Sainik School
-
సైనిక్ స్కూల్‌పై రేవంత్ అబద్ధాలు: వినోద్
సాక్షి, హైదరాబాద్: వరంగల్‌లో సైనిక్ స్కూల్ ఏర్పా టుపై సీఎం రేవంత్ రెడ్డి అసత్యాలు మాట్లా డుతున్నా రని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బి.వినోద్ కుమార్ విమర్శించారు. ఇకపై ఆయన చెప్పే అబద్ధాలకు దీటుగా సమాధానం ఇస్తామ న్నారు. మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌తో కలిసి వినోద్ కుమార్ మంగళవారం తెలంగాణ భవన్లో విలేకరులతో మా ట్లాడారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ త ర్వాత రేవంత్ గోబెల్స్ తరహాలో మాట్లాడార న్నారు.వరంగల్‌లో సైనిక్ స్కూలు గతంలోనే మంజూరైందని, కానీ రక్షణశాఖ ఆధ్వర్యంలో నడపలే మని చెప్పినందునే సమస్య తలెత్తిందన్నారు. సైనిక్ స్కూల్ ఏర్పాటుపై గతంలో నాటి రక్షణ మంత్రులు మనోహర్ పారిక్కర్, అరుణ్ జైట్లీని అనేక మార్లు కలిశామని పేర్కొన్నారు. వరంగల్ సైనిక్ స్కూలు ఏర్పాటుపై గత ప్రభుత్వం కేంద్రంతో చేసిన ఉత్తర ప్రత్యుత్తరాలను రేవంత్ చదువుకోవాలని సూచించారు. రక్షణ శాఖ భూముల కేటాయింపునకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు రికార్డుల్లో ఉన్నాయని గుర్తు చేశారు. -
చిన్ననాటి గురువు ఇంటికి వెళ్లిన ఉపరాష్ట్రపతి
కన్నూర్(కేరళ): ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ సోమవారం కేరళలో కన్నూర్ జిల్లాలోని పన్నియన్నూర్ గ్రామానికి వెళ్లారు. చిత్తోఢ్‌గఢ్ సైనిక్ స్కూల్లో తన గురువైన రత్న నాయర్‌ను కలుసుకున్నారు. అత్యున్నత స్థాయిలో తమ ఇంటికి వచ్చిన శిష్యుడిని చూసిన ఆమె పొంగిపోయారు. ఇంతకు మించిన గురుదక్షిణ ఇంకేముంటుందంటూ ఆనందించారు. వారిద్దరూ నాటి ఘటనలను గుర్తు తెచ్చుకుంటూ గడిపారు. -
జనసేన నాయకుడి మోసానికి కిరాణా వ్యాపారి బలి
పొందూరు: శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం బురిడి కంచరాం గ్రామానికి చెందిన జనసేన నాయకుడు గురివిందల అసిరినాయుడు చేసిన మోసానికి ఓ కిరాణా వ్యాపారి బలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... విజయనగరం జిల్లా రాజాం మండలం పెనుబాకకు చెందిన బుడ్డెపు రామకృష్ణ (43) తమ గ్రామంలోనే కిరాణా వ్యాపారం నిర్వహిస్తుంటారు. ఆయన ఇద్దరు పిల్లలకు 2020లో సైనిక్ స్కూల్లో సీట్లు ఇప్పిస్తానని జనసేన నాయకుడు గురివిందల అసిరినాయుడు నమ్మించాడు. ఇందుకోసం అసిరినాయుడుకు రామకృష్ణ రూ.16లక్షలు ఇచ్చాడు. అయితే రామకృష్ణ పిల్లలకు సైనిక్ స్కూల్లో సీట్లు రాలేదు. తన పిల్లల భవిష్యత్ బాగుంటుందనే ఆశతో అప్పు చేసి రూ.16లక్షలు ఇచ్చానని, ఆ డబ్బులను తిరిగివ్వాలని అనేకసార్లు రామకృష్ణ అడిగినా... అసిరినాయుడు పట్టించుకోలేదు. ఈ ఏడాది మార్చి 31న మరోసారి అసిరినాయుడు ఇంటికి రామకృష్ణ తన భార్యతో కలిసి వచ్చి అప్పులు పెరిగిపోయాయని, డబ్బులు తిరిగి ఇవ్వాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. ‘నీకు నచ్చినట్లు చేసుకో...’ అని అసిరినాయుడు రెచ్చిపోయాడు. దీంతో రామకృష్ణ తన వెంట తెచ్చుకున్న పురుగులమందు తాగాడు. ఆయనను శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, మూడు రోజులకే రూ.3.50 లక్షలు ఖర్చు అయ్యింది. ఆ తర్వాత డబ్బులు లేకపోవడంతో కుటుంబ సభ్యులు రామకృష్ణను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. ఈ ఘటనపై పొందూరు పోలీస్‌స్టేషన్‌లో రామకృష్ణ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఉద్యోగాల పేరుతోనూ డబ్బులు వసూలు! జనసేన నాయకుడు గురివిందల అసిరినాయుడు ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసి జల్సాలు చేస్తుంటాడని కంచరాం గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో నరసన్నపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.10 లక్షలు తీసుకున్నాడని, అతనికి ఉద్యోగం రాకపోవడంతో రూ. 5 లక్షలు తిరిగి ఇచ్చాడని తెలిపారు. ఇదే తరహాలో కొత్తూరుకు చెందిన వ్యక్తి నుంచి రూ.3 లక్షలు, శ్రీకాకుళానికి చెందిన వ్యక్తి నుంచి రూ.15 లక్షలు తీసుకుని మోసం చేయడంతో దేహశుద్ధి కూడా చేశారని గ్రామస్తులు చెప్పారు. -
Bipin Rawat: సైనిక్ స్కూల్‌కు జనరల్ బిపిన్ రావత్ పేరు
లక్నో: దివంగత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ పేరును మెయిన్‌పురి జిల్లాలోని ఒక సైనిక్ స్కూల్‌కు పెట్టాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హెలికాప్టర్ ప్రమాదంలో నీలగిరి కొండల్లో నేలకొరిగిన రావత్‌కు నివాళిగా రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ నిర్ణయం తీసుకున్నారని సీఎం కార్యాలయం గురువారం ఒక ట్వీట్‌చేసింది. 2019 ఏప్రిల్ ఒకటిన ఈ స్కూల్‌ను ప్రారంభించారు. కూనూర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రావత్ దంపతులుసహా 13 మంది అమరులైన విషయం విదితమే. -
సైనిక్ స్కూల్, కలికిరిలో 18 ఖాళీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన కలికిరి సైనిక్ స్కూల్.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 18 ► పోస్టుల వివరాలు: టీజీటీ–02, ఎల్డీసీ–02, ఎంటీఎస్–14 తదితరాలు. ► టీజీటీ: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈడీ/బీఏ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 21 నుంచి 35 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు ఉంటుంది. ► ఎల్డీసీ: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. వయసు: 18 నుంచి 50ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు ఉంటుంది. ► ఎంటీఎస్: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18నుంచి 50ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు ఉంటుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 07.08.2021 ► వెబ్సైట్: https://sskal.ac.in -
Telangana: 11న గురుకుల సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలోని రుక్మాపూర్ (కరీంనగర్), అశోక్‌నగర్ (నర్సంపేట్) సైనిక విద్యాలయాల్లో ఆరోతరగతి, ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల కోసం ఈ నెల 11న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. https://tswreis.in, https://www.tgtwgurukulam.telangana.gov.in/ వెబ్సైట్ల నుంచి విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయా సొసైటీలు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. కోవిడ్–19 నిబంధనలకు అనుగుణంగా విద్యార్థులు పరీక్షా కేంద్రానికి గంట ముందే హాజరు కావాలని తెలిపాయి. మరిన్ని వివరాలకు సొసైటీ వెబ్సైట్ చూడాలని సూచించాయి. ఆదర్శ స్కూళ్ల ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు పెంపు సాక్షి, హైదరాబాద్: ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో అడ్మిషన్లతోపాటు ఏడు నుంచి పదో తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును ఈ నెల 11వ తేదీ వరకు పొడిగించారు. అప్పటివరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్యా డైరెక్టర్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం http://telanganams.cgg.gov.in వెబ్సైట్ చూడాలని ఆయన సూచించారు. -
కలికిరి సైనిక్ స్కూల్లో టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉన్న కలికిరి సైనిక్ స్కూల్.. ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 23 ► పోస్టుల వివరాలు: హెడ్మాస్టర్–01, ప్రీ ప్రైమరీ టీచర్లు–03, ప్రైమరీ టీచర్లు–06, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్–01, మ్యూజిక్/ డ్యాన్స్ టీచర్–01, స్పెషల్ ఎడ్యుకేటర్–01, పీఈటీ–01, హెడ్ క్లర్క్–01, అకౌంట్ క్లర్క్–01, డ్రైవర్–01, ఆయాలు–04, ఎంటీఎస్–02. ► హెడ్ మాస్టర్: అర్హత: గ్రాడ్యుయేషన్, బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ.35,000 చెల్లిస్తారు. ► ప్రీ ప్రైమరీ టీచర్లు: అర్హత: ఇంటర్మీడియట్, ఎన్టీటీసీ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ.20,000 చెల్లిస్తారు. ► ప్రైమరీ టీచర్లు: అర్హత: గ్రాడ్యుయేషన్, డీఈఈటీ/బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. సీటెట్/టెట్ అర్హత కలిగి ఉండాలి. వేతనం నెలకు రూ.20,000 చెల్లిస్తారు. ► ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్: అర్హత: బీఎఫ్ఏ, టీటీసీ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ. 20,000 చెల్లిస్తారు. ► మ్యూజిక్/డ్యాన్స్ టీచర్: అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ. 20,000 చెల్లిస్తారు. ► స్పెషల్ ఎడ్యుకేటర్: అర్హత: గ్రాడ్యుయేషన్, బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ. 20,000 చెల్లిస్తారు. ► పీఈటీ: అర్హత: ఇంటర్మీడియట్/ యూజీడీపీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ. 20,000 చెల్లిస్తారు. ► హెడ్‌క్లర్క్: అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ.15,000 చెల్లిస్తారు. ► అకౌంట్ క్లర్క్: అర్హత: బీకాం ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ.15,000 చెల్లిస్తారు. ► డ్రైవర్: అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వేతనం నెలకు రూ.12,000 చెల్లిస్తారు. ► ఆయా: అర్హత: ఎనిమిదో తరగతి ఉత్తీర్ణుల వ్వాలి. వేతనం నెలకు రూ.12,000 చెల్లిస్తారు. ► ఎంటీఎస్: అర్హత: ఎనిమిదో తరగతి ఉత్తీర్ణుల వ్వాలి. వేతనం నెలకు రూ.12,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్,రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ► దరఖాస్తులకు చివరి తేది: 10.04.2021 ► వెబ్సైట్: www.sskal.ac.in ఏపీ పౌరసరఫరాల శాఖలో ఖాళీలు.. దరఖాస్తు చేసుకోండి -
‘సంతోష్ దేశానికి మంచి చేయాలని తపించేవాడు’
సాక్షి, హైదరాబాద్: భారత్ - చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడి సహోద్యోగులు సంతోష్ మృతి పట్ల సంతాపం తెలిపారు. ‘సంతోష్ నిగర్వి.. దూకుడుగా ఉండే వాడు కాదు. మృదు స్వభావి. ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. చాలా మంచి మనిషి’ అని కల్నల్ ఎస్ శ్రీనివాసరావు తెలిపాడు. అంతేకాక ‘మరో రెండేళ్లలో సంతోష్‌కు సికింద్రాబాద్‌కు పోస్టింగ్ వచ్చేది. దాని కోసం అతడు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు. ఏ అధికారి అయినా తన సొంత రాష్ట్రంలో సేవ చేయడం చాలా గౌరవంగా భావిస్తారు. సంతోష్ కూడా అలానే. ఇప్పటి నుంచే అతడు తన పిల్లలకు మంచి స్కూల్ గురించి వెతుకుతున్నాడు. తెలుగు అధికార్లుగా మేం ఎప్పుడు టచ్‌లో ఉండే వాళ్లం. ఒకరికి ఒకరం మర్యాద ఇచ్చుకునే వాళ్లం. ఒకరి బాగోగులు ఒకరం తెలుసుకునే వాళ్లం’ అని శ్రీనివాసరావు తెలిపారు. అంతేకాక తనతో పాటు పని చేసే జూనియర్ల గురించి సంతోష్ ఎంతో శ్రద్ధ తీసుకునేవాడన్నారు. కోరుకొండ సైనిక్ స్కూల్ ప్రిన్సిపాల్ అరుణ్ కులకర్ణి మాట్లాడుతూ.. ‘పూర్వ విద్యార్థుల కార్యక్రమాల్లో సంతోష్ చురుగ్గా పాల్గొనేవాడు. టీచర్లతో కాంటక్ట్‌లో ఉండేవాడు’ అని తెలిపారు. మరో అధికారి మాట్లాడుతూ.. ‘సంతోష్ సమస్యలకు భయపడేవాడు కాదు. దేశానికి, తన బెటాలియన్‌కు మంచి చేయాలని తపిస్తుండేవాడు. ఎప్పుడు కంబాట్ దుస్తుల్లోనే ఉండేవాడు. ఏ పని అయినా చేస్తాడు.. ఎంత కష్టమైన ఆపరేషన్‌లో అయినా పాల్గొంటాడు. అతడి ముఖం మీద చిరునవ్వు ఎప్పుడు చెరగదు’ అని తెలిపారు. కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు గురువారం ఉదయం సూర్యాపేటలో జరుగనున్నాయి. (చనిపోతున్నా.. చైనాకు చుక్కలు చూపించాడు) -
చనిపోతున్నా.. చైనాకు చుక్కలు చూపించాడు
సాక్షి, విజయనగరం: చైనాతో జరిగిన సరిహద్దు వివాదంలో ప్రాణాలు కోల్పోయిన కల్నల్ సంతోష్ బాబుకు విజయనగరంలోని కోరుకొండ సైనిక్ స్కూల్ సిబ్బంది నివాళులు అర్పించారు. అక్కడ ఉపాధ్యాయులు మాట్లాడుతూ... సంతోష్ బాబు తమ విద్యార్థి కావడం గర్వకారణమన్నారు. కల్నల్ సంతోష్ బాబు మరణం తమను ఎంతగానో కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మృత్యువుతో పోరాడుతూ కూడా సంతోష్ బాబు చైనా సేనకు దడ పుట్టించారని కొనియాడారు. సంతోష్ కుటుంబాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాల ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. (సలామ్ కల్నల్ సంతోష్..) -
గిరిజన సైనిక్ స్కూలు సిద్ధం
సాక్షి, వరంగల్ రూరల్: గిరిజన సైనిక్ స్కూల్ ప్రారంభానికి సిద్ధమైంది. ఆగస్టు 15 నుంచి అధికారికంగా తరగతులు ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని అశోక్‌నగర్‌లో ఈ స్కూలును ఏర్పాటు చేశారు. రూ.1.24 కోట్లతో భవనాలను ఆధునీకరిస్తున్నారు. ఇటీవల నూతన భవనాల నిర్మాణం కోసం మరోసారి ప్రభుత్వం రూ.2.5 కోట్లను మంజూరు చేయగా ఆ పనులు సైతం చురుకుగా సాగుతున్నాయి. దాదాపుగా పనులు పూర్తి కావస్తున్నాయి. కాగా, సైనిక్ స్కూల్లో 5వ తరగతి, ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల కోసం విద్యార్థుల ఎంపికను పూర్తి చేశారు. రాష్ట్రంలోని టీటీడబ్ల్యూఆర్ఎస్ పాఠశాలలు, కళాశాలల నుంచి వీరిని ఎంపిక చేశారు. 5వ తరగతి కోసం రాష్ట్రవ్యాప్తంగా 250 మంది హాజరుకాగా 80 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు 280 మంది వరకు హాజరుకాగా ఇందులో నుంచి 80 మందిని ఎంపిక చేసి వారి జాబితాను గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు పంపారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చే ఆర్మీ రిటైర్డ్ అధికారుల కోసం కూడా బుధవారం హైదరాబాద్‌లో ఎంపిక నిర్వహించినట్లు తెలిసింది. త్వరలో స్కూల్లో బోధించేందుకు అధ్యాపకుల ఎంపిక సైతం పూర్తి కానుంది. అధ్యాపకులు, ఇతర సిబ్బందిని ఈ నెల 10వ తేదీ వరకు ఎంపిక చేయనున్నారు. -
అమ్మాయిలకు తొలిసారి...
లక్నో : ఇన్నాళ్లు సైనిక పాఠశాలలో కేవలం మగపిల్లలను మాత్రమే తీసుకునేవారు. ఈ సైనిక పాఠశాలలు ప్రారంభమైన 57 సంవత్సరాల తర్వాత తొలిసారి సైనిక పాఠశాల్లో ఆడపిల్లలకు అవకాశం కల్పించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2018 - 2019 విద్యాసంవత్సరానికి గాను లక్నోలోని కెప్టెన్ మనోజ్ కుమార్ పాండే సైనిక పాఠశాలలో 15 మంది విద్యార్థినులకు ప్రవేశం కల్పించారు. వీరందరూ రైతులు, వైద్యులు, పోలీసు అధికారులు, ఉపాధ్యాయులు వంటి వేర్వేరు కుటుంబ నేపథ్యాల నుంచి వచ్చారు. సైనిక పాఠశాలలో ప్రవేశం పొందడానికి మొత్తం 2500 మంది అమ్మాయిలు దరఖాస్తు చేసుకున్నారు. ప్రవేశ పరీక్ష, ఇంటర్యూ తర్వాత 15 మంది విద్యార్థినులను ఎంపిక చేసారు. ‘ఇక్కడ అందరికి ఒకే రకమైన దినచర్య ఉంటుంది. ఉదయం 6 గంటలకు వ్యాయామం, తర్వాత 8.15 గంటలకు ప్రార్థనకు హాజరుకావాల్సి ఉంటుంది. తరగతులు అయిపోయిన తర్వాత వారు హాస్టల్‌కి వెళ్లి విశ్రాంతి తీసుకుంటారు. రాత్రి 7 గంటల వరకు వివిధ క్రీడాంశాల్లో పాల్గొంటారు. తర్వాత చదువుకుంటారు. ప్రతిష్టాత్మక సైనిక పాఠశాలలో చేరినందుకు వారంతా చాలా గర్వపడుతున్నారు. సైనిక పాఠశాలలో ఇప్పుడు ప్రవేశం పొందిన అమ్మాయిలు తొమ్మిదో తరగతిలో చేరతారు. 2017లో యూపీ ప్రభుత్వం నిర్ణయం మేరకు ఈసారి సైనిక పాఠశాలలో విద్యార్థినులకు ప్రవేశం కల్పించాం. వీరికి వసతి ఏర్పాట్లు కోసం నూతన భవనాన్ని ఏర్పాటు చేయలేదు. ఇంతకు ముందు అబ్బాయిలకు కేటాయించిన హాస్టల్‌ని ఇప్పుడు అమ్మాయిల కోసం వాడనున్నామ’ని పాఠశాల ప్రాధానోపాధ్యాయుడు కల్నల్ అమిత్ ఛటర్జీ తెలిపారు. -
త్వరలో కరీంనగర్ జిల్లాలో సైనిక్ స్కూలు
జ్యోతినగర్ (రామగుండం): కరీంనగర్ జిల్లా రుక్మాపూర్‌లో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఎన్టీపీసీ రామగుండం టెంపరరీ టౌన్‌షిప్‌లోని ఉద్యోగ వికాస కేంద్రం ఆడిటోరియంలో స్వేరోస్ స్వర సునామి సీడీ–3 ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 2013లో స్వేరోస్ స్థాపించి అందరికీ చదువుకునే అవకాశం కల్పించేలా ప్రతి గ్రామంలో చదువు విలువను తెలియజేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 577 గురుకుల పాఠశాలల్లో 3 లక్షల పైచిలుకు విద్యార్థులు విద్యను పొందుతున్నారని, రాబోయే 2021 సంవత్సరం వరకు 8 లక్షల 60 వేల మందికి విద్యా బోధన చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. -
వరంగల్‌లో గిరిజన సైనిక్ స్కూల్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రతిష్టాత్మక సైనిక్ స్కూల్ ఏర్పాటు కానుంది. సరికొత్త హంగులతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ గిరిజన సైనిక్ స్కూల్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు గిరిజన సంక్షేమ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలను నిర్వహిస్తున్న గిరిజన సంక్షేమశాఖ.. సైనిక పాఠశాల ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో గిరిజన సంక్షేమ శాఖ చర్యలు వేగవంతం చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్‌నగర్‌లో 2018–19 విద్యా సంవత్సరం నుంచి సైనిక పాఠశాల ప్రారంభించనుంది. ఇప్పటికే ఇక్కడ గురుకుల పాఠశాల కొనసాగుతుండగా.. దీనిని అదనపు హంగులతో సైనిక పాఠశాలగా తీర్చిదిద్దనుంది. కోరుకొండ తరహాలో.. ఉమ్మడి రాష్ట్రంలో బాగా పేరొందిన సైనిక పాఠశాల కోరుకొండలో ఉంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో సైనిక పాఠశాల లేదు. వరంగల్ జిల్లా ధర్మసాగర్లో సైనిక పాఠశాల ఏర్పాటుకు అనుమతి లభించినప్పటికీ ఇంకా ప్రారంభం కాలేదు. మరోవైపు ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో ఉన్న తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ కరీంనగర్లో సైనిక పాఠశాల ఏర్పాటుకు ఉపక్రమించింది. ఈ క్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ప్రతిపాదనలకు త్వరితంగా స్పందన రావడంతో చర్యలు వేగవంతం చేసింది. అశోక్ నగర్‌లోని గిరిజన గురుకుల పాఠశాలకు దాదాపు వంద ఎకరాల విస్తీర్ణంలో మైదానం ఉంది. ప్రస్తుతం ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. 720 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న గురుకులానికి ఎలాంటి ఆటంకం కలగకుండా కొత్తగా సైనిక పాఠశాలను ప్రారంభిస్తారు. తొలి ఏడాది 80 సీట్లతో.. మొదటి సంవత్సరం 80 సీట్లతో సైనిక పాఠశాలను ప్రారంభిస్తారు. ఐదో తరగతిలో 40, ఇంటర్ ఫస్టియర్‌లో 40 సీట్లు ఉంటాయి. ఈ సీట్ల భర్తీ రెండంచెలుగా జరుగుతుంది. మొదట రాత పరీక్ష.. తర్వాత దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఫలితాల ఆధారంగా ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుంది. ఇందుకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ పాఠశాలలో సబ్జెక్టు టీచర్లతో పాటు నలుగురు మాజీ సైనికాధికారులను నియమిస్తారు. కల్నల్ స్థాయి సైనికాధికారితో పాటు ఫిజికల్ ఫిట్నెస్ కేటగిరీ, స్పోర్ట్స్, మ్యూజిక్, బ్యాండ్ కేటగిరీల్లో సైనికాధికారులను నియమించేందుకు గిరిజన సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. సైనిక పాఠశాలలో చేరే విద్యార్థులకు రోజువారీ మెనూతో పాటు స్పెషల్ డైట్ ఉంటుంది. ఇందుకు గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక బడ్జెట్ కేటాయించనుంది. అదేవిధంగా ఆధునిక హంగులతో జిమ్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకుడు నవీన్ నికోలస్ ‘సాక్షి’తో చెప్పారు. -
సైనిక పాఠశాలలో ప్రవేశపరీక్షకు 20నుంచి హాల్‌టికెట్లు
సాక్షి, కలికిరిః అఖిల భారత సైనిక పాఠశాల ప్రవేశ పరీక్షకు దరఖాస్తున్న చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 20వ తేదీ నుంచి హాల్‌టికెట్లు పొందవచ్చని కలికిరి సైనిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కెప్టెన్ సైమన్ జేవియర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హాల్‌టికెట్లను www.sainikschoolsociety.org , www.kalikirisainikschool.com నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చునన్నారు. జనవరి 7వ తేదీన ఆదివారం జరిగే ప్రవేశ పరీక్ష ఓ.ఎం.ఆర్ విధానంలో ఉంటుందని, విద్యార్థులు నలుపు, నీలం బాల్ పాయింట్ పెన్ మాత్రమే వినియోగించి జాగ్రత్తగా తమ హాల్‌టిక్కెట్ నంబరు, సమాధానాలు గుర్తించాలని పేర్కొన్నారు. అలాగే విద్యార్థులు ఓ.ఎం.ఆర్ పత్రమును మడవడం, చింపడం చేయరాదని తెలిపారు. -
తెలంగాణ వారైనా స్థానికేతరులే
కోరుకొండ సైనిక్ స్కూల్లో చదివితే అలాగే గుర్తింపు ఆందోళనలో పూర్వ విద్యార్ధులు మిర్యాలగూడ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఏకైక కోరుకొండ సైనిక్ స్కూల్లో చదివిన తెలంగాణ విద్యార్థులు నాన్‌లోకల్ శాపగ్రస్తులుగా మిగిలారు. సొంత రాష్ట్రంలో ఉండి కూడా నాన్‌లోకల్‌గా ముద్రపడి ఉద్యోగాలకు అనర్హులుగా మిగిలారు. రాష్ట్ర విభజన నాటికి కోరుకొండ సైనిక్ స్కూల్లో తెలంగాణ ప్రాంతం నుంచి సుమారుగా 500 మంది విద్యార్థులు 12వ తరగతి పూర్తి చేశారు. ఇందులో కొంత మంది ఉద్యోగాలు సాధించగా.. మరికొంత మంది ప్రైవేట్ ఉద్యోగాలు చేయడంతోపాటు ఉన్నత చదువులు చదువుతున్నారు. కానీ.. తెలంగాణ ప్రాంతంలో ఇటీవల ఉద్యోగాలకు నిర్వహించిన పోటీ పరీక్షల్లో మాత్రం విజయనగరం జిల్లా కోరుకొండలో చదివిన వారిని స్థానికేతరులుగా గుర్తించారు. తెలంగాణలో పుట్టి పెరిగిన వారు అయినప్పటికీ.. చదువురీత్యా ఉమ్మడి రాష్ట్రంలో కోరుకొండ స్కూల్లో చదవడం వల్ల స్థానికేతరులుగా గుర్తింపు ఇస్తున్నారు. దీంతో సైనిక్ స్కూల్లో చదివిన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. జీఓ జారీ చేస్తేనే తీరనున్న కష్టాలు విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక్ స్కూల్లో చదివిన తెలంగాణ విద్యార్థులను కూడా స్థానికులుగా పరిగణించడానికి ప్రభుత్వం ప్రత్యేక జీఓ జారీ చేయాల్సి ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులు, వారి నివాసం, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, పుట్టిన తేదీ సర్టిఫికెట్ల ఆధారంగా లోకల్ సర్టిఫికెట్ జారీ చేయాలి. అందుకుగాను ప్రత్యేకంగా జీఓ జారీ చేయాలని..అలా చేస్తేనే సైనిక్ స్కూల్ విద్యార్థులకు న్యాయం జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం లోకల్‌గా గుర్తించాలి మాది తెలంగాణ. మా తల్లిదండ్రులు నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఉంటారు. మేము మెరుగైన విద్య కోసం కోరుకొండ సైనిక్ స్కూల్లో ప్రవేశపరీక్ష ద్వారా సీటు సాధించా. ఆరు నుంచి 12వ తరగతి వరకు అక్కడే చదివా. కోరుకొండలో చదవడం వల్ల రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నాన్‌లోకల్‌గా పరిగణిస్తున్నారు. మా సొంత రాష్ట్రంలో మమ్మల్ని లోకల్‌గా గుర్తించాలి. - వినోద్‌కుమార్, బీటెక్ ఫైనల్ ఇయర్, మిర్యాలగూడ నాన్ లోకల్ అనడం అన్యాయం తెలంగాణ ప్రాం తానికి చెందిన వారమైనా విజయనగరం జిల్లా కోరుకొండలో చదడవం వల్ల నాన్‌లోకల్‌గా పరిగణించడం అన్యాయం. ఐదో తరగతి వరకు తెలంగాణాలోనే చదువుకున్నాం. సైనిక్ స్కూల్లో ప్రవేశపరీక్ష ద్వారా చేరి 12వ తరగతి వరకు చదివాం. దీంతో మమ్ములను తెలంగాణా వారు కాదని నాన్‌లోకల్‌గా పరిగణించడం సరికాదు. ప్రభుత్వం లోకల్‌గా గుర్తించి న్యాయం చేయాలి. - హరిహర భార్గవ, బీటెక్ ద్వితీయ సంవత్సరం, మిర్యాలగూడ -
జిల్లాలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలి
హన్మకొండ : జిల్లాలో సైనిక స్కూల్ ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్లఅశోక్‌రెడ్డి, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి కోరారు. గురువారం ఢిల్లీలో ఈ మేరకు రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌ను కలిసి వినతిపత్రం అందించి, జిల్లాలో సైనిక్ స్కూల్ ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరం వరంగల్ అని, ఇక్కడ సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు అశోక్‌రెడ్డి తెలిపారు. పార్టీ నాయకుడు చదువు రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
సైనికస్కూల్ ఫలితాలు విడుదల
విజయనగరం రూరల్: 2016-17 సంవత్సరానికి కోరుకొండ సైనిక పాఠశాలలో ఆరు, తొమ్మిది తరగతులలో ప్రవేశానికి 2016 జనవరి 3న నిర్వహించిన ప్రవేశ పరీక్షా ఫలితాలను సైనిక పాఠశాల ప్రిన్సిపాల్, గ్రూప్‌కెప్టెన్ పి.రవికుమార్ శుక్రవారం విడుదల చేశారు. ఆరో తరగతిలో 90 సీట్లకు 255 మంది, తొమ్మిదో తరగతిలో 20 సీట్లకు 51 మంది ఇంటర్వ్యూకు అర్హత సాధించారని ఆయన తెలిపారు. వీరికి ఈ నెల 17వ తేదీనుంచి సైనిక పాఠశాలలో ఇంటర్వ్యూలు, వైద్య పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. ఈ నెల 12వ తేదీ నాటికి ఇంటర్వ్యూకు కాల్ లెటర్ అందని విద్యార్థులు సమాచారం కోసం 08922-246119 నంబరును సంప్రదించవచ్చని తెలిపారు. ప్రవేశ పరీక్ష ఫలితాలను సైనిక పాఠశాల వెబ్సైట్ www. sainikschoolkorukonda.orgÌZ పొందుపరిచామని తెలిపారు. -
సైనికస్కూల్ ప్రవేశ పరీక్షలు వాయిదా
విజయనగరం: వచ్చే నెల నాలుగున నిర్వహించాల్సిన ఆల్ ఇండియా సైనికస్కూల్ ప్రవేశ పరీక్షలు వాయిదా పడినట్లు కోరుకొండ సైనికస్కూల్ ప్రిన్సిపాల్, గ్రూప్ కెప్టెన్ పి.రవికుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2015-16 విద్యా సంవత్సరానికి జనవరి 4న జరగాల్సిన ప్రవేశ పరీక్షలు 2015 ఫిబ్రవరి 22కి వాయిదా పడినట్లు ఆయన తెలిపారు. ఇతర సమాచారం కోసం కోరుకొండ సైనికపాఠశాల ఫోన్ నంబర్లు 08922-246119, 246168లలో సంప్రదించాలన్నారు. -
11 కేంద్రాల్లో సైనిక స్కూల్ ప్రవేశ పరీక్షలు
విజయనగరం: ఆల్ ఇండియా సైనికస్కూల్ ప్రవేశ పరీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా 11 కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు కోరుకొండ సైనిక స్కూల్ ప్రిన్సిపాల్, గ్రూప్ కెప్టెన్ పి.రవికుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2015-16 సంవత్సరానికి సైనిక పాఠశాలల్లో ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశానికి వచ్చేనెల 4న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఆరో తరగతికి ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు గణితం (100 మార్కులకు), లాంగ్వేజీ ఎబిలిటీ (100 మార్కులకు) పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.50 గంటల వరకు ఇంటిలిజెన్సీ (100 మార్కులకు) పరీక్ష నిర్వహిస్తారన్నారు. తొమ్మిదో తరగతికి అదే రోజు ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు గణితం (200 మార్కులకు), సైన్స్ (75 మార్కులకు), మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఇంగ్లిషు (100 మార్కులకు), సోషల్ స్టడీస్ (75 మార్కులకు) పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. గత ఏడాది కంటే అదనంగా కలికిరి, విజయవాడ, రాజమండ్రిలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇతర సమాచారానికి కోరుకొండ సైనిక పాఠశాల ఫోన్ నంబర్లు 08922-246119, 246168 లలో సంప్రదించాలన్నారు. సైనిక స్కూల్ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్న కేంద్రాల వివరాలు... పరీక్షా కేంద్రం నిర్వహించే స్థలం, చిరునామా గుంటూరు శ్రీ మాజేటి గురవయ్య హైస్కూల్, బ్రాడీపేట, గుంటూరు హైదరాబాద్ కీస్ గర్ల్స్ హైస్కూల్, సికింద్రాబాద్ కరీంనగర్ గవర్నమెంట్ హైస్కూల్, సుభాష్‌నగర్, కరీంనగర్ తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి హైస్కూల్, టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం ఎదురుగా, తిరుపతి. విజయనగరం సెయింట్ జోసఫ్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్, కంటోన్మెంట్, విజయనగరం విశాఖపట్నం ఎస్ఎఫ్ఎస్ హైస్కూల్, సీతమ్మధార, విశాఖపట్నం విజయవాడ జెడ్పీ హైస్కూల్ (బాలుర), పటమట, విజయవాడ కడప నాగార్జున మోడల్ స్కూల్, జిల్లా కోర్టు వెనుక, మారుతీనగర్, వైఎస్ఆర్ జిల్లా, కడప కర్నూలు మాంటిసోరి ఇంగ్లిషు మీడియం హైస్కూల్, ఎ-క్యాంప్, కర్నూలు రాజమండ్రి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, సాయికృష్ణా థియేటర్ దగ్గర, డీలక్స్ సెంటర్, రాజమండ్రి కలికిరి సైనిక్ స్కూల్, కలికిరి, చిత్తూరు జిల్లా. -
తెలంగాణకు సైనిక్ స్కూల్
త్వరగా సన్నాహాలు చేయాలని కేసీఆర్‌కు రాపోలు లేఖ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలోని సైనిక్ స్కూల్ సొసైటీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ లేఖ ప్రతిని ఎంపీ రాపోలు ఆనందభాస్కర్‌కు కూడా పంపింది. ఆనందభాస్కర్ నాలుగు రోజుల క్రితం రాజ్యసభలో ప్రత్యేక ప్రస్తావనల కింద తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు సంబంధిత సొసైటీ స్పందించి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసిందని, ఒక ప్రతిని తనకూ పంపిందని ఆనందభాస్కర్ వివరిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంగళవారం ఒక లేఖ రాశారు. సొసైటీ చైర్మన్ తెలంగాణ ప్రభుత్వానికి రాసిన లేఖ గురించి దీనిలో ప్రస్తావించారు. ‘నవంబర్ 17న కేంద్ర రక్షణ శాఖ అండర్ సెక్రటరీ నుంచి సొసైటీకి ఒక లేఖ అందింది. సైనిక్ స్కూల్ ఏర్పాటుకు తదుపరి కార్యాచరణ చేపట్టాలని సూచించింది. 2015-16 విద్యాసంవత్సరంలోనే ఈ సైనిక్ స్కూల్ ఏర్పాటుకు తగిన స్థలాన్ని తెలంగాణ జిల్లాలో కేటాయించాలి’ అని సొసైటీ చైర్మన్ రాసిన విషయాలను ఆనందభాస్కర్ ప్రస్తావించారు. వచ్చే విద్యాసంవత్సరంలోనే ఈ సైనిక్ స్కూల్ ప్రారంభం కావాలంటే జనవరి ఒకటో తేదీ కల్లా సంబంధిత ఏర్పాట్లు చూడాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. వరంగల్ జిల్లా ఏటూరు నాగారం ప్రాంతంలో ఏర్పాటు చేయాలని సూచించారు. -
తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయండి
* రాజ్యసభలో రాపోలు డిమాండ్ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ రాజ్యసభలో డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఈ విషయమై ప్రత్యేక ప్రస్తావన చేశారు. ‘ఆంధ్ర ప్రదేశ్‌లోని కోరుకొండ, కలికిరి సైనిక్ స్కూళ్లు రాష్ట్ర విభజన ఫలితంగా ఏపీకే వెళ్లిపోయాయి. ప్రత్యేక ఉద్యమ నేపథ్యంలో ఆయా పాఠశాలలకు ఎంపికైన తెలంగాణ విద్యార్థులకు అడ్మిషన్లు రద్దు చేసుకోవాలని బెదిరింపులు వచ్చాయి. దీని ఫలితంగా రాష్ట్ర విద్యార్థులు అక్కడి సైనిక్ స్కూళ్లలో చదివే పరిస్థితి లేదు’ అని వివరించారు. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా ఏటూరు నాగారంలో సైనిక్ స్కూలు ఏర్పాటును పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరారు. -
ఉద్యోగాలు, ప్రవేశాలు
సైనిక్ స్కూల్, కలికిరి చిత్తూరు జిల్లా కలికిరిలోని సైనిక్ స్కూల్ కింది ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది. అసిస్టెంట్ మాస్టర్ (మ్యాథమెటిక్స్) అర్హత: మ్యాథ్స్ సబ్జెక్టుతో డిగ్రీ ఉత్తీర్ణత. అసిస్టెంట్ మాస్టర్ (సైన్స్) అర్హత: ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ బోటనీ/ జువాలజీ సబ్జెక్టులతో డిగ్రీ ఉత్తీర్ణత. అసిస్టెంట్ మాస్టర్ (సోషల్) అర్హత: హిస్టరీ/జాగ్రఫీ/పొలిటికల్ సైన్స్ / ఎకనామిక్స్ సబ్జెక్టులతో డిగ్రీ ఉత్తీర్ణత. అసిస్టెంట్ మాస్టర్ (ఇంగ్లిష్) అర్హత: ఇంగ్లిష్ సబ్జెక్టుతో డిగ్రీ ఉత్తీర్ణత. అసిస్టెంట్ మాస్టర్ (తెలుగు) అర్హత: తెలుగు సబ్జెక్టుతో డిగ్రీ ఉత్తీర్ణత. అసిస్టెంట్ మాస్టర్ (హిందీ) అర్హత: హిందీ సబ్జెక్టుతో డిగ్రీ ఉత్తీర్ణత. అసిస్టెంట్ మాస్టర్ (కంప్యూటర్ సైన్స్) అర్హత:కంప్యూటర్ సైన్స్‌తో డిగ్రీ ఉత్తీర్ణత పై అన్ని పోస్టులకు బీఈడీతోపాటు సీటెట్ అర్హత ఉండాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 30 వెబ్సైట్: www.sainikschoolkorukonda.org ప్రవేశాలు ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం రెగ్యులర్, కరస్పాండెన్స్ (దూర విద్య) విధానంలో కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం (పీజీడీజే) కాలపరిమితి: 12 నెలలు అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత. డిప్లొమా ఇన్ జర్నలిజం (డీజే) కాలపరిమితి: ఆరు నెలలు అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత. డిప్లొమా ఇన్ టీవీ జర్నలిజం (డీటీవీజే) కాలపరిమితి: ఆరు నెలలు అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత. సర్టిఫికెట్ కోర్స్ ఆఫ్ జర్నలిజం (సీజే) కాలపరిమితి: మూడు నెలలు అర్హత: ఎస్ఎస్సీ బోధనా మాధ్యమాలు: తెలుగు, ఆంగ్లం దరఖాస్తులు పొందడానికి చివరి తేది: జూలై 24 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది:జూలై 31 చిరునామా: ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం, ఫస్ట్ ఫ్లోర్, చాబ్రా టవర్స్, ఎస్ఆర్టీ (42), అశోక్‌నగర్ క్రాస్ రోడ్స్, జవహర్‌నగర్, హైదరాబాద్-500 029. ఫోన్ నెంబర్లు: 7660907286, 7396426447 వెబ్సైట్: www.apcj.in.