ఇద్దరు రైతుల ఆత్మహత్య | Loss of debt and farmers suicide | Sakshi
Sakshi News home page

ఇద్దరు రైతుల ఆత్మహత్య

Published Thu, Apr 12 2018 1:28 AM | Last Updated on Thu, Apr 12 2018 1:28 AM

Loss of debt and farmers suicide - Sakshi

ముత్తారం/ఎలిగేడు: అప్పుల బాధ భరించలేక ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఇప్పపల్లి రామకృష్ణాపూర్‌కు చెందిన మర్రిపల్లి మల్లేశ్‌(45) తనకున్న అర ఎకరం భూమితోపాటు మూడెకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేస్తున్నాడు. ఆశించిన స్థాయిలో దిగు బడి రాలేదు. పెట్టుబడుల కోసం తీసుకున్న రూ.3 లక్షల అప్పు తీర్చే మార్గం కానరాక ఇద్దరు కూతుళ్ల వివాహం చేసే స్థితిలో లేకపోవడంతో మనస్తాపం చెందిన మల్లేశ్‌ చెట్టుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

  ఇదే జిల్లా ఎలిగేడు మండలం లోకపేట గ్రామానికి చెందిన దేవరనేని సంపత్‌రావు(35) తనకున్న రెండెకరాలతోపాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని వరిసాగు చేశాడు. అయితే, పంట చేతికొచ్చే దశలో ఎండిపోయింది. రూ.4 లక్షలు అప్పు చేయగా.. పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement