సాక్షి, న్యూఢిల్లీ: రూరల్ ఫ్రెండ్లీ బడ్జెట్‌గా ప్రభుత్వం ప్రకటించిన 2018 ఆర్థిక బడ్జెట్‌లో ఎఫ్‌ఎంసీజీ రంగానికే ఎక్కువ బూస్ట్ లభించిందని ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలపై దృష్టిపెట్టి, లాభపడుతున్న కన్జ్యూమర్, ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు ప్రస్తుత బడ్జెట్‌తో మరింత భారీగా లాభపడనున్నాయి. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీలతో అసంఘటిత రంగం కుదేలవుతుండగా.. బడ్జెట్ ప్రోత్సాహకాలతో భారీ ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు మరింత పుంజుకోనున్నాయి. అలాగే దిగుమతులపై సుంకం పెంచడం కూడా ఈ కంపెనీలకు లాభదాయకం. అంతేకాదు దిగుమతి సుంకం పెంపు స్థానిక కంపెనీలకు, ఉత్పత్తులకు ఊతమివ్వనుంది. తద్వారా ఉద్యోగ అవకాశాలు భారీగా పెరుగుతాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నారు.
ప్రధాన కన్జ్యూమర్ డ్యూరబుల్ స్టోర్స్ అన్నీ పల్లెల్లోకి విస్తరించాయి. ఇప్పటికే గ్రామీణ మార్కెట్‌పై దిగ్గజ కంపెనీలు ఆకర్షణీయ ఉత్పత్తులను అందుబాటులోకి తేవడంతోపాటు, మంచి ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ వినియోగదారుడు లోకల్‌బ్రాండ్ కంటే నేషనల్ బ్రాండ్ వైపు మొగ్గుచూపుతారని భావిస్తున్నారు. దీనికి తోడు ప్రధానంగా 2022నాటికి రైతులు ఆదాయం రెట్టింపు చేసే లక్ష్యంతో ఉన్నామని ఆర్థికమంత్రి ప్రకటించారు. అలాగే పంటలకు కనీస మద్దతు ధర 150 శాతం పెరగనుందని వెల్లడించారు. దీంతో గ్రామీణుల వినిమయ శక్తిని ఇప్పటికే విస్తరించిన ఈ కంపెనీలు సొమ్ము చేసుకుంటాయని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment