‘తిరంగా’ ఆర్ట్..
మారేడుపల్లి: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మారేడుపల్లి అశ్విని నగర్‌లో ఆదివారం ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. రుక్మిణి ఆర్ట్స్ అకాడమీ రాజశ్రీ కళాపీఠం ఆధ్వర్యంలో రూపొందించిన పలు చిత్రాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. స్వాతంత్య్ర వేడుకలు, తివర్ణ పతాకం, మహాత్మ గాంధీతో పాటు పలు చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. ఈనెల 22 వరకు ప్రదర్శన కొనసాగుతుందని నిర్వాహకులు శ్రీకాంత్ ఆనంద్ తెలిపారు.