న్యూఢిల్లీ: చైనా రుణ భారం నుంచి విముక్తి కల్పించేందుకు మాల్దీవులకు భారత్ సాయం అందించనుంది. దీంతోపాటు దెబ్బతిన్న సంబంధాలను తిరిగి బలోపేతం చేసుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత్ చేరుకున్న మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్‌తో సోమవారం భారత ప్రధాని నరేంద్రమోదీ చర్చలు జరిపారు. అధ్యక్షుడు యమీన్ హయాంలో చైనా నుంచి తీసుకున్న రుణ భారం నుంచి బయటపడేందుకు వీలుగా మాల్దీవులకు రూ.10వేల కోట్ల రుణ సాయం అందజేయనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ సందర్భంగా రెండు దేశాల నేతలు నాలుగు ఒప్పందాలపై సంతకాలు చేశారు. హిందూమహా సముద్ర ప్రాంతంలో భద్రతను మరింత పెంచేందుకు సహకరించుకోవాలని ఇద్దరు నేతలు అంగీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment