బొమ్మలేస్తున్న బామ్మ
తదేక దీక్షతో బొమ్మలేస్తున్న ఈ బామ్మ పేరు చిలువేరి లింగమ్మ.. వయసు.. డెబ్బయ్ పైనే!
ఈమె కుంచెతో పుట్టలేదు.. అలాగని ఏ గురువు దగ్గరో రంగులద్దడమూ నేర్చుకోలేదు!
స్త్రీలో సహజంగా ఉండే సృజనను 65వ ఏట తట్టి లేపి.. చిత్రకారిణిగా పునర్జన్మనెత్తింది.
తన కొడుకు చిలువేరి మనోహర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో పెట్టిన బోనాలు
అర్ట్‌తో తొలిసారిగా పదిమందికీ తన కళ ప్రదర్శించింది. లింగమ్మ గురించి ఆమె మాటల్లోనే..
‘మాది వరంగల్. రజాకార్ల జమానాలో ఆడపిల్లలకు చిన్నప్పుడే పెళ్లి చేసేటోళ్లు. అట్ల ఎనిమి దేళ్లకే నా పెళ్లరుుంది. మా ఆయనకు ఫ్రేమ్‌లు చేసే దుకాణం ఉండె. అండ్ల అద్దాలకు కళాయి పెడ్తుంటి తప్పితే ఏనాడూ బొమ్మేసిన గుర్తులేదు. మా ఆయున గియ్యుంగ జూసిన. నాకు ఆరుగురు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. ఇల్లు, పిల్లలతోనే జీవితం సగానికెక్కువ ఒడిశిపోరుుంది. పిల్లలందరూ మంచిగున్నరు.
మా ఆయున పోయే దాకా.. నా గురించి ఆలోచించలే. పదేళ్ల కిందట ముచ్చట! ఆయున పోయునంక నాకు జీవితమే లేనట్టనిపించింది. తిండి, నిద్ర అన్నీ మర్సిన. నా పరిస్థితి చూసిన పిల్లలు ‘ అమ్మా.. నువ్వు ఇట్లుంటే కాదు నీకు నచ్చిన పనేదైనా చెయ్యి’ అని వెంటబడ్డరు. నాకేమొచ్చు సదువా..? సంధ్యా..? అరుునా బాగా ఆలోసించిన.. వూ ఇంటాయున ఒదిలేసిన జ్ఞాపకాలు నాకు బలాన్నిచ్చినయ్. ‘ బొవ్ములు గీస్తరా’ అని నా కొడుకులకు చెప్పిన, వాళ్లు నవ్వలే, బొవ్ములేయునికి కావాల్సిన వస్తువులన్నీ తెచ్చిచ్చిండ్రు.
చిన్నప్పటి పరిసరాలు
చిన్నతనంలో మా ఊళ్ల చూసిన చెట్టు, పుట్ట, చేను, గుట్ట.. అన్నీ యూది చేసుకుని బొవ్ములేసిన. నా పెళ్లరుున కొత్తల మా ఇల్లు ఎట్లుండే.. తర్వాత ఎట్లైంది.. ఆ జవూనాల మేం వంట చేసిన కట్టెల పొరుు్య.. తర్వాత తెచ్చుకున్న గ్యాస్ పొరుు్య కూడా నా బొవ్ములైనరుు. ఇట్ల నా బుద్ధికి ఏం యూదికొస్తే.. అవన్నీ గీసిన. వాటిని చూస్కుంటే బొమ్మలంటే గివ్వేనా? నా జీవితం గింతేనా? అనిపించింది.
రేణుక ఎల్లమ్మ
నాకు నలుగురు కొడుకులు పుట్టినాంక ఐదోకాన్పుల బిడ్డ పుట్టాలని రేణుక ఎల్లవ్ము తల్లికి మొక్కుకున్న. అమ్మోరు దయుతో అయిదో సంతానం ఆడపిల్ల పుట్టింది. అప్పటి సంది ఎల్లవ్మును కొలిసేదాన్ని. బొవ్ములన్నీ ఒక్కతీరుగొస్తున్నయుని యూష్టలున్న నాకు.. ఆ ఎల్లవ్ము తల్లి గుర్తొచ్చింది. ఆమె జీవిత చరిత్రనే బొవ్ముల్ల గీస్తే ఎట్లుంటదని ఆలోచించిన. ఆ తల్లి గురించి ఇప్పటికి ఎనభై బొవ్ములైనయ్. గండ్లయే డజన్ బొవ్ములు తీసి నా కొడుకు ‘బోనాలు ఆర్ట్’ ఎగ్జిబిషన్‌లో పెట్టిండు. ఈ బొమ్మల కథను పుస్తకంగా తేవాలనుకుంటున్న.
ఎట్ల బతకాలో చూపించాలి
నేను బతుకమ్మ పాటలు, లాలి పాటలు కూడా బాగా పాడ్త. బతుకమ్మ పాటలను కూడా పాడి ఆ సీడీల రూపంలో తేవాలనుకుంటున్న. ప్రస్తుతం నాకున్న పనులు గివ్వే. ముసలితనం మల్లొచ్చిన బాల్యం అంటరు. చిన్నతనంల ఎంత ఉత్సాహంగా ఉంటమో.. వుుసలితనంల కూడా అట్లనే ఉండాలె. అండ్ల ఆడాళ్లు ఇంకా. పెండ్లి, పిల్లలతో అప్పుడు వునకొచ్చి వునం చేయులేని పనులను వుుసలితనంల చేసుకుంటా ఎవ్వల మీద ఆధారపడకుండా ఎట్ల బతకొచ్చో పదిమందికి చూపించాలి. నాకు తెల్సింది ఇదే!’
స్టేట్ ఆర్ట్‌గ్యాలరీలోని బతుకమ్మలో ‘కుండ’.. స్త్రీకి
ప్రతిరూపంగా.. ఆమె అస్తిత్వానికి, సాధికారతకు చిహ్నంగా లింగమ్మ చిత్రించింది. పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు మనిషి జీవితంలో కుండ ఎన్ని రకాలుగా భాగమవుతుందో స్త్రీ కూడా పురుషుడి జీవితంలోఅంతే ఆలంబనగా నిలుస్తుందనేది ఆమె అభిప్రాయం!