gurukul
-
56 మంది గురుకుల విద్యార్థులకు అస్వస్థత
సత్యవేడు: తిరుపతి జిల్లా సత్యవేడులోని గురుకుల పాఠశాలకు చెందిన 56 మంది విద్యార్థులు విషజ్వరంతో తీవ్ర అస్వస్థతకు గురై గురువారం ఆస్పత్రిలో చేరారు. సత్యవేడులోని జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాలలో 414 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. రెండు రోజుల క్రితం ఐదుగురు విద్యార్థులకు జ్వరం వచ్చింది. గురువారం మరో 51 మంది జ్వరాల బారిన పడ్డారు.దీంతో వారిని సత్యవేడు కమ్యూనిటీ వైద్యశాలలో చేర్పించారు. డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం హాస్టల్లో భోజనానికి వెళ్లినపుడు వర్షాల్లో తడవడం, రెండు రోజుల క్రితం జ్వరం వచ్చిన వారు అందరితో కలసి ఉండడం వల్ల మిగిలిన వారికి కూడా విష జ్వరాలు సోకాయని వైద్యులు చెబుతున్నారు. జ్వర పీడిత విద్యార్థులను వేరుగా మరో గదిలో ఉంచాలని సూచించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులతో వైద్యశాల నిండిపోయింది. -
బాలికలపై ప్రిన్సిపాల్ కర్కశత్వం 44 మందికి అస్వస్థత..
-
గురుకుల బీసీ హాస్టల్లో చిన్నారి మృతి..
-
ఒడవని జీవో 317 లొల్లి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలో జీవో 317 అమలుపై తీవ్ర గందరగోళం నెలకొంది. రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన నూతన జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపు చేపట్టేందుకు గత నెలలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించినప్పటికీ సాంకేతిక సమస్యలు నెలకొనడంతో అమలు తీరు అయోమయంలో పడింది. ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో 317 కేటగిరీలో దాదాపు నాలుగు వందల మందికి పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది. కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైన 550 మంది టీచర్ల సర్వీసు క్రమబద్ధీకరించిన అనంతరం వారికి కూడా జోన్ల కేటాయింపు, పోస్టింగ్ ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు ముందడుగు పడలేదు. కనీసం ఉద్యోగుల సీనియార్టీ జాబితాలు సైతం రూపొందించకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఉద్యోగుల సాధారణ బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం.సొసైటీ కార్యాలయంలో ఎవరికి వారే...జీవో 317 కింద ఉద్యోగుల కేటాయింపు, సీని యార్టీ జాబితాలపై ఉద్యోగులంతా ఎస్సీ గురు కుల సొసైటీ కార్యాలయం చుట్టూ తిరుగుతు న్నారు. గత నెల 24, 25 తేదీల్లో వీరికి వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉండగా... సాంకేతిక కారణాలతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. దాదాపు పది రోజులు గడిచినా ఇప్పటివరకు ఈ అంశంలో ఎలాంటి పురోగతి లేదు. దీంతో సొసైటీ కార్యాలయంలో సంబంధిత అధికారులను సంప్రదించినప్పటికీ తమకేమీ తెలియదంటూ చేతులు దులిపేసుకుంటున్నా రని ఉద్యోగులు మండిపడుతున్నారు. ప్రస్తు తం ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ మొదలైంది. ఎస్టీ గురుకుల సొసైటీలో ఉద్యో గుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఈనెల 20వ తేదీనాటికి బదిలీల ప్రక్రియ ముగించాలని రాష్ట్ర ప్రభు త్వం స్పష్టం చేసింది. ఇతర గురుకుల సొసైటీ లన్నీ వేగవంతంగా ప్రక్రియ పూర్తిచేస్తుండగా.. ఎస్సీ గురుకుల సొసైటీలో నెలకొన్న విచిత్ర పరిస్థితితో ఉద్యోగులంతా తలపట్టుకుంటున్నా రు. ముందుగా జీవో 317 కేటాయింపుల తర్వాత సాధారణ బదిలీలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు వారు సిద్ధమవుతున్నట్లు సమాచారం. జీవో 317 బాధితులు ఆందోళన చెందొద్దుజీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులు ఏమాత్రం ఆందోళన చెందవద్దని.. వారికి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేస్తుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇచ్చారు. జీవో 317 బాధిత ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో శనివా రం మంత్రి తన క్యాంపు కార్యాలయంలో సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు వివరించిన అంశాలను విన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జీవో 317 బాధిత ఉద్యోగులు, స్పౌజ్ బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్‌కమిటీ శాశ్వత పరిష్కారం చూపుతుందని స్పష్టం చేశారు. అతి త్వరలో కేబినెట్ సబ్ కమిటీ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డికి తుది నివేదిక అందించనుందని వెల్లడించారు. -
గిరిజన గురుకుల ఉపాధ్యాయుల పెన్‌డౌన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గిరిజన గురుకుల ఉపాధ్యాయులు, అధ్యాపకులు పెన్‌డౌన్ చేపట్టి నిరసనకు దిగారు. ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీ కారణంగా తమ ఉద్యోగాలకు ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై తమకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇదే విషయమై శుక్రవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిసి విన్నవించిన గురుకుల ఉపాధ్యాయులు శనివారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసి తమ ఆవేదనను చెప్పుకున్నారు.గిరిజన ప్రాంతాలకు చెందిన సుమారు 300 మంది విధులను బహిష్కరించి విజయవాడకు చేరుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. గిరిజన గురుకులాల్లో సుమారు 1,650 మంది దాదాపు 10 నుంచి 15 ఏళ్లుగా కాంట్రాక్టు, ఔట్‌సోరి్సంగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించడంతో తమ ఉద్యోగాలు పోతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెగా డీఎస్సీలో గిరిజన ప్రాంతాల్లోని గురుకుల విద్యాలయాలకు సంబంధించిన 1,143 పోస్టులు ప్రతిపాదించారు.దీంతో ఏళ్ల తరబడి కాంట్రాక్టు, ఔట్‌సోరి్సంగ్ పద్ధతిలో సేవలందిస్తున్న తమకు అన్యాయం జరుగుతుందని ఆవేదన చెందుతున్నారు. ఇదే విషయాన్ని గిరిజన సంక్షేమ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పష్టమైన హామీ రాలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది గురుకుల ఉపాధ్యాయులు, అధ్యాపకులు విధులను బహిష్కరించి విజయవాడ చేరుకున్నారు. ఉద్యోగ భద్రత కల్పించి, సమాన పనికి సమాన వేతనం ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబును కోరినట్టు గురుకుల ఉపాధ్యాయ సంఘం ప్రతినిధి లక్ష్మీనాయక్ తెలిపారు. -
కొన్ని కేటగిరీలకు ఉమ్మడి పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: గురుకుల ఉద్యోగాల భర్తీకి నిర్వహించే అర్హత పరీక్షలకు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) వ్యూహాత్మక కార్యాచరణ చేపట్టింది. పరీక్షలను సులభతరంగా నిర్వహించే క్రమంలో అభ్యర్థులకు వెసులుబాటు కల్పించింది. ఆగస్టు 1 నుంచి 22వ వరకు పరీక్షలు నిర్వహించనుంది. పరీక్షల వారీగా తేదీలను ఖరారు చేస్తూ రూపొందించిన వ్యూహాత్మక టైమ్‌టేబుల్‌ను టీఆర్‌ఈఐఆర్‌బీ వెబ్సైట్లో ఉంచింది. విద్యార్హతలు సమానమైన కేటగిరీ కొలువులకు పరీక్షలను ఉమ్మడిగా నిర్వహిస్తోంది. తద్వారా అభ్యర్థులు ఒక పేపర్లో అర్హత సాధిస్తే సంబంధిత పోస్టులకు అర్హత సాధించినట్లే. పేపర్ వన్, టూల్లోనే ఉమ్మడిగా.. టీఆర్‌ఈఐఆర్‌బీ రూపొందించిన పరీక్షల షెడ్యూల్ కాస్త ఒత్తిడి కలిగించే వి«ధంగా కనిపిస్తున్నప్పటికీ ఉమ్మడి పరీక్షలతో అభ్యర్థులకు భారీ ఊరట లభించనుంది. సులభతర పరీక్షా విధానం ఉండటంతో రోజుకు మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహించేలా టైమ్‌టేబుల్ ఉందని అధికారులు చెబుతున్నారు. మొదటి సెషన్ కింద ఉదయం 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యా హ్నం 12.30 గంటల నుంచి 2.30 గంటల వరకు, మూడో సెషన్ సాయంత్రం 4.30 గంటల నుంచి 6.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పలు పోస్టులకు పేపర్–1, పేపర్–2లను ఉమ్మడిగా నిర్వహిస్తోంది. పీజీ అర్హతతో ఉన్న పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), జూనియర్ లెక్చరర్ (జేఎల్), డిగ్రీ లెక్చరర్ (డీఎల్) కేటగిరీ కొలువులకు పేపర్–1 పరీక్షను ఉమ్మడిగా నిర్వహిస్తున్నా రు. అంటే ఒక అభ్యర్థి ఈ మూడు పరీక్షలకు దరఖాస్తు చేసి.. కేవలం ఒకసారి పేపర్–1 పరీక్ష రాసి అర్హత సాధిస్తే మూడింటికీ పేపర్–1లో అర్హత సాధించినట్టేనన్నమాట. పీజీటీ, జేఎల్ కొలువుల పేపర్–2 పరీక్షలను కూడా ఉమ్మడిగా నిర్వహిస్తున్నారు. ఈ రెండు కేటగిరీలకు సంబంధించిన పెడగాగి (విద్యాబోధన శాస్త్రం) ఒకే రకంగా ఉండటంతో ఈ రెండు కేటగిరీలకు ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. ఇక పేపర్–3 పరీక్షలను వేర్వేరుగా నిర్వహిస్తున్నట్లు గురుకుల బోర్డు స్పష్టత ఇచ్చింది. పరీక్ష తేదీలు ఎక్కడా క్లాష్ కాకుండా పక్కా షెడ్యూల్ తయారు చేసినట్లు వివరించారు. పరీక్షలన్నీ సీబీటీ (కంప్యూటర్ బేస్డ్) పద్ధతిలో నిర్వహించడం ద్వారా ఫలితాలను కేవలం నెలరోజుల్లో విడుదల చేసేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. -
ఆగస్టులో గురుకుల పరీక్షలు!
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ చివరి దశకు చేరింది. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) కొలువులకు దరఖాస్తు గడువు శనివారం సాయంత్రంతో ముగియనుంది. దీంతో గురుకుల విద్యా సంస్థల్లో అన్ని కేటగిరీల ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ పూర్తికానుంది. అర్హత పరీక్షల విధానానికి సంబంధించిన అంశాలను నోటిఫికేషన్ల ద్వారా అభ్యర్థులకు వివరించిన టీఆర్‌ఈఐఆర్‌బీ.. ప్రస్తుతం పరీక్షల నిర్వహణపై దృష్టి సారించింది. ఆగస్టు నెలలో ఈ పరీక్షలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించిన గురుకుల బోర్డు.. తేదీల ఖరారుపై ముమ్మర కసరత్తు చేస్తోంది. రెండు నెలల గ్యాప్..! గురుకుల కొలువులకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ, అర్హత పరీక్షలకు మధ్య అంతరం గరిష్టంగా రెండు నెలలు ఉండాలని టీఆర్‌ఈఐఆర్‌బీ నిర్ణయించింది. గురుకులాల్లో ఉద్యోగ ఖాళీల ఖరారు, ఆర్థిక శాఖ అనుమతుల జారీ ప్రక్రియ పూర్తయ్యి దాదాపు ఏడాది పూర్తయ్యింది. తర్వాత ప్రభుత్వం కూడా స్పష్టత ఇవ్వడంతో అభ్యర్థులు ఏడాదిగా పరీక్షలకు సన్నద్ధమవుతూ వచ్చారు. తాజాగా దరఖాస్తు ప్రక్రియ అనంతరం సన్నద్ధతకు రెండు నెలల గడువు ఇస్తే సరిపోతుందని నిపుణులు సూచించడంతో బోర్డు అదే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆగస్టులో పరీక్షల నిర్వహణపై దృష్టి పెట్టిన టీఆర్‌ఈఐఆర్‌బీ.. ఏయే తేదీల్లో పరీక్షలు నిర్వహించాలనే అంశాన్ని తేల్చేందుకు చర్యలు చేపట్టింది. ఆయా రోజుల్లో ఇతర ఎలాంటి పరీక్షలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. జాతీయ స్థాయి నియామకాల బోర్డులు నిర్వహించే పరీక్షల తేదీలు, ఇతర కీలక నియామకాల బోర్డుల పరీక్షల తేదీలను పరిశీలిస్తోంది. ఆయా పరీక్షలు లేని రోజుల్లో గురుకుల కొలువుల అర్హత పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు అధికారులు చెబుతున్నారు. నియామక సంస్థలతో ఉమ్మడి భేటీ? రాష్ట్రంలోని వివిధ నియామక సంస్థలతో సమన్వయ సమావేశం నిర్వహించాలని తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ శాఖల పరిధిలో 80 వేల ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు జారీ చేయగా.. ప్రస్తుతం నియామక సంస్థలు అర్హత పరీక్షలను నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో గురుకులాల్లో 9 వేల ఉద్యోగ ఖాళీల భర్తీకి నిర్వహించే అర్హత పరీక్షలు, ఇతర పరీక్షల తేదీల్లో లేకుండా నివారించేందుకు ఈ సమన్వయ సమావేశం ఉపకరిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ సేŠట్ట్ పబ్లిక్ సరీ్వస్ కమిషన్, తెలంగాణ హెల్త్ అండ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు, తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత గురుకుల పరీక్షల తేదీలపై మరింత స్పష్టత రానుంది. -
గురుకుల నోటిఫికేషన్ జాడేది? 11 వేల ఉద్యోగాలకు అనుమతులు వచ్చినా!
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తీవ్రంగా జాప్యమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగ నియామకాలకు సంబంధించిన అన్నిరకాల అనుమతులు జారీ అయి నెలలు కావస్తున్నా గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) నోటిఫికేషన్ల ఊసెత్తడం లేదు. మొత్తం 11 వేల ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేయగా.. ఇందులో 9,096 పోస్టులకు 8 నెలల క్రితమే.. మరో 2వేల పోస్టులకు నెలరోజుల క్రితం అనుమతులు వచ్చాయి. ఉద్యోగ జాతరలో భాగంగా.. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో దాదాపు 80వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం గతేడాది యుద్ధ ప్రాతిపదిక చర్యలు మొదలు పెట్టింది. అందులో ఇప్పటికే 60వేలకుపైగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ దాదాపు 20వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వగా.. రాష్ట్ర స్థాయి పోలీసు నియామకాల బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) దాదాపు 18 వేల పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు ప్రకటనలు జారీ చేసింది. ఇక తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు(టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) సైతం మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్సు కేటగిరీల్లో 7 వేల ఉద్యోగాలకు ప్రకటనలు ఇచ్చింది. ఇలా వివిధ నియామక సంస్థలు నోటిఫికేషన్లు ఇచ్చి దరఖాస్తుల స్వీకరణ, అర్హత పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై బిజీ అవుతుండగా.. గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. నిరాశలో అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వం ఐదు గురుకుల సొసైటీల పరిధిలో పోస్టుల భర్తీ బాధ్యతలను టీఆర్‌ఈఐఆర్‌బీకి అప్పగించింది. ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి టీఆర్‌ఈఐఆర్‌బీ పక్కా వ్యూహంతో సన్నద్ధం కావాలి. బోర్డుకు చైర్మన్‌గా గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శుల్లో సీనియర్ ఒకరు వ్యవహరిస్తారు. ఆ తర్వాత మరో కార్యదర్శి కన్వీనర్‌గా, మిగతా సొసైటీలకు సంబంధించిన కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. సొసైటీల కార్యదర్శులే బోర్డులో ఉండటంతో ఉద్యోగ ఖాళీలు, ఇతర అంశాల సమాచారం వేగంగా సేకరించి తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అయినా జాప్యం తప్పడం లేదు. దీనితో గురుకుల కొలువుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. -
ఔట్ సోర్సింగ్‌కు సర్దుబాటు షాక్!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. ఎన్నో ఏళ్లుగా సొసైటీల పరిధిలో పనిచేస్తున్న వారి ఉద్యోగాలకు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వీఆర్వో)ల సర్దుబాటు రూపంలో ప్రమాదం వచ్చిపడింది. రాష్ట్ర ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ.. వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కొందరిని సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో సర్దుబాటు చేయాల్సిందిగా ఆదేశించింది. శాఖల వారీగా ఉద్యోగుల సంఖ్యను నిర్దేశిస్తూ వారికి పోస్టింగులు ఇవ్వాలని ఆదేశించడంతో చర్యలకు దిగిన ఉన్నతాధికారులు ఖాళీలను బట్టి పోస్టింగులు ఇస్తున్నారు. అయితే ఖాళీగా ఉన్న పోస్టుల్లోనే నియమిస్తున్నారా? లేక తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల స్థానాలను భర్తీ చేస్తున్నారా అనే అంశంపై స్పష్టత లేదు. టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్లో 65 మందికి.. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్)లో 65 మంది వీఆర్వోలకు ఈ విధంగా పోస్టింగులిస్తూ సొసైటీ కార్యదర్శి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. సొసైటీ పరిధిలోని వివిధ గురుకుల విద్యా సంస్థల్లో సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, రికార్డు అసిస్టెంట్, స్టోర్ కీపర్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ తదితర పొస్టుల్లో వారిని సర్దుబాటు చేశారు. ఇలా సర్దుబాటు చేసిన పోస్టుల్లో చాలావరకు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 15 ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులుండడం గమనార్హం. కాగా మిగతా సొసైటీల్లోనూ ఈ విధంగా అతి త్వరలో వీఆర్వోలకు పోస్టింగులిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆందోళనలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గురుకుల విద్యా సంస్థల్లో వీఆర్వోల సర్దుబాటుతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సేవలు దాదాపు నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఎస్సీ గురుకుల సొసైటీలో నియమితులైన 65 మంది వీఆర్వోలు శాశ్వత ప్రాతిపదికన పని చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రస్తుతం ఆయా పోస్టుల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించాల్సి రావచ్చు. తాజాగా సర్దుబాటైన వీఆర్వోలు తక్షణమే జిల్లా అధికారికి రిపోర్టు చేయాలని ఉత్పర్వుల్లో స్పష్టం చేయడంతో మెజార్టీ ఉద్యోగులు ఇప్పటికే విధుల్లో చేరారు. దీంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి అయోమయంగా తయారైంది. పది నుంచి పదిహేనేళ్లుగా పనిచేస్తున్న తమను ఒక్కసారిగా విధుల్లోంచి తీసేస్తే భవిష్యత్తు ఏమిటనే ఆందోళన వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వయోభారం కారణంగా కొత్తగా తమకు ఉద్యోగావకాశాలు లభించే పరిస్థితి ఉండదని, అందువల్ల ఒకవేళ తమను ఉద్యోగం నుంచి తొలగించే పరిస్థితి వస్తే ప్రభుత్వమే ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపాలని వారు కోరుతున్నారు. అయితే వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ఉన్నతాధికారులు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కాగా మిగతా సొసైటీల్లో సైతం ఇదే తరహాలో వీఆర్వోల నియామకాలు చేపట్టే అవకాశం ఉండటంతో, ఆయా సొసైటీల్లోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లాం.. టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్లో దాదాపు 15 సంవత్సరాల నుంచి ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా సొసైటీనే నమ్ముకుని ఉన్న వారిని తొలగిస్తే వారి భవిష్యత్తు అంధకారంగా మారుతుంది. మానవీయ కోణంలో ఆలోచించి ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించకుండా.. వీఆర్వోలను సర్దుబాటు చేయాలి. ఈ అంశాన్ని ఇప్పటికే సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్ దృష్టికి తీసుకెళ్లాం. ఆయన సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. – సీహెచ్ బాలరాజు, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం -
గురుకులాల్లో 317 గుబులు! జోనల్ ఉద్యోగుల్లో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీల్లోని ఉద్యోగుల్లో జీఓ 317 గుబులు మొదలైంది. రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి రావడంతో ఆమేరకు అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులను కేడర్ల వారీగా కేటాయించే ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది. తాజాగా సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీల్లో నూతన జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపులు జరపాలని ప్రభుత్వం ఆయా సొసైటీల కార్యదర్శులను ఆదేశించింది. దీంతో కేడర్ల వారీగా ఉద్యోగుల కేటాయింపుపై సొసైటీలు కసరత్తు మొదలుపెట్టాయి. ఇందులోభాగంగా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఎంఆర్ఈఐఎస్)లు జీఓ 317 అమలుకు ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ మేరకు క్షేత్రస్థాయి అధికారులకు మార్గదర్శకాలు ఇవ్వగా... అధికారులు చర్యలు వేగవంతం చేశారు. అతి త్వరలో తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూ ఆర్ఈఐఎస్), మహాత్మా జ్యోతిభా ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఆర్ఈఐఎస్)ల పరిధిలోనూ కొత్త జోన్ల వారీగా ఉద్యోగ కేటాయింపు ప్రక్రియ మొదలు కానుంది. నూతన జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపులు పూర్తయితేనే కొత్తగా నియామకాలు, పోస్టింగులు ఇవ్వడానికి మార్గం సుగమం కానుంది. వివరాల సేకరణ షురూ ఎస్సీ, మైనార్టీ గురుకుల సొపైటీల్లో ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియ వేగవంతమైంది. ఉద్యోగుల నుంచి నిర్దేశించిన ఫార్మాట్లో వివరాలను సేకరించే పనిలో రీజినల్ కోఆర్డినేటర్లు బిజీ అయ్యారు. ఇప్పటికే దాదాపు సమాచారం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. వీటిని పరిశీలించాక సీనియారిటీ జాబితాను రూపొందించిన అనంతరం కేటాయింపులు జరుపుతారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఇతరత్రా నిర్దేశించిన కేటగిరీల్లోని ఉద్యోగులకు ప్రాధాన్యత ఇస్తారు. జోనల్ ఉద్యోగుల్లో గందరగోళం కొత్త జోనల్ విధానం ప్రకారం విభజన అంశం జోనల్ స్థాయి ఉద్యోగుల్లోనే ఎక్కువ గుబులు పుట్టిస్తోంది. ఇదివరకు రాష్ట్రంలో రెండు జోన్లు మాత్రమే ఉండేవి. కొత్త విధానంతో జోన్ల సంఖ్య ఏడుకు పెరిగింది, ఇందులో జోన్ పరిధి తగ్గింది. ఈ క్రమంలో జోనల్ స్థాయి ఉద్యోగుల స్థానికత ఆధారంగా కేటాయింపులు జరిపితే సగానికి పైగా ఉద్యోగులకు స్థానచలనం అనివార్యం కానున్నట్లు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో ఈ పరిస్థితుల్లో ఉద్యోగుల స్థానచలనం జరిగితే పిల్లల చదువులు, ఇతరత్రా అంశాల్లో ఇబ్బందులు తలెత్తుతాయనే వాదన ఉద్యోగ సంఘాల నుంచి వినిపిస్తోంది. కేడర్ల వారీగా ఉద్యోగుల విభజన ఇలా... జిల్లా స్థాయి: జూనియర్ అసిస్టెంట్, స్టోర్ కీపర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, ల్యాబ్ అటెండర్ జోనల్ స్థాయి: టీజీటీ, సూపరింటెండెంట్, ఫిజికల్ డైరెక్టర్ (గ్రేడ్ 2), లైబ్రేరియన్, సీనియర్ అసిస్టెంట్, స్టాఫ్ నర్స్, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్, వార్డెన్, పీఈటీ, ల్యాబ్ అసిస్టెంట్, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్, ప్లంబర్/ఎలక్ట్రీషియన్ మల్టీ జోనల్ స్థాయి: ప్రిన్సిపల్ (గ్రేడ్ 2), డిగ్రీ కాలేజీలోని లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్లు, హెల్త్ సూపర్వైజర్లు, జూనియర్ లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్ (గ్రేడ్ 1), పీజీటీలు. జిల్లా, మల్టీ జోన్లలో కొందరు జిల్లాస్థాయి, మల్టీ జోనల్ స్థాయి కేడర్ ఉద్యోగుల్లోనూ కొన్ని మార్పులు తప్పవని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జిల్లాల పరిధి కుదించుకోపోవడం, ఇదివరకు మల్టీ జోన్ లేకుండా రాష్ట్రస్థాయి పోస్టులుండగా... ఇప్పుడు ఆయా కేడర్లలోని ఉద్యోగుల్లో కొందరికి మార్పు తప్పదని తెలుస్తోంది. ప్రస్తుతం వివరాల సేకరణలో ఉన్న అధికారులు.. వారంలోగా సీనియారిటీ ఆధారంగా కేటాయింపులపై ప్రాథమిక జాబితాలు రూపొందిస్తే కొంత స్పష్టత రానుంది. మరోవైపు ఉద్యోగుల కేటాయింపులు మాత్రమే ఇప్పుడు జరిపి, స్థానచలనం జరిగితే కొంత సమయం ఇవ్వాలనే ఉద్యోగుల వినతులను ప్రభుత్వం పరిశీలిస్తోందని విశ్వసనీయ సమాచారం. చదవండి: Telangana: ఊరూరా గోదారే!.. కనీవినీ ఎరుగని జలవిలయం -
టీజీసెట్–22 ఫలితాలు విడుదల
సాక్షి,హైదరాబాద్: సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదోతరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీసెట్–22 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. గురుకుల విద్యా సంస్థల పనితీరుపై మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆన్లైన్లో ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాలను టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్, టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్, ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ ఈఐఎస్, టీఆర్ఈఐఎస్ సొసైటీల వెబ్సైట్లలో అందుబాటులో ఉంచారు. ఈ నాలుగు సొసైటీల పరిధిలో ఐదో తరగతికి 48,440 సీట్లు ఉన్నాయి. వీటి భర్తీకి టీజీసెట్–22 నిర్వహించారు. మార్కుల ఆధారంగా అభ్యర్థులకు ప్రాధాన్యత ప్రకారం సీట్లు కేటాయించారు. ఈ పరీక్ష కోసం మొత్తంగా 1,47,324మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుని పరీక్ష రాశారు. ‘సహజ’ఉత్పత్తులను సరఫరా చేయండి రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థలు, సంక్షేమహాస్టళ్లకు ‘సహజ’ఉత్పత్తులు సరఫరా చేయాలని కొప్పుల ఈశ్వర్ సూచించారు. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన స్వయం సహాయకసంఘాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘సహజ’ద్వారా నిత్యావసరాలతోపాటు సబ్బులు, షాంపూలు, తలనూనెలు, కాస్మెటిక్స్‌ను ఉత్పత్తి చేస్తున్నారని వీటిని పరిశీలించి అన్ని గురుకులాలు, హాస్టళ్లకు సరఫరా చేసే అంశాన్ని పరిశీలించాలని సొసైటీ కార్యదర్శులకు ఆదేశించారు. -
నెలాఖరుకల్లా గురుకుల సెట్ ఫలితాలు!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాలకు అర్హత పరీక్షలు నిర్వహించిన గురుకుల సొసైటీలు ఇప్పుడు ఫలితాల ప్రకటన, అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఐదోతరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత పరీక్షలు దాదాపు పూర్తయ్యాయి. ఒకట్రెండు సొసైటీల్లో బ్యాక్లాగ్ ఖాళీల భర్తీకి నాలుగైదు రోజుల్లో పరీక్ష పూర్తికానుంది. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరుకల్లా అన్నిరకాల ప్రవేశపరీక్షల ఫలితాలు ప్రకటించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. ఫలితాల ప్రకటన తర్వాత వెంటనే అడ్మిషన్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నాయి. జూలై నెలాఖరుకు ప్రవేశాల ప్రక్రియను కొలిక్కి తెచ్చి, అవసరమున్న కేటగిరీల్లో రెండు, మూడోవిడత కౌన్సెలింగ్ నిర్వహించి పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాయి. -
గురుకుల సెట్–22 దరఖాస్తుకు గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఐదో తరగతి ప్రవేశాలకు నిర్వహించనున్న గురుకుల సెట్(వీటీజీసెట్)–2022 దరఖాస్తు గడువును ఏప్రిల్ 7 వరకు పొడిగిస్తున్నట్లు సెట్ చీఫ్ కన్వీనర్ రోనాల్డ్‌రాస్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. వీటీజీసెట్–22 మే 8న ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలకు సొసైటీ వెబ్సైట్లో పరిశీలించవచ్చని ఆ ప్రకటనలో తెలిపారు. -
నకిలీల ‘అవుట్ సోర్సింగ్’
వరంగల్ జిల్లాలో ఉన్న ఓ ఏకలవ్య మోడల్ స్కూల్లో క్రాఫ్ట్ టీచర్‌గా ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి పనిచేస్తున్నాడు. వాస్తవానికి ఆ వ్యక్తి పదోతరగతి మాత్రమే చదవగా.. డిగ్రీ, అనుబంధ కోర్సులో ఉత్తీర్ణత సాధించినట్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించాడు. తర్వాత అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా క్రాఫ్ట్ టీచర్ ఉద్యోగం సంపాదించాడు. ఇలా ఒకరిద్దరు కాదు.. గిరిజన గురుకుల విద్యా సంస్థల సొసైటీ, ఏకలవ్య మోడల్ పాఠశాలల్లోని పలు విభాగాల్లో పదుల సంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు పొందారు. సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విభాగాల్లో తాత్కాలిక పద్ధతిలో నియమించే అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకూ ‘నకిలీ’చీడ పట్టింది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని గురుకుల విద్యా సంస్థలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పెద్ద సంఖ్యలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో ‘నకిలీలు’ఉ న్నట్లు తెలుస్తోంది. వారికి అర్హత లేకున్నా ఇంటర్మీ డియట్, డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లను తప్పుడు పద్ధతిలో సృష్టించి వాటి ద్వారా అవుట్ సోర్సింగ్ కొలువులు సంపాదించుకున్నట్లు తెలిసింది. ఈ అంశం జిల్లా స్థాయిలో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినప్పటికీ ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. బోగస్ సర్టిఫికెట్లతో బురిడీ.. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను జిల్లా స్థాయిలో ఒక ప్రైవేటు ఏజెన్సీ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ ఏజెన్సీల ద్వారా వచ్చే అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలించి, ఆమోదం తెలిపిన అనంతరం వారిని ఉద్యోగంలో చేరనిస్తారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెలవారీ జీతాలను ప్రభుత్వం నేరుగా కాకుండా ఏజెన్సీల ద్వారా చెల్లిస్తారు. ఈ క్రమంలో ఏజెన్సీల్లోని కొందరు నిర్వాహకులు ఒకరిద్దరు అధికారులతో మిలాఖత్ అయ్యి నకిలీ సర్టిఫికెట్లున్న అభ్యర్థులకు కొలువులు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని గురుకుల విద్యాసంస్థలు, కాలేజీలతో పాటు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో పెద్ద సంఖ్యలో తప్పుడు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు వందకు పైగా ఉద్యోగులను ఇలా ఎంపిక చేసినట్లు వెల్లడైంది. సబార్డినేట్ పోస్టులే ఎక్కువ.. గిరిజన గురుకుల సొసైటీతో పాటు ఏకలవ్య మోడల్ స్కూళ్లలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసిన ఉద్యోగాల్లో అత్యధికం సబార్డినేట్ పోస్టులే ఉన్నట్లు సమాచారం. వాటితో పాటు కొన్నిచోట్ల బోధన సిబ్బందిని సైతం ఇలాగే భర్తీ చేసినట్లు తెలుస్తోంది. ల్యాబ్ అసిస్టెంట్, అటెండర్ పోస్టులతో పాటు మెస్ మేనేజర్, క్రాఫ్ట్ టీచర్, ఆర్ట్ టీచర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టుల్లో ఇలాంటి ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. సబార్డినేట్ పోస్టులకు సంబంధించి ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లు నకిలీవి సృష్టించగా, బోధన సిబ్బంది కేటగిరీలో డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లను తప్పుడు పద్ధతిలో సృష్టించారు. ఈ వ్యవహారానికి సంబంధించి విచారణ జరపాలని ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. పూర్తిస్థాయిలో విచారణ జరిపితే అక్రమాల గుట్టు తెలుస్తుందని అంటున్నారు. -
నెలాఖర్లోగా నోటిఫికేషన్లు!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 వ్యాప్తి నేపథ్యంలో 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు గురుకులాలు ముందస్తు కసరత్తు చేపట్టాయి. ఈ నెలాఖరులోగా అన్ని తరగతుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయించాయి. ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించే దరఖాస్తు ప్రక్రియకు ఇరవై రోజులపాటు గడువు ఇవ్వనున్నాయి. సాధారణంగా ఫిబ్రవరి చివరివారం నుంచి ఏప్రిల్ రెండోవారం వరకు ప్రవేశాల నోటిఫికేషన్లు జారీ చేస్తుండగా, ఆగస్టు రెండోవారం నాటికి అడ్మిషన్ల ప్రక్రియ ముగిసేది. అయితే రెండేళ్లుగా కోవిడ్ కారణంగా ప్రవేశాల ప్రక్రియ గాడితప్పుతోంది. 2021–22 సంవత్సరానికి డిసెంబర్ వరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగింది. ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యే నాటికే వందశాతం అడ్మిషన్లు పూర్తి చేసేలా గురుకులాల సొసైటీలు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. ఐదో తరగతికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలతోపాటు విద్యాశాఖ ఆధ్వర్యంలో గురుకుల సొసైటీలున్నాయి. ఐదో తరగతి ప్రవేశాలకు మైనార్టీ సొసైటీ మినహా మిగతా నాలుగు గురుకులాలు ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహించనున్నాయి. ఈ మేరకు ఒకే నోటిఫికేషన్ వెలువడనుంది. ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకున్న ఖాళీలను భర్తీ చేసేందుకు సొసైటీలవారీగా నోటిఫికేషన్లు జారీ చేస్తారు. జూనియర్, డిగ్రీ, పీజీ కాలేజీల్లో ఫస్టియర్ అడ్మిషన్లకు ప్రత్యేకంగా నోటిఫికేషన్లు ఇస్తాయి. ఎస్సీ, ఎస్టీ గురుకులాల పరిధిలోని సైనిక పాఠ శాలలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో అడ్మిషన్లకు కూడా ప్రత్యేక నోటిఫికేషన్లు వెలువడ నున్నాయి. ఇవన్నీ ఈ నెలాఖరులోగా జారీ చేసేం దుకు గురుకుల సొసైటీలు చర్యలు వేగవంతం చేశాయి. ముందంజలో ఎస్సీ గురుకుల సొసైటీ... ఎస్సీ గురుకుల సొసైటీ ఇప్పటికే డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి టీజీయూజీసెట్–2022 నోటిఫికేషన్ జారీ చేసి, ఈ నెల 23న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది. జూనియర్ కాలేజీలు, సీఓఈ(సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ)ల పరిధిలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ ప్రవేశాలకు టీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ అండ్ సీఓఈసెట్–2022 నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 6 నుంచి 25వ తేదీ వరకు సొసైటీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 20న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు సొసైటీ వెల్లడించింది. మిగతా సొసైటీలు కూడా త్వరలో నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు ఆయా శాఖల అధికారులు చెబుతున్నారు. -
Telangana: 11న గురుకుల సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలోని రుక్మాపూర్ (కరీంనగర్), అశోక్‌నగర్ (నర్సంపేట్) సైనిక విద్యాలయాల్లో ఆరోతరగతి, ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల కోసం ఈ నెల 11న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. https://tswreis.in, https://www.tgtwgurukulam.telangana.gov.in/ వెబ్సైట్ల నుంచి విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయా సొసైటీలు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. కోవిడ్–19 నిబంధనలకు అనుగుణంగా విద్యార్థులు పరీక్షా కేంద్రానికి గంట ముందే హాజరు కావాలని తెలిపాయి. మరిన్ని వివరాలకు సొసైటీ వెబ్సైట్ చూడాలని సూచించాయి. ఆదర్శ స్కూళ్ల ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు పెంపు సాక్షి, హైదరాబాద్: ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో అడ్మిషన్లతోపాటు ఏడు నుంచి పదో తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును ఈ నెల 11వ తేదీ వరకు పొడిగించారు. అప్పటివరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్యా డైరెక్టర్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం http://telanganams.cgg.gov.in వెబ్సైట్ చూడాలని ఆయన సూచించారు. -
సరుకుకు రక్షణ.. సులభతర రవాణా
సాక్షి, హైదరాబాద్: గురుకుల సొసైటీ పరిధిలోని విద్యా సంస్థలకు జియోట్యాగింగ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సరుకు రవాణా సులభతరం చేయడంతో పాటు అక్రమాలకు తావీయకుండా ఉండేందుకు దీన్ని అమలు చేయనుంది. ఈ మేరకు కార్యాచరణ రూపొందించాలని సొసైటీలను ఆదేశించింది. రాష్ట్రంలో 5 గురుకుల సొసైటీలున్నాయి. టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ (తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ), టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్(తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ), ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ (మహాత్మా జ్యోతిభా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ), టీఎంఆర్ఈఐఎస్ (తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ), టీఆర్ఈఐఎస్(తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ) పరిధిలో 870 గురుకుల విద్యా సంస్థలున్నాయి. వీటికి పౌరసరఫరాలశాఖ బియ్యం సరఫరా చేస్తుండగా.. కూరగాయలు, గుడ్లు, మాంసం, ఇతర సరుకులను కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్నారు. ఏటా కొత్త కాంట్రాక్టర్లను ఎంపిక చేస్తుండటంతో విద్యా సంస్థల చిరునామాల్లో గందరగోళం ఏర్పడుతోంది. దీనిని అధిగమించేందుకు జియోట్యాగింగ్ చేస్తే బాగుంటుందని పౌరసరఫరాల శాఖ సూచించింది. సులభంగా గమ్యస్థానానికి... గురుకుల పాఠశాలలు, కళాశాలల చిరునామా తెలుసు కోవడం సులభతరం చేసేందుకు జియోట్యాంగింగ్ ఉపకరిస్తుందని యంత్రాంగం యోచిస్తోంది. ప్రతి గురుకుల పాఠశాల, కళాశాల ఎక్కడుందో తెలుసుకునేందు కు వాటి అక్షాంశ, రేఖాంశాల (లాంగిట్యూడ్, లాటిట్యూ డ్)ను గురుకుల సొసైటీ వెబ్సైట్లో పొందుపరుస్తారు. గురుకుల పాఠశాల, కళాశాల ఫొటోను అందుబాటులో పెట్టనున్నారు. దీంతో సరుకు సరఫరా చేసే కాంట్రాక్టర్లతో పాటు గురుకులానికి వెళ్లే సందర్శకులకు కూడా ఈ విధానం ఉపయోగపడుతుంది. ప్రయోగాత్మకంగా ప్రతీ సొసైటీలో పది గురుకుల పాఠశాలలను తొలుత జియోట్యాగింగ్ చేయాలని ప్రభుత్వం సొసైటీ కార్యదర్శులకు సూచించింది. ఇది పూర్తయ్యాక అన్ని గురుకులాలకు జియోట్యాగింగ్ చేస్తారు. వచ్చే విద్యా సంవత్సరం కల్లా జియోట్యాగింగ్ పూర్తి కానుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో 1,660 సంక్షేమ వసతిగృహాలను కూడా జియోట్యాగింగ్ చేయాల్సిందిగా ప్రభుత్వం సంక్షేమ శాఖలకు ఆదేశించింది. గురుకుల విద్యా సంస్థల తరహా లో వీటికి కూడా సరుకులు సరఫరా చేయనుండటంతో హాస్టళ్లకు సైతం ఇదే పద్ధతిలో జియో ట్యాగింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
‘సీఎం మానవీయతకు ప్రతీకలే గురుకులాలు’
సాక్షి, హైదరాబాద్: గురుకులాల స్థాపనలో సీఎం కేసీఆర్ మానవీయ కోణాన్ని గంగుల ఆవిష్కరించారు. దేశంలో మరెక్కడాలేని విధంగా బీసీలకోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు బీసీల బతుకుల్లో వెలుగులు నింపుతున్నాయన్నారు. మంత్రి ప్రసంగానికి సభ్యులు తమ చప్పట్లతో హర్షాతిరేకాన్ని ప్రకటించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణలో బీసీ బిడ్డలకోసం ఏర్పాటయిన గురుకులాలు సీఎం గారి మానవత్వానికి నిదర్శనాలన్నారు. మంత్రిగా గంగుల తొలి ప్రసంగం అందరినీ ఆకట్టుకున్నది. ‘అధ్యక్షా... ఒక బీసీ బిడ్డగా గురుకులాలకు సంబంధించిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడం నా అదృష్టం. సీఎం నిర్ణయం కారణంగానే 19గా ఉన్న గురుకులాలు, తెలంగాణ ఏర్పడిన తర్వాత 261కి పెరిగాయి. సభ్యులు ఎగ్గె మల్లేశం, పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశ్నలకు గంగుల బదులిచ్చారు. -
గురుకుల హస్టల్‌ను తనిఖీ చేసిన ఎంపీ,ఎమ్మెల్యే
-
అక్షర చైతన్యంతోనే అభివృద్ధి
సాక్షి ప్రతినిధి మహబూబ్‌నగర్: దేశం అభివృద్ధి చెందాలంటే అక్షర చైతన్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని తెలంగాణ గురుకులాల సొసైటీ కార్యదర్శి, స్వేరోస్ ఫౌండర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. మహబూబ్ నగర్‌లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు జరిగిన స్వేరోస్ 4వ జాతీయ సదస్సుకు తెలంగాణ తోపాటు, ఏపీ, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి గురుకులాల పూర్వ విద్యార్థులు (స్వేరోలు) హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ, అణగారిన వర్గాల అభ్యున్నతికి గురుకులాలు మాత్రమే సరిపోవని, ప్రతి ఇల్లు ఒక పాఠశాల కావాలని, అప్పుడే విద్యావ్యాప్తి జరుగుతుందన్నారు. పాలకుల నిర్లక్ష్యంతోనే.. దేశంలో పేదరిక నిర్మూలన కోసం విద్య ఎంతో అవసరమని, ఇందులో భాగంగానే అమెరికా విద్యా విధానాన్ని అమలు చేయాలని పురావస్తు శాఖ డైరెక్టర్ ఆకునూరి మురళి అన్నారు. రాష్ట్రంలో విద్యాభ్యున్నతిని పాలకులు నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈ వ్యవస్థ భ్రష్టు పట్టిందని అన్నారు. ఫలితంగా అభివృద్ధికి ఆస్కారం లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థలను నిషేధించడం ద్వారా అనుకున్న ఫలితాలు సాధించవచ్చని ఆయన అభిప్రాయ పడ్డారు. ప్రభుత్వం నాలుగేళ్లలో ఒక గంట కూడా విద్య కోసం కేటాయించకపోవడం శోచనీయమని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల రద్దు కోసం రాష్ట్రస్థాయిలో హైదరాబాద్‌లో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ సదస్సులో సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి, ఇన్‌కంటాక్స్ కమిషనర్ డాక్టర్ ప్రీతిహరిత్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎన్ఐఆర్డీ రాధిక రస్తోగి, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ రతన్‌లాల్, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ చైతన్య మురళి తదితరులు పాల్గొన్నారు. -
‘రిజర్వేషన్ల అమలుపై సమగ్ర విచారణ చేయాలి’
హైదరాబాద్: రాజ్యాంగ బద్ధంగా ఏర్పడ్డ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిజర్వేషన్లు పాటించకపోవడం దారుణమని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. గురుకుల టీచర్ల రిక్రూట్మెంట్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయలేదని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నిరుద్యోగులు ఖైరతాబాద్‌లోని బీసీ కమిషన్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆర్.కృష్ణయ్య మద్దతు తెలిపారు. అనంతరం బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులకు వినతిపత్రం ఇచ్చారు. నియామకాల్లో ఓపెన్ కాంపిటేషన్ లాస్ట్ కటాఫ్ మార్కుల తర్వాత రిజర్వేషన్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా.. ఓపెన్ కాంపిటేషన్‌లో రావాల్సిన మెరిట్ అభ్యర్థులను కూడా రిజర్వేషన్లో భర్తీ చేయడంతో రిజర్వేషన్లకు పూర్తిగా గండికొట్టినట్టయ్యిందన్నారు. ఈ విధానం వల్ల సుమారు 400 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, టీజీటీ జేఏసీ అధ్యక్షుడు శ్రీను పాల్గొన్నారు. ఘంటా చక్రపాణిని పదవి నుంచి తొలగించాలి: టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణిని తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆందోళన అనంతరం మీడియాతో మాట్లాడుతూ నష్టపోయిన విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ అభ్యర్థులు కమిషన్ వద్దకు వెళితే ముందస్తు అరెస్టులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఉద్యోగ నియామకాల భర్తీలో చక్రపాణి వైఫల్యం చెందారని మండిపడ్డారు. రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేస్తూ రివైజ్డ్ సెలక్షన్ లిస్ట్‌ను ప్రకటించాలని టీఎస్పీఎస్సీని డిమాండ్ చేశారు. -
ఐదు కేటగిరీల్లో ఉద్యోగాలు భర్తీ
సాక్షి, హైదరాబాద్: వివిధ శాఖల్లో పలు పోస్టులకు ఎంపికైన వారి జాబితాను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. వారికి సంబంధించిన ఫలితాలను తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణి ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. - కాలుష్య నియంత్రణ మండలిలో 25 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టులకు అభ్యర్థులను టీఎస్పీఎస్సీ ఎంపిక చేసింది. విజువల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థి లభించకపోవడంతో ఆ పోస్టును భర్తీ చేయలేదు. - జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు పోస్టులకు ముగ్గురిని ఎంపిక చేసింది. - గిరిజన గురుకులాల్లో మూడు ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. అర్హులైన ఏజెన్సీ అభ్యర్థులు లభించకపోవడంతో మరో 3 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయలేదు. - వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ఆరుగురిని ఎంపిక చేసింది. బీసీ–ఏ(మహిళ) అభ్యర్థి లభించకపోవడంతో ఒక పోస్టును భర్తీ చేయలేదు. - సోషల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ పోస్టులకు నలుగురు అభ్యర్థులను టీఎస్పీఎస్సీ ఎంపిక చేసింది. మిగతా 26 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు లభించలేదని పేర్కొంది. ఈ పోస్టులకు 75 దరఖాస్తులు వచ్చాయని, అందులో ఐదుగురే అర్హత సాధించారని తెలిపింది. వారిలో నలుగురు ఇంటర్వ్యూలకు హాజరైనట్లు వివరించింది. -
గురుకులాల్లో సీట్ల భర్తీకి 5న కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని గురుకుల పాఠశాలల్లో 6 నుంచి 9 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలను శనివారం విడుదల చేయనున్నట్లు సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 5న కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. -
‘గురుకుల’ కౌన్సెలింగ్ గందరగోళం
– కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయని అధికారులు – ఇబ్బందులు పడిన విద్యార్థులు డోన్ టౌన్: గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశానికి డోన్ పట్టణంలోని గురుకుల పాఠశాలలో శనివారం నిర్వహించిన కౌన్సెలింగ్ గందరగోళంగా మారింది. జిల్లావ్యాప్తంగా గురుకుల 880 సీట్లు ఉండగా.. 2,300 మంది కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. పట్టణానికి 5 కి.మీ దూరంలో ఉన్న ఈ పాఠశాల ఆవరణలో కౌన్సెలింగ్ ఏర్పాటు చేశారు. ఒక క్రమపద్ధతి పాటించకపోవడంతో, ఒకే సారి కేంద్రంలోకి విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులను అనుమతించడంతో తోపులాట జరిగింది. కొందరు సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో 9 గంటలకు ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్.. పోలీసులు వచ్చిన తరువాత 12 గంటలకు ప్రారంభమైంది. కనీస సౌకర్యాలేవీ..? పాఠశాల ఆవరణలోని మరుగుదొడ్లకు తాళాలు వేయడంతో విద్యార్థినులు చాలా ఇబ్బందులు పడ్డారు. తాగునీటి వసతి లేకపోవడంతో దాహంతో అల్లాడారు. జిల్లా వ్యాప్తంగా వేలాదిమంది విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరవుతారని అధికారులకు తెలిసినా..ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంపై విమర్శలు వచ్చాయి. పట్టణం నుంచి పాఠశాలకు ఎలాంటి వాహన సౌకర్యం లేకపోవడంతో ఆటో డ్రైవర్లు ఇష్టానుసారంగా చార్జీలు వసూలు చేశారు. ఇదిలా ఉండగా.. కౌన్సెలింగ్ నిర్వాహణను జిల్లా కో ఆర్డినేటర్ కృష్ణమూర్తి తనిఖీ చేశారు. ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాగునీటి సౌకర్యం వెంటనే కల్పించాలని ప్రిన్సిపాల్ ఉమాకుమారిని ఆదేశించారు. సౌకర్యాలు లేకుండా కౌన్సిలింగ్ ఎలా నిర్వహిస్తారని జిల్లా కో ఆర్డినేటర్ కృష్ణమూర్తితో ఎస్ఎఫ్ నాయకులు శివశంకర్, ఏఐఎస్ఎఫ్ నాయకులు శివన్న తదితరులు వాగ్వాదానికి దిగారు. -
ఎవరెస్ట్‌ను అధిరోహించిన గురుకులం విద్యార్థి
సి.బెళగల్: సి.బెళగల్‌లోని ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం (బైపీసీ) చదువుతున్న విద్యార్థి సురేష్‌బాబు ఎవరెస్ట్ అధిరోహించారు. గోనెగండ్లకు చెందిన కర్రెన్న, సువర్ణ దంపతుల కుమారుడైన ఈ విద్యార్థి శనివారం తెల్లవారుజామున 5–48 గంటలకు ఎవరెస్ట్ ఎక్కినట్లు స్కూల్ ప్రిన్సిపాల్ మనోహరరావు తెలిపారు. ఈ సమాచారం గురకులం సంస్థ కార్యదర్శి, కల్నల్ రాములు ఫోన్లో తెలియజేసినట్లు ఆయన వెల్లడించారు. ఎవరెస్ట్ అధిరోహణకు రాష్ట్రం తరపున 16 మంది విద్యార్థులను 2016 ఆగష్టున అధికారులు ఎంపికచేయగా పాఠశాలకు చెందిన సురేష్ బాబు అందులో ఒకరన్నారు. ఆత్మవిశ్వాసంతో తమ విద్యార్థి శిఖరం అధిరోహించి కళాశాలకు పేరు తీసుకొచ్చారని శనివారం విలేకరుల సమావేశంలో సంతోషం వ్యక్తం చేశారు. చదువులోనూ ఈ విద్యార్థి అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని 1000కి 882 మార్కులు సాధించారని వెల్లడించారు. అనంతరం సురేష్‌బాబు శిక్షణ విశేషాలను వెల్లడించారు.