జిల్లాలో సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేయాలి | Sainik School to be established in the district | Sakshi
Sakshi News home page

జిల్లాలో సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేయాలి

Published Fri, Aug 12 2016 12:08 AM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM

Sainik School to be established in the district

హన్మకొండ : జిల్లాలో సైనిక స్కూల్‌ ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్లఅశోక్‌రెడ్డి, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి కోరారు. గురువారం ఢిల్లీలో ఈ మేరకు రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ను కలిసి వినతిపత్రం అందించి, జిల్లాలో సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. తెలంగాణలో హైదరాబాద్‌ తర్వాత రెండో పెద్ద నగరం వరంగల్‌ అని, ఇక్కడ సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేయాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు అశోక్‌రెడ్డి తెలిపారు. పార్టీ నాయకుడు చదువు రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement