Independence celebrations
-
విజయవాడ మున్సిపల్ స్టేడియంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు
సాక్షి, విజయవాడ: మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కాకినాడ పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించి స్వాతంత్ర్య వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జెండా ఎగురవేశారు.తూర్పు నావికా దళంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు విశాఖ: తూర్పు నావికా దళంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. నేవీ మార్చ్, నేవీ బెటాలియన్ బ్యాండ్ కనువిందు చేశాయి. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులను నేవీ అధికారులు స్మరించుకున్నారు. న తూర్పు నావికా దళం వైస్ అడ్మిరల్ రాజేష్ పెందర్కర్ జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం స్వీకరించారు. దేశం మొత్తం నావికా దళంలో తూర్పు నావికా దళం చాలా కీలకమని రాజేష్ పెందర్కర్ అన్నారు.‘‘దేశ సేవ చేసే గొప్ప అవకాసం రావటం మన అదృష్టం. ఎన్నో ప్రాణ త్యాగాల ఫలితం ఈ స్వాతంత్రం. ప్రతి ఒక్కరిలో దేశ భక్తి ఉండాలి. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ముందుకు దుసుకెళ్తున్నాం. క్రమశిక్షణ, పట్టుదల, విజయం నేవీ సొంతం. దేశ ప్రగతిలో నేవీ స్థానం కీలకం’’ అని రాజేష్ పెందర్కర్ చెప్పారు. -
ఆగస్టు 15: ఆమె... దేశంలో సగం ఎప్పుడు!?
స్వాతంత్య్ర దినోత్సవం దేశ ఔన్నత్యాన్ని మాట్లాడుతుంది. దేశ ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తుంది. కాని దేశంలో సగమైన స్త్రీలు సంపూర్ణ స్వాతంత్య్ర ఫలాలు ఇంకా పొందవలసే వుంది. ఏనాడైతే స్త్రీల పట్ల సురక్షితమైన, సంస్కారవంతమైన ప్రవర్తనను ఈ సమాజం చూపుతుందో అప్పుడే స్త్రీలకు సంపూర్ణ స్వాతంత్య్రం వచ్చినట్టు. అప్పుడే దేశ ఔన్నత్యం ఇనుమడించినట్టు. ‘ఆకాశంలో సగం’లాగా దేశంలో సగం ఇంకెప్పుడు? నేడు ఆగస్టు 15న ఎర్రకోట మీద జెండా ఎగుర వేసే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీకి ఇద్దరు మహిళా ఆర్మీ ఆఫీసర్లు సహకారం అందిస్తారు. మేజర్ నికితా నాయర్, మేజర్ జాస్మిన్ కౌర్ పతాకావిష్కరణ సమయంలో ప్రధానితో పాటుగా ఉండి జెండా వందనం సమర్పిస్తారు. ఈ విశేష ఘట్టంలో ఇద్దరు మహిళలకు ఈ విధంగా చోటు దక్కడం సంతోషపడాల్సిన సంగతి. 76 ఏళ్ల క్రితం స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు స్త్రీల స్థితిగతుల్లో వచ్చిన పురోభివృద్ధికి ఇదీ ఒక సంకేతమే. నాటి నుంచి నేటి వరకు విద్య, ఉపాధి, ఉద్యోగం, సైన్యం, పాలనా యంత్రాంగం, శాసన వ్యవస్థ... వీటిల్లో స్త్రీలకు గణనీయంగా స్థానం దక్కింది. ప్రాముఖ్యం లభించింది. అయితే అంతమాత్రాన స్త్రీలు సంపూర్ణంగా స్వాతంత్య్ర ఫలాలు అనుభవిస్తున్నారా అనేది ప్రశ్న. స్త్రీల త్యాగం దాస్య భారతంలో జరిగిన స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో స్త్రీలు పాల్గొన్నారు. అన్నింటికి మించి పురుషులు దేశం కోసం ప్రాణాలు అర్పించినా, జైళ్ల పాలైనా స్త్రీలు ధైర్యంగా ఇళ్లు నడిపి కష్టాలను ఈదారు. దేశ విభజన సమయంలో తీవ్ర హింసను ఎదుర్కొన్నారు. అంతెందుకు 1930 నాటికి దేశ వ్యాప్తంగా 30 వేల మంది స్త్రీలు స్వాతంత్య్ర పోరాటంలో ఏదో విధాన జైలు శిక్ష అనుభవిస్తున్నారని తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఈ స్త్రీల పోరాటం చాలామటుకు చరిత్రలో నమోదు కాకుండానే కాలగర్భంలో కలిసిపోయింది. ఇప్పుడిప్పుడే నాటి వీర వనితల గాధలు వెలికి వస్తున్నాయి. ఇంత పోరాటం, త్యాగం చేసి స్త్రీల భాగస్వామ్యంతో తెచ్చుకున్న స్వాతంత్య్రంలో స్త్రీలు నిజంగా సంతోషంగా ఉన్నారా? సురక్షితం కాని దేశం ‘ఒక స్త్రీ అర్ధరాత్రి క్షేమంగా నడిచి వెళ్లినప్పుడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు’ అని గాంధీజీ ఏ ముహూర్తంలో అన్నారో కాని అలాంటి స్థితి నేటికీ రాకపోగా నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. ఎన్ని చట్టాలు చేసినా, శిక్షలు తెచ్చినా స్త్రీలను గౌరవించాలి, వారి ఆత్మగౌరవాన్ని కాపాడాలి అని మెజారిటీ సమాజం అనుకోవడం లేదు. ‘నస్త్రీ స్వాతంత్య్ర మర్హతి’ అనే భావన సమాజంలో ఆది కాలం నుంచి చొప్పించి ఉండటం వల్ల స్త్రీ చేసే ప్రతి పనిలో తప్పు ఎంచడం, అదుపు చేయడం, చులకనగా చూడటం, వివక్ష చూపడం, దండించడం ఆనవాయితీగా మారింది. పిల్లల పెంపకం దశ నుంచే స్త్రీలను గౌరవించడం నేర్పించడం లేదు. ఇంట్లో అమ్మాయిని ఒకలాగా, అబ్బాయిని ఒకలాగా పెంచడం వల్ల ఈ అబ్బాయిలు ‘సమాజం’గా మారి స్త్రీ పాలిట బెడదగా మారుతున్నారు. తమ మాటకు ఎటువంటి తిరస్కారం చెప్పినా పురుషుడు శిక్షించేవాడై స్త్రీని చంపేందుకు వెనుకాడటం లేదు. స్త్రీకి ఒక అభిప్రాయం కలిగి ఉండే స్వాతంత్య్రం ఆమెకు ఎందుకు ఇవ్వడం లేదు? స్త్రీలను ప్రేమ, మర్యాద, గౌరవాలతో కుటుంబం చూసుకోవాలి. అప్పుడు ఆ మర్యాద, గౌరవాలు సమాజంలోకి ఆటోమేటిక్‌గా వస్తాయి. కుటుంబం స్త్రీకి ఎలా రక్షణ ఇస్తుందో సమాజం కూడా స్త్రీకి అలా రక్షణ ఇవ్వాలనే పౌర శిక్షణ, సంస్కారం అవసరం. పురుషులు మాత్రమే కాదు స్త్రీలు కూడా కుటుంబం, సమాజం, దేశం కోసం గొప్పగా ఆలోచించగలరు. వారికి స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఇచ్చి చూస్తే తెలుస్తుంది. అటువంటి వేకువలోకి దేశం ఉదయించాలని ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కోరుకుందాం. -
అశోక ధర్మచక్రం ప్రబోధించే విలువల ప్రతిజ్ఞ
సాక్షి, హైదరాబాద్: 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘మేరా భారత్ మహాన్’ అనే కార్యక్రమం క్రింద.. విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఓ వైవిధ్యమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మన జాతీయ పతాకంలోని అశోక ధర్మచక్రంలో గల 24 ఆకులు సూచించే 24 ధార్మిక విలువలను పాటిస్తూ, దేశ పురోభివృద్ధికి పాటుపడుతూ ఆదర్శవంతమైన జీవితం గడుపుతాము అని విద్యార్థులచే సామూహిక ప్రతిజ్ఞ నిర్వహింపజేస్తోంది. ఆగస్టు 14వ తేదీ ఉదయం 9-10 గంటల మధ్య జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పాల్గొనేలా తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సహకరిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సంస్థ వెబ్ సైట్ www.viswaguruworldrecords.com లోని గూగుల్ ఫామ్ ను పూరించి సంబంధిత పాఠశాలలు, కళాశాలలు తదితర సంస్థలు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుంది. ఈ సంస్థలన్నింటికీ పార్టిసిపేషన్ ఈ-సర్టిఫికెట్స్ ఉచితంగానే అందిస్తారు. ఈ ప్రతిజ్ఞ ద్వారా అశోక ధర్మ చక్రంలోని 24 ఆకులు సూచించే 24 విలువల ప్రాముఖ్యం గురించి తెలుసుకోవడంతో పాటు, ఆ గుణాలను అలవర్చుకొని జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి ఎంతగానో ఉపకరిస్తుందని విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ భావిస్తోంది. అలాగే మన రాష్ట్రం తో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమం లో అందరూ పాల్గొని ఇతరులూ పాల్గొనే విధంగా చైతన్య పరచి దేశభక్తి చాటాలని విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపక సిఈవో, ప్రముఖ నాసికా చిత్రకారుడు సత్యవోలు రాంబాబు కోరుతున్నారు. ఇదీ చదవండి: ఒక్కరోజే 50 లక్షలు?.. అదీ క్రేజ్ మరి! -
కచ్చితంగా ఆ రోజు కూడా వస్తుంది: బిహార్ సీఎం
న్యూఢిల్లీ: స్వాతంత్రోద్యమాన్ని తిరగరాయడానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) బయలుదేరిందంటూ బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విమర్శల దాడి చేశారు. స్వాతంత్య్ర వేడుకల పేరుతో బీజేపీ-ఆర్ఎస్ఎస్లు ముసుగు వేసుకున్నాయని దుయ్యబట్టారు. పాట్నాలోని జనతాదళ్ యునైటెడ్ నేషనల్ సమావేశంలో నితీష్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర ఉద్యమంలో ఆర్ఎస్ఎస్, బీజేపీల పాత్ర లేదని, ఇప్పుడు దాన్ని కూడా తిరగరాస్తారని ఎద్దేవా చేశారు. ఆజాది కా అమృత్ మహోత్సవ్ వేడుకుల గురించి ప్రస్తావిస్తూ ....స్వాతంత్య్ర ఉద్యమానికి నాయకుడు ఎవరు? అని ప్రశ్నించారు. జాతిపిత బాపూజీ సారథ్యంలో జరిగిన స్వాతంత్య్ర ఉద్యమానికి కొత్త అర్థాలను తెచ్చిపెట్టారంటూ బీజేపీపై ఘాటైన విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆ ఉత్సవాలను బాపు మహోత్సవ్‌గా ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. అసలు బాపూజీ హత్య ఎందుకు జరిగిందో అందరికీ తెలుసన్నారు. కేవలం గాంధీజీ హిందువులను ముస్లీంలను ఏకం చేస్తున్నందుకే అనే విషయాన్ని గ్రహించండి అన్నారు. అవసరమనుకుంటే బీజేపీ స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రను తుడిచి పెట్టి మరీ కొత్త విషయాలు రాసేవారంటూ ఎద్దేవా చేశారు. జాతి పిత గాంధీని సైతం పక్కన పెట్టే రోజు వస్తుందని తెలుసుకోండి అని చెప్పారు. గాంధీజీని హత్య చేసినవాడి కోసం ఏం చేస్తున్నారో కూడా గమనించండి అని పిలుపునిచ్చారు. తాను బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నప్పటికీ అలాంటి విషయాల్లో దూరంగా ఉన్నానని కుమార్ స్పష్టం చేశారు. తాను ఆ సమయంలో వారితో పనిచేస్తున్నాను కాబట్టే ఏం మాట్లడలేదని, పైగా ఇలాంటి అర్థం పర్థం లేని వాటికి ఎప్పుడూ మద్దతు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. అంతేకాదు జూన్‌లో కేంద్ర హోంమంత్రి ముఖ్యమంత్రుల సమావేశానికి పిలిచినప్పుడూ తాను దానిని దాటవేసి, అప్పటి డిప్యూటీ మంత్రి తార కిషోర్ ప్రసాద్‌ని పంపించినట్లు తెలిపారు. నితీష్ గత నెలలో ఆర్జేడియూతో జతకట్టి సంకీర్ణ ప్రుభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తదనంతరం నితీష్ పెద్ద ఎత్తున్న బీజేపీ పై విమర్శలు గుప్పించారు. అంతేకాదు ఆయన 2024 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్షాన్ని సృష్టించే లక్ష్యంతో వివిధ నేతలను కలుసుకున్నారు కూడా. ఇప్పటికే నితీష్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తోపాటు వామపక్ష నేతలను కలిశారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శరద్ పవార్ తదితరులను కూడా నితీష్ కలవనున్నారు. (చదవండి: ప్రధాని పదవిపై వ్యామోహం లేదు.. తేల్చేసిన నితీశ్ కుమార్) -
అల్లు అర్జున్‌కి అరుదైన గౌరవం.. ఇండియా డే పరేడ్‌కు నాయకత్వం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన అల్లు అర్జున్‌కి అరుదైన గౌరవం లభించింది. 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా న్యూయార్క్‌లోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్(FIA) నిర్వహించిన భారీ పరేడ్‌కు ఆయన నాయకత్వం వహించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఈ ర్యాలీని నిర్వహించింది.దీనికి గ్రాండ్ మార్షల్‌గా అల్లు అర్జున్ వ్యవహరించారు. ఈ సందర్బంగా ర్యాలీని ఉద్దేశించి అల్లు అర్జున్ మాట్లాడుతూ.. 'యే భారత్‌కా తిరంగా హై.. కబీ ఝుకేగా నహీ..తగ్గేదేలే'.. అంటూ పుష్ప డైలాగ్‌తో ఉత్సాహపరిచాడు. భారతీయుడిగా జన్మించినందుకు గర్వపడుతున్నట్లు తెలిపాడు. ఇక గ్రాండ్ మార్షల్‌గా వ్యవహిరించిన ఐకాన్ స్టార్ అల్లురన్‌కి అక్కడి మేయర్ ఆమమ్స్ సర్టిఫికెట్ ఆఫ్ రికగ్నిషన్ బహుకరించాడు. ఇండియా పరేడ్కి అల్లు అర్జున్ రావడంతో న్యూయర్క్ వీధులు కిక్కిరిసిపోయాయి. అసోసియేషన్ ఛైర్మన్ అంకుర్ వైద్య సహా వివిధ సంఘాల ప్రతినిధులు సహా పలువురు ప్రవాస భారతీయులు ర్యాలీలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. It was a pleasure meeting the Mayor of New York City . Very Sportive Gentleman. Thank You for the Honours Mr. Eric Adams . Thaggede Le ! @ericadamsfornyc @NYCMayorsOffice pic.twitter.com/LdMsGy4IE0 — Allu Arjun (@alluarjun) August 22, 2022 -
Azadi Ka Amrit Mahotsav: అప్పుడే.. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా భారత్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వచ్చే ఐదేళ్లపాటు స్థిరంగా ఏడాదికి తొమ్మిది శాతం వృద్ధి చెందితేనే 2028–29 ఆర్థిక సంవత్సరం నాటికి భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సోమవారం పేర్కొన్నారు. భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని తెలంగాణా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో దువ్వూరి చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు... ► ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్దేశించుకున్న ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కలను సాకారం చేసుకోడానికి భారత్‌కు ఎనిమిది కీలక సవాళ్లు ఉన్నాయి. ఇందులో మొదటిది వచ్చే ఐదేళ్లలో భారత్ వరుసగా 9 శాతం చొప్పున వృద్ధిని సాధించాలి. తరువాతి అంశాల్లో కొన్ని పెట్టుబడులు పెరగాలి. ఉత్పత్పాదక మెరుగుపడాలి. విద్య, వైద్య రంగాలు పురోగమించాలి. భారీ ఉపాధి కల్పనలు జరగాలి. వ్యవసాయం మరింత తోడ్పాటును అందించాలి. ఎకానమీ ఫండమెంటల్స్ పటిష్టంగా కొనసాగుతూ ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు వంటి వంటి స్థూల ఆర్థిక అంశాలు స్థిరంగా ఉండాలి. పలు రంగాల్లో ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయిలో ఉండాలి. పాలనా వ్యవస్థ మెరుగుపడాలి. ► రాష్ట్రాలు ఇచ్చే రాయితీలపై మోడీ చర్చను ప్రారంభించారు. అనవసర సబ్సిడీల పరిస్థితికి ఏ ఒక్కరూ కారణం కాదు. అన్ని రాజకీయ పార్టీలూ ఇందుకు బాధ్యత వహించాలి. ► దేశానికి మిగులు బడ్జెట్లు లేవని, ఈ పరిస్థితుల్లో దేశానికి ఆర్థిక పరమైన భద్రతా వలయం తప్పనిసరిగా అవసరమని, కేంద్రం, రాష్ట్రాలు గుర్తించాలి. ► అప్పు తెచ్చుకున్న డబ్బు నుండి ఎలాంటి ఉచితాలను ఇవ్వాలనే అంశాన్ని కేంద్ర, రాష్ట్రాలు జాగ్రత్తగా పరిశీలించాలి. ఇందుకు సంబంధించి ఎంపికలు జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తు తరాలపై అనవసరమైన అప్పుల భారం మోపకూడదు. ► రూపాయి తన సహజ స్థాయిని కనుగొనడం అవసరమే. ఈ విషయంలో సెంట్రల్ బ్యాంక్ జోక్యం పరిమితంగానే ఉండాలి. తీవ్ర ఒడిదుడుకులను నివారించేలా మాత్రమే ఆర్బీఐ చర్యలు తీసుకోవాలి. డాలర్ మారకంలో మినహాయిస్తే, పలు కరెన్సీలకన్నా భారత్ మెరుగైన స్థితిలో ఉంది. పలు దేశాల మారకంలో బలపడింది. -
స్వాతంత్య్రోద్యమంలో తెలుగువారి పాత్ర చిరస్మరణీయం
సాక్షి, న్యూఢిల్లీ: భారత స్వాతంత్య్ర సంగ్రామంలో దేశవ్యాప్తంగా ఎందరో వీరులు, వీర వనితలు ఆత్మ త్యాగాలు చేశారని, ఈ పోరాటంలో తెలుగువారి పాత్రను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో జరుపుకుంటున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా జాతీయవాద చైతన్యం పెరుగుతోందని చెప్పారు. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలోనూ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతోపాటు స్వచ్ఛంద సంస్థలు చాలా ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశాయని కిషన్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం ఢిల్లీలోని ఆంధ్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. భారతదేశ స్వాతంత్య్ర సిద్ధికి ఘనమైన చరిత్ర ఉన్నట్టుగానే, ఆంధ్రా అసోసియేషన్‌కు సైతం గొప్ప చరిత్ర ఉందని చెప్పారు. తెలుగు తేజం విప్లవ వీరుడైన అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో జరిగిన పోరాట స్ఫూర్తిని యావత్ దేశానికి తెలియజేసే ఉద్దేశంతోనే ప్రధానమంత్రి ద్వారా అల్లూరి 125వ జయంతి కార్యక్రమాలను భీమవరంలో ఘనంగా నిర్వహించి, విగ్రహాన్ని ఆవిష్కరింపజేశామని తెలిపారు. ఈ నెల 22న అల్లూరి నడయాడిన ప్రాంతాల్లో పర్యటించి రూ.50 కోట్లతో ఒక సర్క్యూట్ ఏర్పాటు చేయనున్నట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు. ప్రముఖ తెలుగు గాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడైన ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతిని కూడా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఉన్నప్పటికీ.. భారతదేశంపై ఆ ప్రభావం లేకుండా ప్రజలపై ఆర్థిక మాంద్యం భారం పడకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కోటగిరి సత్యనారాయణ, అసోసియేషన్ ప్రతినిధులు, ఢిల్లీలోని తెలుగు ప్రజలు పాల్గొన్నారు. -
పథకాలను కళ్లకు కట్టిన శకటాలు
సాక్షి, అమరావతి: విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో 76వ భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో పరేడ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా వేడుకలకు హాజరైన విద్యార్థులు, సాధారణ ప్రజానీకానికి ముఖ్యమంత్రి చిరునవ్వుతో అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ క్రమంలో కేరింతలు, నినాదాలతో చేతులు ఊపుతూ విద్యార్థులు, ప్రజలు సీఎంకు ప్రతిగా అభివాదం చేశారు. సాయుధ దళాల గౌరవ వందనాన్ని సీఎం జగన్ స్వీకరించారు. రెండో బహుమతి సాధించిన విద్యాశాఖ శకటం అబ్బురపరిచిన కవాతు ఈ వేడుకల్లో సాయుధ దళాల కవాతు చూపరులను అబ్బురపరిచింది. ఆద్యంతం నూతన ఉత్తేజాన్ని నింపింది. పల్నాడు జిల్లా అడ్మిన్ ఏఎస్పీ గరికపాటి బిందుమాధవ్ సాయుధ దళాల కవాతుకు నేతృత్వం వహించారు. ఏపీఎస్సీ 2వ బెటాలియన్ (కర్నూలు), 3వ బెటాలియన్ (కాకినాడ), 5వ బెటాలియన్ (విజయనగరం), 11వ బెటాలియన్ (కడప), 6వ బెటాలియన్ (మంగళగిరి), ఎన్సీసీ బాలబాలికలు, ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు, భారత్ స్కౌట్స్–గైడ్స్, రెడ్‌క్రాస్ సొసైటీ, ఏపీ సైనిక్ వెల్ఫేర్ శాఖ కంటిన్‌జెంట్లు కవాతులో పాల్గొన్నాయి. గురుకుల పాఠశాలలకు చెందిన బాలబాలికల కంటిన్‌జెంట్ల కవాతు చూపరులను ఆకట్టుకుంది. అలాగే, వివిధ ఏపీఎస్పీ బెటాలియన్లకు చెందిన కవాతు కూడా అలరించింది. ఆర్మ్డ్ విభాగం కవాతులో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఏపీఎస్పీ 5వ బెటాలియన్ మొదటి బహుమతిని, 2వ బెటాలియన్ ద్వితీయ బహుమతిని దక్కించుకున్నాయి. రెడ్‌క్రాస్ సొసైటీ మొదటి, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కంటిన్జెంట్ రెండో బహుమతి దక్కించుకున్నాయి. వీరికి సీఎం బహుమతులు అందజేశారు. మూడో బహుమతి పొందిన గృహనిర్మాణ శకటం సచివాలయాల శకటానికి మొదటి బహుమతి.. ఇక సీఎం వైఎస్ జగన్ సర్కార్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను కళ్లకు కట్టినట్లుగా శకటాల ప్రదర్శన సాగింది. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 15 శకటాల ప్రదర్శనలు గడిచిన మూడేళ్లలో ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధికి.. రాష్ట్ర ప్రగతికి అద్దంపట్టాయి. గ్రామ, వార్డు సచివాలయాల శాఖకు చెందిన ‘గడప గడపకు మన ప్రభుత్వం–ఇంటింటా సంక్షేమం’ శకటం మొదటి బహుమతిని కైవసం చేసుకుంది. విద్యాశాఖకు చెందిన మనబడి నాడు–నేడు శకటానికి రెండో బహుమతి, గృహ నిర్మాణ శాఖకు చెందిన నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు శకటానికి మూడో బహుమతి దక్కాయి. ఉత్తమ ప్రదర్శన కనబరిచిన శకటాల శాఖాధిపతులు, అధికారులకు సీఎం బహుమతులు అందజేశారు. ► మొదటి బహుమతి అందుకున్న సచివాలయాల శకటం గడిచిన మూడేళ్లలో సచివాలయాల వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో వచ్చిన మార్పులను తెలియజేసింది. నెలనెలా ఒకటో తేదీ ఉదయాన్నే లబ్ధిదారుల గుమ్మం వద్దనే ఠంచన్‌గా వలంటీర్లు పింఛన్ల పంపిణీ, సచివాలయాల ద్వారా ప్రజలకు అందుతున్న వివిధ రకాల సేవలు కళ్లకు కట్టాయి. ► విద్యాశాఖ శకటం నాడు–నేడు ద్వారా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు, సంస్కరణలతో కార్పొరేట్ స్థాయి హంగులతో ముస్తాబై ప్రభుత్వ పాఠశాల నమూనాతో ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ► ఇక తృతీయ బహుమతి అందుకున్న గృహ నిర్మాణ శాఖ శకటం నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా రాష్ట్రంలో ఇళ్లులేని పేదలకు చేస్తున్న మేలును తెలియజేసింది. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మంది పేదలకు ఇళ్ల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఊళ్లను నిర్మిస్తున్న తీరును వివరించింది. ఈ వేడుకల్లో సీఎం సతీమణి భారతిరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్‌శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్, ఏపీ జ్యుడిషియల్ ప్రివ్యూ చైర్మన్ జస్టిస్ బి. శివశంకరరావు, ఏపీ ఉన్నత విద్య రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ జస్టిస్ వి. ఈశ్వరయ్య, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసన మండలి చైర్మన్ మోషేన్‌రాజు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
రవీంద్ర భారతిలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు
-
Azadi Ka Amrit Mahotsav: పంజాబ్‌లో ఉగ్ర ముఠా గుట్టు రట్టు
చండీగఢ్: స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ ఉగ్రవాద ముఠాను పంజాబ్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీసులతో కలిసి చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో నలుగురు టెర్రరిస్టులను అరెస్టు చేశారు. వారినుంచి హాండ్ గ్రెనేడ్లు, అత్యాధునిక మందుపాతరలు, పిస్టళ్లు, 40 బులెట్లు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. ‘‘వీరికి పాకిస్తానీ నిఘా సంస్థ ఐఎస్ఐ మద్దతుంది. అంతేగాక కెనడా, ఆస్ట్రేలియాకు చెందిన కరడుగట్టిన భారత సంతతి గ్యాంగ్స్టర్లు అర్‡్ష డల్లా, గుర్జంత్ సింగ్‌లతోనూ సన్నిహిత సంబంధాలున్నాయి’’ అని వివరించారు. పంద్రాగస్టు సందర్భంగా పేలుళ్లకు పాల్పడి దేశంలో కల్లోలం సృష్టించాల్సిందిగా వీరికి ఆదేశాలున్నట్టు చెప్పారు. నలుగురినీ ఐదు రోజుల రిమాండ్‌లోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో చండీగఢ్‌లో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు. జైషే ఉగ్రవాది అరెస్టు లఖ్‌నవూ: జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న హబీబుల్ ఇస్లాం అలియాస్ సైఫుల్లా అనే 19 ఏళ్ల యువకున్ని యూపీ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ అరెస్టు చేసింది. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌కు చెందిన జైషే సభ్యులతో అతను సోషల్ మీడియా ద్వారా లింకులు పెట్టుకున్నట్టు తెలిపారు. సస్పెండెడ్ బీజేపీ నేత నుపుర్ శర్మ హత్య కోసం జైషే పంపిన మహ్మద్ నదీమ్‌ను ఇటీవల ఏటీఎస్ అరెస్టు చేసింది. అతనిచ్చిన సమాచారం ఆధారంగా సైఫుల్లాను అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొంది. ‘‘వర్చువల్ ఐడీలు సృష్టించడంలో సైఫుల్లా దిట్ట. నదీమ్‌తో పాటు పాక్, అఫ్గాన్‌కు చెందిన ఉగ్రవాదులకు 50కి పైగా వాటిని అందజేశాడు’’ అని వివరించింది. -
కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ్.. జాగ్రత్తలు పాటించండి
న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కోవిడ్ కేసులు సరాసరిన 15 వేలకు పైగా నమోదవుతున్నందున అప్రమత్తంగా ఉండాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ముఖ్యంగా ఈ స్వాతంత్య్ర వేడుకల సమయంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ నియమావళిని పాటించాలని కోరింది. ముందు జాగ్రత్తలు పాటిస్తూ, ఉత్సవాల సమయంలో పెద్ద సంఖ్యలో జనం గుమికూడకుండా చూసుకోవాలని కేంద్ర హోం శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. దీంతోపాటు, ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనేలా ప్రోత్సహిస్తూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలోని ఒక ప్రముఖ ప్రాంతంలో పదిహేను, నెల రోజులపాటు కొనసాగించాలని పేర్కొంది. ప్రభుత్వ విభాగాలు, విద్యాసంస్థలు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని కూడా కోరింది. -
విక్టోరియా స్మారక చిహ్నం పై డ్రోన్ల కలకలం...
న్యూఢిల్లీ: కోల్‌కతాలో స్వాత్రత్య్ర దినోత్సవ వేడుకలకు ముందే ఇద్దరు బంగ్లదేశ్ పౌరులు విక్టోరియా స్మారక చిహ్నం పై డ్రోన్లు ఎగరువేశారు. దీంతో భారత్ హై కమాండ్ ఒక్కసారిగా అలర్ట్ అయ్యింది. దీంతో ఆ ఇద్దరు బంగ్లాదేశ్ పౌరులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. భారీ కంటైనర్లలో పెద్ద మొత్తంలో ఆయుధ సామాగ్రి, పేలుడు పదార్థాలను తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో సుమారు ఆరుగురు అనుమానితుల్ని అదపులోకి తీసుకుని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....మీరట్ జైలులో ఉన్న అనిల్ గ్యాంగ్ స్టర్‌కి ఈ ఆపరేషన్‌లో ప్రమేయం ఉన్నట్లు చెబుత్నున్నారు. ఈ మేరకు జౌన్‌పర్ నివాసి సద్దాం కోసం అనిల్ ఉత్తరాఖండ్‌లోని డెహ్రుడూన్‌లోని గన్‌హౌస్ నుంచి ఈ ఆయుధాల కంటైనర్లను సిద్ధం చేశాడని తెలిపారు. అంతేకాదు ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్న ఆరుగురిలో ఒకరు గన్‌హౌస్ యజమాని. దీన్ని ఉగ్రవాదుల కుట్రగా అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులు ఆగస్టు 6న ఆనంద్ విహార్ ప్రాంతంలో ఓ ఆటో డ్రైవర్‌తో సహా అనుమానస్పద స్థితిలో ఇద్దరు వ్యక్తులు రెండు బరువైన బ్యాగులను తరలిస్తున్నట్లు సమాచారం అందిందని తెలిపారు. దీంతో తాము వారిని అదుపులోకి తీసుకుని ఆయుధాలతో కూడిన కంటైనర్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఆయుధాలను లక్నోకు సరఫరా చేయన్నుట్లు విచారణలో తేలిందని చెప్పారు. అలాగే స్మారక చిహ్నంపై డ్రోన్లు ఎగరువేసిన బంగ్లాదేశ్ పౌరులు మహ్మద్ షిఫాత్, మహ్మద్ జిల్లూర్ రెహమాన్‌లుగా గుర్తించామని చెప్పారు. ఆ వ్యక్తులు స్మారక చిహ్నం పై డ్రోన్లు ఎగరు వేయడమే కాకుండా పరిసరాల్లో ఫోటోలు తీస్తుండటంతో సీఎస్ఎఫ్ పోలీసులు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ ఘటనలతో భారత ప్రభుత్వం అప్రమత్తమై గట్టి బంధోబస్తు ఏర్పాటు చేసింది. అదీగాక స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముందుగానే దేశవ్యాప్తంగా గట్టి భద్రతను కట్టుదిట్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించడం తోపాటు, తనీఖీలు కూడా ముమ్మరం చేశారు. అంతేకాకుండా మెట్రో స్టేషన్లు, విమానాశ్రయాలు, మార్కెట్లతో సహా అన్ని ప్రజా సందోహం ఎక్కువగా ఉండే అన్ని ప్రాంతాల్లో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. -
7 గంటలు.. 75 సార్లు..
సప్తగిరికాలనీ(కరీంనగర్): కృషి ఉంటే సాధించనిది ఏదీ లేదని నిరూపించింది కరీంనగర్ జిల్లాకేంద్రంలోని విద్యానగర్‌కు చెందిన పండుగ అర్చన. 75వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ఆజాదికా అమృత్ మహోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయగీతం జనగణమన ఐదు చరణాల్లో 7 గంటల్లో 75 సార్లు పాడింది. కరీంనగర్‌లోని ఓ హోటల్ వేదికగా జరిగిన కార్యక్రమంలో ఈ ఘనత సాధించిన అర్చన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సాధించింది. నగరానికి చెందిన పండుగ కీర్తి కుమార్, దేవపాలా కూతురు అర్చన. ఐదోతరగతి నుంచే జెండా పండుగల్లో జాతీయ గీతాన్ని ఆలపించేది. నాలుగు పీజీలు పూర్తిచేసిన అర్చన నగరంలోని ఓ ప్రయివేటు కళాశాల వైస్‌ప్రిన్సిపాల్‌గా ఉద్యోగం చేస్తోంది. అర్చనను సన్మానిస్తున్న సీపీ సత్యనారాయణ లాక్డౌన్ తెచ్చిన ఆలోచన చిన్నప్పటి నుంచే దేశభక్తి భావాలు అధికంగా ఉన్న అర్చన 2020లో వచ్చిన కరోనా లాక్డౌన్ సరికొత్త ఆలోచనను తీసుకొచి్చంది. లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన అర్చన జాతీయ గీతాన్ని ఆలపించే సంకల్పాన్ని పెట్టుకుంది. ఈ అంశంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాలంటే ఏం చేయాలనే పలువురి సలహాలు తీసుకుంది. ఏడాదికాలంగా సీరియస్‌గా సాధన చేసింది. శనివారం జరిగిన కార్యక్రమంలో సంపూర్ణ జనగణమనను ఐదు చరణాల్లో 75 సార్లు 7 గంటల పాటు పాడి రికార్డుకెక్కింది. మన జాతీయగీతానికి ఉన్న పవిత్రతను ప్రపంచానికి చాటేందుకే ఈ కార్యక్రమం చేసినట్లు అర్చన తెలిపింది. మరిన్ని రికార్డులు సాధించాలి అంతకుముందు ఉదయం ఈ కార్యక్రమాన్ని మాజీ మేయర్ రవీందర్‌సింగ్ ప్రారంభించారు. అనంతరం అర్చనను పోలీస్ కమిషనర్ సత్యనారాయణ శాలువాతో సత్కరించారు. పట్టుదలతో జాతీయ గీతాన్ని పాడి మన జాతీయ గీతానికి ఉన్న మహాత్యాన్ని తేలియజేసేలా ప్రయత్నం చేస్తున్న అర్చన రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులు సాధించాలని ఆకాంక్షించారు. ముగింపు కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్ హాజరై అర్చనను అభినందించారు. చొప్పరి జయశ్రీ, గుంజపడుగు హరిప్రసాద్, సాదవేణి వినయ్, పొన్నం అనిల్‌గౌడ్, తిరుపతి, కుమార్, భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం జగన్
సాక్షి, న్యూఢిల్లీ: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఏర్పాటైన కమిటీతో ప్రధాని నరేంద్రమోదీ బుధవారం వివిధ రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళిసై, టీఎస్ సీఎం చంద్రశేఖర్ రావు (కేసీఆర్), వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, పార్టీల నాయకులు, ఆధ్యాత్మిక వేత్తలు, కళాకారులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్ ప్రసంగిస్తూ.. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న చర్యల్లో ఆజాదీ కా అమృత్‌మహోత్సవ్ అత్యంత ప్రశంసనీయమైందన్నారు. సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక రంగాల్లో గడిచిన 75 సంవత్సరాల్లో దేశం సాధించిన ప్రగతిని గుర్తు చేసుకోవడానికి, అంతేకాదు ప్రగతి పథంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మరోసారి మన అంకితభావాన్ని పునరుద్ఘాటించడానికి అమృత్ మహోత్సవ్ వేదిక కల్పిస్తోందన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ► స్వతంత్ర పోరాట యోధుల నిస్వార్థతను చూసి మనం అంతా గర్వించాలి. అమృత్ మహోత్సవ్ సందర్భంగా వారిని గౌరవించుకోవాలి, వారికి సెల్యూట్ చేయాలి. ఏపీలో స్వాతంత్య్ర సమర యోధులను ఈ సందర్భంగా గౌరవించుకునే అవకాశం నాకు కలిగింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య కుమార్తె సీతా మహాలక్ష్మిని వారి స్వగ్రామంలో కలుసుకున్నాను. జాతీయ పతాకాన్ని పింగళి వెంకయ్య రూపొందించారు. 1921లో ఆయన తాను రూపొందించిన పతాకాన్ని మహాత్మగాంధీకి విజయవాడలో సమర్పించారు. ప్రస్తుతం ఇది బాపు మ్యూజియంలో ఉంది. మా ప్రభుత్వం ఇటీవలి కాలంలో ఈ మ్యూజియంను బాగు చేసి ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి తీసుకువచ్చింది. ► ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఆంధ్రకేసరి ప్రకాశం పంతులుగారు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, అయ్యదేవర కాళేశ్వరరావుగారు, వావిలాల గోపాలకృష్ణయ్య మరెంతో మంది ప్రముఖులు సేవలను గుర్తుచేసుకుంటూ ప్రతివారం వర్చువల్, భౌతికంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకూ 908 కార్యక్రమాలు నిర్వహించాం. నిస్వార్థపరులైన స్వాతంత్య్ర సమరయోధులను గుర్తుచేసుకోవడమే కాదు, వారి జీవితాల నుంచి ఈ తరం యువకులు స్ఫూర్తిని పొందుతున్నారు. ఈ కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేయడంద్వారా వారిలో దేశభక్తిని నింపుతున్నాం. ► గడిచిన కాలంలో మనదేశం నడిచిన మార్గాన్ని మరోసారి అవలోకనం చేసుకునేందుకు ఈ కార్యక్రమం మంచి అవకాశాన్ని కల్పించింది. గడిచిన 75 సంవత్సరాల్లో, ముఖ్యంగా ఈ ఏడున్నర సంవత్సరాల్లో ఈ దేశం చాలా ప్రగతిని సాధించింది. రియల్ జీడీపీ 1950–51లో రూ.2.94 లక్షల కోట్లు ఉంటే, 2019–20 నాటికి రూ. 145.69 లక్షల కోట్లకు చేరుకుంది. తద్వారా ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది. ► ఈ పరిస్థితుల్లో మనం నడుస్తున్న మార్గంలో అనేక అవకాశాలూ ఉన్నాయి, అనేక సవాళ్లు కూడా ఉన్నాయి. మన దేశ సమర్థతను చాటడానికి రెండు ప్రధాన అంశాల మీద దృష్టి పెట్టాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తిచేస్తున్నాను. 1. సుస్థిర ప్రగతి 2. ఆర్థిక అసమానతలను తొలగించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ► దేశ ఆర్థిక పురోగతి ద్వారా ఇప్పుడున్నవారు ప్రస్తుతం తమ అవసరాలను తీర్చుకుంటున్నారు. అయితే భవిష్యత్తు తరాలు కూడా తమ అసరాలను తీర్చుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదు. ► దేశ సామాజిక, ఆర్థిక ప్రగతిలో ఇంధన రంగం కీలక పాత్ర పోషిస్తుంది. గడిచిన 15 ఏళ్లుగా దేశంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 1,27,423 మెగావాట్ల నుంచి 3,84,116 మెగావాట్లకు పెరిగింది. ముఖ్యంగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 84,982 మెగావాట్ల నుంచి 2,34,058 మెగావాట్లకు పెరిగింది. దీనివల్ల కాలుష్యకారక వాయువులు వెలువడుతున్నాయి. ఇది భవిష్యత్తు తరాలకు అత్యంత ప్రమాదకరం. బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని క్రమంగా తొలగించి ఆస్థానంలో సహజ వనరులనుంచి విద్యుత్ ఉత్పత్తిని పెంచాల్సిన బాధ్యత ఉంది. సహజ వనరులనుంచి ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను స్టోరేజ్ చేసుకునే విషయంలో పరిష్కారాలను సత్వరం సాధించాల్సి ఉంది. కార్బన్ న్యూట్రాలిటీని సాధించడంతోపాటు అవసరాలకు అనుగుణంగా విద్యుత్‌ను ఉత్పత్తిచేయడంలో ఇది అత్యంత అవసరం. సుస్థిర ఆర్థిక ప్రగతి దిశగా స్వచ్ఛ విద్యుత్‌ను ఉత్పత్తిచేసే విషయంలో ఒకే సూర్యుడు (ఒన్ సన్), ఒకే ప్రపంచం (ఒన్ వరల్డ్), ఒకే గ్రిడ్ (ఒన్ గ్రిడ్) దిశగా ప్రధాన మంత్రి తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమైనవి. ► భౌగోళికంగా రెండు కాలమానాలున్న ప్రాంతాలమధ్య విద్యుత్ పంపిణీ ఉండాలి. ఇవ్వాళ్టికి ఇది ఒక కల కావొచ్చు. కాని మరొక వాస్తవ విషయం ఏంటంటే.. ఖండాల మధ్య డేటాను పంపడానికి ఇప్పటికే ఆప్టికల్ ఫైబర్‌నెట్ వ్యవస్థ ఉంది. ఇదే తరహాలో ఖండాలను కలుపుతూ పవర్ గ్రిడ్ అన్నది తీరని కల కాకూడదు. ► ఇక ఆర్థిక అసమానతలను తొలగించడంపైన ప్రత్యేక దృష్టిపెట్టాలి. గడిచిన నాలుగు దశాబ్దాలుగా ఆర్థిక అసమానతలను రూపుమాపడంలో చాలా మంచి నిర్ణయాలు అమలు చేశారు. ఉచితంగా విద్య, ఆహార భద్రతలను చట్టబద్ధంచేశారు. ప్రధాని నాయకత్వంలో గ్రామాలను పెద్ద ఎత్తున విద్యుదీకరించారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రతలపై కేంద్రప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. కాని ఒక సమస్య నిరంతరం మనల్ని వెంటాడుతోంది. ► ఈ దేశంలో పేదరికాన్ని రూపు మాపడానికి ప్రస్తుతం ఉన్న ఆర్థిక ప్రగతి సరిపోవడంలేదు. ప్రపంచంలో అసమానతలపై తాజాగా వచ్చిన నివేదిక ప్రకారం జాతీయ ఆదాయంలో 57శాతం.. 10శాతం మంది చేతిలోనూ, 22 శాతం 1 శాతం చేతిలో ఉందని చెప్తోంది. ఆర్థిక అసమానతల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో రుణభారాన్ని పెంచుతాయి, కొనుగోలు శక్తి తగ్గుతుంది. అత్యంత తీవ్రమైన ఈ సమస్య పట్ల విధాన రూపకర్తలమైన మనం అంతా దృష్టిసారించాల్సి ఉంది. సమగ్ర ఆర్థికాభివృద్ధి దిశగా ఉన్న సమస్యలను గుర్తించి, వాటిని తొలగించాలి. చదవండి: సీఎం జగన్ కడప జిల్లా పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే -
కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే నియామకాలు : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే ఉద్యోగ నియామకాలు చేపడతామని తెలంగాణా సీఎం కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణను వెంటాడుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ ఆత్మ విశ్వాసం, సానుకూల దృక్పథంతో ముందడుగు వేస్తోందని అన్నారు. ఉత్పత్తుల రంగంలో ముందువరుసలో తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నగరంలోని చారిత్రాత్మక గోల్కొండ కోటలో గురువారం ఆయన జాతీయ జెండాను ఎగరవేశారు. ఆ తరువాత రాష్ట్ర పోలీసుశాఖ ద్వారా గౌరవవందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి చర్యలు చేపడతామని చెప్పారు. స్వచ్ఛతే లక్క్ష్యంగా 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని అన్నారు. రాష్ట్రంలో శాంతి సామరస్యం వెల్లివెరిస్తున్నాయని తెలిపారు. వాడని బోరుబావులు ఎక్కడ ఉన్నా మూసివేయాలని కోరారు. ఐదేళ్లుగా సుస్థిర ఆర్ధికాభివృద్ధిని సాధిస్తున్నామని చెప్పారు. -
మోదీ మరో నినాదం : ఈజ్ ఆఫ్ లివింగ్
సాక్షి, న్యూఢిల్లీ : 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్ధేశించి సుదీర్ఘంగా ప్రసంగించారు. సులభతర వాణిజ్యమే (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) కాకుండా సులభతర జీవనం (ఈజ్ ఆఫ్ లివింగ్) కూడా అవసరమని ప్రధాని స్పష్టం చేశారు. ప్రజల జీవితాల్లో ప్రభుత్వ జోక్యం తగ్గాలని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ అన్ని రంగాల్లో దూసుకుపోయేలా హైజంప్ చేయాల్సిన అవసరం నెలకొందని అన్నారు. రోజులు మారుతున్నాయని అందుకు తగ్గట్టుగా మనం మారాలని పిలుపు ఇచ్చారు. సంపద సృష్టితోనే సమస్యలు దూరమవుతాయని స్పష్టం చేశారు. దేశ మౌలిక రంగంలో కోటి కోట్ల పెట్టుబడులు పెడతామని వెల్లడించారు. -
అమెజాన్ ఫ్రీడం సేల్ ప్రారంభం, ఆఫర్ల వెల్లువ
అమెజాన్ ఇండియా తన ఫ్రీడం సేల్‌ను నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమైంది. ఈ సేల్, ఆగస్టు 12 అర్థరాత్రి వరకు కొనసాగనుంది. 72వ స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు అమెజాన్ ఈ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా మొబైల్స్, నోట్‌బుక్స్, హోమ్ ఎంటర్టైన్మెంట్ గాడ్జెట్లు, ఆడియో యాక్ససరీస్ ఉత్పత్తులపై డజన్ల కొద్దీ డీల్స్‌ను అమెజాన్ ఆఫర్ చేస్తోంది. ఎక్స్చేంజ్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ స్కీమ్‌లు ఈ సేల్‌లో భాగం కానున్నాయి. ఈ సేల్‌లో ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను అమెజాన్ ఆఫర్ చేస్తోంది. యూపీఐ, నెట్‌బ్యాంకింగ్, ఇతర ఆన్లైన్ పేమెంట్ విధానాల ద్వారా జరిపే అమెజాన్ పే బ్యాలెన్స్‌లపై 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తోంది. అమెజాన్ ఫ్రీడం సేల్‌లో స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు హానర్ 7ఎక్స్ 64జీబీ స్టోరేజ్ వేరియంట్ డిస్కౌంట్ ధరలో రూ.10,999కే లభ్యమవుతుంది. దీని ఎంఆర్పీ 16,999 రూపాయలు. పాత స్మార్ట్ఫోన్ల ఎక్స్చేంజ్పై 7600 రూపాయల తగ్గింపును అమెజాన్ ఆఫర్ చేస్తోంది. శాంసంగ్ గెలాక్సీ నోట్ 8ను, అమెజాన్ తన సేల్‌లో రూ.55,900కు ఆఫర్ చేస్తోంది. హువావే పీ20 లైట్ కూడా డిస్కౌంట్ ధరలో రూ.16,999కు అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ 6, రియల్‌మి 1 6జీబీ, హానర్ 7ఎక్స్, మోటో జీ6, శాంసంగ్ గెలాక్సీ నోట్ 8, హువావీ పీ20 లైట్, హానర్ 7సీ, మోటో ఈ5 ప్లస్, శాంసంగ్ గెలాక్సీ ఆన్7 ప్రైమ్, వివో నెక్స్, నోకియా 6.1, ఒప్పో ఎఫ్5, ఎల్జీ వీ30లాంటి మొబైల్స్‌పై ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. పీసీ యాక్ససరీస్‌పై ప్రైమ్ మెంబర్లకు 60 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు అమెజాన్ అంతకముందే టీజ్ చేసిన సంగతి తెలిసిందే. మొబైల్ ఫోన్లు, యాక్ససరీస్‌పై 40 శాతం వరకు, రోజువారీ వస్తువులు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్‌పై 50 శాతం వరకు, ఫ్యాషన్ ప్రొడక్ట్‌లపై 50 నుంచి 80 శాతం వరకు, హోమ్, అవుట్డోర్ పరికరాలపై 70 శాతం వరకు తగ్గింపును ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది. -
అసెంబ్లీలో ఘనంగా జెండావందనం
జెండా ఆవిష్కరించిన స్పీకర్ సాక్షి, హైదరాబాద్: శాసనసభలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. స్పీకర్ మధుసూదనా చారి జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకు ముందు అసెంబ్లీలోని అంబేడ్కర్, మహాత్మాగాంధీ విగ్రహాలకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత జాతి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించా రన్నారు. ఇక శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ భవన్లో హోంమంత్రి టీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి జెండా ఎగుర వేశా రు. ఇందులో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, పోలీస్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ పాల్గొన్నారు. పేదల సంక్షేమానికి సీఎం అనేక సంక్షేమ పథకాలు చేపట్టారని, రాష్ట్రంలో విద్యుత్ సమస్య లేకుండా చేశారని నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. మగ్దూం భవన్లో చాడ సీపీఐ కార్యాలయం మగ్దూం భవన్లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి జాతీయ పతా కాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. బంధుప్రీతి, అవినీతి అంతమైన రోజునే నిజమైన స్వాతంత్య్రమని ఆయన అన్నారు. -
మధుయాష్కీ మతి భ్రమించింది : బాల్క సుమన్
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం కేసీఆర్ ప్రసంగం తప్పుల తడక అని విమర్శించిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి మధుయాష్కీపై ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలనే సీఎం ప్రస్తావించారని, మధుయాష్కీ మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్, కేవీపీలు బినామీ వ్యాపారాలు చేస్తున్నారంటూ యాష్కీ వ్యాఖ్యానించడం పై మంగళవారమిక్కడ స్పందిస్తూ... ఆధారాలుంటే నిరూపించాలని, లేదంటే నోరు మూసుకోవాలన్నారు. సంఘ వ్యతిరేక శక్తిగా మారిన నయీమ్‌ను గత ప్రభుత్వాలే పెంచి పోషించాయని సుమన్ ఆరోపించారు. -
హెచ్ఎం భర్తకు ప్రభుత్వ ఉద్యోగం
ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి హామీ పూడూరు: స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు చేస్తూ విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయిన ప్రధానోపాధ్యాయురాలు ప్రభావతి భర్తకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం ఉమ్మెంతాల్ లో ప్రభావతి కుటుం బాన్ని ఆయ న పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ ప్రభావతి భర్త రాజీవ్‌రెడ్డికి నెలరోజుల్లోగా ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఆమె కూతుళ్లు ఉన్నత చదువులు చదివేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభావతిలాంటి ఉత్తమ టీచర్ల వల్లే విద్యావ్యవస్థ బాగా పనిచేస్తోందని కితాబిచ్చారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఎక్స్‌గ్రేషియాను అందించేలా సీఎం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. గాయాలపాలైన విద్యార్థుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. స్కూళ్లలో ప్రమాదకర పరిస్థితులను గుర్తించండి: విద్యాశాఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలల పరిసరాల్లో ప్రమాదకర పరిస్థితులు ఎక్కడెక్కడ ఉన్నాయన్న లెక్కలు తేల్చాలని విద్యాశాఖ నిర్ణయించింది. పాఠశాలలను ఆనుకొని ప్రమాదాలకు ఆస్కారం ఉన్న బావులు, విద్యుత్ తీగలు వంటి వాటి వివరాలను సేకరించాలని డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజుల కింద రంగారెడ్డి జిల్లా మేడికొండ ప్రభుత్వ పాఠశాలలో జెండా రాడ్‌కు విద్యుత్ తీగ తగిలి ప్రధానోపాధ్యాయురాలు ప్రభావతమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో విద్యాశాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది. -
కోర్టులకొచ్చేందుకు నేటికీ అత్యధికుల సంశయం
* 10 శాతం మంది మాత్రమే న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు * దీన్ని మార్చి.. సత్వర న్యాయం అందేలా చూడాలి * ఈ బాధ్యత న్యాయమూర్తులు, న్యాయవాదులపై ఉంది * స్వాతంత్య్ర వేడుకల్లో ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్ * పలువురు సీనియర్ న్యాయవాదులకు ఘన సన్మానం సాక్షి, హైదరాబాద్: దేశంలో అత్యధిక శాతం మంది ప్రజలు తమ హక్కుల విషయంలో న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు ఇప్పటికీ సంశయిస్తున్నారని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ పేర్కొన్నారు. కేవలం 10 శాతం మంది మాత్రమే వివాదాలు, సమస్యల పరిష్కారానికి న్యాయస్థానాల మెట్లు ఎక్కుతున్నారని తెలిపారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చి అవసరమైన ప్రతి ఒక్కరికీ న్యాయం అందించడమే కాకుండా అది సత్వరమే అందేలా చూడాల్సిన బాధ్యత న్యాయమూర్తులు, న్యాయవాదులపై ఉందన్నారు. సోమవారం హైకోర్టు ప్రాంగణంలో 70వ స్వాతంత్య్ర దిన వేడుకలు జరిగాయి. ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన వారిలో అత్యధికులు న్యాయవాదులే అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీతోపాటు మొదటి గవర్నర్ జనరల్ రాజగోపాలచారి, మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, మొదటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ, మొదటి ఉప ప్రధాన మంత్రి, హోంమంత్రి సర్ధార్ వల్లభ్‌భాయ్ పటేల్, మొదటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ తదితరులు ప్రముఖ న్యాయవాదులేనని ఏసీజే గుర్తుచేశారు. వారి త్యాగాల ఫలితమే ఇప్పుడు దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటోందన్నారు. ఆ త్యాగాలను సదా స్మరించుకోవాలన్నారు. న్యాయం ఎవరికైతే అవసరమో వారికి న్యాయం అందించడంతోపాటు దానిని వేగంగా కూడా అందించాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థపై ఉందన్నారు. ఈ విషయంలో సీనియర్ న్యాయవాదులు తమ వంతు పాత్ర పోషించాలన్నారు. జూనియర్ న్యాయవాదులకు వారు తమ అనుభవనాలు, జ్ఞానాన్ని పంచాలని కోరారు. కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తులు పాల్గొన్నారు. ఏపీ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, తెలంగాణ అదనపు ఏజీ జె.రామచంద్రరావు, ఏపీ, తెలంగాణ హైకో ర్టు న్యాయవాదుల సంఘాల అధ్యక్షుడు సి.నాగేశ్వరరావు, జి.మోహనరావు తదితరు లు ప్రసంగించారు. వార్షిక పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన హైకోర్టు సిబ్బంది పిల్లలకు జస్టిస్ రమేశ్ రంగనాథన్ దంపతులు బహుమతులు ప్రదానం చేశారు. సీనియర్ న్యాయవాదులకు సన్మానం... ఉభయ రాష్ట్రాలకు చెందిన పలువురు సీనియర్ న్యాయవాదులను ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్ ఘనంగా సన్మానించారు. గత 55 ఏళ్ల నుంచి సీనియర్ న్యాయవాదులుగా న్యాయవ్యవస్థకు ఎనలేని సేవలందిస్తున్నందుకు హైకోర్టు వారిని సన్మానిం చింది. సన్మానం అందుకున్న వారిలో ఎ.పుల్లారెడ్డి, టి.బాల్‌రెడ్డి, కె.ప్రతాప్‌రెడ్డి, పి.బాలకృష్ణమూర్తి, బి.వి.సుబ్బయ్య, బత్తుల వెంకటేశ్వరరావు, ఇ.మనోహర్, కోకా రాఘవరావు, కె.వి.సత్యనారాయణ, సుబ్రహ్మణ్య నరసు తదితరులున్నారు. -
రాజ్‌భవన్‌లో స్వాతంత్య్ర వేడుకలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: భారతదేశ 70 స్వాతంత్య్ర దినోత్సవ వేడుక లు రాజ్‌భవన్‌లో సోమవారం ఘనంగా సాగాయి. ఈ సందర్భంగా గవర్నర్ కొణిజేటి రోశయ్య వివిధ రంగాల ప్రముఖులను కలుసుకున్నారు. త్రివిధ దళాధిపతులు, అధికార, అనధికార ప్రముఖులు హాజరయ్యారు. అలాగే నగరంలోని తెలుగు ప్రముఖులు సైతం రోశయ్యను కలిసి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. న్యాయమూర్తులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ యూనివర్సిటీల వైస్ చాన్సలర్లు, ఇతర ప్రముఖులు తమకు కేటాయించిన స్థలాల్లో ఆశీనులై ఉండగా ఉదయం 11 గంటల సమయంలో గవర్నర్ రోశయ్య ప్రముఖుల ముందుకు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామమోహన్‌రావు సైతం గవర్నర్ సరసన ఆశీనులుకాగా ప్రముఖులంతా వరుసగా వచ్చి గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా పలకరించారు. గవర్నర్ సైతం అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ చిరునవ్వుతో పలకరించారు. అనంతరం రాజ్‌భవన్ ప్రాగంణంలోని వేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన గవర్నర్ రోశయ్య ప్రదర్శనలు చేసిన కళాకారులను సత్కరించారు. వేడుకలకు హాజరైన ప్రముఖులకు గవర్నర్ విందునిచ్చారు. రాజ్‌భవన్ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి జయలలిత హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. తెలుగు ప్రముఖులు : రాజ్‌భవన్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నగరంలోని తెలుగు ప్రముఖులు హాజరై గవర్నర్ కే రోశయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. ఆస్కా సంయుక్త కార్యదర్శి, ప్రముఖ ఆడిటర్ జేకే రెడ్డి, అస్కా మేనేజింగ్ ట్రస్టీ ‘అజంతా’ శంకరరావు, ట్రస్టీ కార్యదర్శి స్వర్ణలతారెడ్డి, ఆస్కా సీనియర్ సభ్యులు ఎరుకలయ్య, మదనగోపాల్, ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్‌కుమార్ రెడ్డి, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు తంగుటూరి రామకృష్ణ, దక్షిణ భారత వైశ్య సంఘం అధ్యక్షులు ఎంవీ నారాయణ గుప్తా, ద్రవిడ దేశం అధ్యక్షులు కృష్ణారావు, చెన్నైపురి ట్రస్ట్ అధికార ప్రతినిధి పొన్నూరు రంగనాయకులు, ఏఐటీఎఫ్ అధ్యక్షులు డాక్టర్ సీఎంకే రెడ్డి, న్యూటెక్ కనస్ట్రక్షన్స్ అధినేత నాగిరెడ్డి, టామ్స్ వ్యవస్థాపకులు గొల్లపల్లి ఇజ్రాయల్, వైశ్య ప్రముఖులు త్రినాధ్ తదితరులు హాజరైనవారిలో ఉన్నారు. అమ్మ చేతుల మీదుగా అవార్డుల ప్రదానం : వివిధ రంగాల్లో విశేష ప్రజ్ఞ కనబరిచిన, సేవలు అందించిన వారికి ముఖ్యమంత్రి జయలలిత వివిధ ప్రముఖుల పేర్లతో అవార్డులను ప్రదానం చేశారు.స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు వీరందరినీ ఆహ్వానించి అవార్డులను అందజేశారు. చెన్నైలోని కేంద్ర చర్మపరిశోధక సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ షణ్ముగంకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ అవార్డు కింద రూ.5 లక్షల చెక్కు, 8 గ్రాముల బంగారుపతకం, ప్రశంసాపత్రం అందజేశారు. నామక్కల్‌కు చెందిన జయంతికి వ్యోమగామి దివంగత కల్పనాచావ్లా అవార్డు కింద రూ.5 లక్షల చెక్కు, రూ.5వేల విలువైన బంగారు పతకం, ప్రశంసాపత్రం బహూకరించారు. మహామహం ఉత్సవాల ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించినందుకు ప్రశంసగా తంజావూరు జిల్లా అప్పటి కలెక్టర్ సుబ్బయ్యన్, పోలీస్ సూపరింటెండెంట్ మయిల్‌వాహనన్ రూ.2లక్షల చెక్కును అందుకున్నారు. గ్రామీణ పారిశుధ్య బహుమతిగా రూ.2 లక్షల చెక్కును మంత్రి ఎస్పీ వేలుమణి, ఆ శాఖ కార్యదర్శి, డెరైక్టర్ అందుకున్నారు. ఆన్లైన్లో సేవలపై రెవెన్యూ మంత్రి ఉదయకుమార్ అవార్డు అందుకున్నారు. దైవాంగుల సంక్షేమానికి విశేషంగా పాటుపడిన డాక్టర్ రాజా కన్నన్ రూ.10 గ్రాముల బంగారుపతకం, ప్రశంసాపత్రం పొందారు. ఉత్తమ సామాజిక కార్యకర్తగా ఎంపీ మహమ్మద్ రబీక్ అవార్డును పొందారు. ఉత్తమ స్థానిక సంస్థలు : రాష్ట్రంలో పలు స్థానిక సంస్థలు ముఖ్యమంత్రి అ వార్డును అందుకున్నాయి. రూ.25 లక్షల చెక్కు, ప్రశంసాపత్రంతో దిండుగల్లు కార్పొరేషన్ ఉత్తమ అవార్డును అందుకుంది. మునిసిపాలిటీల్లో ప్రథమ బహుమతి పట్టుకోట్టై (రూ.15లక్షలు) రెండో బహుమతి పెరంబలూరుకు (రూ.10లక్షలు), మూడో బహుమతి రామనాధపురంకు (రూ.5లక్షలు) దక్కింది. ఉత్తమ పంచాయితీగా పరమత్తివేలూరు (రూ.10లక్షలు), ద్వితీయ బహుమతి చిన్నసేలం (రూ.5లక్షలు), మూడవ బహుమతి పెరియనాయకన్నపాళయం (రూ.3లక్షలు) అందుకున్నాయి. ఉత్తమ సహకార బ్యాంకు అవార్డును సేలం కేంద్ర స హకార బ్యాంకు సాధించుకుంది. స్వా తంత్య్ర దినోత్సవం సందర్భంగా దైవాగులైన చిన్నారులకు సీఎం జయలలిత మిఠాయిలు పంచిపెట్టారు. అసెంబ్లీ స్పీకర్ ధనపాల్, ఆర్థిక మంత్రి పన్నీర్‌సెల్వం సహపంక్తి భోజనం చేశారు. -
నీళ్లు.. నిధులు
మెతుకుసీమ సౌభాగ్యం జిల్లాకు 3 నీటిపారుదల ప్రాజెక్టులు రాజధాని తాగునీటికి ప్రత్యామ్నాయం సింగూరు నీరు మనమే వాడుకుందాం! ‘మెదక్’.. 3 జిల్లాలు కాబోతోంది విద్య, వైద్యం, రోడ్ల మెరుగుకు పుష్కలంగా నిధులు 60 టీఎంసీల సామర్ధ్యంతో మూడు ప్రాజెక్టులు మెదక్‌లోనే హైదరాబాద్ తాగునీళ్ల నీటి అవసరాలకు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేస్తున్నాం సింగూరు నీళ్లు కూడా మనమే ఉపయోగించుకుందాం మెదక్‌ను మూడు జిల్లాలుగా పునర్విభజన 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘గోదావరి పారాలి.. బీడు భూములు తడవాలి. తెలంగాణను కోటి ఎకరాల మాగాణి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైన్ చేశారు. 50 టీఎంసీలతో మల్లన్నసాగర్, 7 టీఎంసీలతో కొండ పోచమ్మ, 3 టీఎంసీలతో రంగనాయక్ సాగర్ ప్రాజెక్టులను నిర్మిస్తున్నాం. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక సింగూరు నీళ్లు కూడా మనకే ఉపయోగపడతాయి’అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రకటించారు. సోమవారం జిల్లా కేంద్రం సంగారెడ్డిలో జరిగిన 70వ స్వాతంత్ర దినోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసు పరేడ్‌గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. పుష్కలంగా నీళ్లు, నిధులతో మెతుకుసీమను సౌభాగ్యసీమగా తీర్చిదిద్దేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే.. కొత్తగా మూడు జిల్లాలు ‘ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మరో శుభవార్త కూడా పంచుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా సంగారెడ్డితో పాటు మెదక్, సిద్దిపేట ప్రాంతాలను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఉద్యమ స్ఫూర్తితో ప్రజలు హరితహారంలో భాగం పంచుకోవటం సంతప్తి నిచ్చింది. ప్రతి ఒక్కరిలో మొక్కలు నాటాలనే చైతన్యం రావటం సంతోషకరం. జిల్లాలో ఈ ఏడాది 3.43 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యమైతే.. ఇప్పటికి 2.25 కోట్ల మొక్కలు నాటాం. నాటిన మొక్కలను సంరక్షించుకోవటమూ ముఖ్యమే. బతకటానికి మనిషికి నీళ్లెంత అవసరమో, మొక్కలకూ అంతే అవసరం. అధికారులు ఎండాకాలంలో ప్రజల గొంతు ఎండకుండా ఎలాగైతే చర్యలు తీసుకున్నారో.. మొక్కల సంరక్షణకూ అలాంటి ఏర్పాట్లే చేయాలి. రాష్ట్ర స్థాయి హరితమిత్ర అవార్డుకు ఎంపికైన సిద్దిపేట మున్సిపల్ పాలవర్గానికి అభినందనలు. విద్యుత్తు మెరుగుకు రూ.800 కోట్లు నీటిపారుదల, విద్యుత్తు రంగాల్లో పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు బాగా సహకరిస్తున్నాయి. సంక్షేమ రంగంలో మనం సాధించిన ప్రగతి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. మెదక్ జిల్లాలో పారిశ్రామిక, వ్యవసాయ, గృహ అవసరాలకు నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు ఈ రెండేళ్లలో రూ.800 కోట్లు ఖర్చు చేసి విద్యుత్తు అభివృద్ధి పనులు చేపట్టాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ములుగులో హర్టీకల్చర్ యూనివర్సిటి, ఫారెస్టు కాలేజిలకు శంకుస్థాపన చేశాం. జిల్లాలో 11 మైనాన్టీ గురుకులాలను ఏర్పాటు చేశాం. అత్యంత వెనుకబడిన ఒక్క నారాయణఖేడ్ నియోజకవర్గానికే 4 ఎస్టీ గురుకుల పాఠశాలలు మంజూరయ్యాయి. మిషన్ కాకతీయ కింద మొదటి దశలో రూ.364 కోట్లతో 1,684 చెరువులను, రూ.454 కోట్లతో 1,679 చెరువులను బాగు చేసుకోబోతున్నట్లు ఆయన వివరించారు. వైద్యం, రహదారుల బాగు.. ప్రభుత్వ వైద్యశాలల నిర్వహణలో మన జిల్లా నెంబర్‌వన్‌గా నిలిచింది. జిల్లాలో 7 కొత్త సిమాంక్ కేం ద్రాలను, 3 రక్తనిధి కేంద్రాలను, 4 రక్త నిలువ కేంద్రాలను ఏర్పాటు చేశాం. రూ.3 కోట్లతో ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఆధునిక వైద్య పరికరాలు అందించాం. రూ 1,500 కోట్లు ఖర్చు చేసి 1,600 కిలోమీటర్ల ఆర్అండ్బీ రోడ్డు, రూ.611 కోట్లు ఖర్చు చేసి 2,493 కిలో మీటర్ల పంచాయితీరాజ్ రోడ్లను బాగు చేసుకున్నాం. జిల్లాలో మూడు విడతల్లో 3.96 లక్షల మంది రైతులకు రూ.1,622 కోట్ల రుణమాఫీ జరిగింది’అని హరీశ్‌రావు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీపాటిల్, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, బాబుమోహన్, భూపాల్‌రెడ్డి, మదన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ రాజమణి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
‘తిరంగా’ ఆర్ట్..
మారేడుపల్లి: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మారేడుపల్లి అశ్విని నగర్లో ఆదివారం ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. రుక్మిణి ఆర్ట్స్ అకాడమీ రాజశ్రీ కళాపీఠం ఆధ్వర్యంలో రూపొందించిన పలు చిత్రాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. స్వాతంత్య్ర వేడుకలు, తివర్ణ పతాకం, మహాత్మ గాంధీతో పాటు పలు చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. ఈనెల 22 వరకు ప్రదర్శన కొనసాగుతుందని నిర్వాహకులు శ్రీకాంత్ ఆనంద్ తెలిపారు. -
మోదీ హామీల అమలు ఎంతవరకు?
గత పంద్రాగస్టున ఇచ్చిన 8 హామీలపై ‘ఫ్యాక్ట్ చెకర్’ పరిశీలన * జన్‌ధన్ యోజన ప్రయోజనంపై అస్పష్టత * మరుగుదొడ్ల నిర్మాణం నామమాత్రమే * ఉత్తమంగా సామాజిక భద్రత కార్యక్రమాలు న్యూఢిల్లీ: గతేడాది ఆగస్టు 15న స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ప్రధాని మోదీ ఇచ్చిన హామీల్లో కొన్ని మాత్రమే కార్యరూపం దాల్చాయని ‘ఫ్యాక్ట్ చెకర్’ సంస్థ పేర్కొంది. అందులోనూ కొన్ని అంశాల్లోనే మెరుగైన ప్రయోజనం కనిపించిందని.. మరిన్ని అంశాల్లో అస్పష్టత నెలకొందని తెలిపింది. ప్రధానమైన 8 అంశాల అమలుతీరుపై ‘ఫ్యాక్ట్ చెకర్’ పరిశీలన జరిపింది. వివరాలు.. 1. ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన నిరుపేదలందర్నీ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది. తద్వారా దేశంలో బ్యాంకు ఖాతాల సంఖ్య ఈ ఏడాది ఆగస్టు 3 నాటికి 22.8 కోట్లకు చేరింది. గత ఏడాది (17.4 కోట్ల ఖాతాలు)తో పోల్చితే.. ఖాతాల సంఖ్య 31 శాతం పెరగడం గమనార్హం. ఖాతాల్లోని సొమ్ము రూ.22,033 కోట్ల నుంచి రూ.40,795 కోట్లకు.. అంటే 85 శాతం పెరిగింది. 2. స్వచ్ఛ విద్యాలయ అభియాన్.. దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో బాలబాలికలకు మరుగుదొడ్ల సదుపాయం కల్పించేందుకు ‘స్వచ్ఛ విద్యాలయ అభియాన్’ను మోదీ ప్రకటించారు. కానీ ఈ లక్ష్యాన్ని ఏ మాత్రం చేరుకోలేకపోయారు.ఢిల్లీ సహా మారుమూల ప్రాంతాల వరకు కూడా స్కూళ్లలో సరైన సంఖ్యలో టాయిలెట్లు లేవని తేలింది. . 3. గివ్ ఇట్ అప్.. ధనికులు పొందుతున్న వంటగ్యాస్ సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకునేందుకు ‘గివ్ ఇట్ అప్’ కార్యక్రమాన్ని కేంద్రం చేపట్టింది. 1.04 కోట్ల మంది ఎల్పీజీ సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకోగా, 17.6 లక్షల మంది మహిళలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చారు. 4. డీబీటీఎల్తో సబ్సిడీ భారం తగ్గింపు పక్కదారి పడుతున్న ఎల్పీజీ సబ్సిడీ అడ్డుకట్టకు ‘ఎల్పీజీకి ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీఎల్)’ తెచ్చారు. గతేడాదిలో రూ.20 వేల కోట్లు సబ్సిడీ భారం తగ్గిందని కేంద్రం చెప్పింది. అయితే తగ్గిన భారం సుమారు 2 వేల కోట్లేనని కాగ్ పేర్కొంది. 5. అన్ని గ్రామాలకు విద్యుత్.. దేశంలో 98.1 శాతం గ్రామాల్లో విద్యుదీకరణ జరిగిందని కేంద్రం పేర్కొనడం వాస్తవ దూరమని ‘ఫ్యాక్ట్ చెకర్’ పేర్కొంది. దేశంలోని 5,97,464 గ్రామాలకుగాను ఈ జూన్ 30 నాటికి 5,87,569 గ్రామాల్లో విద్యుత్ సరఫరా అందుతోందని కేంద్రం చెబుతోంది. అంటే కేవలం 9,895 గ్రామాలకే విద్యుత్ సరఫరా లేదు! 6. సామాజిక భద్రత.. సామాజిక భద్రత కార్యక్రమం కింద కేంద్రం ప్రధానంగా మూడు పథకాలను ప్రవేశపెట్టింది. ఈ జూన్ 14 నాటికి అటల్ పెన్షన్ యోజన కింద 27 లక్షల మంది, ప్రధాని సురక్షా బీమా యోజన కింద 9.45 కోట్ల మంది, ప్రధాని జీవన్ జ్యోతి బీమా యోజన కింద 2.97 కోట్ల మంది నమోదు చేసుకున్నారు. 7. గ్రామీణాభివృద్ధి.. 2015-16లో వ్యవసాయానికి కేటాయించిన రూ. 24,909 కోట్లతో పోల్చితే ఈసారి 44 శాతం అదనంగా రూ.35,984 కోట్లు బడ్జెట్ కేటాయించింది. కానీ దేశంలోని మొత్తం సాగుభూమిలో 32 % కేవలం 5 శాతం మంది పెద్ద రైతుల చేతుల్లోనే ఉంది. వ్యవసాయేతర అవసరాలకు మళ్లించడం, పట్టణీకరణ కారణంగా సాగు చేసే భూమి విస్తీర్ణం తగ్గిపోతోందని పేర్కొంది. 8. వన్ ర్యాంక్ వన్ పెన్షన్.. మాజీ సైనికోద్యోగులకు ఒక ర్యాంక్ ఒకే పెన్షన్ హామీ ఇచ్చిన మోదీ దానిని అమల్లోకీ తెచ్చారు. ఏటా రూ.7,488 కోట్లు భారం పడుతుందని, బకాయిల చెల్లింపునకు రూ.10,925 కోట్లు అవసరమని అంచనా వేశారు. కానీ 2016 మార్చి నాటికి రూ. 2,861 కోట్లే ఖర్చు చేశారు.