established
-
పెద్ద కంపెనీలకు వెళ్లిపోదాం..
చెన్నై: అంకుర సంస్థల్లో పని చేసే వారిలో చాలా మంది పెద్ద కంపెనీలకు మారితే బాగుంటుందని భావిస్తున్నారు. ఉద్యోగ భద్రత, మెరుగైన జీతం, ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలు వారికి ఆకర్షణీయంగా ఉంటున్నాయి. మానవ వనరుల సేవల సంస్థ సీఐఈఎల్ హెచ్ఆర్ సరీ్వసెస్ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న స్టార్టప్స్ ఉద్యోగుల్లో 67 శాతం మంది ఈ మేరకు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈ సర్వే నివేదిక ప్రకారం స్టార్టప్ రంగంలో అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) అత్యధికంగా ఉంటోంది. ఉద్యోగి పనిచేసే సగటు వ్యవధి 2–3 ఏళ్లు మాత్రమే ఉంటోంది. స్టార్టప్ రంగంలో పనిచేసే వారిలో అత్యధిక శాతం మంది ఉద్యోగ భద్రతకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు. అందుకే ఇప్పటికే నిలదొక్కుకున్న కంపెనీల వైపు చూస్తున్నారు. ఇక 30 శాతం మంది మెరుగైన జీతభత్యాలు ఇందుకు కారణంగా తెలిపారు. 25 శాతం మంది స్టార్టప్‌లలో ఉద్యోగం–వ్యక్తిగత జీవితం మధ్య సమతౌల్యం ఉండటం లేదని అందుకే పేరొందిన సంస్థల్లోకి మారాలని భావిస్తున్నట్లు వివరించారు. దేశవ్యాప్తంగా సుమారు 70 స్టార్టప్‌లకు చెందిన 1,30,896 మంది ఉద్యోగులపై ఈ సర్వే నిర్వహించారు. హైరింగ్ ప్రణాళికల్లో అంకురాలు..‘కొత్త ఆవిష్కరణలు, ఉపాధికి ఊతమివ్వడంలో స్టార్టప్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 65 శాతం కంపెనీలు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నియామకాలు జరిపే యోచనలో ఉన్నాయి. దీంతో స్టార్టప్ వ్యవస్థ భవిష్యత్తు ఆశావహంగా కనిపిస్తోంది‘ అని సీఐఈఎల్ హెచ్ఆర్ సరీ్వసెస్ ఎండీ ఆదిత్య నారాయణ్ మిశ్రా తెలిపారు. అయితే, ఉద్యోగులు వెళ్లిపోకుండా తగు చర్యలు తీసుకోవడంపై అంకుర సంస్థలు దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఉద్యోగుల కెరియర్ పురోగతికి అవకాశాలుకల్పించడం, వర్క్–లైఫ్ బ్యాలెన్స్ ఉండేలా చూడటం మొదలైనవి చేయాలని పేర్కొన్నారు. తద్వారా ఉద్యోగులకు స్టార్టప్‌లపై నమ్మకం పెరుగుతుందని, అట్రిషన్ తగ్గగలదని మిశ్రా వివరించారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, మెరుగైన మానవ వనరుల విధానాలు ఉన్న అంకురాలు.. అట్రిషన్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఆకర్షణీయమైన ప్యాకేజీలు, రిమోట్ పని విధానాలు, భారీ స్టాక్ ఆప్షన్స్ స్కీములు మొదలైనవి అందిస్తున్నాయి. రిపోర్టు ప్రకారం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి అత్యధిక డిమాండ్ ఉంటోంది. ఆ తర్వాత సేల్స్, ప్రీ–సేల్స్, రిటైల్ వంటి ఉద్యోగాలు ఉంటున్నాయి. -
మల్బరీ తోటలో.. సరికొత్త పరికరం గురించి మీకు తెలుసా!?
వ్యవసాయ పనుల్లో శారీరక శ్రమ తగ్గించే యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చిన కొద్దీ రైతులకు పని సులువు కావటంతో పాటు ఖర్చు కూడా తగ్గుతూ ఉంటుంది. పట్టు పురుగుల పెంపకంలో భాగంగా జరిగే మల్బరీ తోటలు సాగు చేసే రైతులు సాధారణంగా 28 రోజుల్లో ఒక విడత పట్టు గూళ్ల పెంపకం పని పూర్తి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో మల్బరీ మొక్కల్ని పెంచి, కొమ్మల్ని కత్తిరించి వాటిని షెడ్లో పెరిగే పట్టు పురుగులకు ఆహారంగా వేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు బ్రష్ కట్టర్‌తో వ్యవసాయ కార్మికుడు కొమ్మ కత్తిరిస్తే, ఆ కొమ్మలను మరో కార్మికుడు కట్టకట్టి షెడ్డుకు చేరుస్తూ ఉంటారు. ఈ ప్రక్రియలో మూడు దశల్లో కార్మికుల అవసరం ఉంటుంది. కూలీల కొరతతో కూలి పెరిగిపోవటం వల్ల ఖర్చు పెరిగింది. కొడవళ్లతో కొమ్మ కత్తిరింపు, సేకరణ అధిక శారీరక శ్రమతో కూడిన పని కావటంతో పెరిగిన దశలో పట్టు పురుగులు అధిక మొత్తంలో మల్బరీ ఆకులు మేపాల్సి ఉంటుంది. ట్రాక్టరుకు జోడిండి వాడే పరికరం.. అయితే, గ్రామీణ ఆవిష్కర్త, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెళ్ల గ్రామానికి చెందిన యువకుడు కొడిముంజ ప్రవీణ్ రూపొందించిన పరికరం ద్వారా సులువుగా, త్వరగా, తక్కువ మంది కూలీలతోనే ఏ రోజు కత్తిరించిన ఆకులను ఆ రోజు పురుగులకు మేపటం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తున్నామని రైతులు చెబుతున్నారు. ప్రవీణ్ గత 12 ఏళ్లుగా రైతులకు ఉపయోగపడే పవర్ వీడర్లు, ట్రాక్టర్‌కు జోడించి ఉపయోగించే వ్యవసాయ పరికరాలను తయారు చేసి విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక పట్టుపురుగుల పెంపకందారుల సూచన మేరకు 2023 ఆగస్టులో మల్బరీ కొమ్మలు కత్తిరించే ట్రాక్టర్ అటాచ్‌మెంట్‌ను తయారు చేశారు. 3 అడుగుల దూరంలో వరుసలుగా నాటిన మల్బరీ మొక్కలను నేల నుంచి 5 అంగుళాల ఎత్తులో కత్తిరించి పక్కకు పడేసేలా దీన్ని రూపొందించారు. సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాల్లోని నలుగురు రైతులకు ఈ పరికరాలను విక్రయించారు. పలమనేరు రైతుల సూచనలతో.. ప్రవీణ్ ఈ పరికరం గురించి పల్లెసృజన సంస్థకు తెలియజేయగా, మల్బరీ సాగు విస్తారంగా జరుగుతున్న చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంత రైతులకు ఈ పరికరాన్ని చూపించారు. కొమ్మ కత్తిరించటంతోపాటు కట్ట కట్టి పడేసేలా దీన్ని అభివృద్ధి చేస్తే కూలీల అవసరం బాగా తగ్గుతుందని రైతులు సూచించారు. ప్రవీణ్ రెండు నెలలు శ్రమించి ఈ పరికరాన్ని రైతుల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయటంలో విజయం సాధించారు. నెల నెలా మల్బరీ కొమ్మ కత్తిరించడానికే కాకుండా.. ఏడాదికి, రెండేళ్లకోసారి మల్బరీ చెట్టు దుంప కొట్టడానికి కూడా ఈ పరికరం చక్కగా ఉపయోగపడుతోందని రైతులు సంతోషంగా చెబుతున్నారని ప్రవీణ్ తెలిపారు. బ్రష్ కట్టర్‌తో 8–9 గంటల్లో చేసిన పనిని తాను రూపొందించిన పరికరాన్ని ట్రాక్టర్‌కు జోడించి ఒక గంటలో పూర్తి చేయొచ్చని ప్రవీణ్ చెబుతున్నారు. 200 కిలోల బరువుండే ఈ పరికరాన్ని స్థానికంగా కొనుగోలు చేసిన ఇనుముతో తయారు చేయడానికి రూ. 1,65,000 వరకు ఖర్చయ్యింది. పెద్ద సంఖ్యలో తయారు చేస్తే 10–15% ఖర్చు తగ్గుతుందంటున్నారు ప్రవీణ్. పత్తి రైతులకూ ఉపయోగమే! మల్బరీ కొమ్మల కత్తిరింపు, సేకరణకు సంబంధించి 5–6గురు కూలీలు చేసే పనిని 2–3గురు కూలీలతోనే సులువుగా చేసుకోవడానికి ఈ పరికరం ఉపయోగపడుతోందని రైతులు సంతోషంగా చెబుతున్నారు. మల్బరీకే కాకుండా పత్తి తీత పూర్తయిన తర్వాత పత్తి కట్టె కొట్టడానికి, కంది కట్టె కొట్టడానికి, పశుగ్రాసం కోయడానికి కూడా ఈ పరికరం ఉపయోగపడుతుందని రైతులు చెబుతుంటే సంతోషంగా ఉంది. – కొడిముంజ ప్రవీణ్ (88863 81657), మల్బరీ కత్తిరింపు పరికరం రూపకర్త, జిల్లెళ్ల గ్రామం, తంగళ్లపల్లి మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రకృతి సేద్యానికి ప్రమాణాలు! మన దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, రైతులు చాలా సంవత్సరాలుగా విస్తృతంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నప్పటికీ నిర్దుష్ట ప్రమాణాలు లేవు. భారతీయ నమూనా ప్రకృతి సేద్యం అంతకంతకూ విస్తరించటం.. ఎఫ్.ఎ.ఓ. వంటి అనేక అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ప్రకృతి వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్‌కు సహకార వ్యవస్థ ఏర్పాటవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయానికి, ఉత్పత్తుల లేబులింగ్‌కు భారతీయ ప్రమాణాలను నిర్వచించుకోవాల్సిన అవసరం వచ్చింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) ఒక ముసాయిదా పత్రాన్ని వెలువరించింది. 27 పేజీల డ్రాఫ్ట్ స్టాండర్డ్స్‌ను వెబ్సైట్లో పెట్టింది. ప్రకృతి సాగు పద్ధతులు, ద్రావణాలు, కషాయాలు, అంతర పంటలు, మిశ్రమ పంటలు, ఆగ్రోఫారెస్ట్రీ.. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల బ్రాండింగ్, నిల్వ, ప్యాకేజింగ్‌తో పాటు.. సేంద్రియ–ప్రకృతి వ్యవసాయాల మధ్య వ్యత్యాసాలు ఇందులో ఉన్నాయి. శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద కార్యకర్తలు, రైతు శాస్త్రవేత్తలు, ఆహార నిపుణులు, సంస్థలు, ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరుతున్నది. తుది గడువు 2023 డిసెంబర్ 26. 14 నుంచి విశాఖ ఆర్గానిక్ మేళావిశాఖపట్నంలో ఈ నెల 8–10 తేదీల్లో జరగాల్సిన ఆర్గానిక్ మేళా పెనుతుపాను కారణంగా ఈ నెల 14–17 తేదీలకు వాయిదా పడింది. గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, ఏపీ ప్రభుత్వ రైతు సాధికార సంస్థ, సుస్థిర వ్యవసాయ కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకం మేళా జరగనుంది. విశాఖలో జరుగుతున్న నాలుగో వార్షిక ఆర్గానిక్ మేళా ఇది. 14న ఉ. 10 గంటలకు సేంద్రియ/ప్రకృతి రైతులు– రైతు శ్రేయోభిలాషుల సమ్మేళనం, 15న గ్రాడ్యుయేట్ ప్రకృతి వ్యవసాయదారులు, విద్యార్థుల సదస్సు, 16న ఏపీ ఛాంబర్ ఆఫ్ ఆర్గానిక్స్ సమావేశం, 17న ఇంటిపంటలు/మిద్దెతోటలపై సదస్సు జరుగుతుందని నిర్వాహకులు కుమారస్వామి తెలిపారు. ప్రవేశం ఉచితం. వివరాలకు.. 78934 56163, 86862 24466. -
భారత ఎన్నికల సంఘం రూపొందించిన సీ–విజిల్ యాప్ ఇదే!
మెదక్: ఎన్నికల్లో అవినీతికి చెక్ పెట్టడానికి ఎన్నికల సంఘం ఓటర్లకు ఒక బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేసింది. అదే సీ–విజిల్ యాప్. ఇది ఎన్నికల్లో జరిగే అక్రమాలను అడ్డుకట్ట వేసే బ్రహ్మాస్త్రంగా చెబుతున్నారు. అభ్యుర్థులు డబ్బు, మద్యం, ఇత ర వస్తువులను ఓటర్లకు ఎరగా చూపి అడ్డదారిలో గెలుపొందేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి అవినీతి నాయకుల అంతు చూసేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఇలా పనిచేస్తుంది.. నాయకులు ఓటర్లకు డబ్బు, మద్యం లేదా ఇతర వస్తువు రూపంలో ఇచ్చే క్రమంలో ఫొటోలు, వీడియోలు తీసి ఘటనా స్థలం నుంచి సీ–విజిల్ యాప్‌లో అప్లోడ్ చేయాలి. వెంటనే ఆ దృశ్యాలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌కి చేరతాయి. వెంటనే అధికారులు అప్రమత్తమై అక్కడి చేరుకుంటారు. ఆయా నాయకులపై చర్యలు తీసుకుంటారు. ఈ యాప్ ద్వారా అందే సమాచారం బలమైన సాక్ష్యంగా పనిచేస్తుంది. అవసరమైతే ఆయా అభ్యర్థుల సభ్యత్వాన్ని రద్దు చేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఫొటోలు, లేదా వీడియోలు పంపిన వెంటనే ఫిర్యాదు దారులు ఏ లోకేషన్ నుంచి వాటిని పంపారనేది అధికారులకు స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే చర్యలు తీసుకునేందుకు వీలుంటుంది. ఎన్నికల సంఘం నియామవళి ప్రకారం ఫిర్యాదు దారుల వివరాలను గోప్యంగా ఉంచుతారు. పోలీస్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం.. ఈ సీ–విజిల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులు, సమాచారం ఎన్నికల అధికారులతో పాటు నేరుగా పోలీస్ కంట్రోల్ రూంకు కూడా అందుతుంది. ఫ్లయింగ్ స్క్వాడ్లు, సర్వైలెన్స్ కమిటీలు, రిజర్వ్ టీములు అప్రమత్తం అవుతాయి. వెంటనే లోకేషన్‌కు వెళ్లి బాధ్యులపై చర్యలు తీసుకుంటారు. అంతేకాదు అవినీతికి పాల్పడిన అభ్యర్థులపై ఏ విధమైన చర్యలు తీసుకున్నారనే సమాచారాన్ని సైతం ఫిర్యాదు చేసిన వారికి 100 నిమిషాల్లో యాప్‌ద్వారా తెలియజేస్తారు. నిజాయితీ పరులకు నేస్తం.. సభలు, సమావేశాల్లో ఎవరైనా కోడ్‌ను ఉల్లంఘించే విధంగా ప్రసంగించినా, ఏ అక్రమాలకు పాల్పడినా వెంటనే రికార్డు చేసి అన్యా యాన్ని అడ్డుకోడానికి సీ– విజిల్ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ యాప్‌ను ఎన్నికల సంఘం 2018లోనే అందుబాటులోకి తెచ్చింది. తప్పుడు సమాచారం స్వీకరించదు.. ఈ సీ–విజిల్ యాప్‌ను తప్పుదోవ పట్టించే వీలులేదు. ఈ యాప్‌ను ఘటన జరిగిన స్థలం నుంచే వినియోగించాలి. మరో చోటుకు వెళ్లి తీసిన ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేయడం సాధ్యం కాదు. అలాగే పాత ఫొటోలతో ఎదుటి వారిపై పిర్యాదు చేసినా తీసుకోదు. -
IGNOU: అత్యున్నత ఓపెన్ వర్సిటీ
ప్రపంచంలోని అతిపెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయంగా పేరు గాంచిన ‘ఇందిరా గాంధి నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ’ (ఇగ్నో) సమాజంలోని వెనుకబడిన వర్గాలకు దూర విద్య ద్వారా ఉన్నత విద్యా అవకాశాలను అందిస్తోంది. భారతదేశంలో సార్వత్రిక దూర విద్యను ప్రోత్సహించటం, సమ న్వయం చేయడం, మంచి ప్రమాణాలను నెల కొల్పడం, ఉన్నత దూర విద్య ద్వారా భారత దేశ మానవ వనరులను బలోపేతం చేయడం, బోధన – పరిశోధనలతో పాటు... విస్తరణ, శిక్షణ ప్రధాన లక్ష్యాలుగా ఇగ్నో పని చేస్తోంది. భారత మొదటి మహిళా ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పేరు మీద ఆమె జన్మదినం నవంబర్ 19న 1985లో నెలకొల్పిన ఈ యూనివర్సిటీ... ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు సేవలు అంది స్తోంది. భారతదేశంలో ఉన్నత విద్యలో చేరిన మొత్తం విద్యార్థులలో సుమారు ఇరవై శాతం మంది ఇగ్నోలో ప్రవేశాలు పొందినవారే. 226కు పైగా అకాడెమిక్ ప్రోగ్రాంలు, మరికొన్ని ఆన్ లైన్ ప్రోగ్రాములే కాకుండా ‘స్వయం’ మూక్స్ ద్వారా కూడా విద్యను అందిస్తోంది ఇగ్నో. భారత దేశ దూర విద్యా పితామహుడు ప్రొఫెసర్ జి. రామ్ రెడ్డి ఇగ్నో మొదటి ఉపకులపతిగా సేవలు అందిచటం మన తెలుగువారికి గర్వకారణం. మన దేశంలో ఏ సార్వత్రిక విశ్వవిద్యాలయానికీ లేని ప్రత్యేకతలు ఇగ్నోకు మాత్రమే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు వివిధ సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీలకు (ఎంపిక చేసిన) సంబంధిచిన ట్యూషన్ ఫీజులు పూర్తిగా మినహాయింపు ఇస్తూ... మామూలు రెగ్యులర్ విద్యా లయాల్లో చేరి చదువుకోలేని లక్షలాదిమంది బడుగు, బలహీన, పేద విద్యార్థులకు ఇగ్నో ఉదారంగా విద్యనందిస్తోంది. స్కిల్ డెవలప్మెంట్, ఉపాధిని కలిపించే వివిధ సాంకేతిక, ప్రొఫెషనల్ ప్రోగ్రాములను అభ్యసించిన ఇగ్నో విద్యార్థులు దేశ, విదేశాల్లో ఉద్యోగాలు పొందు తున్నారు. ఢిల్లీలోని మెయిన్ క్యాంపస్‌లోనే కాక... వివిధ రాష్ట్రాల్లో ఉన్న రీజినల్ క్యాంపస్సుల్లో కూడా ఇంటర్వ్యూలు నిర్వహించి, అనేక కంపెనీలు ఇగ్నో విద్యార్థులను రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఈ విధంగా రెగ్యులర్ యూనివర్సిటీలకు ఏమాత్రం తీసిపోకుండా... కొన్నిసార్లు వాటికన్నా మిన్నగా విద్యా, ఉపాధి అవకాశాలను అందిస్తోంది ఇగ్నో. మార్చి 2022 లో వెబ్మెట్రిక్ ప్రమాణాల ర్యాంకింగ్‌లో ఇగ్నో 247వ స్థానంలో నిలిచి తన సత్తా చాటడం ముదావహం. (క్లిక్ చేయండి: ‘కోటా’ను కాపాడుకోవడం ఎలా?) - డాక్టర్ శ్రవణ్ కుమార్ కందగట్ల అకడమిక్ కౌన్సిలర్, ఇగ్నో (నవంబర్ 19న ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఆవిర్భావ దినం) -
అతివలకు అండగా 181
సాక్షి, నెహ్రూనగర్/గుంటూరు: మహిళల సమస్యల పరిష్కారం కోసం 13 జిల్లాల్లోని జిల్లా కేంద్రాల్లో ప్రత్యేకంగా సఖీ (వన్ స్టాప్ సెంటర్) కేంద్రాలు కొనసాగుతున్నాయి. 2016 సెప్టెంబర్ నుంచి మహిళలకు ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. పోలీసు, వైద్య, న్యాయ, మహిళా శిశు సంక్షేమ విభాగాలతో పాటు ఇతర స్వచ్ఛంద సంస్థలతో అనుసంధానమై 181 కాల్ సెంటర్ పనిచేస్తుంది. కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేసే మహిళల వివరాలు ఇక్కడ గోప్యంగా ఉంచుతారు. మహిళలు ఫిర్యాదు చేసే అంశాలు లైంగిక వేధింపులు, గృహ హింస, బాల్య వివాహాలు, వరకట్న వేధింపులు, అక్రమ సంబంధాలు, ఈవ్‌టీజింగ్, బెదిరింపులు, మహిళల అక్రమ రవాణా, సెల్‌ఫోన్ ద్వారా జరిపే నేరాలు, సోషల్ వెబ్సైట్ల ద్వారా జరిపే నేరాలు, మాదకద్రవ్యాలకు లోనై హింసించడం, ఇంటి నుంచి గెంటేయడం, పనిచేసే ప్రదేశంలో మహిళలపై వేధింపులు, తల్లిదండ్రుల నిర్లక్ష్యం తదితర ఫిర్యాదులపై మహిళలు నిర్భయంగా 181కు కాల్ చేయవచ్చు. ఫిర్యాదు తీవ్రతను బట్టి సఖీ కేంద్రంలో సోషల్ కౌన్సెలర్, లీగల్ కౌన్సెలర్లు కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అవసరం అయితే పోలీసుల సహాయం కూడా తీసుకుంటారు. మొత్తం 3,245 ఫిర్యాదులు గుంటూరు నగరంలో 2016 సెప్టెంబర్‌లో 181 కాల్ సెంటర్ ప్రారంభమైంది. ఏపీకి సంబంధించిన 13 జిల్లాల నుంచి వచ్చే ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ప్రారంభం నుంచి 2019 సెప్టెంబర్ వరకు 181కు 3,245 ఫిర్యాదులు అందాయి. వాటిలో సఖీ కేంద్రం ద్వారా పరిష్కరించిన కేసులు 2,304 అని అధికారులు చెబుతున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మహిళను తన భర్త అనుమానంతో రోజు తాగి కొడుతుండటంతో చేసేదేమి లేక సదరు మహిళ 181కి కాల్ చేసింది. అక్కడ సిబ్బంది సఖీ కేంద్రానికి వారిని తీసుకువచ్చి కౌన్సెలింగ్ ఇవ్వడంతో వారి కాపురం సజావుగా సాగుతోంది. గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు ప్రేమికులు కులాంతర వివాహం చేసుకున్నారు. పెళ్లయిన రెండు నెలలు కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత నుంచి కట్నం కోసం ఆ మహిళను అత్త, మామలతో కలిసి భర్త కూడా వేధించడంతో సదరు మహిళ 181 కాల్ సెంటర్ కాల్ చేసి సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లింది. కాల్ సెంటర్ సిబ్బంది సమస్యను సఖీ కేంద్ర దృష్టికి తీసుకెళ్లగా అక్కడ అత్త, మామ, భర్తకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో ప్రస్తుతం కాపురంలో కలతలు తొలగిపోయాయి. విజయవాడలో ఓ తల్లిని ఓ సుపుత్రుడు నిత్యం తాగి కోడుతూ, తిడుతూ ఉండగా ఓపిక నశించి ఆ తల్లి 181కు కాల్ చేసింది. అక్కడి సిబ్బంది విజయవాడ పోలీసులకు సమాచారం అందించి.. అతడికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు డీ–అడిక్షన్ సెంటర్ ద్వారా తాగుడు మాన్పించేందుకు మందులు వాడారు. ప్రస్తుతం ఆ యువకుడు తాగుడు మానేసి ఉద్యోగం చేసుకుంటూ తల్లిని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చు మహిళలకు ఏ సమస్య వచ్చినా నిర్భయంగా 181కు 24/7 కాల్ చేయవచ్చు. కాల్ చేసేవారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. ఆపదలో ఉన్న మహిళలు, చెప్పుకోలేని సమస్యలు ఉన్న మహిళలు 181కి ఏ సంకోచం లేకుండా కాల్ చేసి సమస్యలకు పరిష్కారం పొందవచ్చు. – సుధారాణి, కాల్ సెంటర్ సూపర్వైజర్ -
సిరిసిల్లలో జేఎన్టీయూ ఏర్పాటు
సాక్షి, సిరిసిల్ల: జిల్లాలో జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదిస్తామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య టి.పాపిరెడ్డి అన్నారు. సిరిసిల్ల పట్టణ శివారులోని పెద్దూరు, సర్దాపూర్, వెంకటాపూర్ శివారుల్లో 88 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి బృందం బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. అనంతరం సిరిసిల్ల కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాపిరెడ్డి మాట్లాడారు. కళాశాల స్థాపనకు అన్ని విధాలా అనుకూలమైన పరిస్థితులున్నాయని వివరించారు. పట్టణానికి అతి సమీపంలో స్థలం ఎంపిక చేయడం బాగుందని, సిరిసిల్లలో ఏర్పాటు చేయడం వల్ల సిద్ధిపేట, కామారెడ్డి, అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో విద్యార్థులకు అనువుగా ఉంటుందని పేర్కొన్నారు. రెండేళ్లలో సిరిసిల్లకు రైల్వే లైన్ రానున్న నేపథ్యంలో రవాణా పరంగా ఇబ్బందులుండవని పేర్కొన్నారు. ఏర్పాటుకు సానుకూల నివేదిక అందిస్తామని స్పష్టం చేశారు. సిరిసిల్లలో సాధ్యమైనంత త్వరలో మోడల్ జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. జాయింట్ కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా మాట్లాడుతూ ఎమ్మెల్యే తారకరామారావు ప్రత్యేక చొరవతో జేఎన్టీయూ కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కమిటీ సభ్యులు, రాష్ట్ర విద్య మండలి వైస్‌చైర్మన్ ఆచార్య వి.వెంకటరమణ, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఈ. సాయిబాబారెడ్డి, ఓయూ ఇంజినీరింగ్ కళాశాల వైస్‌ప్రిన్సిపాల్ ఆచార్య ఎ.కృష్ణయ్య, డీఆర్వో ఎన్.ఖీమ్యానాయక్, ఆర్డీవో టి.శ్రీనివాస్‌రావు, జిల్లా సర్వేయర్ శ్రీనివాస్, తహసీల్దార్ అంజన్న పాల్గొన్నారు. -
కేంద్రంపై తమిళనాడు కన్నెర్ర
సాక్షి ప్రతినిధి, చెన్నై: సుప్రీంకోర్టు తీర్పుననుసరించి కావేరీ నదీజలాల మేనేజ్మెంట్ బోర్డును వెంటనే ఏర్పాటుచేయాలన్న డిమాండ్లు తమిళనాడులో వెల్లువెత్తాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, ప్రధాని దిష్టిబొమ్మల దహనంతో తమిళనాడు ప్రజలు కేంద్రంపై తమ ఆగ్రహాన్ని చూపించారు. అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీల ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు మార్చి 30న ముగిసినా కేంద్రం స్పందించకపోవడంతో అన్నాడీఎంకే, ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు ఆందోళనబాట పట్టాయి. చెన్నై, తిరువయ్యూరు, మదురై సహా తమిళనాడువ్యాప్తంగా 600 చోట్ల రాస్తారోకోలు నిర్వహించారు. కోయంబత్తూరు, తిరుచిరాపల్లి, పడుకొట్టాయ్సహా చాలాచోట్ల రైల్‌రోకో చేపట్టారు. కోయంబత్తూరులో ఇద్దరు డీఎంకే కార్యకర్తలు కిరోసిన్ పోసుకుని ఆత్మాహుతికి ప్రయత్నించారు. తమిళనాడు విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూరు కోర్టు ప్రాంగణంలో లాయర్లు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో పోలీసులు దాదాపు 1,000 మందిని అదుపులోకి తీసుకుని గొడవలు సద్దుమణిగాక వదిలేశారు. మంగళవారం రాష్ట్రబంద్‌కు రైతు సంఘాలు, వాణిజ్య సంఘాలు పిలుపునిచ్చాయి. కాగా, డీఎంకే నేతృత్వంలోని విపక్షపార్టీలు ఏప్రిల్ 5న బంద్ నిర్వహించనున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ఒత్తిడి తేకుండా అన్నాడీఎంకే ప్రభుత్వం తమిళుల హక్కులను కాలరాస్తోందని డీఎంకే ఆరోపించింది. అన్నాడీఎంకే ఎంపీ రాజీనామా, ఉససంహరణ కావేరీ అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటులో కేంద్రం వైఖరిని వ్యతిరేకిస్తూ అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యులు ముత్తుకరుప్పన్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. అయితే, సీఎం పళనిస్వామి ఆదేశాలతో తన రాజీనామాను ముత్తుకరుప్పన్ ఉపసంహరించుకున్నారు. మరోవైపు, కావేరీ వాటర్ బోర్డు త్వరగా ఏర్పాటుచేయాలని కోరుతూ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. కావేరి అంశంపై మంగళవారం అన్నాడీఎంకే రాష్ట్రవ్యాప్త నిరాహారదీక్షలు చేపట్టనుంది. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం, మంత్రులు ఈ దీక్షల్లో పాల్గొననున్నారు. కోర్టు ధిక్కార కేసు వింటాం: సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించని కేంద్రంపై తమిళనాడు దాఖలు చేసిన కోర్టు ధిక్కార కేసును విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఏప్రిల్ 9న ఈ కేసు విచారణకు రానుంది. నిరసనల నేపథ్యంలో తమిళనాడు గవర్నర్ పురోహిత్ ఢిల్లీకి వెళ్లారు. -
బడ్జెట్ ఎక్కువగా మేలు చేసింది వీరికేనట..!
సాక్షి, న్యూఢిల్లీ: రూరల్ ఫ్రెండ్లీ బడ్జెట్‌గా ప్రభుత్వం ప్రకటించిన 2018 ఆర్థిక బడ్జెట్లో ఎఫ్ఎంసీజీ రంగానికే ఎక్కువ బూస్ట్ లభించిందని ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలపై దృష్టిపెట్టి, లాభపడుతున్న కన్జ్యూమర్, ఎఫ్ఎంసీజీ కంపెనీలు ప్రస్తుత బడ్జెట్‌తో మరింత భారీగా లాభపడనున్నాయి. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీలతో అసంఘటిత రంగం కుదేలవుతుండగా.. బడ్జెట్ ప్రోత్సాహకాలతో భారీ ఎఫ్ఎంసీజీ కంపెనీలు మరింత పుంజుకోనున్నాయి. అలాగే దిగుమతులపై సుంకం పెంచడం కూడా ఈ కంపెనీలకు లాభదాయకం. అంతేకాదు దిగుమతి సుంకం పెంపు స్థానిక కంపెనీలకు, ఉత్పత్తులకు ఊతమివ్వనుంది. తద్వారా ఉద్యోగ అవకాశాలు భారీగా పెరుగుతాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నారు. ప్రధాన కన్జ్యూమర్ డ్యూరబుల్ స్టోర్స్ అన్నీ పల్లెల్లోకి విస్తరించాయి. ఇప్పటికే గ్రామీణ మార్కెట్‌పై దిగ్గజ కంపెనీలు ఆకర్షణీయ ఉత్పత్తులను అందుబాటులోకి తేవడంతోపాటు, మంచి ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ వినియోగదారుడు లోకల్‌బ్రాండ్ కంటే నేషనల్ బ్రాండ్ వైపు మొగ్గుచూపుతారని భావిస్తున్నారు. దీనికి తోడు ప్రధానంగా 2022నాటికి రైతులు ఆదాయం రెట్టింపు చేసే లక్ష్యంతో ఉన్నామని ఆర్థికమంత్రి ప్రకటించారు. అలాగే పంటలకు కనీస మద్దతు ధర 150 శాతం పెరగనుందని వెల్లడించారు. దీంతో గ్రామీణుల వినిమయ శక్తిని ఇప్పటికే విస్తరించిన ఈ కంపెనీలు సొమ్ము చేసుకుంటాయని అంచనా. -
హోం శాఖ కింద రెండు కొత్త విభాగాలు
న్యూఢిల్లీ: ఉగ్రవాదంవైపు యువత ఆకర్షితులు కాకుండా చూసేందుకు, సైబర్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొత్తగా రెండు విభాగాలను ఏర్పాటు చేసింది. హోం శాఖ కింద పనిచేసే పలు విభాగాల్లో శుక్రవారం కొన్ని మార్పులు జరిగాయి. ఉగ్రవాదుల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన వ్యూహాలను రచించేందుకు సీటీసీఆర్ (కౌంటర్ టెర్రరిజం, కౌంటర్ ర్యాడికలైజేషన్)ను ఏర్పాటు చేశారు. ఆన్లైన్ మోసాలు, హ్యాకింగ్ వంటి సైబర్ సవాళ్లను ఎదుర్కొనేందుకు సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ (సీఐఎస్) కొత్తగా ఏర్పాటైంది. మరికొన్ని విభాగాలను ఒకదానిలో మరొకటి విలీనం చేశారు. ఇకపై హోం మంత్రిత్వ శాఖ కింద 18 విభాగాలు ఉంటాయి. -
యూపీలో సున్నీ, షియా వక్ఫ్‌బోర్డుల విలీనం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సున్నీ, షియా వక్ఫ్‌బోర్డులను విలీనం చేసి ముస్లిం వక్ఫ్‌బోర్డును ఏర్పాటు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. సున్నీ, షియా వక్ఫ్‌బోర్డులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయనీ, అందుకే త్వరలో ప్రభుత్వం వాటిని విలీనం చేసి కొత్త సంస్థను ఏర్పాటు చేయనుందని వక్ఫ్ శాఖ సహాయ మంత్రి మొహ్సిన్ రజా చెప్పారు. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందనీ, కొత్తగా ఏర్పడే బోర్డులో సున్నీ, షియా ఇరు వర్గాల వారు ఉంటారని మంత్రి వెల్లడించారు. రెండు బోర్డులను విలీనం చేయాలని ప్రభుత్వానికి అనేక వినతులు వచ్చిన తర్వాతనే దీనిపై ఆలోచిస్తున్నామని రజా పేర్కొన్నారు. -
సమాజహిత సాధకమే ఆధ్యాత్మికత
‘మనగుడి–మనసేవ’ కార్యవర్గ ప్రమాణ స్వీకారం రాజమహేంద్రవరం కల్చరల్ : ‘ఆధ్యాత్మికత అంటే మతం కాదు.. అత్యున్నతమైన నాగరికత, సమాజకల్యాణానికి ఉపకరించే దివ్యసాధన’మని కవి, గాయకుడు ఎర్రాప్రగడ రామకృష్ణ పేర్కొన్నారు. శ్రీమహాలక్షీ్మసమేత చిన్న వేంకన్నబాబు స్వామివారి పీఠం, సర్వేజనాస్సుఖినోభవంతు ఛారిటబుల్ ట్రస్టుల అనుబంధ సంస్థ ‘మన గుడి–మన సేవ’ నూతన రాష్ట్ర కార్యవర్గసభ్యులతో ఎర్రాప్రగడ ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలికే ప్రతి పలుకూ ప్రార్థన, వేసే ప్రతి అడుగూ తీర్థయాత్ర కావాలన్నారు. పీఠాధిపతి చిన్న వేంకన్నబాబు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కార్యవర్గసభ్యులు అంకితభావంతో సేవలందించాలని కోరారు. పీఠాధిపతి చిన్న వేంకన్నబాబు మాట్లాడుతూ పీఠం ద్వారా వచ్చిన పదవులను బరువుబాధ్యతలుగా కాక భగవంతునితో బంధంగా భావించాలని పిలుపునిచ్చారు. సమాజంలో అశాంతిని దూరం చేసే శక్తి ఆధ్యాత్మికానికే ఉందన్నారు. ఈ ఏడాది దశావతార గోవింద దీక్షలు, గోవిందమాలధారణలు, ద్వారకాతిరుమలకు పాదయాత్రలు, అఖండ నారాయణహరి ఓం మంత్రపారాయణలు భారీస్ధాయిలో నిర్వహిస్తామన్నారు. సామాన్యుని ముంగిటకు ఆధ్యాత్మికవేత్తలు తరలిరావాలని కోరారు. వివిధ జిల్లాలనుంచి తరలి వచ్చిన 20 మంది కార్యవర్గసభ్యులు, అయిదుగురు గౌరవ సలహాదారులు, ఎనిమిదిమంది మహిళావిభాగం సభ్యులు, 11 మంది సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. చైర్పర్స¯ŒSగా ప్రమాణస్వీకారం చేసిన దుర్గావేంకట హేమావతి మాట్లాడుతూ ఆధ్యాత్మికత ఇంటి నుంచే ప్రారంభం కావాలని కోరారు. నూతన ఆంగ్ల సంవత్సరాన్ని కాలపురుషుడు చూపుతున్న మేలి మలుపుగా భావించాలన్నారు. -
ఆదివాసీ జిల్లాను ఏర్పాటు చేయాలి
ఖిలా వరంగల్ : ఏటూరునాగారం కేంద్రంగా ఆదివాసీ స్వయంపాలిత జిల్లాను ఏర్పాటు చేయాలని ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి గాదగోని రవి డిమాండ్ చేశారు. వరంగల్ అండర్ బ్రిడ్జి వద్ద గల ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏటూరునాగారం, తాడ్వాయి, గోవిందరావుపేట, వెంకటాపురం, ములుగు కొత్తగూడ, గూడూరు, ఖానాపురం, నల్లబెల్లి, భూపాలపల్లి, గణపురం, మహాముత్తారం మహదేవ్పూర్ ప్రాంతాలను కలిపి ఆదివాసీ జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు గాదె ప్రభాకర్‌రెడ్డి, సీసీఐ నాయకులు మేకల రవి, కత్తి నాగార్జున, న్యూడెమోక్రసీ నాయకులు పసునూటి రాజు, ఆరెల్లి కృష్ణ, ఎంసీపీఐ(యూ) నేతలు గోనె కుమారస్వామి, హంసారెడ్డి, నాగెల్లి కొముర య్య, రవి, రాజమౌళి, మల్లికార్జున్, రవీందర్, బాబురావు పాల్గొన్నారు. -
‘ఏజెన్సీ’ జిల్లా ఏర్పాటు చేయాలి
ఆదివాసీ ఐకాస చైర్మన్ చందా లింగయ్య దొర గిరిజనుల రౌండ్ టేబుల్ సమావేశం జూలూరుపాడు : జిల్లాలోని 24 ఏజెన్సీ మండలాలతో కూడిన భద్రాద్రి(కొత్తగూడెం) జిల్లా ఏర్పాటు చేయాలని ఆదివాసీ ఐక్య కార్యాచరణ సమితి(ఐకాస) చైర్మన్ చందా లింగయ్య దొర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో గిరిజనుల రౌండ్ టేబుల్ సమావేశం శనివారం జరిగింది. ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ఏన్కూరు, జూలూరుపాడు, సింగరేణి(కారేపల్లి), గార్ల, బయ్యారం, పెనుబల్లి ఏజెన్సీ మండలాలతోపాటు పాక్షిక గ్రామాలను కలుపుతూ కొత్తగూడెం కేంద్రంగా భద్రాద్రి జిల్లాను ఏర్పాటు చేయాలన్నారు. ప్రజాభిప్రాయం మేరకు జిల్లాను ఏర్పాటు చేయాలని కోరారు. ఏజెన్సీలోని ఖనిజ, నిధి నిక్షేపాలను, ఆదివాసీ ప్రత్యేక బడ్జెట్‌ను మైదాన ప్రాంతాల అభివృద్ధికి పాలకులు వినియోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. సమావేశంలో ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు పొడుగు శ్రీనివాస్, సోది వీరయ్య, జార ఆదినారాయణ, ఆరెం రామయ్య, వాసం రామకృష్ణ దొర, ఈసాల సురేష్, గుగులోతు ధర్మా, బాబురావు, దారావతు కాన్షీరాం, సర్పంచ్‌లు లకావత్ గిరిబాబు, ఈసాల వెంకటేశ్వర్లు, కట్రం మోహన్‌రావు, పాయం వెంకటరమణ, వైస్ ఎంపీపీ కొడెం సీతాకుమారి, జూలూరుపాడు, ఏన్కూరు మండలాల ఏఎస్పీ అధ్యక్షుడు ఈసం నరసింహ, పూసం సుధీర్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలి
హన్మకొండ : జిల్లాలో సైనిక స్కూల్ ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్లఅశోక్‌రెడ్డి, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి కోరారు. గురువారం ఢిల్లీలో ఈ మేరకు రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌ను కలిసి వినతిపత్రం అందించి, జిల్లాలో సైనిక్ స్కూల్ ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరం వరంగల్ అని, ఇక్కడ సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు అశోక్‌రెడ్డి తెలిపారు. పార్టీ నాయకుడు చదువు రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
ఘనంగా టీజీవీపీ ఆవిర్భావ దినోత్సవం
కోదాడఅర్బన్: తెలంగాణ విద్యార్థి పరిషత్(టీజీవీపీ) 5వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం పట్టణంలో ఆ సంఘం నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని లక్ష్య కళాశాలలో జరిగిన కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నావత్ వంశీ సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన తమ సంఘం ఇప్పుడు బంగారు తెలంగాణ సాధనకు కృషి చేస్తుందన్నారు. ఆగష్టు 6న∙లక్ష మొక్కలు నాటుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయిభార్గవ్, సాల్మన్, ప్రసాద్, రమేష్, రవి, నితిన్, గోపినా«ద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు 40 మంది భారత ఖైదీల విడుదల
కరాచీ: భారత్, పాకిస్తాన్ల మధ్య సత్సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఈ దిశగా మరో ముందడుగు పడింది. ఇరు దేశాల ప్రధానమంత్రుల కరచాలనం.. పలువురు ఖైదీలకు విముక్తిని ప్రసాదించింది. కరాచీ జైలు నుంచి 40 మంది భారత ఖైదీలను విడుదల చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వం శుక్రవారం నిర్ణయించింది. ఖైదీలను శనివారం వాఘా సరిహద్దు వద్ద భారత్‌కు అప్పగిస్తామని ప్రకటించింది.