
కుంట నర్సమ్మ
మర్కూక్ (గజ్వేల్): తనకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇల్లు తీసు కుంటామని కొంత మంది గ్రామ నాయకులు బెదిరించడంతో మనస్తాపం చెందిన ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్ప డింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలో ఎర్రవల్లిలో చోటు చేసు కుంది. ఎర్రవల్లి గ్రామానికి చెందిన కుంట నర్సమ్మ (45) గతంలో ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూం ఇంట్లో కుటుంబంతో కలి సి ఉంటోంది.
ఇంటి ఆవరణలో ఉన్న ఖాళీ స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించుకు నేందుకు సిద్ధపడగా గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రహరీ నిర్మించు కుంటే ఇల్లు తిరిగి తీసుకుంటా మని బెదిరింపులకు పాల్పడటంతో పాటు అసభ్యంగా మాట్లాడారు. మ నస్తాపం చెందిన నర్సమ్మ శనివా రం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గజ్వేల్ ప్రభుత్వా స్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి భర్త ఫి ర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment