మాలె: డ్రాగన్ కంట్రీ చైనా అండతో మాల్దీవుల ప్రభుత్వం భారత వ్యతిరేక కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు మరోసారి భారత వ్యతిరేకతను వెళ్లగక్కారు. క్రమంలో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాల్దీవులకు భారత్ అందజేసిన హెలికాప్టర్, దాన్ని నిర్వహిస్తున్న సిబ్బందిపై పూర్తి నియంత్రణను తమ చేతుల్లోకి తీసుకుంటున్నట్లు మాల్దీవుల జాతీయ రక్షణ దళం ప్రకటించింది.
వివరాల ప్రకారం.. మాల్దీవుల ప్రభుత్వం భారత్‌కు వ్యతిరేకంగా మరో నిర్ణయం తీసుకుంది. చైనా అండతో భారత వ్యతిరేక చర్యలకు పదునుపెడుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే తమ భూభాగం నుంచి భారత సైనికులను పంపించేయాలని నిర్ణయించగా తాజాగా మరో ముందడుగు వేసింది. భారత్ అందజేసిన హెలికాప్టర్, దాన్ని నిర్వహిస్తున్న సిబ్బందిపై పూర్తి నియంత్రణను తమ చేతుల్లోకి తీసుకుంటున్నట్లు మాల్దీవుల జాతీయ రక్షణ దళం ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇక, భారత దళాల ఉపసంహరణపై చర్చలు కొనసాగుతున్నాయని ఎంఎన్‌డీఎఫ్‌లోని ప్లాన్స్, పాలసీ, రీసోర్సెస్ విభాగం డైరెక్టర్ కర్నల్ అహ్మద్ ముజుథబ మహమ్మద్ తెలిపారు. మే 10 తర్వాత మాల్దీవుల భూభాగంపై విదేశీ దళాలు ఉండొద్దని అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ఆదేశించినట్లు గుర్తుచేశారు. దీంతో, సైనిక సిబ్బంది నుంచి ఆ కేంద్రాల బాధ్యతలను చేపట్టేందుకు భారత్ నుంచి పౌర సిబ్బందితో కూడిన మరో బృందం అక్కడికి చేరుకుంది. కాగా, మాల్దీవుల్లో భారత్ మూడు వైమానిక కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment