Debt relief
-
భారత్‌కు కృతజ్ఞతలు తెలిపిన మాల్దీవుల అధ్యక్షుడు
మాలె: తమ దేశ రుణ చెల్లింపులను సులభతరం చేయటంలో మద్దుతు ఇచ్చినందుకు మాల్లీవులు అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు భారత్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్, మాల్దీవులు బలమైన సంబంధాలను ఏర్పరుస్తాయని, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకొనున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం మాల్దీవలు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలో దైత్య సంబంధమైన విషయాల్లో విదేశాంగ విధానం సాధించిన విజయాలను ప్రశంసించారు. దేశ రుణచెల్లింపులను సులభతరం చేయటంలో సాయం అంధించిన భారత్, చైనా దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో నెలకొన్న అమెరికా డాలర్ల కొరతను తగ్గించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ క్రమంలోనే మాల్దీవుల ప్రభుత్వం భారత, చైనా దేశాలతో కరెన్సీ మార్పిడి ఒప్పందాలపై చర్చలు జరుపుతోందని వెల్లడించారు. బ్రిటన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. అదేవిధంగా భారత్‌తో కూడా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక.. గతంలో భారత్‌త్‌తో దౌత్యపరంగా దెబ్బతిన్న సంబంధాలను మళ్లీ పునరుద్ధరించుకోవాలని మహ్మద్ మొయిజ్జు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక.. గత నెలలో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి ప్రెసిడెంట్ మహ్మద్ మొయిజ్జు హాజరైన విషయం తెలిసిందే. -
వితంతు పింఛన్ కూడా ఇవ్వని ప్రభుత్వం
ఈ ఫోటోలో ఇద్దరు పిల్లలతో దిగాలుగా ఉన్న మహిళ పేరు పద్మావతి. వారిది అనంతపురం జిల్లా పుట్లూరు మండలం శనగలగూడూరు గ్రామం. పద్మావతి భర్త, చీనీ(బత్తాయి) రైతు తిరుపాల్‌రెడ్డి అప్పుల భాదతో విష గుళికలు మింగి ఆత్మహత్యచేసుకోవడంతో ఈ కుటుంబం పరిస్థితి దీనంగా మారింది. చీనీ తోటను కాపాడుకోవడానికి నాలుగు బోర్లు వేసినా నీరు పడకపోవడంతో అప్పులపాలయ్యాడు. ఏడు ఎకరాల్లో పప్పుశనగ సాగు చేసినా పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాకపోవడంతో రూ.17 లక్షలకు అప్పు పెరిగిపోయింది. అప్పు తీర్చలేనన్న బాధతో 2018 అక్టోబర్ 6న తిరుపాల్‌రెడ్డి విష గుళికలు మింగి ఆత్మహత్య చేసుకోవడంతో ఈ రైతు కుటుంబం అనాథగా మారింది. రెవిన్యూ అధికారులు విచారణ చేసి రూ.17 లక్షలు అప్పు ఉన్నట్లు నిర్థారించారు. అయినా తిరుపాల్‌రెడ్డి కుటుంబానికి ఎటువంటి సహాయమూ అందలేదు. ప్రభుత్వం ద్వారా చిల్లి గవ్వ రాకపోవడంతో పాటు పద్మావతికి వితంతు పించన్ కూడా మంజూరు చేయలేదు. ‘ఆయన మమ్మల్ని వదిలి వెళ్లాడు. ఇద్దరు పిల్లలను ఎలా పోషించాలో అర్థం కావడం లేద’ని పద్మావతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. కనీసం వితంతు పింఛన్ కూడా ఇవ్వకపోతే ఎలా అని ఆమె కన్నీటి పర్యంతమౌతోంది. ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరారు. – కాకనూరు హరినాథ్‌రెడ్డి, సాక్షి, పుట్లూరు, అనంతపురం జిల్లా -
పొలం, స్థలం అమ్మినా తీరని అప్పులు
కర్నూలు జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన మంగళి పెద్ద ఎల్లనాగన్న అనే రైతు అప్పుల బాధతో 2014 ఆగస్టు 25న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి భార్య సావిత్రితోపాటు ముగ్గురు కుమార్తెలు (గీతాంజలి, రేణుక, శ్రీలక్ష్మి), కుమారుడు వీరేష్ ఉన్నారు. గీతాంజలి కస్తూర్బా గాంధీ వసతి గృహంలో ఉండి 6వ తరగతి చదువుతున్నది. రేణుక 5వ తరగతి, శ్రీలక్ష్మి 1వ తరగతి, వీరేష్ 4వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. చిన్నారుల పోషణ భారమైనా ఐదేళ్లుగా పంటిబిగువున బాధను దిగమింగి సంసార నౌకను లాక్కొస్తున్నది సావిత్రి. కుటుంబపెద్ద మరణించినా బీమా అందలేదు. ఎన్.ఎఫ్.బి.ఎస్. పథకం కింద రావాల్సిన రూ. 20 వేలు కూడా అందలేదు. బాధితకుటుంబానికి ప్రభుత్వం ఇల్లు కూడా మంజూరు కాలేదు. అధికారులు పట్టించుకోవడం లేదు. వితంతు పింఛన్ మాత్రమే మంజూరైంది. రెండున్నరెకరాల పొలం, ఇంటిస్థలం ఉండేది. అప్పుల వాళ్ల ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో 2.5 ఎకరాల పొలంతోపాటు ఇంటి స్థలాన్ని కూడా అమ్మి అప్పులు తీర్చింది సావిత్రి. అయినా, ఇంకా రూ. 3 లక్షల అప్పు మిగిలింది. గ్రామంలో ఇల్లు కూడా లేకపోవడంతో బంధువుల ఇంటిలో తలదాచుకుంటూ పిల్లలను కడుపులో పెట్టుకొని జీవనం సాగిస్తున్నది. వ్యవసాయ కూలీ పనులకు వెళ్తూ నలుగురు పిల్లలను పోషించుకుంటున్నది. కరువు వల్ల వ్యవసాయ పనులు కూడా చేతినిండా లేవు. పని దొరకని రోజు మంచినీళ్లతో తల్లీ బిడ్డలు కడుపు నింపుకోవాల్సిన దుర్భర పరిస్థితులున్నాయి. ప్రభుత్వం, దాతలు సహకరించి ఆర్థికంగా ఆదుకోవాలని సావిత్రి కోరుతున్నది. – నీలం సత్యనారాయణ, సాక్షి, కల్లూరు, కర్నూలు జిల్లా -
కొండయ్య కుటుంబం బాధ తీరేదెన్నడు?
అప్పుల బాధతో కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం గోవిందిన్నె గ్రామానికి చెందిన వెంకట కొండయ్య(60) ఆత్మహత్యకు పాల్పడి ఆరు నెలలైనా ఇంతవరకు అధికారులెవరూ ఆ ఇంటివైపు కన్నెత్తి కూడా చూడలేదు. వ్యవసాయాన్ని నమ్ముకొని కుటుంబాన్ని పోషించుకునే వెంకట కొండయ్య 18 ఎకరాల సొంత పొలంతో మరో 10 ఎకరాలు కౌలుకు సాగు చేసేవారు. ఇతనికి భార్య సావిత్రి, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు, తండ్రి చిన్న కొండయ్య(88) ఉన్నారు. ముగ్గురు కుమార్తెలతో పాటు పెద్ద కుమారుడు రమేష్‌కు వివాహం చేశారు. ముగ్గురు కుమార్తెల పెళ్లిళ్ల కోసం కొన్ని అప్పులు చేశారు. దీనికి తోడు నాలుగేళ్లుగా వరుసగా అనావృష్టి పరిస్థితులు నెలకొనడంతో పెట్టుబడుల కోసం చేసిన అప్పులు, వడ్డీలు పేరుకుపోయాయి. నాలుగెకరాల వ్యవసాయ భూమిలో గత సంవత్సరం వరి పంట వేయగా భూగర్భ జలాలు అడుగంటి బోరు ఎండిపోవడంతో మళ్లీ అప్పులు చేసి బోరు వేయించారు. కొద్దిగా నీరు పడినప్పటికీ వరి పంటకు చాలలేదు. పూర్తిగా ఎండిపోయింది. ఈ సంవత్సరం మళ్లీ కరువొచ్చింది. సొంత పొలంలో వేసిన జొన్న, ఆముదం, ప్రొద్దుతిరుగుడు పంటలు కూడా ఎండిపోయాయి. పంట పెట్టుబడులు, కుటుంబ అవసరాల కోసం ప్రై వేట్ వ్యక్తుల వద్ద సుమారు రూ. 5 లక్షలు అప్పు చేశారు. అలాగే పలుకూరు ఆంధ్రా బ్యాంక్‌లో రూ. లక్ష, బనగానపల్లె ఎస్బిఐలో రూ. 40 వేలు పంట రుణం తీసుకున్నారు. కానీ నాలుగేండ్లుగా ఎదురు చూస్తే ప్రభుత్వం నుంచి రుణ మాఫీ జరిగింది కేవలం రూ. 60 వేలు మాత్రమే. అది అప్పుపై వడ్డీకి కూడా సరిపోలేదు. రైతు రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం మోసం చేసిందని వెంకటకొండయ్య పలువురి వద్ద ఆవేదన వ్యక్తపరిచే వారు. ఆ పరిస్థితుల్లో వెంకట కొండయ్య పరిస్థితి దుర్భరంగా తయారైంది. అప్పులు తీర్చే మార్గం కానరాక 2018 ఆగస్టు 5న ఇంటికి సమీపంలోని పశువుల పాకలో తెల్లవారుజామున ఎవరూలేని సమయంలో పురుగుమందు తాగి చనిపోయాడు. కుటుంబ పెద్దను కోల్పోయిన అతని కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. -
దస్తగిరి కుటుంబానికి దిక్కెవరు?
పంటల సాగుకు చేసిన అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబం దుర్భరమైన జీవితం గడుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. కుటుంబ పెద్ద ఆత్మహత్య చేసుకోవడంతో మృతుడి భార్య, నలుగురు పిల్లలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కర్నూలు జిల్లా సి.బెళగల్ మండల పరిధిలోని కంబదహాల్ గ్రామానికి చెందిన దస్తగిరి(40) అప్పుల బాధతో పొలంలో పురుగుల మందు తాగి 2016 సెప్టెంబర్ 12న మృతి చెందారు. ముగ్గురు కూతుళ్లను, ఒక కుమారిడిని పోషించుకునేందుకు అతని భార్య దానమ్మ తీవ్ర అవస్థలు పడుతున్నారు. దస్తగిరికి రెండెకరాల పొలముంది. దీనికి తోడు మరో ఐదెకరాలను ఎకరా రూ. 30 వేలకు కౌలుకు తీసుకుని 2014, 2015, 2016 సంవత్సరాలలో వ్యవసాయం చేశాడు. ఏడెకరాలలో పత్తి పంట సాగు చేశారు. పంటల సాగుకు ఏడాదికి రూ. లక్ష అప్పు చేసి పెట్టుబడి పెట్టారు. వచ్చిన అరకొర దిగుబడులతో రైతు దస్తగిరి కొంతమేర అప్పులు తీర్చుతూ వచ్చాడు. అయితే పంటల సాగు, ఇంటి నిర్మాణంకు, ఇద్దరు కూతుళ్ల వివాహానికి ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ. 3 లక్షలు అప్పు చేశాడు. అదేవిధంగా సి.బెళగల్‌ని బంగారు అంగళ్ళ దగ్గర రెండవ కూతురు లుదియాకు చెందిన రెండు తులాల బంగారాన్ని తాకట్టుపెట్టి రూ. 46 వేలు అప్పు తీసుకున్నాడు. తెలిసిన వారి దగ్గర, బంధువుల దగ్గర, గ్రామస్తుల దగ్గర పంటలకు, కుటుంబ పోషణకు దస్తగిరి రూ. 6 లక్షల వరకు అప్పులు చేశాడు. చేసిన అప్పలు ఎలా చెల్లించాలోనని మధనపడేవాడని భార్య దానమ్మ, కుమార్తెలు తెలిపారు. దానమ్మ కూలి పనులు చేసుకుంటూ నలుగురు పిల్లలను చదివించుకుంటూ జీవనం సాగిస్తోంది. కుమారుడు దీవనరాజు కోడుమూరులోని ఎస్సీ వసతి గృహంలో వదిలారు). అయితే రైతు చనిపోయి రెండేళ్లు పూర్తయినా కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు. ప్రభుత్వం తమను కరుణించి పరిహారం అందజేసి తన కుటుంబాన్ని ఆదుకోవాలని బాధితురాలు దానమ్మ కోరుతోంది. – బి.గోవిందు, సాక్షి రిపోర్టర్, సి.బెళగల్, కర్నూలు జిల్లా -
ఎన్సీఎల్టీలో రుయాలకు చుక్కెదురు
న్యూఢిల్లీ: ఎస్సార్ స్టీల్ రుణ బకాయిలను తీర్చివేస్తామంటూ రుయా కుటుంబం దాఖలు చేసిన పిటిషన్‌ను జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అహ్మదాబాద్ బెంచ్ తిరస్కరించింది. ఎస్సార్ స్టీల్ ప్రమోటర్ల ప్రణాళికను ఆమోదించొద్దన్న రుణదాతల అభ్యర్థన చట్టవిరుద్ధం కాదని ఎన్సీఎల్టీ స్పష్టం చేసింది. దీంతో ఎస్సార్ స్టీల్‌ను కాపాడుకోవాలన్న రుయాల ప్రయత్నాలకు చుక్కెదురు అయింది. అదే సమయంలో ఎస్సార్ స్టీల్‌ను విక్రయించడం ద్వారా రుణ బకాయిలను తీర్చుకోవాలన్న రుణదాతల ప్రయత్నాలకు ఊతం లభించింది. ఎస్సార్ స్టీల్ కొనుగోలుకు ఆర్సెలర్ మిట్టల్ వేసిన రూ.42,000 కోట్ల బిడ్‌ను రుణదాతల కమిటీ ఇప్పటికే ఆమోదించడం తెలిసిందే. బ్యాంకులకు రూ.50,800 కోట్ల మేర బకాయిలను కంపెనీ చెల్లించాల్సి ఉండటంతో, వీటిని రాబట్టుకునేందుకు దివాలా పరిష్కార చట్టం కింద చర్యలు చేపట్టింది. రూ.54,389 కోట్లను చెల్లించేందుకు తాము ఆఫర్ ఇచ్చామని, రుణదాతలకు ఇదే అత్యధిక చెల్లింపు ప్రతిపాదన అని ఎస్సార్ స్టీల్ ప్రమోటర్లు ఎన్సీఎల్టీకి తెలిపారు. ‘‘ఐబీసీలో ఇటీవలే ప్రవేశపెట్టిన సెక్షన్ 12ఏ కింద మా ప్రతిపాదన సమర్పించాం. అలాగే, ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు సైతం ఈ సెక్షన్ వర్తిస్తుందని స్పష్టం చేస్తోంది’’ అని ఎస్సార్ స్టీల్ కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఎన్సీఎల్టీ పూర్తి తీర్పు కాపీ అందిన తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరోవైపు ఎన్సీఎల్టీ తీర్పు ఐబీసీ సమగ్రతను కాపాడేలా ఉందని, నిబంధనల ఆధారంగా చట్టం పనిచేస్తుందని భరోసా ఇచ్చినట్టయిందని ఆర్సెలర్ మిట్టల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎస్సార్ స్టీల్ ఇండియా, భారత్‌కు కూడా ఇది సానుకూల పరిణామమని, ఈ కేసులో సత్వర పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది. -
ఎక్స్‌గ్రేషియా కోసం మూడేళ్ల వేదన
వ్యవసాయ జూదంలో ఓడి అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న యువ రైతు కుటుంబాన్ని ప్రభుత్వం విస్మరించడంతో ఆ కుటుంబం మూడేళ్లుగా దుర్భర జీవితం గడుపుతోంది. ప్రభుత్వ సాయం అందక, పూట గడవని స్థితిలో ఆ కుటుంబం సమస్యలతో సహజీవనం చేస్తోంది. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం రేవనూరు గ్రామానికి చెందిన వరకుటి సుబ్రమణ్యం అప్పుల బాధ తాళలేక 2015 ఫిబ్రవరి 2న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎకరాకు రూ. 10 వేలు కౌలు చెల్లించి ఐదు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని జొన్న పంట సాగు చేశాడు. రసాయనిక ఎరువులు, విత్తనాలు, కౌలు, తదితర పెట్టుబడుల కోసం ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ. 2 లక్షలు అప్పు చేశాడు. వర్షాభావంతోపాటు వాతావరణం అనుకూలించక పంట ఎండిపోయి తీవ్ర నష్టం వాటిల్లింది. పైరు బొందుపోవడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుబ్రమణ్యంకు రెండేళ్ల కుమార్తె సుస్మితతోపాటు భార్య వరలక్ష్మి ఉన్నారు. భర్త చనిపోయే నాటికి గర్భవతిగా ఉన్న ఆమె ఆరు నెలలకు ఆమె మరో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అభం, శుభం తెలియని వయస్సులో ముక్కుపచ్చలారని చిన్నారులకు తండ్రి దూరం కాగా భర్త మరణంతో కుటుంబ పోషణ ఆ ఇల్లాలిపైనే పడింది. ఎలాంటి ఆస్తిపాస్తులు లేకపోవడంతో ప్రభుత్వం ఆదుకుంటుందని భావించింది. అధికారులు రెండు, మూడుసార్లు ఇంటి వద్దకు వచ్చి వివరాలు నమోదు చేసుకున్నారే తప్ప ఇప్పటి వరకు ఎలాంటి ఆర్థికసాయం చేయకపోవడంతో మూడేళ్లుగా ఆ కుటుంబం అష్టకష్టాలు పడుతోంది. తలదాచుకునేందుకు ఇల్లు తప్ప ఎలాంటి ఆస్తిపాస్తులు లేకపోవడంతో వ్యవసాయ కూలి పనులకు వెళుతూ వరలక్ష్మి కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. చిన్న కుమార్తె రేవతి పుట్టిన ఏడాదికే∙అనారోగ్యం బారిన పడి చనిపోయింది. పెద్ద కుమార్తెను, వృద్ధుడైన మామ వెంకటసుబ్బయ్యను కాయకష్టంతో పోషించుకుంటూ రేవతి కాలం వెళ్లదీస్తోంది. ప్రభుత్వం కరుణించి ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు. - కె. మౌలాలి, సాక్షి, కోవెలకుంట్ల, కర్నూలు జిల్లా -
కౌలు రైతు కుటుంబాన్ని ఆదుకోని ప్రభుత్వం
పంటలు సరిగ్గా పండక పెట్టుబడులు కూడా తిరిగి రాక నాలుగేళ్ల వ్యవసాయంలో ఐదెకరాల భూమి అమ్మి తీర్చినా ఇంకా మిగిలిన రూ. 8 లక్షల అప్పులు యువ రైతు ఎద్దుల రాజేశ్వరరెడ్డి (26)ని బలిగొన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో స్పందన కనిపించకపోవడం విడ్డూరంగా ఉంది. కర్నూలు జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని కొణిదేల గ్రామానికి చెందిన ఎద్దుల రాజేశ్వరరెడ్డి (26) అనే యువరైతు అప్పుల బాధతో ఈ ఏడాది సెప్టెంబర్ 10న ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సకాలంలో వర్షాలు కురవక సాగు చేసిన పంటలు చేతికి రాక చేసిన అప్పులు తీరలేదు. నాలుగేళ్లలో చేసిన అప్పులు తలకు మించి భారమయ్యాయి. రెండేళ్ల క్రితం సొంత భూమి 5 ఎకరాలు అమ్మేసినా అప్పులు తీరలేదు. రెండేళ్ల నుంచి 22 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని మొక్కజొన్న–12, ఉల్లి–5, మినుములు–5 ఎకరాల్లో పంటలు సాగు చేసినా ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. మొత్తంగా రూ.8 లక్షలకు పైగా అప్పులు మిగిలాయని, ప్రైవేటు ఫైనాన్స్‌లో బంగారు రుణం కింద రూ. 2.50 లక్షలు తీసుకున్నట్లు రాజేశ్వరరెడ్డి భార్య భాగ్యలక్ష్మి తెలిపారు. అప్పులకు వడ్డీలు పెరిగి తలకుమించిన భారంగా మారుతున్నాయని బాధపడుతూ తన భర్త ఆత్మహత్య చేసుకున్నా, తమకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం అందలేదన్నారు. దినసరి కూలీగా మారి మూడేళ్ల కుమార్తెను పోషించుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించి ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని ఆమె కోరుతున్నారు. – ఎస్. నగేష్, నందికొట్కూరు, కర్నూలు జిల్లా -
నాలుగేళ్లయినా ఆదుకో లేదు
పంట సాగు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్న రైతు మౌలాలి కుటుంబాన్ని ఆదుకోవడానికి టీడీపీ ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. దీంతో కుటుంబ పెద్దను కోల్పోయి తీరని దుఃఖంలో మౌలాలి కుటుంబీకులకు ఆసరా లభించడం లేదు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం పరిధిలోని రాతన గ్రామానికి చెందిన మౌలాలి(50) అనే రైతు అప్పుల బాధతో 2014 నవంబర్ 20వ తేదీన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మృతి చెందాడు. వ్యవసాయం తప్ప మరో జీవన మార్గం తెలియని మౌలాలి 5 ఎకారాల్లో వేరుశనగ, పత్తి పంటలను సాగు చేశాడు. ఎకరాకు రూ. 20 వేలు పెట్టుబడి పెట్టాడు. అయితే ఆ ఏడాది వర్షాభావం, వచ్చిన దిగుబడులకు మార్కెట్లో మద్దతు ధర లేకపోవడంతో ఆశలు అడియాసలయ్యాయి. పెట్టుబడి కూడా తిరిగి రాలేదు. పాత అప్పులు రూ. 3.50 లక్షలకు కొత్త అప్పులు తోడై వడ్డీలతో కలుపుకొని రూ.5 లక్షలకు చేరుకుంది. ఈ నేపథ్యంలో నలుగురికి ముఖం చూపలేక దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య లాలూబీ, పెద్ద కుమారుడు చాంద్ బాషా, రెండో కుమారుడు మున్నా ఉన్నారు. పెద్ద కుమారుడు చాంద్‌బాషా జేసీబీ డ్రైవర్‌గా, చిన్న కుమారుడు మున్నా సైకిల్ షాపులో కూలి పనులు చేస్తున్నారు. లాలూబీ గ్రామంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇంట్లో వాళ్లందరూ కూలీ నాలీ చేస్తున్నా కుటుంబ పోషణకు సరిపోవడం లేదు. పైగా అప్పులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం తమపై దయతలచి ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని మౌలాలి భార్య లాలూబీ విజ్ఞప్తి చేశారు. – పి. గోపాల్, సాక్షి, పత్తికొండ, కర్నూలు జిల్లా -
పత్తి రైతు కుటుంబాన్ని విస్మరించిన ప్రభుత్వం
అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులు దుర్భర జీవితం గడుపుతున్నారు. కుటుంబ పెద్ద ఆత్మహత్య చేసుకోవడంతో పూట గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం జిల్లా రొద్దం మండల పరిధిలోని గోనిమేకులపల్లి గ్రామానికి చెందిన పత్తి రైతు శ్రీనివాసులు(40) అప్పుల బాధతో దాదాపు నాలుగేళ్ల క్రితం(2014 నవంబర్ 5న) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పత్తి పంటకు పిచికారీ చేయడానికి తీసుకువచ్చిన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీనివాసులుకు భార్య సరోజమ్మ, కుమార్తె, కుమారుడు ఉన్నారు. శ్రీనివాసులు తనకున్న ఎకరం పొలంలో పత్తి సాగు చేసేవారు. పంట దిగుబడి ఆశించినంత రాకపోవడంతో అప్పులపాలయ్యారు. దీనితోపాటు కూతురు పెళ్లి చేయడానికి కొంత అప్పు చేశారు. తన భర్త తమకున్న ఎకరం పొలంలో పంట సాగుచేయడానికి, కూతురి పెళ్లి చేయడానికి రూ. 2 లక్షల దాకా అప్పు చేసినట్లు శ్రీనివాసులు భార్య సరోజమ్మ తెలిపారు. పంట పండకపోతే చేసిన అప్పులు ఎలా తీర్చాలని రోజూ అంటూ బాధపడుతూ ఉండేవారన్నారు. అప్పుల దిగులుతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఈ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయమూ అందలేదు. మృతుడి భార్య ప్రతిరోజూ కూలీకి వెళ్తూ తన పిల్లలను పోషించుకుంటూ చదివిస్తున్నారు. ప్రభుత్వం కరుణించి ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు. – కె.ఎల్. నాగరాజు, సాక్షి, రొద్దం, అనంతపురం -
మూడోరోజూ రైతుల ఆందోళన
న్యూఢిల్లీ / భోపాల్ / చండీగఢ్ /జైపూర్: కేంద్రం రుణమాఫీతో పాటు పంటకు మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ రైతులు చేపట్టిన 10 రోజుల దేశవ్యాప్త ఆందోళన ఆదివారం మూడో రోజుకు చేరుకుంది. ఆందోళనలో భాగంగా రైతులు పట్టణాలకు పాలు, కూరగాయలు, ఇతర నిత్యావసరాల సరఫరాను నిలిపివేయడంతో పాటు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాలు, కూరగాయల సరఫరా నిలిచిపోవడంతో ఉత్తరాది రాష్ట్రాల్లో వాటి ధరలు 25–30% పెరిగాయి. ఆందోళనలో భాగంగా హరియాణా, పంజాబ్ల్లోరైతులు పాలు, కూరగాయల్ని రోడ్డుపై పారబోసి నిరసన తెలియజేశారు. పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం రైతులు, వ్యాపారుల మధ్య ఘర్షణ చెలరేగింది. రాజస్తాన్‌లో అతిపెద్ద మార్కెట్అయిన ముహానా మండీకి కూరగాయల్ని తీసుకెళ్తున్న 150 ట్రక్కుల్ని రైతులు అడ్డుకున్నారు. ఆందోళన చివరిరోజైన జూన్ 10న రైతు సంఘాలు భారత్ బంద్‌కు పిలుపిచ్చాయి. మధ్యప్రదేశ్‌లో రైతులపై పోలీస్కాల్పులకు నిరసనగా జూన్ 8న నిర్వహించే కార్యక్రమంలో బీజేపీ నేతలు యశ్వంత్ సిన్హా, శత్రుఘ్న సిన్హా, వీహెచ్‌పీ నేత ప్రవీణ్ తొగాడియా పాల్గొననున్నారు. -
అప్పులధికమై.. మనోవేదనకు గురై..
సూర్యాపేట క్రైం : అప్పుల బాధ తాళలేక.. తీర్చే మార్గం కనిపించక ఇద్దరు వ్యక్తులు బలవన్మర ణానికి పాల్పడ్డారు. సూర్యాపేటలో జిరాక్స్ సెం టర్ నిర్వాహకుడు, కనగల్ మండలం బాబా సాహెబ్గూడెంలో రైతు ఉరేసుకుని ఆత్మహత్య చేçసుకున్నారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తె లిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్(ఎస్) మండలం కందగట్ల గ్రామానికి చెందిన యలగందుల సుదర్శన్(34) సూర్యాపేటలోని రామలింగేశ్వర థియేటర్ రోడ్డులో జిరాక్స్ సెంటర్‌ను నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల సుదర్శన్ తన కుమారుడికి గుండె ఆపరేషన్ చేయించాడు. అంతేకాకుండా దుకాణం ఏర్పాటుకు సుమారు రూ.10 లక్షలు అప్పులు చేశాడు. అదేవిధంగా ఆ యన వద్దే ఉంటున్న మరదలు వివాహాన్ని కూడా జరిపించాడు. అప్పులు తీవ్రం కావడం, అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో మనోవేదనకు గురయ్యాడు. దుకాణంలో పని ఎక్కువ ఉం దని, ఇంటికి రావడం ఆలస్యమవుతుందని భార్య కు చెప్పి అక్కడే ఉండిపోయాడు. ఉదయం వరకు కూడా సుదర్శన్ ఇంటికి రాకపోవడంతో భార్యకు అనుమానం వచ్చి దుకాణం వద్దకు వచ్చింది. షెట్టర్ తీసేందుకు ప్రయత్నించగా రాకపోవడంతో స్థానికులను పిలిచి తీయగా.. సుదర్శన్ విగతజీవిగా మారి ఉన్నాడు. ఫ్యాన్‌కు ఉరేసుకుని ఉన్న ఆయన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీ రయ్యారు. అప్పుల బాధతోనే ఆత్మహత్యకు పా ల్పడుతున్నట్లు సూసైడ్ నోట్లో రాసి ఉంచాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జానికిరాములు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. బాబాసాహెబ్‌గూడెంలో రైతు.. కనగల్(నల్లగొండ) : ఆర్థిక ఇబ్బందులతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం కనగల్ మండలం బాబసాహెబ్గూడెంలో జరి గింది. ఎస్ఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకా రం.. గ్రామానికి చెందిన చిన్నాల పోలురాజు(48) తనకున్న 3 ఎకరాల భూమిలో వరితోపాటు పత్తి సాగు చేస్తున్నాడు. సాగులో వరస నష్టాలు రావడంతోపాటు ఏడాది క్రితం కూతురు వివాహం చేయడంతో సుమారు రూ. 5 లక్షల వరకు అప్పులయ్యాయి. అప్పలు ఎలా తీరుతాయోనన్న బెంగతో మనస్తాపం చెందిన పోలురాజు బుధవారం సాయంత్రం ఇంట్లోంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు గ్రామంలో వాకబు చేసినా సమాచారం లేకపోవడంతో తెలిసిన బంధువుల వద్దకు వెళ్లాడేమో అనుకున్నారు. గురువారం మృతుని భార్య పార్వతమ్మ పశువులకు గడ్డి తీసుకొచ్చేందుకు వ్యవసాయ భావి వద్దకు వెళ్లగా చెట్టుకు ఉరేసుకు ని భర్త పోలురాజు కనిపించడంతో కేకలు వేసింది. చుట్టుపక్కల రైతులు అక్కడకు చేరుకుని కిందికి దిండగా అప్పటికే మృతి చెందాడు. ఎండాకాలం కావడంతో వ్యవసాయ బావి వద్ద పైరు లేనందున బావి వద్దకు ఎందుకు పోతాడు అనుకున్నామని, ఇలా బలవన్మరణానికి పాల్పడుతాడని అనుకోలేదని పోలురాజు భార్య రోదించడం అక్క డున్న వారిని కంటతడి పెట్టించింది. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
రైతు కుటుంబానికి కూలి పనులే గతా?
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడుకు చెందిన కోనంకి రమేష్ తనకున్న నాలుగు ఎకరాలతో పాటు మరో ఆరు ఎకరాలను కౌలుకు తీసుకొని పత్తి, మిరప, తమలపాకు తోటలను సాగు చేసేవాడు. గిట్టుబాటు ధరలేక అప్పులపాలయ్యాడు. అప్పు రూ. 6 లక్షలకు పెరిగింది. రుణ మాఫీ కాలేదు. దీంతో 4 ఎకరాలను అమ్మి కొంత అప్పు తీర్చాడు. మళ్లీ ఎనిమిది ఎకరాలు కౌలుకు తీసుకుని పంట వేస్తే అప్పు మరో రూ. 4 లక్షలు పెరిగింది. అప్పుల వాళ్ల ఒత్తిడితో కౌలు రైతు రమేష్ గతేడాది మార్చి 15న తన పొలంలోనే పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రమేష్ భార్య అంజమ్మ, కుమార్తె కల్పన(ఇంటర్), కుమారుడు అనిల్‌కుమార్ (8వ తరగతి) నిస్సహాయులుగా మిగిలారు. భర్త ఆత్మహత్య చేసుకున్న తర్వాత అంజమ్మ కూలి పనులు చేస్తూ పిల్లలతో పాటు రమేష్ నాయనమ్మ కోటమ్మనూ పోషిస్తున్నారు. ఉంటున్న ఇల్లు కూడా తాకట్టులో వుంది. మొత్తం అప్పు రూ. 13 లక్షలకు చేరింది. ఏమి చేయాలో అర్థంకావడం లేదని అంజమ్మ కుమిలిపోతున్నారు. ప్రభుత్వం ఆదుకొని ఎక్స్‌గ్రేషియా ఇవ్వకపోతే.. వచ్చే ఏడాది నుంచి పిల్లల చదువులు అపేసి తనతో పాటు కూలి పనులకు తీసుకువెళ్లడం తప్ప మరో దారి లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని నమ్మి మోసపోయామన్నారు. ఓ. వెంకట్రామిరెడ్డి, అమరావతి బ్యూరో -
ఇద్దరు రైతుల ఆత్మహత్య
రాయపోలు (దుబ్బాక): అప్పులబాధతో ఇద్దరు రైతులు బుధవారం ఆత్మహత్యకు పాల్ప డ్డారు. సిద్దిపేట జిల్లా రాయపోలు మండలం మంతూరులో మన్నె కిష్టయ్య, సుగుణ దంప తులకు నలుగురు కుమారులు. వీరి కుటుంబం తమకున్న ఎకరం 10 గుంటల సాగు భూమితో పాటు మరో ఎకరంన్నర కౌలుకు తీసుకున్నా రు. ఇటీవల పంట పెట్టుబడులు, ఇంటి నిర్మా ణం కోసం రూ.3 లక్షల వరకు అప్పులు చేశా రు. మల్లన్నసాగర్ కాల్వ నిర్మాణంకోసం భూసేకరణలో వీరి భూమి పూర్తిగా పోయింది. దీంతో పెద్ద కొడుకు నాగరాజు (28) అప్పుల విషయమై కొద్ది రోజులుగా తీవ్ర మనస్తాపం తో పొలం వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపా లెంలో పాగాల మల్లారెడ్డి (58) ఇరవై ఎక రా లు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నా డు. రెండేళ్లుగా వచ్చిన కరువుతో పంటలు సరి గా పండలేదు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినా లాభం లేకపోయింది. పెట్టుబడి కోసం చేసిన అప్పులు రూ.10 లక్షలకు చేరాయి. పం టలు పండకపోయినా రైతుకు ఏడాదికి రూ.1.50 లక్షల కౌలు చెల్లించాల్సి వస్తుండటం, అప్పులు తీర్చే మార్గం కానరాక పురుగు ల మందు తాగి బలవన్మరణం చెందాడు. -
ఇద్దరు రైతుల ఆత్మహత్య
ముత్తారం/ఎలిగేడు: అప్పుల బాధ భరించలేక ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఇప్పపల్లి రామకృష్ణాపూర్‌కు చెందిన మర్రిపల్లి మల్లేశ్(45) తనకున్న అర ఎకరం భూమితోపాటు మూడెకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేస్తున్నాడు. ఆశించిన స్థాయిలో దిగు బడి రాలేదు. పెట్టుబడుల కోసం తీసుకున్న రూ.3 లక్షల అప్పు తీర్చే మార్గం కానరాక ఇద్దరు కూతుళ్ల వివాహం చేసే స్థితిలో లేకపోవడంతో మనస్తాపం చెందిన మల్లేశ్ చెట్టుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇదే జిల్లా ఎలిగేడు మండలం లోకపేట గ్రామానికి చెందిన దేవరనేని సంపత్‌రావు(35) తనకున్న రెండెకరాలతోపాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని వరిసాగు చేశాడు. అయితే, పంట చేతికొచ్చే దశలో ఎండిపోయింది. రూ.4 లక్షలు అప్పు చేయగా.. పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
మూడేళ్లయినా అందని సాయం..
శ్రీకాకుళం జిల్లా భామిని మండలం పాత గానసర గ్రామానికి చెందిన వలరోతు భాస్కర్‌రావు 2 ఎకరాల సొంత భూమికి తోడు 5 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి, పత్తి పంటలు సాగు చేశాడు. వరుసగా రెండు సంవత్సరాలు నష్టం వచ్చింది. కూతురు ఝాన్సీ పెళ్లికి రూ. లక్ష అప్పు అయ్యింది. పంటలకు చేసిన అప్పు రూ. 2 లక్షలు కలసి.. మొత్తం ప్రైవేటు అప్పు రూ. 3 లక్షలు. వడ్డీ నెలకు నూటికి 3 రూపాయలు. ఇక అప్పుల బాధ తీరదని భావించిన భాస్కర్‌రావు 2014 డిసెంబర్ 24న పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మూడేళ్లు దాటిపోయింది. కానీ, భాస్కర్‌రావు భార్య లక్ష్మికి ఇంతవరకూ వితంతు పింఛను కూడా రావటం లేదు. ఇక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చే ఎక్స్‌గ్రేషియా ఊసేలేదు. ఆంధ్రప్రదేశ్‌లో రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇదొక ఉదాహరణ. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
జైనథ్(ఆదిలాబాద్): అప్పుల బాధతో ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం ఖాప్రి గ్రామానికి చెందిన కల్లెం లచ్చన్న (35) ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం లచ్చన్న భార్య సురేఖ పేరుమీద 2015లో మూడెకరాల భూమి ఇచ్చింది. గతేడాది తన మూడెకరాల్లో పత్తి, కౌలుకు తీసు కున్న మరో మూడెకరాల్లో సోయా సాగు చేశాడు. దిగుబడి రాక పెట్టుబడికి చేసిన అప్పులు తీర్చలేకపోయాడు. ఈ ఏడాది కూడా ఆరెకరాల్లో పత్తి సాగు చేశాడు. వాతా వరణం అనుకూలించక పోవడంతో దిగు బడి రాదేమోననే బెంగ పెట్టుకున్నాడు. మంగళవారం రాత్రి తాగిన మైకంలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. -
ఆరుగురు రైతుల ఆత్మహత్య
సాక్షి నెట్వర్క్: అప్పుల బాధతో వేర్వేరు జిల్లాల్లో బుధవారం రాత్రి నుంచి గురువారం రాత్రి వరకు ఆరుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం భూతాయి(కే) పరిధి మాన్కపూర్‌కు చెందిన రైతు బాంద్రే అమర్‌సింగ్(20) వర్షాలు లేక సాగు చేసిన సోయ పంట వాడిపోయింది. రూ. 2 లక్షల వరకు అప్పులు తీర్చలేక బుధవారం పురుగుల మందు తాగాడు. నిజామాబాద్ జిల్లా వెల్కటూర్ జీపీ పరిధిలోని నడిమితండాకు చెందిన రైతు నూనవత్ అమర్‌సింగ్ (37) వర్షాలు లేక పంటలు గట్టెక్కే పరిస్థితి లేదని కుంగి బుధవారం ఉరివేసుకున్నాడు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలానికి చెందిన రైతు బడుగుల వీరస్వామి(36) వ్యవసాయ పెట్టుబడులకు రూ.5.50 లక్షల వరకు అప్పులు చేశాడు. సరిగా దిగుబడి రాకపోవడంతో గురువారం ఉరి వేసుకున్నాడు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం తిప్పనగుల్లకు చెందిన బొమ్మ బాలమల్లు(45) కూతురు వివాహానికి, ఇంటి నిర్మాణానికి అప్పు చేశాడు. పంటల దిగుబడి తగ్గడంతో అప్పు తీరే మార్గం కనిపించక గురువారం ఉరి వేసుకున్నాడు. వికారాబాద్ జిల్లాలోని బూర్గుపల్లికి చెందిన గంగారం నర్సింలు(28) సాగుచేసిన పత్తి, మొక్కజొన్న వర్షాలు లేక ఎండిపోయాయి. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు రూ. 3 లక్షలకు చేరాయి. అప్పు తీరే మార్గం కనిపించక గురు వారం పురుగుల మందు తాగాడు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం జాఫర్‌గూడెం శివారు రామన్న గూడెంకు చెందిన రైతు పేరబోయిన వీరస్వామి(35) సాగుకోసం చేసిన రూ. 3 లక్షల అప్పు తీరే మార్గం కనిపించక గురువారం పురుగుల మందు తాగాడు. -
అప్పుల బాధతో అన్నదాత బలవన్మరణం
మృతునికి 8 మంది కూతుళ్లు నలుగురికి పెళ్లి.. మరో నలుగురికి పెళ్లీడు భారమైన అప్పులు.. ఆదుకోని రుణమాఫీ కదిరి: అప్పుల బాధతో అన్నదాత బలవన్మరణానికి పాల్పడిన ఘటన అనంతపురం జిల్లా కదిరి మండలంలోని చలమకుంట్లపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దళిత రైతు నాగప్ప(56) మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగప్పకు మూడు ఎకరాల పొలం ఉంది. ఇందులో అప్పు చేసి బోరు వేయగా కరువుతో కొద్ది రోజులకే ఎండిపోయింది. అన్నదమ్ములతో కలిసి మరో బోరు వేయించాడు. ఇందుకోసం బంధువుల వద్ద అప్పు చేశాడు. కొద్దిగా నీరు పడటంతో వేరుశనగ సాగు చేస్తున్నాడు. ఇతనికి భార్య శివమ్మ, 8 మంది కుమార్తెలు సంతానం. పెద్దమ్మాయిలు ముగ్గురినీ టీటీసీ చదివించి అప్పులు చేసి పెళ్లిళ్లు కూడా చేశాడు. నాలుగో కుమార్తె చదువుకోలేదు. ఈమెకు కూడా పెళ్లి చేసి మెట్టినింటికి పంపించాడు. మిగిలిన నలుగురు కూతుళ్లూ పెళ్లీడుకొచ్చారు. వీరిలో ఒకరు ఇంజనీరింగ్ చదువుతుండగా.. మరో ఇద్దరు ఇంటర్ చదువుతున్నారు. చివరి అమ్మాయి 10వ తరగతి చదువుతోంది. మూడెకరాల పొలంతో నాగప్ప బతుకు బండిని భారంగా లాగుతున్నాడు. పంటల సాగు, పెట్టుబడులతో పాటు పిల్లల చదువుకు బంధువుల వద్ద రూ.4లక్షల వరకు అప్పు చేశాడు. అదేవిధంగా కదిరి ఎస్బీఐ ఏడీబీలో భార్య బంగారం తాకట్టు పెట్టి 2014లో రూ.1.20 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఇందులో ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. అదే బ్యాంకులో 2013లో రూ.45వేలు పంట రుణం తీసుకున్నాడు. వడ్డీతో కలిపి అది రూ.60వేలకు చేరుకుంది. ఇందులో రూ.5వేలు మాత్రమే మాఫీ అయ్యింది. అది వడ్డీకే సరిపోలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అసలే అప్పులు.. ఆపై కుటుంబ భారం పంటల సాగుతో పాటు పిల్లల చదువు, పెళ్లిళ్లతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన నాగప్పను కష్టాలు ఉక్కిరిబిక్కిరిచేశాయి. ఇక లాభం లేదని గురుపౌర్ణమి నాడు(9న) బోరుబావి దగ్గరకెళ్లి తన వెంట తీసుకెళ్లిన పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. చివరి సారిగా తన భార్యాపిల్లలను చూడాలనిపించి పరుగు పరుగున ఇంటికెళ్లాడు. అతని పరిస్థితి గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడ ప్రథమ చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం అనంతపురం లేదా కర్నూలుకు తరలించాలని సూచించారు. వారి సూచన మేరకు అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ మంగళవారం కన్నుమూశాడు. కదిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కంపెనీలా... అప్పుల కుప్పలా?
♦ కార్పొరేట్లను వెంటాడుతున్న రుణభారం... ♦ గతేడాది 85 కంపెనీల నిర్వహణ లాభం కంటే చెల్లించాల్సిన వడ్డీయే అధికం! ♦ అంతకంతకూ పెరుగుతున్న జాబితా... ♦ బ్యాంకుల నెత్తిన మొండిబకాయిల బండ... దేశంలో ఇప్పుడు అత్యధికంగా వినిపిస్తున్న పదం ‘మొండిబకాయి’ అంటే అతిశయోక్తి కాదేమో!! వేల కోట్ల రూపాయల రుణాలు ఎగవేసిన వారి భరతం పట్టేందుకు అటు కేంద్రం, ఇటు ఆర్బీఐ నేరుగా రంగంలోకి దిగడంతో ఈ మొండిబకాయిల(ఎన్పీఏ)పై చర్చ తీవ్రంగానే జరుగుతోంది. మొదటివిడతగా 12 కంపెనీలపై(డర్టీ డజన్) చర్యలు చేపట్టాల్సిందిగా కూడా బ్యాంకును ఆర్బీఐ ఆదేశించింది. ప్రధానంగా కార్పొరేట్ కంపెనీలు తీసుకున్న రుణభారం తారస్థాయికి చేరడం, చెల్లింపుల విషయంలో చేతులెత్తేయడంతో బ్యాంకుల మెడకు చుట్టుకుంటోంది. ఇలాంటి కంపెనీల జాబితా అంతకంతకూ పెరిగిపోతుండటం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావమే చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు కూడా. గడచిన ఆర్థిక సంవత్సరం(2016–17)లో మొత్తం 85 కంపెనీలు చెల్లించాల్సిన వడ్డీ మొత్తం వాటి నిర్వహణ లాభం కంటే అధికంగా ఉండటం గమనార్హం. దేశీ కార్పొరేట్ రంగంపై రుణాల భారం ఎంతగా ఉందనేదానికి ఇదే నిదర్శనం. 2015–16లో ఇలాంటి కంపెనీల సంఖ్య 67 మాత్రమే. మొత్తంమీద చూస్తే కార్పొరేట్ల లాభదాయకత కాస్త మెరుగుపడినప్పటికీ.. రుణ ఊబిలో కూరుకుపోతున్న కంపెనీల సంఖ్య పెరుగుతుండటం విశేషం. వడ్డీ చెల్లింపూ గగనమే... దేశంలో స్టాక్మార్కెట్లో లిస్టయిన మొత్తం కంపెనీల్లో దాదాపు 11 శాతం(బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మినహా) గతేడాది తమ రుణాలపై వడ్డీని కూడా చెల్లించలేని స్థాయికి దిగజారాయి. 2016–17 చివరినాటికి మొత్తం కార్పొరేట్ రుణాల్లో ఐదో వంతు ఈ 11 శాతం కంపెనీలదే. 2016–17లో ఈ సంస్థల నిర్వహణ లాభం రూ.12,000 కోట్లు కాగా, అవి ఇప్పటిదాకా చెల్లించాల్సిన మొత్తం వడ్డీ భారమే రూ.60,000 కోట్లుగా ఉంది. 2015–16లో ఈ జాబితాలో ఉన్న 67 కంపెనీల మొత్తం నిర్వహణ భారం రూ.5,100 కోట్లు. పేరుకు పోయిన వడ్డీ చెల్లింపులు రూ.43,200 కోట్లుగా లెక్కతేలింది. కాగా, తగినంత లాభాలులేని కం పెనీల సంఖ్య 2012–13 నుంచి 2014–15 మధ్య పెరగకుండా స్థిరంగా ఉండటం గమనార్హం. ఏదైనా కంపెనీ నిర్వహణ లాభం గనుక అది చెల్లించా ల్సిన వడ్డీ కంటే తక్కువగా ఉంటే.. రుణాలు తీర్చలేని స్థాయికి పడిపోతుంది. దీంతో బ్యాంకులు ఆయా కంపెనీలకు ఇచ్చిన రుణాలన్నీ మొండిబకాయిలుగా మారిపోతాయి. గతేడాది ఈ జాబితాలోకి చేరిన కంపెనీల్లో అలోక్ ఇండస్ట్రీస్, కాస్టెక్స్ టెక్నాలజీస్, ఉత్తమ్ గాల్వా, వీడియోకాన్ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ కన్స్ట్రక్షన్, ఉషా మార్టిన్, రుచి సోయా, ఆమ్టెక్ ఆటో వంటివి ఉన్నాయి. ఆర్బీఐ చర్యలకు ఆదేశించిన డర్టీ డజన్(ఎస్సార్ స్టీల్, భూషణ్ స్టీల్, అలోక్ ఇండస్ట్రీస్, ఏబీజీ షిప్‌యార్డ్, ఎలక్ట్రోస్టీల్, జేపీ ఇన్ఫ్రా, ల్యాంకో ఇన్ఫ్రా, మోనెత్ ఇస్పాత్, జ్యోతి స్ట్రక్చర్స్, ఆమ్టెక్ ఆటో, ఎరా ఇన్ఫ్రా ఉన్నట్లు అనధికారిక సమాచారం) ఈ కంపెనీలూ ఉన్నాయి. వీటి రుణ భారం దాదాపు రూ. 2 లక్షల కోట్లుగా అంచనా. బ్యాంకులకు ఉన్న మొత్తం మొండిబకాయిల్లో వీటిదే సుమారు 25 శాతం కావడం గమనార్హం. ఆ 85 కంపెనీల రుణ భారం రూ.5 లక్షల కోట్లు పైనే... అప్పుల కుప్పలుగా లెక్కతేలిన సుమారు 85 కంపెనీల మొత్తం రుణ భారం గతేడాది చివరినాటికి రూ.5.04 లక్షల కోట్లుగా అంచనా. 2015–16 చివరికి ఈ మొత్తం రూ.4.6 లక్షల కోట్లుగా ఉంది. కాగా, 2016–17కు సంబంధించి ఆడిటెడ్ బ్యాలెన్స్ షీట్లను ఇంకా చాలా కార్పొరేట్లు సమర్పించాల్సి ఉన్నందున ఈ జాబితా మరింత పెరిగే అవకాశం ఉంది. తీవ్ర రుణ భారం ఉన్న ఈ 85 కంపెనీలు గతేడాది రూ.60,300 కోట్ల నష్టాలను మూటగట్టుకున్నట్లు అంచనా. వీటి మొత్తం ఆదాయం రూ.2.83 లక్షల కోట్లు. బీఎస్ఈ–500, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కంపెనీల(బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, రిఫైనింగ్, మార్కెటింగ్ కంపెనీలు మినహా)లో 761 కంపెనీలను పరిగణలోకి తీసుకొని ఒక ఫైనాన్షియల్ వార్తా పత్రిక ఈ విశ్లేషణను చేసింది. ప్రధానంగా 2006–07 నుంచి వార్షిక ఆర్థిక ఫలితాలు అందుబాటులో ఉన్న కంపెనీల ఆధారంగా దీన్ని రూపొందించారు. ‘గతేడాది చివరి త్రైమాసికంలో మొత్తంమీద రుణ చెల్లింపుల ఒత్తిడిని ఎదుర్కొంటున్న కంపెనీల్లో పెద్దగా మెరుగుదలేమీ లేదు. బలహీనమైన కంపెనీలు మరింత బలహీనం అయ్యాయి. రుణాలపై వడ్డీ కూడా చెల్లించలేని స్థాయి ఉన్న కంపెనీలు ఇంకా 40 శాతం ఉన్నాయి. నిర్వహణ లాభాలు కుచించుకుపోతున్నాయి. కార్పొరేట్ల మొత్తం రుణాల్లో నష్టాల్లో ఉన్న కంపెనీల శాతం 32 శాతం నుంచి 36 శాతానికి ఎగబాకింది’ అని క్రెడిట్ సూసీకి చెందిన ఆశిష్ గుప్తా, కుష్ షా పేర్కొన్నారు. నోట్ల రద్దు, పెట్టుబడి కార్యకలాపాలు, పారిశ్రామిక మందగమనం కొనసాగుతుండటం వంటివి కూడా కంపెనీల రుణ చెల్లింపులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ‘నోట్ల రద్దు తర్వాత హఠాత్తుగా డిమాండ్ పడిపోవడం చాలా కంపెనీల ఆర్థిక పరిస్థితులను దెబ్బతీసింది. ప్రభుత్వ వ్యయం కారణంగా ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా కోలుకుంటోంది. -
ఐదేళ్లలో రాష్ట్రంలో కరువు లేకుండా చేస్తా
త్వరలోనే గోదావరి, కృష్ణానదుల అనుసంధానం చిత్తూరు సభలో ఏపీ సీఎం రైతు రుణవిముక్తి పత్రం విడుదల సాక్షి, చిత్తూరు: కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేసి వచ్చే ఐదేళ్లల్లో రాయలసీమతోపాటు రాష్ట్రంలో కరువు లేకుండా చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. జాతీయస్థాయిలో నదులు అనుసంధానం చేయాలని అనుకున్నప్పటికీ ముందు రాష్ట్రంలో దీనికి శ్రీకారం చుడుతున్నట్ల్లు చెప్పారు. చిత్తూరులో గురువారం నిర్వహించిన రైతు సాధికారిక సదస్సులో సీఎం పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి రైతు రుణవిముక్తి పత్రాన్ని విడుదల చేశారు. అంతకుముందు బాబు పలు శంకుస్థాపన శిలాఫలాకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... గోదావరి నీళ్లు ఏడాదిలో 3వేల టీఎంసీలకుపైగా సముద్రం పాలవుతున్నాయని చెప్పారు. పోలవరం పూర్తిచేసి కుడి కాలువ ద్వారా కృష్ణానదికి 70 టీఎంసీల నీటిని తరలిస్తామన్నారు. అక్కడినుంచి హంద్రీ-నీవా, గాలేరు-నగరి, సోమశిల, కండలేరు ద్వారా రాయలసీమకు తరలించి రతనాల సీమ చేయడమే తన కల అని చెప్పారు. రూ.500 కోట్లు ఖర్చుచేస్తే గోదావరి నీటిని కృష్ణా నదిలో కలపవచ్చునన్నారు. ప్రణాళికా సంఘాలు సరిగ్గా పనిచేయడం లేదని ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తెచ్చినట్లు తెలిపారు. ప్రణాళిక సంఘాల స్థానంలో ముఖ్యమంత్రుల మండలి ఏర్పాటుచేయాలని సూచించినట్లు చెప్పారు. 2050 నాటికి అమెరికా, చైనా కంటే భారతదేశం ముం దుంటుందన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నా రుణమాఫీ చేసి రైతుల భారాన్ని తన భుజస్కంధాలపై వేసుకున్నానని చెప్పారు. హంద్రీ-నీవా పూర్తయితేనే చిత్తూరు బాగుపడుతుందన్నారు. చెరువులు, చెక్‌డ్యాములు, కాలువలను ఆధునికీకరించి భూగర్భ జలాలు పెరిగేలా చూస్తానని చెప్పారు. సౌర విద్యుత్తును అభివృద్ధి చేసి రైతులకు ఏడు గంటల కరెంట్‌ను పగటి పూటే ఇస్తామన్నారు. -
20.29 లక్షల అనర్హులతో రెండో జాబితా
ఎందుకు అర్హత లేదో రిమార్కు కాలంలో వివరణ సాక్షి, హైదరాబాద్: తొలి దశలో రుణ విముక్తికి అర్హత పొందిన 22.79 లక్షల కుటుంబాల వివరాలను వెల్లడించిన సర్కారు.. రెండో జాబితాలో రుణ విముక్తికి అనర్హులుగా పేర్కొన్న 20.29 లక్షల కుటుంబాల వివరాలను వెబ్సైట్లో ఉంచింది. ఆధార్, రేషన్ కార్డులతో పాటు ఇతర వివరాలు సక్రమంగా లేని వారు ఈ జాబితాలో ఉన్నారు. వీరికి ఎందుకు అర్హత లేదో రిమార్కు కాలంలో సర్కారు వివరించింది. ఇందులో పేర్కొన్న వివరాలు ఉంటే వాటిని ఆన్లైన్లో లేదా జన్మభూమి గ్రామ కమిటీలకు అందజేసి, రుణ మాఫీకి అర్హత పొందవచ్చని తెలిపింది. ఈ వివరాలను జన్మభూమి గ్రామ కమిటీల ద్వారా తనిఖీ చేస్తారు. కుటుంబ సభ్యుల వివరాలు లేని ఖాతాలు, పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్, రేషన్ కార్డు, సర్వే నంబర్లు సరిగా లేనివారు, మొత్తం రుణమెంతో సరిగా లేనివారి ఖాతాలను రెండో జాబితాలో చేర్చారు. వీటికి సంబంధించి సరైన వివరాలను ఆన్లైన్లో ఉంచాలని లేదా జన్మభూమి గ్రామ కమిటీలకు అందజేయాలని కోరారు.ఈ ప్రక్రియ పూర్తికి ప్రభుత్వం 4 వారాలు సమయమిచ్చింది. రూ. 10 లక్షలు రుణం తీసుకున్న వారు, 50 ఎకరాలున్న వారు, ఒకే ఆధార్ నంబర్, పలు రేషన్ కార్డులు ఉన్న 35,000 ఖాతాలను ప్రభుత్వమే నేరుగా తిరస్కరించింది.ఆమోదం లేని పంటలకు తీసుకున్న రుణాలనూ తిరస్కరించింది. ఒకే సర్వే నంబర్ మీద ఒకే సీజన్లో భూమి యజమాని, కౌలుదారు రుణాలు తీసుకున్నారని మరికొన్నింటిని తిరస్కరించింది. ఆ కుటుంబాలకూ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఇదిలా ఉండగా తొలి దశ జాబితాల్లోని కొన్ని రైతు కుటుంబాల్లో కొందరి ఖాతాలు కలపకపోవడం వల్ల స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తించలేదని ప్రభుత్వం గుర్తించింది. వీరికీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తింపజేసి, ఆ నిధులను రికవరీ చేయాలని నిర్ణయించింది. కుటుంబంలో నలుగురు రైతులు రుణం తీసుకుంటే వాటన్నింటినీ కాకుండా కేవలం ఇద్దరివే కలపడంతో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తించకుండా రూ.50 వేల వరకు మొత్తం రుణం మాఫీ జరిగినట్లు గుర్తించింది. ఈ నలుగురి ఖాతాల్లో రుణం కలిపితే రూ. 50 వేల పైన అవుతుందని, అప్పుడు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తిస్తుందని అభిప్రాయపడింది.