
సత్యవేడు: తిరుపతి జిల్లా సత్యవేడులోని గురుకుల పాఠశాలకు చెందిన 56 మంది విద్యార్థులు విషజ్వరంతో తీవ్ర అస్వస్థతకు గురై గురువారం ఆస్పత్రిలో చేరారు. సత్యవేడులోని జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాలలో 414 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. రెండు రోజుల క్రితం ఐదుగురు విద్యార్థులకు జ్వరం వచ్చింది. గురువారం మరో 51 మంది జ్వరాల బారిన పడ్డారు.
దీంతో వారిని సత్యవేడు కమ్యూనిటీ వైద్యశాలలో చేర్పించారు. డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం హాస్టల్లో భోజనానికి వెళ్లినపుడు వర్షాల్లో తడవడం, రెండు రోజుల క్రితం జ్వరం వచ్చిన వారు అందరితో కలసి ఉండడం వల్ల మిగిలిన వారికి కూడా విష జ్వరాలు సోకాయని వైద్యులు చెబుతున్నారు. జ్వర పీడిత విద్యార్థులను వేరుగా మరో గదిలో ఉంచాలని సూచించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులతో వైద్యశాల నిండిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment