మాలె: తమ దేశ రుణ చెల్లింపులను సులభతరం చేయటంలో మద్దుతు ఇచ్చినందుకు మాల్లీవులు అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు భారత్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్, మాల్దీవులు బలమైన సంబంధాలను ఏర్పరుస్తాయని, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకొనున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం మాల్దీవలు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలో దైత్య సంబంధమైన విషయాల్లో విదేశాంగ విధానం సాధించిన విజయాలను ప్రశంసించారు. దేశ రుణచెల్లింపులను సులభతరం చేయటంలో సాయం అంధించిన భారత్, చైనా దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో నెలకొన్న అమెరికా డాలర్ల కొరతను తగ్గించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ క్రమంలోనే మాల్దీవుల ప్రభుత్వం భారత, చైనా దేశాలతో కరెన్సీ మార్పిడి ఒప్పందాలపై చర్చలు జరుపుతోందని వెల్లడించారు.
బ్రిటన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. అదేవిధంగా భారత్‌తో కూడా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక.. గతంలో భారత్‌త్‌తో దౌత్యపరంగా దెబ్బతిన్న సంబంధాలను మళ్లీ పునరుద్ధరించుకోవాలని మహ్మద్ మొయిజ్జు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక.. గత నెలలో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి ప్రెసిడెంట్ మహ్మద్ మొయిజ్జు హాజరైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment