
సాక్షి, చిత్తూరు : ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌పై కుప్పం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి, బ్యాంక్ నుంచి డబ్బులు కాజేశారంటూ మనోహర్‌పై వైఎస్సార్ సీపీ నేత విద్యాసాగర్ ఫిర్యాదు చేశారు. కాగా చిత్తూరు జిల్లా కుప్పం టౌన్ బ్యాంక్‌లో గోల్‌మాల్ కలకలం రేపుతోంది. (మీరు కుప్పంలో చేసిందేంటి బాబూ?)
చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ ఈ గోల్‌మాల్ వ్యవహారంలో కీలక సూత్రధారిగా మారటం చర్చనీయాంశం అయింది. వ్యవసాయానికి ఇవ్వాల్సిన నిధులు పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. మనోహర్ సిఫారసుతో పలువురికి అడ్డగోలుగా లోన్లు మంజూరు చేసిన బ్యాంక్ ఇప్పుడు వసూలు చేయలేక తంటాలు పడుతోంది. లోన్లు తీసుకున్న వారు చెల్లించకపోవడంతో బయటపడ్డ ఈ గోల్‌మాల్ వెనుక బడా నేతల ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. సుమారు 2కోట్ల 97 లక్షల అవినీతి జరిగినట్టు నిర్ధారణ అయింది.
Comments
Please login to add a commentAdd a comment