
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేస్తున్న ఆస్పత్రులకు రూ.235.94 కోట్లు చెల్లించినట్టు ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ ఎ.మల్లికార్జున ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 719 నెట్‌వర్క్ ఆస్పత్రులకు ఏప్రిల్ 15 నాటికి ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు సమర్పించిన బిల్లులకుగాను 195.36 కోట్లు, ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద 584 నెట్‌వర్క్ ఆస్పత్రులకు మార్చి 15 నాటికి ఇచ్చిన బిల్లులకుగాను రూ.40.58 కోట్లు కలిపి మొత్తం రూ.235.94 కోట్లు చెల్లించామన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసే ఆస్పత్రులకు ఎప్పటికప్పుడు నిధులు చెల్లిస్తున్నట్టు తెలిపారు.
ఆస్పత్రులకు నోటీసులు కోవిడ్ బాధితులకు ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స అందించని ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసినట్లు ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు. మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో విజయవాడలోని నిమ్రా ఆస్పత్రి, ఆంధ్ర ఆస్పత్రులు కోవిడ్ బాధితులకు చికిత్స అందించడంలో సరిగా స్పందించడం లేదని తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ రెండు ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. కోవిడ్ సమయంలో ఏ ప్రైవేటు ఆస్పత్రి అయినా పేద ప్రజలకు చికిత్సలు అందించాల్సిందేనని, ఆరోగ్యశ్రీ కింద 50 శాతం పడకలు ఇవ్వకపోయినా, చికిత్సలు చేయకపోయినా అలాంటి ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment