కళల కాణాచి హైదరాబాద్ నగరం మరో ప్రత్యేకమైన ఆర్ట్ ఎగ్జిబిషన్‌కు వేదిక కానుంది. మాదాపూర్‌లోని స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ వేదికగా ఢిల్లీ ఆర్ట్ మాగ్నమ్ ఆధ్వర్యంలో ప్రముఖ ఆర్ట్ క్యూరియేటర్ అన్నపూర్ణ ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ ను నిర్వహించనున్నారు. ప్రముఖ ఆర్టిస్టులు ధ్రువ్ పటేల్, దుష్యంత్, రఘు, ముఖ్తార్ అహ్మద్‌లు తమ ప్రత్యేకమైన కళాఖండాలను ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించనున్నారు. చిత్రకళా రంగంలో సరికొత్త కోణాన్ని కళా ప్రేమికుల ముందుకు తీసుకువస్తున్నారు. ఉరుకుల, పరుగుల యాంత్రిక జీవితంలో ఒక్క క్షణం ఆగి ఆస్వాదించడమే ఈ పదర్శన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
ఆర్టిస్ట్ రఘు తనదైన శైలితో ఆకట్టుకుంటారనీ, అలాగే ఆర్టిస్ట్ ముఖ్తార్ అహ్మద్ వర్షం, ధూళి కారణంగా పాడుబడ్డ భవనాలు చిత్రాలు ప్రత్యేకంతా నిలువనున్నాయి. ధృవ్ పటేల్ లంగూర్ల చిత్రలతోనూ, ఆర్టిస్ట్ దుష్యంత్ ఆర్ట్ లో వాటర్ కలర్స్ చిత్రాలను వీక్షకులను బాగా ఆకర్షించ నున్నాయి. ఈ ఆర్టిస్టులు అంతా కలిసి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కొత్తగా పరిచయం చేస్తారు. ఈ ప్రదర్శన కేవలం కళ ప్రదర్శన మాత్రమే కాదు, అందరినీ ఒక అడుగు వెనక్కి తీసుకుని, జీవితంలో సాధారణ ఆనందాలను ఆస్వాదించేలా ప్రేరేపిస్తుందని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఇంటిలిజెన్స్
ఐజీ సుమతి, అలాగే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డా.కోట నీలిమ హాజరు కానున్నారు.
వివరాలు :
2024 సెప్టెంబర్ 1న, ఆదివారం ఉదయం 11 గంటలు.
వేదిక: మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ,
ప్రదర్శన వివరాలు : సెప్టెంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు, ఉదయం 11 నుంచి రాత్రి 8 వరకు.
Comments
Please login to add a commentAdd a comment