సుదర్శన్ మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు
సూర్యాపేట క్రైం : అప్పుల బాధ తాళలేక.. తీర్చే మార్గం కనిపించక ఇద్దరు వ్యక్తులు బలవన్మర ణానికి పాల్పడ్డారు. సూర్యాపేటలో జిరాక్స్ సెం టర్ నిర్వాహకుడు, కనగల్ మండలం బాబా సాహెబ్‌గూడెంలో రైతు ఉరేసుకుని ఆత్మహత్య చేçసుకున్నారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తె లిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్(ఎస్) మండలం కందగట్ల గ్రామానికి చెందిన యలగందుల సుదర్శన్(34) సూర్యాపేటలోని రామలింగేశ్వర థియేటర్ రోడ్డులో జిరాక్స్ సెంటర్‌ను నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల సుదర్శన్ తన కుమారుడికి గుండె ఆపరేషన్ చేయించాడు. అంతేకాకుండా దుకాణం ఏర్పాటుకు సుమారు రూ.10 లక్షలు అప్పులు చేశాడు.
అదేవిధంగా ఆ యన వద్దే ఉంటున్న మరదలు వివాహాన్ని కూడా జరిపించాడు. అప్పులు తీవ్రం కావడం, అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో మనోవేదనకు గురయ్యాడు. దుకాణంలో పని ఎక్కువ ఉం దని, ఇంటికి రావడం ఆలస్యమవుతుందని భార్య కు చెప్పి అక్కడే ఉండిపోయాడు. ఉదయం వరకు కూడా సుదర్శన్ ఇంటికి రాకపోవడంతో భార్యకు అనుమానం వచ్చి దుకాణం వద్దకు వచ్చింది. షెట్టర్ తీసేందుకు ప్రయత్నించగా రాకపోవడంతో స్థానికులను పిలిచి తీయగా.. సుదర్శన్ విగతజీవిగా మారి ఉన్నాడు. ఫ్యాన్‌కు ఉరేసుకుని ఉన్న ఆయన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీ రయ్యారు. అప్పుల బాధతోనే ఆత్మహత్యకు పా ల్పడుతున్నట్లు సూసైడ్ నోట్‌లో రాసి ఉంచాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జానికిరాములు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
బాబాసాహెబ్‌గూడెంలో రైతు..
కనగల్(నల్లగొండ) : ఆర్థిక ఇబ్బందులతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం కనగల్ మండలం బాబసాహెబ్‌గూడెంలో జరి గింది. ఎస్‌ఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకా రం.. గ్రామానికి చెందిన చిన్నాల పోలురాజు(48) తనకున్న 3 ఎకరాల భూమిలో వరితోపాటు పత్తి సాగు చేస్తున్నాడు. సాగులో వరస నష్టాలు రావడంతోపాటు ఏడాది క్రితం కూతురు వివాహం చేయడంతో సుమారు రూ. 5 లక్షల వరకు అప్పులయ్యాయి. అప్పలు ఎలా తీరుతాయోనన్న బెంగతో మనస్తాపం చెందిన పోలురాజు బుధవారం సాయంత్రం ఇంట్లోంచి వెళ్లిపోయాడు.
కుటుంబ సభ్యులు గ్రామంలో వాకబు చేసినా సమాచారం లేకపోవడంతో తెలిసిన బంధువుల వద్దకు వెళ్లాడేమో అనుకున్నారు. గురువారం మృతుని భార్య పార్వతమ్మ పశువులకు గడ్డి తీసుకొచ్చేందుకు వ్యవసాయ భావి వద్దకు వెళ్లగా చెట్టుకు ఉరేసుకు ని భర్త పోలురాజు కనిపించడంతో కేకలు వేసింది. చుట్టుపక్కల రైతులు అక్కడకు చేరుకుని కిందికి దిండగా అప్పటికే మృతి చెందాడు. ఎండాకాలం కావడంతో వ్యవసాయ బావి వద్ద పైరు లేనందున బావి వద్దకు ఎందుకు పోతాడు అనుకున్నామని, ఇలా బలవన్మరణానికి పాల్పడుతాడని అనుకోలేదని పోలురాజు భార్య రోదించడం అక్క డున్న వారిని కంటతడి పెట్టించింది. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment