Manohar
-
భర్త అనుమానం.. పెను‘మంటలై’..
రాయచోటి: భర్త అనుమానానికి తోడు.. వేధింపుల ధాటికి తట్టుకోలేక ఇద్దరు బిడ్డలతో సహా ఓ తల్లి సజీవదహనమైన హృదయవిదారక ఘటన అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. పలువురిని కంటతడి పెట్టించిన ఈ దారుణ ఘటన వివరాలను బంధువులు వెల్లడించారు. జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి మండలం బి.ఎర్రగుడి హరిజనవాడకు చెందిన ఎర్రగుడి రాజా పది సంవత్సరాల కిందట గాలివీడుకు చెందిన గాలివీటి రమాదేవిని వివాహం చేసుకున్నారు. వీరికి మనోహర్ (8), మన్విత (5) సంతానం. జీవనోపాధి నిమిత్తం రాజా గల్ఫ్ దేశంలో ఉంటూ భార్య, పిల్లలను రాయచోటి పట్టణం బోస్‌నగర్ తొగటవీధిలో ఉంచాడు. భార్య రమాదేవి టైలరింగ్ చేసుకుంటూ ఇద్దరు పిల్లలను స్కూలుకు పంపుతూ జీవనం సాగించేది. రెండు సంవత్సరాలుగా భార్యపై అనుమానాన్ని పెంచుకున్న రాజా తను నివాసం ఉంటున్న ఇంటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ మధ్యకాలంలో అనుమానం పెనుభూతమై వీడియో ఫోన్ ద్వారా వేధించేవాడు. వాటిని తట్టుకోలేక శనివారం ఉదయం ఆరుగంటలకు వంటగదిలో ఉన్న గ్యాస్ సిలిండర్‌ను బెడ్రూమ్లోకి తీసుకెళ్లి కన్నబిడ్డలు ఇద్దరినీ పట్టుకుని రమాదేవి (34) గ్యాస్‌బండకు నిప్పు అంటించి ఆ మంటల్లో ఆహుతి అయింది. ఇంటిలో నుంచి పొగలు రావడంతో స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆరి్పవేశారు. అప్పటికే మంటల్లో తల్లీ, ఇద్దరు పిల్లలు కాలిపోయారు. రమాదేవి సోదరుడు గాలివీటి నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రాయచోటి అర్బన్ సీఐ చంద్రశేఖర్ తెలిపారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి మృతదేహాల వద్ద నివాళులు అర్పించారు. ఈ ఘటన దురదృష్టకరమని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. -
మంత్రిగారూ.. ఇవిగో పులిహోరలో పురుగులు
కర్నూలు(సెంట్రల్): ‘అయ్యా మంత్రి మనోహర్ గారు... మీరు నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తే పులిహోరలో పురుగులు ఎందుకు వస్తాయి?.. అన్నం ఎందుకు ముక్కిపోయి ముద్దగా ఉంటుంది. కుల్లిపోయిన కూరగాయలతో కూరలు చేసే దుస్థితి ఎందుకు వస్తుంది...’ అని కర్నూలు సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల విద్యార్థులు మండిపడుతున్నారు. తమ కళాశాల మేనేజ్మెంట్ బాలుర, బాలికల హాస్టళ్లలో పురుగుల బియ్యంతో అన్నం వండుతున్నారని, కుళ్లిన కూరగాయలతో కూరలు చేస్తున్నారని, నాలుగైదు రోజులకొకసారి నీళ్లు వస్తుండడంతో స్నానాలు కూడా చేయకుండా కాలేజీకి వెళ్తున్నామని శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట దాదాపు 700మంది సిల్వర్ జూబ్లీ కళాశాల విద్యార్థులు ధర్నా చేశారు.విద్యార్థుల ఆవేదనను వివరిస్తూ ‘అన్నమో చంద్రబాబూ’ అంటూ ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై శనివారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. సిల్వర్ జూబ్లీ కళాశాలకు నాణ్యమైన బియ్యం సరఫరా చేశామని విజయవాడలో ఒక ప్రకటన విడుదల చేశారు. ‘సాక్షి’లో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అక్కసు వెళ్లగక్కారు. అదేవిధంగా ఈ ఘటనపై విచారణ చేయాలని కర్నూలు ఆర్డీవో, పౌరసరఫరాల సంస్థ డీఎంను ఆదేశించారు.అతి ప్రధానమైన కిలో బియ్యం రూపాయికే ఇచ్చే ప్రతిపాదనపై మాత్రం మంత్రి స్పష్టత ఇవ్వలేదు. ఉన్నత విద్యాశాఖ నుంచి ప్రతిపాదనలు వచ్చాయని, త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. దీంతో మంత్రి ప్రకటనపై విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేస్తే శుక్రవారం ఉదయం వండిన పులిహోరలో పురుగులు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తున్నారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని, కుళ్లిన కూరగాయలతో వంట చేస్తున్నారనే విషయాన్ని తాము సాక్ష్యాధారాలతో కళ్లకు కట్టినట్లు ధర్నాలో వివరించినా మంత్రి వాస్తవాలు తెలుసుకోకుండా అన్నీ బాగానే ఉన్నట్లు ప్రకటన ఇవ్వడం మంచిది కాదని, వెంటనే తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని పలువురు విద్యార్థులు డిమాండ్ చేశారు. బుగ్గన చొరవతో రూపాయికే కిలో బియ్యం ఇచ్చేలా ఉత్తర్వులుసిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల హాస్టల్ విద్యార్థులు నెలకు ఒక్కొక్కరూ రూ.430 మెస్ చార్జీల కోసం చెల్లిస్తారు. దానిలో అత్యధిక భాగం బియ్యం కొనుగోలుకే సరిపోతుంది. ప్రస్తుతం కళాశాల మేనేజ్మెంట్ కిలో బియ్యం రూ.45 చొప్పున కొనుగోలు చేస్తోంది. ఈ క్రమంలో మెస్‌చార్జీల డబ్బులన్నీ బియ్యం కొనుగోలుకే సరిపోతుండడంతో గ్యాస్, నూనె, కూరగాయలు, ఇతర సరుకుల కొనుగోలుకు డబ్బులు సరిపోవడంలేదు.ఈ విషయాన్ని గత ప్రభుత్వంలో ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వైఎస్ జగన్ స్పందించి సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాలకు రూపాయికే కిలో బియ్యం ఇవ్వాలని ఆదేశిస్తూ 2024, మార్చి ఒకటో తేదీన మెమో నంబర్ 976211/సీఈ/ఏ1/2019 జారీ చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దానిని అమలు చేయకపోవడంతోనే విద్యార్థులు అల్లాడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. -
ఏపీ బాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తోట మనోహర్ మృతి
సాక్షి, నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ బాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తోట మనోహర్ హఠాన్మరణం చెందారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు వస్తుండగా గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ బాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. తోట మనోహర్ మృతిపట్ల బ్యాట్మింటన్ క్రీడాకారులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. (చదవండి: ‘సీమ’ నుంచి శాసన రాజధానికి రాచబాట) -
నూకల మనోహర్‌పై పీడీ యాక్ట్
కోవెలకుంట్ల/ కర్నూలు(టౌన్): కోవెలకుంట్ల కేంద్రంగా నిషేధిత గుట్కా వ్యాపారం చేస్తున్న నూకల మనోహర్‌పై పీడీయాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ సుబ్బరాయుడు ఆదివారం కోవెలకుంట్ల సర్కిల్ కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. కోవెలకుంట్ల మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన మనోహర్ కొన్నేళ్ల నుంచి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు వ్యక్తులతో కలిసి గుట్కా వ్యాపారం చేస్తున్నాడు. జిల్లాలోని ఆళ్లగడ్డ, శిరివెళ్ల, నంద్యాల, బనగానపల్లె, కొలిమిగుండ్ల తదితర ప్రాంతాలకు గుట్కా ప్యాకెట్లను సరఫరా చేసేవాడు. ఇందుకు సంబంధించి అతనిపై 14 కేసులు నమోదయ్యాయి. కోవెలకుంట్ల పోలీస్‌స్టేషన్‌లో ఎనిమిది, ఆళ్లగడ్డ పీఎస్‌లో మూడు, ఆళ్లగడ్డ రూరల్, శిరివెళ్ల, నంద్యాల తాలూకా స్టేషన్లలో ఒక్కొక్క కేసు ఉన్నాయి. ఈ కేసుల్లో పలుమార్లు అరెస్టయ్యి.. జైలుకు కూడా వెళ్లొచ్చినా నేర ప్రవృత్తిని మాత్రం మార్చుకోలేదు. గత నెల 22వ తేదీన రూ.60 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను కర్ణాటక రాష్ట్రం బళ్లారి నుంచి తెస్తూ స్పెషల్ పార్టీ పోలీసులకు పట్టుబడ్డాడు. అతని గుట్కా వ్యాపారాన్ని సీరియస్‌గా పరిగణించిన పోలీసులు పీడీయాక్ట్ నమోదు కోసం జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్పకు ప్రతిపాదనలు పంపగా..వారు అనుమతి ఇచ్చారు. దీంతో మనోహర్‌పై పీడీయాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం కడప సెంట్రల్ జైలుకు తరలించారు. -
చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిపై కేసు నమోదు
సాక్షి, చిత్తూరు : ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌పై కుప్పం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి, బ్యాంక్ నుంచి డబ్బులు కాజేశారంటూ మనోహర్‌పై వైఎస్సార్ సీపీ నేత విద్యాసాగర్ ఫిర్యాదు చేశారు. కాగా చిత్తూరు జిల్లా కుప్పం టౌన్ బ్యాంక్‌లో గోల్మాల్ కలకలం రేపుతోంది. (మీరు కుప్పంలో చేసిందేంటి బాబూ?) చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ ఈ గోల్మాల్ వ్యవహారంలో కీలక సూత్రధారిగా మారటం చర్చనీయాంశం అయింది. వ్యవసాయానికి ఇవ్వాల్సిన నిధులు పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. మనోహర్ సిఫారసుతో పలువురికి అడ్డగోలుగా లోన్లు మంజూరు చేసిన బ్యాంక్ ఇప్పుడు వసూలు చేయలేక తంటాలు పడుతోంది. లోన్లు తీసుకున్న వారు చెల్లించకపోవడంతో బయటపడ్డ ఈ గోల్మాల్ వెనుక బడా నేతల ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. సుమారు 2కోట్ల 97 లక్షల అవినీతి జరిగినట్టు నిర్ధారణ అయింది. -
తాగి వాహనాలు నడిపితే..
శ్రీనివాస్, ఇర్ఫాన్, చంటి, మనోహర్, లోహితలు ముఖ్య పాత్రలు చేస్తున్న చిత్రం ‘రా’. రాజ్ డొక్కర దర్శకత్వం వహించి, నిర్మించారు. దర్శకుడు త్రినాథరావు నక్కిన, అవినాష్, సతీష్ బోట్ల ముఖ్య అతిథులుగా పాల్గొని ‘రా’ చిత్రం పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా త్రినాథరావు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా టైటిల్ చాలా కొత్తగా అనిపించింది. ‘రా’ సినిమాలో కంటెంట్ హారర్ కామెడీ, లవ్‌స్టోరీ ఉందని అర్థమవుతోంది. రాజ్ డొక్కర దర్శకత్వం వహిస్తూ, సినిమాని నిర్మించటం గ్రేట్ ’’ అన్నారు. ‘‘ఈ టైటిల్ ఎందుకు పెట్టామనేది ఇంట్రవెల్లో తెలుస్తుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ మెసేజ్ కూడా ఉంటు ంది. 2 పాటలు, రెండు ఫైట్లు మినహా షూటింగ్ పూర్తయింది’’ అన్నారు. -
ఆస్పత్రి నుంచి మాధవి డిశ్చార్జ్
సాక్షి, హైదరాబాద్: తండ్రి చేతిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న మాధవి(22)ని వైద్యులు బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకున్నట్లు ప్రకటించారు. ఎర్రగడ్డ ప్రేమ్‌నగర్‌కు చెందిన సందీప్(24), బోరబండ వినాయకనగర్‌కు చెందిన మాధవి(22) ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో మాధవి తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో వారు తల్లిదండ్రులకు చెప్పకుండా సెప్టెంబర్ 12న అల్వాల్ ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. పోలీసుల కౌన్సెలింగ్ తర్వాత మాధవి తండ్రి మనోహరాచారి కొత్త దంపతులకు బట్టలు కొనిస్తానని, ఎర్రగడ్డకు రావాలని ఆహ్వానించడంతో సెప్టెంబర్ 19న వారిద్దరూ అక్కడికి చేరుకున్నారు. అక్కడ మనోహరాచారి కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన మాధవిని యశోద ఆస్పత్రికి తరలించారు. తెగిపోయిన చేయి సహా చెవి, మెడ భాగంలోని నరాలు, కండరాలను వైద్యులు అతికించారు. చికిత్స పూర్తయిన తర్వాత తాజాగా డిశ్చార్జి చేశారు. కాగా, ఇప్పటివరకు మాధవిని చూసేందుకు తల్లిదండ్రుల తరఫు బంధువులెవరూ రాలేదు. నమ్మకంతోనే పెళ్లి చేసుకున్నా: మాధవి, బాధితురాలు సందీప్‌పై పూర్తి నమ్మకం ఏర్పడిన తర్వాతే ఆయన్ను పెళ్లి చేసుకోవాలని భావించాను. ఇదే విషయాన్ని మా ఇంట్లో కూడా చెప్పాను. అయితే, వారు అంగీకరించకపోవడం వల్లే ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నాం. దాడి తర్వాత చాలా అవస్థ పడ్డాను. నాలాంటి పరిస్థితి మరే ప్రేమికురాలు ఎదుర్కోకూడదు. దాడి చేసిన వారెవరైనా సరే శిక్ష అనుభవించి తీరాల్సిందే. నమ్మించి మోసం చేశాడు: సందీప్, మాధవి భర్త పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటికి రావాలని మనోహరాచారి ఆహ్వానించాడు. రిసెప్షన్ చేస్తామని చెప్పాడు. కొత్త బట్టలు కొనిస్తానని నమ్మించాడు. తీరా వచ్చిన తర్వాత దాడికి పాల్పడ్డాడు. ప్రాణాపాయస్థితిలో వచ్చిన నా భార్యను యశోద ఆస్పత్రి ఆదుకుంది. వైద్యఖర్చులను భరించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. -
అదిరెన్ ఇడ్లీ
అ షాపులో అరటి ఆకు వేస్తారు... నాలుగు రకాల పచ్చళ్లు వడ్డిస్తారు...మరోవ్యక్తి పళ్లెం నిండా ఇడ్లీలు, గారెలు పుచ్చుకుని వస్తాడు... ఇంకొకరు శొంఠి పొడి, నెయ్యి తీసుకువస్తారు...‘మీకు ఏం కావాలి’ అంటూ తమిళ భాషలో ప్రశ్నిస్తూ, కొసరికొసరి వడ్డిస్తారు...ఆ ప్రదేశం పేరు మురుగన్ ఇడ్లీ షాపు...ఆ యజమాని పేరు మనోహర్...మదురై పేవ్మెంట్ ప్రారంభమైన వీరి ప్రయాణం‘మురుగన్ ఇడ్లీ షాపు’ గా విదేశాల స్థాయికి ఎదిగింది. ఆ ఫుడ్ ప్రింట్స్ ఈ వారం... ‘‘మా తల్లిదండ్రులు చెప్పినట్టు విని ఉంటే, నేను వంటగదిలోకి అడుగుపెట్టేవాడినే కాదు. వాళ్లు నన్ను బ్యాంకు ఉద్యోగిగానో, కాలేజీ ప్రొఫెసర్‌గానో చూడాలనుకున్నారు’’ అంటారు మురుగన్ ఇడ్లీ షాపు అధినేత 55 సంవత్సరాల మనోహర్. చదివిన లా డిగ్రీని పక్కనపెట్టి, తల్లిదండ్రులు నడుపుతున్న చిన్న కాఫీ షాపుని మదురై నుంచి చెన్నైకి, అక్కడ నుంచి సింగపూర్ స్థాయికి తీసుకువచ్చారు. ప్రతిరోజూ మురుగన్ ఇడ్లీ షాపు కనీసం రోజూ 25,000 ఇడ్లీలను, 13 బ్రాంచీలలో అమ్ముతోంది. బిజీ సమయాల్లో ఇడ్లీ తినాలంటే ఇక్కడ కనీసం 45 నిమిషాలు నిరీక్షించాల్సిందే. ఇక్కడ ఇడ్లీ తిన్న తరవాత చాలామంది ‘మెత్తగా ఉండే మురుగన్ ఇడ్లీ, రకరకాల చట్నీలు కావాలి’ అని అడగడం సహజమైపోయింది. అలా మొదలైంది... కుటుంబ ఆదాయానికి వేణ్నీళ్లకు చన్నీళ్లు అన్నట్లుగా మనోహర్ తల్లి 1960 ప్రాంతంలో మదురై పేవ్మెంట్ మీద హంగు ఆర్భాటం లేకుండా అతి సామాన్యంగా ఇడ్లీ దుకాణం ప్రారంభించారు. ‘‘మా తల్లిగారు కేవలం ఇడ్లీలు తయారుచేసి అమ్మేవారు. ఇడ్లీలలోకి రెండు రకాల చట్నీలు మాత్రమే చేసేవారు. సాంబారు కూడా ఉండేది కాదు. కస్టమర్లు వాటిని ఎంతో ఇష్టంగా తినేవారు. ఆ చిన్న స్టాలే ఎంతో పేరు సంపాదించుకుంది’’ అంటారు మనోహర్.ఒకసారి దివంగత కె. కామరాజు కారులో అటు వెళ్తున్న సమయంలో, ఆ షాపు దగ్గర జనం గుమిగూడి ఉండటం చూసి, తాను కూడా అక్కడ ఇడ్లీ తినాలని కారు ఆపుకున్నారంటే ఆ ఇడ్లీలకు ఎంత పేరు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. 1970 నాటికి ఆ స్టాల్ చిన్న దుకాణంగా మారింది. ‘‘మురుగన్ మా కులదైవం కావడం వల్ల మా షాపుకి ‘మురుగన్ కాఫీ నిలయం’ అని పేరు పెట్టాం’’ అని గతం వివరిస్తారు మనోహర్. 1993 నాటికి మనోహర్ చదువు పూర్తి చేయడంతో, ఇంట్లో వారి కోరికను కాదని పూర్తిస్థాయిగా ఈ వ్యాపారంలోకి ప్రవేశించారు. ‘‘చిన్నతనం నుంచీ నాకు ఇలాంటి ఒక షాపు నడపాలని కోరికగా ఉండేది. మా తల్లిదండ్రులు మాత్రం, ‘చదువుకున్నవారు పనివాళ్లతో పనిచేయించలేరు’ అని నన్ను వెనక్కులాగారు. నేను ఏ మాత్రం పట్టు విడిచిపెట్టలేదు. ఈ దుకాణం నా చేతిలోకి వచ్చాక సీటింగ్ కెపాసిటీ పెంచాను. ఇంటీరియర్‌లో మార్పులు చేశాను. మెనూలో ఇడ్లీలతో పాటు చక్ర పొంగలి, దోసె, వడ, మరిన్ని చట్నీలు, సాంబారు... వంటివి చేర్చాను’’ అని ఎంతో ఆన ందంగా చెబుతున్న మనోహర్, కేవలం రెండు సంవత్సరాలలో మదురైలో మరో రెండు శాఖలు తెరిచి, పది సంవత్సరాల కాలంలో 30 లక్షల టర్నోవర్ స్థాయికి తీసుకువెళ్లారు. ‘‘రెండు నెలల పాటు చెన్నై అంతా తిరిగిన తర్వాత టి. నగర్లో మొట్టమొదటి ఇడ్లీ షాపును ప్రారంభించాను. ‘ఇడ్లీ కడై’ అని తమిళ పేరుతో ప్రారంభించడంతో ఆ పేరు ఎలా వినపడుతుందో అని సందేహపడ్డాను. ఆంగ్లంలో ‘మురుగన్ ఇడ్లీ షాప్’ అని పేరు స్థిరపరిచాను. ఆరు నెలల తర్వాత టి. నగర్లోనే మరో ఇడ్లీ షాపు తెరిచాను. ప్రస్తుతం చెన్నపట్టణంలో పది షాపులు ఉన్నాయి. ఇక ధైర్యం వచ్చింది. 2008లో సింగపూర్‌లో తెలుగు, తమిళలు ఎక్కువగా ఉండే ముస్తఫా స్టోర్ ఎదురుగా ఒక షాపు ప్రారంభించాను. ఆ రోజే అక్కడ ఇడ్లీలు తినడానికి పెద్ద క్యూ ఏర్పడింది’’ అని సంబరంగా చెబుతారు మనోహర్. మురుగన్ ఇడ్లీ షాపులో వడ్డించే విధానం, తయారుచేసే విధానం... భోజన ప్రియుల్ని బాగా ఆకర్షిస్తుంది. ‘‘ఇన్ని రెస్టారెంట్లు ఉన్నప్పటికీ ఇడ్లీలు మాత్రం ఒకే చోట తయారుచేసి, అన్ని బ్రాంచీలకు సప్లయి చేస్తారు. ఆరోగ్యకరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ‘‘అన్నిరకాల పదార్థాలు అరటి ఆకుల్లోనే వడ్డిస్తాం. అన్లిమిటెడ్ చట్నీ సాంబారు వడ్డిస్తాం’’ అని చెబుతున్న వీరి ఇడ్లీ షాపులో ‘పొడి కావాలా’, ‘నెయ్యి కావాలా’ అని కొసరి కొసరి వడ్డిస్తారు. వీరికి పోటీగా ఉన్న హోటల్స్‌లో పెద్ద పుస్తకం పరిమాణంలో మెనూ కార్డులు ఇస్తారు. ఇక్కడ కేవలం ఆరోగ్యకరమైన భారతీయ వంటకాలు మాత్రమే దొరుకుతాయి. చెన్నైలోని ఒక మార్కెట్ రిసెర్చర్ మురుగన్ ఇడ్లీ షాపు గురించి ‘ఈ షాపు చైనీ వంటకాల నుంచి చాట్ వరకు అమ్మకపోవడం చాలా సంతోషం’ అంటారు. ‘‘ఇడ్లీ తయారీలో మినప్పప్పు, ఉప్పుడు బియ్యం పరిమాణం ఎంత అన్నది రహస్యంగానే ఉంచాం’’ అంటున్న మనోహర్ మెనూను స్వయంగా తయారుచేసుకున్నారు. ఇక్కడి కాఫీ కూడా రుచిగా ఉంటుంది. ‘మా అమ్మ తయారుచేసే వాటికే మరి కొన్ని జోడించాను’ అంటారు మనోహర్. చాలామంది వీటిని అనుకరించడానికి ప్రయత్నించి, విఫలమయ్యారు. ఇడ్లీ, వడ, దోసెతో పాటు జిగర్‌ఠండా, ఉల్లి ఊతప్పమ్ వీరి ప్రత్యేకం. చిన్న ఉల్లిపాయలు మాత్రమే ఇందుకు ఉపయోగిస్తారు. వాటి తొక్క తీయడం చాలా కష్టం. చిన్న ఉల్లిపాయల వల్లే ఊతప్పానికి రుచి చేరుతుంది. ‘ఉల్లి పాయలు ఒలవడానికి 20 మందిని నియోగించాను. వారంతా మదురైలోనే ఉంటారు. వారు తొక్క తీసి అన్ని ప్రాంతాలకు చేర వేస్తారు. మేం ఇంతవరకూ మురుగన్ ఇడ్లీ షాపు ప్రకటనల కోసం ఎక్కువ ఖర్చు చేయలేదు’’ అని గర్వంగా చెబుతారు మనోహర్.‘‘మా తల్లిదండ్రుల్లా కాకుండా నేను మాత్రం ఈ వ్యాపారాన్ని నా కుమారుడితో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రస్తుతం నా దృష్టంతా ప్రపంచ దేశాల మీద ఉంది. రానున్న పది సంవత్సరాలలో మరో 300 శాఖలు ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నాను’’ అంటారు మనోహర్. – వైజయంతి పురాణపండ -
మనోహర్ మరోసారి...
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా శశాంక్ మనోహర్ మరో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. తొలి స్వతంత్ర చైర్మన్‌గా 2016లో ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన రెండోసారి కూడా ఎలాంటి పోటీ లేకుండా ఎంపిక కావడం విశేషం. ఐసీసీ డైరెక్టర్లందరూ మరో మాటకు తావు లేకుండా శశాంక్ అభ్యర్థిత్వానికి మద్దతు పలికారు. ఫలితంగా ఒక్క మనోహర్ నామినేషన్ మాత్రమే రావడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఐసీసీ ప్రకటించింది. బీసీసీఐ మాజీ అధ్యక్షుడైన మనోహర్, గత రెండేళ్ల కాలంలో ఐసీసీలో సమర్థంగా పని చేస్తూ పలు సంస్కరణలు చేపట్టారు. ‘ఐసీసీ చైర్మన్‌గా మళ్లీ ఎంపిక కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. వచ్చే రెండేళ్ల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌కు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ఐసీసీ సభ్యులందరితో కలిసి పని చేస్తాం. ప్రస్తుతం క్రికెట్ ఉచ్ఛ స్థితిలో ఉంది. దీనిని ఇలాగే కొనసాగించేందుకు శ్రమించాల్సి ఉంది’ అని శశాంక్ మనోహర్ వ్యాఖ్యానించారు. ఐసీసీ–బీసీసీఐ అధికారుల భేటీ! టెస్టు క్రికెట్ భవిష్యత్తు సహా పలు కీలక అంశాలపై చర్చించేందుకు బీసీసీఐ అధికారులతో ఐసీసీ బృందం గురువారం భేటీ కానుంది. ఐసీసీ నిబంధనలు రూపొందించే వర్కింగ్ గ్రూప్ వాటిపై సభ్య దేశాల అభిప్రాయాలు తెలుసుకుంటుంది. ఇందులో భాగంగానే ఈ సమావేశం జరుగనుంది. బోర్డు తరఫున తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా, తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి, కోశాధికారి అనిరుధ్ చౌదరి, సీఈఓ రాహుల్ జోహ్రి దీనికి హాజరయ్యే అవకాశం ఉంది. త్వరలో టెస్టు క్రికెట్ చచ్చిపోతుందని ఇటీవల బ్రెండన్ మెకల్లమ్ చేసిన వ్యాఖ్యలు, కుర్రాళ్లు దేశం తరఫున టెస్టు ఆడటంకంటే టి20 లీగ్‌లకే ప్రాధాన్యత ఇస్తుండటం, డే అండ్ నైట్ టెస్టుల నిర్వహణ తదితర అంశాలపై బీసీసీఐ తమ అభిప్రాయాలు, సూచనలు ఐసీసీ బృందానికి వెల్లడిస్తుంది. -
నూతన వధూవరులకు సీఎం కేసీఆర్ సర్ఫ్రైజ్
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు కార్యక్రమంలో పాల్గొనడానికి కరీంనగర్ నుంచి హుజూరాబాద్ వెళ్లుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మార్గమధ్యంలో తాడికల్ వద్ద వివాహ వేడుకను చూశారు. వెంటనే బస్సు దిగి నూతన వధూవరులు కావ్య, మనోహర్‌లను పలకరించి, అక్షితలు చల్లి ముఖ్యమంత్రి ఆశీర్వదించారు. కళ్యాణలక్ష్మి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అనుకోని అతిథిలా ముఖ్యమంత్రి స్వయంగా రావడంతో వధూవరుల బంధువులు ఆనంద,ఆశ్చర్యాలకు గురయ్యారు. ముఖ్యమంత్రికి, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. -
న్యాయవాది కుమారుడి కిడ్నాప్‌నకు యత్నం
కాజీపేట రూరల్: హైకోర్టు న్యాయవాది కుమారుడిని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌కు యత్నించారు. సికింద్రాబాద్‌లోని ఇందిరానగర్ వారసిగూడకు చెందిన హైకోర్టు న్యాయవాది ఎన్.నర్సింహారావు ఇంటికి సోమవారం రాత్రి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వెళ్లి అతడి కుమారుడు సాయి మనోహర్ (12)ను కిడ్నాప్ చేసి మారుతికారులో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ముందు సెంటర్ వరకు తీసుకొచ్చారు. అప్పటికే బాలుడు ఏడుస్తుండగా హోటల్‌కు వెళ్లి ఏమైనా తీసుకొస్తామని ఒకరు లోపలికి వెళ్లగా మరొకరు బయట ఉన్నారు. కాగా, తనను కిడ్నాప్ చేస్తున్నట్లుగా గుర్తించిన మనోహర్ వారి నుంచి తప్పించుకుని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లోపలికి పరుగెత్తుకొచ్చాడు. రాత్రి 11.30 గంటలకు సికింద్రాబాద్ నుంచి గూడూరుకు వెళ్తున్న సింహపురి ఎక్స్‌ప్రెస్‌ను ఎక్కాడు. దీంతో రైలులో ఉన్న ఎస్కార్ట్ పోలీసులు గమనించి కోపగించగా బాలుడు జరిగిన విషయం వారికి తెలిపాడు. కాగా, అర్ధరాత్రి 1.30 గంటలకు రైలు కాజీపేట జంక్షన్‌కు చేరుకోగా ప్లాట్‌ఫాంపై పెట్రోలింగ్ చేస్తున్న ఏఎస్ఐ రాజిరెడ్డికి బాలు డిని ఎస్కార్ట్ పోలీసులు అప్పగించగా.. వారు తల్లిదండ్రులకు అప్పగించారు. -
సీఎం పీఏనా..?మజాకా..!
చిత్తూరు, కుప్పం: సీఎం పీఏ మెప్పుకోసం కుప్పం అధికార పార్టీ నాయకులు, కాంట్రాక్టర్లు అత్యుత్సాహం చూపిస్తున్నారు. బాగున్న రోడ్డుకు మళ్లీ మరమ్మతులు చేపట్టి ప్రజా ధనాన్ని సైతం వృథా చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం అప్పటి జిల్లా పరిషత్ చైర్మన్ సుబ్రమణ్యంరెడ్డి హయాంలో రూ.5 లక్షల వ్యయంతో సీఎం పీఏ మనోహర్ ఇంటి ముందు, ఓ విద్యా సంస్థకు అనుకూలంగా సిమెంటు రోడ్డును ప్రత్యేకంగా వేశారు. అప్పట్లో జెడ్పీ చైర్మన్ అనుచరుడిగా ఉన్న దళవాయికొత్తపల్లెలోని ఓ నాయకుడు కాంట్రాక్టు పనులు తీసుకుని ఈ రోడ్డు పనులను పూర్తి చేశాడు. ప్రస్తుతం ఇదే కాంట్రాక్టరు అధికారం మారడంతో పార్టీలు మారాడు. ఆ కాంట్రాక్టరే మళ్లీ నాయకుడిగా అవతారమెత్తాడు. పాత రోడ్డును పూర్తిగా తవ్వి రూ.20లక్షలతో మరమ్మతులతో రోడ్డు పూర్తి చేశాడు. అప్పట్లో సిమెంటు రోడ్డుకు ఓ వైపు నిర్మించిన కాలువ సైతం ఇప్పటికీ దర్శనమిస్తోంది. అధికార దుర్వినియోగం... సీఎం పీఏ మనోహర్ మెప్పు పొందేందుకు స్థానిక నేతలు ఇలా ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. పట్టణంలో గుంతలమయమై నడవలేని స్థితిలో చాలా రహదారులు ఉన్నాయి. ప్యాలెస్ ఎక్స్టెన్షన్లో ఇప్పటికీ మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తున్నా పట్టించుకునేవారే లేరు. అధికార పార్టీ నేతలకు మాత్రం వేసిన రోడ్లనే మళ్లీ వేస్తూ ప్రజాధనాన్ని స్వప్రయోజనం కోసం వినియోగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
పెళ్లి చేసుకొని పారిపోయాడు
♦ న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు ♦ గతంలోనూ పలు పెళ్లిళ్లు చేసుకున్నాడన్న మొదటి భార్య సాక్షి పలమనేరు : తాను రియల్టర్‌నని, తన భార్య చనిపోయిందని మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుని నెలరోజుల తర్వాత భర్త పారిపోయాడు. బాధితురాలు న్యాయం కోసం ఆదివారం పలమనేరు పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం మేరకు.. పలమనేరుకు చెందిన మనోహర్ విశాఖ జిల్లా చోడవరం మండలం లక్కవరంలో కొన్నాళ్లుగా ఉంటున్నాడు. తాను రియల్టర్‌నని అక్కడ చెప్పుకునేవాడు. ఈ క్రమంలో తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, భార్య చనిపోయిందని అదే గ్రామానికి చెందిన ఓ మ్యారేజ్ బ్రోకర్‌కు చెప్పాడు. తాను రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు. బ్రోకర్ ద్వారా అదే గ్రామానికి చెందిన తాతాబాయి కుమార్తె నాగమణిని గత నెల 16న సింహాచలం ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. అత్తగారింట్లోనే కాపురం పెట్టాడు. అదే ప్రాంతంలో పలువురు నిరుద్యోగులకు ఉద్యోగాలు తీసిస్తానంటూ డబ్బులు వసూలు చేశాడు. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయం తెలుసుకున్న మనోహర్ భార్యను వదలి అక్కడి నుంచి ఉడాయించాడు. అతను మరిచిపోయిన పర్సును పరిశీలించగా చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన వాడిగా గుర్తించారు. బాధితురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం పలమనేరు పోలీసులను ఆశ్రయించింది. మనోహర్ మొదటి భార్యను పోలీసులు విచారించారు. మనోహర్ గతంలోనూ కదిరి, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో పెళ్లిళ్లు చేసుకున్నాడని తెలిపింది. స్థానికంగా ట్రాన్స్‌కోలో ఉద్యోగాలు తీసిస్తానంటూ పలువురికి టోపీ పెట్టినట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో తాను మోసపోయినట్టు గ్రహించిన బాధితురాలు నాగమణి లబోదిబోమంటోంది. న్యాయం చేయాలని పోలీసు స్టేషన్ వద్దే వేచి చూస్తోంది. మనోహర్ అందుబాటులో లేడని అతని మొదటి భార్య చెప్పడం గమనార్హం. -
వడదెబ్బకు మరో ఇద్దరి మృతి
అనంతపురం రూరల్ : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం మరో ఇద్దరు వడదెబ్బకు గురై మరణించారు. అనంతపురం రూరల్ మండలం పామురాయి గ్రామానికి చెందిన మనోహర్(50) వడదెబ్బతో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. సోములదొడ్డిలోని ఓ ప్రైవేటు షోరూంలో సెక్యూరిటీ గార్డుగా పని చేసే మనోహర్ వడదెబ్బకు గురై కుప్పకూలిపోయారన్నారు. గమనించిన సహచరులు చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వివరించారు. మృతునికి భార్య నాగలక్ష్మి ఉన్నారు. గుత్తిలో మరొకరు.. గుత్తి (గుంతకల్లు) : గుత్తి చెర్లోపల్లి కాలనీలో వడ్డే ఉలిగన్న(49) వడదెబ్బకు గురై మృత్యువాత పడ్డారని కాలనీవాసులు తెలిపారు. శనివారం రాళ్లు కొట్టేందుకు పట్టణ సమీపంలోని గుట్టకు వెళ్లిన అతను మధ్యాహ్నం సొమ్ముసిల్లి పడిపోయాడని వివరించారు. వెంటనే స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున ప్రాణాలు విడిచినట్లు చెప్పారు. మృతునికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. -
యూత్‌పుల్ పెళ్లి కథ
శ్రీ రామాంజనేయులు ఇంటర్నేషనల్ మూవీ కార్పొరేషన్ పతాకంపై జి.యన్. మూర్తి దర్శకత్వంలో వడ్డి రామాంజనేయులు నిర్మిస్తున్న చిత్రం ‘పెళ్లి కథ’. మనోహర్, ఇషికా, అయేషా ముఖ్య తారాగణం. తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్‌ను ఇటీవల ప్రారంభించారు.ఈ సందర్భంగా నిర్మాత రామాంజనేయులు మాట్లాడుతూ– ‘‘ఇది యూత్‌పుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫస్ట్ షెడ్యూల్లో సగానికిౖ పెగా చిత్రీకరణ జరిపాం. సెకండ్ షెడ్యూల్లో బ్యాలెన్స్ షూటింగ్‌ను హైద్రాబాద్, వైజాగ్‌లో కంప్లీట్ చేసి త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తాం’’ అన్నారు. -
ప్రియురాలి కోసం దొంగ అవతారం
- ఎట్టకేలకు పట్టుబడిన అంతర్రాష్ట్ర దొంగ - 51 బైక్‌లు స్వాధీనం - నిందితుడు గోరంట్ల మండల వాసి ఎంతటి వాడైనా కాంతదాసుడే అంటారు. నిజమే. ప్రేమించిన అమ్మాయి కోర్కెలు తీర్చేందుకు ఓ యువకుడు దొంగ అవతారం ఎత్తాడు. అతని కాలంలోనే అంతర్రాష్ట్ర దొంగగా ఎదిగిపోయాడు. చివరకు పోలీసుల వలకు చిక్కి కటకటాలు లెక్కిస్తున్నాడు. చేజేతులా భవిష్యత్తును నాశనం చేసుకున్నాడు. బెంగళూరు : అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పెట్లకుంటపల్లికి చెందిన మనోహర్ అలియాస్ మను అనే అంతర్రాష్ట్ర దొంగను బెంగళూరు పోలీసులు ఎట్టకేలకు వలపన్ని అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. అతని నుంచి 51 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు పోలీస్ అదనపు కమిషనర్ హేమంత్ నింబాళ్కర్ నిందితుడ్ని మీడియా ముందు శనివారం హాజరుపరిచారు. వాటి వివరాలను వివరించారు. పరిచయం.. ప్రేమ.. సహజీవనం... బెంగళూరులోని హొంగసంద్ర నాయుడు లేఔట్‌కు చెందిన మనోహర్ బొమ్మనహళ్లిలోని ఓ గార్మెంట్స్‌లో టైలర్‌గా పని చేసేవాడు. గోరంట్ల ప్రాంతానికి చెందిన ఓ యువతి కూడా అక్కడే మరో గార్మెంట్స్‌లో పని చేసేది. ఇద్దరిదీ ఒకే ప్రాంతం కావడంతో పరిచయం ప్రేమకు దారితీసింది. ఈ నేపథ్యంలో అనారోగ్యం కారణంగా సదరు యువతి సొంత ఊరికి వెళ్లిపోయింది. తిరిగి బెంగళూరు రావాలని ఆమెను మనోహర్ తరచూ ఫోన్లో కోరేవాడు. అద్దె ఇంటిని తీసుకుంటే వస్తానంటూ ఆమె షరతు పెట్టింది. చివరకు ఆమె చెప్పినట్లే హొంగసంద్రలో ఓ అద్దె గదిని తీసుకుని ప్రియురాలితో సహజీవనం చేయసాగాడు. అదే సమయంలో వచ్చే జీతంతో సంసారం సాగించడం కష్టమని భావించిన మనోహర్ మరోసారి దొంగ అవతారం ఎత్తాడు. కన్నుపడితే మాయం చేసేవాడు బైక్‌ల అపహరణలో ఆరితేరిన మనోహర్ బెంగళూరు రాకముందు హిందూపురం, కదిరి ప్రాంతాల్లో బైక్‌లు చోరీ చేసేవాడు. అతనిపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. మడివాళ, బేగూరు, బొమ్మనహళ్లి, మధుగిరి, కొరటెగెరె, మిడగేసి, బాగేపల్లి, గుడిబండ తదితర ప్రాంతాల్లో బైక్‌లను చోరీ చేసిన కేసులు నమోదై ఉన్నాయి. కన్నుపడితే చాలు క్షణాల్లోఆ బైక్‌ను అపహరించడం మనోహర్‌కు వెన్నతో పెట్టిన విద్య. అయితే అతను పోలీసులకు చిక్కకుండా చాలా జాగ్రత్తలు తీసుకునేవాడు. దీంతో పోలీసులకు సవాల్‌గా మారాడు. పోలీసుల వలకు చిక్కిందిలా.. కదిరి, గుడిబండ గ్యాంగ్‌ల కోసం గాలింపు చర్యలు చేపట్టిన బెంగళూరు పోలీసులు.. పాత బైక్‌లు కొంటామంటూ ప్రకటన ఇచ్చారు. దీంతో పోలీసులు ఇచ్చిన ఫోన్ నెంబర్‌కు మనోహర్ పలుమార్లు ఫోన్లు చేసి సంప్రదించాడు. బొమ్మనహళ్లి పోలీసులు మారువేషంలో బైక్‌ల కొనుగోలు నెపంతో నాయుడు లేఔట్‌కు శనివారం వెళ్లి మనోహర్‌ను పట్టుకున్నారు. అతని వద్దనున్న 51 బైక్‌లను చూసి విస్తుపోయారు. వాటి విలువ సుమారు రూ.25 లక్షలు ఉంటుందని అంచనా. మనోహర్‌ను వెంటనే అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారణ చేపట్టగా.. ప్రియురాలి కోసమే బైక్‌ల చోరీకి పాల్పడుతున్నట్లు అంగీకరించాడు. అయితే దొంగతనాలు చేసి ప్రియుడు తనను పోషిస్తున్నట్లు ఆ అమాయకురాలికి తెలియదు. డీసీపీ బోరలింగయ్య, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘ఎయిర్ పోర్టులో అప్రమత్తత అవసరం లేదు’
హైదరాబాద్: స్వైన్‌ప్లూతో జనవరి నుంచి ఇప్పటివరకు 16 మంది మృతి చెందారని, 1246 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని నిమ్స్ డైరెక్టర్ మనోహర్ తెలిపారు. స్వైన్‌ప్లూకు భయపడాల్సిన పనిలేదని, కనీస జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నారు. నిన్న ఆస్పత్రిలో చేరిన చిన్నారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వెల్లడించారు. 14 స్వైన్ ప్లూ ప్రికాషన్ కేంద్రాల్లో 2 మాత్రమే పనిచేస్తున్నాయని తెలిపారు. కేంద్రం సాయంతో మరొకటి ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఎయిర్ పోర్టులో అప్రమత్తం చేయాల్సిన అత్యవసర పరిస్థితి లేదన్నారు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో స్వైన్‌ప్లూ వ్యాప్తి ఎక్కువగా ఉందని వెల్లడించారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో స్వైన్‌ప్లూ కేసులు ఎక్కువగా నమోదైనట్టు తెలిపారు. ఈ సీజన్లో జెనెటిక్ షిప్ట్, జెనటిక్ డ్రిప్ట్ అనే వైరస్ ల ద్వారా స్వైన్‌ప్లూ వ్యాపిస్తోందన్నారు. వైరస్ ను నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపి తీవ్రత నమోదు చేయటనున్నట్టు మనోహర్ తెలిపారు. -
క(వ)ల చెదిరింది..
► మృత్యుపోరులో ఓడిన చిన్నారి ► ఏడేళ్ల క్రితం నాన్న.. ఐదురోజుల క్రితం అమ్మ.. ► నేడు ఆరేళ్ల ఉమంత్.. మృత్యుఒడికి ► కవలల్లో ఒంటరైన ఉహాసిని ► కుటుంబాన్ని ఛిద్రం చేసిన రోడ్డు ప్రమాదం కన్ను తెరవకముందే నాన్న పోయాడు. అయినా అమ్మే సర్వస్వం అనుకున్నారు ఆ కవలలు..కానీ విధి వెక్కిరించింది. ఐదు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో అమ్మ కూడా దూరమైంది. అమ్మతోపాటు గాయపడిన ఆరేళ్ల ఉమంత్ కూడా మత్యుపోరాటంలో గురువారం రాత్రి ఓడిపోయాడు. వేలూరుకు తరలించినా ఫలితం దక్కలేదు. దీంతో ఆ కుటుంబంలో ఆరేళ్ల ఉహాసిని ఒంటరైంది. చంద్రగిరి మార్గంలో గత ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని ఛిద్రం చేసింది. కన్నీటి సంద్రంలోకి నెట్టివేసింది. మాటలకందని విషాదమిది.. తిరుపతి మెడికల్ : అనుకోని ప్రమాదం ఆ కుటుంబాన్ని ఛిద్రం చేసింది. తిరుపతి ఎంఆర్‌పల్లికి చెందిన చందన, మనోహర్ దంపతులకు ఉమంత్, ఉహాసిని కవల పిల్లలు. పంచాయతీ రాజ్ శాఖలో ఏఈగా పనిచేసిన మనోహర్ 2010లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. కారుణ్య కోటాలో భార్య చందనకు తిరుపతి సబ్‌కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. దీంతో ఆమె కవల బిడ్డల్ని తండ్రి లేని లోటు తీర్చుతూ పెంచుతోంది. ఇంతలో మరో విషాదం ఆకుటుంబాన్ని తాకింది. గత ఆదివారం ఏడేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలతో కారులో వెళుతూ చంద్రగిరి వద్ద రోడ్డు ప్రమాదానికి గురై చందన ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదంలో కవల పిల్లలు ఉమంత్, ఉహాసిని తీవ్రగాయాల పాలయ్యారు. ఉమంత్‌కు ఇదివరకే గుండెకు సంబంధించిన వ్యాధి ఉండటం, రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో మెరుగైన చికిత్స కోసం ఉమంత్(7)ని వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ గురువారం ఉదయం వైద్యులు ఆపరేషన్‌ను నిర్వహించారు. ఆరోగ్యంగా కోలుకుంటాడనుకున్న ఉమంత్ పరిస్థి తి అకస్మాత్తుగా మారిపోయింది. గురువారం రాత్రి తుదిశ్వాస విడిచాడు. ఈ సంఘటన చందన కుటుంబ సభ్యులను తీరని విషాదంలో ముంచింది. కవలల్లో ఒకరు మృతి చెందడంతో ఉహాసిని ఒంటరిగా మిగిలింది. ఎడమకాలు విరగడంతో రుయాలో చికిత్స పొందుతోంది. తల్లికి ఏమైందో, తనతో పాటు పుట్టిన అన్న ఎలా ఉన్నాడో కూడా తెలియని ఆ చిట్టి తల్లి అమ్మకావాలంటుంటే రుయా వైద్యులు కంటతడి పెడుతున్నారు. విషయం దాచి పంటిబిగువున దుఃఖాన్ని అదిమిపెట్టుకుని వైద్యం చేస్తున్నారు. తన వద్దకు వచ్చిన వారిని అమ్మ కావాలంటూ ఆత్రుతగా అడగడం చూపరులను కంటతడిపెడుతోంది. అమ్మ వస్తుందని ఎదురుచూస్తోంది. కుటుంబం లో ముగ్గురు రోడ్డు ప్రమాదాల్లోనే చనిపోవడం కుటుంబ సభ్యులను కలచివేస్తోంది. వేలూరు నుంచి ఉమంత్ మృతదేహాన్ని తిరుపతికి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉమంత్ కోలుకోవాలని ఇక్కడ రెవెన్యూ అధికారులు విశ్వప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. కవల చిన్నారులను విషాదం విడదీయడం చందన కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోతున్నారు. తుంటిఎముక, వెన్నెముక ఆపరేషన్ చేస్తుండగా గుండెపోటు రావడంతో బాలుడు మృతిచెందినట్టు రెవెన్యూ అసోసియేషన్ నాయకులు నరసింహులు నాయుడు తెలిపారు. కాగా ఉమంత్‌కు పుట్టుకతోనే గుండెసంబంధ వ్యాధి ఉంది. శస్త్రచికిత్స చేస్తే ప్రాణాపాయమని వైద్యులు చెప్పడంతో చందన వెనుకడుగు వేసింది. -
కలెక్టరేట్ ఎదుట సత్యాగ్రహం
సమస్యలు పరిష్కరించాలని వైద్యుల డిమాండ్ ఆదిలాబాద్ అర్బన్ : డాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం కలెక్టరేట్ ఎదుట డాక్టర్లు సత్యాగ్రహం చేపట్టారు. ముందుగా పట్టణంలోని తెలంగాణ చౌక్ నుంచి ర్యాలీగా బయలుదేరి కుమ్రం భీం చౌక్ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అక్కడ కొద్ది సేపు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.ప్రకాశ్, కె.మనోహర్ మాట్లాడారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ న్యూఢిల్లీ కేంద్ర సంఘం పిలుపు మేరకు దేశంలో డాక్టర్లంతా సత్యాగ్ర హం చేపట్టినట్లు తెలిపారు. దేశంలో డాక్టర్లపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తున్నామన్నారు. వైద్యులపై దాడులు జరగకుండా కఠినచర్యలు తీసుకోవాలని, ఇందుకు తగిన చట్టాన్ని తీసుకురావాలన్నారు. చిన్నచిన్న క్లినికల్ పొరపాట్లను సాకుగా చూపి డాక్టర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం డాక్టర్లను అనవసరమైన కేసులలో ఇరికించి ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు. వైద్యవృత్తి మానవీయ కోణంతో ముడిపడి ఉన్నందున చట్టం నుంచి డాక్టర్లను మినహాయించాలన్నారు. అల్లోపతి డాక్టర్లు మాత్రమే అల్లోపతి మందులు ఇవ్వాలని, మరే డాక్టర్లు అల్లోపతి మందులు ఇచ్చినట్లరుుతే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం జేసీ కృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు. వైద్యులు మనోహర్, శ్యామలారాణి, అనిల్ చిద్రాల, మహాభలేశ్వర్, లీనా గుజరాత్, తిప్పేస్వామి, నరోత్తమ్‌రెడ్డి, రవికాంత్, సూర్యకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌ల విక్రయాలపై తనిఖీలు
ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ ల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు శేరిలింగంపల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వి.వి.మనోహర్ గురువారం తెలిపారు. 40 మైక్రాన్ల లోపు సామర్ధ్యం ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌లను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. సర్కిల్ పరిదిలోని మార్కెట్లు, వ్యాపార సముదాయాల్లో ఎంత సామర్ధ్యం ఉన్న బ్యాగ్‌లను విక్రయిస్తున్నారో పరిశీలించేందుకు తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 40 మైక్రాన్ల కన్నా సామర్ధ్యం తక్కువ ఉన్న కవర్లు విక్రయిస్తే వారిపై ఫైన్లు విధిస్తామని హెచ్చరించారు. -
యూనివర్శిటీల సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి
-తెలంగాణ విశ్వవిద్యాలయాల బోధనేతర సిబ్బంది సంఘం పంజగుట్ట(హైదరాబాద్ సిటీ) ముఖ్యమంత్రి కెసీఆర్ ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించడం సంతోషకరమని అదే సమయంలో యూనివర్సిటీలో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలు కూడా పరిష్కరించాలని తెలంగాణ విశ్వవిద్యాలయాల బోధనేతర సిబ్బంది సంఘం డిమాండ్ చేసింది. ఎంతో మంది పేదలకు విద్య అందిస్తున్న ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని విశ్వవిద్యాలయాలకు బ్లాక్గ్రాంట్ని పెంచి నిధులను వెంటనే విడుదల చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ విశ్వవిద్యాలయాల భోధనేతర సిబ్బంది సంఘం అధ్యక్షులు కంచి మనోహర్, సెక్రటరీ జనరల్ కె.మహిపాల్ రెడ్డిలు మాట్లాడుతూ ... ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ప్రతీ నెలా జీతాలు, ఖర్చులకు 33 కోట్ల 50 లక్షలు అవసరం కాగా ప్రభుత్వం కేవలం 19 కోట్లు మాత్రమే కేటాయిస్తున్నారని, వచ్చే నెల జీతాలు వస్తాయో లేదో అన్న అనుమానం ఉందని పేర్కొన్నారు. పదవీవిరమణ పొందిన ఉద్యోగులకు పిఎఫ్ కూడా ఇవ్వడంలేదని ఆవేదనవ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా ఉన్న ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల పరిస్థితి మరీ ఇంత దయనీయంగా ఉండడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి తమకు కూడా ట్రెజరీద్వారా ప్రతీ నెల 1వ తేదీన వేతనాలు చెల్లించాలన్నారు. ప్రతీ సంవత్సరం ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తున్న 238 కోట్ల బ్లాక్‌గ్రాంట్‌ను మరో 170 కోట్లు కలిపి త్వరగా నిధులు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి తమకు హెల్త్‌కార్డులు మంజూరు చేయాలని, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు వెంటనే పెన్షన్, పెన్షనరీ బెనిఫిట్స్‌ను చెల్లించాలని, టైమ్‌స్కేలు, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మెనెంట్ చేయాలని, భోధనేతర సిబ్బంది లేని యూనివర్సిటీల్లో వెంటనే నియామకాలు చేపట్టాని డిమాండ్ చేశారు. తమ సమస్యలపై త్వరలో అధికారులకు, ప్రజా ప్రతినిధులకు వినతిపత్రం ఇస్తామని, అప్పటికీ పరిష్కారం కాకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు జ్ఞానేశ్వర్, నాగభూషనం, శంకర్, ఖదీర్, రాజశేఖర్ రెడ్డి, వినోద్‌కుమార్, రుక్కయ్య, వెంకటేష్, రాము, విజయ్‌కుమార్, నాగభూషనం తదితరులు పాల్గొన్నారు. -
హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవం
కర్నూలు జిల్లా బండిఆత్మకూరు మండలం పడమటూరు గ్రామానికి చెందిన ఒక యువకుడి హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవ జైలు శిక్ష పడింది. పోలీసుల కథనం.. గ్రామానికి చెందిన మనోహర్ అనే యువకుడితో బోయ రాములు కుమార్తె సన్నిహితంగా ఉంటోంది. ఇది నచ్చని రాములు మనోహర్‌ను చంపేందుకు పథకం పన్నాడు. ఈ మేరకు 2013లో మార్చి 2వ తేదీన అతడిని పొలం వద్దకు పిలిపించాడు. రాములుతోపాటు గ్రామానికి చెందిన సుబ్బారాయుడు, విజయ్ కలిసి మనోహర్‌ను విపరీతంగా కొట్టి చంపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. విచారణ చేపట్టిన నంద్యాల మూడో అదనపు జిల్లా జడ్జి ప్రియదర్శిని నేరం రుజువు కావటంతో నిందితులు ముగ్గురికీ యావజ్జీవ జైలు శిక్ష ఖరారు చేస్తూ బుధవారం సాయంత్రం తీర్పునిచ్చారు. -
కొనసాగుతున్న జూడాల నిరసన
రిమ్స్‌లో జూడా(జూనియర్ డాక్టర్)లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి. శనివారం విధులు బహిష్కరించిన జూడాలు ఓపి విభాగం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జూడా అసోసియేషన్ చీఫ్ అడ్వయిజర్ డాక్టర్ మనోహర్ మాట్లాడుతూ విధులు నిర్వర్తించే వైద్యులకు రోజు రోజుకు రక్షణ లేకుండా పోతోందన్నారు. సెక్యూరిటీ సిబ్బంది కొరతతో వైద్యులకు భద్రత లేదని, రోగి బంధువులు పెద్దయెత్తున వచ్చి వైద్యుల విధులకు ఇబ్బందులు కలుగచేస్తున్నారని పేర్కొన్నారు. కొంతమంది మద్యం తాగి వచ్చి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఓపీ, ఎమర్జెన్సీ వార్డులో సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులను నియమించాలని అన్నారు. జూడాలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జూడాలు ప్రవీణ్, దీక్షిత్, స్వేచ్చా, తదితరులు పాల్గొన్నారు. -
టీటీడీ ఉద్యోగి అనుమానాస్పద మృతి
టీటీడీ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా తిరుపతిలోని నెహ్రూనగర్‌లో బుధవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న మనోహరయ్య(52) టీటీడీ పరిధిలో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రస్తుతం విశాఖలోని ఉమా వెంకటేశ్వర స్వామి ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న మనోహరయ్య కొన్ని రోజుల క్రితం ఆయలంలో అశ్లీల కార్యక్రమాలు చేస్తూ పట్టుబడ్డాడంతో అధికారులు అతన్ని సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో అతను మృతిచెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. అంతేకాక.. అతను చనిపోయిన విషయం ఎవరికి తెలయకుండా ఉంచేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించడం కూడా అనుమానాలు రేకెత్తిస్తోంది. వివరాలు.. విశాఖ నుంచి ఈ నెల నాలుగో తేదిన ఇంటికి వచ్చిన మనోహరయ్యను అదే రోజు కుటుంబ సభ్యులు హతమార్చి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. కాగా.. నిన్న రాత్రి ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటాన్ని గమనించిన స్థానికులు వారిని ప్రశ్నించగా.. ఏమి లేదని బుకాయించి.. అర్ధరాత్రి సమయంలో మృతదేహాన్ని ఉంచడానికి ఫ్రీజర్ తెప్పించారు. దీంతో ఇరుగుపొరుగున ఉన్నవారు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని మనోహరయ్య తలపై ఉన్న గాయాలను గుర్తించి భార్య శారదే ఆయన్ని హతమార్చి ఉంటుందని ఆరోపిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉండగా.. పెద్ద కూతురు వివాహం అయింది. చిన్న కూతరు శిరీష బీటెక్ చదువుతోంది. భర్త మృతిచెందితే కారుణ్య మరణం క్రింద కూతురుకు ఉద్యోగం వస్తుందనే ఆశతో ఇద్దరు కలిసి తలపై కొట్టి చంపి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. భర్త మృతిచెందినా కనీసం బంధువులకు కూడా సమాచారం అందించకపోవడంతో భార్య తీరుపై పలువురు అనుమానాలు లెవనెత్తుతున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతికింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పోకండ ఆపండి
కండ కరిగితే కష్టం. గుండె కరిగితే సాయం. ఈ అన్నదమ్ముల కండలు కొద్దికొద్దిగా కరిగిపోతున్నాయి. అవి ఇంకా ఇంకా కరగక ముందే.. మన గుండెలు కరగాలి. వరికి సాయం అందాలి. ‘‘చదువులో ప్రతిభావంతులు... ప్రత్యర్థులను మట్టి కరిపించే ఆట తీరు... మాటలతోనే మైమరిపించే వాగ్ధాటి... నిర్మలమ్మా! నిమ్మళంగా ఉండమ్మా. రామలక్ష్మణుల్లా ఇద్దరు కొడుకులు, లక్ష్మీదేవిలాంటి కూతురు పుట్టారు. నీ కొడుకులకు చదువులో, తెలివిలో సాటిలేరెవ్వరు’’ అని అంటుంటే ఆ తల్లిదండ్రుల మనసు ఉప్పొంగి పోయేది. ఇరవై రెండేళ్ల మనోవేదన కానీ విధి ఆడిన వింత నాటకంలో ఆ అమ్మానాన్న ఓడిపోయారు. విద్యాకుసుమాలై విరిసి, జ్ఞాన సుగంధాన్ని విరజిమ్ముతున్న ఆ అన్నదమ్ములిద్దరినీ మొండి వ్యాధి తినేస్తోంది. పేగు తెంచుకుని పుట్టిన ఇద్దరు బిడ్డలను మాయదారి రోగం కబళించబోతోందని తెలియగానే ఆ వృద్ధ దంపతుల హృదయాలు కకావికలమయ్యాయి. గుండెలు అవిసెలా ఏడ్చారు. తీరొక్క దేవునికి మొక్కారు. అయినా ఏ దేవుడూ కనికరించలేదు. బతుకు మార్గం చూపలేదు. ఇది ఇరవై రెండేళ్ల మనో వేదన. కష్టాల కన్నీటి కథ. ఆ సంతోషం నిలవలేదు! మెదక్ జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామానికి చెందిన కొండా నిర్మల, దుర్గయ్యలకు జగన్నాథం(35), మనోహర్(32), భగవతి(29) సంతానం. నిర్మల బీడీలు చుట్టేవారు. దుర్గయ్య చేనేత కార్మికుడు. పిల్లలను కష్టపడి బాగా చదివిస్తున్నారు. క్లాస్‌లో ఎప్పుడూ ఫస్టే. ఆటల్లో మేటి. మాటల్లో వారికి వారే సాటి. వారి ప్రతిభాపాటవాల ముందు ఎవరూ సరితూగేవారు కాదు. పదవ తరగతి ఫలితాల్లో ఫస్ట్ క్లాస్ సాధించి పాఠశాలకే వన్నె తెచ్చారు. అదంతా చూసి ఆ తల్లిదండ్రుల్లో ఆనందం... పట్టలేనంత సంతోషం. కానీ వారి సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. అన్నిటికీ అమ్మానాన్నే... 1994 నుంచి కండరాల క్షీణత వ్యాధితో కుమారుల కాళ్లు, చేతులు కదలలేని స్థితికొచ్చాయి. వారిని స్థానిక ఆసుపత్రిలో, హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చూపెట్టారు. ఇక్కడ లాభం లేదంటే నిర్మల తల్లిగారి ఊరైన ముంబాయికి తీసుకెళ్లి అక్కడ జె.జె.జస్లోక్ ఆసుపత్రిలో చూపెట్టారు. పిల్లలను పరీక్షించిన వైద్యులు వీరికి ‘కండరాల క్షీణత’ వ్యాధి అని నిర్ధారించారు. వ్యాధి నివారణకు మందులవాడకం తప్ప ఇతర చికిత్స లేనందున ఇద్దరినీ తిరిగి స్వగ్రామానికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఇద్దరు కుమారుల సేవలోనే జీవితాన్ని గడుపుతున్నారు నిర్మల, దుర్గయ్య. కాలకృత్యాల నుంచి రాత్రి పడుకునే వరకు... అన్ని పనులూ చేయాల్సిందే. వారికి స్నానం చేయాలన్నా... బట్టలు వేసుకోవాలన్నా... అన్నం తినాలన్నా... అన్నీ ఒకరు చేయాల్సిందే. బిడ్డల మీద ప్రేమతో చేస్తున్నారు. అయితే వృద్ధాప్యం మీద పడడంతో నీరసించిపోతున్నారు. ఉపాధి రెక్కలు విరిగాయి నిర్మల బీడీలు చుట్టగా వచ్చిన డబ్బులతో కలో గంజో పెట్టేది. బీడీ కట్టలపై 85 శాతం పుర్రె బొమ్మ వేయాలన్న కేంద్రప్రభుత్వ నిబంధన ఆమెకు చేతనైన ఆ ఒక్క ఉపాధినీ లాక్కెళ్లింది. సరళీకృత ఆర్థిక విధానాలు, సాలెల మగ్గం సడుగులిరగడంతో దుర్గయ్య చేసే చేనేత వృత్తిపైనా తీవ్ర ప్రభావం పడింది. దీంతో చేనేతను వదిలేశారాయన. పిల్లల వైద్యం కోసం వేలకు వేలు వెచ్చించడం భారంగా మారడంతో ఇంట్లోనే చిన్నపాటి కిరాణ కొట్టు పెట్టుకుని, పిల్లలకు వచ్చే వికలాంగుల పెన్షన్‌తో రోజులు వెళ్లదీస్తున్నారు. అయితే వికలాంగుల పెన్షన్ ఇస్తున్నాం కదా అని ప్రభుత్వం బీడీ కార్మికుల జీవన భృతిని రద్దు చేసింది. అచేతన, నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఈ కుటుంబానికి ప్రభుత్వం ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది. - డి.నర్సయ్య, సాక్షి, దుబ్బాక చావాలన్నా చావలేం! ‘కదలలేం. మెదలలేం. 30 ఏళ్లు దాటాయి. తల్లిదండ్రులను కూర్చోబెట్టి చూసుకోవాల్సిన వయస్సు. ఏ జన్మ పాపమో ఈ మాయదారి రోగం మా ఇద్దరినీ గృహ నిర్భందం చేసింది. మంచి, చెడూ అన్నీ అమ్మ చేయాల్సిందే. సిగ్గుతో కుంచించుకు పోతున్నాం. ఆ మహాతల్లి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేం. పాపం నాన్నకూ నిరంతరం మాదే ఆలోచన. ఈ నిస్సహాయ జీవన యాత్ర ఎంత కాలం? మాది నిరాశ కాదు, నిస్పృహ కాదు. ఇది నిజం. కఠిన వాస్తవం. ‘మమ్మల్ని మరణించనివ్వండి. చావు కోసం మరొకరి తోడు కావాల్సిన దుస్థితిలో తల్లిదండ్రులు, చెల్లెలు పడుతున్న కష్టాలను చూడలేకపోతున్నాం. మమ్మల్ని కరుణించి మరణించనివ్వడి’ అని 2005లో మానవ హక్కుల కమిషన్‌కు దరఖాస్తు చేసుకున్నాం. మా విజ్ఞప్తిని కమిషన్ తిరస్కరించింది. మా నిర్ణయాన్ని అమ్మకు చెప్పాం. ఆమె గుండె పగిలేలా ఏడ్చింది. - జగన్నాథం, మనోహర్ ఈ కష్టం ఎవరికీ రాకూడదు నా బిడ్డలకొచ్చిన కష్టం ఎవరికీ రాకూడదు. నా బిడ్డల ఆరోగ్యం కోసం ఎక్కని గుడి మెట్లు లేవు. మొక్కని దేవుడూ లేడు. నేను, నా భర్త కష్టపడితే నెలకు రూ. 2 వేలు కూడా రావు. పిల్లల వైద్యానికి నెలకు రూ. 10 వేలు కావాలి. లక్షల అప్పు చేశాం. మా పరిస్థితి చూసినవాళ్లెవరూ మాకు అప్పు ఇవ్వడం లేదు. పిల్లలకు మందులు కొనలేకపోతున్నాం. మనసున్న మహారాజులు ఎవరైనా సాయం చేస్తే పిల్లల మందులకు ఉపయోగపడతాయి. - కొండా నిర్మల, బాధితుల తల్లి -
అడవి పందులు దూసుకురావడంతో..
అడవి పందులు అకస్మాత్తుగా జీపును ఢీకొన్న ఘటనలో ఒక యువకుడు మృతి చెందాడు. ఈ విషాదం నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలం సంభాపూర్ వద్ద సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పొంతగల్ నుంచి బీర్కూట్ వరకూ కొత్త కల్వర్టు నిర్మాణం జరుగుతోంది. పనుల్లో పాల్గొంటున్న సిబ్బంది.. పనులు ముగించుకొని జీపులో తిరిగి వస్తున్న సమయంలో ఒక్కసారిగా.. అడవి పందులు రోడ్డుపైకి దూసుకొచ్చి జీపును ఢీకొన్నాయి. జీపు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టుంది. ఈ ప్రమాదంలో మనోహర్(26) అనే యువకుడు అక్కడి కక్కడే మృతి చెందాడు. సురేష్ కుమార్, ఆదిత్య లకు తీవ్ర గాయాలయ్యయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అంతా మా ఇష్టం
► వివాదాస్పదంగా బీసీసీఐ పెద్దల చర్యలు ► రోజుకో మాట మాట్లాడుతున్న అనురాగ్ ► కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్కు మనోహర్ కొత్త భాష్యం బీసీసీఐ నుంచి శ్రీనివాసన్‌ను తప్పించాలనే ఒకే ఒక్క లక్ష్యంతో ఏకమైన శక్తులన్నీ రెండు నెలల్లోనే తామేంటో ప్రపంచానికి చూపిస్తున్నాయి. అధికారం చేతిలో ఉంటే ఎవరైనా ‘ఒకే పని’ చేస్తారని అధ్యక్షుడు శశాంక్ మనోహర్, కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ మరోసారి నిరూపించారు. ప్రపంచకప్ కోసం వేదికల ఎంపికలో సొంత నగరాలకు పెద్ద పీట వేయడంతో పాటు... వీళ్లిద్దరి వ్యవహార శైలి భారత క్రికెట్‌కు ఆర్థికంగా కూడా నష్టం చేసేలా ఉంది. బోర్డులోని చాలామంది సభ్యులకు శ్రీనివాసన్ హయాంలో తప్పులుగా కనిపించినవి... ఇప్పుడు ఒప్పులుగా మారిపోయాయి. సాక్షి క్రీడావిభాగం అనురాగ్ ఠాకూర్ మార్చిలో బీసీసీఐ కార్యదర్శిగా ఎన్నికైన దగ్గరి నుంచి ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ వచ్చారు. అంతకుముందు శ్రీని హయాంలో బోర్డు సంయుక్త కార్యదర్శిగా పనిచేసిన ఠాకూర్... ఆయనను తప్పించడంలో కీలక పాత్ర పోషించారు. శ్రీనివాసన్ పదవిలో ఉన్నంతకాలం మౌనంగా ఉన్నా... ఈ ఏడాది బోర్డు ఏజీఎం జరిగే సమయానికి మాత్రం ఆయన అన్ని శక్తులనూ ఏకం చేయడంలో విజయం సాధించారు. శ్రీనివాసన్ అంటే పడని శశాంక్ మనోహర్‌ను తెరమీదకు తీసుకొచ్చి బోర్డు అధ్యక్షుడిని చేయగలిగారు. ఇక మనోహర్ కూడా తాను వచ్చిన దగ్గరినుంచి ఏదో భిన్నంగా చేయబోతున్నట్లు పదే పదే చెబుతున్నారు. గతంలో శ్రీనివాసన్ చేసింది చెడు... నేను చేయబోయేది మంచి అనే భావన తేవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇందులో భాగంగా ఐసీసీలో మార్పులు తెస్తామనే ప్రకటన చేశారు. నిజానికి శ్రీనివాసన్ ఐసీసీ చైర్మన్‌గా ఉన్న సమయంలో అనేక సంస్కరణలు తెచ్చారు. ఇందులో భాగంగా ఆదాయం ఎక్కువ ఇచ్చే భారత్‌కు ఎక్కువ వాటా రావాలని డిమాండ్ చేసి... ఐసీసీ నుంచి భారత్‌కు వచ్చే ఆదాయాన్ని పెంచారు. ఇప్పుడు మనోహర్ వచ్చి దానిని తప్పు పడుతున్నారు. దీనివల్ల ఇతర ఐసీసీ సభ్య దేశాల్లో తను మంచివాడనే పేరు తెచ్చుకోవాలని భావిస్తున్నారు. కానీ దీనివల్ల బీసీసీఐ ఆదాయానికి గండిపడుతుందనే అంశాన్ని మరచిపోతున్నారు. ప్రశ్న నాదే... సమాధానం నాదే... కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్కు మనోహర్ కొత్త భాష్యం చెప్పారు. క్రికెట్ నుంచి ఆదాయం పొందేవారు క్రికెట్ పరిపాలనలో ఉండటం తప్పు అని ఆయన అంటున్నారు. కానీ ఒకే వ్యక్తి మూడు రకాల హోదాల్లో నిర్ణయాలు తీసుకోవడం కాన్ఫ్లిక్ట్ కాదా? ప్రస్తుతం మనోహర్ ఐసీసీ చైర్మన్, బీసీసీఐ అధ్యక్షుడు, విదర్భ క్రికెట్ సంఘం కో ఆప్టెడ్ సభ్యుడు. అలాగే విదర్భ సంఘంలో ఆయన కుమారుడు అద్వైత్ మనోహర్ ఉపాధ్యక్షుడు. తాజాగా దక్షిణాఫ్రికా, భారత్‌ల మధ్య నాగ్‌పూర్‌లో జరిగిన రెండో టెస్టులో పిచ్ బాగోలేదని మ్యాచ్ రిఫరీ ఐసీసీకి ఫిర్యాదు చేశారు. చైర్మన్ హోదాలో మనోహర్ బీసీసీఐని వివరణ కోరారు. ఇక్కడ బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో విదర్భ సంఘానికి ఆ లేఖను పంపారు. దీనికి విదర్భ తరఫున సమాధానం ఇచ్చిన కమిటీలో ఆయన సభ్యుడు. ఆ సమాధానాన్ని తిరిగి బోర్డు అధ్యక్షుడి హోదాలో చదివి ఐసీసీకి పంపుతారు. అక్కడ నిర్ణయం కూడా ఆయనదే. అంటే ఒక ప్రశ్నకు ప్రశ్న, సమాధానం కూడా ఆయనే ఇస్తారు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలో ఆయనే చెప్పాలి. తేనెతుట్టెను కదిపారు ఐసీసీ చైర్మన్‌గా ఎన్నికయ్యే సమయంలో శ్రీనివాసన్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో ఓ ఒప్పందం చేసుకున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే ఇరు దేశాల మధ్య సరిహద్దులో పరిస్థితి బాగోలేనందున శ్రీనివాసన్ సిరీస్‌కు సుముఖత చూపలేదు. ఆ సమయంలో అనురాగ్ ఠాకూర్ కూడా ఓ ట్వీట్ చేశారు. ‘సరిహద్దులో మా మీద దాడులు చేస్తుంటే మేం క్రికెట్ ఆడాలా?’ అంటూ విరుచుకుపడ్డారు. ఆ ట్వీట్ తర్వాత నెల రోజులకు బోర్డు అధ్యక్షుడిగా మనోహర్ వచ్చారు. రాగానే మనోహర్ పాక్‌తో సిరీస్ అనే తేనెతుట్టెను కదిల్చారు. చర్చలకు రావాలంటూ పాక్ బోర్డు చైర్మన్ షహర్యార్ ఖాన్‌ను పిలిచారు. అది కూడా పోయి పోయి ముంబైకి రమ్మన్నారు. వాస్తవానికి ముంబైలో ఉండే పరిస్థితులు మహారాష్ట్ర వాసి అయిన మనోహర్‌కు బాగా తెలుసు. సహజంగానే ఖాన్ రాకను వ్యతిరేకిస్తూ ముంబైలో ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో మనోహర్ కోరుకున్న ప్రచారం లభించింది. ఈ సమయంలో ఠాకూర్ తన పాత వైఖరికి భిన్నంగా మాట్లాడారు. ‘భారత్, పాకిస్తాన్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ల పునరుద్ధరణ కోసం కృషి చేయాల్సిన బాధ్యత నాది’ అన్నారు. ఈ సందర్భంలో ఆయనకు సరిహద్దు గుర్తుకు రాలేదు. ఎలాగూ భారత ప్రభుత్వం ఈ సిరీస్‌కు అనుమతి ఇచ్చే అవకాశాలు తక్కువ. అయినా మనోహర్, ఠాకూర్ పదే పదే ఈ అంశం గురించి మాట్లాడుతూ వచ్చారు. ఆ పార్టీ ఎలా ఇచ్చారు? ఢిల్లీలో దక్షిణాఫ్రికాతో నాలుగో టెస్టు సందర్భంగా మ్యాచ్ నాలుగో రోజు రాత్రి బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తన నివాసరంలో భారత క్రికెటర్లకు పార్టీ ఇచ్చారు. నిజానికి మ్యాచ్‌ల మధ్యలో ఇలాంటి పార్టీలు నిర్వహించడం నిబంధనలకు వ్యతిరేకం. మ్యాచ్‌కు ముందు, తర్వాత పార్టీలు ఇవ్వడం సహజం. కానీ మ్యాచ్‌ల మధ్యలో ఇలాంటివి ఏర్పాటు చేయడం వల్ల కొత్తవాళ్లని క్రికెటర్లు కలిసే అవకాశం ఉంటుంది. ఇందులో బుకీలు ఉండొచ్చు... ఇంకెవరైనా ఉండొచ్చు. అందుకే వీటిని నియంత్రిస్తారు. గతంలో బోర్డులోని ఏ పెద్ద మనిషి కూడా ఇలాంటి పార్టీలు ఇవ్వలేదు. ఠాకూర్ ఇచ్చిన పార్టీకి పలువురు రాజకీయ నాయకులు, బయటి వ్యక్తులు వచ్చారు. మరి కార్యదర్శిగా ఓ బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తి ఇలా చేయడం సమంజసమా? ఇది బోర్డులోని మిగిలిన వ్యక్తులకు కనిపించలేదా? అన్నీ మనకే రావాలి అనురాగ్ ఠాకూర్ బీసీసీఐ కార్యదర్శిగా ఎన్నికయ్యాక తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌కు కావలసినంత మేలు చేసుకుంటూ వె ళుతున్నారు. ఆయన బోర్డు పదవిలోకి రాకముందు అడపాదడపా అక్కడ మ్యాచ్‌లు జరిగేవి. మిగిలిన మైదానాలతో పోలిస్తే చిన్నది కావడం, వా తావరణ పరిస్థితులు కూడా కఠినంగా ఉండటం వల్ల ధర్మశాల మైదానానికి పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ ఠాకూర్ వచ్చాక వరుసగా ప్ర తి సిరీస్‌లోనూ అక్కడ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. రొటేషన్ పాలసీ కూడా పక్కకు పోయింది. తాజాగా టెస్టు హోదా కూడా తెచ్చుకున్నా రు. నేపాల్ జట్టును పిలిచి అక్కడ క్యాంప్ ఏర్పాటు చేయించారు. ఆసి యా క్రికెట్ కౌన్సిల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా అక్కడికే వెళ్లింది. వీ టన్నింటి వల్ల బీసీసీఐ నుంచి డబ్బు ఆ రాష్ట్ర సంఘానికి వెళుతుంది. రెండే వేదికల్లో 17 మ్యాచ్‌లు.... ఇక మార్చిలో భారత్‌లో జరిగే ఐసీసీ టి20 ప్రపంచకప్‌కు వేదికల ఎంపికలోనూ తీవ్ర పక్షపాతం చూపించారు. ఠాకూర్‌కు చెందిన ధర్మశాల, మనోహర్‌కు చెందిన నాగ్‌పూర్‌లలో ఏకంగా 17 మ్యాచ్‌లు జరుగుతాయి. మొత్తం 35 మ్యాచ్‌ల్లో దాదాపు సగం ఈ రెండు నగరాలకే ఇచ్చారు. ఒక్కో మ్యాచ్ నిర్వహణ వల్ల క్రికెట్ సంఘానికి సగటున 2 కోట్ల రూపాయల దాకా ఆదాయం వస్తుంది. దేశంలో ప్రధాన క్రికెట్ సెంటర్ చెన్నైని పూర్తిగా విస్మరించారు. అలాగే ఢిల్లీ, చండీగఢ్, ముంబై, కోల్‌కతా, బెంగళూరులకు మిగిలిన మ్యాచ్‌లను పంచారు. దేశంలో మొత్తం 20 క్రికెట్ వేదికలు ఉన్నాయి. ఇందులో 15 మైదానాలకు టెస్టు హోదా ఉంది. ఇటీవల ధర్మశాలతో పాటు టెస్టు హోదా పొందిన పుణే, రాంచీ, వైజాగ్, రాజ్‌కోట్, ఇండోర్‌లకు ఒక్క మ్యాచ్ కూడా ఇవ్వలేదు. భారత్-పాక్ మ్యాచ్‌కు 23 వేల మందేనా? వేదికల కేటాయింపులో ధర్మశాలకు పెద్ద పీట వేయడంతో భారత్, పాక్ మ్యాచ్‌ను కూడా ఇక్కడే నిర్వహించబోతున్నారు. ఈ స్టేడియం సామర్ధ్యం కేవలం 23 వేలు. 50 వేల మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా మ్యాచ్ చూడగల వేదికలు దేశంలో చాలా ఉన్నాయి. భారత్, పాక్‌ల మధ్య ప్రపంచకప్ మ్యాచ్ అంటే ఉండే క్రేజ్ వల్ల దీనికి ప్రేక్షకులు పోటెత్తుతారు. అనేక దేశాల నుంచి అభిమానులు వస్తారు. అయినా కేవలం 23 వేల మంది చూడగల స్టేడియంలో ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. -
డబ్బు ఇవ్వకపోతే అంతు చూస్తా...
- నిమ్స్ వైద్యుడికి నకిలీ విలేకరి బెదిరింపులు - నిందితుడి అరెస్టు పంజగుట్ట : ‘నేను విలేకరిని, నాకు డబ్బు ఇవ్వకపోతే .. మా పత్రికలో నీకు వ్యతిరేకంగా వార్త రాసి నీ అంతు చూస్తా’ అంటూ బెదిరించి అడ్డంగా దొరికిపోయాడో నకిలీ విలేకరి. పంజగుట్ట పోలీసుల కథనం ప్రకారం ... దోమలగూడకు చెందిన మనోహర్ (40) రిపోర్టర్నని చెప్పుకుంటూ తిరుగుతుంటాడు. ఇతను శనివారం నిమ్స్ ఆసుపత్రి బ్లడ్‌బ్యాంక్ విభాగాధిపతి పాండురంగారావు వద్దకు వెళ్లి ‘నేరు యాంటీ కరప్షన్ పత్రిక విలేకరిని, నాకు వెయ్యి రూపాయలు కావాలి.. డబ్బు ఇవ్వకపోతే, నీకు వ్యతిరేకంగా మా పత్రికలో వార్త రాస్తానని బెదిరించాడు. తాను ఏ తప్పు చేయకపోయినా తను బెదిరిస్తుండటంతో సదరు డాక్టర్ అవాక్కయ్యాడు. వెంటనే పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు మనోహర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను నకిలీ విలేకరని తేలింది. అతడి వద్ద విజ్ఞాన్, నందు టైమ్స్, జననేత, వాయిస్ ఆఫ్ తెలంగాణ, ఎవరెస్ట్ న్యూస్ అనే పేర్లతో ఉన్న ఏడు గుర్తింపు కార్డులు దొరికాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు మనోహర్‌ను రిమాండ్‌కు తరలించారు. -
నేడే ప్రకటన
అధ్యక్ష పదవికి మనోహర్ ఒక్కరే నామినేషన్ బీసీసీఐ ఎస్జీఎంకి శ్రీనివాసన్ దూరం ముంబై: భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడెవరో నేడు (ఆదివారం) అధికారికంగా ఖరారు కానుంది. జగ్మోహన్ దాల్మియా ఆకస్మిక మృతితో ఖాళీ అయిన బోర్డు అత్యున్నత పదవి ఎంపిక కోసం ఆదివారం ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం) జరుగనుంది. అధ్యక్షుడిగా అనేకమంది పేర్లతో ఊహాగానాలు వినిపించినా ఆఖరికి శశాంక్ మనోహర్ ఒక్కరే బరిలో నిలిచారు. ఈ పదవికి నామినేషన్ దాఖలైంది కూడా ఆయనొక్కరి నుంచే. కాబట్టి మనోహర్ ఎంపికకు సభ్యుల నుంచి ఏకగ్రీవ ఆమోదం లభించనుంది. ఈస్ట్ జోన్ నుంచి కూడా ఆయనకు మద్దతు లభించింది. అయితే శ్రీనివాసన్ ఎస్‌జీఎంకు హాజరుకావడం లేదు. తన వర్గానికి చెందిన వ్యక్తికి ఈ పదవిని కట్టబెట్టేందుకు ఆయన చివరిదాకా ప్రయత్నించినా.. ప్రస్తుత కార్యదర్శి అనురాగ్ ఠాకూర్, పవార్ గ్రూపు ఒక్కటి కావడంతో శ్రీనికి నిరాశే ఎదురైంది. దీంతో ఈ కీలక సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తన స్థానంలో తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్‌సీఏ) ఉపాధ్యక్షుడు పీఎస్ రామన్ హాజరుకానున్నారు. ఈస్ట్ జోన్‌లోని ఆరు సంఘాలు వేర్వేరుగా మనోహర్‌కు తమ పూర్తి మద్దతును ప్రకటించాయి. బెంగాల్ నుంచి గంగూలీ, జాతీయ క్రికెట్ క్లబ్ (ఎన్సీసీ) నుంచి దాల్మియా కుమారుడు అవిషేక్, త్రిపుర నుంచి సౌరవ్ దాస్ గుప్తా, అస్సాం నుంచి గౌతమ్ రాయ్, ఒడిషా నుంచి ఆశీర్వాద్ బెహరా, జార్ఖండ్ క్రికెట్ సంఘం నుంచి సంజయ్ సింగ్ ప్రతి పాదించిన వారిలో ఉన్నారు. మనోహర్ గతంలో 2008-09, 2010-11లో బోర్డు అధ్యక్షుడిగా వ్యవహరించారు. -
చిరునవ్వుతో ఇంటికి వెళ్లాలన్నదే ధ్యేయం
- నిమ్స్ డెరైక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన మనోహర్ హైదరాబాద్: నిమ్స్ ఆసుపత్రికి బాధతో వచ్చే ప్రతి రోగి చిరునవ్వుతో ఇంటికి వెళ్లాలన్నది తన ధ్యేయమని నిమ్స్ నూతన డెరైక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కందకట్ల మనోహర్ అన్నారు. శుక్రవారం నిమ్స్ లెర్నింగ్ సెంటర్లో మాజీ డెరైక్టర్ డాక్టర్ నరేంద్రనాథ్ చేతులమీదుగా డెరైక్టర్‌గా మనోహర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ... తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగులను, వైద్యులను కలుపుకుపోయి నిమ్స్‌లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం, వైద్య విద్యార్థులకు మంచి విద్యను అందించడమే తన లక్ష్యమని అన్నారు. మొదట అడ్మినిస్ట్రేషన్ విభాగాన్ని పర్యవేక్షిస్తానన్నారు. ఇందుకోసం శనివారం అడ్మిన్ అధికారులతో సమావేశం కానున్నట్లు తెలిపారు. సోమవారం నుంచీ ప్రతీ విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మౌలిక సదుపాయాలు కల్పించి ప్రాధాన్యాన్ని బట్టి అవసరాలు తీరుస్తానన్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో దాతల సహకారంతో 80 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశానని.. కెమెరాల ఆధారంగా అవినీతికి పాల్పడుతున్న పలువురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై చర్యలు తీసుకున్నానని తెలిపారు. నిమ్స్‌లో కూడా కెమెరాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఒక నెలలో ఆసుపత్రి లోటుపాట్లు తెలుసుకుంటానన్నారు. కబ్జాకు గురైన స్థలాన్ని కూడా సేకరించేందుకు ప్రయత్నిస్తానని ఎలాంటి ఒత్తిళ్లకు తావులేకుండా విధులు నిర్వహిస్తానని అన్నారు. మాజీ డెరైక్టర్ నరేంద్రనాథ్ మాట్లాడుతూ ... గత రెండేళ్లుగా తనకు పూర్తి సహకారం అందించిన వైద్యులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రజాసమస్యల పై వెబ్ అస్త్రం
విజ్ఞాన్ విద్యార్థుల ఘనత చేబ్రోలు : లంచం అడిగినవారు ఇక వెబ్ బజారులో నిలబడాల్సి రావచ్చు. ఏ సమస్య అయినా క్షణాల్లో అందరి ఫోన్లకు మెసేజ్ రూపంలో రావచ్చు. వీధుల్లో సమస్యల నుంచి వ్యక్తిగత కష్టాల వరకు అన్నింటికీ ఇక వెంటనే పరిష్కారం కోసం విజ్ఞాన్ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన ఓ వెబ్సైట్ శక్తివంతంగా పనిచేస్తోంది. ఈ నెల 11న దీన్ని సీఎం చంద్రబాబు హైదరాబాదులో ప్రారంభించారు. దీన్ని రూపొందిం చిన విద్యార్థులను ఆయన అభినందించారు. ఆ నలుగురికి వచ్చిన ఐడియా.. మంగళగిరి రూరల్ మండలం నూతక్కికి చెందిన జి.మనోహర్, తాడేపల్లి మండలం సీతానగరానికి చెందిన ఆర్.మనోహర్‌రెడ్డి, తెనాలికి చెందిన కృష్ణలావణ్యకుమార్, హైదరాబాద్‌కు చెందిన పి.విద్వాన్‌రెడ్డి విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో ఈసీఈ బ్రాంచ్ చివరి సంవత్సరం విద్యార్థులు. ప్రభుత్వ విభాగాల్లో పేరుకుపోతున్న అవినీతి, ప్రజాసమస్యల పరిష్కారం కోసం వెబ్ అస్త్రాన్ని ప్రయోగించాలని ఈ వెబ్‌సైట్‌ను రూపొందించారు. వీరి ప్రాజెక్టుకు మనోహర్ కీలకం. వెబ్ అడ్మినిస్ట్రేటర్ కూడా అతనే. రోజు 18 గంటలపాటు కష్టపడి, రూ.60వేల వరకు పెట్టుబడి పెట్టి ఎట్టకేలకు ఓ వైబ్‌సైట్‌ను ప్రజల ముందుకు తీసుకొచ్చాడు. మిగిలిన ముగ్గురు మనోహర్‌కు సాంకేతిక సాయం అందించారు. -
వెబ్సైట్లో ఇంగ్లిషు పాఠాలు
మనోహర్ మరో ప్రయత్నం ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం సీతంపేట : తనకున్న ఆంగ్ల భాషా ప్రావీణ్యాన్ని పదిమందికీ ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో 24 సంవత్సరాలుగా స్పోకెన్ ఇంగ్లిష్ పాఠాలు చెబుతున్న మనోహర్ ఇప్పుడు వెబ్సైట్ ద్వారా సేవలందిస్తున్నారు. ఆయన మధురానగర్ జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఇప్పటివరకు సుమారు 23 వేల మందికి శిక్షణ ఇచ్చి వారిని ఉన్నత పదవుల్లో చేర్చిన ఘనత దక్కించుకున్నారు. కేవలం 30 రోజులలో అవలీలగా ఇంగ్లిష్‌లో మాట్లాడేలా తీర్చిదిద్దే నైపుణ్యం మనోహర్ మాస్టారి సొత్తు. తను రూపొందించిన స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సును సులభ మార్గాన్ని మరింతమందికి చేరువ చేసేందుకు manoharspokenenglish.com పేరిట వెబ్ సైట్‌ను ప్రత్యేకంగా రూపొందించి అందుబాటులోకి తెచ్చారు. వీడియో గాలరీలో రెండు గంటల నిడివి గ ల వీడియో పాఠాలను వెబ్సైట్లో పొందుపర్చారు. ఎవరైనా ఉచితంగా వెబ్ సైట్ద్వారా స్పోకెన్ ఇంగ్లిష్ నేర్చుకునే వీలు కల్పించారు మనోహర్ మాస్టారు. అంతేకాదు ఉచితంగా డౌన్ లోడ్చేసుకునే సదుపాయం కూడా ఉంది. వెబ్ సైట్లో ఏముంది... ఇంగ్లిష్ సులభంగా మాట్లాడేందుకు అవసరమైన 300 సింపుల్ వెర్బ్స్, నాలుగు చాప్టర్ల గ్రామర్‌ను పొందుపర్చారు. గ్రామర్‌లో స్రక్చర్స్, సింపుల్ ప్రెజెంటెన్స్, ప్రెజెంట్ కంటిన్యువస్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ అనే నాలుగు టెన్స్‌లు, వాటిని 300 వెర్బ్స్తో ఎలా ఉపయోగించి ఇంగ్లిష్ నేర్చుకోవచ్చునో వీడియోలో వివరించారు. నిత్యజీవితంలో ఉపయోగించే సంభాషణలతో వీడియోను పొందుపరిచారు. మరింత చేరువ కావాలని... ప్రపంచం మాట్లాడే భాష ఇంగ్లిష్. ఇంగ్లిష్ అంటే చాలా మందికి భయం. మాట్లాడటం రాక ఉద్యోగాాలను చేజార్చుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. నేటి సమాజంలో విద్య, వ్యాపారం,ఉద్యోగంలో రాణించాలంటే ఇంగ్లిష్‌లో మాట్లాడటం తప్పనిసరైపోయింది. ఎంఎన్సీ కంపెనీలలో కొలువు కావాలన్నా, ఆఖరికి ఇంటిలో పిల్లలకు చదువుచెప్పాలన్నా గృహిణులకు ఆంగ్లంలో మాట్లాడటం అవసరమైంది. ఇలాంటి వారిలో భయాన్ని పోగొట్టి కేవలం 30 రోజులలో ఇంగ్లిష్‌లో మాట్లాడేలా పుస్తకాన్ని, డీవీడీ రూపొందించాను. 1991 నుంచి ఉచితంగా శిక్షణ ఇస్తున్నాను. ఈ సులభమైన పద్ధతి మరింతమందికి చేరువ కావడానికి సంఘమిత్ర సర్వీసెస్ ద్వారా మనోహర్ స్పోకెన్ ఇంగ్లిష్ డాట్ కామ్ వెబ్ సైట్‌ను అందుబాటులోకి తెచ్చాను. - దామోదల మనోహర్, జీవీఎంసీ ఉపాధ్యాయుడు, సీతంపేట -
జిల్లావాసులకు ‘జయశంకర్’ అవార్డు
కామారెడ్డి రూరల్ : కామారెడ్డి మండలంలోని తిమ్మక్‌పల్లి (కే) ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మార బాల్రెడ్డికి ఆచార్య జయశంకర్ సార్ రాష్ట్రస్థాయి అవార్డును రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి ఈటెల రాజేందర్ కరీంనగర్‌లోని కళాభారతి కళావేదికలో అందజేశారు. విద్యారంగంలో వీరి సేవలను గుర్తించిన తెలంగాణ ఆత్మబంధువు హెల్పింగ్ ఫౌండేషన్ కరీంనగర్ వారు ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఆదుకునే చేతులు ఉంటే అనాథలెవరుండరు అనే ఆలోచనలను ఆదర్శంగా తీసుకుని అనాథ, పేద, కిడ్నీ, గుండెజబ్బు, హెచ్ఐవీ పిల్లల సహాయ సంస్థలకు మార బాల్‌రెడ్డి అందించిన సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ ఉపాధ్యాయుడి స్వగ్రామంలో ఎస్సెస్సీ ఇంటర్ విద్యార్థుల ప్రతిభ వెలికి తీయడానికి ప్రతిభ పురస్కారాలను అందజేసి వాళ్లను ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బల్క సుమన్, తెలంగాణ ఆత్మబంధువు హెల్పింగ్ పౌండేషన్ ప్రతినిధులు, కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్, కళాకారులు తదితరులు పాల్గొన్నారు. మనోహర్‌కు.. కామారెడ్డిటౌన్ : తాడ్వాయి మండలానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు అంబీర్ మనోహర్‌రావుకు స్వర్గీయ ఆచార్య జయశంకర్ రాష్ట్ర స్థాయి అవార్డు దక్కింది. 14వ తేదీన కరీంనగర్ జిల్లా కళావేదికలో తెలంగాణ పితామహుడు ఆచార్య జయశంకర్ స్మారకంగా సామాజిక, సాహిత్య, విద్య, వైద్యం, ఉద్యోగ, కళా, క్రీడా రంగంలో విశిష్ట సేవలందించిన వారికి జయశంకర్ రాష్ట్రస్థాయి, లైఫ్‌టైం, అచీవ్మెంట్ అవార్డులను సత్కరించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి చేతుల మీదుగా ఈ అవార్డును మనోహర్ అందుకున్నారు. ఈ సందర్భంగా మనోహర్‌ను పలువురు అభినందించారు. ఠాణాకలాన్ పీఈటీకి.. ఎడపల్లి: మండలంలోని ఠాణా కలాన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీఈటీగా విధులు నిర్వహిస్తున్న సాయిలుకు ఆదివారం రాత్రి కరీంనగర్లో ప్రొఫెసర్ జయశంకర్ అవార్డును ప్రదానం చేశారు. తెలంగాణలోని పది జిల్లాలలో వివిధ రంగాలలో గుర్తింపు పొందిన పలువురిని ఆత్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. జిల్లాలో సన్మానం పొందిన 11 మందిలో ఠాణాకలాన్ పీఈటీ సాయిలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్,పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్,ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. పీఈటీ సాయిలుకు అవార్డు రావడంపై ఉపాధ్యాయులు,విద్యార్థులు,గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. -
ఈ పేపర్లు ఏం చేసుకోవాలి?
తరిమెల (శింగనమల) : ‘ఏ ఒక్క రైతుకూ రుణ మాఫీ సక్రమంగా చేయలేదు.. రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పి మాట మార్చారు. రైతుకు రూ.ఒకటిన్నర లక్ష వరకు రుణమాఫీ అని చె ప్పారు. కనీసం అది కూడా వేయకుండా మోసం చేశార’ని రైతు సాధికరత సదస్సుకు వచ్చిన రైతులు గురువారం అధికారులను నిలదీశారు. ఈ సంఘటన శింగనమల మండలం తరిమెలలో చోటుచేసుకుంది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ రైతులు సదస్సును బాయ్ కాట్ చేశారు. తరిమెల గ్రామంలో రుణ మాఫీపై రైతు సాధికారత సదస్సు ప్రారంభం కాగానే.. రైతులకు ప్రభుత్వం రుణాలు మాఫీ చేసిందని, అందుకు గాను రైతులకు విముక్తి పత్రాలు అందించనున్నట్లు ఎంపీడీఓ లలితకుమారి తెలిపారు. దీంతో రైతులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు.‘ఈ పత్రాలు తీసుకుని ఏం చేయూలి? అంతా మోసం చేశారు.. రుణాలు పూర్తిగా మాఫీ అని చెప్పి, రకరకాల పేరుతో తగ్గించేశారు.. గ్రామంలో ఎంత మందికి పూర్తిగా రుణం పోయిందో చెప్పండ’ని అధికారులను నిలదీశారు. పత్రాలను బ్యాంకులకు తీసుకుని పోతే, రేపు తిరిగి రుణాలు మంజూరు చేస్తారని అధికారులు నచ్చజెప్పారు. ఈ విషయూన్ని ఎంత వరకు నమ్మాలని.. అక్కడే ఉన్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజర్ మనోహర్‌ను రైతులు ప్రశ్నించారు. బ్యాంకులకు అలాంటి ఆదేశాలు ఇంకా రాలేదని, వచ్చిన వెంటనే రైతులకు తెలియజేస్తామని చెప్పారు. ఎందుకూ ఉపయోగం లేని ఈ పత్రాలు ఎందుకని అధికారులను ప్రశ్నించారు. బ్యాంకులలో మాఫీ అయినప్పుడు ఇస్తే తీసుకుంటామని, అంతవరకు ఈ పత్రాలు మీదగ్గరే పెట్టుకోవాలని అధికారులకు సూచించారు. రైతులు హనుమంతురెడ్డి, బాలిరెడ్డి, కోటేశ్వర్‌రెడ్డి, క్రిష్ణారెడ్డి, సీపీఐ నాయకులు రామాంజినేయులు మాట్లాడుతూ రైతులను నిలువునా మోశారని ఆవేదన చెందారు. రుణాలు పూర్తిగా మాఫీ అని చెప్పి, ప్రభుత్వం ఏర్పడిన తరువాత మాట మార్చారన్నారు. స్కేల్ ఆఫ్ పైనాన్స్ పేరుతో రైతులను మోసం చేశారన్నారు. రూ.50 వేలు ఏ ఒక్కరికీ మాఫీ కాలేదన్నారు. ఇది రైతులను దగా చేయడమేనన్నారు. పింఛన్ల విషయంలో కూడా అలాగే చేశారని మండిపడ్డారు. గ్రామంలో 90 మంది పింఛన్లు తొలగిస్తే, కేవలం 10 మందికి మాత్రమే పునరుద్దరించారని, మిగిలిన వారికి రాలేదని ప్రశ్నించారు. గ్రామంలో ఇంకా చాలా మంది రైతుల పేర్లు రుణ మాఫీ జాబితాలో లేవన్నారు. రైతులకు పూర్తిగా మాఫీ అయిన తరువాత ఈ పత్రాలు అందించాలని రైతులందరం బాయ్ కాట్ చేస్తున్నామని చెప్పి అందరు వెళ్లిపోయారు. దీంతో సదస్సును అధికారులు నిలిపి వేశారు. సదస్సులో ఈఓఆర్డీ యశోదమ్మ, ఏఏఓ శైలజ, ఆత్మ పీపీఎం లావణ్య, వీఆర్వో భరత్‌కుమార్, గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేశ్వర్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ ఆదినారాయణ పాల్గొన్నారు. -
రసాభాసగా టీడీపీ సమావేశం
మాజీ ఎమ్మెల్యేపై తిరగబడ్డ తమ్ముళ్లు ఏ అధికారంతో సమావేశాలు నిర్వహిస్తున్నారని నిలదీత సమావేశాన్ని బహిష్కరించిన నేతలు వరదయ్యుపాళెం: వరదయ్యుపాళెంలో శుక్రవా రం జరిగిన తెలుగు దేశం పార్టీ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. సత్యవేడు మాజీ ఎమ్మెల్యే తలారి మనోహర్‌పై వరదయ్యుపాళెం వుండల తెలుగు తమ్మళ్లు తిరుగుబాటు బావుటా ఎగుర వేసారు. ఆయన వైఖరిని తీవ్రంగా తప్పు పడుతూ సమావేశాన్ని బహిష్కరించారు. శుక్రవారం వుధ్యాహ్నం వూజీ ఎమ్మెల్యే తలారి వునోహర్ పార్టీ సభ్యత్వ నమోదుపై వరదయ్యుపాళెంలోని కల్కి అన్నదాన వుండపంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసారు. సవూవేశానికి వుండలంలోని వివిధ గ్రావూలకు చెందిన నేతలు హాజరయ్యూరు. వరదయ్యుపాళెం పట్టణ అధ్యక్షుడు నవాబ్ వూట్లాడుతూ వూజీ ఎమ్మెల్యే తలారి వునోహర్ వైఖరిని దుయ్యుబట్టారు. ఈ సవుయుంలో వునోహర్ కార్యకర్తలపై దూకుడుగా ప్రవర్తించారు. దీంతో తీవ్ర వునస్థాపానికి గురైన కార్యకర్తలు ఒక్కసారిగా వునోహర్పై విరుచుకుపడ్డారు. ఏ అధికారంతో సవూవేశాలు నిర్వహిస్తున్నారని వునోహర్ను కార్యకర్తలు ప్రశ్నించారు. నియోజకవర్గంలో కార్యకర్తలను,అధికారులను తన కొడుకు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పీక్కు తింటున్నారని, ప్రతి పనికి డబ్బులు వసూలు చేయుడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఉన్నందుకు అవవూనపడుతున్నావుని ఆవేదన వ్యక్తం చేసారు. కార్యకర్తలు చిన్న పని చేసుకోవాలన్నా వూజీ ఎమ్మెల్యేకు వేలు,లక్షలు సవుర్పించుకోవాల్సి వస్తోం దని ఆరోపించారు. తవు కష్టం చెప్పుకోడానికి ఎమ్మెల్యేను కలవాలని పోతే తిరుపతిలో వేలకు వేలు లాడ్జీ బిల్లులు చెల్లించాల్సి వస్తోం దని వాపోయూరు. సవూవేశానికి హాజరైన 90శాతం కార్యకర్తలు వునోహర్‌కు వ్యతిరేకంగా వూట్లాడుతూ సవూవేశాన్ని బహిష్కరించారు. వునోహర్ అవినీతిని కార్యకర్తలే ఏవగించుకుంటున్నారని, జిల్లా వుంత్రికి,వుుఖ్యవుంత్రికి ఫిర్యాదు చేయునున్నట్లు వుండల తెలుగుదేశం నేతలు ప్రకటించారు. పార్టీ నేతలు కరుణాకర్ నాయుుడు,నిర్మల్ కువూర్, నరసరాజు,ఆంజి నేయుులు రెడ్డి,నాగ భూషణం నాయుుడు,లక్ష్మీపతి రెడ్డి,లక్ష్మీప్రసాద్ రెడ్డి,వుుని భూషణవ్ము,బొర్ర సుబ్బయ్యు పాల్గొన్నారు. విలేకరులపై కస్సుబుస్సులాడిన వూజీ ఎమ్మెల్యే కార్యకర్తల సవూవేశాన్ని కవర్ చేయుడానికి వెళ్లిన విలేకరులపై వునోహర్ కస్సుబుస్సులాడారు. సంఘటనను ఫొ టోలు తీయుడానికి ప్రయుత్నించిన ఓ విలేకరి (సాక్షికాదు)ని సవూవేశం నుంచి బయుటకు వెళ్లవుని పలుసార్లు హెచ్చరించారు. ఆయన వైఖరిని గర్హిస్తూ విలేకరులు సవూవేశం నుంచి బయుటకు వచ్చేశారు. -
బొమ్మలేస్తున్న బామ్మ
తదేక దీక్షతో బొమ్మలేస్తున్న ఈ బామ్మ పేరు చిలువేరి లింగమ్మ.. వయసు.. డెబ్బయ్ పైనే! ఈమె కుంచెతో పుట్టలేదు.. అలాగని ఏ గురువు దగ్గరో రంగులద్దడమూ నేర్చుకోలేదు! స్త్రీలో సహజంగా ఉండే సృజనను 65వ ఏట తట్టి లేపి.. చిత్రకారిణిగా పునర్జన్మనెత్తింది. తన కొడుకు చిలువేరి మనోహర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో పెట్టిన బోనాలు అర్ట్తో తొలిసారిగా పదిమందికీ తన కళ ప్రదర్శించింది. లింగమ్మ గురించి ఆమె మాటల్లోనే.. ‘మాది వరంగల్. రజాకార్ల జమానాలో ఆడపిల్లలకు చిన్నప్పుడే పెళ్లి చేసేటోళ్లు. అట్ల ఎనిమి దేళ్లకే నా పెళ్లరుుంది. మా ఆయనకు ఫ్రేమ్‌లు చేసే దుకాణం ఉండె. అండ్ల అద్దాలకు కళాయి పెడ్తుంటి తప్పితే ఏనాడూ బొమ్మేసిన గుర్తులేదు. మా ఆయున గియ్యుంగ జూసిన. నాకు ఆరుగురు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. ఇల్లు, పిల్లలతోనే జీవితం సగానికెక్కువ ఒడిశిపోరుుంది. పిల్లలందరూ మంచిగున్నరు. మా ఆయున పోయే దాకా.. నా గురించి ఆలోచించలే. పదేళ్ల కిందట ముచ్చట! ఆయున పోయునంక నాకు జీవితమే లేనట్టనిపించింది. తిండి, నిద్ర అన్నీ మర్సిన. నా పరిస్థితి చూసిన పిల్లలు ‘ అమ్మా.. నువ్వు ఇట్లుంటే కాదు నీకు నచ్చిన పనేదైనా చెయ్యి’ అని వెంటబడ్డరు. నాకేమొచ్చు సదువా..? సంధ్యా..? అరుునా బాగా ఆలోసించిన.. వూ ఇంటాయున ఒదిలేసిన జ్ఞాపకాలు నాకు బలాన్నిచ్చినయ్. ‘ బొవ్ములు గీస్తరా’ అని నా కొడుకులకు చెప్పిన, వాళ్లు నవ్వలే, బొవ్ములేయునికి కావాల్సిన వస్తువులన్నీ తెచ్చిచ్చిండ్రు. చిన్నప్పటి పరిసరాలు చిన్నతనంలో మా ఊళ్ల చూసిన చెట్టు, పుట్ట, చేను, గుట్ట.. అన్నీ యూది చేసుకుని బొవ్ములేసిన. నా పెళ్లరుున కొత్తల మా ఇల్లు ఎట్లుండే.. తర్వాత ఎట్లైంది.. ఆ జవూనాల మేం వంట చేసిన కట్టెల పొరుు్య.. తర్వాత తెచ్చుకున్న గ్యాస్ పొరుు్య కూడా నా బొవ్ములైనరుు. ఇట్ల నా బుద్ధికి ఏం యూదికొస్తే.. అవన్నీ గీసిన. వాటిని చూస్కుంటే బొమ్మలంటే గివ్వేనా? నా జీవితం గింతేనా? అనిపించింది. రేణుక ఎల్లమ్మ నాకు నలుగురు కొడుకులు పుట్టినాంక ఐదోకాన్పుల బిడ్డ పుట్టాలని రేణుక ఎల్లవ్ము తల్లికి మొక్కుకున్న. అమ్మోరు దయుతో అయిదో సంతానం ఆడపిల్ల పుట్టింది. అప్పటి సంది ఎల్లవ్మును కొలిసేదాన్ని. బొవ్ములన్నీ ఒక్కతీరుగొస్తున్నయుని యూష్టలున్న నాకు.. ఆ ఎల్లవ్ము తల్లి గుర్తొచ్చింది. ఆమె జీవిత చరిత్రనే బొవ్ముల్ల గీస్తే ఎట్లుంటదని ఆలోచించిన. ఆ తల్లి గురించి ఇప్పటికి ఎనభై బొవ్ములైనయ్. గండ్లయే డజన్ బొవ్ములు తీసి నా కొడుకు ‘బోనాలు ఆర్ట్’ ఎగ్జిబిషన్లో పెట్టిండు. ఈ బొమ్మల కథను పుస్తకంగా తేవాలనుకుంటున్న. ఎట్ల బతకాలో చూపించాలి నేను బతుకమ్మ పాటలు, లాలి పాటలు కూడా బాగా పాడ్త. బతుకమ్మ పాటలను కూడా పాడి ఆ సీడీల రూపంలో తేవాలనుకుంటున్న. ప్రస్తుతం నాకున్న పనులు గివ్వే. ముసలితనం మల్లొచ్చిన బాల్యం అంటరు. చిన్నతనంల ఎంత ఉత్సాహంగా ఉంటమో.. వుుసలితనంల కూడా అట్లనే ఉండాలె. అండ్ల ఆడాళ్లు ఇంకా. పెండ్లి, పిల్లలతో అప్పుడు వునకొచ్చి వునం చేయులేని పనులను వుుసలితనంల చేసుకుంటా ఎవ్వల మీద ఆధారపడకుండా ఎట్ల బతకొచ్చో పదిమందికి చూపించాలి. నాకు తెల్సింది ఇదే!’ స్టేట్ ఆర్ట్గ్యాలరీలోని బతుకమ్మలో ‘కుండ’.. స్త్రీకి ప్రతిరూపంగా.. ఆమె అస్తిత్వానికి, సాధికారతకు చిహ్నంగా లింగమ్మ చిత్రించింది. పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు మనిషి జీవితంలో కుండ ఎన్ని రకాలుగా భాగమవుతుందో స్త్రీ కూడా పురుషుడి జీవితంలోఅంతే ఆలంబనగా నిలుస్తుందనేది ఆమె అభిప్రాయం! -
పికెట్ రూమ్‌లోనే కానిస్టేబుల్ ఆత్మహత్య
అనారోగ్యమా...? పని ఒత్తిడి కారణమా! చాంద్రాయణగుట్ట, న్యూస్‌లైన్: విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ పోలీస్ పికెట్ రూంలోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఛత్రినాక పోలీసుల కథనం ప్రకారం... ఏపీఎస్పీ ఫస్ట్ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ మనోహర్ కుమారుడు సీహెచ్ కిరణ్‌కుమార్ (30) ఛత్రినాక ఠాణాలో కానిస్టేబుల్ (పీసీ నెం. 9564)గా పని చేస్తున్నాడు. కిరణ్ కుటుంబ సభ్యులంతా యూసుఫ్‌గూడలోని పోలీస్ క్వార్టర్స్‌లోనే ఉంటున్నారు. 2007 బ్యాచ్‌కు చెందిన కిరణ్ 2008 నుంచి ఛత్రినాక పీఎస్‌లో పని చేస్తున్నాడు. ఇదిలా ఉండగా గురువారం ఉదయం 10 గంటల నుంచి ఫలక్‌నుమా రైల్వేస్టేషన్ రోడ్డులోని కట్టమైసమ్మ ఆలయం పక్కన ఉన్న ‘ఛత్రినాక పోలీస్ పికెట్ రూమ్’లో మరో కానిస్టేబుల్ వి.శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, తన ఇంట్లో ఓ కార్యక్రమం ఉండటంతో శ్రీనివాస్‌గౌడ్ సెలవు మంజూరు చేయించుకొనేందుకు ఛత్రినాక ఠాణాకు వెళ్లాడు. అతను అరగంట తర్వాత వచ్చి చూడగా, కిరణ్ పికెట్ రూం పైకప్పులోని రేకుల పైప్‌కు తాడుతో ఉరేసుకొని మృతి చెంది ఉన్నాడు. విషయం తెలిసి దక్షిణ మండలం డీసీపీ సర్వశ్రేష్ట త్రిపాఠీ, అదనపు డీసీపీ కె.బాబురావు, ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ అబ్దుల్ బారీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. కిరణ్ ఆత్మహత్య చేసుకున్న రూమ్‌లో ఎలాంటి సూసైడ్‌నోట్ దొరకలేదు. కాగా డీఐ దేవేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి ఇంకా వివాహం జరగలేదు. మెడికల్ రిపోర్ట్స్ లభ్యం... మృతుడు కిరణ్ బ్యాగ్‌లో మెడికల్ రిపోర్ట్స్ దొరికాయి. కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు వాటిలో ఉంది. బ్యాగ్‌లో ఒక సిరఫ్ కూడా ఉంది. కిరణ్ సెల్‌ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని కాల్ డేటాను పరిశీలించారు. అనారోగ్యం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడా...? ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా...? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా గురువారం ఉదయం 10 గంటలకు విధులకు హాజరైన కిరణ్ శుక్రవారం ఉదయం 10 గంటలకు డ్యూటీ దిగాల్సి ఉంది. అయితే, శుక్రవారం ప్రార్థనల బందోబస్తు కోసం సాయంత్రం వరకు ఇక్కడే ఉండాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పని ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడా? అన్న విషయాలు తుది విచారణలో తేలాల్సి ఉంది. ఇదిలా ఉండగా, ఛత్రినాక ఇన్స్పెక్టర్, ఎస్సైల వేధింపులు ఎక్కువ కావడంతో విధి నిర్వహణ కొనసాగించలేని పరిస్థితి నెలకొందని ఛత్రినాక ఠాణాకు చెందిన కొందరు కానిస్టేబుళ్లు దక్షిణ మండలం డీసీపీ సర్వశ్రేష్ట త్రిపాఠీకి ఘటనా స్థలంలోనే మౌఖికంగా ఫిర్యాదు చేశారు. -
మనోహర్... మహా ముదురు!
సిటీబ్యూరో: అదో చోర కుటుంబం... స్వస్థలం గుంటూరు జిల్లా ఉండవల్లి... తల్లి, తండ్రితో పాటు కుమారుడు సైతం నేరాలు చేయడంలో దిట్ట. తల్లిని వనస్థలిపురం పోలీసుల 2012లో పట్టుకున్నారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న కుమారుడిని పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. జంట కమిషనరేట్ల పరిధిలో నమోదైన 52 కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నాడు. అదనపు డీసీపీ కె.రామ్‌చంద్రన్ తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన మేకపాటి మనోహర్ కుటుంబంతో సహా చాంద్రాయణగుట్ట ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఆరో తరగతితో చదువుకు స్వస్తి చెప్పిన ఇతను మెకానిక్‌గా పని చేస్తున్నాడు. తల్లి మంగమ్మ, తండ్రి ఆదినారాయణలతో కలిసి రద్దీ బస్సులు, ప్రాంతాల్లో తిరుగుతూ చోరీలు చేసేవాడు. 2009లో ఓసారి అరెస్టైన ముగ్గురూ జైలు నుంచి విడుదలైనా తమ పంథా మార్చుకోలేదు. దీంతో వనస్థలిపురం పోలీసులు 2012 ఆగస్టులో మంగమ్మను మరోసారి అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే తన కుమారుడు మనోహర్‌తో కలిసి జంట కమిషనరేట్ల పరిధిలో 52 నేరాలు చేశానని బయటపెట్టింది. వీటిలో జేబు దొంగతనాలు, అటెన్షన్ డైవర్షన్లు, స్నాచింగ్స్, చోరీలు ఉన్నాయని తెలిపింది. అప్పట్లో వీరి బ్యాంక్ ఖాతాలను పరిశీలించిన పోలీసులు రూ.లక్షల లావాదేవీలు చూసి అవాక్కయ్యారు. దీంతో అప్పటి నుంచి పోలీసులు మనోహర్ కోసం గాలిస్తున్నారు. ఇతడి కదలికలపై సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ వై.ప్రకాష్‌రెడ్డి నేతృత్వంలోని బృందం మంగళవారం వలపన్ని పట్టుకుంది. మనోహర్‌పై నగర కమిషనరేట్ పరిధిలోని సైదాబాద్, మలక్‌పేట్ ఠాణాల్లో మూడు కేసులు, సైబరాబాద్‌లో 49 కేసులు నమోదై ఉన్నట్లు తేలడంతో తదుపరి చర్యల నిమిత్తం సైదాబాద్ పోలీసులకు అప్పగించారు. మనోహర్ అరెస్టు సమాచారాన్ని సైబరాబాద్ పోలీసులు చేయగా.. అక్కడి అధికారులు పీటీ వారెంట్‌పై తమ కేసుల్లో అరెస్టు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
కేన్సర్ కాటు
వారికి ఇద్దరు కుమార్తెలు.. ఇద్దరు కుమారులు.. కుమార్తెలకు ఎలాగోలా పెళ్లి చేశారు.. కుమారుల సాయంతో బతుకుబండి సాగుతోంది.. ఇంతలో విధి వారితో ఆడుకోవడం మొదలు పెట్టింది.. చిన్న కుమారుడు నరేష్‌కుమార్‌కు జబ్బు చేసింది.. పరీక్షల్లో బోన్ కేన్సర్ అని తేలింది.. పైసాపైసా కూడబెట్టిన సొమ్ముతో నరేష్‌కుమార్‌కు ఆపరేషన్ చేయించారు. కొద్దికొద్దిగా కోలుకుంటుండగానే మరో షాక్.. పెద్ద కుమారుడు మల్లికార్జునకు పేగు కేన్సర్ చివరి దశలో ఉన్నట్లు వైద్యుల రిపోర్ట్.. ఆ కుటుంబానికి నోట మాట రాలేదు.. కొద్ది రోజులకే కేన్సర్‌తో పోరాడలేక మల్లికార్జున కన్ను మూశాడు.. పెద్ద కుమారుడితో పాటు ఆ కుటుంబం ఉన్నదంతా పోగోట్టుకుంది.. అయినా విధికి ఆ కుటుంబంపై పగ చల్లారలేదు.. ఈసారి ఇంటిపెద్దపైనే కేన్సర్ గురిపెట్టింది.. బోన్కేన్సర్ ముదిరిపోవడంతో ఇంటిపెద్ద మనోహర్ పెద్ద కుమారుడి వద్దకే వెళ్లిపోయాడు. భర్తను.. పెద్ద కుమారుడిని పోగోట్టుకున్న నాగలక్ష్మి చిన్నకుమారుడు నరేష్కుమార్పైనే ప్రాణాలు పెట్టుకుంది.. విధి తన కాఠిన్యాన్ని మానలేదు.. బోన్కేన్సర్ నుంచి తప్పించుకున్నావు.. ఇప్పుడు చూడు... అంటూ కంటి కేన్సర్‌ను ప్రయోగించింది.. ప్రస్తుతం నరేష్కుమార్ కంటి కేన్సర్‌తో పోరాటం చేస్తున్నాడు.. పెనిమిటిని.. పెద్దకొడుకును బలి తీసుకుని చిన్నకుమారుడిని కూడా కాటేయాలని కేన్సర్ చూస్తుండటంతో ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోతోంది.. -
నిలువెల్లా నిర్లక్ష్యం
సాక్షి, సంగారెడ్డి: ధర్మాస్పత్రి వైద్యాధికారుల నిర్లక్ష్యమే మానసిక రోగుల పాలిట శాపమైంది. కళ్లెదుటే రోగులు తీవ్ర అనారోగ్యంతో నరకయాతన అనుభవిస్తున్నా చూసి కనికరించడం లేదు. ఆస్పత్రిలో పనిచేస్తున్న ఏకైన మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ మురహరి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్(ఆర్ఎంఓ) బాధ్యతలతోనే సరిపెట్టుకుంటున్నారు. వైద్య సేవలందించడానికి సహృదయంతో వైద్యులెవరూ ముందుకు రావడం లేదు. ఆస్పత్రి ఆవరణలోనే నిర్వహిస్తున్న మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో పదుల సంఖ్యలో రోగులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మృత్యువుతో పోరాడుతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారు. ఆస్పత్రి సైక్రియాట్రిస్టు మురహరి, పునరావాస కేంద్రం నిర్వాహకుడు మనోహర్‌ల మధ్య నెలకొన్న భేదాభిప్రాయల నేపథ్యంలో వైద్యులెవరూ రోగుల వైపు కన్నెత్తి చూడడం లేదు. లేఖతో గుట్టు రట్టు ! ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి ఈ నెల 2న కలెక్టర్‌కు రాసిన ఓ లేఖ ‘సాక్షి’కి చిక్కింది. ఆస్పత్రి నుంచి పంపుతున్న రోగులను పునరావాస కేంద్రంలో చేర్చుకోకుండా నిర్వాహకుడు మనోహర్ వెనక్కి పంపిస్తున్నారని ఈ లేఖ ద్వారా ఆస్పత్రి సూపరింటెండెంట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి సిబ్బంది తో మనోహర్ దుర్భాషలాడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. వైద్యాధికారులు, నిర్వాహకుడి మధ్య నెలకొన్న విభేదాల మధ్య రోగులు నలిగిపోతున్నారని ఈ లేఖ చెప్పకనే చెప్పుతోంది. మానసిక, శారీరక రుగ్మతలతో రోజురోజుకు కుంగిపోతున్న రోగులకు వైద్యం అందించకుండా.. ఆస్పత్రి క్యాంటీన్ నుంచి సరఫరా చేసే నాసిరకం భోజనం పెట్టి.. ఆ తర్వాత నిద్రమాత్రలు మింగించి చేతులు దులుపుకుంటున్నారు. ఎవరికీ పట్టదా? పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న రోగులందరూ బక్కచిక్కిపోయారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో ఆశ్రయం పొందున్న 61 మంది రోగుల్లో సుమారు 20 మంది క్షయ వ్యాధితో బాధపడుతున్నా వైద్యాన్ని నోచుకోవడం లేదు. మంగళవారం ‘సాక్షి’లో ‘మృత్యు గోస’ శీర్షికతో ప్రచురితమైన కథనం మానసిక రోగుల వరుస మరణాలను వెలుగులోకి తీసుకొచ్చింది. నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు రోగులు మృతి చెందడంతో ఈ కేంద్రంలో చోటుచేసుకున్న మరణాల సంఖ్య 80కు చేరిన విషయాన్ని ఈ కథనం బయటపెట్టింది. పలువురు మానవతావాదులు స్పందించి రోగులకు తమవంతు సహాయం అందిస్తామని ‘సాక్షి’ కార్యాలయానికి సంప్రదించారు. అయితే, ఈ జిల్లా యంత్రాంగం గానీ, అటు ఆస్పత్రి వైద్యాధికారులు గానీ స్పందించకుండా మిన్నకుండిపోవడం విడ్డూరంగా మారింది. గడిచిన 8 ఏళ్లలో సంభవించిన మరణాల్లో అధిక శాతం క్షయ వ్యాధితో సంభవించినవే కాగా, జిల్లా వైద్య శాఖలో క్షయ వ్యాధి నిర్మూలన కోసమే ఓ ప్రత్యేక విభాగం పనిచేస్తున్నా.. ఇంతకాలం స్పందించకపోవడం శోచనీయం. -
ఏజేసీ హామీతో దీక్షల విరమణ
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : గిరిజన భవన నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని అదనపు జాయింట్ కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి హామీ ఇవ్వడంతో గిరిజన హక్కుల పోరాట సమితి కలెక్టరేట్ ఎదుట నిర్వహిస్తున్న 24 గంటల రిలే నిరాహార దీక్షలను గురువారం విరమించింది. పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జేసీ సుబ్బరాయుడు, జిల్లా అధ్యక్షుడు జె.సుబ్బరాయుడు, జిల్లా కార్యదర్శి బి.వెంకట సుబ్బయ్య, సహాయ కార్యదర్శి కె.శ్రీనివాసులు, దళిత ప్రజాపార్టీ అధ్యక్షుడు సంగటి మనోహర్ తదితరులు ఈ విషయాన్ని ఏజేసీకి వివరించారు. త్వరలో గిరిజన భవనానికి అవసరమైన స్థలాన్ని చూపెడతామని, ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ కింద భవన నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూరుస్తామని ఏజేసీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీసీ మహాసభ కన్వీనర్ అవ్వారు మల్లికార్జున, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేంద్రనాయక్ పాల్గొన్నారు. -
ఆప్తురాలిగా వచ్చి.. శిశువు కిడ్నాప్
గాంధీ ఆస్పత్రి/తెనాలి రూరల్, న్యూస్‌లైన్: గాంధీ ఆస్పత్రిలో ఒక రోజు వయస్సు న్న శిశువు అపహరణకు గురయ్యాడు. రంగంలోకి దిగిన నార్త్‌జోన్ పోలీసులు సమయస్ఫూర్తి తో వ్యవహరించి ఏడు గంటల్లోనే కేసును ఛేదిం చారు. తెనాలి పోలీసుల సహకారంతో శిశువును రక్షించడంతో పాటు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. చిలకలగూడ ఇన్స్పెక్టర్ బి.అంజయ్య కథనం ప్రకారం.. కడప జిల్లాకు చెందిన మనోహర్(37), చిత్తూరు జిల్లా పీలేరుకు చెంది న సుమిత్ర (28) ఐదేళ్ల క్రితం ప్రేమవివాహం చేసుకొని, బోరబండ శ్రీరాంనగర్‌లో ఉంటున్నా రు. గర్భవతి అయిన సుమిత్రను ప్రసవం కోసం శనివారం ఆస్పత్రిలో చేర్చగా, ఉదయం 11.36 గంటలకు మగబిడ్డకు జన్మనిచ్చిం ది. కొద్దిసేపటికి వైద్యు లు తల్లీబిడ్డల్ని పోస్ట్ ఆపరేటివ్ వార్డు యూనిట్-5కు తరలించారు. ఆప్తురాలిగా వచ్చి.. అదును చూసి కిడ్నాప్ బాలింతైన సుమిత్రకు సపర్యలు చేసేందుకు మహిళలు లేకపోవడం, మనోహర్‌ను వార్డులోకి రానీయక పోవడంతో అనేక ఇబ్బందులు పడ్డారు. ఆ స్థితిలో భార్యను చూసిన మనోహర్ లేబర్‌వార్డు వద్ద రోదిస్తూ కూర్చున్నారు. అటుగా వచ్చిన ఓ మహిళ ‘అన్నా ఎందుకు ఏడుస్తున్నావు’ అంటూ ప్రశ్నించింది. విషయం చెప్పడంతో ‘నేనున్నాను’ అంటూ ఓదార్చి అతని చేతిలోని మందులు తీసుకుని సుమిత్ర వద్దకు వెళ్లిన ఆ మహిళ.. తనపేరు మరియమ్మ అలియాస్ కీర్తి (30) అని, మనోహర్ పంపించాడని పరిచయం చేసుకుంది. పూర్తి నమ్మకం కలిగేందుకు కొన్ని సపర్యలు కూడా చేసింది. వార్డులో కలియతిరుగుతూ హడావుడి చేసింది. శనివారం రాత్రంతా సుమిత్ర, శిశువులతో కలిసి ఉన్న ఆమె.. ఆదివారం తెల్లవారుజామున శిశువును తీసుకుని వైద్యుడికి చూపించి తీసుకువస్తానంటూ వెళ్లింది. ఎంతకీ తిరిగి రాకపోవడంతో సుమిత్ర విషయం భర్తకు చెప్పింది. ఆస్పత్రి మొత్తం గాలించినా ఫలితం లేకపోవడంతో మనోహర్ అక్కడి పోలీసు ఔట్‌పోస్టు సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. వారి సాయంతో 8.30 గంటలకు చిలకలగూడ ఠాణాకు చేరుకుని ఇన్స్పెక్టర్ అంజయ్యను కలిశారు. సమయస్ఫూర్తితో.. మనోహర్ నుంచి నిందితురాలి వివరాలను సేకరించిన పోలీసులు.. ఇది కచ్చితంగా బయటి వారి పనేనని నిర్ధారణకు వచ్చారు. కిడ్నాప్ తర్వాత నగరం నుంచి పారిపోతారని అంచనాకు వచ్చిన పోలీసులు నార్త్‌జోన్ డీసీపీ జయలక్ష్మికి విషయం తెలిపారు. ఆమె ఆదేశాలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అన్ని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లకు పంపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఇన్స్పెక్టర్ అంజయ్య, ఎస్సై వీరబాబు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజ్‌ను పరిశీలించగా, కీలక ఆధారాలు లభించాయి. ఉదయం 6.19 గంటలకు ఓ మహిళ శిశువును ఎత్తుకొని స్టేషన్లోకి ప్రవేశించగా, వెనుక మరో వ్యక్తి టికెట్లతో వచ్చాడు. శిశువుతో ఉన్న మహిళను మనోహర్ గుర్తించాడు. వారిద్దరు 6.27కు రెండో నెంబర్ ప్లాట్‌ఫాం పైకి వచ్చినట్లు రికార్డు అయింది. అ ప్లాట్‌ఫామ్ నుంచి 7.10 గంటలకు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ వెళ్లడంతో నిందితులు అదే ఎక్కి ఉంటారని అనుమానించారు. తక్షణమే స్పందించిన తెనాలి డీఎస్పీ.. రైలు తెనాలి మీదుగా వెళ్తోందని గుర్తించిన చిల కలగూడ పోలీసులు తెనాలి డీఎస్పీ వై.తులసీరామ్ప్రసాద్ను సంప్రదించి, విషయం వివరిం చారు. గతంలో నగరంలో సుదీర్ఘ కాలం పని చేసిన ప్రసాద్ తక్షణమే స్పందించి, తెనాలి త్రీ టౌన్‌తో పాటు ఆర్పీఎఫ్, జీఆర్పీలను అప్రమత్తం చేసి మొత్తం 30 మందిని ప్లాట్‌ఫాంకు ఇరువైపులా మోహరించారు. మధ్యాహ్నం 1.30కు రైలు తెనాలికి చేరుకోగానే అనువణువూ తనిఖీ చేశారు. డీ-1 బోగీలో ఉన్న నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని శిశువును రెస్క్యూ చేశారు. నిందితులైన కత్తిమండ్ల మేరీ (23), పంబా నవీన్ (18)లను త్రీ టౌన్ ఠాణాకు, శిశువును ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. నిందితులది పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుగా తేలింది. నవీన్... మేరీ అక్క కుమారుడు. వీరు గతంలోనూ ఇలాంటి నేరాలు చేసినట్లు సమాచారం. అస్వస్థతకు గురైన శిశువును మెరుగైన వైద్యమందించేందుకు గుంటూ రు జిల్లా ఆస్పత్రికి తరలించాలని వైద్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించా రు. 1.9 కిలోల బరువున్న శిశువును అంబులెన్స్‌లో తేవడం ప్రమాదకరమని, తల్లినే గుంటూ రు తరలించాలని భావించారు. అయితే బాలిం తకు రక్తస్రావం ఎక్కువ కావడంతో సోమవా రం గుంటూరు తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందం బయల్దేరి వెళ్లింది. కాగా, మేరీ రెండ్రోజులుగా ఆస్పత్రి పరిసరాల్లో తిరుగుతూ శిశువును విక్రయిస్తారా? అంటూ సెక్యూరిటీ సిబ్బందిని వాకబు చేసినట్లు తెలిసింది. వారు అక్కడి నుంచి వెళ్లగొట్టగా, ఆప్తురాలిగా నటించి బాబుతో ఉడాయించినట్లు సమాచారం.