డెంగీ భారీన పడి చిన్నారి మృతిచెందిన సంఘటన నల్లగొండ జిల్లా సూర్యాపేటలో శనివారం వెలుగుచూసింది.
సూర్యాపేట(నల్లగొండ): డెంగీ భారీన పడి చిన్నారి మృతిచెందిన సంఘటన నల్లగొండ జిల్లా సూర్యాపేటలో శనివారం వెలుగుచూసింది. పట్టణంలోని భగత్‌సింగ్ నగర్‌కు చెందిన శ్రావణి(7) వారం రోజుల నుంచి జ్వరంతో బాధపడుతోంది. దీంతో చిన్నారిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందింది.