మహబూబాబాద్: ఓ పసి హృదయం విష జర్వంతో విలవిలాడుతోంది. పట్టుమని పది నెలలు కూడా నిండని ఆ శిశువును డెంగీ మహమ్మారి ఆవహించింది. వాంతులు, విరోచనాలతో చుట్టుముట్టింది. దీనికి ఆందోళన చెందిన తల్లిదండ్రులు.. చిన్నారిని పలు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. ఎక్కడా తగ్గలేదు. వైద్యుల సూచన మేరకు చివరకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అక్కడ రోజుకు రూ. 2 లక్షలు ఖర్చు చేస్తూ చిన్నారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై దాతలు స్పందించి ఆర్థిక చేయూతనందించాలని వారు వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని ముల్కనూరు గ్రామ పంచాయతీ పరిధి దుబ్బగూడెం గ్రామానికి చెందిన చిన్నారి తోటకూర బాలకృష్ణ, లలిత దంపతుల 9 నెలల పాప ప్రణిద ఉంది.
ఈ క్రమంలో ప్రణితకు ఈనెల 13న జ్వరం రావడంతో బయ్యారంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అక్కడ జ్వరం తగ్గకపోవడంతో 14వ తేదీన ఖమ్మంలోని జాబిల్లి ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. ఖమ్మంలో కూడా జ్వరం తగ్గకపోగా, వాంతులు, విరోచనాలు అయ్యాయి. దీంతో అక్కడి వైద్యులు ఈనెల 17న హైదరాబాద్ రెయిన్‌బో ఆస్పత్రికి రెఫర్ చేయగా చిన్నారిని అక్కడికి తీసుకెళ్లారు.
ప్రస్తుతం పాప ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే వైద్యఖర్చుల రోజుకు రూ.2 లక్షలు అవుతుందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. దీనిపై దాతలు స్పందించి 9949803665 నంబర్‌కు ఫోన్ పే చేసి ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. కాగా, దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు ముల్కనూరు పీహెచ్‌సీ ఆధ్వర్యంలో బుధవారం దుబ్బగూడెంలో వైద్యశిబిరం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment