రాయపోలు (దుబ్బాక): అప్పులబాధతో ఇద్దరు రైతులు బుధవారం ఆత్మహత్యకు పాల్ప డ్డారు. సిద్దిపేట జిల్లా రాయపోలు మండలం మంతూరులో మన్నె కిష్టయ్య, సుగుణ దంప తులకు నలుగురు కుమారులు. వీరి కుటుంబం తమకున్న ఎకరం 10 గుంటల సాగు భూమితో పాటు మరో ఎకరంన్నర కౌలుకు తీసుకున్నా రు. ఇటీవల పంట పెట్టుబడులు, ఇంటి నిర్మా ణం కోసం రూ.3 లక్షల వరకు అప్పులు చేశా రు. మల్లన్నసాగర్ కాల్వ నిర్మాణంకోసం భూసేకరణలో వీరి భూమి పూర్తిగా పోయింది.
దీంతో పెద్ద కొడుకు నాగరాజు (28) అప్పుల విషయమై కొద్ది రోజులుగా తీవ్ర మనస్తాపం తో పొలం వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపా లెంలో పాగాల మల్లారెడ్డి (58) ఇరవై ఎక రా లు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నా డు. రెండేళ్లుగా వచ్చిన కరువుతో పంటలు సరి గా పండలేదు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినా లాభం లేకపోయింది. పెట్టుబడి కోసం చేసిన అప్పులు రూ.10 లక్షలకు చేరాయి. పం టలు పండకపోయినా రైతుకు ఏడాదికి రూ.1.50 లక్షల కౌలు చెల్లించాల్సి వస్తుండటం, అప్పులు తీర్చే మార్గం కానరాక పురుగు ల మందు తాగి బలవన్మరణం చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment