న్యూఢిల్లీ: ఉగ్రవాదంవైపు యువత ఆకర్షితులు కాకుండా చూసేందుకు, సైబర్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొత్తగా రెండు విభాగాలను ఏర్పాటు చేసింది. హోం శాఖ కింద పనిచేసే పలు విభాగాల్లో శుక్రవారం కొన్ని మార్పులు జరిగాయి. ఉగ్రవాదుల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన వ్యూహాలను రచించేందుకు సీటీసీఆర్ (కౌంటర్ టెర్రరిజం, కౌంటర్ ర్యాడికలైజేషన్)ను ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్ మోసాలు, హ్యాకింగ్ వంటి సైబర్ సవాళ్లను ఎదుర్కొనేందుకు సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ (సీఐఎస్) కొత్తగా ఏర్పాటైంది. మరికొన్ని విభాగాలను ఒకదానిలో మరొకటి విలీనం చేశారు. ఇకపై హోం మంత్రిత్వ శాఖ కింద 18 విభాగాలు ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment