హరియాణా హిస్సార్‌లో రైతుల నిరసన
న్యూఢిల్లీ / భోపాల్ / చండీగఢ్ /జైపూర్: కేంద్రం రుణమాఫీతో పాటు పంటకు మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ రైతులు చేపట్టిన 10 రోజుల దేశవ్యాప్త ఆందోళన ఆదివారం మూడో రోజుకు చేరుకుంది. ఆందోళనలో భాగంగా రైతులు పట్టణాలకు పాలు, కూరగాయలు, ఇతర నిత్యావసరాల సరఫరాను నిలిపివేయడంతో పాటు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాలు, కూరగాయల సరఫరా నిలిచిపోవడంతో ఉత్తరాది రాష్ట్రాల్లో వాటి ధరలు 25–30% పెరిగాయి. ఆందోళనలో భాగంగా హరియాణా, పంజాబ్‌ల్లోరైతులు పాలు, కూరగాయల్ని రోడ్డుపై పారబోసి నిరసన తెలియజేశారు.
పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం రైతులు, వ్యాపారుల మధ్య ఘర్షణ చెలరేగింది. రాజస్తాన్‌లో అతిపెద్ద మార్కెట్‌అయిన ముహానా మండీకి కూరగాయల్ని తీసుకెళ్తున్న 150 ట్రక్కుల్ని రైతులు అడ్డుకున్నారు. ఆందోళన చివరిరోజైన జూన్ 10న రైతు సంఘాలు భారత్ బంద్‌కు పిలుపిచ్చాయి. మధ్యప్రదేశ్‌లో రైతులపై పోలీస్‌కాల్పులకు నిరసనగా జూన్ 8న నిర్వహించే కార్యక్రమంలో బీజేపీ నేతలు యశ్వంత్ సిన్హా, శత్రుఘ్న సిన్హా, వీహెచ్‌పీ నేత ప్రవీణ్ తొగాడియా పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment