mallikarjuna
-
సమాజానికి ‘ఎక్స్‌రే’!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరగాలంటే కులగణన తప్పనిసరని... ఇది సమాజానికి ‘ఎక్స్‌రే’వంటిదని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సమాజానికి ‘మెగా హెల్త్ చెకప్’జరగాలంటే కులగణన చేసి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో సామాజిక న్యాయ సాధనకోసం చేపట్టే మూడో ఉద్యమంలో కులగణన భాగమని చెప్పారు. ఇప్పటికే తెలంగాణలో కులగణన చేపట్టి, దేశానికే ఆదర్శంగా నిలిచామని పేర్కొన్నారు. మంగళవారం 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏఐసీసీ ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని తోల్‌కటోరా స్టేడియంలో నిర్వహించిన ‘సంవిధాన్ రక్షక్ అభియాన్’కార్యక్రమంలో సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు.ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి కులగణన అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ, బీఆర్ అంబేడ్కర్, ఇందిరాగాంధీ తమ హయాంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, బ్యాంకుల జాతీయీకరణ వంటివి తెచ్చారు. 140 కోట్ల మంది పేదలకు రాజ్యాంగపరమైన హక్కులు కల్పించారు. రిజర్వేషన్ల ద్వారా విద్య, ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు. అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా పేదలకు భూమి హక్కులు కలి్పంచి వారి గౌరవాన్ని రెట్టింపు చేశారు. అది చరిత్రలో 1.0గా నిలిచింది. ఇక 2.0లో భాగంగా రాజీవ్‌గాంధీ మొదలు పీవీ నర్సింహారావు వరకు మండల్ కమిషన్ ద్వారా ఓబీసీలకు, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేశారు. 18 ఏళ్లకే ఓటు హక్కు తెచ్చారు. ఐఐటీ, ఐఐఎంలలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలకు సామాజిక న్యాయం చేశారు. ఎంత జనాభా ఉంటే అంత హక్కు ఇక 3.0లో భాగంగా సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేల నిర్దేశంలో రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశీ్మర్ వరకు పాదయాత్ర చేసి... నిరుద్యోగులు, పేదలు, రైతులను కలసి కులగణన చేస్తామని హామీ ఇచ్చారు. ‘జిత్నీ భాగీ దారీ.. ఉత్నీ హిస్సే దారీ (ఎంత జనాభా ఉంటే అంత హక్కు)’అని నినదించారు. ఈ కులగణన అనేది ఎక్స్‌రే వంటిది. సమాజానికి ఇది ‘మెగా హెల్త్ చెకప్’వంటిదే. దేశంలో జనాభా ఆధారంగా రిజర్వేషన్లు దక్కాలన్నా, సామాజిక న్యాయం జరగాలన్నా కులగణన తప్పనిసరి. దేశంలోనే తొలిసారి తెలంగాణలో కులగణన మొదలుపెట్టాం. 92శాతం పూర్తయింది. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకున్నాం. సామాజిక న్యాయం చేయడంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలబడింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం జనగణనలో భాగంగా కులగణన కూడా చేపట్టాల్సిందే. కులగణన చేసేంతవరకు మోదీ ప్రభుత్వంపై రాహుల్ ఒత్తిడి తెస్తూనే ఉంటారు.గాంధీ పరివార్.. మోదీ పరివార్ మధ్య యుద్ధందేశంలో ప్రస్తుతం మోదీ పరివార్, గాంధీ పరివార్‡ అని రెండు వర్గాలే ఉన్నాయి. ఇందులో గాంధీ పరివార్ రాజ్యాంగాన్ని రక్షించాలని భావిస్తుంటే... మోదీ పరివార్ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తోంది. ఈ సమయంలో ప్రజలంతా రాజ్యాంగ రక్షకులైన గాంధీ కుటుంబానికి వెన్నుదన్నుగా నిలవాలి. గతంలో రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తెచి్చన నల్లచట్టాలపై రాహుల్ దృఢంగా నిలబడి కొట్లాడారు. రాహుల్ పోరాటంతో కేంద్రం వెనకడుగు వేసింది. అదే రీతిలో కులగణనపై కొట్లాడాలి. ఈ అంశంలో రాహుల్ చేసే ప్రతి పోరాటానికి మద్దతుగా మేముంటాం..’’అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.ఖర్గేతో భేటీ.. ప్రియాంకకు శుభాకాంక్షలు సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో మంగళవారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో విడిగా కొంతసేపు భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు జనగణన ప్రక్రియ సాగుతున్న తీరును వివరించినట్టు సమాచారం. కులగణన ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్‌పై వారి మధ్య చర్చ జరిగినట్టు తెలిసింది. డిసెంబర్ ఒకటి నుంచి జరగనున్న ప్రజా పాలన దినోత్సవాల ఏర్పాట్లపైనా మాట్లాడుకున్నట్టు సమాచారం. ఇక ఇటీవల వయనాడ్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన ఎంపీ ప్రియాంకా గాం«దీని రేవంత్, భట్టి విక్రమార్క కలసి శుభాకాంక్షలు తెలిపారు. -
‘బుల్డోజర్’ ప్రభుత్వంగా మారొద్దు!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో మూసీ సుందరీకరణ, చెరువుల పరిరక్షణ, హైదరాబాద్ అభివృద్ధి పేరిట అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో కూల్చివేయడంపై ఆచితూచి వ్యవహరించాలని కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హితోపదేశం చేసినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పౌరుల హక్కులను హరించి వారిని రోడ్డుపాలు చేసేలా అమానవీయంగా వ్యవహరించొద్దని, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా అధికార కొరడాను సామాన్యులపై ఝళిపించవద్దని ఏఐసీసీ పెద్దలు సూచించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనుసరిస్తున్న బుల్డోజర్ సంస్కృతిపై రాజకీయ, న్యాయ వేదికలపై కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్న పోరాటాన్ని ముఖ్యమంత్రికి గుర్తు చేశారు.అదే తరహా బుల్డోజర్ విధానాన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో అమలు చేయడం పార్టీ ప్రతిష్టకు భంగకరమని వ్యాఖ్యానించారు. ఇటీవల జమ్మూకశీ్మర్ ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను పరామర్శించడంతో పాటు రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై పెద్దలతో చర్చించేందుకు సోమవారం రాత్రి ఢిల్లీ వచి్చన రేవంత్‌రెడ్డి మంగళవారం ఖర్గేతో పాటు పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో విడివిడిగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిస్థితులు, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ వంటి అంశాలపై చర్చించారు. ఆ చెడ్డపేరు మనకొద్దు.. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు, నిర్వాసితుల నిరసనలు, ప్రతిపక్షాల ఆందోళనలు ఆయా భేటీల్లో చర్చకు వచ్చినట్లు తెలిసింది. మూసీ పరీవాహక అభివృద్ధి విషయంలో ప్రభుత్వ లక్ష్యం, దానికోసం తీసుకున్న కార్యాచరణ, నిర్వాసితులకు ప్రభుత్వ పరంగా అందజేయనున్న మద్దతు వంటి అంశాలను సీఎం వివరించారు. ఈ సందర్భంగా ఖర్గే స్పందిస్తూ.. ‘అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ప్రభుత్వం తీసుకునే కార్యాచరణలో ముందుగా నష్టపోయేది, రోడ్డున పడేది నిమ్న వర్గాల ప్రజలే. అక్రమ నిర్మాణాల కూల్చివేతలు వంటి కార్యక్రమాల్లో నిందితులు ఒకరైతే, బాధితులు ఇంకొకరు ఉంటారు.నిమ్న వర్గాల పట్ల ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తోందనే అపవాదును ఒకసారి మూటగట్టుకుంటే దానిని తుడిచెయ్యడం అంత సులభం కాదు. అందుకే సంయమనంతో వ్యవహరించండి. ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూల్చివేతలపై కాంగ్రెస్ పక్షాన నేనూ, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పోరాటం చేస్తున్నాం. బుల్డోజర్ పాలసీని వ్యతిరేకిస్తూ మన పార్టీ నేతలు, క్షేత్రస్థాయి కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు.కోర్టుల్లోనూ కొట్లాడుతున్నాం. ఇలాంటి నేపథ్యంలో మనది కూడా బుల్డోజర్ ప్రభుత్వం అనే చెడ్డపేరు రాకూడదు..’అని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ అంశంలో ఇప్పటికే ఏఐసీసీకి ఫిర్యాదులు అందాయని, సొంత పార్టీ నేతలు సైతం ప్రభుత్వ విధానాన్ని తప్పుపడుతూ తమకు లేఖలు రాసినట్లుగా ఖర్గే చెప్పినట్లు సమాచారం. కాగా పునరావాసం, డబుల్ బెడ్రూమ్ ఇళ్లæ కేటాయింపు వంటి వాటిద్వారా నిరాశ్రయులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామని రేవంత్‌రెడ్డి వివరించినట్లుగా సమాచారం. కాగా ఖర్గే తరహాలోనే కేసీ వేణుగోపాల్ సైతం ఈ వ్యవహారంపై స్పందించినట్లు ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. దసరాకు ముందే.. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా చర్చించినట్లు తెలిసింది. నామినేటెడ్ పదవుల భర్తీపై పీసీసీ అధ్యక్షుడితో సహాæ ఇతర సీనియర్లను సంప్రదించి నియామకాలు చేసుకోవచ్చని పెద్దలు సూచించినట్లు సమాచారం. ఇతర పార్టీల నుంచి వచి్చన ఎమ్మెల్యేలకు కూడా నామినేటెడ్ పదవుల్లో కీలక కార్పొరేషన్లు ఇచ్చేందుకు వారు అంగీకరించినట్లు తెలిసింది. దసరాకు ముందే 25కు పైగా కార్పొరేషన్ చైర్మన్ పదవులు భర్తీ చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.ఇక మంత్రివర్గ విస్తరణపై ఈ నెల 5 తర్వాత మరోమారు చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని ఏఐసీసీ పెద్దలు చెప్పినట్లు తెలిసింది. దసరాకు ముందే విస్తరణ ఉంటుందనే సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. కాగా రాజ్యసభ సభ్యుడు అభిõÙక్ మను సింఘ్వీతో కూడా భేటీ అయిన రేవంత్, అనంతరం హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. -
ధర్మవరంలో బీజేపీ – టీడీపీ వార్
ధర్మవరం: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున నియామకం కూటమి పార్టీల మధ్య చిచ్చు రగిల్చింది. మంత్రి సత్యకుమార్ మద్దతుతో మల్లికార్జున ధర్మవరం మున్సిపాలిటీ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ తీవ్రంగా వ్యతిరేకించారు. మల్లికార్జున మున్సిపల్ ఆఫీసుకు వస్తే చొక్కా పట్టుకుని బయటకు గెంటేస్తానని శ్రీరామ్ హెచ్చరించారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ధర్మవరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో మంత్రి సత్యకుమార్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు కమిషనర్‌ను అడ్డుకునేందుకు అక్కడికి భారీగా తరలివచ్చారు. దీంతో మంత్రి సత్యకుమార్ మున్సిపల్ అధికారులను, కమిషనర్‌ను మార్కెట్ యార్డు వద్ద ఉన్న ఎన్డీఏ కార్యాలయంలోని క్యాంప్ ఆఫీసుకి రప్పించుకుని అక్కడే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మంత్రి క్యాంప్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ధర్మవరం–అనంతపురం ప్రధాన రహదారిపై బైఠాయించారు. మంత్రి సత్యకుమార్, కమిషనర్ మల్లికార్జునకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. డీఎస్పీ శ్రీనివాసులు వారిని శాంతింపజేసే ప్రయత్నం చేసినా ఫలించక పోవడంతో ఎన్డీఏ ఆఫీస్‌లోకి ఎవ్వరూ వెళ్లకుండా తాళం వేశారు.కమిషనర్ మల్లికార్జున నియామకం సరైనదేఅంతకు ముందు మంత్రి సత్యకుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. కమిషనర్ మల్లికార్జున నియామకం సరైనదేనని, ఆయన సమర్ధుడైన మంచి అధికారి అంటూ కితాబిచ్చారు. మల్లికార్జున అయితే ధర్మవరం అభివృద్ధి చెందుతుందని భావించే మున్సిపల్ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించిందన్నారు. గత ప్రభుత్వంలో పని చేశారన్న కారణంతో ఆయన్ని కొన్ని పార్టీల నాయకులు అడ్డుకుంటున్నారని, అది మంచి పద్ధతి కాదని చెప్పారు. అధికారులకు రాజకీయాలను ఆపాదించకూడదని అన్నారు. కమిషనర్‌గా మల్లికార్జున కొనసాగుతారని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు.సత్యకుమార్‌ను ఘెరావ్ చేసిన టీడీపీ కార్యకర్తలుమంత్రి క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు కమిషనర్ మల్లికార్జునను కార్యాలయం వెనుక గేట్ నుంచి బందోబస్తుతో పంపించేశారు. అనంతరం మంత్రి సత్యకుమార్ సమావేశాన్ని అర్ధంతరంగా ముగించుకుని బయటకు వచ్చారు. వెంటనే టీడీపీ నేతలు ఆయనపై విరుచుకుపడ్డారు. ‘మేం కష్టపడి గెలిపిస్తే మంత్రివి అయ్యావు. నీవు, నీ అనుచరులు మాపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. మీ సంగతి చూస్తాం’ అంటూ దుర్భాషలాడారు. మంత్రి సత్యకుమార్ ముందుకు కదలకుండా ఆయన వాహనాన్ని చుట్టుముట్టి ఘొరావ్ చేశారు. పరిస్థితి చేయిదాటుతుండటంతో పోలీసులు టీడీపీ కార్యకర్తలను నెట్టివేసి మంత్రిని పంపించేశారు. బీజేపీ, టీడీపీ విభేదాల కారణంగా ధర్మవరం పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రహదారిపై రెండు గంటల పాటు ధర్నా వల్ల వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పాఠశాలల విద్యార్థులు, వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. -
పేర్లు ఫైనల్.. మిగిలింది ప్రకటనే!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించే నేతల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది. దీనితోపాటు పీసీసీ కొత్త చీఫ్ ఎంపిక, నామినేటెడ్ పదవుల జాబితానూ కొలిక్కి తెచ్చినట్టు సమాచారం. జిల్లాల ప్రాతినిధ్యం, సామాజిక వర్గాలు, పార్టీలో పనిచేసిన అనుభవం, సీనియారిటీ ఆధారంగా కొత్త మంత్రుల ఎంపిక జరిగినట్టు సమాచారం. కాంగ్రెస్ నుంచి పోటీచేసి, గెలిచిన వారికే మంత్రివర్గంలో చోటు కలి్పంచాలని, ఎన్నికల తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చి న వారికి అవకాశం ఇవ్వకూడదని అధిష్టానం నిర్ణ యించినట్టు పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమెల్యేలకు కీలక పదవులు దక్కే అవకాశం లేదని అంటున్నాయి. వరుసగా నేతలతో భేటీలు.. కీలక పదవుల పంపకాలపై ఢిల్లీలో ఐదు రోజులుగా వరుసగా భేటీలు జరుపుతున్న రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు శుక్రవారం కూడా విడివిడిగా చర్చలు జరిపారు. సీఎంతో భేటీకి ముందే దీపాదాస్ మున్షీ తెలంగాణ భవన్‌లోని శబరి బ్లాక్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు లతో గంటన్నర పాటు చర్చించారు. మంత్రివర్గంలో తీసుకునేందుకు పరిశీలనలో ఉన్నవారందరి పేర్లపై అభిప్రాయం తీసుకున్నారు. ఒకరిద్దరి పేర్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా.. మిగతా పేర్లపై ఏకాభిప్రాయం వచ్చినట్టు తెలిసింది.ఈ భేటీ అనంతరం దీపాదాస్ మున్షీ సహా నేతలంతా సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు. ఏకాభిప్రాయం వ్యక్తమైన పేర్లపై చర్చించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి పేర్లకు అందరూ ఆమోదం తెలిపినట్టుగా సమాచారం. మిగతా పేర్లలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి, బల్మూరి వెంకట్, ప్రేమ్‌సాగర్‌రావు, వివే క్, బాలూనాయక్ తదితరుల పేర్లపై కొంత భిన్నాభిప్రాయాలు వచ్చినట్టు తెలిసింది. దీంతో వీటి నుంచి ఫైనల్ చేసే బాధ్యతను అధిష్టానంకు కట్టబెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. కొత్తగా చేరినవారికి ఎలా? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తెల్లం వెంకట్రావ్, కాలె యాదయ్య, సంజయ్‌కుమార్‌ల లో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలన్న ప్రతిపాదనపైనా భేటీలో చర్చించినట్టు తెలిసింది. దీనికితోడు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లోకి వచ్చే ందుకు సిద్ధమైన దృష్ట్యా.. వారికి ఎలాంటి హామీ ఇవ్వాలన్న దానిపైనా చర్చ జరిగినట్టు సమాచారం.చివరిగా ఈ భేటీ అనంతరం దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి తదితరులు.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లతో భేటీ అయ్యారు. పరిశీలనలో ఉన్న ఎమ్మెల్యేల పేర్లు, ఏకాభిప్రాయం కుదిరిన పేర్లపై వారితో చర్చించారు. పీసీసీ అధ్యక్ష నియామకం విషయంలో నేతల అభిప్రాయాలను వారి దృష్టికి తెచ్చారు.రాష్ట్ర నేతలు తెలిపిన పేర్లను పరిశీలించి ఒకట్రెండు రోజుల్లో తెలియజేస్తామని.. జూలై మొదటివారంలో మంత్రివర్గ విస్తరణ చేసుకోవచ్చని అధిష్టానం పెద్దలు చెప్పినట్టు తెలిసింది. ఇక మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టులేవీ కొత్తగా చేరిన వారికి అవకాశం ఇవ్వకుండా.. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న వారికే అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. బీసీకే పీసీసీ చీఫ్ పదవి! పీసీసీ చీఫ్‌గా బీసీ వర్గ నేతకే చాన్స్ ఇవ్వాలని నేతలంతా అభిప్రాయపడ్డట్టు తెలిసింది. ఈ లెక్కన ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్‌లలో ఒకరికి అవకాశం దక్కవచ్చని టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. వీరి విషయంలో ఏకాభిప్రాయం రాని పక్షంలో ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్ పేరు పరిశీలనలో ఉందని అంటున్నాయి. -
మంత్రివర్గంలోకి పోచారం?
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర మంత్రివర్గంలోకి మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డిని తీసుకొనేందుకు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దల నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పోచారానికి ఉన్న అపార అనుభవం, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆయనకున్న పట్టును దృష్టిలో పెట్టుకొని మంత్రి పదవి ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడంతోపాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసేందుకు ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం రాత్రి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్‌రెడ్డిని తన కారులో ఎక్కించుకొని స్వయంగా ఏఐసీసీ కార్యాలయానికి వచ్చిన సీఎం... ఆయన్ను పార్టీ పెద్దలకు పరిచయం చేశారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా, స్పీకర్‌గా ఆయన అనుభవాన్ని వారికి వివరించారు. జిల్లాలో ఉన్న ఆయన పలుకుబడి పార్టీ ఉన్నతికి ఉపయోగపడుతుందని వారి దృష్టికి తెచ్చారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఎవరూ మంత్రివర్గంలో లేని దృష్ట్యా ఆయనకు అవకాశం ఇస్తే పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని వివరించారు. దీనిపై హైకమాండ్ పెద్దలు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. మరోవైపు జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అంశంతోపాటు మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీలోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్న విషయాన్ని ముఖ్యమంత్రి పార్టీ పెద్దలకు వివరించారు. పీసీసీ రేసులోకి బలరాం, షెట్కార్ పార్టీ పెద్దలతో పీసీసీ అధ్యక్ష ఎంపిక వ్యవహారం సైతం చర్చ కు వచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే సామాజికవర్గాల వారీగా పలువురి పేర్లు ప్రచారంలో ఉండగా కొత్తగా ఎంపీలు బలరాం నాయక్, సురేశ్ షెటా్కర్ల పేర్లు రేసులోకి వచ్చాయి. పీసీసీ పదవి కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మంత్రి పొన్నం ప్రభాకర్, పార్టీ సీనియర్ నేతలు మహేశ్‌కుమార్‌గౌడ్, మధుయాష్కీగౌడ్ పోటీ పడుతుండగా మరో మంత్రి సీతక్క పేరు సైతం ప్రచారంలో ఉంది.అయితే సోమవారం నాటి భేటీలో మాత్రం మహేశ్‌కుమార్ గౌడ్‌తోపాటు ఎస్టీ కోటాలో బలరాం నాయక్, బీసీ కోటాలో షెటా్కర్ పేర్లు ప్రస్తావనకు వచి్చనట్లు తెలిసింది. అయితే ఇంకా ఎవరి పేరును ఖరారు చేయలేదని తెలుస్తోంది. రాష్ట్ర సీనియర్లతో చర్చించి ఫైనల్ చేయనున్నారు. ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశంపైనా రేవంత్ సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. -
సీట్లు తగ్గడానికి బాధ్యులెవరు?
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందిన స్థానాలపై వారం రోజుల్లోగా ఏఐసీసీ నాయకత్వం పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించనుంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ ఫలితాలు సాధించినప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ కేవలం 8 స్థానాలకే పరిమితం కావడంపై ఒకింత అసహనంగా ఉన్న హైకమాండ్ దీనికి బాధ్యులెవరని గుర్తించడంతో పాటు ఓటమికి కారణాలను సూక్ష్మ స్థాయిలో పరీశీలన చేయనుంది.దీనిపై ఇప్పటికే పూర్తి స్థాయి నివేదికలతో రావాలని రాష్ట్ర నాయకత్వానికి హైకమాండ్ కబురు పంపినట్లు తెలిసింది. నిజానికి రాష్ట్రంలో కనీసంగా 14 సీట్లు గెలవాలని ఏఐసీసీ లక్ష్యంగా నిర్ణయించినప్పటికీ ఎనిమిది స్థానాల్లోనే గెలిచింది. ప్రధాన పోటీదారుగా ఉన్న బీజేపీకి సైతం 8 స్థానాలు దక్కాయి. కేవలం ఐదు నెలల వ్యవధిలోనే ఈ స్థాయి వైఫల్యాలపై ఇటీవల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీలో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తప్పుపట్టారు.గెలవాల్సిన రాష్ట్రాల్లోనూ పార్టీ మెరుగైన సీట్లు సాధించలేకపోయిందని తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఫలితాలను ప్రస్తావించారు. ఈ రాష్ట్రాలపై విడిగా సమీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు. అందుకు అనుగుణంగానే కర్ణాటక ఫలితాలను ఖర్గే, రాహుల్‌గాంధీ సమీక్షించారు. కేబినెట్లో మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పార్టీకి తక్కువ ఓట్లు రావడానికి గల కారణాలను విశ్లేషించారు. ఇదే మాదిరి సమీక్ష తెలంగాణలోని ఓటమి చెందిన నియోజకవర్గాలకు సంబంధించి ఉంటుందని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. -
‘అసైన్డ్’పై తప్పుడు కథనాలు
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో అసైన్డ్ భూముల వ్యవహారంపై ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నాయని జిల్లా కలెక్టర్ డా.మల్లికార్జున అన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా.. ప్రజల్ని తప్పుదారి పట్టించేలా ఆ కథనాలున్నాయని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆనందపురం మండలం రామవరం గ్రామంలోని సర్వే నం.164–3లో 1.53 ఎకరాలు, సర్వే నం.169–2లో 0.87 ఎకరాల్ని జీఓ నం.596 ప్రకారం ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు కథనాలు వచ్చాయన్నారు. అయితే, 1977 రెÐవెన్యూ చట్టానికి లోబడే ప్రొసీడింగ్స్ మంజూరు చేశామని స్పష్టంచేశారు. అక్కిరెడ్డి బంగారయ్యకి సంబంధించి సర్వే నంబర్ 169–2లోని 0.87 ఎకరాలకు ఎలాంటి ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ జారీచేయలేదన్నారు. అదేవిధంగా.. 2020లో భీమునిపట్నం మండలం అన్నవరం, భోగాపురం మండలం తూడెం గ్రామాల్లో జరిగిన ల్యాండ్ పూలింగ్ విషయంలో ఈనాడు రాసిన కథనంపై కలెక్టర్ మండిపడ్డారు. వాస్తవానికి.. అన్నవరం గ్రామంలోని సెటిల్మెంట్ ఫెయిర్ అడంగల్, భీమునిపట్నం మండలం అన్నవరం గ్రామంలోని సర్వే నం.1/101.పరిధిలోని భూమి వర్గీకరణ, మొత్తం విస్తీర్ణం 199.28 ఎకరాలు గయాలుగా నమోదైందన్నారు. ఇందులో తాము అనుభవిస్తున్నట్లుగా సదరు రైతులు ఆధారాలతో తమకెలాంటి ఫిర్యాదులూ చేయలేదన్నారు. హక్కు పత్రాలు ఏమైనా ఉంటే సమర్పించాలని పలుమార్లు రైతుల్ని కోరినా ఇవ్వలేదన్నారు. నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా పట్టణ ప్రాంతంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలిచ్చేందుకు ఆనందపురం, పద్మనాభం మండలాల్లో పూలింగ్ జరిపినప్పుడు హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే చేపట్టామని కలెక్టర్ స్పష్టంచేశారు. గ్రామసభలు సైతం నిర్వహించామని.. ఇందులో భాగంగానే 2019 నవంబర్ 28న ఎంజాయ్మెంట్ సర్వేచేసి రైతుల సమ్మతితోనే భూ సమీకరణ చేసుకునేందుకు అదే నెల 30న ఫారం–1 నోటీసులు సైతం జారీచేసినట్లు ఆయన వివరించారు. ఈ సమయంలో ఎలాంటి అభ్యంతరాలు రాలేదనీ, దానికనుగనంగా.. సమీకరణ చేపట్టామన్నారు. రిజి్రస్టేషన్ల ప్రక్రియ కూడా తుదిదశలో ఉందని.. ఎవరైనా రైతులు మిగిలి ఉంటే.. తగిన డీ–పట్టాలతో అ«దీకృత అధికారిని సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. ప్రతి ఒక్క రైతుకీ న్యాయం చేసేలా వ్యవహరించామే తప్ప.. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ప్రచురించినట్లుగా ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వలేదని కలెక్టర్ డా.మల్లికార్జున స్పష్టంచేశారు. -
మోదీజీ.. ఇక చాలు
న్యూఢిల్లీ: విద్వేష ప్రసంగాలతో హిందూ, ముస్లింల మధ్య విషం చిమ్ముతున్న మోదీ ప్రజాజీవితం నుంచి నిష్క్రమించడం మేలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే హితవు పలికారు. విపక్షాల కూటమి అధికారంలోకి వస్తే మీ దగ్గర ఉన్న పాడిఆవులు, గేదెలను లాక్కుంటారని, మీ రిజర్వేషన్ కోటా తగ్గించి ముస్లింలకు 15 శాతం ఇస్తారని మోదీ రోజూ అబద్దాలు ప్రచారంచేస్తూ సమాజంలో చీలిక తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం పీటీఐ ఇంటర్వ్యూ సందర్భంగా ఖర్గే వెల్లడించిన అభిప్రాయాలు, ప్రస్తావించిన అంశాలు ఆయన మాటల్లోనే..ఆయనే వైదొలగుతానన్నారు‘హిందూ, ముస్లింల మధ్య ఘర్షణకు కారణమయ్యేలా మాట్లాడితే క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఇటీవల ప్రధాని మోదీ స్వయంగా చెప్పారు. మళ్లీ ఆయనే రోజూ హిందూ, ముస్లిం విద్వేష ప్రసంగాలు ఇస్తున్నారు. ఆయన మాటలకు ఆయనే కట్టుబ డట్లేరు. తప్పులు ఒప్పుకోరు. క్షమాపణలు చెప్పరు. ఆయన ఎంతగా అబద్దాలడుతున్నారో తెలియాలంటే సొంత ప్రసంగాలు ఆయన ఒకసారి వింటే, చూస్తే మంచిది. ఎన్నికల ర్యాలీల్లో విష ప్రచారాన్ని దట్టించారు. ఇలా మాట్లాడే ఆయన ప్రజాజీవితానికి స్వస్తి పలకడమే అత్యుత్తమం’’అందుకే రాహుల్ ప్రేమ దుకాణాలు తెరుస్తానన్నారు‘‘ బీజేపీ నేతలు రాజ్యాంగం, ముస్లింల వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే మోదీ ఏనాడైనా ఖండించారా? గిరిజ నులపై మూత్ర విసర్జన ఘటనలను ఒక్కసారైనా తప్పుబట్టారా? కనీసం బీజేపీ నేతలను మందలిస్తూ హెచ్చరిక వ్యాఖ్యలు చేశారా?. తానొక్కడినే నేత అన్నట్లు వన్‌మ్యాన్ షో చేస్తున్నారు. మొత్తం దేశాన్ని ఒక్కడినే పాలిస్తానని ప్రకటించుకుంటున్నారు. ప్రచారసభల్లో విద్వేష వ్యాఖ్యానాలే చేస్తున్నారు. అందుకే విద్వేషం సమసిపోయేలా ప్రేమ దుకాణాలు తెరుస్తానని రాహుల్ గాంధీ అన్నారు’’అవి బుజ్జగింపు రాజకీయాలు కావు‘‘అన్యాయమైపోతున్న వారిని పట్టించుకుంటే దానిని బుజ్జగింపు రాజకీయాలు అనరు. మేమేం చేసినా బుజ్జగింపు రాజకీయాలు అంటే ఎలా? పేదలకు ఏదైనా ఇవ్వడం, స్కాలర్షిప్ అందించడం, ముస్లింలకు ప్రత్యేక పాఠశాలల ద్వారా విద్యనందిస్తే వాటిని బుజ్జగింపు రాజకీయాల గాటన కట్టొద్దు’’బీజేపీలో కూర్చున్న అవినీతి నేతల సంగతేంటి?‘‘అవినీతి నేతల్ని జూన్ 4 తర్వాత జైల్లో వేస్తామని మోదీ అన్నారు. మరి అవినీతి మరకలున్న చాలా మంది నేతలను బీజేపీ లాగేసుకుని ఒళ్లో కూర్చోబెట్టుకుంది. వారిలో కొందరిని ఎంపీలను చేసింది. మరి కొందరు ఏకంగా ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. మరి వారి సంగతేంటి?’’.బీజేపీ మెజారిటీని కచ్చితంగా అడ్డుకుంటాం‘‘కాంగ్రెస్, విపక్షాల ‘ఇండియా’ కూటమి పట్ల ప్రజల్లో సానుకూల స్పందన చాలా పెరిగింది. కూ టమి అనుకూల పవనాలు బలంగా వీస్తున్నాయి. ఈ బలంతో బీజేపీ మెజారిటీని ఖచ్చితంగా నిలు వరిస్తాం. మా కూటమి ఎక్కువ సీట్లు గెలుస్తుంది’’.ప్రధాని స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా?‘‘రామ మందిరం, హిందూ–ముస్లిం, ఇండియా–పాకిస్తాన్ అంశాలే దశాబ్దాలుగా చెబుతూ ప్రజల భావోద్వేగాలను ఓట్ల రూపంలో ఇన్నాళ్లూ ఒడిసిపట్టారు. ఇక ఆటలు సాగవని అర్థమైంది. అందుకే కొత్తగా కాంగ్రెస్ గెలిస్తే ఇంట్లో ఆవులు, గేదెలు తీసుకెళ్తుందని, ఆస్తులు స్వాధీనం చేసుకుంటుందని, మంగళసూత్రం తెంపుకుపోతుందని, భూము లు లాక్కుంటారని ఇష్టమొచ్చినట్లు చెబుతున్నారు. అసలు ప్రధాని స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా?’’‘400’ గొడవ మొదలెట్టిందే మీరు‘‘పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజారిటీ కావాలని, 400 సీట్లు గెలవాలని అన్నది ఎవరు?. రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదా? అసలు 400 సీట్ల గొడవ మొదలెట్టిందే మీరు. అర్హతలేని ఆర్ఎస్ఎస్ నేతలతో రాజ్యాంగబద్ధ సంస్థలను నింపేద్దామని బీజేపీ భావిస్తోంది. రిజర్వేషన్లు తెగ్గోసేందుకు రాజ్యాంగంలో మార్పులకు బీజేపీ సాహసిస్తోంది. రాజ్యాంగం ప్రకారం పాలించట్లేదు. అనైతికంగా గతంలో మధ్యప్రదేశ్, కర్ణాటక, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవాల్లో ప్రభుత్వాలను కూల్చేశారు’’ అని ఖర్గే ఆరోపించారు. -
బీజేపీ వస్తే రాజ్యాంగం రద్దు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ’’బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దవుతుంది.. ప్రజాస్వామ్యా నికి ముప్పు ఏర్పడుతుంది.. రిజర్వేషన్లు పోతా యి, ప్రజల ప్రాథమిక హక్కులనూ తొలగిస్తా రు’’ అని ఆఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. దేశంలో ప్రజల హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ పోరాడుతోందని చెప్పారు. తెలంగాణలో బీజేపీకి, మోదీకి ఒక్కసీటు కూడా రావద్దని, వస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్టేనన్నారు.శుక్రవారం నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో జరిగిన కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్‌రెడ్డి ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాజ్యాంగం రక్షించే కాంగ్రెస్ పార్టీకి, రాజ్యాంగం రద్దు చేయాలని చూసే బీజేపీకి మధ్య ఈ ఎన్నికలు జరుగుతు న్నాయన్నారు. పొరపాటున బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను తొలగించేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుతంత్రాలు పన్నుతాయని ధ్వజమెత్తారు.అదానీ, అంబానీలపై ఐటీ దాడులు చేయించగలరా?మోదీ దేశాన్ని ధనవంతులైన తన మిత్రులకు ప్రభుత్వరంగ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నా రని ఖర్గే ఆరోపించారు. పదేళ్ల బీజేపీ పాలనలో దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచి పెట్టి తిరిగి కాంగ్రెస్‌పైనే ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి అదానీ, అంబానీ ట్రక్కులు, టెంపోలలో డబ్బులు పంపుతున్నా రని అమిత్‌షా, మోదీ మాట్లాడుతున్నారని, వా రు డబ్బులు పంపిస్తుంటే మరి మోదీ, అమిత్‌షా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ధైర్యముంటే అదానీ, అంబానీలపై ఈడీ, ఐటీ దాడులు చేయించాలని ఖర్గే సవాల్ విసిరారు. ఆటో డ్రైవర్లుకు ఏటా రూ.12 వేలిస్తాంతెలంగాణలో కాంగ్రెస్ వంద రోజుల పాలనలో అన్ని గ్యారంటీలు అమలవుతున్నాయని ఖర్గే వెల్లడించారు. ఉచిత బస్ప్రయాణం, ఆరోగ్యశ్రీ, రూ.500కే గ్యాస్ సిలిండర్ అమలు చేస్తున్నామ ని, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే వారికి ఆర్థిక సహకారం అందిస్తామన్నారు. ఆగస్టు 15వ తేదీన రూ.2 లక్షల రుణ మాఫీ చేసి తీరుతా మన్నారు. ఆటో వారికి ఏటా రూ.12 వేలు ఇస్తామని స్పష్టం చేశారు. కులగణన తరువాత కుటుంబ యజమాని అయిన మహిళల ఖాతాలో ఏటా రూ.లక్ష జమ చేస్తామన్నారు.ఇవన్నీ నెరవేరాలంటే హస్తం గుర్తుకు ఓట్లు వేసి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. సభలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, నకిరేకల్, తుంగతుర్తి ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మందుల సామేలు పాల్గొన్నారు.ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదుఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ బంద్ కావడం ఖాయమని ఖర్గే జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ పరోక్షంగా బీజేపీకి మద్దతు పలుకుతున్న విషయం ప్రజలకు అర్థమైందని, అందుకే ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదన్నారు. మోదీ రాజ్యాంగాన్ని మారు స్తామని చెప్పినా దానిపై కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ఆయన నిలదీశారు. -
అబద్ధాల మోదీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ ఇచ్చిన 6 హామీల్లో ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బస్సు, 500 సిలిండర్, 200 ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ లాంటివి ఇప్పటికే ప్రారంభించాం. మిగిలిన ఒకటి కూడా త్వరలోనే ప్రారంభి స్తామని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జునఖర్గే ప్రకటించారు. ఎన్నికల కోడ్ కారణంగా హామీల అమలు తాత్కాలికంగా ఆగిందని, కోడ్ ముగియగానే అమలు చేస్తామని చెప్పారు.తాము తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌లో ఇచ్చిన వాగ్దానా లను అమలు చేస్తూ పోతున్నామని, బీజేపీ ఎన్ని కల మేనిఫెస్టో గురించి మాట్లాడకుండా, కాంగ్రెస్‌ను తిట్టడంపైనే ఫోకస్ చేసిందని విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్ వచ్చిన మల్లి కార్జున ఖర్గే తాజ్‌కృష్ణలో విలేకరులతో మాట్లా డారు. పూర్తి వివరాలు ఆయన మాట్లల్లోనే... తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది లేదు. ఐదేళ్లపాటు అద్భుతపాలన అందిస్తాం. మీ సీబీఐ ఏం చేస్తోంది..?జనగణనను మోదీ బయటపెట్టడం లేదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, మహిళలు, పిల్లలు ఎందరున్నారు? వారి స్థితిగతులేంటి? వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ఏ సంక్షేమ పథకాలు చేపట్టాలి? విద్య, వైద్యం పరిస్థితి ఏంటీ? అయితే మోదీ సర్కారు ఈ గణాంకాలను దాచిపెడుతోంది. మోదీ అబద్ధాలపై అబద్ధాలు చెబుతున్నారు. అదానీ, అంబానీలు రాహుల్‌గాంధీకి టెంపోలో డబ్బులు పంపిస్తున్నారని మోదీ ఆరోపిస్తున్నారు.మీ సీబీఐ ఏమైంది..ఈడీ, ఆదాయపు పన్నుశాఖ ఏం చేస్తోంది? కావాలంటే విచారణ జరిపించు. ప్రతిపక్ష నాయకులను భయబ్రాంతులకు గురిచేస్తున్న కేంద్రం.. అసలు అదానీ, అంబానీలపై ఈడీ, ఐటీ సంస్థల రైడింగ్ ఎందుకు జరపడం లేదో మోదీకే తెలియాలి. వారితో అమిత్‌షా ఎప్పుడూ కలిసే తిరుగుతారు. 50 కోట్ల మంది వద్ద ఎంత సంపద ఉందో ఆ ఇద్దరి వద్ద అంత ఉంది.దేశాన్ని విడదీసే ప్రయత్నం చేస్తున్నారు‘మోదీ, అమిత్‌షా ఆందోళనలో ఉన్నారు. అభివృద్ధి చూసి ఓటు వేయమని మోదీ అడగం లేదు. మటన్, మందిర్, మంగళసూత్రం, మైనారిటీలు లాంటి అంశాలనే ప్రధాని మాట్లాడుతున్నారు. ఇలాంటి ప్రధానిని ఇంత వరకు ఎవరూ చూసి ఉండరు. కాంగ్రెస్‌ను చూసి బీజేపీ భయపడుతోంది. అందుకే మమల్ని టార్గెట్ చేసి మోదీ విమర్శలు చేస్తున్నారు. అధికారంలోకి రాగానే పథకాలు..‘ఆలిండియా సర్వీసెస్ అధికారుల్లో ఎస్సీ, ఎస్టీలెందరో చెప్పడం లేదు. మేం అధికారంలోకి రాగానే రిజర్వేషన్ ప్రకారం పోస్టులిస్తాం. మహిళలకు 50%... జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తాం. మహాలక్ష్మీ యోజన కింద రూ.లక్ష ఆర్థిక సహాయం చేస్తాం. 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. రైతుకు కనీస మద్దతు ధర ఇస్తాం. పదేళ్లలో తెలంగాణకు బీజేపీ ఏమీ చేయలేదు. దేశరాజధాని స్థాయిలో హైదరా బాద్‌లో అభివృద్ధి జరగాల్సి ఉండగా, ఆ మేరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు.హైదరాబాద్, బెంగళూరు, ముంబైలను పక్కకు పెట్టి అన్నీ ఒక్క గుజరాత్‌కే తరలిస్తే ఎంతవరకు సమంజసం. చేయిని తీసివేయడం ఎవరికీ సాధ్యం కాదు. మరోసారి నొక్కి చెబుతున్న హామీలన్నీ అమలు చేసి తీరుతాం’ అని మల్లికార్జున ఖర్గే వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్‌మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు గీతారెడ్డి, మధు యాష్కీగౌడ్, జబీర్ అహ్మద్ పాల్గొన్నారు. -
విజయపతాక ఎగరేయాలి
బెంగళూరు: వచ్చే ఐదేళ్ల భారతావని దశ, దిశను నిర్ధేశించే ఎన్నికల రణరంగంలో విజయబావుటాను ఎగరేశాకే ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థి ఎవరనేది వెల్లడిస్తామని కాంగ్రెస్ సారథి మల్లికార్జున ఖర్గే స్పష్టంచేశారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మంగళవారం పీటీఐతో ఆయన ముఖాముఖి మాట్లాడుతూ పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ‘‘ గెలిచాక వచ్చే ఐదేళ్లలో చేపట్టాల్సిన పథకాలు, పనుల పట్టికలను ముందుగానే సిద్ధంచేసుకుంటున్నట్లు ప్రధాని మోదీ చెబుతున్నారు. అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులను పిలిపించి పనులు పురమాయిస్తున్నారు. గెలవకముందే ఆయన చేస్తున్న హడావిడి అంతాఇంతా కాదు. ఈయన అత్యుత్సాహం, అతి ఆత్మవిశ్వాసం భారత్‌లాంటి ప్రజాస్వామ్యదేశానికి ఏమాత్రం మంచిదికాదు’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఘన విజయాలు లోక్‌సభ ఎన్నికల్లో సానుకూల పవనాలు వీచేలా చేస్తున్నాయి. ఇది నిజంగా శుభపరిణామం. కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల్లో ధరవరలను కిందకు దించేలా మేం తెచ్చిన పలు పథకాలు, చేపట్టిన కార్యక్రమాలను జనం మెచ్చారు. మా గ్యారెంటీ స్కీమ్‌లు ఇదే విషయాన్ని నిరూపించాయి కూడా. అందుకే మా గ్యారెంటీ పథకాలపై ఓటర్లు దృష్టిపెట్టారు’’ అని అన్నారు. ఈసారి ఎన్ డీఏ కూటమి 400 చోట్ల విజయం సాధిస్తుందని మోదీ ముందే ప్రకటించిన విషయాన్ని ఖర్గే వద్ద ప్రస్తావించగా.. ‘‘ ఇంకా నయం. ఆయన ఈసారి 600 సీట్లు మావే అనలేదు. ఇంతటి అతి అత్యాశతో చేసే వ్యాఖ్యానాలు వింటుంటే దేశంలో విపక్షమే లేదు.. అంతా నేనే అన్నట్లుగా ఉంది మోదీ వైఖరి’’ అని ఖర్గే అసహనం వ్యక్తంచేశారు. ఆనాడూ వెలిగిపోతుందన్నారు ‘‘ 2004లోనూ ఇదే సీన్ కనిపించింది. భారత్ వెలిగిపోతోంది(ఇండియా ఈజ్ షైనింగ్) అంటూ దేశవ్యాప్తంగా భారీ ప్రకటనలు, నినాదాలతో నాటి బీజేపీ సర్కార్ మోతెక్కించింది. వాజ్‌పేయీ మాత్రమే ప్రధాని పదవికి అర్హుడు అన్నట్లు ప్రచారం చేశారు. చివరకు ఏమైంది?. మన్మోహన్ సింగ్ సారథ్యంలో కాంగ్రెస్ నేతృత్వంలో మేం ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాం. మన్మోహన్ మెరుగైన ప్రధానిగా నిరూపించుకున్నారు’’ అని చెప్పారు. అమేథీ, రాయ్‌బరేలీకి టైం ఉంది ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాల నుంచి ఈసారి ఎవరు పోటీచేస్తారన్న ప్రశ్నకు సమాధానంగా.. ‘ ఆ స్థానాల్లో పోలింగ్ తర్వాతి ఫేజ్‌లలో ఉందిగా. ఇంకా సమయం ఉంది. ఇప్పుడే చెప్పేస్తే రాజకీయ సర్ప్రైజ్ ఏముంటుంది?. ఫీడ్‌బ్యాక్ తీసుకుని అక్కడ అభ్యర్థులు ఎవరు అనేది తర్వాత వెల్లడిస్తాం. అందరి సమ్మతితోనే కాంగ్రెస్‌లో నిర్ణయాలు ఉంటాయి. మోదీలాగా అందరి తరఫున ఇక్కడ ఒక్కరే నిర్ణయాలు తీసుకోరు’’ అని అన్నారు. ‘‘ ఎలక్టోరల్ బాండ్ల పథకంలో పారదర్శకత లోపించింది. ఒక్క బీజేపీనే భారీగా లాభపడింది. పారిశ్రామికవేత్తలు, సంస్థలను లొంగదీసుకునేందుకు దర్యాప్తు సంస్థలను రంగంలోకి దింపారు. ‘ చందా ఇచ్చుకో. దందా పుచ్చుకో’ అన్న సూత్రం పాటించారు. చేతులు వెనక్కి మెలిపెట్టి మరీ డబ్బులు తీసుకుని ఇప్పుడు పారదర్శకత ఉంది అంటే ఎలా?’’ అని ప్రశ్నించారు. తుక్డే తుక్డే గ్యాంగ్‌కు సుల్తాన్ మోదీనే ‘‘కుల, మత, ప్రాంత, వర్ణ ప్రాతిపదికన దేశ ప్రజలను మోదీ విభజిస్తున్నారు. నిజానికి తుక్డే తుక్డే గ్యాంగ్‌కు సుల్తాన్ మోదీనే. దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన ఒక్క బీజేపీ నేతనైనా చూపించండి. ఆర్ఎస్ఎస్, బీజేపీలో ఒక్కరైనా దేశం కోసం పోరాడారా?’ అని ఖర్గే ఎద్దేవాచేశారు. సమాలోచనలతోనే సారథి ఎంపిక ‘‘ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ వచ్చాక విపక్షాల ‘ఇండియా’ కూటమిలో చర్చలు జరిపి ఏకాభిప్రాయంతో ప్రధాని అభ్యర్థి ఎవరనేది ప్రకటిస్తాం. ఈసారి నేను పోటీ చేయట్లేదు. గుల్బర్గా(కలబురిగి) సీటు వేరే వాళ్లకు ఇచ్చేశారు’ అని తాను ప్రధాని రేసులో లేనని పరోక్షంగా చెప్పారు. గుల్బర్గా(కలబురిగి) నుంచి ఈసారి ఖర్గే అల్లుడు రాధాకృష్ణ దొడ్డమణి పోటీచేస్తున్నారు. 2009 నుంచి 2014 వరకు ఖర్గే ఇక్కడి నుంచే ఎంపీగా గెలిచారు. -
ప్రేమ పెరుతో దారుణం తాడిపత్రిలో పచ్చ నేత పైశాచికం
-
Fact Check: కాదు కాదన్నా కట్టుకథలేనా?
విశాఖ సిటీ: విశాఖపై పచ్చపత్రికలు మరోసారి పూనకం వచ్చినట్లుగా ఊగిపోయాయి. విషపు రాతలతో రెచ్చిపోయాయి. జిల్లా అభివృద్ధిని జీర్ణించుకోలేక విశాఖ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేందుకు.. ఇష్టానుసారం బురదజల్లాయి. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా చేపడుతున్న ప్రాజెక్టులపై దుష్ప్రచారాలకు వలువలన్నీ విప్పేశాయి. నిత్యం అభాసుపాలవుతున్నా సిగ్గూఎగ్గూ లేకుండా అబద్ధాలనే అచ్చోస్తూ పైశాచికానందం పొందుతున్నాయి. తాజాగా.. విశాఖ నగరంలో చోటుచేసుకున్న ఓ చిన్న సంఘటనను తమకు అనుకూలంగా మల్చుకునేందుకు తెగ ఆరాటపడ్డ పచ్చ మీడియా చివరికి బొక్కబోర్లా పడి తమ పరువును తీసుకున్నాయి. ఇక్కడ సాగర తీరంలో కొత్తగా ఏర్పాటుచేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జి పటిష్టతను పరిశీలించేందుకు బ్రిడ్జి నుంచి ప్లాట్‌ఫాంను డీ–లింక్ చేస్తే బ్రిడ్జి తెగిపోయిందంటూ చేతికొచ్చింది రాసిపారేశాయి. బ్రిడ్జి సిబ్బంది డీ–లింక్ చేస్తున్న వీడియోను అధికారులు విడుదల చేసినప్పటికీ.. వాటిని పట్టించుకోకుండా వాస్తవాలను సమాధి చేస్తూ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాల్జేయడమే పనిగా పెట్టుకుని అప్పటికప్పుడు కట్టుకథలు అల్లేశాయి. పచ్చపత్రికల విషపు రాతలపై ‘ఫ్యాక్ట్‌చెక్’ ఏమిటంటే.. శాస్త్రీయ అధ్యయనాలు చేశాకే.. పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు విశాఖ బీచ్ రోడ్డులో సముద్ర అధ్యయన శాస్త్రవేత్తల సూచనలతో.. ప్రతికూల వాతావరణాన్ని సైతం తట్టుకునేలా పూర్తి భద్రతా ప్రమాణాలతో ఫ్లోటింగ్ బ్రిడ్జి ఏర్పాటుచేయాలని విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) సంకల్పించింది. కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియానికి సమీపంలో దీనిని ఏర్పాటుచేశారు. దేశంలో ఈ తరహా ప్రాజెక్టుల తీరును పరిశీలించేందుకు వీఎంఆర్డీఏ అధికారులు, ఆంధ్రా యూనివర్శిటీ ప్రొఫెసర్ల బృందం కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ (కాలికట్) వద్ద బేపూర్ తీరంలోను, త్రిసూ్సర్ నగరంలోని చావక్కడ్ తీరంలో ఫ్లోటింగ్ బ్రిడ్జిలను సందర్శించారు. అధికారులు, నిర్మాణ, నిర్వహణదారులతో మాట్లాడి అక్కడ ప్రాజెక్టు విధానాలు తెలుసుకున్నారు. కేరళలో ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జిలు ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న విషయాన్ని గమనించారు. ఇవి ఏర్పాటుచేసిన ప్రతిచోటా విజయవంతంగా నడుస్తున్నట్లు గుర్తించారు. దీంతో పీపీపీ విధానంలో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు వీఎంఆర్డీఏ గ్లోబల్ టెండర్లు ఆహ్వానించింది. ఇందులో సాయిమోక్షా షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ సంస్థ ఈ టెండర్‌ను దక్కించుకుంది. వీఎంఆర్డీఏకు ఏడాదికి రూ.15.3 లక్షలు ముందస్తు చెల్లింపుల ప్రతిపాదికన ఈ ప్రాజెక్టును చేపట్టింది. సముద్ర అధ్యయన శాస్త్రవేత్తల సూచనలతో.. తొలుత.. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జిను తెన్నేటి పార్కు సమీపంలో ఏర్పాటుచేయాలని అధికారులు భావించారు. అయితే, ఆ ప్రాంతం అటవీశాఖ పరిధిలో ఉండడంతో అక్కడ విరమించుకున్నారు. రుషికొండ ప్రాంతంలో ఏర్పాటుపై ఆంధ్రా యూనివర్శిటీలో సముద్ర అధ్యయన, భూభౌతిక శాస్త్రవేత్తలను సంప్రదించారు. ఇక్కడ ప్రాణాంతకమైన రిప్ కరెంట్ అధికంగా ఉంటుందని, ప్రాజెక్టుకు అనుకూలమైన ప్రాంతం కాదని చెప్పి కురుసుర మ్యూజియం ఉత్తర దిశ ప్రాంతం ఫ్లోటింగ్ బ్రిడ్జికు అనుకూలమైనదని సూచించారు. దీంతో నిర్వాహకులు ఆ ప్రాంతంలో ఫ్లోటింగ్ బ్రిడ్జి ఏర్పాటు చేశారు. మాక్‌డ్రిల్ చేస్తే తెగిపోయిందంటూ రాద్ధాంతం.. సహజంగా పౌర్ణమి, అమావాస్య రోజుల్లో సముద్రపు ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. ఆ సమయాల్లో ఫ్లోటింగ్ బ్రిడ్జిను డీ–లింక్ చేస్తారు. అయితే.. సోమవారం సముద్ర కెరటాల తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో ఆ రోజు నుంచి బ్రిడ్జిపైకి సందర్శకులను అనుమతించాలని ముందు భావించినప్పటికీ అలల ఉధృతి కారణంగా అనుమతించలేదు. ఈ సమయంలో మాక్‌డ్రిల్ చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఇందులో భాగంగా సిబ్బంది సోమవారం మ.3 గంటల సమయంలో బ్రిడ్జి, ప్లాట్‌ఫాంలను విడదీశారు. ఆ ఫ్లాట్‌ఫాంను లాగి యాంకర్ వద్దకు తీసుకువెళ్లారు. ఇదంతా అక్కడ ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయింది. అయితే.. బ్రిడ్జి, ప్లాట్‌ఫాం మధ్య కొంత ఖాళీ ప్రాంతాన్ని ఫొటో తీసి ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోయిందని పచ్చ పత్రికలు, మీడియా తెగ రాద్ధాంతం చేశాయి. వెంటనే అధికారులు, నిర్వాహకులు అప్రమత్తమై బ్రిడ్జి తెగిపోయిందని చేస్తున్న ప్రచారంలో వాస్తవంలేదని సా.5 గంటలకే సీసీ కెమెరా దృశ్యాలను విడుదల చేశారు. అందులో బ్రిడ్జి, ప్లాట్‌పాంను 10 మంది సిబ్బంది విడదీయడంతో పాటు తాళ్లతో యాంకర్ వద్ద తీసుకెళ్లిన దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయి. అయినప్పటికీ.. పచ్చపత్రికలు, పచ్చ పార్టీల లక్ష్యం వేరు కదా.. వాటిని అస్సలు పట్టించుకోకుండా ప్రభుత్వంపై బురదజల్లాయి. వాస్తవ దృశ్యాలను తొక్కిపెట్టి విశాఖపై అక్కసు వెళ్లగక్కాయి. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, వీఎంఆర్డీఏ కమిషనర్ డాక్టర్ ఎ. మల్లికార్జున ఇచ్చిన వివరణను సైతం పట్టించుకోలేదు. కేవలం విశాఖ ఇమేజ్, అభివృద్ధిపై విషం చిమ్మడమే పనిగా తప్పుడు కథనాలు ప్రచురించాయి. బ్రిడ్జి తెగిపోలేదు.. లంగరు వేశాం.. ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోయిందన్న వార్తల్లో ఏమాత్రం వాస్తవంలేదు. మాక్‌డ్రిల్‌లో భాగంగా రెండింటిని వేరుచేసి లంగరు వేశాం. తెగిపోతే సముద్రంలో కొట్టుకుపోవడమో, ఒడ్డుకు రావడమో జరిగేది. ప్లాట్‌ఫాం ఒకేచోట ఉండదు. వాస్తవాలను పట్టించుకోకుండా పెనుప్రమాదం తప్పిందని వార్తలు ప్రచురించడం సరికాదు. సముద్రంలో ప్రతికూలతవల్ల అలల తాకిడి ఎక్కువగా ఉండడంతో సందర్శకులను అనుమతించలేదు. ప్రధాన వంతెన, వ్యూ పాయింట్ వేరుగా ఉండడంతో మధ్య ఖాళీ ప్రాంతాన్ని ఫొటోతీసి దుష్ప్రచారం చేశారు. భవిష్యత్తులో కూడా ప్రతికూల పరిస్థితులున్న సమయాల్లో ఇటువంటి మాక్‌డ్రిల్స్ నిర్వహిస్తాం. సంచలనాల కోసం అసత్య వార్తలు రాకుండా అధికారుల నుంచి వివరాలు తీసుకుని ధృవీకరించుకుని ప్రచురించాలి. విశాఖ ఖ్యాతిని మరింత పెంచేందుకు అందరూ సహకరించాలి. – డాక్టర్ ఎ. మల్లికార్జున, వీఎంఆర్డీఏ కమిషనర్ పూర్తి భద్రతా ప్రమాణాలతో.. ♦ సబ్‌మెరైన్ మ్యూజియం ప్రాంతానికి సమీపంలో ముంబై నుంచి వచ్చిన నిర్మాణ నిపుణుల నేతృత్వంలో బ్రిడ్జిను ఏర్పాటుచేశారు. ♦ ఒకేసారి 200 మంది సామర్థ్యాన్ని తట్టుకునేలా బలమైన యాంకర్లతో పటిష్టంగా హెచ్డీపీఈ బ్లాక్‌లతో ఈ నిర్మాణం చేపట్టారు. ♦ మొత్తం 100 మీటర్లు ఉండే ఈ బ్రిడ్జి 20 మీటర్లు తీరం ఒడ్డున, 80 మీటర్లు సముద్రంపై ఉంది. ♦ అలల తాకిడికి దెబ్బతినకుండా ఉండేలా 38 యాంకర్లను వినియోగించారు. వాటిలో 150 కిలోలు బరువైనవి నాలుగు, 200 కిలోలతో 14.. 500 కిలోలతో 20 యాంకర్లు ఉన్నాయి. ♦ తాత్కాలికంగా నిర్మాణమైన ఈ బ్రిడ్జిలో వినియోగించిన బ్లాకులు, యాంకర్లు, ఇతర సామాగ్రి పూర్తిగా పర్యావరణ సానుకూలమైనవి. బ్రిడ్జి చుట్టూ నిరంతర గస్తీ.. ♦ సముద్రం అలలకు తగ్గట్లుగానే ఫ్లోటింగ్ బ్రిడ్జి ప్రతిస్పందిస్తుంటుంది. ♦ దానిపై నడిచే వారు అందుకు తగ్గట్టుగా సరికొత్త అనుభూతిని పొందుతారు. ♦ పర్యాటకాభివృద్ధి కోసం చేపట్టిన ఈ ప్రాజెక్టులో పర్యాటకుల భద్రతపై కూడా వీఎంఆర్డీఏ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ♦ ఫ్లోటింగ్ బ్రిడ్జి చుట్టూ రెండు పడవలతో నిర్వాహకులు నిరంతరం గస్తీ నిర్వహించనున్నారు. ♦ అలాగే, సందర్శకుల భద్రత నిమిత్తం 10 మంది గజ ఈతగాళ్లను నియమించారు. ♦ వారి పర్యవేక్షణలో మాత్రమే వంతెనపై సందర్శనకు అనుమతిస్తారు. ♦ ప్రతి సందర్శకుడికి లైఫ్‌జాకెట్ అందజేస్తారు. అది ధరించకపోతే అనుమతించరు. ♦ ఇండియన్ నేవీ వారు వినియోగించే లైఫ్ జాకెట్లను ఇందుకోసం సిద్ధంచేశారు. ఇవి 200 కేజీల బరువును 14 గంటలపాటు సముద్రంలో తేలియాడేలా చేస్తాయి. ప్రమాద సమయాల్లో లైఫ్గార్డును అప్రమత్తం చేసేందుకు జాకెట్‌కు కుడివైపున విజిల్ ఉంటుంది. ♦ బ్రిడ్జిపై సందర్శకుల వెంట ఇద్దరు లైఫ్‌గార్డులు ఉంటారు. ♦ అలాగే, బ్రిడ్జి చుట్టూ లైఫ్‌గార్డులు రక్షణ వలయంగా ఉంటారు. ♦ రక్షణకు సంబంధించి ప్రజలకు శిక్షణనిచ్చేందుకు నేవీ విశ్రాంత అధికారి, మెరైన్ కమాండోను అందుబాటులో ఉంచారు. ♦ నిరంతర పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలను సైతం ఏర్పాటుచేశారు. -
కూకట్పల్లి మల్లికార్జున థియేటర్లో వైఎస్ జగన్ అభిమానులు హంగామా చేశారు
-
భూ సమస్య పేరుతో రాష్ట్ర ప్రభుత్వంపై నెపం
-
కాంగ్రెస్‌లోకి వైఎస్ షర్మిల
సాక్షి, న్యూఢిల్లీ: యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీ (వైఎస్సార్టీపీ) అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు ఈ సందర్భంగా షర్మిల ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏపీ కాంగ్రెస్ ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, ఏపీ పీసీసీ చీఫ్ రుద్రరాజు, ఏఐసీసీ సీనియర్ నేత కొప్పుల రాజుతోపాటు షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్, పలువురు వైఎస్సార్టీపీ నేతలు పాల్గొన్నారు. కాగా, షర్మిలకు కండువా కప్పిన అనంతరం బ్రదర్ అనిల్‌కు సైతం ఖర్గే కండువా కప్పేందుకు ప్రయత్నించగా ఆయన సున్నితంగా నిరాకరించారు. షర్మిల సైతం తాను ఒక్కదానినే చేరుతున్నట్లు పేర్కొనగా మరి వేదికపైకి మీరెందుకు వచ్చారని ఖర్గే నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం అనంతరం పార్టీ పార్లమెంటరీ చైర్పర్సన్ సోనియా గాంధీతో షర్మిల దంపతులు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆ తర్వాత షర్మిల మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యున్నతికి పనిచేస్తా... కాంగ్రెస్‌లో చేరడంపట్ల తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆత్మ సంతోషిస్తుందని షర్మిల పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలనేది తన తండ్రి కల అని.. ఆ కల నెరవేర్చేందుకు, పార్టీ అభ్యున్నతి కోసం పనిచేస్తా నని చెప్పారు. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశంతోనే తెలంగాణలో కాంగ్రెస్‌కు తాను మద్దతు ప్రకటించి పోటీ చేయలేదని వెల్లడించారు. కడప ఎంపీ సీటు నుంచి పోటీ చేస్తారా లేక ఏదైనా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అని మీడియా ప్రశ్నించగా పార్టీ ఆదేశిస్తే అండమాన్ నుంచైనా పోటీకి సిద్ధమని షర్మిల ప్రకటించారు. మరో రెండ్రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. మరోవైపు ఏపీలో షర్మిలకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వాలనేది పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తుందని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్ పేర్కొన్నారు. -
తేలని శాఖలు
ఎంపీ పదవికి రేవంత్ రాజీనామా కొడంగల్ ఎమ్మెల్యేగా విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డి, తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. మల్కాజిగిరి పార్లమెంటు నియోజక వర్గం నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఉన్న ఆయన, స్పీకర్ ఓం బిర్లాను కలిసి తన రాజీనామా సమర్పించారు. సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణ స్వీ కారం చేసిన నేతలకు శాఖల కేటాయింపుపై సస్పెన్స్ కొనసాగుతోంది. శుక్రవారం ఈ అంశంపై స్పష్టత వస్తుందని భావించినా ఏమీ తేల్లేదు. ఈ అంశంపై చర్చించేందుకు ఢిల్లీ కి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైకమాండ్ పెద్దలతో భేటీ కావాల్సి ఉన్నప్పటికీ వా రంతా బిజీ బిజీగా ఉన్నారు. ఇటీవల ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ ఎన్నికల ఫలితాలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ రోజంతా సమీక్షల్లో పాల్గొన్నారు. దీంతో పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ దాదాపు రెండు గంటల సేపు భేటీ అయి శాఖల కేటాయింపుపై చర్చించారు. హోం, ఆరిక్థ, రెవెన్యూ, వైద్యం, మునిసిపల్, విద్యుత్, నీటిపారుదల వంటి కీలక శాఖల కేటాయింపుపై సీనియర్ల నుంచి వస్తున్న వినతులపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. గతంలో మంత్రులుగా పనిచేసిన సీనియర్లకే కీలక శాఖలు ఇవ్వాలని ఈ భేటీలో నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు వంటి సీనియర్లకు కీలక శాఖలు ఇవ్వాలని, వారి సేవలను వినియోగించుకోవాలని కేసీ సూచించినట్లు సమాచారం. అయితే ఎవరికి ఏ శాఖ ఇచ్చేలా నిర్ణయం జరిగిందన్న విషయం బయటకు రాలేదు. కాగా ఈ భేటీ అనంతరం కేసీ, ఠాక్రే, రేవంత్ కలిసి ఖర్గే నివాసానికి వెళ్లారు. కాసేపటి తర్వాత రాహుల్ కూడా వారితో చేరారు. అర్ధరాత్రి వరకు చర్చలు కొనసాగాయి. శనివారం ఉదయానికి ఈ అంశంపై స్పష్టత వస్తుందని తెలుస్తోంది. ఇక మిగిలిన ఎమ్మెల్యేలలో ఎవరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలి? అనే దానిపై మరోసారి చర్చిద్దామని వేణుగోపాల్ సూచించడంతో దీనిపై నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టినట్లు సమాచారం. -
రాహుల్, ప్రియాంక పర్యటించిన చోట్ల
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేతల ఎన్నికల ప్రచారం ఆ పార్టీ అభ్యర్థులకు మిశ్రమ ఫలితాన్నిచ్చింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన స్థానాల్లో కొన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలవగా, మరికొన్ని చోట్ల పరాజయం పాలయ్యారు. ఈ ఏడాది అక్టోబర్18న తన సోదరి ప్రియాంకతో కలిసి వరంగల్ జిల్లాకు వచ్చిన రాహుల్ ప్రచారం నిర్వహించిన ములుగు, వరంగల్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. రాహుల్ వెళ్లిన భూపాలపల్లి, వరంగల్ ఈస్ట్, కొల్లాపూర్, కల్వకుర్తి, జడ్చర్ల, షాద్‌నగర్, బోధన్, వేములవాడ స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక, ఆయనతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెళ్లినప్పటికీ సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఓటమి పాలు కావడం గమనార్హం. ప్రియాంక వెళ్లిన కొడంగల్, ఖానాపూర్, పాలేరు, ఖమ్మం, మధిర స్థానాల్లో గెలవగా, జహీరాబాద్, మల్కాజ్గిరి స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. రాహుల్ వెళ్లిన కామారెడ్డి, ఆదిలాబాద్‌లోనూ పార్టీ అభ్యర్థి ఓడిపోగా, ఆంధోల్‌లో విజయం సాధించారు. జీహెచ్ఎంసీ పరిధిలో రాహుల్ ప్రచారం చేసిన జూబ్లీహిల్స్, నాంపల్లి, మల్కాజ్గిరి స్థానాల్లో అభ్యర్థులు ఓడిపోయారు. ఖర్గే హాజరైన నల్లగొండలో కోమటిరెడ్డి భారీ మెజార్టీతో గెలవగా, ఆలంపూర్లో సంపత్‌కుమార్ పెద్ద తేడాతో ఓటమి పాలయ్యారు. గతంలో సోనియాగాంధీ సభ నిర్వహించిన తుక్కుగూడలో పార్టీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి (ఇబ్రహీంపట్నం) భారీ మెజార్టీతో విజయం సాధించడం గమనార్హం -
కాంగ్రెస్‌కు సంబంధం లేదు
నర్సాపూర్: రాష్ట్రంలో రైతుబంధు పథకం సొమ్ము రైతుల ఖాతాల్లో జమ కాకుండా నిలిచిపోవడానికి.. తమ పార్టీ కి ఎలాంటి సంబంధం లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. సోమ వారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చిన్న గొట్టిముక్కులలో ఏర్పాటు చేసిన ఆత్మియ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. మంత్రి హరీశ్‌రావు ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉల్లంఘించడంతో రైతుబంధును ఎన్నికల కమిషన్ నిలిపివేసిందని చెప్పారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం రైతుబంధు కు కాంగ్రెస్ పార్టీ యే అడ్డుపడిందంటూ తప్పుడు ఆరోపణలు, నిందలు వేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ రైతు పక్షపాతిగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ తప్పుడు మాటల ను నమ్మొద్దని ఆయన రైతులను కోరారు. హామీల అమల్లో విఫలమైన కేసీఆర్... అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో తాము అధికారంలోకి రావడం ఖాయమని, ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిందే సోనియా.. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాందీ దేశానికి ఎంతో సేవ చేశారని, ఆ కుటుంబాన్ని కేసీఆర్ దూ షించడం ఎంత వరకు సమంజసమని ఖర్గే ప్రశ్నించారు. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చి కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టారని... సోనియా లేకుంటే కేసీఆర్ సీఎం అయ్యేవారా అని అన్నారు. తెలంగాణ లో దొరల పాలన కొనసాగుతోందని విమర్శించా రు. ఇంటికో ఉద్యోగం, దళితుడిని సీఎం చేస్తానంటూ గతంలో హామీ ఇచ్చిన కేసీఆర్... ముఖ్యమంత్రి పీఠం అధిష్టించి తన కుటుంబ సభ్యులకే పదవులు ఇచ్చారని దుయ్యబట్టారు. దేశంలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చి విస్మ రించిందని మండిపడ్డారు. కాళేశ్వరం, ఓఆర్ఆర్, పేపర్‌లీక్ తదితర స్కామ్‌ల ద్వారా తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆరోపించారు. -
కాంగ్రెస్ బీసీ నేతల చలో ఢిల్లీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లోని బీసీ నాయకులు ఢిల్లీ బయలుదేరారు. ఇటీవల గాంధీభవన్‌లో జరిగిన టీం బీసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు అధిష్టానం పెద్దలను కలిసేందుకు మంగళవారం హస్తిన పయనమయ్యారు. మాజీ ఎంపీ వి. హనుమంతరావు, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఓబీసీ జాతీయ సమన్వయకర్త కత్తి వెంకటస్వామి మంగళవారమే ఢిల్లీ వెళ్లగా, మధుయాష్కీగౌడ్, పొన్నం ప్రభాకర్, అంజన్‌కుమార్ యాదవ్, గాలి అనిల్‌కుమార్, సురేశ్ షెట్కార్ తదితరులు బుధవారం బయలుదేరనున్నారు. వీరంతా బుధ లేదా గురువారాల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవనున్నారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. త్వరలోనే ఖరారు చేయనున్న అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో బీసీలకు కనీసం 34 స్థానాలు కేటాయించడమే ఎజెండాగా తెలంగాణ బీసీ నేతలు ఢిల్లీ బయలుదేరారు.ఇచ్చిన మాట నిలబెట్టుకోండి: ప్రదేశ్ ఎన్నికల కమిటీ, రాజకీయ వ్యవహారాల కమిటీలో ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలోని ప్రతి లోక్‌సభ స్థానంలో రెండు అసెంబ్లీ సీట్ల చొప్పున మొత్తం 34 సీట్లను బీసీలకు కేటాయించాలని కోరుతూ టీం బీసీ నేతలు మంగళవారం హైదరాబాద్‌లో ఉన్న ముఖ్య నేతలను కలిశారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు అంజన్‌కుమార్ యాదవ్, మహేశ్ కుమార్ గౌడ్, సురేశ్‌షెట్కార్, గాలి అనిల్‌కుమార్, ఎర్రశేఖర్, సంగిశెట్టి జగదీశ్వరరావు తదితరులు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు మధుయాష్కీగౌడ్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. బుధవారం అందుబాటులో ఉన్న నేతలు నల్లగొండ ఎంపీ, స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కూడా కలవనున్నారు. -
హైదరాబాద్ వేదికగా తొలిసారి!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో ఇటీవలే నియామకమైన అత్యున్నత విధాన నిర్ణాయక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) హైదరాబాద్‌లో తొలిసారిగా సమావేశం కానుంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులకు నూతనోత్సాహం తేవడం, కాంగ్రెస్ వైపు ప్రజల దృష్టి మళ్లించడం లక్ష్యంగా ఈ సమావేశాలను నిర్వహించనుంది. గత నెల 20న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీడబ్ల్యూసీని పునర్వ్యవస్థీకరించిన విషయం తెలిసిందే. 16, 17 తేదీల్లో కొత్త కమిటీ తొలి సమావేశం కోసం హైదరాబాద్‌ను ఎంచుకున్నారు. సోమవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ వివరాలను వెల్లడించారు. 17న విస్తృతస్థాయి సమావేశం తర్వాత అనంతరం భారీ బహిరంగ సభను నిర్వహించనున్నామని.. తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అందించే 5 గ్యారెంటీ హామీలను ప్రకటించనున్నామని వివరించారు. 17న నియోజకవర్గాల్లో బస ఈ నెల 17న బహిరంగ సభ ముగిశాక అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో తమకు కేటాయించిన చోటికి వెళ్లి రాత్రి బస చేస్తారు. 18న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయా నియోజకవర్గాల్లో జరిగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థానిక నేతలతో కలసి మధ్యాహ్న భోజనం చేస్తారు. అయితే ఈ నెల 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఉన్న నేపథ్యంలో.. నియోజకవర్గాల పర్యటన నుంచి ఎంపీలకు మినహాయింపు ఇచ్చినట్టు కేసీ వేణుగోపాల్ తెలిపారు. సోనియా, రాహుల్, ప్రియాంక.. అంతా.. హైదరాబాద్‌లో జరిగే సీడబ్ల్యూసీ భేటీ తొలిరోజు సమావేశాల్లో.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు సహా మొత్తం 39 మంది సీడబ్ల్యూసీ సభ్యులు, 32 మంది శాశ్వత ఆహ్వానితులు, 9 మంది ప్రత్యేక ఆహ్వానితులు, నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు పాల్గొననున్నారు. రెండోరోజు 17న జరిగే విస్తృతస్థాయి సీడబ్ల్యూసీ సమావేశంలో వర్కింగ్ కమిటీ సభ్యులతోపాటు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ బేరర్లు పాల్గొంటారు. గత ఐదేళ్లలో ఢిల్లీ వెలుపల సీడబ్ల్యూసీ సమావేశం జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 2019 మార్చి 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సీడబ్ల్యూసీ భేటీ జరిగింది. తర్వాత ఢిల్లీలోనే ఈ భేటీలు నిర్వహించారు. ఈసారి హైదరాబాద్‌లో జరగనున్నాయి. -
కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీలో ఉత్తమ్
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం నూతనంగా 16 మంది సభ్యులతో కేంద్ర ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కీలక కమిటీలో తెలంగాణ నుంచి పార్టీ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి చోటు కల్పించారు. మల్లికార్జున ఖర్గే ఈ కమిటీని ఏర్పాటు చేయగా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో మల్లికార్జున ఖర్గే, సోనియా గాందీ, రాహుల్ గాందీ, అంబికా సోని, అదీర్ రంజన్ చౌదరి, సల్మాన్ ఖుర్షీద్, మధుసూదన్ మిస్త్రీ, ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, టీఎస్ సింగ్ దేవ్, కేజే జార్జ్, ప్రీతమ్ సింగ్, మహమ్మద్ జావేద్, అమీ యాజ్ఞిక్, పీఎల్ పునియా, ఓంకార్ మార్కం, కేసీ వేణుగోపాల్‌లు ఉన్నారు. ఉత్తమ్ సేవలను అధిష్టానం గుర్తించింది వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)తో సమానంగా పరిగణించే కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)లో ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి చోటు లభించడం పట్ల రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సీఈసీలో తెలుగు రాష్ట్రాల నుంచి గత మూడు, నాలుగు దశాబ్దాలుగా ఎవరికీ అవకాశం లభించలేదు. ఈ పదవిలో ఆయన ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసే ఈ కమిటీలో ఉత్తమ్‌కు హైకమాండ్ స్థానం కల్పించడం విశేషం. రాష్ట్ర మంత్రిగా, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, అధ్యక్షునిగా, 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఆయన పార్టీకి చేసిన సేవలను అధిష్టానం గుర్తించిందని, ఆయన నిబద్ధతకు ఇదో నిదర్శనమని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ అధిష్టానానికి, గాంధీ కుటుంబానికి ఉత్తమ్‌పై ఉన్న నమ్మకం మరోమారు రుజువైందని చెపుతున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఫైటర్ పైలట్ గా సేవలందించిన ఉత్తమ్‌కుమార్, భారత రాష్ట్రపతి కార్యాలయంలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తున్న సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు. 1994లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన మూడు దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతున్నారు. -
ఎస్సీలకు 18%.. ఎస్టీలకు 12% రిజర్వేషన్లు
చేవెళ్ల: చేవెళ్ల ప్రజాగర్జన సభ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను ప్రకటించింది. మొత్తం 12 అంశాలతో కూడిన ఈ డిక్లరేషన్‌ను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే సమక్షంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ డిక్లరేషన్‌లో పేర్కొన్న అంశాలన్నింటినీ తాము అధికారంలోకి రాగానే అమలు చేస్తామని.. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఖర్గే ప్రకటించారు. డిక్లరేషన్‌లోని అంశాలివీ.. జనాభా దామాషా ప్రాతిపదికన ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12% మేర రిజర్వేషన్ల పెంపు. వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేస్తాం. అంబేడ్కర్ అభయహస్తం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల చొప్పున ఆర్థిక సాయం. ఐదేళ్ల పాటు ప్రతి బడ్జెట్లో సరిపడా నిధులు కేటాయించి పథకం అమలు. ఎస్సీ, ఎస్టీలకు అన్ని ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 18 శాతం, 12 శాతం చొప్పున రిజర్వేషన్లు అమలు. ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందే ప్రైవేటు కంపెనీల్లో కూడా వారికి రిజర్వేషన్లు ఇందిరమ్మ పక్కా ఇళ్ల పథకం కింద ఇంటి స్థలాలు లేని ప్రతి దళిత, గిరిజనులకు ఇంటి స్థలంతోపాటు ఇల్లు కట్టుకునేందుకు రూ.6 లక్షల ఆర్థిక సాయం. ఐదేళ్లలో ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి ఈ పథకం వర్తింపు. బీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకున్న ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను అన్ని హక్కులతో తిరిగి అసైనీలకే కేటాయింపు. ప్రజా ప్రయోజనార్థం, భూసేకరణ చట్టం–2013 ప్రకారం భూములను సేకరించినప్పుడు సదరు అసైన్డ్ భూములకు పట్టా భూములతో సమానంగా పరిహారం. ఎస్సీలకు ఇచ్చిన అసైన్ భూములపై యాజమాన్య హక్కుల కల్పన. అమ్ముకునేందుకు, బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకునే హక్కులు. ఎస్టీలకు ఇచ్చిన పోడు భూములపైనా వారికి పూర్తి హక్కులు. అటవీ హక్కుల చట్టం పటిష్టంగా అమలు. సమ్మక్క–సారక్క గిరిజన గ్రామీణ అభివృద్ధి పథకం కింద ప్రతి గూడెం, తండా గ్రామ పంచాయతీలకు రూ.25లక్షల అభివృద్ధి నిధులు. ఎస్సీలకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు. మాదిగ, మాల, ఇతర ఉపకులాలకు ఒక్కో కార్పొరేషన్ ద్వారా ఏటా రూ.750 కోట్ల నిధులు. గిరిజనుల కోసం మూడు కార్పొరేషన్లు. తుకారాం ఆదివాసీ కార్పొరేషన్, సంత్ సేవాలాల్ లంబాడా కార్పొరేషన్, ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు. వాటికి ఏటా రూ. 500 కోట్ల కేటాయింపు. రాష్ట్రంలో ఐదు కొత్త ఐటీడీఏలు, తొమ్మిది సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటు. మైదాన ప్రాంత గిరిజనుల కోసం నల్లగొండ, మహబూబాబాద్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో ఐటీడీఏల ఏర్పాటు. అన్ని ఐటీడీఏ కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు.. విద్యాజ్యోతుల పథకం కింద పదో తరగతి పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి రూ.10 వేల నగదు, ఇంటర్ పాసైతే రూ.15 వేలు, డిగ్రీ పాసైతే రూ.25వేలు, పీజీకి రూ.లక్ష.. ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేసిన విద్యార్థులకు రూ.5లక్షల నగదు బహుమతులు. ప్రతి మండలంలో ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద అందరికీ విద్య. గ్రాడ్యుయేట్, పీజీ విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం. విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన ప్రతి ఎస్సీ, ఎస్టీ విద్యార్థికి ఆర్థిక సాయం. -
ఆ ముగ్గురూ తోడు దొంగలే
వికారాబాద్/కొడంగల్: ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, ఎంపీ ఒవైసీ ముగ్గురూ తోడు దొంగలేనని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. ట్రిపుల్ తలాక్, 370డీ రద్దు వంటి మోదీ తీసుకున్న నిర్ణయాలకు కేసీఆర్ అండగా నిలిచారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిని గెలిపించాలని ఒవైసీ.. ముస్లింలకు ఎలా చెబుతాడని ప్రశ్నించారు. వికారాబాద్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తే ఎంతో మంది యువత ఉద్యోగాలు సాధించారని తెలిపారు. ప్రాణహిత– చేవెళ్ల పథకాన్ని ప్రారంభించి వైఎస్ రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తే.. కేసీఆర్ తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రాణహితకు పాతరేశాడన్నారు. రంగారెడ్డి జిల్లాకు, దక్షిణ తెలంగాణకు కేసీఆర్ తీరని అన్యాయం చేశారని విమర్శించారు. కేసీఆర్ తన సొంత ఊరు బాగుంటే చాలనుకుంటున్నారని, ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రా లేక చింతమడకకు సర్పంచో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ముదిరాజ్‌లకు ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని కేసీఆర్ పూర్తిగా గాలికి వదిలేశారని రేవంత్ విమర్శించారు. జనాభాలో మెజార్టీ శాతం ఉన్న ముదిరాజ్‌లకు బీఆర్ఎస్ రాష్ట్రం మొత్తంలో ఒక్క అసెంబ్లీ టికెట్ కూడా ఇవ్వలేదని, మాదిగలకు ఒక్క మంత్రి పదవి కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే హాజరుకానున్న చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రజాగర్జన సభకు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు రఘువీరారెడ్డి పాల్గొన్నారు. కొడంగల్ రుణం ఎన్నటికీ తీర్చలేనిది కొడంగల్ ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణానికి వచి్చన ఆయన మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం దేశ్‌ముఖ్ కుటుంబ సభ్యులను కలిసి.. తనకు మద్దతివ్వాలని కోరారు. ఈ సందర్భంగా మీడియాతో రేవంత్ మాట్లాడుతూ.. గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కొడంగల్‌ను మరువను.. విడువను అని భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేస్తానని స్పష్టంచేశారు. కాంగ్రెస్‌లో చేరిన మైత్రి గ్రూప్ చైర్మన్ సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లాకు చెందిన మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం సాయంత్రం గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కండువా కప్పి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. జైపాల్ పార్టీలో చేరిక సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఆయన అనుచరులు గాందీభవన్‌కు తరలివచ్చారు. -
ఆంగ్లంలో సుశిక్షిత సైన్యం
విశాఖ విద్య: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీపడేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లిష్ మీడియం చదువులకు ప్రాధాన్యం ఇస్తోంది. 2023–24 విద్యా సంవత్సరానికి మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న ఫార్మటివ్ పరీక్షలతో అదనంగా ఇంగ్లిష్ లో విద్యార్థుల నైపుణ్యాన్ని తెలుసుకునేందుకు ‘టోఫెల్’ పరీక్షను సైతం నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు మేలు చేయాలనే ఉన్నతాశయంతో ఇలాంటి ప్రయోగాలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుండగా.. వీటిని క్షేత్రస్థాయిలో విజయవంతం చేసేందుకు విశాఖ జిల్లా అధికారులు సైతం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. దీనిలో భాగంగానే జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 3 నుంచి 10వ తరగతి వరకు బోధించే ఇంగ్లిష్ సబ్జెక్టు టీచర్లకు రోజుకు 50 మంది చొప్పున జిల్లాలోని మొత్తం 500 మందికి శిక్షణ ఇప్పించేలా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు అంతర్జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే ఐడియల్ లెర్కింగ్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. జిల్లా విద్యాశాఖాధికారుల ప్రతిపాదనలకు కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున సానుకూలంగా స్పందించి, శిక్షణకు అయ్యే మొత్తాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్) కింద చెల్లించేందుకు ముందుకొచ్చారు. ఈ నెల 28న ప్రారంభమైన శిక్షణ మూడు నెలల పాటు కొనసాగనుంది. విదేశాలకు వెళ్లి చదువుకుంటామనే పేద విద్యార్థులకు తోడ్పాటుగా నిలిచేలా జగనన్న విదేశీ విద్యా కానుక అందజేస్తోంది. అయితే విదేశాల్లో చదువులకు జీఆర్ఈ, కాట్, ఐల్ట్సŠ, క్లాట్, టోపెల్, సాట్ వంటి అంతర్జాతీయ స్థాయి ఎంట్రన్స్ పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్థులకు ఇలాంటి పోటీ పరీక్షలపై అవగాహనలేక వెనుకబడిపోతున్నారు. ఉపాధ్యాయులకు ఇలాంటి శిక్షణతో ఆ లోటు భర్తీ కానుంది. పట్టుసాధించేలా ఇంగ్లిష్ మీడియం చదువులకు ప్రాధాన్యం పెరిగింది. ఉపాధ్యాయులకూ సబ్జెక్టుపై పట్టుండాలి. కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున సహకారంతో విశాఖ జిల్లాలో తొలిసారిగా ఇలాంటి శిక్షణ ఇస్తున్నాం. – బి.శ్రీనివాసరావు, సమగ్ర శిక్ష, ఏపీసీ, విశాఖపట్నం మెలకువలు నేర్పుతున్నాం.. ఇంగ్లిష్ భాషలో మెలకువలు తెలిస్తే.. విద్యార్థులను ఆకట్టుకునే రీతిలో బోధించవచ్చు. అలాంటి మెలకువలనే వారికి నేర్పుతున్నాం. ప్రతి ఉపాధ్యాయుడు కనీసం 30 గంటలైనా శిక్షణలో పాల్గొంటే మంచి ఫలితాలొస్తాయి. విద్యాశాఖాధికారులు ఈ విషయంలో చొరవ తీసుకోవాలి. – ఫిలిప్, ట్రైనర్,ఐడియల్ లెర్కింగ్ సంస్థ, విశాఖపట్నం ఉపయోగకరంగా ఉంది.. నా 23 ఏళ్ల సరీ్వసులో ఇలాంటి శిక్షణ ఇదే తొలిసారి. ఇంగ్లిష్ మీడియం బోధన అమలు చేస్తున్నందున ఇలాంటి శిక్షణ ఉపాధ్యాయులకు ఉపయోగకరంగా ఉంటుంది. – రామలక్ష్మి, ఉపాధ్యాయురాలు, జెడ్పీ హైస్కూల్, గిరిజాల, విశాఖపట్నం అలా ఉంటేనే మెరుగైన ఫలితాలు విద్యార్థులకు పాఠాలు చెప్పే మేము, మళ్లీ విద్యార్ది గా మారి శిక్షణకు హాజరవుతున్నాం. ఉపాధ్యాయుడైనా నిత్య విద్యార్ది గా ఉంటేనే ఉత్తమ ఫలితాలు వస్తాయి. నిరంతరం నేర్చుకోవాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన రీత్యా శిక్షణ ఎంతో మేలు చేస్తుంది. – ఆర్.విజేత, జీవీఎంసీ హైస్కూల్, మల్కాపురం, విశాఖపట్నం -
Karnataka assembly elections 2023: కార్యకర్తలు పార్టీని గెలిపించాలి
రాయచూరు రూరల్: రాష్ట్రంలో ఐకమత్యంతో కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి తేవాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. గురువారం యాదగిరి జిల్లా గురుమఠకల్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాజీ మంత్రి, పార్టీ అభ్యర్థి బాబూరావ్ చించనసూరు తరఫున ప్రచారసభలో కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడారు. పార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా ఉన్నారని, నేతల మధ్య అసమ్మతిని తొలగించుకొని పార్టీకి పూర్వవైభవం తేవాలన్నారు. అభివృద్ధిలో వెనుకబడిన కల్యాణ కర్ణాటకకు రాజ్యాంగంలోని ఆర్టికల్–371(జె)ను అమలు చేశామని గుర్తు చేశారు. కాగా రోడ్డు ప్రమాదం నుంచి ఇంకా కోలుకోని అభ్యర్థి బాబూరావ్ చించనసూరును స్ట్రెచర్ మీద కూర్చోబెట్టి ఆయన తరఫున భార్య వేదికపై చీర కొంగు పట్టి ఎన్నికల్లో తన భర్తకు ఓటు వేసి ఆశీర్వదించాలని ఓటర్లను అభ్యర్థించారు. -
ఏయూలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఏర్పాట్లు
-
‘దసపల్లా’ కథనాలపై పరువునష్టం దావా
దసపల్లా భూములపై రాసిందే పదేపదే రాస్తున్నారు రామోజీరావు. పేదలు ఏళ్ల తరబడి అడుగుతున్నా పట్టించుకోని అధికారులు... దసపల్లా భూముల్ని మాత్రం 22(ఎ) జాబితా నుంచి తొలగించడానికి అత్యుత్సాహం చూపిస్తున్నారంటూ బుధవారం మరో బ్యానర్ కథనాన్ని వండేశారు. ఇదే కథనాన్ని అటుతిప్పి.. ఇటు తిప్పి గతంలోనే పలుమార్లు రాయగా... వాస్తవాలు వివరిస్తూ స్థానిక ప్లాట్ల యజమానులు, భూ యజమాని రాణి కమలాదేవి, ప్లాట్ల యజమానులతో డెవలప్మెంట్ ఒప్పందం చేసుకున్న కంపెనీ... అందరూ ఖండించారు. దిగువ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ ఈ భూములు ప్రభుత్వానివి కావని, రాణి కమలాదేవికే చెందుతాయని పదేపదే తీర్పులిచ్చాక కూడా ప్రభుత్వం వీటిని వ్యూహాత్మకంగా వారికి అప్పగించేస్తోందని ‘ఈనాడు’ రాస్తోందంటే దాని అర్థమేంటి? కోర్టు తీర్పులను అమలు చేయకూడదనా? కోర్టు ధిక్కారాన్ని ఎదుర్కోవాలనా? ఎందుకు రామోజీరావు గారూ ఈ రాతలు? రాసిందే పదేపదే రాయటం వెనక అర్థమేంటి? బుధవారం రాసిన కథనానికి సంబంధించి ‘ఈనాడు’పై పరువునష్టం దావా వేస్తామంటూ రాణి కమలాదేవి, ఆమె కుమారుడు నోటీసులివ్వగా... విశాఖపట్నం జిల్లా కలెక్టరు కూడా పరువునష్టం దావా వేస్తున్నట్లు తెలియజేశారు. చట్టపరమైన చర్యలు... ‘‘దసపల్లా భూములపై తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న పత్రికలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఈ భూములకు సంబంధించి న్యాయస్థానాలు జారీ చేసిన ఆదేశాలు ఈ నెల 23 నాటికి అమలు చేయాలని కోర్టులు స్పష్టంచేశాయి. లేకుంటే హైకోర్టుకు జిల్లా కలెక్టర్ వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది. అందుకే కోర్టు తీర్పులను అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాం’’ అని పేర్కొనటంతో పాటు... ఆ భూముల చరిత్రను కూడా వివరించారు కలెక్టర్. ఇదీ... దసపల్లా భూముల కథ ► మొదటి నుంచీ రాణి కమలాదేవి కుటుంబీకుల చేతుల్లోనే ఉన్న ఈ భూములపై... సర్వే సెటిల్మెంట్ డైరెక్టర్‌తో పలు వ్యాజ్యాలు నడిచినా... చివరకు డైరెక్టరు కూడా ఆ భూములు వారివేనని స్పష్టం చేస్తూ తీర్పునిచ్చారు. 1985లో ఈ భూములపై తహశీల్దార్ హైకోర్టులో కేసు వేయగా... వాదోపవాదాలు విన్న న్యాయస్థానం 1992లో ఆ భూములు కమలా దేవికి చెందినవి అంటూ తీర్పునిచ్చింది. ► ఇంతలో జీవో నం. 657 విడుదల చేసి... ఆ భూముల్ని ప్రభుత్వ పోరంబోకు భూమలుగా గుర్తిస్తూ సెక్షన్ 22(ఏ)లో నమోదు చేశారు. దీనిపై 2005లో హైకోర్టులో రాణి కమలాదేవి రిట్ పిటిషన్ వేశారు. దీంతో జీవో ఈ భూములకు వర్తించదని కోర్టు తీర్పునిచ్చింది. ► నాటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా ప్రభుత్వ పిటిషన్లని సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో 2012లో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసింది. దాన్నీ కోర్టు డిస్మిస్ చేసింది. 2014లో రాష్ట్ర ప్రభుత్వం చివరి ప్రయత్నంగా క్యూరేటివ్ పిటిషన్‌ను దాఖలు చేసింది. దాన్ని కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ► తీర్పును అమలు చేయకుండా ప్రభుత్వం పదే పదే సుప్రీంకి వెళ్తుండటంతో రాణి కమలాదేవి 2012లో హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు వేశారు. ఇది పెండింగ్‌లో ఉండగానే... ఆ భూముల్ని 22(ఏ)లో పెట్టి నోటిఫై చేసింది ప్రభుత్వం. దీనిపై రాణి కమలాదేవి మళ్లీ కోర్టుకు వెళ్లారు. దీంతో కోర్టు జిల్లా గెజిట్‌ను రద్దుచేసి... ప్రభుత్వానికి తగు సూచనలు చేయాలని అడ్వకేట్ జనరల్‌కు చెప్పింది. ఏజీ ప్రభుత్వానికి అదే సూచన చేశారు. అయినా అమలు చేయకపోవడంతో మరోసారి పిటిషనర్లు్ల కోర్టుకు వెళ్లారు. దీంతో.. దసపల్లా భూములకు సంబంధించి ఈ నెల 23 నాటికి కోర్టు ఆదేశాలు అమలు చేయాలని... లేకుంటే కలెక్టర్ హైకోర్టుకు వ్యక్తిగతంగా రావాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టంచేసింది. ► అన్ని దారులు మూసుకుపోవడంతో పాటు కోర్టు ధిక్కార పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున, సుప్రీం ఆదేశాలను, ఏజీ సూచనను అంగీకరిస్తూ.. న్యాయస్థానాల ఆదేశాల్ని 2022 డిసెంబర్ 31న అమలు చేసినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. కానీ ప్రభుత్వాస్తులు, వీఎంఆర్డీఏ, జీవీఎంసీ, రెవెన్యూ విభాగాలవిగా చెబుతున్న 18.41 ఎకరాల్ని మాత్రం 22(ఏ)లో అలాగే ఉంచినట్లు తెలిపారు. ఎవరైనా ఇంకేం చేస్తారు? ఇవీ వాస్తవాలు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందే కదా? అన్ని స్థాయిల్లోనూ న్యాయ పోరాటం చేసి ఓడిపోయాక... కోర్టు ధిక్కార కేసులను సైతం ఎదుర్కోవాల్సి వస్తుందని న్యాయస్థానాలు హెచ్చరించాక ఏ ప్రభుత్వమైనా ఆ ఆదేశాలను అమలు చేయక ఇంకేం చేస్తుంది? కథనాలు రాసేముందు ఈ మాత్రం ఆలోచించకపోతే ఎలా రామోజీరావు గారూ? ఈ రాతలు... మరీ ఘోరం ‘‘విశాఖలో 2002లో ఓ అపార్ట్మెంట్ కట్టారు. అందులో పిసరంత ప్రభుత్వ భూమి ఉందని మొత్తం అపార్ట్‌మెంట్‌నే 22(ఏ)లో పెట్టేశారు. ఈ సంగతి అపార్ట్మెంట్లోని ఫ్లాట్ల ఓనర్లకు ఏడెనిమిదేళ్ల కిందట తెలిసింది. అప్పటి నుంచి తిరుగుతున్నా ఇప్పటికీ 22(ఏ) నుంచి తొలగించలేదు. ఇదీ ఈ ప్రభుత్వం సామాన్యుల విషయంలో అనుసరిస్తున్న వైఖరి’’అంటూ తన కథనంలో ‘ఈనాడు’ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టింది. మరి ఎనిమిదేళ్ల కిందట అంటే అప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబునాయుడు కదా? ఐదేళ్ల పాటు ఆయనే ఉన్నారు కదా? ఐదేళ్లూ వారు 22(ఏ) నుంచి తొలగించలేదంటే ఏమని అనుకోవాలి? మరి అప్పుడెందుకు ప్రశ్నించలేదు? ఐదేళ్లూ బాబు ప్రభుత్వంలో చేయని పనిని... ఈ ప్రభుత్వం మూడేళ్లలో చేయలేదని విమర్శించటం సబబేనా? ఎందుకీ దుర్మార్గపు రాతలు రామోజీరావు గారూ? బాబు అధికారంలో ఉంటే ప్రశ్నించాల్సిన మీ కలంలో సిరా అయిపోతుందా? లేక మీ గొంతు మూగబోతుందా? -
టీపీసీసీ కొత్త కమిటీలపై ఖర్గే తో రేవంత్ రెడ్డి చర్చలు
-
ఖర్గే రావణ్ వ్యాఖ్యలకు ప్రధాని మోదీ కౌంటర్
-
ప్రధాని మోదీని రావణుడితో పోల్చిన ఖర్గే
-
AICC అధ్యక్ష ఎన్నికల్లో ఖర్గే విజయం
-
మోడీ ,అమిత్ షా కలిసి దేశాన్ని నాశనం చేస్తున్నారు : మల్లికార్జున ఖర్గే
-
మల్లికార్జున ఖర్గే ,శశి థరూర్ మధ్యే ఫైనల్ ఫైట్
-
పొలిటికల్ కారిడార్ : కాంగ్రెస్ లో సమర్థత కంటే విధేయతే కీలకం
-
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ... రేసులో మల్లికార్జున ఖార్గే
-
లేటరైట్ కొండలను పరిశీలించిన విశాఖ కలెక్టర్
నాతవరం: విశాఖ జిల్లాలో లేటరైట్ నిక్షేపాలున్న కొండలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున బుధవారం పరిశీలించారు. నాతవరం మండలంలో సుందరకోట శివారు బమ్మిడికలొద్దు ప్రాంతంలో లేటరైట్ తవ్వకాల కోసం అటవీ ప్రాంతంలో చెట్లను నరికేశారని గునుపూడికి చెందిన కె.మరిడయ్య జాతీయ హరిత ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది. దీంతో కలెక్టర్ లేటరైట్ నిక్షేపాలున్న కొండలను సందర్శించారు. కొండపైకి కారు వెళ్లే అవకాశం లేదు. దీంతో జీపులో, ద్విచక్రవాహనంపై కొంత దూరం ప్రయాణించి, సుమారు రెండు కిలోమీటర్లు నడిచి కొండలను చేరుకున్నారు. అటవీ, రెవెన్యూ భూములు, వాటి సరిహద్దుల మ్యాప్‌లను తహసీల్దార్ జానకమ్మ వివరించారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఫిర్యాదీ మరిడయ్యతో మాట్లాడారు. ఫిర్యాదులో ఉన్న విషయాలకు, క్షేత్రస్థ్ధాయిలో కనిపిస్తున్న దానికి పొంతన లేకపోవడం, భారీ వృక్షాలు లేకపోవడంపై ఫిర్యాదీని ప్రశ్నించారు. అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ లేటరైట్ తవ్వకాల కోసం వేసిన రోడ్లను పరిశీలించామని చెప్పారు. నిబంధనలను పాటించారా లేదా అన్న విషయంపై అటవీ, మైనింగ్, కాలుష్య నియంత్రణ, పర్యావరణ, రెవెన్యూ శాఖల అధికారులతో మాట్లాడి, రికార్డులను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. కలెక్టర్‌తోపాటు జేసీ వేణుగోపాలరెడ్డి. కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఎల్లమురుగన్, సైంటిస్టు సురేష్‌బాబు, ఇతర అధికారులు ఉన్నారు. -
మహిళా మార్షల్స్‌ను ఉసిగొల్పారు
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఎంపీలను అప్రతిష్టపాలు చేయడంతోపాటు తప్పుడు పనుల్లో వారిని ఇరికించడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చివరి రోజు రాజ్యసభలో చోటుచేసుకున్న రగడపై ఆయన స్పందించారు. సభలో ప్రతిపక్ష ఎంపీలపై ప్రభుత్వం మహిళా మార్షల్స్‌ను ఉసిగొల్పిందని మండిపడ్డారు. ఖర్గే మంగళవారం ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. కేవలం ఒక పార్టీని లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వం అనుచితంగా ప్రవర్తించడం దారుణమని విమర్శించారు. రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడిపై తమకు విశ్వాసం ఉందని, సభలో చివరి రోజు జరిగిన అలజడి విషయంలో ఆయన నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీకి దాదాపు పూర్తి మెజారిటీ వచ్చిందని, ఇప్పుడే ఆ పార్టీ అసలు రంగు బయటపడుతోందని దుయ్యబట్టారు. కీలకమైన బిల్లులను చర్చ లేకుండానే పార్లమెంట్లో ఆమోదించడం ఏమిటని నిలదీశారు. బీజేపీ సర్కారు నిరంకుశంగా వ్యవహరిస్తోందని, ఇష్టారాజ్యంగా సభను నడిపించాలని చూస్తోందని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష సభ్యుల ప్రతిష్టను దెబ్బతీయడమే ప్రభుత్వం పని పెట్టుకుందని నిప్పులు చెరిగారు. ఇన్సూరెన్స్ బిల్లును బలవంతంగా ప్రవేశపెట్టారు ప్రభుత్వ పరిధిలో కొనసాగుతున్న బీమా సంస్థలను సంపన్న వ్యాపారవేత్తలైన వారి మిత్రులకు కట్టబెట్టాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించుకున్నారని మల్లికార్జున ఖర్గే చెప్పారు. అందుకే ఆగస్టు 11న రాజ్యసభలో మార్షల్స్‌తో కోట కట్టి, ఇన్సూరెన్స్ సవరణ బిల్లును బలవంతంగా ప్రవేశపెట్టారని తెలిపారు. పురుష మార్షల్స్ కంటే ముందే మహిళా మార్షల్స్‌ను రంగంలోకి దించారని, ఒకవేళ ప్రతిపక్ష ఎంపీలు పొరపాటున వారిని తాకితే రాద్ధాంతం చేయాలన్నదే సర్కారు పన్నాగమని విమర్శించారు. సభలో అనుచితంగా ప్రవర్తించిన ప్రతిపక్ష సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తోందని గుర్తుచేయగా.. ఏం చర్యలు తీసుకుంటారో చూస్తామని, సభలో జరిగిన ఘర్షణలో తమ సభ్యులు గాయపడ్డారని ఖర్గే బదులిచ్చారు. ఈ విషయంలో చైర్మన్ వెంకయ్య నాయుడిపై నమ్మకం ఉంచామని అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సాఫీగా సాగకపోవడానికి ప్రతిపక్షాలే కారణమంటూ కేంద్రం నిందించడం సరి కాదని హితవు పలికారు. వాస్తవానికి ప్రతిపక్షాల సహకారం వల్లే ఈసారి ఎక్కువ సమయం పార్లమెంట్ వ్యవహారాలు కొనసాగాయని వివరించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష బీజేపీ కారణంగా పార్లమెంట్ సమావేశాలు ఏనాడూ సజావుగా సాగలేదని గుర్తుచేశారు. -
కోవిడ్ బాధితులకు కొండంత అండ
సాక్షి, అమరావతి: కోవిడ్ బాధితులకు ఆరోగ్యశ్రీ కొండంత అండగా నిలుస్తోంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చడం, చివరకు బ్లాక్ ఫంగస్‌ను సైతం ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచితంగా చికిత్స అందించడం ద్వారా పేద రోగులకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పించింది. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో 50 శాతం పడకలు ఆరోగ్యశ్రీ రోగులకు కేటాయించాలనే నిబంధనతో వేలాది మందికి ఉచితంగా కరోనా చికిత్స అందుతోంది. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచితంగా సమర్థవంతంగా చికిత్స అందిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది. సుమారు 55 శాతం ప్రైవేట్ ఎం ప్యానల్డ్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్నట్టు అంచనా వేశారు. ఇది 65 శాతానికి పెంచాలని భావిస్తున్నారు. 116 ప్రభుత్వ ఆస్పత్రుల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 116 ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోవిడ్ బాధితులకు చికిత్స అందుతోంది. ఇందులో 2,288 ఐసీయూ పడకలు, 12,250 ఆక్సిజన్ పడకలు, 11,544 సాధారణ పడకల్లో సేవలు అందుతున్నాయి. ఈ కేసులన్నిటికీ ఆరోగ్యశ్రీ వర్తిస్తోంది. ఇవి కాకుండా 200 తాత్కాలిక ఎం ప్యానల్డ్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లోనూ సేవలు అందిస్తున్నారు. చికిత్సకు నిరాకరిస్తే కఠిన చర్యలు.. ఆరోగ్యశ్రీ కింద కోవిడ్ బాధితులకు పడకలు కేటాయించని ఆస్పత్రులు, చికిత్స అందించని ఆస్పత్రులపై అధికారులు తనిఖీలు నిర్వహించి ఇప్పటివరకూ 54 కేసులు నమోదు చేశారు. 11 ఆస్పత్రులను మూసి వేశారు. రూ.3.72 కోట్లు జరిమానా విధించారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. ఎంత పెద్ద కార్పొరేట్ ఆస్పత్రి అయినా సరే ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించకుంటే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మానవత్వంతో వ్యవహరించాలి ‘కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. ఈ సమయంలో వ్యాపార దృక్పథంతో ఆస్పత్రులను నిర్వహించడం సమంజసం కాదు. తమ వంతు సాయంగా ప్రజలకు వైద్యం అందించేలా కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు మానవత్వంతో ఆలోచించాలి. సామాన్యులు, పేదలకు భరోసా కల్పించాలి. ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించిన ప్రతి ఆస్పత్రికీ ప్రభుత్వం చెల్లింపులు చేస్తోంది’ –డాక్టర్ ఎ.మల్లికార్జున, సీఈవో, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ -
ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు రూ.235.94 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేస్తున్న ఆస్పత్రులకు రూ.235.94 కోట్లు చెల్లించినట్టు ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ ఎ.మల్లికార్జున ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 719 నెట్వర్క్ ఆస్పత్రులకు ఏప్రిల్ 15 నాటికి ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు సమర్పించిన బిల్లులకుగాను 195.36 కోట్లు, ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద 584 నెట్వర్క్ ఆస్పత్రులకు మార్చి 15 నాటికి ఇచ్చిన బిల్లులకుగాను రూ.40.58 కోట్లు కలిపి మొత్తం రూ.235.94 కోట్లు చెల్లించామన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసే ఆస్పత్రులకు ఎప్పటికప్పుడు నిధులు చెల్లిస్తున్నట్టు తెలిపారు. ఆస్పత్రులకు నోటీసులు కోవిడ్ బాధితులకు ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స అందించని ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసినట్లు ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు. మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో విజయవాడలోని నిమ్రా ఆస్పత్రి, ఆంధ్ర ఆస్పత్రులు కోవిడ్ బాధితులకు చికిత్స అందించడంలో సరిగా స్పందించడం లేదని తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ రెండు ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. కోవిడ్ సమయంలో ఏ ప్రైవేటు ఆస్పత్రి అయినా పేద ప్రజలకు చికిత్సలు అందించాల్సిందేనని, ఆరోగ్యశ్రీ కింద 50 శాతం పడకలు ఇవ్వకపోయినా, చికిత్సలు చేయకపోయినా అలాంటి ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామన్నారు. -
నిబంధనల ప్రకారమే ఆస్పత్రుల్లో ఉంచండి
సాక్షి, అమరావతి: కొన్ని నెట్వర్క్ ఆస్పత్రులు ఎక్కువ రోజులు ఆస్పత్రుల్లో ఉండాలని కోవిడ్ పేషెంట్లపై ఒత్తిడి తెస్తున్నాయని, వాటిపై చర్యలు తీసుకుంటామని ఆరోగ్యశ్రీ సీఈవో మల్లికార్జున హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ సాంకేతిక కమిటీ అన్నీ పరిశీలించాకే రోజు వారీ ప్యాకేజీలు నిర్ణయించామని, దీన్ని కాదని ఆస్పత్రులు ప్యాకేజీ డబ్బుల కోసం ఎక్కువ రోజులు ఉండాలని ఒత్తిడి తెస్తున్నాయన్నారు. అయినా సరే నిబంధనల ప్రకారం ప్యాకేజీ డబ్బులు ఇస్తామని నెట్వర్క్ ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేశారు. -
ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులకు నిధులు విడుదల
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్ఆర్ పథకం కింద 573 ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులకు 148.37 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్లు మంగళవారం ఆరోగ్య శ్రీ సీఈఓ మల్లీఖార్జున తెలిపారు. సెప్టెంబర్ మొదటి వారం వరకు ఉన్న బిల్లుల మొత్తాన్ని విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు. అంతేగాక ఉద్యోగులకు హెల్త్ స్కీం కింద 31.97 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. 544 ఆస్పత్రులకు జులై నెల వరకు ఉన్న బకాయిలను కూడా విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు. -
పెట్రోల్ పోసి కాలబెట్టాలె!
కరీంనగర్ రూరల్: ‘‘నా భూమి కోసం 15 ఏళ్లుగా చెప్పులరిగేలా తిరుగుతున్నా.. ఎవరూ పట్టించుకుంటలేరు. అధికారులందరిని పెట్రోల్ పోసి కాలబెట్టాలె..’’అంటూ కరీంనగర్ మండలం బొమ్మకల్‌కి చెందిన బాధితుడు మల్లికార్జున్ సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో హల్చల్ చేశాడు. రిటైర్డు ఎంఈవో మల్లికార్జున్‌కు బొమ్మకల్‌లో 3.24 గుంటల భూమి ఉంది. 15 ఏళ్ల క్రితం తన కుమారుడు విజయ్ పేరిట పాసుపుస్తకం ఎందుకిచ్చారని, తన భూమిని తనకే ఇవ్వాలని పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నాడు. కొడుకు పేరిట రిజిస్ట్రేషన్ ఉండడంతో అధికారులు మిన్నకున్నారు. దీంతో సోమవారం జరిగిన ప్రజావాణికి వచ్చిన మల్లికార్జున్ రెవెన్యూ అధికారుల తీరుపై మండిపడ్డాడు. పదిహేనేండ్ల నుంచి తిరుగున్నా పట్టించుకోవడం లేదంటూ, అధికారులపై పెట్రోల్ పోసి కాలపెట్టాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మల్లికార్జున్ తీవ్ర పదజాలంతో అధికారులను దూషిస్తుండడంతో డీఆర్వో ప్రావీణ్య పోలీసులకు తెలిపారు. ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకోగా, స్ధానిక నేతల విజ్ఞప్తి మేరకు మల్లికార్జున్‌ను విడిచిపెట్టారు. -
కదిరిలో ఖతర్నాక్ ఖాకీ
ప్రజలకు ఏ కష్టం వచ్చినా.. ఇతరుల వల్ల అన్యాయం జరిగినా.. వెంటనే పరిగెత్తేది పోలీసుస్టేషన్‌కు. బాధితుల ఫిర్యాదు తీసుకుని విచారణ జరిపి నిందితులను కోర్టు మెట్లెక్కించడం పోలీసుల విధి. అలాంటి ఓ పోలీసు దారి తప్పాడు. ఓ సర్కిల్‌కు ఉన్నతాధికారిగా.. తన సిబ్బందికి ఆదర్శంగా ఉండాల్సిన ఆయన.. ఖాకీ ముసుగులో కాసుల వేటలో పడ్డాడు. కేసు ఏదైనా.. బాధితులైనా.. నిందితులైనా డబ్బులిస్తేనే వారికి న్యాయం చేస్తాడనే పేరు ఈయన సొంతం. అడిగినంత ఇవ్వకపోతే బాధితులపైనే రివర్స్ కేసు పెట్టేస్తాడనే అపవాదూ ఉంది. అందుకే కదిరిలో ఆయన పేరు ‘మనీ’కార్జునగా మార్మోగుతోంది. సాక్షి, కదిరి(అనంతపురం): పోలీసు శాఖలో సీఐ అంటే అందరికీ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గానే తెలుసు. కానీ కదిరి టౌన్ సీఐ మల్లికార్జున గుప్త మాత్రం ఆ పదాన్ని కలెక్షన్ ఇన్స్పెక్టర్గా మార్చేశారు. నిందితులతో పాటు బాధితుల దగ్గర కూడా పైసలు వసూలు చేస్తున్నాడు. ఎస్పీ సత్యయేసుబాబు ఫ్రెండ్లీ పోలిసింగ్‌కు కృషి చేస్తుండగా.. కదిరి టౌన్ సీఐ మాత్రం కాసులిస్తేనే ఖాకీ సేవలనేలా వ్యవహరిస్తున్నాడు. బాధితులైనా సరే పెద్ద మొత్తంలో డబ్బు ముట్టజెపితే కానీ న్యాయం చేసే పరిస్థితి లేదు. అందువల్లే ఆయన కదిరికి వచ్చిన 90 రోజుల్లోనే రూ.కోటి దాకా అక్రమంగా సంపాదించాడని పోలీసుల వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. బూటు కాలుతో తంతా... ‘నా అల్లుడు శ్రీనివాసులు రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం మీద నెల రోజుల క్రితం మీకు ఫిర్యాదు చేశాం. మీరు ఏ మాత్రం పట్టించుకోలేదు. సీఐకి రూ.50 వేలు ఇచ్చాను. ఆయన నా మాటే మాట్లాడతాడని మా అల్లుడే మాతోనే ఎన్నోసార్లు అన్నాడు. నా కూతురు శైలజకు జరిగిన అన్యాయం నీ కూతురుకు జరిగితే మీరు ఇలాగే వ్యవహరిస్తారా..?’ అని కదిరి పట్టణానికి చెందిన సుజాత అన్నందుకు ‘చెప్పుతో కొడతా లం.., నోటి కొచ్చింది మాట్లాడతావా?’ అంటూ పత్రికలో రాయలేని విధంగా దూషించారు. తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె.. గత శనివారం సాయంత్రం స్టేషన్ ప్రాంగణంలోనే విషద్రావకం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తెలిసిందే. ఈ దృశ్యాన్ని ఆమె బంధువులు సెల్ఫోన్లో చిత్రీకరిస్తుండగా.. వారిని చితక్కొట్టిన సీఐ మల్లికార్జున గుప్త.. తమ విధులకు ఆటంకం కల్గించారంటూ బాధితులపైనే కేసు నమోదు చేయడం గమనార్హం. ఆయనకు 41 నోటీసు వజ్రాయుధం పలు నేరాల్లో నిందితుడైన హతీక్ అనే వ్యక్తి ఓ మహిళను చీరపట్టి లాగి అందరి ముందూ అవమానించాడు. దీనిపై బాధిత మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే.. సీఐ మల్లికార్జున గుప్త నిందితుడి దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు తీసుకొని అతనికి 41 నోటీసు ఇచ్చి సరిపెట్టారు. అలాగే రెండు రోజుల క్రితం తన అల్లుడు రెండోపెళ్లి చేసుకున్నాడని సూజత అనే మహిళ ఫిర్యాదు చేయగా.. నిందితుడు శ్రీనివాసులు దగ్గర రూ.50 వేలు లంచం తీసుకొని అతనికి కూడా 41 నోటీసు ఇచ్చి చేతులకు దులుపుకున్నాడని బాధితురాలు మీడియా ముందు వాపోయింది. కేసు వస్తే సీఐకి కాసుల పంటే టీడీపీ పట్టణాధ్యక్షుడు అహ్మద్‌వలీ ఇంటి పట్టాల ఇప్పిస్తామని చెప్పి తమవద్ద భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించారని దాదాపు 150 మంది భవన నిర్మాణ కార్మికులు ఫిర్యాదు చేస్తే.. ఆ కేసులో కూడా అహ్మద్ వలి దగ్గర సుమారు రూ.5 లక్షలు దాకా డబ్బు తీసుకొని 41 నోటీసుతో సరిపెట్టాడని బాధితులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు అడిగితే కేసు నమోదు చేసి నిందితుడికి 41 నోటీసు ఇచ్చామని తప్పించుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. ⇔ రైల్వేస్టేషన్ రోడ్లో ఇటీవల వడ్డే సామాజిక వర్గానికి చెందిన ఇరు వర్గాలు ఇంటి విషయంలో తగాదా పడితే పోలీస్ స్టేషన్లోనే దుప్పటి పంచాయతీ చేసి అక్కడే పనిచేసే ఓ మహిళా కానిస్టేబుల్ ద్వారా రూ.50 వేలు లంచం తీసుకున్నట్లు పోలీసు వర్గాల్లోనే చర్చ నడుస్తోంది. ⇔ టీడీపీ ఇన్చార్జ్ కందికుంట అనుచరుడు పాలహరి అధికారాన్ని అడ్డుపెట్టుకొని తమ పొలాన్ని కబ్జాచేసి తప్పుడు పత్రాలు పుట్టించారని రిటైర్డ్ కమర్షియల్ ట్యాక్స్ అధికారి ఒకరు ఈ మధ్యే కదిరి తహసీల్దార్ మారుతిని కలిసి ‘స్పందన’లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన తహసీల్దార్.. బాధితులకు న్యాయం చేస్తూ ఆ పొలాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేటప్పుడు పోలీసులు అతనికి రక్షణ కల్పించాలని ఆదేశించారు. ఈ కేసులో కూడా పట్టణ సీఐ పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితులకు ఎలాంటి పోలీసు రక్షణ కల్పించకపోగా... నిందితునికి బదులు బాధితుడినే స్టేషన్‌కు పిలిపించి అతన్ని బెదిరించే ధోరణిలో మాట్లాడినట్లు తెలుస్తోంది. ⇔ ఇక వైఎస్సార్ జిల్లా నుంచి బదిలీపై సీఐగా ఇక్కడికి వచ్చిన మల్లికార్జున అక్కడ ఉన్న తన ఇంటి సామగ్రిని ఓ మినీ లారీలో కదిరికి తెప్పించుకున్నాడు. కదిరికి చెందిన ఆ లారీ యజమాని రహంతుల్లాకు బాడుగ ఇవ్వకుండా.. ఆయన కోరిక మేరకు అతనికి సరిపోని ఇరువురిపై తప్పుడు కేసు నమోదు చేశారు. మొదట రాయించిన కంప్లైంట్ సరిగా లేదంటూ దాన్ని చింపేసి, తమను చంపడానికి వచ్చారంటూ మరో ఫిర్యాదు రాయించుకొని తనకు ఎలాంటి సంబంధం లేదన్నట్లు పట్టణ ఎస్ఐ మహమ్మద్ రఫీ చేత బలవంతంగా ఆ కేసు ఫైల్ చేయించినట్లు చర్చ జరుగుతోంది. పైసలిస్తే కేసు క్లోజ్ టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ ముఖ్య అనుచరుడు నటేష్ ఎంతో మంది రైతులను మోసగించి సుమారు రూ.2 కోట్లకు పైగా ఎగ్గొట్టాడు. దీనిపై బాధిత రైతులు పోలీసులను ఆశ్రయించారు. గతంలో ఇక్కడ పని చేసిన సీఐ బీవీ చలపతికి నటేష్ రూ.20 లక్షలు ఆఫర్ చేసి ఆ కేసు మూసివేయాలని కోరితే అందుకు ఆయన నిరాకరించారు. అయితే ప్రస్తుత సీఐ మల్లికార్జున గుప్త ఇంకా ఎక్కువ మొత్తం తీసుకొని బాధితుడు నాయక్ ఒక్కరే అని చూపుతూ లోక్ అదాలత్ ద్వారా ఆ కేసును కొట్టివేయించి మిగిలిన రైతులందరినీ మోసగించారని బాధితులు వాపోతున్నారు. అక్కడ కూడా ఇంతే.. సీఐ మల్లికార్జున గుప్త టీడీపీ హయాంలో చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో పని చేసేటప్పుడు కూడా టీడీపీ నాయకుల మెప్పుకోసం అక్కడి ఎమ్మెల్యే రోజాపై పలు తప్పుడు కేసులు బనాయించారు. ఇలా ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ పేరు డీఎస్పీ పదోన్నతి జాబితాలో ఉందని తెలిసి పోలీసులే ముక్కున వేలేసుకుంటున్నారు. జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి తక్షణం ఇతన్ని విధుల నుంచి తప్పించి నిష్పక్షపాతంగా ఉన్న ఓ పోలీసు అధికారితో దర్యాప్తు జరిపిస్తే మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
గుంతకల్లులో టీడీపీ నేత మల్లికార్జున చౌదరి అరాచకం
-
కరక్కాయల స్కాం ప్రధాన నిందితుడు అరెస్ట్
-
భూముల సేకరణకు ఆదేశించాం
కాకినాడ రూరల్: పట్టణం, రూరల్ ప్రాంతా ల్లో ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రాధాన్యం ఇచ్చేలా భూములను సేకరించాలని ఆర్డీవోలను, తహసీల్దార్లను ఆదేశించినట్టు జాయింట్ కలñ క్టర్ ఎ.మల్లికార్జున వివరించారు. మంగళవారం అమరావతి నుంచి సీసీఎల్ఏ అనిల్‌చంద్ర పునేఠా స్పెషల్ ప్రాజెక్టులకు ఇళ్ల స్థలాలు, భూసేకరణ, నీటి పన్ను వసూలు, మీకోసంలో వచ్చిన సమస్యల పరిష్కారం, ఆర్థికేతర సమస్యల పరిష్కారం, జన్మభూమిలో వచ్చిన అర్జీల పరిష్కారం తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. మీ కోసంలో వచ్చిన సమస్యల తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. పునేఠా మాట్లాడుతూ భూమికి సంబంధించి వచ్చిన సమస్యలు పరిష్కరించడానికి తూర్పుగోదావరి, కృష్ణా, విజయనగరం, కర్నూలు జిల్లాల జాయింట్ కలెక్టర్లతో కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. ఆర్అండ్ఆర్ రిజిస్టరు డాట్ లేండ్ వెంటనే పరిష్కరించాలన్నారు. రాజోలు బైపాస్ 216కి సేకరించిన భూములకు చెల్లింపులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కాన్ఫరెన్స్‌లో జేసీ మల్లికార్జున రంపచోడవరం నుంచి పాల్గొనగా కాకినాడ కలెక్టరేట్ నుంచి ఇన్చార్జి డీఆర్వో ఎం.జ్యోతి, ఏవో జి.భీమారావు, ల్యాండ్ సర్వే ఏడీ నూతన్‌కుమార్, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. ప్రజాసాధికార సర్వేలో నమోదుకండి ప్రజాసాధికార సర్వేలో అందరూ వివరాలు నమోదు చేయించుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎ.మల్లికార్జున మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. 2016లో నిర్వహించిన సర్వేలో కొంతమంది ఇంటిలో లేకపోవడం, గ్రామం నుంచి పాక్షికంగా వలస వెళ్లటం, ఇతర కారణాల వల్ల వారి వివరాలు నమోదు కాలేదన్నారు. అలాంటి వారి వివరాలు సేకరించే నిమిత్తం వీఆర్వోవో, వీఆర్ఏ, పంచాయతీ కార్యదర్శి, మున్సిపల్ సిబ్బంది ద్వారా గ్రామాల్లో నమోదు కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించినట్టు తెలిపారు. తహసీల్దార్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయాల్లో వారం రోజులు నమోదు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. -
మరో ఇద్దరి బలవన్మరణం
- మొన్న ముగ్గురు, నిన్న ముగ్గురు.. నేడు ఇద్దరు.. - ఆందోళన కలిగిస్తున్న ఆత్మహత్యలు జిల్లాలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. మొన్న ముగ్గురు ఆత్మహత్య చేసుకోగా, నిన్న మరో ముగ్గురు బలవన్మరణం చెందారు. తాజాగా ఇద్దరు బలవంతపు చావు చచ్చారు. అంతులేని ఆత్మహత్యలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రొద్దం(పెనుకొండ) : రొద్దం మండలంశేషాపురంలో కురుబ భాగ్యమ్మ(42) అనే వివాహిత ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ మునీర్ అహమ్మద్ తెలిపారు. భాగ్యమ్మ, ఆమె భర్త శ్రీరాములు ఇద్దరూ కలసి గొర్రెలను తోలుకుని గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి శనివారం వెళ్లారన్నారు. మధ్యాహ్నం కడుపునొప్పి తీవ్రం కావడంతో ఇంటికి వెళ్లాల్సిందిగా భర్త సూచించారన్నారు. అయితే ఆమె ఇంటికెళ్లకుండా మార్గమధ్యంలోనే చెట్టుకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించారు. రాత్రి ఇంటికొచ్చిన భర్తకు భార్య కనిపించకపోవడంతో అటవీ ప్రాంతంలో గాలించారు. అయినా ఆచూకీ కనబడలేదు. ఆదివారం మరోసారి గాలించగా.. చెట్టుకు వేలాడుతూ కనిపించిందని పేర్కొన్నారు. విషయం తెలిసిన వెంటనే ఎస్ఐ తమ సిబ్బందితో కలసి నేర స్థలానికి వెళ్లారు. ఘటనపై ఆరా తీశారు. రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాగా మృతురాలికి డిగ్రీ చదివే కూతురు, ఇంటర్ చదివే కుమారుడు ఉన్నారు. ధర్మవరంలో మరొకరు.. ధర్మవరం అర్బన్ : ధర్మవరం కేతిరెడ్డి సూర్యప్రతాప్‌రెడ్డి కాలనీలో నివసిస్తున్న మల్లికార్జున(45) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు పట్టన పోలీసులు తెలిపారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని నూనె అంగట్లో గుమాస్తాగా పని చేసే మల్లికార్జున కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడేవాడన్నారు. ఈ నేపథ్యంలో జీవితంపై విరక్తి చెందిన ఆయన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని తనువు చాలించినట్లు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక మార్చురీకి తరలించారు. మృతునికి భార్య తులసమ్మ, కుమారుడు ఓంకార్ ఉన్నారు. మల్లికార్జున మృతదేహం వద్ద వారు రోదించిన తీరు అందరినీ కలచివేసింది. -
నేడు పూర్ణాహుతి
శ్రీశైలం: శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల సన్నిధిలో ఈ నెల 11 నుంచి ›ప్రారంభమైన మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు సోమవారం పూర్ణాహుతిని నిర్వహిస్తున్నట్లు ఈఓ నారాయణ భరత్ గుప్త సోమవారం తెలిపారు. ఉదయం 9.15 గంటలకు ఆలయప్రాంగణంలోని యాగశాల రుద్రహోమ పూర్ణాహుతి, అనంతరం కలశోద్వాసన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేరోజు రాత్రి ధ్వజావరోహణ, ధ్వజపటానిష్క్రమణ కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. -
రావణ వాహనాధీశా... పాహిమాం
శ్రీశైలం: మకర సంక్రమణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సకలభోగ సౌభాగ్యాలనిచ్చే భోగి పర్వదినాన శ్రీశైల మల్లికార్జునుడు దేవేరి భ్రామరితో కలిసి రావణవాహనంపై దర్శనమిస్తూ అభయమిచ్చారు. శ్రీశైల ఆలయంలో సంకమ్రణ బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు శుక్రవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల ఉత్సవమూర్తులను రావణ వాహనంపై ఉంచి విశేష వాహనపూజలను నిర్వహించారు. ఉత్సవమూర్తులకు అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తరీతిన ప్రత్యేక పూజలు చేశారు. రావణ వాహనాధీశులైన స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయప్రద„ìణ చేయించి ఊరేగింపుగా రథశాల వద్దకు తీసుకువచ్చారు. నారికేళ ఫలపుష్పాదులను సమర్పించి గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. రథశాల నుంచి అంకాలమ్మగుడి, నందిమండపం, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఈ ఉత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని కర్పూరనీరాజనాలను అర్పించారు. కార్యక్రమంలో ఈఓ నారాయణ భరత్ గుప్త, ఆలయ ఏఈఓ కృష్ణారెడ్డి, శ్రీశైలప్రభ ఎడిటర్ డాక్టర్ కడప అనిల్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
ఆత్మకూరు : ఆత్మకూరు సమీపంలో బుధవారం లారీ ఢీకొన్న ప్రమాదంలో మల్లికార్జున (28) అనే యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కంబదూరు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన మల్లికార్జున బీటెక్ పూర్తి చేసి అనంతపురంలోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. అయితే స్వగ్రామమైన తిమ్మాపురంలో ఓ శుభకార్యానికి బుధవారం తన స్నేహితుడితో కలిసి ద్విచక్రవాహనంలో బయలుదేరాడు. ఆత్మకూరు దాటగానే కళ్యాణదుర్గం నుంచి వస్తున్న లారీ వీరిని ఢీ కొంది. క్షతగాత్రులను స్థానికులు ఆటోలో అనంతపురం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మల్లికార్జున మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
లేపాక్షి ఆలయంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ
లేపాక్షి : లేపాక్షి ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం అనంతపురం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ మల్లికార్జున, ఆయన కుటుంబ సభ్యులు సందర్శించారు. ఆలయంలోని వీరభద్రస్వామి, దుర్గాదేవి అమ్మవార్లకు విశేషంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని అపురూపమైన శిల్పాలు, చిత్రలేఖనాలు, కల్యాణమండపాలు తదితరాలను తిలకించారు. చిలమత్తూరు ఎస్ఐ జమాల్‌బాషా, పోలీసులు ఆయన వెంట ఉన్నారు. -
ప్రజా సమస్యలపై పోరుబాట
అనంతపురం రూరల్ : ప్రజా సమస్యపై ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మల్లికార్జున ఆ పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. మంగళవారం నీలం రాజశేఖర్‌రెడ్డి భవన్లో సీపీఐ రూరల్ మండల కార్యదర్శి రమేష్ అధ్యక్షతన సమితి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లికార్జున మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంలో టీడీపీ పూర్తిగా విఫలమైందన్నారు. తమది పేదల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ ఆదిశగా చర్యలు చేపట్టక పోగా ఆధార్ అనుసంధానం పేరిట ఉన్న రేషన్‌కార్డులను తొలగించందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తున్న ఒక్క ఇళ్లు మంజూరు చేసిన పాపన పోలేదన్నారు. పీఏబీఆర్ కుడికాలువ కింద ఉన్న 49చెరువులను పూర్తి స్థాయిలో నీటితో నింపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రామకృష్ణ, సీపీఐ నాయకులు రామాంజినేయులు, వన్నారెడ్డి, చియ్యేడు రామకృష్ణ, రఘురామయ్య, చంద్రకళ, శ్రీకాంత్, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
దేవుడా.. ఎంత పని చేశావయ్యా!
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం ఎంత పని చేశావయ్యా ? మేమేం పాపం చేశామయ్యా తండ్రీ ? ఎవరి కోసం బతకాలి నాయనా ? మాకు ఇంక దిక్కెవరు తండ్రీ అంటూ మృతుల తల్లిదండ్రులు రోదించిన తీరు చూపరులను కలచివేసింది. రాయదుర్గం మండలం 74 ఉడేగోళం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు గురువారం రాత్రి కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. మండలంలోని 74 ఉడేగోళం గ్రామానికి చెందిన రాయంపల్లి హరిజన తిప్పేస్వామి, శాంతమ్మ దంపతులకు ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు మహేంద్ర (22) ఆటోను నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. చెల్లెలు భవానికి కర్ణాటకలోని రాంపురం వద్ద గల బసాపురం గ్రామానికి చెందిన దురుగేష్తో వివాహమైంది. చెల్లిని పలకరిద్దామని గురువారం గ్రామానికి చెందిన చింతమాను తిప్పేస్వామి, శంకుతుల దంపతుల కుమారుడు మల్లికార్జున(20)ను వెంటబెట్టుకుని మహేంద్ర ద్విచక్రవాహనంపై బసాపురం వెళ్లాడు. చెల్లెలి కుటుంబ సభ్యులతో మాట్లాడిన అనంతరం తిరుగుపయనమయ్యాడు. రాంపురం హైవే వద్దకు రాగానే వీరి బైక్‌ను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో మహేంద్ర, మల్లికార్జున అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద వార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసుకున్న కర్ణాటక పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను స్వగ్రామానికి తరలించారు. మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కాపు మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, సతీమణీ కాపు భారతి శుక్రవారం 74 ఉడేగోళం గ్రామానికి చేరుకుని మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు. మీ కుటుంబాలకు అండగా ఉంటామని వారికి ధైర్యం చెప్పారు. కాపు వెంట వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి మాధవరెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎన్టీ సిద్దప్ప, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కలుగోడు మహేష్, ఐనాపురం మంజునాథ, పవన్, రఘు, గోవిందప్ప, ఉలిగప్ప, రాజన్న, మల్లికార్జున తదితరులు ఉన్నారు. మృతుని కుటుంబానికి ఆర్థికసాయం : రోడ్డు ప్రమాదంలో మరణించిన ఒక్కొక్క కుటుంబానికి చంద్రన్న బీమా పథకం కింద రూ.5వేల తక్షణ సాయం అందజేసినట్లు వెలుగు ఏపీఎం తిప్పేస్వామి తెలిపారు. -
ప్రియురాలితో జల్సా కోసం చిటికెలో చోరీలు!
మదనపల్లె టౌన్: ఆ యువకుడు ఒక యువతిని ప్రేమించాడు. ఆమెతో కలిసి జల్సాలు చేయాలనుకున్నాడు. కానీ చేతిలో డబ్బు లేదు. దీంతో దొంగగా మారాడు. కడప, చిత్తూరు జిల్లాల్లో 22 ద్విచక్ర వాహనాలను చోరీ చేశాడు. చోరీ చేసిన వాహనంలో వెళుతుండగా పోలీసులు చేసిన తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయి కటకటాల పాలయ్యాడు. మదనపల్లె డీఎస్పీ రాజేంద్రప్రసాద్ బుధవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వైఎస్సార్ జిల్లా దేవపట్లకు చెందిన రాళ్లపల్లె వెంకటేశ్వర్లు కుమారుడు మల్లికార్జున(19) పదో తరగతి చదువుతుండగా తల్లిదండ్రులు విడిపోయారు. తల్లి తన పుట్టినిల్లు అయిన చిత్తూరు జిల్లాలోని సోమల మండలం సామిరెడ్డిగారిపల్లెలో తల్లి వద్ద ఉంటోంది. మల్లికార్జున కూడా ఆమె వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఏడాదిగా అదే గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమించాడు. ఆమెను సంతోష పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఏం చేయాలో తోచక దొంగగా మారాడు. చిటికెలో ద్విచక్ర వాహనాలను చోరీ చేయడం నేర్చుకున్నాడు. ఈ క్రమంలో కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన పలు పట్టణాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ చేసి రూ.3 వేలు, రూ.5 వేలకు విక్రయించేవాడు. వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు. బాధితుల ఫిర్యాదుతో కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా ఎస్పీ శ్రీనివాస్, డీఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆదేశాల మేరకు టూటౌన్ ఎస్ఐలు గంగిరెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి వైఎస్సార్ కాలనీ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. మల్లికార్జున చోరీ చేసిన ద్విచక్ర వాహనంపై వెళ్లూ పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతన్ని వెంటాడిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పలుచోట్ల ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్టు అంగీకరించాడు. అతని సమాచారం మేరకు తూర్పు ఎర్రకొండ వద్ద ఓ పాత ఇంటిలో దాచిపెట్టిన వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. రాయచోటి, కడప, తిరుపతి, మదనపల్లె, కలికిరి, భాకరాపేట, పుంగనూరు ప్రాంతాల్లో నిందితుడు చోరీ చేశానని అంగీకరించిన 22 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. నిందితున్ని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన ఎస్ఐ గంగిరెడ్డి, ఏఎస్ఐ విజయ్‌కుమార్‌రెడ్డి, కానిస్టేబుల్ రాజేష్‌కు నగదు రివార్డులను అందజేసినట్లు డీఎస్పీ తెలిపారు. -
మల్లికార్జున.. ఏ–ప్లస్
– జిల్లాలో ఏ కేటగిరి చెందినవి 4 – రెండు ఘాట్లు బీ కేటగిరి కర్నూలు (అగ్రికల్చర్): కృష్ణా పుష్కరాల నిర్వహణలో భాగంగా ఏర్పాటు చేసిన ఘాట్లకు అధికారులు గ్రేడ్లు ఇచ్చారు. శ్రీశైలంలోని మల్లికార్జున ఘాట్ ఏ ప్లస్ గ్రేడును సాధించింది. మిగతా ఘాట్లు వివిధ కేటగిరీల్లో చేరాయి. జిల్లాలో మొత్తం 7 ఘాట్లు ఉండగా...శ్రీశైలంలో నాలుగు, సంగమేశ్వరంలో మూడు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్యను జిల్లా యంత్రాంగం అంచనావేసి వాటికి గ్రేడ్లు ఇచ్చింది. రోజుకు లక్ష మంది ఆపైన వచ్చే శ్రీశైలంలోని మల్లికార్జున పుష్కర ఘాట్‌ను ఏప్లస్ కేటగిరిగా ప్రకటించారు. శ్రీశైలంలోని భ్రమరాంబిక ఘాట్, లింగాలగట్టు –1 కొత్తఘాట్, లింగాలగట్టు –2 పాతఘాట్‌లను ఏ కేటగిరిగా గుర్తించారు. ఏ కేటగిరి ఘాట్లకు రోజుకు 50 వేల నుంచి లక్ష వరకు భక్తులు వచ్చి పుష్కర స్నానాలు ఆచరించే అవకాశం ఉంది. అలాగే సంగమేశ్వర ఘాట్‌ను ఏ–కేటగిరిలో చేర్చారు. సంగమేశ్వరంలోని లలితాదేవీ ఘాట్, లో లెవెల్ టెంపుల్ ఘాట్లను బీ కేటగిరిగా జిల్లా యంత్రాంగం గుర్తించింది. బీ కేటగిరి ఘాట్లకు రోజుకు 10 వేల నుంచి 50 వేల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో ఏడు ఘాట్లు ఏర్పాటు చేస్తుండగా ఒకటి ఏ ప్లస్, ఏ కేటగిరి ఘాట్లు 4, బీ కేటగిరి ఘాట్లు రెండింటిని గుర్తించారు. ఘాట్ కేటగిరిని బట్టి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
కరెంటుషాక్ తో లైన్మెన్ దుర్మరణం
బద్వేలు: వైఎస్సార్ జిల్లా బద్వేలు మండలం లక్ష్మీపురం గ్రామంలో గురువారం ఉదయం ఓ జూనియర్ లైన్మెన్ విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయాడు. పట్టణంలోని వెంకటాయనగర్కు చెందిన తలపాటి మల్లికార్జున (27) నందిపల్లె గ్రామ ఫీడర్లో పని చేస్తున్నాడు. గురువారం లక్ష్మీపాలెం గ్రామ ఫీడర్‌కు సంబంధించి రెగ్యులర్ లైన్‌మ్యాన్ రాకపోవడంతో మల్లికార్జునను అక్కడకు పంపించారు. ఓ స్తంభం ఎక్కి మరమ్మతు పనులు చేస్తున్న క్రమంలో విద్యుత్ ప్రసారం కావడంతో అతడు మృతి చెందాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని మల్లికార్జున బంధువులు ఆగ్రహంతో మృతదేహాన్ని తీసుకెళ్లి బద్వేలు లోని 33కేవీ సబ్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. -
ఇసుక లారీ-ఆటో ఢీ.. యువకుడి మృతి
వేగంగా వెళ్తున్న ఇసుక లారీ ఆటోను ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా మంగపేట మండలం చుంచుపల్లి సమీపంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వేంగంగా వెళ్తున్న లారీ రోడ్డు దాటుతున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న మల్లికార్జున(25) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీశైలం మలన్న సన్నిధిలో రాశి
-
మళ్లీ రావయ్యా! మల్లికార్జునయ్యా..
మదనపల్లె: ఇక్కడ ఫొటోలో తలకు క్యాప్ పెట్టుకుని, నీలిరంగు చొక్కాను టక్ చేసుకుని, సీరియస్‌గా నీళ్లకు బండరాళ్లను అడ్డం వేస్తున్న వ్యక్తిని చూస్తే ఏమనిపిస్తుంది?.. చూడటానికి చదువుకున్నోడిలా ఉన్నాడనో, మరెవరో అనుకుంటున్నారు కదూ! నిజానికి ఆయన మదనపల్లె సబ్ కలెక్టర్ డాక్టర్ ఏ.మల్లికార్జున. వ్యవసాయ నేపథ్యం కలిగిన కుటుంబం ఆయనది. బదిలీ అయినప్పటికీ విధులను నిబద్ధతతో నిర్వర్తించి, తా నూ రైతు బిడ్డనే అని పరోక్షంగా చాటారు. భారీ వర్షాలకు మండలంలోని పలు చెరువులు ప్రమాదస్థితికి చేరాయి. బుధవారం వీటిని ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డితో కలసి సబ్‌కలెక్టర్ పరిశీలించారు. మండలంలోని పెద్ద మొరవ అధ్వానంగా ఉండడడంతో నీరు వృథాగా పోతోంది. ఇది చూసి సబ్‌కలెక్టర్ ఇరిగేషన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం స్పందించారు. నీరు వృథా కాకుండా చర్యలకు ఉపక్రమించారు. ఫ్యాంటును పాదంపై వరకూ మడిచారు. అక్కడ ఉన్న బండరాళ్లను తానే స్వయంగా మోసుకొచ్చి, నీటికి అడ్డుకట్టగా వేయసాగారు. ఇది చూసి తక్కిన ఆయనతో వచ్చిన ఇతర సిబ్బంది తామూ ఓ చెయ్యి వేశారు. వాళ్లు రాళ్లు అందిస్తూంటే దెబ్బతిన్న మొరవ కట్టపై వరుసగా పేర్చి, నీటిని నిలువరించసాగారు. విషయం తెలుసుకున్న ఆయకట్టు రైతులు అక్క డి చేరుకుని ఆయన శ్రమలో పాలు పంచుకునేందుకు ఉద్యుక్తులయ్యారు. వారిపై కూడా సబ్ కలెక్టర్ మండిపడ్డారు. ‘ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్పలేదు సరే..రైతులుగా ఉండి మీరేం చేస్తున్నారు?.. మొరవ పరిస్థితి ఇలా ఉంటే మా దృష్టికి తీసుకురావాలనే ఆలోచన కూడా లేదా?’ అంటూ చీవాట్లు పెట్టడంలో రైతులు నోరెళ్ల బెట్టారు.! ఇప్పటివరకూ ఇలాంటి అధికారిని తాము చూడలేదని, సబ్ కలెక్టర్ బదిలీ అయినా రైతు సంక్షేమమే ముఖ్యం అన్నట్లుగా ఆయన మాట్లాడారని ఆయకట్టుదారులతో పాటు ఎమ్మెల్యే కూడా ప్రశంసించకుండా ఉండలేకపోయారు. -
అమ్మా..ఈ నరకం నాకొద్దు
భర్త వేధింపులు భరించలేను సూసైడ్ నోట్ రాసి వివాహిత ఆత్మహత్య మదనపల్లె : మదనపల్లెలో ఓ వివాహిత సూసైడ్ నోట్ రాసి మంగళవారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. మదనపల్లె పట్టణం దిగువకమ్మపల్లెకు చెందిన రామ్మూర్తి, లక్ష్మిదేవి దంపతుల కుమార్తె శోభన(25) ఎంఏ బీఈడీ చదివింది. 2012 ఆగస్టు 12న పుంగనూరు మండలం చెర్లోపల్లికి చెందిన మల్లికార్జునతో ఈమెకు వివాహం చేశారు. అప్పట్లో రూ.3 లక్షల నగదు, కొంత బంగారా న్ని కట్నంగా ఇచ్చారు. అప్పట్లో మల్లికార్జున సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటూ నమ్మించాడు. తర్వాత ఇక్కడే కంప్యూటర్ షాపు పెట్టివ్వాలని డిమాండ్ చేశాడు. కూతురు కళ్ల ముందే ఉంటుందని ఆ దంపతులు స్థానికంగా ఒక కంప్యూటర్ షాపు పెట్టించారు. వారం తిరక్కనే షాపును అమ్మేసి హైదరాబాద్‌లో ఉద్యోగం వచ్చిందని వెళ్లిపోయాడు. అక్కడ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యను వేధించేవాడు. రెండేళ్ల కిందట అతనిపై వరకట్న వేధింపు కేసు కూడా నమోదైంది. అప్పట్లో రాజీ పడిన ఇతను మళ్లీ వేధించడం మొదలు పెట్టాడు. రెండు రోజుల క్రితం రూ.1 లక్ష నగదు, కొంత బంగారు తేవాలని గొడవ చేశాడు. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఆమె లేఖ రాసి ఇంట్లోనే ఉరి వేసుకుంది. దగ్గరుంటావనుకుంటే దూరమైపోయావా తల్లీ..అంటూ శోభన తల్లి లక్ష్మిదేవి కన్నీటిపర్యంతమైంది. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. -
నిందితుడి ఇంటి ముందే శవం పూడ్చివేత
తనకల్లు (అనంతపురం): ఓ యువకుడిని హత్య చేసిన వారిలో పశ్చాత్తాపం కలిగేలా మృతుడి బంధువులు స్పందించారు. హత్యారోపణలు ఎదుర్కొంటున్న ఓ నిందితుని ఇంటి ముందే మృతదేహాన్ని ఖననం చేశారు. అనంతపురం జిల్లా తనకల్లు మండలం మోటిచింతమానుతండాలో రెండు రోజుల క్రితం జరిగిన ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం మేరకు... ఈ నెల 3న తండాకు చెందిన వేణుగోపాల్ నాయక్‌ను కొందరు వ్యక్తులు హత్య చేసి సీజీ ప్రాజెక్టులో పడేశారు. హత్య విషయం వెలుగులోకి వచ్చిన మరుసటి రోజు అదే తండాకు చెందిన రవీంద్రనాయక్, మల్లికార్జున నాయక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు హత్య చేసినట్లు ఆధారాలను కూడా గుర్తించారు. దీంతో వేణుగోపాల్‌నాయక్ బంధువులు కోపంతో రగిలిపోయారు. శవాన్ని పోస్టుమార్టమ్ చేసి ఆదివారం తండాకు తీసుకువచ్చారు. మృతదేహాన్ని నిందితుడు మల్లికార్జున నాయక్ ఇంటి ఎదురుగా సమాధి చేశారు. హత్య చేసిన వారికి నిత్యం ఆ పాపం గుర్తుకు వచ్చి పశ్చాత్తాపం కలగాలని ఈ విధంగా చేసినట్లు తండా వాసులు చెబుతున్నారు. -
ఆక్రమణలపై ఆరా
కందుకూరు : తీగ లాగితే డొంక కదిలింది. పట్టణంలోని అంకమ్మ దేవాలయం ఇరువైపులా ఉన్న స్థలాల ఆక్రమణపై అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. ఆక్రమణలపై ‘సాక్షి’ కథనాలు, స్థానిక ఎమ్మెల్యే పోతుల రామారావు ఆగ్రహం, స్థానికుల నుంచి వ్యతిరేకత వెరసి అక్రమార్కుల గుట్టురట్టయింది. శుక్రవారం ‘సాక్షి’లో ‘దేవుని పేరుతో దౌర్జన్యం’ శీర్షికతో జిల్లా టాబ్లాయిడ్ ఏడో పేజీలో ప్రచురించిన కథనానికి అధికారుల్లో చలనం వచ్చింది. అదే రోజు రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి దేవాలయానికి ఇరువైపులా ఉన్న స్థలాలను సబ్ కలెక్టర్ మల్లికార్జున పరిశీలించారు. ప్రధాన రోడ్డును ఆనుకుని ఉన్న దుకాణాల్లోని వ్యాపారుల వద్దకు వెళ్లి విచారించారు. నెలనెలా అద్దెలు ఎవరికి ఇస్తున్నారని సబ్ కలెక్టర్ ప్రశ్నించగా వారు దివి లింగయ్యనాయుడికి ఇస్తున్నామని చెప్పారు. ఆ వివరాలన్నీ సబ్ కలెక్టర్ నమోదు చేసుకున్నారు. ఆర్టీసీ డిపో ప్రవేశ ద్వారం నుంచి అంకమ్మ దేవాలయం ముఖ ద్వారం వరకు ఉన్న వ్యాపారుల నుంచి అధికారులు స్టేట్మెంట్లు రికార్డు చేశారు. అనంతరం సబ్‌కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ అంకమ్మ దేవాలయానికి ఇరువైపులా ఉన్న ఖాళీ స్థలం మొత్తం మున్సిపాలిటీదేనని అక్కడి వ్యాపారులతో చెప్పారు. ఈ స్థలాలపై వచ్చే ఆదాయం కూడా దానికే చెందాలన్నారు. ఈ స్థలాలపై సమగ్ర విచారణ కోసం ఓ ట్రైనీ కలెక్టర్‌ని నియమిస్తామని ఆయన స్పష్టం చేశారు. పది రోజుల లోపు విచారణ చేసి స్థలాలకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. అదే విధంగా ప్రతి దుకాణానికి మున్సిపాలిటీ తరఫున రసీదులు ఇచ్చి పన్నులు వసూలు చేయాలని మున్సిపల్ కమిషనర్ రమణకుమారిని ఆదేశించారు. టీడీపీ నేత తిట్ల పురాణం సబ్‌కలెక్టర్ విచారణకు వచ్చి వెళ్లిన త ర్వాత టీడీపీ పట్టణ అధ్యక్షుడు రంగంలోకి దిగారు. ఆక్రమణలపై అధికారులు స్పందించారని తె లుసుకుని ఊగిపోయారు. స్థానిక ఎమ్మెల్యేపై అనవసరంగా నోరుపారేసుకున్నారు. అధికారులను సైతం ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. స్థలాలన్నీ దేవాలయానికి సంబంధించినవేనని అడ్డగోలుగా మాట్లాడారు. ఐఏఎస్ స్థాయి అధికారి వచ్చి స్థలాలన్నీ మున్సిపాలిటీవేనని చెప్పిన తర్వాత కూడా సదరు నేత వ్యవహరించిన తీరుపై స్థానికులు ముక్కున వేలేసుకున్నారు. -
సాగులో ‘సహకార’o
ముథోల్ : సహకార సంఘం ఆ గ్రామ రైతులను అభివృద్ధి వైపు నడిపిస్తోంది. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు తక్కువ ధరకే విక్రయిస్తూ మరికొందరు రైతులకు చేయూతనిస్తోంది. పంటలకు వచ్చే తెగుళ్లు, చీడపీడలపై అవగాహన కల్పిస్తూ.. సూచనలు, సలహాలు అందిస్తూ ఆసరాగా నిలుస్తోంది. మండలంలో ని ఎడ్బిడ్ గ్రామంలో 2007 జనవరి మొదటి వారంలో 36 మంది రైతులు కలిసి మల్లికార్జున పరస్పర సహకార పొదుపు సంఘం ఏర్పాటు చేసుకున్నారు. సభ్యత్వ నమోదు కోసం రూ.వెయ్యి, రూ.1,500 చొప్పున చెల్లించారు. ఈ సంఘానికి చైర్మన్‌తోపాటు తొమ్మిది మంది డెరైక్టర్లను ఎన్నుకున్నారు. ప్రతి నెల ఒక్కో సభ్యుడి నుంచి రూ.50 చొప్పున సేకరించి పొదుపు చేస్తున్నారు. ప్రతీ నెల ఐదో తేదీన సమావేశం ఏర్పాటు చేసి సంఘం కార్యకలాపాలపై సమీక్షిస్తారు. ఇలా పొదుపు చేసిన డబ్బులతో రూ.15లక్షలు వెచ్చించి సంఘ భవనాన్ని నిర్మించారు. 36మంది సభ్యులతో ప్రారంభమైన ఈ సంఘంలో ప్రస్తుతం 46 మంది సభ్యులు ఉన్నారు. నాలుగేళ్లలో సంఘానికి పొదుపు, ఇతర వనరుల ద్వారా రూ.కోటీ 50లక్షలు సమకూరిందని సంఘం అధ్యక్షుడు నర్సారెడ్డి తెలిపారు. -
కేన్సర్ కాటు
వారికి ఇద్దరు కుమార్తెలు.. ఇద్దరు కుమారులు.. కుమార్తెలకు ఎలాగోలా పెళ్లి చేశారు.. కుమారుల సాయంతో బతుకుబండి సాగుతోంది.. ఇంతలో విధి వారితో ఆడుకోవడం మొదలు పెట్టింది.. చిన్న కుమారుడు నరేష్‌కుమార్‌కు జబ్బు చేసింది.. పరీక్షల్లో బోన్ కేన్సర్ అని తేలింది.. పైసాపైసా కూడబెట్టిన సొమ్ముతో నరేష్‌కుమార్‌కు ఆపరేషన్ చేయించారు. కొద్దికొద్దిగా కోలుకుంటుండగానే మరో షాక్.. పెద్ద కుమారుడు మల్లికార్జునకు పేగు కేన్సర్ చివరి దశలో ఉన్నట్లు వైద్యుల రిపోర్ట్.. ఆ కుటుంబానికి నోట మాట రాలేదు.. కొద్ది రోజులకే కేన్సర్‌తో పోరాడలేక మల్లికార్జున కన్ను మూశాడు.. పెద్ద కుమారుడితో పాటు ఆ కుటుంబం ఉన్నదంతా పోగోట్టుకుంది.. అయినా విధికి ఆ కుటుంబంపై పగ చల్లారలేదు.. ఈసారి ఇంటిపెద్దపైనే కేన్సర్ గురిపెట్టింది.. బోన్కేన్సర్ ముదిరిపోవడంతో ఇంటిపెద్ద మనోహర్ పెద్ద కుమారుడి వద్దకే వెళ్లిపోయాడు. భర్తను.. పెద్ద కుమారుడిని పోగోట్టుకున్న నాగలక్ష్మి చిన్నకుమారుడు నరేష్కుమార్పైనే ప్రాణాలు పెట్టుకుంది.. విధి తన కాఠిన్యాన్ని మానలేదు.. బోన్కేన్సర్ నుంచి తప్పించుకున్నావు.. ఇప్పుడు చూడు... అంటూ కంటి కేన్సర్‌ను ప్రయోగించింది.. ప్రస్తుతం నరేష్కుమార్ కంటి కేన్సర్‌తో పోరాటం చేస్తున్నాడు.. పెనిమిటిని.. పెద్దకొడుకును బలి తీసుకుని చిన్నకుమారుడిని కూడా కాటేయాలని కేన్సర్ చూస్తుండటంతో ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోతోంది.. -
వీరయోధునికి ఘన నివాళి
యాదగిరి, న్యూస్‌లైన్ : గుల్బర్గాలో ఈనెల 8న జరిగిన ఎన్కౌంటర్లో గ్యాంగ్‌స్టర్ మున్నాను మట్టి కరిపించి.. ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఎస్ఐ మల్లికార్జున బండె కన్నుమూశారు. ఆయన హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో.. ముఖ్యంగా హైదరాబాద్-కర్ణాటకలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్యాంగ్‌స్టర్ ఎన్కౌంటర్లో ఎస్ఐ మల్లికార్జున బండెతో పాటు ఇద్దరు ఏఎస్ఐలు తీవ్రంగా గాయపడిన సంగతి విదితమే. తలలోకి తుపాకీ గుళ్లు దూసుకుపోవడంతో కోమాలోకి వెళ్లిన మల్లికార్జున బండెకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఆయన త్వరగా కోలుకోవాలని రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది ప్రార్థనలు చేశారు. అయితే మంగళవారం రాత్రి ఆయన మరణ వార్త వెలువడిన వెంటనే కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బుధవారం గుల్బర్గాలో అప్రకటిత బంద్ వాతావరణం ఏర్పడింది. యజమానులు స్వచ్ఛందంగా తమ దుకాణాలు బంద్ చేసి.. బండె మృతికి సంతాపం సూచించారు. హైదరాబాద్-కర్ణాటకలో బీదర్ నుంచి మొదలుకుని గుల్బర్గా, యాదగిరి, రాయచూరుతో పాటు అన్ని చోట్ల పలువురు ప్రముఖులు, సంఘ సంస్థల నుంచి బండె వీర మరణానికి సంతాపం వ్యక్తం చేశారు. ముందు జాగ్రత్తగా గుల్బర్గా నగరంతో పాటు ఆళంద, జేవర్గి పట్టణాల్లో బుధ, గురువారాల్లో 144 సెక్షన్‌ను అమలు చేస్తూ గుల్బర్గా ఉపవిభాగం అసిస్టెంట్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్తగా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా బండెకు సకాలంలో వైద్య చికిత్సలు అందించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ అభిమానులు, కన్నడ సంఘాల కార్యకర్తలు బుధవారం గుల్బర్గాలో టైర్లకు నిప్పంటించి నిరసన తెలిపారు. నగరంలోని శాస్త్రి సర్కిల్లో గుమికూడిన అభిమానులు గుల్బర్గా ఎస్పీ అమిత్‌సింగ్‌ను ఘెరావ్ చేసి మల్లికార్జున బండె భౌతికకాయాన్ని సత్వరం తెప్పించాలని డిమాండ్ చేశారు. -
ఆ వాల్వ్... నష్టకారణం
జడ్చర్ల,న్యూస్‌లైన్: జడ్చర్ల సమీప పోలేపల్లి సెజ్‌లోనున్న హెటిరో ఫార్మాలో అగ్నిప్రమాదం సంభవించి నిర్వాహకులకు రూ.15 కోట్ల నష్టాన్ని మిగిల్చిన తీరుకు అందులో ఉన్న వాటర్‌వాల్వ్ సమయానికి పనిచేయకపోవడమే కారణంగా తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం రెండుగంటలకు విద్యుదాఘాతం కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లు అంచనావేస్తున్నారు. అయితే దీన్ని తీవ్రత తగ్గించేందుకు యత్నించినా పరిశ్రమలోని వాటర్‌వాల్వ్ సకాలంలో తెరుచుకోలేదు. దీంతో మంటలను ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బంది నాలుగు గంటల సేపు కష్టపడాల్సి వచ్చింది. సుమారు 500మంది సిబ్బంది పరిశ్రమ ప్రాంగణంలోనే ఉన్నారు. వారెవరికీ ఎలాంటి ఇబ్బందీ తలెత్తలేదు. ఆ 35నిమిషాల్లోనే: జనరల్ బ్లాక్‌లో గల 4వ యూనిట్లో తొలుత చిన్నగా ఉన్న మంటలను ప్రారంభంలోనే ఆర్పేందుకు చేసిన ప్రయత్నం ఫలించనట్లు తెల్సింది. వాటర్ వాల్వ్ తెరుచుకునేందుకు దాదాపుగా 35 నిమిషాలకు పైగా ఆలస్యం కావడంతో ఆలోగా యూనిట్ విబాగం మొత్తం ప్రమాదంలో చిక్కుకుంది.అ యితే ఎలాంటి ప్రాణ నష్టం జరగక పోవడం ఊరటనిచ్చే అంశం. మంటలు తీవ్రస్థాయికి చేరి పరిసర ప్రాంతాలవారిని భయభ్రాంతులకు గురిచేసింది. మంటలను ఆర్పేందుకు కావలసిన నీరు అందుబాటులో లేక కొంత మేరజాప్యమైంది.ఈ లోగా అక్కడికి సమీపంలో ఉన్న అరబిందో ఫార్మా కంపెనీ సహకారంతో వారి పరిశ్రమలోని నీటిని మంటలను ఆర్పేందుకు వినియోగించారు. ఫైర్ స్టేషన్లకు సమాచారం ఇచ్చినా దాదాపు గంటన్నర అనంతరం గానీ సంఘటనా స్థలానికి చేరుకోలేక పోయాయి. తొలుత షాద్‌నగర్ నుండి వచ్చిన ఫైర్ ఇంజన్ రంగంలోకి దిగింది.అనంతరం నాగర్‌కర్నూల్,మహబూబ్‌నగర్‌లనుండి కూడా ఫైర్ ఇంజన్లను రప్పించారు. ఫైర్ ఇంజన్లకు తోడు పరిశ్రమలోని సంపు నుండి,ఇతరత్రా నీటితో మంటలను ఆర్పే ప్రయత్నాలు చేశారు. మరోవైపు జేసీబీలను రప్పించి పరిశ్రమ గోడలను బద్దలు కొట్టి నీటిని చిమ్మడంతో సాయంత్రం 6గంటల సమయానికి మంటలు అదుపులోకి వచ్చాయి.అద్దాలను బద్దలు కొట్టి ముందస్తుగా గోడలను నీటితో తడిపేశామని పరిశ్రమ మేనేజర్ భాస్కర్‌రెడ్డి ఈ సందర్బంగా విలేకరులకు వెళ్లడించారు. ప్యాకింగ్ మెటీరియల్ పూర్తిగా దగ్ధమైనట్లు తెలిపారు. మొత్తం నష్టం రూ.15కోట్లు ఉంటుందని డీఎస్పీ మల్లిఖార్జున ఆద్వర్యంలోని బృందం తేల్చింది. సీఐలు వెంటకరమణ,శ్రీనివాస్‌రెడ్డి,ఫైర్ అధికారి గిరిధర్‌రెడ్డి ,తహసీల్దార్ అమరేందర్,పోలేపల్లి సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి,తదితరులు ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు.మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మల్లురవి సంఘటనస్థలాన్ని పరిశీలించారు.