అనంతపురం ఎడ్యుకేషన్ : జిల్లాలోని మోడల్ స్కూళ్లలో 7,8,9 తరగతుల్లో మిగులు సీట్ల భర్తీకి ఈనెల 20న రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ, మోడల్ స్కూళ్ల ఏడీ శ్రీరాములు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 18 లోపు సంబంధిత పాఠశాలల ప్రిన్సిపాళ్ల వద్ద దరఖాస్తులు అందజేసి, రశీదు పొందాలన్నారు. అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశానికి శనివారంలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తులను పాఠశాల ప్రిన్సిపాళ్లకు అందజేయాలన్నారు.