స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రూ.34.34 కోట్ల ఆస్తుల పంపిణీ | On the eve of Independence Day of the asset allocation of Rs .34.34 crore | Sakshi
Sakshi News home page

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రూ.34.34 కోట్ల ఆస్తుల పంపిణీ

Published Thu, Aug 14 2014 6:12 AM | Last Updated on Sat, Sep 2 2017 11:52 AM

On the eve of Independence Day of the asset allocation of Rs .34.34 crore

చిత్తూరు (సెంట్రల్): జిల్లా పోలీసు గ్రౌండ్‌లో శుక్రవారం జరగనున్న స్వా తంత్య్ర  వేడుకల్లో అర్హులైన లబ్ధిదారులకు రూ.34.34 కోట్ల విలువైన ఆస్తుల ను పంపిణీ చేయనున్నారు. జిల్లా మం త్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని 77,424 మంది లబ్దిదారులకు ప్రయోజనం చేకూర్చనున్నారు. ఇందులో డీఆర్‌డీఏ ద్వారా 526 స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.20 కోట్లు రుణ సా యంగా అందించనున్నారు. 77,355 మందికి బీమా, ఉపకార వేతనాలుగా రూ.9.17 కోట్లు, పట్టణ ఇందిర క్రాం తిపథంలో 141 స్వయం సహాయక సంఘాలకు రూ.5 కోట్లు, వ్యవసాయ శాఖ ద్వారా వ్యవసాయ పనిముట్ల అద్దె కేంద్రం నిర్వహణ కోసం, మిని ఎస్‌ఎంఎస్ ఆర్‌ఐ కింద రూ.2.62 లక్ష లు అందించనున్నారు.
 
వికలాంగుల వృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా ట్రైసైకి ళ్లు, శ్రవణయంత్రాలు 25 మందికి రూ.1 లక్ష విలువ కలిగినవి అందించనున్నారు. జిల్లా సాంఘిక సంక్షేమశాఖ ద్వారా కులాంతర వివాహం చేసుకున్న 13 జంటలకు రూ.6.1 లక్షలను ప్రో త్సాహకంగా అందించనున్నారు. పట్టు పరిశ్రమశాఖ ద్వారా అధికోత్పత్తి మల్బరీ నారు, పట్టు పురుగుల పెంపకగృహ నిర్మాణం కోసం, రేరింగు పరికరాలకు ఇతరత్రా వాటి నిమిత్తం 25 మందికి 5 లక్షల రూపాయలను అం దించనున్నారు. వీటితో ఆయా శాఖలు అందించే పథకాలను తెలిపేందుకు 9 స్టాళ్లను జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ఆదేశాలతో జిల్లా అధికారులు ఏర్పాటు చేయనున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement