State Art Gallery
-
'పాజ్ అండ్ రిఫ్లెక్ట్' : ఆర్ట్ ఎగ్జిబిషన్, సెప్టెంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు
కళల కాణాచి హైదరాబాద్ నగరం మరో ప్రత్యేకమైన ఆర్ట్ ఎగ్జిబిషన్‌కు వేదిక కానుంది. మాదాపూర్‌లోని స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ వేదికగా ఢిల్లీ ఆర్ట్ మాగ్నమ్ ఆధ్వర్యంలో ప్రముఖ ఆర్ట్ క్యూరియేటర్ అన్నపూర్ణ ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ ను నిర్వహించనున్నారు. ప్రముఖ ఆర్టిస్టులు ధ్రువ్ పటేల్, దుష్యంత్, రఘు, ముఖ్తార్ అహ్మద్‌లు తమ ప్రత్యేకమైన కళాఖండాలను ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించనున్నారు. చిత్రకళా రంగంలో సరికొత్త కోణాన్ని కళా ప్రేమికుల ముందుకు తీసుకువస్తున్నారు. ఉరుకుల, పరుగుల యాంత్రిక జీవితంలో ఒక్క క్షణం ఆగి ఆస్వాదించడమే ఈ పదర్శన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.ఆర్టిస్ట్ రఘు తనదైన శైలితో ఆకట్టుకుంటారనీ, అలాగే ఆర్టిస్ట్ ముఖ్తార్ అహ్మద్ వర్షం, ధూళి కారణంగా పాడుబడ్డ భవనాలు చిత్రాలు ప్రత్యేకంతా నిలువనున్నాయి. ధృవ్ పటేల్ లంగూర్ల చిత్రలతోనూ, ఆర్టిస్ట్ దుష్యంత్ ఆర్ట్ లో వాటర్ కలర్స్ చిత్రాలను వీక్షకులను బాగా ఆకర్షించ నున్నాయి. ఈ ఆర్టిస్టులు అంతా కలిసి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కొత్తగా పరిచయం చేస్తారు. ఈ ప్రదర్శన కేవలం కళ ప్రదర్శన మాత్రమే కాదు, అందరినీ ఒక అడుగు వెనక్కి తీసుకుని, జీవితంలో సాధారణ ఆనందాలను ఆస్వాదించేలా ప్రేరేపిస్తుందని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఇంటిలిజెన్స్ ఐజీ సుమతి, అలాగే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డా.కోట నీలిమ హాజరు కానున్నారు. వివరాలు : 2024 సెప్టెంబర్ 1న, ఆదివారం ఉదయం 11 గంటలు.వేదిక: మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ,ప్రదర్శన వివరాలు : సెప్టెంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు, ఉదయం 11 నుంచి రాత్రి 8 వరకు. -
హార్ట్ ఆఫ్ ఆదివాసి..
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా నగరంలోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వేదికగా ప్రారంభించిన ఫొటో ఎగ్జిబిషన్ విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రముఖ ఫొటోగ్రాఫర్ సతీష్ లాల్ దాదాపు 14 ఏళ్లు దేశంలోని 20 రాష్ట్రాల్లో తిరిగి 40కి పైగా ఆదివాసి తెగలపై తీసిన అద్భుత డాక్యుమెంటరీని ప్రదర్శిస్తున్నారు.ఆదివాసి సంస్కృతులు, వారి జీవన విధానం, వేషధారణ, పండుగలు, మేళాలు తదితర అంశాలపై తీసిన పరిశోధనాత్మక ఫొటోల సమాహారమని సతీష్ లాల్ తెలిపారు. ఈ డాక్యుమెంటరీకి గత సంవత్సరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ప్రశంసలు అందుకున్నానని గుర్తు చేశారు. తను తీసిన 65 ఆదివాసి ఫొటోలు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ఆదివాసి ఆర్ట్ మ్యూజియంలో శాశ్వతంగా కొలువుదీరాయని అన్నారు. -
ఆర్ట్ గ్యాలరీలో ఆరంభ్ చిత్రప్రదర్శన
మాదాపూర్: స్థానిక చిత్రమయి స్టేట్ అర్ట్ గ్యాలరీలో ఆరంభ్ పేరిట చిత్రప్రదర్శనను శనివారం ఏర్పాటు చేశారు. కళాకారులు వేసిన చిత్రాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. చారూస్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న 28 మంది కళాకారులు వేసిన 36 చిత్రాలను ప్రదర్శనలో ఉంచారు. ఈ ప్రదర్శనను మెరీడియన్ పాఠశాల ప్రిన్సిపల్ ఆకృశబెల్లాని ప్రారంభించారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని ఆమె కోరారు. విద్యార్థులు వేసిన చిత్రాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ప్రదర్శన ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకూ అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. -
‘ఆద్యకళ’కు ఆయువునివ్వండి
సాక్షి, హైదరాబాద్: వందల ఏళ్ల నాటి సాంస్కృతిక మూలాలను ఆవిష్కరించిన పరిశోధన..ఆదివాసీ, గిరిజన కళాత్మకతకు సమున్నతమైన ఆవిష్కరణ..ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఆద్యకళాకృతుల ప్రదర్శన. ఆదికాలం కళారూపాలను భవిష్యత్ తరాలకు అందజేసేందుకు, ఆద్యకళను కాపాడేందుకు నాలుగున్నర దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు. సుమారు 2,000 ఆద్యకళాకృతులతో జూలై నుంచి ఆగస్టు చివరి వరకు జరిగిన ప్రదర్శనకు అనూహ్య స్పందన లభించింది. ఈ ప్రదర్శన తెలంగాణ సృజనాత్మకతను, సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటింది. అయితే ఈ కళాసంపద ఇప్పుడు ప్రమాదంలో పడింది. దానిని కాపాడి జాతీయ, అంతర్జాతీయ సమాజానికి పరిచయం చేసేందుకు ప్రభుత్వం, సమాజం ముందుకు రావాలని ఆద్యకళకు ఆయువునివ్వాలని కోరుతున్నారు జయధీర్ తిరుమలరావు. ‘సాక్షి’తో తన మనోభావాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... అవి సామూహిక వ్యక్తీకరణలు ప్రకృతిలోని వివిధ రకాల వస్తువుల నుంచి ఉత్పన్నమయ్యే శబ్దాన్ని ఒడిసిపట్టుకొని సంగీత పరికరాలను సృష్టించారు. మృత జంతువుల చర్మాలతో ఆదివాసీలు రూపొందించిన వాయిద్య పరికరాలు గొప్ప సంగీతాన్ని సృష్టించాయి. కోయ గిరిజనులు వేసే ‘పగిడె’పటాలు ఆది మానవుడి కాలం నాటి గుహచిత్రాలను తలపిస్తాయి. మట్టి ఫలకాలు, కుండలు, కర్రలపై చెక్కుకున్న అక్షరాలు తర్వాతర్వాత అనేక రకాలుగా పరిణామం చెందాయి. ఓజోలు అనే గిరిజన సమూహం తయారు చేసిన డోక్రా హస్త కళావస్తువులు గొప్ప ప్రతిభకు తార్కాణం. పొనికి చెట్టు కలప నుంచి అద్భుతమైన బొమ్మలు తయారు చేశారు. ఇవన్నీ సామూహిక వ్యక్తీకరణలు. ఆద్యకళకు ప్రతిరూపాలు. 1974లో ఎం.ఎ. పూర్తైన తొలిరోజుల్లో పరిశోధన ప్రారంభించాను. క్షేత్రస్థాయిలో పర్యటించాను. ప్రజలు రూపొందించుకున్న కళల చారిత్రక, సాంస్కృతిక మూలాలను ఆవిష్కరించేందుకు ప్రయత్నించాను. రెండువేల ఆద్యకళారూపాల సేకరణ ఆదివాసీ, గిరిజన కళల్లో గొప్ప ప్రతిభ ఉంది. నాలుగున్నర దశాబ్దాలకు పైగా అన్ని వర్గాల జీవన సమూహాలతో కలసి పనిచేశాను. వారి కళలను, కళా నైపుణ్యాలను, కళా పరికరాలను తయారు చేసే విధానాన్ని దగ్గర నుంచి చూశాను. అప్పటి నుంచి ఇప్పటివరకు 2,000 కళాకృతులకు, కళాఖండాలను సేకరించాను. వాటన్నింటిని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించినప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. మంత్రులు, ప్రముఖులు సందర్శించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఆ సాంస్కృతిక, కళా వారసత్వ సంపదను కాపాడుకుంటూ వచ్చాను. ఈ కళాసంపదను భవిష్యత్తరాలకు అందజేసేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, సమాజమే చొరవ చూపాలి. మ్యూజియం ఏర్పాటు చేయాలి ఆద్యకళను కాపాడేందుకు ఓ మ్యూజియం ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం అందుకోసం ఒకభవనాన్ని ప్రత్యేకంగా కేటాయించాలి. తద్వారా తెలంగాణ ప్రజల సాంస్కృతిక, వైవిధ్యభరితమైన కళాత్మక జీవితాన్ని జాతీయ, అంతర్జాతీయ సమాజానికి పరిచయం చేసే అవకాశం లభిస్తుంది. అంతరించిపోతున్న ఆద్యకళలను కాపాడుకోలేకపోతే చారిత్రక తప్పిదమవుతుంది. -
ఆకట్టుకుంటున్న ‘మెనీ ఫేసెస్ ఆఫ్ ఎ మాస్టర్’
సాక్షి, మాదాపూర్: తెలంగాణ ముద్దుబిడ్డ... బహుముఖ ప్రజ్ఞాశాలి.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా భాషా సంస్కృతి శాఖ, ఆర్ట్‌గ్యాలరీ సంయుక్త ఆధ్వర్యంలో మాదాపూర్ చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ‘మెనీ ఫేసెస్ ఆఫ్ ఎ మాస్టర్’ ఫొటో ఎగ్జిబిషన్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పీవీకి సంబంధించిన దాదాపు 250లకు పైగా చిత్రాలను ఇక్కడ ప్రదర్శనలో ఉంచారు. ఇవి ఆయన రాజకీయ జీవితంలోని ప్రధాన ఘటనలను గుర్తుకు తెస్తున్నాయి. యువత ఈ చిత్రాలను తిలకించి పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలను తెలుసుకొని ఆయన అడుగుజాడల్లో ముందుకు సాగాలని రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఎగ్జిబిషన్‌కు క్యూరేటర్‌గా వ్యవహరిస్తున్న పీవీ కుమార్తె ఎస్.వాణిదేవి ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని ‘సాక్షి’కి వివరించారు. దేశం కోసం పరితపించేవారు.. మా నాన్నగారు ప్రతిక్షణం దేశ కోసం, దేశ ప్రజల అభ్యున్నతి కోసం పరితపించేవారు. 1957లో శాసన సభ్యుడిగా రాజకీయ జీవితం ఆరంభించిన ఆయన రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర రాజకీయాల్లో ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. భారత ఆరి్థక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు భీజం వేసి, కుంటుతున్న భారత ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించారు. నాన్నగారు మితభాషి. బహుభాషా కోవిదుడు.గొప్ప రచయిత. ఇంగ్లీసు, హిందీతో పాటు దక్షిణాది భాషలు మొత్తం 17 అనర్గళంగా మాట్లాడేవారు. నాన్నగారి జీవిత విశేషాలు అందరికీ తెలియజేసి స్ఫూర్తి కలిగించాలనే ఉద్దేశంతో ఈ చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశాం. – ఎస్.వాణిదేవి పీవీ కుమార్తె ఇందిరాగాంధీతో పీవీ (ఫైల్) ప్రదర్శన వేళలు... ఈనెల 16వ తేదీ వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.. చదవండి: అక్కడ చెట్టూ పుట్టా పీవీ జ్ఞాపకాలే! పైసలిస్తారా.. ఫిర్యాదు చేయాలా..? -
ఆర్ట్‌ఫుల్ గిఫ్ట్
-
ఫ్రెండ్స్‌గా తాము నివసించిన ఇంటి నంబర్‌తో..
‘ది 16/622 కలెక్టివ్...’ ఇది చూస్తే ఏదో ఇంటి నంబర్లా ఉంది కదూ! కానీ ఇదొక సంస్థ పేరు. వాస్తవానికి ఇది డోర్ నంబరే.. కానీనలుగురు యువతులు దీన్ని సంస్థ పేరుగా మార్చారు. వారిసృజనాత్మకతకు ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే. ఖండాంతరాల్లో నివసిస్తున్న ఆ నలుగురు యువతులు కలిసి తొలిసారిగా భారత్‌లో అదీ మన నగరంలో ఏర్పాటు చేస్తున్న మిక్స్డ్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ‘ఏ యూలజీ టు దట్ థింగ్స్ నెవర్ వెర్’ అంతకుమించినసృజనశీలురుగా వీరిని మనకు పరిచయం చేస్తుంది. సాక్షి, సిటీబ్యూరో: కలకాలం నిలిచేదే స్నేహం అంటారు. కళ కూడా అంతే. ఈ నలుగురు స్నేహితులు తమ స్నేహాన్ని వర్ధిల్లజేసుకోవడానికి కళనే ఆధారం చేసుకున్నారు. ‘మేం స్నేహితులం అనేకన్నా అందరం ఒక ఫ్యామిలీగానే భావిస్తాం’ అని ఈ బృందంలోని లలిత చెప్పారు. ప్రస్తుతం అమెరికా, లండన్ ఇలా ఒక్కొక్కరు ఒక్కో చోట ఉంటున్నా ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి వీరంతా కలిసింది కేవలం ఒక చిత్ర ప్రదర్శన కోసం మాత్రమే కాదు... తమ స్నేహాన్ని కలకాలం కళకళలాడేలా చేసుకోవడానికి కూడా. కళా కంపెనీ... కాలేజీ రోజుల్లో గుర్గావ్కు చెందిన ప్రగ్యా భార్గవ, బెంగళూర్‌కి చెందిన అపరాజిత, సింగపూర్‌కి చెందిన వికీ అరవిందన్లతో పాటు మన నగరానికి చెందిన లలితా భండారు స్నేహితులు. విద్యార్థులుగా ఉన్నతస్థాయి ప్రతిభ చూపిన వీరంతా... తమ తమ అభిరుచులకు తగ్గట్టుగా చిత్రకళ, శిల్పకళ, వీడియోగ్రఫీలలో మంచి నైపుణ్యం సాధించారు. సింగపూర్‌లో కాలేజీ కోర్సులు పూర్తయ్యాక వీరి దారులు వేరయ్యాయి. కెరీర్ అన్వేషణలో ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. కళాశాల చదువైపోయి విడిపోయినా కళలతో కలిసుందామని నిశ్చయించుకున్న వీరు... దీని కోసం ఇటీవల ఒక కంపెనీని ప్రారంభించారు. తామంతా కలిసి నివసించిన ఇంటి నంబర్‌నే ఆ కంపెనీ పేరుగా పెట్టారు. ‘రకరకాల కళా ప్రదర్శనల్లో పాల్గొంటున్నా, ఆ విశేషాలు ఏదో రూపంలో పంచుకుంటున్నా ఏదో వెలితి. నలుగురం కలిసి మా మధ్య ఉన్న గాఢమైన స్నేహానుభూతిని ఆస్వాదిస్తూనే అదే సమయంలో ఆ సమయాన్ని కూడా మాలోని ప్రతిభా ప్రదర్శనకు వెచ్చించాలని, అందుకు ఏదైనా చేయాలని అనిపించింది. ఆ ఆలోచనలో నుంచే మా ‘ది 16/622 కలెక్టివ్’ పుట్టింద’ని చెప్పారు లలిత. సింగపూర్‌లో తాము కలిసి నివసించిన ఇంటి నంబర్‌నే తమ కంపెనీ పేరుగా మార్చుకున్నామని, ‘ప్రస్తుతం ఆ ఇల్లు కూల్చేశారు. కానీ ఆ ఇంటిలో నివసించిన మా జ్ఞాపకాల్ని పదిలం చేసుకోవాలనుకున్నాం’ అని వివరించారు. సింగపూర్ టు మాదాపూర్... సింగపూర్‌లో పుట్టిన వీరి స్నేహం మాదాపూర్ వరకు ప్రయాణం చేసింది. మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో వీరు నలుగురు కలిసి తొలి కళా ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ శనివారం ప్రారంభం కానుంది. ‘ఈ ప్రదర్శన కోసం మన ఊహల్లోనే తప్ప నిజంగా చూడడం సాధ్యపడని కొన్నింటికి రూపం ఇవ్వాలని అందరం కామన్ థీమ్ తీసుకున్నాం. ప్రగ్యా ఫొటోగ్రఫీ, డ్రాయింగ్.. అపరాజిత మిక్స్ మీడియా పెయింటింగ్స్.. నా పెయింటింగ్స్... వికీ అరవింద్ శిల్పాలు, వీడియోలు.. ఇలా అన్నీ ఈ థీమ్‌తోనే రూపుదిద్దుకున్నాయి’ అని వివరించారు లలిత. ఈ ప్రదర్శన పది రోజులు కొనసాగుతుందని చెప్పారు. -
బొమ్మలేస్తున్న బామ్మ
తదేక దీక్షతో బొమ్మలేస్తున్న ఈ బామ్మ పేరు చిలువేరి లింగమ్మ.. వయసు.. డెబ్బయ్ పైనే! ఈమె కుంచెతో పుట్టలేదు.. అలాగని ఏ గురువు దగ్గరో రంగులద్దడమూ నేర్చుకోలేదు! స్త్రీలో సహజంగా ఉండే సృజనను 65వ ఏట తట్టి లేపి.. చిత్రకారిణిగా పునర్జన్మనెత్తింది. తన కొడుకు చిలువేరి మనోహర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో పెట్టిన బోనాలు అర్ట్తో తొలిసారిగా పదిమందికీ తన కళ ప్రదర్శించింది. లింగమ్మ గురించి ఆమె మాటల్లోనే.. ‘మాది వరంగల్. రజాకార్ల జమానాలో ఆడపిల్లలకు చిన్నప్పుడే పెళ్లి చేసేటోళ్లు. అట్ల ఎనిమి దేళ్లకే నా పెళ్లరుుంది. మా ఆయనకు ఫ్రేమ్‌లు చేసే దుకాణం ఉండె. అండ్ల అద్దాలకు కళాయి పెడ్తుంటి తప్పితే ఏనాడూ బొమ్మేసిన గుర్తులేదు. మా ఆయున గియ్యుంగ జూసిన. నాకు ఆరుగురు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. ఇల్లు, పిల్లలతోనే జీవితం సగానికెక్కువ ఒడిశిపోరుుంది. పిల్లలందరూ మంచిగున్నరు. మా ఆయున పోయే దాకా.. నా గురించి ఆలోచించలే. పదేళ్ల కిందట ముచ్చట! ఆయున పోయునంక నాకు జీవితమే లేనట్టనిపించింది. తిండి, నిద్ర అన్నీ మర్సిన. నా పరిస్థితి చూసిన పిల్లలు ‘ అమ్మా.. నువ్వు ఇట్లుంటే కాదు నీకు నచ్చిన పనేదైనా చెయ్యి’ అని వెంటబడ్డరు. నాకేమొచ్చు సదువా..? సంధ్యా..? అరుునా బాగా ఆలోసించిన.. వూ ఇంటాయున ఒదిలేసిన జ్ఞాపకాలు నాకు బలాన్నిచ్చినయ్. ‘ బొవ్ములు గీస్తరా’ అని నా కొడుకులకు చెప్పిన, వాళ్లు నవ్వలే, బొవ్ములేయునికి కావాల్సిన వస్తువులన్నీ తెచ్చిచ్చిండ్రు. చిన్నప్పటి పరిసరాలు చిన్నతనంలో మా ఊళ్ల చూసిన చెట్టు, పుట్ట, చేను, గుట్ట.. అన్నీ యూది చేసుకుని బొవ్ములేసిన. నా పెళ్లరుున కొత్తల మా ఇల్లు ఎట్లుండే.. తర్వాత ఎట్లైంది.. ఆ జవూనాల మేం వంట చేసిన కట్టెల పొరుు్య.. తర్వాత తెచ్చుకున్న గ్యాస్ పొరుు్య కూడా నా బొవ్ములైనరుు. ఇట్ల నా బుద్ధికి ఏం యూదికొస్తే.. అవన్నీ గీసిన. వాటిని చూస్కుంటే బొమ్మలంటే గివ్వేనా? నా జీవితం గింతేనా? అనిపించింది. రేణుక ఎల్లమ్మ నాకు నలుగురు కొడుకులు పుట్టినాంక ఐదోకాన్పుల బిడ్డ పుట్టాలని రేణుక ఎల్లవ్ము తల్లికి మొక్కుకున్న. అమ్మోరు దయుతో అయిదో సంతానం ఆడపిల్ల పుట్టింది. అప్పటి సంది ఎల్లవ్మును కొలిసేదాన్ని. బొవ్ములన్నీ ఒక్కతీరుగొస్తున్నయుని యూష్టలున్న నాకు.. ఆ ఎల్లవ్ము తల్లి గుర్తొచ్చింది. ఆమె జీవిత చరిత్రనే బొవ్ముల్ల గీస్తే ఎట్లుంటదని ఆలోచించిన. ఆ తల్లి గురించి ఇప్పటికి ఎనభై బొవ్ములైనయ్. గండ్లయే డజన్ బొవ్ములు తీసి నా కొడుకు ‘బోనాలు ఆర్ట్’ ఎగ్జిబిషన్లో పెట్టిండు. ఈ బొమ్మల కథను పుస్తకంగా తేవాలనుకుంటున్న. ఎట్ల బతకాలో చూపించాలి నేను బతుకమ్మ పాటలు, లాలి పాటలు కూడా బాగా పాడ్త. బతుకమ్మ పాటలను కూడా పాడి ఆ సీడీల రూపంలో తేవాలనుకుంటున్న. ప్రస్తుతం నాకున్న పనులు గివ్వే. ముసలితనం మల్లొచ్చిన బాల్యం అంటరు. చిన్నతనంల ఎంత ఉత్సాహంగా ఉంటమో.. వుుసలితనంల కూడా అట్లనే ఉండాలె. అండ్ల ఆడాళ్లు ఇంకా. పెండ్లి, పిల్లలతో అప్పుడు వునకొచ్చి వునం చేయులేని పనులను వుుసలితనంల చేసుకుంటా ఎవ్వల మీద ఆధారపడకుండా ఎట్ల బతకొచ్చో పదిమందికి చూపించాలి. నాకు తెల్సింది ఇదే!’ స్టేట్ ఆర్ట్గ్యాలరీలోని బతుకమ్మలో ‘కుండ’.. స్త్రీకి ప్రతిరూపంగా.. ఆమె అస్తిత్వానికి, సాధికారతకు చిహ్నంగా లింగమ్మ చిత్రించింది. పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు మనిషి జీవితంలో కుండ ఎన్ని రకాలుగా భాగమవుతుందో స్త్రీ కూడా పురుషుడి జీవితంలోఅంతే ఆలంబనగా నిలుస్తుందనేది ఆమె అభిప్రాయం!