suffer
-
56 మంది గురుకుల విద్యార్థులకు అస్వస్థత
సత్యవేడు: తిరుపతి జిల్లా సత్యవేడులోని గురుకుల పాఠశాలకు చెందిన 56 మంది విద్యార్థులు విషజ్వరంతో తీవ్ర అస్వస్థతకు గురై గురువారం ఆస్పత్రిలో చేరారు. సత్యవేడులోని జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాలలో 414 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. రెండు రోజుల క్రితం ఐదుగురు విద్యార్థులకు జ్వరం వచ్చింది. గురువారం మరో 51 మంది జ్వరాల బారిన పడ్డారు.దీంతో వారిని సత్యవేడు కమ్యూనిటీ వైద్యశాలలో చేర్పించారు. డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం హాస్టల్లో భోజనానికి వెళ్లినపుడు వర్షాల్లో తడవడం, రెండు రోజుల క్రితం జ్వరం వచ్చిన వారు అందరితో కలసి ఉండడం వల్ల మిగిలిన వారికి కూడా విష జ్వరాలు సోకాయని వైద్యులు చెబుతున్నారు. జ్వర పీడిత విద్యార్థులను వేరుగా మరో గదిలో ఉంచాలని సూచించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులతో వైద్యశాల నిండిపోయింది. -
హెల్త్: మహిళల్లో.. ఈ 'డీప్ వీన్ థ్రాంబోసిస్' సమస్యను గురించి విన్నారా!?
కుటుంబ సభ్యుల ఆరోగ్యం మీద పెట్టినంత శ్రద్ధ తమ విషయానికి వచ్చేసరికి మహిళలు గాలికి వదిలేస్తారు. కుటుంబ సభ్యులు కూడా అంతగా పట్టించుకోరు. దాంతో ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చి, అది తీవ్రరూపం దాల్చేవరకు ఎవరూ సీరియస్‌గా తీసుకోరు. అలాంటి సమస్యల్లో ‘డీప్ వీన్ థ్రాంబోసిస్’ ఒకటి. ఇది స్త్రీ, పురుషులిద్దరికీ వచ్చే సమస్య అయినప్పటికీ... మహిళల్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ. గర్భధారణ నుంచి హార్మోన్ల సంక్లిష్టతల వరకు అనేక అంశాలు డీప్ వీన్ థ్రాంబోసిస్కు దారితీస్తాయి. రక్తనాళాల్లో.. ప్రధానంగా చెడు రక్తాన్ని తీసుకెళ్లే సిరల్లో రక్తం గడ్డకట్టడాన్ని ‘డీప్ వీన్ థ్రాంబోసిస్’ (డీవీటీ)గా చెబుతారు. ఈ సమస్యపై అవగాహన కోసం ఈ కథనం. డీప్ వీన్ థ్రాంబోసిస్ అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. కాలి సిరల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇంచుమించు ప్రతి 20 మందిలో ఒకరికి... వారి జీవితకాలంలో డీప్ వీన్ థ్రాంబోసిస్ బాధపెడుతుంది. మహిళల్లోనే ప్రభావం చూపడానికి కారణాలు.. ప్రెగ్నెన్సీ: స్త్రీలలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపించడానికి గల కారణాలలో గర్భధారణ ఒకటి. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం తర్వాత ఆరు వారాల వరకు ఈ ముప్పు ఉంటుంది. గర్భధారణ తర్వాత రక్తనాళాల్లో రక్తప్రవాహం కాస్త నెమ్మదించడం మామూలే. దాంతో రక్తం గడ్డ కట్టే అవకాశాలు పెరగడం. గర్భసంచి బాగా సాగడం: దీంతో రక్తనాళాలపై ఒత్తిడి పడి రక్తం సాఫీగా ప్రవహించడానికి ఆటంకం కలుగుతుంది. నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్రలు: వీటిల్లోని హార్మోన్లతో డీప్ వీన్ థ్రాంబోసిస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. దాదాపు ప్రతి గర్భనిరోధక మాత్రలో ఈస్ట్రోజెన్, ప్రోజెస్టిన్ ఉండటంతో అవి రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టేలా చేసే అవకాశాలు పెరుగుతాయి. పైగా ఈస్ట్రోజెన్... కాలేయాన్ని ప్రేరేపించి... రక్తంలో ఉండే బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్ రక్తం గడ్డకట్టేలా చేసే ఫైబ్రినోజెన్ను ఎక్కువగా స్రవింపజేస్తుంది. దీనికితోడు గర్భనిరోధక మాత్రల్లో వాడే కొన్ని రకాల కాంబినేషన్స్ పిల్స్ వల్ల ఈ ముప్పు మరింత పెరుగుతుంది. అందువల్ల గర్భనిరోధక మాత్రలు వాడేవారు డాక్టర్ సలహా మేరకే వాడాలి. హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ: మెనో΄ాజ్ తర్వాత తీసుకునే హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీలోని మందుల్లో ఈస్ట్రోజెన్,ప్రోజెస్టిన్ కాంబినేషన్ ఉంటుంది. ఈ ఈస్ట్రోజెన్ పైన పేర్కొన్న ప్రభావాన్నే చూపడంతో డీప్ వీన్ థ్రాంబోసిస్ ముప్పు పెరుగుతుంది. అందువల్ల ఈస్ట్రోజెన్ మందుల్ని చర్మానికి అంటించే ΄్యాచ్ల రూపంలో ఇస్తే ఈ ముప్పు తగ్గుతుంది. జీవనశైలి అంశాలు: శారీరక శ్రమ లేకుండా ఒకేచోట ఎక్కువసేపు కూర్చుని ఉండటం, స్థూలకాయం, ΄÷గతాగడం వంటివి రక్తప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి. స్మోకింగ్ ద్వారా దేహంలోకి చేరే నికోటిన్ రక్తాన్ని గడ్డకట్టేలా చేస్తుంది. వేర్వేరుగా లక్షణాల తీవ్రత.. డీప్ వీన్ థ్రాంబోసిస్లో రకరకాల లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఆ లక్షణాలన్నీ అందరిలోనూ కనిపించక΄ోవచ్చు. దానికితోడు లక్షణాల తీవ్రతలో కూడా మార్పులుండవచ్చు. కొందరిలో రక్తపుగడ్డ చిన్నదిగా ఉంటే కొందరిలో అసలు ఎలాంటి లక్షణాలూ కనిపించక΄ోవచ్చు. సమస్య దానంతట అదే సమసి΄ోవచ్చు కూడా. కొన్ని సాధారణ లక్షణాలు.. రక్తం గడ్డ కట్టినచోట చర్మం వాపు (ముఖ్యంగా కాలు, ΄ాదం వంటివి) చర్మం ఎర్రబారడం, అక్కడ వేడిగా ఉన్నట్లు అనిపించడం ఒక్కోసారి చర్మంలోంచి రక్తనాళాలు కనిపించడం కాలిలో డీవీటీ ఏర్పడినప్పుడు కాలు బలహీనంగా ఉన్నట్లు అనిపించడం రక్తనాళాలు గట్టి పడడం ఈ లక్షణాలు అకస్మాత్తుగా కనిపించినా లేదా కాలం గడుస్తున్న కొద్దీ తీవ్రత పెరుగుతూ పోతున్నా వెంటనే డాక్టర్‌కు చూపించాలి. కొన్నిసార్లు రక్తనాళంలో ఏర్పడ్డ ఈ గడ్డ (క్లాట్) రక్తప్రవాహంలో కొట్టుకుపోతూ, గుండె రక్తనాళల్లోకి చేరి, గుండెస్పందనలను ఆపివేసే ‘పల్మునరీ ఎంబాలిజమ్’ అనే కండిషన్‌కు దారితీసే ప్రమాదం ఉంటుంది. చికిత్స.. డీవీటీ వచ్చే అవకాశాలున్నవారు సపోర్ట్ స్టాకింగ్స్ / కంప్రెషన్ స్టాకింగ్స్ వాడటం. రక్తాన్ని పలచబార్చే మందులైన యాంటీ కోయాగ్యులెంట్స్ వాడటం.. క్లాట్ బస్టర్స్ / థ్రాంబోలైటిక్స్ చికిత్స : చిన్న పైప్ (క్యాథెటర్) ద్వారా రక్తం గడ్డకట్టిన చోటికి థ్రాంబోలైటిక్స్ అని పిలిచే మందును పంపి, రక్తపుగడ్డను చెదరగొట్టే ఔషధాల్ని వాడటం. నివారణ.. మంచి సమతులాహారం తీసుకోవడం అంటే పొట్టు తీయని కాయధాన్యాలు, ఆకుకూరలు, కాయగూరలు, తాజా పండ్లు తీసుకుంటూ బరువు పెరగకుండా చూసుకోవడం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ముఖ్యంగా మహిళలు రోజుకు కనీసం 30 నిమిషాల వ్యాయామం చేయడం వల్ల రక్తప్రవాహం సాఫీగా మారి రక్తపు గడ్డలు ఏర్పడకుండా ఉంటుంది. తగినన్ని నీళ్లు, ద్రవాహారాలు తీసుకుంటూ ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండటం ఒకేచోట స్థిరంగా కూర్చుని ఉండకుండా కాసేపు నడక, స్ట్రెచ్చింగ్ వంటివి చేస్తూ ఉండటం దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు అదేపనిగా వాహనంలో కూర్చుని ఉండకుండా తరచూ బ్రేక్ తీసుకోవటం రక్తనాళాల్లో రక్తప్రవాహం సాఫీగా సాగేందుకు కంప్రెషన్ స్టాకింగ్ వంటివి వాడటం గర్భం దాల్చిన మహిళల కుటుంబ సభ్యుల్లో డీప్ వీన్ థ్రాంబోసిస్ వచ్చిన ఆరోగ్య చరిత్ర ఉంటే ముందే డాక్టర్‌కు ఈ విషయాన్ని చెప్పడం మంచిది. — డాక్టర్ నరేంద్రనాథ్ మేడ, కన్సల్టెంట్ వాస్క్యులార్ – ఎండో వాస్క్యులార్ సర్జన్ ఇవి చదవండి: హెల్త్: 'గుండె' పెరగడమా..? అవును ఇదొక సమస్యే..! -
ఇంటిప్స్: కిచెన్‌లో బొద్దింకల సమస్యా?
రోజురోజుకి వంటగది అంటేనే భయంగా మారుతున్న పరిస్థితి అని కొందరు వాపోవడం జరుగుతుంటుంది. దీనికి కారణం బొద్దింకల బెడద అంటుంటారు. కానీ ఈ బొద్దింకల సమస్యను సులువుగా తొలగించడానకి పరిష్కార మార్గం మనచేతిలోనే ఉన్నదని మీకు తెలుసా! మరవేంటో తెలుసుకుందాం. పరిష్కార మార్గాలు.. కాసిని వెల్లుల్లి రెబ్బల్ని దంచి నీటిలో కలిపి సింక్ పైప్ దగ్గర పెట్టాలి. బొద్దింకలకు ఇది విరుగుడుగా పనిచేస్తుంది. మూలల్లో బోరిక్ ΄ûడర్‌ను ఉంచితే బొద్దింకలు మాయమవుతాయి. బేకింగ్ సోడా, చక్కెర కలిపి బొద్దింకలు తిరిగే ప్రదేశంలో చల్లడం ద్వారా కూడా బొద్దింకలను తరిమికొట్టవచ్చు. ఇవి చదవండి: హెల్త్: మీకు తెలుసా! ఈ రెండు కలిపి తీసుకోవడంతో.. ఏమవుతుందో? -
హోలీ వేళ.. నాలుగు కుటుంబాల్లో విషాదం!
హోలీ పండుగవేళ.. కుమురంభీం ఆసిఫా బాద్ జిల్లాలోని వార్దా తీరం కన్నీటి మయమైంది. ఆర్తనాదాలతో మారుమోగింది. అప్పటి వరకు ఉత్సాహంగా రంగుల పండుగ జరుపుకుని స్నానం కోసం వెళ్లిన నలుగురు స్నేహితులను నది పొట్టన బెట్టుకుంది. ఈత రాకపోవడంతో గల్లంతై తిరిగిరాని లోకాలకు చేరుకున్న ఆ మిత్రుల చివరి వేడుక విషాదాంతంగా మారింది. నాలుగు కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగి ల్చింది. విగత జీవులుగా మిగిలిన బిడ్డలను పట్టుకొని గుండెలవిసేలా ఆ తల్లులు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఉత్సాహంగా హోలీ చేసుకుని.. కౌటాల మండలం కేంద్రంలోని నదిమాబాద్‌కు చెందిన పనస కమలాకర్(22), ఆలం సాయి(22), ఉప్పుల సంతోష్(25), ఎల్ములె ప్రవీణ్(23), మేడి నవీన్, పసుల సంతోష్ చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులు. కలిసి చదువుకోకున్నా ఒకే కాలనీలో ఉండడంతో వీరి మధ్య స్నేహం పెరిగింది. సోమవారం హోలీ పండుగ కలిసే జరుపుకున్నారు. మధ్యాహ్న వరకు రంగులు చల్లుకుని ఎంజాయ్ చేశారు. సెల్ఫీలు దిగారు. తర్వాత మద్యం కొనుగోలు చేసి స్నానాలు చేసేందుకు తాటిపల్లి గ్రామ సమీపంలోని వార్దా నది వద్దకు వెళ్లారు. మద్యం తాగి స్నానానికి దిగి.. ఆరుగురూ స్నానం చేస్తూ ఉల్లాసంగా గడిపారు. తర్వాత ఒడ్డునే కూర్చుని అందరూ వెంటతెచ్చుకున్న మద్యం సేవించారు. అనంతరం నవీన్ అక్కడి నుంచి కౌటాలకు తిరిగి వెళ్లాడు. పసుల సంతోష్‌కు ఫోన్ రావడంతో మాట్లాడుతూ ఒడ్డునే ఉండి పోయాడు. కమలాకర్, ఉప్పుల సంతోష్, ప్రవీణ్, సాయి మాత్రం మరోసారి స్నానం చేసేందుకు నదిలో దిగారు. మద్యం మత్తు, ఈత రాకపోవడం, లోతు అంచనా వేయకపోవడంతో నలుగు రూ గల్లంతయ్యారు. గమనించిన సంతోష్ సమీ పంలో ఉన్నవారి వద్దకు వెళ్లి సాయం చేయాలని కోరాడు. స్థానికులు నదిలో గాలించగా ఆచూకీ లభించలేదు. పోలీసులకు సమాచారం అందించడంతో కౌటాల సీఐ సాదిక్‌పాషా, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నాడు. గజ ఈతగాళ్లను రప్పించి సుమారు నాలుగు గంటలపాటు గాలించారు. అనంతరం నలుగురి మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదానికి కారణాలివే.. నదిలో స్నానానికి వెళ్లి నలుగురు మృత్యువాత పడడానికి ప్రధాన కారణం ఈత రాకపోవడం. నదిలో లోతు అంచనా వేయకుండా స్నానానికి వెళ్లడం, మద్యం తాగి ఉండడం అని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతంలో నది ప్రవాహం వంపు తిరిగి ఉంది. నదిలో స్నానానికి వెళ్లిన ప్రదేశంలో తీరం నుంచి ఇసుక ఉండగా.. నడుచుకుంటూ వెళ్లిన వారు ఒక్కసారిగా లోతుకు పడిపోయి ఉంటారని స్థానికులు తెలిపారు. మద్యం తాగి ఉండటం, నీటి మట్టం కారణంగా బయట రాలేకపోయారని పోలీసులు పేర్కొన్నారు. యువకులు దిగే చోట లోతు ఎక్కువగా ఉందని స్థానిక రైతులు చెప్పినా లెక్క చేయకపోవడంతో అంతా విగతజీవులుగా మారాల్సి వచ్చింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ, డీఎస్పీ తాటిపల్లి వద్ద ఘటనా స్థలాన్ని ఎస్పీ సురేశ్‌కుమార్, డీఎస్పీ కరుణాకర్ పరిశీలించారు. మృతదేహాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఘటనా స్థలంలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మరో యువకుడు పసుల సంతోష్‌తో మాట్లాడారు. సీఐ సాదిక్ పాషాతో మాట్లాడిన ఎస్పీ మృతదేహాలకు త్వరగా పోస్ట్‌మార్టం ముగించి కుటుంబీకులకు అప్పగించాలని ఆదేశించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. యువకులు నలుగురు మద్యం తాగి నీటిలోకి దిగడంతో ఈత రాక మృతి చెందారని ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. మిన్నంటిన రోదనలు.. యువకులు నీటిలో గల్లంతయిన విషయం తెలుసుకున్న వారి కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు, ప్రజలు భారీగా నది వద్దకు చేరుకున్నారు. మృతదేహాలను వెలుపలికి తీయగానే మృతుల కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ‘హోలీ ఆడి ఇంటికి వచ్చి బోర్ వేసుకుని స్నానం చేయమన్నా కదా కొడుకా.. ఇక్కడికి ఎందుకు వచ్చినవ్ కొడుకా..’ అంటూ కమలాకర్ తల్లి నది వద్ద కొడుకు మృతదేహాన్ని పట్టుకుని రోదించిన తీరు కదిలించింది. మృతుల వివరాలు.. ఆలం శంకర్–దేవమ్మ దంపతులకు ముగ్గురు సంతానం కాగా, సాయి పెద్ద కుమారుడు. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్‌లో డిగ్రీ చదువుకుంటున్నాడు. ఉప్పుల గురుపాదం–శంకరమ్మ దంపతుల చిన్న కుమారుడు ఉప్పుల సంతోష్. తండ్రి గతంలో చనిపోవడంతో ఇంటర్ పూర్తి చేసిన సంతోష్ రైస్‌మిల్లులో పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. పనస వసంత్ – లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. పేద కుటుంబం కావడంతో పెద్ద కుమారుడు కమలాకర్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. వాసుదేవ్ – సునీత దంపతుల ఒక్కగానొక్క కుమారుడు ఎల్ములే ప్రవీణ్. వీరిది రైతు కు టుంబం. ప్రవీణ్ వ్యవసాయంలో తండ్రికి తోడుగా ఉంటున్నాడు. మూడేళ్ల క్రితం వివా హం కాగా, భార్య వకుళ, ఏడాది వయసున్న కుమారుడు వేదాంశ్ ఉన్నాడు. కొడుకు మృతితో భార్య, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇదిలా ఉండగా ఆరు నెలల క్రితం ప్రవీణ్ మేనమామ చౌదరి మారుతి కూడా సిర్పూర్(టి) మండలం టోంకిని వద్ద వార్దా నదిలోనే గల్లంతై మృతి చెందాడు. ఇవి చదవండి: వివాహితను ట్రాప్ చేసిన ఏఎస్సై రామయ్య.. -
ప్రమోషన్లకు ఆటంకంగా 'టెట్' అలజడి!
నిర్మల్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) ఉత్తీర్ణత తప్పనిసరి అనే నిబంధన జిల్లాలోని సీనియర్ ఉపాధ్యాయుల్లో అలజడి రేపుతోంది. టెట్ ఉత్తీర్ణులై ఉండాలనే నిబంధన తప్పనిసరి అని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయానికి వచ్చినట్లు తెలియడంతో ప్రమోషన్లకు ఆటంకంగా మారింది. జిల్లాలో గత అక్టోబర్‌లో ఉపాధ్యాయ ప్రమోషన్ల ప్రక్రియ నిలిచిపోగా తాజాగా ఈ వివాదం తెరపైకి వచ్చింది. 2011లో టెట్ నిర్వహణ మొదలు కాగా కొన్నేళ్లకు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) ప్రతీ ఉపాధ్యాయుడికి తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులిచ్చింది. అయితే ఇది రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ఫలితంగా 1996 నుంచి 2008 వరకు పలు దఫాలుగా నిర్వహించిన డీఎస్సీల్లో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిలో చాలామందికి టెట్ అర్హత లేదు. ఇలాంటి వారందరి ప్రమోషన్ వ్యవహారం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. కాగా, మరోవైపు జూనియర్లు తమకు ప్రాధాన్యం లభించనుందని 2012, 2017 ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ అర్హత ద్వారా ఎంపికై న ఎస్జీటీ, ఎస్ఏ ఉపాధ్యాయ వర్గాల్లో కొత్త ఉత్సాహం వ్యక్తమవుతోంది. ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం టెట్ అర్హత నియమావళి కలిగి ఉన్నవారే నూతన నియామకాలకై నా, ప్రమోషన్లకై నా అర్హులవుతారని టెట్ క్వాలిఫైడ్ టీచర్స్ సంఘం జిల్లా నాయకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటే ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా అర్హతలు పొందుతూనే ఉండాలన్నదే వారి అభిప్రాయంగా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్సీటీఈ తీసుకున్న నిర్ణయంతో వాస్తవానికి ఉపాధ్యాయ ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ అక్టోబర్‌లో జరగాల్సి ఉండగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో మధ్యంతరంగా నిలిచిపోయింది. తాజాగా ఎన్సీటీఈ ఇచ్చిన ఉత్తర్వులపై విద్యాశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న దానిపై సీనియర్ ఉపాధ్యాయుల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఈ నెల 11న రాష్ట్రస్థాయి సమీక్షలో ఉన్నతాధికారులు, సంబంధిత శాఖల కార్యదర్శులు ముఖ్యమంత్రితో సమీక్షా సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమీక్షలో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందోననే ఉత్కంఠ సీనియర్ ఉపాధ్యాయుల్లో కొనసాగుతోంది. టెట్ నిబంధన సరికాదు డీఎస్సీలు అమలు పరిచినప్పటినుంచి కాకుండా 2011 నుంచి ఈ టెట్ అర్హత పరీక్ష మొదలైంది. ఈ నిబంధన ప్రమోషన్లలో ప్రవేశపెట్టడం సరైంది కాదు. దీంతో సీనియర్ ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతున్నారు. 25 ఏళ్లుగా ఒకే కేడర్‌లో పనిచేస్తున్న వారు ఉద్యోగోన్నతి వస్తుందని భావిస్తున్న తరుణంలో వారి ఆశలపై నీళ్లు చల్లే నిర్ణయమిది. ఈ నిబంధనపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి సడలింపు నిర్ణయం తీసుకోవాలి. – నరేంద్రబాబు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఆరేళ్ల సమయంతో సడలింపు ఇవ్వాలి ఎన్సీటీఈ నిబంధనల మేరకు ప్రాథమిక స్థాయిలో బోధించే వారు టెట్ పేపర్–1, ఉన్నత స్థాయిలో బోధించే వారికి పేపర్–2 పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలని నిబంధన ఉన్న మాట వాస్తవమే. కానీ.. ఇదివరకే ఉపాధ్యాయులుగా కొనసాగుతున్న వారికి ప్రమోషన్లలో దీన్ని వర్తింపజేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ వర్తింపజేయాలనుకున్నా కనీసం ఆరేళ్ల సడలింపునిస్తూ ప్రమోషన్లు చేపట్టాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. – విజయ్‌కుమార్, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఇవి చదవండి: పంచాయతీ పోరుకు బ్రేక్..! పార్లమెంట్ ఎన్నికల తర్వాతే.. -
నేరడిగొండ జెడ్పీఎస్‌ఎస్‌లో ఓ ఉపాధ్యాయుడు..
ఆదిలాబాద్: విద్యార్థుల భవితకు బాటలు వేయాల్సిన కొంత మంది గురువులు ఆ వృత్తికే కలంకం తీసుకొస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా విద్యార్థినులపై వేధింపులకు పాల్పడుతున్నారు. ఆ బాధను భరించలేక కొందరు బయట పెడుతుండగా, మరికొంత మంది మౌనంగా భరించాల్సిన దుస్థితి. జిల్లాలో కొద్ది రోజులుగా ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటున్నాయి. అయితే ఆ కీచకులపై నామమాత్రపు చర్యలకే పరిమితం కావడంతో వక్రబుద్ధి ఉన్న మిగతా వారి తీరులో మార్పు కానరాని పరిస్థితి. సంఘటనలు బయటకు వచ్చినప్పుడు రాజకీయ పలుకుబడి, అధికారుల అండదండలతో బయటపడుతున్నారు. తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధించాల్సి పోయి వారిపై అసభ్యంగా ప్రవర్తించడం పరిపాటిగా మారింది. దీంతో విద్యాశాఖకే చెడ్డ పేరు వస్తోంది. ఇటీవల నేరడిగొండ జెడ్పీఎస్‌ఎస్‌లో ఓ కీచక గురువు విద్యార్థినులను వేధించడంతో వారు పాఠశాల ఆవరణలో నిరసనకు దిగారు. గతంలోనూ జిల్లాలో చాలా మంది విద్యార్థులు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. నేరడిగొండ జెడ్పీఎస్‌ఎస్‌లో ఓ ఉపాధ్యాయుడు ఇటీవల విద్యార్థినులపై వేధింపులకు పాల్పడడంతో వారు పాఠశాల ఆవరణలో నిరసన తెలిపారు. దీంతో ఆ ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు పడింది. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సమితి కార్యదర్శి సైతం ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, డీఈవోకు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. జిల్లా కేంద్రంలోని క్రీడా పాఠశాలలో ఈ ఏడాది మార్చిలో ఓ కోచ్ విద్యార్థినులను వేధించడంతో ఆ విషయం బయట పడింది. అధికారుల దృష్టికి తీసుకెళ్లగా విచారణ చేపట్టి అతడిని విధుల నుంచి తప్పించారు. వెకిలిచేష్టలకు పాల్పడినట్లు తేలడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. మావల మండలం వాఘాపూర్‌లో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తించడంతో అతడిని అక్కడి నుంచి మరో పాఠశాలకు బదిలీ చేశారు. ఆ పాఠశాలలో సైతం ఆయన తీరు మారలేదు. విద్యార్థినులు ఆందో ళన చేపట్టినప్పటికీ విషయం బయట పొక్క కుండా విద్యాశాఖాధికారులు కప్పిపుచ్చారు. తాంసి మండలంలోని ఘోట్కురి పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు సెల్ఫోన్లో అశ్లీల చిత్రాలను విద్యార్థినులకు చూపించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో గ్రామస్తులు ఆయనను పాఠశాలలో బంధించారు. ఈ మేరకు విచారణ జరిపిన డీఈవో అతడిని మరో పాఠశాలకు పంపించారు. ఉట్నూర్ మండలం లక్కారం పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. విచారణ జరిపి ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. అలాగే అతడిపై పోక్సో చట్టం కింద కేసు సైతం నమోదైంది. వక్రబుద్ధితో.. విద్యార్థులను ఉన్నతస్థాయికి తీసుకెళ్లాల్సిన ఉపాధ్యాయులు కొంత మంది వక్రబుద్ధితో వారి ని వేధిస్తున్నారు. ముఖ్యంగా ఈఘటనలు ఉన్న త పాఠశాలల్లో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. పాఠశాలల్లో సాధికారత క్లబ్‌లు ఏర్పా టు చేసినప్పటికీ అవి నామామత్రంగానే మిగిలాయి. విద్యార్థినులపై వేధింపులకు పాల్పడే ఉపాధ్యాయులకు తోటి టీచర్లు మద్దతు పలకడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాఠాలు బోధించే సమయంలో బాలికలపై అసభ్యకరంగా ప్రవర్తించడం, వెకిలిచేష్టలకు దిగడంతో వారు చదువుపై ఆసక్తి చూపలేకపోతున్నారు. విషయాన్ని తల్లిండ్రులకు చెప్పలేక మదనపడుతున్నారు. ఒకవేళ విషయాన్ని బయట పెడితే తమ చదువులకు ఆటంకం కలుగుతుందేమోనని వా రు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఎవరి కై నా చెబితే సంగతి చూస్తామని ఈ గురువులే విద్యార్థినులను హెచ్చరిస్తు న్న ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. టీచర్ల మధ్య గొడవలు.. జిల్లాలోని కొన్ని ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల మధ్య వర్గపోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇలాంటి ఘటనలు కొన్ని వెలుగుచూస్తుండగా, మరెన్నో బహిర్గతం కావడం లేదన్నట్టు తెలుస్తోంది. అయితే కొన్ని పాఠశాలల్లో తమకు వ్యతిరేకంగా ఉన్న ఉపాధ్యాయులు విద్యార్థులను రెచ్చగొట్టి ఉపాధ్యాయులు తమను వేధిస్తున్నారని చెప్పిస్తున్నట్లు కూడా చర్చ సాగుతోంది. వీరి మధ్య గొడవలు విద్యార్థుల భవితపై ప్రభావం చూపుతున్నాయి. విద్యార్థులు నిరసనకు దిగడంతో విద్యాశాఖ అధికారులు ఆ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులను పంపిస్తున్నారు. దీంతో అక్కడ పాఠాలు బోధించే టీచర్ల కొరత ఏర్పడుతోంది. గొడవల కారణంగా ఉపాధ్యాయుల పరువు పోవడంతో పాటు విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. కొరవడిన పర్యవేక్షణ.. విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లోపించడంతో పాఠశాలల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. కొంత మంది ఉపాధ్యాయులు విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించడంతో పా టు తోటి మహిళ ఉపాధ్యాయులను కూడా వేధిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో గతంలో పలు ఘటనలు చోటుచేసుకున్నాయి. జిల్లాలో ఒక్క రెగ్యులర్ ఎంఈఓ లేకపోవడం, అలాగు జిల్లా విద్యాశాఖ అధికారి కూడా ఇన్చార్జి కావడంతో కొంత మంది ఉపాధ్యాయులు వారి మాటలను పెడచెవిన పెడుతున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు ఏవైన ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోవడం లేదు. తప్పు చేసిన వారికి కనీసం మెమోలు కూడా ఇవ్వకుండా మెతక వైఖరి వ్యవహరించడంతో తమను ఎవరేమి చేయలేదనే ధీమాతో వారు ఉన్నట్లు తెలుస్తోంది. గురుతర బాధ్యతలు నిర్వర్తించాలి ఉపాధ్యాయులు గురుతర బాధ్యతలు నిర్వర్తించాలి. తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధించడంతో పాటు ఉపాధ్యాయులు వారి భవితకు బాటలు వేయాలి. విద్యార్థినులను వేధిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు. కొంత మంది తీరు వల్ల విద్యా శాఖకు చెడ్డ పేరు వస్తోంది. ఎవరైన ఇబ్బందులకు గురిచేస్తే మా దృష్టికి తీసుకురావాలి. విద్యార్థులు మానసికంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – ప్రణిత, డీఈవో -
దిక్కులేని వారిని చేసి వెళ్లిపోయావా.. బండపల్లిలో విషాదం..!
సాక్షి, కరీంనగర్: ఉన్న ఊరిలో ఉపాధి కరువై ఎడారి దేశానికి వెళ్లిన యువకుడి శవమై ఇంటికి తిరిగొచ్చాడు. యువకుడి మృతితో ఆ కుటుంబం రోడ్డున పడింది. బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు గ్రామానికి చెందిన యువకులు ముందుకొచ్చి విరాళాలు అందిస్తున్నారు. మండలంలోని బండపల్లికి చెందిన రేగుల బాబు(39) గత డిసెంబర్లో జీవనోపాధి కోసం కువైట్ వెళ్లాడు. ఇరువై రోజుల క్రితం జ్వరం బారిన పడ్డాడు. అక్కడ వైద్యం చేయించుకున్నప్పటికీ తగ్గలేదు. రెండు, మూడు రోజుల్లో ఇంటికొస్తానని భార్యకు వారం క్రితం ఫోన్ చేసి చెప్పాడు. పరిస్థితి విషమించి బాబు శుక్రవారం మృతి చెందాడు. ఈ అతని స్నేహితులు ఫోన్ ద్వారా బాబు భార్య కల్యాణికి ఫోన్లో తెలపడంతో ఆమె గుండెలవిసేలా రోదించింది. బాబు శవపేటిక సోమవారం బండపల్లికి చేరింది. తండ్రి శవాన్ని చూసి కూతురు, కుమారుడు, భార్య రోదించిన తీరు అందరిని కన్నీరు పెట్టించింది. చిన్ననాటి నుంచి కష్టాలే.. బాబు చిన్నతనంలోనే తండ్రి లచ్చయ్య మృతి చెందడంతో తల్లి లచ్చవ్వ గ్రామంలో చిన్న హోటల్ నడిపిస్తూ కుమారుడిని పోషించింది. బాబు పదోతరగతి చదువుతుండగా తల్లి అనారోగ్యంతో చనిపోయింది. ఒంటరిగా జీవిస్తున్న బాబు బంధువులు పెళ్లి చేశారు. స్వగ్రామంలో చిన్నాచితక పనులు చేసుకునేవాడు. ఇటీవల అప్పు చేసి కువైట్‌కు వెళ్లాడు. అక్కడ పరిస్థితులు అనుకూలించకపోవడంతో జ్వరంబారిన పడి గత శుక్రవారం మృతిచెందాడు. ముందుకొచ్చిన యువకులు.. బాబు కుటుంబాన్ని ఆదుకునేందుకు గ్రామ యువకులు ముందుకొచ్చారు. మృతుడికి పదమూడేళ్ల కూతురు రష్మిత ఉంది. ఆమె చదువుల కోసం యువకులు రూ.50వేలు జమచేశారు. మరింత మొత్తం జమచేసి అందజేసేందుకు యువకులు ప్రయత్నిస్తున్నారు. ఇవి చదవండి: పండుగ రోజున యువకుడి తీవ్ర విషాదం! -
డెంగీతో.. 'పసి హృదయం' విలవిల..! ఆదుకోవాలంటూ కన్నోళ్ల వేదన..!!
మహబూబాబాద్: ఓ పసి హృదయం విష జర్వంతో విలవిలాడుతోంది. పట్టుమని పది నెలలు కూడా నిండని ఆ శిశువును డెంగీ మహమ్మారి ఆవహించింది. వాంతులు, విరోచనాలతో చుట్టుముట్టింది. దీనికి ఆందోళన చెందిన తల్లిదండ్రులు.. చిన్నారిని పలు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. ఎక్కడా తగ్గలేదు. వైద్యుల సూచన మేరకు చివరకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ రోజుకు రూ. 2 లక్షలు ఖర్చు చేస్తూ చిన్నారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై దాతలు స్పందించి ఆర్థిక చేయూతనందించాలని వారు వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని ముల్కనూరు గ్రామ పంచాయతీ పరిధి దుబ్బగూడెం గ్రామానికి చెందిన చిన్నారి తోటకూర బాలకృష్ణ, లలిత దంపతుల 9 నెలల పాప ప్రణిద ఉంది. ఈ క్రమంలో ప్రణితకు ఈనెల 13న జ్వరం రావడంతో బయ్యారంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అక్కడ జ్వరం తగ్గకపోవడంతో 14వ తేదీన ఖమ్మంలోని జాబిల్లి ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. ఖమ్మంలో కూడా జ్వరం తగ్గకపోగా, వాంతులు, విరోచనాలు అయ్యాయి. దీంతో అక్కడి వైద్యులు ఈనెల 17న హైదరాబాద్ రెయిన్బో ఆస్పత్రికి రెఫర్ చేయగా చిన్నారిని అక్కడికి తీసుకెళ్లారు. ప్రస్తుతం పాప ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే వైద్యఖర్చుల రోజుకు రూ.2 లక్షలు అవుతుందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. దీనిపై దాతలు స్పందించి 9949803665 నంబర్‌కు ఫోన్ పే చేసి ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. కాగా, దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు ముల్కనూరు పీహెచ్సీ ఆధ్వర్యంలో బుధవారం దుబ్బగూడెంలో వైద్యశిబిరం నిర్వహించారు. -
దేశం పేరు మారితే ఆ వెబ్సైట్లకు కష్టాలు
ఢిల్లీ: ఇండియా పేరు భారత్‌గా మారితే దేశంలోని వేలాది వెబ్సైట్లకు కష్టాలు మొదలుకానున్నాయి. ఎందుకంటే చాలా వెబ్సైట్లు తమ పేర్లలో .ఇన్ అనే డొమైన్‌ను వాడుతున్నాయి. ఇన్నాళ్లూ ఇండియా పేరు ఉంది కాబట్టే ఇండియా స్పెల్లింగ్‌లోని తొలి రెండు అక్షరాలు అయిన ఐఎన్‌లను ఆయా వెబ్సైట్ల పేరు చివరన పెట్టుకున్నాయి. .ఇన్ డొమైన్‌ను కంట్రీ కోడ్ టాప్ లేయర్ డొమైన్(టీఎల్‌డీ) అంటారు. దేశం పేరు ఇండియా నుంచి భారత్‌కు మారితే .ఇన్ అనే డొమైన్ భారత్ అనే కొత్త పేరును ప్రతిబింబించదు. అçప్పుడు భారత్ అనగానే ఠక్కున స్ఫురించేలా కొత్త టీఎల్‌డీ(డొమైన్)కు మారితే బాగుంటుంది. భారత్ ఇంగ్లిష్ స్పెల్లింగ్‌లోని బీహెచ్ లేదా బీఆర్ ఇంగ్లిష్ అక్షరాలతో కొత్త డొమైన్‌ను వాడాలి. అంటే .బీహెచ్ లేదా .బీఆర్ అని ఉంటే సబబుగా ఉంటుంది. కానీ ఈ రెండు డొమైన్లను ఇప్పటికే వేరే దేశాలకు కేటాయించారు. దీంతో వెబ్సైట్ పేరు చూడగానే ఇది భారత్‌దే అని గుర్తుపట్టేలా ఉండే కొత్త డొమైన్ మనకిప్పుడు అందుబాటులో లేదు. అదే ఇప్పుడు అసలు సమస్య. ఎన్ఐఎక్సై్స వారు ఇన్‌రిజిస్ట్రీ సంస్థ ద్వారా .ఇన్ డొమైన్‌ను రిజిస్టర్ చేశారు. ప్రత్యేకమైన అవసరాల కోసం ఇందులోనే సబ్‌డొమైన్‌లను సృష్టించి కొన్ని సంస్థలకు కేటాయించారు. ఉదాహరణకు జీఓవీ.ఇన్ అనే డొమైన్‌ను భారత ప్రభుత్వ రంగ సంస్థలు వాడుకుంటున్నాయి. ఎంఐఎల్.ఇన్ అనే డొమైన్‌ను దేశ సైన్యం వినియోగిస్తోంది. ఒక్కో డొమైన్ ఒక్కో దేశాన్ని వెంటనే స్ఫురణకు తెచ్చేలా ప్రాచుర్యం పొందాయి. ఉదాహరణకు .సీఎన్ అనగానే చైనా వెబ్సైట్లు, .యూఎస్ అనగానే అమెరికా వెబ్సైట్లు, .యూకే అనగానే బ్రిటన్ వెబ్సైట్లు గుర్తొస్తాయి. భారత్‌లోని చాలా ప్రముఖమైన వెబ్సైట్లు సైతం తమ ఐడెంటిటీ(గుర్తింపు)ను నిలబెట్టుకున్నాయి. మార్కెట్లో ప్రాచుర్యం పొందాయి. ఇప్పుడు ఒక్కసారిగా డొమైన్ మారిపోతే కొత్త డొమైన్‌తో ఆయా వెబ్సైట్లకు మళ్లీ అంతటి గుర్తింపు రావడం చాలా కష్టం. .బీహెచ్, .బీఆర్ మనకు రావేమో!.బీహెచ్, .బీఆర్ అనే భారత్‌కు సరిగ్గా సరిపోతాయి. కానీ ఇప్పటికే .బీహెచ్ను బహ్రెయిన్ దేశానికి, .బీఆర్‌ను బ్రెజిల్ దేశానికి, .బీటీను భూటాన్‌కు కేటాయించారు. దీనికి మరో పరిష్కారం ఉంది. డొమైన్లోని అక్షరాలను పెంచుకుని .BHARAT, లేదా .BHRT అనే కొత్త డొమైన్‌కు తరలిపోవడమే. కొత్త డొమైన్‌కు మారినాసరే ఆయా వెబ్సైట్లు పాత డొమైన్లనూ కొనసాగించవచ్చు. వీటి నిర్వహణలో వచ్చే ఇబ్బందేమీ లేదు. అయితే ఆయా సంస్థల అసలు వెబ్సైట్ ఏది అనేది గుర్తించడం కష్టమవుతుంది. నకిలీ వెబ్సైట్ల బెడద ఒక్కసారిగా పెరిగిపోతుంది. బ్యాంకింగ్ రంగంలో ఇలాంటి సమస్య తలెత్తితే ఇక అంతే సంగతులు. కొత్త డొమైన్ ప్రాచుర్యం పొందాక పాత డొమైన్లకు.. ఇవి ఏ దేశానికి చెందినవబ్బా ? అనే కొత్త అనుమానం నెటిజన్లకు కలిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే డొమైన్ పేరు సమస్య ఒక్కటే పొంచి ఉంది. నిజంగానే దేశం పేరు మారితే ఇలాంటి కొత్త రకం సమస్యలు ఏమేం వస్తాయో ఇçప్పుడే చెప్పలేం. చూద్దాం.. ఈ డొమైన్ల కథ ఏ మలుపు తిరుగుతుందో! ఇదీ చదవండి: తెరపైకి భారత్..! -
పురిటి కష్టాలు.. ఏడుగురు వైద్యులున్నా.. సేవలు అంతంతే..
ఆదిలాబాద్: గర్భిణులకు రిమ్స్‌లో పురిటి కష్టాలు తప్పడం లేదు. నవమాసాలు మోసి ప్రసవం కోసం ఇక్కడికి వస్తున్న వారిలో ఇటీవల పలువురు మృత్యువాత పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కొంతమంది వెద్యుల నిర్లక్ష్యం కారణంగా బాధిత కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకుంటున్నాయి. రూ.కోట్లాది నిధులతో సర్కారు ఆసుపత్రి నిర్మించినా పేదల కష్టాలు మాత్రం దూరం కావడం లేదు. మెటర్నిటీ వార్డులో పరిస్థితి దయనీయంగా తయారైంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కాన్పుకు రూ.వేలాది చెల్లించుకోలేని పేదలు రిమ్స్‌లో చేరితే వైద్యం అందక అష్టకష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటీవలే ఇద్దరు బాలింతలు మృతిచెందడం ఆందోళనకు గురిచేస్తుంది. గైనిక్ వార్డులో పర్యవేక్షణ కరువవడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. వార్డును పర్యవేక్షించాల్సిన అధికారి చుట్టపు చూపుగా రావడం, వచ్చినా పట్టించుకోకపోవడం, బాలింతలకు సరైన వైద్య సేవలు అందించకపోవడమే కష్టాలకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ అధికారి లేకపోతే రిమ్స్‌కు పీజీ సీట్లు రావనే ఆలోచనతో ఎలాంటి చర్యలకు పూనుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. రూ.లక్షల వేతనం తీసుకుంటున్న ఆ ఉద్యోగి నిర్లక్ష్యం కారణంగా గైనిక్‌వార్డు పరిస్థితి అగమ్యగోచరంగా మారిందనే విమర్శలు లేకపోలేదు. ఏడుగురు వైద్యులున్నా.. సేవలు అంతంతే.. జిల్లాలోని మారుమూల గ్రామాల ప్రజలతో పాటు ఉమ్మడి జిల్లా, మహారాష్ట్ర, ఇతర జిల్లాల నుంచి జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి వైద్యం కోసం వస్తుంటారు. రిమ్స్‌లో పలు వార్డులు ఉండగా, అందులో మెటర్నిటీ, ఎమర్జెన్సీ వార్డులే కీలకం. ప్రసవం కోసం ఇన్పెషేంట్స్ దాదాపు 200కు పైగా ఉంటారు. అయితే ఈ కీలక వార్డుల్లో వైద్యులు అందుబాటులో ఉండడం లేదనే ఆరోపణలున్నాయి. గైనిక్ వార్డులో హెచ్‌వోడీతో పాటు మరో ఏడుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. వీరితో పాటు రిమ్స్‌లో నలుగురు పీజీ చేస్తున్న గైనిక్ వైద్యులున్నారు. అలాగే షిఫ్టుల వారీగా ముగ్గురు చొప్పున హౌస్ సర్జన్లు ఈ వార్డులో ఉంటారు. ఓపీలో ఇద్దరు, ఆపరేషన్ థియేటర్లో మరో ఇద్దరు ఉన్నప్పటికీ మిగతా వైద్యులు గైనిక్ వార్డులో ఉండాలి. కానీ వారు చుట్టపుచూపులా కనిపిస్తుండడంతో గర్భిణులకు కష్టాలు తప్పడం లేదు. ప్రసవం అయిన తర్వాత రక్తస్రావం, బీపీ, తదితర అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. అయితే అవేమి పట్టించుకోకుండా మధ్యాహ్నానికే ఇంటి ముఖం పడతారు. అందుబాటులో ఉన్న సిబ్బందిని పిలిచినా వారు విసుక్కోవడం, వస్తాం.. వెళ్లండనే సమాధానాలు తప్పా వచ్చి చూసిన దాఖలాలు ఉండవని బాధితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా రిమ్స్‌లో స్టాఫ్‌నర్సులు, హౌస్సర్జన్లు, పీజీ డక్టర్లతోనే నెట్టుకొస్తున్నారు. 24 గంటల పాటు మెటర్నిటీ వార్డులో ఉండాల్సిన వైద్యులు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తే తప్ప రాత్రి వేళల్లో రావడం లేదు. దీంతో గతంలో ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన ఓ గర్భిణి సకాలంలో వైద్యం అందక పురిటి నొప్పుల్లోనే మృత్యువాత పడిన విషయం తెలిసిందే. మారని రిమ్స్ తీరు.. ఎన్ని విమర్శలొస్తున్నా ఇక్కడి వైద్యుల తీరు మాత్రం మారడం లేదు. ఇక్కడ పనిచేసే చాలా మంది వైద్యులకు ప్రైవేట్ క్లినిక్‌లు ఉండడంతో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నారు. దీంతో రిమ్స్‌లో ఉన్న వారికి నాణ్యమైన వైద్యసేవలు అందకుండా పోతున్నాయి. కాసులిస్తేనే.. సేవలు గైనిక్ వార్డులో కొంతమంది సిబ్బంది తీరుపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సిజేరియన్, సాధారణ ప్రసవమైన తర్వాత సిబ్బందికి ఎంతో కొంత ముట్టజెప్పాల్సిందే. లేకుంటే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. మగ బిడ్డ పుడితే రూ.వెయ్యి, ఆడబిడ్డ పుడితే రూ.500.. ఇలా రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇంద్రవెల్లి మండలంలోని మర్కగూడకు చెందిన సొనాలి కాంబ్లే(22) రిమ్స్‌లో జూలై 25న మగబిడ్డకు జన్మనిచ్చిన ఐదారు గంటల్లోనే మృతి చెందింది. డెలివరీ కోసం రెండు రోజుల ముందుగానే ఆస్పత్రిలో చేరిన ఆమె సాధారణ ప్రసవం అయ్యింది. ఉదయం 7గంటలకు బిడ్డకు జన్మనివ్వగా, 10 గంటల సమయంలో చనిపోయింది. అయితే వైద్యులు మాత్రం ఉమ్మ నీరు ఊపిరితిత్తులో చేరి శ్వాస ఆడక చనిపోయిందని చెప్పడం గమనార్హం. గత నెలలో సిరికొండ మండలానికి చెందిన ఓ గర్భిణి రిమ్స్‌లో ప్రసవం కోసం చేరింది. ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం అనారోగ్యం (కాలేయ సమస్య) కారణంగా మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. అయితే ప్రసవం కోసం వచ్చిన సమయంలో వైద్య పరీక్షలు చేయాల్సి ఉండగా, తీరా చనిపోయిన తర్వాత అనారోగ్య సమస్య అని చెప్పడం వారి పనితీరుకు నిదర్శనం. ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం.. ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చిన గర్భిణులు, బాలింతలకు ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నాం. వైద్యులు 24 గంటల పాటు అందుబాటులో ఉంటున్నారు. గైనిక్ వార్డులో నాణ్యమైన వైద్యసేవలు అందించేలా చర్యలు చేపడతాం. ఇబ్బందులు ఉంటే నా దృష్టికి తీసుకురావాలి. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తా. – జైసింగ్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ -
సినీ నటి పూనమ్ కౌర్ కు అరుదైన వ్యాధి
-
Telangana: ఆ ఊరికి ఏమైంది..?
ఆ ఊరును కిడ్నీవ్యాధి పీడిస్తోంది. అంతుచిక్కకుండా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఆ వ్యాధి సోకి పలువురు మృత్యుకోరల్లో చిక్కుకున్నారు. చాలామంది డయాలసిస్ కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. వైద్యానికి డబ్బుల్లేక మరికొందరు దీనంగా రోజులు వెళ్లదీస్తున్నారు. ఇదీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం భేతాళపాడు గ్రామపంచాయతీ పరిస్థితి. ఆ గ్రామపంచాయతీ పరిధిలోని పంతులుతండా, టాక్యాతండా, పీక్లాతండా, చీపురుగూడెం, రాచబండ్ల కోయగూడెం, రేగళ్లతండా గ్రామాల ప్రజలు కూడా ఈ వ్యాధితో పోరాడుతున్నారు. 2015 నుంచి ఇప్పటివరకు కిడ్నీ సంబంధితవ్యాధితో 28 మంది మృతి చెందారు. గత పదిరోజుల వ్యవధిలోనే పంతులుతండాలో గుగులోత్ దేవిజ్యా(58), ధరావత్ వీరు(38) మృత్యువాతపడ్డారు. ఈ పంచాయతీ పరిధిలో 18 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా పడకలు, వసతుల్లేక ప్రైవేట్ ఆస్పత్రుల్లో డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోందని బాధితులు అంటున్నారు. – జూలూరుపాడు భద్రాద్రి జిల్లా భేతాళపాడులో అంతుచిక్కని కిడ్నీవ్యాధి ఏడేళ్లుగా ఇదే తంతు... : ఈ పంచాయతీ పరిధిలోని ప్రజలు ఏడేళ్లుగా కిడ్నీవ్యాధితో బాధపడుతున్నా, పలువురు పిట్టల్లా రాలిపోతున్నా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుందో అంతుపట్టడం లేదని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. 2017లో ఒకే రోజు ఇద్దరు మృతి చెందడంతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు నామమాత్రంగా స్పందించి, అక్కడి ప్రజల తాగునీటి శాంపిళ్లను పరీక్షించి ఫ్లోరైడ్ సమస్య లేదని తేల్చారు. ఆ తర్వాత కూడా కిడ్నీవ్యాధి నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ప్రజలు ఎందుకు కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారనే విషయాలను తేల్చడంలో ప్రభుత్వం, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. భేతాళపాడు, పంతులుతండా, టాక్యాతండా, పీక్లాతండా గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య వల్లే కీళ్లు, ఒంటినొప్పులు, కాళ్లవాపులు రావడంతోపాటు కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డాక్టర్లు దయచూపాలె గత నాలుగేళ్లుగా భార్యాభర్తలిద్దరం కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాం. డయాలసిస్ చేస్తే చనిపోతావని, బలహీనంగా ఉన్నావని, మందులు వాడమని నాకు డాక్టర్లు చెప్పారు. నా భార్య లక్ష్మి కీళ్లనొప్పులు, ఒళ్లు, నడుము నొప్పుల బాధ భరించలేకపోతోంది. ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లే మాపై దయ చూపాలి. –బానోత్ పరశ్యా, పంతులుతండా వారానికి రెండుసార్లు డయాలసిస్ చేయించుకుంటున్నా రెండేళ్లుగా మూత్రపిండాలవ్యాధితో బాధపడుతున్నా. వారానికి రెండుసార్లు ఖమ్మం ఆస్పత్రికి వెళ్లి డయాలసిస్ చేయించుకుంటున్నా. నెలకు రూ.20 వేలు ఖర్చవుతున్నాయి. డయాలసిస్ కోసం కొత్తగూడెం, భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రులకు వెళితే పడకలు ఖాళీగా లేవని డాక్టర్లు అంటున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్దామంటే డబ్బుల్లేవు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాలి. – బానోత్ మంగ్యా, టాక్యాతండా రక్త నమూనాలు సేకరిస్తాం భేతాళపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలు కిడ్నీవ్యాధితో బాధపడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. బాధితుల రక్త నమూనాలు సేకరించాలని పీహెచ్సీ డాక్టర్‌ను ఆదేశించాం. బ్లడ్ శాంపిల్స్‌ను టీ హబ్‌కు పంపిస్తాం. భేతాళపాడుతోపాటు తండాల్లో నీటి నమూనాలు కూడా సేకరించాలని చెప్పాం. అన్ని శాఖల సమన్వయంతో ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. – శిరీష, డీఎంహెచ్‌వో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా -
ఎందుకలా ఉన్నావ్?
బాధ, సంతోషం కలసిందే జీవితం. ఎప్పటిమాట! ఎప్పటి మాటైనా ఎప్పటికీ తెలుసుకోవలసిన మాట. కలవడానికి ఏవైనా రెండు ఉండాలి. అందుకేమో జీవితంలో సుఖఃదుఖాలు కలిసి ఉంటాయి. కలవకుండా రెండూ వేర్వేరుగా ఉంటే? వేర్వేరుగా ఉండడం అంటే జీవితంలో ఏదో ఒకటే ఉండడం. బాధగానీ, సంతోషం గానీ! అలా ఉండదు కానీ, ఉంటే కనుక రెండిటికీ విలువ ఉండదు. అప్పుడిక జీవితం కూడా విలువను కోల్పోతుంది. ఏదో బతికేస్తున్నట్లుగా ఉంటుంది. ఎప్పుడూ సంతోషం విసుగనిపిస్తుంది. ఎప్పుడూ బాధ విరక్తి కలిగిస్తుంది. కాబట్టి రెండూ కలిసే ఉండాలి. మానవజన్మ చేసుకున్న అదృష్టం ఏంటంటే బాధలో, సంతోషంలో లోకం మన ముఖంలోకి ముఖం పెట్టి చూస్తూ ఉంటుంది! సంతోషంగా ఉంటే దూరం నుంచి చూసి సంతోషిస్తుంది. బాధలో ఉంటే దగ్గరకొచ్చి ‘ఎందుకలా ఉన్నావ్?’ అని అడుగుతుంది. ‘ఏం లేదు’ అంటే వదిలి పెట్టదు. ఏముందో చెప్పేవరకు వదిలి వెళ్లదు. కొన్నిసార్లు అనిపిస్తుంది. ఎందుకు బాధగా ఉన్నామో చెప్పుకోవడం కన్నా, మనసులోని బాధను అదిమిపట్టుకుని నవ్వు ముఖం పెట్టడం తేలికని! వాస్తవానికి మనం చెయ్యవలసింది కూడా అదే. బాధను ఉంచుకోవాలి. సంతోషాన్ని పంచుకోవాలి. -
మామయ్య ప్రపంచం
నాది చాలా చిన్న ప్రపంచం. అమ్మ, నాన్న, చెల్లెలు, అమ్మమ్మ, మామయ్య. ఇదే నా ప్రపంచం. చిన్న చిన్న ప్రపంచాల్లోనే కొన్నిసార్లు చాలా పెద్ద కథలుంటాయి. మామయ్య గురించి చెప్పాలి. ఆయన ఈరోజు ఇంతలా ఎందుకు గుర్తొస్తున్నాడో చెప్పాలి. మామయ్యది ఒక పల్లెటూరు. అమ్మమ్మతో పాటు ఉండేవాడు. ఆదివారం వచ్చిందంటే మేమందరం అక్కడికి వెళ్లిపోయి సరదాగా గడిపేస్తుంటాం. ఈ ఆదివారం ఆయన ఇక్కడ లేకపోవడం, ఇంకే ఆదివారం ఉండడు అన్న ఆలోచనే ఎందుకో బాధను పెంచెస్తోంది.రాత్రిపూట ఆరుబయట ఇలా మంచం మీద పడుకొని ఉంటే గాలి కన్నా వేగంగా పరిగెడుతున్నాయి నా ఆలోచనలు. మామయ్య ఎలా ఉండేవాడు! నన్ను, చెల్లిని చిన్నప్పట్నుంచీ ఎంతో ప్రేమతో పెంచాడు. నాకు బాగా గుర్తు.. స్కూల్‌కెళ్లే తొలినాళ్లలో తనే రెడీ చేయించి మరీ స్కూల్‌కి తీసుకెళ్లేవాడు. మధ్యాహ్నం అయితే భోజనం దగ్గర గారం చేయడం నా పని. చెల్లి కూడా అచ్చం నాలాగే! అస్సలు తినేవాళ్లమే కాదు. మామయ్య పైకి చూపెట్టి, ‘‘చూడండి పిల్లలూ! ఈ ముద్ద మీరు తినకపోతే ఆ ఫ్యాన్ మీ మీద పడిపోతుంది’’ అనేవాడు. నిజానికి, అబద్ధానికి తేడా తెలియని ఆ వయసులో అది నిజమేనేమోనని భయంతో తినేసేవాళ్లం. మమ్మల్ని కూర్చోబెట్టుకొని ఎన్నెన్ని కబుర్లు చెప్పేవాడో తల్చుకుంటే, ఇప్పుడు ఆయన పక్కనలేనందుకు కూడా కోప్పడాల్సింది ఆయన్నే కదా అనిపిస్తోంది. కోపమైనా, ఇష్టమైనా మామయ్య మీదే అలా చూపించేస్తాం నేను, చెల్లి. మేం చదువుల్లో ఒక్కో తరగతీ ముందుకు వెళ్తూ ఉంటే ఆయన కళ్లలో సంతోషం కనిపించేది. కొన్నిసార్లు సమయాలు ఎలా ఎలా గడిచిపోతాయో ఆలోచిస్తే గొప్ప ఆశ్చర్యం కలుగుతుంది. ఇలా మామయ్య స్కూల్లో చేరిపించాడో లేదో, అలా పదోతరగతికి వచ్చేసినట్టు అనిపించింది.పదేళ్లలో ఈ ప్రపంచంలో, నాలో ఎన్ని మార్పులొచ్చినా మామయ్య ప్రపంచంలో ఏ మార్పూ రాలేదు. ఎప్పట్లాగే మేమే ఆయన ప్రపంచం. నా పదో తరగతి పూర్తయింది. కాలేజీలో జాయిన్ అవ్వాల్సిన రోజులవి. పదో తరగతి వరకైతే ఇంటి దగ్గరే ఉండి చదవగలిగాను కానీ, ఇంటర్లో మంచి కాలేజీలో చేరాలి. బైపీసీ తీసుకొని డాక్టర్ అవ్వాలి. అందుకు నేను విజయవాడ వెళ్లి తప్పక చదువుకోవాల్సిన పరిస్థితి.మామతో ఇదే మాట చెబితే, నా గడ్డం పట్టుకొని, ‘‘ఏరా కొడుకా! అంత దూరం పోవాలా? ఎలా ఉంటావో ఏమో మా అందర్నీ వదిలేసి!’’ అంటూ నా కళ్లకేసి చూశాడు. నాకప్పుడు అర్థం కాలేదు ఆ మాటల్లో ఎంత ప్రేమ దాగి ఉందో! ‘‘ఉంటానులే మామా! నువ్వేం దిగులుపడకు.’’ అన్నాను ఎంతో కులాసాగా.‘నువ్వుంటావేమో తల్లీ! నేను ఉండలేనే’ అన్నట్టు ఒక చిరునవ్వు నవ్వాడు.కాలేజీలో చేరి చదువుల్లో పడిపోయా. ఒక కొత్త ప్రపంచం పరిచయమైంది. నా చిన్న ప్రపంచం చిన్న చిన్నగా పెరగడం మొదలైంది. ఆ మార్పును అర్థం చేసుకుంటుండగానే ఒక సంవత్సరం గడిచిపోయింది.సెలవులిచ్చారు. అంతకుముందు ఆదివారం వచ్చిందంటే నాకొక ఉత్సాహం ఉండేది. కాలేజీలో చేరాక మళ్లీ సంవత్సరానికి అంతే ఉత్సాహంతో ఆదివారం కోసం ఎదురుచూశా.ఎప్పట్లానే ఆ ఆదివారం ఊరికి వచ్చాం. కానీ ఈసారి ఎప్పటిలా లేడు మామయ్య. బక్కచిక్కిపోయి నీరసంగా ఉన్నాడు. ఎందుకలా ఉన్నాడో ఎవ్వరూ చెప్పలేదు. మామయ్యను అంత దిగాలుగా చూడటం అదే మొదటిసారి. ఆ సాయంత్రమే తిరిగి ఇంటికెళ్లిపోయాం. ఒక రెండు రోజుల తరువాత మామ ఇంటికొచ్చాడు. ‘‘ఎప్పుడెళ్లాలి తల్లీ మళ్లీ కాలేజీకి?’’ అన్నాడు టీ తాగుతూ.‘‘రేపే’’ అన్నాను.టీ తాగడం అయ్యాక ‘‘సరే, నేను బయల్దేరుతాను’’ అంటూ పైకి లేచాడు. గడప వరకూ వెళ్లి వెనక్కి తిరిగి నా గడ్డం పట్టుకొని.. ‘‘రేపే వెళ్లిపోవాలా కొడుకా?’’ అన్నాడు దీనంగా. ఔనన్నట్లు తలూపాను. ఆ క్షణం తన కళ్లలో ప్రేమ, ఆప్యాయత, బాధ కన్నీటి చుక్కలా రాలిపడుతుంటే దాన్ని పట్టుకుని.. ప్రేమగా నుదుటిపై ముద్దుపెట్టి ‘‘సరే నాన్నా! జాగ్రత్త. అప్పుడప్పుడు అయినా ఫోన్ చెయ్యొచ్చు కదా!’’ అన్నాడు. అలాగే అన్నట్టు తలూపాను. మామయ్య మా ఫోన్ కోసం ఎంతెంత ఎదురుచూసేవాడో ఆ మాట తీరులో తెలిసిపోతుంది. కానీ అది అర్థమయ్యేసరికి ఈరోజు వస్తుందని మాత్రం నాకు తెలియదు. ఆ రోజు మామయ్య వీధి చివరికెళ్లేవరకూ అలా చూస్తూనే ఉండిపోయా. సత్తువ లేని ఆ కాళ్లతో మామయ్య అలా ఎంతో ఆయాసంగా నడిచి వెళ్తోంటే ఏడుపు తన్నుకొచ్చింది. ‘మామయ్యని వదిలేసి ఎక్కడో ఎలా ఉంటున్నా నేను?’ అనిపించింది ఆ క్షణం. ఆ వెంటనే చదువుకోసం ఇవన్నీ తప్పవు కదా అని నాకు నేనే సర్దిచెప్పుకున్నాను. చూస్తుండగానే అలాగే మరో సంవత్సరం కూడా గడిచిపోయింది. ఈసారి సెలవులకి మాత్రం మామ పరిస్థితి ఇంకా మారిపోయింది. ఒక్క అడుగు కూడా వేయలేని పరిస్థితి. పెళ్లి, పిల్లలు ఏదీ లేకుండా మేమే ప్రపంచమై బతికాడు. తనకంటూ రూపాయి కూడబెట్టుకోలేదు. చేతికి రూపాయి వచ్చినా అది మా కోసమే ఖర్చు పెట్టాడు. మామే అయినా ఒక తండ్రి కంటే ఎక్కువ ప్రేమనే చూపించాడు మా మీద. ఆస్తి అంటూ ఏమీ లేకున్నా వాటన్నింటి కంటే మించిన ప్రేమ ఉంది మామ దగ్గర. అంతగా మమ్మల్ని ప్రేమించిన మామని అలా చూడలేక, ‘‘పద నువ్వు.. హాస్పిటల్‌కి..’’ అన్నాను. ‘‘నాకేమైందని?’’ అంటూ అలానే ఉండిపోయాడు. నాకు మామయ్య మీద అరోజు కోపమొచ్చింది. ఆయన కోసమే చెప్తుంటే ఇలా మాట్లాడతాడు ఏంటని ఆయనతో మాట్లాడొద్దనుకున్నా. మూడు నెలలు అలాగే గడిచిపోయాయి. నా చదువులు కూడా బాగా సాగుతున్నాయి. కాలేజీ మారింది. ఇంకో కొత్త ప్రపంచం ఇప్పుడు. ఈ కొత్త ప్రపంచం పరిచయమైన ఒకరోజు ఫోనొచ్చింది – ‘‘రేయ్ కొడుకా! ఇదిగో ఈ ఊళ్లోనే ఉన్నా. హాస్పిటల్‌కి వచ్చా. నువ్వు రాగలవా ఇక్కడికి!’’ అని అడిగాడు మామయ్య.నేను కోపంలోనే ‘‘రాలేను నేను’’ అన్నాను.ఆ తరువాత కొన్ని రోజులకు డిశ్చార్జ్ అయ్యాడు. నాన్న మామయ్యను ఇంటికి తీసుకెళ్లిపోయాడు. అ తర్వాత నేనే ఇంటికెళ్లి చూస్తే ఆయన పరిస్థితి అర్థమై దగ్గరికెళ్లి మాట్లాడలేకపోయా. ఏమీ తినలేకపోతున్నాడు. ఏం తిన్నా, ఏం తాగినా కడుపులో నిలవట్లేదు. ఏమీ మింగలేకపోతున్నాడు. అలాంటి పరిస్థితిలో కూడా తన బాధ మాతో ఎప్పుడూ పంచుకోలేదు. కొన్ని రోజులకి మళ్లీ ఊరెళ్లిపోయాడు. ఒకరోజు అనుకోకుండా నాన్న, చెల్లి వచ్చారు. ఇంత పొద్దున్నే ఏంటా? అనుకుంటూ ఆఫీస్ రూమ్ వైపుకు నడిచాను. ఏదో తెలియని బాధ వాళ్ల కళ్లలో. ఆ బాధకి కారణాన్ని నేను అడిగేలోపే నాన్న, ‘‘మామకి సీరియస్ అంట. వెంటనే బయలుదేరు’’ అన్నాడు. అక్కడ ఏం జరిగి ఉంటుందో ఊహించగలుగుతున్నా. కానీ మనసు మాత్రం ఒప్పుకోవడం లేదు. గేటు వైపుకి అడుగులు వడివడిగా సాగాయి. ఊరు చేరేవరకూ మామ జ్ఞాపకాలే. ఇంటికి ఆమడ దూరంలో ఉండగానే అంతమంది మనుషుల్ని చూడగానే మనసు కలవరపడింది. ఆగిపోతా అంటున్న నడకని కాదంటూ అడుగు ముందుకేశా. ప్రేమే ఊపిరై బతికే మామని ఊపిరి లేకుండా అలా చూసి నోటి వెంట మాట రాలేదు, కళ్లలో నీళ్లు తప్ప.ప్రేమతో గోరుముద్దలు తినిపించిన మామకి ఒక్క పూట కూడా భోజనం పెట్టలేకపోయాననే బాధ. ‘‘రాగలవా?’’ అన్నప్పుడు ఎందుకు వెళ్లలేదు అనే కోపం నామీద నాకు. కానీ కోపం తనకెప్పుడూ లేదు నా మీద. ఎందుకంటే తనకి తెలిసింది.. ప్రేమించడం, అభిమానించడం.. అంతే. అందుకేనేమో తన జీవితంలోని చివరిరోజున కూడా అమ్మకి ఫోన్ చేసి ‘‘పిల్లలెలా ఉన్నారు? చూడాలని ఉంది.’’ అని అడిగాడు. మామయ్య మమ్మల్ని చూడాలని ఎవ్వర్నీ అడగని చూడాలనుకున్న రోజులు ఎన్ని ఉన్నాయో తల్చుకున్నప్పుడల్లా ఇప్పుడున్న బాధంతా రెట్టింపవుతుంది. ఆ బాధలోనే మామయ్య తిరిగొస్తే బాగుండు అన్న ఆశ పుట్టుకొస్తుంది, మళ్లీ రాడని తెలిసినా! - హెప్సిబ -
పెద్దలప్లాన్..పేదల విలవిల
ఇందిరా సత్యనగర్ పుంత పేదల ఇళ్లకు ఎసరు 80 అడుగుల రోడ్డు విస్తరణకు అధికారుల ప్రయత్నాలు సర్వే లేకుండానే పనులు చేసేందుకు యత్నం ఆక్రమణదారులెవరు? ఎందరో తేల్చాలని స్థానికుల డిమాండ్ నీటి సరఫరా నిలిపివేత, వైఎస్సార్సీపీ జోక్యంతో పునరుద్ధరణ చర్యల వెనుక అధికార పార్టీ నేతల హస్తం 200 కుటుంబాల్లో అలజడి ... సాక్షి, రాజమహేంద్రవరం : ఉండటానికి గూడు లేకపోవడంతో 44 ఏళ్ల క్రితం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి వెనుక ఉన్న ఇందిరానగర్ రెవెన్యూ సర్వే నంబర్ 89లోని పుంతను చదును చేసుకుని చిన్నపాటి ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేదలకు ప్రస్తుతం గూడును కోల్పో యే పరిస్థితి ఏర్పడింది. 1975 మాస్టర్‌ప్లా¯ŒS ప్రకారం కోరుకొండ రోడ్డు నుంచి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి వెనుక అన్నయాచారి రోడ్డును కలుపుతూ 80 అడుగుల రోడ్డును నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే దాన్ని 1989లో స్థానికులు విజ్ఞప్తి మేరకు అప్పటి నగరపాలక మండలి 40 అడుగులకు కుదిస్తూ అక్కడున్న వారికి పట్టాలు మంజూరు చేసేవిధంగా తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. అయితే ఈ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించ లేదు. అయితే తర్వాత 1998లో ఆ రోడ్డును 80 అడుగుల నుంచి 40 అడుగులకు కుదించారు. ఇంత వరకూ బాగానే ఉన్నా ప్రస్తుతం నగరపాలక సంస్థ యంత్రాంగం పుంతలో ఉన్న పేదలను ఖాళీ చేయించి 80 అడుగుల రోడ్డును నిర్మించాలని ప్రయత్నిస్తోంది. 1973 నుంచి ఆ పుంతలో పేదలు నివాసాలు ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు. 1989లో నగరపాలక మండలి తీర్మానం మేరకు అక్కడ 76 మంది ఉన్నారు. ప్రస్తుతం దాదాపు 200 కుటుంబాలు ఉన్నాయి. పేదల ఇళ్లను ఆనుకుని, ముఖ్యంగా ధనవంతుల ఇళ్లకు ముందు రోడ్డువైపున పేదల ఇళ్లున్నాయి. ప్రస్తుతం అక్కడ కొంత మంది రాజకీయ నాయకులు, పీఅండ్‌టీ కాలనీ వాసులు పేదలను ఖాళీ చేయించేందుకు యత్నిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సర్వే లేకుండానే పనులు ఎలా? గత చరిత్రను పక్కన పెట్టిన ప్రస్తుత పాలకవర్గం, యంత్రాంగం పుంతలోని ఆక్రమణదారులను ఖాళీ చేయించి 80 అడుగుల రోడ్డు వేయాలని ప్రయత్నిస్తోంది. నగరాన్ని అభివృద్ధి చేయాలన్న యంత్రాంగం చర్యలు తమ బతుకులను ఛిద్రం చేయరాదన్నది అక్కడి పేదల విన్నపం. పుంత ఆక్రమణలో పేదలతోపాటు, ఆ తర్వాత అక్కడ ప్రైవేటు స్థలాలు కొన్నవారు కూడా కొంత ప్రాంతాన్ని తమ స్థలంలో కలుపుకున్నారు. ఆ అనవాళ్లు ఆక్కడ స్పష్టంగా కనపడుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రి వెనుక వైపున అన్నయాచారి రోడ్డు నుంచి కోరుకొండ రోడ్డులోని క్వారీ సెంటర్ వరకు దాదాపు రెండు కిలోమీటర్ల పొడవు ఉంది. మధ్య మధ్యలో రోడ్డు వెడల్పు ప్రస్తుతం పలు రకాలుగా ఉంది. నగరపాలక మండలి 1998 తీర్మానం ప్రకారం 40 అడుగులు కాకుండా 80 అడుగుల మేర రోడ్డును వేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు అక్కడ ఉన్న పేదలు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా అసలు పుంత ఎంత స్థలం? ఎక్కడ వరకు ఉంది? ఆక్రమణ ఎంత మేర గురైంది? ఆక్రమణదారులు ఎవరు? ఎంత ఆక్రమించారు? అన్న విషయాలు తేల్చేందుకు సర్వే చేయకుండా పేదల ఇళ్లను మాత్రమే తొలగించాలని నిర్ణయించడంపై విమర్శలు వస్తున్నాయి. కోరుకొండ రోడ్డు 80 అడుగులు ... అదే విధంగా అన్నయాచారి రోడ్డు కనీసం 30 అడుగులు కూడా లేదు. అలాంటిది ఈ రెండు రహదారులను కలుపుతూ వేసే లింకు రోడ్డు 80 అడుగులు ఉండడం, పీఅండ్‌టీ కాలనీ సంఘానికి, అక్కడ పేదలకు గత కొన్నేళ్లుగా వివాదాలు ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు... యంత్రాంగం తాను అనుకున్న పనిని వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా పదిహేను రోజుల క్రితం పుంతలోని అన్నయాచారి రోడ్డువైపు ప్రారంభంలోని నీటి కుళాయిని తొలగించింది. అయితే పేదల విషయం ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలా రెడ్డి అధికారుల దృష్టికి తీసుకురావడంతో కుళాయిని పునరుద్ధరించారు. ఘటనా స్థలానికి వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలు వారికి భరోసా ఇచ్చారు. అయితే మరుసటి రోజు నుంచి కూడా యంత్రాంగం తమ ప్రయత్నాలను ఆపలేదు. దీంతో స్థానికులు నగరపాలక సంస్థ ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎప్పడు ఎవరొస్తారు? ఏమి చేస్తారోనన్న ఆందోళనలో కాలనీ వాసులున్నారు. -
గిరిపై ఉక్కిరిబిక్కిరి
అగ్నిగుండాన్ని తలపిస్తున్న ఆలయ ప్రాంగణం సత్తెన్న భక్తులకు ఎండదెబ్బ అరకొర ఏర్పాట్లతో ఇబ్బందిపడుతున్న భక్తులు ప్రహసనంగా మజ్జిగ పంపిణీ పనిచేయని వాటర్ కూలర్లు అన్నవరం : రత్నగిరి సత్యదేవుని సన్నిధికి విచ్చేసే భక్తులు ఎండలకు అల్లాడిపోతున్నారు. వివాహాల సీజ¯¯ŒS, విద్యాసంస్థలకు సెలవులు కావడంతో భక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. రత్నగిరిపై 40 డిగ్రీలకు పైబడి కాస్తున్న ఎండలకు భక్తులు తట్టుకోలేక పోతున్నారు. దేవస్థానంలో కొన్ని చోట్ల చలువ పందిళ్లు వేశారు. వ్రతమండపాల వద్ద మాత్రం వేయలేదు. అక్కడక్కడా షామియానాలు వేసేందుకు ఇనుప గొట్టాలు పాతి వదిలేశారు. దీంతో మధ్యాహ్నమైతే చాలు భక్తులు ఆలయప్రాంగణంలో నడవలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ‘‘తెల్లపెయింట్ వేశాం. దానిపై భక్తులు నడిస్తే కాళ్లు కాలవు’’ అని అధికారులు చెబుతుండడంపై భక్తులు మండిపడుతున్నారు. రావిచెట్టు నీడలోనే సేదతీరుతున్నారు. ప్రహసనంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం రత్నగిరిపై భక్తులకు ఉచిత మజ్జిగ పంపిణీ ప్రహసనంగా మారింది. మజ్జిగ పంపిణీకి ఎంచుకున్న స్థలం, సమయం పరిశీలిస్తే అధికారుల చిత్తశుద్ధి బయటపడుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉదయం పది గంటల నుంచి ఈ మజ్జిగ పంపిణీ చేస్తున్నట్టు ప్రకటిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే రోజుకు కేవలం 50 లీటర్లు పాలు మాత్రమే ఇందుకు కేటాయించారు. దీంతో వచ్చే మజ్జిగ మాత్రమే ఇక్కడ పంపిణీ చేస్తున్నారు. రోజూ పదివేలకు పైగా భక్తులు రత్నగిరికి వస్తుంటే , కనీసం వేయి మందికి కూడా ఈ మజ్జిగ సరిపోవడం లేదు. మొక్కుబడిగా నిర్వహణ.. సత్యదేవుని నిత్యాన్నదాన పథకం నుంచే ఈ మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. నిత్యాన్నదానపథకానికి భక్తులు నిత్యం వేలాది రూపాయలు విరాళాలుగా సమర్పిస్తున్నా.. అధికారులు మజ్జిగ పంపిణీని మొక్కుబడిగా నిర్వహించడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఈ మజ్జిగ పంపిణీని రోశయ్య మండపానికి ఎదురుగా నిర్వహించారు. ఈ సారి సర్కులర్ మండపంలో చివరన నిర్వహిస్తున్నారు. అలంకారప్రాయంగా కూలింగ్ వాటర్ పాయింట్ దేవస్థానంలో చాలా చోట్ల ఏర్పాటు చేసిన కూలింగ్ వాటర్ పాయింట్లు పనిచేయడం లేదు. అయినా అధికారులు వాటికి మరమ్మతులు చేయించడం లేదు. దేవస్థానం ఈఓ కార్యాలయం వెలుపల గల కూలింగ్‌వాటర్ పాయింట్ పనిచేయకుండా పోయి సుమారు ఆరునెలలైనా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో భక్తులు చల్లని నీటి కోసం ప్రైవేటు షాపులను ఆశ్రయించాల్సి వస్తోంది. -
జలసిరి.. ఉత్సాహం ఆవిరి
అడ్డగోలు నిబంధనలతో లబ్ధిదారుల కుదింపు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు ∙ ఉచిత మోటారు హామీ నమ్మి మోసపోయామని ఆవేదన పంచపాండవులు మంచం కోళ్లలా ముగ్గురు అని రెండేళ్లు చూపి ఒకటి అంకె వేశాడట వెనుకటి ఒకడు! జిల్లాలో ఎన్టీఆర్ జలసిరి పథకం అమలు తీరు కూడా అలాగే ఉంది. మోటారు బోర్లు ఏర్పాటు చేసేందుకు రైతుల నుంచి 14,106 దరఖాస్తులు స్వీకరించి, 13,598 మందిని అర్హులుగా గుర్తించి, 3,844 పాయింట్లకే అనుమతి ఇచ్చి, 592 మంది బోర్లను తవ్వుకొంటే 259 మంది మాత్రమే ఇప్పటికే బోర్లను ఏర్పాటు చేసుకొనేలా వ్యవహరించిన సర్కారు వైఖరే ఇందుకు తార్కాణం. ఆర్భాటంగా పథకాలను ప్రారంభించడం.. ఆర్థిక భారం భరించలేక ఆనక నిబంధనల పేరుతో కొద్దిమందికి మాత్రమే వర్తించేలా చేయడం అలవాటు చేసుకున్న తెలుగుదేశం ప్రభుత్వం తాజాగా ఎన్టీఆర్ జలసిరి పేరుతో రైతుల ఉత్సాహాన్ని ఆవిరి చేసింది. ఆలమూరు : ఎన్టీఆర్ జలసిరిలో రాష్ట్ర ప్రభుత్వం హఠాత్తుగా నిబంధనల మార్పు చేయడంతో ఈ పథకం రైతులకు అక్కరకు వచ్చేలా లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యవసాయశాఖ, ఎ¯ŒSఆర్జీఈఎస్, విద్యుత్ శాఖ సమన్వయలోపం కూడా రైతుల పాలిట శాపంగా పరిణమించింది. ఎన్టీఆర్ జలసిరి పథకం కింద సన్నకారు, చిన్నకారు రైతులకు మోటారు బోరును ఉచితంగా ఏర్పాటు చేసి వ్యవసాయాన్ని సస్యశ్యామలం చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం మధ్యలో నిబంధనలను మార్చేసింది. జిల్లాలో ఎన్టీఆర్ జలసిరి పథకం కింద 14,106 మంది రైతులు మోటారు బోరును ఏర్పాటు చేసుకొనేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు అందులో 13,598 మందిని అర్హులుగా గుర్తించి అనుమతి కోసం భూగర్భ జలవనరులశాఖకు పంపించారు. ఆ శాఖ కేవలం 3,844 పాయింట్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. నిబంధనల్లో గందరగోళం వల్ల ఇప్పటివరకూ 592 మంది మాత్రమే బోర్లను తవ్వుకోగా మిగిలిన రైతులు అర్ధాంతరంగా పనులను నిలిపివేశారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకూ కేవలం 259 మాత్రమే బోర్లను ఏర్పాటు చేసుకోవడం పథకం పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. ప్రభుత్వ మెలికపై రైతుల ఆగ్రహం ఎన్టీఆర్ జలసిరి కింద ఐదెకరాలు కలిగిన రైతులకు రూ.1.16 లక్షలతో 180 అడుగుల లోపు మోటారు బావిని ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. సోలార్ సిస్టమ్‌తో గాని విద్యుత్‌తో గాని నడిచే మోటారు కనెక్ష¯ŒS ఇస్తామని, ఏది కావాలో రైతులే ఎంచుకోవచ్చని చెప్పారు. ఒకవేళ లోతు ఎక్కువైతే ఆ భారం రైతు భరించవలసి ఉంటుందన్నారు. తవ్వేందుకు రూ.16 వేలు, మోటారుకు రూ.40 వేలు, విద్యుత్ లై¯ŒSకు రూ.40 వేలు చొప్పున మంజూరు చేస్తామని చెప్పారు. బోరును తవ్వేందుకు కనీసం రూ.40 వేలు అవుతుండగా ప్రభుత్వం రూ.16 వేలు మంజూరు చేసినా బోరు బావి వస్తుందని ఎక్కడికక్కడ రైతులు మిగతా సొమ్ము భరించేందుకు అంగీకరించారు. విద్యుత్ లైన్లకు ఖర్చు ఎక్కు అవుతుందని భావించిన ప్రభుత్వం ఇప్పుడు సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటేనే మోటారు ఉచితంగా ఇస్తామని మెలిక పెట్టడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము విద్యుత్ లై¯ŒS ఏర్పాటు చేసుకుంటే ప్రదేశాలను బట్టి సుమారు రూ. 40 వేల నుంచి రూ.90 వేల వరకూ వ్యయం అవుతుందని రైతులు చెబుతున్నారు. దీంతో పాటు మోటారు కొనుగోలు భారం కూడా రైతులపై పడితే జలసిరి పథకం ఎందుకుని వారు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో కడియం మండలంలోని నర్సరీ రైతులు మినహా మిగిలినచోట్ల సోలార్ సిస్టమ్‌పై ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వ తీరుపై రైతుల మండిపాటు వివిధ మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో దశల వారీగా నిర్వహిస్తున్న జలసిరి సమీక్ష సమావేశాల్లో అధికారులు రైతుల ఆగ్రహాన్ని చూడవలసి వస్తోంది. కొన్నిచోట్ల బహిరంగంగానే నిరసనలు తెలియజేస్తుండగా మరికొన్ని మండలాల్లో జలసిరి సమావేశాలను బహిష్కరిస్తున్నారు. బోరు మోటారును ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీతో ఒక్క పైసా ప్రభుత్వం మంజూరు చేయకపోయినా సుమారు రూ.40 వేలతో నిబంధనల మేరకు ఏడు అంగుళాల వెడల్పుతో బోరును తవ్వించుకున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. బోరును తవ్వించుకున్న తరువాత కేవలం సోలార్ సిస్టమ్ ద్వారానే మోటారును ఏర్పాటు చేస్తామని విద్యుత్ లై¯ŒSను ఏర్పాటు చేసుకుంటే పథకం వర్తించదని అధికారులు తేల్చి చెప్పడంతో రైతులకు ఏమీ తోచని పరిస్థితి ఏర్పడింది. దీంతో జిల్లాలో ఎక్కడికక్కడ రైతులు తవ్వించుకున్న బోరును అలాగే వదిలేస్తున్నారు. -
ఆరో రోజూ అవే అవస్థలు
క్యూ లైన్లలో సామాన్యులు ఉదయం నుంచే ఏటీఎంల వద్ద పడిగాపులు నల్లధనం మార్పునకు పేదలే పావులు సాక్షి, రాజమహేంద్రవరం : వారం రోజులు గడుస్తున్నా బ్యాంకుల వద్ద రద్దీ ఏమాత్రం తగ్గడంలేదు. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన రూ. వెయ్యి, రూ.500 నోట్లు మార్చుకునేందుకు, నగదు డిపాజిట్ చేసేం దుకు బ్యాంకుల వద్ద ప్రజలు బారులుదీరుతున్నారు. చంటి బిడ్డలతో క్యూలైన్లలో నిలబడలేక అల్లాడిపోతున్నారు. ఉదయం వచ్చిన వారు నగదు మార్చుకునే సరికి సాయంత్రం అవుతోంది. మధ్యాహ్నం భోజనం మానుకుని క్యూలైన్లలో నిలబడుతున్నారు. ఎక్కడ పక్కకు వెళితే తమ స్థానం పోతుందోననే భయంతో అక్కడే ఉండి పోతున్నారు. నల్లధనం బయటకు వస్తుందో రాదో తెలియదుకాని తమ రోజువారీ ఉపాధిని మానుకొని నగదులేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. గం టల తరబడి నిలబడితే రూ.4500 ఇస్తున్నారని, ఇవి తీసుకున్నా చిల్లర కోసం మళ్లీ తిప్పలు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన మొత్తంలో కూడా సామాన్య, మధ్య తరగతి ప్రజలు జమచేసిందే కావడం గమనార్హం. పార్లమెంట్ సమావేశాలు కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడ పెద్దనోట్ల చెలామణి రద్దు, పన్ను చెల్లిపుంపులపై ఏదైనా ఉపసమనం లభిస్తుందేమోనన్న ఆశాభావంతో ఉన్నారు. ఉదయం నుంచే ఏటీఎంల ముందు బారులు పెద్దనోట్లు చెలామణి లేకపోవడం..చేతిలో ఉన్న రెండు వేల నోటుతో చిన్నపాటి అవసరాలు తీర్చుకునే అవకాశం లేకపోవడంతో ప్రజలు ఏటీఎంల వద్ద క్యూలు కడుతున్నారు.జిల్లాలో ఉన్న 811 ఏటీఎంలలో కేవలం 30 శాతం ఏటీఎంలలో మాత్రమే సిబ్బంది నగదు పెడుతున్నారు. దీంతో ప్రజలు రూ.100 నోట్ల కోసం ఏటీఎంల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బ్యాంకుల వద్ద ఉన్న ఏటీఎంలలో మాత్రమే నగదు అందుబాటులో ఉంచుతున్నారన్న సమాచారంతో ఆ వైపు పరుగులు తీస్తున్నారు. పేదలతో నగదు మార్చుతున్న పెద్దలు కొందరు రాజకీయ నేతలు తమ అనుచరులను ఉపయోగించి పేదల ద్వారా నగదు మార్చుతున్నారు. ఖాతా లేకపోయినా ఆధార్ కార్డు నకలు, బ్యాంకు ఫారం నింపి ప్రతి వ్యక్తి రూ.4500 విలువైన పెద్దనోట్లు మార్చుకునే వెలుసుబాటు ఉంది. దీన్ని ఆసరాగా చేసుకున్న నేతలు నగదు మార్చి ఇచ్చిన వారికి 10 శాతం కమిష¯ŒS ఇస్తున్నారు. నేతల అనుచరలు తమ వెంట తిరిగే కుర్రాళ్లకు నగదు ఇచ్చి మహిళలతో బ్యాంకుల వద్దకు పంపిస్తున్నారు. వారు ఎనాగ్జర్–5 ఫారం నింపి ప్రతి ఒక్కరికీ రూ.4,500 చొప్పున ఇస్తున్నారు. నగదు మార్చిన తర్వాత అక్కడే తిరిగి తీసుకుంటున్నారు. ఈ విధంగా జిల్లాలో ఫైనా¯Œ్స వ్యాపారం నిర్వహిస్తున్న ఓ ప్రజా ప్రతినిధి తన వద్ద ఉన్న నగదు మొత్తాన్ని మార్చుకుంటున్నట్లు సమాచారం. ఉన్నోళ్లు లేనోళ్లు ఒకటేనా చేతిలో నగదు లేదు. పెద్దనోట్లు తీసుకోవడంలేదు. నగదు మార్చుకోవడానికి వచ్చాం. ఇంటి దగ్గర ఎవ్వరూ లేకపోవడంతో బాబును కూడా తీసుకొచ్చాను. నల్లధనం బయటకు తీయడానికి నోట్ల రద్దు అని చెబుతున్నారు. ఉన్నోళ్లు లేనోళ్లు ఒకటేనా?. మాకు మాత్రమే ఎందుకు ఈ కష్టాలు. – డి.ధనమ్మ, రాజమహేంద్రవరం అనుమతి తీసుకుని వచ్చా మాది గుంటూరు. హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాను. డబ్బులు అయిపోయాయి. ప్రిన్సిపాల్ అనుమతి తీసుకుని వచ్చాను. నిన్న మధ్యాహ్నం వచ్చి క్యూలో నిలబడ్డాను. గంట తర్వాత ఏటీఎంలో నగదు అయిపోయింది. తిరిగి ఈ రోజు వచ్చాను. క్లాసులు పోతున్నా తప్పడంలేదు. – వి.పావని, బీఎస్సీ -
పెద్ద నోట్ల రద్దుతో బడా బాబుల్లో గుబులు
-
డెంగ్యూతో ప్రాణాపాయ స్థితిలో బాలుడు
-
15 మంది విద్యార్థినులకు అస్వస్థత
విజయనగరం: కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో భోజనం వికటించి 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విజయనగరం జిల్లా మెరకముడిదం మండలంలోని కస్తూర్బా గురుకులంలో ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. దీంతో 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురవడంతో.. పాఠశాల సిబ్బంది వారిని ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
నిజాంపేటలో భయాందోళనలో ప్రజలు
-
పిక్కలు నొప్పిగా ఉన్నాయి.. సమస్య ఏమిటి?
వాస్క్యులర్ కౌన్సెలింగ్ నా వయసు 38 ఏళ్లు. గత 15 ఏళ్లుగా సెక్యూరిటీ సర్వీసెస్‌లో పనిచేస్తున్నాను. మొదట్లో సెక్యూరిటీ గార్డ్‌గా ఉన్నప్పటికీ, ప్రస్తుతం సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్నాను. అయితే డ్యూటీలో భాగంగా ఎక్కువసేపు నిలబడే ఉంటాను. నాకు ఇటీవల కాళ్లలో వాపు వస్తోంది. అలాగే పిక్కలు కూడా పట్టేస్తున్నాయి. ముఖ్యంగా రాత్రిళ్లు ఇబ్బందిపడుతున్నాను. బాధ భరించలేనప్పుడు పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు వాడుతున్నాను. రోజురోజుకూ సమస్య పెరుగుతోంది. ఇలాంటి సమస్య గతంలో నాకెన్నడూ లేదు. అసలు నాకు ఏమైంది. దయచేసి సలహా ఇవ్వండి. - రాజు, వైజాగ్ మీరు తెలిపిన లక్షణాలను బట్టి చూస్తే మీరు వేరికోస్ వెయిన్స్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పవచ్చు. ఈ సమస్య సాధారణంగా ఎక్కువ సేపు నిల్చుని ఉండేవారిలో, అధిక బరువులు మోసేవారిలో ఎక్కువగా ఉంటుంది. వీరికి మొదట్లో కాళ్లలో వాపు రావడం, మంట పుట్టడం, పిక్కలు పట్టేయడం చోటు చేసుకుంటాయి. అనంతరం వీరు నడక అంటేనే బెదిరిపోయేలా సమస్య మరీ తీవ్రమవుతుంది. వ్యాధి దశను బట్టి పూర్తి చికిత్స ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ సమస్యతో బాధపడుతున్నట్లు డాక్టర్ నిర్ధారణ చేస్తే, మీరు కుంగిపోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక చికిత్స విధానాలతో మీ సమస్యను పూర్తిగా ఉపశమనం కలిగేలా చేయవచ్చు. మొదటి దశ, రెండోదశలో వ్యాధిని గుర్తించి చికిత్స ప్రారంభిస్తే ఎలాంటి సర్జరీ అవసరం ఉండదు. కేవలం డాక్టర్ సూచించిన మేరకు మందులు వాడుతూ వారు అందించే సలహాలను పాటిస్తూ మీ జీవనశైలి, ఆహారపు అలవాట్లను మార్చుకుంటే వ్యాధిని పూర్తిగా కంట్రోల్ చేయవచ్చు. మెరుగైన ఫలితాల కోసం సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. సమస్య నుంచి తాత్కాలికంగా రిలీఫ్ దొరికిన చాలామంది మందులు మానివేయడం లేదా కోర్స్ పూర్తయిన తర్వాత డాక్టర్‌ను సంప్రదించకుండా ఉండటం లాంటివి చేస్తుంటారు. దీనివల్ల వ్యాధి మరింత ముదిరిపోయే అవకాశం ఉంటుంది. ఇక మూడు లేదా నాలుగో దశలో వ్యాధి ఉంటే మాత్రం వాస్క్యులర్, శస్త్రచికిత్సలు అవసరమవుతాయి. వేరికోస్ వెయిన్స్‌కు మంచి చికిత్స అందుబాటులో ఉంది. కాబట్టి మీరు వెంటనే అన్ని సదుపాయాలు ఉన్న ఆసుపత్రిలో నిపుణులైన వైద్యులను సంప్రదించి, మీ సమస్యకు కారణాన్ని తెలుసుకోండి. వ్యాధి ప్రాథమిక దశలో ఉన్నప్పుడే చికిత్స ప్రారంభిస్తే మెరుగైన ఫలితాలను సులువుగా పొందవచ్చు. - డా॥దేవేందర్ సింగ్ సీనియర్ వాస్క్యులర్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
దత్తుపై దయచూపండి..
ప్రస్తుతం ప్రాణాపాయ పరిస్థితి శస్త్రచికిత్స చేయాలంటే రూ.25 లక్షలు అవసరం అప్పులు చేసి, ఉన్నదంతా ఖర్చుపెట్టిన తల్లిదండ్రులు ఏమీ చేయలేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు ఆదిలాబాద్ రిమ్స్ : పంతొమ్మిదేళ్ల వయసులో చలాకిగా ఉండాల్సిన ఆ యువకుడు.. మంచానికే పరిమితమయ్యాడు. ఆ వయసులో అందరిలా తాను చదువుకోవాలని.. ఆటలాడాలని.. ఆశ ఉన్నా అనారోగ్యం అతడి పాలిట శాపంగా మారింది. లివర్ చెడిపోయి అతని బతుకు దుర్భరంగా మారింది. పొట్ట ఉబ్బి, కాళ్లు, చేతులు వాపులతో అసలు నడవడానికే ఇబ్బంది పడుతున్నాడా యువకుడు. వైద్యం కోసం ఎదురుచూస్తున్నాడు. ఎనిమిదేళ్లుగా అనారోగ్యమే.. ఆదిలాబాద్ పట్టణం రాంనగర్ కాలనీకి చెందిన దుమ్మ వనిత, భగవాండ్లు దంపతులకు ఒక కూతురు, ఒక కుమారుడు. గతంలోనే కూతురు హేమలత వివాహం చేయగా, ప్రస్తుతం కుమారుడు దత్తాత్రి డిగ్రీ తతీయ సంవత్సరం చదువుతున్నాడు. 2008లో జాండీస్ రావడంతో హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన వైద్యులు దత్తుకు లివర్ పాడైపోయిందని తెలిపారు. దీంతో ప్రతీ నెల ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. చికిత్సలతో ప్రతీ నెల దాదాపు రూ.20 వేల ఖర్చు వచ్చేది. ఇలా ఏడాది పాటు వైద్యం చేయించుకున్నారు. అక్కడ నయం కాకపోవడంతో మళ్లీ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చూపించారు. మళ్లీ హైదరాబాద్‌లోని మెడిసిటీలో మూడేళ్ల పాటు చికిత్స చేయించుకున్నారు. ఇలా మూడేళ్లలో రూ.2 లక్షలు ఖర్చయ్యాయి. అక్కడ నుంచి మళ్లీ వార్దాలో నెలరోజుల పాటు చికిత్స అందించారు. ఇలా ప్రతినెల ఆస్పత్రులు చుట్టూ తిరిగిన వ్యాధి నయం కాలేదు. ఇప్పటి వరకు రూ.10 లక్షల వరకు ఖర్చు చేసినట్లు దత్తు తల్లిదండ్రులు తెలుపుతున్నారు. ఇప్పటికే బ్యాంకులో రూ. 2 లక్షలు అప్పుతీసుకోగా, రూ. 3 లక్షల వరకు ప్రై వేట్ అప్పులు చేసి కొడుకు చికిత్స అందిస్తున్నారు. ఉస్మానియా, యశోద ఆస్పత్రులకు వెళ్లినా ప్రయోజనం లేదు. రూ.25 లక్షల వరకు చెల్లిస్తే శస్త్రచికిత్స చేస్తామని ప్రైవేట్ ఆస్పత్రులు చెప్పడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. ప్రస్తుతం రెండు నెలలుగా దత్తు మంచానికి పరిమితమయ్యాడు. రిమ్స్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స తీసుకుంటున్నాడు. దత్తు తండ్రి భగవాండ్లు ఔట్సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్నాడు. తల్లిదత్తుకు సపర్యాలు చేస్తూ ఇంట్లోనే ఉంటోంది. కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఎవరైనా దాతలు ఆదుకుని తమ కొడుకును కాపాడాలని ఆ తల్లిదండ్రులు వనిత, భగవాండ్లు వేడుకుంటున్నారు. -
రైతన్నకు కలుపు కష్టాలు
పంట పొలాల్లో పెరుగుతున్న గడ్డి వేధిస్తున్న కూలీల కొరత పెరిగిన పెట్టుబడుల ఆందోళనలో అన్నదాత కుంటాల : రైతన్నలకు సాగు కష్టాలు తప్పడం లేదు. గత రెండేళ్లలో వర్షాలు లేక వేసిన పంట నష్టపోతే,ఈ సారి అధిక వర్షాల కారణంగా పంట పొలాల్లో గడ్డి ఎక్కువగా పెరిగింది.గడ్డిని తొలగించడానికి కూలీలు దొరక్క పక్క రాష్ట్రాల నుంచి ప్రయాణ ఖర్చులు కట్టించి కూలీలను తీసుకువస్తున్నారు.పెట్టిన పెట్టుబడిలో సగం కూలీలకే ఖర్చుచేస్తే మేమెలా బ్రతికేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గత రెండు సంవత్సరాలుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంటదిగుబడి రాక రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయారు.గత ఖరీఫ్ సీజన్లో వర్షాలు కురుస్తాయన్న ధీమాతో రైతులు మ గశిర కార్తెకు ముందే విత్తనాలు వేసినా సకాలంలో వర్షాలు లేక రెండుసార్లు విత్తనాలు వేసి నష్టపోయారు.ఈఏడు ఖరీఫ్‌ను నమ్ముకుని పంటలసాగు చేసిన రైతులకు మళ్లీ చేదు అనుభవమే ఎదురవుతోంది. పెరుగుతున్న గడ్డి మండలంలోని ఆయా గ్రామాల్లో ఈఖరీఫ్ సీజన్లో 3450 హెక్టార్లలో సోయా,1750 హెక్టార్లలో వరి,16280 హెక్టార్లలో పత్తి,420 హెక్టార్లలో కందులు,150 హెక్టార్లలో మినుములు,80హెక్టార్లలో పెసళ్లు,35 హెక్టార్లలో పసుపు పంటలను సాగుచేశారు.ఈసారి మ గశిర కార్తెనుంచి కురుస్తున్న వర్షాల కారణంగా పంటలు దెబ్బతింటున్నాయి.మండలంలోని రైతులు పత్తితోపాటు సోయా పంటను ఈసారి అధికమొత్తంలో సాగుచేశారు.ఎడతెరిపిలేని వర్షాల వల్ల పంటలు తక్కువగా ఎదిగి గడ్డి ఏపుగా పెరిగింది.వర్షాలు కురుస్తుండడంతోపాటు గడ్డి ఎక్కువగా ఉండడం వల్ల కలుపుతీయలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కురవని సమయంలో కలుపుతీద్దామన్నా కూలీల కొరత రైతులను వేధిస్తోంది.గతేడాది కలుపుకు కూలీ ధర రూ.150 నుంచి 200 ఉంటే ప్రస్థుతం అదే కూలీకి రూ.250 నుంచి రూ.300 వరకు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.కొందరు రైతులు ఇక్కడ కూలీలు దొరకక పోవడంతో మహారాష్ట్ర నుంచి కూలీలను తీసుకువచ్చి వారికి ప్రయాణ ఖర్చులతో పాటు కూలీలను చెల్లిస్తున్నారు.పంట పెట్టుబడిలో సగం ఖర్చు కూలీలకే అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ ఏడాది అధికవర్షాలతో నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి వస్తుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. -
ఏడాదిగా విడుదలకాని వేతనాలు
ఎస్సీ కార్పొరేషన్ ఉద్యోగుల వెతలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల ఆర్థికాభివృద్ధి సంస్థ ఉద్యోగులకు ఏడాది కాలంగా వేతనాలు విడుదల కావడంలేదు. ఉద్యోగుల ఇబ్బందుల దృష్ట్యా ఎస్సీ కార్పొరేషన్‌కు సంబంధించిన ఆయా పథకాలు, ఇతరత్రా ఉన్న డబ్బు నుంచి జీతాలు చెల్లిస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఉద్యోగుల జీతాల చెల్లింపు కోసం ప్రభుత్వం మేనేజిరియల్ సబ్సిడీని చెల్లిస్తోంది. ఉద్యోగాల జీతా ల కోసం 2016-17లో మొత్తం రూ. 60 కోట్లు పొందుపరిచినా, ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి రూ.15 కోట్లకు బీఆర్వోలు ఇచ్చినా అవి ఇంతవరకు విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు ఆగస్టు కూడా సగం పూర్తయింది. మందగించిన భూ పంపిణీ: ఈ ఆగస్టు 15తో దళితులకు భూ పంపిణీ పథకం రెండేళ్లు పూర్తి చేసుకోబోతోంది. ఈ ఏడాది 3,400 మందికి పదివేల ఎకరాల పంపిణీకి లక్ష్యం నిర్దేశించుకోగా ఇప్పటివరకు 788 మందికి 2079 ఎకరాలను మాత్రమే అధికారులు పంపిణీ చేశారు. రెండేళ్లల్లో 3,589 మందికి 9,446 ఎకరాలను పంపిణీ చేశారు. భూ అభివృద్ధి పథకం కింద పంటలకు సాగునీరు, కరెంట్, విత్తనాలు, ఎరువులు, ఇతరత్రా సౌకర్యాలను కల్పించాల్సి ఉన్నా పూర్తిస్థాయిలో అందుతున్న దాఖలాలు లేవు. భూ పంపిణీ పథకం కోసం భూములను విక్రయిస్తామంటూ కొన్ని జిల్లాల్లో పలువురు రైతులు ఎస్సీ కార్పొరేషన్‌తో ఒప్పందాలు చేసుకున్నారు. అయితే, కార్పొరేషన్‌కు డబ్బులు రాకపోవడంతో వాటిని తిరిగి రద్దు చేసుకున్నారు. స్వయం ఉపాధి పథకాలకు కూడా సకాలంలో రుణాలు విడుదల కావడంలేదు. -
సమ్మెతో అందని బ్యాంకు సేవలు
యాలాల: ఎస్బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా చేపట్టిన బ్యాంకుల సమ్మె కారణంగా మండలంలో బ్యాంకు సేవలు నిలిచిపోయాయి. మండల కేంద్రంలోని ఎస్బీహెచ్తోపాటు జుంటుపల్లి ఆంధ్రా బ్యాంకు, లక్ష్మీనారాయణపూర్‌లోని దేనాబ్యాంకు తదితర బ్యాంకులు మూసేశారు. ఈ విషయం తెలియని వినియోగదారులు, అకౌంట్ హోల్డర్లు బ్యాంకు లావాదేవీల కోసం మండల కేంద్రానికి వచ్చిన వారు ఇబ్బందులు పడ్డారు. -
వికటించిన మధ్యాహ్న భోజనం
ఖానాపూర్ (ఆదిలాబాద్) : ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం నర్సాపూర్‌లోని ప్రాథమిక పాఠశాలలో శనివారం మధ్యాహ్న భోజనం తిన్న చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. బడిలో చదువుకునే బాలల్లో 23 మంది వాంతులు, కడుపునొప్పితో బాధపడటంతో అందరినీ ఖానాపూర్ మండల కేంద్రంలోని పీహెచ్‌సీకి తరలించారు. వారిలో ఐదుగురికి సెలైన్ ఎక్కిస్తున్నారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. -
అవకాశాల్లేక కుంగిపోతున్నారు!
పారిస్: అవకాశాల లేమితో కుంగిపోతున్న అట్టడుగు వర్గాల విద్యార్థుల జీవితాలను మార్చేసే శక్తి విద్యకు ఉందని 'సూపర్30' వ్యవస్థాపకులు ఆనంద్‌కుమార్ అన్నారు. గతేడాది ఐఐటీ జేఈఈలో ఉత్తీర్ణత సాధించిన ఆటోరిక్షా డ్రైవర్ కూతురు, సూపర్30 విద్యార్థిని 'నిధి ఝా' విజయగాథ ఆధారంగా ఫ్రెంచి భాషలో తెర కెక్కించిన 'ది బిగ్ డే' చిత్రాన్ని ప్రముఖ ఫ్రెంచి బిజినెస్ స్కూల్ 'ఎసెక్ స్కూల్' లో ప్రదర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. అవకాశాల లేకపోవడం వల్లే అట్టడుగు వర్గాల విద్యార్థులు కుంగుబాటుకు గురవుతున్నారన్నారు. ఇతర విద్యార్థులతో సమానంగా వారికి సామర్థ్యాలు ఉన్నాయని, ఒక్క చిన్న అవకాశం వారి జీవితాలను మార్చేయగలదని తన 30 ఏళ్ల అనుభవంలో ఎన్నో ఉదాహరణలు చూశానని చెప్పారు. నిధి ఝా జీవితం ఆధారంగా ఫ్రెంచి దర్శకుడు పాస్కల్ ప్లిసన్ ది బిగ్ డే చిత్రాన్ని తెరకెక్కించారు. నిధి ఝా ప్రస్తుతం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైన్స్‌లో విద్యనభ్యసిస్తోంది. -
భద్రతా సంక్షోభంలో కాంగ్రెస్ నేతలు!
న్యూఢిల్లీ : అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ సర్కార్ .... గత ప్రభుత్వ మంత్రుల భద్రతను తగ్గించడంతో వారు ఆందోళనకు గురువుతున్నారు. మరో విశేషమేమంటే.. గత ప్రభుత్వం నియమించిన పోలీసు అధికారులను భద్రత నుంచి తొలగించి ప్రస్తుత ప్రభుత్వం కొత్తవారిని నియమించింది. కేంద్రంలో అధికారం మారితే ...గత ప్రభుత్వ నేతలు, మంత్రులు తదితరుల రక్షణకు కొత్త సర్కార్ మంగళం పాడటం ఆనవాయితీగా వస్తున్నదే. తాజాగా కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మాజీ మంత్రి మనీష్ తివారి, బొగ్గుశాఖ మాజీ మంత్రి శ్రీప్రకాష్ జైస్వాల్ లకు ఇప్పటివరకు కల్పిస్తోన్న 'జడ్' కేటగిరి భద్రతను తొలగించారు. అంతేకాకుండా లోకసభ మాజీ స్పీకర్ మీరా కుమార్‌తో పాటు మాజీ మంత్రి బేని ప్రసాద్ వర్మలకు కల్పిస్తోన్న 'జడ్' కేటగిరి భద్రతను 'వై' కేటగిరికి మార్చడంతో వారు ఆందోళన చెందుతున్నారు. కాగా భద్రతా సంక్షోభంలో ఉన్న అందరూ కాంగ్రెస్ పార్టీ నేతలు కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వీరితో పాటు రీటా బహుంగ జోషి, జితిన్ ప్రసాదా, పీఎల్ పునియా, ఆర్ పీఎన్ సింగ్, సలీం షెన్వారీ తదితరులు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో ఇబ్బందులకు గురవుతున్నారు. బీఎస్పీ నేతలు బ్రజేష్ పాథక్, ధనంజయ్ సింగ్, సమాజ్ పార్టీ నేత అమర్ సింగ్‌లకు కూడా 'జడ్' కేటగిరి భద్రతను తొలగించిన కేంద్ర ప్రభుత్వం కేవలం 'వై' కేటగిరి అందిస్తుంది. ఢిల్లీ మాజీ పోలీస్ కమిషనర్లు నీరజ్ కుమార్, వైఎస్ దడ్వాల్లతో పాటు ఆర్మీ మాజీ చీఫ్ ఎన్ సీ విజయ్‌కి ప్రస్తుతం ఎలాంటి సెక్యురిటీ లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతోంది. హోం మంత్రిత్వ శాఖ కార్యాలయం సమాచారం ప్రకారం... 327 మంది వీఐపీల భద్రత అంశంపై సమీక్ష నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 20 మంది వీఐపీలు తమ భద్రత కేటగిరిని తగ్గించడంపై ఆందోళన చెందుతున్నారు. ముజఫర్ నగర్లో మత ఘర్షణలతో సంబంధం ఉన్న బీజేపీ నేత సురేష్ రానాకు మాత్రం 'వై' కేటగిరి నుంచి జడ్ కేటగిరికి ప్రమోషన్ ఇస్తూ భద్రతను పెంచడం విశేషం. ఆయనతో పాటు బాబా రాందేవ్, యోగి ఆదిత్యనాథ్ లకు జడ్ స్థాయి భద్రతను కల్పిస్తూ బీజేపీ ప్రభుత్వం వారి రక్షణను పటిష్ట చర్యలు తీసుకుంది. -
గుండె పగిలింది..
సాక్షి నెట్వర్క్: ఆరుగాలం కష్టపడి అందరి కడుపూ నింపే అన్నదాతను కరువు కబళిస్తోంది.. వానల్లేవు.. కరెంటు రాదు.. విత్తనాలు, ఎరువులు అందవు.. బ్యాంకులు రుణాలివ్వవు.. వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పు చేయాల్సిన దుస్థితి.. ఎలాగోలా పెట్టుబడి సమకూర్చుకున్నా వేసిన విత్తనాలు మొలకెత్తక, మొలకెత్తినా పంట చేతికి వచ్చే పరిస్థితి లేక రైతులు ఆవేదనలో మునిగిపోతున్నారు.. చేతికొచ్చే పంట కళ్లముందే ఎండిపోతుంటే తట్టుకోలేకపోతున్నారు.. చేసిన అప్పులెలా తీర్చాలనే ఆందోళనతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.. భార్యకు, పిల్లలకు, తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చుతున్నారు.. ఇప్పటివరకు 369 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే సగటున రోజుకు నలుగురు అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. రైతుల ఆత్మహత్యలపై సోమవారం అసెంబ్లీలో చర్చ జరుగనున్న నేపథ్యంలో... ఆదుకునే నిర్ణయాలు వెలువడుతాయని అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఖరీఫ్‌లో రాష్ట్రవ్యాప్తంగా సాధారణ సాగు విస్తీర్ణం 40 లక్షల హెక్టార్లుకాగా.. ఈ ఏడాది 2 లక్షల హెక్టార్ల సాగు తగ్గింది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 10.04 లక్షల హెక్టార్లుకాగా.. ఈ ఏడాది 8.17 లక్షల హెక్టార్లలోనే సాగు చేశారు. తెలంగాణలో పత్తి పంట పరిస్థితి కూడా ఇలాగే ఉంది. గత రెండేళ్లుగా 18 లక్షల హెక్టార్లలో పత్తి సాగుచేయగా.. ఈ ఏడాది 16 లక్షల హెక్టార్లకు తగ్గింది. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లోనైతే వేల ఎకరాల్లో వరిని తగులబెట్టారు. బావుల కింద వేసిన పంటలు విద్యుత్ లేక ఎండిపోయాయి. దీంతో ఆందోళనకు గురై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అప్పులు, ఆర్థిక ఇబ్బందులే.. ఈ ఖరీఫ్‌లో తొలి వర్షాలకే పంటలు వేసిన రైతులు విత్తనాలు మొలకెత్తకపోవడంతో.. పెట్టుబడితో పాటు విత్తనాల ఖర్చునూ నష్టపోయారు. రుణమాఫీ పథకం ఆలస్యం కావటంతో బ్యాంకుల నుంచి కొత్త రుణా లు అందడం లేదు. దీంతో చాలా మంది రైతులు నాలుగైదు రూపాయల వడ్డీకి ప్రైవేటు వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చి పంటలు వేశారు. సాగుకు పెట్టుబడి పెరగడం.. కూలీ రేట్లు పెరిగిపోవడం.. ఇందుకు అనుగుణంగా పంట దిగుబడులు లేకపోవడం, మార్కెట్లో గిట్టుబాటు ధర రాకపోవడం వంటివి రైతన్నను కుంగదీశాయి. వడ్డీ వ్యాపారుల ఒత్తిళ్లతో.. రాష్ట్రంలోని రైతులు రూ. 18 వేల కోట్ల వరకూ ప్రైవేటు అప్పులు చేసినట్లు ఒక అంచనా. కానీ ఇలా అప్పు చేసి పండించిన పంటను మార్కెట్లో అమ్ముకోవాలంటే కనీస మద్దతు ధర అందడం లేదు. పత్తి కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ. 4,050 కాగా.. రూ.3,300 మించి కొనే వారు లేరు. మొక్కజొన్న కనీస మద్దతు ధర రూ. 1,510 ఉండగా.. రూ. 1,050కు మించి ఇవ్వడం లేదు. వరి కనీస మద్దతు ధర రూ. 1,340 ఉండగా.. రూ. 1,100 కంటే ఎక్కువ అందడం లేదు. దీనికితోడు వడ్డీ వ్యాపారులు తమ అప్పులు వెంటనే తీర్చాలని అందరి ముందు నిలదీస్తుండడంతో... అది భరించలేక కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలా చనిపోయిన వారిలో ఎక్కువ మంది 30-35 ఏళ్ల యువ రైతులేనని ఒక రైతు సంఘం లెక్కగట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జారీ చేసిన 421జీవో ప్రకారం.. బలవన్మరణానికి పాల్పడ్డ రైతుల కుటుంబాలకు రూ. లక్షన్నర పరిహారం అందించి ఆదుకోవాలి. కానీ పెద్దదిక్కును కోల్పోయి కుమిలిపోతున్న రైతు కుటుంబాలకు పరిహారం అందడం లేదు. -
పేలిన టపాసులు
-
సదరం సర్టిఫికెట్లు లేక వికలాంగులకు వేదన
సాక్షి, హైదరాబాద్: సమగ్ర సర్వే వేల మంది వికలాంగుల పెన్షన్‌కు ఎసరు తీసుకుని వచ్చింది. సర్వేలో వికలాంగులు విధిగా సదరం సర్టిఫికెట్ల నంబర్లను నమోదు చేయాలని స్పష్టంగా పేర్కొనడంతో..ప్రస్తుతం పెన్షన్లు తీసుకుంటున్న వికలాంగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దసరా నుంచి తమకు నెలకు రూ. 500 నుంచి 1500 వచ్చే సమయంలో ఈ సర్టిఫికేట్లు లేకపోవడం వల్ల పెన్షన్లు తొలగిస్తారని భయపడుతున్నారు. సర్వే ఉద్దేశం కూడా సరైన సర్టిఫికేట్ల లేని వారిని అనర్హులుగా గుర్తించడం, అర్హులకు పెన్షన్లు ఇవ్వడమని సర్కార్ చెప్పడంతో ఏమి చేయాలో తెలియక సర్టిఫికెట్లు లేని వికలాంగులు ఇబ్బంది పడుతున్నారు. 40% కంటే అధికంగా వైకల్యం ఉన్నప్పటికీ.. డాక్టర్లు ఈ సదరం సర్టిఫికెట్లను వికలాంగుల ఇళ్లకు ఇప్పటి వరకు పంపిం చలేదు. సదరం శిబిరాలకు వికలాంగులు వెళ్లి పరీక్షలు చేయించుకున్నప్పటికీ..ఈ సర్టిఫికెట్లను పంపిణీ చేయడంలో డాక్టర్ల నిర్లక్ష్య వైఖరి కారణంగా వికలాంగులు పింఛన్లకు దూరం కావాల్సి వస్తోంది. తమతప్పు లేకపోయినా పెన్షన్ కోల్పోవడం వల్ల తమ జీవితాలు దుర్భరంగా మారుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిజిల్లాలోనూ వేలమంది వికలాంగుల పెన్షన్లలో కోతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పెన్షన్లు తీసుకుంటున్న పెన్షనర్లలో 25 నుంచి 30 శాతానికి పైగా వికలాంగులకు సదరం సర్టిఫికెట్లు అందలేదు. పెన్షన్ మొత్తాన్ని రూ. 1500లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో భారాన్ని తగ్గించుకోవడానికి ఈ సర్టిఫికేట్లను సాకుగాచూపి వేలాది పెన్షన్లు తొలగించే యత్నం చేస్తోందని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ నాయకులు అందె రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు. సమితి ఇచ్చిన సమాచారం మేరకు ప్రస్తుతం పెన్షన్ పొందుతున్నవారు, సదరం సర్టిఫికేట్లు అందనివారి వివరాలు పై విధంగా ఉన్నాయి. వీరంతా తాము సర్వేలో ధ్రువీకరణ పత్రాలు లేకుండా ఎలా నమోదు చేసుకోవాలని సతమతమవుతున్నారు. -
జూడాల సమ్మెతో అవస్థలు పడుతున్న రోగులు