ప్రవేశ పరీక్షలు ప్రశాంతం
కర్నూలు సిటీ: గురుకుల, ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో మొత్తం 32 స్కూళ్లలో 6వ తరగతి ప్రవేశాలకు 8028 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా, 7386 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. డీఈఓ తాహెరా సుల్తానా పెద్దపాడు ఆదర్శ పాఠశాలలో జరుగుతున్న పరీక్షలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష పత్రాలను త్వరలోనే మూల్యాంకనం చేసి ఫలితాలు ప్రకటిస్తామన్నారు.
గురుకుల ప్రవేశాలకు 4710 మంది హాజరు
గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాలకు కర్నూలు, నంద్యాల, ఆదోని డివిజన్లలో పరీక్షలు నిర్వహించారు. మొత్తం 5115 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 4710 మంది పరీక్షలకు హాజరైనట్లు గురుకుల పాఠశాలల కన్వీనర్ ఉబేదుల్లా తెలిపారు.