beneficiaries
-
అనుమతి లేకుండా యాంజియోప్లాస్టీ.. ఇద్దరు మృతి
అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోరం చోటుచేసుకుంది. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుని నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు మృతి చెందారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఆ వైద్యుడు అనుమతి లేకుండా ఏడుగురు బాధితులకు యాంజియోప్లాస్టీ నిర్వహించాడు. వీరిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ఐదుగురు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.మీడియాకు అందిన వివరాల ప్రకారం నవంబర్ 10న గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో ఒక ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించింది. దీనికి 19 మంది బాధితులు హాజరయ్యారు. వీరిలో 17 మంది రోగులకు వైద్యులు యాంజియోగ్రఫీ చేశారు. ఏడుగురికి యాంజియోప్లాస్టీ చేశారు. ఈ విషయాన్ని బాధితుల కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయలేదు. చికిత్స అనంతరం బాధితుల ఆరోగ్యం దిగజారింది. ఈ నేపధ్యంలో మహేశ్ గిర్ధర్ భాయ్ బరోట్, నగర్ సేన్మా అనే బాధితులు మృతిచెందారు.విషయం తెలుసుకున్న బాధితుల గ్రామస్తులు ఆస్పత్రిని ధ్వంసం చేశారు. ఘటన అనంతరం ఆస్పత్రి యాజమాన్యం పరారయ్యింది. ఆసుపత్రి డైరెక్టర్, చైర్మన్ కూడా పరారయ్యారని సమాచారం. కాగా ఆయుష్మాన్ భారత్-ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (పీఎంజేఏవై) సొమ్మును దక్కించుకునేందుకు ఈ ప్రైవేట్ ఆసుపత్రి.. బాధితుల అంగీకారం తీసుకోకుండా ఈ విధంగా వ్యవహరిస్తున్నదని బాధిత కుటుంబ సభ్యుల ఆరోపిస్తున్నారు.ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన గుజరాత్ మెడికల్ కౌన్సిల్ అహ్మదాబాద్‌లోని ఖ్యాతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి నోటీసులు పంపింది. ఈ ఘటనపై ఆస్పత్రి సీఈవో సహా ఐదుగురి నుంచి జీఎంసీ సమాధానాలు కోరింది. యాంజియోగ్రఫీ, యాంజియోప్లాస్టీ గురించి బాధిత కుటుంబ సభ్యులకు ఎందుకు తెలియజేయలేదని కోరింది. మరోవైపు ఈ ఘటనపై గుజరాత్ ప్రభుత్వానికి చెందిన పీఎంజేఏవై ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది.ఈ పథకం కింద ఆసుపత్రికి అందాల్సిన అన్ని బకాయి చెల్లింపులను నిలిపివేసింది. కాగా గుండె సంబంధిత కరోనరీ ఆర్టరీ వ్యాధికి చికిత్సలో భాగంగా యాంజియోప్లాస్టీ చేస్తారు. ఈ వ్యాధి గుండె కండరాలకు రక్త ప్రవాహాన్ని మందగింపజేస్తుంది. ఫలితంగా రక్త నాళాలు కుచించుకుపోతాయి. ఈ చికిత్సతో కుచించుకుపోయిన ధమనులు లేదా సిరలను విస్తరించేలా చేస్తారు. ఫలితంగా కరోనరీ ధమనులకు రక్త ప్రవాహ పునరుద్ధరణ సవ్యంగా జరుగుతుంది.ఇది కూడా చదవండి: ఘనంగా శంకర నేత్రాలయ మ్యూజికల్ కాన్సర్ట్ -
‘మూసీ’ ప్రక్షాళన.. నిర్వాసితుల తరలింపు (ఫోటోలు)
-
AP: ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అంతరాయం కలిగిస్తే ఆసుపత్రులపై చర్యలు
సాక్షి, విజయవాడ: ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అంతరాయం కలిగిస్తే ఆ ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ సేవలు బ్రేక్ కాకుండా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ‘‘పెండింగ్ నిధులపై పట్టుబడుతూ ఆరోగ్యశ్రీ సేవలకు కొన్ని చోట్ల నెట్ వర్క్ ఆసుపత్రులు బ్రేక్ వేశాయి. 2023-24లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి 3,566.22 కోట్లు నెట్ వర్క్ ఆసుపత్రులకు జమ చేశాం. గతంలోని హామీ ప్రకారం ఇప్పటికే 203 కోట్లు విడుదల చేశాం. 2024-25 మొదటి రెండు నెలల్లో ఇప్పటివరకు రూ.366 కోట్లు విడుదల చేశాం. గత ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ ద్వారా 42.91 లక్షల మందికి వైద్యసేవలు అందించాం ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 13,471 కోట్లు ఖర్చు చేశాం.. మిగిలిన బకాయిలు త్వరలోనే విడుదల చేస్తాం’’ అని ట్రస్ట్ సీఈవో లక్ష్మీషా వెల్లడించారు. -
డీబీటీ లబ్ధిదారులతో టీడీపీ ముఠా చెలగాటం
సాక్షి, విజయవాడ: డీబీటీ లబ్ధిదారులతో టీడీపీ ముఠా చెలగాటమాడుతోంది. లబ్ధిదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయనీయకుండా ఈసీపై ఒత్తిళ్లు చేస్తోంది. ఈసీ ఉత్తర్వులను ఇవాళ్టి వరుకూ నిలుపుదల చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. నిన్న అర్థరాత్రి హైకోర్టు తీర్పు ఉత్తర్వులు అందుబాటులోకి వచ్చాయి.హైకోర్టు తీర్పు కాపీతో ఈసీని అధికారులు సంప్రదించారు. క్లారిఫికేషన్ కోసం ఈసీని అధికారులు కోరగా, ఇప్పటివరకూ ఈసీ ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు. ఎన్నికల సంఘం పరిధిలో పనిచేస్తున్నందున ఎన్నికల కమిషన్ క్లారిఫికేషన్ ఇస్తే తప్ప ముందుకు వెళ్లలేమని అధికారులు అంటున్నారు. ఈసీ క్లారిఫికేషన్ ఆలస్యమైతే హైకోర్టు ఇచ్చిన గడువు ముగిపోతోందని లబ్ధిదారుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.హైకోర్టు ఉత్తర్వులను అడ్డుకునేందుకు మరో వైపు కోర్టులో టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. నవతరం పార్టీ తరఫున పరోక్షంగా కోర్టులో టీడీపీ అప్పీల్ వేసింది. తమకు ఫిర్యాదులు వచ్చినందునే పథకాలను నిలిపేశామని ఈసీ పేర్కొనగా, దీంతో టీడీపీ బాగోతం బయటపడింది. -
డీబీటీ పథకాలను ఈసీ అడ్డుకోవడంపై హైకోర్టును ఆశ్రయించిన లబ్ధిదారులు
సాక్షి, విజయవాడ: పేదలన్నా.. సంక్షేమ పథకాలన్నా టీడీపీ అధినేత చంద్రబాబుకి ఎందుకంత కడుపుమంటో అర్థం కావడం లేదు. మొన్నటికి మొన్న వాలంటీర్లను అడ్డుకుని అవ్వాతాతల ప్రాణాలతో చెలగాటం ఆడిన చంద్రబాబు.. ఇప్పుడు అక్కచెల్లెమ్మలు, విద్యార్థులు, రైతులకి సాయం అందకుండా వారి జీవితాలతో ఆడుకునే కుట్రకు తెరలేపాడు. అమల్లో ఉన్న సంక్షేమ పథకాలైన వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ ఈబీసీ నేస్తం, రైతులకి ఇన్పుట్ సబ్సిడీ, జగనన్న విద్యా దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అడ్డుకుంటూ, లబ్దిదారులకు డబ్బులు చేరకుండా చంద్రబాబు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. దీంతో ఏపీలో ప్రభుత్వ పథకాల నిధుల విడుదలకు ఈసీ అనుమతి నిరాకరించింది.తాజాగా ఇప్పటి వరకు కొనసాగుతున్న డీబీటీ పథకాలను ఈసీ అడ్డుకోవడంపై లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు. విద్యాదీవెన, ఇన్పుట్ సబ్సిడీ నిధులను అడ్డుకోవడంపై విద్యార్ధులు, రైతులు హైకోర్టును ఆశ్రయించారు. చేయూత నిధుల విడుదలను ఈసీ నిరాకరించడంపై హైకోర్టులో మహిళా సంఘం సభ్యులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిని లంచ్ మోషన్ కింద హైకోర్టు విచారించనుంది. -
ఒకే రోజు 25,000 ఇళ్ల పట్టాలు..
-
నిరుపేదలకు తీరిన సొంతింటి కల
-
వచ్చే ఎన్నికల్లోనూ ఫ్యాన్ ప్రభంజనమే అంటున్న లబ్ధిదారులు
-
మా జీవితాలు మారాయి..మళ్లీ జగనన్నకే మా ఓటు
-
అక్కచెల్లెమ్మలకు ఆస్తి ఇవ్వగలిగాం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: 12.77 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు పావలావడ్డీ రుణాలు ఇప్పించామని, ఈ దఫాలో 4.07 లక్షల మందికి వడ్డీ రియింబర్స్ కింద రూ.46.9 కోట్లు ఇవాళ విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈకార్యక్రమం జరుగుతుంది. గతంలో సుమారు ఐదు లక్షలకు పైబడి అక్క చెల్లెమ్మలకు రూ.50 కోట్ల పైబడి ఇచ్చాం. రూ.35వేల రుణాలను పావలా వడ్డీకే ఇస్తున్నాం. దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా 31,19,000 ఇళ్ల స్థలాలు అక్క చెల్లెమ్మలకు ఇచ్చాం. అందులో ఇప్పటికే 22లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఒక్కో ఇంటికి 2.7 లక్షలు ఖర్చు అవుతుంది. మౌలిక సదుపాయాలకు మరో రూ.1 లక్ష ఖర్చు అవుతోంది. ఇళ్ల నిర్మాణంకోసం ఉచితంగా ఇసుక ఇస్తున్నాం’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘సిమెంటు, స్టీల్, మెటల్ ఫ్రేంలు తదితర ఇంటి సామగ్రి మీద కనీసంగా రూ.40వేలు మంచి జరిగేలా చూస్తున్నాం. ఒక్కో ఇంటి స్థలం విలువ జిల్లాను బట్టి, ప్రాంతాన్ని బట్టి రూ.2.5లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ ఉంది. అన్ని కలుపుకుంటే దాదాపు ప్రతి అక్క చెల్లెమ్మకు రూ.5 -20 లక్షల వరకూ ఒక ఆస్తిని అక్కచెల్లెమ్మలకు ఇవ్వగలిగాం. ఈ అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కేవలం పావలా వడ్డీకే రూ.35వేల చొప్పున రుణాలు ఇప్పిస్తున్నాం. ఈ మంచి కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం’’ అని సీఎం జగన్ తెలిపారు. కాగా, రాష్ట్రంలో ఇళ్లు లేని పేదింటి అక్కచెల్లెమ్మలకు తోబుట్టువుగా వారి సొంతింటి కలను సీఎం జగన్ సాకారం చేస్తున్నారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రికార్డు స్థాయిలో నివేశన స్థలాలను పంపిణీ చేయడంతోపాటు ఇళ్లను మంజూరు చేశారు. ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం చేయడంతో పాటు రాయితీపై సామగ్రి అందిస్తున్నారు. ఇళ్ల లబ్ధిదారులు బ్యాంకు నుంచి పొందిన రుణాలకు వడ్డీని కూడా రీయింబర్స్మెంట్ చేయనున్నారు. తొలి విడత లబ్ధిదారులకు వడ్డీని రీయింబర్స్మెంట్ చేశారు. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 71,811.50 ఎకరాల విస్తీర్ణంలో 31లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మల పేరిట పంపిణీ చేశారు. ఇంటి నిర్మాణానికి యూనిట్‌కు రూ.1.80 లక్షలు చొప్పున ఇవ్వడమే కాకుండా, ఉచితంగా ఇసుక సరఫరా ద్వారా రూ.15 వేలు, సిమెంట్, స్టీలు, మెటల్ ఫ్రేమ్స్, ఇతర నిర్మాణ సామగ్రిని తక్కువ ధరకే అందించడంతో మరో రూ.40 వేల మేర లబ్ధి కల్పింస్తున్నారు. పావలా వడ్డీకే రూ.35వేలు చొప్పున బ్యాంకు రుణం అందిస్తున్నారు. ఇలా మొత్తంగా ఒక్కో లబ్ధిదారుకు రూ.2.70 లక్షలు చొప్పున లబ్ధి చేకూరుస్తున్నారు. దీనికి అదనంగా మరో రూ.లక్షకు పైగా ప్రతి ఇంటిపై మౌలిక వసతులకు ఖర్చు పెడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతుండగా, ఇప్పటికే 8.6 లక్షలకు పైగా ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు ప్రభుత్వం అందించింది. మిగిలిన ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కాగా, ఇప్పటి వరకు 12.77 లక్షల మంది లబ్ధిదారులకు రూ.4,500.19 కోట్లు బ్యాంకు రుణాల ద్వారా అందించారు. బ్యాంకులు 9 నుంచి 11 శాతం వడ్డీతో రుణాలు ఇస్తున్నాయి. అయినా అక్కచెల్లెమ్మలపై భారం పడకుండా పావలా వడ్డీకే రుణాలు అందిస్తూ ఆపై వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. తొలి దఫా అర్హులైన 4,07,323 మంది లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్మెంట్ కింద రూ.46.90 కోట్లను గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. ఇలా సంవత్సరంలో రెండు పర్యాయాలు వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం అందించనుంది. ఇదీ చదవండి: నందమూరి ఫ్యామిలీలో బయటపడ్డ విభేదాలు -
పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వైఎస్ జగన్
-
లబ్ధిదారులకు సీఎం వైఎస్ జగన్ నిధులు విడుదల చేశారు
-
విజయ గాథలతో వీడియోలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత పథకాల ద్వారా అక్క చెల్లెమ్మలను నాలుగేళ్ల పాటు చేయి పట్టుకుని నడిపిస్తూ ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఈ పథకాల లబ్ధిదారుల విజయగాథలను వీడియోల రూపంలో వలంటీర్ల ద్వారా సేకరించి పంపాలని కలెక్టర్లకు సూచించారు. ఈ పథకాలు, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు మహిళల జీవితాలు, స్థితిగతులను ఏ రకంగా మార్చాయో వీడియోల్లో పొందుపరచాలని సూచించారు. పంపిన వాటిల్లో అత్యుత్తమమైన వాటికి బహుమతులు ఇస్తామని ప్రకటించారు. ఇవి మరి కొందరిలో స్ఫూర్తిని పెంచుతాయన్నారు. సచివాలయాల స్థాయిలో రూ.10 వేలు, మండల స్థాయిలో రూ.15 వేలు, నియోజకవర్గ స్థాయిలో రూ.20 వేలు, జిల్లా స్థాయిలో రూ.25 వేలు చొప్పున ఉత్తమ విజయ గాథలకు బహుమతులు ఇస్తామని చెప్పారు. ఉత్తమ సేవలు అందించిన వలంటీర్లకు ఫిబ్రవరి 15, 16 తేదీల్లో సేవామిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులు ఇస్తామని, వాటితో పాటే లబ్ధిదారులపై ఉత్తమ వీడియోలు పంపినవారికి అవార్డులు అందచేస్తామని తెలిపారు. సీఎం జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో మాట్లాడారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టాం వైఎస్సార్ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ, అమ్మ ఒడి పథకాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టాం. 2019లో మన ప్రభుత్వం రాకముందు పొదుపు సంఘాలన్నీ పూర్తిగా కుదేలైపోయాయి. ఏ గ్రేడ్, బీ గ్రేడ్ సంఘాలు పూర్తిగా కనుమరుగైపోయి సీ గ్రేడ్, డీ గ్రేడ్‌గా మారిపోయిన దుస్థితి నెలకొంది. 18 శాతం పైచిలుకు ఖాతాలన్నీ అవుట్ స్టాండింగ్, ఎన్పీఏల స్థాయిలోకి వెళ్లిపోయాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. మనం అధికారంలోకి వచి్చన తర్వాత వారికి చేయూతనిచ్చి ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, అమ్మ ఒడి పథకాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగలిగాం. ఆర్థిక స్వావలంబన, సాధికారత క్రమం తప్పకుండా ఏటా లబ్ధిదారులకు పలు పథకాలను అందించడం ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారితను సాధించగలిగాం. అందువల్లే ఈ రోజు పొదుపు సంఘాల్లో ఎన్పీఏలు కేవలం 0.3 శాతానికి పరిమితమయ్యాయి. అక్క చెల్లెమ్మలకు ఇంతగా తోడుగా నిలిచి నడిపించిన ప్రభుత్వం మనది. జనవరిలో వైఎస్సార్ ఆసరా చివరి విడత ఒక్క వైఎస్సార్ ఆసరా ద్వారానే రూ.25 వేల కోట్లకుపైగా మహిళలకు లబ్ధి చేకూరుస్తున్నాం. ఈ పథకం కింద మూడు విడతలుగా ఇప్పటికే రూ.19,195 కోట్లు ఇచ్చాం. నాలుగో విడతగా, చివరి ఇన్స్టాల్మెంట్ కింద సుమారు రూ.6,400 కోట్లు్ల ఇస్తున్నాం. జనవరి 23న ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇది జనవరి 23 నుంచి 31వ తారీఖు వరకూ కొనసాగుతుంది. దీని ద్వారా 78.94 లక్షల మంది మహిళలు లబ్ధి పొందారు. ఈ కార్యక్రమాలన్నీ ఉత్సవ వాతావరణంలో జరగాలి. ఇందులో మహిళా సంఘాల కార్యకలాపాలను వివరించే స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేయాలి. సుస్థిర జీవనోపాధి.. మహిళలకు సుస్థిర జీవనోపాధి కల్పించాలన్నదే ఆసరా, చేయూత పథకాల ఉద్దేశం. స్వయం ఉపాధి పథకాల ద్వారా వారి జీవితాల్లో వెలుగులు చూడగలుగుతాం. ఇందులో భాగంగానే పలు మల్టీ నేషనల్, ప్రముఖ కంపెనీలు, బ్యాంకులతో అనుసంధానించాం. ప్రీ లాంచ్, లాంచ్, పోస్ట్ లాంచ్ కార్యక్రమాల ద్వారా మహిళలు, మహిళా సంఘాలకు దీనిపై అవగాహన పెంపొందించాలి. ఆసరా, చేయూత కార్యక్రమాల లబ్ధిదారులకు ఇది చాలా అవసరం. మహిళా సంఘాలు తీర్మానాలు చేస్తే ఆసరా కింద ఇచ్చే డబ్బు గ్రూపు ఖాతాల నుంచి వారి వ్యక్తిగత ఖాతాల్లోకి వెళ్తుంది. ‘చేయూత’తో రూ.14,129 కోట్లు ఫిబ్రవరి 5 నుంచి 14 వరకూ వైఎస్సార్ చేయూత కార్యక్రమం వేడుకలా జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం గతంలో ఎప్పుడూ జరగలేదు. పథకం కింద ఇప్పటివరకూ రూ.14,129 కోట్లు అందచేశాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలిచి వారికి జీవనోపాధి చూపించేలా కార్యక్రమం చేపట్టాం. 45 ఏళ్లకు పైబడ్డ మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున అందిస్తూ 26.50 లక్షల మందికి పైగా అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తున్నాం. లబ్ధిదారులు 31,23,466 మంది ఉన్నారు. ఈ పథకం వారి జీవితాల్లో ఏ రకంగా మార్పులు తెచి్చందో తెలియజెప్పాలి. జీవనోపాధి మార్గాలపై అవగాహన కలి్పస్తూ వారికున్న అవకాశాలను వివరించాలి. ఈ కార్యక్రమంలో కూడా నా తరపున లేఖను లబ్ధిదారులకు అందించాలి. నా వీడియో సందేశాన్ని కూడా వారికి చేరవేయాలి. సామాజిక న్యాయానికి చిహ్నంగా అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సామాజిక న్యాయానికి చిహ్నంగా విజయవాడలో 19 ఎకరాల్లో రూ.404 కోట్లతో రూపొందించిన 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని జనవరి 19న ఆవిష్కరిస్తున్నాం. సచివాలయం నుంచి రాష్ట్ర స్థాయివరకూ ప్రతి అడుగులోనూ సామాజిక న్యాయ నినాదం వినిపించాలి. ప్రతి సచివాలయం పరిధిలో సమావేశాలు నిర్వహించాలి. ప్రతి సచివాలయం నుంచి ఐదుగురిని 19న జరిగే అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించాలి. ప్రతి మండల కేంద్రం నుంచి ప్రత్యేకంగా బస్సులు నడుపుతాం. సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణలో వారందరినీ భాగస్వాములను చేస్తాం. గ్రామ స్థాయిలో పరిపాలనను చేరువ చేసి సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం. తద్వారా గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేశాం. ఇదొక గొప్ప మార్పు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ ఈ మార్పులకు ప్రతిరూపంగా నిలుస్తుంది. -
6 గ్యారంటీలకు తెల్ల కార్డే కీలకం
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన 6 గ్యారంటీల కింద లబ్ధి దారుల ఎంపికకు అర్హతగా తెల్లరేషన్‌కార్డును ప్రామాణికం(థంబ్‌రూల్)గా పెట్టుకుంది. ‘ప్రజాపాలన’పేరుతో కార్యక్రమం నిర్వహించి ప్రజల గుమ్మం దగ్గరే గార్యంటీలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర సమాచార, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహచర కేబినెట్ మంత్రులతో కలిసి ఆదివారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సదస్సు నిర్వహించారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సచివాలయ మీడియా సెంటర్లో విలేకరుల సమావేశం నిర్వహించి ఆ వివరాలు వెల్లడించారు. గార్యంటీలకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను 28వ తేదీకి ముందే స్థానిక అధికారులు అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేస్తారని మంత్రి పొంగులేటి తెలిపారు. తక్కువ సమయం ఉందని, రద్దీ ఎక్కువగా ఉందని, దరఖాస్తు ఇవ్వలేదని ఆందోళన అక్కర్లేదన్నారు. అందరి దరఖాస్తులను ప్రభుత్వం చిత్తశుద్ధితో తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారన్నారు. వన్‌సైడ్ బ్యాటింగ్ చేయం.. సలహాలు స్వేచ్ఛగా ఇవ్వండి ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలో అన్న అంశంపై వారి ఆలోచనలు, అభిప్రాయాలను సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకున్నారని పొంగులేటి తెలిపారు. గత ప్రభుత్వం తరహాలో వన్‌సైడ్ బ్యాటింగ్ చేయమని, ఏదైనా ఇబ్బందులు, సలహాలుంటే స్వేచ్ఛగా తెలియజేయాలని కలెక్టర్లు, ఎస్పీలను కోరినట్టు చెప్పారు. ]అధికారులు కూడా మంచి సలహాలు ఇచ్చారన్నారు. ఈ ప్రభుత్వానికి కళ్లు, చెవులు ఐపీఎస్. ఐఏఎస్ అధికారులే అని స్పష్టం చేశామన్నారు. విద్య వైద్యం, ఇతర రంగాల్లో ప్రభుత్వ ఆలోచనలను, విధానాలను వారికి వివరించామన్నారు. చాలా సౌకర్యవంతంగా అధికారులు ఫీల్ అయ్యారని, ప్రజల కోసం ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో అర్థం చేసుకున్నారన్నారు. వ్యక్తులు, వ్యవస్థల పట్ల కక్షపూరితంగా వ్యవహరించమని, తప్పు చేస్తే ఎంత పెద్ద వారినైనా ఊపేక్షించేది ఉండదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కబ్జా చేసిన భూములను ప్రజలకు పంచిపెడతాం ధరణి పోర్టల్‌ను అడ్డంపెట్టుకుని గత ప్రభుత్వంలోని పెద్దలు, తొత్తులు వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారని, ఇంకా కొన్ని భూములకు సంబంధించిన ఫైల్స్ సర్క్యులేషన్లో ఉన్నాయని మంత్రి పొంగులేటి ఆరోపించారు. ధరణిలో ఒకటే కాలమ్ ఇచ్చారని, ఒక సారి కలెక్టర్/ సీసీఎల్ఏ లాగిన్ అయితే పోర్టల్‌లో ఐటం కనబడదన్నారు. ’’ధరణి పోర్టల్ ప్రక్షాళన చేపట్టి ప్రజల ఇబ్బందులను తొలగించడంతో పాటు గత ప్రభుత్వం కబ్జా చేసిన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని ప్రజలకు పంచిపెడ్తాం. ధరణిలో తప్పులను సరిదిద్ది సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. ఆరు గ్యారంటీలతో పాటు ధరణిపై కసరత్తు ప్రారంభించాం.. స్పష్టత వచ్చాక ప్రక్షాళన చేస్తాం. అన్ని ఆధారాలతో ఒక రోజు ధరణిపై మీడియా ముందుకు వస్తాం’’అని పొంగులేటి ప్రకటించారు. -
ఐటీని పంపుతాననుకున్నావా..ప్రధాని సరదా వ్యాఖ్యలు
వారణాసి:సొంత నియోజకవర్గం వారణాసి పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ దివ్యాంగులైన వ్యాపారవేత్తలతో కొద్దిసేపు సరదాగా ముచ్చటించారు. కేంద్ర ప్రభుత్వ స్కీమ్‌ల వల్ల వారు చేస్తున్న వ్యాపారాలకు ఎలాంటి ప్రయోజనం కలుగుతోందో అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగ వ్యాపారవేత్తలతో సంభాషణలో భాగంగా అందులో ఒకరిని మోదీ పలకరించారు. ఏం వ్యాపారం చేస్తున్నావని మోదీ ప్రశ్నించారు. తాను స్టేషనరీ వ్యాపారం చేస్తున్నానని, కేంద్ర ప్రభుత్వ పెన్షన్ స్కీమ్ తనకు, తన ఫ్యామిలీకి ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని ఆ దివ్యాంగుడు బదులిచ్చాడు. ఆదాయం ఎంత వస్తోందని మోదీ అడగ్గా చెప్పేందుకు అతడు కాసేపు ఆలోచించాడు. దీంతో ఇన్‌కమ్‌ట్యాక్స్(ఐటీ) వాళ్లను పంపుతాననుకుంటున్నావా అతనితో అని మోదీ చమత్కరించారు. ప్రధాని తన పర్యటనలో భాగంగా ఆయుష్మాన్భారత్ యోజన, ఉజ్వల్ యోజన, పీఎం స్వనిధి యోజన, ముద్రయోజన తదితర పథకాల లబ్ధిదారులతో ముచ్చటించారు. కాశీ తమిళ్ సంగమం 2.0ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఇదీచదవండి..భారీ వర్షాలు..స్కూళ్లకు సెలవు -
3 వేలు పెన్షన్ పై లబ్ధిదారులు హర్షం
-
కొత్త రేషన్‌కార్డులు ఇస్తారా?
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ మొదలు రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు లబ్ధిదారులుగా ఉండాలంటే..రేషన్‌కార్డు తప్పనిసరి అయ్యింది. అధికారంలోకి వస్తే అర్హులైన వారందరికీ కొత్త రేషన్‌కార్డులు (ఆహారభద్రత కార్డులు) జారీ చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. మంగళవారం పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లోని పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసే సమీక్ష సమావేశంలో కొత్త రేషన్‌కార్డుల జారీకి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంలో ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త రేషన్‌కార్డుల కోసం ఎన్ని విజ్ఞప్తులు వచ్చినా, ఇప్పటికే రాష్ట్రంలో 90 లక్షలకు పైగా కార్డులు ఉన్నాయనే కారణంతో ఆ దిశగా దృష్టి పెట్టలేదు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల్లో 3 లక్షల కార్డులు జారీ చేశారు. అప్పటి నుంచి కొత్తగా దరఖాస్తులు ఆహ్వనించలేదు. ఉమ్మడి కుటుంబాల నుంచి వేరుపడినవారు... ఈ పదేళ్లలో జన్మించిన పిల్లల పేర్లు కూడా కార్డుల్లో చేర్చలేదు. చనిపోయిన వారి పేర్లు మాత్రమే ఎప్పటికప్పుడు తొలగించారు. రాష్ట్రంలో 90.14 లక్షల రేషన్‌కార్డులు: రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆహారభద్రత కార్డులు 90.14 లక్షలు ఉన్నాయి. ఇందులో జాతీయ ఆహార భద్రత చట్టం(ఎన్ఎఫ్ఎస్ఏ) కింద 54.48 లక్షల కార్డులు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆహారభద్రత కార్డులు 35.66 లక్షలు ఉన్నాయి. ఇవి కాకుండా అంత్యోదయ అన్నయోజన కింద 5.62 లక్షల కార్డులు, అన్నపూర్ణ పథకం కింద 5,211 కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల పరిధిలో 2.83 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న జనాభా, ప్రజల ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుంటే ఈ కార్డుల లబ్ధిదారుల్లో 20 శాతం వరకు అనర్హులే ఉన్నట్టు గత ప్రభుత్వం గుర్తించింది. అయితే అనర్హుల నుంచి కార్డులను ఏరివేత ప్రక్రియ ప్రారంభిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే కారణంగా యథాతథ స్థితి కొనసాగించింది. అనర్హులను తొలగిస్తారా...? గతంలో తెలుపు, గులాబీ రేషన్‌కార్డులు ఉండేవి. 2014లో కేంద్ర ప్రభుత్వం గులాబీకార్డులను పూర్తిగా ఎత్తివేసి దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) వారికే ఆహారభద్రత కార్డులు జారీ చేసింది. కేంద్రం జారీ చేసిన రేషన్ కార్డులు పొందలేని వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహారభద్రత కార్డులు ఇచ్చిం ది. ఈ లెక్కన రాష్ట్రంలో 90.14 లక్షల కుటుంబాలకు రేషన్‌కార్డులు ఉండగా, లబ్ధిదారుల సంఖ్య దాదాపు 2.83 కోట్లు. రాష్ట్ర జనాభానే 4 కోట్లు అనుకుంటే సుమారు 3 కోట్ల మంది ఆహారభద్రత కార్డులకు అర్హులుగా ఉన్నారు. కొత్త రేషన్‌కార్డులు జారీ చేయాల్సి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి విధివిధానాలు రూపొందిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత రేషన్‌కార్డులలో అర్హులైన వారిని మాత్రమే కొనసాగించి, కొత్తగా బీపీఎల్ పరిధిలోకి వచ్చే వారికి కార్డులు జారీ చేస్తారా లేక ఉన్న వాటి జోలికి వెళ్లకుండా కొత్తగా అర్హులను గుర్తిస్తారా చూడాలి. -
జగనన్న ఫీజు.. మా అమ్మాయి ఇంజినీర్..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. మా అమ్మాయి ఇంజినీర్.. మాది గిరిజన కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడదు. కొండపోడు పనులు, కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట ఏజెన్సీలో కొండ శిఖరంపైన ఉన్న జన్నోడుగూడ గ్రామానికి చెందిన నాకు ముగ్గురు కుమార్తెలు. వీరిలో ఇద్దరు కుమార్తెలకు చదువంటే చాలా ఇష్టం. స్థానికంగా ఉన్న ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో ఇద్దరినీ ఇంటర్మీడియట్ వరకు చదివించాను. ఆ పై చదువులు చదివించాలంటే చాలా ఖర్చు అవుతుందని భయపడ్డాను. అయితే పేద కుటుంబాల పిల్లల చదువుకు ప్రభుత్వం సాయం అందిస్తోందని గ్రామంలో చదువుకున్న వారు చెప్పారు. దీంతో పిల్లలను చదివించేందుకు ఏర్పాట్లు చేశాను. సర్కారు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తోంది. హాస్టల్లో ఉండి చదువుకునేందుకు జగనన్న వసతిదీవెన పథకం కింద డబ్బు సమకూరుస్తోంది. పెద్దకుమార్తె విజయ ఏలూరులోని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండియర్ సివిల్ ఇంజినీరింగ్ చదువుతోంది. చిన్నకుమార్తె ప్రశాంతి విశాఖపట్నంలో బీఎస్సీ నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. పైసా ఖర్చు లేదు. ఏటా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు నా భార్య బ్యాంకు ఖాతాలో వేయడంతో కళాశాలకు ఫీజులు కడుతున్నాను. మాలాంటోళ్ల పిల్లలు ఇంజనీరింగ్ చదవడమంటే మాటలా! మా కల నిజమైంది. – సవర బంగారయ్య, జన్నోడుగూడ (బోనుమద్ది కొండలరావు, విలేకరి, సీతంపేట) పథకాలే మా బంధువులు భార్యభర్తలిద్దరం కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటూ మా నలుగురు బిడ్డల్ని చదివించుకునేవాళ్లం. రానురాను కూలి పనులు తగ్గిపోయాయి. రాబడి కూడా అంతంతమాత్రంగానే ఉండేది. కూలి చేస్తూ నలుగుర్ని సాకడం కష్టమైపోయింది. అప్పులు పెరిగిపోయాయి. ఏం చేయాలో పాలుపోలేదు. బంధువుల్లో కూడా మాపై చిన్నచూపు ఏర్పడింది. మాతో మాట్లాడేందుకు, మా ఇంటికి వచ్చేందుకు ఎవరూ పెద్దగా ఇష్టపడేవారు కాదు. ఈ పరిస్థితిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రావడం.. వైఎస్సార్ ఆసరా, జగనన్న చేయూత పథకాల ద్వారా నాకు లబ్ధి కలిగింది. ఈ మొత్తాలకు శ్రీ నిధి తోడైంది. బ్యాంకు లింకేజీ కింద 1.5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం తీసుకుని, ప్రకాశం జిల్లా తుర్లపాడు మండలం తుమ్మల చెరువులో కిరాణా షాప్ పెట్టుకున్నాము. నేను, నా భర్త కలిసి దుకాణాన్ని నడుపుతున్నాము. మా చుట్టుపక్కల ఉన్న డ్వాక్రా సంఘాల మహిళలంతా మా దుకాణంలోనే సరుకులు కొంటున్నారు. క్రమంగా మా ఆర్థిక పరిస్థితులు గాడిలో పడ్డాయి. ఇద్దరు కుమారులకు పెళ్లిళ్లు చేశాం. ఈ ప్రభుత్వమే లేకపోయి ఉండుంటే మేము ఏమైపోయేవాళ్లమో! ప్రభుత్వ పథకాలే మా బంధువులయ్యాయి. ఇప్పుడు హాయిగా ఉన్నంతలో సంతోషంగా బతుకుతున్నాం. – షేక్ మహబున్నీ, తుమ్మల చెరువు (రామయోగయ్య, విలేకరి, తుర్లపాడు) పని కోసం ఇక వలసపోము.. జీవనోపాధి కోసం గతంలో చెన్నై వంటి దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్లం. వైఎస్ జగన్ సీఎం అయిన తరువాత ఆ బాధలు తప్పాయి. మా సొంత ఊరు పార్వతీపురం మన్యం జిల్లాలోని కొత్తపల్లి. నా ఇద్దరు ఆడ పిల్లలను మా అమ్మ దగ్గర ఉంచి నేను, నా భర్త జీవనోపాధి కోసం చెన్నైకి వెళ్లి పనులు చేసుకునే వారం. అయితే కోవిడ్ సమయంలో మా ఊరికి తిరిగొచ్చాం. తరువాత పిల్లలతో సహా విశాఖపట్నం వచ్చాము. ఇక్కడ అక్కయ్యపాలెం అబిత్నగర్లో నేను అపార్ట్మెంట్లో వాచ్ ఉమెన్‌గా ఉంటున్నాను. నా భర్త పోలిశెట్టి తాపీ పనులకు వెళ్తున్నాడు. డిగ్రీ చదువుతుండగానే మా పెద్దమ్మాయికి పెళ్లి చేశాము. రెండో అమ్మాయి మౌనిక అక్కయ్యపాలెం జీవీఎంసీ హైసూ్కలులో తొమ్మిదవ తరగతి చదువుతోంది. ఈ పాపను బాగా చదువించుకోవాలని కోరిక. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవటంతో మా లాంటి పేదలకు ఆ ఆశ నెరవురుతుందా అనే భయం ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడా భయం లేదు. వరుసగా నాలుగేళ్లుగా అమ్మ ఒడి డబ్బులు పడ్డాయి. దీంతో మా అమ్మాయికి కావలసినవన్నీ కొనగలుగుతున్నాను. బడికి పంపిస్తే పుస్తకాలు, బూట్లు, బ్యాగు ఇలా అన్నీ ఫ్రీగానే ఇస్తున్నారు. జగనన్న చేస్తున్న సాయం మాలాంటోళ్లకు భరోసాగా నిలుస్తోంది. ధైర్యంగా పిల్లలను చదివిస్తున్నాం. మేము కూలి పనుల కోసం ఎక్కడికీ వలస వెళ్లాల్సిన అవసరం లేదు. – వెంపటాపు లక్ష్మీ, అబిత్నగర్, విశాఖపట్నం (కోవెల కాశీ విశ్వనాధం, విలేకరి, విశాఖపట్నం) -
పింఛన్ చూసి ఒకటో తారీఖు గుర్తుకొస్తోంది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. బతుకు పంట పండింది పచ్చటి పంట చేలో నీళ్లు పెడుతూ.. పంటను సంరక్షించుకుంటూ పొలం పనిలో నిత్యం నిమగ్నమై పోవాలనేది నా కల. నేను గిరిజన రైతుని. నాకు నాలుగు ఎకరాల 20 సెంట్ల భూమి ఉంది. మా భూమి పూర్తిగా వర్షాధారం. వర్షం నీటిపై ఆధారపడి పంటలు పండించాల్సిన పరిస్థితి. నీరు సరిపోక పత్తి పంట వేసినప్పుడల్లా నష్టాలపాలయ్యేవాడిని. ఆదాయం అంతంతమాత్రంగా ఉండడంతో కుటుంబ పోషణ కష్టంగా ఉండేది. గతేడాది వైఎస్సార్సీపీ ప్రభుత్వం జలకళ పథకంలో భాగంగా నా పొలంలో బోరు వేయించింది. ఉచిత కరెంటు కనెక్షన్ కూడా ఇచ్చింది. దీంతో ఈ ఏడాది ఎకరం భూమిలో మొక్కజొన్న, 1.20 ఎకరాల్లో వైట్ బార్లీ వేశాను. మిగిలిన పొలంలో పొగాకు పంట సాగు చేశాను. జలకళ బోరు వల్ల పంటలకు పుష్కలంగా నీరందింది. నాలుగు డబ్బులు చేతికందే అవకాశముంది. దీంతో నా బతుకు పంట పండినట్లే. మాది ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం కాకులవారిగూడెం గ్రామం. నాకు భార్య, ఓ బాబు. ఏటా రైతు భరోసా కింద రూ.13,500 వస్తోంది. ఈ సొమ్ము పంట పెట్టుబడికి సరిపోతుంది. రైతు భరోసా కేంద్రం నుంచి ఎరువులు తీసుకున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వ హయాంలో రైతులకు వ్యవసాయం పండుగైంది. నాలాంటి గిరిజన రైతులు ఎంతో మంది జీవితాలు బాగుపడ్డాయి. – కమ్మే శ్రీనివాసరావు, కాకులవారిగూడెం (కోడూరి ఆనంద్, విలేకరి, బుట్టాయగూడెం) నాలుగు ముద్దలు నోట్లోకెళ్తున్నాయి.. గత ప్రభుత్వ హయాంలో రూ.200 చాలీచాలని పింఛను ఇచ్చేవారు. నా భర్త శ్రీమోను కాలం చేశారు. కుమార్తెకు పెళ్లి చేసి పంపాను. ఇక ఇంట్లో ఉండేది నేను ఒక్కదాన్నే. నేను కూలికి వెళితే 200 రూపాయలు వస్తుంది. ఆరోగ్యం బాగోలేని రోజు ఆ డబ్బులు కూడా ఉండవు. పింఛనే నాకు ఆధారం. ఇటువంటి సమయంలో అవసరాలు తీరడానికి అప్పులు చేసేదాన్ని. అయితే, నిత్యం ఏ మోహం పెట్టుకుని అప్పులోళ్ల దగ్గరకు వెళ్లగలను? దీంతో తరచూ ఆరి్థక ఇబ్బందులు ఎదుర్కొనేదాన్ని. ఈ ప్రభుత్వం పుణ్యమా అని ప్రస్తుతం పింఛన్ రూ.2,750 వస్తుండడంతో ఆనందంగా జీవిస్తున్నాను. వలంటీరే ప్రతి నెలా ఒకటవ తేదీన ఇంటికి వచ్చి పింఛను ఇస్తున్నారు. ఇప్పుడు నేను ఇంటి అవసరాల కోసం అప్పులు చేయడం లేదు. మానసిక ఒత్తిడి లేకుండా జీవిస్తున్నాను. సంతోషంగా నాలుగు ముద్దలు నోట్లోకి వెళ్తున్నాయి. ఈ ప్రభుత్వం నాకు మరో మేలు చేసింది. లే అవుట్ వేసి, సెంటున్నర ఇంటి స్థలం కూడా మంజూరు చేసింది. అద్దె ఇంట్లో ఉన్న నాకు ఇంటి స్థలం ఇవ్వడం సంతోషంగా ఉంది. తొందరలో అక్కడ ఇల్లు కట్టుకుంటాను. – పరదేశి రత్నమ్మ, మిట్నాల, నంద్యాల. (కె.చంద్రవరప్రసాద్, విలేకరి, నంద్యాల న్యూటౌన్) భిక్షాటన మానేశాం.. నేను, మా ఆయన సింహాద్రి రోజూ ఊరూరా తిరిగి భిక్షాటన చేసేవాళ్లం. మేం బుడగ జంగాలం. భిక్షాటన మా కులవృత్తి. ఆ విధంగా వచ్చిన ఆదాయంతో ఎలాగోలా ఇద్దరు ఆడ పిల్లలు, ఇద్దరు మగ పిల్లలను నెట్టుకొస్తుండేదాన్ని. ఏమాత్రం ఆరోగ్యం సహకరించకపోయినా ఆరోజు గడప దాటి వెళ్లలేకపోయేవాళ్లం. అప్పుడు పస్తులుండాల్సి వచ్చేది. కిందా మీదా పడి అందరికీ పెళ్లిళ్లు చేశాం. ఒకబ్బాయి తాపీ పని చేస్తుండగా... మరో కొడుకు ఆరోగ్యం అంతంత మాత్రమే. ఇద్దరబ్బాయిలు వారి భార్యలతో కలిసి మాతో పాటే ఉంటున్నారు. ఈ పరిస్థితిలో కుటుంబ పోషణ ఎలా.. అని దిగులు పడుతుండేవాళ్లం. ఆ తరుణంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైఎస్సార్ చేయూత పథకం కింద ఏటా రూ.18,750 నా ఖాతాలో వేసింది. గత మూడేళ్లుగా పైకం అందింది. దానితోపాటు మూడేళ్లుగా ఆసరా పథకం ద్వారా కూడా డబ్బు అందుతోంది. ఆ వచ్చిన మొత్తంతో మా సొంతూరైన శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం మహర్తాపురంలో పాన్‌షాపు పెట్టుకున్నాను. నా భర్తకు పింఛన్ వస్తోంది. మనవళ్లకు అమ్మ ఒడి కింద డబ్బులొస్తోంది. తద్వారా మేము ఇప్పుడు కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటున్నాం. భిక్షాటన మానేసి గౌరవంగా బతుకుతున్నాం. – ప్రసాదం యల్లమ్మ, మహర్తాపురం (అల్లు నర్సింహరావు, విలేకరి, కొత్తూరు) -
ఆసరా వచ్చింది.. అప్పు తీర్చింది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. కట్టెలమ్మిన చోటే పండ్లమ్ముతున్నా.. 20 ఏళ్లుగా నాకున్న రెండెకరాల్లో నిమ్మతోటనే జీవనాధారంగా చేసుకుని ఇద్దరు పిల్లలను చదివించుకుంటున్నాను. గతంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఎటుచూసినా తోట మొత్తం ఎండిపోయేది. సరిపడా నీరు లేక దిగుబడి చాలా తక్కువగా చేతికొచ్చేది. దీంతో నిమ్మకాయల మార్కెట్ యార్డులో వ్యాపారుల వద్ద అప్పులు చేసి, పిల్లల చదువులకు అయ్యే ఖర్చులను భరించాల్సి వచ్చింది. అదే క్రమంలో ఎండిపోయిన తోటను పూర్తిగా నరికించి వంట చెరకుగా అమ్మేశాను. ఫలితంగా కుటుంబ పోషణే భారంగా మారింది. చుట్టూ అప్పులతో మునిగిపోయాను. దిక్కుతోచని పరిస్థితుల్లో సీఎం వైఎస్ జగన్ చేపట్టిన జలయజ్ఞం నా తోట స్వరూపాన్నే మార్చేసింది. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని మా గ్రామం పులికల్లు చెంతనే కండలేరు హై లెవల్ స్లూయిజ్ నుంచి ఎడమగట్టు కాలువను రూ.40 కోట్లతో తవ్వించారు. దీంతో మా ఊరితోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భ జలాలు బాగా పెరిగాయి. తర్వాత మళ్లీ నిమ్మ తోట పెంచాను. ప్రస్తుతం తోట ఏపుగా పెరిగి మంచి దిగుబడి వస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ నిమ్మతోట ఎండిందే లేదు. ఫలసాయం అందడంతో ఇబ్బందుల నుంచి బయటపడ్డాను. చేసిన అప్పులన్నీ క్రమంగా తీర్చేశాను. ఇప్పుడు మళ్లీ ధైర్యంగా వ్యవసాయం చేస్తున్నా. ఈ ప్రభుత్వం పుణ్యంతోనే ఉద్యాన పంటలను చక్కగా పండించుకుంటున్నాము. గత పాలకులు మాటలతో మభ్యపెట్టి దశాబ్దాలుగా మా ప్రాంతంలో కాలువ పనులు చేపట్టకపోవడం వల్ల నా లాంటి రైతులు ఎంతో మంది తీవ్రంగా నష్టపోయారు. ఈ ప్రభుత్వం పథకాల పుణ్యమాని నా పిల్లల చదువులు పూర్తయ్యాయి. – సన్నాల శ్రీనివాసులురెడ్డి, పులికల్లు (కె.మధుసూదన్, విలేకరి, పొదలకూరు) ఓ గూడు దొరికింది నా భర్త ఊరూరూ తిరిగి బట్టల వ్యాపారం చేస్తారు. వచ్చిన ఆదాయం అంతంత మాత్రంగా సరిపోయేది. బతకడానికే ఇబ్బందికర పరిస్థితిలో ఉంటే ఇల్లు కట్టుకునే ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే ఆ ఊహకే స్వస్తి పలికాం. కాకినాడ జిల్లా సామర్లకోటలోని వీర్రాఘవపురంలో సుమారు 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే నివాసం ఉంటున్నాను. గతంలో అనేక పర్యాయాలు ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసినా ఏ ప్రభుత్వంలోనూ స్థలం రాలేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఒక రోజు వలంటీర్ మా ఇంటి వద్దకు వచ్చాడు. దరఖాస్తు పెట్టుకుంటే ఉచితంగా ఇంటి స్థలం ఇస్తారని చెప్పారు. ఇదంతా చూసిందేలే అనుకున్నాము. మా వలంటీరే దరఖాస్తు నింపించి ప్రభుత్వానికి పంపించారు. కొద్ది రోజుల్లోనే వలంటీరే మా ఇంటికి వచ్చి సామర్లకోట ఈటీసీ లేఅవుట్లో స్థలం కేటాయించారని శుభ వార్త చెప్పారు. ఆ స్థలంలో చక్కగా మా ఆలోచనకు అనుగుణంగా ఇల్లు కట్టుకున్నాం. ప్రభుత్వం ఇచ్చిన రూ.1.80 లక్షలకు తోడు మరింత మొత్తం కలిపి అందంగా నిర్మించుకున్నాం. ఇదివరకు నెలకు రూ.5 వేలు అద్దెగా కట్టేవాళ్లం. ఇప్పుడు ఆ మొత్తం ఆదా అవుతోంది. పిల్లలకు అమ్మ ఒడి, విద్యా దీవెన పథకాలు వస్తుండటంతో వారి చదువుకు ఇబ్బంది లేకుండా పోయింది. మా జీవితానికి ఈ ప్రభుత్వం ఒక కొత్త బాట వేసింది. – కట్టా పద్మావతి, సామర్లకోట (అడపా వెంకటరావు, విలేకరి, సామర్లకోట) మా వ్యాపారానికి ‘ఆసరా’ రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం మాది. ఇద్దరు ఆడపిల్లలున్నారు. పెద్దమ్మాయికి పెళ్లి చేశాం. రెండో అమ్మాయి ఇక్కడే హైస్కూల్లో 10వ తరగతి చదువుతోంది. మా ఆయన చేపలు పట్టి తెస్తే వాటిని ఇక్కడే అమ్మేవాళ్లం. సరుకు కొని బయటికి వెళ్లి వ్యాపారం చేయాలని ఉన్నా పెట్టుబడి లేక ఊరుకున్నాం. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు మాకు అండగా నిలిచాయి. విజయనగరం జిల్లా లక్కవరపుకోటలోని వీరభద్ర పొదుపు సంఘంలో ఉన్న నాకు మూడు విడతలుగా ఆసరా కింద రుణమాఫీ మొత్తం రూ.21,300 అందింది. బ్యాంకు లింకేజీ కింద రూ.1,00,000, స్త్రీనిధి నుంచి రూ.50,000 మంజూరైంది. ఈ సొమ్ముతో చేపల వ్యాపారం ప్రారంభించాం. సరుకు కొనుగోలు చేసి మా ఆయనతో కలిసి అరకు, అనంతగిరి మండలాల్లో అమ్ముతున్నాం. కూతురి చదువుకు అమ్మఒడి సొమ్ము అందుతోంది. జగనన్న విద్యాకానుక రూపంలో ఆమె చదువుకు అవసరమైన సామగ్రి అంతా ప్రభుత్వమే అందిస్తోంది. ఇప్పుడు మా వ్యాపారం కూడా బాగుంది. ఈ ప్రభుత్వం వల్ల మా కుటుంబం గౌరవంగా బతికే అవకాశం కలిగింది. – గుదేలక్ష్మి, నెయ్యిలవీధి, లక్కవరపుకోట (ఆర్.వి.సూర్యప్రతాప్, విలేకరి, శృంగవరపుకోట) -
చెట్టంత కొడుక్కి కాలు పోయింది.. కానీ జీవితం రోడ్డున పడలేదు
ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో ఎన్నికలకు ముందు ప్రకటించిన మేనిఫెస్టోను.. ఎన్నికల్లో గెలిచి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచే మనసా వాచా ఆచరణలోకి తీసుకురావటం మొదలుపెట్టారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆడిన మాట తప్పలేదు. ఆరంభించిన ఏ పథకాన్నీ ఆపలేదు. ఫలితంగా రాష్ట్రంలో కోట్లాది మందికి నవరత్న పథకాలు అండగా నిలిచాయి. చిన్నారులు మొదలు పండు ముదుసలి వరకు అందరూ ఆనందంగా జీవించేలా వనరులు సమకూరుతున్నాయి. కనీస అవసరాలైన కూడు, గూడు, ఆరోగ్యానికి ఢోకా లేదనే విషయం ఊరూరా కళ్లకు కడుతోంది. పేదల జీవితకాల కల అయిన ‘సొంతిల్లు’ సాకారం కావడంతో కొత్తగా ఊళ్లకు ఊళ్లే వెలుస్తుండటం కనిపిస్తోంది. అక్కచెల్లెమ్మలు సొంత కాళ్లపై నిలబడేలా చేయూత, ఆసరా అండగా నిలుస్తోంది. పేదింటి పిల్లలకు పెద్ద చదువులు.. విదేశీ విశ్వవిద్యాలయాల్లో సైతం చదివేందుకు రాచబాట సిద్ధమైపోయింది. అన్నదాతకు వ్యవసాయం పండుగగా మారింది. వెరసి నవరత్నాల వెలుగులు ప్రతి ఊళ్లోనూ ప్రసరిస్తున్నాయి. సీఎం వైఎస్ జగన్ తపన, తాపత్రయం, ఆకాంక్ష ఫలించిన తీరు లబ్ధిదారుల మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. ఆరోగ్యశ్రీ లేకుంటే ఏమయ్యేదాన్నో! మేము ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలోని బీసీ కాలనీలో ఉంటున్నాం. గతంలో చేనేత పని చేస్తూ జీవించేవాళ్లం. నాకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. ముగ్గురికీ వివాహమైంది. ప్రైవేటు బస్సులో క్లీనర్‌గా పనిచేసే నా కుమారుడు వెంకటేశ్వర్లుకు అనారోగ్య సమస్యలు తలెత్తి కాలు తీసేయాల్సి వచ్చింది. చెట్టంత కొడుక్కు కాలు తీసేయడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాం. కుటుంబం రోడ్డున పడిపోయింది. చివరికి కుటుంబ భారం మొత్తాన్నీ నేనూ, నా కోడలు సునీత మోస్తున్నాం. ఏదోలా సంసారాన్ని నెట్టుకొస్తున్న సమయంలో నాకు రెండేళ్ల కిందట తీవ్రంగా సుస్తీ చేసింది. గుండె ఆపరేషన్ చేయించాలని వైద్యులు చెప్పారు. దీంతో నేను వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు వెళ్లాను. అక్కడ వాళ్లు ఆపరేషన్ ఖర్చు రూ.5 లక్షలవుతుందన్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితుల్లో ఆపరేషన్ కోసం రూ.5 లక్షలు ఎక్కడి నుంచి తేగలను? నేను మరింత కుంగిపోయాను. నాకేమైనా జరిగితే అంగవైకల్యంతో ఉన్న నా కుమారుడి గతి ఏమవుతుందోనని మరింత బెంగ పట్టుకుంది. ఆ సమయంలో ఆరోగ్య శ్రీ నాకు కొండంత ధైర్యాన్నిచ్చింది. ఉచితంగా ఆపరేషన్ చేశారు. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నా. ప్రభుత్వం కల్పించిన చేయూత, ఆసరా, వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాలు నాకూ వర్తించాయి. మూడు విడతలుగా చేయూత రూ.56,250 వచ్చింది. వైఎస్సార్ ఆసరా కింద రూ.31,800 లబ్ధి చేకూరింది. నేతన్న నేస్తంలో భాగంగా రూ.72 వేలు వచ్చాయి. డబ్బులతో చిల్లర కొట్టు పెట్టుకున్నాను. పచ్చళ్లు తయారు చేసి అమ్ముతున్నా. నెలకు రూ.20 వేల ఆదాయం వస్తోంది. – తిరుపతమ్మ (పి.హనుమంతరెడ్డి, విలేకరి, బేస్తవారిపేట) రుణమాఫీతో ఆర్థిక ఆసరా మేము విశాఖపట్నం నగరంలోని అక్కయ్యపాలెం అబిద్‌నగర్ కాలనీలో ఉంటున్నాము. గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చినా చెయ్యలేదు. కానీ జగనన్న ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి నాలాంటి పేద కుటుంబాలకు ఆర్థికంగా ఆసరా కల్పించారు. నేను, నా భర్త, ఇద్దరు పిల్లలతో బతుకుదెరువుకోసం సాలూరు నుంచి విశాఖకు వలస వచ్చాము. అబిద్‌నగర్‌లో నా భర్త అపార్టుమెంట్ వాచ్‌మేన్‌గా పని చేస్తున్నాడు. ఇద్దరు పిల్లల్లో ఒకరిని ఐటీఐ, మరొకరిని ఇంటర్ చదివిస్తున్నాము. 2014 నుంచి 44వ వార్డు బిస్మిల్లా ఎంపీఎస్ గ్రూప్‌లో సభ్యురాలుగా కొనసాగుతున్నాను. అప్పట్లో గ్రూప్‌లో ఒకొక్కరికి రూ.50 వేల చొప్పున డ్వాక్రా రుణం ఇచ్చారు. అందులో కొంత వరకు నెలనెలా కట్టాను. సీఎం జగన్ నవరత్నాల పథకాల్లో భాగంగా వైఎస్సార్ ఆసరా పథకం కింద 2019 ఏప్రిల్ నాటికి ఉన్న డ్వాక్రా రుణాలను నాలుగు విడతల్లో మాఫీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ వార్త విన్నాక చాలా సంతోషం కలిగింది. ఆసరా పథకం వల్ల నాకు రూ.25,465 వరకు రుణ మాఫీ అయ్యింది. విడతకు రూ.6,366 చొప్పున మూడు విడతల రుణం మాఫీ అయ్యింది. వాచ్‌మేన్‌గా మాకు ఆదాయం అంతంత మాత్రమే. అటువంటి సమయంలో ఆసరా పథకం కింద రుణమాఫీ జరగడం మా కుటుంబానికి చాలా వరకు ఆర్థిక భారం తప్పింది. ఐదు నెలల కిందట మళ్లీ మా గ్రూపునకు ఏడున్నర లక్షల రుణం మంజూరైంది. ఒక్కో సభ్యురాలికి రూ.75 వేల రుణం లభించింది. సున్నా వడ్డీ కింద రూ.2,539 నాలుగు విడతలుగా జమ అయింది. కరోనా సమయంలో పనులు లేక, ఆదాయం లేక ఇంటి పట్టున ఉంటున్న సమయంలో సున్నా వడ్డీ జమ కావడంతో మా కుటుంబాన్ని ఆర్థికంగా చాలా ఆదుకుంది. – ఎస్.రవణమ్మ, డ్వాక్రా సభ్యురాలు (బి.అనితా రాజేష్, విలేకరి, సీతంపేట, విశాఖపట్నం) అప్పుచేసే బాధ తప్పింది మాది అనకాపల్లి జిల్లా చోడవరం మండలం పీఎస్‌పేట గ్రామం. మా కుటుంబం పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తోంది. మా తాత, తండ్రుల నుంచి వ్యవసాయమే జీవనాధారం. మా పొలాల పక్కనే పెద్దేరు నది పారుతుండటంతో నీటికి ఇబ్బంది లేదు. అందుకే వరి, చెరకు పంటలు వేస్తుంటాము. నాకు ఒకటిన్నర ఎకరం పొలం ఉంది. ఏటా 70 సెంట్లలో వరి, 80 సెంట్లలో చెరకు వేస్తుంటాను. ఈ ఏడాది కూడా వరి, చెరకు పంటలు వేశాను. వరికి ఉడుపుల నుంచి కోతలు వరకు సుమారు రూ.10 వేల వరకు ఖర్చవుతుంది. ఈ మొత్తం ఖర్చు అంతా నేనే భరించాల్సి వచ్చేది. అప్పు చేసి పంటకు పెట్టుబడి పెట్టేవాడిని. ఒక్కోసారి తుపాన్లు వచ్చినప్పుడు పంట పూర్తిగా నష్టపోయి పెట్టుబడి కూడా వచ్చేది కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దయవల్ల నాలుగేళ్లుగా వ్యవసాయానికి పెట్టుబడి సాయంగా ఏటా రూ.13,500 చొప్పున అందుతోంది. ఈ సొమ్ము ప్రభుత్వం ఇవ్వడం వల్ల నాకు అప్పులు చేసే బాధ తప్పింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ మొదలై ఇప్పుడు వరి పంట వెన్ను దశలో ఉంది. ఇది పెట్టుబడులు పెట్టే అదును. ఈ సమయంలో రైతు భరోసా కింద మొదటి విడతగా రూ.4 వేలు ఇటీవలే నా ఖాతాలో పడ్డాయి. ఇప్పుడు పొలానికి ఎరువులు, మందులు, కలుపు పనులు చేయించాల్సి ఉంది. ఈ రైతు భరోసా డబ్బులు నాకే కాదు రైతులందరికీ ఎంతో ఉపయోగపడ్డాయి. – గొలగాని ఎరుకునాయుడు (కొప్పాక భాస్కర్‌రావు, విలేకరి, చోడవరం) -
మా పిల్లలు డాక్టర్ అయ్యే వరకు జగనన్నే సీఎంగా ఉండాలి
-
నాలాంటి పేదోడికి జగనన్నే దిక్కు
విత్తు నాటిన వెంటనే చెట్టయిపోదు. ఫలించడానికి దానికి సమయమివ్వాలి. ఈలోగా సంరక్షించాలి. ఇదిగో.. రాష్ట్రంలో ఇపుడా ఫలాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు వెళ్లే ముందు మాయమాటలు చెప్పి... గెలిచాక మరిచిపోయే కుటిల రాజకీయాలకు స్వస్తి చెప్పారు వైఎస్ జగన్మోహన్రెడ్డి. 2019లో ఎన్నికలకు ముందు ప్రకటించిన మేనిఫెస్టోను... గెలిచిన క్షణం నుంచే మనసా వాచా ఆచరణలోకి తీసుకురావటం మొదలుపెట్టారు. కోవిడ్ చుట్టుముట్టి యావద్దేశాన్నీ అతలాకుతలం చేసినా... రాష్ట్రం సైతం ఆరి్థకంగా తల్లకిందులైనా... ఆడిన మాట తప్పలేదు. ఆరంభించిన ఏ పథకాన్నీ ఆపలేదు. ఫలితం... ‘అమ్మ ఒడి’తో స్కూళ్లలో చదువుకునే పిల్లల సంఖ్య పెరిగింది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పింఛన్లను అన్నట్టే రూ. 3,000 వరకూ పెంచుకుంటూ వెళుతుండటంతో వారికి ఆసరా దొరికింది. డ్వాక్రా రుణాల మాఫీతో మహిళలు తలెత్తుకు నిలబడ్డారు. నగదు జమచేసి రైతుకు భరోసా కల్పించటమే కాదు. ఈ–క్రాప్‌తో ఉచితంగా నూరుశాతం బీమా చేయించి పంటనష్టమనే భయం లేకుండా చేశారు. రైతు భరోసా కేంద్రాలతో వ్యవసాయాన్ని లాభసాటి చేశారు. చరిత్రలో తొలిసారి ఉచితంగా ప్రతి పేద మహిళకూ ఇంటి స్థలాన్నివ్వటమే కాక.. ఇళ్ల నిర్మాణానికీ శ్రీకారం చుట్టారు. ‘నాడు–నేడు’తో స్కూళ్లు, ఆసుపత్రుల రూపు రేఖలనే మార్చేశారు. విద్యాకానుక, గోరుముద్ద, వసతి దీవెన పేరిట విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారు. ఇక ఆరోగ్య రంగంలో తెచ్చిన సంస్కరణలు అమూల్యం. ఆసుపత్రుల రూపురేఖల్ని మార్చటమే కాదు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి దాదాపు ప్రతి చికిత్సా వచ్చేలా ప్రొసీజర్ల సంఖ్యను గణనీయంగా పెంచారు. ఇంటింటికీ ఫ్యామిలీ డాక్టర్‌ను పంపించి, ఉచితంగా మందులిస్తూ పేదల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇలా చెబుతూ వెళితే ఐదేళ్లలో ఇన్ని చేయటం సాధ్యమా? అనే ఆశ్చర్యం కలగకమానదు. కాకపోతే సంకల్పం కన్నా శక్తిమంతమైనదేదీ లేదని నిరూపించారు వైఎస్ జగన్. అందుకే.. ఆ ‘నవరత్నాల’ వెలుగుల్ని ఆయా లబ్ధిదారుల మాటల్లోనే చూపించే ప్రయత్నం ఆరంభించింది సాక్షి.. నా ప్రాణం నిలబెట్టారు.. మాది టెక్కలి సమీపంలోని రాందాస్‌పేట. శ్రీకాకుళం జిల్లా. నేను టెక్కలి రోడ్డులో కొబ్బరికాయలు అమ్ముకుంటూ బతుకుతున్నాను. గతేడాది ఆరో నెలలో ఎక్కువగా గుండె వద్ద నొప్పి వస్తుంటే... అందరూ గ్యాస్టిక్ నొప్పి అని చెప్పారు. శ్రీకాకుళంలోని పెద్ద డాక్టర్‌కు చూపిస్తే వెంటనే ఆపరేషన్ చెయ్యాలని చెప్పారు. అప్పుడే నా గుండె ఆగినంత పనైంది. మా ఆవిడ అమ్ములమ్మతో కలిసి తిరిగి మా ఊరొచ్చేశాము. దిగాలుగా ఉండిపోయాం. నాకు ముగ్గురు ఆడపిల్లలు. ఇద్దరికి పెళ్లి చేసేశాను. ఇంకా ఒక పిల్ల ఉంది. మేము రోజంతా రోడ్డు మీద కొబ్బరికాయలు, పళ్లు అమ్మితేనే ఇళ్లు గడుస్తుంది. ఏం చెయ్యాలిరా దేవుడా అని బెంగపడ్డాను. వైఎస్సార్ ఆరోగ్యశ్రీతో ఈ డబ్బులు లేకుండానే ఆపరేషన్ చేస్తారని ఎవరో మా ఆవిడకి చెప్పారు. వెంటనే టెక్కలి ఆస్పత్రికి వెళ్లి నా జబ్బు కోసం చెప్పాను. ఇలా చెప్పానో లేదో నాలుగైదు రోజు ల్లోనే ఆపరేçషన్ చేయిస్తామని కబురు చెప్పారు. శ్రీకాకుళం కిమ్స్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేశారు. పది రోజులు అక్కడే ఉన్నాం. వెంటనే పనికి వెళ్లలేనని ఆసరా పథకం అంటూ పది వేలు నగదు నా ఖాతాకు వేశారు. ఆరోగ్యశ్రీ లాంటి పథకం లేకపోతే..నాలాంటి పేదోడికి దిక్కేది చెప్పండి. నాకోసం రూ.4.30 లక్షలు వరకు ఈ ప్రభుత్వం భరించింది. ఈ ఆరోగ్యశ్రీ యే నా ప్రాణం నిలబెట్టింది. ఇప్పుడైతే నా ఆరోగ్యం బాగానే ఉంది. ఉన్న ఆడపిల్లకు పెళ్లి చేసేశాను. ఆనందంగా ఉన్నాను. – బోర రామ్మూర్తి, రాందాస్‌పేట (బి.శివప్రసాద్, విలేకరి, అరసవెల్లి) మా రెక్కల కష్టానికి మద్దతు మాది ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఒమ్మెవరం. పదేళ్ల క్రితం వివాహమైంది. మా కుటుంబంలో నేను చిన్న కోడలిని. మాకు సెంటు భూమి కూడా లేదు. భార్యభర్తలమిద్దరం రెక్కల కష్టం మీదే ఆధారపడి జీవిస్తున్నాం. ఒక్క రోజు కూలికి వెళ్లకపోతే ఆ రోజు పస్తు ఉండాల్సిందే. కూలి పనులకు వెళ్తూనే మా ఇద్దరు బిడ్డలు జాస్మిన్ (8వ తరగతి), అమర్ (7వ తరగతి)లను చదివించుకోవాలి. వారికి మంచి దుస్తులు, పుస్తకాలు కొనాలంటే మాలాంటి వారికి తలకు మించిన భారమే. ఈ దుస్థితిలో మా బిడ్డల్ని ఎలా చదివించాలి అని మథనపడేవాళ్లం. వారు పెద్దవుతున్న క్రమంలో ఇంకా భయం పట్టుకొంది. పెద్ద పెద్ద చదువులు చదివించాలంటే మా వల్ల కాదు. మాలాగా మా పిల్లలు ఉండకూడదు. వారిని ఉన్నత చదువులు చదివించాలనేదే నా ముందున్న పెద్ద సవాలు. కానీ మాకు ఆ స్తోమత లేదు. అలాంటి సమయంలో నాలుగేళ్లుగా ఎలాంటి ఆటంకం లేకుండా అమ్మ ఒడి పథకం మాకు కొండంత ఆసరాగా నిలిచింది. నాలుగేళ్లుగా నా బ్యాంక్ అకౌంట్లో నేరుగా డబ్బులు పడుతున్నాయి. వాటితో మా బిడ్డలకు కావల్సిన ఇతరత్రా వస్తువులు కొనుక్కుంటున్నాము. ఒకప్పుడు స్కూళ్లు తెరుస్తున్నారంటే ఎంతో భయపడిపోయేవాళ్లం. వారికి ఏ విధంగా డబ్బులు సమకూర్చాలి? ఎక్కడ అప్పు చేయాలి..? అని మేమిద్దరం నెల రోజులపాటు ఆలోచించేవాళ్లం. ఎంతమందిని అడిగినా అప్పు పుట్టేది కాదు. ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్ ఏమిటా అని భయపడేవాళ్లం. కానీ అమ్మ ఒడి రూపంలో ఆ దేవుడే కరుణించాడు. ఈరోజు ఏపీలో మా లాంటి నిరుపేదల పిల్లలకు మంచి చదువు దొరుకుతోంది. తొందరలో మాకు సొంతింటి కల నెరవేరనుంది. – అత్తంటి యేసుమ్మ, ఒమ్మెవరం (ఎ.మధుబాబు, విలేకరి, నాగులుప్పలపాడు) ఇదిగో మా సొంతిల్లు అన్నమయ్య జిల్లా రాయచోటి సమీపంలోని సిబ్యాలకు చెందిన మేము 30 ఏళ్ల క్రితం ముగ్గుÆý‡ు కొడుకులతో కలిసి బతుకుదెరువు కోసం మదనపల్లెకు వలస వచ్చాం. నీరుగట్టువారిపల్లె చౌడేశ్వరినగర్, మాయాబజార్ ఇంకా చానా చోట్ల అద్దె ఇళ్లల్లో ఉన్నాం. బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాళ్లం. ముగ్గురు బిడ్డలకు పెళ్లిళ్లయ్యాక జీవనోపాధికి మగ్గాలు నేసుకునేందుకు వేర్వేరుగా వెళ్లిపోయారు. మాకు వయసై పోవడంతో చంద్రబాబు ఉన్నప్పుడు సొంతింటి కోసం తిరిగాము. చేతిలో అర్జీ పెట్టుకొని తిరగని ఆïఫీసంటూ లేదు. చేతులెత్తి మొక్కని ఆఫీసర్ లేడు.. చెప్పులరిగిపోయాయేగానీ పెద్దసార్ల మనసు కరగలేదు. తహసీల్దార్, మున్సిపాలిటీ ఆఫీస్ వద్ద చాలా సార్లు అర్జీలు ఇచ్చాము. తలదాచుకునేందుకు ఓ చిన్న గూడు కట్టుకుందామన్నది మా ఆశ. అది ఈ జన్మలో తీరదనుకుని ఆశ వదిలేసుకున్నాం. ఓ రోజు మా ఇంటికి వలంటీర్ రోజా ‘పెద్దయ్య, పెద్దమ్మా.. మీకు ఇల్లు మంజూరు చేస్తే కట్టుకుంటారా’అంటూ మా దగ్గరికొచ్చింది. ఇది కూడా వట్టి మాటలే అనుకున్నాం. కొన్ని రోజులుపోయాక శ్రీవారినగర్ సమీపంలో ఇల్లు మంజూరైందని చల్లని కబురు చెప్పింది. పట్టా కూడా చేతికి రావడంతో నమ్మలేకపోయాం. ప్రభుత్వం ఇచ్చిన సొమ్ముతో, మా కష్టంతో ఇల్లు ఇలా కట్టుకున్నాం. – సుబ్బరామయ్య, రాములమ్మ దంపతులు (ఎస్.వంశీధర్, విలేకరి, మదనపల్లి) -
జగనన్న వలన మా సొంత ఇంటి కల నెరవేరింది.. మాకంటూ ఒక స్థిరాస్తిని కల్పించారు
-
వెంకటాచలంలో అట్టహాసంగా జగనన్న ఇళ్ల ప్రారంభం
-
కొందరికే ‘గృహలక్ష్మి’!
సాక్షి, హైదరాబాద్: గృహలక్ష్మి లబ్ధిదారుల జాబితా తయారీ అర్ధాంతరంగా నిలిచిపోయింది. నాలుగు లక్షల మందితో జాబితా రూపొందించాల్సి ఉండగా, సోమవారం వరకు కేవలం 1.75 లక్షల మందికి మాత్రమే మంజూరు పత్రాలు జారీ చేయగలిగారు. దీంతో అంతే సంఖ్యతో లబ్ధిదారుల జాబితా రూపొందింది. ఎన్నికల కోడ్ అమలులోకి రావటంతో జాబితా రూపొందించే పని నిలిచిపోయింది. ఎమ్మెల్యేల జాబితాలతో జాప్యం.. గృహలక్ష్మి పథకానికి గత బడ్జెట్లో ప్రభుత్వం నిధులు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. సొంత జాగా ఉన్న ఒక్కో లబ్ధిదారుకు రూ.3 లక్షలు అందించాల్సి ఉంటుంది. కానీ, దరఖాస్తుల ప్రక్రియను మాత్రం చాలా ఆలస్యంగా ప్రారంభించింది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో దరఖాస్తుల సేకరణ ప్రక్రియ ప్రారంభించగా, 15 లక్షల వరకు అందాయి. వాటి నుంచి 4 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. నియోజకవర్గంలో ఏయే ఊళ్లు, ఒక్కో ఊరు నుంచి ఎంతమంది లబ్ధిదారులు.. అన్న విషయంలో అధికారపార్టీ ఎమ్మెల్యేలకు బాధ్యతను అప్పగించారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే, లబ్ధిదారుల జాబితా రూపొందించాల్సి ఉన్నా.. వివరాలు మాత్రం ఎమ్మెల్యేలు అందించాల్సి ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలు వేగంగా స్పందించగా, కొందరు జాప్యం చేశారు. ఫలితంగా జాబితా రూపొందించే ప్రక్రియ నత్తనడకన సాగింది. పూర్తి జాబితా కోసం ఈసీని అనుమతి అడుగుతామంటున్న అధికారులు ఈనెల ఆరో తేదీ తర్వాత ఏ క్షణాన్నయినా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందన్న సమాచారంతో, ఐదో తేదీ రాత్రి వరకు జాబితాను సిద్ధం చేసి సమర్పించాల్సిందిగా సచివాలయం నుంచి సంబంధిత అధికారులకు ఆదేశాలందాయి. కానీ, ఎమ్మెల్యేల నుంచి వివరాలు సకాలంలో అందకపోవటంతో.. సోమవారం నాటికి 1.75 లక్షల మందితో కూడిన లబ్ధిదారుల జాబితా సిద్ధమైనట్టు తెలిసింది. కొన్ని జిల్లాల నుంచి వివరాలు అందాల్సి ఉందని, దీంతో ఆ సంఖ్య కొంతమేర పెరిగే అవకాశం ఉందని అధికారులంటున్నారు. కోడ్ అమలులోకి వచ్చినందున, మిగతా లబ్ధిదారుల ఎంపిక ఇప్పట్లో ఉండదని, కొత్త ప్రభుత్వం కొలువు దీరిన తర్వాతనే ఉంటుందని అధికారులు అంటున్నారు. అయినా, పూర్తి జాబితా సిద్ధం చేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. ఏదైనా ఇక ఎన్నికల తర్వాతనే.. ఎన్నికలు ముగిసి కోడ్ అడ్డంకి తొలగిపోయిన తర్వాతనే ప్రక్రియ పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చే ప్రభుత్వ ఆలోచనలకు వీలుగా ఈ పథకం భవిష్యత్తు ఆధారపడి ఉంది. కోడ్ అమలులోకి వచ్చే లోపు మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులకు మాత్రం రూ.3 లక్షల చొప్పున నిధులు విడుదలవుతాయి. వారు పనులు మొదలుపెట్టుకోవచ్చు. మిగతా లబ్ధిదారులకు నిధుల విడుదల ప్రక్రియ మాత్రం ఎన్నికల తర్వాతనే జరుగుతుందని అధికారులంటున్నారు. కొలువుదీరే కొత్త ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించాలనుకుంటేనే ఆ ప్రక్రియ ముందుకు సాగుతుందని, లేనిపక్షంలో తదనుగుణంగా నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. -
అధైర్య పడొద్దు... అండగా ఉంటా
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడలోని విద్యాధరపురం స్టేడియం గ్రౌండ్లో సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ వాహన మిత్ర లబ్ధిదారులకు శుక్రవారం ఐదో విడత ఆర్ధిక సాయం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి హాజరై తిరిగి క్యాంపు కార్యాలయానికి వెళ్లే సమయంలో పొందుగుల చిన్నారెడ్డి, నాగోజి చంద్ర శేఖర్ల ఆనారోగ్య సమస్యలను ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు సీఎంకు వివరించారు. విజయవాడ భవానీపురానికి చెందిన పొందుగుల చిన్నారెడ్డికి ఇటీవల జరిగిన ప్రమాదంలో వెన్నుపూస దెబ్బతింది. తాను ఏ పని చేయలేకపోతున్నానని, తన ఇద్దరు కుమార్తెలతో జీవనోపాధి ఇబ్బందికరంగా ఉందని సీఎంకు చెప్పారు. చంద్రశేఖర్‌కు రూ.లక్ష చెక్కు అందజేస్తున్న కలెక్టర్,ఎమ్మెల్యే సమస్యను విన్న సీఎం జగన్ చలించి మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయం చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. అలాగే భవానీపురానికే చెందిన నాగోజి చంద్ర శేఖర్ తన కిడ్నీలు పాడైపోయిన కారణంగా ఆర్థిక కారణాలతో వైద్యం చేయించుకోవడానికి ఇబ్బందిగా ఉందని ముఖ్యమంత్రికి వివరించారు. అతని సమస్యను విన్న సీఎం వైద్య సేవల నిమిత్తం ఆర్థిక సహాయం చేయాల్సిందిగా కలెక్టర్‌ను ఆదేశించారు. ఇరువురి సమస్యను విన్న సీఎం జగన్ అధైర్య పడొద్దు అండగా ఉంటానని వారికి ధైర్యం చెప్పారు. సీఎం ఆదేశించిన వెంటనే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు ఎమ్మెల్యే వెలంపల్లితో కలిసి శ్రీనివాసరెడ్డికి రూ.10 లక్షలు, చంద్రశేఖర్‌కు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.లక్ష చెక్కును అందజేశారు. -
లబ్ధి దారుల ఇళ్లకే రేషన్.. భేష్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధిదారుల ఇళ్లకు ఎండీయూల్లో రేషన్ అందించడం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని కర్ణాటక రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి కె.హెచ్.మునియప్ప ప్రశంసించారు. తమ రాష్ట్రంలో కూడా ఇలాంటి విధానాన్ని ప్రవేశపెట్టే దిశగా అధ్యయనం చేస్తామని చెప్పారు. ఆయన శుక్రవారం విజయవాడలో పౌరసరఫరాల శాఖ గోడౌన్ల నిర్వహణ, ఎండీయూ వాహనాలు, రేషన్ సరుకుల ప్యాకేజింగ్, పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావుతో కలిసి పరిశీలించారు. పేదలకు పౌష్టికాహార బియ్యంతో పాటు రాయలసీమ జిల్లాల్లో చిరుధాన్యాలు, పట్టణ ప్రాంతాల్లో ఫోర్టిఫైడ్ గోధుమపిండి పంపిణీ గురించి తెలుసుకుని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆయన్ని మంత్రి కారుమూరి సత్కరించారు. ఈ కార్యక్రమాల్లో పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్, పౌరసరఫరాల సంస్థ ఎండీ వీరపాండియన్ తదితరులు పాల్గొన్నారు. -
తొలి పట్టా అందుకున్న ఈపూరి జీవరత్నం భావోద్వేగం
-
సొంతింటి కల నెరవేర్చారు...మళ్లీ జగనన్నే సీఎం కావాలి
-
ఈ యుద్ధంలో జగనన్నదే విజయం..
-
జగనన్న సురక్షతో లబ్ధిదారులు హర్షం
-
సీఎం వైఎస్ జగన్ కు నేతన్నల సంఘీభావం
-
మాలాంటి ఎంతోమందికి వైయస్ఆర్ పింఛను కానుక భరోసా
-
జగనన్న సురక్షపై లబ్ధిదారుల హర్షం..
-
నవ్వులూరు లేఔట్ లో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆర్కే
-
లబ్ధిదారుల భావోద్వేగం.. మా ‘బలగం’ మీరే జగనన్నా..
సాక్షి, అమరావతి: సీఆర్డీఏ పరిధిలో 50,793 మంది పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాల పంపిణీ శుక్రవారం పండగలా జరిగింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన వేదికపై ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఈ పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఎమ్మెల్యే, మంత్రులు, లబ్ధిదారులు ఏమన్నారంటే…వారి మాటల్లోనే.. మీరు గృహ ప్రవేశానికి రావాలి జగనన్నా.. అన్నా నాది పేద కుటుంబం, మేం రైల్వే పోరంబోకు స్ధలంలో ఇల్లు వేసుకుని ఉంటున్నాం. మాలాగే 750 కుటుంబాలు ఉన్నాయి, రైల్వే వారు నోటీసులు ఇచ్చారు. ఏం చేయాలో అర్ధం కాలేదు. ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు, ఎండకు ఎండి వానకు తడిశాం. నాకు ఇంటి స్ధలం వచ్చిందని చాలా ఆనందపడ్డాం. గజం భూమి కూడా కొనుక్కోలేని మాకు గుంటూరు-విజయవాడ మధ్యలో లక్షల విలువైన భూమిని ఇస్తున్నారు. మీరు లక్షల మందికి పట్టాలివ్వడమే కాదు వారిని ఆస్తిపరులను చేశారు. కుట్రలు, రాజకీయంతో మాకు రాకుండా చేశారు.పేదలు ఉంటే స్లమ్ లుగా మారుతాయన్నారు. అవన్నీ మీరు ధీటుగా ఎదుర్కొన్నారు. మాకు ఇది గొప్ప పండుగ. మీ మధ్యలో ఈ పండుగ చేసుకుంటున్నాం. నవులూరులో నాకు వచ్చిన స్ధలం చూడగానే సంతోషమేసింది. అక్కడ ఉన్న ఏర్పాట్లు చాలా బావున్నాయి. నేను ఇల్లు కట్టగానే మీరు గృహ ప్రవేశానికి రావాలని కోరుతున్నాను. మా పేదలకు మీరు తోడుగా ఉన్నారు. మీ చెరగని చిరునవ్వు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. దుష్టశక్తులకు తగిన బుద్దిచెబుతాం. మా మహిళలంతా మీ వెంటే నడుస్తామని చెబుతున్నాను, మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుణ్ని ప్రార్ధిస్తున్నాను. -గొట్టిముక్కల హైమావతి, లబ్ధిదారు, తాడేపల్లి మున్సిపాలిటీ ఆ యాగ ఫలితమే ఈ పండుగ.. అన్నా, నేను ఒక బీసీ వర్గానికి చెందిన మధ్యతరగతి మహిళను, నాకు వివాహం అయి 25 ఏళ్లు అయింది. నా భర్త హోటల్లో పనిచేస్తారు. నాకు ముగ్గురు పిల్లలు. నాకు వివాహం అయిన కొత్తలో ఎదుర్కున్న సమస్యను చెప్పాలనుకున్నాను. మా అత్తగారి అమ్మ చనిపోతే ఆ అద్దె ఇంటి యజమాని శవాన్ని ఉంచనీయలేదు, అప్పుడు చాలా క్షోభను అనుభవించాను. అద్దె పెరిగినప్పుడల్లా ఇల్లు మారుతూ జీవనం కొనసాగించాను. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ మా ఇంటికి వచ్చి మీరు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇస్తారు మీరు దరఖాస్తు చేసుకోండని చెప్పారు. మేం నమ్మి దరఖాస్తు చేశాం. మీరు పేదలకు ఇళ్లు అనే మహాయాగం ప్రారంభిస్తే ప్రతిపక్ష నాయకులు మారీచుడిలా అడ్డపడినా మీరు శ్రీరాముడిలా జయించి, వారిని ఎదిరించి మాకు యాగఫలం అందించారు. ఆ యాగ ఫలితమే ఈ పండుగ. నాతో పాటు యాభై వేల మంది మహిళలు ఇక్కడికి వచ్చారు. ఏ అన్నైనా పుట్టింటికి వెళితే ఒక చీర పెడతారు లేక ఒకరోజు భోజనం పెడతారు కానీ ఏ అన్నైనా ఇంటింటికి వచ్చి బొట్టు పెట్టి మరీ పట్టాల పంపిణీకి ఆహ్వనించి మీ సొంతింటి కల సాకారం చేసుకోమనే అన్న ఎవరైనా ఉన్నారా. అలాంటి అన్న నాకు ఉన్నారు. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. నాకు ముగ్గురు పిల్లలు, వారిని బాగా చదివించడం కత్తి మీద సాము. నా పెద్దపాప పీజీ చదువుతుంది. చిన్నపాప బీటెక్ చదువుతుంది. విద్యాదీవెన, వసతిదీవెన ద్వారా నేను చదివించగలుగుతున్నాను. మీరు అమ్మలా ఆదరిస్తున్నారు. నాన్నలా మా భారం మోస్తున్నారు. అన్నలా మీ అనురాగం పంచుతున్నారు. మీ చల్లని నీడలో మేం సుస్ధిరంగా ఉండాలనుకుంటున్నాం. మాకు కేటాయించిన స్ధలం చూసినప్పుడు చాలా సంతోషమేసింది. చక్కగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మా గృహ ప్రవేశాల పండుగకు రావాలి. దేవుడంటే ఎవరు అడిగిన వరాలిచ్చేవారు కానీ నా కుటుంబంలో నేను ఏదీ అడక్కుండానే, ఏదీ కోరుకోకుండానే అన్ని వరాలిచ్చిన మీరే నా ప్రత్యక్ష దైవం, మీరు ఉదయించే సూర్యుడు.. మీరు ఒక ప్రభంజనం.. మా మహిళలకు ఒక ధైర్యం, భరోసా, బలగం మీరు. మీరే మళ్లీ సీఎంగా రావాలి. మా ఓట్లు మీకే, మీ చల్లని పాలన సుస్ధిర కాలం ఉండాలి. లక్ష్మీ, లబ్ధిదారు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పేదల జీవితాల్లో మీరు కాంతిరేఖలా నిలబడ్డారు: ఎమ్మెల్యే ఆర్కే అందరికీ నమస్కారం, అన్నా ఈ రాష్ట్రంలో ఇళ్ళు లేని నిరుపేదలు 32 లక్షల మందికి ఇళ్ళస్ధలాలు ఇచ్చి అందులో లక్షల మంది నివాసాలు ఉంటుంటే, మా రాజధాని ప్రాంతంలో సొంత ఇల్లు లేదని పేదలు ఎదురుచూశారు, వీరందరికీ మీ దయ వల్ల పట్టాలు అందుతున్నాయి, ఈ పేదలంతా మీకు శాశ్వతంగా రుణపడి ఉంటారు. చంద్రబాబు ఈ రోజు ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు, ఆయన సీఎంగా ఉన్నప్పుడు సీఆర్డీఏ చట్టం ప్రకారం 5 శాతం ఈడబ్యూఎస్ కి ఇవ్వాలని పెట్టినా, ఆయనకు పేదల మీద ప్రేమ, అభిమానంతో పెట్టలేదు. తప్పనిసరిగా ఇవ్వాలని కాబట్టి 5 శాతం రిజర్వ్ చేసి కట్టలేదు. దళితుల్లో పుట్టాలా అని ఎవరైనా కోరుకుంటారా అన్న చంద్రబాబు, బీసీల తోకలు కత్తిరిస్తాం అన్న చంద్రబాబు ఈ రాజధాని ప్రాంతంలో నిరుపేదలకు ఇల్లు ఎందుకు కట్టించాలి, ఇక్కడ పేదలు దళితులు ఉంటే ఇది రాజధాని కాదన్నాడు, చివరికి సమాధులతో సైతం పోల్చాడంటే ఆయన మతిభ్రమించి మాట్లాడుతున్నాడు. మీరు పట్టాలిస్తున్న వారంతా త్వరలోనే గృహప్రవేశం చేస్తారు. ఈ పేదలంతా సంక్రాంతి నాటికి ఆ పండుగ ఈ ఇళ్ళలో జరుపుకునేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను, మీ చేతుల మీదుగా సంక్రాంతినాడు గృహప్రవేశం జరుపుకునేలా ఉండాలి, ఈ రాజధాని ప్రాంతంలో కులం, మతం గురించి మాట్లాడారు, నా కులం మానవత్వం. నా మతం సమానత్వం అనే ధైర్యాన్ని ఈ పేదలలో నింపాలని కోరుకుంటున్నాను. పేదల జీవితాల్లో మీరు కాంతిరేఖలా నిలబడ్డారు. ఇల్లు లేని నిరుపేదలకు తెలుసు ఆ భాదలేంటో, ఇల్లు లేని పేదవాడు ఉండకూడదన్న మాటను నిలబెట్టుకుంటూ దేశానికి మీరు ఆదర్శంగా నిలవాలి. ఎల్లో మీడియా దారుణంగా ప్రవర్తిస్తుంది, ఏబీఎన్ చానల్లో ఆర్ 5 జోన్ ఆరిపోయే జోన్ అన్నారు, వారికి సంక్రాంతి పండుగ ఈ ఇళ్ళలో జరుపుకుని నిరూపించాలి. శాసన రాజధానికి నిండైన అర్ధం తీసుకొచ్చారు, ధన్యవాదాలు. -ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే), మంగళగిరి ఎమ్మెల్యే అణగారిన వర్గాల వారంటే చంద్రబాబాబుకు పగ: మంత్రి ఆదిమూలపు సురేష్ అందరికీ నమస్కారం, పేదలను పెద్దోళ్ళుగా చూడాలన్న సీఎంగారి సంకల్పం ముందు కుళ్ళు కుతంత్రాలు కుట్రలు పటాపంచలు అయిన రోజు, పేదలకు పట్టాలతో పట్టాభిషేకం, ఇది ఏపీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు, 51 వేల పట్టాలు అన్ని హంగులతో ఇస్తున్న రోజు, వీటితో పాటు పట్టణ ప్రజలకు రూపాయికే ఇల్లు అని ప్రకటించిన విధంగా లక్ష ఇళ్ళు సిద్దం చేయడంతో పాటు 2,63,000 ఇళ్ళు ఈ ఏడాది చివరికి పూర్తి చేయాలన్న సంకల్పంతో ముందుకెళుతున్నాం. 8 లొకేషన్లలో 5,000 ఇళ్ళను సీఎంగారి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందిస్తున్న పండుగ రోజు. ఇవి ఇళ్ళు కాదు ఊళ్ళు, జగనన్న తలపెట్టిన మహాయజ్జాన్ని భగ్నం చేయాలని చంద్రబాబు ప్రయత్నించారు. పేదలకు పట్టాలివ్వడంపై సుప్రిం ఉత్తర్వులే ఒక నిదర్శనం. చదవండి: మోసాల నారా చంద్రబాబును మాత్రం నమ్మొద్దు: సీఎం జగన్ పేదల కోసం ఎంతదూరమైనా వెళతాననే జగనన్న మరోసారి నిరూపించారు. బడుగు బలహీనవర్గాలు, అణగారిన వర్గాల వారంటే చంద్రబాబాబుకు పగ. ఆయన ఎన్నోసార్లు చెప్పారు, చంద్రబాబు వ్యాఖ్యలు ఎవరూ మరిచిపోరు, అమరావతి పరిధిలో సామాజిక సమతుల్యం జరుగుతుంది. ఇది జగనన్నకు మాత్రమే చెల్లింది, రాబోయే రోజుల్లో ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా జగనన్న ఉక్కు సంకల్పం ముందు అవన్నీ పటాపంచలు అవుతాయి, ఈ స్ధలాలను సమాధులతో పోలుస్తున్నారు, చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో మీకు దళితులు రాజకీయ సమాధి కడతారు. జగనన్నే మా నమ్మకం. మా భవిష్యత్, మళ్ళీ మళ్ళీ మీరే సీఎం అని మనం ఎలుగెత్తి చాటుదాం. ధ్యాంక్యూ. సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు: మంత్రి మేరుగ నాగార్జున నమస్కారం, ఈరోజు సామాజిక న్యాయానికి పండుగ రోజు, సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. గతంలో ఇళ్ళస్ధలాల కోసం కమ్యూనిస్ట్ పార్టీలు ఉద్యమాలు, ధర్నాలు చేసేవి, కానీ అవి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాయో తెలీదు, వారు చంద్రబాబు పంచన చేరి ఇళ్ళస్ధలాలు ఇక్కడ వద్దంటున్నారు. ఈ ప్రాంతంలో రైతులను చంద్రబాబు నిలువునా ముంచారు, ఆయన్ను రాబోయే రోజుల్లో ఈ పేదలు వెంటబడి తరుముతారు. పేదల ఇళ్ళ స్ధలాలు ఇవ్వకూడదని కోర్టులకెళ్ళారు, పేదలకు అండగా ఉండాలని సీఎంగారు ముందుకెళుతున్నారు, టీడీపీ అధికారంలోకి వస్తే ఈ పట్టాలు క్యాన్సిల్ చేస్తామంటున్నారు, ఆరునూరైనా మళ్ళీ జగన్ గారు సీఎం అవుతున్నారు, ప్రజాస్వామ్యవాదులంతా జగన్ గారిని బలపరచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జగనన్నా మేమంతా మీ వెంటే: మంత్రి జోగి రమేష్ పేదలకు, పెత్తందార్లకు మధ్య జరిగిన యుద్దంలో సుప్రిం సైతం పేదల పక్షాన నిలబడితే, పేదలకు ఇళ్ళస్ధలాలు వద్దు అని పెత్తందార్ల పక్షాన నిలబడ్డ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చంద్రబాబు. 31 లక్షల మందికి ఇళ్ళు కట్టిస్తుంటే దానిని అడ్డుకుంటున్నారు, రాజధానిలో పేదలు నివసించకూడదని, పేదలు పాలేర్లుగా ఉండాలనే విధంగా సుప్రింకు వెళ్ళారు. చంద్రబాబు పెత్తందార్ల పక్షాన ఉంటే మన జగనన్న పేదల వెంట ఉన్నారు, జగనన్నా మేమంతా మీ వెంటే ఉంటాం. 2024లో మరోసారి సీఎం చేద్దాం, మనమంతా జగనన్న వెంట ఉందాం. -
‘అన్నా మళ్లీ మీరే సీఎం కావాలి.. మేమంతా మీ వెనకే ఉంటాం’
సాక్షి, నెల్లూరు జిల్లా: దశాబ్దాలుగా రైతన్నల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చుక్కల భూముల సమస్యలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెక్ పెట్టారు. వాటికి శాశ్వత పరిష్కారం చూపిస్తూ రైతన్నలకు ఆ భూములపై సంపూర్ణ హక్కులు కల్పించారు. శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా కావలిలో సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన కావలి ఎమ్మెల్యే, లబ్ధిదారులు ఏమన్నారంటే.. వారి మాటల్లోనే జగనన్న మళ్లీ సీఎం కావాలి.. అందరికీ నమస్కారం, నేను 20 ఏళ్ళుగా రెండెకరాల భూమికి హక్కులు లేక గత ప్రభుత్వంలో రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయాయి. మన జగనన్న వచ్చిన తర్వాత చుక్కుల భూముల చిక్కులు శాశ్వతంగా పరిష్కరించారు. నాకు ఇద్దరు ఆడపిల్లలు, నా భార్య వికలాంగురాలు పెన్షన్ ఇవ్వమని గత ప్రభుత్వంలో అడిగితే ఖాళీ ఉంటే ఇస్తామని ఇవ్వలేదు, కానీ జగనన్న పాలనలో నా ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చారు, రూ. 3 వేలు తలుపుతట్టి ఇస్తున్నారు, నా పిల్లలకు విద్యా దీవెన, వసతి దీవెన వస్తున్నాయి, నేను దళితుడిని, నేను రెండు ఎకరాలు కౌలుకు సాగుచేస్తున్నాను, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు సార్లు రూ. 41,500 నాకు పెట్టుబడి సాయం అందింది, జగనన్నను నేను జీవితంలో మరిచిపోలేను, మన దళితులు ఎదగాలంటే జగనన్న మళ్ళీ మళ్ళీ సీఎం కావాలి, మనం మళ్లీ సీఎం చేసుకుంటేనే మన బిడ్డల భవిష్యత్ బావుంటుంది. ధన్యవాదాలు. -మద్దెల ప్రసాదు, రైతు, ముంగమూరు, బోగోలు మండలం మేమంతా మీ వెనకే ఉంటాం.. అన్నా నమస్కారం, మాకు 3 ఎకరాల పొలం ఉంది. అది మేం పండించుకుంటాం కానీ హక్కులు లేవు, మీరు ఈ రోజు మాకు ఆ భూమిపై హక్కులు కల్పిస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. నన్ను మీరు రూ. 50 లక్షల విలువైన పొలానికి వారసురాలని చేశారు, నేనే కాదు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు, నాకు ఇద్దరు పిల్లలు, వారికి అమ్మ ఒడి వస్తుంది, నేను వారిని ఇంగ్లీష్ మీడియంలో ప్రేవేట్ స్కూల్ లో చదివించాలనుకునేదానిని, కానీ మీరు అవన్నీ ఇవ్వడంతో వారు చక్కగా చదువుకుంటున్నారు, వాళ్ళని స్కూల్‌కు పంపుతుంటే చూడముచ్చటగా ఉంది, పిల్లలకు గోరుముద్ద పథకం కింద మంచి భోజనం ఇస్తున్నారు. మేం తల్లిదండ్రులుగా కూడా ఆలోచించని విధంగా మీరు మేనమామగా ఆలోచించి చేస్తున్నారు, మా డ్వాక్రా సంఘంలో నాకు మూడు విడతలుగా రూ. 22 వేలు వచ్చాయి, మా సంఘానికి బ్యాంకులో రూ. 10 లక్షలు ఇవ్వగా నా వాటాగా రూ. 1 లక్ష వచ్చాయి, దానికి కూడా సున్నా వడ్డీ పథకం కింద ఏప్రిల్ నెలలో వడ్డీ కూడా వేస్తున్నారు, బయట అధిక వడ్డీలకు ఇస్తుంటే మీరు సున్నా వడ్డీకి ఇస్తున్నారు. మాకు రైతుభరోసా సాయం అందింది, మా మామయ్యకు పెన్షన్ వస్తుంది, ఉదయం ఆరుగంటలకే వలంటీర్ వచ్చి మీ మనవడు ఇచ్చారని ఇస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అన్నా మీరే మళ్ళీ మళ్ళీ సీఎం కావాలి, మేమంతా మీ వెనకే ఉంటాం, ధన్యవాదాలు. -మమత, మహిళా రైతు, జక్కేపల్లి గూడూరు, బోగోలు మండలం వైనాట్ 175.. తప్పకుండా గెలుస్తాం.. అందరికీ నమస్కారం, ఈ రోజు పండుగ రోజు, ఎన్నో ఏళ్లుగా చుక్కల భూముల సమస్యతో ఇబ్బందులు పడుతున్న రైతన్నల సమస్యను సీఎం పరిష్కరించారు. సీఎం రైతుల పక్షపాతి, ఆయన తండ్రి బాటలో ముందుకెళుతూ, రైతాంగానికి వెన్నుదన్నుగా ఉన్నారు, నెల్లూరు జిల్లాలో 43 వేల ఎకరాల చుక్కల భూములు ఉన్నాయి, వాటిని విముక్తి చేస్తూ సీఎం తీసుకున్న నిర్ణయం రైతాంగానికి ఉపయోగకరం, పిల్లల చదువుల కోసం దేశంలో ఏ సీఎం చేయని విధంగా వేల కోట్లు ఖర్చుపెట్టి స్కూల్స్ రూపురేఖలు మార్చారు, గడప గడపకు వెళుతున్న సమయంలో ప్రతి ఇంటిలో ఏ విధంగా ఆదరిస్తున్నారో అందరికీ తెలిసిందే. ఇంటింటికీ తలుపుతట్టి మరీ పెన్షన్స్ ఇస్తున్నారు, కావలి నియోజకవర్గ అభివృద్ది జగనన్న వల్లే సాధ్యమైంది, ఈ రోజు రామాయపట్నం పోర్ట్ పనులు ఏ విధంగా పరిగెత్తుతున్నాయో మనకు తెలుసు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు కూడా అతి త్వరలో పూర్తి అవుతున్నాయి, చంద్రబాబు శంకుస్ధాపనలు చేశారే తప్ప ఒక్క పని చేయలేదు. కావలి పెద్ద చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేస్తే దాదాపు 7,8 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది, రైతాంగానికి ఉపయోగకరంగా ఉంటుంది, సోమశిల నుంచి కావలికి నీరు వచ్చే పరిస్ధితి లేదు, మాకు సంగం బ్యారేజ్ నుంచి ఇవ్వాలని కోరాం, కావలి పట్టణంలో రోడ్ల విస్తరణకు నిధులు మంజూరు చేస్తే మేం ఆ పనులు పూర్తిచేసుకుంటాం, గతంలో వైఎస్ఆర్ హయాంలో ఇందిరమ్మ కాలనీలో 6 వేల ఇళ్ళు మంజూరు అయ్యాయి కానీ అవి అసంపూర్తిగా ఉన్నాయి, వాటిని పూర్తిచేయాలని కోరుతున్నాం, జగనన్న మళ్లీ మళ్లీ సీఎం కావాలని జనం కోరుకుంటున్నారు, చాలా సంతోషం, మీరు అన్నట్లు వైనాట్ 175, తప్పకుండా గెలుస్తాం, ధన్యవాదాలు. -కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్ రెడ్డి -
రూ.2,875 కోట్ల ‘పీఎల్ఐ’ ప్రోత్సాహకాలు
న్యూఢిల్లీ: ‘ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం’ (పీఎల్ఐ) కింద ఈ ఏడాది మార్చి నాటికి కంపెనీలకు రూ.2,875 కోట్ల ప్రోత్సాహకాలను కేంద్రం విడుదల చేసింది. ఎలక్ట్రానిక్స్, టెలికం, నెట్వర్కింగ్ ప్రొడక్టŠస్, ఫార్మాస్యూటికల్స్, బల్క్ డ్రగ్స్, వైద్య పరికరాలు, ఫుడ్ ప్రాసెసింగ్, డ్రోన్లు తదితర ఎనిమిది రంగాల్లో పీఎల్ఐ పథకం కింద అర్హత సాధించిన కంపెనీలకు ఈ మేరకు ప్రోత్సాహకాలు పంపిణీ చేసినట్టు పారిశ్రామిక ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) అదనపు సెక్రటరీ రాజీవ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. 2020లో కరోనా మహమ్మారి కారణంగా చైనా నుంచి సరఫరాలకు అంతరాయం కలగడం తెలిసిందే. దీంతో దిగుమతులు తగ్గించి, దేశీయంగా తయారీని పెంచడం, తయారీకి భారత్‌ను కేంద్రంగా చేయాలన్న లక్ష్యాలతో కేంద్ర సర్కారు పీఎల్ఐ పథకాన్ని తీసుకొచ్చింది. 14 రంగాలకు దీని కింద రూ.1.97 లక్షల కోట్ల ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఎనిమిది రంగాల్లోని కంపెనీల నుంచి రూ.3,420 కోట్ల ప్రోత్సాహకాలకు దరఖాస్తులు వచ్చినట్టు రాజీవ్‌సింగ్ ఠాకూర్ తెలిపారు. ఇందులో రూ.2,875 కోట్లను విడుదల చేసినట్టు వెల్లడించారు. వచ్చే రెండు మూడేళ్లలో దేశీయంగా మరింత పెద్ద ఎత్తున ఉత్పత్తి సాధ్యపడుతుందన్నారు. 2022 డిసెంబర్ నాటికి 14 రంగాల నుంచి 717 దరఖాస్తులను ఆమోదించామని, ఈ కంపెనీలు రూ.2.74 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు ఠాకూర్ తెలిపారు. ‘‘ఇప్పటికి రూ.53,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీంతో రూ.5 లక్షల కోట్ల అదనపు ఉత్పత్తి దేశీయంగా సాధ్యపడింది. 3 లక్షల మందికి పైగా కొత్తగా ఉపాధి అవకాశాలు వచ్చాయి’’అని వివరించారు. -
‘చాలా సంతోషంగా ఉన్నాం.. జగనన్న మీరే మళ్లీ సీఎం కావాలి’
సాక్షి, అమరావతి: అక్టోబర్-డిసెంబర్ 2022 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 4,536 మంది లబ్ధిదారులకు వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా క్రింద రూ. 38.18 కోట్ల ఆర్ధిక సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రులు, లబ్ధిదారులు ఏమన్నారంటే.. వారి మాటల్లోనే మీ ధైర్యానికి హ్యట్సాఫ్: మంత్రి మేరుగ నాగార్జున అందరికీ నమస్కారం, ఈ రోజు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా అనే గొప్ప కార్యక్రమాలు ఈ రాష్ట్రంలోని పేద కుటుంబాలకు అండగా, సహాయంగా ఉంటాయి. ఇది చాలా గొప్ప కార్యక్రమం. సీఎంగారు చదువుకు ఎంత ప్రాధాన్యతనిస్తున్నారో అర్ధమవుతుంది. నాడు బీఆర్ అంబేద్కర్‌గారు ఎడ్యుకేషన్ ఈజ్ ద వెపన్ అన్న మాట అమలుచేస్తున్నారు. డ్రాపౌట్స్ రేట్స్ తగ్గాయి, ఇటీవల మైసూర్ లో జరిగిన ఒక కాన్ఫరెన్స్‌లో 9 రాష్ట్రాల వారు వచ్చిన సమావేశంలో ఒక్క ఏపీలోనే ఈ రోజు డ్రాపౌట్స్ శాతం తగ్గుతుందని చెప్పారు, ఇది గర్వకారణం. పదవ తరగతి పాసైన వారికే అర్హత అనేది మంచి ఆలోచన, దీని వల్ల చదువుకు ప్రాధాన్యతనిస్తారు. మీ ధైర్యానికి హ్యట్సాఫ్, మీరు చేస్తున్న ఈ కార్యక్రమం ఫలప్రదమవుతుందని ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఈ గొప్ప కార్యక్రమాల వెంట ప్రజలంతా నడుస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్యూ. మా జీవనోపాధి మెరుగైంది: సువర్ణ రత్న నమస్కారం జగనన్నా, అన్నా మా నాన్న కూలీ పనులు చేసి మమ్మల్ని చదివించారు, మమ్మల్ని ప్రయోజకులను చేశారు, పెళ్ళి చేయాలనుకుని ఆలోచిస్తుండగా మాకు ఈ కళ్యాణమస్తు ద్వారా ఆర్ధిక సాయం జరుగుతుందని తెలిసి మేం సంతోషించాం, మాకు ఈ సాయం అందుతుంది, ధన్యవాదాలు అన్నా, మా నాన్న మమ్మల్ని చదివించడానికి చాలా ఇబ్బందులు పడ్డారు, మీరు ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు అందాయి. మేం పోడు భూములు సాగుచేసుకుంటున్నాం, మీరు మాకు ఆర్వోఎఫ్ఆర్ పట్టా ఇవ్వడంతో మాకు రైతు భరోసా సాయం అందుతుంది, ఆ డబ్బుతో మేం వ్యవసాయం చేసుకుంటున్నాం, మా అమ్మకు వైఎస్సార్ చేయూత, ఆసరా అందుతున్నాయి, మా జీవనోపాధి మెరుగైంది, మా చెల్లి కూడా మీ పథకాల వల్ల సాయం పొందింది. మీరే మాకు ఎప్పటికీ సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాను. మా నాన్నకు కుమారులు లేరు. మీరు మాకు అన్నగా ముందుండి నడిపించారు. మా కుటుంబం తరపున, మా పేదలందరి తరపునా మీకు ధన్యవాదాలు అన్నా. ధ్యాంక్యూ. -సువర్ణ రత్న, లబ్ధిదారు, మర్రివలస గ్రామం, అనంతగిరి మండలం, ఏఎస్ఆర్ జిల్లా ధైర్యంగా చదివించారంటే మీరే కారణం: లక్ష్మీదేవి అన్నా నమస్తే, మీరు ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ కళ్యాణమస్తు వల్ల మాకు మేలు జరిగింది. దీని వల్ల మాలాంటి చాలామంది ఆడపిల్లలు సంతోషంగా ఉన్నారు. కన్నతండ్రికి కూతురు పెళ్ళి చేయాలంటే ఎంత భారమో తెలుసు, కానీ మీరు ఈ పథకం ద్వారా సాయం చేస్తున్నారు. తండ్రులంతా కూడా మా కొడుకులాగా మీరు సాయం చేశారని గర్వంగా చెప్పుకుంటున్నారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాలాంటి ఎన్నో కుటుంబాలు ఇదే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మేం ఐదుగురు ఆడపిల్లలం, మీరు ప్రవేశపెట్టిన విద్యాదీవెన, వసతిదీవెన ద్వారా డిగ్రీ పూర్తిచేయగలిగాం, మా నాన్నగారు మమ్మల్ని ధైర్యంగా చదివించారంటే మీరే కారణం. చదవండి: నారా లోకేష్ ఫ్లాప్ షో.. యువగళం ‘గండాలు’ మా చెల్లెల్లకు కూడా అన్ని పథకాలు అందుతున్నాయి. మేం స్కూళ్లో చదువుకున్న రోజుల్లో ఇవన్నీ లేవు, తనకు ట్యాబ్ కుడా ఇవ్వడంతో మరింత ఇంట్రెస్ట్‌గా చదువుకుంటుంది, మేం ఐదుగురు ఆడపిల్లలం చదవగలిగాం అంటే మీ పథకాల వల్లే, అందరూ ఆశ్చర్యంగా చూశారు ఎలా చదువుతారని, కానీ మీ పథకాల వల్లే మేమంతా చదవుకున్నాం. మేమంతా గర్వంగా ఫీల్ అవుతున్నాం, ఎంతోమంది కుటుంబాలకు మీరు మేలు చేస్తున్నారు, మేమంతా మీకు రుణపడి ఉన్నాం, మీరే ఎల్లప్పుడూ మాకు సీఎంగా ఉండాలని ఏడుకొండలవాడిని వేడుకుంటున్నా అన్నా, థ్యాంక్యూ. -లక్ష్మీదేవి, లబ్ధిదారు, రెడ్డివారిపల్లి గ్రామం, తిరుపతి జిల్లా పేదలు చాలా సంతోషంగా ఉన్నారు: -షేక్ సాబా కౌసర్ నమస్కారం, మా తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటూ బతుకుతుంటారు, మా వలంటీర్ వచ్చి ఈ పథకం గురించి చెప్పడంతో మా అమ్మా నాన్న చాలా సంతోషపడ్డారు. ఇప్పుడున్న పరిస్ధితుల్లో ఏ ఒక్కరూ కూడా రూపాయి సహాయం చేయరు కానీ మీరు మాత్రం లక్ష రూపాయల సాయం చేస్తున్నారు, చాలా సంతోషం. మా కమ్యూనిటీలో చాలా మంది నిరుపేద కుటుంబాలు ఉన్నాయి, వారందరికీ పిల్లల పెళ్ళిళ్ళు భారంగా మారాయి, మీరు చేస్తున్న సాయం చాలా ఉపయోగకరం. అలాగే మీరు పదో తరగతి చదవాలని, వయసు 18 నిండాలన్న నిబంధన పెట్టడంతో అందరూ చదివిస్తున్నారు, దీంతో బాల్యవివాహాలు ఆగిపోయాయి, మీ నాన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారు ముస్లిం, మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంతో ఎంతోమంది డాక్టర్లు అవుతున్నారు. ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు, ఫీజు రీఇంబర్స్మెంట్ వల్ల బాగా చదువుకోగలగుతున్నారు, మా ఇంట్లో మా నాన్నమ్మకు పింఛన్ వస్తుంది, మా చెల్లికి అమ్మ ఒడి రావడంతో తనను కూడా చదివిస్తున్నారు. పేద ముస్లింలకు ఇళ్ళ స్ధలాలు ఇస్తున్నారు, మా కుటుంబం చాలా పథకాల ద్వారా లబ్ధిపొందింది. ఈ పథకాలతో పేదలు చాలా సంతోషంగా ఉన్నారు, మీరే మళ్లీ మళ్లీ సీఎం అవ్వాలని దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను, ధ్యాంక్యూ. -షేక్ సాబా కౌసర్, లబ్ధిదారు, కర్నూలు -
మా ఇంటికి వెళ్లేదెప్పుడు?
గ్రేటర్ హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోని జనం డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. వేల ఇళ్లు నిర్మాణం పూర్తయినా పేదల చేతికి రావడం లేదు. మరెన్నో ఇళ్లు వివిధ దశల్లో పనులు ఆగిపోయి బోసిపోయి కనిపిస్తున్నాయి. గ్రేటర్లో కలిసి ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని ప్రాంతాల్లో 62 వేలకుపైగా ఇళ్ల నిర్మాణం పూర్తయింది. వీటిని వెంటనే పంపిణీ చేయాలని, తమ సొంతింటి కలను తీర్చాలని లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: 2016 జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు 2015లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెద్ద సంఖ్యలో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ.. త్వరలో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ ఉంటుందని ప్రకటించింది. కానీ ఇది అమల్లోకి రాలేదు. ఇప్పటివరకు 62 వేల ఇళ్ల నిర్మాణం పూర్తయినా లబ్ధిదారుల ఎంపిక జరగకపోవడంతో పంపిణీ కాలేదు. దరఖాస్తుల అప్లోడింగ్ సగమే.. మొత్తంగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో లక్ష ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా.. 50 వేల ఇళ్లను పంపిణీ చేయనున్నట్టు మంత్రి కేటీఆర్ దాదాపు రెండేళ్ల క్రితం పేర్కొన్నారు. పంపిణీకి అర్హులైన పేదలను గుర్తించేందుకు ఆరు నెలల కింద క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన చేపట్టారు. 7 లక్షల మందికిపైగా ‘డబుల్’ ఇళ్ల కోసం దర ఖాస్తు చేసుకోగా.. ఇప్పటివరకు మూడున్నర లక్షల మంది వివరాలనే సంబంధిత యాప్‌లో అప్లోడ్ చేశారు. కరోనా సమయంలో చాలా మంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడం, ఫోన్ నంబర్లు మారడం తదితర కారణాలతో వారికి సమాచారం అందలేదు. అర్హుల ఎంపిక ఇప్పటికీ పూర్తికాలేదు. ఈ ఏడాది సంక్రాంతి సమయంలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారనే ప్రచారంతో చాలా మంది ఆశపడినా నిరాశే మిగిలింది. నిలిచిన పనులు.. సామగ్రి దొంగల పాలు పలుచోట్ల డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు తుది దశలో ఉన్నాయి. కానీ కాంట్రాక్టర్లకు బిల్లులు అందకపోవడంతో ఏడాదిన్నరగా పనులు నిలిచిపోయాయి. నిర్మాణ సామాగ్రి ధరలు పెరిగాయని, పాత ధరలతో ఇప్పుడు పనులు చేయలేమని కాంట్రాక్టర్లు అంటున్నారు. మరోవైపు నిర్మాణం పూర్తయిన ప్రాంతాల్లో ఇళ్లకు కాపలా సమస్యగా మారింది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల తలుపులు, కిటికీలు, శానిటేషన్ సామగ్రితోపాటు వివిధ అవసరాల కోసం ఏర్పాటు చేసిన కేబుళ్లు, ట్రాన్స్ఫార్మర్ల వంటివి చోరీకి గురయ్యాయి. చివరికి ఇళ్ల గోడలు తొలిచి ఇటుకలనూ దొంగిలించినట్టు అధికారుల దృష్టికి వచ్చింది. ఇప్పటికే దాదాపు రూ.3కోట్ల విలువైన సామగ్రి దొంగలపాలు అయిందని.. లబ్ధిదారులకు కేటాయింపులు, గృహ ప్రవేశాలు జరిగితేగానీ మొత్తం ఏయే సామగ్రి పోయిందో, ఎంత విలువో తెలుస్తుందని అధికారులు చెప్తున్నారు. అపార్ట్మెంట్ల తరహాలో నిర్మాణం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్రూం ఇళ్లను భారీ అపార్ట్మెంట్ల తరహాలో నిర్మిస్తున్నారు. వీటిలో మూడు రకాలున్నాయి. ►సెల్లార్+ స్టిల్ట్+ 9 అంతస్తులు, లిఫ్టులు, ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలతో భవన సముదాయం. ఒక్కో ఇంటి వ్యయం రూ.8.65 లక్షలు ►స్టిల్ట్+ 5అంతస్తులు, లిఫ్టులు, మౌలిక సదుపాయాలతో భవనాలు. ఒక్కో ఇంటి వ్యయం రూ.8.50 లక్షలు. ►లిఫ్టులు లేకుండా గ్రౌండ్+3 అంతస్తులు, మౌలిక సదుపాయాలతో భవనాలు. ఒక్కో ఇంటి వ్యయం రూ.7.75 లక్షలు. ►అన్ని రకాల్లోనూ 569 చదరపు అడుగుల విస్తీర్ణంతో.. ఒక హాల్, 2 బెడ్రూంలు, ఒక కిచెన్, రెండు టాయిలెట్లు ఉండేలా నిర్మిస్తున్నారు. లక్ష ఇళ్లు ఇలా.. ►మొత్తం లక్ష ఇళ్లకుగాను కోర్టు కేసులు, వివాదాలతో 2,659 ఇళ్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ►మిగతా వాటిలో 88,443 ఇళ్లను 27 ఖాళీ ప్రదేశాల్లో చేపట్టారు. వీటిలో 62,516 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మిగతావాటి పనులు 70–80 శాతం వరకు పూర్తయ్యాయి. ►నగరంలోని మురికివాడలు, ఇతర ప్రాంతాల్లో పేదల పాత ఇళ్లను కూల్చివేసి వాటిస్థానంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇలా 40 ప్రాంతాల్లో 8,898 ఇళ్లు నిర్మిస్తున్నారు. వీటిని డిగ్నిటీ హౌసింగ్ కాలనీలుగా పిలుస్తున్నారు. ఇప్పటివరకు 26 డిగ్నిటీ హౌసింగ్ కాలనీల్లో 5,266 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. వీటిని మాత్రం పంపిణీ చేశారు. మరో రూ. 2847 కోట్లు అవసరం ►గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్రూం ఇళ్లకు మౌలిక సదుపాయాలతో కలిపి మొత్తం అంచనా వ్యయం: రూ.9,715 కోట్లు ►ఇందులో హౌసింగ్ విభాగం నుంచి అందిన నిధులు: రూ.6,868 కోట్లు ►పెండింగ్‌లో ఉన్న బిల్లులు: రూ. 150 కోట్లు ►ఇళ్లు పూర్తయ్యేందుకు ఇంకా కావాల్సిన నిధులు: రూ. 2,847 కోట్లు ►కేంద్రం నుంచి పీఎంఏవై ద్వారా రూ. 1,500 కోట్లు మంజూరైనా.. లబ్ధిదారుల ఎంపిక జరగనందున మొత్తం నిధులు రాలేదు. ఇప్పటివరకు దాదాపు రూ. 750 కోట్లు అందాయి. పంపిణీ యోచనలో ప్రభుత్వం ఉంది ‘‘కోవిడ్ కారణంగా అన్నిరంగాలు దెబ్బతినడం, ఆర్థిక ఇబ్బందులతో కొంతకాలం పనులు నెమ్మదించాయి. 62 వేల ఇళ్లు పూర్తికాగా మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. స్థానికత గుర్తింపు కోసం నియోజకవర్గ ఓటరు, ఆధార్ జిరాక్సులను జీహెచ్ఎంసీ సర్కిల్ స్థాయిలో అధికారులు సేకరిస్తున్నారు. దీనికోసం ప్రత్యేక యాప్ రూపొందించారు. ఇళ్ల కోసం ఏడు లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకోగా.. 3.50 లక్షల మంది డేటా అప్లోడ్ అయింది. ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారికి సమాచారం నిమిత్తం పత్రికా ప్రకటనలు జారీ చేయడంతోపాటు జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. మూడు నెలలకోమారు 30 వేల కుటుంబాలకు చొప్పున ఇళ్లను పంపిణీ చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. ఉత్తర్వులు రాగానే ఇళ్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. – కె.సురేశ్‌కుమార్, ఓఎస్డీ (హౌసింగ్), జీహెచ్ఎంసీ ఐదేళ్ల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాం డబుల్ బెడ్రూం ఇంటి కోసం ఐదేండ్ల నుంచి ఎదురు చూస్తున్నాం. ఆరు నెలల కింద ఫోన్‌కు ఎస్ఎంఎస్ వస్తే ఓటరు ఐడీకార్డు, ఆధార్‌కార్డు వివరాలిచ్చాం. ఇప్పటికైనా సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేలు డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేస్తారని ఆశిస్తున్నాం. – పద్మ, బాపునగర్, చిక్కడపల్లి కళ్లు కాయలు కాస్తున్నాయ్.. అదిగో ఇదిగో డబుల్ బెడ్రూం ఇళ్లొస్తున్నాయ్ అంటూ ఏళ్లు గడుస్తున్నా అతీగతీ లేదు. నాలుగేళ్ల కింద దరఖాస్తులిచ్చినం. ఇప్పటివరకు ఏమీలేదు. మాకు ఇద్దరు ఆడపిల్లలు. మా ఆయన కూలి పనికి వెళతాడు. కరోనా వచ్చినప్పటి నుంచి మరిన్ని ఇబ్బందులు పడుతున్నాం. ఇంటికోసం ఎదురు చూసీ చూసీ కళ్లు కాయలు కాస్తున్నాయ్. – ప్రశాంతి, ఉప్పల్ -
‘థ్యాంక్యూ సీఎం జగన్ సార్.. మా కల నెరవేరుస్తున్నారు’
సాక్షి, అమరావతి: ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్ధులు ప్రపంచంలోని టాప్ యూనివర్శిటీలలో ఉన్నత విద్యా కోర్సులు అభ్యసించేందుకు అవసరమైన ఆర్ధిక సాయం అందించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ ఏడాది టాప్ 200 విదేశీ యూనివర్శిటీల్లో అడ్మిషన్లు పొందిన 213 మంది విద్యార్థులకు మొదటి విడత సాయంగా రూ.19.95 కోట్లను సీఎం క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం జమ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ దేశాల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. బండి సుచరిత పథకం ఒక చారిత్రాత్మకం: బండి సుచరిత బండి సుచరిత, కృష్ణా జిల్లాకు చెందిన విద్యార్ధిని, హార్వర్డ్ యూనివర్శిటీలో గ్లోబల్ హెల్త్ అండ్ పాపులేషన్‌పై మాస్టర్స్ చదువుతూ బోస్టన్ నుంచి మాట్లాడారు. గుడ్ మార్నింగ్ సార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. ఈ స్కీమ్ చాలా అద్భుతంగా ఉంది, విద్యారంగంలో ఇది గొప్ప పథకం. మెరుగైన సమాజ నిర్మాణానికి విద్య ఒకటే మార్గమని సీఎం గారు చెప్పిన విధంగా ఈ పథకం ఒక చారిత్రాత్మకం. ఏపీ ప్రభుత్వానికి మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు, థ్యాంక్యూ సార్ అని ముగించగా వెల్కమ్, విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్, మే గాడ్ బ్లెస్ యూ అంటూ సీఎం చెప్పారు. అల్లాడి జ్యోతిర్మయి ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు: అల్లాడి జ్యోతిర్మయి అల్లాడి జ్యోతిర్మయి, ఏలూరుకు చెందిన విద్యార్ధిని, వార్విక్ యూనివర్శిటీలో పీజీ ఇన్ పబ్లిక్ హెల్త్, కోవెంటీ నుంచి మాట్లాడారు. హలో సార్, ఇంత గొప్ప యూనివర్శిటీలో చదవడం చాలా గర్వంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నేను చిన్నప్పటి నుంచి సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, కాలేజీలలో చదివి ఈ రోజు ఇక్కడికి రాగలిగాను, ధ్యాంక్యూ సార్ అని ముగించగా వండర్ఫుల్ స్టోరీ అంటూ సీఎం గారు ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పారు. నిరూషాదేవి కొత్త ఆశలు చిగురిస్తున్నాయి: నిరూషాదేవి నిరూషాదేవి, బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన విద్యార్ధిని, యూనివర్శిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్‌లో ఎంబీఏ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్, బర్మింగ్‌హామ్ నుంచి మాట్లాడారు. గుడ్ మార్నింగ్ సార్. జగనన్న విదేశీ విద్యా దీవెన స్కీమ్ ద్వారా నేను బర్మింగ్ హామ్ యూనివర్శిటీలో ఎంబీఏ చదువుతున్నాను. సీఎం గారు మీరు విద్యావ్యవస్ధలో మీరు తీసుకొస్తున్న సంస్కరణల వల్ల మాలో ఆత్మవిశ్వాసం పెంపొందింది. మా విద్యార్ధుల జీవితాల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. మా కుటుంబాలు కూడా ఆర్ధికంగా నిలదొక్కుంటున్నాయి. మా యువతకు మీరు ఒక ఆదర్శం. నేను చదువుతున్న ఇదే యూనివర్శిటీలో మన దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్ధులు కూడా ఉన్నారు కానీ వారికి ఎవరికీ కూడా ఇలాంటి స్కీమ్స్ లేవు. మన దేశంలో ఏ సీఎం కూడా ఇలాంటి స్కీమ్ ఏర్పాటుచేయలేదు, థ్యాంక్యూ సార్, విదేశాలలో ఉన్నత విద్యను చదవాలన్న కలను మీరు నెరవేరుస్తున్నారు. థ్యాంక్యూ సో మచ్ సార్. యోగేంద్ర నాగ సాత్విక్ మా కల నెరవేరుస్తున్నారు: యోగేంద్ర నాగ సాత్విక్ యోగేంద్ర నాగ సాత్విక్, కృష్ణా జిల్లాకు చెందిన విద్యార్ధి, గ్లాస్గో యూనివర్శిటీలో ఎంఎస్సీ ఇన్ డేటా సైన్స్, గ్లాస్గో నుంచి మాట్లాడారు. గుడ్ మార్నింగ్, థ్యాంక్యూ వెరీమచ్ సీఎం సార్, మా విద్యార్థుల కలను మీరు నెరవేరుస్తున్నారు. ఇలాంటి టాప్ యూనివర్శిటీలలో చదవాలన్న మా కోరికను మీరు నెరవేర్చుతున్నారు. కృతజ్ఞతలు. నేను ఇక్కడే పీహెచ్డీ చేసి ఫ్రొఫెసర్‌గా చేస్తూ ఎంతోమంది నాలాంటి విద్యార్ధులకు భోదించాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నాను. నా కుటుంబానికి ఇంత పెద్ద యూనివర్శిటీలలో చదివించే స్ధోమత లేదు. కానీ మీరు మా కల నెరవేరుస్తున్నారు. నాలాంటి ఎంతోమంది పేద విద్యార్ధులకు మీరు చేసే సాయం ఎప్పటికీ మరువలేము, ధ్యాంక్యూ వెరీమచ్ సార్. -
లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఏ ఒక్క లబ్ధిదారుడు నష్టపోకూడదన్నదే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తమది రైతులు, పేదల కష్టాలు తెలిసిన ప్రభుత్వమన్నారు. అర్హులైనప్పటికీ ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి మరో అవకాశం కల్పిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 2,79,065 మందికి రూ.590.91 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హత ఉండి సంక్షేమ పథకాలు పొందని వారికి అవకాశం ఇచ్చాం. పలు సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నిధులు జమ చేస్తున్నాం. అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఈ మాదిరిగా సంక్షేమ పథకాలు ఇవ్వడం దేశ చరిత్రలోనే లేదని సీఎం అన్నారు. ‘‘లంచాలు, వివక్షకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. మూడున్నరేళ్లలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.1.85 లక్షల కోట్లు జమ చేశాం. డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా మొత్తం రూ.3.30 లక్షల కోట్లు అందించాం. సంక్షేమ పథకాల అమలులో కలెక్టర్ల పాత్ర చాలా కీలకం. గత ప్రభుత్వంలో ఏ పార్టీ అని అడిగి పథకాలు ఇచ్చేవారు. లంచాలు లేకుండా గత ప్రభుత్వం ఏ పథకం ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు వసూళ్లకు పాల్పడ్డాయి’’ అని సీఎం జగన్ అన్నారు. వంద శాతం సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యం సాధ్యమైనంత వరకు పథకాలను ఎలా ఎగ్గొట్టాలనే గత పాలకుల ఆలోచనలకు పూర్తి భిన్నంగా అర్హులందరికీ వంద శాతం సంతృప్త స్థాయిలో సంక్షేమ ఫలాలను అందించడమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలన కొనసాగుతోంది. ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాలు అందని వారు ఆ పథకం ద్వారా లబ్ధి చేకూర్చిన నెలలోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే వెరిఫై చేసి ప్రభుత్వం ఏటా రెండు దఫాలు ప్రయోజనాన్ని అందచేస్తోంది. డిసెంబర్ నుంచి మే వరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిని జూన్‌లో అందిస్తుండగా జూన్ నుంచి నవంబర్ వరకు అమలైన పథకాల ప్రయోజనాన్ని మిగిలిపోయిన అర్హులకు డిసెంబర్లో అందిస్తోంది. దీంతోపాటు కొత్తగా జూన్ 22 నుంచి నవంబర్ వరకు పెన్షన్ కార్డులు, బియ్యం కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు, ఇళ్ల పట్టాలకు సంబంధించి అర్హుల వెరిఫికేషన్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ నెల 30వ తేదీన తుది జాబితాను ప్రకటిస్తారు. జనవరి 1 నుంచి పెంచిన పెన్షన్‌తో పాటు అన్ని కార్డులను వలంటీర్లు ఇంటికే వచ్చి అందిస్తారు. -
వైయస్సార్ జగనన్న కాలనీ గృహ లబ్ధిదారులతో కొడాలి నాని ,జోగి రమేష్
-
రూ.7 డిపాజిట్ చేస్తే నెలకు రూ.5000 పెన్షన్ పొందవచ్చు!
దేశంలో అర్హులైన పౌరులకు 60 ఏళ్ల తర్వాత స్థిరమైన నెలవారీ ఆదాయాన్ని అందించే లక్ష్యంతో కేంద్రం 2015-16 ఆర్థిక సంవత్సరంలో అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ప్రారంభించింది . ఈ పథకం పెన్షన్ ఫండ్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఆర్డీఏ) నియంత్రణలో పనిచేస్తుంది. బెన్ఫిట్స్ ఈ పథకం కింద ఒక వ్యక్తి 60 ఏళ్లు నిండిన తర్వాత డిపాజిట్ చేసిన మొత్తాన్ని బట్టి కనీసం నెలకు రూ. 1,000, రూ. 2,000, రూ. 3,000, రూ. 4,000, గరిష్టంగా రూ. 5,000 పెన్షన్ పొందవచ్చు. అటల్ పెన్షన్ పథకానికి అర్హులు ఇంతకుముందు ఈ పథకం అసంఘటిత రంగాల్లో పనిచేసే వ్యక్తుల కోసం మాత్రమే ప్రారంభించబడింది. ఇప్పుడు 18 నుండి 40 సంవత్సరాల వయస్సు గల భారతీయ పౌరులు ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో డిపాజిటర్లు 60 ఏళ్ల తర్వాత నెల నెల పెన్షన్ పొందడం ప్రారంభిస్తారు. అయితే, పన్ను చెల్లింపుదారులు ఇకపై అక్టోబర్ 1, 2022 నాటికి ఈ ప్రభుత్వ పెన్షన్ పథకంలో పెట్టుబడి పెట్టడానికి అన్హరులు. ఈ పెన్షన్ స్కీమ్‌లో చేరాలనుకునేవారికి ఈ పథకాన్ని పొందేందుకు, ఒక వ్యక్తి తప్పనిసరిగా సేవింగ్స్ బ్యాంక్ ఖాతా లేదా ఆధార్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, పోస్టాఫీస్ ఖాతాను కలిగి ఉండాలి. రూ. 5000 పెన్షన్ ఎలా పొందాలి లబ్ధిదారులు తప్పనిసరిగా నెలవారీ, త్రైమాసిక, సెమీ యాన్యవల్ డిపాజిట్ చేయాలి. ఇలా చేస్తే 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.1,000 నుండి రూ. 5,000 వరకు పెన్షన్ పొందవచ్చు. రూ.7లతో..రూ.5000 పెన్షన్ ఒక వ్యక్తి 18 సంవత్సరాల వయస్సులో పథకంలో చేరి నెలకు రూ. 210, లేదా రోజుకు రూ.7 డిపాజిట్ చేస్తే ప్రతి నెలా రూ. 5వేలు పెన్షగా తీసుకోవచ్చు. అదేవిధంగా త్రైమాసికానికి (3నెలల కాలానికి) రూ. 626, 6 నెలలకు రూ.1239, నెలకు రూ.42 డిపాజిట్ చేస్తే నెలకు పెన్షన్ రూ. 1000 పొందవచ్చు. లేదంటే రూ.2వేలు పెన్షన్ కావాలంటే నెలకు రూ.84, రూ.3వేలు కావాలంటే నెలకు రూ.126 డిపాజిట్ చేయాలి. నెలవారీ పెన్షన్ రూ. 4000 కావాలనుకుంటే రూ.168 డిపాజిట్ చేయాలి. పన్ను ప్రయోజనాలు పథకంలో పెట్టుబడి పెట్టే వారు ఆదాయపు పన్ను చట్టం 80 సి కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనం పొందుతారు. ఇది కాకుండా, కొన్ని సందర్భాల్లో రూ. 50,000 వరకు అదనపు పన్ను ప్రయోజనం లభిస్తుంది. మొత్తంగా ఈ పథకం ద్వారా రూ. 2 లక్షల వరకు మినహాయింపు లభిస్తుంది. అటల్ పెన్షన్ స్కీమ్‌లో చేరడం ఎలా? మీ బ్యాంక్ సేవింగ్ అకౌంట్ ఉన్న బ్యాంక్ బ్రాంచ్‌లో అటల్ పెన్షన్ యోజన రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. అవసరమైన వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి. ఆధార్ కార్డు తో పాటు వ్యక్తిగత వివరాల్ని అందించాలి. యాక్టీవ్‌గా ఉన్న ఫోన్ నెంబర్‌ను అందిస్తే సరిపోతుంది. -
మూడేళ్లలో 67% తగ్గిన పీఎం కిసాన్ లబ్ధిదారులు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ పథకం లబ్ధిదారులు ఏటికేడు తగ్గిపోతున్నారు. 2019 ఫిబ్రవరిలో ఈ పథకం ప్రారంభమైన సమయంలో మొదటి విడత లబ్ధిదారుల సంఖ్య 11.84 కోట్ల మంది కాగా, ఈ ఏడాది జూన్‌లో మొదటి ఇన్స్టాల్మెంట్ 3.87 కోట్ల మంది ఖాతాల్లోనే జమ అయింది. అంటే, దాదాపు 8 కోట్ల మంది రైతులను ఈ జాబితా నుంచి తొలగించారు. సమాచార హక్కు చట్టం(ఆర్టీఏ) కింద అడిగిన ప్రశ్నకు సాక్షాత్తూ కేంద్ర వ్యవసాయ శాఖ ఈ మేరకు సమాధానమిచ్చింది. లబ్ధిదారుల సంఖ్య 67% తగ్గిపోవడానికి దారితీసిన కారణాలను మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు. పీఎం–కిసాన్ పథకం ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రూ.2 లక్షల కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఏడాదికి రూ.6 వేలను రూ.2 వేల చొప్పున మూడు విడతలుగా ఏడాదిలో రైతులకు అందించేందుకు పీఎం–కిసాన్‌ను కేంద్రం 2019 ఫిబ్రవరిలో లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో తాజాగా 12వ విడత ఇన్‌స్టాల్‌మెంట్‌ను చెల్లించింది. మొదటి విడతలో 11.84 కోట్ల రైతులు లబ్ధిదారులుగా ఉండగా, ఆరో విడత వచ్చే సరికి ఈ సంఖ్య 9.87 కోట్లకు తగ్గింది. ఆ తర్వాత క్రమేపీ తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో లబ్ధిదారుల సంఖ్య 55.68 లక్షల నుంచి 28.2 లక్షలకు, మహారాష్ట్రలో 1.09 కోట్ల నుంచి 37.51 లక్షలకు, గుజరాత్లో 63.13 లక్షల నుంచి 28.41 లక్షలకు రైతు లబ్ధిదారుల సంఖ్య పడిపోయింది. దేశంలోని మూడొంతుల మంది రైతుల్లో రెండొంతుల మందికి కూడా పీఎం–కిసాన్ అందకపోవడం దారుణమని ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రెసిడెంట్ అశోక్ ధావలె అంటున్నారు. ఈ పథకాన్ని క్రమేపీ కనుమరుగు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. -
పొలిటికల్ కారిడార్ : దత్తపుత్రుడి అగచాట్లు ..
-
జనసేన నేతలపై తిరగబడుతున్న జనం
-
తల్లికి ‘సంపూర్ణ’ పోషణ.. ఐరన్, పోలిక్ ఆమ్లం, విటమిన్ బీ12 పోషకాలున్న ఫోర్టిఫైడ్ బియ్యం
కళ్యాణదుర్గం (అనంతపురం): తల్లి గర్భం నుంచే శిశువు ఆరోగ్య పరిరక్షణకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. ఇందులో భాగంగా సాధారణ బియ్యానికి అదనంగా ఖనిజ లవణాలు, సూక్ష్మపోషకాలు జోడించి ఇవ్వడం వల్ల శిశువు, ఎదిగే పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం అందించే కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. వ్యాధులతో పోరాడేందుకు తగిన శక్తినిచ్చే పోషక విలువలు కలిగిన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అంగన్వాడీ కేంద్రాల అందిస్తోంది. ప్రతి నెలా క్రమం తప్పని పోషకాలు.. వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం కింద జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు నెలకు 3 కేజీల ఫోర్టిఫైడ్ బియ్యం, 1 కేజీ కందిపప్పు, అర లీటరు నూనె, 25 కోడిగుడ్లు, 5 లీటర్ల పాలను వైఎస్ జగన్ సర్కార్ అందజేస్తోంది. 3 నుంచి 5 ఏళ్లలోపు పిల్లలకు 2 కిలోల ఫోర్టిపైడ్ బియ్యం, అర కేజీ కందిపప్పు, 150 మి.మీల నూనె, 25 కోడిగుడ్లు, 2.5 లీటర్ల పాలు అందిస్తున్నారు. 6 నెలల నుంచి 3 ఏళ్ల లోపు పిల్లలకు 25 కోడిగుడ్లు, 2.5 లీటర్ల పాలు ప్రతి నెలా అంగన్వాడీ కార్యకర్త నేరుగా లబ్దిదారుల ఇంటికెళ్లి అందజేసేలా చర్యలు తీసుకున్నారు. (చదవండి: బొమ్మేస్తే అచ్చు దిగాల్సిందే..!) పోషకాహార లోపాన్ని అధిగమించేలా.. బియ్యంలో ప్రకృతి సహజ సిద్ధమైన సూక్ష్మ పోషకాలు సహజంగానే ఉంటాయి. సూక్ష్మ పోషకాల స్థాయిని మరింత పెంచేందుకు ఆ బియాన్ని పొడి చేసి ఆ పొడిలో ఐరన్, ఫొలిక్ యాసిడ్, విటమిన్ బీ 12 వంటి ఖనిజాలు అదనంగా చేర్చి మళ్లీ బియ్యంగా మారుస్తారు. ఇలా తయారైన బియ్యాన్నే ఫోర్టిఫైడ్ రైస్ (బలవర్థకమైన బియ్యం) అని పిలుస్తారు. చిన్నారులు, గర్బిణులు, బాలింతలకు కీలకమైన సూక్ష్మ పోషకాలను బియ్యంలో అదనంగా చేర్చి అందించడం ద్వారా పోషకాహార లోపాన్ని అధికమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. డబ్ల్యూహెచ్ఓ సిఫారసులకు అనుగుణంగా.. ఫోర్టిఫైడ్ బియ్యం రంగు, రుచి, రూపంలో సాధారణ బియ్యం మాదిరిగానే ఉంటాయి. ఈ బియ్యం రక్తహీనతను అధిగమించి హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. జింక్, విటమిన్ ఏ, విటమిన్ బీ 12, ఫొలిక్ యాసిడ్ వంటి సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా అందజేస్తుంది. దీని వల్ల నాడీ వ్యవస్థ పని తీరు మెరుగుపడుతుంది. మధుమేహం, రక్తపోటును నియంత్రిస్తాయి. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిఫారసుల మేరకు జగన్ ప్రభుత్వం కూడా అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ఉచితంగా అందజేస్తోంది. (చదవండి: అపోహలు వద్దు.. ఆరోగ్యమే ముద్దు) రక్తహీనతను తగ్గిస్తుంది ఫోర్టిపైడ్ బియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల గర్భిణులు, బాలింతల్లో ఆరోగ్యం మెరుగు పడుతుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. చిన్నారులకు సంపూర్ణ పోషకాలను అందజేసినట్లవుతుంది. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఈ బియ్యాన్ని డ్రై రేషన్ కింద అందించేందుకు చర్యలు తీసుకున్నాం. – శ్రీదేవి, ప్రాజెక్ట్ డైరెక్టర్, ఐసీడీఎస్ -
వైఎస్సార్ రైతు భరోసాతో ఎంతో మేలు జరుగుతోంది
-
సీఎం వైఎస్ జగన్ రైతులకు పెద్దదిక్కుగా ఉన్నారు
-
‘మీ వల్లే నాన్న బతికారు.. మిమ్మల్ని చూడాలని వచ్చారు’
సాక్షి, నంద్యాల జిల్లా: రైతు భరోసా సాయాన్ని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ, వైఎస్సార్ రైతు భరోసాతో ఎంతో మేలు జరుగుతోందన్నారు. ఆర్బీకే కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. ఎరువులు కోసం గతంలో రోజుల తరబడి క్యూ ఉండేది. ఇప్పుడు విత్తనం నుంచి విక్రయం దాకా ఆర్బీకేలు అండగా ఉన్నాయి. సీఎం వైఎస్ జగన్ రైతులకు పెద్దదిక్కుగా ఉన్నారన్నారు. ఇంకా లబ్ధిదారులు ఏమన్నారంటే వారి మాటల్లోనే.. చదవండి: గజ దొంగల ముఠా మంచి చెప్పదు.. ఎల్లో మీడియాకు సీఎం జగన్ కౌంటర్ మీ వల్లే ఆయన బతికారు: భూక్యే క్రిష్ణానాయక్, గిరిజన రైతు జగనన్నా నేను నిరుపేద గిరిజన రైతును, నాలుగేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను. మా నాన్న పొలం ఇచ్చాడు కానీ పంట పెట్టుబడికి డబ్బు ఇవ్వలేదు. జగనన్న వచ్చిన తర్వాత పంట పెట్టుబడి సాయం ఇవ్వడంతో నేను వ్యవసాయం మొదలుపెట్టాను. సాగు చేస్తున్నాను. నాకు ఆర్బీకేల ద్వారా పొలంబడిలో అవగాహన కల్పించారు. నేను వరి వేస్తే ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయాను. కానీ జగనన్న ప్రవేశపెట్టిన పంటల బీమా, ఈ కేవైసీ ద్వారా సీజన్ ముగిసేలోగా నాకు రూ. 40 వేలు వచ్చాయి. బ్యాంకు నుంచి లోన్ తీసుకుని సకాలంలో కట్టడం వలన దానికి సున్నావడ్డీ కింద రూ.3 వేలు వచ్చాయి. గతంలో ఎన్నడూ పంట నష్టం, ఇన్పుట్ సబ్సిడీ రాలేదు. ఇప్పుడు అన్నీ వస్తున్నాయి. మా నాన్నకు పింఛన్ వస్తుంది, మా అమ్మ, నాన్నకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సలు జరిగాయి. మీ వల్లే ఆయన బతికారు. ఈ రోజు ఈ సభకు కూడా మిమ్మల్ని చూడాలని వచ్చారు. తెలుగుగంగ ప్రాజెక్ట్ కెనాల్‌కు పిల్ల కాలువలు డాక్టర్ వైఎస్ఆర్ తవ్వించి ఈ నియోజకవర్గానికి సాగు, తాగు నీరు ఇచ్చారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకాన్ని ప్రారంభించినందుకు మా గిరిజనుల తరపున మీకు ధన్యవాదాలు, అందరికీ ధన్యవాదాలు. అమ్మ సంతోషపడింది: దూదేకుల గుర్రప్ప, రైతు జగనన్నా నమస్కారం, అన్నా నేను ఏడు ఎకరాల సాగు చేస్తున్నాను, గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాను. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా సాయం అందింది. మూడేళ్ళ పాటు ఏటా రూ. 13,500 చొప్పున తీసుకున్నాను. మీరు వేశారు నా అకౌంట్లో వచ్చాయి. నాకు పంట నష్టం సాయం కూడా అందింది, దానికింద అక్షరాలా రూ. 30 వేలు సాయం అందింది, పంటల బీమా కూడా అందుతుంది. ప్రతి రైతు ఈ కేవైసీ చేయించుకోవాలి. పంటల బీమా చేయించుకోవాలి. నేను 20 ఏళ్ళుగా వ్యవసాయం చేస్తున్నాం. గతంలో ఎరువుల కోసం క్యూలైన్లో నిలబడి ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళం కానీ ఈరోజు మన గ్రామంలో ఆర్బీకేలో మనకు అందుతున్నాయి. అన్నీ ఇక్కడే అందుతున్నాయి, జగనన్నా మేం గ్రూప్‌గా ఏర్పడి ట్రాక్టర్, కంకుల కటింగ్ మిషన్, ఇతర సామాగ్రి తీసుకున్నాం, మాకు సబ్సిడీ అందింది, మేం రైతులకు తక్కువ రేట్లకే వ్యవసాయ పనులకు పనిముట్లను ఇస్తున్నాం. మా అమ్మకు క్యాన్సర్ ఆపరేషన్ జరిగితే సీఎంఆర్ఎఫ్ కింద రూ. 60 వేలు వచ్చాయి. కొడుకుగా నా బాధ్యత జగన్ తీసుకున్నారని అమ్మ సంతోషపడింది. మా కుటుంబ సభ్యుడివి అన్నా, ఇన్పుట్ సబ్సిడీ కూడా అందింది. మన జగనన్నను మనం 175 కి 175 సీట్లతో గెలిపించాలి. మన రైతులు, మన అక్కచెల్లెల్లు మనం గెలిపించుకోవాలి, ధన్యవాదాలు. -
ఏపీలో పింఛన్ల పండగ.. కొనసాగుతున్న ‘వైఎస్సార్ పెన్షన్ల కానుక’ పంపిణీ
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ కొనసాగుతోంది. 62.69 లక్షల మంది పెన్షనర్లకు రూ.1594.66 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. తెల్లవారుజాము నుంచే ఇంటింటికి వెళ్లి వాలంటీర్లు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఉదయం 9.20 గంటల వరకు 64.83 శాతం పెన్షన్లు పంపిణీ చేసినట్లు డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు తెలిపారు. 41.27 లక్షల మందికి రూ.1048.23 కోట్ల నగదు పంపిణీ జరిగినట్లు ఆయన వెల్లడించారు. చదవండి: మూడు రోజుల పాటు సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే -
జగనన్నతోడు లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేసిన సీఎం జగన్
-
ఇదే చివరి అవకాశం.. ఇలా చేయకపోతే డబ్బులు పడవు
అనంతపురం అగ్రికల్చర్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల లబ్ధి పొందాలంటే ఈ–కేవైసీ (ఎలక్ట్రానిక్ నోయువర్ కస్టమర్) తప్పని సరి అయింది. ఈ ఏడాది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం అందజేసే రూ.2వేల చొప్పున ఏటా రూ.6వేలు జమ కావాలంటే రైతులు తప్పనిసరిగా ఈ–కేవైసీ చేయించుకోవాలి. ఈ నెల 31వ తేదీలోపు ఈ–కేవైసీ చేయించుకోకపోతే పథకం లబ్ధిని కోల్పోయే ప్రమాదం ఉంది. చదవండి: నష్టమే రాని పంట.. ఒక్కసారి సాగుచేస్తే 40 ఏళ్ల వరకు దిగుబడి ఈ–కేవైసీ, కేవైసీ రెండూ వేర్వేరు.. ఈ–కేవైసీ, కేవైసీ (నో యువర్ కస్టమర్) రెండు విధానాలు వేర్వేరు. ఓటీపీ ఆధారంగా చేసే విధానాన్ని ఈ–కేవైసీ అంటారు. ఆధార్ రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీతో ఈ–కేవైసీని పూర్తి చేస్తారు. అలాగే కేవైసీని డాక్యుమెంట్ల ఆధారంగా పూర్తి చేస్తారు. ఇంతకు మునుపు కేవైసీ చేయించిన పీఎం కిసాన్ లబ్ధిదారులు మళ్లీ ఈ–కేవైసీ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆర్బీఐ ఆదేశాల మేరకు మనీ ల్యాండరింగ్, ఫేక్ అకౌంట్లను అరికట్టేందుకు ఈ–కేవైసీ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానం వల్ల అనర్హులకు సంక్షేమ పథకాలు నిలిచిపోతాయి. దీంతో ప్రజాధనం ఆదా అవుతోంది. స్మార్ట్ ఫోన్ ఉంటే ఇంట్లోనే ఇలా... స్మార్ట్‌ఫోన్ ఉంటే ఇంట్లోనే ఈ–కేవైసీని అప్డేట్ చేసుకోవచ్చు. ముందుగా www.pmkisan.gov.in వెబ్సైట్లోకి వెళ్లి ఆధార్ నంబర్ నమోదు చేసుకోవాలి. అప్పుడు ఆధార్‌కార్డుకు లింకై ఉన్న మొబైల్ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే గెట్ పీఎం కిసాన్ ఓటీపీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. మళ్లీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి సబ్మిట్ చేస్తే ఈ–కేవైసీ అప్డేట్ అవుతుంది. కస్టమర్ సర్వీస్ సెంటర్లలో... జిల్లాలోని దాదాపు అన్ని మండల కేంద్రాల్లో ఉన్న కస్టమర్ సర్వీస్ సెంటర్లలో (సీఎస్సీ) రైతుల సౌకర్యార్థం ఈ–కేవైసీ చేస్తున్నారు. ఆన్లైన్ కేంద్రాలు, మీసేవ కేంద్రాల్లోనూ ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఈ నెల 31 లోపు రైతులు ఈ–కేవైసీని పూర్తి చేసుకోవాలి. లేకపోతే ఈ పథకం వర్తించదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలుమార్లు ఈ–కేవైసీ నమోదుకు గడువు పొడగిస్తూ వచ్చింది. ఇదే చివరి అవకాశం కావడంతో రైతులను ఉమ్మడి జిల్లా వ్యవసాయశాఖ అధికారులు చైతన్య పరుస్తున్నారు. అవకాశం జారవిడుచుకోవద్దు.. పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద రూ.2 వేలు చొప్పున ఏటా మూడు విడతల్లో రూ.6 వేలు లబ్ధి చేకూరుతుంది. అర్హత ఉన్న ప్రతి రైతూ ఆధార్, దానికి అనుసంధానమైన ఫోన్ నెంబరు, అలాగే ఓటీపీ నెంబరు ఆధారంగా అథెంటిఫికేషన్ చేసుకోవాలి. రైతులు ఈ విషయాన్ని గమనించి సాధ్యమైనంత తొందరగా ఈకేవైసీ చేయించుకోవాలి. ఇదే చివరి అవకాశం.. జారవిడుచుకోవద్దు. – బి.చంద్రానాయక్, డీఏఓ -
పాపం ఈ కుర్రాళ్లు .. పుట్టుకతో వృద్ధులు
చెన్నై: సహజంగా అందరూ వృద్ధాప్యంలోనూ యవ్వనవంతులుగా ఉండాలని కోరుకుంటారు. అయితే తమిళనాడులో కొందరు యవ్వనంలోనే సీనియర్ సిటిజన్స్‌గా ప్రచారంగా చేసుకుంటూ “కొంత మంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు’అనే శ్రీశ్రీ రాసిన కవితను తలపిస్తున్నారు. నకిలీ ధ్రువపత్రాలను సమర్పించి వృద్ధ్యాప్య పింఛను స్వాహా చేస్తున్న చెన్నై, కాంచీపురం జిల్లాలకు చెందిన 4,191 మంది పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల్లో వృద్ధ్యాప్య పింఛను కూడా ఒకటి. బంధువుల ఆసరా లేకుండా, సొంతిల్లు, రెండు వంట గ్యాస్ సిలిండర్ల కనెక్షన్, బ్యాంకులో రూ.1 లక్షకు మించని నగదు, 5 సవర్లకు మించని బంగారు నగలు తదితర నిబంధనలకు లోబడి జీవించే 60 ఏళ్లు పైబడిన వారు వృద్ధ్యాప్య పింఛనుకు దరఖాస్తు చేసుకోవచ్చు. సర్టిఫికేట్లు తనిఖీ చేసిన తరువాత అర్హత ఉన్నట్లు నిర్ధారణ అయితే నెలకు రూ.1000 పింఛను మంజూరు చేస్తారు. అవకతవకలపై ఫిర్యాదులు పెన్షన్ మంజూరులో రాష్ట్రవ్యాప్తంగా అనేక అక్రమాలు చోటు చేసుకున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. కాంచీపురం జిల్లాలో 60,500 మంది పింఛను పొందుతున్నారు. వీరిలో కొందరు మంచి వసతులతో కూడిన జీవిస్తున్నా తప్పుడు పత్రాలను సమర్పించి పెన్షన్ పొందుతున్నట్లు అనుమానాలు తలెత్తడంతో అధికారుల బృందం విచారణ ప్రారంభించింది. ఆయా తాలూకాల, గ్రామ నిర్వాహకుల కార్యాలయాలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ల సాయంతో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించింది. ఒక్క కాంచీపురం జిల్లాల్లోనే 4,180 మంది నకిలీ లబ్ధిదారులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వారందరిని వృద్ధ్యాప్య పింఛనుకు అనర్హులుగా ప్రకటించి లబ్ధిదారుల జాబితా నుంచి వారి పేర్లను తొలగించారు. ఇక చెన్నై జిల్లాలో సాంఘిక సంక్షేమశాఖ పథకం కింద వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితరులు 1.95 లక్షల మంది పింఛన్ పొందుతున్నారు. వీరిలో కొందరు నకిలీ లబ్ధిదారులని ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టారు. 11 వేల బోగస్ పింఛనుదారులను జాబితా నుంచి తొలగించారు. రెండు జిల్లాల్లోనే ఇంత పెద్ద సంఖ్యలో నకిలీ లబ్ధిదారులు పట్టుబడటంతో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చదవండి: చెన్నైలోని ఐసీఎఫ్.. ప్రపంచ దేశాల్లో ఈ పేరు మారుమోగుతోంది.. ఎందుకో తెలుసా! -
‘జగనన్నే నా ఇద్దరు బిడ్డలను చదివిస్తున్నారు’
జగనన్నే నా ఇద్దరు బిడ్డలను చదివిస్తున్నారు. ఆడపిల్లలను నా చేతిలో పెట్టి నా భర్త పదేళ్ల క్రితమే కాలం చేశాడు. ఇద్దరిని చదివించడం నా శక్తికి మించిన పని. జగనన్న చలువతో నా పెద్ద కూతురు ప్రియాంక బీకామ్ రెండో సంవత్సరం చదువుతోంది. విద్యా దీవెన కింద ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి రూ.2,875 లెక్కన ఇప్పటికి ఐదు పర్యాయాలు అందించింది. వసతి దీవెన కింద రూ.10 వేలు వంతున అందిస్తోంది. నా రెండో కూతురు మనీషా ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అమ్మ ఒడి నగదుతో ఈ అమ్మాయిని చదివిస్తున్నాం. -కుమార్తె ప్రియాంకతో తల్లి ప్రభావతి, పుత్తూరు నేను వ్యవసాయ కూలీని. నా కుమార్తె దీప్తి చిత్తూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతోంది. ప్రభుత్వ సాయంతోనే బిడ్డను చదివించుకోగలుగుతున్నాం. పాపకు విద్యాదీవెన నగదు అందుతోంది. పేద పిల్లల చదువుకు భరోసా ఇస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రుణం ఎప్పటికీ తీర్చుకోలేం. జీవితాంతం ఆయన వెంట నడుస్తాం. -శివయ్య. జంగాలపల్లె, ఐరాల మండలం మాది వైఎస్సార్ జిల్లా బద్వేలు. మేము ఐదుగురు అక్కచెల్లెళ్లం. మా నాన్న వ్యవసాయ కూలీ. ఇల్లు గడవడమే కష్టం. మమ్మల్ని పదోతరగతి వరకు చదివించేందుకు నానా అవస్థలు పడ్డారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మా చదువు కోసం దిగులు తప్పింది. అమ్మ ఒడి నగదుతో మా చెల్లెలు, విద్యాదీవెన పథకం ద్వారా నేను మా అక్క చక్కగా చదువుకుంటున్నాం. ప్రస్తుతం నేను తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ థర్డ్ ఇయర్ చదువుతున్నా. జగనన్న అందిస్తున్న పథకాలతో మా చదువును కొనసాగించగలమనే భరోసా వచ్చింది. – వి.దీప్తి, విద్యార్థిని, శ్రీపద్మావతి డిగ్రీ కళాశాల, తిరుపతి చదువుకు పేదరికం అడ్డంకిగా మారకూడదు.. ఆర్థిక స్థోమత లేక ఒక్క విద్యార్థి కూడా విద్యకు దూరం కాకూడదు.. పిల్లల కలలు సాకారం చేసుకునేందుకు ఉన్నతంగా చదువుకోవాలి.. ఆధునిక సమాజంలో అత్యున్నతంగా ఎదగాలి.. పోటీ ప్రపంచంలో దీటుగా రాణించాలి. మేలైన అవకాశాలు అందుకుని రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలి’’.. ఇదే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యావిప్లవానికి తెరతీశారు. అందులో భాగంగా పేద పిల్లల ఉన్నత చదువుల కోసం జగనన్న విద్యాదీవెన పథకం ప్రారంభించారు. ఏటా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ నగదును జమ చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ మైదానంలో ఏర్పాటు చేసిన సభా వేదిక నుంచి దీవెన సొమ్మును లబ్ధిదారులకు అందించేందుకు శ్రీకారం చుట్టనున్నారు. సాక్షి, చిత్తూరు కలెక్టరేట్/తిరుపతి అర్బన్: ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. విద్యాదీవెన పథకంతో సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తూ భరోసా కల్పిస్తోంది. అందులో భాగంగా 2021–22 విద్యాసంవత్సరంలో జనవరి– మార్చికి సంబంధించి నగదు సాయం అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు తిరుపతి వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అర్హులైన పేద విద్యార్థులందరికీ విద్యాదీవెన పథకం కింద లబ్ధి చేకూర్చనున్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా.. ఒక కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉన్నత చదువులు చదువుతున్నప్పటికీ ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన పథకం వర్తింపజేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సకాలంలో నిధులను తల్లుల ఖాతాల్లో జమచేస్తోంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి నగదును నేరుగా అందించడం ద్వారా పిల్లల చదువులు, కళాశాలల్లో మౌళిక వసతులను తల్లిదండ్రులు పరిశీలించే అవకాశం ఉంటుందని విద్యావేత్తలు చెబుతున్నారు. కళాశాలల్లో ఏవైనా లోటుపాట్లు ఉంటే యాజమాన్యాలను ప్రశ్నించగలిగేలా అవకాశముంటుందని వెల్లడిస్తున్నారు. కాలేజీ యాజమాన్యాల్లో జవాబుదారీతనం, పిల్లల బాగోగులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ రెండూ జరుగుతోందని వివరిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం నగదు జమ గత టీడీపీ ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పూర్తి నిర్వీర్యం చేశారు. పిల్లల ఫీజు కట్టేందుకు తల్లిదండ్రులు అప్పులు చేయాల్సిన దుస్థితి కల్పించారు. విద్యార్థులను ఆయా కళాశాల యాజమాన్యాలు నానా అవస్థలు పెట్టిన తర్వాత అరకొరా ఫీజు చెల్లించి చేతులు దులుపుకునేవారు. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్థులు రోడ్లపై ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. వీటన్నింటికీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెక్ పెట్టింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పెండింగ్ లేకుండా ఫీజురీయింబర్స్ విడుదల చేస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తోంది. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో సుమారు రూ.452.52 కోట్లు విద్యాదీవెన కింద లబ్ధిదారులకు అందించింది. చివరకు ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనూ దీవెన పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తోంది. మూడేళ్లుగా ఈ ప్రాంతానికి చెందిన సుమారు 17,900 మంది పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేసింది. మా ఇంట్లో ఇద్దరికీ లబ్ధి మా నాన్న జయకృష్ణ చిరువ్యాపారి. నా చెల్లెలు కావ్య బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతోంది. నేను ప్రస్తుతం బీఎస్సీ ఫైనలియర్ చదువుతున్నా. మా ఇంట్లో ఇద్దరికీ విద్యాదీవెన పథకం కింద ఆర్థిక సాయం అందుతోంది. ఇదివరకు మమ్మల్ని చదివించేందుకు నాన్న ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ప్రభుత్వ భరోసాతో వారిపై భారం తగ్గింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రుణం తీర్చుకోలేం. – కిషోర్, విద్యార్థి, గోవిందపురం, వి.కోట మండలం జగనన్న మేలు..జన్మలో మరువలేం నేను వ్యవసాయ కూలీని. ముగ్గురు పిల్లలు. ఒకమ్మాయికి పెళ్లి చేశా. మరో ఇద్దరిని చదివించేందుకు నానా అవస్థలు పడేవాడిని. ఫీజు కట్టేందుకు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొనేవాడిని. ఇప్పుడు ప్రభుత్వం అందిస్తున్న నగదు సాయంతో ఫీజుల బాధ తప్పింది. ముఖ్యమంత్రి జగనన్న చలువ వల్ల నా కుమారుడు హరికృష్ణ కుప్పంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు. రెండో అమ్మాయి ఇంటర్ సెకండియర్ చదువుతోంది. జగనన్న మేలును జన్మలో మరువలేను. – కుమారుడు హరికృష్ణతో వేమన్న, కణ్ణమ్మ దంపతులు అర్హులందరికీ అందిస్తాం అర్హులైన విద్యార్థులందరికీ విద్యాదీవెన పథకం వర్తింపజేశాం. సచివాలయాల ద్వారా పథకంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. గురువారం కలెక్టరేట్లో కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ, కాపు, బీసీ, ఈబీసీ, క్రిస్టియన్ మైనారిటీ శాఖల ద్వారా ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తాం. – హరినారాయణన్, చిత్తూరు కలెక్టర్ -
మూడు వారాలు గడిచినా అందని ‘ఆసరా’.. ఇక కొత్త పింఛన్లు వచ్చేదెప్పుడో?
ఈమె పేరు నర్సమ్మ. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మున్సి పాలిటీలో విలీనమైన తుప త్రాల్ల గ్రామానికి చెందిన నర్సమ్మకు ఆసరా పింఛనే ఆధారం. భర్త ఇదివరకే మృతిచెందగా ఇద్దరు కుమారులు బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లారు. ప్రతినెలా ఆలస్యంగా వస్తున్న పింఛన్ వల్ల కాళ్ల నొప్పుల మందులు కొనుక్కోనేందుకు ఇబ్బంది పడుతోంది. గత నెల 22న పింఛన్ రాగా ఈ నెల ఇప్పటివరకు రాలేదని చెప్పింది. పింఛన్ పడిందేమోనని ఇప్పటికే నాలుగుసార్లు 4 కి.మీ. దూరంలోని అయిజ బ్యాంకుకు వెళ్లానని.. ప్రతిసారీ భోజనానికి రూ.50, చార్జీలు రూ. 20 అవుతున్నాయని తెలిపింది. ఈ గిరిజన మహిళ పేరు బుడ్డమ్మ. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని పెద్దతండా గ్రామంలో నివసిస్తోంది. ఉన్న ఒక్క కొడుకు, కోడలు బతుకుదెరువుకు హైదరాబాద్ వలస వెళ్లారు. భర్త కాలం చేయగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో ఉన్న పొలం ముంపునకు గురైంది. ఉన్న కొద్దిపాటి పొలం చూసుకుంటూ జీవిస్తోంది. ప్రభుత్వం ఇచ్చే ఆసరా పింఛనే ఆమెకు అండగా మారింది. కానీ గత కొన్ని నెలలుగా పింఛన్ సకాలంలో అందక ఇబ్బంది పడుతోంది. పింఛన్ కోసం గ్రామ పంచాయతీకి రోజూ వెళ్లి వాకబు చేస్తోంది. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఇది ఒకరిద్దరి వ్యథ మాత్రమే కాదు... రాష్ట్రవ్యాప్తంగా ఆసరా పింఛన్ లబ్ధిదారులందరి దీన గాథ ఇదే. ఆసరా లేని పేదలకు సాయం అందించి ఆదుకోవాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలనెలా ఆసరా పింఛన్లు అందిస్తోంది. అయితే కొంతకాలంగా ప్రతి నెలా పింఛన్ డబ్బు లు సకాలంలో అందక వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులతో పాటు మరికొన్ని వర్గాల లబ్ధిదారులు ఇబ్బం దులు పడుతున్నారు. 2–3 నెలల నుంచి మరీ ఆలస్యం.. రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, ది వ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు, బీడీ వర్కర్లు, ఫైలేరియా బాధితు లు సుమారు 38.75 లక్షల మందికి నెలనెలా ఆస రా పింఛన్లు అందుతున్నాయి. గతంలో వీరికి ప్రతి నెలా మొదటి వారంలోనే పింఛన్ డబ్బులు అందేవి. కరోనా కాలంలో అంటే 2020 నుంచి పెన్షన్ పంపిణీలో జాప్యం చోటుచేసుకుంది. 2021లో ఆర్థిక వ్యవస్థ గాడి న పడిన తర్వాత పెద్దగా ఆలస్యం జరగలేదు. కానీ ఇటీవల 2–3 నెలల నుంచి పింఛన్ డబ్బులు 20వ తేదీ తర్వాతే బ్యాంకులు, పోస్టాఫీసు ఖాతాల్లో జమ వుతున్నాయి. గత నెలలో 25 తర్వాతే డబ్బులు జమవగా వరుస సెలవుతో 28వ తేదీ నుంచి లబ్ధిదారులకు అందాయి. ఈ నెలలో ఇప్పటి వరకూ డబ్బులు ఖాతాల్లో జమకాకపోవడంతో పింఛ న్‌దారులు ఆందోళనలో కొట్టుమిట్టాడు తు న్నారు. పోస్టాఫీసులు, మండల కేంద్రాల్లోని బ్యాంకుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇంకా నెరవేరని ‘కుదింపు’ హామీ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు కనీస వయసు పరిమితిని 65 నుంచి 57 ఏళ్లకు కుదించింది. 2018లో ఎన్నికల సమయంలో వృద్ధులకు ఈ మేరకు అధికార టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. మేనిఫెస్టోలో సైతం పెట్టింది. ఈ మేరకు అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు సైతం స్వీకరించినా కార్యరూపం దాల్చలేదు. మార్చిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆసరా పింఛన్లకు రూ. 11,728 కోట్లు కేటాయిస్తున్నామని.. కుదించిన వయసు మేరకు లబ్ధిదారులకు ఏప్రిల్ నుంచి పింఛన్లు ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. అయినా ఇప్పటివరకు పురోగతి లేదు. మొత్తానికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 13 లక్షల మంది కొత్త పింఛన్లు ఎప్పుడొస్తాయా అని మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్నారు. కొడుకులు పట్టించుకోవట్లేదు.. నాకు బీపీ, షుగర్ ఇతర మందులకు నెలకు రూ. 1,500 వరకు ఖర్చవుతుంది. పింఛన్ వస్తదని నా కొడుకులు పట్టించుకోవట్లేదు. కానీ 3 నెలలుగా ఆలస్యంగా వస్తుండటంతో ఇబ్బంది పడుతున్నా. – పోచయ్య, వృద్ధుడు, జంగరాయి, చిన్నశంకరంపేట, మెదక్ ముసలోళ్లమని ఎవరూ చేబదులివ్వట్లేదు గత రెండు నెలలుగా ఆలస్యంగా పింఛన్ రావడంతో సకాలంలో మందులు కొనుక్కోలేకపోతున్నా. ఈ నెల ఇప్పటివరకు పింఛన్ రాలేదు. ఎవరినైనా డబ్బులు బదులు అడిగితే ముసలోళ్లమని ఇవ్వట్లేదు. – నాగవ్వ, వృద్ధ్యాప్య పింఛన్ లబ్ధిదారురాలు, బాల్కొండ, నిజామాబాద్ -
దళితబంధు: మళ్లీ ఎమ్మెల్యేలకే పగ్గాలు!
సాక్షి, హైదరాబాద్: దళితబంధు లబ్ధిదారుల ఎంపికను ఈసారి కూడా ఎమ్మెల్యేలకే అప్పగించే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ప్రతిపాదనలు రూపొందిస్తోంది. 2021–22 సంవత్సరంలో ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌కు 100 యూనిట్లు మంజూరు చేయగా సంబంధిత శాసనసభ్యులే ప్రత్యేక చొరవతో లబ్ధిదారుల ఎంపిక చేపట్టారు. ఈసారి ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి 1,500 యూనిట్లు మంజూరు చేయడంతో ఈ దఫా కూడా ఎమ్మెల్యేలకు ఎంపిక బాధ్యత అప్పగిస్తే బాగుంటుందని ప్రభుత్వానికి ఎస్సీ కార్పొరేషన్ సూచిస్తోంది. కార్యాచరణ ప్రణాళికలో ఎమ్మెల్యేల ద్వారా ఎంపికకు ప్రాధాన్యం ఇవ్వాలంటోంది. అయితే ఎమ్మెల్యేలకు ఎంపిక బాధ్యతపై క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పథకానికి అనూహ్య స్పందన రావడంతో.. 2021–22లో తొలుత హుజూరాబాద్‌లో, ఆ తర్వాత మరో 4 మండలాల్లో దళితబంధు పథకాన్ని అమల్లోకి తెచ్చారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 100 చొప్పున యూనిట్లు మం జూరు చేసి లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పగించింది. యుద్ధ ప్రాతిపదికన లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ఆదేశించారు. దీంతో దాదాపు నెల వ్యవధిలో అన్ని నియోజకవర్గాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఏడాది లబ్ధిదారుల సంఖ్యను 100 నుంచి 1,500కు పెంచింది. ఈ బడ్జెట్లో పథకానికి రూ.17,700 కోట్లు కేటాయించింది. హుజూరాబాద్ మినహా మిగతా 118 అసెంబ్లీ సెగ్మెంట్లలో పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. ఉన్నతాధికారులకు బాధ్యతలు ఇవ్వాలంటూ.. వాస్తవానికి ఈ పథకం కింద లబ్ధిదారుల ఎంపికపై ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదు. ఎమ్మెల్యేలు సైతం పేర్లను ఎంపిక చేసి ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించారు. అయితే ఎమ్మెల్యేకు సన్నిహితంగా ఉంటున్న వ్యక్తులకే దళితబంధు కట్టబెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యేలకు కాకుండా ప్రభుత్వ అధికారులకే బాధ్యతలు ఇవ్వాలని కొందరు సూచనలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. -
Dalit Bandhu: ‘గులాబీ’లకే దళితబంధు!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం లబ్ధిదారుల ఎంపికలో అధికార పార్టీకి చెందిన వారికే ప్రాధాన్యం దక్కిందని పలువురు ఆరోపిస్తున్నారు. లబ్ధిదారులను ఎంపిక చేసే అధికారం ఎమ్మెల్యేలకు ఇవ్వడంతో వారి అనుయాయులకే యూనిట్లు కేటాయించినట్లు సమాచారం. ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి వంద యూనిట్లను కేటాయించింది. వీటిలో దాదాపు 90 శాతానికి పైగా అధికార పార్టీ వారికి కేటాయించినట్లు తెలుస్తోంది. చదవండి: రహస్య సర్వే: హస్తం కేడర్‌పై.. అధిష్టానం నజర్.. ఎంపిక చేసిన జాబితాలో టీఆర్ఎస్ కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎక్కువగా ఉన్నారు. కొన్ని మండలాల్లో సదరు కార్యకర్తలు తమ సమీప బంధువుల పేర్లమీద ఏకంగా రెండు నుంచి మూడు వరకు యూనిట్లు పెట్టుకున్నారు. ఇందులో గతంలో హార్వెస్టర్లు, ట్రాక్టర్లు పొందిన వారు సైతం ఉండడం గమనార్హం. దీంతో నిరుపేద దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం 100 యూనిట్లే కావడంతో మొదట ఇబ్బందులు పడిన ఎమ్మెల్యేలు తరువాత ఏదైతే అదైంది అన్న రీతిలో తమ అనుయాయులకే ప్రాధాన్యం ఇచ్చినట్లు సమాచారం. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా లబ్ధిదారుల ఎంపిక విషయంలో మొదట ఇబ్బంది పడినట్లు తెలిసింది. లబ్ధిదారుల ఎంపిక జాబితాను వెంటవెంటనే మూడు సార్లు మార్పు చేయడం గమనార్హం. రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ డిచ్పల్లి మండలం సాంపల్లిలో 15, నిజామాబాద్ రూరల్ మండలం ముత్తకుంటలో 14, సిరికొండ మండల కేంద్రంలో 1, ముషీర్‌నగర్‌లో 15, జక్రాన్‌పల్లి మండలం మాదాపూర్‌లో 5, ధర్పల్లి మండలం వాడిలో 15, ఇందల్వాయి మండలం లోలంలో 15, మోపాల్ మండలం ముదక్‌పల్లిలో 15 కుటుంబాలను ఎంపిక చేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎంపిక చేసిన జాబితాను గోప్యంగా ఉంచారు. ఈ నియోజకవర్గంలో ఇతర పార్టీలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను టీఆర్ఎస్లో చేర్చుకుని వారికి సంబంధించిన వారిని సైతం ఎంపిక చేసినట్లు తెలిసింది. బోధన్ నియోజకవర్గంలో సైతం ఎమ్మెల్యే షకీల్ ఆధ్వర్యంలో దాదాపుగా టీఆర్ఎస్ కార్యకర్తలనే ఎంపిక చేసినట్లు సమాచారం. బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇందుకు సంబంధించి అధికారుల పరిశీలన నామమాత్రంగానే సాగినట్లు సమాచారం. ఎమ్మెల్యేల నుంచి వచ్చిన జాబితాను ఆన్లైన్ చేయడమే అధికారుల పని అన్నట్లుగా ఉంది. కాగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి యూనిట్ల రుణాల కోసం ఎదురు చూస్తున్న దళిత నిరుద్యోగులు ఈ పథకం అమల్లోకి రావడంతో ఆ రుణాలపై ఆశలు వదులుకుంటున్నారు. అయితే తాజా పథకంలో తమకు ప్రాధాన్యం దక్కకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ ఆయా జాబితాలకు సంబంధించి అధికారులతో వెరిఫికేషన్ చేయించామన్నారు. లబ్ధిదారులకు శిక్షణ కార్యక్రమం పూర్తి చేసినట్లు చెప్పారు. -
దళితబంధులో అన్యాయం చేశారు
జూలూరుపాడు: దళితబంధు పథకం లబ్ధిదారుల ఎంపికలో అన్యాయం జరిగిందంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో దళితులు, యువకులు ఆందోళనకు దిగారు. అర్హులైన వారికి కాకుండా భూములు, భవనాలు, ఉద్యోగాలు ఉన్నవారికి, గతంలో ప్రభుత్వ రుణాలు పొందిన వారికి దళితబంధు జాబితాలో చోటు కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జూలూరుపాడు, వెంగన్నపాలెం, పెద్దహరిజనవాడ, చిన్నహరిజనవాడ గ్రామాల దళిత మహిళలు, యువత మండల కేంద్రంలో బస్టాండ్ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్యాలయాన్ని ముట్టడించారు. ఖమ్మం–కొత్తగూడెం ప్రధాన రహదారిపై ఆందోళన చేశారు. వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాబితాలోని అనర్హుల పేర్లు ఇస్తే పరిశీలించి ప్రభుత్వానికి నివేదికిస్తామని తహసీల్దార్ చెప్పడంతో ఆందోళనకారులు ధర్నా విరమించారు. అనర్హుల పేర్లు తొలగించి అర్హుల ఎంపిక కోసం గ్రామసభ నిర్వహించాలని, ఎమ్మెల్యే అనుచరుల పేర్లు తొలగించాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని గ్రామస్తులు స్పష్టం చేశారు. -
జగనన్న చేదోడు నగదు సాయం అందడంపై లబ్ధిదారులు హర్షం
-
ఒక విషయం చెప్తా వినండి అన్న.. ఈ అక్క న్మాతలకి జగనన్న ఫిదా
-
నేడు రైతు భరోసా - పీఎం కిసాన్ మూడో విడత నిధుల జమ
-
ఈరోజు వివక్ష లేదు...లంచాలకు తావులేదు: సీఎం జగన్
-
వివక్ష లేదు.. లంచాలకు తావులేదు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సంక్షేమ పథకాల్లో అర్హత ఉండి మిగిలిపోయిన వారికి మంగళవారం ఆయన నగదు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని.. 9,30,809 మందికి వారి ఖాతాల్లో రూ. 703 కోట్లను జమచేస్తున్నామని తెలిపారు. చదవండి: 2021 రివైండ్: టీడీపీకి పరాభవ ‘నామం’ ‘‘గతంలో పథకాలకోసం ప్రజలు ఎదురుచూసేవారు. ఇప్పుడు ప్రజలనే నేరుగా వెతుక్కుంటూ పథకాలు వస్తున్నాయి. ఈ పథకాలు అమలు చేసేటప్పుడు మనం కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడ్డం లేదు. అర్హత ఉంటే చాలు, సంక్షేమ పథకాలు అందరికీ దక్కుతాయన్న కోణంలోనే ప్రతి అడుగూ వేస్తున్నాం. ఇంకా ఎక్కడైనా అర్హులైన ఉండి కూడా దరఖాస్తు చేసుకోలేకపోవడమో, అర్హత నిర్ధారణలో జరిగిన పొరపాట్లవలనో, నిర్ణీత సమయంలోగా దరఖాస్తు చేసుకోకపోవడంవల్లో, బ్యాంకు ఖాతాలు సరిగ్గా లేపోవడం వల్లో ఇలా ఏ కారణాలు అయినా సరే అర్హులందరికీ కూడా సంక్షేమ పథకాలు అందనట్టు అయితే అటువంటి వారు అందరూ కూడా మిస్‌కాకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నామని’’ సీఎం పేర్కొన్నారు. ఇది గొప్ప విప్లవాత్మక మార్పు: ‘‘గతంలో ప్రభుత్వాలు.. ఎలా కత్తిరించాలి.. అనిఆలోచించేవి. ఎవరూ మిగిలిపోకూడదు, అర్హులకు అందరికీ అందలాన్న తపన, తాపత్రయం ఈ ప్రభుత్వంలో ఉంది. దేశంలో తొలిసారిగా మిస్ అయిన వారికి కూడా ఒక అవకాశం ఇచ్చి, వారికి కూడా నెలరోజుల్లోపు దరఖాస్తులు చేసుకోమని చెప్పి, పరిశీలనలు చేసి వారిక్కూడా రావాల్సిన డబ్బును అందిస్తున్నాం. పెన్షన్లు, రేషన్‌కార్డులు, ఇతర పథకాల లబ్ధిదారులను తీసుకున్నా.. గత ప్రభుత్వంతో కంటే లబ్ధిదారుల సంఖ్యలో కాని, వారికి ఇస్తున్న మొత్తంలోగాని విపరీతమైన మార్పు ఉంది. విప్లవాత్మకంగా ఈ మార్పునకు శ్రీకారం చుట్టడం జరిగింది. టీడీపీ హయాంలో పెన్షన్ల రూపంలో ఎన్నికలకు 2 నెలలముందు వరకూ కేవలం రూ.1000లు మాత్రమే ఇచ్చేవారు. అది కూడా ఎన్నికలకు 6 నెలలకు ముందు వరకూ కేవలం 39 లక్షలమందికి, నెలకు రూ.400 కోట్లు ఇచ్చేవారు. ఇవాళ 61లక్షల పెన్షన్లకు పెంచాం. పెన్షన్‌ను రూ.2250లకు పెంచాం. రూ.1450 కోట్లు నెలకు కేవలం పెన్షన్లకోసమే ఖర్చు చేస్తున్నాం. ఎవ్వరూ ఇబ్బంది పడకూడదని తెల్లవారుజామునే వాలంటీర్ వచ్చి గుడ్మార్నింగ్చెప్పి.. చేతిలో పెన్షన్ పెట్టబోతున్నారు. ఈ ఒకటో తారీఖు నుంచి రూ.2500కు పెంచబోతున్నాం. గతంలో పథకాలను ఎగ్గొట్టేందుకు, లంచాలు గుంజేందుకు జన్మభూమి కమిటీలు పెడితే... గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి సోషల్ఆడిట్ ద్వారా అర్హులందరికీ న్యాయం ఇవాళ న్యాయం జరుగుతుంది. గతంలో ఆత్మాభిమానం చంపుకుని వృద్ధులు, వికలాంగులు పెన్షన్లకోసం తిరిగే వారు. వివక్ష లేకుండా, లంచాలకు తావు లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తున్నాం. కోవిడ్ వల్ల ప్రభుత్వ రాబడి తగ్గినా, ఖర్చులు పెరిగినా పేదలకు అండదండలు అందించేందుకు మన ప్రభుత్వం అడుగులు ముందుకేసిందని’’ సీఎం అన్నారు. వివిధ పథకాల్లో మిస్ అయిన వారికి ఇవాళ ఇస్తున్న ప్రయోజనాలు ఇవీ: ♦వైఎస్సార్ చేయూత కింద 2,50,929 మందికి రూ. 470.40 కోట్లు ఇవాళ అందిస్తున్నాం ♦వైఎస్సార్ ఆసరా కింద 1,136 మందికి రూ. 7.67 కోట్లు ఇస్తున్నాం ♦వైఎస్సార్ సున్నావడ్డీ కింద మహిళలకు 59,661 మందికి రూ. 53,51కోట్లు అందిస్తున్నాం ♦వైఎస్సార్ సున్నావడ్డీ పంటరుణాలు కింద 2019–20 ఏడాది కింద 62,622 మందికి రూ. 9.01కోట్లు, ఖరీఫ్ 2020 కింద 58,821 మందికి 10.06 కోట్లు ఇస్తున్నాం ♦వైఎస్సార్ రైతు భరోకకింద 2,86,059 మందికి రూ. 58.89 కోట్లు ఇస్తున్నాం ♦జగనన్న విద్యా దీవెన కింద 31,940 మందికి రూ.19.92 కోట్లు ఇస్తున్నాం ♦వైఎస్సార్ వసతి దీవెన కింద 43,010 మందికి రూ. 39.82 కోట్లు ఇస్తున్నాం ♦వైఎస్సార్ కాపు నేస్తం కింద 12,983 మందికి రూ.19.47 కోట్లు ఇస్తున్నాం ♦వైఎస్సార్ వాహన మిత్ర కింద 8,080 మందికి రూ.8.09 కోట్లు ఇస్తున్నాం ♦వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద 3,788 మందికి రూ. 3,79 కోట్లు ఇస్తున్నాం ♦వైఎస్సార్ నేతన్న నేతన్న నేస్తం కింద 794 మందికి రూ.1.91 కోట్లు అందిస్తున్నాం ♦ఇవికాక 90 రోజుల్లో ఇళ్లపట్టాలు 1,10,986 కు ఇస్తున్నాం ఇవికాకుండా 1,51,562 లక్షల మందికి పెన్షన్‌కార్డులు ఇస్తున్నాం, ఏప్రిల్ 2021 నుంచి ఇచ్చిన పెన్షన్‌కార్డులు కలుపుకుంటే 4,96,059 మందికి పెన్షన్‌కార్డులు ఇచ్చాం. బియ్యంకార్డులు 3,07,599 మందికి ఇస్తున్నాం. ఆరోగ్యశ్రీ కార్డులు 1,14,129 మందికి ఇస్తున్నాం. డిసెంబర్ నుంచి మే వరకూ అమలైన పథకాల్లో అర్హత ఉండి మిస్ అయిన వారికి జూన్ లోనూ, అలాగే జూన్ నుంచి నవంబర్ వరకూ అమలైన పథకాల్లో మిస్ అయిన వారికి డిసెంబర్‌లోనూ అందించే కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభిస్తున్నామని’’ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
సంక్షేమ పథకాల్లో అర్హత ఉండి మిగిలిపోయిన వారికి నేడు నగదు జమ
-
పథకాలు అందని అర్హులకు నగదు జమ చేసిన సీఎం జగన్
Live Updates: ►సంక్షేమ పథకాల్లో అర్హత ఉండి మిగిలిపోయిన వారికి మంగళవారం ఆయన నగదు జమ చేశారు. కంప్యూటర్లో బటన్ నొక్కి 9,30,809 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.703 కోట్లు జమ చేశారు. Time:11:06 AM ►గతంలో సంక్షేమ పథకాలకు ఎదురు చూసే పరిస్థితి ఉండేదని.. నేడు ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. నేడు అందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల్లో అర్హత ఉండి మిగిలిపోయిన వారికి నగదు జమ చేస్తున్నామన్నారు. 9,30,809 మంది ఖాతాల్లో రూ.703 కోట్లు జమ చేస్తున్నామని పేర్కొన్నారు. Time:10:50 AM ఇచ్చిన ప్రతీ మాట సీఎం జగన్ నిలబెట్టుకుంటున్నారు: పెద్దిరెడ్డి ►ఇచ్చిన ప్రతీ మాట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకుంటున్నారని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.ఇంటింటికీ నవరత్నాలు అందిస్తున్నారన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. సాక్షి, అమరావతి: ప్రస్తుతం అమలులో ఉన్న వివిధ పథకాలకు సంబంధించి, అర్హత ఉన్నప్పటికీ సాయం పొందలేకపోయిన 9,30,809 మంది లబ్ధిదారులకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూ.703 కోట్లను జమ చేయనున్నారు. ఇంతే కాకుండా 3,44,497 మందికి పెన్షన్ కార్డులు, 3,07,599 మందికి బియ్యం కార్డులు, 1,10,880 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు, 90 రోజుల్లో ఇళ్లపట్టాల లబ్ధిదారులతో కలిపి మొత్తంగా 18,47,996 మందికి ప్రయోజనం కల్పించనున్నారు. మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్లో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా నగదు జమ చేయనున్నారు. అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి మరోసారి వెరిఫికేషన్ చేసి.. ఏటా జూన్, డిసెంబర్లలో సంక్షేమ పథకాల లబ్ధి అందజేస్తామని సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో సాధ్యమైనంత మందికి పథకాల లబ్ధిని ఎలా ఎగ్గొట్టాలా అనే ఆరాటమే కనిపించేది. ఇప్పుడు అర్హులైన ఏ ఒక్కరూ పథకాల లబ్ధికి దూరం కాకూడదనే సంకల్పంతో వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ► అర్హులై ఉండి, ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారు.. సంక్షేమ పథకం అందించిన నెలలోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తులు పరిశీలించి, అర్హులైన వారికి డిసెంబర్ నుండి మే వరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించి జూన్‌లో లబ్ధి కల్పిస్తారు. జూన్ నుండి నవంబర్ వరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించి డిసెంబర్లో లబ్ధి కల్పిస్తారు. ► వైఎస్ జగన్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యంత పారదర్శకంగా సోషల్ ఆడిట్ కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో జాబితాను ప్రదర్శించి, నూటికి నూరు శాతం సంతృప్త స్ధాయిలో అర్హులకు లబ్ధి కల్పిస్తోంది. ► వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ (మహిళలు), వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు రబీ (2019–20), ఖరీఫ్ (2020), వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ (రెండవ విడత), జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ వాహన మిత్ర, వైఎస్సార్ మత్స్యకార భరోసా, వైఎస్సార్ నేతన్న నేస్తం, పెన్షన్ కార్డులు, బియ్యం కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, 90 రోజుల్లో ఇళ్ల పట్టాల పథకాల కింద నేడు లబ్ధి పొందనున్న వారి సంఖ్య 18,47,996. గత ప్రభుత్వ తీరు ఇలా ► అస్మదీయులకు మాత్రమే సంక్షేమ ఫలాలు. అర్హులకు ఎలా ఎగ్గొట్టాలనే ఆలోచనలు. సంక్షేమానికి ఎలా కోత పెట్టాలా అనేపరిస్థితి. ► తమ వర్గం, తమ పార్టీ, తమ వారికే లబ్ధినందించే పక్షపాత జన్మభూమి కమిటీలు. ►సంక్షేమ పథకాల లబ్ధి కోసం ఆత్మాభిమానాన్ని చంపుకుని వృద్ధులు, దివ్యాంగులు, అక్కచెల్లెమ్మలు కాళ్లరిగేలా జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి మోకరిల్లాల్సిన దీనస్థితి. అయినా తప్పని లంచాలు, వివక్ష. ► గ్రామానికి ఇంత మందికే లబ్ధి అనే కోటాలు. ► లబ్ధిదారుల ఎంపికలో కాలయాపన, ఎంత లబ్ధి కల్పిస్తారో.. ఎప్పుడు అందజేస్తారో తెలియని అనిశ్చితి. ► పథకాల సొమ్మును లబ్ధిదారుల ఇతర రుణాలకు జమ చేసుకునే దుస్థితి. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇలా.. ►కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా.. అవినీతి, వివక్ష, ఆశ్రిత పక్షపాతానికి తావు లేకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాలు. ►అర్హులై ఉండి ఒకవేళ ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాల లబ్ధి అందని వారికి మరో అవకాశమిస్తూ ప్రతి ఏటా రెండు సార్లు లబ్ధి కల్పిస్తున్నారు. ►సంక్షేమ పథకాల లబ్ధి కోసం మధ్యదళారీలు, పైరవీకారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పని లేకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లో జాబితాల ప్రదర్శన. సోషల్ ఆడిట్ ద్వారా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక. ►దళారులకు, పైరవీకారులకు తావులేకుండా, ఇతర లోన్ల బకాయిలకు బ్యాంకర్లు మళ్లించుకోలేని విధంగా పథకాల సొమ్ము నేరుగా లబ్ధిదారుల అన్ ఎన్కంబర్డ్ ఖాతాలకు జమ. ►సంక్షేమ క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటించి, నిర్దిష్ట సమయంలోనే ఠంచన్‌గా లబ్ధి పంపిణీ. ►ఆత్మాభిమానం నిలబడేలా వలంటీర్, సచివాలయ సిబ్బంది సేవలు. -
రైతు‘బంధువులు’ పెరిగారు!
సాక్షి, హైదరాబాద్: సాగు పనులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశ్యంతో తలపెట్టిన రైతుబంధు పథకం కింద లబ్ధిదారుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రతి సీజన్లో రైతుబంధు సాయం పొందేవారి సంఖ్య సగటున లక్ష వరకు పెరుగుతోంది. 2018, ఏప్రిల్ నుంచి ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అప్పుడు ఎకరానికి రూ.4 వేల సాయం చొప్పున ఇవ్వగా.. ఏడాది తర్వాత నుంచి ఎకరాకు రూ.5 వేలు అందిస్తోంది. పథకం అమల్లోకి వచ్చిన ఏడాదిలో రాష్ట్రవ్యాప్తంగా 1.30 కోట్ల ఎకరాల భూమికి సంబంధించి 50.25 లక్షల మంది లబ్ధిదారులకు రూ.5,236.30 కోట్లు పంపిణీ చేశారు. ఈ పథకం అమల్లోకి వచ్చిన మూడేళ్లలో లబ్ధిదారుల సంఖ్య 60.84 లక్షలకు చేరింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 1.47 కోట్ల ఎకరాల విస్తీర్ణానికిగాను రూ.7,360.41 కోట్లు రైతుబంధు కింద లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశారు. ప్రస్తుతం రబీ సీజన్ నిధులను త్వరలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 17 లక్షల ఎకరాలకు పరిష్కారం... వ్యవసాయ భూముల క్రయవిక్రయాలతో యజ మానుల సంఖ్యలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత చిన్నపాటి వివాదం ఉన్న భూములపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో పెద్ద సంఖ్యలో భూ యజమానులు లావాదేవీలు సాగిం చే అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం ధరణిలో సాంకేతికతను అప్డేట్ చేస్తుండటంతో మ్యూ టేషన్, సక్సెషన్ లాంటి అపరిష్కృత సమస్యలకు ప రిష్కారం లభించింది. ఆయా లబ్ధిదారులంతా రై తుబంధు సాయానికి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో లబ్ధిదారుల సంఖ్య, భూ విస్తీర్ణం పెరుగుతోంది. పథకం అమల్లోకి వచ్చిన నాటి నుంచి 17 లక్షల ఎకరాల విస్తీర్ణానికి సంబంధించిన సమస్యలు పరిష్కారమైనట్లు స్పష్టమవుతోంది. సీసీఎల్ఏ గణాంకాల్లో... సాగు భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియంతా ఇప్పుడు రెవెన్యూ విభాగం పర్యవేక్షిస్తోంది. ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్ జరిగిన క్షణాల్లోనే పోర్టల్‌లో వివరాలు మారిపోతుంటాయి. రిజిస్ట్రేషన్ కాగానే లబ్ధిదారుకు మ్యూటేషన్ పూర్తయి పాసు పుస్తకం ప్రింట్ కాపీని ఇస్తున్నారు. నాలుగైదు రోజుల్లో పోస్టు ద్వారా పాసుపుస్తకం లబ్ధిదారు ఇంటికి చేరుతుంది. ఈ క్రమంలో భూపరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) కార్యాలయం గణాంకాల ప్రకారం.. 63.25 లక్షల మంది పేరిట 1.50 కోట్ల ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ ఉంది. ఈ లెక్కన లబ్ధిదారులకు రూ.7,508.78 కోట్లు అవసరమని అంచనా వేసింది. అయితే రైతుబంధు పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ప్రభుత్వం సాయం అందిస్తోంది. ఈ లెక్కన రబీ సీజన్లో లబ్ధిదారుల సంఖ్య అటుఇటుగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
Dalit Bandhu: కారు... లేకుంటే ట్రాక్టరు!
సాక్షి, హైదరాబాద్: దళితబంధు యూనిట్ ఏర్పాటుపై లబ్ధిదారులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకేసారి రూ.10 లక్షలు బ్యాంకు ఖాతాలో జమ కాగా, ఆ నిధితో ఎలాంటి వ్యాపారం చేయాలనే దానిపై స్పష్టత లేక అయోమయంలో పడ్డారు. యూనిట్ ప్రతిపాదనలు సంబంధిత కమిటీల ద్వారా జిల్లా కలెక్టర్‌కు సమర్పించాల్సి ఉంటుంది. కలెక్టర్ ఆమోదించిన తర్వాత యూనిట్ సంబంధిత వస్తువులు, పరికరాల కొనుగోలుకు అనుమతి లభిస్తుంది. అనంతరం లబ్ధిదారు ఖాతా నుంచి నగదును చెక్కురూపంలో విక్రేత ఖాతాకు బదిలీచేస్తారు. పథకాన్ని పారదర్శకంగా, పక్కాగా అమలు చేసేవిధంగా ప్రభుత్వం ఈ మేరకు నిబంధనలు విధించింది. దళితబంధు కింద హూజూరాబాద్ శాసనసభ నియోజకవర్గంతోపాటు ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన వాసాలమర్రిలో ఇప్పటివరకు 18,064 మంది బ్యాంకుఖాతాల్లో నగదు జమచేశారు. ఈ క్రమంలో సగానికిపైగా లబ్ధిదారులు కొత్త యూనిట్లకు సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించగా, ఇందులో అత్యధికులు కార్లు, ట్రాక్టర్లు కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. దాదాపు 8 వేల ప్రతిపాదనల్లో 5,440 మంది కారుగానీ, ట్రాక్టర్గానీ కొనుగోలు చేస్తామని చెప్పారు. కొందరు కార్లు కొని అద్దెకు ఇచ్చుకుంటామని తెలపగా, మరికొందరు క్యాబ్రంగంలో పనిచేస్తామని వివరించారు. వ్యవసాయపనుల కోసం ట్రాక్టర్లు కొనుగోలు చేసుకుని సొంతంగా నడిపిస్తామని వివరించారు. కార్లు, ట్రాక్టర్లకు డిమాండ్ ఉన్నప్పటికీ, ఒకేచోట పెద్దసంఖ్యలో వాహనాలుంటే వాటికి పనిదొరికే అవకాశాలు తగ్గుతాయనే అభిప్రాయం అధికార వర్గాల్లో కనిపిస్తోంది. దీంతో పరిమితసంఖ్యలోనే ఇలాంటి యూనిట్లకు అవకాశం ఇవ్వాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కార్లు, ట్రాక్టర్లు మాత్రమే కాకుండా ఇతర డిమాండ్ ఉన్న రంగాలపై అవగాహన కల్పించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు దళితబంధు నోడల్ అధికారులు సూచనలు చేస్తున్నారు. చదవండి: హైదరాబాద్‌లో భారీ వర్షం.. హై అలర్ట్ -
పక్కా నిర్వహణ, నిఘా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన దళితబంధు పథకం లబ్ధిదారులు ఏర్పాటు చేసే యూనిట్ల నిర్వహణపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రూ.10 లక్షల విలువైన యూనిట్ల ఏర్పాటుతో ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకునేలా అమలుచేస్తున్న ఈ కార్యక్రమంపై పక్కా నిర్వహణ, నిఘాను ఏర్పాటు చేస్తోంది. ప్రతి లబ్ధిదారుకు సరైన అవగాహన కల్పించడంతో పాటు వారికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు లబ్ధిదారులకు అందుబాటులో ఉంటూ అవగాహన కల్పిస్తాయి. యూనిట్ నిర్వహణలో మెళకువలపై చైతన్యపర్చడం, సందేహాలను నివృత్తి చేయడంతో పాటు యూనిట్లను విజయవంతంగా ముందు కు తీసుకెళ్లేందుకు తోడ్పాటు అందిస్తాయి. ఇవీ మార్గదర్శకాలు... ►దళితబంధు కింద ఎంపికైన లబ్ధిదారుకు ప్రభుత్వం నిర్దేశించిన బ్యాంకులో ప్రత్యేక ఖాతాను తెరుస్తారు. పాసు పుస్తకం, చెక్ పుస్తకం ఇస్తారు. ►ఒక్కో ఖాతాలో రూ.10 లక్షలు జమచేస్తారు. దళిత రక్షణ నిధి కింద ఈ ఖాతా నుంచి రూ.10 వేలు వెనక్కి తీసుకుంటారు. ►వ్యవసాయ అనుబంధ రంగాలు, రవాణా రంగం, తయారీ పరిశ్రమ, రిటైల్ దుకాణాలు, సేవలు–సరఫరా కేటగిరీల్లో యూనిట్లను ఎంచుకోవచ్చు. ►నిర్దేశించిన రంగాల్లో సీనియర్ అధికారులతో పాటు నిపుణులను గుర్తించి గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో రిసోర్స్ పర్సన్లను, కమిటీలను ఎంపిక చేస్తారు. ►అవసరమైతే ఇతర జిల్లాల నుంచి కూడా రిసోర్స్ పర్సన్లను లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా ఎంపిక చేసుకోవచ్చు. ►యూనిట్ ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలను పరిశీలించిన తర్వాత నిధుల విడుదలకు కమిటీ అనుమతి ఇస్తుంది. అనంతరం కలెక్టర్ ఆమోదంతో ఆ మేరకు చెక్కును బ్యాంకు మేనేజర్ ఆమోదిస్తారు. ►లబ్ధిదారులు ఏర్పాటు చేస్తున్న యూనిట్లకు సంబంధించి ప్రాజెక్టు రిపోర్టును రిసోర్స్ పర్సన్లు తయారు చేయాలి. ►యూనిట్ ఏర్పాటుపై లబ్ధిదారుకు శిక్షణ, అవగాహనతో పాటు చైతన్యపర్చేందుకు కమిటీలు పనిచేస్తాయి. ►యూనిట్ ఏర్పాటుకు నిర్దేశించిన సాయం సరిపోకుంటే ఇద్దరు సంయుక్తంగా యూనిట్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక్కొక్కరు రూ.10 లక్షల విలువ చేసే రెండు యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ►రిసోర్స్ పర్సన్లు, కమిటీలు దళితవాడలు, గ్రామాలు, ఆవాసాలను నిరంతరం సందర్శించి పరిస్థితిని సమీక్షించాలి. లబ్ధిదారుల ప్రాధాన్యతలను గుర్తించి వివరించాలి. ►లబ్ధిదారులకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు జిల్లా ఉన్నతాధికారితో సమగ్ర శిక్షణ మాడ్యూళ్లను స్థానిక పరిస్థితులకు తగినట్లుగా రూపొందించాలి. ►ఈ మాడ్యూళ్ల తయారీలో నిపుణులు, ప్రభుత్వేతర సంస్థలు, ఎన్జీఓల సహకారం తీసుకోవచ్చు. ►లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా శిక్షణ తరగతులను నిర్వహించాలి. ఈ మేరకు ప్రత్యేక షెడ్యూల్‌ను ఖరారు చేసుకోవాలి. 2 నుంచి 6 వారాల్లో ఈ శిక్షణలు పూర్తిచేయాలి. ►ఇప్పటికే ఆయా రంగాల్లో విజయవంతంగా యూనిట్లు నిర్వహిస్తున్న వారి సహకారాన్ని తీసుకోవాలి. ►లబ్ధిదారు ప్రారంభించతలచిన యూనిట్లను ప్రతి దశలో విజయవంతంగా పూర్తిచేసేందుకు కమిటీలు, రిసోర్స్ పర్సన్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. -
‘దళితబంధు’ సర్వే చకచకా..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో దళితబంధు పథకం లబ్ధిదారుల గుర్తింపు కోసం చేపట్టిన సర్వే చురుకుగా సాగుతోంది. శుక్రవారం ప్రారంభమైన ఇంటింటి సర్వే శనివారానికి ఊపందుకుంది. సర్వేలో దాదాపు 400 మంది జిల్లా అధికారులు పాలుపంచుకుంటున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక, జమ్మికుంట, హుజూరాబాద్, కమలాపూర్, ఇల్లందకుంట మండలాలు, జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపాలిటీలను మొత్తం ఏడు యూనిట్లుగా విభజించారు. ప్రతి యూనిట్‌ను ఐదు క్లస్టర్లుగా విభజించారు. క్లస్టర్ల బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులు ‘దళితబంధు’యాప్ ద్వారా లబ్ధిదారుల వివరాలు నమోదు చేస్తున్నారు. అందులో లబ్ధిదారుల పేరు, వయసు, ఫోన్, రేషన్‌కార్డు, ఆధార్ నంబర్లు, సమగ్ర కుటుంబసర్వే నంబరు, చిరునామా, కుటుంబసభ్యులు ఎందరు? వారి వయసు, ఆధార్, ఫోన్ తదితర వివరాలు సేకరిస్తున్నారు. అనంతరం ప్రతివ్యక్తి ఫొటోను ట్యాబ్‌లో పొందుపర్చి అప్లోడ్ చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ఈ సాఫ్ట్వేర్, యాప్‌లను ప్రత్యేకంగా రూపొందించింది. ఈ సాఫ్ట్వేర్ తెలుగు, ఇంగ్లిష్ రెండుభాషల్లోనూ అందుబాటులో ఉంది. సర్వే సమయంలోనే ఏ యూనిట్ అంటే ఆసక్తి ఉంది? అన్న వివరాలు కూడా తీసుకుంటున్నారు. 2014లో సమగ్ర కుటుంబసర్వేనే దళితబంధు సర్వేకు ప్రామాణికంగా తీసుకున్నారు. సమగ్ర కుటుంబసర్వే గణాంకాల ప్రకారం... రాష్ట్రంలో 20,900 దళిత కుటుంబాలున్నాయి. సమగ్ర కుటుంబసర్వే తర్వాత మరో రెండు, మూడు వేల వరకు కొత్త కుటుంబాలు పెరిగాయి. ఆ కొత్త కుటుంబాల కోసం ఖాళీ దరఖాస్తులు (లబ్ధిదారుల సమాచార పత్రం) ఇచ్చి వివరాలు నమోదు చేస్తున్నారు. అందరి వివరాలు ఏ రోజుకారోజు కరీంనగర్ కలెక్టరేట్లో పొందుపరుస్తున్నారు. సీఎంసభకు ముందురోజు అంటే ఈ నెల 26వ తేదీ నుంచి కలెక్టరేట్, ఇతర ప్రభుత్వవిభాగాల సిబ్బంది ఉరుకులు, పరుగులు పెడుతూ ఇంటింటి సర్వే పనులు చేస్తుండటం గమనార్హం. -
ఏడాదిలో ఆదాయం రెట్టింపవ్వాలి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అనుభవం, వృత్తి నైపుణ్యత ఆధారంగా ఏడాదిలోగా రెట్టింపు ఆదాయం వచ్చే యూనిట్లను ఎంపిక చేసుకోవాలని దళితబంధు లబ్ధిదారులకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. హుజూరాబాద్‌లో దళితబంధు ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చేతుల మీదుగా ఆర్థిక సాయం పొందిన 15 మంది లబ్ధిదారులకు మంగళవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో కర్ణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితబంధు కింద యూనిట్ల ఎంపికకు తొందరపడొద్దని, వారంపాటు సమయం ఇస్తామని కలెక్టర్ తెలిపారు. లబ్ధిదారులు కొత్తగా దళితబంధు ఖాతాలు తెరవాలని సూచించారు. యూనిట్ స్థాపించుకునేందుకు కుటుంబ సభ్యులతో చర్చించి ఎంపిక చేసుకోవాలన్నారు. యూనిట్ల ఎంపికపై జిల్లా అధికారులతో పూర్తి అవగాహన కల్పిస్తామన్నారు. లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్ల నిర్వాహణకు 10–15 రోజులు పూర్తి స్థాయిలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా ఉచితంగా వృత్తి నైపుణ్యత శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. అవగాహన సమావేశానికి హాజరైన 15 మంది లబ్ధిదారుల్లో కొందరు పాడి గేదెలు (డెయిరీ యూనిట్లు), గూడ్స్ ట్రెయిలర్, ట్రాక్టర్ ట్రెయిలర్, కారు, సూపర్ బజార్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, లేడీస్ ఎంపోరియం యూనిట్ ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. వాహనాలు ఎంపిక చేసుకున్న వారికి బుధవారం లెర్నింగ్ లైసెన్సు జారీ చేయాలని డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్, జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమాధికారి నేతనియల్, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డా.నరేందర్, ఎల్డీఎం లక్ష్మణ్, ఆర్సెటీ మేనేజర్ దత్తాత్రేయ, నాబార్డు ఏజీఎం అనంత్ పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులను కరీంనగర్‌లోని విజయపాల డెయిరీకి తీసుకెళ్లారు. పాల శీతలీకరణ, పెరుగు, నెయ్యి తయారీ, మజ్జిగ, బట్టర్ మిల్క్, బాదాం మిల్క్ తయారీలు, దాణా, గడ్డి పెంపకం, శిలీంద్ర మొక్కలు పెంపకం, గడ్డి కత్తిరించే యంత్రాలు ఆవుల షెడ్ వాటి నిర్వహణ తదితర విషయాలపై అవగాహన కల్పించారు. -
దళితబంధు జాబితాలో అనర్హులా?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/హుజూరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలో దళితబంధు పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక సరిగా జరగలేదని పలువురు ఆందోళనకు దిగడం కలకలం రేపింది. ఈనెల 16వ తేదీన జరగనున్న ముఖ్యమంత్రి సభకు లబ్ధిదారులను తీసుకువచ్చేందుకు శుక్రవారం అధికారులు సర్వే చేపట్టారు. ఆ సమయంలో జాబితాలో ఉన్న వారి వివరాలు తెలుసుకున్న స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీణవంకలో పేదలకు కాకుండా అనర్హులకు జాబితాలో చోటు కల్పించారని ఆరోపిస్తూ పలువురు తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న వారిని, స్థానికంగా లేని వారిని ఎలా ఎంపిక చేస్తారని తహసీల్దార్ సరిత దృష్టికి తీసుకెళ్లారు. మళ్లీ సర్వే చేయాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామంలో ప్రధాన రహదారిపై దళితులు బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో 250 దళిత కుటుంబాలు ఉంటే.. కేవలం ఏడుగురిని మాత్రమే ఎలా ఎంపిక చేస్తారంటూ అధికారులను ప్రశ్నించారు. అలాగే ప్రగతి భవన్‌కు తమ గ్రామం నుంచి నలుగురు వెళ్తే.. ఇద్దరిని మాత్రమే ఎలా ఎంపిక చేస్తారంటూ ప్రశ్నించారు. జమ్మికుంటలో కూడా పలువురు దళితులు తహసీల్దార్‌తో వాగ్వాదానికి దిగారు. అయితే పోలీసుల జోక్యంతో వారంతా ఆందోళన విరమించారు. ఇంకా ఎవరికీ మంజూరు చేయలేదు: కలెక్టర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకం లబ్ధిదారుల ఎంపికకు సర్వే పూర్తయిందని. అయితే ఇంతవరకూ ఎవరికీ మంజూరు చేయలేదని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. ఈ నెల 16న హుజూరాబాద్‌లో దళితబంధు పథకాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభిస్తారని.. అనంతరం ప్రతి ఒక్కరికీ ఈ పథకం మంజూరుచేస్తామని చెప్పారు. లబ్ధిదారులు ఎవరూ ఆందోళన చెందవద్దని, వదంతులను నమ్మవద్దని కోరారు. సమాచార లోపం వల్లే.. దీనిపై కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు నాయకులను ‘సాక్షి’ సంప్రదించింది. లబ్ధిదారుల ఎంపికలో ఎవరికీ అన్యాయం జరగదని వారు స్పష్టంచేశారు. 2015లో ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగానే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. ఆ సర్వే సమయంలో కుటుంబ ఆర్థిక, సామాజిక పరిస్థితులు తెలుసుకునేందుకు 24 గడులు పెట్టిందన్నారు. అవి నింపే క్రమంలో కొందరు సొంతిళ్లు, వాహనాల విషయంలో వాస్తవాలు దాచారన్నారు. తాజా జాబితాలో అలాంటి వారు కనిపించే సరికి, వారికి రూ.10 లక్షల సాయం ఎలా చేస్తారని స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేశారని వివరించారు. సామాజిక పరిస్థితులతో సంబంధం లేకుండా లబ్ధిదారులందరికీ న్యాయం జరుగుతుందని స్పష్టంచేశారు. ఇదే తుది జాబితా కాదని, మరిన్ని జాబితాలు ఉంటాయని వెల్లడించారు. -
‘వైఎస్సార్ చేయూత’తో మా కుటుంబానికి భరోసా లభించింది
కింది ఉన్న మహిళ పేరు పిన్నబోయిన అంజమ్మ. గుంటూరు జిల్లా ఈపూరు మండలం చిట్టాపురానికి చెందిన ఈమెకు పాడి పశువులే జీవనాధారం. ఆమె వద్దనున్న రెండు గేదెలు కొంతకాలం కిందట అనారోగ్యం తో మృతి చెందాయి. ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమెను ‘వైఎస్సార్ చేయూత’ పథకం ఆదుకుంది. ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో పాడి గేదెల కోసం దరఖాస్తు చేసుకుంది. ‘జగనన్న పాలవెల్లువ’ పథకం కింద ఒక్కొక్కటి రూ.55 వేల విలువైన 2 మేలు జాతి గేదెలను అధికారులు ఆమెకు ఇప్పించారు. ప్రస్తుతం ఒకటి చూడుపోయగా, మరొకటి 4 నుంచి 5 లీటర్ల పాలు ఇస్తోంది. లీటర్‌కు రూ.65 వరకు వస్తున్నాయని.. తమ కుటుంబానికి భరోసా లభించిందంటూ అంజమ్మ సంతోషం వ్యక్తం చేసింది. ఇలా ఆమె ఒక్కరే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది పేద మహిళలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో భరోసా లభించింది. వారి జీవితాల్లో కొత్త వెలుగులు వచ్చాయి. ఆర్థికంగా బలపడుతూ తమ సొంత కాళ్లపై నిలబడుతున్నారు. కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. సాక్షి, అమరావతి: మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్ చేయూత’ పథకాన్ని ప్రవేశపెట్టింది. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఈ పథకం ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తోంది. లబ్ధిదారులకు ఏటా రూ.18,750 చొప్పున అందిస్తోంది. ఇప్పటికే రెండు విడతల సాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వారికి ప్రభుత్వమే అండగా నిలిచి ‘జగనన్న పాల వెల్లువ’ కింద మేలు జాతి ఆవులు, గేదెలు.. జగనన్న జీవ క్రాంతి ద్వారా మేక పిల్లలు, గొర్రె పిల్లలు, పొట్టేళ్లు, మేకపోతులను అందిస్తోంది. వాటి పెంపకం ద్వారా లబ్ధిదారుల జీవన ప్రమాణాలు పెరిగేలా, ఆర్థిక పురోగతి లభించేలా రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తోంది. లక్ష్యానికి మించి యూనిట్ల మంజూరు.. పాడి పశువులకు సంబంధించిన జగనన్న పాల వెల్లువ పథకం కింద 1,13,008 యూనిట్లు మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా.. వైఎస్సార్ చేయూత లబ్ధిదారుల నుంచి విశేష స్పందన వచ్చింది. దీంతో 1,13,854 యూనిట్లకు ప్రభుత్వం ఆర్థిక చేయూతనిచ్చింది. ఇందులో 78,003 యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వీరిలో బీసీలు 47,387 మంది, ఎస్సీలు 26,883 మంది, ఎస్టీలు 3,192 మంది, ఓసీలు 494 మంది, మైనార్టీలు 47 మంది ఉన్నారు. తూర్పు గోదావరి, అనంతపురం, విజయనగరం జిల్లాలు మినహా మిగిలిన పది జిల్లాల్లో 100 శాతానికి మించి యూనిట్లు మంజూరు చేశారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 6,405 యూనిట్లను లక్ష్యంగా పెట్టుకోగా.. 8,504 యూనిట్లు మంజూరయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 9,815కు గానూ 4,321 యూనిట్లు మంజూరు చేశారు. అన్ని వర్గాలకూ.. మేక పిల్లలు, గొర్రె పిల్లలు, పొట్టేళ్ల పిల్లలకు సంబంధించిన జగనన్న జీవక్రాంతి పథకం ద్వారా 72,179 యూనిట్లు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. 71,576 యూనిట్లకు ప్రభుత్వం ఆర్థిక చేయూత ఇచ్చింది. వాటిలో 46,342 యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వీరిలో బీసీలు 27,183 మంది, ఎస్సీలు 11,927 మంది, ఎస్టీలు 6,902 మంది, మైనార్టీలు 47 మంది, ఓసీలు 283 మంది ఉన్నారు. వైఎస్సార్, విశాఖ, కర్నూలు, గుంటూరు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో లక్ష్యానికి మించి యూనిట్లు మంజూరయ్యాయి. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 21,113 యూనిట్లు మంజూరు చేయగా, ఇప్పటికే 15,512 యూనిట్ల సన్నజీవాలను లబ్ధిదారులకు అందించారు. ఒక్కొక్క యూనిట్లో 14 గొర్రె పిల్లలు లేదా 14 మేక పిల్లలతో పాటు పొట్టేలు లేదా మేకపోతు ఉంటాయి. మొత్తంగా 15 సన్నజీవాలుంటాయి. మా కుటుంబానికి ఆసరా దొరికింది.. నేను వైఎస్సార్ చేయూత సొమ్ములతో మేకలు, గొర్రెలు తీసుకుంటానని అధికారుల ను అడిగాను. వారు కూడా వెంటనే స్పందించి.. జగనన్న జీవ క్రాంతి పథకం ద్వారా 14 మేక పిల్లలు, ఒక మేకపోతును ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. వీటి వల్ల మా కుటుంబానికి ఆసరా దొరికింది. – తుపాకుల కుమారి, ముప్పాళ్ల, గుంటూరు జిల్లా -
‘దేవుడు ఎలా ఉంటారో తెలీదు.. మీరు ప్రత్యక్ష దైవం అన్నా’
సాక్షి, అమరావతి: మూడో ఏడాది వైఎస్సార్ వాహన మిత్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ప్రారంభించారు. తన క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి సుమారు 2.48 లక్షల మంది లబ్దిదారులకు నేరుగా రూ. 248.47 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం వైఎస్ జగన్‌తో లబ్ధిదారులు తమ స్పందన తెలిపారు. సీఎం వైఎస్ జగన్ పాలన, పథకాల గురించి మనస్పూర్తిగా మాట్లాడారు. ముఖ్యమంత్రికి వారు ధన్యవాదాలు తెలిపారు. ఒక అన్న ఉంటే కూడా ఇంత చేయరు.. ఈ సందర్భంగా విశాఖనగరం గాజువాకకు చెందిన మహిళా ఆటోడ్రైవర్ పైడిమాత మాట్లాడుతూ ‘‘జగనన్నా.. నేను విశాఖ గాజువాకలో గత ఐదేళ్లుగా ఆటో నడిపించుకుంటూ బతుకుతున్నాను, రోజంతా నడిపితే మాకు వచ్చేది రెండు మూడు వందలు, దాంతో మా బతుకులు కష్టంగా ఉన్నాయి. మీరు పాదయాత్రలో చెప్పినట్లు ప్రతీ ఆటో కార్మికుడికి రూ. పది వేలు ఆర్ధిక సాయం చేశారు, మా ఆటో కార్మికుల అందరి తరపున మీకు ధన్యవాదాలు అన్నా. మేం ఏడాది పొడవునా ఎంత సంపాదించినా ఆటో మరమ్మత్తులు, ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ ఇలా ఖర్చులు ఉంటాయి. మీరు ఇచ్చే ఈ పదివేలు మాకు చాలా పెద్ద విషయం. మాకు నిరుడు కూడా వచ్చాయి. దేవుడు ఎలా ఉంటారో తెలీదు కానీ మీరు ప్రత్యక్ష దైవం అన్నా.. మా ఆటోవాళ్ళ కుటుంబాలకు ఇబ్బంది లేకుండా మీరు ముందుగానే సాయం చేస్తున్నారు. మేం ఇల్లూ, వాకిలి లేక అద్దె ఇంట్లో ఉన్న సమయంలో ఇళ్ళ పట్టా ఇచ్చారు. మా పిల్లలకు అమ్మ ఒడి వచ్చింది. పిల్లలకు అన్నీ ఇస్తున్నారు. మా అత్తగారు పెన్షన్ తీసుకుంటున్నారు. అమ్మకి కొడుకు ఉంటే ఇంత సాయం చేస్తారో లేదో కానీ మా అమ్మ కళ్ళలో ఆనందం చూశాం. చేయూత పథకం కింద రూ. 18, 750 మొదటి సారి తీసుకున్నారు. రేషన్ కోసం ఇబ్బంది పడుతుంటే ఇంటికే వచ్చి ఇస్తున్నారు. దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి మా మహిళలకు రక్షణ నిచ్చారు. అభయ యాప్ ద్వారా ప్రతీ ప్రయాణికుడు గమ్యాన్ని సురక్షితంగా చేరుకుంటున్నారు. నాకు ఒక అన్న ఉంటే కూడా ఇంత చేయరు, నాకు అన్న లేరని బాధపడుతుంటే మీరు వచ్చి నాకు ఎంతో సాయం చేశారు, ఇది చాలన్నా, నేనే కాదు నాలా ప్రతీ ఆడవారు కూడా మీకు రుణపడి ఉంటారు. పుడితే ఆడపిల్లగానే పుట్టాలి, ఆంధ్రప్రదేశ్‌లో జగనన్న నాయకత్వంలో పెరగాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని ముగించగా.. స్పందించిన సీఎం వైఎస్ జగన్ ధ్యాంక్యూ అమ్మా, మీ మాటలు మరింత స్పూర్తినిస్తున్నాయి. దేవుని దయతో ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం కూడా దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ తల్లి’’ అన్నారు. ఇంటి పెద్ద కొడుకుగా సాయం చేస్తున్నారు.. వైఎస్సార్ జిల్లా కడపకు చెందిన ఆటోడ్రైవర్ నాగూరు నాగయ్య మాట్లాడుతూ, ‘‘అన్నా నేను వైఎస్సార్ వాహన మిత్ర లబ్దిదారుడిగా ఎంపికైనందుకు సంతోషంగా ఉంది. నాడు పాదయాత్రలో మీరు మాట ఇచ్చారు, మా కష్టాలు మీకు చెప్పగానే వెంటనే పెద్ద మనసుతో హమీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే వెంటనే ఇచ్చారు. కరోనా టైంలో కూడా నిరుడు రెండో విడత ఇచ్చారు. ఇప్పుడు కూడా మూడో విడత సాయం చేస్తున్నారు. నా జీవితంలో నేను రూ. 30 వేల సంపాదన చూడలేదు. నా జీవితంలో మర్చిపోలేను, ఆదాయం చాలక అప్పులు చేసే వాళ్ళం కానీ మీరు ఇచ్చే డబ్బుతో అప్పులు చేయాల్సిన అవసరం లేదు. మేం సంతోషంగా మా కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. మాకు అమ్మ ఒడి వచ్చింది. అలాగే మా అమ్మకు వైఎస్ఆర్ చేయూత కింద సాయం అందింది. మీరు ఇంటి పెద్ద కొడుకుగా సాయం చేస్తున్నారు. నాన్న వైఎస్సార్ హయాంలో రిమ్స్ హాస్పిటల్ సమీపంలో ఇందిరానగర్‌లో మా అమ్మకు ప్లాట్ మంజూరు అయింది, అప్పుడు రూ. 60 వేల ఆర్ధిక సాయం చేశారు. ఆ డబ్బుతో ఇల్లు కట్టుకుని అదే ఇంట్లో కాపురం ఉంటున్నాం. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నా కుటుంబంలో అనేక సంక్షేమ పథకాలు పొందుతున్నాం, ఏపీలో ఆటో కార్మికులకు గతంలో విలువ లేదు కానీ మీరు సీఎం అయిన తర్వాత మా వెనక జగనన్న ఉన్నారు అనే మంచి మాట వినిపిస్తుంది. గతంలో ఈ వృత్తిలోకి ఎందుకు వచ్చాం అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఆటో ఫీల్డ్‌లోకి రమ్మని మేమే చెబుతున్నాం. మా కుటుంబం మీకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది అన్నా’’ అని అన్నారు. చదవండి: వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ వాహనమిత్ర థర్డ్‌వేవ్ హెచ్చరికలు: ఏపీ సర్కార్ ముందస్తు ప్రణాళిక -
కళ్ల నిండా ఆనందం
ఊరూ వాడా ఒకటే చర్చ.. ఎక్కడ నలుగురు గుమిగూడి ఉన్నా అదే మాటలు.. ‘సుబ్బమ్మత్తా.. నీ స్థలం ఎక్కడ? రాములమ్మా నీ ప్లాటెక్కడే? శ్రీదేవొదినా నీక్కూడా స్థలం వచ్చిందా?’ అంటూ చర్చోపచర్చలు. పేర్లు మారినా మూడు రోజులుగా ఊరూరా ఇవే సంభాషణలు. దేశంలోనే ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రోజుల క్రితం ఏకంగా 30.70 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టడం చర్చనీయాంశమైంది. ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లు కూడా ఉచితంగా కట్టించి ఇస్తామని ప్రకటించడం పట్ల లబ్ధిదారులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. సొంతింటి కల ఇంత త్వరగా సాకారం అవుతుందని అనుకోలేదని చెబుతున్నారు. అద్దె కోసం ఇతర ఖర్చులు తగ్గించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నామని, ఇకపై ఈ కష్టం ఉండదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జీవితంలో సొంతింట్లో ఉండగలమా.. అనే ప్రశ్న వేధించేదని, జగన్ పుణ్యమా అని ఇక ఆ ప్రశ్నకు తావేలేదని ఆనందం నిండిన కళ్లతో చెబుతున్నారు. పేదల సంక్షేమం కోసం పరితపిస్తున్న జననేతకు వారి గుండెల్లో గూడు కట్టుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి పట్టా అందుకుని సొంతింటి నిర్మాణానికి శ్రీకారం చుట్టిన లబ్ధిదారుల మనోగతాలు ఇలా ఉన్నాయి. – సాక్షి నెట్వర్క్ నా మనవడు జగన్ వల్లే సొంతిల్లు మాది కాకినాడ. నా భర్త సత్యనారాయణ కాలం చేశారు. మాకు ముగ్గురు పిల్లలు. సొంతంగా ఇల్లు లేదు. అవసాన దశకు చేరుకున్న నేను జీవితంలో సొంతిల్లు చూస్తాననుకోలేదు. ఎన్నికల్లో అవ్వాతాతలను ఆదుకుంటానని నా మనవడు జగన్ చెప్పిన మాటలు ఇవాళ అక్షరాలా నిజం చేశాడు. అధికారంలోకి రాగానే పింఛన్ ఇచ్చాడు. ఇప్పుడు స్థలం ఇచ్చి, ఇల్లు కట్టిస్తున్నాడు. వలంటీర్ వచ్చి.. అవ్వా నీకు ఇల్లు మంజూరైందని చెప్పగానే నా జీవితకాల కల నెరవేరినట్లైంది. – అడపా నాగసుగుణ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా 12 సార్లు అర్జీ పెట్టినా రానిది.. 14 ఏళ్ల కిందట పొట్ట చేత పట్టుకుని ఈ గ్రామానికి వచ్చాం. అప్పట్నుంచి ఇంటి స్థలం కోసం 12 సార్లు అర్జీ పెట్టాను. అయినా ప్రయోజనం లేకపోయింది. సీఎం జగన్ చలువతో ఒక్క దరఖాస్తుతో ప్లాటు మంజూరైంది. అంతా కలగా ఉంది. స్థలం ఇవ్వటంతో పాటు ఇల్లు కట్టి ఇస్తున్న సీఎం వైఎస్ జగన్ మేలును ఎప్పటికీ మరువలేము. – తన్నీరు రమాదేవి, వీరపనేనిగూడెం, కృష్ణా జిల్లా ఇన్నాళ్లూ తిరిగి తిరిగి అలసిపోయాం సొంతింట్లో ఉండాలనేది మా కల. దాని కోసం చేయని ప్రయత్నం లేదు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు దరఖాస్తు ఇచ్చామో లెక్కలేదు. జన్మభూమి కమిటీలు, నాయకుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయాం. కానీ ఫలితం లేదు. ఇంటి స్థలం మాకు లేదని వలంటీర్‌కు చెప్పాను. ఇంటి స్థలం మంజూరయ్యేలా చేశారు. ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇస్తుందని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. – దోనిపర్తి శ్రీదేవి, మైపాడు, ఇందుకూరుపేట మండలం, నెల్లూరు జిల్లా ఇప్పుడు ఆ భయం లేదు పదేళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నాం. ఎవరూ చేయని మేలును సీఎం జగన్ చేశారు. ఇంటి అద్దెలు చెల్లించలేక, పిల్లలను చదివించుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చాక ఆ ఆలోచన మళ్లీ రాలేదు. ఆ భయం లేదు. మా పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తున్నాం. ఇప్పుడు ఇంటి స్థలం ఒక్కసారి దరఖాస్తు చేయగానే వచ్చింది. – విజయలక్ష్మి, దండోరా కాలనీ, కడప చెప్పలేనంత ఆనందంగా ఉంది బతుకుదెరువు కోసం పదేళ్ల కిందట ఎస్.కోట వచ్చాం. అద్దెలు కట్టలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఎప్పటికైనా సొంత ఇల్లు ఒకటి ఉంటే బావుంటుందని కలలు కనేవారం. ఇప్పుడు నాకు ఇంటి స్థలం ఇచ్చారు. కట్టుకోలేమన్న వారికి ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇస్తుందని జగన్ అన్న చెబుతున్నారు. ఆయన మాట చెప్పారంటే అది శాసనం. మాకు సొంత ఇల్లు వస్తుందన్న ఊహే చెప్పలేనంత ఆనందంగా ఉంది. మా కల నిజం చేసిన జగనన్నను ఎప్పటికీ మరచిపోం. – సింహాద్రి సంతోషి, ఎస్.కోట, విజయనగరం జిల్లా టీడీపీ వాళ్లమైనప్పటికీ ఇల్లు మంజూరు నా భర్త ఓ ప్రైవేట్ స్కూల్లో వాచ్మెన్. తిరుపతి శివజ్యోతి నగర్లో 40 ఏళ్లుగా కాపురం ఉంటున్నాం. అనేకసార్లు ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా.. ఫలితం లేదు. ఇప్పుడు వార్డు వలంటీర్ మా ఇంటికి వచ్చి ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలివ్వాలని అడిగారు. ఇన్నేళ్లు రాని ఇంటి పట్టా ఇప్పుడు వస్తుందా..? అనుకున్నాను. వలంటీర్ బలవంతంగా దరఖాస్తు చేయించింది. ఎవరి సిఫార్సు లేకుండానే ఇల్లు కూడా మంజూరవడంతో ఆశ్చర్యపోయాం. కొన్నేళ్లుగా టీడీపీ సానుభూతిపరురాలుగా ఉన్న నాకు సీఎం జగన్ వల్లే స్థలం వచ్చింది. ఇల్లు కూడా కట్టిస్తున్నారంటే ఆనందంగా ఉంది. చిరకాల స్వప్నం నెరవేర్చారు. – ఎన్.వనజాక్షి, శివజ్యోతినగర్, తిరుపతి నిజంగా ఇది పేదల ప్రభుత్వం రోడ్డు పక్కనున్న ప్రభుత్వ స్థలంలో తాటాకు పాక వేసుకుని జీవిస్తున్నాం. భర్త చనిపోయి పదేళ్లవుతుంది. కూతురుతో కలసి పాకలోనే ఉంటున్నాం. టిడ్కో ఇంటికి దరఖాస్తు చేసుకున్నాను. ప్రభుత్వం రూపాయికే ఇల్లు మంజూరు చేసింది. టీడీపీ ప్రభుత్వం టిడ్కో ఇంటికి 20 ఏళ్లు పాటు బ్యాంకు రుణం చెల్లించాలని చెప్పితే జగన్ ఒక్క రూపాయి కడితే చాలని చెప్పారు. ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని చెప్పడంతో ఆనందంగా ఉంది. నిజంగా ఇది పేదల ప్రభుత్వం. – మాకిరెడ్డి రమణమ్మ, నర్సీపట్నం మున్సిపాలిటీ, విశాఖ జిల్లా అన్నలా ఆదుకుంటున్నాడు పేదరికంతో కన్న తల్లిదండ్రులు కూడా ఇవ్వలేని ఇంటి స్థలం జగనన్న ఇచ్చారు. సొంత అన్నలా ఆడపడుచులను ఆదుకుంటున్నారు. 30 ఏళ్లుగా ఇంటి స్థలం కోసం ఎన్నో అర్జీలు పెట్టినా పట్టించుకోలేదు. జగనన్న ప్రభుత్వంలో దరఖాస్తు పెట్టిన వెంటనే ఇంటి స్థలం, ఇల్లు మంజూరు చేశారు. పేదల గుండెల్లో సీఎం జగన్ చిరస్థాయిగా నిలిచిపోతారు. – చందన భాస్కరలక్ష్మి, దేవరపల్లి, పశ్చిమగోదావరి జిల్లా ఇన్నాళ్లూ ఒకే ఇంట్లో మూడు కుటుంబాలు ఇప్పట్లో సొంత ఇల్లు వచ్చే అవకాశం లభిస్తుందని అనుకోలేదు. మూడు కుటుంబాల వాళ్లం ఒకే ఇంటిలో నివాసముంటున్నాం. చాలా ఇబ్బందిగా ఉంది. విడిగా అద్దె ఇంట్లో ఉండాలంటే మా ఆదాయం సరిపోవటం లేదు. ఈ కష్టాల నుంచి గట్టెక్కే మార్గం లేదా అని అనుకుంటున్న సమయంలో సీఎం జగన్ చెప్పడంతో ఇంటి స్థలానికి దరఖాస్తు పెట్టుకున్నా. నాకు ఇంటి స్థలం పట్టా మంజూరైంది. ఇల్లు కూడా కట్టించి ఇస్తామన్నారు. మా ఊహలను నిజం చేసిన జగనన్నకు రుణపడి ఉంటాం. – కె.శారద, చినగంజాం, ప్రకాశం జిల్లా దేవుడే జగనన్న రూపంలో వచ్చాడు మాది చాలా పేదరికం. 20 ఏళ్ల క్రితం నా భర్తను కిడ్నీ వ్యాధి మహమ్మారి కబళించింది. పిల్లలతో అద్దె ఇంటిలో ఉంటూ కూలి పనులు చేసుకుని బతుకు సాగిస్తున్నా. గత ప్రభుత్వంలో ఇంటి స్థలం కోసం కాళ్లరిగేలా తిరిగినా రాలేదు. కూలి డబ్బులు అద్దెలకు పోస్తే నా పిల్లల భవిష్యత్ ఏమవుతుందోనని మదన పడేదాన్ని. జగనన్న ప్రభుత్వం వచ్చింది. వలంటీర్ వచ్చి ఇంటి స్థలం మంజూరవుతుందని వివరాలు తీసుకుని వెళ్లారు. తర్వాత నాకు ఇల్లు మంజూరైందని చెప్పగానే ఆనందం వేసింది. ఆ దేవుడే జగనన్న రూపంలో వచ్చాడు. ఆయనకు ఎల్లవేళలా రుణపడి ఉంటాం. – జోగి మోహిని, గుణుపల్లి, వజ్రపుకొత్తూరు మండలం, శ్రీకాకుళం జిల్లా ఇది మా కుటుంబానికి తొలి ఆస్తి నా పేరు షేక్ నసీమా. 25 ఏళ్లుగా కుటుంబం మొత్తం అద్దె ఇంట్లోనే సర్దుకుపోతున్నాం. గతంలో ఎన్నోసార్లు ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక దరఖాస్తు చేసిన వెంటనే ఇంటి పట్టా మంజూరు చేశారు. ఇది మా కుటుంబానికి చేకూరిన తొలి ఆస్తి. ఇల్లు కూడా ప్రభుత్వమే కట్టించి ఇస్తుండటం పట్ల ఆనందంగా ఉంది. సీఎం జగన్ చెప్పినవన్నీ చేసుకుపోతున్నాడు. – షేక్ çనసీమా, చిలకలూరిపేట, గుంటూరు జిల్లా జీవితాంతం గుడిసె తప్పదనుకున్నాం కూలికి పోతే తప్ప పూట గడవని పరిస్థితి. గ్రామంలో వేరేవారి స్థలంలో గుడిసె వేసుకొని జీవనం సాగిస్తున్నాం. జీవితాంతం ఇదే గుడిసెలో కాలం ఈడ్చాలని అనుకునే వాళ్లం. నా భర్త హనుమంతప్ప, నలుగురు పిల్లలు ప్రతి రోజూ కూలికి పోయి జీవనం గడుపుతున్నాం. జీవితంలో సొంతిల్లు కట్టుకోలేమనే భావనతో ఉన్న మాకు సీఎం జగన్మోహన్రెడ్డి భరోసా కల్పించారు. ఇంటి పట్టా అందుకున్న వేళ మా ఆనందం చెప్పలేం. ఇప్పుడు ఇల్లు కూడా కట్టిస్తామని చెబుతుంటే సంతోషంతో మాటలు రావడం లేదు. – అయ్యమ్మ, పెద్ద తుంబళం గ్రామం, కర్నూలు జిల్లా చిత్తూరు జిల్లా ఊరందూరులో ప్రజలకు ఇచ్చేందుకు సిద్ధం చేసిన లేఅవుట్ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం తాళ్లకోడు వద్ద వేసిన లే అవుట్ విజయనగరం జిల్లా గుంకలాం వద్ద పేదల కోసం ఏర్పాటు చేసిన ఇళ్ల స్థలాలు -
‘సగం’ మందికి చేరిన బియ్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ బియ్యం పంపిణీ వేగంగా జరుగుతోంది. గడిచిన రెండు మూడు రోజులుగా సర్వర్ సమస్యల కారణంగా అనేక ఇబ్బందులు తలెత్తగా, ఆదివారానికి సమస్య కొలిక్కి రావడంతో పంపిణీ కార్యక్రమం సజావుగా కొనసాగింది. శనివారం ఒక్క రోజే గరిష్టంగా 10.04 లక్షల మంది కార్డుదారులు రేషన్ బియ్యాన్ని తీసుకోగా ఆదివారం మధ్యాహ్నానికి 6.50 లక్షల మంది రేషన్ తీసుకున్నారు. మొత్తంగా రాష్ట్రంలో 87.59 లక్షల కుటుంబాల్లో 2.80 కోట్ల మంది లబ్ధిదారులు ఉండగా, ఇప్పటివరకు 45.11 లక్షల కుటుంబాల్లో 1.60 కోట్ల మంది 1.67 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకున్నట్లు పౌర సరఫరాల శాఖ వర్గాలు వెల్లడించాయి. నిజానికి సాధారణ రోజుల్లో ఒక్కో లబ్ధిదారుడికి 6 కిలోల చొప్పున నెలకు 1.57 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని శాఖ పంపిణీ చేస్తుంటారు. ఈ ప్రక్రియ ప్రతి నెలా 15 రోజుల పాటు కొనసాగుతుంది. కానీ ప్రస్తుతం ఒక్కో లబ్ధిదారుడికి 12 కిలోల ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తుండగా ఇప్పటికే నెల కోటాను దాటి 1.67 లక్షల మెట్రిక్ టన్నుల పంపిణీని పూర్తి చేసింది. ఆదివారం సైతం చాలా రేషన్ దుకాణాల వద్ద జనం గుంపులుగా కనిపించినా డీలర్లు వేగంగానే పంపిణీ ప్రక్రియ పూర్తి చేశారు. 15 తర్వాత కిలో కందిపప్పు.. కేంద్ర ప్రభుత్వం సైతం రేషన్ లబ్ధిదారులకు కిలో కందిపప్పు ఇచ్చేందుకు సమ్మతించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 87.59 లక్షల కుటుంబాలకు కిలో చొప్పున మొత్తంగా 26,685 మెట్రిక్ టన్నుల మేర కందిపప్పు అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ కందిపప్పును కేంద్ర సంస్థ అయిన నాఫెడ్.. పౌర సరఫరాల సంస్థకు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మరో వారం పది రోజుల్లో పూర్తవగానే ఈ నెల 15 తర్వాత నుంచి కందిపప్పును పంపిణీ చేయనున్నారు. -
సబ్సిడీల కోసం వ్యాపారాలు చేయొద్దు
సాక్షి, హైదరాబాద్: సబ్సిడీల కోసం కాకుండా ఆసక్తి, పట్టుదలతో వ్యాపారాలు చేస్తే రాణిస్తారని, అలాంటి వారి కోసం రాష్ట్రంలోని ఇండస్ట్రీయల్ పార్కుల్లో అవకాశాలు ఎదురు చూస్తున్నాయని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ పార్కుల్లో గ్రామీణ యువత, మహిళలు, దళితులు, గిరిజనులకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గురువారం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సీఎం ఎస్టీ ఎంట్రప్రెన్యూర్ అండ్ ఇన్నోవేషన్ పథకం కింద 2019 బ్యాచ్ కోసం ఎంపిక చేసిన 100 మంది గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్య, తెలివి, వ్యాపారం ఎవరి సొత్తూ కాదని, పట్టుదల ఉంటే అందరూ పారిశ్రామికవేత్తలు కాగలరని, ఇప్పటికే కొందరు ఔత్సాహిక యువ గిరిజన పారిశ్రామికవేత్తలు దీనిని నిరూపించారన్నారు. గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కార్యక్రమంలో పాల్గొన్న తృప్తి ఎప్పుడూ కలగలేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఐఎస్బీలో శిక్షణ పొంది, ప్రభుత్వ సాయంతో ఏర్పాటయ్యే పరిశ్రమల ప్రారంభోత్సవానికి తనతోపాటు సెలబ్రిటీలనూ వెంట తీసుకొస్తానని అన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల వల్లే 70 శాతం ఉపాధి, ఉద్యోగాలు లభిస్తున్నాయని, ఈ పరిశ్రమలను కాపాడేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఐఎస్బీలో నిలబడే అవకాశమిచ్చారు: సత్యవతి రాథోడ్ గిరిజనులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రారంభించిన ‘సీఎం ఎస్టీ ఎంట్రప్రెన్యూర్ అండ్ ఇన్నొవేషన్ స్కీం’ద్వారా ఐఎస్బీలో నిలబడి మాట్లాడే అవకాశం గిరిజనులకు దక్కిందని గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సమావేశంలో గిరిజన సంక్షేమ కార్యదర్శి బెన్హర్ మహేశ్‌దత్ ఎక్కా, కమిషనర్ డాక్టర్ క్రిస్టినా చోంగ్తు, ఎస్బీఐ డీజీఎం దేబాశిష్ మిశ్రా, ఐఎస్బీ డీన్ రాజేంద్ర శ్రీవాస్తవ పాల్గొన్నారు. -
‘రైతు భరోసా’ లెక్కతేలుతోంది..!
సాక్షి, మచిలీపట్నం: ‘వైఎస్సార్ రైతు భరోసా’ లబ్ధిదారుల లెక్కతేలుతోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం(పీఎంకేఎస్‌ఎన్‌ఎస్) కింద జిల్లాలో 3,18,935 మంది లబ్ధిదారులుండగా, వారిలో అనర్హులు ఎంతమందో తేల్చడంతో పాటు జాబితాలో చేరని అర్హులను గుర్తించేందుకు గత నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహించారు. క్షేత్ర స్థాయి పరిశీలనలో పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో 40,320 మంది అనర్హులున్నట్టుగా గుర్తించారు. కాగా సెప్టెంబర్ వరకు వెబ్ ల్యాండ్‌లో జరిగిన చేర్పులు, మార్పులు, మ్యుటేషన్ జాబితా ప్రకారం కొత్తగా 45,550 మంది అర్హులుగా గుర్తించారు. 50 వేల మంది ఆక్వా రైతులు.. కాగా కిసాన్ జాబితాలో దాదాపు 50వేల మందికి పైగా ఆక్వా రైతులున్నట్టుగా భావిస్తున్నారు. జిల్లాలో కలిదిండి, కైకలూరు, మండవిల్లి, కృత్తివెన్ను, నందివాడ, మచిలీపట్నం, పెడన, బంటుమిల్లి ప్రాంతాల్లో చేపలు, రొయ్యల చెరువులు ఎక్కువగా ఉన్నాయి. ఈ భూములన్నీ ఇప్పటి వరకు వ్యవసాయ భూములుగానే రికార్డుల్లో నమోదై ఉన్నాయి. ఈ భూములకు చెందిన వ్యవసాయ భూముల జాబితా నుంచి మినహాయించాల్సి ఉంది. రైతు భరోసా నిబంధనల ప్రకారం వీరంతా అనర్హులే. ముమ్మరంగా ప్రక్రియ.. ఇక సెంటు సాగు భూమి కూడా లేని కౌలుదారుల గుర్తింపు కూడా వేగవంతంగా జరుగుతోంది. గ్రామసభల్లోనే కాదు.. వలంటీర్ల ద్వారా కూడా ఈ గుర్తింపు చేస్తున్నారు. ఇప్పటి వరకు గ్రామసభల ద్వారా 4,109 మంది కౌలు దారులను ఫార్మాట్ 3.2 జాబితాలో చేర్చారు. కానీ జిల్లాలో 1.31లక్షల మంది కౌలు దారులున్నట్టు అంచనా. ఎల్ఈసీ, సీఈసీ కార్డులు జారీ చేసిన మేరకైనా అర్హుల జాబితాలో చేర్చేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. జిల్లాలోఎల్‌ఈసీ కార్డు దారులు 17,574 మంది, సీఓసీ కార్డుదారులు 18,762 మంది ఉండగా, ఆర్ఎంజీ గ్రూపుల్లో 2,784 మంది, జేఎల్‌జీ గ్రూపుల్లో 2,073 మంది ఉన్నారు. కనీసం వీరినైనా జాబితాల్లో చేర్చేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. త్వరితగతిన పూర్తికి చర్యలు మరొక వైపు తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్వే నంబర్ల వారీగా రైత్వారీ ఖాతాలను పరిశీలించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో 6,21,043 ఖాతాలున్నాయి. గడిచిన నాలుగు రోజులుగా మండల కేంద్రాల్లో ఈ ఖాతాల వారీగా పరిశీలన చేపట్టారు. ఇప్పటి వరకు 1,21,826 ఖాతాలను పరిశీలించారు. 6వ తేదీలోగా ఈ ఖాతాల పరిశీలన పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో మండల స్థాయిలో ప్రత్యేక సిబ్బందిని నియమించుకుని మరీ రేయింబవళ్లు ఖాతాల పరిశీలన చేస్తున్నారు. ఇందుకోసం మండల వ్యవసాయశాఖ కార్యాలయాల్లో ఎంపీఈఒ, ఏఈఒ, వీఆర్వో, గ్రామ కార్యదర్శులు, గ్రామ వలంటీర్లు ఖాతాల పరిశీలనలో నిమగ్నమయ్యారు. జిల్లా స్థాయిలో ప్రత్యేక సెల్.. గడువు తక్కువగా ఉండడంతో సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్న తలంపుతో ఇంజినీరింగ్ విద్యార్థులను కూడా సహాయకులుగా నియమించుకుని వారితో కూడా పరిశీలన చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో లబ్ధిదారుల పూర్తిస్థాయి జాబితాను తయారు చేస్తున్నప్పుడు ఎదురయ్యే సమస్యలను తీర్చడానికి, తీర్చలేని సమస్యలను ఉన్నతాధికారులకు తెలియజేయడానికి జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా ఒక సెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ సెల్లో ఇద్దరు సహాయ వ్యవసాయ సంచాలకులు, ఇద్దరు వ్యవసాయాధికారులను నియమించారు. అర్హులందరికీ ఇవ్వాలన్నదే లక్ష్యం జిల్లాలో సాగుపై ఆధారపడిన రైతులు, కౌలుదారులకు రైతు భరోసా ద్వారా లబ్ధి చేకూర్చేందుకు కృషి చేస్తున్నాం. నిబంధనల ప్రకారం అనర్హులను తొలగించడంతో పాటు అర్హుడైన ప్రతి రైతును ఈ జాబితాలో చేరుస్తాం. ఖాతాల వారీగా పరిశీలన చేస్తున్నాం. ఆర్టీజీఎస్, ప్రజా సాధికార సర్వేలతో సరిపోల్చుకుని అర్హుల జాబితాలను తయారు చేస్తున్నాం. 15వ తేదీ నుంచి రైతు భరోసా లబ్ధి అందనుంది. – టి.మోహనరావు, జేడీ, వ్యవసాయ శాఖ -
సొంతింటికి గ్రహణం!
ఇళ్లులేని నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల పథకాన్ని తీసుకువచ్చింది. కామారెడ్డి నియోజకవర్గంలో విడతల వారీగా 1,675 ఇళ్లు మంజూరు కాగా 1500 నిర్మాణాలు దాదాపుగా పూర్తయ్యాయి. కానీ వాటికి సెప్టిక్ ట్యాంకులు, డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో లబ్ధిదారులకు కేటాయించలేకపోతున్నారు. సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో 2015–16, 2017–18 సంవత్సరాల్లో కలిపి మొత్తం 7,686 డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరయ్యాయి. బాన్సువాడ నియోజక వర్గానికి 2,810, జుక్కల్‌కు 1,466, కామారెడ్డికి 1,675, ఎల్లారెడ్డికి 1,735 ఇళ్లు కేటాయించారు. ఇందులో 7,186 ఇళ్లకు టెండర్లు పిలువగా.. 4,863 ఇళ్లకు టెండర్లు ఖరారయ్యాయి. దీంతో ఆయా నియోజక వర్గాల్లో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి కాంట్రాక్టు పొందిన సంస్థలు పనులు మొదలుపెట్టాయి. చాలావరకు నిర్మాణాలు పూర్తికావచ్చాయి. బాన్సువాడలో నిర్మాణం పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించారు. ఇంకా కొన్ని నిర్మాణాలు కొనసాగుతున్నాయి. కామారెడ్డిలో.. కామారెడ్డి నియోజకవర్గంలో 1,675 ఇళ్లు మంజూరు కాగా 1500 నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి. ఇళ్ల నిర్మాణాలు పూర్తై దాదాపు ఆరు నెలలు గడచినా సెప్టిక్ ట్యాంకుల నిర్మాణానికి నిధులు లేకపోవడంతో లబ్ధిదారులకు కేటాయించలేకపోతున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద రోడ్లు, విద్యుత్ వంటి సౌకర్యాలు కూడా కల్పించాల్సి ఉంది. ఒక్కో బ్లాక్‌కు ఒక్కో సెప్టిక్ ట్యాంకు నిర్మించి, డ్రెయినేజీలు ఏర్పాటు చేస్తే సమస్య పరిష్కారమవుతుంది. దీనికిగాను రూ.2.89 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. తప్పని ఎదురుచూపులు నియోజకవర్గంలో దాదాపు 1,500 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. వాటిని చూసి నిరుపేదలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇళ్ల మంజూరు కోసం అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు అందిస్తూనే ఉన్నారు. అయితే ఇళ్ల నిర్మాణాలు పూర్తయినప్పటికీ సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో ఇళ్లను కేటాయించడం లేదు. సెప్టిక్ ట్యాంకులు, డ్రెయినేజీల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడంలేదు. వృథాగా.. నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పూర్తై వృథాగా ఉండడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయి. ముఖ్యంగా మద్యపానం, పేకాట, వ్యభిచారం వంటి అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్టు తెలుస్తోంది. ఇళ్లు నిర్మించిన కాంట్రాక్టర్లు తమ పని ముగించుకుని వెళ్లారు. దీంతో అక్కడ ఎటువంటి కాపలా లేకపోవడంతో కొందరు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మార్చుకున్నారు. అసెంబ్లీలో ప్రస్తావించిన విప్ గంప కామారెడ్డి నియోజక వర్గంలో 1,500 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, వాటికి సెప్టిక్ ట్యాంకులు నిర్మిస్తే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడతామని ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో ప్రస్తావించారు. రూ.2.89 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఇప్పటికీ ఎలాంటి చలనం లేకపోవడంతో ఇళ్లు దిష్టిబొమ్మల్లా మిగిలాయి. -
వసూల్ సొమ్ము వెనక్కి
ప్రభుత్వ భూమిలో ప్లాట్ల కోసం వసూలు చేసిన డబ్బు లబ్ధిదారులకు తిరిగి అందించేందుకు గుడుపల్లె నేతలు సిద్ధమవుతున్నారు. నాలుగేళ్ల క్రితం వసూలు చేసిన డబ్బు అధికార పార్టీకి చెందిన గుడుపల్లె ప్రధాన నేతలు పంచుకున్నారు. లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయించడంలో విఫలమయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ, జనం ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేమని భావించి, తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. సాక్షి, కుప్పం : చిత్తూరు జిల్లా గుడుపల్లె సమీపంలోని రాళ్లగంగమాంబ దేవస్థానం వదళ్లున్న 52 సెంట్ల పశువులమేత బీడును చదును చేసి ప్లాట్లుగా మార్చిన విషయం తెలిసిందే. 36 మంది వద్ద ప్లాట్లు రూ.30వేల నుంచి రూ.50వేల వరకు అధికార పార్టీ నేతలు వసూలు చేశారు. ఎన్టీఆర్ గృహకల్పనలో పశువుల మేతబీడును కాలనీ గృహాలు నిర్మించాలని గతంలో ప్రణాళిక సిద్ధం చేసి, వసూలు కార్యక్రమం సాగించారు. ఈ విధంగా రూ.పది లక్షలకుపైగా వసూలు చేసిన గుడుపల్లె మండల ప్రధాన నేతలు కొందరు పంచుకున్నట్లు ఆరోపణలు ఉన్నా యి. నాలుగేళ్లు పూర్తయినా, లబ్ధిదారులకు ప్లాట్లు, ఎన్టీఆర్ గృహకల్పన కింద ఇళ్లు ఇవ్వలేదు. డబ్బు వాపస్.. రెండు నెలల క్రితం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ప్లాట్ల విక్రయాలు కథనంపై అధికార పార్టీ అధినేతలు స్పందించినట్లు సమాచారం. ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజల వద్దకు వెళితే ఆ డబ్బుపై ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానాలు చెప్పాలో అని తర్జనభర్జన పడుతున్నారు. ప్రభుత్వ భూమిలో ప్లాట్ల కేటాయింపులో ఇబ్బంది పడుతున్నామని చెబుతూ, తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వడానికి అధికార పార్టీ నేతలు సిద్ధపడినట్లు సమాచారం ఎవరెవరి దగ్గర ఎంతెంత డబ్బు తీసుకున్నామనే విషయాలు తెలుసుకుని, వారికి తిరిగి చెల్లించాలని మండలానికి చెందిన ప్రధాన నేత మార్కెట్ కమిటీ చైర్మన్ సన్నిహితులతో చర్చించినట్లు సమాచారం. ఆ... ఆదేశాలతోనే... ఎన్నికల దృష్ట్యా తీసుకున్న నగదు తిరిగి చెల్లించాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం వసూళ్లకు పాల్పడ్డ కొందరు నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. నోటిఫికేషన్ వెలువడకముందే లబ్ధిదారులకు డబ్బు తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. -
బాబు స్టిక్కర్ వేద్దాం... ఫిక్స్ చేద్దాం
సాక్షి, అమరావతి బ్యూరో: రానున్న ఎన్నికల్లో ఓటర్లను బెదిరించి తమకు అనుకూలంగా మలచుకునే దిశగా టీడీపీ ప్రభుత్వం మరో పన్నాగానికి సన్నద్ధమవుతోంది. టీడీపీకి ఓటేయకపోతే ఇంతవరకు అందిస్తున్న సంక్షేమ పథకాలను రద్దు చేస్తామని చెప్పేందుకు స్టిక్కర్ రాజకీయానికి తెరతీసింది. ఓ వైపు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ.. మరోవైపు టీడీపీ నేతల బెదిరింపులకు లైసెన్స్ ఇచ్చేలా వ్యవహరిస్తోంది. సంక్షేమ పథకాలు పొందుతున్న లబ్ధిదారుల ఇళ్లకు చంద్రబాబు ఫొటోతో ప్రత్యేక స్టిక్కర్లు అతికించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల్లో వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల పేర్లు, చిరునామా, ఇతర వివరాలను కుటుంబాల వారీగా జాబితాలను రూపొందించాలని చెప్పింది. స్థానిక టీడీపీ నేతలను వెంటబెట్టుకుని మరీ ఇంటింటికి తిరుగుతూ ఆ స్టిక్కర్లు అతికించాలని ప్రభుత్వం చెప్పడం గమనార్హం. ఈ వ్యవహారాన్ని వారం రోజుల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఇంటికి స్టిక్కర్ వేసే సమయంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీకే ఓటు వేయాలని, లేకపోతే సంక్షేమ పథకాలు అందకుండా చేస్తామని అధికారుల ఆధ్వర్యంలో అధికార పార్టీ నేతలు హెచ్చరికలు చేస్తారు. కాగా, ప్రభుత్వ నిర్ణయాన్ని అధికార యంత్రాంగం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇంతవరకు రాష్ట్రంలో ఇలాంటి విధానాన్ని ఏ ప్రభుత్వం అనుసరించలేదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. స్థానిక టీడీపీ నేతలతో స్టిక్కర్లు అతికించడానికి సిద్ధపడితే ప్రజలు తిరగబడతారని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీని వల్ల గ్రామాల్లో వివాదాలు, ఘర్షణలు జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులమైన తామెందుకు వివాదాస్పదం కావాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని ఇప్పటికే ఉద్యోగులు తమ ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వం మాత్రం లబ్ధిదారుల ఇళ్లకు స్టిక్కర్లు అతికించాలన్న పట్టుదలతో ఉంది. మరి ఈ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారితీయనుందో వేచి చూడాల్సిందే. -
హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ మాకొద్దు
-
ఆసరా పింఛన్ల అర్హులను గుర్తించాలి
ఆదిలాబాద్‌అర్బన్: అర్హులైన ఆసరా పింఛన్ లబ్ధిదారులను గుర్తించి జాబితా సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఆయన జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ నెల 18న క్రిస్మస్ గిఫ్ట్ పంపిణీ, 20న ఫుడ్ మెటీరియల్ పంపిణీ చేయాలని అన్నారు. ఈ నెల 19న బతుకమ్మ చీరలను అర్హులైన పేద మహిళలకు పంపిణీ చేయాలని, జిల్లా స్థా«యి గోదాముల్లో ఉన్న చీరలను గ్రామ స్థాయికి సరఫరా చేయాలని చెప్పారు. పంపిణీలో స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. జూనియర్ గ్రామ కార్యదర్శుల నియామకానికి ఈ నెల 25లోగా నియామకపు ఉత్తర్వులు జారీ చేయాలని, అర్హత సాధించిన వారి హాల్‌టికెట్లను స్థానిక దినపత్రికల ద్వారా పబ్లిష్ చేయాలని, ధ్రువీకరణ పత్రాలు పరిశీలించాలని చెప్పారు. జాతీయ రహదారుల పనులకు అవసరమైన భూసేకరణ చేపట్టాలని, రాష్ట్రంలో 16 జిల్లాల్లో భూసేకరణ వేగవంతం చేయాలని అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు వెంటనే చెక్కులు అందజేయాలని అన్నారు. రాష్ట్రంలో 90 లక్షల బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. 57 సంవత్సరాలు నిండిన అర్హత గల పేద వారికి ఆసరా పింఛన్లు మంజూరు చేయాలన్నారు. ముఖ్యమంత్రి ప్రకటన నేపథ్యంలో 57 సంవత్సరాలు నిండిన వారిని ఓటర్ల జాబితా, సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా లబ్ధిదారుల జాబితా సిద్ధం చేసి సమాచారాన్ని పంపించాలని తెలిపారు. అర్హత గల వారికి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 9355 మంది జూనియర్ పంచాయతీ గ్రామ కార్యదర్శుల ని యామకానికి సంబంధించిన జాబితాలను జిల్లాల వారీగా పంపించనున్నట్లు వివరించారు. ఆయా జిల్లాలో పత్రికల్లో హాల్‌టికెట్లను ప్రచురించి అ భ్యుర్థులకు తెలియజేయాలన్నారు. ప్రతీ కుటుం బంలో ఒకరికి పింఛన్ అందేలా చూడాలని అన్నా రు. కలెక్టర్ దివ్యదేవరాజన్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 2 లక్షల బతుకమ్మ చీరలు పంపిణీ చేయాల్సి ఉందని తెలిపారు. ఆసరా పింఛన్లో భాగంగా ఆధార్‌ను వయస్సు ధ్రువీకరణలో సమస్యలు ఉన్నట్లు ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకువచ్చారు. ఉమ్మడి కుటుంబంలో 75 ఎకరాల భూమి ఉందని, వారికి ఆసరా పింఛన్ మంజూరులో సమ స్య ఎదురవుతున్నాయని తెలిపారు. అభయహస్తం పింఛన్లు సమస్య వివరించారు. ఈ వీడి యో కాన్ఫరెన్స్‌లో సహాయ కలెక్టర్ ప్రతిక్ జైన్, డీపీవో, జెడ్పీసీఈవో జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
కోటి కళ్ల చల్లని చూపు
సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లో వృద్ధులు దూరం నుంచి ఎవరినైనా చూడాలంటే కను బొమల పైన చెయ్యి పెట్టుకొని, కళ్లు చిన్నవి చేసుకొని చూస్తుండటం సర్వసాధారణం. ఇక మరికొందరి కళ్లు పూర్తిగా కనిపించకపోయినా అలాగే కాలం వెళ్లదీయడమూ మనకు తెలుసు. కళ్లు కనిపిం చడం లేదన్న సంగతి వారికి తెలుసు. కానీ వైద్యం చేయించుకునే స్థోమత లేకపోవడం, ఆరోగ్యశ్రీలోనూ దానికి ఉచిత వైద్య చికిత్స చేయకపోవడంతో లక్షలాది మంది ఇప్పటివరకు అలాగే కనుచూపు కరువై జీవిస్తున్నారు. కానీ ఇప్పుడు గ్రామాల్లో పరిస్థితి మారుతోంది. కంటి వెలుగు కింద ప్రభుత్వం కంటి పరీక్షలు చేసి ఉచితంగా కళ్లద్దాలు ఇస్తుండటంతో గ్రామీణుల్లో ఆనందం వెల్లివిరిసింది. అప్పటివరకు తమ మనవడిని, మనుమరాలిని సంపూర్ణంగా చూడలేని పరిస్థితి నుంచి ఇప్పుడు వారిని నిండుగా కళ్లారా చూస్తుండటంతో కంటి వెలుగుపై గ్రామీణుల్లో స్పందన పెరిగింది. అదికాస్తా ఎన్నికల్లో ఓటు రూపంలో టీఆర్ఎస్కు లాభించింది. ‘కేసీఆరే కంటి పరీక్షలు చేయిస్తున్నాడంట. ఆయన చలువ వల్లే కళ్లద్దాలు వచ్చాయి. ఇప్పుడు తృప్తిగా అందరినీ చూస్తున్నామ’న్న ప్రచారం జరిగింది. కేసీఆర్ కంటి పరీక్షలంటూ ప్రజలు పిలుచుకుంటున్నారు. ఒకవైపు వృద్ధాప్య పింఛన్, మరోవైపు కంటి చూపుతో వృద్ధులు, పెద్దలు టీఆర్ఎస్ను నిలువెల్లా దీవించారు. 90% మంది బడుగు బలహీన వర్గాలే.. ఆగస్టు 15 నుంచి కంటి వెలుగు కార్యక్రమం ప్రారం భమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఎన్నికల ముందు రోజు వరకు ఏకంగా కోటి మందికి కంటి పరీక్షలు చేశారు. కోటి మందిలో 45.15 లక్షల మంది పురుషులు, 54.85 లక్షల మంది మహిళలు ఉన్నారు. కంటి పరీక్షలు చేయించుకున్నవారిలో చాలామంది 18 ఏళ్లకు పైబడిన వారే ఉన్నారు. పైగా పరీక్షలు చేయించుకున్న కోటి మందిలో దాదాపు 90% మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే సగానికి పైగా బీసీలే కావడం గమనార్హం. బీసీలు 56.83 లక్షల (56.82%) మంది పరీక్షలు చేయించుకున్నారు. కోటి మందిలో 36.61 లక్షల మందికి ఏదో ఒక కంటి లోపం ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. అందులో 16.66 లక్షల మందికి అక్కడికక్కడే ఉచితంగా రీడింగ్ గ్లాసులు ఇచ్చారు. ఇక వారు కాకుండా చత్వారంతో బాధప డుతున్నవారు 12.95 లక్షల మంది ఉన్నారు. వారికి ప్రత్యేకంగా కళ్లద్దాలు తయారుచేసి ఇవ్వాలని నిర్ణ యించారు. అందులో ఇప్పటికే 1.96 లక్షల మందికి చత్వారం అద్దాలు అందజేశారు. వీరంతా ప్రభు త్వంపై కృతజ్ఞతాభావంతో ఉన్నారు. ‘ప్రభుత్వం గ్రామంలోకి వచ్చి కంటి పరీక్ష చేసి ఉచితంగా కళ్లద్దాలు ఇవ్వడమనేది సాధారణ విషయం కాదు. గ్రామాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కళ్లద్దాలు పెట్టుకున్నవారే కనిపిస్తున్నారు. కాబట్టి కంటి వెలుగు కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అది టీఆర్ ఎస్‌కు ఓట్ల వర్షం కురిపించింద’ని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. 4.47 లక్షల మందికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయాల్సి ఉంది. ఈ కార్యక్రమం మొదలుపెడతామని వివరించారు. ►16.6 లక్షల మందికి రీడింగ్ గ్లాసులు ఇచ్చిన వైనం ►12.95 లక్షల మందికి చత్వారం అద్దాలు -
ఎదురుచూపులేనా !
బూర్గంపాడు: షెడ్యూల్ కులాల నిరుద్యోగ యువత స్వయం ఉపాధి కల్పనకు ఎస్సీ కార్పొరేషన్ నుంచి ప్రభుత్వం ఇవ్వాల్సిన రుణాలు అందని ద్రాక్షగానే మిగులుతున్నాయి. ప్రతి ఏటా ఎస్సీ కార్పొరేషన్ అధికారులు రుణాలకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రచారం చేయటం, ఆ తర్వాత లబ్ధిదారులను ఎంపిక చేయటం, అంతటితోనే సరిపెట్టడం పరిపాటిగా మారింది. గత రెండేళ్లుగా ఎస్సీ నిరుద్యోగులు రుణాల కోసం ఎదురుచూస్తున్నారు. రుణాలకు ఎంపికైనప్పటికీ.. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. లబ్ధిదారులను ఎంపిక చేసిన అధికారులు.. వారికి రుణాలు మంజూరు చేయకుండానే ఈ ఏడాది కొత్తగా మళ్లీ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జిల్లాలో 2017 – 18 సంవత్సరానికి గాను 2, 283 మంది లబ్ధిదారులను ఎస్సీ కార్పొరేషన్ ఎంపిక చేసింది. ఈ ప్రక్రియ పూర్తయి ఏడాది గడిచింది. కాగా, ఇప్పటివరకు టేకులపల్లి, చుంచుపల్లి మండలాలకు చెందిన 180 మందికి మాత్రమే ఎస్సీ కార్పొరేషన్ రుణాలు మంజూరయ్యాయి. మిగతా మండలాల్లోని 2103 మంది లబ్ధిదారులకు ఇప్పటి వరకు రుణాలు మంజూరు కాలేదు. ఎస్సీ కార్పొరేషన్ నుంచి రుణాలు తీసుకునే లబ్ధిదారులు యూనిట్ పెట్టుకునేందుకు 80 శాతం ఎస్సీ కార్పొరేషన్ రాయితీగా అందిస్తుంది. మిగతా 20 శాతం బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే బ్యాంకర్లు ఎస్సీ కార్పొరేషన్ రుణాలు తీసుకున్న వారు సక్రమంగా చెల్లించటం లేదని, 20 శాతం బ్యాంకు రుణం ఇవ్వాలంటే లబ్ధిదారుని నుంచి డిపాజిట్ చేయాలని చెపుతున్నారు. అలా చెల్లించిన వారికే బ్యాంకు రుణం ఇచ్చేలా అంగీకారపత్రం అందిస్తున్నారు. దీంతో లబ్ధిదారులు తమ వాటా 20 శాతం ఎంపిక సమయంలో చెల్లించి బ్యాంకుల నుంచి కాన్సెంట్ తెచ్చుకున్నారు. ఇందుకోసం ప్రైవేటు అప్పులు తీసుకుని బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. ఏడాది దాటినా రుణాలు మంజూరు కాకపోవటంతో లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 2016 – 17 సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు ఎంపికైన లబ్ధిదారుల్లో కొందరిని 2017 – 18 లబ్ధిదారుల్లో చేర్చారు. వారు రెండేళ్లుగా ప్రభుత్వ రాయితీ కోసం పడిగాపులు పడుతున్నారు. బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు బయట తీసుకువచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పది రోజుల్లో రుణాలు మంజూరు కాకపోతే మళ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎవరూ పట్టించుకోరని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రుణాలు వెంటనే మంజూరు చేయాలని కోరుతున్నారు. తీవ్రజాప్యం జరుగుతోంది ఎస్సీ కార్పొరేషన్ రుణాల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోంది. లబ్ధిదారులను ఎంపిక చేసి ఏడాది గడిచినా రుణం మాత్రం మంజూరు కావడం లేదు. లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా పట్టించుకునే వారు లేరు. ఎప్పుడు అడిగినా వస్తాయి అంటారే తప్ప ఇచ్చేది మాత్రం లేదు. – పేరాల శ్రీనివాసరావు, మాజీ ఉపసర్పంచ్, సారపాక బడ్జెట్ విడుదలవుతుంది జిల్లాలో 2, 283 మంది లబ్ధిదారులకు గాను 180 మందికి రుణం మంజూరు అయింది. మిగతా వారికి కూడా బడ్జెట్ విడుదలైంది. రుణాలకు సంబంధించి చెక్ అలాట్ అయింది. తొందరలోనే లబ్ధిదారులకు రుణాలను అందిస్తాం. – ఎం. పులిరాజు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ -
రుణం.. అందని ద్రాక్షే!
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: బీసీ కార్పొరేషన్లో రుణాలు అందని ద్రాక్షగా మారాయి. గత రెండేళ్లుగా రుణాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలే పంపకపోవడం గమనార్హం. 2017–18 సంవత్సరాలకు బీసీ అభ్యర్థుల నుంచి రుణాల కోసం దర ఖాస్తులను ఆహ్వానించింది. దీంతో జిల్లావ్యాప్తంగా మొత్తం 32వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదటి విడతగా రూ.50వేలు వందశాతం «సబ్సిడీ కోసం దరఖాస్తులు చేసుకున్న 86 మందికి అధికారులు రుణాలు మంజూరు చేశారు. మిగతా వారికి కూడా రుణాలు ఇచ్చేందుకు అధికారులు సకరత్తు చేస్తున్నారు. అయితే లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత డొల్లగా మారిందనే విమర్శలున్నాయి. గతంలో జిల్లాస్థాయి కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేసేది. ప్రస్తుతం పూర్తిగా మండ ల స్థాయి అధికారులే చేస్తున్నారు. ఎంపీడీఓతో పాటు డీపీడీఓ, బ్యాంకు అధికారులు, రెవెన్యూ అధికారులతో కూడిన కమిటీ ప్రతి గ్రామంలో గ్రామసభ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. చాలా మండలాల్లో అధికారులు లబ్ధిదారుల ఎంపిక విషయంలో నిబంధనలు పాటించలేదన్న వాదన బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రోజుల తరబడి ఎదురుచూసిన జిల్లాలోని నిరుద్యోగుల ఆశలపై బీసీ కార్పొరేషన్ నీళ్లు చల్లినట్లైంది. అధికారులు తమకు ఇష్టమొచ్చినట్లు ఎంపిక చేశారని, మండల నాయకులు చెప్పిన వారికే రుణాలు ఇచ్చారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. లబ్ధిదారుల ఎంపిక విధానం బీసీ కార్పొరేషన్ వివిధ స్కీంలకు దరఖాస్తు చేసుకున్న వారికి వ్యక్తిగత రుణాలతో పాటు, కార్పొరేషన్ రుణాలు ఇస్తుంది. ముందుగా దరఖాస్తులను అభ్యర్థులు ఆన్లైన్ పద్ధతిలో చేసుకుని అనంతరం, మండల ఎంపీడీఓ కార్యాలయంలో వాటిని సమర్పించాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా గ్రామాల వారి వివరాలను సేకరించిన మండల స్థాయి కమిటీ గ్రామాలలో లబ్ధిదారుల ఎంపికను గ్రామసభల ద్వారా ఎంపిక చేస్తుంది. ఇందులో అభ్యర్థులు ఆర్థిక, సామాజిక, వ్యాపారం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికపై నిబంధనలు ప్రత్యేకంగా జారీ చేయలేదు. ఈ క్రమంలో లబ్ధిరులను ఎలా ఎంపిక చేస్తారన్న విషయంలో కూడా స్పష్టత లేకుండా పోయింది. స్థానిక నాయకులు చెప్పిన వారికే రుణాలు జిల్లాలో చాలా మండలాల్లో ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యిందన్న విషయం దరఖా స్తుదారులకు తెలియదు. గ్రామసభల ద్వారా ఎంపిక చేస్తారన్న విషయం మాత్రమే తెలుసు. సభలు ఎప్పుడు నిర్వహిస్తారో, ఎంపిక ఎలా చేస్తారన్న విషయం స్పష్టత లేదు. ఈ విషయంలో అధికారులు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలున్నాయి. స్థానిక నాయకులు చెప్పిన వారినే ఏకపక్షంగా ఎంపిక చేశారని, పూర్తి స్థాయి లో ఏ గ్రామంలో కూడా గ్రామసభలు నిర్వహించలేదని అంటున్నారు. దరఖాస్తుదారులకు అధికారులు మొండిచేయి చూపారని విమర్శిస్తున్నారు. 1,360 మంది లబ్ధిదారులు జిల్లా వ్యాప్తంగా బీసీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్న మొత్తం లబ్ధిదారులు 1,360 మందిని ఎంపిక చేయాలని ప్రభుత్వం జిల్లా అధికారులకు సూచించింది. వివిధ స్కీంల కింద రూ.6.80 కోట్లను కేటాయించింది. ఇందులో రూ. 50వేలు వందశాతం సబ్సిడీ కోసం దరఖాస్తులు చేసుకున్న 86 మందికి అందించేందుకు ప్రభుత్వం రూ.43లక్షలు విడుదల చేసింది. వీటితో పాటు రెండో విడతగా 243 మంది లబ్ధిదారుల కోసం రూ.1.21.50 కోట్లలో బడ్జెట్ కేయించారు. వీటికోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయి జిల్లా అధికారుల వద్దకు ఫైల్ వెళ్లింది. ఈ క్రమంలో మొ త్తం ఇప్పటివరకు 329 మంది లబ్ధిదారులకు రుణా లు ఇచ్చేందుకుప్రక్రియపూర్తయ్యింది.1.031 మంది లబ్ధిదారులకు ఇంకా రుణాలు మంజూరుకావాల్సి ఉంది. దీనికోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. సంఘాల రుణాలపై లేని స్పష్టత వివిధ ఫెడరేషన్ల కింద రూ.50వేల నుంచి రూ.10లక్షల వరకు రుణాల కోసం 32వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో సంఘాలుగా ఏర్పడిన వారూ ఉన్నారు. మొదటి విడతగా కేవలం రూ.50వేలకు మాత్రమే ప్రభుత్వం రుణా లు ఇస్తుంది. ఎక్కువ మొత్తంలో «రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి, సంఘాల తరపున దరఖాస్తు చేసుకున్న వారికి ఎప్పుడు రుణాలు ఇస్తారో అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. -
టార్గెట్ ఇవ్వాల్సిందే..!
నల్లగొండ : బీసీ కార్పొరేషన్ పథకాలపై అనిశ్చితి నెలకొంది. స్వయం ఉపాధి పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయడంపై అధికారులు అయోమయంలో పడ్డారు. నిర్దేశించిన లక్ష్యం లేకుండా పథకాలకు అర్హులైన వారిని ఎంపిక చేయడం అంత సులువు కాదని ఎంపీడీఓలు తేల్చి చెబుతున్నారు. పథకాల మార్గదర్శకాల్లో మార్పు చేయాలని, లేదంటే క్షేత్రస్థాయిలో రాజకీయంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కోక తప్పదనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారులను ఎంపిక చేయాలంటే ముందుగా అర్హులైన వారితో జాబితా తయారు చేయాలని కార్పొరేషన్ విధివిధానాలు రూపొందించింది. పేద, నిరుపేద కుటుంబాలు, వితంతువులు, వికలాంగులు, సంచార జాతుల వారికి ప్రాధాన్యత కల్పించా లని, మొత్తం స్కీంల్లో 33 శాతం మహిళలకు, 3 శాతం వికలాంగులకు ఇవ్వాలని చెప్పారు. ఈ రకంగా మండలం, పట్టణాల్లో అర్హులైన వారితో జాబితా తయారు చేయాలంటే రాజకీయంగా సమస్యలు వచ్చే అవకాశం ఉందని సంబంధిత అధికారులు అంటున్నారు. అదీగాక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కార్పొరేషన్ పథకాలపై దృష్టి సారించడం కూడా అంత çసులువుకాదనే విషయాన్ని వారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రైతుబంధు కార్యక్రమం, పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఎంపీడీఓలు, గ్రామ కార్యదర్శులు క్షణం తీరికలేకుండా గ్రామాల్లో తిరుగుతున్నారు. ఇప్పటికిప్పుడు గ్రామసభలు నిర్వహించి అర్హులను గుర్తిం చడం కష్టమైన పనేని ఎంపీడీఓలు అంటున్నారు. పనిఒత్తిడితో సతమతం.... రైతుబంధు కార్యక్రమం ఈ నెల 17 వరకు కొనసాగింది. మరో వైపు పంచాయతీ ఓటర్ల జాబితాపై ఎంపీడీఓలు, అధికారులు తీవ్ర కసరత్తు చేయాల్సి వచ్చింది. ఓటర్ల జాబితా పూర్తికాక ముందే పోలింగ్ కేంద్రాల పని మొదలైంది. కొత్తగా పంచాయతీలు ఏర్పాటైన నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. ఇది కొనసాగుతుండగానే రైతుబంధు కార్యక్రమంలో మిగిలిన భాగాన్ని పూర్తి చేసేందుకు వచ్చే నెల 25 వరకు గడువు పొడిగించారు. ఇలా ఒకదాని తర్వాత మరొకటి పనిభారం పెరగడంతో అధికారులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. పంచాయతీ ఎన్నికలకు రైతుబంధు పథకం ముడిపడి ఉండటంతో మరేతర పని పెట్టుకోకుండా చెక్కులు, పాస్‌పుస్తకాలు పంపిణీ వందశాతం పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఈ రెండు కార్యక్రమాలు పూర్తయ్యాకే కార్పొరేషన్ పథకాలపై దృష్టి సారిస్తామని ఎంపీడీఓలు చెబుతున్నారు. లక్ష్యం నిర్దేశిస్తేనే గ్రామసభలు... లబ్ధిదారుల ఎంపిక జరగాలంటే మండలం, పట్టణం వారీగా లక్ష్యాలను నిర్దేశించాలని, అలా కాకుండా గ్రామసభలు నిర్వహించడం వీలుకాదని అధికారులు అంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 34,284 దరఖాస్తులు వచ్చాయి. వీటిన్నింటిని వడపోసి, అర్హులైన వారితో జాబితా తయారు చేయడం తలకుమించిన భారమని అధికారులు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ యాదాద్రి జిల్లా ఉన్నతాధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. గతంలో ఉన్న విధానాన్నే కొనసాగించాలని, మండలం, పట్టణాల్లో ఒక్కో స్కీంకు ఎంత మందిని ఎంపిక చేయాలనే దానిపైన నిర్దేశించిన లక్ష్యాన్ని ముందుకు ఖరారు చేస్తే లబ్ధిదారుల ఎంపిక సులువుగా ఉంటుందనే విషయాన్ని వివరిస్తూ ప్రభుత్వానికి లిఖితపూర్వక లేఖ రాశారు. ముగిసిపోతున్న గడువు.... కార్పొరేషన్ షెడ్యూల్ ప్రకారం లక్ష రూపాయల పథకాలకు లబ్ధిదారులను ఈ నెల 15 తేదీలోగా ఎంపిక చేయాల్సి ఉంది. అదేవిధంగా రెండు లక్షల పథకాలకు 25వ తేదీ, రెండు లక్షలు దాటిన పథకాల లబ్ధిదారులను జూన్ 5 తేదీలోగా ఎంపిక చేసి ఆ జాబితాను జిల్లా అధికారులకు పంపాల్సి ఉంది. ఇదంతా జరగాలంటే గ్రామసభలు, వార్డు సభలు నిర్వహించాలి. కానీ ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో ఈ ప్రక్రియ మొదలు కాలేదు. -
‘ఎరువుల సబ్సిడీ కంపెనీలకే’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యక్ష నగదు బదిలీ కింద ఎరువుల సబ్సిడీ లబ్ధిదారులకు కాకుండా ఫెర్టిలైజర్ కంపెనీలకే విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.లబ్ధిదారులకు రిటైలర్లు ఎరువులు విక్రయించిన అనంతరం సబ్సిడీని ఆయా కంపెనీలకు చెల్లిస్తామని ఎరువులు, రసాయనాల మంత్రి రావు ఇంద్రజిత్‌సింగ్ మంగళవారం లోక్‌సభలో వెల్లడించారు.ఈ వ్యవహారంపై లోతైన విశ్లేషణ జరిపిన నీతి ఆయోగ్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి తెలిపారు. ఎల్పీజీ తరహాలో సబ్సిడీని నేరుగా లబ్ధిదారులకు అందచేయడం ఎరువుల సబ్సిడీ విషయంలో సాధ్యపడదని చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో దశలవారీగా ప్రభుత్వం ఎరువుల సబ్సిడీని ప్రత్యక్ష నగదు బదిలీని ప్రవేశపెడుతుందని చెప్పారు. రిటైలర్లు లబ్ధిదారులకు విక్రయించిన ఎరువుల ఆధారంగా సబ్సిడీని గ్రేడ్ల వారీగా ఆయా ఎరువుల కంపెనీలకు ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. ఆధార్ కార్డులు లేని లబ్ధిదారులు సైతం కిసాన్ క్రెడిట్ కార్డు, ఓటర్ ఐడీ కార్డులు చూపి సబ్సిడీపై ఎరువులను కొనుగోలు చేయవచ్చని మంత్రి చెప్పారు. -
బడ్జెట్ ఎక్కువగా మేలు చేసింది వీరికేనట..!
సాక్షి, న్యూఢిల్లీ: రూరల్ ఫ్రెండ్లీ బడ్జెట్‌గా ప్రభుత్వం ప్రకటించిన 2018 ఆర్థిక బడ్జెట్లో ఎఫ్ఎంసీజీ రంగానికే ఎక్కువ బూస్ట్ లభించిందని ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలపై దృష్టిపెట్టి, లాభపడుతున్న కన్జ్యూమర్, ఎఫ్ఎంసీజీ కంపెనీలు ప్రస్తుత బడ్జెట్‌తో మరింత భారీగా లాభపడనున్నాయి. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీలతో అసంఘటిత రంగం కుదేలవుతుండగా.. బడ్జెట్ ప్రోత్సాహకాలతో భారీ ఎఫ్ఎంసీజీ కంపెనీలు మరింత పుంజుకోనున్నాయి. అలాగే దిగుమతులపై సుంకం పెంచడం కూడా ఈ కంపెనీలకు లాభదాయకం. అంతేకాదు దిగుమతి సుంకం పెంపు స్థానిక కంపెనీలకు, ఉత్పత్తులకు ఊతమివ్వనుంది. తద్వారా ఉద్యోగ అవకాశాలు భారీగా పెరుగుతాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నారు. ప్రధాన కన్జ్యూమర్ డ్యూరబుల్ స్టోర్స్ అన్నీ పల్లెల్లోకి విస్తరించాయి. ఇప్పటికే గ్రామీణ మార్కెట్‌పై దిగ్గజ కంపెనీలు ఆకర్షణీయ ఉత్పత్తులను అందుబాటులోకి తేవడంతోపాటు, మంచి ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ వినియోగదారుడు లోకల్‌బ్రాండ్ కంటే నేషనల్ బ్రాండ్ వైపు మొగ్గుచూపుతారని భావిస్తున్నారు. దీనికి తోడు ప్రధానంగా 2022నాటికి రైతులు ఆదాయం రెట్టింపు చేసే లక్ష్యంతో ఉన్నామని ఆర్థికమంత్రి ప్రకటించారు. అలాగే పంటలకు కనీస మద్దతు ధర 150 శాతం పెరగనుందని వెల్లడించారు. దీంతో గ్రామీణుల వినిమయ శక్తిని ఇప్పటికే విస్తరించిన ఈ కంపెనీలు సొమ్ము చేసుకుంటాయని అంచనా. -
పేదలపై జులుం తగదు
లక్షల్లో ఇళ్లు అమ్ముకున్న వారిపై చర్యలు శూన్యం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం రాజమహేంద్రవరం అఖిలపక్ష నాయకులు ద్వజం ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్) : హౌసింగ్ అధికారులు అర్హులుగా గుర్తించి రూ.60,800 అప్పులు చేసి మరీ ప్రభుత్వానికి చెల్లిస్తే ఎండోమెంట్కాలనీలో ఫ్లాట్లను కేటాయించారని ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు లక్షల్లో ఆ ఇళ్లను అమ్ముకోవడం వల్లే పేదవారిని అన్యాయంగా ఖాళీ చేయించారని రాజమహేంద్రవరం అఖిలపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు మజ్జి అప్పారావు అధ్యక్షతన అఖిలపక్ష నాయకులు మాట్లాడారు. ప్రకటించిన 181 మంది ఎందుకు అనర్హులో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అధికారులు చెప్పాలి ఉండగా, అలా కాదని అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఆజ్ఞతో ఏకపక్షంగా కొత్తవారికి కేటాయించడం దారుణమన్నారు. అధికారులు, పోలీసులు ఇల్లు ఖాళీచేయించే విధానం కూడా లబ్ధిదారులను భయబ్రాంతులకు గురిచేసిందన్నారు. తలుపులు పగలుగొట్టి, బయటకు ఈడ్చడం వంటి చర్యలు దారుణమన్నారు. కొత్తగా ఇచ్చిన 181మంది లబ్ధిదారుల జాబితాను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అనర్హులు ఉంటే తొలగించినా ఇబ్బంది లేదని అర్హులకు మాత్రం అన్యాయం జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు.ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకు వెళతామని, బాధితులకు న్యాయం జరగని పక్షంలో కార్యాచరణ ఉద్యమాన్ని త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఎంగిలి మెతుకులు కోసం ఆశపడడం దారుణం : రౌతు అధికారపార్టీ నాయకులు లక్షల్లో సొమ్ములు వసూలు చేసి అర్హులైన పేదవాడి ఎంగిలి మెతుకులు కోసం ఆశపడడం దారుణమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నగర కో ఆర్డినేటర్ రౌతుసూర్యప్రకాశరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రతిపేదవాడికి గూడు ఉండాలన్న ఉద్ధేశ్యంతో దేవదాయశాఖ భూమిలో గృహాలను నిర్మించారన్నారు. లబ్ధిదారులను అధికారులు సర్వే చేసిన తరువాతే వారి వద్ద సొమ్ములు కట్టించుకుని ఇళ్లు కేటాయించారన్నారు. అప్పుడు అర్హులు ఇప్పుడు అనర్హులు ఎలా అవుతారని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో నిర్మించిన వాంబే గృహాలలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అనర్హులు ఉన్నారని తన దృష్టికి వచ్చినా పేదవాడికి అన్యాయం జరగకూడదని భావించి ఎవరినీ తొలగించలేదని స్పష్టంచేశారు. లబ్ధిదారుల కోసం పోరాడుతున్న మజ్జి అప్పారావును పోలీసులు అరెస్టు చేసిన తీరును తీవ్రంగా ఖండించారు. క్రిమినల్ కేసులు పెట్టాలి : సీపీఎం నేత అరుణ్ లబ్ధిదారులను అర్హులుగా ప్రకటించిన అప్పటి కలెక్టర్ నుంచి కింద తహసీల్దార్, హౌసింగ్ అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆ తరువాత వీరిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం నేత టి.అరుణ్ డిమాండ్ చేశారు. అప్పటి అధికారులు సర్వేలు నిర్వహించి అర్హులుగా ప్రకటించిన తరువాతే సొమ్ములు కడితేనే ఇళ్లు కేటాయించారన్నారు. జన్మభూమి కమిటీ సభ్యుల పెత్తనమా? కందుల ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను కాదని రాజ్యాంగ విరుద్ధమైన జన్మభూమి కమిటీ సభ్యుల పేరుతో పచ్చ చొక్కాలకు ఇళ్లను కేటాయించడం దారుణమని మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ పార్టీ గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనర్హులుగా ప్రకటించిన 181మంది ఎందుకు అర్హులు కారో వివరంగా శ్వేతపత్రంను విడుదల చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. అప్పటి ఎమ్మెల్యే రౌతు ఎంతో కృషి చేసి లబ్ధిదారులకు ఇళ్ల నిర్మించి ఇచ్చారన్నారు. సీపీఐ నగర అధ్యక్షుడు నల్లా రామారావు మాట్లాడుతూ 181 మంది లబ్ధిదారుల తొలగింపుపై రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్యచౌదరి కలిస్తే అందరితో మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పినా అది అమలుకు నోచుకోలేదన్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్వీ శ్రీనివాస్ మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు పోలీసులు, అధికారులతో బలవంతంగా ఖాళీచేయించడం దారుణమన్నారు. ఎమ్మార్పీఎస్ నాయకులు వైరాల అప్పారావు మాట్లాడుతూ లబ్ధిదారులలో దళితులు అని చూడకుండా దారుణంగా తలుపులు పగలగొట్టి ఖాళీ చేయించడంపై ఎస్సీ, ఎస్టీ కేసు పెడతామని హెచ్చరించారు. తండ్రి ముఖ్యమంత్రి, కుమారుడు మంత్రిగా ఉన్నప్పుడు తండ్రీ కొడుకులుకు ఇళ్లు ఉండకూడదా అని ఎద్దేవా చేశారు. నగరపాలక సంస్థ మాజీ ఫ్లోర్‌లీడర్ పోలు విజయలక్ష్మి మాట్లాడుతూ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన లబ్ధిదారుణి పెద్దిరెడ్డి రాజేశ్వరిదేవిని అనర్హురాలుగా ప్రకటించి ఖాళీ చేయించడం దారుణమన్నారు. ఉద్యమ నేత మజ్జి అప్పారావు మాట్లాడుతూ అధికారులు, పోలీసులు తీరు దారుణమని, 54 మందికి హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసిందని, పోలీసులు, అధికారులు వ్యవహరించిన తీరును సీడీల రూపంలో త్వరలోనే విడుదల చేస్తామన్నారు. అఖిలపక్ష నాయకులు మార్తి నాగేశ్వరరావు, పోలిన వెంకటేశ్వరరావు, గోలి రవి, మార్గాని రామకృష్ణగౌడ్, కానుబోయిన సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
సబ్సిడీ నిధులు ఆదా చేస్తే మీకే..!
రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ * ఎల్పీజీ తరహాలో నేరుగా లబ్ధిదారులకే ప్రయోజనాలు * దీంతో డూప్లికేట్లు, అనర్హులు, అక్రమార్కులకు ముకుతాడు * దేశవ్యాప్తంగా రూ.36 వేల కోట్లు మిగులుతాయని అంచనా * అన్ని రాష్ట్రాల్లోని లబ్ధిదారుల డేటా ఒకేచోటికి * డీబీటీ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: పెన్షన్లు.. స్కాలర్షిప్పులు.. ఉపాధిహామీ.. ప్రజాపంపిణీ.. ఉపాధి శిక్షణ.. వీటికి సంబంధించి అమలవుతున్న పథకాలు.. కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని అందిస్తోంది. వీటిలో కొన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు చేరుతున్నాయి. మరికొన్ని పథకాలకు సంబంధించిన సబ్సిడీ ముందుగా ఆయా శాఖలకు అందుతున్నాయి. అయితే ఈ సబ్సిడీ నిధులు వివిధ రకాలుగా దుర్వినియోగమవుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం చాలావరకూ దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. సబ్సిడీ నిధులను ఆదా చేస్తే ఆ డబ్బును రాష్ట్రాలకే పంచి పెడతామని ప్రకటించింది. వివిధ పథకాలకు ఇస్తున్న సబ్సిడీ నిధులను నేరుగా లబ్ధిదారులకు బదిలీ చేసే విధానాలను అమలు చేస్తే.. దేశవ్యాప్తంగా సుమారు రూ.36 వేల కోట్లు మిగులుతాయని అంచనా వేసింది. కేంద్రం ఇప్పటికే ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీలను నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా దాదాపు రూ.28 వేల కోట్లు ఆదా అయినట్లుగా లెక్కతేల్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే సబ్సిడీ నిధులను ఆదా చేసే అవకాశముందని, వీటిని ఆయా రాష్ట్రాల ఖాతాలకే బదిలీ చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు తగిన వ్యూహాలను అమలు చేయాలని సూచించింది. ఇటీవల కేంద్ర కేబినెట్ సెక్రెటేరియట్ అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ అధికారులతో ఢిల్లీలో ఈ అంశంపై ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించింది. నేరుగా ప్రయోజనం ఉదాహరణకు రేషన్ బియ్యం, కిరోసిన్, ప్రజా పంపిణీ ద్వారా సరఫరా చేసే రేషన్ సరుకులపై కేంద్రం ఇచ్చే సబ్సిడీ నేరుగా రాష్ట్ర ఖాతాలో జమవుతుంది. అందుకు బదులుగా కిరోసిన్ లబ్ధి పొందే రేషన్ కార్డుదారుడికి.. ఆ నెల కిరోసిన్ అందిందా..? లేదా..? అనే వివరాలను సెల్‌ఫోన్‌కు ఎస్సెమ్మెస్ పంపించే విధానం అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో సబ్సిడీ కిరోసిన్‌పై పక్కదారి పడుతున్న కోట్లాది రూపాయలు ఆదా అవుతాయని కేంద్రం భావిస్తోంది. కొన్ని పథకాలకు ఐరిష్ విధానం అమలు చేయాలని, మరికొన్నింటికి బయో మెట్రిక్‌ను.. ఇదేతరహాలో వివిధ విభాగాల్లో అమలవుతున్న పథకాలను, లబ్ధిదారుల డేటాను ఒకేచోటికి చేర్చడం ద్వారా భారీ మొత్తంలో నిధులు ఆదా అవుతాయని విశ్లేషించింది. దీంతో డూప్లికేట్లు, అనర్హులు, అక్రమార్కులకు ముకుతాడు పడుతుందనే అభిప్రాయపడింది. లబ్ధిదారుల డేటా ఒకేచోట.. అన్ని విభాగాల డేటాను సమ్మిళితం చేసేందుకు వీలుగా పథకాలన్నింటినీ ‘ఆధార్’తో అనుసంధానం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అన్ని రాష్ట్రాలు తమ దగ్గర ఉన్న డేటాను కేంద్రం అధ్వర్యంలోని ‘సర్వం’ డేటాబేస్‌తో లింకప్ చేయాలని సూచించింది. దీంతో అన్ని రాష్ట్రాల్లో లబ్ధిదారుల డేటా ఒకేచోటికి చేరుతుంది. ప్రభుత్వం సైతం ఎప్పటికప్పుడు తమకు అవసరమైన సమాచారాన్ని ఈ డేటాబేస్ నుంచి రాబట్టుకునే అవకాశం ఉంటుంది. ఆధార్‌తో అనుసంధానం చేయటం ద్వారా.. ఏ గ్రామంలో.. ఏ కుటుంబం.. ప్రభుత్వం నుంచి ఏయే పథకాల్లో ఎంతమేరకు లబ్ధి పొందిందనే వివరాలను క్షణాల్లో తెలుసుకోవటం సాధ్యమవుతుందని, అది ప్రజా ప్రతినిధులకు, రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం ఉపయుక్తంగా ఉంటుందని నిర్దేశించింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్(డీబీటీ) సెల్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం తక్షణ కార్యాచరణను నిర్దేశించింది. గత వారంలో జరిగిన ఈ సదస్సు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం డీబీటీ సెల్‌ను ఏర్పాటు చేసింది. ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్‌ను ఈ సెల్‌కు కో ఆర్డినేటర్‌గా, జాయింట్ సెక్రెటరీ వి.సాయిప్రసాద్‌ను నోడల్ ఆఫీసర్‌గా నియమించింది. అన్ని విభాగాల్లో పథకాలను, లబ్ధిదారుల డేటాను సమ్మిళితం చేసి.. ఒకే డేటాబేస్ కిందికి తీసుకువచ్చేందుకు డీబీటీ సెల్ ప్రత్యేక కార్యాచరణ చేపడుతుంది. రాష్ట్రంలో డేటా ఒకేచోటికి వచ్చిన తర్వాత.. కేంద్రం సూచించిన ‘సర్వం’ డేటాబేస్కు లింకప్ చేస్తారు. -
కల తీరకుండానే
♦ కన్నుమూశారు.. ♦ ఇందిరమ్మ లబ్ధిదారుల దయనీయం ♦ సొంతింటి కల తీరకుండానే కన్నుమూత ♦ ‘సమీక్ష’లో బయటపడిన వాస్తవం ♦ ‘సాక్షి’ కథనానికి స్పందన సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:పునాదులు తీశారు.. బేస్మెంట్ కట్టారు.. గోడలు లేపారు. పై కప్పు వేసుకుంటే ఇక గృహప్రవేశమే.. సొంతింటి కల నెరవేరబోతుందనుకున్నారు వాళ్లు.. కానీ ఏళ్లకేళ్లుగా బిల్లులు రాక.. సొంతింటి కల తీరకుండానే తనువు చాలించారు. ఇందిరమ్మ లబ్ధిదారుల్లో దాదాపు వంద మంది చనిపోయారని, వారి ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉందని, ఇప్పుడు వారికి బిల్లులు చెల్లించడం సాధ్యం కాదని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఇందిరమ్మ ఇళ్లు కట్టుకున్న లబ్ధిదారులు బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారని, రూ.16 కోట్ల బకాయి ఉదంటూ గు‘బిల్లు’ శీర్షికన ఈ నెల 19న ‘సాక్షి’ జిల్లా సంచికలో కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు.. గృహ నిర్మాణంపై సమీక్ష సమావేశానికి ఆదేశించారు. ఈ మేరకు గురువారం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం అందోల్‌లో అదీ సంగతి! ‘అందోల్ ఐఏవై ఇళ్ల స్టేటస్ ఏమిటి? డీఈ ఎవరు? ఒకసారి లేవండి. సమావేశానికి రాలేదా?..’ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ ప్రశ్నలపై ప్రశ్నలు వేస్తున్నారు. ఓ ఏఈ ధైర్యం చేసి ఆందోల్‌కు రెగ్యులర్ డీఈ, ఇన్చార్జి డీఈ లేరని చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. ఆందోల్ నియోజకవర్గానికి రెండేళ్లుగా గృహనిర్మాణ శాఖ డీఈ లేరు. ఈ విషయం సమీక్ష సమావేశంలో బయటపడే వరకు జిల్లా కలెక్టర్‌కు కూడా తెలియదు. అందోల్ గృహ నిర్మాణ శాఖ డీఈ ధర్మారెడ్డిని సంగారెడ్డి నియోజకవర్గానికి డీఈగా బదిలీ చేశారు. అప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగానే ఉంది. కనీసం ఇన్చార్జి కూడా లేకుండానే రెండేళ్లు గడవడం ఆ శాఖ పనితీరుకు అద్దం పట్టింది. -
‘ఆసరా’కు బయోమెట్రిక్ చేటు!
వృద్ధులు, వికలాంగులకు ఇబ్బందులు కంటిచూపు, చేతి వేళ్ల ముద్రలకు నో అయోమయంలో పింఛన్ దారులు దుబ్బాక రూరల్: బయోమెట్రిక్ సహకరించక పోవడంతో ఆసరా లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. కంటిపాపల (ఐరిస్) నమోదు కాకపోవడంతో వారు పింఛన్ కు అర్హతను కోల్పోతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వృద్ధులకు, అంధులకు సహకరించని కారణంగా పింఛన్ కు దూరమయ్యే ప్రమాదం ఉంది. వృద్ధులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఇతరులకు ప్రభుత్వం ఆసరా పింఛన్ అందిస్తోంది. ఇటీవల మీసేవ ద్వారా ప్రతి ఒక్కరు బయోమెట్రిక్ లైఫ్ సర్టిఫికెట్ కోసం నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అర్హత ఉండి ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు పింఛన్ పొందారు. బయోమెట్రిక్ నమోదుకోసం చేతి వేళ్లతోపాటు, కంటి చూపు నమోదు చేసుకోవాలి. వృద్ధులు, అంధులకు బయోమెట్రిక్ నమోదు కాకపోవడంతో వారు అయోమయానికి గురవుతున్నారు. గతంలో ఆధారు కార్డు నమోదు కోసం అన్ని నమోదైతే ఇప్పుడు ఎందుకు నమోదు చేసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. 80 ఏళ్లుదాటిన వారిలో చాలామందికి కంటిచూపు అంతగా కనిపించదు. కొంతమంది వికలాంగులకు సగం కంటి చూపు ఉంటుంది. సాంకేతిక సమస్య నుంచి తమను బయట పడేసి పింఛన్ వచ్చేలా చూడాలని వారు కోరుతున్నారు. -
కల్యాణలక్ష్మి మార్గదర్శకాల మార్పుతో చిక్కులు
* స్పష్టత లేక లబ్ధిదారుల్లో అయోమయం * పాత విధానమేమేలంటున్న లబ్ధిదారులు సాక్షి, హైదరాబాద్: కల్యాణలక్ష్మి పథకం మార్గదర్శకాల మార్పుతో లబ్ధిదారుల్లో అయోమయం నెలకొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలకు సంబంధించి కల్యాణలక్ష్మి పథకం లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనితో పాటు ఈ దరఖాస్తుల పరిశీలన బాధ్యతను కేవలం తహసీల్దార్లకే అప్పగిస్తూ గతంలోని మార్గదర్శకాలను మార్పు చేయడంతో కొంత గందరగోళం నెలకొంది. తహసీల్దార్లు దరఖాస్తులను పరిశీలించి ఆమోదముద్ర వేయడంలో జాప్యం జరుగుతోంది. మార్గదర్శకాల్లో అస్పష్టత.. గందరగోళం పాత విధానంలో నేరుగా వధువు బ్యాంక్ ఖాతాలోకి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా రూ.51 వేల మొత్తం జమయ్యేది. ఇప్పుడు దానిని మార్చి పెళ్లి కూతురు తల్లి పేరిట చెక్కును ఇవ్వాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో మార్పుచేసింది. ఒకవేళ వధువుకు తల్లి లేని పక్షంలో ఏం చేయాలనే దానిపై స్పష్టత కొరవడింది. ఇప్పటివరకు అనుసరించిన విధానం బాగానే ఉన్నందున దానిని మార్చాలనే నిర్ణయం సరైందికాదని అంటున్నారు. రాజకీయ జోక్యం పెరిగేలా ప్రజాప్రతినిధులకు లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలను అప్పగిస్తే పరోక్షంగా అవినీతి, అక్రమాలకు ఊతం ఇచ్చినట్లవుతుందని వివిధ సంక్షేమశాఖల అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యేల ద్వారా పంపిణీ ఎలా.. స్థానిక ఎమ్మెల్యేలకు ఎంపిక అవకాశం కల్పించడం వల్ల అనర్హులు లబ్ధిపొందడంతో పాటు, పథకం లక్ష్యాలు దెబ్బతిని .. అవినీతిమయమవుతుందనే హెచ్చరికలు సైతం వస్తున్నాయి. వారానికి ఒకసారి నియోజకవర్గ లేదా మండల కేంద్రంలో ఎమ్మెల్యేల ద్వారా వధువు తల్లికి చెక్కులు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేయాలని సవరించిన మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది. అయితే కచ్చితమైన తేదీ, సమయమేది నిర్ణయించకపోవడంతో ఎమ్మెల్యేలు ఎప్పుడు అందుబాటులో ఉంటారు, ఎక్కడ నుంచి చెక్కులు తీసుకోవాలన్న దానిపై గందరగోళం నెలకొంది. అందులోనూ పెళ్లి సమీపిస్తున్నపుడు చెక్కు కోసం సమయం కేటాయించడం కూడా కష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ నెల 5 నాటికి మొత్తం 55,936 దరఖాస్తులు రాగా, 31,479 దరఖాస్తులు ఇంకా పరిశీలన కోసం పెండింగ్‌లోనే ఉన్నాయి. అందులో బీసీ, ఈబీసీలవే 10,466 కాగా ఇంతవరకు ఒక్కరికి కూడా ఈ పథకం కింద లబ్ధి చేకూరలేదు. -
మా ఇంటికి రాని మహాలక్ష్మి!
తెలుగింట ఆడబిడ్డల పథకం అటకెక్కింది... గత ప్రభుత్వం పెట్టిన పేరు మార్చి ఆడంబరంగా అమలు చేస్తామని తాజా సర్కారు ఆర్భాటంగా చెప్పింది. ఆడపిల్ల భారం కాదు.. పుట్టిన వెంటనే ప్రభుత్వమే కొంతమొత్తం ఆ పిల్ల పేరుమీద డిపాజిట్ చేస్తుంది. ఆమెను కన్న తల్లిదండ్రులు నిశ్చింతగా ఉండొచ్చు. అని ఎంతో భరోసా ఇచ్చింది. కానీ అమలుకు వచ్చేసరికి ముఖం చాటేసింది. పాత పథకం కొనసాగించక... కొత్త పథకాన్ని ప్రారంభించక ఆడబిడ్డలకు అన్యాయం చేసింది. * అటకెక్కిన బాలికల సంక్షేమ పథకం * రెండేళ్లుగా విడుదల కాని నిధులు * ఆందోళనలో లబ్ధిదారులు * పేరుకు పోయిన వేలాది దరఖాస్తులు బొబ్బిలి/నెల్లిమర్ల : ఆడపిల్ల ఎవరికి బరువు కాకూడదు... బడుగు, బలహీన వర్గాల్లో పుట్టిన ఆడపిల్లకు చదువుకొనే వరకూ అండగా ఉంటామని నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి బంగారుతల్లి పథకాన్ని అమలు చేశారు. 2013 మే ఒకటో తేదీ తరువాత పుట్టిన ఆడపిల్లలకు ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. ఆడపిల్ల పుట్టిన 21 రోజుల తరువాత పథకానికి దరఖాస్తు చేసుకుంటే... బిడ్డ పేరుతో బ్యాంకులో రూ. 2500 డిపాజిట్ చేస్తారు. తరువాత వరుసగా రెండేళ్లపాటు ఏడాదికి వెయ్యి చొప్పున ఇమ్యూనైజేషన్ అయిన వెంటనే జమ చేస్తారు. ఆ తరువాత మూడు నుంచి అయిదేళ్ల వయసు వరకూ అంగన్వాడీ కేంద్రాలకు పంపితే ఏడాదికి రూ. 15 వందలు బ్యాంకులో జమ చేస్తారు. స్కూలులో వేసిన తరువాత అయిదో తరగతి వరకూ ఏడాదికి రూ. రెండు వేలు చొప్పున ఆడపిల్ల ఖాతాలో వేస్తారు. ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు రూ. 2500లు, 9, 10 తరగతులు చదువుతున్నప్పుడు ఏడాదికి రూ. 3 వేలు వేస్తారు. ఇంటర్లో రూ. 3500లు, డిగ్రీ చదువుతున్నప్పుడు రూ. 4 వేలు వేస్తారు. పేరు మార్చినా... బంగారుతల్లి స్థానంలో మాఇంటి మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు టీడీపీ ప్రభుత్వం 2014లోనే ప్రకటించింది. పథకం నిర్వహణ బాధ్యతను వెలుగు(ఇందిరాక్రాంతి పథం)నుంచి ఐసీడీఎస్‌కు మార్చుతున్నట్లు ప్రకటించింది. రెండేళ్ళు దాటినా పథకం ప్రారంభానికి నోచుకోలేదు. జిల్లాలోని నాలుగు పురపాలక సంఘాల్లో ఈ పథకం ప్రారంభమప్పుడు 1650 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 350 మందికి మాత్రమే దీనిని వర్తింపజేశారు. మిగిలిన వారంతా ఎప్పుడు మంజూరు అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. విజయనగరం పురపాలక సంఘంలో 550, సాలూరులో 270, పార్వతీపురంలో 230, బొబ్బిలిలో 260 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇవన్నీ ఆన్లైన్లో అప్లోడ్ చేసినా రెండేళ్లుగా మంజూరు కాలేదు. అయితే ఇప్పుడు ఆ దరఖాస్తులు కూడా తీసుకోవడంలేదు. దీనికోసం నిర్దేశించిన వెబ్సైట్ కూడా ఓపెన్ కాకపోవడంతో ఇటు అధికారులు, అటు లబ్ధిదారుల్లో అయోమయం నెలకొంది. నెల్లిమర్ల నియోజకవర్గంలోని నెల్లిమర్ల, పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ మండలాలకు చెందిన 10వేల మంది చిన్నారులు పథకం కోసం ఎదురుచూస్తున్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా లక్షమందికి పైగా ఎదురు చూస్తున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. మొదటి జమతోనే సరి ఇదిలా ఉంటే బంగారుతల్లి పథకానికి సంబంధించి మొదటి విడతగా కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 2500లు చొప్పున ఖాతాల్లో జమచేసింది. రెండు, మూడో సంవత్సరంలో ఇవ్వాల్సిన రూ. వెయ్యి ఇవ్వలేదు. అసలు ఈ పథకం ఉందో లేదో కూడా ప్రస్తుతం తెలియని పరిస్థితి నెలకొంది. ఏడాదిగా ఎదురు చూస్తున్నాం మాకు పాప పుట్టి ఏడాది దాటింది. పెద్ద పాపకు బంగారుతల్లి పథకం ఉంది. చిన్నపాపకు కూడా పథకంలో చేర్పిద్దామని వెళితే ఆన్లైన్ అవ్వడం లేదని చెప్పారు. కొత్త పథకం వస్తుందన్నారు. అప్పటినుంచి తిరుగుతూనే ఉన్నాం. - బొద్దాన రాధ, నెల్లిమర్ల. రెండేళ్ళ క్రితమే ఆన్లైన్ నిలిచిపోయింది బంగారుతల్లి పథకానికి సంబంధించి రెండేళ్ళ క్రితమే ఆన్లైన్ నిలిచిపోయింది. పథకాన్ని ఐసీడీఎస్‌కు అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం అక్కడ కూడా ఆన్లైన్ చేయడంలేదు. - జగదీష్, వెలుగు ఏపీఎం, నెల్లిమర్ల -
నేడు ఎర్రవల్లికి సీఎం
లబ్ధిదారులకు ట్రాక్టర్ల పంపిణీ జగదేవ్‌పూర్: ముఖ్యమంత్రి కేసీఆర్ తన దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో శుక్రవారం పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు గ్రామచావిడి వద్ద గ్రామసభలో పాల్గొని ఇటీవల రెండు గ్రామాలకు మంజూరైన 42 ట్రాక్టర్లు అందజేస్తారు. ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలకు ట్రాక్టర్లు వచ్చిన విషయం తెలిసిందే. ఉదయం 10 గంటలకు సీఎం కేసీఆర్ ఫాంహౌస్ నుంచి ఎర్రవల్లికి చేరుకుని ముందుగా డబుల్ బెడ్రూం ఇళ్ల పనులను పరిశీలిస్తారు. అనంతరం గ్రామసభలో లబ్ధిదారులకు ట్రాక్టర్లు పంపిణీ చేస్తారు. సభ ముగించుకుని ఫాంహౌస్‌కు చేరుకుంటారు. గురువారం రాత్రి ఎర్రవల్లిలో జేసీ వెంకట్రాంరెడ్డి, గడా అధికారి హన్మంతరావు సభ ఏర్పాట్లు పనులను పరిశీలించారు. -
దిగ్విజయ్ సింగ్ కు కలిసొచ్చింది...!
మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కు భారీగా కలిసొచ్చింది. వేతనాలు పెంచాలంటూ గతంలో బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు చేసిన డిమాండ్ పై ప్రభుత్వం స్పందించింది. వేతనాలను పెంచుతూ ప్రకటన వెలువరించింది. దీంతో మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కు కూడ ఏడు రెట్లు జీతం పెరిగింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వేతనాలు పెంపుపై శనివారం ప్రకటన చేశారు. వేతనాలను పెంచాలంటూ బిజెపి, కాంగ్రెస్ చట్టసభ సభ్యుల డిమాండ్ కు శివరాజ్ సింగ్ ప్రభుత్వం ఈ సంవత్సరం ఏప్రిల్ మొదటివారంలోనే ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులు, స్పీకర్, ఎమ్మెల్యేలకు జీతం పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ తాజా నిర్ణయంతో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కు కూడ భారీగా ప్రయోజనం కలిగింది. తాజా నిర్ణయంతో మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ జీతం కూడ ఏడు రెట్టు పెరిగింది. దీంతో ప్రస్తుతం 26,000 రూపాయలు జీతాన్ని అందుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి ఇకపై నెలకు 1.7 లక్షలు పొందే అవకాశం ఉంది. -
డబుల్ ఇళ్ల ఊసెక్కడ..?
శంకుస్థాపనకే పరిమితమా!? కొణిజర్ల : రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన పథకం డబుల్ బెడ్ రూం పథకం ఇంత వరకు మొదలు కాలేదు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చి తీరుతామని గల్లీ నాయకుడి దగ్గర నుంచి మంత్రి వరకు అందరూ హామీలు గుప్పిస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. దీనికి తోడు గతంలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో అవినీతి జరిగిందని ప్రభుత్వం బిల్లుల చెల్లింపులు నిలిపి వేసింది. అటు పాత బిల్లులు రాక కొత్త ఇళ్లు రాక లబ్ధిదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వైరా నియోజకవర్గ పరిధిలో 400 డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేశారు. వీటి నిర్మాణాలను మొదలు పెట్టేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గత ఏడాది అక్టోబర్ 26న తనికెళ్లలో శంకుస్థాపన చేశారు. నాలుగు నెలల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు. మండలంలో తనికెళ్ల, పెద్దగోపతి, తీగలబంజర, రాంపురం, విక్రంనగర్ గ్రామాల్లో వైరా ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ స్వయంగా లబ్ధిదారులను గుర్తించారు. వారికి ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు అధికారులు సైతం ప్రకటించారు. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు ఈ జాబితాకు బ్రేక్ పడింది. జిల్లా కలెక్టర్, మంత్రి , ఎమ్మెల్యేలు కలసి జాబితాను తయారు చేయాలని కోర్టు ఆదేశించడంతో ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పటి వరకు తిరిగి దాని ఊసే ఎవ్వరు ఎత్తటం లేదు. అధికారులు సైతం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఉన్న ఇళ్లు కూల్చారు.. ఎమ్మెల్యే ప్రతిపాదనతో ఇక తమకు ఇళ్లు ఖాయం అన్న ధీమాతో పలువురు లబ్ధిదారులు తమకున్న కొద్ది పాటి ఇండ్లను కూల్చివేసుకున్నారు. తనికెళ్లలో సుమారు 8 మంది, తీగలబంజరలో రెండు కుటుంబాల వారు తమకున్న ఆధారాలను కూల్చివేసుకుని రేకుల షెడ్లు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. ప్రస్తుతం కాస్తున్న ఎండలకు ఆ రేకుల షెడ్లలో ఉండలేక అనేక అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఇటీవల కాలంలో డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పిన నాయకులు స్పష్టత ఇవ్వకపోవడం వల్ల నిరుపేదల తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పట్లో ఇళ్ల నిర్మాణం జరిగే పరిస్థితి కనబడటం లేదు. గ్రామంలో ఉమ్మడిగా స్థలం ఉన్నచోట ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అయితే ఇలా మండలంలో ఎక్కడా ప్రభుత్వ స్థలం లేదు. దీంతో సొంతింటి కల నెరవేరుతుందా.. లేదా.. అనే అయోమయంలో లబ్ధిదారులు కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికార్లు, ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు మొదలు పెట్టేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
అత్యధిక కాంట్రాక్ట్ ఉద్యోగులకు లబ్ధి: ఈటల
సాక్షి, హైదరాబాద్: అత్యధిక కాంట్రాక్ట్ ఉద్యోగులకు లబ్ధి కల్పించాలని ప్రభుత్వం భావిస్తోందని ఆర్థికమంత్రి ఈటల రాజేం దర్ తెలిపారు. 25,589 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆయా శాఖలల్లో పనిచేస్తున్నట్లు హెచ్ఆర్ఎంఎస్ డేటా ప్రకారం ఇప్పటివరకు వివరాలు వచ్చాయన్నారు. ఉన్నతవిద్యలో 7,434, వైద్యశాఖలో 6,186, పంచాయతీరాజ్‌లో 3,454, సోషల్ వెల్ఫేర్‌లో 1,370 ఉద్యోగులు పనిచేస్తున్నట్లు తెలుస్తోందని చెప్పారు. ఖాళీలు ఉన్నచోట నియామకాలు జరిగినవి, 2014 జూన్ 2 కు ముందు సర్వీసులో చేరినవారు, ప్రతినెలా జీతాలు తీసుకుంటున్నవారు, పార్ట్‌టైం జాబ్ చేయనివారు, అనుమతి లేకుండా విధులకు దూరం కాకపోవడం, ఇతరత్రా క్రమశిక్షణ చర్యలు తీసుకోనివారు, రిజర్వేషన్ విధానంలో రోస్టర్ పాయింట్లకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, తదితరులకు ప్రాధాన్యం వంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న ఆరు ముఖ్యమైన అంశాల ప్రాతిపదికన వీటిని చేపడతామని మంత్రి తెలిపారు. మంగళవారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కర్నె ప్రభాకర్, గంగాధర్‌గౌడ్ అడిగిన ప్రశ్నకు విపక్ష నేత షబ్బీర్‌అలీ, పొంగులేటి సుధాకరరెడ్డి, ఎన్.రామచంద్రరావు, పాతూరి సుధాకరరెడ్డి, పూల రవీందర్, ఎమ్మెస్ ప్రభాకర్‌రావు వేసిన ఉపప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. -
‘షాదీ ముబారక్’పై ఏసీబీ ఆరా..
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన షాదీ ముబారక్ పథకం అమలు తీరుపై ఏసీబీ అధికారులు శనివారం దృష్టి సారించారు. పథకం అమల్లో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయంటూ అందిన ఫిర్యాదులపై ఏసీబీ స్పందించింది. నల్లగొండ, వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో ఈ పథకం కింద సాయం అందుకున్న లబ్ధిదారుల వివరాల రికార్డులను పరిశీలిస్తోంది. గతంలో పెళ్లయిన వారు కూడా తాజాగా వివాహం చేసుకున్నట్లు చూపించి లబ్ధి పొందారని పలు ఫిర్యాదులు రావడంతో అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. పేదింటి ముస్లిం మైనారిటీ యువతికి వివాహం సందర్భంగా రూ.51 వేలు అందజేయటానికి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటికే ఎస్టీ, ఎస్సీలకు కల్యాణలక్ష్మీ పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. త్వరలో బీసీలకు కూడా ఈ పథకాన్ని అమలు చేయాలనే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. -
కాపు రుణాలు తమ్ముళ్లకే...
* లబ్ధిదారులకు మొండిచేయి * టీడీపీ నేతల సిఫారసు లేఖలు * జాబితాలో ఉన్న వారికే రుణాలు * అడ్డదారిలో దరఖాస్తుల పరిశీలన సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికారపార్టీ నేతల పైరవీలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. వృద్ధులు, వికలాంగుల పింఛన్లు.. రేషన్‌కార్డులు.. వరద పరిహారం.. ఇలా గ్రామాల్లో పనులు కావాలంటే టీడీపీ నేతలు చెప్పిన వారికే ఇస్తున్నారు. అర్హతలు పక్కనపెట్టి వారి సిఫారసు లేఖలకే ప్రాధాన్యం ఇస్తుండటంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. తాజాగా కాపుల పేరున మంజూరైన బ్యాంకు రుణాలు సైతం టీడీపీ నేతలు, అనుచరులు, కార్యకర్తలు పంచుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తునిలో జరిగిన కాపు ఉద్యమంతో టీడీపీ ప్రభుత్వం ఆ సామాజికవర్గం నుంచి వ్యతిరేక రాకుండా ఉండేందుకు సబ్సిడీ రుణాలు ప్రకటించింది. జిల్లా మొత్తానికి 2,462 మంది కాపు, తెలగ, ఒంటరి, బలిజ సామాజికవర్గీయులకు సబ్సిడీ రుణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. రూ.లక్ష సబ్సిడీతో రూ.7కోట్లు వారికి ఇవ్వటానికి సర్కారు నిర్ణయించింది. అయితే జిల్లావ్యాప్తంగా 12,508 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలా వచ్చిన దరఖాస్తులను మంగళవారం పరిశీలించారు. అయితే ఆ రుణాలు కూడా నిజమైన లబ్ధిదారులకు ఇవ్వకుండా అడ్డదారిలో టీడీపీ నేతలే దండుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టీడీపీ నేతలు సిఫారసు లేఖలు : కాపుల పేరుతో మంజూరైన రుణాలు మొత్తాన్ని టీడీపీ నేతలు, కార్యకర్తలు అడ్డదారిలో మంజూరు చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అందులోభాగంగా మంగళవారం జిల్లావ్యాప్తంగా ఉన్న టీడీపీ నేతలు వారి వారి అనుచరుల పేర్లతో కూడిన సిఫారసు లేఖలను అధికారులకు పంపినట్లు తెలిసింది. అదేవిధంగా మంగళవారం దరఖాస్తు పరిశీలనలోనూ టీడీపీ నేతల అనుచరులవే ముందుగా చూసి పంపేశారు. ఉదయం నుంచి క్యూలైన్లో వేచి ఉన్నవారిని పక్కనపెట్టేశారు. దీంతో అనేకమంది లబ్ధిదారులు సాయంత్రం వరకు క్యూలైన్లో వేచి ఉండాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే దరఖాస్తుల పరిశీలనకు 21 బ్యాంకులు, 65 బ్రాంచ్‌లకు సంబంధించిన అధికారులు హాజరుకావాల్సి ఉంది. అయితే దరఖాస్తుల పరిశీలనలో కేవలం 25 మంది అధికారులు మాత్రమే కనిపించారు. మిగిలిన వారు హాజరుకాకపోవటంతో దరఖాస్తుదారులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. అనర్హులకే పెద్దపీట: కాపు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అనేకమంది అనర్హులే ఉన్నారు. ధనవంతులు అనేకమంది దరఖాస్తు పరిశీలనకు రావటం కనిపించింది. వారంతా టీడీపీ నేతలు, వారి బంధువులు, కార్యకర్తలు ఉన్నారు. అలావచ్చిన వారికే బ్యాంకర్లు కూడా పెద్దపీట వేశారని విమర్శలు వినిపిస్తున్నా యి. ప్రస్తుతం జరుగుతున్న తంతు చూస్తుంటే కాపు రుణాలు నిజమైన లబ్ధిదారులకు అందేలా కనిపించలేదని నెల్లూరుకు చెందిన రమణరావు ఆందోళన వ్యక్తం చేశారు. -
పస్తులు తప్పవా..?
లంఖణం(పస్తు ఉండడం) దివ్య ఔషధం అన్నారు పెద్దలు. వారానికి ఒక రోజు ఉపవాసం ఉంటే ఆరోగ్యమేమో గాని..ఏకంగా నెలంతా ప్రతిరోజూ పస్తులుంటే శుష్కించి అనారోగ్యం బారిన పడతారు. పేదప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతినెలా రేషన్ షాపుల ద్వారా చౌకధరలకు సరుకులను పంపిణీ చేస్తోంది. సరుకుల పంపిణీలో పారదర్శకత కోసం ఈపోస్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే గ్రామాల్లో డిపోలకు అందజేసిన ఈ పోస్ మెషీన్లు సరిగా పనియకపోవడం, కొంతమంది వృద్ధుల వేలిముద్రలు స్కాన్ అవకపోవడం వంటి ఇబ్బందులతో లబ్ధిదారులకు వచ్చిన రేషన్ కాస్తా తిరిగి వెళ్లిపోతుండడంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు. సరుకులు అందకుండా వెనక్కి వెళ్లిపోతే నెలంతా పస్తులుండాల్సిదేనని వాపోతున్నారు. * జిల్లాలో 76వేల మందికి పైగా అందని రేషన్ * ఇబ్బందుల్లో లబ్ధిదారులు భోగాపురం: జిల్లాలోని 34మండలాల్లో ఈ పోస్ ద్వారాపనిచేస్తున్న 1341 రేషన్ షాపుల్లో 6,62,681 లబ్ధిదారులు ఉండగా ఫిబ్రవరిలో కేవలం 5,86,080మందికి మాత్రమే రేషన్ సరుకులు అందాయి. ఈ పోస్ సిగ్నల్స్ అందని షాపులు జిల్లాలో 30నుంచి 40వరకు ఉండవచ్చు. వారికి మాన్యువల్‌గానే సరుకులు అందిస్తున్నారు. జిల్లా మొత్తం మీద ఈనెల సరుకులు 88.44శాతం పంపిణీ జరిగాయి. జిల్లాలో అత్యధికంగా కొత్తవలసలో 93.49శాతం సరుకులు అందించగా, అతితక్కువగా మెంటాడ మండలంలో 84.79శాతం సరుకులను మాత్రమే అందించారు. దీంతో ఈనెల చౌకధరల దుకాణాల ద్వారా 76,541మంది సరుకులను పొందలేకపోయారు. జిల్లాలో ఇన్చార్జ్ డీలర్లు ఎక్కువగా ఉండడం, ఈపోస్ మెషీన్లు పనిచేయకపోవడం. మెషీన్లు పనిచేసినా ఇంట్లో ఒక్కరే ఉన్న కార్డుల్లో వేలిముద్రలు స్కాన్ కాకపోవడంతో సరుకుల పంపిణీ కాలేదు. అయితే రేషను సరుకులపైనే ఆధారపడే పేదవారు ఈపోస్ విధానం ద్వారా సరుకులు పొందలేక ఇక్కట్లకు గురవుతున్నారు. ప్రతినెలా 15నుంచి 20వ తారీఖుల్లో ఈ పోస్ ఆన్లైన్ ఆగిపోవడంతో సరుకులు వెనక్కి వెళ్లిపోతున్నాయి. రేషన్ ఇస్తున్నారంటే చాలు లబ్ధిదారులు పగలనక, రాత్రనక డిపోల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుంది. పడిగాపులు కాసినా తీరా వారివంతు వచ్చేసరికి వేలిముద్రలు పడకపోవడమో, సర్వర్ ఆగిపోవడమో జరుగుతుండడంతో వారంతా ఉసూరుమంటూ వెనుదిరగాల్సి వస్తోంది. జిల్లాలోని ఒక్క నెల్లిమర్ల నియోజకవర్గంలోనే ఫిబ్రవరి నెలలో సుమారు 10వేల మంది లబ్ధిదారుల రేషన్ వెనక్కి వెళ్లి పోయింది. దీంతో లబ్ధిదారులు ఈనెల ఏంతిని బతకాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులు తిరిగినా రేషన్ రాలేదు మాది భోగాపురం మండలం రావాడ పంచాయతీ చినరావాడ గ్రామం. మేము రేషన్ అందుకోవాలంటే సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రావాడ గ్రామానికి వెళ్లాలి. నా వయసు 80ఏళ్లు. నేను ఒక్కదాన్నే ఉంటాను. వారంరోజులు తిరిగాను వేలి ముద్రలు పడలేదని వెనక్కి పంపించేశారు. కోటా బియ్యమే ఆధారం. నెలకు నాకు ఇచ్చే ఐదు కేజీల బియ్యం కూడా అందలేదు. - బమ్మిడి అచ్చెమ్మ, చినరావాడ రేషను సరుకులకు ఇబ్బంది పడుతున్నాం రేషన్ సరుకులకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. మెషీన్లు పనిచేయడం లేదని సరుకులు రాత్రిపూట ఇవ్వడంతో మా గ్రామం నుంచి చీకట్లో ఇబ్బందులు పడి మరీ వెళ్తాం. అయినా నాకు రేషను అందలేదు. రావాల్సిన ఐదుకేజీల బియ్యం అందకపోతే ఏం తిని బతకాలి. మా పరిస్థితి ఏంటి? - ఇప్పిలి తాత, చినరావాడ -
రుణం..ఇదేమి విడ్డూరం!
- గత ఏడాది లబ్ధిదారులకు అందని రుణం - ఈ ఏడాది కొత్తగా దరఖాస్తు ఆహ్వానం - మండిపడుతున్న గత లబ్ధిదారులు కర్నూలు(అర్బన్): జిల్లా సాంఘిక సంక్షేమ శాఖలో రుణ పంపిణీ వ్యవహారం ప్రహసనంగా మారింది. గత ఏడాది లబ్ధిదారులకు ఇప్పటి వరకు రుణాలు పంపిణీ చేయకుండా ఈ ఏడాది కొత్తగా మళ్లీ దరఖాస్తులు ఆహ్వానించడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదేమి విడ్డూరం అంటూ లబ్ధిదారులు మండిపడుతున్నారు. గత ఏడాది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా జిల్లాలోని 4,495 మంది లబ్ధిదారులకు రూ. 37.06 కోట్లను రుణాలుగా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే లబ్ధిదారులు అష్టకష్టాలకోర్చి ఆన్లైన్లో దరఖాస్తు కూడా చేసుకున్నారు. అంతకు ముందు సంవత్సరంలో మిగిలిపోయిన దరఖాస్తులను కలుపుకొని మొత్తం 4,979 మందికి రుణాలను మంజూరు చేశారు. అయితే వీరిలో ఇప్పటి వరకు 1,370 మందికి మాత్రమే రూ. 13.86 కోట్లు రుణం మంజూరైనట్లు అధికారుల లెక్కలు తెలియజేస్తున్నాయి. ఇంకా గత ఏడాదికి సంబంధించి 3,609 మంది లబ్ధిదారులకు రూ.23.19 కోట్లను విడుదల చేయాల్సి ఉంది. వీరిలో దాదాపు 2,900 మంది బ్యాంకు వ్యక్తిగత ఖాతా, లోన్ ఖాతా నంబర్లను కూడా అందజేశారు. ఖాతా నంబర్లను అప్లోడ్ చేయని వారు దాదాపు 700 మంది దాకా ఉన్నారు. కోరిన ధ్రువీకరణ పత్రాలన్నీ సమర్పించి ఉన్నతాధికారి కార్యాలయానికి అప్లోడ్ చేసిన వారికి కూడా నేటికీ నయాపైసా సబ్సిడీ విడుదల కాలేదు. గత ఏడాదికి సంబంధించి వేల మందికి రుణాలు అందించాల్సి ఉన్నప్పటికీ, తిరిగి 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రుణాలు పొందేందుకు ఆగస్టు 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలనడంపై ఎస్సీ వర్గాలకు చెందిన ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది 6,615 మంది లబ్ధిదారులకు రూ.87.54 కోట్ల మేరకు రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే గత ఏడాదికి సంబంధించిన రుణాలన్నింటినీ విడుదల చేసిన అనంతరం ఈ ఆర్థిక సంవత్సరానికి చెందిన ప్రక్రియను ప్రారంభిస్తే బాగుండేదనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. బీసీ కార్పొరేషన్లో.... వెనుకబడిన తరగతుల ఆర్థిక సేవా సహకార సంస్థలో కూడా ఇదే తంతు నడుస్తోంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 50 శాతం సబ్సిడీతో జిల్లాలోని 8,193 మంది బీసీ లబ్ధిదారులకు 22.50 కోట్ల మేర సబ్సిడీ విడుదల చేయాలని లక్ష్యాన్ని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే అందిన దరఖాస్తులను జల్లెడ పట్టి 5,727 మంది లబ్ధిదారులకు రూ.21.17 కోట్ల మేర సబ్సిడీ విడుదల చేసేందుకు ప్రొసీడింగ్స్ అందించారు. అయితే వీరిలో 3,189 మంది మాత్రమే బ్యాంకు జీరో బ్యాలెన్స్ ఖాతా, లోన్ ఖాతా నంబర్లను అందించారు. వీరికి రూ.11.70 కోట్ల సబ్సిడీ విడుదల కాలేదు. అయితే బీసీ కార్పొరేషన్ అధికారులు కూడా 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 5209 మంది లబ్ధిదారులకు రూ.28.50 కోట్ల రుణాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకొని దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. రుణాలు అందించేందుకు చర్యలు గత ఏడాది బ్యాంకు ఖాతా నంబర్లు అప్లోడ్ చేసిన వారందరికీ తప్పక రుణాలు అందుతాయి. పెన్షన్ కమిటీలను తొలగించాలని వైఎస్సార్ జిల్లాకు చెందిన కొందరు హైకోర్టును ఆశ్రయించడం, అంతలోపే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం వల్ల సబ్సిడీ విడుదలో జాప్యం జరిగింది. ఇంకా బ్యాంకు ఖాతా నంబర్లు అప్లోడ్ చేయని వారికి ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలి. - పులిచేరి సారయ్య, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్ -
ఆసరాపై ఆరా
- సామాజిక తనిఖీకి నిర్ణయం.. - గతంలో కంటే ఎక్కువ మందికి పింఛన్లు - ఇంకా కావాలంటూ రోడ్డెక్కుతున్న జనం - ఆలోచనలో పడిన సర్కారు - లబ్ధిదారుల ఇంటింటి సర్వేకు శ్రీకారం! - మున్సిపాలిటీలు, నగర పంచాయితీలపైనే ప్రధాన దృష్టి - నెలాఖరు నుంచి తనిఖీలు షురూ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: బోగస్ ‘ఆసరా’ పింఛన్ల ఏరివేతకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ నెల చివరి వారంలోగా లబ్ధిదారుల ఇంటింటి సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. గతంలో కంటే ఎక్కువ మందికి పింఛన్లు ఇస్తున్నా.. ఇంకా జిల్లా వ్యాప్తంగా పెన్షన్ల కోసం జనం రోడ్డెక్కుతున్న వైనంతో సర్కారు ఆలోచనలో పడింది. దీంతో సామాజిక సర్వేకు శ్రీకారం చుడుతోంది. ఎందుకిలా జరుగుతోంది? ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గత సర్కారుల హయాంలో కంటే 50 వేల మందికి ఎక్కువగా పింఛన్లు ఇస్తోంది. అయినా, ఇంకా పింఛన్ల కోసం ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చిన ప్రభుత్వం వాస్తవ లబ్ధిదారులను గుర్తించేందుకు ఇంటింటి సర్వేకు ఆదేశించింది. ఇటీవల ప్రయోగాత్మకంగా ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ప్రాథమికంగా నిర్వహించిన సర్వేలో మొత్తం ఫించనుదారుల్లో 20 శాతం మంది అనర్హులున్నట్లు తేలింది. దీంతో అప్రమత్తమై న సర్కారు అన్ని జిల్లాల్లో సర్వేల నిర్వహణకు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ నుంచి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులకు సంకేతాలందాయి. ఆ ఉత్తర్వులే ఆధారంగా.. ఆసరా పింఛన్లకు సంబంధించి జారీ చేసిన జీవోలోనే ప్రభుత్వం సామాజిక తనిఖీ అంశాన్ని పొందుపర్చింది. దీని ఆధారంగానే ఇప్పుడు సామాజిక తనిఖీలకు సిద్ధమైంది. పింఛన్లు బోగస్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్నట్లు జిల్లా అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. సదరమ్ క్యాంపుల ద్వారా వైకల్య నిర్ధారణ పరీక్షలు చేస్తున్నప్పటికీ.. వికలత్వం నిర్ధారణలో వైద్యులు అవినీతికి పాల్పడుతున్న దాఖలాలున్నాయి. కల్లు గీత కార్మికుల్లో చోటామోటా రాాజకీయ నాయకులు, వృద్ధాప్య పెన్షన్‌దారుల్లో అనర్హులు ఉ న్నట్లు జిల్లా అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. మున్సిపాల్టీలు, నగర పంచాయతీల స్థాయిలోనే ఈ భారీ అవకతవకలు జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. జిల్లా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పనితీరు అస్తవ్యస్తంగా ఉం డటంతో పాటు మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగా అనర్హులనూ పెన్షనర్ల జాబితాలో చే రుస్తున్నట్టు అధికారులు ఇప్పటికే గుర్తించారు. పెరిగిన భారం.... ఆసరా పెన్షన్లకు ముందు జిల్లా వ్యాప్తంగా అన్ని కేటగిరీల్లో కలిపి పింఛన్‌దారులు మొత్తం 3,00,482 మంది ఉన్నారు. ప్రస్తుతం ఈ సంఖ్య 3,47,430కి చేరింది. గత ప్రభుత్వం పింఛన్ల కోసం నెలకు రూ 8.18 కోట్లు ఇస్తే తెలంగాణ ప్రభుత్వం రూ.33.9 కోట్లు చెల్లిస్తోంది. నెలవారీ చెల్లిస్తున్న పింఛన్ మొత్తాన్ని రూ.200 నుంచి రూ.1000, వికలాంగుల పింఛన్‌ను రూ.500 నుంచి రూ.1500కి పెంచారు. పెన్షనర్లలో వికలాంగులు, కల్లుగీత కార్మికులు గతాని కంటే భారీగా పెరిగారు. అయినా ఇంకా పింఛన్లు కావాలని జనం రోడ్డెక్కుతుండటం ప్రభుత్వాన్ని ఆలోచనలో పడేస్తోంది. సమగ్ర సర్వే ప్రామాణికం ఉపాధి హామీ పథకంలో మాదిరిగానే ఆసరా పెన్షన్లలోనూ సామాజిక తనిఖీ నిర్వహిస్తారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో వేర్వేరు బృందాలు పర్యటిస్తాయి. లబ్ధిదారుల జాబితా ఆధారంగా సర్వే జరుగుతుంది. సమగ్ర కుటుంబ సర్వేను ప్రామాణికంగా తీసుకుని లబ్ధిదారుల దరఖాస్తుల ఆధారంగా ఇంటింటికి వెళ్లి ఆర్థిక, సామాజిక స్థితిగతులను స్వయంగా పరిశీలిస్తారు. తనిఖీలో అనర్హులు బయటపడితే గ్రామసభలు నిర్వహించి ఆసరా జాబితా నుంచి వారిని తొలగిస్తారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు, ఇప్పటి వరకు వారికి చెల్లించిన సొమ్మునూ రికవరీ చేస్తారు. -
పింఛన్ తిప్పలు
- నిధులు విడుదలై వారం.. - లబ్ధిదారులకు అందని డబ్బులు - అర్బన్‌లో బ్యాంకులు, రూరల్‌లో పోస్టాఫీస్‌ల ద్వారా పంపిణీ - పోస్టాఫీస్‌లలో సాంకేతిక సమస్యలు - పింఛన్‌దారుల అయోమయం హన్మకొండ అర్బన్ : జిల్లాలో గాడిన పడుతున్న ఆసరా పింఛన్ల పంపిణీ వ్యవస్థను ప్రభుత్వ కొత్త ప్రయోగం లబ్ధిదారులను అయోమయూనికి గురి చేస్తోంది. ఇప్పటివరకు పల్లెల్లో పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు.. నగరంలో మున్సిపల్ సిబ్బంది పింఛన్ డబ్బులు అందజేసేవారు. ఈ సమయంలో పింఛన్ డబ్బులు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో భాగంగా అర్బన్ ప్రాంతంలో 22,061 పింఛన్ దారులకు సంబంధించిన డబ్బులు వారి ఖాతాల్లో జమచేశారు. ఈ డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో చేరింది లేనిది ంకా స్పష్టం కాలేదు. ఎందుకంటే తమ డబ్బులు బ్యాంకుల్లో పడతాయని సమాచారం చాలా మంది పింఛనర్లకు తెలియదు. దీంతో ఎప్పటిలాగే అధికారులే వచ్చి పంపిణీ చేస్తారని చాలా మంది ఎదురు చూస్తున్నారు. సాంకేతిక సమస్యలు ప్రస్తుతం బ్యాంకుల ద్వారా పంపిణీ చేస్తున్న పింఛన్ల పంపిణీ విషయంలో సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే లావాదేవీలు జరపకుండా చాలా కాలం ఉన్న ఖాతాల్లో డబ్బులు వేసినా ప్రస్తుతం పనిచేయదు. ఇక బ్యాంకు ఖాతా నంబర్లు వేల సంఖ్యలో ఉండటం వల్ల కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉపకార వేతనాల పంపిణీ విషయంలో ఎదురైన అనుభవాలు ఇదే విషయం చెపుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో.. ఈ నెల నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని వృద్ధులకు, వింతంతువులకు, వికలాంగులకు పోస్టాఫీసు ద్వారా అత్యధికంగా 2,14,525 మంది పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. మిగతా 1,74,395 మాత్రం నేరుగా ఉద్యోగులే పంపిణీచేస్తున్నారు. అయితే పోస్టాఫీసుల ద్వారా పంపిణీ విషయంలో గ్రామాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. పోస్టల్ సిబ్బంది పింఛన్‌దారుల వేలి ముద్రలు ఆధారంగా పింఛన్ పంపిణీ చేయాలి. ఇందుకోసం వారికి ప్రత్యేకంగా మిషన్ ఇస్తారు. అయితే మిషన్ సాంకేతిక లోపం తలెత్తితే ఇబ్బందులు తప్పవు. వేలి ముద్రలు ఏమాత్రం తేడాగా ఉన్నా ఇబ్బందే. పోస్టాఫీసుల్లో పంపిణీ విషయంలో ఏపీ ఆన్లైన్ వారు సర్వీసు ప్రొవైడర్‌గా ఉంటారు. ప్రతి మండలానికి ఒక కో-ఆర్డీ నేటర్ను ఏర్పాటు చేయాల్సింది. వీరు సమన్వయంతో వెంటనే సమస్యను పరిష్కరించాలి. మంచం పట్టిన వారికి.. గ్రామంలో పోస్టాఫీసుల ద్వారా పంపిణీ విషయంలో వేలిముద్రలు తప్పనిసరి కాబట్టి ఒక వేళ పింఛన్‌దారు పూర్తి గా నడవలేని స్థితిలో ఉన్నా.. వేలిముద్రలు రాని స్థితి ఉన్నా.. సంబంధిత వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి పరిశీలించి పింఛన్‌దారుల కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తి వేలిముద్రలు తీసుకుని పింఛన్ ప్రతి నెలా ఇచ్చేలా ఆదేశాలు ఇచ్చే విధంగా వేసులు బాటు కల్పించారు. కొన్నిచోట్ల ఇబ్బందులు పోస్టాఫీస్ సిబ్బంది కొన్నిచోట్ల పింఛన్‌దారులను ఇబ్బందులు పెడుతున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. కొన్నిచోట్ల ఉదయం నుంచి పింఛనర్లు లైన్కట్టినా సాయంత్రం ఎప్పుడో పంపిణీ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల ఉదయం, సాయంత్రం, రేపు అంటే తిప్పుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈసారి ముందే... ప్రతి నెల 20వ తేదీ తరువాత విడుదల చేసే పింఛన్ డబ్బులు ఈ సారి మాత్రం అధికారులు ముందే విడుదల చేశారు. 13 నుంచి పంపిణీ చేపట్టే విదంగా ఆదేశాలిచ్చి నిధులు విడుదల చేశారు. -
మీరు బతికే ఉన్నారా?
‘ఆసరా’ కావాలంటే నిరూపించుకోవాల్సిందే * మూడు నెలలకోసారి ‘మీసేవ’లో నమోదు * వచ్చే నెల నుంచి బ్యాంకు, పోస్టల్ ఖాతాల్లోకే పింఛన్లు * తొలుత కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో లబ్ధిదారుల నుంచి వివరాల సేకరణ సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ప్రతి నెలా పింఛను కావాలంటే లబ్ధిదారులు ఇకపై మూడు నెలలకోసారి తాము బతికున్నట్లు నిరూపించుకోవాల్సిందే! అప్పుడే పింఛను పొందగలుగుతారు. అయితే పింఛను కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన పనిలేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోనే జమ చేస్తారు. వచ్చే నెల నుంచి పట్టణాలు, నగరాల్లో, ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఈ తరహా విధానాన్ని అమలు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, బీడీ, గీత కార్మికులు సహా మొత్తం 35.79 లక్షల మంది ప్రతి నెలా సామాజిక పింఛన్లు పొందుతున్నారు. ఈ డబ్బుల కోసం వారు ప్రభుత్వ కార్యాలయాల వద్ద గంటల తరబడి లైన్లో నిలబడాల్సి వస్తోంది. కొన్ని చోట్ల రోజుల తరబడి తిరుగుతున్న దాఖలాలున్నాయి. ఇకపై పింఛన్లను నేరుగా బ్యాంకు/పోస్టాఫీస్ ఖాతాల ద్వారా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విధానం వల్ల లబ్ధిదారుల్లో ఎంత మంది బతికున్నారో/చనిపోయారో తెలియని పరిస్థితి నెలకొనే అవకాశముంది. ఒకవేళ లబ్ధిదారులు మరణించినప్పటికీ డబ్బులు మాత్రం బ్యాంకు ఖాతాలో జమ అవుతూనే ఉంటాయని, ఆ మొత్తాన్ని వారి కుటుం బసభ్యులు ఏటీఎం ద్వారా తీసుకునే అవకాశముందని అధికారులు గ్రహించారు. పింఛను సొమ్ము పక్కదారి పట్టకుండా ప్రతి మూడు నెలలపాటు పింఛన్‌ను బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు. ఇలా చేయడం వల్ల లబ్ధిదారుల్లో ఎవరైనా చనిపోతే తెలిసిపోతుందని, తద్వారా పింఛను సొమ్ము పక్కదారి పట్టకుండా చూడగలమని అధికారులు చెబుతున్నారు. ‘కరీంనగర్ జిల్లాలో గత మూడు నెలల్లోనే 21,362 మంది లబ్ధిదారులను పింఛన్ల జాబితా నుంచి తొలగించారు. ఇందులో అనర్హులతోపాటు చనిపోయిన వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు’ అని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో చాలా చోట్ల పోస్టాఫీస్ ఖాతాల ద్వారా డబ్బులను పంపిణీ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో వచ్చే నెల నుంచి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా డబ్బులు జమ చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా పింఛను డబ్బులు తీసుకునేందుకు వస్తున్న సమయంలోనే లబ్ధిదారుల నుంచి బ్యాంకు ఖాతాల వివరాలు సేకరిస్తోంది. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది ఆ వివరాలు సేకరించే పనిలో పడ్డా రు. మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో బిల్ కలెక్టర్లు, పురపాలక సిబ్బంది ఈ పని చేస్తున్నారు. వివరాల సేకరణ కార్యక్రమం గ్రామాల్లో కొంత మందకొడిగా జరుగుతోంది. గ్రామీణ లబ్ధిదారుల నుంచి ఆశించిన మేరకు వివరాలు రావడం లేదని గ్రహించిన గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తొలుత మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోనే జూలై నుంచి ఈ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రతి మూడు నెలలకోసారి ప్రతి మూడు నెలలకోసారి లబ్ధిదారుడు తాను బతికే ఉన్నానంటూ సర్టిఫికెట్ తెచ్చి చూపించేలా కొత్త నిబంధన రూపొందించారు. ఇందుకోసం తహశీల్దార్/మున్సిపాలిటీ/ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా దగ్గర్లోని మీ సేవా/ఆధార్ కేంద్రాల్లో బయోమెట్రిక్ యంత్రాలను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. తద్వారా సామాజిక పింఛను లబ్ధిదారులు ఆయా కేంద్రాలకు వెళితే... అక్కడున్న సిబ్బంది లబ్ధిదారుల వేలి ముద్రలను సరిపోల్చుతారు. బయోమెట్రిక్ యంత్రాల్లో పొందుపర్చిన వేలి ముద్రలతో సరిపోతే లబ్ధిదారుడు ‘బతికే ఉన్నట్లుగా’ నమోదు చేసి సమాచారాన్ని అధికారులకు తెలియజేస్తారు. -
వితంతు పింఛన్‌కు కొర్రీలు
- భర్త మరణ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి - లేకుంటే వచ్చే నెల నుంచి పింఛన్‌కు బ్రేక్ - మళ్లీ మొదటికి రానున్న తంతంగం - ఆందోళన చెందుతున్న లబ్ధిదారులు - భర్త మరణ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి - అది సమర్పిస్తేనే వచ్చే నెల నుంచి ‘ఆసరా’ - మళ్లీ మొదటికి రానున్న తతంగం - ఆందోళన చెందుతున్న లబ్ధిదారులు ముకరంపుర : ఆసరా పింఛన్లు ఆరంభమైనప్పటి నుంచి అనేక నిబంధనలతో లబ్ధిదారులను అష్టకష్టాలకు గురిచేస్తున్న అధికారులు వితంతు పింఛన్లకు మళ్లీ కొర్రీలు పెడుతున్నారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయి ప్రభుత్వం అందించే పింఛన్‌తో రోజులు నెట్టుకొస్తున్న అభాగ్యులను డెత్ సర్టిఫికెట్ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. భర్త చనిపోయినట్లుగా మరణ ధ్రువీకరణపత్రం అందజేస్తేనే వచ్చే నెల నుంచి వితంతు పింఛన్ ఇస్తామని చెబుతుండడంతో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రారంభంలో భర్త మరణ ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని నిబంధన పెట్టినప్పటికీ వాటిని తప్పనిసరి చేయలేదు. కొన్నేళ్ల క్రితం మరణించిన వారి సర్టిఫికెట్లు ఎలా తీసుకురాగలమని సర్వత్రా ఆందోళన వ్యక్తం సర్కారు వెనక్కు తగ్గి ఈ నిబంధనను సడలించింది. వితంతు పింఛన్లలో బోగస్‌లు ఉండే అవకాశం లేదని భావిస్తూ మానవీయకోణంలో ఆలోచించి పింఛన్లు మంజూరు చేయూలని అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం నగర పంచాయతీ, మున్సిపాలిటీ, గ్రామీణ ప్రాంతాల్లో భర్త మరణ ధ్రువీకరణ పత్రం ఉండాలన్న నిబంధనను అమలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 1,31,213 వితంతు పింఛన్‌దారులున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 1,04,216, పట్టణ ప్రాంతంలో 26,997 మంది ఉన్నారు. వీరిలో 70 శాతం లబ్దిదారులు మధ్య వయస్సు నుంచి వృద్ధాప్యంలో ఉన్నవారే. దాదాపు 20 ఏళ్ల క్రితం భర్త మరణించిన వారు ప్రస్తుతం వృద్ధాప్యంలో ఉన్న కారణంగా చుట్టూ తిరిగే పరిస్థితి లేదు. మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్ ఎక్కడ తీసుకోవాలో కూడా తెలియని నిరక్షరాస్యులకు మరింత ఇబ్బందిగా మారింది. 15 నుంచి 20 ఏళ్ల క్రితం చనిపోయిన వారి ధ్రువీకరణ పత్రాలు తీసుకోవడం వ్యయప్రయాసలతో కూడుకున్నపని. జనన, మరణ ధ్రుువీకరణ పత్రాలకు సంబంధించి వెంటనే స్థానిక సంస్థల్లో నమోదు చేస్తేనే వచ్చే అవకాశముంది. నెలలు, సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత డెత్ సర్టిఫికెట్ రావాలంటే పెద్ద తంతగమే ఉంటుంది. అదో పెద్ద తంతు.. ఏళ్ల క్రితం చనిపోయిన తమ భర్త మరణ ధ్రువీకరణ పత్రం స్థానిక సంస్థల నుంచి పొందాలంటే స్థానికంగా నమోదై ఉండాలి. అప్పట్లో నమోదు చేయనివారు మున్సిపాలిటీ, గ్రామపంచాయతీలో నాన్ అవైలబులిటీ (రికార్డుల్లో నమోదు కానట్లు)గా లేఖను తీసుకోవాలి. అనంతరం ఒక గెజిటెడ్, ఇద్దరు నాన్ గెజిటెడ్ అధికారుల స్టేట్మెంట్ తీసుకుని నోటరీ అఫిడవిట్‌తో మీ సేవ ద్వారా ఆర్డీవోకు దరఖాస్తు చేయూల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులను విచారించాల్సిందిగా ఆర్డీవో కార్యాలయం నుంచి తహశీల్దార్లకు సమాచారం పంపుతారు. వీఆర్వో, ఆర్ఐలు విచారణ జరిపి నివేదికను తహశీల్దార్ కార్యాలయంలోని ఏఎస్వోలకు అందజేస్తారు. అక్కడి నుంచి తిరిగి ఆర్డీవో కార్యాలయానికి పంపుతారు. ఆర్డీవో కార్యాలయం నుంచి దరఖాస్తు చేసిన మీ సేవ కేంద్రానికి ఆర్డీవో ప్రొసీడింగ్‌ను అందజేస్తారు. ప్రొసీడింగ్‌ను తీసుకుని సంబంధిత మున్సిపాలిటీ లేదా నగరపంచాయతీ, గ్రామ పంచాయతీల్లో అందజేస్తే ఆయా స్థానిక సంస్థల్లో సదరు పేరు నమోదు చేసుకుని అప్పుడు మాత్రమే డెత్ సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. ఇంతటి తతంగం తమకు ఎలా సాధ్యమవుతుందని నిరక్షరాస్యులు, వృద్ధులు వాపోతున్నారు. వితంతు పింఛన్లకు భర్త డెత్ సర్టిఫికెట్ నిబంధనను సడలించాలని, దీనికి ప్రత్యామ్నాయంగా స్థానికంగా అధికారులతో విచారణ జరిపి అర్హులా.. కాదా అని నిర్దారించుకోవాలని కోరుతున్నారు. -
భూ పంపిణీలో కూలీలకే మొదటి ప్రాధాన్యం
- జేసీ ప్రశాంత్ జీవన్ పాటిల్ - రైతుల భూముల పరిశీలన నెక్కొండ/నర్సింహులపేట/దుగ్గొండి/చెన్నారావుపేట : మూడెకరాల భూ పంపిణీలో లబ్ధిదారుల ఎంపికలో ఉపాధి కూలీలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని జేసీ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. నెక్కొండ మండలం నాగారం, నర్సింహులపేట మండలం వేములపల్లి, దుగ్గొండి మండలం తిమ్మంపేట, చెన్నారావుపేట మండలం లింగగిరి గ్రామాల్లో రైతుల భూములను కొనుగోలు చేసేందుకు మంగళవారం ఆయన పరిశీలించారు. నాగారం గ్రామానికి చెందిన కర్కాల వెంకట్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డికి చెందిన సర్వే నం.248,249,251లోని 17 ఎకరాల 8 గుంటల భూమిని జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో సుమారు 48 దళిత కుటుంబాలు ఉండగా.. మొదటి విడతలో ఆరుగురు లబ్ధిదారులకు భూ పంపిణీ చేయూలని అన్నారు. నెక్కొండ జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ గటిక అజయ్‌కుమార్, ఆర్డీఓ భాస్కర్‌రావు, జిల్లా కోఆప్షన్ సభ్యుడు షేక్ అబ్దుల్నబీ, తహసీల్దార్ రాములు, డీటీ విక్రమ్‌కుమార్, సర్పంచ్ పర్కాల బిక్షం, వీఆర్ఓ అలీం, సంపత్, నాయకులు చిల్లా వెంకటేశ్, చల్లా వినయ్‌రెడ్డి, అమ్జత్ఖాన్, పాషా పాల్గొన్నారు. నర్సింహులపేట మండలం వేములపల్లిలో సర్వే నం.5లో 51 ఎకరాలు, 230లో 8-37 ఎకరాలు, 231లో 4-32 ఎకరాల భూములను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీఓ భాస్కర్‌రావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేష్, తహసీల్దార్ అమర్నాథ్, మూడావత్ కోమి, సర్పంచ్ గుమ్మడవల్లి పర్శయ్య, ఎంపీటీసీ సభ్యుడు రవి, సర్వేయర్లు గోపీసింగ్, మధు, ప్రసన్న పాల్గొన్నారు. కాగా, గ్రామంలోని ఊర చెరువులో సుమారు 4 ఎకరాల భూమిని కొందరు స్వాధీనం చేసుకొని సాగు చేసుకుంటున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. సర్వేయర్లతో కొలతలు వేయించి రికార్డు ప్రకారం ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. దుగ్గొండి మండలం తిమ్మంపేటలో 10 మంది రైతులకు చెందిన 21 ఎకరాల వ్యవసాయ భూమిని జేసీ పరిశీలించారు. ఇదే మండలం వెంకటాపురంలో 13 ఎకరాల వ్యవసాయ భూమిని అమ్మడానికి రైతులు ముందుకొచ్చారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీఓ రామకృష్ణారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేష్, గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు తోటకూరి రమేష్, రైతులు బీరం ప్రభాకర్‌రెడ్డి, వీరారెడ్డి, ఇంద్రారెడ్డి, గంట రాజిరెడ్డి, వీఆర్ఓ రాజు పాల్గొన్నారు. చెన్నారావుపేట వుండలం లింగగిరి గ్రావుంలోని ప్రభుత్వ భూమిని జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయున వూట్లాడుతూ గ్రావుంలో ప్రభుత్వ భూమి 22 ఎకరాలు ఉందన్నారు. నిరుపేద దళితులకు ప్రభుత్వం 3 ఎకరాలు భూమి అందించడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగానే సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రవుంలో తహసీల్దార్ ఆంజనేయుులు, సర్పంచ్ గణేష్, ఆర్ఐలు విఠలేశ్వర్ సిరంగి, ఉవూరాణి, వీఆర్వో నరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
విధేయులకే పింఛన్
ఉదయగిరి: అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తాం.. ఇందులో ఎలాంటి భేదాలు లేవు. అర్హతనే ప్రామాణికంగా తీసుకొని కొత్త లబ్ధిదారులను ఎంపిచేస్తాం. దీనిని అధికారులు తప్పక పాటించాలి. కొత్తగా సామాజిక పింఛన్ల లబ్ధిదారుల ఎంపికపై ఇటీవల చంద్రబాబు అధికారులతో అన్న మాటలివి. కానీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎప్పట్నుంచో ఇస్తున్న సామాజిక పింఛన్లకు రకరకాల కొర్రీలతో కోతలు పడగా..కొత్తగా మంజూరయ్యే వాటిలోనైనా న్యాయం జరుగుతుందేమోనని వేయికళ్లతో ఎదురుచూసిన లబ్ధిదారులకు నిరాశే ఎదురైంది. అధికారపార్టీ నేతలు అధికారులతో కుమ్మక్కై అర్హత ప్రాతిపాదిక పక్కనపెట్టి తమ విధేయులకే పింఛను మంజూరుకు సిఫారసు చేస్తున్నారు. కొత్తగా మంజూరైన జాబితాలను పరిశీలిస్తే..ఈ విషయం తేటతెల్లమవుతుంది. 37 వేల దరఖాస్తులు : జిల్లాలో వివిధ రకాల సామాజిక పింఛన్ల కోసం 37 వేలమంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 14 వేలమందిని అర్హులుగా గుర్తించి వారి పేర్లను ఆన్లై న్లో ఉంచారు. వీటిని కూడా నిశితంగా మరోమారు పరిశీలించి గ్రామకమిటీల ఆమోదం తీసుకొని మరలా అప్లోడ్ చేయాల్సిందిగా అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమం కూడా మంగళవారంలోపు పూర్తిచేయాలని ఆదేశించారు. కానీ ఈ జాబితాను పరిశీలిస్తే అర్హులకు మొండిచేయి చూపించినట్లుగా అర్థమవుతోంది. నిబంధనలను గాలికొదిలేసి అధికారపార్టీ నేతలు చెప్పిన జాబితాకే అధికారులు జేకొట్టారు. ఇందుకు ఉదాహరణ.. వరికుంటపాడు మండలానికి 270 పింఛన్లు మంజూరుకాగా, వాటిలో దాదాపు 150కి పైగా అనర్హుల పేర్లే ఉన్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో తేలినట్లు ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులు చెబుతున్నారు. వృద్ధుల పింఛన్లకు వయస్సు 65 ఉండాలి. కానీ ఆ వయస్సు వారి పేర్లు జాబితాలో లేకపోగా, 40 ఏళ్లున్న వారిపేర్లు జాబితాలో చోటుచేసుకున్నాయి. బోగస్ సర్టిఫికెట్లతో..: మరికొంతమంది బోగస్ అంధత్వ సర్టిఫికెట్లతో అన్ని అవయవాలు చక్కగా ఉన్న వారి పేర్లు కూడా కొత్త జాబితాలో ఉన్నాయి. గణేశ్వరపురం పంచాయతీకి కొత్తగా 39 పింఛన్లు మంజూరుకాగా, వాటిలో అర్హత కలిగిన వారి పేర్లు పట్టుమని ఐదు కూడా లేవు. మిగతా పేర్లన్నీ కూడా యాభై ఏళ్లలోపు వయస్సు ఉన్నవారే. రేషన్‌కార్డు, ఆధార్‌కార్డులు పరిశీలించడంతో ఈ విషయం తేటతెల్లమైంది. రాజకీయ నాయకులు వత్తాసుతో..: కార్యాలయంలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు రాజకీయ నాయకులకు వత్తాసు పలికి జన్మభూమి కమిటీ ఆమో దం పొందిన జాబితాను తొలగించి అనర్హులైన వారి పేర్లను కంప్యూటరీకరించారు. విషయమై ఆ గ్రామస్తులు మంగళవారం ఎంపీడీఓను నిలదీసి ఆందోళనకు దిగారు. అన్ని అర్హతలు ఉన్న 25మంది పేర్లు జాబితాలో లేకుండా చేశారు. వీరిపై వైఎస్సార్సీపీ సానుభూతిపరులన్న ముద్రవేసి పింఛన్లు లేకుండా తొలగించారని ఆ గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అలీ అహ్మద్ ఎంపీడీఓను నిలదీశారు. నా పేరు జాబితాలో లేదు: నాకు 65 శాతం వికలాంగత్వం ఉంది. ఏడాది నుంచి పింఛ ను కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా. అయినా ఫలితం లేదు. ఇటీవల జన్మభూమి కమిటీ సభ్యులు నా పేరు ఎంపికచేశారు. తీరా జాబితాలో చూస్తే నాపేరు లేదు. మా ఊర్లో అర్హతలేని వారి పేర్లు ఉన్నాయి. -ఎం.అచ్చమ్మ, వికలాంగురాలు, తిమ్మారెడ్డిపల్లి -
పింఛన్లు రెడీ.. లబ్ధిదారులేరీ..!
తాండూరు: అర్హత ఉన్నా జాబితాలో పేరు లేదని, తనకు పింఛన్ మంజూరు కాలేదని పలువురు పేదలు గగ్గోలు పెడుతున్నారు. ఆలస్యమైనా పింఛన్ వస్తుందనే ఆశతో మళ్లీమళ్లీ దరఖాస్తులు అందజేస్తున్నారు. అయితే తాండూరు మున్సిపాలిటీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. పింఛన్ రాక జనాలు ఓవైపు లబోదిబోమంటుంటే ఇక్కడ దాదాపుగా రెండొందలకు పైగా లబ్ధిదారుల జాడ కనిపించడం లేదు. అలాగే ఒక పేరుపైనే డబుల్ పింఛన్లు మంజూరయ్యాయి. ఓ మృతి చెందిన వ్యక్తికి సైతం పింఛన్ మంజూరైంది. దీంతో మున్సిపల్ అధికారులు పింఛన్ డబ్బులు ఉన్నా పంపిణీ చేయలేని అయోమయంలో పడిపోయారు. వివరాల్లోకి వెళితే.. తాండూరు మున్సిపాలిటీలో మొత్తం 8 రెవెన్యూ వార్డుల పరిధిలో 31 వార్డులు ఉన్నాయి. మొత్తం 5,051మంది వృద్ధులు, వికలాంగులు, వితంతు, చేనేత,కల్లుగీతకార్మికులకు పింఛన్లు మంజూరయ్యాయి. ప్రభుత్వం రెండు విడతల్లో గత ఏడాది నవంబర్, డిసెంబర్ మాసాలకు కలిపి మొత్తం కోటీ 4లక్షల 16వేల రూపాయలను విడుదల చేసింది. ఆయా వార్డుల్లో, మున్సిపల్ కార్యాలయంలో పలు దఫాలుగా జాబితా ప్రకారం లబ్ధిదారులకు పింఛన్ డబ్బులు అందజేశారు. ఇలా ఈనెల 5వ తేదీ వరకు సుమారు 4,717మందికి రూ.98.92లక్షలను పంపిణీ చేయగా సుమారు రూ.5.24 లక్షలు ఇంకా పంపిణీ కాలేదు. 246 మంది పేర్లు జాబితాలో ఉన్నప్పటికీ.. వారు మొత్తం వార్డుల్లో ఎక్కడా లేరు. ముగ్గురు పేరు మీద పింఛన్లు రెండు సార్లు(డబుల్) వచ్చాయి. మృతి చెందిన ఒకరికి పింఛన్ మంజూరైంది. ఒక వార్డు లబ్దిదారుడు మరో వార్డులో, ఇంటినంబరు తప్పు, ఆధారు కార్డులో వివరాల పొరపాటు తదితర కారణాలతో కూడా కొంతమందికి పింఛన్లు పంపిణీ కాలేదు. తాండూరు మండలం మల్కాపూర్ అడ్రస్‌గా ఒకరికి పింఛన్ పట్టణంలో రావడం గమనార్హం. అయితే డబుల్, మృతి చెందిన పింఛన్‌దారులను మినహాయిస్తే 246మంది ఎవరు.. ఎక్కడున్నారు? స్థానికంగా లేని వారి పేరు మీద పింఛన్లు ఎలా మంజూరయ్యాయి, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారా..తదితర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఎవరో.. ఎక్కడుంటున్నారో తెలియక రూ.5.24 లక్షల పింఛన్ డబ్బులు మిగిలిపోయినట్టు మున్సిపల్ బిల్‌కలెక్టర్ రమేష్ వివరించారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు నివేదించామన్నారు. కలెక్టర్ ఆదేశాల తరువాత మున్సిపల్ కమిషనర్ సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
పింఛన్..ఫికర్
అన్ని అర్హతలున్నా ‘ఆసరా’ అందకపోవడంతో లబ్ధిదారులకు పింఛన్ ఫికర్ పట్టుకుంది. ఇన్నాళుగా వచ్చిన పింఛన్ ఇప్పుడు వస్తలేదాయేనంటూ ఆందోళన చెందుతున్నారు. అన్ని అర్హతులున్నా తమను ఎందుకు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పెన్షన్ అందుతుందనే ఆశతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయినా వారిని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. * అర్హులకు అందని ‘ఆసరా’ * కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు * చేతులెత్తేసిన ప్రజాప్రతినిధులు * ఆందోళనలో లబ్ధిదారులు సంగారెడ్డి మున్సిపాలిటీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆసరా పథకానికి ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. అన్ని అర్హతలున్నా అర్హులకు పింఛన్ అందడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు చేతులెత్తేస్తున్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి గ్రేడ్-1 మున్సిపాలిటీలో గతంలో 5378 పింఛన్లు మంజూరు కాగా ప్రస్తుతం 1962 మాత్రమే మంజూరయ్యాయి. దీంతో అర్హులైన వేలమంది అర్జీదారులు మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అధికారులు మాత్రం మంజూరైన పింఛన్లను పంపిణీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఎస్కేఎస్ ఫాం సర్వే అన్లైన్ చేసే క్రమంలో కంప్యూటర్ ఆపరేటర్లు సక్రమంగా నిర్వహించకపోవడంతో అర్హులు చాల మందికి పింఛన్ పొందలేకపోతున్నారు. పుల్కల్ మండలం మిన్పూర్లో సైతం ఇదే సమస్య నెలకొని ఉన్నా పట్టించుకునే వారే లేకపోయారు. దీంతో మంగళవారం మండలాభివృద్ధి అధికారి కార్యలయం ఎదుట గంటల తరబడి నిరీక్షించిన పట్టించుకునే వారు లేరు. దీంతో వృద్ధులు ప్రజాప్రతినిధుల తీరుపట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన మంగలి మల్లయ్య (79 సంవత్సరాలు) తనకు పింఛన్ అందలేదని తెలిపారు. కుటుంబంలో తనను చూసేవారు ఎవరూ లేరని, కొడుకులు వేరుగా ఉంటూ బతుకు దెరువుకోసం వలస వెళ్లారని తెలిపారు. దీంతో తనను చూసేవారే లేకుండా పోయారన్నారు. ఇప్పటి వరకు తనకు వచ్చిన పింఛన్‌తో జీవనం కొనసాగించినట్లు తెలిపారు. ప్రస్తుతం వచ్చే పింఛన్ కూడా రాకపోవడంతో తిండితినలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. అధికారులు స్పందించి తనకు పింఛన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఇదే గ్రామనికి చెందిన మున్సిబీ(71) కి సైతం పింఛన్ మంజూరు కాలేదు. ఆమె భర్త 36 సంవత్సరాల క్రితం చనిపోయాడని అయినప్పటికీ ఆమెకు వితంతు పింఛను కాని, వృద్ధాప్య పింఛన్ కానీ మంజూరు కాలేదు. ఆమెకు కొడుకులు లేకపోవడంతో గ్రామంలో ఉన్న కుమార్తె వద్ద ఉంటోంది. ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే అనంతరం రేషన్‌కార్డు, పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంది. 71 సంవత్సరాలున్న ఆమెకు వృద్ధాప్య, వితంతు పింఛన్ మంజూరు కాకపోవడంతో ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇలా జిల్లా వ్యప్తంగా అర్హులైన వృద్ధులకు, వితంతువులకు పింఛను మంజూరు కాకకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీడీఓలకు దరఖాస్తు చేసుకోవాలి ప్రభుత్వం మంజూరు చేసిన ఆసరా పింఛన్లు అర్హులకు అందని పక్షంలో వెంటనే సంబంధింత మండలాభివృద్ధి అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సత్యనారాయణరెడ్డి సూచించారు. అర్హులకు పింఛన్ అందడం లేదనే విషయంపై పీడీని వివరణ కోరగా ఆయన పై విధంగా స్పందించారు. -
రుణమాఫీ లబ్ధిదారుల రెండవ జాబితా సిద్ధం
-
రుణమాఫీ జాబితా అస్పష్టం
-
పింఛన్ పంపిణీలో తొక్కిసలాట
ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల మున్సిపాలిటీ కార్యాలయంలో బుధవారం పింఛన్ల పంపిణీలో తొక్కిసలాట చోటుచేసుకుంది. దీనికి అధికారుల నిర్లక్ష్యమే కారణం. పింఛన్ల పంపిణీ చేస్తున్నారని లబ్ధిదారులు, కొత్తగా మరికొన్ని మంజూరయ్యాయని కొంతమంది లబ్ధిదారులు అక్కడికి చేరుకున్నారు. దీంతో కార్యాలయ ఆవరణం పింఛన్ల లబ్ధిదారులతో నిండిపోయింది. ముందుగానే కార్యాలయం చాలా ఇరుగ్గా ఉంటుంది. కొత్తగా మంజూరైన పింఛన్ లబ్ధిదారుల జాబితాను మేనేజర్ ప్రసాద్ చదివి వినిపిస్తున్న నేపథ్యంలో అందరూ ఒక్కసారిగా అక్కడికి వెళ్లారు. దీంతో గందరగోళంగా తయారైంది. ఊపిరాడక పలువురు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పింఛన్ మంజూరు కాని వారు మాకెందుకు రాలేదని అధికారులపై వాదనకు దిగారు. చేసేదిలేక మేనేజర్ పాసుపుస్తకాల్వికుండా లోనికి వెళ్లారు. దీంతో లబ్ధిదారులు ఒక్కసారిగా కార్యాలయ గేట్ తోసుకుంటూ లోనికి పోయారు. ఈ తొక్కిసలాటలో పాపమ్మ అనే వృద్ధురాలు కిందపడింది. ఆమె చేతికి, కాళ్లకు గాయాలయ్యాయి. మరో మృద్ధురాలు సుబ్బమ్మ నడవలేక, కళ్లు సరిగా కనిపించక అక్కడే ఓ మూల కూర్చుని కన్నీరుమున్నీరుగా ఏడ్చింది. ముందుచూపుగా అధికారులు అక్కడ క్యూ ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడ్డారు. విషయాన్ని మేనేజర్ ప్రసాద్ పోలీసులకు చేరవేయడంతో వారు వచ్చి పరిస్థితిని నియంత్రించారు. 207 కొత్త పింఛన్లు మంజూరు ఎర్రగుంట్ల నగర పంచాయతీ పరిధిలోని 20 వార్డులలో కొత్తగా 207 పింఛన్లు మంజూరైనట్లు మేనేజర్ ప్రసాద్ తెలిపారు. ఇందులో 180 వృద్ధులకు, 27 వికలాంగులకు కేటాయించారన్నారు. -
ఏడాదిగా ఎదురుచూపు
కర్నూలు(అర్బన్): ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల నుంచి వివిధ రుణాల కోసం లబ్ధిదారులు ఏడాదిగా ఎదురుచూస్తున్నారు. వెరిఫికేషన్, ఎన్నికలు, కొత్త ప్రభుత్వం తదితర కారణాలతో కాలయూపన జరగుతోంది. జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 2013-14 ఆర్థిక సంవత్సరంలో 5366 మంది లబ్ధిదారులకు రూ.34.34 కోట్ల మేరకు రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. 2027 మందికి రూ.20.82 కోట్లు సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరయ్యాయి. అయితే గత ఏడాది ఆగస్టు నుంచి రాష్ట్రంలో సమైక్యాంధ్ర ఉద్యమం, ఎన్నికలు రావడంతో ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల నుంచి రుణాలు అందించని పరిస్థితి ఏర్పడింది. జీవో నంబర్ 101తో మొదలైన కాలయూపన.. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి 2013 డిసెంబర్ 31వ తేదీన జీవో నంబర్ 101ను జారీ చేశారు. ఈ మేరకు 45 సంవత్సరాల లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీలు మాత్రమే రుణాలు పొందేందుకు అర్హులు. దీంతో వందల సంఖ్యలో దరఖాస్తులు బుట్టదాఖాలయ్యాయి. వయస్సు నిర్ధారణకు సంబంధించి ఆయా కార్పొరేషన్లకు అందిన దరఖాస్తులన్నీ తిరిగి మండలాలు, మున్సిపల్ కార్యాలయూలకు తిప్పి పంపారు. ఆయా కార్యాలయాల్లో దరఖాస్తులను వడపోసి తిరిగి కార్పొరేషన్లకు పంపడంలో కొంత మేర జాప్యం జరిగింది. వయసు నిర్ధారణ తర్వాత రూపొందించిన జాబితాలను కలెక్టర్ అనుమతి కోసం పంపారు. కలెక్టర్ అనుమతి లభించిన అనంతరం ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మళ్లీ అవి పెండింగ్‌లో పడ్డారుు. నేతల పెత్తనం.. ఎన్నికలు అయిపోయి రాష్ట్రంలో కొత్తగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కలెక్టర్ అప్రూవల్ చేసిన దరఖాస్తులను గ్రామీణ, మున్సిపల్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫించన్ కమిటీలు స్క్రూట్నీ చేయూలని రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 535ను జారీచేసింది. ఆ మేరకు ఎస్సీ, ఎస్సీ కార్పొరేషన్లలోని దరఖాస్తులను తిరిగి పింఛన్ల కమిటీ పరిశీలనకు పంపుతారు. ఈ గ్రామ కమిటీల్లో సర్పంచు, ఎంపీటీసీ, పంచాయతీ కార్యదర్శి, ఇద్దరు స్వయం సహాయక సంఘాల లీడర్లు, ఇద్దరు సామాజిక కార్యకర్తలు ఉంటారు. మున్సిపల్ ప్రాంతాల్లో కార్పొరేటర్, ఇద్దరు స్వయం సహాయక సంఘాల లీడర్లు, ముగ్గురు సామాజిక కార్యకర్తలు, ఒక బిల్ కలెక్టర్ సభ్యులుగా ఉంటారు. వీరు విచారించి సిఫారసు చేసిన దరఖాస్తులను ఉన్నతాధికారి కార్యాలయానికి అప్లోడ్ చేయనున్నారు. ఇక్కడే వారు రాజకీయం చేస్తున్నారు. తమ వారి దరఖాస్తులను మాత్రమే సిఫార్సు చేస్తున్నారు. అర్హులైనా చాలామంది దరఖాస్తులను పక్కన పడేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2027 దరఖాస్తులను ఆయా కార్యాలయాలకు పంపగా 676 దరఖాస్తులను మాత్రమే సిఫారసు చేశారు. ఎస్టీ కార్పొరేషన్ కూడా 527 దరఖాస్తులను ఆయా కార్యాలయాలకు విచారణకు పంపేందుకు చర్యలు చేపట్టింది. -
భూ తగాదా
►రెవెన్యూ, అటవీశాఖల మధ్య సమన్వయ లోపం ► భూవివాదంలో 25 వేల ఎకరాలు ► రెండు శాఖల మధ్య నలుగుతున్న 8 వేల మంది లబ్ధిదారులు ► పరిష్కారం చూపాలని వేడుకోలు నెన్నెల : రెవెన్యూ, అటవీ శాఖ అధికారుల మధ్య సమన్వయ లోపం లబ్ధిదారులకు శాపంగా మారింది. రెవెన్యూ అధికారు లు పంచిన భూములను సాగు చేయకుండా అటవీశాఖతో అధికారులు అడ్డుకుంటున్నారు. రెవెన్యూ అధికారులేమో పంచిన భూములపై పూర్తిస్థాయి హక్కులు ఉంటాయని తెలుపుతున్నారు. కానీ, అటవీ శాఖ అధికారులు ఆ భూములు రిజర్వు ఫారెస్టు కిందకి వస్తాయని అందులో పంటలు ఎలా సాగు చేస్తారని పేర్కొంటున్నారు. ఈ రెండు శాఖల మధ్య భూవివాదంలో జిల్లాలో దాదాపు 8 వేల మందికి సంబంధిం చిన 25 వేల ఎకరాల భూములు ఉన్నాయి. ఈ రెండు శాఖల మధ్య లబ్ధిదారులు సమిధలవుతున్నారు. దశాబ్దాలుగా వామపక్షాలు పేదల పక్షాన పోరాడితే అధికారులు కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. కానీ, భూ సమస్య పరిష్కారానికి మాత్రం నోచుకోవడం లేదు. కాగా, ప్రభుత్వ శాఖల్లో సరైన రికార్డులు లేకపోవడం వివాదాలకు కారణంఅవుతుంది. రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సమన్వయం లేక పోవడమే కారణంగా కనిపిస్తుంది. వివాదంలో 25 వేల ఎకరాలు జిల్లాలోనే అత్యధికంగా ప్రభుత్వ భూములున్న నె న్నెల మండలంలో దాదాపు 7,600 ఎకరాల భూ మి చిక్కుల్లో చిక్కుకుని ఉంది. నెన్నెల మండలం సింగాపూర్‌లో సర్వే నంబర్ 34, 36లలో 950 ఎకరాలు, కొంపెల్లి, పొట్యాల, కొత్తూర్ శివార్లలోని సర్వే నంబరు 4/2, 4/3లలో 600ఎకరాలు, కొ నంపేట సమీపంలోని చీమరేగళ్ల వద్ద 700 ఎకరా లు, నెన్నెల, బొప్పారం వద్ద గల సర్వే నంబరు 671, 672,674లలో 1,200 ఎకరాలు, సీతానగర్లోని సర్వే నంబరు 1లో 400 ఎకరాలు, జైపూర్ మండలం గుత్తేదారిపల్లి శివారులోని సర్వే నంబరు 368, 369/12లో 200 ఎకరాలు, వేమనపల్లి మండలం గోధుంపేట శివారు సర్వే నంబరు 3లో 350 ఎకరాలు. చామనపల్లి శివారులోని సర్వే నంబరు 61లో 100 ఎకరాలు, సూరారంలో మరో 200 ఎక రాలు, చెన్నూర్ మండలం కన్నెపల్లి, బుద్ధారం, సంకారం, గ్రామాలకు అనుకొని ఉన్న సర్వే నంబ రు 354లో 800 ఎకరాలు, మందమర్రి మండలం సారంగపల్లి శివారు సర్వే నంబరు 33లో 220 ఎకరాలు, భీమిని మండలం రెబ్బెన శివారు సర్వే నం బరు 247లో 250 ఎకరాలు, ఆనందాపూర్ శివారు సర్వే నంబరు 101లో 120 ఎకరాలు, మెట్పల్లిలో ని సర్వే నంబరు 20, 22లలో 150 ఎకరాలు, జజ్జరెల్లిలోని సర్వే నంబరు88/89లో 400ఎకరాల భూ మి వివాదంలో ఉంది. కోటపల్లి మండలం కొండంపేట, పార్‌పల్లిలో దాదాపు 800ఎకరాలు, సిర్పూర్ మండలంలో 6,800 ఎకరాలు, ఉట్నూర్‌లో 4,300 ఎకరాలు, కౌటాలలో 3,600 ఎకరాలు, రెబ్బెనలో 2,900 ఎకరాలు, దహెగాంలో 580 ఎకరాల భూ ములు వివాదంలో ఉన్నాయి. తాండూర్, బెజ్జూర్, సిర్పూర్(టి), ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, కడెం, ఖా నాపూర్, ఇంద్రవెల్లి మండలాల్లో కూడా సమస్య తీ వ్రంగా ఉంది. భూమి తమదంటే తమదని ఇరుశాఖల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. దీంతో వేలాది ఎకరాల భూములు బీళ్లుగా మారాయి. జాయింట్ సర్వేపై జాప్యం ఆర్భాటంగా పట్టాలు అందజేసిన అధికారులు, ప్ర జాప్రతినిధులు ఆ తర్వాత ప్రజల సమస్యలను ప ట్టించుకోవడం లేదు. కేటాయించిన భూములు ఏ శాఖకు చెందుతాయో నిర్ధారించాల్సిన జాయింట్ సర్వే నిర్వహణలో జాప్యం జరుగుతోంది. ప్రభుత్వం కేటాయించిన భూమి మోఖా(పొజీషన్) ఎ క్కడుందనేది చూపకపోవడంతో లబ్ధిదారులు ఆ నంబరులో ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ దున్నడం ప్రారంభించారు. రైతులు సర్వే నంబరు ఆధారం గా ప్రభుత్వ భూమిలోనే సాగు చేసుకుంటున్నారు. కొన్నాళ్లు సాగు చేసుకున్నాక ఈ భూములు రిజర్వు ఫారెస్టుకు చెందినవని అటవీశాఖ అడ్డుకుంటుంది. రికార్డుల్లో పీపీ ల్యాండుకే పట్టాలిస్తున్నామని రెవె న్యూ అధికారులు వాదిస్తున్నారు. పట్టాల పేరిట అ టవీ భూములను కబ్జా చేస్తున్నారని అటవీ అధికారులు ఆరోపిస్తున్నారు. అటవీ భూములు నిర్దారిం చేందుకు చాలా ప్రాంతాల్లో సరైన హద్దులు లేవు. దీంతో రిజర్వు ఫారెస్టు సరిహద్దులేవో తెలియడం లేదు. ప్రభుత్వం జిల్లాలో రక్షిత అటవీ ప్రాంతాన్ని గుర్తించినపుడు అందుకు అనుగుణంగా రికార్డుల్లో మార్పులు చేయలేదు. దీంతో మిగులు భూములపై వివాదం కొనసాగుతోంది. -
25 శాతం నిధులు మిగిలినట్లే!
‘సర్వే’ సమాచారం ఆధారంగా పలు పథకాల్లో కోత పెట్టనున్న సర్కారు ఆదా అయిన నిధులు అభివృద్ధి కార్యక్రమాలకు మళ్లింపు టాస్క్‌ఫోర్స్ కమిటీల సిఫారసుల అనంతరమే బడ్జెట్‌కు తుది రూపు సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం అమలవుతున్న ప్రభుత్వ పథకాల్లో దుర్వినియోగాన్ని తగ్గించడం వల్ల.. వాటికి అవుతున్న వ్యయంలో దాదాపు 25 శాతం నిధులు ఆదా చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం సమగ్ర ఇంటింటి సర్వే సమాచారాన్ని వినియోగించుకోనుంది. రేషన్‌కార్డులు, పింఛన్లు, విద్యార్థులకు ఆర్థిక సాయం, ఆరోగ్యశ్రీ, గృహ నిర్మాణ పథకాల్లో నిధుల దుర్వినియోగాన్ని చాలా వరకూ అరికట్టవచ్చని అధికారులు అంచనా వేశారు. దీనివల్ల ఆదా అయిన నిధులను అభివృద్ధి కార్యక్రమాలకు మళ్లించడం వల్ల ప్రభుత్వంపై భారం తగ్గుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే డీలర్లు రాష్ట్రవ్యాప్తంగా ఐదున్నర లక్షల రేషన్ కార్డులను సరెండర్ చేయగా... ఆధార్ సీడింగ్‌తో మరో ఐదు లక్షల రేషన్‌కార్డులను తొలగిస్తున్నారని అధికారవర్గాలు తెలిపాయి. మొత్తంగా కోటికిపైగా ఉన్న రేషన్‌కార్డుల్లో ఇప్పటికే పది లక్షల వరకూ తగ్గడంతో... పౌర సరఫరాల శాఖ వ్యయంలో పది శాతం వరకూ నిధులు ఆదా అయినట్లేనని పేర్కొన్నాయి. ఇక పింఛన్లలోనూ ఇదే పద్దతి అమలవుతుందని అంచనా వేస్తున్నారు. పింఛన్లను ఏకంగా రూ. వెయ్యి, పదిహేను వందలకు పెంచుతుండడంతో... బోగస్ లబ్ధిదారుల తొలగింపు చేపడతారని చెబుతున్నారు. అలాగే అర్హులైన విద్యార్థులకు మాత్రమే ఫీజులు చెల్లించేదిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పటిదాకా వచ్చిన బడ్జెట్లకు భిన్నంగా ఈ బడ్జెట్ ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని అధికారవర్గాలు వివ రించాయి. కానీ బడ్జెట్ కోసం వివిధ శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన తరువాత అధికారులకు దిమ్మతిరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ప్రణాళిక వ్యయం కింద రూ. 60 వేల కోట్ల ప్రతిపాదనలు వస్తే.. తెలంగాణ రాష్ట్ర అధికారులు గత బడ్జెట్ అంచనాలను యథావిధిగా రూపొందించి.. ఏకంగా రూ. 68 వేల కోట్ల మేరకు ప్రణాళిక ప్రతిపాదనలు పంపించినట్లు తెలిసింది. ఎలాంటి కసరత్తు లేకుండా అధికారులు ప్రతిపాదనలు పంపించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో... లక్ష్యాన్ని సాధించేలా బడ్జెట్ రూపకల్పన జరుగుతుందని, టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఇచ్చే నివేదికల తరువాత బడ్జెట్‌పై తుది నిర్ణయానికి వస్తారని ఓ అధికారి వివరించారు. సమగ్ర సర్వేపై వర్క్‌షాప్.. సమగ్ర కుటుంబ సర్వేలో సేకరించిన సమాచారాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దానిపై సలహాలు, సూచనల కోసం గ్రామీణాభివృద్ధి శాఖ బుధవారం అపార్డ్‌లో వర్క్‌షాప్ నిర్వహించింది. ఎన్ఐఆర్డీ, పంచాయతీరాజ్, సెర్ప్ అధికారులు, ఆర్థిక, సామాజికవేత్తలతో గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ ఈ సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న అధికారులు, నిపుణులు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. -
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రూ.34.34 కోట్ల ఆస్తుల పంపిణీ
చిత్తూరు (సెంట్రల్): జిల్లా పోలీసు గ్రౌండ్లో శుక్రవారం జరగనున్న స్వా తంత్య్ర వేడుకల్లో అర్హులైన లబ్ధిదారులకు రూ.34.34 కోట్ల విలువైన ఆస్తుల ను పంపిణీ చేయనున్నారు. జిల్లా మం త్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని 77,424 మంది లబ్దిదారులకు ప్రయోజనం చేకూర్చనున్నారు. ఇందులో డీఆర్డీఏ ద్వారా 526 స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.20 కోట్లు రుణ సా యంగా అందించనున్నారు. 77,355 మందికి బీమా, ఉపకార వేతనాలుగా రూ.9.17 కోట్లు, పట్టణ ఇందిర క్రాం తిపథంలో 141 స్వయం సహాయక సంఘాలకు రూ.5 కోట్లు, వ్యవసాయ శాఖ ద్వారా వ్యవసాయ పనిముట్ల అద్దె కేంద్రం నిర్వహణ కోసం, మిని ఎస్ఎంఎస్ ఆర్ఐ కింద రూ.2.62 లక్ష లు అందించనున్నారు. వికలాంగుల వృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా ట్రైసైకి ళ్లు, శ్రవణయంత్రాలు 25 మందికి రూ.1 లక్ష విలువ కలిగినవి అందించనున్నారు. జిల్లా సాంఘిక సంక్షేమశాఖ ద్వారా కులాంతర వివాహం చేసుకున్న 13 జంటలకు రూ.6.1 లక్షలను ప్రో త్సాహకంగా అందించనున్నారు. పట్టు పరిశ్రమశాఖ ద్వారా అధికోత్పత్తి మల్బరీ నారు, పట్టు పురుగుల పెంపకగృహ నిర్మాణం కోసం, రేరింగు పరికరాలకు ఇతరత్రా వాటి నిమిత్తం 25 మందికి 5 లక్షల రూపాయలను అం దించనున్నారు. వీటితో ఆయా శాఖలు అందించే పథకాలను తెలిపేందుకు 9 స్టాళ్లను జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ఆదేశాలతో జిల్లా అధికారులు ఏర్పాటు చేయనున్నారు. -
ఉపాధి కూలీలుగా సచిన్, అమితాబ్
-
వీధినపడ్డ రాజీవ్ స్వగృహ లబ్దిదారులు
-
దక్కబోయే వేళ చిక్కుముడి
సాక్షి, రాజమండ్రి : ‘ఎంత చెట్టుకు అంత గాలి.. ఎంత పిట్టకు అంత గూడు’ అన్నట్టు- తమకంటూ నీడనిచ్చే ఓ చిన్నఇల్లు సొంతం కాబోతోందని ఆ నిరుపేదలు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. తీరా ఇల్లు సిద్ధమయ్యాక- చేతికి వచ్చిన ముద్ద తినకుండా మూతి మీద కొట్టినట్టు.. ప్రభుత్వం వారిపై అదనపు భారాన్ని మోపుతోంది. ‘అది మోస్తేనే ఇల్లు.. లేకుంటే ఇంటికీ, మీకూ చెల్లు’ అని నిర్దాక్షిణ్యంగా అంటోంది. పట్టణ పేదల సొంత ఇంటి కలను సాకారం చేయాలన్న సంకల్పంతో దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఇంటిగ్రేటెడ్ హౌసింగ్, స్లమ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(ఐహెచ్ఎస్డీపీ)కు శ్రీకారం చుట్టారు. రాజమండ్రిలో ఈ పథకం కింద పేపర్ మిల్లు సమీపంలోని ఆర్అండ్బీ స్థలంలో, ధవళేశ్వరం సమీపంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వద్ద, లాలాచెరువులో 3,500కు పైగా ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో 1,750 ఎస్సీలకు కేటాయించారు. నాలుగేళ్ల క్రితం ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. గృహ నిర్మాణ సంస్థ నిబంధనల ప్రకారం లబ్ధిదారుల నుంచి రూ.26,500 డీడీల రూపంలో కట్టించుకున్నారు. పరిమాణం, కైవారం తదితర అంశాల ప్రకారం కొన్ని ఇళ్లకు ముందుగా రూ.17,000 కట్టించుకున్నారు. జి+ కేటగిరీల్లో ఇళ్లు నిర్మాణాలు చేపట్టారు. రాజశేఖరరెడ్డి మరణానంతరం ఇళ్ల నిర్మాణాల్లో అధికార పార్టీ నేతలు తీవ్ర జాప్యానికి కారణం అయ్యారు. లబ్ధిదారుల జాబితాల్లో కూడా అవకతవకలు చోటు చేసుకున్నాయి. స్థానిక ఎమ్మెల్యే తనకు అనుయాయులకు ఇళ్లు కేటాయించేందుకు జాబితాలో మార్పులు చేయించాన్న ఆరోపణలు కూడా వచ్చాయి. నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు ప్రస్తుతం ఇళ్ల నిర్మాణం పూర్తి కావచ్చింది. లబ్ధిదారులు తమ సొంత ఇంటికల నెరవేరుతోందని సంబరపడుతున్న తరుణంలో ప్రభుత్వం వారి పాలిట పీడకల లాంటి నిర్ణయం తీసుకుంది. ఆ అప్పులే ఇంకా తీరలేదు.. నిర్మాణ వ్యయం పెరిగినందువల్ల యూనిట్ ధర పెరిగిందని, అందువ ల్ల అదనంగా డబ్బులు కట్టాలని గృహ నిర్మాణ శాఖ అధికారులు లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చారు. గతంలో రూ.26,500 కట్టిన వారు మరో రూ.15,000 తక్షణం చెల్లించాలని, రూ.17,000 చెల్లించిన వారు మరో రూ. 10,000 చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ‘డిసెంబర్ నెలాఖరులోగా మిగిలిన సొమ్ములు చెల్లించకుంటే ఇళ్లు రద్దు చేసేస్తాం’ అని కూడా హెచ్చరించారు. దీంతో నిరుపేదలైన లబ్ధిదారులు ప్రధానంగా ఎస్సీ లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. సొంత ఇళ్లు వస్తాయన్న ఆశతో అప్పట్లో వడ్డీలకు తెచ్చి మరీ డబ్బులు కట్టామని, ఆ అప్పులే ఇంకా తీరలేదని, ఇప్పుడు ఇంకా డబ్బులు తేవాలంటే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. ఇళ్లు ఇవ్వకపోతే ఉద్యమమే : చోడిశెట్టి నగరంలో ఆర్అండ్బీ స్థలంలో 696 ఇళ్లు, లాలాచెరువు వద్ద 360 ఇళ్లు లబ్ధిదారులకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. కానీ వారంతా అదనంగా సొమ్ము చెల్లిస్తేనే ఇళ్లు దక్కుతాయని అధికారులు స్పష్టంగా చెబుతున్నారు. కానీ తాము అంత సొమ్ములు చెల్లించుకోలేమని, తమకు నెలకు రూ.1,000 చెల్లించుకునేలా వాయిదాల పద్ధతికి అనుమతి ఇవ్వాలని 47వ డివిజన్‌కు చెందిన పేకేటి సూర్యకాంతం అనే లబ్ధిదారు అభ్యర్థిస్తున్నారు. ‘గూడు దక్కబోయే ఈ చిక్కుముడి ఏమి’టని నిట్టూరుస్తూనే పలువురు లబ్ధిదారులు అదనపు సొమ్ము వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు. కాగా మంజూరైన లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వకపోతే ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని క్వారీ ప్రాంతనేత, మాజీ కార్పొరేటర్ చోడిశెట్టి రాఘవబాబు హెచ్చరిస్తున్నారు.