సాక్షి, విజయవాడ: మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కాకినాడ పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించి స్వాతంత్ర్య వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జెండా ఎగురవేశారు.
తూర్పు నావికా దళంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
విశాఖ: తూర్పు నావికా దళంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. నేవీ మార్చ్, నేవీ బెటాలియన్ బ్యాండ్ కనువిందు చేశాయి. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులను నేవీ అధికారులు స్మరించుకున్నారు. న తూర్పు నావికా దళం వైస్ అడ్మిరల్ రాజేష్ పెందర్కర్ జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం స్వీకరించారు. దేశం మొత్తం నావికా దళంలో తూర్పు నావికా దళం చాలా కీలకమని రాజేష్ పెందర్కర్ అన్నారు.
‘‘దేశ సేవ చేసే గొప్ప అవకాసం రావటం మన అదృష్టం. ఎన్నో ప్రాణ త్యాగాల ఫలితం ఈ స్వాతంత్రం. ప్రతి ఒక్కరిలో దేశ భక్తి ఉండాలి. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ముందుకు దుసుకెళ్తున్నాం. క్రమశిక్షణ, పట్టుదల, విజయం నేవీ సొంతం. దేశ ప్రగతిలో నేవీ స్థానం కీలకం’’ అని రాజేష్ పెందర్కర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment