జైనథ్(ఆదిలాబాద్): అప్పుల బాధతో ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం ఖాప్రి గ్రామానికి చెందిన కల్లెం లచ్చన్న (35) ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం లచ్చన్న భార్య సురేఖ పేరుమీద 2015లో మూడెకరాల భూమి ఇచ్చింది. గతేడాది తన మూడెకరాల్లో పత్తి, కౌలుకు తీసు కున్న మరో మూడెకరాల్లో సోయా సాగు చేశాడు. దిగుబడి రాక పెట్టుబడికి చేసిన అప్పులు తీర్చలేకపోయాడు. ఈ ఏడాది కూడా ఆరెకరాల్లో పత్తి సాగు చేశాడు. వాతా వరణం అనుకూలించక పోవడంతో దిగు బడి రాదేమోననే బెంగ పెట్టుకున్నాడు. మంగళవారం రాత్రి తాగిన మైకంలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.