వారికి ఇద్దరు కుమార్తెలు.. ఇద్దరు కుమారులు.. కుమార్తెలకు ఎలాగోలా పెళ్లి చేశారు.. కుమారుల సాయంతో బతుకుబండి సాగుతోంది.. ఇంతలో విధి వారితో ఆడుకోవడం మొదలు పెట్టింది.. చిన్న కుమారుడు నరేష్‌కుమార్‌కు జబ్బు చేసింది.. పరీక్షల్లో బోన్ కేన్సర్ అని తేలింది.. పైసాపైసా కూడబెట్టిన సొమ్ముతో నరేష్‌కుమార్‌కు ఆపరేషన్ చేయించారు. కొద్దికొద్దిగా కోలుకుంటుండగానే మరో షాక్.. పెద్ద కుమారుడు మల్లికార్జునకు పేగు కేన్సర్ చివరి దశలో ఉన్నట్లు వైద్యుల రిపోర్ట్..
ఆ కుటుంబానికి నోట మాట రాలేదు.. కొద్ది రోజులకే కేన్సర్‌తో పోరాడలేక మల్లికార్జున కన్ను మూశాడు.. పెద్ద కుమారుడితో పాటు ఆ కుటుంబం ఉన్నదంతా పోగోట్టుకుంది.. అయినా విధికి ఆ కుటుంబంపై పగ చల్లారలేదు.. ఈసారి ఇంటిపెద్దపైనే కేన్సర్ గురిపెట్టింది.. బోన్‌కేన్సర్ ముదిరిపోవడంతో ఇంటిపెద్ద మనోహర్ పెద్ద కుమారుడి వద్దకే వెళ్లిపోయాడు. భర్తను.. పెద్ద కుమారుడిని పోగోట్టుకున్న నాగలక్ష్మి చిన్నకుమారుడు నరేష్‌కుమార్‌పైనే ప్రాణాలు పెట్టుకుంది.. విధి తన కాఠిన్యాన్ని మానలేదు.. బోన్‌కేన్సర్ నుంచి తప్పించుకున్నావు.. ఇప్పుడు చూడు... అంటూ కంటి కేన్సర్‌ను ప్రయోగించింది.. ప్రస్తుతం నరేష్‌కుమార్ కంటి కేన్సర్‌తో పోరాటం చేస్తున్నాడు.. పెనిమిటిని.. పెద్దకొడుకును బలి తీసుకుని చిన్నకుమారుడిని కూడా కాటేయాలని కేన్సర్ చూస్తుండటంతో ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోతోంది..
కేన్సర్ కాటు
Published Sat, Feb 1 2014 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM
Advertisement
Advertisement