Telangana: 11న గురుకుల సైనిక్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్ష | Telangana Gurukul Sainik School Entrance Exam 2021 Latest Update | Sakshi
Sakshi News home page

Telangana: 11న గురుకుల సైనిక్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్ష

Published Thu, Jul 8 2021 3:36 PM | Last Updated on Thu, Jul 8 2021 3:36 PM

Telangana Gurukul Sainik School Entrance Exam 2021 Latest Update - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలోని రుక్మాపూర్‌ (కరీంనగర్‌), అశోక్‌నగర్‌ (నర్సంపేట్‌) సైనిక విద్యాలయాల్లో ఆరోతరగతి, ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల కోసం ఈ నెల 11న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

https://tswreis.in, https://www.tgtwgurukulam.telangana.gov.in/ వెబ్‌సైట్‌ల నుంచి విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఆయా సొసైటీలు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. కోవిడ్‌–19 నిబంధనలకు అనుగుణంగా విద్యార్థులు పరీక్షా కేంద్రానికి గంట ముందే హాజరు కావాలని తెలిపాయి. మరిన్ని వివరాలకు సొసైటీ వెబ్‌సైట్‌ చూడాలని సూచించాయి.  

ఆదర్శ స్కూళ్ల ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు పెంపు 
సాక్షి, హైదరాబాద్‌: ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో అడ్మిషన్లతోపాటు ఏడు నుంచి పదో తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును ఈ నెల 11వ తేదీ వరకు పొడిగించారు. అప్పటివరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్యా డైరెక్టర్‌ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం http://telanganams.cgg.gov.in వెబ్‌సైట్‌ చూడాలని ఆయన సూచించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement