YSR Aarogyasri Scheme
-
బాబు హయాంలో కన్నా.. YSRCP హయాంలో తలసరి ఆదాయం పెరిగింది
-
ఆరోగ్యశ్రీకి చంద్రబాబు సర్కార్ తూట్లు: విడదల రజిని
సాక్షి, గుంటూరు: వైద్య రంగంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. పేదల సంక్షేమం కోసం వైఎస్సార్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీని చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వైఎస్ జగన్ హయాంలో ప్రతి ఏడాది ఆరోగ్యశ్రీ కోసం రూ. 3 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు.‘‘ఆరోగ్యశ్రీపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోంది. వైఎస్సార్సీపీ హయాంలో ఆసుపత్రి పెండింగ్ బిల్లులను చెల్లించాం గత ప్రభుత్వం ఆసుపత్రులకు బకాయిలు పెట్టిందని కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేయడం సరికాదు. జనవరిలోపు ఆసుపత్రులకు ఉన్న బకాయిలను అన్ని చెల్లించాం. బాబు పెట్టిన బకాయిలను కూడా మేం క్లియర్ చేశాం. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఆరోగ్యశ్రీకి తూట్లు పొడుస్తుంది. సాకులు చెప్తూ ఆరోగ్యశ్రీని ఎగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పేదవారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఆరోగ్యశ్రీ పరిధిని రూ.25 లక్షల వరకు వైఎస్ జగన్ పెంచారు.’’ అని విడదల రజిని గుర్తు చేశారు.‘‘పెండింగ్ బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదే. ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలంటూ కేంద్ర మంత్రి పెమ్మసాని చెబుతున్నారు. చంద్రబాబు మనస్సులో మాటలనే మంత్రులు చెబుతున్నారా అన్న అనుమానం కలుగుతోంది. ఆరోగ్యశ్రీలో రూ. 25 లక్షల వరకూ లిమిట్ పెంచాం. ఆయుష్మాన్ భారత్‌లో పరిధి కేవలం ఐదు లక్షలే. ఆయుష్మాన్ భారత్ ద్వారా కేవలం మూడు వందలు కోట్లు మాత్రమే ఇస్తున్నారు. పేదవారు ఇబ్బంది పడకూడదనే ఆరోగ్య శ్రీ, ఆరోగ్య ఆసరా అందించాం. ఆరోగ్యశ్రీపై ప్రస్తుత ప్రభుత్వ విధానమేంటో సీఎం వెల్లడించాలి’’ అని విడదల రజిని డిమాండ్ చేశారు.‘‘మొదటి విడతలో ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించాం. వచ్చే నెలలో మరో ఐదు కాలేజ్ లు ప్రారంభించేందుకు మా హాయాంలో అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రస్తుత ప్రభుత్వం వచ్చే నెలలో ఐదు మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్స్ ప్రారంభిస్తారో లేదో స్పష్టత ఇవ్వాలి. ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని మా హాయాంలో తీసుకొచ్చాం. మారుమూల గ్రామాల్లో ఉన్న రోగులకు ఎంతగానో ఈ విధానం ఉపయోగపడింది. ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని కొనసాగిస్తారా? లేదా?’’ అంటూ విడదల రజిని ప్రశ్నించారు. -
AP: ఆరోగ్యశ్రీ ఆగలేదు.. అయినా అసత్య ప్రచారమే!
సాక్షి, విజయవాడ: ఏపీ వ్యాప్తంగా డా.వైఎస్సార్ ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగుతున్నాయి. ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయినా కూడా నిలిచిపోయాయంటూ ఎల్లో మీడియా తప్పుడు కథనాలు ఇస్తోంది. రెండు రోజుల క్రితం నెట్ వర్క్ ఆసుపత్రులకి 200 కోట్ల బకాయిలు విడుదల చేసింది. మిగిలిన బకాయిల విడుదలపై ఇప్పటికే సీఎస్ జవహర్ రెడ్డి, వైద్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు, ఆరోగ్యశ్రీ సిఈవో లక్ష్మీ షాతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే.. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం రూ.3566 కోట్లు చెల్లించింది. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో నెట్ వర్క్ ఆసుపత్రులకు తొలి రెండు నెలలలో రూ.366 కోట్ల చెల్లింపులు చేసింది. ఇక ఏడాది కాలంగా రోజుకి సరాసరిన 5349 మందికి ఆరోగ్యశ్రీలో చికిత్సలు జరిగాయి. మొన్న(మే 22, బుధవారం) 6718 మందికి.. నిన్నన(మే 23, గురువారం) 7118 మందికి ఆరోగ్యశ్రీలో చికిత్సలు అందాయి. ఈ విషయాన్ని ఆరోగ్యశ్రీ సీఈవో లక్ష్మీ షా తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం కలిగించవద్దన్న పిలుపుకి నెట్ వర్క్ ఆసుపత్రులు సహకరిస్తున్నాయని ఆయన వెల్లడించారు. పొరుగు రాష్ట్రాలలోనూ ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతున్నాయని.. ఆరోగ్యశ్రీ సేవలకు ఎక్కడా అంతరాయం లేదని లక్ష్మీషా స్పష్టం చేశారు. -
యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు
సాక్షి, అమరావతి: డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద పేద, మధ్య తరగతి రోగులకు యథావిధిగా ఉచిత చికిత్సలు అందుతున్నాయి. పథకం సేవలు నిలిపివేసినట్టు కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రకటనలు చేశాయి. కాగా, ఎక్కడా పథకం సేవలు నిలిచిపోలేదని ముఖ్య కార్యనిర్వహణ అధికారి(సీఈవో) డాక్టర్ లక్ష్మీషా బుధవారం తెలిపారు.ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం కింద 3,257 ప్రొసీజర్లలో నగదు రహిత చికిత్సను అందిస్తున్నట్టు తెలిపారు. ఇలా ప్రతి కుటుంబానికీ వార్షిక చికిత్స పరిమితి రూ.25 ల„ý ల వరకూ ఉందన్నారు. గత ఆరి్థక సంవత్సరం(2023–24)లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి రూ.3,566.22 కోట్లు నెట్వర్క్ ఆస్పత్రులకు జమ చేశారు. బుధవారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి అన్ని ఆస్పత్రులకు రూ.203 కోట్ల బిల్లులు చెల్లించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మొదటి రెండు నెలల్లోనే రూ.366 కోట్లు చెల్లించినట్లయింది. మిగిలిన బకాయిలనూ త్వరలోనే విడుదల చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఐదేళ్లలో వైద్య శాఖలో 54 వేల పోస్టుల భర్తీ కొన్ని ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటనలిస్తున్న క్రమంలో పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్య సేవల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని జిల్లా కలెక్టర్లకు వైద్య శాఖ ఆదేశాలిచ్చింది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలంది. ఆరోగ్యశ్రీ లబ్ధిదారుల వైద్య సేవలకు అంతరాయం కలిగించే ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు అసౌకర్యం కలగకుండా చూడాలని సూపరింటెండెంట్లకు సూచించింది. గత ఐదేళ్లలో 54 వేల మేర వైద్య శాఖలో పోస్టులు భర్తీ చేశారు. దీంతో ఆస్పత్రుల్లో పూర్తి స్థాయిలో వైద్యులు ఉన్నారు. -
AP: ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అంతరాయం కలిగిస్తే ఆసుపత్రులపై చర్యలు
సాక్షి, విజయవాడ: ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అంతరాయం కలిగిస్తే ఆ ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ సేవలు బ్రేక్ కాకుండా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ‘‘పెండింగ్ నిధులపై పట్టుబడుతూ ఆరోగ్యశ్రీ సేవలకు కొన్ని చోట్ల నెట్ వర్క్ ఆసుపత్రులు బ్రేక్ వేశాయి. 2023-24లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి 3,566.22 కోట్లు నెట్ వర్క్ ఆసుపత్రులకు జమ చేశాం. గతంలోని హామీ ప్రకారం ఇప్పటికే 203 కోట్లు విడుదల చేశాం. 2024-25 మొదటి రెండు నెలల్లో ఇప్పటివరకు రూ.366 కోట్లు విడుదల చేశాం. గత ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ ద్వారా 42.91 లక్షల మందికి వైద్యసేవలు అందించాం ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 13,471 కోట్లు ఖర్చు చేశాం.. మిగిలిన బకాయిలు త్వరలోనే విడుదల చేస్తాం’’ అని ట్రస్ట్ సీఈవో లక్ష్మీషా వెల్లడించారు. -
గుండె ఘోష విన్నారు..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంభవిస్తున్న మరణాల్లో 32.4 శాతం గుండె సంబంధిత వ్యాధుల కారణంగానే ఉంటున్నాయి. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ)లో గుండె జబ్బులదే అగ్రస్థానం. ఈ క్రమంలో ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కలిగిన సీఎం వైఎస్ జగన్ మునుపెన్నడూలేని రీతిలో ఎన్సీడీ నిర్వహణపై పక్కా ప్రణాళికతో అడుగులు వేశారు. ఇందులో భాగంగా.. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయిలో ప్రభుత్వాస్పత్రుల ఆధునీకరణ సహా అనేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రధానంగా గుండె జబ్బులు, క్యాన్సర్ తదితర పెద్ద జబ్బులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. కార్డియాలజీ, కార్డియో వాసు్క్యలర్ సేవలను మరింతగా విస్తృతం చేసి, ప్రజలకు చేరువ చేస్తూ ఎమర్జెన్సీ కార్డియాక్ కేర్ (ఈసీసీ) కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఇందులో భాగంగా గుండెపోటు బాధితులకు గోల్డెన్ అవర్‌లో చికిత్స అందించి బాధితుల ప్రాణాలను కాపాడింది. నగరాలకు దూరంగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు గుండెపోటు బారినపడితే తొలి 40 నిమిషాల్లోనే ఈ కార్యక్రమం ద్వారా ప్రాథమిక వైద్య సేవలు లభించేలా చర్యలు తీసుకున్నారు. హబ్ అండ్ స్పోక్ విధానంలో ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నారు. సామాన్యులకూ అందుబాటులోకి హార్ట్‌కేర్ సర్వీసులు.. తిరుపతి రుయా ఆస్పత్రిలో 2022 జనవరి నుంచి పైలెట్ ప్రాజెక్టుగా ఈ ఈసీసీ నడుస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లో గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం జీజీహెచ్‌లను హబ్‌లుగా తీర్చిదిద్ది కార్యక్రమాన్ని విస్తరించారు. నాలుగు చోట్ల కార్డియాలజిస్ట్ వైద్యులతో పాటు, క్యాథ్‌ల్యాబ్ సౌకర్యం ఉంది. హబ్‌లకు ఆయా జిల్లాల పరిధిలోని 69 స్పోక్స్ (సెకండరీ హెల్త్ సర్వీసెస్ ఆస్పత్రులు)ను అనుసంధానంచేసి హార్ట్‌కేర్ సర్వీసులను సామాన్యులు, గ్రామీణులకు అందుబాటులోకి తెచ్చారు. అనంతరం అన్ని జీజీహెచ్‌లను హబ్‌లుగా, సెకండరీ హెల్త్ ఆస్పత్రులను స్పోక్స్‌గా తీర్చిదిద్ది రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాన్ని అమలులోకి తెచ్చారు. స్పోక్స్‌గా వ్యవహరించే ఆస్పత్రుల్లో ఛాతినొప్పి, ఇతర గుండెపోటు లక్షణాలతో వచ్చిన వ్యక్తులకు వెంటనే ఈసీజీ తీస్తున్నారు. ఆ ఫలితాన్ని హబ్‌లో ఉన్న కార్డియాలజిస్ట్‌కు పంపుతున్నారు. కార్డియాలజిస్ట్‌లు సంబంధిత కేసు గుండెపోటుదా కాదా అని నిర్ధారించి గుండె రక్తనాళం ఎంత శాతం పూడుకుపోయిందో పరిశీలించి థ్రాబోలైసిస్ థెరపీని సూచిస్తున్నారు. ఇలా సూచించిన కేసుల్లో రూ.40 వేల విలువ చేసే థ్రాంబోలైసిస్ ఇంజక్షన్‌ను బాధితులకు ఉచితంగా ఇస్తున్నారు. గతేడాది సెప్టెంబరు 29 నుంచి ఇప్పటివరకూ 3 వేల మందికి పైగా ఛాతినొప్పితో స్పోక్స్‌కు రాగా వారికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో గుండె రక్తనాళం 100 శాతం పూడిపోవడంతో వచ్చే ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియాల్ ఇన్ఫార్క్షన్ (స్టెమీ) సమస్యతో బాధపడుతున్న 489 మందికి వెంటనే థ్రాంబోలైసిస్ నిర్వహించారు. వీరిలో 424 మంది క్షేమంగా ఉన్నారు. సకాలంలో వైద్యసాయం అందకపోయినట్లయితే వీరందరూ కూడా మృత్యువాత పడేవారని వైద్యులు చెబుతున్నారు. భవిష్యత్‌లోనూ మరింత రక్షణ.. మరోవైపు.. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా బీపీ, షుగర్, ఇతర ఎన్సీడీ వ్యాధిగ్రస్తుల ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షించారు. గుండె జబ్బులకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ ఆస్పత్రుల్లో పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించారు. ఐదేళ్లలో 3.67 లక్షల గుండెపోటు బాధితులకు ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు చేశారు. ఇందుకు రూ.2,300 కోట్లకు పైగా వెచ్చించారు. మరింత సమర్థవంతంగా గుండెపోటు మరణాలను నియంత్రించడానికి ఈసీసీను అమలులోకి తెచ్చారు. ఇక వచ్చే ప్రభుత్వంలో గుండె సంబంధిత వైద్యసేవల కోసం విశాఖ, కర్నూలు, గుంటూరుల్లో హబ్‌లు ఏర్పాటుచేస్తామని వైఎస్సార్సీపీ 2024 మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. -
Fact Check: రుచీపచీ లేని రాతలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలు మారాయి. అత్యాధునిక వైద్యం అందుతోంది. గ్రామాలు, వార్డుల చెంతకు వైద్యం చేరింది. డాక్టర్లే ప్రజల గుమ్మం వద్దకు వచ్చి ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. మందులకు కొదవ లేదు. విలేజ్, వార్డు క్లినిక్‌లు ఏర్పడ్డాయి. ఇక ప్రధానాసుపత్రుల్లో సేవలు కార్పొరేట్ స్థాయిని తలపిస్తున్నాయి. గడచిన ఐదేళ్ల సీఎం జగన్ పాలనలో నాడు–నేడు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ బలోపేతం, డైట్ చార్జీల పెంపు ఇలా అనేక సంస్కరణలతో ప్రభుత్వాస్పత్రులు అభివృద్ధి చెందాయి. ప్రభుత్వ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచి్చన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో అభిమానం వెల్లువెత్తుతోంది. ఇది రుచించని ఈనాడు రామోజికి ఆసుపత్రుల్లో అందిస్తున్న రుచికరమైన భోజనం నచ్చలేదు. తన బాబు పాలనలో రుచీపచీలేకుండా వండినా, ఆ ఐదేళ్లలో రోగుల మెనూ ఛార్జీ రూ.40 మించకపోయినా, మూడుపూటలా భోజనం అందించకపోయినా ఈ ‘పచ్చ’రోగికి వెచ్చగా ఉంది. జగన్ పాలనలో మెనూ చార్జి రూ.80కి పెంచి రుచితో పాటు పౌష్టికాహారాన్ని అందిస్తున్నా రామోజీకి చప్పగానే ఉంది. అందుకే ‘బటన్ల బడాయి.. రోగుల బువ్వకూ బకాయి’ అంటూ రుచీపచీలేని ఓ కథనాన్ని వండేశారు. బాబు పాలనలో ఇదీ గతీ 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం ఒక్కో రోగికి రూ.40తో భోజనం పెట్టేది. ఇది కూడా 2011లో నిర్దేశించిన ఖర్చు. ఇంత తక్కువ ధరతో ఎలా వీలవుతుందన్న ఆలోచన కూడా అప్పట్లో బాబుకు రాలేదు. ఆ ఐదేళ్లలో ఒక్కసారి కూడా డైట్ చార్జీల పెంపుపై బాబు దృష్టి పెట్టిన పాపాన పోలేదు. రోజులో ఒక పూట మాత్రమే కోడిగుడ్డు అందించేవారు. ఇక అప్పట్లో వైద్య సేవల గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. గుంటూరు జీజీహెచ్‌లో చిన్నారిని ఎలుకలు కొరికి చంపిన దుర్ఘటనే బాబు పాలనలో కునారిల్లిన వైద్య రంగానికి పెద్ద నిదర్శనం. జగన్ పాలనలో ఇదీ పురోగతి 2019లో సీఎం జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఈ క్రమంలో ఆస్పత్రుల్లో చేరిన రోగులు త్వరగా కోలుకోవాలంటే నాణ్యమైన వైద్య సేవలతో పాటు, పౌష్టికాహారం అవసరమని గుర్తించారు. ఇందులో భాగంగా రూ.80కు డైట్ చార్జీలను పెంచారు. రోగులకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అందించేందుకు ప్రత్యేకంగా ఒక మెనూ రూపొందించారు. రూ.100 తో గర్భిణులకు నిర్దేశించిన మెనూతో పాటు, అదనంగా చిక్కీలు, రాగి జావ, టీబీ, ఎయిడ్స్, మానసిక రోగులకు హై ప్రొటీన్ డైట్‌ను అందిస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు పూటలా రోగులందరికీ కోడిగుడ్డు ఇస్తున్నారు. మెనూలో మార్పులు ఇలా టీడీపీ ప్రభుత్వంలో రోగికి రోజుకు మూడు పూటలా ఆహారం కోసం రూ.40 బ్రేక్ ఫాస్ట్: బ్రెడ్, పాలు మధ్యాహ్న భోజనం: అన్నం, సాంబారు, వెజ్ కర్రీ, గుడ్డు, అరటిపండు, మజ్జిగ రాత్రి భోజనం: అన్నం, సాంబారు, వెజ్ కర్రీ, మజ్జిగ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రోగికి రోజుకు మూడు పూటలా ఆహారం కోసం రూ.80 ఖర్చు బ్రేక్ ఫాస్ట్: ఉప్మా, కిచిడీ, ఇడ్లీ, పొంగలి, కోడిగుడ్డు, పాలు మధ్యాహ్న భోజనం: అన్నం, సాంబారు, ఆకుకూర పప్పు, అరటిపండు, మజ్జిగ, వెజ్ కర్రీ, గుడ్డు రాత్రి భోజనం: అన్నం, సాంబారు, పప్పు, అరటిపండు, మజ్జిగ, వెజ్ కర్రీ, సంగటి, చపాతీ(డయాబెటీస్ రోగులకు), గుడ్డు -
Fact Check: బాబు హయాంలో తుస్...జగన్ పాలనలో భేష్!
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రామోజీ పైత్యం పరాకాష్టకు చేరుతోంది. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గంటూ ఈనాడులో ‘పచ్చ’ రోతలు పెచ్చుమీరుతున్నాయి. బాబు హయాంలో వ్యవస్థ మొత్తం భ్రష్టుపట్టినా వేలెత్తి చూపేందుకు మనసురాని పచ్చ పత్రికలకు జగన్ హయాంలో జరిగే మంచి కూడా పాపంలా కనిపిస్తోంది. ఏపీలో వైద్యరంగాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న ఆయన సంస్కరణలు వారికి ఘోరంలా గోచరిస్తున్నాయి. కొత్తగా 17 వైద్య కళాశాలలు రాష్ట్రంలో ఏర్పాటు చేసి అందులో ఐదింటిని ప్రారంభించినా ప్రశంసించలేక... పగబడుతున్నాయి. ఐదేళ్లలో వైద్య రంగం స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తే... అది తమ వారు చేయలేకపోయారన్న దుగ్ధతో క్షుద్ర రాతలకు తెగబడుతున్నాయి. ‘తెలంగాణ లో భేష్.. ఏపీలో తుస్’ అంటూ ఇక్కడి బోధన ఆస్పత్రులపై నికృష్ట కథనాన్ని అచ్చేశాయి. సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. వీలైనంత పెద్ద సంఖ్యలో అబద్ధాలను అచ్చేయాలి. ఎలాగైనా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెంచాలి. తద్వారా తమకు అనుకూలురైన పచ్చనేతలకు పట్టంగట్టాలి. ఇదే లక్ష్యంతో ఎలాంటి దారుణానికైనా వెనుకాడకూడదని రామోజీ సారధ్యంలో నడుస్తున్న ఈనాడు నిర్ణయించుకున్నట్టుంది. ఇందుకోసం రోజురోజుకూ అత్యధిక సంఖ్యలో తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నాయి. 2014–19 మధ్య రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగం పడకేసిన సందర్భంలోనూ సీఎంగా తన మనిషి ఉండటంతో ఆహా ఓహో ఏపీ వైద్య రంగం అంటూ రామోజీరావు బాకాలు ఊదారు. గడచిన ఐదేళ్లలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో వైద్య, ఆరోగ్యశాఖలో 53 వేలకు పైగా పోస్టులను భర్తీ చేయడంతో పాటు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించారు. 17 వైద్య కళాశాలల ఏర్పాటుకు చర్యలు చేపట్టి ఐదు కళాశాలలను ఇప్పటికే ప్రారంభించడంతో పాటు, మరో ఐదు త్వరలో ప్రారంభించనున్నారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్ విధానం, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి ప్రజల గుమ్మం వద్దకే వైద్య సేవలను చేరువ చేశారు. కేవలం ఐదేళ్లలో వైద్య రంగం ఇంతగా పురోగమిస్తే బాబుకు రాజకీయ భవిష్యత్ ఉండదనే ఉద్దేశంతో నిస్సిగ్గుగా ఈనాడులో దిగజారుడు రాతలు రాస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ కంటే మనమే మెరుగు ప్రజలకు వైద్యపరంగా అండగా నిలవడంలో పక్కనున్న తెలంగాణాతో పాటు, దేశంలోనే అగ్రస్థానంలో ఏపీ ఉంటోంది. మధ్యతరగతి వర్గాలకు సైతం ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు అందిస్తున్న రాష్ట్రంగా ఏపీని నీతి ఆయోగ్ సైతం కీర్తించింది. రూ.5 లక్షలలోపు వార్షికాదాయం గల కుటుంబాలన్నీ నేడు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నాయి. రూ.25 లక్షల వరకూ వైద్య సేవలను ఉచితంగా పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్రం కన్నా మిన్నగా ఆరోగ్యశ్రీ పథకాన్ని సీఎం జగన్ ప్రభుత్వం అమలు చేస్తోంది. రక్తహీనత నివారణ, డిజిటల్ వైద్య సేవల కల్పన, జాతీయ ప్రమాణాలు కలిగిన ఆస్పత్రుల సంఖ్య పరంగా, ఇలా వివిధ అంశాల్లో తెలంగాణా ఏపీ కంటే వెనుకే ఉంది. వైద్య విద్యకు పట్టం అధికారంలోకి వచ్చాక ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తామని 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. ఆ మేరకు 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. జాతీయ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా ప్రణాళికబద్ధంగా అడుగులు వేశారు. తొలుత ఐదు జిల్లా ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేయడం ద్వారా రాజమహేంద్రవరం, ఏలూరు, విజయనగరం, నంద్యాల, మచిలీపట్నం వైద్య కళాశాలలకు అనుమతులను రాబట్టారు. తద్వారా ఈ ఏడాది 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి వస్తున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం పాడేరు, పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నారు. మిగిలిన 7 వైద్య కళాశాలలను అందుబాటులోకి తెచ్చేలా సన్నద్ధమయ్యారు. మూడేళ్లలో 17 కొత్త మెడికల్ కాలేజీలు మన రాష్ట్రంలోనూ ఏర్పాటు కానున్నాయి. కరోనా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటూనే వైద్య రంగంలో సంస్కరణలన్నింటినీ ప్రస్తుత ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్రంలో చిన్న పిల్లలకు మెరుగైన వైద్య సదుపాయాల అవసరాలను గుర్తించి టీటీడీ ఆధ్వర్యంలో శ్రీపద్మావతి చిన్న పిల్లల హృదయాలన్ని ప్రారంభించారు. చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులోకి తెస్తూ రూ. 450 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. దాని నిర్మాణం దాదాపు పూర్తయింది. కానీ చిన్న పిల్లల ఆస్పత్రులకు ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపలేదని ఈనాడు తప్పుడు రాతలతో జనాన్ని నమ్మించేందుకు యత్నిస్తోంది. బాబు పాలనలోనే నీరుగార్చారు గత తెలుగుదేశం పాలనలో రాష్ట్రంలో వైద్యరంగం పూర్తిగా కుదేలైంది. ఆరోగ్యశ్రీ మూలకు చేరింది. వైద్యకళాశాలల ఊసే లేదు. అదే సమయంలో పక్కనున్న తెలంగాణ ప్రభుత్వం నాలుగు కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడంతోపాటు, భవిష్యత్తులో మరిన్ని కళాశాలల ఏర్పాటుకు వీలుగా 25 సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రులను జిల్లా ఆస్పత్రులుగా అప్‌గ్రేడ్ చేస్తూ పడకల సంఖ్యను పెంచింది. 2018లోగా ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేసింది. అప్పట్లో తీసుకున్న చర్యలు 17 కొత్త వైద్య కళాశాలలకు అనుమతులు వచ్చేందుకు దోహదపడ్డాయి. పక్క రాష్ట్రంలో కళాశాలల ఏర్పాటుకు ముందు చూపుతో అడుగులు వేస్తున్నా.. బాబు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగి కూడా రాష్ట్ర ప్రయోజనాలను నీరుగార్చారు. ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ వైద్య రంగాన్ని పట్టించుకోకుండా ప్రైవేట్ వైద్య కళాశాలలను ప్రోత్సహిస్తూ వైద్య విద్యను వ్యాపారంగా మార్చేశారు. అయినా అవేవీ ఈనాడుకు... దానిని నడిపిస్తున్న రామోజీరావుకు ‘కమ్మ’గానే కనిపించాయి. వైఎస్సార్సీపీ హయాంలో పురోగతి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో రాష్ట్ర వైద్య శాఖ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఏకంగా 53 వేలకుపైగా పోస్టులను ఐదేళ్లలో భర్తీ చేశారు. అంతేకాకుండా వైద్య శాఖలో నియామకాల కోసమే ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటుతో పాటు, ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ చేపట్టేలా అత్యవసర ఉత్తర్వులు ఇచ్చారు. స్పెషలిస్ట్ వైద్యులు 4500 మేర, మెడికల్ ఆఫీసర్లు 2500కు పైగా, 6700కు పైగా నర్సుల పోస్టులను భర్తీ చేశారు. ఇంతలా చర్యలు తీసుకుంటే బోధనాస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత ఉంటోందని రామోజీరావు రోత రాతలు రాసుకొచ్చారు. -
కేన్సర్ కొమ్ము వంచేలా!
సాక్షి, అమరావతి: మహిళల్లో చాపకింద నీరులా కమ్ముకొస్తున్న బ్రెస్ట్ (రొమ్ము) కేన్సర్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనిపై అవగాహన లేకపోవడంతో మహిళల్లో కొందరు ఈ కేన్సర్ బారినపడుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి సోకిన వారిలో దాదాపు 60 శాతం మంది వ్యాధి ముదిరిన తర్వాతే వైద్యుల వద్దకు పరుగు తీస్తున్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గ్రామస్థాయిలో కేన్సర్ స్క్రీనింగ్ ప్రారంభించింది. ప్రభుత్వాస్పత్రుల్లో రొమ్ము కేన్సర్ నిర్థారణ సదుపాయాలను మెరుగుపరిచింది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద కేన్సర్ బాధితులందరికీ ఉచితంగా వైద్యసేవలు అందిస్తోంది. ఏఎన్ఎంలు, సీహెచ్‌వోలు, ఫ్యామిలీ డాక్టర్ల ద్వారా ఈ జబ్బు లక్షణాలతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహిళల్లో అవగాహన కల్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న బాధితులు దేశంలో ఏటా రెండు లక్షల మందికి పైగా మహిళలు రొమ్ము కేన్సర్ బారిన పడుతున్నారు. ఈ విషయాన్ని ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ లోక్‌సభలో వెల్లడించింది. నేషనల్ కేన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ గణాంకాల ప్రకారం 2019 నుంచి 2023 మధ్య దేశంలో 8,37,935 మంది మహిళలు రొమ్ము కాన్సర్ బారినపడ్డట్టు వెల్లడైంది. వీరిలో 3.92 లక్షల మంది బాధిత మహిళలు మృత్యువాత పడ్డారు. గత ఏడాదిలోనే దేశంలో 2,21,579 మంది మహిళల్లో ఈ జబ్బు కొత్తగా నిర్థారణ కాగా.. 82,429 మంది మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. 2023లో దేశంలోనే అత్యధికంగా యూపీలో 30,781, తమిళనాడులో 15,931, బిహార్‌లో 15,555 చొప్పున కొత్త కేసులు వెలుగు చూశాయి. ఇదిలా ఉండగా ఏపీలో 11,921 కేసులు గత ఏడాది నమోదయ్యాయి. పక్కనున్న కర్ణాటకలో 14,484, తెలంగాణలో 8,066, కేరళలో 8,874 చొప్పున కొత్త కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రంలోని పరిస్థితులను గమనించిన ప్రభుత్వం కేన్సర్‌ను తొలి దశలోనే గుర్తించి తక్షణ చికిత్సలు చేయించడం ద్వారా కేన్సర్ నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. 2 జిల్లాల్లో పైలెట్ కార్యక్రమం కేన్సర్ నియంత్రణ చర్యల్లో భాగంగా పెద్దఎత్తున స్క్రీనింగ్ చేపట్టి ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించి చికిత్సలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా మరణాలను అరికట్టేలా ప్రణాళికలు రచించాం. ఇప్పటికే కేన్సర్ స్క్రీనింగ్ పైలట్ కార్యక్రమం అనకాపల్లి, తిరుపతి జిల్లాల్లో అమలవుతోంది. భవిష్యత్‌లో రాష్ట్రవ్యాప్తంగా స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రభుత్వం విస్తరించబోతోంది. – ఆర్.రమేశ్‌బాబు, నోడల్ అధికారి రాష్ట్ర కేన్సర్ నియంత్రణ కార్యక్రమం క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకోవాలి కుటుంబంలో ఎవరికైనా రొమ్ము కేన్సర్ ఉంటే ఆ కుటుంబంలోని మహిళలు 20 ఏళ్ల వయసు నుంచే స్వయంగా రొమ్ములను పరీక్షించుకోవాలి. క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. ఇలా చేయడం ద్వారా కేన్సర్ కణితిని ప్రారంభ దశలోనే గుర్తించడానికి వీలుంటుంది. రొమ్ము పరిమాణంలో మార్పులు, చెయ్యి పెట్టినప్పుడు గడ్డ స్పష్టంగా తగలడం, నొప్పి కలగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. వయసు మళ్లిన అనంతరం పెళ్లిళ్లు, పిల్లలకు పాలు పట్టకపోవడం, ఊబకాయం వంటి కారణాలు రొమ్ము కేన్సర్‌కు దారితీస్తుంటాయి. ఇలాంటి మహిళలు ముందస్తు జాగ్రత్తలను పాటించాలి. – ఎంజీ నాగకిశోర్, సర్జికల్ అంకాలజిస్ట్, గుంటూరు -
30 లక్షల మందికి సేవల దిశగా ఆరోగ్య సురక్ష–2
సాక్షి, అమరావతి: ప్రజారోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్కరి ఆరోగ్య సమస్యను పరిష్కరించే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష (జేఏఎస్)’ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. 30 లక్షల మందికి వైద్య సేవల దిశగా రెండో దశ ఆరోగ్య సురక్ష కార్యక్రమం (జేఏఎస్–2) కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైన రెండో దశ కార్యక్రమంలో నిర్దేశిత షెడ్యూల్ మేరకు గ్రామాలు, వార్డుల్లో శిబిరాలను ఏర్పాటు చేసి, స్పెషలిస్ట్ వైద్యుల ద్వారా ప్రభుత్వం ప్రజలకు సేవలందిస్తోంది. ప్రతి జిల్లాలో సగం మండలాల్లో మంగళవారం, మిగిలిన సగం మండలాల్లో శుక్రవారం శిబిరాలు నిర్వహిస్తున్నారు. పట్టణ, నగరాల్లో బుధవారం శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో మండలంలో గ్రామీణంలో వారానికి ఒక గ్రామం చొప్పున, పట్టణాల్లో ఒక వార్డు చొప్పున ఆరు నెలల్లో రాష్ట్రం మొత్తం శిబిరాలను నిర్వహించేలా కార్యాచరణ రూపొందించారు. ఒక్కో శిబిరంలో సగటున 362 మందికి సేవలు జేఏఎస్ –2 లో రాష్ట్రవ్యాప్తంగా 13,954 శిబిరాలను నిర్వహించనున్నారు. ఇప్పటివరకూ 7,974 శిబిరాలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో 5,929 శిబిరాలు, పట్టణ ప్రాంతాల్లో 2,045 నిబిరాలు నిర్వహించారు. ఒక్కో శిబిరంలో సగటున 362 మంది చొప్పున 28,79,408 మందికి ఇప్పటివరకూ వైద్య సేవలందించారు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 1.63 లక్షలు, నంద్యాలలో 1.51 లక్షలు, వైఎస్సార్ జిల్లాలో 1.44 లక్షల మంది ప్రజలు వైద్యం చేయించుకున్నారు. వైద్య పరీక్షల నిర్వహణకు 7 రకాల కిట్లను, ఈసీజీ, ఇతర పరికరాలను, వందల సంఖ్యలో మందులను శిబిరాల్లో అందుబాటులో ఉంచారు. శిబిరాలకు వద్దకు వచ్చి సేవలు అందుకున్న వ్యక్తుల్లో సుమారు 13 వేల మందికి ఆస్పత్రుల్లో చికిత్సలు అవసరమని వైద్యులు నిర్ధారించి, దగ్గరలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రెఫర్ చేశారు. వారందరినీ ఆస్పత్రులకు తరలించి వైద్య సేవలందించేలా స్థానిక పీహెచ్సీ వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే 5 వేల మంది ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందుకున్నారు. ప్రజలకు సొంత ఊళ్లలోనే స్పెషలిస్ట్ వైద్య సేవలందించేందుకు 543 మంది జనరల్ మెడిసిన్, 645 మంది గైనకాలజీ, 349 మంది జనరల్ సర్జన్లు, 345 ఆర్థోపెడిక్, 378 మంది ఇతర స్పెషలిస్ట్ వైద్యులు, 3 వేల మంది వరకూ వైద్యులు, కంటి సమస్యల గుర్తింపునకు 562 మంది ఆప్తాల్మిక్ ఆఫీసర్లు పనిచేస్తున్నారు. -
‘న్యూరాలజీ’ బాధితులకు భరోసా
సాక్షి, అమరావతి: మణికంఠ, యోగేంద్ర తరహాలో అనారోగ్యం బారినపడిన నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వ్యక్తులకు ఆరోగ్యశ్రీ పథకం అండగా నిలుస్తోంది. చేతి నుంచి చిల్లిగవ్వ ఖర్చు పెట్టే పని లేకుండానే పూర్తి ఉచితంగా ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ స్ట్రోక్, మెదడులో రక్తం గడ్డకట్టడం వంటి జబ్బుల బాధితులతో పాటు, రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులకు న్యూరో, న్యూరో సర్జరీ విభాగాల్లో ఖరీదైన చికిత్సలు ఉచితంగా అందుతున్నాయి. న్యూరో, న్యూరో సర్జరీ విభాగాల్లో 1.46 లక్షల మందికి మేలు 2019 నుంచి ఇప్పటి వరకూ ఆరోగ్యశ్రీ కింద న్యూరో, న్యూరో సర్జరీ విభాగాల్లో 1,46,345 మంది ఉచితంగా చికిత్సలు పొందారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.572.23 కోట్లు వెచ్చించింది. ఇందులో 77,190 మంది న్యూరాలజీ, 69,155 మంది న్యూరో సర్జరీ విభాగాల్లో చికిత్సలు అందుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక పథకం బలోపేతంలో భాగంగా బెంగళూరు, హైదరాబాద్ వంటి ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ సేవలు అందుబాటులోకొచ్చాయి. దీంతో న్యూరో, న్యూరో సర్జరీ సమస్యల బాధితులు ఆయా నగరాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా చికిత్సలు పొందుతున్నారు. మరోవైపు చికిత్స అనంతరం ఆస్పత్రులకు డిశ్చార్జ్ అయిన రోగులకు వైద్యులు సూచించిన విశ్రాంత సమయానికి వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద భృతిని సైతం ప్రభుత్వం అందిస్తోంది. దీంతో విశ్రాంత సమయంలో రోగులకు ఆర్థిక ఇబ్బందులు తప్పుతున్నాయి. జబ్బుల బారినపడిన నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలను ఆరోగ్య శ్రీ సంజీవనిలా ఆదుకుంటోంది. 2019కు ముందు బాబు పాలనలో నీరుగారిపోయిన పథకాన్ని సీఎం జగన్ విప్లవాత్మక సంస్కరణలతో బలోపేతం చేశారు. రూ.25 లక్షలకు వైద్య సేవల పరిమితిని పెంచడంతో పాటు.. 1059 నుంచి 3257కు ప్రొసీజర్లనూ పెంచారు. నెట్వర్క్ ఆస్పత్రులను విస్తరించారు. దీంతో 2019 నుంచి ఇప్పటి వరకూ ఏకంగా 44.78 కోట్ల మంది రూ.13,004 కోట్ల విలువ చేసే వైద్య సేవలు పొందారు. 22 లక్షల మందికి పైగా బాధితులకు చికిత్స అనంతరం రూ.1,300 కోట్లకు పైగా ఆసరా సాయాన్ని ప్రభుత్వం అందించింది. 3.67 లక్షల మంది గుండె జబ్బు, 3.03 లక్షల మంది క్యాన్సర్ రోగులు ఉచిత వైద్య సేవలు అందుకున్న వారిలో ఉన్నారు. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం నారువానిపల్లెకు చెందిన వెంకటరామయ్యది నిరుపేద వ్యవసాయ కుటుంబం. 2021లో రామయ్య దంపతుల ఎనిమిదేళ్ల కుమారుడు యోగేంద్ర ఇంటి వద్ద ఆడుకుంటూ కళ్లు తిరిగిపడిపోయాడు. దగ్గర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళితే గుంటూరుకు తీసుకెళ్లాలని చెప్పారు. గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. బ్రెయిన్ ఎన్యూరిజం రప్చర్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ అరుదైన జబ్బుకు ప్రభుత్వం ఉచితంగా చికిత్స చేయించింది. ఈ ఫోటోలో వైద్యుల మధ్య బెడ్‌పై ఉన్న గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గొడవర్రుకు చెందిన దానబోయిన మణికంఠ ఆటోడ్రైవర్. కొంతకాలంగా మూర్చ సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో ఆటోను సక్రమంగా నడపలేక జీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. గతేడాది డిసెంబర్ 29న ఫిట్స్ వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చికిత్స కోసం కుటుంబ సభ్యులు గుంటూరులోని బ్రింద న్యూరో సెంటర్‌కు తీసుకెళ్లారు. మెదడులో కుడి వైపు, కుడిచెయ్యి, గొంతు, నాలుక, దంతాలు, దవడ, మాటలు వచ్చే భాగం, ముఖానికి నరాలు సరఫరా చేసే మెదడులోని భాగంలో ట్యూమర్ ఉన్నట్లు గుర్తించారు. దానిని తొలగించ కుంటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.5 లక్షల ఖరీదైన అరుదైన ఆపరేషన్‌ను పూర్తి ఉచితంగా ఆస్పత్రిలో నిర్వహించారు. అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ల్యాప్‌ట్యాప్‌లో చూపిస్తూ డాక్టర్ భవనం శ్రీనివాసరెడ్డి నిర్వహించిన అరుదైన సర్జరీ అప్పట్లో సంచలనమైంది. ప్రస్తుతం మణికంఠ ఆరోగ్యంగా ఉన్నాడు. -
ప్రతి పేదవాడికి ఫ్యామిలీ డాక్టర్..ఈ స్కిం సాధించిన విజయాలపై గ్రౌండ్ రిపోర్ట్
-
ఆరోగ్య సురక్ష సాధించిన ఘనత కోటి మందికి ఉచిత వైద్యం..
-
"బీరువా లో అన్న ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు ఉంది తీసుకురా.."
-
ఇంటింటికీ రక్ష.. జగనన్న ఆరోగ్య సురక్ష
సాక్షి, అమరావతి: పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య సురక్ష కార్యక్రమం కింద ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ప్రజల ఆరోగ్య సమస్యల్ని ప్రభుత్వం గుర్తించింది. వివిధ రుగ్మతలతో బాధపడుతున్న వారందరికీ ఉచితంగా చికిత్సలు చేయించి సాంత్వన చేకూరుస్తోంది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని సురక్ష క్యాంపుల్లో గుర్తించి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత చికిత్సలు చేయించడంతోపాటు బాధితులపై రవాణా ఖర్చుల భారం కూడా పడకుండా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం భరోసా ఇస్తోంది. చికిత్సల అనంతరం కూడా బాధితులకు బాసటగా నిలుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే బాధితులను చేయిపట్టి సీఎం జగన్ ముందుకు నడిపిస్తూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుస్తున్నారు. విజయవంతంగా 2.O ఆరోగ్య సురక్ష రెండో దశ కార్యక్రమం ఈ ఏడాది జనవరి నెలలో ప్రారంభించగా విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా వైద్య శాఖ 6,710 శిబిరాలు నిర్వహించగా.. ఒక్కోచోట సగటున 359 చొప్పున 24,11,785 మంది వైద్య సేవలు పొందారు. హైపర్‌టెన్షన్, డయాబెటీస్, హెచ్‌బీ, యూరిన్, మలేరియా, డెంగీ సహా ఇతర 32.64 లక్షల స్పాట్ టెస్ట్‌లను శిబిరాల వద్ద నిర్వహించారు. రెండో దశలో భాగంగా శిబిరాల వద్దకు వచ్చిన ప్రజల్లో 8,179 మందికి తదుపరి వైద్య సేవలు అవసరం ఉన్నట్టుగా వైద్యులు నిర్ధారించి ఆస్పత్రులకు రిఫర్ చేశారు. వీరిలో ఇప్పటికే 2,030 మంది ఆస్పత్రుల్లో చికిత్సలు అందుకున్నారు. ఇక 2.13 లక్షల మందికి కంటి స్క్రీనింగ్ చేపట్టగా.. 60 వేల మందికి మందులతో నయమయ్యే సమస్యలను గుర్తించి అక్కడికక్కడే మందులు అందించారు. మరో 1.50 లక్షల మందికి అద్దాలను, 2,090 మందికి కేటరాక్ట్ సర్జరీలను సూచించారు. 98 శాతం మందికి చికిత్సలు పూర్తి గత ఏడాది ఆరోగ్య సురక్ష తొలి దశ కార్యక్రమంలో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 12 వేలకు పైగా శిబిరాలు నిర్వహించింది. వీటిలో 60.27 లక్షల మంది అవుట్ పేషెంట్ సేవలు పొందారు. వీరిలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 86,713 మందిని వైద్యులు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేశారు. వారందరికీ చికిత్సలు చేయించేలా వైద్య శాఖ పర్యవేక్షించింది. వీరిలో ఇప్పటివరకూ 98 శాతం అంటే.. 84,982 మందికి ప్రభుత్వమే చికిత్సలు చేయించింది. చిన్న పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంటేషన్, పుట్టుకతో గుండెలో రంధ్రాలు, ఇతర సమస్యలతోపాటు, పెద్దల్లో న్యూరో, కార్డియాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, వంటి ఇతర సమస్యలకు ఉచిత చికిత్సలు అందించారు. చిత్తూరు, ఏలూరు, కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, పశి్చమ గోదావరి జిల్లాల్లో వంద శాతం మందికి చికిత్సలు చేయించారు. మొత్తం రోగుల్లో 1,731 మందికి చికిత్సలు అందించేలా వైద్య శాఖ పర్యవేక్షిస్తోంది. కాగా.. తొలి దశలో కంటి సమస్యలతో బాధపడుతున్న 80,155 మందికి కేటరాక్ట్ సర్జరీలు అవసరమని వైద్యులు సూచించగా.. 41633 మందికి ఇప్పటికే సర్జరీలు పూర్తి అయ్యాయి. 5.73 లక్షల మందికి కళ్లద్దాలు అవసరమని గుర్తించగా.. 5.63 లక్షల మందికి పంపిణీ పూర్తయింది. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దండిగుంట గ్రామానికి చెందిన రైతు అనిల్ దంపతులకు ముగ్గురు సంతానం. రెండో కుమార్తె మధుప్రియ గ్రహణం మొర్రితో పుట్టడంతో వెంటనే తిరుపతిలోని బర్డ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ నిర్వహించిన వైద్య పరీక్షల్లో మధుప్రియ గుండెకు రంధ్రం కూడా ఉన్నట్టు నిర్ధారణ అయింది. పాప పెద్దయ్యాక గానీ ఆపరేషన్ చేయడానికి వీలుండదని అప్పట్లో చెప్పారు. ప్రస్తుతం మధుప్రియకు మూడేళ్లు నిండాయి. పాప గుండెకు ఆపరేషన్ చేయించాలనుకుంటున్న తరుణంలో ప్రభుత్వం ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా వైద్య సిబ్బంది నిర్వహించిన ఇంటింటి సర్వేలో మధుప్రియ సమస్యను తల్లిదండ్రులు తెలియజేశారు. దీంతో వైద్య శిబిరానికి హాజరవ్వమని చెప్పారు. గ్రామంలో శిబిరం నిర్వహించిన రోజు పాపను తీసుకు వెళ్లగా వైద్యులు తొలుత నెల్లూరు ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడి నుంచి మధుప్రియను తిరుపతిలోని చిన్న పిల్లల హృదయాలయానికి తరలించారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్ పూర్తయింది. బాలిక పూర్తిగా కోలుకుంది. మధుప్రియ తరహాలోనే వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వేలాది మందికి ఆరోగ్య సురక్ష వరంగా మారింది. -
తల్లీబిడ్డా ప్రాణాలు నిలిపిన ఆరోగ్య శ్రీ
-
పోకిరి సినిమా చూపిస్తూ ఆపరేషన్ చేసిన డాక్టర్లు..ఆపరేషన్ సక్సెస్..
-
జగన్ నాకు పునర్జన్మ ఇచ్చాడు..క్యాన్సర్ తో బయటపడ్డ
-
ఆరోగ్యశ్రీ సేవలపై విషంచిమ్ముతూ ఈనాడు కథనం
-
ఆరోగ్యశ్రీతో 3,67,305 మందికి పునర్జన్మ
గుండె పోటు అనగానే ఎవరికైనా సరే సగం ప్రాణాలు పోతాయి. మిగతా సగం ప్రాణాలు పోకుండా కాపాడుకోవాలంటే వెంటనే అత్యుత్తమ వైద్యం అందాలి. ఇది జరగాలంటే చేతిలో కనీసం రెండు మూడు లక్షల రూపాయలుండాలి. డబ్బులున్నోళ్లయితే వెంటనే కార్లో వెళ్లి కార్పొరేట్ ఆస్పత్రిలో జాయినైపోతారు. మరి రెక్కాడితే కానీ డొక్కాడని పేదల పరిస్థితి ఏమిటి? ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందేనా? ఇదంతా గతం. గత టీడీపీ ఐదేళ్ల దుర్మార్గపు పాలనలో, మనసు లేని పాలకుల హయాంలో ఇలాగే జరిగేది. ఇప్పుడా పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడా లేదు. నేనున్నానంటూ ‘వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’ రూపంలో సీఎం వైఎస్ జగన్ గుండె గుండెకూ భరోసా ఇస్తున్నారు. ఇలా ఇప్పటిదాకా వంద కాదు.. వెయ్యి కాదు.. లక్ష కాదు.. ఏకంగా 3.67 లక్షల మందికి పునర్జన్మ ఇచ్చారు. ఇంతటి మేలు ఏపీ మినహా ఏ రాష్ట్రంలోనూ జరగలేదనడం పచ్చి నిజం. అతనో ఆటో డ్రైవర్.. పేరు పొందూరు విజయ్ కుమార్.. ఊరు పార్వతీపురం. వచ్చే ఆదాయం ఇంట్లో వాళ్లు మూడు పూటలా తినడానికి కూడా సరిగా సరిపోదు.. ఒకరోజు ఉన్నట్టుండి ఛాతిలో నొప్పి రావడంతో వైద్యుడి వద్దకు వెళ్లాడు. గుండెలో మూడు రక్తనాళాలు మూసుకుపోయినట్లు గుర్తించి, వెంటనే బైపాస్ సర్జరీ చేయాలని చెప్పారు. ఆ మాట వినగానే అతడు వణికిపోయారు. తానిక బతకనంటూ కుటుంబ సభ్యుల ఎదుట కన్నీరు పెట్టుకున్నాడు. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఏం చేయాలో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతుంటే.. ‘ఏదో ఒక పెద్దాసుపత్రికి వెంటనే వెళ్లిపోండి.. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్ చేస్తారు’ అని అక్కడి వారు చెప్పారు. విశాఖ మెడికవర్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఇతనికి వెంటనే రెండున్నర లక్షల రూపాయల ఆపరేషన్‌ను ఉచితంగా చేశారు. రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తూ వైఎస్సార్ ఆసరా కింద రూ.10,000 అందజేశారు. ఇప్పుడు చక్కగా ఆటో తోలుకుంటూ ఆనందంగా జీవిస్తున్నాడు. –సాక్షి, అమరావతి 3.67 లక్షల మందికి పునర్జన్మ 2019 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,67,305 మంది గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు అందుకున్నారు. వీరికి 4,87,303 ప్రొసీజర్లలో చికిత్సలు అందించడానికి ప్రభుత్వం ఏకంగా రూ.2,229.21 కోట్లు ఖర్చు చేసింది. కాగా, 3.67 లక్షల మందిలో 2,22,571 మంది యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, హార్ట్ స్ట్రోక్, స్టెంట్లు వంటి కార్డియాలజీ సంబంధిత 2.82 లక్షల ప్రొసీజర్లలో చికిత్సలు అందుకున్నారు. మిగిలిన 1,44,734 మంది బైపాస్ సర్జరీలు, వాల్వ్ రిపేర్, కార్డియాక్, కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగంలో 2.05 లక్షల ప్రొసీజర్లలో ఉచిత వైద్య సేవలు అందుకున్నారు. మరో వైపు చికిత్స అనంతరం ఆరోగ్య ఆసరా కింద విశ్రాంత సమయానికి నెలకు గరిష్టంగా రూ.5 వేల వరకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం అరకబద్ర గ్రామానికి చెందిన కె.సాహూ ఇంటి వద్ద చిన్న కొట్టు నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. నిరుపేద కుటుంబం. 2020 డిసెంబర్ 23 అర్ధరాత్రి ఛాతీలో నొప్పి రావడంతో తొలుత బరంపురం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వెంటనే గుండె ఆపరేషన్ చేయాలని చెప్పగా, కుటుంబ సభ్యులు విశాఖకు తీసుకెళ్లారు. ఆరోగ్య శ్రీ కింద అక్కడ ఉచితంగా గుండె ఆపరేషన్ నిర్వహించారు. తర్వాత ఆరోగ్య ఆసరా కింద ప్రభుత్వం రూ.5 వేలు అతని ఖాతాలో జమ చేసింది. గుంటూరు రాజీవ్‌గాంధీనగర్‌లో ఉంటున్న ఆటో డ్రైవర్ రావెల ప్రభాకర్‌దీ అదే పరిస్థితి. రూ.3 లక్షల ఖర్చయ్యే ఆపరేషన్‌ను ఉచితంగా చేయించిన ప్రభుత్వం పునర్జన్మనిచ్చింది. ఇలాంటి వారు తక్కువలో తక్కువ రాష్ట్ర వ్యాప్తంగా ఊరికొకరున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులతో బతికి బట్టకట్టగలిగారు. ఈ పథకమే లేకపోయి ఉండుంటే తామంతా ప్రాణాలతో ఉండే వాళ్లం కాదంటున్నారు. చేతి నుంచి చిల్లిగవ్వ ఖర్చు పెట్టే పని లేకుండా ఖరీదైన గుండె ఆపరేషన్, గుండె మార్పిడి చికిత్సలను సైతం ప్రభుత్వం ఉచితంగా చేయిస్తోంది. ఏపీతో పాటు, రాష్ట్రం వెలుపల చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి. రూ.25 లక్షల వరకు వైద్యం ఉచితం నిరుపేదలు, రూ.5 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాల ప్రజలకు ఒక్క గుండె సంబంధిత చికిత్సలే కాకుండా అనేక రకాల ఆరోగ్య సమస్యల్లో ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు అందిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ ఈ పథకాన్ని విప్లవాత్మకంగా బలోపేతం చేశారు. ఇటీవల వైద్య ఖర్చుల పరిమితిని రూ.25 లక్షలకు పెంచారు. గత ప్రభుత్వంలో 1,059 ప్రొసీజర్లు ఉండగా, వాటిని 3,257కు పెంచారు. 2019 నుంచి ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా కోసం ఏకంగా రూ.13 వేల కోట్లకు పైగానే ఖర్చు చేసింది. 40 లక్షల మందికి ఉచితంగా వైద్య సేవలు అందించారు. కొత్తగా 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు నడుం బిగించారు. ఇందులో ఐదు కళాశాలలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మరో ఐదు వచ్చే ఆర్థిక ఏడాదిలో ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. నాడు–నేడు కింద ప్రభుత్వ ఆస్పత్రులన్నింటినీ అభివృద్ధి చేస్తున్నారు. 53 వేల మందికి పైగా వైద్యులు, వైద్య సిబ్బందిని కొత్తగా నియమించారు. ఉద్దానంలో వైఎస్సార్ కిడ్నీ పరిశోధన కేంద్రం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించారు. ఫ్యామిలీ డాక్టర్ పేరుతో గ్రామీణులకు వైద్యాన్ని మరింత చేరువ చేశారు. వీటన్నింటికీ తోడు వైఎస్సార్ ఆరోగ్య సురక్ష క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలందిస్తున్నారు. తొలి విడత 12,423 శిబిరాలు నిర్వహించి, 60.27 లక్షల మందికి ఓపీ సేవలు అందించారు. రెండవ దశలో ఇప్పటి వరకు 2,838 క్యాంపులు నిర్వహించి, 9.48 లక్షల మందికి వైద్యం అందించారు. దేవుడిలా ఆదుకున్నారు నాకు 71 ఏళ్లు. అరటిపళ్లు, కొబ్బరికాయలు అమ్ముకునే చిరు వ్యాపారిని. ఆయాసంతో బాధ పడుతున్నాను. దీంతో గత ఏడాది ప్రభుత్వం మా ఊళ్లో ఆరోగ్య సురక్ష క్యాంప్ పెట్టినప్పుడు వైద్యులను సంప్రదించా. రాజమండ్రిలో ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లమన్నారు. అక్కడకు వెళ్లగా పరీక్షలు చేసి రక్తనాళాలు పూడిపోయాయని చెప్పారు. బైపాస్ సర్జరీ చేయాలన్నారు. మా అబ్బాయి ఎలక్ట్రికల్ పనులు చేస్తుంటాడు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి మాది. ఈ క్రమంలో బైపాస్ సర్జరీ చేయించుకోవడానికి అప్పులు చేయాల్సి వస్తుందని భయపడ్డాను. ఆరోగ్యశ్రీ పథకం దేవుడిలా అదుకుంది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే అక్టోబర్ 25న సర్జరీ చేయించింది. డిశ్చార్జి అయ్యాక కోలుకునే సమయానికి రూ.9500 భృతి బ్యాంక్ ఖాతాలో జమ చేసింది. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. ప్రభుత్వం మేలును ఎన్నటికీ మరువము. – గుత్తికొండ వెంకటరమణ, తేతలి గ్రామం, పశ్చిమగోదావరి జిల్లా ఆరోగ్యశ్రీ నా ప్రాణం నిలబెట్టింది వీధి వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నాను. 2022 జూన్‌లో ఎక్కువగా గుండె నొప్పి వచ్చింది. ఆస్పత్రికి వెళ్లి చూపిస్తే వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. దీంతో నా గుండె ఆగినంత పనైంది. ముగ్గురు ఆడపిల్లల్లో ఇద్దరికి పెళ్లి చేశాను. ఇంకా ఒక అమ్మాయి ఉంది. రోజంతా రోడ్డు మీద కొబ్బరికాయలు, పళ్లు అమ్మితేనే నోటికి కూడు దక్కుతాది. వచ్చే డబ్బుతో కుటుంబ పోషణ, మూడో అమ్మాయి పెళ్లి ఇలా చాలా సమస్యలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆపరేషన్ అంటే ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీతో డబ్బులు లేకుండానే ఆపరేషన్ చేస్తారని మా ఊరి నర్స్ చెప్పంది. దీంతో శ్రీకాకుళంలో ఆస్పత్రికి వెళ్లగా అక్కడ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్ చేశారు. ఈæ పథకం లేకపోతే.. నాలాంటి పేదోడికి దిక్కేది? ఈ పథకమే నా ప్రాణం నిలబెట్టింది. – బోర రామ్మూర్తి, రాందాస్‌పేట, శ్రీకాకుళం జిల్లా పేదలపై వైద్య ఖర్చుల భారం లేదు రాష్ట్రంలో వైద్యం కోసం పేదలు, మధ్యతరగతి ప్రజలు అప్పులపాలు కాకూడదు అనేది ప్రభుత్వ లక్ష్యం. ఆ మేరకు పథకానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. అర్హులందరికీ ఉచితంగా చికిత్సలు అందేలా చూస్తున్నాం. గుండె, కాలేయం, కిడ్నీ సంబంధిత, క్యాన్సర్ వంటి పెద్ద పెద్ద జబ్బులకు చికిత్సలు పథకం పరిధిలో ఉన్నాయి. సేవలు పొందడంలో ఏవైనా సందేహాలుంటే 104ను సంప్రదించవచ్చు. వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి పథకం గురించి ప్రజలకు వివరిస్తున్నారు. – డి.కె.బాలజీ, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈవో -
నిరంతరాయంగా ఆరోగ్యశ్రీ సేవలు
సాక్షి, అమరావతి: డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం సేవలను యథావిధిగా ప్రజలకు అందిస్తామని, సేవలు నిలిపివేస్తున్నట్లు జరుగుతోన్న ప్రచారంతో తమకు ఏ సంబంధం లేదని ఏపీ ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. తమ అసోసియేషన్ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా 1,150 ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయని వాటిల్లో సేవలు నిరంతరాయంగా అందుతాయని చెప్పారు. ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో సేవలు నిలిపివేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. సీఎం జగన్ ప్రభుత్వం పథకానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రొసీజర్లను భారీగా పెంచడమే కాకుండా, రోగులకు మెరుగైన సేవలు అందించడానికి ఏ మాత్రం రాజీ లేకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. -
ప్రైవేట్ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో సేవలు నిలిపివేస్తున్నట్టు వస్తున్న ప్రచారం నిజం కాదని ప్రకటన
-
డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలని అధికార యంత్రాంగానికి ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశం...ఇంకా ఇతర అప్డేట్స్
-
డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలని అధికార యంత్రాంగానికి ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశం...ఇంకా ఇతర అప్డేట్స్
-
ప్రతి ఒక్కరికీ సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ
-
ఆరోగ్య శ్రీ కార్డుంటే రూ. 25లక్షల వైద్యం చేతిలో ఉన్నట్టే..
-
ఆరోగ్యశ్రీ కార్డుంటే.. రూ.25 లక్షల వైద్యం చేతిలో ఉన్నట్టే
సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్ ఆరోగ్యశ్రీ. ఈ పథకం కింద ప్రభుత్వం రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తోంది. దురదృష్టవశాత్తు కుటుంబంలో ఎవరికైనా జబ్బు చేసినా.. ప్రమాదం సంభవించినా ఈ పథకం కింద ఉచితంగా చికిత్సలు పొందవచ్చు. ఆరోగ్యశ్రీ కార్డు వెంటబెట్టుకుని మీ దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లండి’ అంటూ వైద్య సిబ్బంది ఆరోగ్యశ్రీ పథకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వం ఈ పథకం కింద వైద్య ఖర్చుల పరిమితిని రూ.25 లక్షలకు పెంచింది. ఈ క్రమంలో విస్తరించిన ప్రయోజనాలతో కూడిన కొత్త స్మార్ట్ కార్డులను అందజేస్తూ.. పథకం సేవలు ఎలా పొందాలన్న దానిపై ప్రతి ఒక్కరికీ వివరించేలా ప్రచార కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. సరికొత్త ఫీచర్లతో రూపొందించిన 1.48 కోట్ల స్మార్ట్ కార్డులను వైద్య శాఖ ముద్రించింది. గ్రామ, వార్డు సచివాలయాల వారీగా కార్డుల పంపిణీ చేస్తున్నారు. కాగా.. ఇప్పటివరకు 1,04,326 కార్డుల పంపిణీ పూర్తి అయింది. ఒక్కో వారంలో నియోజకవర్గంలో నాలుగు వరకు గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తూ కార్డుల పంపిణీ కార్యక్రమాలు చేపట్టేలా ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారు. సేవలు పొందడం ఇలా.. ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు పొందడం ఎలా అనే అంశంపై ప్రజాప్రతినిధులు, ఏఎన్ఎం, సీహెచ్‌వో, వలంటీర్లతో కూడిన బృందాలు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరిస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ సేవలను 1,059 రోగాల నుంచి 3,257 రకాల రోగాలను పెంచారు. ఆరోగ్య ఆసరా కింద చికిత్స అనంతరం అందిస్తున్న భృతి, రూ.25 లక్షల వరకూ ఉచిత వైద్య సేవలు పొందగలగటం వంటి ప్రయోజనాలన్నీ ప్రజలకు తెలియజేస్తున్నారు. సులువుగా ప్రజలు పథకం సేవలు పొందడం కోసం ప్రభుత్వం ఆరోగ్యశ్రీ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌ను ప్రతి ఇంటిలో మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేయించి, కుటుంబ సభ్యుల ఐడీ ద్వారా లాగిన్ చేయించి వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. కాగా.. గడచిన వారంలో లక్షకు పైగా లబ్ధిదారుల ఫోన్ల ఆరోగ్యశ్రీ యాప్‌ను డౌన్లోడ్ చేయించారు. యాప్‌లో లాగిన్ అవ్వడం ద్వారా పథకం కింద అందే వైద్య సేవలు, నెట్వర్క్ ఆస్పత్రులు, గతంలో పొందిన చికిత్సల వివరాలను ఏ విధంగా తెలుసుకోవచ్చో ఏఎన్ఎం, సీహెచ్‌వోలు ప్రజలకు వివరించారు. పథకం కింద సేవలు పొందడంలో ఇంకా ఏవైనా అనుమానాలు, సందేహాలు ఉంటే 104కు ఫోన్‌ను ఎలా సంప్రదించాలన్న దానిపైనా అవగాహన కల్పిస్తున్నారు. పనిలో పనిగా మహిళల భద్రత కోసం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం రూపొందించిన దిశ యాప్‌ను మహిళల ఫోన్లో ఇన్స్టాల్ చేయించే కార్యక్రమం చేపడుతున్నారు. ఇప్పటివరకూ దిశ యాప్‌ను ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోని యువతులు, మహిళలు ఉన్నట్లైతే వారి ఫోన్లలో యాప్‌ను డౌన్లోడ్ చేయించి, అత్యవసర సమయంలో యాప్ ఎలా సహాయపడుతుందో వివరిస్తున్నారు. -
సీఎం జగన్ కి రుణపడి ఉంటాం..
-
విశాఖ నార్త్ నియోజకవర్గంలో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ
-
ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల పంపిణీ షురూ
-
తండ్రి స్వప్నాన్ని నిజం చేసిన తనయుడు
వై.ఎస్. రాజశేఖర రెడ్డి పేదల ఆరోగ్యం గురించి ఒక బృహత్తరమైన కలకంటూ అది పూర్తిగా నెరవేరక ముందే అర్ధంతరంగా నిష్క్రమించారు. దాన్ని ఆయన కుమారుడు, ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నెరవేర్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సామాన్య ప్రజలకోసం ‘ఆరోగ్య శ్రీ’ పేరుతో ఒక బృహత్తర కార్యక్రమానికి రూప కల్పన చేశారు. సామాన్యులకు అందని ద్రాక్షగా ఉన్న కార్పో రేట్ స్థాయి వైద్యం వారికి అందుబాటులోకి తెచ్చిన పథకమే ఆరోగ్య శ్రీ. అందులో భాగంగానే అత్యవసర సమయాల్లో, పిలుపు అందగానే రయ్యిమని వచ్చి ప్రమాదాల్లో చిక్కు కున్నవారిని సకాలంలో ఆసుపత్రులకు చేర్చి వారి ప్రాణాలు కాపాడడానికి ఉద్దేశించిన ‘108 అంబులెన్స్ సర్వీసు’, ప్రజల వద్దకే వెళ్లి రోగనిర్ధారణ పరీక్షలు చేసి అవసరమైన మందులు అక్కడికక్కడే ఉచితంగా ఇచ్చే ‘104 సర్వీసు’లు. వీటిని వైఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తూ... ఈ పథకాల ద్వారా ఎలాంటి పరిపూర్ణ ఫలితాలు రాబట్టాలని కల కన్నారో, ఆ స్వప్నం సాకారం కాకుండానే హెలికాప్టర్ ప్రమాదంలో కన్ను మూశారు. ఆయన కన్న కలను నిజం చేసే మహత్తర అవకాశం, వైఎస్ మరణించిన పదేళ్ల తర్వాత 2019లో విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు జగన్ మోహన్ రెడ్డికి లభించింది. ముందు వైఎస్ కన్న కల ఎలాంటిదో చెప్పుకుందాం. రోడ్లు విశాలంగా ఆధునికంగా తయారవుతున్నప్పుడు వాటిపై ప్రయాణించే వాహనాలు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు కూడా పెరుగుతాయి. జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రమాదా లకు గురయి కొసప్రాణంతో కొట్టుమిట్టాడుతూ, అమృత ఘడియల్లో (వైద్య పరిభాషలో గోల్డెన్ అవర్స్) అవసరమైన వైద్యసాయానికి నోచుకోకుండా ఏటా వందల వేల సంఖ్యలో, కలిగినవారు లేనివారు అనే తేడాలేకుండా మృత్యువాత పడు తున్నారు. ఇలాంటి వారికి ప్రాణభిక్ష పెట్టేదే 108 అంబులెన్స్ సర్వీసు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మూడు మైళ్ళదూరంలో నివసించే పేదవారికి కార్పొరేట్ వైద్యం సంగతి సరే, సాధారణ వైద్యం కూడా అందని మావే. షుగర్, బీపీ వంటి రోగాలు వారి శరీరంలో దూరిన సంగతి కూడా వారికి తెలి యదు. ఎందుకంటే వారు తమ జీవితంలో ఎన్నడూ ఆరోగ్య పరీక్షలు చేయించుకుని ఎరుగరు కాబట్టి. అవి ముదిరి పక్ష వాతం, గుండెజబ్బులకు దారితీసినప్పుడు కానీ పరిస్థితి తమ చేయిదాటి పోయిందనే ఎరుక వారికి కలగదు. ఈ నేపథ్యంలో కలిగిన ఆలోచన 104 సర్వీసు. జబ్బులు, రోగాలు చెప్పిరావు. వచ్చిపడిన తరువాత తల తాకట్టు పెట్టయినా వైద్యం చేయించాల్సిన పరిస్థితి. చాలీ చాలని ఆదాయాలతో రోజులు గడిపేవారికి ఆసుపత్రులు, ఖరీ దైన వైద్యం అంటే మాటలు కాదు. అందుకే వైఎస్, ఆరోగ్య శ్రీ అనే పథకానికి రూపకల్పన చేసి అమల్లో పెట్టారు. గుండె జబ్బుల వంటి పెద్ద జబ్బులకు కూడా ఉచితంగా ఆపరేషన్లు చేయించుకోగలిగే అద్భుత అవకాశం పేద ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఇంతటితో సరిపోలేదని వైఎస్ మరిన్ని ఆలోచనలను జత చేస్తూ ఆరోగ్యశ్రీని మరింత మెరుగుపరచి, విస్తరించాలని తలపోశారు. 104 వాహనం ప్రతినెలా ఒక నిర్దిష్టమైన రోజు ప్రతి గ్రామానికీ వెళ్లి బాలింతలు, చూలింతలు, వృద్ధులు, బాల బాలికలకు వైద్య పరీక్షలు చేసి తగిన మందులు ఇస్తుంది. వారి ఆరోగ్య రికార్డులను కంప్యూటర్లలో భద్రపరచి, ఇతర ప్రదేశా లకు వెళ్ళినప్పుడు కూడా ఆ రికార్డుల ద్వారా వైద్య సాయం, చికిత్స పొందడానికి వీలైన ఏర్పాట్లు ఈ పథకంలో పొందుపరచారు. గర్భిణులకు క్రమబద్ధంగా పరీక్షలు చేసి, గర్భస్థ శిశువు పెరుగుదల గమనించి, తదనుగుణంగా వారికి పోషకా హారం అందించడమే కాకుండా, పురుడు వచ్చే రోజును నిర్ధా రించి, 108 అంబులెన్స్‌కు కబురుచేసి, వారికి సకాలంలో ఆసుపత్రులలో పురుడుపోసుకునే వీలు కల్పించాలని అను కున్నారు. అలాగే ప్రసవానంతరం ఆ తల్లీ బిడ్డలను క్షేమంగా ప్రభుత్వ అంబులెన్స్‌లోనే ఇంటికి చేర్చాలనేది కూడా వైఎస్ తలంపు. వైఎస్ కన్న కలలో పూర్తికాని, అమలుకు నోచుకోని ఆయన ఆలోచనలకు వైఎస్ జగన్ తన హయాంలో పూర్తి స్వరూపం కల్పించారని ఆరోగ్య శ్రీ గురించి ఆయన మొన్న చేసిన ప్రకటన చెప్పకనే చెబుతోంది. వైఎస్ స్వప్నం నేరవేర్చ డానికి ఆయన ప్రస్తుతం లభ్యం అవుతున్న అధునాతన కంప్యూటర్ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం హర్షణీయం. విశాలమైన రహదారులూ, రమ్య హర్మ్యాలూ అభివృద్ధికి కొలమానాలు కావచ్చు. అయితే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కూడా కళ్ళకు కనిపించని పురోగతే. తోక టపా: సీనియర్ జర్నలిస్ట్ దారా గోపి తన అనుభవం గురించి ఓసారి చెప్పారు. ఆ ముచ్చట ఆయన మాటల్లోనే: ‘రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆరోగ్యశ్రీ ప్రవేశ పెట్టారు. చాలామంది డబ్బున్నోళ్ళు కూడా ఆరోగ్యశ్రీ కార్డులు తీసుకుని వైద్యం చేయించుకుంటున్నారు. అప్పుడు ఓ సారి ఆయన విజయవాడ వచ్చినప్పుడు నేను ఇదే ప్రస్తావించాను. ఆయన నాకు రెండు ఉదాహరణలు చెప్పారు. 1. వరద వచ్చినప్పుడు ముందుగా చెత్తా చెదారం వస్తుంది. మంచినీళ్ళు ఆ తర్వాతే వస్తాయి. ఈ స్కీం ఇప్పుడే పెట్టాం కాబట్టి చెత్తా చెదారం ఉంటుంది. 2. నేను పేదలకు అన్నదానం అని ప్రకటించా. ఓ పెద్దాయన ప్లేట్ పట్టుకుని వరసలో నుంచుంటే, ఆ ప్లేట్లో అన్నం పెట్టకుండా ఎలా ఉంటాను!?’ భండారు శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల పంపిణీ షురూ
సాక్షి, అమరావతి/పట్నంబజార్ (గుంటూరు) : పేద, మధ్యతరగతి ప్రజలపై వైద్య ఖర్చుల భారం పడకుండా సీఎం జగన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంపై ప్రచార కార్యక్రమంతో పాటు కొత్తగా రూపొందించిన ఆరోగ్యశ్రీ స్మార్ట్‌కార్డుల పంపిణీ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ పథకం కింద వైద్యఖర్చుల పరిమితిని రూ.25 లక్షలకు ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. దీంతో విస్తరించిన ప్రయోజనాలతో కూడిన కొత్త స్మార్ట్‌కార్డులను అందజేస్తూ, పథకం సేవలు ఎలా పొందాలన్న దానిపై ప్రతిఒక్కరికీ వివరించే ప్రచార కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. ఈ ప్రచార, స్మార్ట్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ప్రతి నియోజకవర్గంలో ఎంపిక చేసిన గ్రామాలు, పట్టణాల్లో వార్డులు/డివిజన్లలో ప్రచారం, కార్డుల పంపిణీ చేపట్టారు. సరికొత్త ఫీచర్లతో 1.48 కోట్ల స్మార్ట్‌కార్డులను వైద్యశాఖ ముద్రించింది. ఇంటింటికీ వెళ్లి అవగాహన.. కుటుంబంలో ఎవరికైనా దురదృష్టవశాత్తు జబ్బుచేసినా, ప్రమాదం జరిగినా ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యసేవలు పొందడం ఎలా అనేదానిపై ప్రజాప్రతినిధులు, ఏఎన్ఎం, సీహెచ్ఓ, వలంటీర్లతో కూడిన బృందాలు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రొసీజర్లను 1,059 నుంచి 3,257కు పెంచడం, ఆరోగ్య ఆసరా కింద చికిత్స అనంతరం అందిస్తున్న భృతి, రూ.25 లక్షల వరకూ ఉచిత వైద్యసేవలు ఇలా పథకం ప్రయోజనాలన్నీ ప్రజలకు తెలియజేశారు. ప్రజలు సులువుగా పథకం సేవలు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరోగ్యశ్రీ యాప్‌ను రూపొందించింది. దీనిని ప్రతి ఇంటిలో మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేయించి, కుటుంబ సభ్యుల ఐడీ ద్వారా లాగిన్ చేయించి వినియోగంపై అవగాహన కలి్పంచారు. యాప్‌లో లాగిన్ కావడం ద్వారా పథకం కింద అందే వైద్యసేవలు, నెట్వర్క్ ఆస్పత్రులు, గతంలో పొందిన చికిత్సల వివరాలను ఏ విధంగా తెలుసుకోవచ్చో ఏఎన్ఎం, సీహెచ్‌ఓలు ప్రజలకు వివరించారు. పథకం కింద సేవలు పొందడంలో ఇంకా ఏవైనా అనుమానాలు, సందేహాలు ఉంటే ‘104’ ఫోన్‌ను ఎలా సంప్రదించాలన్న దానిపైనా అవగాహన కలి్పంచారు. ఇక పనిలో పనిగా ఇప్పటివరకూ దిశ యాప్‌ను ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోని యువతులు, మహిళలు ఉన్నట్లైతే వారి ఫోన్లలో కూడా యాప్‌ను డౌన్లోడ్ చేయించి, అత్యవసర సమయంలో యాప్ ఎలా సహాయపడుతుందో వివరిస్తున్నారు. ఆరోగ్యశ్రీకి ఏటా రూ.4వేల కోట్లు : మంత్రి రజిని కాగా, ఆరోగ్యశ్రీ ద్వారా ఎటువంటి రోగాలకు చికిత్స లభిస్తుంది, సందేహాలను నివృత్తి చేస్తూ ప్రచురించిన పోస్టర్లను గుంటూరులో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి విడదల రజిని ఆవిష్కరించి ఆరోగ్యశ్రీ కొత్త స్మార్ట్‌కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక విప్లవాత్మక నిర్ణయాలకు శ్రీకారం చుట్టి వాటిని అమలుచేశారన్నారు. వచ్చే జనవరి 1 నుంచి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ సెకండ్ ఫేజ్ కార్యక్రమాన్ని చేపట్టేందుకు దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. సీఎం జగన్ బాధ్యతలు చేపట్టాక ప్రతిఏటా రూ.4వేల కోట్లు చొప్పున ఆరోగ్యశ్రీకి కేటాయించారని.. విలేజ్ క్లినిక్‌లు, పీహెచ్సీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లతో పాటు వైద్యానికి సంబంధించి రూ.17వేల కోట్లతో నాడు–నేడు కింద అభివృద్ధి పనులు చేశారని తెలిపారు. అలాగే, వైద్య విభాగంలో రాష్ట్రవ్యాప్తంగా 53 వేల పోస్టులను భర్తీచేశారన్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటుచేస్తున్నామని, ఇందులో భాగంగా ఇప్పటికే ఐదు కళాశాలలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి విప్ లేళ్ల అప్పిరెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈఓ డీకే బాలాజీ, జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్‌రెడ్డి, పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, మేయర్ కావటి మనోహర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రజలకు చేరువ చేశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్ఘాటన..ఇంకా ఇతర అప్డేట్స్
-
పట్టణంలో ప్రతీ బుధవారం హెల్త్ క్యాంపు ఏర్పాటు
-
ప్రతీ ఇంటా ఆ రెండు యాప్‌లు ఉండాలి: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: పేదవాడికి ఆరోగ్యశ్రీని మరింత చేరువ చేసే ఉద్దేశంతోనే అవగాహన కార్యక్రమం ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రాంభించారు. పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ ఓ వరమని.. అందుకే దాని పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారాయన. ‘‘దేశంలో ఎక్కడా లేని విధంగా పేదవాడికి ఖరీదైన వైద్యం అందిస్తున్నాం. వైద్యం కోసం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ కిందకు వస్తుంది. ఇక నుంచి ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతున్నాం. ఆరోగ్యశ్రీ చికిత్సల సంఖ్యను పెంచాం. రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 513 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నాం. ఏ పేదవాడు వైద్యం కోసం అప్పులు కాకూడదని అడుగులు వేస్తున్నాం. విప్లవాత్మక మార్పులు ఇవాళ్టి నుంచి ఏపీలో కొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్‌కార్డుల పంపిణీ జరుగుతుంది. క్యూఆర్ కోడ్‌తో కార్డులో లబ్ధిదారుని ఫొటో, ఆరోగ్య వివరాలు ఉంటాయి. ఆరోగ్యశ్రీ మార్పులు.. విప్లవాత్మకమైన మార్పులు. ఆరోగ్యశ్రీ సేవల్ని ప్రతీ ఒక్కరికీ విస్తరించాలన్నదే లక్ష్యం. రాష్ట్రంలోని 1.4 కోట్ల మందిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చాం. రాష్ట్రంలో కొత్తగా మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నాం. పార్లమెంట్ స్థానానికి ఒక మెడికల్ కాలేజీ ఉండేలా ప్రణాళిక రూపొందించాం. పేదవాడికి ఆరోగ్యశ్రీని మరింత చేరువ చేయడమే లక్ష్యం. పేదలకు ఆరోగ్యశ్రీ ఒక వరం. ప్రతీ ఇంట తప్పనిసరి ప్రతీ ఇంట్లో దిశ, ఆరోగ్యశ్రీ యాప్‌లు ఉండాలి. ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల్లో పేషెంట్‌కు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి. క్యూఆర్ కోడ్ ద్వారా పేషెంట్ వివరాలు అన్నీ డాక్టర్లకు తెలుస్తాయి. ఆరోగ్య శ్రీ సేవల గురించి తెలియని వ్యక్తి ఎవ్వరూ ఉండకూడదు. ఇప్పటికే డోర్ డెలివరీకి సంబంధించి ట్రయల్ రన్ స్టార్ట్ చేశాం. ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స పొందిన వారికి మందులు ఉచితంగా డోర్ డెలివరీ చేస్తాం. గత ప్రభుత్వంతో పోలిస్తే.. రాష్ట్రంలో ఎలాంటి పరిమితులు లేకుండా ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తున్నాం. కాన్సర్‌లాంటి వ్యాధులకు సైతం ఆరోగ్య శ్రీ వర్తింపజేశామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో 104,108 వాహనాలు కూడా సరిగ్గా వచ్చేవి కావు. ఇవాళ ఏకంగా 104 ,108 కింద 2,200 వాహనాలు తిరుగుతున్నాయి. గతంలో మండలానికి ఒక 104,108 కూడా లేని పరిస్థితి ఉండేది. గత ప్రభుత్వ హయాంలో సరిగ్గా డాక్టర్లు కూడా లేని పరిస్థితి. ఇవాళ అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్ల కొరత లేకుండా చర్యలు తీసుకున్నాం. ఆరోగ్యశ్రీ కోసం ఏటా రూ. 4వేల 100 కోట్లు ఖర్చు చేస్తున్నాం. గత ప్రభుత్వం ఏటా రూ.1000 కోట్లు కూడా ఖర్చు చేసేది కాదు. అలాగే ఇప్పుడు ఆరోగ్యశ్రీ పరిధిని రూ.25 లక్షలకు పెంచాం. గత ప్రభుత్వం రూ.5 లక్షలు కూడా ఇచ్చేది కాదు. జాతీయ స్థాయిలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత 61శాతం ఉంటే.. రాష్ట్రంలో 3.3శాతం మాత్రమే స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఉంది. వీటినికూడా ఖాళీలు లేకుండా చూసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాం’’ అని సీఎం జగన్ చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమం దేశ చరిత్రలోనే చారిత్రాత్మక ఘటనగా నిలిచిపోతుంది. ఎప్పుడూ కూడా లేని విధంగా మార్పులు తీసుకు వస్తూ ముందడుగు వేస్తున్నాం. ఆరోగ్య శ్రీని వినియోగించుకోవడంపై ప్రతీ సందేహాన్ని తీరుస్తూ ఆరోగ్య శ్రీకార్డులు ఇస్తూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది. సంవత్సరానికి రూ.5 లక్షల ఆదాయం వస్తున్న కుటుంబాలను కూడా ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకు వచ్చాం. 1059 చికిత్సలకు మాత్రమే గతంలో ఆరోగ్య శ్రీ వర్తించేంది. ఇప్పుడు ఆ సంఖ్యను 3,257 చికిత్సలకు పెంచాం. పేదవాళ్లు అప్పులు పాలు కాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. హైదరాబాద్‌లో 85, బెంగుళూరులో 35, చెన్నైలో 16 ఆస్పత్రుల్లో 716 ప్రొసీజర్లకు ఆరోగ్య శ్రీని వర్తింపు చేశాం. చికిత్సల సంఖ్యను పెంచడం, ఆరోగ్య శ్రీ సేవలను ఏడాదికి రూ.5 లక్షల ఆదాయం వరకూ ఉన్నవారికి వర్తింపు చేయడం, అలాగే రూ.25 లక్షల వరకూ ఆరోగ్యశ్రీని వర్తింపు చేయడం ఇవన్నీ కీలక మార్పులు. చికిత్స తీసుకున్న తర్వాత విశ్రాంతి తీసుకునేవారికి నెలకు రూ.5వేల చొప్పున ఆరోగ్య ఆసరా ఇచ్చాం. ఆరోగ్య ఆసరా కింద 25,27,870 మందికి రూ.1,310 కోట్లు చెల్లించాం. ఆరోగ్య శ్రీ కింద ఈ ప్రభుత్వంలో 53,02,816 మంది చికిత్స తీసుకున్నారు. పెద్ద ఖర్చుతో కూడిన ప్రొసీజర్లను ఉచితంగా చికిత్సలు అందించాం. క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైన వ్యాధులకు ఎలాంటి పరిమితులు లేకుండా ఈ నాలుగున్నరేళ్ల కాలంలో రూ.1,897 కోట్లు ఖర్చు చేశాం. ఎప్పుడూ చూడని విధంగా 53,126 మంది వైద్య సిబ్బందిని నియమించాం. జాతీయస్థాయిలో నర్సుల కొరత 27 శాతం అయితే, మన రాష్ట్రంలో సున్నా. జాతీయ స్థాయిలో ల్యాబ్ టెక్నీషియన్ల కొరత 33 శాతం అయితే మన రాష్ట్రంలో వీరి కొరత సున్నా స్థాయికి తీసుకు వచ్చాం. నూటికి నూరుశాతం భర్తీచేశాం. గతంలో ప్రభుత్వాసుపత్రుల్లోకి వెళ్తే మందులు లేని పరిస్థితి ఉండేదని గుర్తు చేశారాయన. అలాంటి పరిస్థితులను మారుస్తూ ప్రభుత్వం పంపిణీ చేసే ప్రతి మందుకూడా డబ్ల్యూహెచ్ఓ, జీఎంపీ ప్రమాణాలు మాత్రమే ఉండేట్టుగా అడుగులు వేశామన్నారాయన. ప్రజలకు 562 రకాల మందులు అందుబాటులోకి తీసుకు వచ్చాం. ప్రివెంటివ్ కేర్‌ను విప్లవాత్మకంగా తీసుకురావడం జరిగింది. ప్రివెంటివ్ కేర్‌లో భాగంగా 10,032 విలేజ్ క్లినిక్స్‌ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. 24 గంటల సేవలు ఇందులో అందుబాటులో ఉంటాయి. ఎప్పుడూ జరగని విధంగా అడుగులు పడ్డాయి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను కూడా తీసుకు రావడం జరిగింది. మండలానికి నలుగురు డాక్టర్లను తీసుకురావడం జరిగింది. ఇద్దరు పీహెచ్‌సీల్లో ఉంటే, మరో ఇద్దరు ఫ్యామిలీ డాక్టర్ సేవలకు వెళ్తున్నారు. విలేజ్ క్లినిక్స్‌తో వీరు అనుసంధానం అయ్యారు. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లోనూ నాడు – నేడు కింద కార్యక్రమాలు చేపట్టాం. అని అన్నారాయన. ఆరోగ్యశ్రీ కోసం వివరంగా చెప్పే కార్యక్రమాన్ని ఇవాళ మనం ప్రారంభిస్తున్నాం. ఇందుకోసం రేపటినుంచి నియోజకవర్గంలో 5 గ్రామాల్లో ఆరోగ్య శ్రీ కార్డులు, అలాగే ఆరోగ్య శ్రీపై ప్రచారం కార్యక్రమాలు ప్రారంభిస్తున్నాం. దీని తర్వాత ప్రతి ఇంటికీ ఆరోగ్య శ్రీ కార్డును ఇవ్వడమే కాకుండా, ఇచ్చిన తర్వాత ఆరోగ్య శ్రీ కింద సేవలు ఎలా పొందాలన్నదానిపై వివరాలు చెప్పాలి. కనీసం ఒకరి ఫోన్లోనైనా ఆరోగ్య శ్రీయాప్ను డౌన్లో చేయించి, రిజిస్ట్రేషన్ చేయించాలి. దీని తర్వాత ప్రతివారం మండలానికి నాలుగు గ్రామాలు చొప్పున కార్డుల పంపిణీ, ప్రచారం కార్యక్రమం జరుగుతుంది. ఏఎన్ఎంలు, సీహెచ్‌ఓలు, ఆశావర్కర్లు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వానికి మద్దతు తెలిపేవాళ్లు, ఈ కార్యక్రమంలో పాల్గొనాలనేకునేవాళ్లుకూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. ఎలాగూ ఈకార్యక్రమం జరుగుతుంది కాబట్టి, మహిళా పోలీసులుకూడా ఇందులో పాల్గొని దిశ యాప్‌ను కూడా డౌన్లోడ్ చేయాలి. ప్రతి ఇంట్లో మహిళల ఫోన్లో ఆరోగ్యశ్రీ, దిశ యాప్‌లు ఉండాలి. ఈ రెండూ కచ్చితంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. గతంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేశాం. ఆరోగ్య సురక్ష కార్యక్రమం గుర్తించిన రోగులకు సంబంధించి వారిని డేటా బేస్‌లోకి తీసుకు వచ్చి, వారికి సరిగ్గా చేయూత నిస్తున్నారా? లేదా? అని చూడాలి. డాక్టర్ రిఫరెల్, అంతేకాక వారికి కావాల్సిన మందులు అందుతున్నాయా? లేవా? అనే దానిపై సమీక్ష చేయాలి. ఉచితంగా మందులు కూడా డోర్‌డెలివరీ చేస్తున్నాం. జనవరి -1 నుంచి కూడా వారికి ఉచితంగా డోర్‌డెలివరీ ద్వారా అందుతాయి. ఆరోగ్య సిబ్బంది నుంచి ఇండెంట్ పంపితే వెంటనే సెంట్రల్ డ్రగ్ స్టోరీ నుంచి వారికి మందులు పోస్టుల్ సర్వీసుద్వారా విలేజ్ క్లినిక్‌కు అందుతాయి. అక్కడనుంచి ఆరోగ్య సిబ్బంది వారికి మందులను అందిస్తారు. రిఫరెల్ కేసులకు సంబంధించి ప్రయాణ ఖర్చుల కింద రూ.300లను ప్రభుత్వమే అందిస్తుంది. ఇవన్నీకూడా జగనన్న ఆరోగ్య సురక్ష-2లో భాగంగా చేపడతారు. జనవరి 1 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ప్రతి మండలంలోనూ ప్రతి వారం ఒక గ్రామంలో హెల్త్ క్యాంపు జరుగుతుంది. ఈ పద్ధతిలో ప్రతి గ్రామంలో కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి హెల్త్ క్యాంపు రిపీట్ అవుతుంది. ప్రతివారం మంగళవారం, శుక్రవారం ఈ క్యాంపులు జరుగుతాయి. అలాగే అర్బన్ ప్రాంతాల్లో ప్రతి బుధవారం జరుగుతాయి: ఆరోగ్య సురక్ష ఫేజ్-1ను రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాం. దాదాపుగా 60.27 లక్షల మంది సేవలు పొందారు. 2.4 లక్షల మందికి బీపీ లక్షణాలు కనిపిస్తే వారికి తిరిగి నిర్ధారణ చేశాం: 1.48 లక్షల మందికి సుగర్ ఉన్నట్టుగా కనిపిస్తే, నిర్ధారణ పరీక్షలు చేశాం. వీరికి మందులు కూడా ఇచ్చాం. నిర్ధారణ పరీక్షలు జనవరి 1 నాటికి పూర్తవుతాయి. ఇదికూడా చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఆరోగ్య శ్రీని ఎలా వినియోగించుకోవాలన్నదానిపై 6 నిమిషాల వీడియో కూడా మీ అందరి ఫోన్లకు పంపిస్తున్నాం. దీన్ని కుటుంబాలన్నింటికీ చూపించండి. వారిఫోన్లలో కూడా వీడియోను ఉంచండి అని సీఎం జగన్ ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖకు, అధికారులకు సూచించారు. -
CM Jagan: మరింత ‘స్మార్ట్’గా ఆరోగ్యశ్రీ
CM YS Jagan Launch Mega Aarogyasri Awareness Programme Updates సీఎం జగన్ మాట్లాడుతున్నారు.. ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమం ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా పేదవాడికి ఖరీదైన వైద్యం అందిస్తున్నాం వైద్యం కోసం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ కిందకు వస్తుంది ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం ఆరోగ్యశ్రీ చికిత్సల సంఖ్యను పెంచాం రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 513 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు ఏ పేదవాడు వైద్యం కోసం అప్పులు కాకూడదని అడుగులు వేస్తున్నాం ఇవాళ్టి నుంచి ఏపీలో కొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్‌కార్డుల పంపిణీ క్యూఆర్ కోడ్‌తో కార్డులో లబ్ధిదారుని ఫొటో, ఇతర వివరాలు ఆరోగ్యశ్రీ సేవలపై ప్రతీ ఒక్కరికీ అవగాహన కల్పించాలి ఆరోగ్యశ్రీ మార్పులు.. విప్లవాత్మకమైన మార్పులు ఆరోగ్యశ్రీ సేవల్ని ప్రతీ ఒక్కరికీ విస్తరించాలన్నదే లక్ష్యం రాష్ట్రంలోని 4 కోట్ల 25 లక్షల మంది ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తారు ఆరోగ్యశ్రీ కోసం ఏటా రూ. 4వేల 100 కోట్లు ఖర్చు చేస్తున్నాం గతంలో రూ.5 లక్షలకు మించి ఇవ్వలేదు రాష్ట్రంలో కొత్తగా మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నాం పార్లమెంట్ స్థానానికి ఒక మెడికల్ కాలేజీ ఉండేలా ప్రణాళిక రూపొందించాం ఇక నుంచి ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్యం పేదవాడికి ఆరోగ్యశ్రీని మరింత చేరువ చేయడమే లక్ష్యం పేదలకు ఆరోగ్యశ్రీ ఒక వరం తాడేపల్లి కార్యక్రమంలో.. ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమం ప్రారంభించిన సీఎం జగన్ ► సీఎం జగన్ అధ్యక్షతన తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రారంభమైన ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమం. పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, సంబంధిత శాఖ అధికారులు ► కాసేపట్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీపై అవగాహన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ► ఆరోగ్యశ్రీ యాప్‌ను డౌన్లోడ్ చేయించడం.. అలాగే ఈ పథకం ద్వారా వైద్యం ఎలా పొందాలనే దానిపైనా అర్హులకు అవగాహన కల్పిండమే ఈ కార్యక్రమ ఉద్దేశం. దీంతో పాటు కొత్త ఫీచర్లతో మెరుగైన ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ.. ఆరోగ్యశ్రీ ద్వారా అందించే వైద్యం పరిధి రూ.25 లక్షల దాకా పెంపును సైతం ఆయన ప్రారంభిస్తారు. ► పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన ఉచిత కార్పొరేట్ వైద్యం అందించేందుకు తీసుకొచ్చిందే డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం. ► దీనికి మరిన్ని మెరుగులు దిద్దుతూ.. మరింత బలోపేతం చేసే కార్యక్రమాన్ని సీఎం జగన్ సోమవారం లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ పథకం కింద ఇక నుంచి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందనుంది. కొత్త కార్డుల్లో ఏముంటాయంటే.. క్యూఆర్ కోడ్, లబ్దిదారుని ఫొటో, కుటుంబ యజమాని పేరు, ఫోన్ నెంబర్, కుటుంబ సభ్యుల వివరాలు ఎల్రక్టానిక్ హెల్త్ రికార్డులో పొందుపరిచిన లబ్ధిదారుల ఆరోగ్య వివరాలతో ఏబీహెచ్ఏ ఐడీ క్యూఆర్ కోడ్‌తో లాగిన్ ద్వారా రోగి చేయించుకునే వ్యాధి నిర్ధారణ పరీక్షలు, తీసుకుంటున్న వైద్యం, చికిత్సలు, డాక్టర్ సిఫార్సులు, సమీపంలోని ఆసుపత్రులు, ఆ ఆసుపత్రులకు చేరేందుకు గూగుల్ మ్యాప్స్ ద్వారా అనుసంధానమైన మార్గాలు తెలుసుకోవచ్చు ఆరోగ్యమిత్ర కాంటాక్టు నంబర్లు సైతం తెలుసుకునే వీలు రోగి ఆరోగ్య పరిస్థితులపై డాక్టర్లకు, సిబ్బందికి పూర్తి అవగాహన మెరుగైన ఉచిత వైద్యం లభించేందుకు మార్గం సులభతరం అవగాహన అందరికీ.. ► ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమం ద్వారా.. లబ్దిదారులకు దిక్సూచిలా పనిచేసే ఆరోగ్యశ్రీ యాప్‌ను ప్రతి ఒక్కరి సెల్ఫోన్లో డౌన్లోడ్ చేయించాలి ► యాప్ ద్వారా ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి, ఎక్కడికి వెళ్లాలి, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి, ఎవరిని అడగాలనే సందేహాలన్నింటినీ ప్రతిఇంట్లో నివృత్తిచేసే కార్యక్రమం ఇది ► అలాగే కొత్త కార్డుల పంపిణీ సందర్భంగా ప్రతీ ఇంట్లో కనీసం ఒకరి ఫోన్లో ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ చేసుకునేలా ఏఎన్ఎంలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, ఆశా వర్కర్లు, వలంటీర్లు, మహిళా పోలీసులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు కృషి చేయాలి ఇదీ చదవండి: జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్–2 జనవరి 1 నుంచి.. -
25 లక్షల రూపాయల వరకు ‘డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’ పథకాన్ని ప్రారంభించనున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి..ఇంకా ఇతర అప్డేట్స్
-
ఆరోగ్య శ్రీ పరిధి రూ.25 లక్షలకు పెంపు
-
ఆరోగ్యానికి మరింత భరోసా
‘విద్య, వైద్యం ప్రజలకు హక్కుగా లభించాలి. ఈ హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత. అందుకే అధికారంలోకి వచ్చిన రోజు నుంచే మన ప్రభుత్వం ఈ అంశాలపై విశేష కృషి చేసింది. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య పథకం కోసం ఇప్పటిదాకా దాదాపు రూ.12,000 కోట్లు, వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకం కోసం రూ.1,309 కోట్లు ఖర్చు చేశాం. 108, 104 అంబులెన్స్‌ల వ్యవస్థను బలోపేతం చేసేందుకు మరో రూ.750 కోట్లు వెచ్చించాం. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకు వేస్తూ.. ఆరోగ్య శ్రీ కింద రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించేందుకు శ్రీకారం చుడుతున్నాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి : నిరుపేద, మధ్య తరగతి కుటుంబాల ప్రజలకు ఉచిత వైద్య సేవల కల్పన విషయంలో అత్యంత మానవీయ దృక్పథంతో మనందరి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ క్రమంలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చామని స్పష్టం చేశారు. ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలు వచ్చినా సరే ఆరోగ్యశ్రీ అండగా నిలుస్తుందన్నారు. ప్రజారోగ్య రంగంలోనే ఇది చరిత్రాత్మక నిర్ణయమని ఉద్ఘాటించారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఆయన వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రూ.25 లక్షల వరకు వైద్యం ఉచితంగా లభిస్తుందని తెలియజేయండి. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందిన అనంతరం వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. చికిత్స చేయించుకున్న వారు తిరిగి ఫాలో అప్ చెకప్ కోసం డాక్టర్ వద్దకు వెళ్లేలా చూడాలి. ఇందులో భాగంగా ఫాలో అప్ కన్సల్టేషన్ కోసం రవాణా చార్జీల కింద రూ.300 చొప్పున అందజేయండి. మరోవైపు జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాల నుంచి ఆస్పత్రులకు రెఫర్ చేసిన వారికి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. వీరు ఆస్పత్రులకు వెళ్లడం కోసం రవాణా చార్జీల కింద రూ.500 చొప్పున అందిస్తున్నాం. మరో విషయం ఏమిటంటే.. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా? అనే దానిపై రూపొందించిన వీడియో అందరికీ చేరేలా చూడండి. ఆరోగ్య సిబ్బంది, వలంటీర్లు, సచివాలయ సిబ్బంది సహా ప్రజలందరికీ ఈ వీడియోను అందుబాటులో ఉంచాలి’ అని ఆదేశించారు. కిడ్నీ రోగులకు బాసటగా నిలవాలి శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రోగులకు అందుతున్న వైద్య సేవలు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. స్క్రీనింగ్, మందులు, చికిత్స తదితర అంశాల్లో రోగులకు బాసటగా నిలవాలన్నారు. డయాలసిస్‌పై ఉన్న రోగులు వాడుతున్న మందులు గ్రామ స్థాయిలో వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్‌లో అందుబాటులోకి తీసుకురావాలని, ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంతో అనుసంధానం చేసి.. బాధితుల ఆరోగ్యంపై వాకబు చేయాలని సూచించారు. మార్కాపురంలోనూ పలాస తరహా వైద్య చికిత్స సౌకర్యాలు అందుబాటులోకి తేవాలన్నారు. కొత్తగా కడుతున్న మెడికల్ కాలేజీలో ఇప్పటికే నెఫ్రాలజీ విభాగం కోసం ఉత్తర్వులు ఇచ్చామని చెప్పారు. దీంతో పాటు యూరాలజీ విభాగం కూడా తీసుకురావాలని, ప్రభుత్వాస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యుల కొరతకు తావు లేకుండా చూడాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో పనిచేసే స్పెషలిస్ట్ డాక్టర్ కోసం అవసరమైన చోట క్వార్టర్లను నిర్మించాలని సూచించారు. 18న సీఎం చేతుల మీదుగా ప్రారంభం రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఈ నెల 18వ తేదీన ప్రారంభించనుంది. 19వ తేదీ నుంచి ప్రతి నియోజకవర్గంలో 5 గ్రామాల చొప్పున జరిగే కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. మండలంలో వారానికి నాలుగు గ్రామాల చొప్పున కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపడతారు. ప్రతి ఇంటికీ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ చేపట్టి, జనవరి నెలాఖరుకు పూర్తి చేయనున్నారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఎలా వైద్యం పొందవచ్చనే దానిపై పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఏఎన్ఎం, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో), ఆశా వర్కర్లు, వలంటీర్లు, మహిళా పోలీసులు ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ సహా, పథకంపై అవగాహన పెంచే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆరోగ్యశ్రీ మొబైల్ యాప్‌ను ప్రజల సెల్ఫోన్లలో డౌన్లోడ్ చేసి, యాప్ ద్వారా కలిగే ప్రయోజనాలను వివరిస్తారు. పనిలో పనిగా దిశ యాప్‌ను కూడా డౌన్లోడ్ చేస్తారు. ఇదిలా ఉండగా జనవరి ఒకటో తేదీ నుంచి ఫేజ్–2 జగన్ ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. ప్రతివారం మండలానికి ఒక గ్రామ సచివాలయం, పట్టణ ప్రాంతాల్లో ఒక వార్డు పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం నిర్వహించనున్నారు. జిల్లాల్లో సగం మండలాల్లో మంగళవారం, సగం మండలాల్లో శుక్రవారం శిబిరాల నిర్వహణ ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో బుధవారం నిర్వహిస్తారు. వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఆరోగ్యశ్రీ సీఈవో బాలాజీ పాల్గొన్నారు. -
రూ.25 లక్షల వరకూ ఆరోగ్యశ్రీ: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆరోగ్యశ్రీపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకూ ఉచిత చికిత్స అందించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 18న సీఎం ప్రారంభించనున్నారు. సమీక్షలో సీఎం జగన్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో ఇది చరిత్రాత్మక నిర్ణయం. ఆరోగ్యం, విద్య అన్నవి ప్రజలకు ఒక హక్కుగా లభించాలి. ఈ హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత. అందుకనే అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ప్రభుత్వం ఈ అంశాలపై విశేష కృషి చేసింది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వంచేస్తున్న ఖర్చులే దీనికి ఉదాహరణ. దీంట్లో భాగంగానే వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స కార్యక్రమాన్ని చేపట్టాం’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘ఎవరికి ఎలాంటి వైద్యం అవసరమైనా రూ.25 లక్షల వరకూ చికిత్స ఉచితంగా లభిస్తుందన్న భరోసా ఇవ్వాలి. అత్యంత మానవీయ దృక్పథంతో ప్రభుత్వం ఈ విషయంలో ముందడుగు వేస్తోంది. వైఎస్సార్‌ఆరోగ్య శ్రీ కార్డు ఉందంటే.. ఆ వ్యక్తికి రూ.25 లక్షలు వరకూ వైద్యం ఉచితంగా లభిస్తుంది. ఎవరికి ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలు వచ్చినా సరే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ అండగా నిలుస్తుంది’’ అని సీఎం చెప్పారు. ‘‘ఆరోగ్యశ్రీలో చికిత్స చేయించుకున్న వారికి మళ్లీ డాక్టర్ దగ్గరకు వెళ్లి చెకప్ చేయించుకునేందుకు(ఫాలో అప్ కన్సల్టేషన్) రవాణా ఛార్జీల కింద రూ.300 చెల్లించాలి. వైఎస్సార్‌ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా? అన్నదానిపై రూపొందించిన వీడియోను అందరికీ పంపించాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే స్పెషలిస్టు డాక్టర్లకు అవసరమైన చోట క్వార్టర్లను నిర్మించాలి. 19నుండి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కూడా పాల్గొనాలి. మండలంలో వారానికి నాలుగు గ్రామాల చొప్పున కార్డుల పంపిణీ కార్యక్రమం. ప్రతి ఇంటికీ ఆరోగ్యశ్రీకార్డుల పంపిణీ జరుగుతుంది. జనవరి నెలాఖరు నాటికి పూర్తి కావాలి. దీంతో పాటు వైఎస్సార్‌ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఎలా వైద్యం పొందవచ్చన్నదానిపై పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలి’’ అని సీఎం జగన్ ఆదేశించారు. వైఎస్సార్‌ఆరోగ్యశ్రీ యాప్‌ను ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకునేలా చూడాలి. భావసారూప్యత ఉన్నవారు, ప్రజాప్రతినిధులు, ఉత్సాహవంతులు ఇందులో పాల్గొనవచ్చు. ఫేజ్–2 ఆరోగ్య సురక్ష జనవరి 1 నుంచి ప్రారంభించాలి. ప్రతివారం మండలానికి ఒక గ్రామ సచివాలయం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం నిర్వహించాలి. అర్బన్ ప్రాంతాల్లో వారంలో ఒక వార్డులో ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఉండాలి. జిల్లాల్లో సగం మండలాల్లో మంగళవారం, సగం మండలాల్లో శుక్రవారం శిబిరాలను నిర్వహించాలి. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రోగులకు అందుతున్న వైద్య సేవలు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా అందించాలి. స్క్రీనింగ్, మందులు, చికిత్స తదితర అంశాల్లో కిడ్నీ రోగులకు బాసటగా నిలవాలి. డయాలసిస్ పేషెంట్లు (సీకేడీ) వాడుతున్న మందులు విలేజ్ హెల్త్ క్లినిక్స్‌లో అందుబాటులోకి తీసుకురావాలి’’ అని సీఎం జగన్ సూచించారు. సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎం టి కృష్ణబాబు, ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఆరోగ్యశ్రీ సీఈఓ డీకే బాలాజీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: చిల్లర రాజకీయాలు మానుకో చంద్రబాబూ..: సజ్జల -
రూ. 25 లక్షల వరకు ఆరోగ్య శ్రీ
సాక్షి, అమరావతి: ఓ మనిషి ప్రాణాన్ని కాపాడేందుకు వైద్యులు ఎంతో శ్రమిస్తారు.. అందుకే డాక్టర్ని దేవుడంటారు! మరి ఏకంగా కోటిన్నర కుటుంబాలకు ఆరోగ్యదాతను ఏమని పిలవాలి? నాలుగున్నరేళ్లలో దాదాపు నలభై లక్షల మందికి ఉచిత వైద్యంతో ప్రాణం పోసిన ‘డాక్టర్’ను ఎవరితో పోల్చాలి? ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లాక జీవన భృతి కోసం ఆదుర్దా పడకుండా రోగికి డబ్బులిచ్చి మరీ చిరునవ్వుతో సాగనంపే మానవీయ కోణాన్ని ఎవరైనా ఎలా మరువగలరు? ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి ఊపిరిలూదిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించాలని నిర్ణయించారు. తద్వారా గుండె, కిడ్నీ, న్యూరో లాంటి ఎంత పెద్ద జబ్బులకైనా చేతి నుంచి చిల్లి గవ్వ ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు ఖరీదైన వైద్యం అందనుంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ కింద అందించే చికిత్సల సంఖ్యను 1,059 నుంచి ఏకంగా మూడు రెట్లకుపైగా పెంచి 3,257కి చేర్చిన సీఎం జగన్ ఇక క్యాన్సర్ లాంటి ఖరీదైన జబ్బుల చికిత్సకు సైతం పరిమితి లేకుండా వ్యయాన్ని భరించేందుకు సిద్ధమయ్యారు. ఆరోగ్యశ్రీ సేవలను ప్రజలు అత్యంత సులభంగా పొందేలా ఆధునిక ఫీచర్లతో కొత్తగా కార్డులను రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 18వతేదీన నూతన మార్గదర్శకాలు జారీ చేయనుంది. ఈ సందర్భంగా అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో), ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, గృహ సారథులు, వలంటీర్లనుద్దేశించి సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. ఆరోగ్యశ్రీ సేవలను ప్రజలు మరింత మెరుగ్గా వినియోగించుకునేలా విస్తృత ప్రచారం కల్పించడంపై దిశా నిర్దేశం చేస్తారు. అనంతరం 19వతేదీ నుంచి కొత్తగా రూపొందించిన 1.42 కోట్ల వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. దేశ ఆరోగ్య రంగంలో తొలిసారిగా... ఇటీవల జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పలు పార్టీలు ఆరోగ్యశ్రీ తరహాలో ఉచిత వైద్యం అందిస్తామని హామీలిచ్చాయి. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ రూ.10 లక్షల వరకూ ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇవ్వగా బీఆర్ఎస్ రూ.15 లక్షల వరకూ ఉచిత వైద్యం సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కూడా రాజకీయ పార్టీలు ఇలాంటి హామీలనే ఇచ్చాయి. అయితే దేశంలో ఎక్కడాలేని విధంగా ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.25 లక్షల వరకూ ఉచితంగా వైద్యానికి ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం భరోసా నివ్వడం గమనార్హం. గతంలో క్యాన్సర్ చికిత్సకు ఆరోగ్యశ్రీ కింద ఇచ్చే డబ్బులపై రూ.5 లక్షల వరకు పరిమితి ఉంది. ఆ తర్వాత ఎంత ఖర్చు అయినా రోగులే భరించాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ పరిమితిని ఎత్తివేయడం ద్వారా పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యానికి పూర్తి భరోసానిస్తున్నారు. అందరికీ అభయం 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ ఏడాది నవంబర్ నెలాఖరు నాటికి ఆరోగ్యశ్రీ పథకం కింద 37,40,525 మంది ఉచితంగా వైద్యం అందుకున్నారు. వీరి వైద్యం కోసం ప్రభుత్వం ఏకంగా రూ.11,859.96 కోట్లు ఖర్చు చేసింది. చికిత్స ఖర్చు రూ.వెయ్యి దాటితే ప్రభుత్వమే ఉచితంగా పథకం కింద వైద్యాన్ని అందిస్తోంది. మరోవైపు వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కోసం రూ.1,309 కోట్లు వెచ్చించింది. ఇలా నాలుగున్నరేళ్లలో ఆరోగ్యశ్రీ, ఆసరా కోసం ఏకంగా రూ.13,168.96 కోట్లు వెచ్చించింది. గత సర్కారు 2014 – 19 మధ్య అరకొర ప్రొసీజర్లతో రూ.5,177.38 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. సీఎం జగన్ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా కరోనాకు సంబంధించిన 10 రకాల చికిత్సలను 2021 మే, జూన్ నెలల్లో ఆరోగ్యశ్రీలోకి చేర్చింది. రెండు లక్షల మందికిపైగా బాధితులకు ఉచితంగా కోవిడ్ చికిత్స కోసం రూ.744 కోట్ల మేర ఖర్చు చేసింది. 2,198 ప్రొసీజర్స్ పథకంలోకి తెచ్చిన సీఎం జగన్ ప్రజారోగ్యానికి పెద్దపీట వేసిన సీఎం జగన్ వైద్య ఖర్చులు రూ.వెయ్యి దాటే ప్రతి చికిత్సకు ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేస్తామని 2019 ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టో ద్వారా ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకున్నారు. 2020 జనవరిలో ప్రొసీజర్లను తొలుత 2059కి పెంచారు. అనంతరం అదే ఏడాది జూలైలో ప్రొసీజర్లను 2,200కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనిద్వారా 54 క్యాన్సర్ చికిత్సలు పథకంలో అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు 2020 నవంబర్‌లో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ లాంటి పలు పెద్ద చికిత్సలతో సహా 235 చికిత్సలతో ప్రొసీజర్స్ సంఖ్యను 2,436కి పెంచారు. పది రకాల కరోనా చికిత్సలను పథకంలోకి చేర్చడంతో ప్రొసీజర్స్ 2,446కి చేరాయి. గతేడాది మరో 809 చికిత్సలను చేర్చడంతో ఆరోగ్యశ్రీ పథకంలో 3,257 ప్రొసీజర్లు సమకూరాయి. గర్భిణులకు ఉచితంగా టిఫా స్కాన్ సేవలు అందించేందుకు ఇటీవలే మరో రెండు ప్రొసీజర్లను పథకంలో చేర్చారు. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి 1,059 ప్రొసీజర్లు మాత్రమే ఉండగా వీటికి అదనంగా 2,198 ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీలో చేర్చి మొత్తం 3,257 ప్రొసీజర్లతో పథకాన్ని అమలు చేస్తూ సీఎం జగన్ చరిత్ర సృష్టించారు. ఇంటికి వెళ్లి యోగక్షేమాల ఆరా.. వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా 1,519 ప్రొసీజర్లకు సంబంధించి రోగి ఇంటివద్ద కోలుకుంటూ విశ్రాంతి తీసుకునే సమయంలో రోజుకు రూ.225 చొప్పున నెలకు గరిష్టంగా రూ.ఐదు వేలు వరకు ప్రభుత్వం అందిస్తోంది. రోగి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన రోజే బ్యాంకు ఖాతాలో ఆసరా మొత్తాన్ని జమ చేస్తున్నారు. డిశ్చార్జి అనంతరం ఏఎన్ఎంలు రోగుల ఇళ్లకు వెళ్లి యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ సేవల్లో ఏవైనా సమస్యలుంటే ఫిర్యాదు చేసేందుకు 104 కాల్ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చారు. 2019లో టీడీపీ సర్కారు దిగిపోయే నాటికి ఆరోగ్యశ్రీ కింద రూ.477.40 కోట్లు, ఈహెచ్ఎస్ కింద రూ.154.1 కోట్లు బకాయిలు పెట్టగా మొత్తంగా రూ.631.56 కోట్లను వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే చెల్లించింది. -
ఆరోగ్యం మీ హక్కు!
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్యాన్ని అత్యంత ప్రాధాన్య రంగంగా భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఈ విషయంలో సంతృప్తి కరంగా సేవలందించేలా అడుగులు వేస్తోంది. పేదలందరికీ ఆరోగ్యం అనేది హక్కుగా ఉండాలన్న లక్ష్యంతో ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్స్, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య సురక్ష కార్యక్రమాల ద్వారా రోగులను చేయి పట్టుకుని నడిపిస్తూ వారికి నాణ్యమైన సేవలతోపాటు మందుల నుంచి చికిత్స వరకు అందించే బాధ్యతను భుజానకెత్తుకుంది. గతంలో చికిత్స పొందిన వారి ఆరోగ్యంపట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ తీసు కుంటూనే మందుల విషయంలో రాజీపడకుండా ఎంత ఖరీదైనవి అయినా సరే వారికి అందించాలన్న కృతనిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఏ పేదవాడు వైద్యం కోసం ఇబ్బంది పడకూడదని.. ఈ విషయంలో వాళ్లు అప్పులపాలు కాకుండా ఉండేందుకు వీలుగా ఆరోగ్యశ్రీని ప్రభుత్వం గతంలో ఎన్నడూలేని విధంగా బలోపేతం చేసింది. ఈ విషయంలో సీఎం వైఎస్ జగన్ మరో అడుగు ముందుకేస్తూ ప్రజలు నచ్చేలా.. ప్రభుత్వాన్ని మెచ్చేలా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం, పథకం సేవలు ఎలా పొందాలన్న దానిపై ప్రతీ ఒక్కరికీ విస్తృతంగా అవగాహన కల్పించాలని సంకల్పించారు. సేవలు వినియోగించడం గురించి తెలియని వ్యక్తి అంటూ రాష్ట్రంలో ఎవరూ ఉండకూడదని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం.. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎం, ఆశా వర్కర్ల ద్వారా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేయనున్నారు. మొత్తం 1,42,34,464 కొత్త కార్డులను ప్రింట్ చేయిస్తున్నారు. ఈనెల 18 నుంచి వీటిని అందజేస్తారు. మరోవైపు.. ఆరోగ్యశ్రీ యాప్ ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్లో అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇదే సమయంలో దిశ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకునేలా కార్యక్రమం చేపడుతోంది. ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్లో ఈ రెండు యాప్‌లు ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఆరోగ్య సురక్షపై నిరంతర సమీక్ష మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా యజ్ఞంలా సాగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు చేయూతనందించే కార్యక్రమాన్ని నిరంతరం సమీక్షించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో మూడు అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టనుంది. అందులో మొదటిది.. ► సురక్షలో గుర్తించిన రోగులకు మందులు అందించడం, కాలానుగుణంగా ఆరోగ్యంపై ఫాలోఅప్ చేయడం.. ► రెండోది.. గతంలో ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేసుకున్న వారికి అవసరమైన మందులు, చికిత్సపై ఫాలోఅప్ సేవలు అందించడం.. ► మూడోది.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి అందిస్తున్న మందులను కోర్సు ముగిసేలోపే వాటిని అందుబాటులో ఉంచడం. ఈ మూడు ప్రధాన అంశాలపై నిరంతరం సమీక్ష చేయనుంది. ► అలాగే, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రెండో దశను జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మందులపై ప్రత్యేక శ్రద్ధ.. ఇక ఫ్యామిలీ డాక్టర్ ప్రతి గ్రామానికీ వెళ్తున్నందున అదే సమయంలో వారికి మందులు అందాయా? లేదా? అన్న దానిపైనా దృష్టి కేంద్రీకరించనుంది. ఈ ప్రక్రియలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని యోచిస్తోంది. అలాగే, సురక్షలో గుర్తించిన ఆస్పత్రుల్లో చికిత్స అవసరమున్న రోగులకు రవాణా ఖర్చుల కింద రూ.500 చొప్పున ఇవ్వడమే కాక.. సురక్ష క్యాంపుల నుంచి ఆస్పత్రులకు రిఫర్ చేసి నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఇన్పేషెంట్లుగా చేరిన వారిని మరోసారి డాక్టర్ల బృందం పరిశీలించేలా.. శిబిరాల్లో ఇంకా వైద్యం అందాల్సిన వారికి వెంటనే నాణ్యమైన చికిత్స అందేలా చర్యలు తీసుకోనుంది. చైనా వైరస్‌పైనా అప్రమత్తం చైనాలో హెచ్9ఎన్2 వైరస్ విస్తరిస్తున్న దృష్ట్యా మన దగ్గర ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖను సీఎం జగన్ అప్రమత్తం చేశారు. ఆస్పత్రుల వారీగా ఉన్న మౌలిక సదుపాయాలపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని.. మందులు, ఆక్సిజన్, పడకల విషయంలో అన్ని రకాలుగా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆస్పత్రుల్లో ఎక్కడా వైద్యులు, సిబ్బంది పోస్టుల ఖాళీలు లేకుండా చూడాలని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో సూచించారు. 1.42 కోట్ల ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ.. అంతకుముందు.. వైద్యశాఖలో అమలుపరుస్తున్న పలు కార్యక్రమాల పురోగతిని అధికారులు ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబరు నెలాఖరు వరకూ 12,42,118 మంది ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స చేయించుకున్నట్లు చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే 24.64 శాతం చికిత్సలు పెరిగాయన్నారు. అలాగే.. ఆరోగ్యశ్రీ యాప్‌ను ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్లో అందుబాటులో ఉంచేలా చూస్తున్నామన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలు, పురోగతిని కూడా వారు సీఎంకు వివరించారు. ► కంటి చికిత్సలు కాకుండా ఇతర వైద్య చికిత్సలు అవసరమైన వారు 86,690 మంది ఉన్నారని.. ► ఇందులో 73,602 మందికి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్సలు అందేలా చర్యలు తీసుకున్నామని.. ► చాలామందికి పరీక్షలు చేసిన తర్వాత వైద్యులు మందులు ఇచ్చారని.. అనంతరం తదుపరి చికిత్స కోసం 16,128 మందిని ఆస్పత్రుల్లో అడ్మిట్ చేశామని చెప్పారు. ► వీరిలో 15,786 మందికి సర్జరీలు, ట్రీట్మెంట్లు పూర్తయ్యాయి. ► 78,292 మందికి కంటిచికిత్సలు అవసరమని జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల ద్వారా గుర్తించామని అధికారులు వివరించారు. ► ఇక కంటిచూపు సంబంధిత సమస్యలున్న 13,614 మందికి ఇప్పటికే కేటరాక్ట్ సర్జరీలు చేయించామన్నారు. 5,26,702 మందికి కంటి అద్దాలు అందిస్తున్నామన్నారు. ► క్యాంపుల్లో గుర్తించిన రోగులకు సకాలంలో మందులు అందేలా అన్ని ఏర్పాట్లూ చేశామన్నారు. జనవరి నుంచి రెండోదశ ఆరోగ్య సురక్ష.. ఇక జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రెండో దశను జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభిస్తామని సీఎంకు అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి మండలంలో ప్రతీవారం ఒక ఆరోగ్య సురక్ష క్యాంపు ఏర్పాటుచేసేలా ప్రణాళిక రచించామన్నారు. క్యాంపుల్లో స్పెషలిస్ట్ వైద్యులు అందుబాటులో ఉండి సేవలు అందిస్తారని.. మందులు, వైద్య పరీక్షలు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. ఇలా 110 మున్సిపాలిటీల్లోని పట్టణ, నగర ప్రాంతాలను కవర్ చేస్తూ వారంలో 162 క్యాంపులు ఉంటాయన్నారు. ఈ సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, సీఎస్ డాక్టర్ జవహర్‌రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, కార్యదర్శి డాక్టర్ మంజుల, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ నివాస్, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, సెకండరీ హెల్త్ డైరెక్టర్, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ వెంకటేశ్వర్, డీఎంఈ డాక్టర్ నరసింహం, ఆర్థికశాఖ కార్యదర్శి ఎన్. గుల్జార్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఆరోగ్యశ్రీ తో మెరుగైన వైద్యం
-
ఆరోగ్య శ్రీ పథకం పట్ల ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం
-
దశాబ్దాల నిర్లక్ష్యానికి చికిత్స 'ప్రజారోగ్య విప్లవం'
పల్నాడు జిల్లా యండ్రాయి, ధరణికోట గ్రామాల నుంచి సాక్షి ప్రతినిధి వడ్డే బాలశేఖర్: ఈ ఫొటోలోని షేక్ రిహానాకు ఏడేళ్లు. పల్నాడు జిల్లా అమరావతి మండలం యండ్రాయి గ్రామం. తండ్రి జానీ చిరు వ్యాపారి, తల్లి ఫాతిమా గృహిణి. రిహానాకు పుట్టుకతో గుండె సమస్య ఉంది. దీనికి తోడు రెండేళ్ల వయస్సు వచ్చినా మాటలు రాలేదు. గుండె సమస్య కారణంగా మాటలు రావడం లేదని తొలుత తల్లిదండ్రులు భావించారు. కొద్ది రోజులకు గుంటూరు ఆస్పత్రిలో చూపించగా, పుట్టుకతో వినికిడి లోపం సమస్య కూడా ఉందని తేలింది. పాపకు మూడేళ్లు వచ్చాక గుండెకు సర్జరీ చేయించారు. వినికిడి లోపం సమస్యకు చికిత్స చేయించాలంటే ఎంత ఖర్చు అవుతుందోనని భయపడి ఆగిపోయారు. డబ్బు సమకూర్చుకున్నాక వైద్యం చేయిద్దామనుకున్నారు. ఇలా రోజులు గడుస్తూ పాపకు ఏడేళ్లు వచ్చాయి. అందరు పిల్లలు గలగలా మాట్లాడుతుంటే రీహానా మాత్రం మౌనంగా ఉండటం చూసి తల్లిదండ్రులు ఆవేదనకు గురవ్వని రోజంటూ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం వీరికి కలిసొచ్చింది. గత నెల 6వ తేదీన గ్రామంలో సురక్ష క్యాంప్ నిర్వహించారు. తల్లి ఫాతిమా.. రిహానాను ఆ క్యాంప్‌నకు తీసుకెళ్లింది. వైద్యులు పరీశీలించి గుంటూరు జీజీహెచ్‌కు రెఫర్ చేశారు. అక్కడ పలు పరీక్షలు నిర్వహించి మందులు ఇచ్చారు. అవి వాడాక వాస్తే మరికొన్ని పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఫలితాల ఆధారంగా స్పీచ్ థెరఫీ ఇవ్వడం లేదంటే కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ నిర్వహించడమో చేస్తామని తెలిపారు. ‘నా బిడ్డ మాట్లాడలేని స్థితిలో ఉండటం చూసి ఏడుపు వస్తోంది. సురక్ష క్యాంప్‌లో వైద్యులు చెప్పారని జీజీహెచ్‌కు వెళ్లొచ్చాను. పాపకు చికిత్స చేసి మాటలొచ్చేలా చేస్తామన్నారు. నా బిడ్డకు మాటలొస్తే చాలు అంతకు మించి ఏమీ వద్దు’ అని ఫాతిమా అంటోంది. ‘మీరు అధైర్యపడొద్దు. వైద్య పరీక్షలకు వెళ్లండి. ఆశా వర్కర్‌ను మీకు తోడుగా పంపుతాను. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. ప్రభుత్వమే ఉచితంగా పాపకు మాటలు వచ్చేలా చికిత్స చేయిస్తుంది. ఆరోగ్యశ్రీ కింద రూ.12 లక్షల ఖరీదైన రెండు చెవులకు కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీని ప్రభుత్వం ఉచితంగా చేయిస్తోంది’ అని అత్తలూరు పీహెచ్సీ డాక్టర్ రవిబాబు ఫాతిమాకు ధైర్యం చెప్పారు. ఇలా రాష్ట్రంలోని ప్రజలందరి ఆరోగ్యానికి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కొండంత అండగా నిలుస్తోంది. సీఎం జగన్ సర్కార్ ఆరోగ్య భరోసా అనారోగ్య సమస్యలున్నప్పటికీ సుదూర ప్రాంతంలో ఉండే ఆస్పత్రులకు వెళ్లి చూపించుకోలేక కొందరు, నిర్లక్ష్యంతో మరికొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఈ నేపథ్యంలో ప్రాణం విలువ తెలిసిన సీఎం వైఎస్ జగన్.. రాష్ట్రంలో ఏ ఒక్కరూ వైద్య సాయం అందక ఇబ్బంది పడటానికి వీల్లేకుండా ఫ్యామిలీ డాక్టర్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించారు. అయినప్పటికీ ఇంకా ఎవరైనా ప్రజలు వైద్యం అందక ఇబ్బంది పడుతున్నారేమోనని మరో అడుగు ముందుకు వేసి ప్రతి ఇంటిని జల్లెడ పట్టి.. ప్రజల ఆరోగ్య సమస్యలు, అవసరాలను గుర్తించి ఉచిత చికిత్సలు చేపట్టి, వైద్య పరంగా చేయి పట్టి నడిపించడం కోసం ఆరోగ్య సురక్షకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో అనేక సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉన్న ఊళ్లోనే 59.30 లక్షల మందికి వైద్యం ఏఎన్ఎం, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో) నేతృత్వంలోని వైద్య బృందాలు 1.44 కోట్లకు పైగా గృహాలను సందర్శించి ప్రజలను స్క్రీనింగ్ చేపట్టాయి. బీపీ, షుగర్, హెచ్‌బీ, మలేరియా, డెంగ్యూ వంటి ఏడు రకాల పరీక్షలను 6.50 కోట్ల మేర నిర్వహించారు. తద్వారా వివిధ అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారిని గుర్తించి సురక్ష శిబిరాలకు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 9వ తేదీ నాటికి గ్రామాల్లో 9,982, పట్టణాల్లో 2,258 సురక్ష శిబిరాలను ప్రభుత్వం నిర్వహించింది. ఒక్కో శిబిరంలో సగటున 485 చొప్పున 59,30,972 మందికి సొంత ఊళ్లలోనే వైద్య సేవలు అందించారు. ప్రతి శిబిరంలో జనరల్ మెడిసిన్, గైనిక్, పీడియాట్రిక్, ఆప్తమాలజిస్ట్ వంటి స్పెషలిస్ట్ వైద్యులు అందుబాటులో ఉండి ప్రజలకు వైద్య సేవలు అందించారు. ప్రతి శిబిరం వద్ద ర్యాపిడ్ టెస్ట్‌లతో పాటు, ఈసీజీ, ఇతర వైద్య పరీక్షలు నిర్వహణతోపాటు, 172 రకాల మందులను అందుబాటులో ఉంచారు. ఖరీదైన వైద్యం పూర్తిగా ఉచితం సురక్ష క్యాంప్‌లకు వచ్చిన వివిధ అనారోగ్య బాధితుల్లో మెరుగైన వైద్యం అవసరం ఉన్న వారిని ఆస్పత్రులకు రెఫర్ చేశారు. ఇలా 86,108 మందిని ఇప్పటి వరకు రెఫర్ చేయగా వీరందరికీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స చేపడుతోంది. గుండె, కిడ్నీ, మెదడు సంబంధిత జబ్బులు, క్యాన్సర్, ఇతర వ్యాధులకు ఖరీదైన చికిత్సలను పూర్తి ఉచితంగా అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆఖరికి వీరు ఆస్పత్రులకు పోయి, రావడానికి అయ్యే ప్రయాణ చార్జీలు కూడా ప్రభుత్వమే అందిస్తోంది. ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ఇస్తోంది. ప్రతి రెఫరల్ కేసును స్థానిక పీహెచ్సీ వైద్యుడు, ఏఎన్ఎం, సీహెచ్‌వోల ద్వారా పర్యవేక్షిస్తూ వైద్యం అందించేలా చూస్తున్నారు. ఇలా ఇప్పటి వరకూ 19,934 మంది ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు వెళ్లగా, 1,634 మందికి అడ్మిషన్ అవసరం ఉందని వైద్యులు నిర్ధారించారు. మిగిలిన వారికి మెడికేషన్ అందించారు. అడ్మిషన్ అవసరం ఉన్న వారిలో 1,060 మందికి సర్జరీలు, చికిత్సలు పూర్తయ్యాయి. చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వారి ఆరోగ్యంపై వైద్య శాఖ నిరంతరం వాకబు చేస్తోంది. కాలానుగుణంగా ఎప్పటికప్పుడు అవసరమైన మందులు, వైద్య సేవలు అందించేలా చర్యలు చేపడుతోంది. ఈ ఫోటోలో వైద్యుడు రవిబాబు పరిశీలిస్తున్న ఉషారాణిది యండ్రాయి గ్రామమే. చిన్నపాటి పాడి రైతు. కొద్ది నెలల క్రితం కాలికి సర్జరీ చేయించుకుంది. అనంతరం కాలు వాపు రావడంతో పాటు, గాయాలు మొదలయ్యాయి. సర్జరీ కారణంగా ఇన్ఫెక్షన్ వచ్చిందేమోనని గుంటూరులోని పలు ఆస్పత్రుల్లో చూపించుకుంది. మందులు వాడినా సమస్య తగ్గలేదు. ఆరోగ్య సురక్షలో భాగంగా వైద్య సిబ్బంది ఇటింటి సర్వే నిర్వహించినప్పుడు ఆమె తన సమస్య వివరించింది. ఈ క్రమంలో సురక్ష శిబిరానికి హాజరవ్వమని సిబ్బంది సూచించారు. గత నెల 6వ తేదీన శిబిరానికి హాజరైంది. స్పెషలిస్ట్ వైద్యులు ఆమెను పరిశీలించి బోద వ్యాధి లక్షణాలున్నాయని, అమరావతి సీహెచ్‌సీకి రెఫర్ చేశారు. వైద్య సిబ్బంది సహాయంతో ఆమె అక్కడికి వెళ్లింది. వైద్య పరీక్షల అనంతరం తెనాలిలోని ప్రభుత్వ ఫైలేరియా సెంటర్‌కు రెఫర్ చేశారు. అక్కడ బోద వ్యాధిగా నిర్ధారించారు. ఉచితంగా మందులు అందించారు. ఈ క్రమంలో ఉషారాణి మాట్లాడుతూ.. ‘ఊళ్లో ఆరోగ్య సురక్ష క్యాంప్ పెట్టి ప్రభుత్వం నాకు ఎంతో మేలు చేసింది. లేకుంటే నా సమస్యను ఇంకా నిర్లక్ష్యం చేసేదాన్ని. నేను ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకునే వరకు వైద్య సిబ్బంది రోజు ఫాలోఅప్ చేశారు’ అని సంతోషం వ్యక్తం చేస్తోంది.1250 మంది జనాభా ఉన్న యండ్రాయి గ్రామంలో నిర్వహించిన సురక్ష క్యాంప్‌నకు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న 350 మంది హాజరయ్యారు. వీరిలో 88 మంది కంటి సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. మిగిలిన వారు గ్యాస్ట్రిక్, బీపీ, షుగర్ వంటి ఇతర సమస్యలతో బాధపడుతున్నారు. కంటి సమస్యలున్న వారిలో 74 మందికి ఆప్తమాలజిస్ట్ సూచన మేరకు కళ్లద్దాల పంపిణీ చేపడుతున్నారు. ఇక రిహాన, ఉషారాణి తరహాలో పలు తీవ్రమైన సమస్యలున్న నలుగురిని ఇతర ఆస్పత్రులకు రెఫర్ చేశారు. స్పెషలిస్ట్ వైద్య సేవల కోసం ఈ గ్రామస్తులు 25 కి.మీ దూరంలో ఉండే గుంటూరు జీజీహెచ్‌కు వెళ్తుంటారు. దీంతో ఒకసారి గుంటూరుకు పోయి రావాలంటే కనీసం రూ.500 చొప్పున రవాణా, ఇతర అవసరాల కోసం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఒక రోజంతా పని మానుకోవాల్సి రావడంతో కూలి డబ్బులు నష్టపోవాల్సి వస్తుంది. ఈ ఖర్చులకు భయపడి ఇదే గ్రామానికి చెందిన దస్తగిరి కొంత కాలంగా మోకాళ్ల నొప్పులు వేధిస్తున్నప్పటికీ మందులు వేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. సురక్ష క్యాంప్‌లో స్పెషలిస్ట్ వైద్య సేవలుంటాయని స్థానిక ఏఎన్ఎం చెప్పడంతో హాజరయ్యాడు. తన సమస్యకు వైద్య సేవలు పొందాడు. క్యాంప్‌లోనే ఉచితంగా మందులు ఇచ్చారు. ఆ మందులు వాడినా సమస్య నయం అవ్వకపోతే తదుపరి వైద్యం ఉచితంగా అందిస్తామని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది నాకు 72 ఏళ్లు. రక్తపోటు, మధుమేహం సమస్యతో కొన్నేళ్లుగా బాధ పడుతున్నాను. గతంలో ప్రతి నెలా గుంటూరుకు మెడికల్ చెకప్ కోసం వెళ్లేవాడిని. ఒకసారి గుంటూరుకు పోయి, రావడానికి రూ.వెయ్యికి పైనే ఖర్చు అయ్యేది. ఈ ప్రభుత్వం వచ్చాక మా గ్రామంలోనే వైద్య సేవలు అందుతున్నాయి. ప్రతి నెలా మా గ్రామానికే డాక్టర్ వస్తున్నారు. దీంతో గుంటూరుకు వెళ్లడం మానేశాను. మందులు బాగా పని చేస్తున్నాయి. దీనికి తోడు ఈ మధ్య ఆరోగ్య సురక్ష క్యాంప్ పెట్టారు. గతంలో మేం వైద్యం కోసం వేరే ప్రాంతాలకు వ్యయ ప్రయాసలకోర్చి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు మా వద్దకే వచ్చి వైద్యం చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. – కె. పౌలేశు, యండ్రాయి, పల్నాడు జిల్లా కిడ్నీ సమస్యను గుర్తించి చికిత్స కొద్ది నెలలుగా నడుము భాగంలో నొప్పి వస్తుండేది. గుంటూరు వరకు పోయి చూపించుకోలేక ఏవో మందులు తెప్పించుకుని నొప్పి నుంచి విముక్తి పొందేదాన్ని. గ్రామంలో క్యాంప్ పెట్టడంతో వెళ్లాను. వైద్యులకు నా సమస్య వివరించాను. కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. క్యాంప్‌లోనే పలు మందులు ఇచ్చారు. జీజీహెచ్‌కు వెళ్లమని చీటీ ఇచ్చారు. ఆ మందులు వాడాక నొప్పి తగ్గుముఖం పట్టింది. జీజీహెచ్ కూడా వెళ్లొచ్చాను. క్యాంప్‌లో ఇచ్చిన మందులన్నీ వాడాక రమ్మన్నారు. – మొగల్ సబీరా, యండ్రాయి, పల్నాడు జిల్లా ఇంత శ్రద్ధ ఏ ప్రభుత్వం చూపలేదు ఎనిమిదేళ్ల క్రితం నా గుండెకు స్టెంట్ వేశారు. రోజూ మందులు వాడటంతో పాటు, రెండు, మూడేళ్లకు ఓసారి పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. మందులు అయితే వాడుతున్నా కానీ పరీక్షలు చేయించుకోలేదు. మా ఊళ్లో పెద్ద డాక్టర్లతో క్యాంప్ పెడుతున్నారని చెబితే వెళ్లి చూపించుకున్నాను. వాళ్లు ఈసీజీ తీశారు. ఎందుకైనా మంచిదని గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లండని చెప్పారు. వెళ్లాను.. పరీక్షలు చేశారు. అంతా బాగుందని చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చాక మా గ్రామంలోనే బీపీ, రక్తం పలుచబడే బిళ్లలు ఇస్తున్నారు. నెలనెలా డాక్టర్ వస్తున్నారు. వైఎస్సార్ కంటి వెలుగు కింద ఉచితంగా కంటి ఆపరేషన్ చేశారు. ఇన్ని విధాలుగా గతంలో ఏ ప్రభుత్వం మా ఆరోగ్యాలపై శ్రద్ధ చూపలేదు. – ఎస్.ఆదం, ధరణికోట, పల్నాడు జిల్లా పెద్ద ఊరట కల్పించారు వయోభారం రీత్యా కాళ్లు, నడుము నొప్పులతో కొన్నాళ్లుగా బాధపడుతున్నాను. పట్టణంలోని ఆస్పత్రికి వెళ్లాలంటే ఎవరో ఒకరు తోడుండాలి. దీనికి తోడు రానుపోను చార్జీలు, ఇతర ఖర్చులు పెట్టుకోవాలి. ఇంట్లో ఎవరైనా పట్టణానికి పోయినప్పుడు తెచ్చి ఇచ్చే మాత్రలు వేసుకుంటూ కాలం వెల్లదీస్తుండేదాన్ని. ఈ పరిస్థితుల్లో గ్రామంలో క్యాంప్ పెట్టారని వలంటీర్ చెప్పడంతో వెళ్లాను. నాకున్న సమస్యలు చెప్పాను. మందులు ఇచ్చారు. అవి వేసుకుంటుంటే నొప్పులు తగ్గాయి. గ్రామంలోనే వైద్య శిబిరం పెట్టి చాలా పెద్ద ఊరట కల్పించారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులకు నెలనెలా ఇంటి వద్దకే పింఛన్ పంపిణీ చేస్తున్నట్టే, వైద్య సేవలను చేరువ చేసి పుణ్యం కట్టుకున్నారు. – కింతలి రాజేశ్వరమ్మ, తోనంగి, గార మండలం, శ్రీకాకుళం జిల్లా. ప్రతి కేసుపై ప్రత్యేక శ్రద్ధ పీహెచ్సీ పరిధిలోని సురక్ష శిబిరాల్లో సుమారు ఏడు వేల మంది వైద్య సేవలు అందుకున్నారు. 168 మందిని ఆస్పత్రులకు రెఫర్ చేశారు. ప్రతి రెఫరల్ కేసుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. రెఫరల్ కేసుల్లో సంబంధిత వ్యక్తులను ఆస్పత్రులకు తరలించి, అక్కడ వైద్య సేవలు అందేలా పర్యవేక్షిస్తున్నాం. అవసరం మేరకు ఆశ వర్కర్‌ను తోడు పంపి మరీ వైద్య సేవలు అందిస్తున్నాం. చికిత్స అనంతరం డిశ్చార్జి అయిన రోగుల ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్యంపై వాకబు చేస్తున్నాం. – డాక్టర్ రవిబాబు, మెడికల్ ఆఫీసర్, అత్తలూరు పీహెచ్సీ, పల్నాడు జిల్లా నెలలో మండలంలో నాలుగు చోట్ల నిరంతరాయంగా ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టాలని సీఎం ఆదేశించారు. జనవరి నుంచి ప్రతి మండలంలో నెలలో నాలుగు చోట్ల సురక్ష శిబిరాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇక ఇప్పటికే శిబిరాల నుంచి వచ్చిన రెఫరల్ కేసులన్నింటికీ వంద శాతం మెరుగైన, నాణ్యమైన చికిత్సలు అందించడానికి చర్యలు వేగవంతంగా చేపడుతున్నాం. – జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ -
నిరంతరం ‘ఆరోగ్య సురక్ష’
‘‘సోమవారం నాటికి.. ‘ఆరోగ్య సురక్ష’లో దాదాపు 85వేల మంది రోగులను తదుపరి చికిత్సల నిమిత్తం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్, బోధనాస్పత్రులకు రిఫర్ చేశారు. వీరందరినీ మొబైల్ యాప్ ద్వారా ట్రాక్‌చేసి, ఆస్పత్రులకు మ్యాప్ చేయాలి. ఆ తర్వాత వైఎస్సార్ విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, గ్రామ సచివాలయంలోని వైద్య, ఆరోగ్య సిబ్బందితో అనుసంధానించాలి. సిబ్బంది ద్వారా సంబంధిత రోగులకు జబ్బులు నయమయ్యే వరకూ వైద్యపరంగా చేయిపట్టి నడిపించాలి. చికిత్సానంతరం ఇంటికి వచ్చాక వారికి తోడుగా ఉంటూ, నిరంతరం ఆరోగ్య స్థితిపై వాకబు చేస్తుండాలి’’. సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి క్రమం తప్పకుండా జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు ఉంటాయని.. ప్రతి వారం మండలంలో ఈ క్యాంపు నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇలా నెలలో ఆ మండలంలో నాలుగు క్యాంపులు నిర్వహించాలని.. ఆరు నెలల్లో ప్రతి మండలం.. ప్రతి గ్రామంలో క్యాంపు జరుగుతుందన్నారు. తద్వారా సంతృప్త స్థాయిలో ప్రజలకు వైద్యసేవలు అందుతాయన్నారు. ఇదొక నిరంతర ప్రక్రియని ఆయన తెలిపారు. అలాగే, జగనన్న ఆరోగ్య సురక్ష, డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ విధానం ప్రివెంటివ్ కేర్ అత్యంత కీలకంగా వ్యవహరించనున్నాయని సీఎం చెప్పారు. ఏదైనా జబ్బు వచ్చాక వైద్యం అందించడం కన్నా.. అవి రాకుండా వాటిని నియంత్రించడమే ముఖ్యమని ఇందుకు ఈ వ్యవస్థలన్నీ ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. ప్రజారోగ్య రంగంలో పెనుమార్పులు తీసుకొచ్చే అత్యంత ముఖ్యమైన కార్యక్రమం జగనన్న ఆరోగ్య సురక్ష అని.. ఈ కార్యక్రమం ద్వారా వివిధ ఆరోగ్య సమస్యల బాధితులకు చేయూత అందించాలని జిల్లాల కలెక్టర్లకు ఆయన దిశానిర్దేశం చేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై సోమవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వర్చువల్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. జగనన్న ఆరోగ్య సురక్షపై సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత కీలకం ఐదో దశ.. ఐదు దశల్లో ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఐదో దశ కార్యక్రమం మొత్తంలో అత్యంత కీలకమైంది. ప్రస్తుతం మనం నిర్వహించే వైద్య శిబిరాలు మామూలు శిబిరాలు మాత్రం కావు. సాధారణంగా నిర్వహించే వైద్య శిబిరాలు అప్పటికప్పుడు నిర్వహించి వైద్యంచేసి మందులిస్తే అక్కడితో అంతా అయిపోతుంది. అయితే, మన కార్యక్రమంలో శిబిరాల నిర్వహణ అనంతరం అసలు పనిమొదలవుతుంది. శిబిరాలు నిర్వహించిన అనంతరం వివిధ ఆరోగ్య సమస్యల బాధితులను మనం వైద్యపరంగా చేయిపట్టి నడిపిస్తాం. ఇదే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశ్యం. ఆరోగ్య సురక్షలో భాగంగా నిర్వహిస్తున్న వైద్య శిబిరాలు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటివరకూ సురక్షలో భాగంగా పట్టణాల్లో 91 శాతం, గ్రామాల్లో 94.94 శాతం మంది జనాభా స్క్రీనింగ్ పూర్తయ్యింది. 1.44 కోట్ల గృహాలను ఏఎన్ఎం, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్ఓ)లు జల్లెడపట్టి 6.4 కోట్ల ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించారు. ప్రతి ఇంట్లో సగటున నాలుగు పరీక్షలు చేస్తూ జల్లెడ పట్టాం. గ్రామాల్లో 10,032 శిబిరాలకుగాను 98 శాతం అంటే 9,869 శిబిరాలు.. పట్టణాల్లో 2,390 శిబిరాలకు గాను 1,841 శిబిరాలు అంటే 77శాతం నిర్వహణ పూర్తయింది. ఇక గ్రామాల్లో ఈనెల 22న, పట్టణాల్లో 29 నాటికి శిబిరాల నిర్వహణ ముగుస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు మనం ఐదో దశలో ఉన్నాం. ఇక ఇక్కడి నుంచి అసలు ప్రక్రియ మొదలవుతుంది. ప్రత్యేక యాప్ ద్వారా శిబిరాలకు వచ్చిన ప్రతి ఒక్కరి వివరాలు నమోదు చేస్తున్నాం. ఎవరెవరికి తదుపరి వైద్యసేవలు అవసరం ఉంది? ఎవరెవరిని ఆస్పత్రులకు రిఫర్ చేశాం? ఎవరెవరు ఏఏ సమస్యలతో బాధపడుతున్నారన్న సమగ్ర సమాచారం మన దగ్గర ఉంది. ఈ సమాచారం ఆధారంగా మనం మూడు రకాల కార్యక్రమాలు ఈ దశలో చేపట్టాలి. కార్యక్రమం–1 జబ్బులు నయమయ్యే వరకూ చేయిపట్టి నడిపించాలి.. ఇక సోమవారం నాటికి.. దాదాపు 85వేల మంది రోగులను తదుపరి చికిత్సల నిమిత్తం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్, బోధనాస్పత్రులకు రిఫర్ చేశారు. వీరందరినీ మొబైల్ యాప్ ద్వారా ట్రాక్‌చేసి, ఆస్పత్రులకు మ్యాప్ చేయాలి. ఆ తర్వాత వైఎస్సార్ విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, గ్రామ సచివాలయంలోని వైద్య, ఆరోగ్య సిబ్బందితో అనుసంధానించాలి. సిబ్బంది ద్వారా సంబంధిత రోగులకు జబ్బులు నయమయ్యే వరకూ వైద్యపరంగా చేయిపట్టి నడిపించాలి. రిఫరల్ కేసుల్లో సంబంధిత వ్యక్తులకు ఆస్పత్రులకు వెళ్లేందుకు రవాణా ఖర్చుల కింద రూ.500 చొప్పున ఇవ్వాలి. 85వేల కేసుల్లో 13,850 మందికి ఇప్పటివరకూ చేయూతనిచ్చి తదుపరి చికిత్సల కోసం నెట్వర్క్/జిల్లా ఆస్పత్రులకు పంపించాం. మిగిలిన వారిని కూడా రాబోయే రోజుల్లో నెట్వర్క్ ఆస్పత్రులకు పంపించి వారికి మంచి చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలి. వీరందరికీ చేయూతనందిస్తూ వైద్యపరంగా చేయిపట్టి నడిపించాలి. ఈ కార్యక్రమంపై మీ అందరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇలా అన్ని ప్రాంతాల్లో శిబిరాలు నిర్వహించి, గుర్తించిన మొత్తం రిఫరల్ కేసులన్నింటికీ కూడా తదుపరి చికిత్సలు అందించే కార్యక్రమాన్ని డిసెంబర్ నెలాఖరుకల్లా పూర్తిచేయాలి. చికిత్సానంతరం ఇంటికి వచ్చాక వారికి తోడుగా ఉంటూ, నిరంతరం ఆరోగ్య స్థితిపై వాకబు చేస్తుండాలి. ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్స్‌ను 3,300కు పెంచాం. అయినప్పటికీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని.. ఎక్కడైనా ఆరుదైన ఆరోగ్య సమస్యలు, జబ్బులు బయటపడిన సందర్భాల్లో ఫ్యామిలీ డాక్టర్ రిఫరెన్స్ ద్వారా జిల్లా ఆస్పత్రికి, బోధనాసుపత్రులకు పంపించి ఉచితంగా వైద్య చికిత్సలు అందించాలి. అలాంటి రోగాలకు కూడా ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలి. ఈ మేరకు ఆరోగ్యశ్రీ అధికారులకు కూడా ఆదేశాలు జారీచేస్తున్నా. కార్యక్రమం–2 వైద్య సేవలపై ఆరా తీయాలి.. ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు చేయించుకున్న రోగులపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి. ఇందులో భాగంగా.. ► డిశ్చార్జ్ అయి వచ్చిన రోగి ఇంటికి విలేజ్ క్లినిక్ సిబ్బంది వారం రోజుల్లో వెళ్లాలి. ► ఆస్పత్రుల్లో వైద్యసేవలపై ఆరా తీయాలి. ఎలాంటి లంచాలకు తావు లేకుండా పూర్తి ఉచితంగా చికిత్సలు అందాయో లేదో తెలుసుకోవాలి. ► మందులు సక్రమంగా వాడుతున్నారో లేదో పరిశీలించాలి. ► వైఎస్సార్ ఆరోగ్య ఆసరా అందిందో లేదో నిర్ధారించుకోవాలి. ► రోగితో ఫొటో తీసుకుని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ► ఆరోగ్యశ్రీ సేవలందుకున్న రోగులకు ఏడాదిపాటు ఉచితంగా మందులు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రమం తప్పకుండా రోగులు తిరిగి ఆస్పత్రులకు వెళ్లి మందులు తీసుకునేలా చర్యలు తీసుకోవాలి. ► కానీ, సరైన అవగాహనలేక, కొందరు తెలీక.. ఇతర కారణాలతో మరికొందరు ఆస్పత్రులకు వెళ్లి మందులు తీసుకుంటున్న వారి సంఖ్య తక్కువగా ఉంటోంది. ► ఇలా చికిత్సానంతరం మూడు నెలల తర్వాత కేవలం 33 శాతం పేషెంట్లు మాత్రమే మందులు తీసుకుంటున్నారు. ► ఆరు నెలల తర్వాత 22 శాతం, ఏడాది తర్వాత చూస్తే కేవలం 8 శాతం మాత్రమే ఉంటున్నారు. ► ఇలాంటి పరిస్థితులు ఇకపై ఉండకూడదు. నిర్ణీత సమయానికి రోగులు ఠంఛన్‌గా వెళ్లి మందులు తీసుకునేలా చూడాలి. ► ఈ మేరకు మొబైల్ యాప్‌లో తగిన విధంగా ఫీచర్లు తీసుకొచ్చాం. ► రోగులు నిర్ణీత కాలానికి ఆస్పత్రులకు వెళ్లేలా చూడాల్సిన బాధ్యత విలేజ్ క్లినిక్స్‌కు, ఫ్యామిలీ డాక్టర్‌కు ఉంది. కార్యక్రమం–3 మందులు ఎంత ఖరీదైనా సరే అందించాలి.. కిడ్నీ, లివర్ రోగులతో పాటు, మస్క్యులర్ డిస్ట్రోపీ బాధితులు ఖరీదైన మందులు వాడాల్సి ఉంటుంది. అంత ఖరీదైన మందులను పేద, మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేయలేరు. అలాంటి వారికి మందులు అందిస్తూ చేయూతనివ్వాలి. మందులు ఎంత ఖరీదైనా సరే వెనకడుగు వేయకుండా మనం అందించాలి. ఈ మేరకు అధికారులందరికీ కూడా స్పష్టమైన ఆదేశాలిచ్చాను. గ్రామ, వార్డు సచివాలయం, విలేజ్ క్లినిక్స్ ఆధారంగా మ్యాపింగ్ చేసి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో అనుసంధానం చేయాలి. వైద్యం కోసం ప్రజలు ఖర్చుపెట్టకుండా చూడాలి.. ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలన్న దానిపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలి. పథకం ద్వారా ఉచితంగా సేవలు పొందడం గురించి తెలియని వ్యక్తి రాష్ట్రంలో ఉండకూడదు. డిసెంబరు ఒకటో తేదీ నుంచి ఈ కార్యక్రమం నిర్వహించాలి. మంచి ఫీచర్లతో ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని ఇదివరకే ఆదేశాలిచ్చాను. ఈ కార్డుల పంపిణీ కూడా అదేరోజు నుంచి ప్రారంభించాలి. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరి ఫోన్లో ఆరోగ్యశ్రీ యాప్ ఉండాలి. 1.24 కోట్ల మంది మహిళలు దిశ యాప్‌ను తమ ఫోన్లలో రిజిస్టర్ చేసుకున్నారు. ఈ తరహాలోనే ప్రతి ఫోన్లో ఆరోగ్యశ్రీ యాప్ ఉండాలి. ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగోకపోతే ఆరోగ్యశ్రీ చికిత్స కోసం ఎక్కడకు వెళ్లాలన్న దానిపై పూర్తి వివరాలు ఈ యాప్‌లో ఉంటాయి. దీనిపై ఎలాంటి సందేహాలు ఎవ్వరికీ ఉండకూడదు. యాప్‌లోకి వెళ్తే సమీపంలోని ఎంపానెల్ ఆస్పత్రికి మార్గం చూపిస్తుంది. లేకపోతే విలేజ్ క్లినిక్‌లో సంప్రదించినా, 104కు ఫోన్‌చేసినా గైడ్ చేస్తారు. ఆరోగ్యశ్రీ సేవలను ఎలా పొందాలన్న దానిపై బుక్లెట్ కూడా ప్రతి కుటుంబానికీ అందిస్తారు. ఆరోగ్యశ్రీని వినియోగించుకోవడంపై సీహెచ్ఓ, ఏఎన్‌ఎలు, ఆశా వర్కర్లు అవగాహన కలిగించాలి. ఇక వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 950 నెట్వర్క్ ఆసుపత్రులుంటే, ప్రస్తుతం 2,295 ఆస్పత్రుల్లో సేవలు అందుతున్నాయి. మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లోని పెద్దపెద్ద కార్పొరేట్ ఆస్పత్రులను ఆరోగ్యశ్రీలో ఎంప్యానెల్ చేశాం. అయినా వైద్యం కోసం ప్రజలు ఎందుకు తమ జేబుల్లో నుంచి డబ్బులు ఖర్చుచేసుకోవాలి? అలాంటి పరిస్థితులు ఇకపై లేకుండా చూడటం మనందరి బాధ్యత. 8.72 లక్షల మందికి కంటి పరీక్షలు.. ఇక ఆరోగ్య సురక్షలో కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 8.72 లక్షల మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. 5.22 లక్షల మందికి కంటి అద్దాలు ఇవ్వాలని డాక్టర్లు సిఫారసు చేశారు. వీరికి వెంటనే వాటిని అందించేలా చర్యలు తీసుకోవాలి. అలాగే, 73,474 మందికి కంటి సర్జరీలు చేయాలని గుర్తించారు. వీరికీ సర్జరీలు చేయించాలి. డిసెంబర్ నెలాఖరు నాటికి ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తికావాలి. మరోవైపు.. రక్తపోటు కేసులు 2,48,638గా.. మధుమేహం 1,49,879 కేసులను గుర్తించారు. వీరిందరికీ నిర్ధారణ పరీక్షలు చేసి మందులివ్వాలి. ఆ తర్వాత వారి ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి. ప్రివెంటివ్ కేర్‌లో ఇది చాలా కీలకమైన అంశం. పౌష్టికాహారం లోపం, రక్తహీనత సమస్యలను పూర్తిగా నివారించాలి. ఈ సమస్యలతో బాధపడుతున్న వారికి సంపూర్ణ పోషణ కింద పౌష్టికాహారం, మందులు అందుతున్నాయో లేదో విలేజ్ క్లినిక్స్ ద్వారా పరిశీలించాలి. రక్తహీనత బాధితుల మీద మహిళా, శిశుసంక్షేమ శాఖ అధికారులు దృష్టిపెట్టాలి. మందులు, సంపూర్ణ పోషణం ప్లస్ ద్వారా తగిన ఆహారం కూడా ఇప్పించాలి. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ వ్యవస్థలు లేవు.. దేశంలో ఏ రాష్ట్రంలోని కలెక్టర్లకు లేని యంత్రాంగం, మన రాష్ట్రంలో కలెక్టర్లకు ఉంది. అలాగే, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, గ్రామ సచివాలయంలాంటి వ్యవస్థలు లేవు. ఇవన్నీ సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనలో మనల్ని అన్ని రాష్ట్రాలకన్నా ముందు ఉంచేందుకు ఉపయోగపడతాయి. కలెక్టర్లకు మంచి అభిరుచి ఉంటే కచ్చితంగా లక్ష్యాలు సాధిస్తాం. ప్రతి కలెక్టర్ దీన్ని సవాల్‌గా తీసుకుని, జీరో ఎనీమిక్ కేసులు దిశగా ప్రయత్నించాలి. అలాగే, 9,969 లెప్రసీ అనుమానాస్పద కేసులున్నాయి. వీరందరికీ వెంటనే నిర్ధారణ పరీక్షలు చేపట్టాలి. 442 మందికి టీబీ ఉన్నట్లుగా నిర్ధారణ అయ్యింది. వీరికి సక్రమంగా మందులు అందించాలి. 1,239 మంది చిన్నారులు 4–డి (డెఫీషియన్సీస్, డిఫెక్టŠస్ ఎట్ బర్త్, డిసీజెస్, డెవలప్మెంటల్ డిలేస్) సమస్యలతో బాధపడుతున్నట్లుగా తేలింది. సాధ్యమైనంత త్వరగా వీరికి అవసరమైన చికిత్సలు అందించడంపై దృష్టిపెట్టాలి. కాక్లియర్ ఇంప్లాంట్ చికిత్సలు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అందిస్తే పిల్లలు ఈ సమస్యల నుంచి బయటపడతారు. సేవలు మరింత విస్తరిస్తాం.. టెరిషరీ కేర్ వైద్యసేవలను రాబోయే రోజుల్లో మరింత విస్తరిస్తున్నాం. ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. ప్రతి జిల్లాలో అత్యాధునిక సేవలు అందించే బోధనాసుపత్రి అందుబాటులో ఉంటుంది. ఒకవైపు పాత ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా అభివృద్ధిపరుస్తూనే ఇవన్నీ చేపడుతున్నాం. ఇక నియామకాల పాలసీ మీద కలెక్టర్లు పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. ప్రతి జిల్లాలో స్పెషలిస్టు, ఎంబీబీఎస్ డాక్టర్లు, ఇతర సిబ్బంది కొరత లేకుండా సంబంధిత జిల్లాల కలెక్టర్లు చూసుకోవాలి. ఇప్పటికే కేవలం ఆరోగ్య రంగంలో 53 వేల ఖాళీలను మనం భర్తీచేశాం. ఈ నేపథ్యంలో.. ఎక్కడ ఖాళీలున్నా, వెంటనే భర్తీచేసేలా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలి. ఆరోగ్య రంగాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నాం కాబట్టే, రాష్ట్రంలో తొలిసారిగా మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డును çసృష్టించాం. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి, సీఎస్ డాక్టర్ జవహర్‌రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కృష్ణబాబు, అజయ్‌జైన్, కార్యదర్శులు గుల్జార్, డాక్టర్ మంజుల, చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్సెస్ గిరిజాశంకర్, ఆరోగ్యశ్రీ సీఈఓ హరేంధిరప్రసాద్, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
సెల్ ఫోన్లలో ఆరోగ్యశ్రీ
-
వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ఉత్తమ పథకం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేద ప్రజలకు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా అత్యాధునిక కార్పొరేట్ వైద్యాన్ని అందించడమే కాకుండా, శస్త్ర చికిత్స చేయించుకున్న వారికి ఆర్థిక తోడ్పాటునందించడానికి ప్రవేశ పెట్టిన డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకం జాతీయ స్థాయిలో ప్రశంసలందుకుంటోంది. డా. వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ఉత్తమ పథకమని, దాని అమలు సాహసోపేతమైన చర్య అని ఏకంగా నేషనల్ హెల్త్ అథారిటీనే అభివర్ణించింది. ఈ పథకం శస్త్ర చికిత్స చేయించుకుని, విశ్రాంతి తీసుకునే సమయంలో పేదల జీవనోపాధికి పెద్ద భరోసా ఇస్తోందని తెలిపింది. ప్రజారోగ్య రంగంలో ఉత్తమ పద్ధతులు, ఆవిష్కరణలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోందని నేషనల్ హెల్త్ అథారిటీ కితాబునిచ్చింది. వివిధ రాష్ట్రాల్లో ఆరోగ్య బీమాలో అనుసరిస్తున్న విధానాలను అథ్యయనం చేసిన అథారిటీ.. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకంపై ప్రశంసలు కురిపించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం పేద కుటుంబాల్లోని వారు శస్త్ర చికిత్సలు చేయించుకున్న అనంతరం విశ్రాంతి సమయంలో గృహ ఖర్చులకు రక్షణ కవచంగా నిలుస్తోందని పేర్కొంది. ఇది చాలా పెద్ద కార్యక్రమమైనప్పటికీ, వైఎస్ జగన్ ప్రభుత్వం విజయవంతంగా కొనసాగిస్తోందని తెలిపింది. ‘శస్త్ర చికిత్స చేయించుకునే రోగులకు కోలుకోవడానికి కొన్ని రోజులు విశ్రాంతి అవసరం. ఆ సమయంలో రోగి జీవనోపాధిని కోల్పోయి, ఆర్థికంగా నష్టపోతారు. విశ్రాంతి సమయంలో రోజువారి వేతనాలు రాకపోవడంతో ఆ కుటుంబాల్లో ఆర్థిక సంక్షోభం నెలకొంటుంది. కుటుంబాల నిర్వహణ కష్టమవుతుంది. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకం ద్వారా వారి గృహ ఖర్చులకు రక్షణ కల్పింస్తోంది’ అని అథారిటీ తెలిపింది. శస్త్ర చికిత్స చేయించుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 48 గంటల్లోనే ఆ పేద కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా భత్యం జమ అవుతోందని పేర్కొంది. విశ్రాంతి సమయంలో రోజుకు రూ.225 చొప్పున గరిష్టంగా రూ. 5,000 వరకు పేద కుటుంబాల ఖాతాల్లో జమ చేస్తున్నారని, మరే ఇతర రాష్ల్రాల్లో ఇలాంటి పథకం లేదని అథారిటీ తెలిపింది. యూనివర్సల్ హెల్త్ కవరేజీలో ఏపీ ముందడుగు యూనివర్సల్ హెల్త్ కవరేజీని సాధించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందడుగు వేసిందని అథారిటీ తెలిపింది. రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న పేద కుటుంబాలను రేషన్ కార్డుతో సంబంధం లేకుండా నవశకం కార్యక్రమం కింద గుర్తించి ఆ కుటుంబాలకు డా.వైఎస్సార్ ఆరోగ్య శ్రీ స్మార్ట్ హెల్త్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపింది. క్యూఆర్ కోడ్, యూనిక్ ఐడీ నెంబర్లతో కూడిన ఈ స్మార్ట్ హెల్త్ కార్డులతో లబ్ధిదారుల వైద్య రికార్డుల నిర్వహణ మెరుగుపడిందని పేర్కొంది. అంతే కాకుండా రోగి వివరాల గోప్యతకు, భద్రతకు ఈ కార్డులు రక్షణ కల్పింస్తున్నాయని చెప్పింది. కుటుంబ యజమాని, సభ్యులందరి వివరాలను, గ్రామ, వార్డు సచివాలయాల వివరాలను కూడా కార్డుల్లో పొందుపరిచారని పేర్కొంది. ఆరోగ్య శ్రీ స్మార్ట్ హెల్త్ కార్డులు చాలా నాణ్యతతో ఉన్నాయని, పదేళ్లకుపైగా మన్నిక ఉంటుందని తెలిపింది. -
జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే @ 5.28 కోట్లు
సాక్షి, అమరావతి : జగనన్న ఆరోగ్య సురక్ష ఇంటింటి సర్వే ద్వారా రాష్ట్రంలో పౌరులకు రికార్డు స్థాయిలో ఉచితంగా వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నెల 11వరకు మొత్తం 5,28,33,324(ఏడు రకాల) వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 16వ తేదీ నుంచి ఏఎన్ఎంలు, కమ్యునిటీ హెల్త్ ఆఫీ సర్లు ఇంటింటికీ వెళ్లి ఆ ఇంట్లో వారికి ఆరోగ్య పరీక్షలు చేయడం ప్రారంభించారు. మరోవైపు, గత నెల 30వ తేదీ నుంచి ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. శిబిరాలకు భారీగా జనం వచ్చి అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు మందులు తీసుకుంటున్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష ఇంటింటి సర్వేలో మొత్తం ఏడు రకాల పరీక్షలు చేస్తున్నారు. బీపీ, షుగర్, మూత్ర (యూరిన్), హిమోగ్లోబిన్, మలేరియా, డెంగీ, కఫం పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య శిబిరాలకు రాక ముందే పౌరుల ప్రొఫైల్‌తో కూడిన కేస్ షీట్‌ను ప్రింట్ చేసి ఇస్తున్నారు. అలాగే ఇంటింటి సర్వే రోగులకూ ఆరోగ్య శిబిరాల్లో కేస్ షీట్ ఇస్తున్నారు. వీరందరికీ ఆరోగ్య శిబిరాల్లో స్పెష లిస్ట్ సేవలందిస్తున్నారు. మహిళా రోగుల కో సం ప్రత్యేకంగా మహిళా వైద్యులు సేవలందిస్తు న్నారు. 172 రకాల డ్రగ్స్ అందుబాటులో ఉంచి.. అవస రాన్ని బట్టి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఎల్ ఎఫ్టీ, ఆర్ఎఫ్టీ, సీరమ్ వంటి 53 రకాల తదుపరి పరీక్షల కోసం పీహెచ్‌సీలకు అను సంధానం చేయ డంతో పాటు ఏఎన్ఎం ద్వారా పరీ క్షల ఫలితాలను తెలియజేస్తున్నారు. ఆ తర్వాత ఫ్యామిలీ డాక్టర్ ద్వారా ఫాలోఅప్ చేయిస్తున్నారు. పెద్ద చికిత్సలు అవసరమైన వారిని నెట్వర్క్ ఆస్ప త్రులకు రిఫర్ చేస్తున్నారు. పోషకాహార ప్రదర్శనలతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎలా తయారుచేయాలనే దానిపైనా కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఆరోగ్య శిబిరాల్లో టీబీ, కుష్టు పరీక్షలు చేసిన ప్పుడు పాజిటివ్ అని తేలితే ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. శిబిరాల్లోనే ఆరోగ్యశ్రీ కార్డులు ఆరోగ్య శ్రీ కార్డుల్లేని అర్హులైనవారికి ఆరోగ్య శిబిరాల్లోనే కార్డులు మంజూరుచేస్తున్నారు. తీవ్రమైన పోష కాహార లోపం కేసులను గుర్తించడంతో పాటు, పోష కాహార పునరావాస కేంద్రాలకు సిఫారుసు చేస్తు న్నారు. పిల్లల్లో పుట్టకతో వచ్చే లోపాలను గుర్తించి అవసరమైన చికిత్సలు సూచిస్తున్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో చికిత్సలకు వచ్చే వారి కోసం కుర్చీలు, తాగునీటి వసతి కల్పిస్తున్నారు. ఆ రోగ్య శిబిరాల నిర్వహణకు ఒక్కో విలేజ్ క్లినిక్‌కు రూ.20 వేల చొప్పున, పట్టణ పీహెచ్‌లకు రూ.40 వేల చొప్పున ప్రభుత్వం విడుదల చేసింది. ఆరోగ్య శిబిరాలను సజావుగా నిర్వహించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో పీహెచ్సీ పరిధిలో నలుగురు, పట్టణాల్లో 4–5 పీహెచ్‌సీల పరిధిలో ఒకరిని పర్యవేక్షణ కోసం నియమించారు. -
ఈనాడు ఆరోపణలు అవాస్తవం
-
రాష్ట్రంలో 1.42 కోట్ల కుటుంబాలకు సంజీవనిగా డా.వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ
-
ఆరోగ్యశ్రీ సేవలు చాలా బాగున్నాయి
కష్టకాలంలో ఆదుకున్నారు గుండెకు బైపాస్ సర్జరీ చేయాలన్నారు. నా భర్త ఆటో డ్రైవర్. రోజువారి సంపాదన కుటుంబ పోషణకు సరిపోతుంది. బైపాస్ సర్జరీ అంటే బయట అప్పులు చేయాలని భయపడ్డాను. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్ చేయిస్తుందని చెప్పారు. ఫిబ్రవరిలో ఆపరేషన్ చేశారు. అనంతరం విశ్రాంత సమయానికి రూ. 9,500 భృతిని ఆరోగ్య ఆసరా కింద ఇచ్చారు. చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టకుండా ఆపరేషన్ పూర్తి అయింది. పేదల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధకు నాలాంటి ఎంతోమంది ప్రాణాలను నిలుపుకుని సంతోషంగా ఉంటున్నారు. కష్టకాలంలో సీఎం జగన్ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంది. – అల్లంశెట్టి రాజ్యలక్ష్మి, ఒంగోలు, ప్రకాశం జిల్లా సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 1.42 కోట్ల కుటుంబాలకు సంజీవని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆయా కుటుంబాల వారికి ఏదైనా అనారోగ్యం వస్తే రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం లభిస్తుంది. ఇంతటి ప్రతిష్టాత్మకమైన ఈ పథకం అమలుపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తొలి నుంచి ప్రత్యేక దృష్టి పెడుతూ వస్తోంది. సంతృప్తకర స్థాయిలో ప్రజలకు సేవలు అందించేలా విప్లవాత్మక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పథకం కింద చికిత్స పొందిన రోగుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. చికిత్స పొందిన రోగుల్లో సుమారు వంద శాతం సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అతి కొద్ది మంది మాత్రమే సేవల్లో సమస్యలను ప్రస్తావించారు. ఈ స్వల్ప సమస్యలను కూడా సరిదిద్దడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. 99.71 శాతం మంది సంతృప్తి ఆరోగ్యశ్రీ సేవల్లో లోటుపాట్లు ఏమైనా ఉంటే వాటిని సర్దుబాటు చేసి ప్రజలకు వంద శాతం సంతృప్తికరంగా సేవలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా గతేడాది ఆగస్టు 16 నుంచి ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందిన రోగుల నుంచి అభిప్రాయ సేకరణను ప్రారంభించారు. రోగి ఆస్పత్రి నుంచి డిశ్చార్జయి ఇంటికి వెళ్లిన వారం నుంచి 10 రోజుల్లో ఏఎన్ఎం సంబంధిత రోగి ఇంటికి వెళ్లి రోగి ఆరోగ్య పరిస్థితులపై వాకబు చేస్తున్నారు. అలాగే ఆరోగ్యశ్రీ సేవలపైనా అభిప్రాయం సేకరిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించారు. ఇప్పటి వరకూ పథకం కింద చికిత్స పొందిన 15,43,831 మంది నుంచి అభిప్రాయాలు తీసుకోగా.. 15,39,506 మంది అంటే 99.71 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం 0.29 శాతం మంది మాత్రమే సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదురైనట్టు చెప్పారు. ఈ సమస్యలను క్రమశిక్షణ కమిటీల ద్వారా విచారించి, కారణాలను అన్వేషించి బాధ్యులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. డబ్బు వసూళ్లకు పాల్పడ్డారా? నెట్వర్క్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని డిశ్చార్జయిన రోగి చిరునామా ఆధారంగా సంబంధిత ఏఎన్ఎంకు యాప్ ద్వారా వివరాలు వెళతాయి. చికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితిపై ఏఎన్ఎం ఆరా తీసి.. యాప్‌లో రూపొందించిన పలు ప్రశ్నలపై సమాధానాలు రాబడతారు. చికిత్స కోసం నెట్వర్క్ ఆస్పత్రికి వెళ్లినప్పుడు డబ్బు డిమాండ్ చేశారా? వైద్య సేవలు, సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి? ఆరోగ్యమిత్ర సహకారం ఎలా ఉంది? మందులు ఉచితంగా ఇచ్చారా? లేదా? తదితర ప్రశ్నలకు సమాధానం రాబడతారు. ఇలా సేకరించిన అభిప్రాయాన్ని యాప్‌లో నమోదు చేస్తారు. రోగులు ఎవరైనా సమస్యలు తెలియజేసినట్లయితే.. సంబంధిత జిల్లా కో–ఆర్డినేటర్ల లాగిన్‌కు వెళతాయి. కో–ఆర్డినేటర్ విచారణ చేపట్టి కారణాలను అన్వేషించాల్సి ఉంటుంది. రోగుల నుంచి డబ్బు వసూళ్లకు పాల్పడిన సందర్భాల్లో రూ. 20 వేలలోపు డబ్బు వసూళ్ల ఆరోపణల్లో జిల్లా స్థాయిలో, ఆపైన వసూళ్ల కేసులను రాష్ట్ర స్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటున్నారు. ప్రజారోగ్యానికి భరోసా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజల ఆరోగ్యాలకు సీఎం జగన్ ప్రభుత్వం భరోసాగా ఉంటోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 1,059 ప్రొసీజర్లు ఈ పథకంలో అందుబాటులో ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య ఏకంగా 3,257కు పెంచారు. 2019 నుంచి ఈ ఏడాది ఆగస్టు నెలాఖరు నాటికి 46.12 లక్షల మందికి ఉచితంగా వైద్యం అందించారు. ఏకంగా రూ. 9,193.61 కోట్లు ఖర్చు చేశారు. చికిత్స అనంతరం విశ్రాంత సమయంలో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కార్యక్రమం కింద ఆర్థికంగా చేయూత ఇస్తున్నారు. ఇలా రూ. వెయ్యి కోట్లకుపైగా ప్రభుత్వం రోగులకు సాయం చేసింది. 104కు ఫిర్యాదు చేయవచ్చు ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు ఈ పథకం కింద పూర్తి ఉచితంగా అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఆ మేరకు చర్యలు చేపడుతున్నాం. రోగుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టి అవకతవకలకు పాల్పడిన ఆస్పత్రులపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. ప్రజలు 104కు ఫిర్యాదు చేయవచ్చు. – ఎం.ఎన్. హరేంధిరప్రసాద్, సీఈవో, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ జవాబుదారీతనం పెరుగుతుంది చికిత్స అనంతరం రోగుల నుంచి అభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. ఎక్కడైనా సమస్యలు ఎదురైతే ప్రజలు ఫిర్యాదు చేయడానికి వీలుంటుంది. ఇది మంచి పరిణామం. ఈ తరహా విధానాలతో నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాల్లో జవాబుదారీతనం పెరుగుతుంది. రోగులకు ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. – డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, ఏపీ ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ అధ్యక్షుడు -
AP: ఇంటింటికీ ఆరోగ్య రక్ష
రాష్ట్రంలో ప్రతి ఇంటిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని ఆరోగ్యపరంగా సురక్షితంగా ఉంచే కార్యక్రమమే ‘జగనన్న ఆరోగ్య సురక్ష’. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ప్రజల ఆరోగ్య సమస్యలను తెలుసుకోవడంతోపాటు వాటిని పరిష్కరించే గొప్ప బాధ్యతను ప్రభుత్వం స్వీకరిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే ఇప్పటికే అమలు చేసిన జగనన్న సురక్ష కార్యక్రమం తరహాలోనే ఇప్పుడు ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. మొత్తం ఐదు దశల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని హెల్త్ క్యాంపులతో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జగనన్న సురక్ష ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించామని, సుమారు 98 లక్షలకు పైగా సర్టిఫికెట్లను నెల రోజుల వ్యవధిలో అందించినట్లు గుర్తు చేశారు. దీని ద్వారా ప్రభుత్వం మీకు అందుబాటులో, మీ గ్రామంలోనే ఉందనే భరోసా ఇవ్వగలిగామన్నారు. అదే మాదిరిగానే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వివరించారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ కార్యక్రమం అమలుపై అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్య పొందడంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ రూపొందించిన బ్రోచర్‌ను ఈ సందర్భంగా సీఎం జగన్ ఆవిష్కరించారు. సమీక్షలో సీఎం ఏమన్నారంటే.. ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెను మార్పులకు శ్రీకారం జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి ఇంటినీ సందర్శించి మ్యాపింగ్ చేస్తారు. ఏ ఇంట్లో ఎవరు ఎలాంటి ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారో గుర్తిస్తారు. గ్రామాల్లో నిర్వహించే ప్రత్యేక హెల్త్ క్యాంప్‌ల ద్వారా వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి అవసరమైన పరీక్షలు చేయడం పాటు మందులు, కళ్లద్దాలు అందిస్తారు. క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు లాంటి దీర్ఘకాలిక జబ్బుల బాధితులను (క్రానిక్ డీసీజెస్) గుర్తించడం, రెగ్యులర్‌గా చెకప్ చేయడం, డాక్టర్లు ఎప్పటికప్పుడు పరిశీలించడం, మందులను అందించడం, అవసరమైతే ఆస్పత్రులకు పంపడం లాంటి జాగ్రత్తలతో అనారోగ్య బాధితులను పూర్తిగా చేయి పట్టుకుని నడిపించే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. గ్రామం పూర్తి బాధ్యతను ఫ్యామిలీ డాక్టర్ తీసుకోవాలి. రెగ్యులర్‌గా ఒకవైపు తనిఖీలు చేస్తూనే మందులు కూడా ఇవ్వబోతున్నాం. ఎక్కడా మందులు లేని పరిస్థితి ఉండకూడదు. ఇలా చాలా పెద్ద మార్పులకు శ్రీకారం చుడుతున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇల్లూ కవర్ కావాలి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులున్న ఇళ్లను ప్రత్యేకంగా పరిగణించి కాలానుగుణంగా పరీక్షలు చేస్తూ మందులు, చికిత్స అందించాలి. సంపూర్ణ రక్తహీనత నివారణ రాష్ట్రంలో జీరో అనిమిక్ (రక్తహీనత) లక్ష్యంగా పని చేయాలి. ఆరోగ్య సురక్షలో గర్భిణులు, బాలింతలతో పాటు రక్తహీనత బాధితులను కూడా గుర్తించి మందులతో పాటు, పుడ్ సప్లిమెంటేషన్ అందచేస్తాం. దీర్ఘకాలిక వ్యాధులు, నియోనేటల్ అండ్ ఇన్ఫాంట్ కేర్ (నవజాత శిశువులు, చిన్నారులు) కేసులను పరిగణలోకి తీసుకోవడంతో పాటు బీపీ, షుగర్ లాంటి సమస్యలున్న వారికి చికిత్స అందించాలి. ఒకవైపు సరైన సమయంలో చికిత్స అందిస్తూనే జీవన విధానాల్లో తీసుకోవాల్సిన మార్పులు, ఆయా వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలపై (ప్రివెంటివ్ కేర్) ప్రజల్లో అవగాహన పెంపొందించాలి. దీన్ని కూడా ఈ కార్యక్రమంలో భాగంగా చేపట్టాలి. 45 రోజుల తర్వాత కూడా.. మనం 45 రోజుల పాటు తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని ఆ తర్వాత కూడా చేపట్టాలి. ప్రతి మండలంలోనూ నెలకు కనీసం 4 గ్రామాల్లో ఈ క్యాంపులను నిర్వహించాలి. దీంతో ప్రతి 6 నెలలకు ఒకసారి ఆ మండలంలో ఉన్న ప్రతి గ్రామంలోనూ హెల్త్ క్యాంపు నిర్వహించినట్లు అవుతుంది. క్యాంప్‌లలో నలుగురు వైద్యులు హెల్త్ క్యాంప్‌లలో నలుగురు డాక్టర్లు పాల్గొంటారు. ఇందులో ఇద్దరు పీహెచ్సీ డాక్టర్లు, మరో ఇద్దరు స్పెషలిస్టు డాక్టర్లు ఉంటారు. స్పెషలిస్ట్ వైద్యుల్లో గైనిక్/పీడియాట్రిక్ స్పెషలిస్టు డాక్టర్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. కంటి పరీక్షలను కూడా క్యాంపులో భాగంగా చేపట్టాలి. స్కూళ్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలి. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అనుకూలంగా ఉంటుంది. ఎంపీడీవో, ఎమ్మార్వోలు ఈ మెడికల్ క్యాంపు నిర్వహణ బాధ్యతలు తీసుకోవాలి. హెల్త్ క్యాంపు నిర్వహణకు అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. అధికారులకు ఈ కార్యక్రమంపై ఎలాంటి సందేహాలున్నా సీఎంవో (ముఖ్యమంత్రి కార్యాలయం)తో నివృత్తి చేసుకోవాలి. ప్రతి పేషెంట్‌కు ఉచిత వైద్యమే లక్ష్యం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద అర్హులందరికీ రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం అందాలి. పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి. ఆరోగ్య సురక్ష తొలి, రెండో దశల్లో వలంటీర్లు, సీహెచ్‌వోలు, ఏఎన్ఎంలు, ఆశాలు ప్రత్యేకంగా రూపొందించిన ఆరోగ్యశ్రీ బ్రోచర్లను ప్రజలకు అందజేయాలి. ఆరోగ్యశ్రీ యాప్‌ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవడం, వినియోగంపై వివరించాలి. ఆరోగ్యశ్రీలో గతంలో 1,050 ప్రొసీజర్లు మాత్రమే ఉంటే మనం 3,256కి పెంచాం. పథకం పరిధిని విస్తృతం చేశాం. ప్రతి పేషెంట్ ఈ సేవలను ఉచితంగా అందుకోవాలన్నదే మన లక్ష్యం. ఏ ఒక్కరూ వైద్యం కోసం అప్పులపాలయ్యే పరిస్థితులు ఉండకూడదు. ప్రివెంటివ్ కేర్‌లో నూతన అధ్యాయం ఈ నాలుగేళ్లలో ఒక్క వైద్య, ఆరోగ్య శాఖలోనే 53,126 పోస్టులను భర్తీ చేశాం. ఎక్కడైనా ఖాళీలు ఏర్పడితే వెంటనే భర్తీ చేసేలా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా చర్యలు తీసుకుంటున్నాం. గతంలో ఈ తరహా కార్యక్రమాన్ని ఎవరూ, ఎప్పుడూ చేయలేదు. నాడు–నేడుతో అన్ని ఆసుపత్రులను జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేశాం. రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలలతోపాటు వీటికి అదనంగా 5 మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏజెన్సీలో నిర్మిస్తున్నాం. ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్‌ల పాత్ర ప్రివెంటివ్ కేర్‌లో ఒక కొత్త అధ్యాయం. ► సమీక్షలో వైద్య శాఖ మంత్రి మంత్రి విడదల రజిని, సీఎస్ డాక్టర్ జవహర్‌రెడ్డి, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ సాయిప్రసాద్, వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్ జానకి, సీసీఎల్ఏ కార్యదర్శి ఇంతియాజ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్, ఆర్థిక శాఖ కార్యదర్శి గుల్జార్, గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ వెంకట మురళీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఐదు దశల్లో ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ఇలా... (( 1)) వలంటీర్లు, గృహ సారథులు, ప్రజాప్రతినిధులు.. ఈ ముగ్గురూ కలిసి ప్రతి ఇంటినీ సందర్శిస్తారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం గురించి ప్రజలకు వివరిస్తారు. తేదీతో పాటు ఏయే సేవలు అందిస్తారో గ్రామం/పట్టణం వారీగా తెలియజేస్తారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీపై కూడా అవగాహన కల్పిస్తారు. ఆరోగ్యశ్రీ పథకంలో నెట్వర్క్ ఆస్పత్రులు ఎక్కడ ఉన్నాయి? ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఎలా ఆ ఆస్పత్రులకు వెళ్లాలి? ఉచిత వైద్య సేవలను ఎలా వినియోగించుకోవాలనే దానిపై అవగాహన కల్పిస్తారు. అనంతరం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్‌వో), ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల బృందం ఆయా కుటుంబాల వద్దకు వస్తుందని, ప్రతి ఇంట్లోనూ పౌరులందరితో మాట్లాడి 7 రకాల టెస్టులకు సంబంధించిన అంశాలను మీతో చర్చిస్తారని తెలియజేస్తారు. ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ క్యాంపెయిన్ మొదలవుతుంది. ((2)) సీహెచ్‌వో ఆధ్వర్యంలో ఏఎన్ఎం, ఆశావర్కర్, వలంటీర్లు అన్ని ఇళ్లను సందర్శిస్తారు. ప్రజలకు వారి ఇంటివద్దే బీపీ, షుగర్, హిమోగ్లోబిన్, యూరిన్, స్పూటమ్ (కఫం) పరీక్షలతోపాటు జ్వరంతో బాధపడుతున్న వారికి మలేరియా, డెంగీ లాంటి మొత్తం ఏడు రకాల పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య పరీక్షల ఫలితం ఆధారంగా సేకరించిన వివరాలను మొబైల్ యాప్‌లో నమోదు చేస్తారు. అనంతరం ప్రతి ఇంటికి, పేషెంట్‌కి ఒక కేష్ షీట్ జనరేట్ అవుతుంది. ఈ డేటా వివరాలు హెల్త్ క్యాంపు జరిగే నాటికి ఉపయోగపడతాయి. ((3)) మరోసారి ఓరియెంటేషన్ కార్యక్రమం ఉంటుంది. గ్రామం/పట్టణంలో హెల్త్ క్యాంప్ నిర్వహించటానికి మూడు రోజులు ముందుగానే వలంటీర్, గృహ సారధులు, ప్రజా ప్రతినిధులు ఆయా చోట్ల ప్రజలకు మరోసారి గుర్తు చేస్తారు. క్యాంప్ నిర్వహించే రోజు అందుబాటులో ఉండాలని సమాచారం ఇస్తారు. ((4)) గ్రామం/పట్టణంలో హెల్త్ క్యాంపు నిర్వహిస్తారు. ఈ నెల 30వతేదీ నుంచి హెల్త్ క్యాంపులు ప్రారంభం అవుతాయి. ప్రతి రోజూ ప్రతి మండలంలో ఏదో ఒక గ్రామం/పట్టణంలో క్యాంపు నిర్వహిస్తారు. గ్రామాల్లో వైఎస్సార్ విలేజ్ క్లినిక్/పట్టణాల్లో వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని యూనిట్‌గా తీసుకుని 45 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపులు జరుగుతాయి. ((5)) ప్రతి గ్రామంలో జల్లెడ పట్టిన తర్వాత ప్రజల ఆరోగ్య వివరాలు హ్యాండ్ హోల్డింగ్‌లో ఉండాలి. వివిధ సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించాక వారికి కాలానుగుణంగా టెస్టింగ్, కన్సల్టేషన్, మందులు ఇవ్వడం అన్నది ఈ కార్యక్రమంలో ప్రధాన అంశం. మందులు లేవు, దొరకడం లేదు అన్న మాటే వినిపించకుండా చర్యలు. -
‘ఫ్యామిలీ డాక్టర్’తో పల్లెకు రక్ష
(పమిడివారిపాలెం, పెదపాలెం, కాకుమాను గ్రామాల నుంచి సాక్షి ప్రతినిధి వడ్డే బాలశేఖర్): ‘ఏం తాత.. ఆరోగ్యం ఎలా ఉంది? మందు బిళ్లలు సమయానికి వేసుకుంటున్నావా?’ అని డాక్టర్ అడిగితే.. ‘ఆరోగ్యం బాగానే ఉంది’ అనేలా రెండు చేతులు కదిలిస్తూ సైగల ద్వారా ఆరి నాగేశ్వరరావు సమాధానం ఇచ్చారు. ఇంతలో పక్కనే ఉన్న నాగేశ్వరరావు భార్య విమల మాట్లాడుతూ.. ‘మీరు చెప్పినట్టే మాత్రలు సమయానికి వేస్తున్నాం. రోజులో 3 సార్లు పడుకునే స్థితి (పొజిషన్)లో మార్పులు చేస్తున్నాం’ అని వివరించింది. గుంటూరు జిల్లా కాకుమానుకు చెందిన వృద్ధుడు నాగేశ్వరరావు రెండేళ్లుగా ఆర్థో, న్యూరో సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నాడు. వీటికి తోడు బీపీ సమస్య కూడా ఉంది. వయోభారం, అనారోగ్య సమస్యల రీత్యా మంచానికి పరిమితం అయ్యాడు. దీంతో క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుని, మందులు తీసుకోవడం కోసం వైద్యుడి వద్దకు నాగేశ్వరరావు వెళ్లాలంటే ఈ కుటుంబానికి ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఇంటికి కిలోమీటర్‌కు పైగానే దూరంలో ఉన్న పీహెచ్‌సీకి వెళ్లడానికి ప్రత్యేకంగా ఓ ఆటో మాట్లాడుకోవాలి. రాను పోను సుమారు రూ.300 అవుతుంది. కదల్లేని స్థితిలో ఉన్న నాగేశ్వరరావును ఆటో ఎక్కించి, ఆస్పత్రిలో చూపించుకునిగి మళ్లీ ఇంటికి చేర్చాలంటే ఇద్దరు వ్యక్తులు కచ్చితంగా తోడుండాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానంలో ఈ వ్యయ ప్రయాసలు ఏమీ లేకుండా కాకుమాను పీహెచ్సీ డాక్టర్.. వృద్ధుడైన నాగేశ్వరావు ఇంటికి క్రమం తప్పకుండా వస్తున్నాడు. బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొలె్రస్టాల్, రక్తం గడ్డ కట్టడాన్ని నియంత్రించే మాత్రలు ఇస్తున్నారు. ఈ క్రమంలో నాగేశ్వరావు భార్య విమల మాట్లాడుతూ ‘ఒకప్పుడు ఆయన్ని ఆస్పత్రికి తీసుకుని వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడేవాళ్లం. ఆ రోజు మా పిల్లలు పనులు వదులుకోవాల్సి వచ్చేది. ఇప్పుడా ఇబ్బందులు లేవు. డాక్టరే మా ఇంటికి వస్తున్నారు. మా ఆయన ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటోంది. నెల నెలా వలంటీర్ ఇంటికే వచ్చి పెన్షన్ కూడా ఇచ్చి వెళుతున్నారు. గతంలో ఆయన కిందపడి కాలు విరిగినప్పుడు ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స చేయించి ఆదుకుంది’ అని సంతోషం వ్యక్తం చేసింది. ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానంపై ‘సాక్షి’ గుంటూరు జిల్లాలోని పొన్నూరు, పెదకాకాని, పెదనందిపాడు మండలాల్లోని పలు గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి అమలు తీరును పరిశీలించగా ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తమైంది. గుంటూరుకు వెళ్లే బాధ తప్పింది.. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పెదపాలెం గ్రామానికి చెందిన కావూరి శేషగిరిరావుకు 90 ఏళ్లు. ఆయన సతీమణి వెంకాయమ్మకు 70 ఏళ్లుపైనే ఉంటాయి. పిల్లలందరూ వేరే ఊళ్లలో స్థిరపడ్డారు. వృద్ధులు ఇద్దరే ఉంటారు. వయో భారానికి తోడు శేషగిరిరావుకు బీపీ, షుగర్ ఉన్నాయి. వెంకాయమ్మ గుండెకు కొన్నేళ్ల క్రితం స్టెంట్ వేశారు. దీంతో వీరిద్దరూ క్రమం తప్పకుండా ఆస్పత్రికి వెళ్లి చెకప్ చేయించుకుని మందులు వాడాల్సిన పరిస్థితి. ప్రతి నెలా గుంటూరులోని మిలటరీ ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక గ్రామంలో వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ను అందుబాటులోకి తేవడంతో పాటు, ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో గ్రామంలోని వీరి ఇంటికి వైద్యుడు వచ్చి మందులు ఇచ్చారు. ఈ మందులను తీసుకెళ్లి గుంటూరు మిలటరీ ఆస్పత్రిలో చూపిస్తే తామిచ్చే మందులు కూడా అవే అన్నారు. దీంతో వెంకాయమ్మ దంపతులు గుంటూరుకు వెళ్లడం మానేశారు. క్రమం తప్పకుండా ఫ్యామిలీ డాక్టర్ వీరి ఇంటికి వెళుతున్నారు. వైద్య సేవలు అందిస్తున్నారు. ‘ఒకప్పుడు గుంటూరు మిలటరీ ఆస్పత్రికి పోయి రావడానికి రోజంతా సరిపోయేది. బాగా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఇంటి దగ్గరకే డాక్టర్ వస్తుండటం మాకెంతో ఉపయోగకరంగా ఉంది. ప్రభుత్వం చాలా గొప్ప నిర్ణయం తీసుకుంది. మాలాంటి ఎందరికో చాలా మంచి చేస్తోంది’ అని వెంకాయమ్మ అభిప్రాయపడింది. ఇలా ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానం వల్ల వృద్ధులు, వ్యాధిగ్రస్తులున్న ఊరు, ఇంటి వద్దకే వెద్యులు వచ్చి సేవలు అందిస్తూ, ఆరోగ్య వివరాలను వాకబు చేస్తుండటం పట్ల ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. సీఎం జగన్ పుణ్యమా అని ఆస్పత్రుల చుట్టూ తిరిగే అవస్థలు తప్పాయని మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంత ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వ్యయ, ప్రయాసలకు ఫుల్స్టాప్ పెదనందిపాడు మండలం పమిడివారిపాలెం గ్రామంలో సుమారు 900 మంది జనాభా ఉంటారు. వీరిలో 170 మందికి పైగా బీపీ, షుగర్‌తో బాధ పడుతున్నారు. వీరితో పాటు గర్భిణులు, బాలింతలు, వృద్ధులు క్రమం తప్పకుండా వైద్యుడిని సంప్రదించి, వైద్య పరీక్షలు చేయించుకుని మందులు వాడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 14 కి.మీ దూరంలో ఉండే పెదనందిపాడు పీహెచ్సీ, 20 కి.మీకు పైగా దూరంలో ఉండే ప్రత్తిపాడు సీహెచ్‌సీ, పొన్నూరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లాలి. ఇంట్లో మోటార్ సైకిల్ ఉంటే పర్వాలేదు. లేదంటే ప్రత్యేకంగా ఆటో మాట్లాడుకుని వెళ్లాల్సిందే. ఒకసారి ఆటోలో ఆస్పత్రికి పోయి రావాలంటే రూ.500 పైనే ఖర్చవుతుంది. ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ వల్ల ఈ వ్యయ, ప్రయాసలకు ఫుల్స్టాప్ పడింది. ఈ విధానంలో పెదనందిపాడు పీహెచ్సీ డాక్టర్ ప్రతి నెలా క్రమం తప్పకుండా నాలుగో శుక్రవారం గ్రామానికి వస్తున్నారు. రోజంతా గ్రామంలో ఉండి వైద్య సేవలు అందిస్తున్నారు. మంచానికే పరిమితం అయిన వృద్ధులు, ధీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, బాలింతలు, ఆరోగ్యశ్రీ రోగుల ఇళ్ల వద్దకే వెళ్లి వారి ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు. మరోవైపు పక్కనే మూడు కి.మీ దూరంలో ఉన్న పుసులూరు గ్రామంలో ప్రభుత్వం వైఎస్సార్ విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. తొలగిన ఆర్థిక భారం.. ఇబ్బందులు.. ఫ్యామిలీ డాక్టర్‌తో రాష్ట్రంలో ఉన్న గ్రామీణ ప్రజలు ప్రాథమిక వైద్యం కోసం సమీపంలోని ఆస్పత్రికి వెళ్లి రావడానికి అయ్యే రవాణా వ్యయం రూ.కోట్లలో ఉంటుంది. ఇప్పుడు ఈ ఆరి్థక భారం, ఇతర ఇబ్బందులకు విముక్తి లభించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక గ్రామంలోనే విలేజ్ క్లినిక్ సేవలు ప్రారంభం అయ్యాయి. 12 రకాల వైద్య సేవలు, 14 పరీక్షలు, 105 రకాల మందులు అక్కడే అందుబాటులోకి వచ్చాయి. టెలీ మెడిసిన్ ద్వారా గైనిక్, పీడియాట్రిషన్, ఇతర స్పెషాలిటీ వైద్యుల కన్సల్టెన్సీ లభిస్తోంది. పీహెచ్సీ డాక్టర్ ప్రతి నెలా గ్రామాలకే వెళుతున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అవుట్ పేషెంట్(ఓపీ) క్లినిక్ నిర్వహించి, ఆ తర్వాత మంచానికి పరిమితం అయిన వారికి వైద్య సేవలు అందించడానికి గృహాలు సందర్శిస్తున్నారు అదే విధంగా అంగన్వాడీలు, పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు. ఇప్పటి వరకు 2.04 కోట్ల మందికి వైద్యం రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్‌రన్ గత ఏడాది అక్టోబర్ 21న ప్రారంభించారు. పూర్తి స్థాయిలో ఈ ఏడాది ఏప్రిల్‌లో అందుబాటులోకి వచ్చింది. కాగా గత ఏడాది అక్టోబర్ 21 నుంచి ఇప్పటి వరకు పీహెచ్సీ వైద్యులు 10,032 విలేజ్ క్లినిక్స్ పరిధిలో 1,82,459 సార్లు సందర్శించారు. 2,10,75,065 మందికి వైద్య సేవలు అందించారు. ‘ఫ్యామిలీ డాక్టర్’తో గ్రామాల్లో అందే వైద్య సేవలు ► జనరల్ అవుట్ పేషెంట్ సేవలు ► బీపీ, షుగర్, ఊబకాయం లాంటి జీవనశైలి జబ్బుల కేసుల ఫాలోఅప్ ► గర్భిణులకు యాంటినేటల్ చెకప్స్, బాలింతలకు పోస్ట్‌నేటల్ చెకప్స్, ప్రసవానంతర సమస్యల ముందస్తు గుర్తింపు. చిన్నపిల్లల్లో పుట్టుకతో వచ్చిన లోపాల గుర్తింపు ► రక్తహీనతతో బాధ పడుతున్న మహిళలు, చిన్న పిల్లలకు వైద్య సేవలు ► ఆరోగ్యశ్రీ కింద శస్త్ర చికిత్స జరిగిన రోగులు, క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక జబ్బులతో మంచానికే పరిమితం అయిన వారికి, వృద్ధులకు ఇంటి వద్దే వైద్యం ► పాలియేటివ్ కేర్ ► తాగునీటి వనరుల్లో క్లోరినేషన్ నిర్ధారణ ఇవీ 14 రకాల వైద్య పరీక్షలు ► గర్భం నిర్ధారణకు యూరిన్ టెస్ట్ ► హిమోగ్లోబిన్ టెస్ట్ ► ర్యాండమ్ గ్లూకోజ్ టెస్ట్ (షుగర్) ► మలేరియా టెస్ట్ ► హెచ్ఐవీ నిర్ధారణ ► డెంగ్యూ టెస్ట్ ► మలీ్టపారా యూరిన్ స్ట్రిప్స్ (డిప్ స్టిక్) ► అయోడిన్ టెస్ట్ ► వాటర్ టెస్టింగ్ ► హెపటైటిస్ బి నిర్ధారణ ► ఫైలేరియాసిస్ టెస్ట్ ► సిఫ్లిస్ ర్యాపిడ్ టెస్ట్ ► విజువల్ ఇన్స్పెక్షన్ ► స్పుటమ్ (ఏఎఫ్‌బీ) ‘ఫ్యామిలీ డాక్టర్’ కోసం ప్రభుత్వ చర్యలు ఇలా.. ► మండలానికి రెండు పీహెచ్‌సీలు ఉండేలా ప్రస్తుతం ఉన్న 1,142 పీహెచ్‌సీలకు అదనంగా 88 కొత్త పీహెచ్‌సీల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ప్రతి పీహెచ్సీలో తప్పనిసరిగా ఇద్దరు వైద్యులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన భవనాలు నిర్మాణంలో ఉంటుండగానే కార్యక్రమం అమలు కోసం వైద్యులను అందుబాటులోకి తెచ్చింది. ► మరోవైపు మండలంలో ఒక పీహెచ్సీ, సీహెచ్‌సీ ఉన్న చోట 63 చోట్ల వైద్యులను నియమించి వారిని సీహెచ్‌సీలో కో లొకేట్ చేసి సేవలు అందిస్తున్నారు. ఎవరైనా వైద్యులు సెలవు పెడితే కార్యక్రమానికి ఇబ్బంది రాకుండా పూల్ అప్ వైద్యులను అందుబాటులో ఉంచారు. ► 104 మొబైల్ మెడికల్ యూనిట్(ఎంఎంయూ)తో పాటు వైద్యులు గ్రామాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో 10,032 విలేజ్ క్లినిక్స్‌ను నెలలో రెండుసార్లు సందర్శించడానికి వీలుగా అప్పటికే ఉన్న 676 ఎంఎంయూ వాహనాలకు అదనంగా 260 వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. ► అన్ని విలేజ్ క్లినిక్స్‌లో 105 రకాల మందులను అందుబాటులో ఉంచారు. ► ఎన్సీడీ సర్వేలో భాగంగా 30 ఏళ్లు పైబడిన వారందరినీ వైద్య శాఖ స్క్రీనింగ్ చేపట్టింది. వీరిలో గుర్తించిన బీపీ, షుగర్, ఇతర సమస్యల బాధితులను ఫ్యామిలీ డాక్టర్‌తో అనుసంధానించారు. వారికి నిరంతర ఫాలో అప్ సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. పెద్ద సమస్య అయితే తప్ప ఊరు దాటం 15 ఏళ్లుగా బీపీ, షుగర్ సమస్యలున్నాయి. గతంలో రెగ్యులర్ చెకప్ కోసం పొన్నూరు, గుంటూరుకు వెళ్లేవాడిని. ప్రతి నెలా వెళ్లి రావడం ఇబ్బందిగా ఉండేది. కొన్ని సందర్భాల్లో చెకప్‌కు వెళ్లడం మానేసి మందులు మాత్రం వాడేవాన్ని. అలా నిర్లక్ష్యం చేయడంతో కొన్నిసార్లు ఇబ్బంది అయింది. ప్రభుత్వం కొద్ది నెలల నుంచి డాక్టర్‌ను గ్రామానికే పంపుతోంది. దీంతో గ్రామంలోనే వైద్యం అందుతోంది. డాక్టర్ గ్రామానికి వచ్చే ముందు రోజు మైక్‌లో ప్రకటిస్తారు. ఇప్పుడు చాలా పెద్ద సమస్య అయితేనే మా ఊరి వాళ్లు పొన్నూరు, గుంటూరు వెళుతున్నారు. – పారి జలందర్, పమిడివారిపాలెం, గుంటూరు జిల్లా చాలా ఆనందంగా ఉంది రెండేళ్లుగా బీపీ సమస్య ఉంది. దీంతో మందులు వాడుతూ, క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ చెప్పారు. మా ఊళ్లోనే ప్రభుత్వం విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేసింది. ఇక్కడే పరీక్షలు చేసి మందులు ఇస్తున్నారు. పొన్నూరు నుంచి ప్రభుత్వ డాక్టర్ కూడా క్లినిక్‌కు వస్తారు. ముందు రోజు ఆశ, ఏఎన్ఎం సమాచారం ఇస్తారు. బీపీ స్థాయిని బట్టి డాక్టర్లు మందులు ఇస్తున్నారు. మందులు బాగా పని చేస్తున్నాయి. ప్రభుత్వం ఈ వ్యవస్థను తేకపోయినట్లైతే పొన్నూరుకు పోవాల్సి వచ్చేది. దీంతో రాను, పోను ఆటో చార్జీల రూపంలో అదనపు ఖర్చులు పెట్టుకోవాల్సి ఉండేది. ఇప్పుడా సమస్య లేదు. – రత్నకుమారి, పెదపాలెం, గుంటూరు జిల్లా చాలా మంచి పని చేశారు రెండేళ్ల నుంచి బీపీ, షుగర్‌తో బాధ పడుతున్నాను. నెలనెలా చెకప్‌లు చేయించుకోవాలి. రోజూ మందులు వేసుకోవాలి. వైద్యం కోసం పొన్నూరు, గుంటూరుకు వెళ్లేదాన్ని. నన్ను చెకప్‌కు తీసుకుని వెళ్లడానికి మా ఇంట్లో ఎవరో ఒకరు తోడు ఉండాల్సి వచ్చేది. ప్రస్తుతం ఊర్లోనే మందులు ఇస్తున్నారు. టెస్ట్‌లు చేస్తున్నారు. డాక్టర్ కూడా మా ఊరికే వస్తున్నారు. ప్రభుత్వం చాలా మంచి పని చేసింది. ఈ విధానం లేకుంటే మా ఇబ్బందులు వర్ణాతీతం. – ముప్పలనేని సుబ్బాయమ్మ, పమిడివారిపాలెం, గుంటూరు జిల్లా మంచి కార్యక్రమం మన దేశంలో ఇప్పటి వరకు గ్రామాల్లో ప్రజలకు వైద్య సేవలు అందించడం కోసం ఏఎన్ఎం, ఆశ, ఎంఎల్‌హెచ్‌పీ వ్యవస్థ మాత్రమే ఉంది. గ్రామ స్థాయిలోనే వైద్యులు నేరుగా ప్రజలకు సంరక్షణ అందించే వ్యవస్థ లేదు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా డాక్టర్లను గ్రామ స్థాయిలోకి తీసుకుని వెళ్లి ప్రజలకు సేవలు అందించడం మంచి నిర్ణయం. ప్రజారోగ్య వ్యవస్థలో ప్రాథమిక వైద్య సేవలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. వివిధ జబ్బులు, అనారోగ్య సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించడం, ఆ దశలోనే రోగికి సరైన వైద్య సేవలు అందించడం కీలకం. ఈ నేపథ్యంలో వైద్యులు క్రమం తప్పకుండా గ్రామాలకు వెళ్లి అక్కడి ప్రజలతో మమేకం అవ్వడంతో చాలా వరకు జబ్బులు, సమస్యలు ప్రారంభ దశలోనే బయటపడతాయి. దీనికి తోడు బీపీ, షుగర్, ఇతర నాన్ కమ్యూనికబుల్ డిసిజెస్తో బాధపడే వారికి నిరంతర ఫాలోఅప్ సేవలు అందుతాయి. తద్వారా భవిష్యత్‌లో వారు గుండె, కిడ్నీ, మెదడు సంబంధిత పెద్ద జబ్బులు ఎదుర్కోకుండా కాపాడటానికి వీలుంటుంది. ప్రజలపై ఆరి్థక భారం పడదు. – డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, ఢిల్లీ ఎయిమ్స్ కార్డియాలజీ విభాగం మాజీ అధిపతి, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు ప్రజల సంతృప్తి స్థాయి తెలుసుకుంటున్నాం ఫ్యామిలీ డాక్టర్ సేవల పట్ల ప్రజల సంతృప్తి స్థాయిలను తెలుసుకుంటున్నాం. ఇందుకోసం బోధనాస్పత్రుల్లోని ఎస్పీఎం విభాగాన్ని కార్యక్రమంలో భాగస్వామిని చేశాం. ప్రతి జిల్లాలో ర్యాండమ్‌గా ఒకటి రెండు గ్రామాలను ఎంపిక చేసి ఫ్యామిలీ డాక్టర్ సేవలు పొందిన వారి నుంచి వైద్య విద్యార్థులు అభిప్రాయాలు సేకరిస్తున్నారు. సేవలు పొందిన వారిలో అత్యధికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన నెగిటివ్ ఫీడ్ బ్యాక్‌కు కారణాలు అన్వేషించి, పరిష్కరిస్తున్నాం. – జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ -
అర్హులకు లబ్ధే లక్ష్యం
సాక్షి, అమరావతి: కొత్తగా మరో 1,49,875 మందికి సామాజిక పెన్షన్లు మంజూరు చేసినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. వచ్చే నెల నుంచి వీరికి పెన్షన్లు అందుతాయని చెప్పారు. అలాగే కొత్తగా 2,00,312 బియ్యం కార్డులు మంజూరు చేశామని, వీరికి వచ్చే నెల నుంచి రేషన్ అందుతుందన్నారు. 4,327 మందికి వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కార్డులు మంజూరు చేయడంతో పాటు మరో 12,069 మందికి ఇళ్ల స్థలాలను కూడా ఇస్తున్నామని తెలిపారు. 2022 డిసెంబర్ నుంచి 2023 జూలై వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని 2,62,169 మంది అర్హులకు లబ్ధి చేకూరుస్తూ గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్లో బటన్ నొక్కి వారి ఖాతాల్లో రూ.216.34 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎక్కడా లంచాలు, వివక్షకు చోటు ఇవ్వకుండా.. కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా.. మనకు ఓటు వేయకపోయిన ఫర్వాలేదు, అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికీ కచ్చితంగా లబ్ధి కలిగించాలని తాపత్రయ పడుతూ అడుగులు ముందుకు వేస్తున్న ప్రభుత్వం మనదని చెప్పారు. అర్హత ఉన్నప్పటికీ ఏ కారణం వల్ల అయినా లబ్ధి కలుగకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి మేలు చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అధికారం అంటే అజమాయిషీ చేయడం కాదని, ప్రజల పట్ల మమకారం చూపడమని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. కొత్తగా పింఛన్, బియ్యం, ఆరోగ్యశ్రీ కార్డులు ► ఈ ఆరు నెలల్లో కొత్తగా పింఛన్, బియ్యం, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా కొత్తగా దరఖాస్తు పెట్టుకుంటే.. వెరిఫికేషన్ చేసి మంజూరు చేస్తున్నాం. ఇందులో భాగంగా 1,49,875 మందికి కొత్తగా పెన్షన్లు ఇవ్వడంతో.. రాష్ట్రంలో మొత్తం పెన్షన్ల సంఖ్య దాదాపు 64.27 లక్షలకు చేరుకుంది. ► గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు అంటే 2018 అక్టోబర్ వరకు కేవలం 39 లక్షలు మాత్రమే ఉన్నాయి. ఇవాళ ఆ సంఖ్య 64.27 లక్షలకు పెరిగింది. అప్పట్లో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు అంటే 4 సంవత్సరాల పది నెలల కాలంలో కేవలం రూ.1,000 పింఛన్ మాత్రమే ఇస్తున్న పరిస్థితి. ఇవాళ రూ.2,750 ఇస్తున్నాం. ► ఇప్పుడు కొత్తగా మంజూరు చేసిన 2,00,312 కార్డులతో కలుపుకుంటే.. మొత్తం 1,48,12,934 బియ్యం కార్డులు ఉన్నాయి. అదే విధంగా కొత్తగా మంజూరు చేస్తున్న 4,327 ఆరోగ్యశ్రీ కార్డులతో కలుపుకుంటే.. మొత్తం వాటి సంఖ్య 1,42,15,820కు చేరింది. ఈ రోజు మంజూరు చేస్తున్న ఇళ్ల పట్టాలు 12,069 కలుపుకుంటే.. మొత్తంగా వాటి సంఖ్య 30,84,935కు చేరింది. జగన్ మళ్లీ సీఎం కావాల్సిందే రాష్ట్రంలో ప్రజలు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని సీఎం జగన్ అనుక్షణం పరితపిస్తున్నారు. ఎక్కడా రూపాయి లంచం లేకుండా శాచురేషన్ మోడ్‌లో పథకాలు అందిస్తున్నారు. మేం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటింటికీ వెళ్లినప్పుడు ప్రజల్లో జగన్ పట్ల నమ్మకం స్పష్టంగా కనిపించింది. మా మనవడు మాకు మేలు చేస్తున్నారని అవ్వాతాతలు, మా మామ సాయం చేస్తున్నారని చిన్నారులు, మా అన్న వల్ల మేం బాగుపడుతున్నామని అక్కచెల్లెమ్మలు సంతోషంగా చెప్పడం స్వయంగా విన్నాం. ఈ రాష్ట్రానికి జగన్ మళ్లీ సీఎం కావాల్సిందేనని, అప్పుడే ఆనందంగా ఉంటామని ప్రజలు చెబుతున్నారు. – బూడి ముత్యాలనాయుడు, డిప్యూటీ సీఎం పేదల కళ్లలో ఆనందం పారదర్శకత, కుల మతాలకు.. ప్రాంతాలకు అతీతంగా అర్హులందరికీ లబ్ధి కల్పించడం, జవాబుదారీతనం ప్రతి దశలోనూ కనిపిస్తోంది. గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్నకు చెబుదాం, జగనన్న సురక్ష కార్యక్రమాల వల్ల ప్రజలకు ఎంతో మేలు జరిగింది. ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా రూ.2.33 లక్షల కోట్లు సాయం చేయడం దేశంలోనే రికార్డు. గత ప్రభుత్వాలు ఎన్నడూ ఇలా చేయలేదు. ఏ పథకాలు ఎవరికి ఇచ్చారో తెలియని పరిస్థితి. ఇప్పుడు అర్హులను వెతికి మరీ లబ్ధి చేకూరుస్తున్నారు. ప్రతి పేదవాడి కళ్లలో సంతోషం కనిపిస్తోంది. ఇది ప్రతిపక్షాలకు కంటగింపుగా మారింది. – ఆదిమూలపు సురేష్, మంత్రి వివిధ పథకాల కింద 2.62 లక్షల మందికి లబ్ధి ► జగనన్న చేదోడు కార్యక్రమం ద్వారా 43,170 మందికి మళ్లీ లబ్ధి కలిగిస్తున్నాం. 207 మందికి వైఎస్సార్ మత్స్యకార భరోసా అందిస్తున్నాం. 1,08,000 మంది రైతులకు సున్నా వడ్డీ పంట రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ అందిస్తున్నాం. జగనన్న విద్యా దీవెన సొమ్మును మరో 32,770 మంది తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. ► జగనన్న వసతి దీవెన ద్వారా 36,898 మంది తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం. 8,753 మందికి వైఎస్సార్ ఈబీసీ నేస్తం, 267 మందికి వైఎస్సార్ నేతన్న నేస్తం, 16,717 మందికి జగనన్న అమ్మఒడి.. ఇలా మొత్తంగా 2.62 లక్షల మందికి వివిధ పథకాలను అందిస్తున్నాం. 94,62,184 మందికి సర్టిఫికెట్లు ► రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల 15,004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకులు, ప్రతి ఇంటికీ వెళ్లి.. జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. వివిధ పథకాలకు అర్హులైన వారెవరూ మిగిలిపోకూడదన్న తపనతో ఈ కార్యక్రమం చేపట్టాం. ఇందులో భాగంగా 94,62,184 మందికి వివిధ సర్టిఫికెట్లు ఇచ్చాం. ► ఇలా ప్రతి ఇంటికి వెళ్లినప్పుడు 12,405 మంది అర్హులై ఉండి.. వివిధ కారణాల వల్ల మిగిలిపోయిన వారికి కూడా లబ్ధి చేకూరుస్తున్నాం. జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా.. కాల్ సెంటర్‌కు ఫోన్ చేసిన 1,630 మంది కూడా అర్హులని తేలడంతో వారికి కూడా మంచి చేస్తున్నాం. మళ్లీ మిమ్మల్నే గెలిపించుకుంటాం నమస్తే సార్.. నేను చేనేత కార్మికుడిని. గతంలో కూలి మగ్గం నేసేవాడిని. ఇప్పుడు సొంత మగ్గం నేస్తున్నాను. గత జూలైలో నేతన్న నేస్తం పథకానికి దరఖాస్తు చేసుకుని, వెరిఫికేషన్ సమయంలో లేకపోవడంతో రాలేదు. మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ఇప్పుడు అప్రూవ్ అయ్యి డబ్బులు రావడంతో సంతోషంగా ఉంది. ఈ డబ్బుతో పనితనం మరింత మెరుగు పరుచుకుంటాను. మీ వల్ల సొంతింటి కల నెరవేరింది. ఇతర పథకాలు కూడా అందుతున్నాయి. స్కూళ్ల స్వరూపం పూర్తిగా మార్చేశారు. సచివాలయంలోనే అన్ని పనులు జరుగుతున్నాయి. మళ్లీ మిమ్మల్నే గెలిపించుకుంటాం. – నాగశేషు, ధర్మవరం, శ్రీ సత్యసాయి జిల్లా ఇలాంటి పాలన చూడలేదు అన్నా.. నాకు ఇద్దరు పిల్లలు. అమ్మ ఒడి మూడో విడత రాలేదు. ఎందుకు రాలేదని బాధ పడుతుండగా, వలంటీర్ వచ్చి మీ బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ లింక్ కాలేదన్నారు. లింక్ చేసి వలంటీర్‌కు చెప్పాక అమ్మ ఒడి వచ్చింది. గతంలో ఏదైనా పథకం కోసం మేం ఆఫీస్‌ల చుట్టూ తిరిగేవాళ్లం. ఇప్పుడు గడప దగ్గరకే అన్నీ వస్తున్నాయి. మా పాలిట మీరు దేవుడు అన్నా. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిపాలన చూడలేదు. – కళ్యాణి, భీమిలి మండలం, విశాఖపట్నం జిల్లా డైనమిక్ లీడర్ అంటే మీరే.. అన్నా నమస్కారం.. నేను 15 ఏళ్లుగా టైలరింగ్ వృత్తిలో ఉన్నాను. టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల రెండోసారి చేదోడు పథకం కింద లబ్దిపొందలేక పోయాను. తిరిగి దరఖాస్తు చేసుకుంటే ఇప్పుడు మంజూరైంది. మా ఇద్దరు పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించలేకపోయాననే బాధ గతంలో ఉండేది. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్‌కు దీటుగా ప్రభుత్వ స్కూల్స్‌ను మార్చారు. ఇంత మార్పు వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. అందరూ లీడర్స్ అవుతారు కానీ ప్రజల హృదయాల్లో నిలిచిపోయే డైనమిక్ లీడర్ మీరే అన్నా.. – నాగరాజ, తిమ్మాయపాలెం, అద్దంకి మండలం, బాపట్ల జిల్లా -
ఇంటికే ‘ఆరోగ్యం’!
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికీ వెళ్లి ఆరోగ్యశ్రీ సేవలను ఎలా పొందాలనే అంశంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వలంటీర్లు, సచివాలయ సిబ్బంది వారి పరిధిలోని ఇళ్లకు వెళ్లి ఆరోగ్యశ్రీ సమాచారాన్ని ప్రజలకు అందించాలని సూచించారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి రూ.5 లక్షలు లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు పథకాన్ని వర్తింపజేస్తున్నామని, తద్వారా రాష్ట్రంలో 95 శాతం జనాభాను పథకం పరిధిలోకి తెచ్చామని తెలిపారు. ఈ క్రమంలో పథకం కింద రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా ఉచితంగా వైద్య సేవలను పొందటంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇందుకోసం వచ్చే నెల 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని దిశా నిర్దేశం చేశారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, ఆరోగ్యశ్రీ పథకం, నాడు–నేడు, వైద్య శాఖ అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల పురోగతిని అధికారులు వివరించారు. 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు ప్రగతిని సీఎం అడిగి తెలుసుకున్నారు. వైద్య కళాశాలల నిర్మాణం వేగంగా ముందుకు సాగుతోందని అధికారులు తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభమైన నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం కొత్త కళాశాలల్లో ఎంబీబీఎస్ అడ్మిషన్లకు మంచి స్పందన వచ్చిందన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లలో ప్రవేశాలు పొందడానికి ప్రైవేట్ కంటే ప్రభుత్వ కళాశాలల వైపే విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. వచ్చే ఏడాది పులివెందుల, పాడేరు, ఆదోని మార్కాపురం, మదనపల్లె మెడికల్ కళాశాలలను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ కళాశాలలు, బోధనాస్పత్రుల కోసం ఇప్పటికే పోస్టులను కొత్తగా సృష్టించిన నేపథ్యంలో భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. 2025–26లో మిగిలిన ఏడు మెడికల్ కళాశాలల్లో ప్రవేశాలు చేపట్టేందుకు సిద్ధం అవుతున్నామన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. సమగ్ర వివరాలతో బుక్లెట్ గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీలో కేవలం 1,059 ప్రొసీజర్ మాత్రమే ఉండేవి. మన ప్రభుత్వం వచ్చాక వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటే ప్రతి ప్రొసీజర్స్‌ను పథకంలోకి తెచ్చి ప్రొసీజర్లను ఏకంగా 3,257కు పెంచాం. నెట్వర్క్ ఆస్పత్రుల సంఖ్యను గణనీయంగా పెంచి హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో కూడా మనవారికి ఉచిత వైద్యం అందిస్తున్నాం. ఈ క్రమంలో వచ్చే నెల 15 నుంచి ప్రారంభించే ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమంలో ప్రతి కుటుంబానికి పథకం గురించి సమగ్ర వివరాలతో బుక్లెట్ అందజేయాలి. ఆ బుక్‌లెట్‌ను చూస్తే పథకం సేవలను ఎలా పొందాలి? ఏ సేవలు ఉంటాయి? లాంటి అంశాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన రావాలి. డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లోని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్‌వో), ఏఎన్ఎం, ఆశావర్కర్, వలంటీర్లు, సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి ఆరోగ్యశ్రీ గురించి సవివరంగా తెలియజేయాలి. అనారోగ్యం బారినపడినా, దురదృష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం జరిగినా ఆరోగ్యశ్రీ కింద ఎలా చికిత్స పొందాలన్న దానిపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి. ప్రజలు ఉంటున్న ప్రాంతానికి అత్యంత సమీపంలోని నెట్వర్క్ ఆస్పత్రిలో ఎలా చికిత్స పొందాలో వివరించాలి. ఆరోగ్యశ్రీ సేవలపై సంపూర్ణ సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడమే కాకుండా సమర్థంగా సేవలు అందుకునేలా చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే పథకం సేవలపై యాప్ తీసుకొచ్చాం. ఒక్క యాప్ ద్వారానే కాకుండా కాల్ సెంటర్ల ద్వారా కూడా సేవలు పొందడంపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలి. ► సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, సీఎస్ డాక్టర్ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, కార్యదర్శి డా.మంజుల, ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ మురళీధర్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ సాంబశివారెడ్డి, సీఈవో హరేందిరప్రసాద్, సలహాదారు గోవిందహరి, ప్రత్యేకాధికారి అశోక్‌బాబు, సెకండరీ హెల్త్ డైరెక్టర్ వెంకటేశ్వర్, ఫైనాన్స్ సెక్రటరీ గుల్జార్, డీఎంఈ డాక్టర్ నరసింహం, నాడు–నేడు డైరెక్టర్ మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమర్థంగా నిర్వహణ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల నిర్మాణం, పరికరాలు సమకూర్చడం ఎంత ముఖ్యమో వాటిని ఉత్తమంగా నిర్వహించడం కూడా అంతే ముఖ్యం. అలా చేయకపోతే పరిస్థితులు మళ్లీ మొదటికే వస్తాయి. ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల నిర్వహణ అత్యంత సమర్థంగా ఉండాలి. నిర్వహణకు నిధుల సమస్య రాకుండా చూసుకోవాలి. ఇందుకోసం ఒక విధానం తీసుకురావాలి. ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద అందించే సేవలకుగాను ప్రభుత్వం నుంచి వెళ్లే నిధులు ఆయా ఆస్పత్రుల నిర్వహణకు వినియోగించేలా ఒక పద్ధతి తీసుకురావాలి. ఇలా చేయకపోతే ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల నిర్వహణ నాణ్యతతో చేయడం కష్టం. అలాగే ప్రభుత్వ విద్యా సంస్థలకు ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బుల్లో కూడా కొంత ఆయా సంస్థల నిర్వహణకు వినియోగించేలా ఒక విధానం తేవాలి. అన్ని ప్రాంతాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువచేయడానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా 17 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నాం. నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు ఏర్పాట్ల పనులు పూర్తి కావాలి. పాలకొల్లు, పార్వతీపురం కళాశాలల పనులను మరింత వేగవంతం చేయాలి. ఫిర్యాదులు చేయడంపై అవగాహన ఉండాలి ఆరోగ్యశ్రీ సేవలను పొందడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా, లంచాల ప్రస్తావన వచ్చినా వెంటనే ఫిర్యాదు చేసేలా కూడా ప్రజలకు అవగాహన కల్పించాలి. ఫిర్యాదులకు సంబంధించిన నెంబర్లను కూడా ప్రజలకు తెలియచెప్పాలి. నెట్వర్క్ ఆస్పత్రులు ఆయా ప్రాంతాల్లో తప్పనిసరిగా హెల్త్ క్యాంపులు నిర్వహించాలి. ఈ విధానం కచ్చితంగా అమలయ్యేలా చూడాలి. విలేజ్ క్లినిక్స్, సచివాలయ సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ఈ శిబిరాలు అమలు జరిగేలా చూడాలి. డిశ్చార్జ్ అయిన రోజే ‘ఆసరా’ ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్ర చికిత్స చేసిన రోగులకు వైద్యులు సూచించిన విశ్రాంత సమయంలో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకం కింద నెలకు రూ.5 వేల వరకూ జీవన భృతి ఇస్తున్నాం. రోగికి అందించే ఈ సాయాన్ని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన రోజే ఇవ్వాలి. దీనికి కావాల్సిన ఎస్ఓపీని రూపొందించండి. -
Fact Check: ఇదే'మీ' మాయరోగం!!
టీడీపీ హయాంలో 2014–19 మధ్య ఆరోగ్యశ్రీ పథకం కింద రూ. 5,171.29 కోట్లు ఖర్చు చేసినట్టు చూపించారు. ఇందులో రూ. 631.56 కోట్లు నెట్వర్క్ ఆస్పత్రులకు చెల్లించకుండా బకాయిలు పెట్టారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ బకాయిలను చెల్లించింది. అప్పట్లో పథకం పరిధిలో 1,059 ప్రొసీజర్లు, 748 నెట్వర్క్ ఆస్పత్రులు మాత్రమే ఉండేవి. రోజుకు సగటున 1,570 మంది మాత్రమే చికిత్స పొందేవారు. – సాక్షి, అమరావతి వైఎస్ జగన్ ప్రభుత్వంలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద 2019 నుంచి ఈ ఏడాది జూలై వరకూ రూ.8,816.57 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. 44.21 లక్షల మంది రోగులు ఉచితంగా చికిత్సలు చేయించుకున్నారు. రోజుకు సగటన 3,300 మంది చికిత్స పొందుతున్నారు. ప్రొసీజర్లను 3,257కి పెంచారు. 2,282 నెట్వర్క్ ఆస్పత్రులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు. వీటిలో ఏపీతో పాటు పక్క రాష్ట్రాల ఆస్పత్రులు కూడా ఉన్నాయి. మరోవైపు శస్త్ర చికిత్సల అనంతరం రోగులకు విశ్రాంత భృతిగా ఆరోగ్య ఆసరా కింద రూ.1,449.49 కోట్లు ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం సాయం అందించింది. రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వారందరికీ పథకాన్ని వర్తింపజేసి మధ్య తరగతి కుటుంబాలకు భారీ ఊరట కల్పించింది. ఇది కాక రూ.350 కోట్లతో 108 అంబులెన్స్‌లు 768 వాహనాలు, 104 మొబైల్ మెడికల్ యూనిట్లు 910 వాహనాలను ప్రవేశపెట్టింది. ఈ వివరాలను పరిశీలిస్తే కాస్తంత ఇంగితం ఉన్న ఎవ్వరికైనా ఆరోగ్యశ్రీ పథకం గతంతో పోలిస్తే చాలా మెరుగ్గా ఉన్నట్టు అర్థమవుతంది.. ఒక్క రామోజీరావుకు తప్ప. అందుకే.. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంపై విషం చిమ్ముతూ ఈనాడు పత్రికలో రోత రాతలు రాసేశారు. ఈ క్రమంలో వాస్తవాలను ఓ సారి పరిశీలిస్తే... ఈనాడు ఆరోపణ: నెట్వర్క్ ఆస్పత్రులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరగడంలేదని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నివేదిక స్పష్టం చేసింది. ట్రస్ట్ నుంచి 60 రోజుల్లో చెల్లించాల్సి ఉండగా, ఏకంగా 400 రోజుల సమయం పడుతోందని ఆక్షేపించింది. దీంతో ఆస్పత్రుల్లో నిస్తేజం అలముకుంది. వాస్తవం: నెట్వర్క్ ఆస్పత్రుల నుంచి వచ్చే క్లెయిమ్‌లను ప్యానెల్ డాక్టర్ల ద్వారా ఆరోగ్యశ్రీ ట్రస్టు పరిశీలించి చెల్లింపులు చేస్తుంది. కొన్ని ఆస్పత్రులు క్లెయిమ్‌ల నమోదు సమయంలో సంబంధిత ధ్రువపత్రాలను జత చేయకపోవడంతో వాటిని వెనక్కు పంపుతారు. ఆ పత్రాలు జత చేసి మళ్లీ పంపితే ఆమోదిస్తారు. అనంతరం బిల్లులు చెల్లిస్తారు. అంతే తప్ప బిల్లుల చెల్లింపుల్లో ఏ విధమైన జాప్యం లేదు. ఆరోపణ: సత్తెనపల్లి, తాడిపత్రి ఏరియా ఆస్పత్రు లకు 2019 మే నుంచి అక్టోబర్ 2021 మధ్య ట్రస్ట్ ఇచ్చిన రూ.43.19 లక్షలను వినియోగించకుండా బ్యాంకుల్లోనే భద్రపరిచారు. వాస్తవం: రోగులకు వైద్యం చేసిన సిబ్బందికి ట్రస్ట్ అందించాల్సిన ప్రోత్సాహకాలను నేరుగా సంబంధిత సిబ్బంది ఖాతాల్లో జమ చేయటానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈలోగా డబ్బును బ్యాంక్‌లో భద్రంగా ఉంచితే ఈనాడుకు వచ్చిన ఇబ్బంది ఏమిటో అర్థం కావడంలేదు. ఆరోపణ: ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో రోగులకందించిన చికిత్సలపై క్లినికల్, మెడికల్ డెత్ ఆడిట్ లేదు. వాస్తవం: వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక పథకం అమలుపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో క్లినికల్, మెడికల్ డెత్ ఆడిట్ కోసం జేఈవో ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సక్రమంగా సేవలు అందించని 8 ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రులను ప్రత్యేక బృందం పరిశీలించి పథకం నుంచి తొలగించింది. అంతేకాకుండా చిన్న చిన్న తప్పులు చేసిన 17 ఆస్పత్రుల నుంచి రూ.1.17 కోట్లు జరిమానాగా వసూలు చేశారు. ఆరోపణ: 2019 జనవరి నుంచి 2021 మార్చి మధ్య ఆరోగ్యశ్రీ కింద 17,16,317 క్లెయిమ్‌లు వచ్చాయి. ఇందులో 9.24 లక్షల క్లెయిమ్‌లకు ఆలస్యంగా చెల్లింపులు చేశారు. వాస్తవం: 2019 జనవరి నుంచి 2023 జూలై నెలాఖరుకి ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌కు మొత్తం 44,21,025 క్లెయిమ్‌లు వచ్చాయి. వీటికి రూ.8,816.57 కోట్లు చెల్లించారు. ఇది వాస్తవం. ఈనాడులో 2021 వరకు డేటాను మాత్రమే పరిశీలించారు. దురుద్దేశపూర్వకంగా వైద్యం చేయించుకున్న వారి సంఖ్యను తక్కువగా చేసి చూపారు. ఆరోపణ: పథకం కింద ప్రభుత్వ బోధనాస్ప త్రుల్లో 133, ప్రైవేట్ బోధనాస్పత్రుల్లో 123 చికిత్సలు ఉన్నాయి. వైద్య విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని నెలకు ఒక్కో ఆస్పత్రి నుంచి 40 కేసులే చూడాలన్న నిబంధన తెచ్చారు. కొన్ని ఆస్పత్రులు మాత్రం 133 రకాల చికిత్సలను రోగులకు అందించాయి. 2020 డిసెంబర్ నుంచి 81 ప్రైవేట్ ఆస్పత్రుల్లో 133 చికిత్సలను అందుబాటులోకి తెచ్చారు. వాస్తవం: గత ప్రభుత్వంలో ప్రభుత్వ బోధనాస్ప త్రుల్లో 133, ప్రైవేట్ బోధనాస్పత్రుల్లో 123 చికిత్సలు అనుమతించారు. ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో 171, ప్రైవేట్‌లో 108 చికిత్సలకు అనుమతి ఇచ్చారు. గతంలో ఒక్కో ఆస్పత్రి నుంచి నెలకు 40 కేసులే అనే నిబంధన ఉండేది. ఈ ప్రభుత్వం ఆస్పత్రుల అభ్యర్థన మేరకు రోజుకు రెండు కేసుల వరకూ చూసేలా 40 నుంచి 60 కేసులకు అనుమతించింది. మీ బాబు హయాంలోనే కష్టాల్లో ఆరోగ్యశ్రీ ఆరోగ్య శ్రీ పథకం కష్టాల్లో పడి కొట్టుమిట్టాడింది రామోజీకి అత్యంత ఇష్టుడైన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే. టీడీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశారు. కేవలం 1,059 ప్రొసీజర్లతో అరకొర ఆస్పత్రుల్లో తూతూ మంత్రంగా పథకాన్ని కొనసాగించారు. దీంతో అనారోగ్యం బారిన పడిన పేద కుటుంబాలు అప్పట్లో వైద్యం కోసం అనేక అగచాట్లు పడ్డాయి. అప్పట్లో సీఎం తమ వాడు కావడంతో రామోజీరావుకు పేదవాడి అరణ్య రోదన ఏమాత్రం పట్టలేదు. బాబు ఘనకార్యాలతో నిర్వీర్యమైపోయిన ఆరోగ్య శ్రీ పథకానికి సీఎం జగన్ ఊపిరిలూదారు. నిధులు, ప్రొసీజర్లు, నెట్వర్క్ ఆస్పత్రులు పెంచారు. పక్క రాష్ట్రాల్లోని ప్రముఖ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారికి కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. 108, 104 వాహనాలను పెంచి, సత్వర వైద్యాన్ని ప్రజలకు చేరువ చేశారు. నీతి ఆయోగ్ సైతం ప్రశంసించేలా పథకాన్ని బలోపేతం చేశారు. ఏదైనా జబ్బు చేసినా ఆరోగ్యశ్రీ అండగా ఉందిలే అనే భరోసాను పేద, మధ్యతరగతి కుటుంబాలకు కల్పించారు. ఇది చూసి ఓర్వలేని రామోజీ నిత్యం పథకంపై నిస్సిగ్గుగా బురద రాతలు రాయడంపట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. 2019 జనవరి నుంచి మే నెలాఖరు మధ్య టీడీపీ హయాంలో క్లెయిమ్‌ల ఆలస్యానికి కారణమెవరన్నది ఈనాడు కథనంలో ఎందుకు ప్రస్తావించలేదు? చంద్రబాబు పెట్టిన బకాయిలు, అప్పట్లో పథకం నిర్వీర్యం చేసిన తీరును దాచిపెట్టి ప్రజలను మభ్యపెట్టేలా రామోజీ కథనం ఉంది. -
క్యాన్సర్ గ్రిడ్‌తో ‘ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల’ అనుసంధానం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న అన్ని క్యాన్సర్ ఆస్పత్రుల్లో పాలియేటివ్ కేర్ కోసం 5% పడకలను కచ్చితంగా కేటాయించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఆదేశించారు. బుధవారం వైద్య ఆరోగ్య శాఖ విభాగాధిపతులతో ఆమె మంగళగిరిలో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ..ఆరోగ్యశ్రీ క్యాన్సర్ ఆస్పత్రులను హోమీబాబా క్యాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నడుస్తున్న క్యాన్సర్ గ్రిడ్‌కు అనుసంధానం చేయాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల ఏ ప్రాంతంలో ఎలాంటి, ఎక్కువ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయో ప్రభుత్వానికి తెలుస్తుందన్నారు. ఐబ్రిస్ట్ స్క్రీనింగ్‌ను పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని చెప్పారు. రూ.10వేల ఆసరా పింఛన్లు పొందుతున్న వారికి ఉచిత బస్‌పాస్‌లు అందజేయాలని సీఎం ఆదేశించారని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉద్దానం తాగునీటి ప్రాజెక్టుతో పాటు, పలాసలో కిడ్నీ కేర్ సెంటర్‌ను త్వరలో అందుబాటులోకి తెస్తామని తెలిపారు. పిడుగురాళ్ల, పులివెందులలో ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభించనున్న నేపథ్యంలో, ఆయా చోట్ల టీచింగ్ ఆస్పత్రుల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలన్నారు. నేడు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మంత్రి రజిని పోస్టర్‌ను ఆవిష్కరించారు. గురువారం గుంటూరులో నులిపురుగుల నివారణ మందులు పంపిణీ చేస్తామన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ జె.నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరీందిరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
చిట్టి చెవులకు గట్టి భరోసా
అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం మల్లవరంకు చెందిన అడిగర్ల కొండబాబు, సత్యవేణి దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఆరేళ్ల క్రితం కుమారుడు పుట్టాడు. చిన్నారి శబ్దాలను గ్రహించలేకపోవడంతోపాటు ఎవరైనా పలకరించినా వారివైపు చూసేవాడు కాదు. దీంతో తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించగా పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్నట్టు నిర్ధారించారు. కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ చేయాలని.. ఇందుకు రూ.8 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పడంతో ఆ నిరుపేద దంపతులు హతాశులయ్యారు. ఈ తరుణంలో వారిని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆదుకుంది. ఈ పథకం కింద విశాఖలోని విమ్స్‌లో ఉచితంగా గతేడాది ఆగస్టులో బాబుకు సర్జరీ చేశారు. ప్రస్తుతం పిల్లాడికి వినిపిస్తోంది.. తల్లిదండ్రులు పిలిస్తే పలుకుతున్నాడు.. నెమ్మదిగా మాట్లాడుతున్నాడు. దీంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. ‘బాబుకు సర్జరీ చేయించేంత ఆర్థిక స్తోమత మాకు లేదు. అలాంటి మమ్మల్ని సీఎం వైఎస్ జగన్ ఆదుకున్నారు. బిడ్డకు మేం జన్మనిస్తే.. వాడికి మాటలు వచ్చేలా చేసి ఆరోగ్యశ్రీ పునర్జన్మను ప్రసాదించింది’ అని కొండబాబు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. – సాక్షి, అమరావతి ..ఇది ఒక్క కొండబాబు ఆనందం మాత్రమే కాదు. రాష్ట్రంలో ఎంతో మంది వినికిడి శక్తి లేని చిన్నారులకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆపద్బాంధవిలా నిలుస్తోంది. పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఈ పథకం కింద పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్న పిల్లలకు అత్యంత ఖరీదైన కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీలను వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తి ఉచితంగా నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 566 మందికి .. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసింది. ఇందులో భాగంగా రెండు చెవులకు (బైలాటెరల్) కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీని పథకంలోకి చేర్చింది. దీంతో దాదాపు రూ.12 లక్షలు ఖర్చయ్యే సర్జరీకి కూడా ఆరోగ్యశ్రీ వర్తించింది. 2019 నుంచి ఇప్పటివరకు 566 మంది వినికిడి లోపం ఉన్న పిల్లలకు ప్రభుత్వం కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీలు నిర్వహించింది. ఇందుకు రూ.33.48 కోట్లు ఖర్చు చేసింది. అంతేకాకుండా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద చిన్నారులకు విశ్రాంత సమయానికి భృతిని సైతం అందజేస్తున్నారు. మా జీవితాల్లో సీఎం జగన్ సంతోషాన్ని నింపారు.. నేను ప్రైవేట్ బ్యాంక్‌లో ఉద్యోగిని. మా నాలుగేళ్ల బాబుకు పుట్టుకతోనే వినికిడి లోపం ఉంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.12 లక్షల వరకు ఖర్చవుతుందన్నారు. అంత ఆర్ధిక స్తోమత మాకు లేదు. గతేడాది ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా రెండు చెవులకు బైలాటెరల్ కాక్లియర్ ఇంప్లాంటేషన్ జరిగింది. ప్రస్తుతం చిన్న చిన్నగా మాట్లాడగలుగుతున్నాడు.. స్కూల్‌కు కూడా వెళుతున్నాడు. మా జీవితాల్లో సంతోషాన్ని నింపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేలును ఎప్పటికీ మరిచిపోలేం. – సీహెచ్ శ్రీధర్, నర్సిపురం, శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వం చేసిన మేలును ఈ జన్మకు మరువను.. మా బాబు జాన్విత్కు పుట్టుకతోనే వినికిడి లోపం ఉంది. దీంతో పెద్దయ్యేకొద్దీ బాబుకు మాటలు కూడా రావని వైద్యులు చెప్పారు. కాక్లియర్ ఇంప్లాంటేషన్ చేయిస్తే వినికిడి శక్తి వస్తుందన్నారు. మాది పేద కుటుంబం కావడంతో సర్జరీ చేయించే స్తోమత మాకు లేదు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.12 లక్షల విలువైన ఆపరేషన్‌ను ఉచితంగా ప్రభుత్వం చేయించింది. ఏడాది పాటు ఉచితంగా సౌండ్ థెరపీ ఇచ్చి బాబుకు మాటలొచ్చేలా చేశారు. వాడు పుట్టిన కొన్నేళ్లకు అమ్మా అనే పిలుపునకు నోచుకున్నాను. ప్రభుత్వం చేసిన మేలును ఈ జన్మకు మరువను. – లక్ష్మి, దొర్నిపాడు, నంద్యాల జిల్లా -
ఆరోగ్య శ్రీ ద్వారా పేదవారికి మెరుగైన వైద్యం: ఎమ్మెల్యే శిల్పా
-
క్యాన్సర్ బాధితులకు ‘ఆరోగ్యసిరులు’
క్యాన్సర్ బారినపడిన పేద, మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్యశ్రీ కొండంత అండగా ఉంటోంది. 2019 నుంచి ఇప్పటివరకు 2.64 లక్షల మంది బాధితులకు జగన్ ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఉచితంగా చికిత్స అందించింది. ఇందుకోసం రూ.1,801 కోట్లు ఖర్చుచేసింది. ఈ ఫొటోలో మంచంపై ఉన్న మహిళ పేరు కె. సువార్త. ఈమెది పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం అల్లూరివారిపాలెం గ్రామం. పొదుపు సంఘాల ఆర్పీగా పనిచేస్తోంది. భర్త ఆటో డ్రైవర్. కొద్దినెలల క్రితం గొంతులో సమస్య మొదలైంది. క్రమంగా ఆ సమస్య తీవ్రమై ఆహారం తీసుకోవడానికి ఇబ్బందిగా మారింది. దీంతో వైద్యులను సంప్రదిస్తే.. గొంతు క్యాన్సర్‌గా నిర్ధారించారు. ఉన్నంతలో సంతోషంగా జీవించే ఆ కుటుంబంలో ఆందోళన మొదలైంది. ఇంతలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్‌కు ఉచిత వైద్యం లభిస్తుందని తెలియడం రాజేశ్‌కు ఎంతో ఊరటనిచ్చింది. దీంతో విజయవాడలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి భార్యను తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు. ఈ క్రమంలో రాజేశ్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటివరకూ నా కుటుంబానికి సీఎం జగన్ ప్రభుత్వం అనేక పథకాలు అందించింది. ఇప్పుడు నా ఇల్లాలు క్యాన్సర్‌తో బాధపడుతుంటే ఉచిత వైద్యం కూడా అందిస్తోంది. ఆరోగ్యశ్రీ పథకం లేకుంటే ఈ రోజున నా భార్యను బతికించుకునేందుకు నేను ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చేదో’’.. అని అంటున్నాడు. – సాక్షి, అమరావతి ఇలా సువార్తలాగే క్యాన్సర్ బారినపడ్డ పేద, మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకం కొండంత అండగా ఉంటోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ పథకం పరిధిని సీఎం జగన్ విస్తరించారు. టీడీపీ ప్రభుత్వంలో 1,059గా ఉన్న ప్రొసీజర్స్‌ను ఏకంగా 3,257కు పెంచారు. అలాగే, టీడీపీ హయాంలో 200లోపు మాత్రమే క్యాన్సర్ ప్రొసీజర్లు ఉండగా ప్రస్తుతం 400కు పైగా క్యాన్సర్ ప్రొసీజర్లు పథకం పరిధిలోకి వచ్చాయి. లుకేమియా (బ్లడ్ క్యాన్సర్) బాధితులకు నిర్వహించే అత్యంత ఖరీదైన బోన్ మ్యారో స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను ఆరోగ్యశ్రీ కింద చేస్తున్నారు. అలాగే, రూ.10 లక్షలు, ఆపైన ఖర్చయ్యే ఈ ప్రొసీజర్‌ను పూర్తి ఉచితంగా చేస్తున్నారు. ఇలా ఏ తరహా క్యాన్సర్‌కైనా ఆరోగ్యశ్రీలో ఉచితంగా చికిత్స లభిస్తోంది. ఒక్క క్యాన్సరే కాకుండా.. క్యాన్సర్‌కే కాక.. హృద్రోగాలు, కిడ్నీ, లివర్ ఇలా వివిధ రకాల చికిత్సలు ఆరోగ్యశ్రీ ద్వారా బాధితులకు ఉచితంగా అందుతున్నాయి. అదే టీడీపీ హయాంలో ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడంతో అప్పట్లో పేదలు పడ్డ కష్టాలు అన్నీఇన్నీ కావు. కానీ, ఆ తర్వాత ఆరోగ్యశ్రీకి పూర్వవైభవం తీసుకొస్తూ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న చర్యలతో పేద, మధ్యతరగతి ప్రజలకు భారీ మేలు చేకూరుతోంది. ప్రొసీజర్లను 3,257కి పెంచి 2019 నుంచి ఇప్పటికి 40 లక్షల మందికి ఉచిత వైద్యం అందించారు. చికిత్స అనంతరం విశ్రాంత సమయానికి ఆరోగ్య ఆసరా కింద కూడా అండగా నిలుస్తున్నారు. ఇలా ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా కోసం 2019 నుంచి ఇప్పటికి రూ.10వేల కోట్లకు పైగా జగన్ సర్కార్ ఖర్చుచేసింది. ప్రభుత్వమే నా మనవరాలిని బతికించింది.. నా మనవరాలికి బ్లడ్ క్యాన్సర్. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి మాది. మమ్మల్ని ఆరోగ్యశ్రీ పథకం ఆదుకుంది. ఒకరోజు జీవచ్ఛవంలా పడిపోయిన పాపను ఎత్తుకుని విజయవాడలోని హెచ్‌సీజీ ఆస్పత్రికి వెళ్లాం. అక్కడ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా పాపకు వైద్యం మొదలుపెట్టారు. ప్రస్తుతం వైద్యం కొనసాగుతోంది. ఈరోజు నా మనవరాలి ప్రాణాలను సీఎం జగన్ ప్రభుత్వం కాపాడింది. – శాంతకుమారి, విజయవాడ 2.64 లక్షల మందికి వైద్యం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ కింద 2,64,532 మంది క్యాన్సర్ బాధితులకు ఉచితంగా వైద్యం అందించారు. ఇందుకోసం ప్రభుత్వం ఏకంగా రూ.1,801.30 కోట్లు ఖర్చుచేసింది. ఇదే 2014–19 మధ్య టీడీపీ హయాంలో క్యాన్సర్ చికిత్సకు కేవలం రూ.751.56 కోట్లు ఖర్చుచేశారు. అంటే.. నాలుగేళ్లలోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం టీడీపీ కంటే రూ.1,049.74కోట్లు అదనంగా ఖర్చుచేసింది. ప్రభుత్వమే నా మనవరాలిని బతికించింది.. నా మనవరాలికి బ్లడ్ క్యాన్సర్. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి మాది. మమ్మల్ని ఆరోగ్యశ్రీ పథకం ఆదుకుంది. ఒకరోజు జీవచ్ఛవంలా పడిపోయిన పాపను ఎత్తుకుని విజయవాడలోని హెచ్‌సీజీ ఆస్పత్రికి వెళ్లాం. అక్కడ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా పాపకు వైద్యం మొదలుపెట్టారు. ప్రస్తుతం వైద్యం కొనసాగుతోంది. ఈరోజు నా మనవరాలి ప్రాణాలను సీఎం జగన్ ప్రభుత్వం కాపాడింది. – శాంతకుమారి, విజయవాడ ఆరోగ్యశ్రీ లేకపోయి ఉంటే.. మా నాన్నకు గొంతు క్యాన్సర్ వచ్చింది. ఆయన కౌలు రైతు. వ్యవసాయం మీద వచ్చే ఆదాయంతో వాళ్లు జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్యాన్సర్ చికిత్సకు సొంతంగా ఖర్చుపెట్టే స్థోమత లేదు. ఆరోగ్యశ్రీ పథకం మా నాన్నను ఆదుకుంది. పథకం లేకపోయి ఉంటే ఎంతో కష్టంగా ఉండేది. ఈ మేలును ఎప్పటికీ మరువలేం. – ప్రశాంతి, శృంగవృక్షం గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా పూర్తి ఉచితంగా వైద్యం.. అన్ని రకాల క్యాన్సర్‌తో పాటు, రూ.వెయ్యి వైద్యం ఖర్చు దాటే ప్రతి ప్రొసీజర్‌ను ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చింది. అర్హులైన లబ్దిదారులకు ఉచితంగా వైద్యం అందేలా చూస్తున్నాం. చికిత్స అనంతరం రోగుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నాం. మెజారిటీ శాతం సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు పథకాన్ని మరింతగా మెరుగుపరచడానికి నిరంతరం కసరత్తు చేస్తున్నాం. – ఎంఎన్ హరేంధిరప్రసాద్, సీఈఓ, డా. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ -
నాకు ప్రాణం పోసిన దేవుడు వైఎస్ఆర్..!
-
పల్లె చెంతకు వైద్యం
ఆ గుండెకు ధైర్యం.. కృష్ణా జిల్లా వణుకూరుకు చెందిన కె.సరోపరాణి హృద్రోగ బాధితురాలు. రెండున్నరేళ్ల క్రితం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా స్టెంట్ వేసి ప్రాణాన్ని కాపాడారు. క్రమం తప్పకుండా మందులు వాడుకుంటూ బీపీ, షుగర్ పరీక్షించుకోవాలని డాక్టర్లు ఆమెకు సూచించారు. గతంలో ఐదు కి.మీ ప్రయాణించి కంకిపాడు లేదా విజయవాడ వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు గ్రామంలోనే డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్ ద్వారా ఉచితంగా పరీక్షలు, మందులు ఇవ్వడంతోపాటు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్‌్టతో సొంతూరిలోనే వైద్య సేవలు అందడం ఆమెకు ఎంతో ఊరటనిస్తోంది. ‘గుండె జబ్బు బారిన పడ్డాక నేను కూలికి వెళ్లట్లేదు. మా అబ్బాయి సంపాదనే ఆధారం. వ్యయ ప్రయాసలకు భయపడి గతంలో వైద్య పరీక్షలకు వెళ్లకుండా చాలాసార్లు నిర్లక్ష్యం చేశా. ఇప్పుడు గ్రామంలోనే అన్నీ అందుతున్నాయి. డాక్టర్ వచ్చి పరామర్శిస్తున్నారు’ అని సంతోషం వ్యక్తం చేసింది. (వడ్డే బాలశేఖర్ – వణుకూరు, బోళ్లపాడు గ్రామాల నుంచి సాక్షి ప్రతినిధి): రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో నెలకొల్పిన పది వేలకుపైగా వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల ద్వారా వై ద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం రోగుల చెంతకే చేర్చింది. పల్లె పల్లెకు ఆరోగ్య భరోసా కల్పిస్తోంది. చాపకింద నీరులా గ్రామాల్లోనూ విస్తరిస్తున్న జీవన శైలి జబ్బులను ప్రాథమిక దశలోనే గుర్తించి అరికట్టే లక్ష్యంతో విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చింది. ఒక్కో పీహెచ్‌సీకి ఇద్దరు చొప్పున మండలానికి నలుగురు డాక్టర్లను నియమించి గ్రామీణ వైద్య వ్యవస్థను బలోపేతం చేసింది. జీవన శైలి వ్యాధులను ఆదిలోనే గుర్తించడం ద్వారా ప్రాణాంతకం కాకుండా నివారించవచ్చు. రక్తపోటు లాంటి వాటికి సకాలంలో చికిత్స చేయకుంటే నరాల జబ్బులు, కార్డియాక్ అరెస్టు, పక్షవాతం బారిన పడే ప్రమాదం ఉంది. డయాబెటిస్‌కు సరైన సమయంలో చికిత్స చేయకుంటే కిడ్నీ సమస్యలకు దారి తీస్తుంది. గ్రామీణులకు సొంతూరిలోనే మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉంటే ఇలాంటి వాటిని నియంత్రించడం సులభం అవుతుంది. ఇప్పుడు వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థలు సరిగ్గా అదే పని చేస్తున్నాయి. ఫ్యామిలీ డాక్టర్ క్రమం తప్పకుండా గ్రామాలను సందర్శించడంతో స్థానికులతో మంచి అనుబంధం ఏర్పడుతోంది. అందరినీ గుర్తు పట్టి పేరుతో పిలిచేంత సన్నిహితంగా మసలుకుంటున్నారు. వారు సూచించిన విధంగా ఆహార అలవాట్లను మార్చుకోవడం, తగిన వ్యాయామాల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ఇక స్పెషలిస్టు డాక్టర్ల వైద్య సేవలు పొందాలంటే గతంలో ఎన్నో వ్యయ ప్రయాసలను అధిగమించాల్సి వచ్చేది. దూరాభారం కావడం వల్ల కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు తోడుగా రావాల్సిందే! ఇప్పుడా కష్టాలు లేవు. టెలీమెడిసిన్ ద్వారా గైనకాలజీ, పీడియాట్రిక్స్ లాంటి స్పెషలిస్ట్ డాక్టర్ల సేవలను సైతం గ్రామంలోని క్లినిక్స్ నుంచే పొందగలుగుతున్నారు. వారి సూచనల మేరకు మందులను సైతం ఉచితంగానే ఇస్తున్నారు. ఈ–సంజీవని ఓపీ యాప్ ద్వారా కూడా స్మార్ట్ ఫోన్లు ఉన్న ప్రతి ఒక్కరు టెలీమెడిసిన్ సేవలను పొందవచ్చు. స్మార్ట్ ఫోన్‌ను వినియోగించడం రానివారు, విలేజ్ క్లినిక్ వరకూ వెళ్లలేని వృద్ధులు, వికలాంగులు, మంచానికే పరిమితం అయిన వారికి ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటి వద్దకే వెళ్లి మొబైల్ ద్వారా టెలీమెడిసిన్ సేవలను అందిస్తున్నారు. టెలిమెడిసిన్ ద్వారా వృద్ధులు, మహిళలకు సేవలందించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచినట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంట్లో ప్రకటించడం గమనార్హం. కృష్ణా జిల్లా వణుకూరు, బోళ్లపాడు గ్రామాల్లో పర్యటించిన ‘సాక్షి’ ప్రతినిధి వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ ద్వారా అందుతున్న సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. వణుకూరు విలేజ్ క్లినిక్–2 పరిధిలో 3,412 జనాభా ఉండగా 148 మంది బీపీ, 152 మంది షుగర్ బాధితులు ప్రయోజనం పొందుతున్నారు. ఈ రెండు సమస్యలున్న బాధితులు 70 మంది ఉన్నారు. గర్భిణులు 18 మంది, బాలింతలు 10 మందికి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తూ మందులు అందిస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా పీహెచ్సీ వైద్యుడు డాక్టర్ రవికుమార్ గ్రామానికి వస్తున్నారు. మంచానికే పరిమితం అయిన 12 మంది బాధితులకు ఇళ్ల వద్దకే వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. బోళ్లపాడులో 1,600 మందికిపైగా వైద్య సేవలు అందుతున్నాయి. 12 రకాల వైద్య సేవలు.. 14 పరీక్షలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక గ్రామీణ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా 2,500 జనాభాకు ఒకటి చొప్పున 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను నెలకొల్పింది. వీటిల్లో వైద్య సేవలు అందించేందుకు బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల (ఎంఎల్‌హెచ్‌పీ) నియామకం చేపట్టి సీహెచ్‌వో హోదా కల్పించింది. వీరితో పాటు సచివాలయాల ఏఎన్ఎం, ఆశా వర్కర్లు విలేజ్ క్లినిక్‌లలో సేవలు అందిస్తున్నారు. క్లినిక్‌లలో 12 రకాల వైద్య సేవలు, 14 రకాల వైద్య పరీక్షలు, 105 రకాల మందులు అందుబాటులో ఉంటున్నాయి. విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.1,692 కోట్లు వెచ్చించింది. ప్రతి విలేజ్ క్లినిక్‌కు శాశ్వత భవనాలను సమకూర్చారు. గ్రామ స్థాయిలో పటిష్ట వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం అమలులో విలేజ్ క్లినిక్‌లే కేంద్ర బిందువులుగా ఉంటున్నాయి. విలేజ్ క్లినిక్ యూనిట్‌గా ప్రతి గ్రామాన్ని పీహెచ్సీ వైద్యులు నెలలో రెండు సార్లు సందర్శిస్తున్నారు. విలేజ్ క్లినిక్‌లోనే ఫ్యామిలీ డాక్టర్ క్లినిక్‌లు నిర్వహిస్తున్నారు. 10,032 విలేజ్ క్లినిక్స్‌ను ఇప్పటివరకూ 2.05 లక్షల సార్లు వైద్యులు సందర్శించారు. 1.70 కోట్లకు పైగా సేవలు ఫ్యామిలీ డాక్టర్ విధానంలో నమోదు అయ్యాయి. గ్రామ స్థాయిలోనే వైద్య సేవల కల్పనకు ఇంత పటిష్టమైన వ్యవస్థ ఉండటంతో చాలా వరకు ఆరోగ్య సమస్యలకు గ్రామాల్లోనే పరిష్కారం లభిస్తోంది. బీపీ, షుగర్, ఇతర జీవన శైలి జబ్బులను ప్రాథమిక దశలోనే గుర్తించగలుగుతున్నారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ సేవలు ఇలా ► గర్భిణులు, చిన్నారుల సంరక్షణ ► నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణ ► బాల్యం, కౌమార దశ ఆరోగ్య సేవలు ► కుటుంబ నియంత్రణ, గర్భ నిరోధక సేవలు, పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణ సేవలు ► జీవన శైలి జబ్బుల స్క్రీనింగ్, నివారణ, నియంత్రణ, నిర్వహణ ► అంటువ్యాధుల నిర్వహణ, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు ► సాధారణ అనారోగ్యాలు, చిన్న జబ్బులకు జనరల్ అవుట్ పేషెంట్ కేర్ ► ఆఫ్తాల్మిక్ (కంటి సమస్యలు), ఈఎన్టీ సమస్యలపై జాగ్రత్తలు ► దంత ఆరోగ్య సంరక్షణ ► వృద్ధాప్య వ్యాధులకు చికిత్స, ఉపశమన ఆరోగ్య సంరక్షణ సేవలు ► కాలిన గాయాలు, ప్రమాదాల్లో గాయపడిన (ట్రామా) వారికి అత్యవసర వైద్య సేవలు ► మానసిక ఆరోగ్య వ్యాధుల స్క్రీనింగ్, ప్రాథమిక నిర్వహణ, అనారోగ్య సమస్యలను జయించడం, మానసిక ప్రశాంతత కోసం రోగులకు యోగాపై అవగాహన 7.12 కోట్ల ఓపీలు నమోదు 2020లో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ విలేజ్ క్లినిక్ సేవలను ప్రారంభించారు. ఇప్పటివరకూ 7,12,08,533 ఓపీ సేవలు నమోదు అయ్యాయి. వివిధ సమస్యలతో క్లినిక్స్‌కు వచ్చిన బాధితులకు డాక్టర్ సలహాల కోసం 3 కోట్ల టెలీ కన్సల్టేషన్లు నిర్వహించారు. ప్రస్తుతం ఒక్కో క్లినిక్‌లో రోజుకు సగటున 30 నుంచి 40 వరకూ ఓపీలు, 10 వైద్య పరీక్షలు, 10 టెలీ కన్సల్టేషన్లు నమోదవుతున్నాయి. రోజంతా సరిపోయేది... నాకు బీపీ, షుగర్ సమస్య ఉంది. గతంలో 15 రోజులకు ఒకసారి విజయవాడ ఆస్పత్రికి వెళ్లేదాన్ని. ఒక రోజంతా సరిపోయేది. ఇప్పుడు ఆ సమస్య లేదు. గ్రామంలోనే క్లినిక్‌కు రెండు వారాలకు ఒకసారి వెళ్తున్నా. అక్కడ ఇచ్చే మందులు బాగా పనిచేస్తున్నాయి. – ఎం.రాణి, వణుకూరు, కృష్ణా జిల్లా వ్యయప్రయాసలు తొలిగాయి వయసు మళ్లడంతో ఆరోగ్య సమస్యల కారణంగా రెండు వారాలకు ఒకసారి విలేజ్ క్లినిక్‌కు వస్తుంటా. బీపీ, షుగర్ చెక్ చేయించుకుని దగ్గుకు మందులు తీసుకుంటున్నా. గతంలో పీహెచ్‌సీకి వెళ్లాలంటే ఆటో, బైక్‌లపై వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు గ్రామానికే పీహెచ్సీ డాక్టర్ వస్తున్నారు. గ్రామంలోనే విలేజ్ క్లినిక్ ఏర్పాటుతో వ్యయ ప్రయాసలు తొలిగాయి. అవసరమైతే కంప్యూటర్లో పెద్ద డాక్టర్‌తో మాట్లాడిస్తున్నారు. – కె. మధు, వణుకూరు, కృష్ణా జిల్లా రోజుకు 40 ఓపీలు గ్రామస్తులకు ఏ చిన్న ఆరోగ్య సమస్య ఉన్నా ప్రస్తుతం విలేజ్ క్లినిక్కే వస్తున్నారు. ఇక్కడ రోజుకు 40 వరకూ ఓపీలు నమోదవుతుంటాయి. 30 ఏళ్లుపైబడిన వారందరికీ జీవనశైలి జబ్బుల స్క్రీనింగ్ చేశాం. బీపీ, షుగర్ బాధితులను గుర్తించి వారికి ఫ్యామిలీ డాక్టర్ ద్వారా రెగ్యులర్ హెల్త్ చెకప్ జరిగేలా ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. – యామిని, సీహెచ్‌వో వణుకూరు–2 వైఎస్సార్ విలేజ్ క్లినిక్, కృష్ణా జిల్లా నైపుణ్యాలపై శిక్షణ.. ఇంజెక్షన్లు ఇవ్వడం, సెలైన్ ఎక్కించడం, కుట్లు వేయడం, కట్లు కట్టడం లాంటి ప్రాథమిక చికిత్స విధానాల్లోని నైపుణ్యాలపై మాకు ఇటీవలే శిక్షణ ఇచ్చారు. పీహెచ్సీ వైద్యుడి సూచన మేరకు సెలైన్, ఇంజెక్షన్లు చేయడం లాంటి విధులను నేను ప్రధానంగా నిర్వహిస్తున్నా. – శివకృష్ణ, సీహెచ్‌వో బోళ్లపాడు వైఎస్సార్ విలేజ్ క్లినిక్, కృష్ణా జిల్లా సీహెచ్‌వోలకు ప్రత్యేక శిక్షణ గ్రామ స్థాయిలోనే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న సీఎం వైఎస్ జగన్ లక్ష్యానికి అనుగుణంగా వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలులోకి వచ్చాయి. సీహెచ్వోల్లో నైపుణ్యాల పెంపు ద్వారా ప్రజలకు మరింత మెరుగ్గా వైద్య సంరక్షణ అందించాలని సీఎం ఆదేశించారు. ప్రత్యేక కరిక్యులమ్‌ను రూపొందించి వారికి శిక్షణ ఇచ్చాం. ఇంజెక్షన్ చేయడం, కుట్లు వేయడం, సెలైన్ ఎక్కించడం, పాము కాట్లు, గుండె పోటు సందర్భాల్లో అందించాల్సిన ప్రాథమిక చికిత్సపై అవగాహన కల్పించాం. జబ్బులు రాకముందే నివారించడం ఎంతో కీలకం. ప్రపంచాన్ని వేధిస్తున్న జీవన శైలి జబ్బులతోపాటు ఇతర రుగ్మతలను నివారించడంలో విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్ విధానం ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. – ఎం.టి. కృష్ణబాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ కుటుంబమంతా.. గ్రామంలోనే వైద్యం గతంలో వైద్యం కోసం చాలా ఇబ్బందులు పడ్డాం. జలుబు, జ్వరం లాంటి చిన్న సమస్యలకు ఐదు కిలోమీటర్లు ప్రయాణించి కాటూరు, ఉయ్యూరు వెళ్లాల్సి వచ్చేది. అంత దూరం వెళ్లలేక ఆర్ఎంపీలపై ఆధారపడేవాళ్లం. ఇప్పుడు గ్రామంలో విలేజ్ క్లినిక్ ఏర్పాటైంది. ప్రతి నెల ఒకటో శుక్రవారం, మూడో శనివారం పీహెచ్సీ డాక్టరమ్మ మా ఊరికే వస్తోంది. నాకు బీపీ, గ్యాస్ సమస్య ఉంది. ఇంట్లో ఎవరికి ఏ చిన్న ఆరోగ్య సమస్య తలెత్తినా క్లినిక్కే వెళ్తున్నాం. – వీర వెంకటేశ్వరరెడ్డి, బోళ్లపాడు, కృష్ణా జిల్లా ఇంటి పక్కనే నిశ్చింతగా.. ఉయ్యూరు మండలం బోళ్లపాడుకు చెందిన వి.శ్రీదేవి కొన్నేళ్లుగా బీపీ, గ్యాస్ సమస్యతో బాధపడుతోంది. 1,624 మంది జనాభా నివసించే గ్రామంలో విలేజ్ క్లినిక్ ఏర్పాటు కావడంతో శ్రీదేవి రెండున్నరేళ్లుగా అక్కడే వైద్యం, మందులు ఉచితంగా అందుకుంటోంది. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో) బీపీ, షుగర్ పరీక్షలు చేసిన తరువాత టెలీ మెడిసిన్ ద్వారా స్పెషలిస్ట్ వైద్యుడితో ఆన్లైన్లో మాట్లాడుతోంది. ఫ్యామిలీ డాక్టర్ ద్వారా కాటూరు పీహెచ్ డాక్టర్ నెలకు రెండు సార్లు విలేజ్ క్లినిక్‌కు వస్తున్నారు. శ్రీదేవి ఆరోగ్యంపై ఆరా తీస్తూ ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. ‘గతంలో హెల్త్ చెకప్, మందుల కోసం వెళ్లాలంటే ఓ ప్రహసనమే. కుటుంబ సభ్యుల్లో ఎవరో కచ్చితంగా తోడుండాల్సిందే. ఇప్పుడా సమస్య లేదు. మా ఇంటి పక్కనే విలేజ్ క్లినిక్ ఉంది. ఏ చిన్న ఆరోగ్య సమస్య తలెత్తినా ఇక భయం లేదు’ అని శ్రీదేవి నిశ్చింతగా చెబుతోంది. -
ప్రతి గుండెకు నిబ్బరం.. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చికిత్స
-
ప్రాణం నిలబెట్టిన వైఎస్ఆర్.. ప్రాణం తీసిన బాబు ప్రభుత్వం
-
ఆపద కాలంలో ఆపద్భాంధవి ‘డాక్టర్ వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ’ పథకం
-
ఆపద కాలంలో ఆపద్భాంధవిలా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ
-
'ఆరోగ్యశ్రీయే అండ'
ఈ ఫొటోలో మంచంపై ఉన్న కృష్ణా జిల్లా కంకటావ గ్రామానికి చెందిన ఎన్.శివ ఆటో డ్రైవర్. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరగా బ్లడ్ క్యాన్సర్‌గా వైద్యులు నిర్ధారించారు. సంపాదించే కుటుంబ పెద్ద మంచం పట్టడంతో ఇంట్లోవారు తల్లడిల్లారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం అందుతుందని తెలియడంతో శివ భార్య భ్రమరాంబ విజయవాడలోని హెచ్‌సీజీ క్యాన్సర్ ఆస్పత్రిని సంప్రదించింది. నాలుగు నెలలుగా శివకు అక్కడ ఉచితంగా వైద్యం అందుతోంది. ఇప్పటివరకు రూ.రెండు లక్షలకు పైగా ప్రభుత్వమే చెల్లించింది. కష్టకాలంలో ఆరోగ్యశ్రీ తమ కుటుంబాన్ని ఆదుకుందని భ్రమరాంబ చేతులు జోడిస్తోంది. ఈ ఫొటోలో కనిపిస్తున్న కూరా సాహూ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం అరకబద్ర గ్రామవాసి. రెక్కాడితే గానీ డొక్కాడని పేద కుటుంబం. ఇంటి వద్ద చిన్న కొట్టు నిర్వహిస్తున్నాడు. 2020 డిసెంబర్ 23 అర్ధరాత్రి సమయంలో ఛాతీ నొప్పి రావడంతో బరంపురం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వెంటనే గుండె ఆపరేషన్ చేయాలని చెప్పడంతో చేతిలో చిల్లి గవ్వలేని కుటుంబ సభ్యులకు దిక్కు తోచలేదు. కొందరు ఆరోగ్యశ్రీ గురించి చెప్పడంతో విశాఖ తరలించారు. అక్కడ ఉచితంగా గుండె ఆపరేషన్‌తోపాటు ఇంటికి వెళ్లేప్పుడు ఉచితంగా మందులు, రూ.5 వేలు అందించారు. కోలుకున్న సాహూ యథావిధిగా షాప్ నిర్వహిస్తున్నాడు. ఆరోగ్యశ్రీ పథకం లేకుంటే తాను ప్రాణాలతో ఉండేవాడిని కాదేమో అని చెబుతున్నాడు. సాక్షి, అమరావతి: ఆపద కాలంలో ఆపద్బాంధవిలా ఆదుకుంటూ డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పునర్జన్మను ప్రసాదిస్తోంది. ఈ పథకం ద్వారా నాలుగేళ్లలో దాదాపు 40 లక్షల మందికి ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందించడం, నెట్వర్క్ ఆస్పత్రుల సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరగడమే ఇందుకు నిదర్శనం. అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీకి ఊపిరిలూదుతూ చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత సర్కారు బకాయి పెట్టిన రూ.631 కోట్లను నెట్వర్క్ ఆస్పత్రులకు చెల్లించారు. ప్రొసీజర్ల సంఖ్యను ఏకంగా మూడు రెట్లకుపైగా పెంచారు. దీంతో ఎంత పెద్ద జబ్బుకైనా చేతి నుంచి చిల్లి గవ్వ ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యం ఉచితంగా అందుతోంది. చికిత్స ఖర్చు రూ.వెయ్యి దాటితే ఉచితంగా వైద్యం అందించడంతోపాటు శస్త్ర చికిత్సల అనంతరం రోగి కోలుకునే సమయంలో ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలుస్తోంది. వైద్యులు సూచించిన మేరకు విశ్రాంతి సమయంలో ‘డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా’ ద్వారా సాయం అందిస్తున్నారు. వైఎస్సార్ ఆరోగ్య ఆసరాకి వెయ్యి కోట్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ ఏడాది మే నెలాఖరు నాటికి ఆరోగ్యశ్రీ పథకం కింద 39,97,617 మంది ఉచితంగా వైద్యం అందుకున్నారు. వీరికి వైద్యం కోసం ప్రభుత్వం రూ.7,949.76 కోట్లు ఖర్చు చేసింది. ఇక వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కోసం రూ.1,074.69 కోట్లను వెచ్చించింది. ఇలా ఇప్పటిదాకా పథకం కోసం రూ.9,024.45 కోట్లు వ్యయం చేసింది. 2014–19 మధ్య టీడీపీ హయాంలో పథకం కోసం రూ.5,177.38 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఆరోగ్యశ్రీకి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో వెచ్చించిన మొత్తంతో పోలిస్తే ఐదేళ్లలో టీడీపీ సర్కారు 57.37 శాతం మాత్రమే ఖర్చు చేసింది. కరోనాను పథకంలోకి తెచ్చిన తొలి ప్రభుత్వం కోవిడ్ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి ప్రజలకు ఊరట కల్పించింది. వైరస్ బారిన పడ్డ 2.06 లక్షల మందికి ఉచితంగా చికిత్స అందించి ఇప్పటివరకు రూ.743.75 కోట్లు ఖర్చు చేసింది. అదనంగా 2,198 ప్రొసీజర్లు.. మొత్తం 3,257 ప్రజారోగ్యానికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి జగన్ వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటే ప్రతి చికిత్సకు ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేస్తామని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. టీడీపీ హయాంలో కేవలం 1,059 ప్రొసీజర్లతో ఆరోగ్యశ్రీని నీరుగార్చగా సీఎం జగన్ అధికారంలోకి రాగానే 2020 జనవరిలో ప్రొసీజర్లను తొలుత 2,059కి పెంచారు. అదే ఏడాది జూలైలో 2,200కు ప్రొసీజర్లను పెంచి మరింత ప్రయోజనం చేకూర్చారు. తద్వారా 54 క్యాన్సర్ చికిత్సలు పథకం ద్వారా అందుబాటులోకి వచ్చాయి. 2020 నవంబర్‌లో బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సహా 235 చికిత్సలతో ప్రొసీజర్ల సంఖ్యను 2,436కి పెంచారు. 2021 మే, జూన్ నెలల్లో పది రకాల కరోనా వైరస్ చికిత్సలను పథకంలో చేర్చడంతో 2446కు ప్రొసీజర్స్ పెరిగాయి. గతేడాది మరో 809 చేర్చడంతో ఆరోగ్యశ్రీ పథకంలో ప్రొసీజర్లు 3,255కి చేరుకున్నాయి. గర్భిణులకు ఉచితంగా ‘టిఫా స్కాన్’ సేవలు అందించడం కోసం మరో రెండు ప్రొసీజర్లను ఇటీవలే పథకంలో చేర్చారు. ఇలా 2019 నుంచి ఇప్పటిదాకా 2,198 ప్రొసీజర్లను పథకంలో అదనంగా చేర్చి మొత్తం 3,257 ప్రొసీజర్లతో ఆరోగ్యశ్రీ పథకాన్ని సమర్థంగా అమలు చేస్తున్నారు. చికిత్సానంతరం అండగా వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా 1,519 ప్రొసీజర్లకు వైద్యులు సూచించిన మేరకు విశ్రాంతి సమయంలో రోగులకు రోజుకు రూ.225 లేదా నెలకు గరిష్టంగా రూ.ఐదు వేలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందచేస్తోంది. రోగి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన రోజే బ్యాంకు ఖాతాలో ఆసరా మొత్తాన్ని జమ చేస్తున్నారు. 2019 డిసెంబర్ 12వతేదీ నుంచి ఈ ఏడాది మే నెలాఖరు వరకూ 17,25,238 మందికి రూ.1,074.69 కోట్ల మేర ఆరోగ్య ఆసరా ద్వారా సాయం అందింది. రోగి సంతృప్తే లక్ష్యం ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందే రోగుల సంతృప్తే లక్ష్యంగా పథకాన్ని సీఎం జగన్ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా పలు కీలక సంస్కరణలు చేపట్టారు. చికిత్స అనంతరం రోగుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని వారు సంతృప్తి చెందినట్టు తెలిపితేనే ఆస్పత్రులకు బిల్లుల చెల్లింపులు చేపడుతున్నారు. డిశ్చార్జి సమయంలో ప్రతి రోగి నుంచి కన్సెంట్ ఫామ్ తీసుకుంటున్నారు. అంతేకాకుండా రోగి ఖాతా నుంచి ఆస్పత్రులకు బిల్లుల చెల్లింపు విధానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో పాటు సేవల్లో సమస్యలుంటే ఫిర్యాదు చేయడానికి 104 కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. డిశ్చార్జి అనంతరం ఏఎన్ఎంలు రోగుల ఇళ్లకు వెళ్లి యోగక్షేమాలను తెలుసుకుటున్నారు. ఆరోగ్యంపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. మా బాబు మాట్లాడుతున్నాడు.. ఐదేళ్ల వయసున్న మా బాబుకు పుట్టుకతోనే వినికిడి లోపం ఉంది. రూ.లక్షలు ఖర్చు చేసి శస్త్ర చికిత్స చేయించే స్తోమత మాకు లేదు. ఆరోగ్యశ్రీ పథకం కింద కడప ఆస్పత్రిలో కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ ఉచితంగా చేశారు. రూ.10 లక్షలకు పైగా విలువైన సర్జరీని రూపాయి ఖర్చు లేకుండా చేశారు. ఈరోజు మా బాబు మాట్లాడటం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం. – వెంకటేశ్వర్లు, రేవతి, రాజంపేట, అన్నమయ్య జిల్లా క్యాన్సర్‌కు ఉచితంగా చికిత్స 2020లో అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరగా బ్లాడర్ క్యాన్సర్‌గా నిర్ధారించారు. చికిత్సకు రూ.3 లక్షలకు పైనే ఖర్చవుతుందని ప్రైవేట్ ఆస్పత్రిలో చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్ చికిత్స అందించే ఆస్పత్రికి వెళ్లడంతో రూపాయి ఖర్చు లేకుండా కీమోథెరపీ, రేడియో థెరపీతో రెండు చికిత్సలు అందించి మందులు కూడా ఉచితంగా ఇచ్చారు. ఆసరా కింద ప్రభుత్వం రూ.ఏడు వేలు అందించింది. క్యాన్సర్ చికిత్స ఖర్చు తలచుకుని ఎంతో ఎంతో భయపడ్డా. రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందటాన్ని నమ్మలేకపోతున్నా. – మారెన్న, బూదేడు గ్రామం, అనంతపురం జిల్లా ఆలస్యం లేకుండా వైద్యం భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసే నాకు ఇటీవల గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు కర్నూలులోని మెడికవర్ ఆసుపత్రిలో చేర్చారు. అదేరోజు వెంటనే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా బైపాస్ సర్జరీ చేశారు. డిశ్చార్జ్ అయ్యాక ఇంట్లో విశ్రాంతి తీసుకునే సమయంలో రూ.9,500 నా ఖాతాలో జమ అయింది. ఈ డబ్బులతో ప్రస్తుతం నా కుటుంబం జీవనం సాగిస్తోంది. – మండల ఆంజనేయులు, ఆదోని, కర్నూలు జిల్లా అత్యధిక ప్రాధాన్యం ఆరోగ్యశ్రీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. గ్రీన్ చానల్లో నెట్వర్క్ ఆస్పత్రులకు వేగంగా బిల్లులు చెల్లిస్తున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఏమాత్రం రాజీపడకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారు. ప్రొసీజర్ల సంఖ్యను భారీగా పెంచడంతో ప్రజలకు వైద్య ఖర్చుల భారం తగ్గింది. – డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, ఏపీ ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ అధ్యక్షుడు -
బోధనాస్పత్రుల బలోపేతం
కర్నూలులోని అశోక్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ కేదారేశ్వరయ్య గత ఫిబ్రవరిలో గుండెపోటుకు గురవటంతో కుటుంబ సభ్యులు స్థానిక జీజీహెచ్‌లో చేర్చారు. స్టెంట్ వేయడానికి వీలులేని ప్రదేశంలో రక్తనాళాల్లో బ్లాక్ ఉండటంతో బైపాస్ సర్జరీ అవసరమైంది. కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి చిన్న కోతతో అరుదైన పద్ధతిలో బైపాస్ సర్జరీ చేశారు. ప్రైవేట్‌లో రూ.5 లక్షలు దాకా ఖర్చయ్యే శస్త్ర చికిత్సను జీజీహెచ్‌లో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేశారు. తెనాలి రూరల్ మండలం పెదరావూరుకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థికి గత నెలలో ఫిట్స్ రావడంతో కన్ను తీవ్రంగా వాచింది. ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా ప్రాణాలకు ప్రమాదం ఉందని వైద్యులు పేర్కొనడంతో గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ముక్కులో ఇటమాయిడ్ సైనసైటిస్‌తో ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్థారించిన వైద్యులు ఆర్టిటల్ డికంప్రషన్ ఆపరేషన్ ద్వారా విద్యార్థి కంటి చూపుతో పాటు, ప్రాణాలను కాపాడారు. సుమారు రూ.3 లక్షల ఖరీదైన ఆపరేషన్‌ను జీజీహెచ్‌లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా నిర్వహించారు. సాక్షి, అమరావతి: అరుదైన శస్త్ర చికిత్సలను వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా బోధనాస్పత్రుల్లో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా మానవ వనరులు, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. రోగుల తాకిడికి అనుగుణంగా వనరులు సమకూర్చడంతో ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలు గణనీయంగా మెరుగయ్యాయి. ఏడాదిలో 2.22 లక్షల కేసులు 2022–23లో ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద 2,22,147 కేసులకు వైద్య సేవలు అందించారు. ఇందుకు రూ.388.63 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. 2018–19 నుంచి బోధనాస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కేసులను పరిశీలిస్తే ఇదే అత్యధికం. టీడీపీ హయాంలో కేవలం 90 వేల లోపు కేసులకు మాత్రమే బోధనాస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందగా ఇప్పుడు ఏకంగా రెండు లక్షలకు పైగా చేరుకోవడం గమనార్హం. విజయవాడ జీజీహెచ్ టాప్ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యసేవల్లో విజయవాడ జీజీహెచ్ 2022–23లో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. 27,081 ఆరోగ్యశ్రీ కేసులు ఇక్కడ నమోదయ్యాయి. 22,104 కేసులతో కర్నూలు జీజీహెచ్ రెండో స్థానంలో, 21732 కేసులతో విశాఖ కేజీహెచ్ మూడో స్థానంలో ఉన్నాయి. ప్రత్యేక పర్యవేక్షణ ఇన్నాళ్లూ ప్రభుత్వాస్పత్రుల్లో వనరులు సరిగా లేకపోవడంతో ఆరోగ్యశ్రీ వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రులనే ఆశ్రయించాల్సి వస్తోంది. ఆరోగ్యశ్రీ క్లెయిమ్‌లలో 30 శాతం ప్రభుత్వాస్పత్రుల నుంచి ఉంటున్నాయి. వీటిని మరింత పెంచి ప్రభుత్వాస్పత్రులను అభివృద్ధి చేసే లక్ష్యంతో వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో 2019 నుంచి బోధనాస్పత్రుల్లో 1,582 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులతోపాటు ప్రమోషన్ల రూపంలో కలిపి మొత్తం రెండు వేల వరకూ పోస్టుల భర్తీ చేపట్టింది. గతంతో పోలిస్తే మైనర్, మేజర్ సర్జరీలు, ఇతర చికిత్సలు బోధనాస్పత్రుల్లో గణనీయంగా పెరిగాయి. ఆరోగ్యశ్రీ కేసులపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచినట్లు డీఎంఈ డాక్టర్ వినోద్ ‘సాక్షి’కి తెలిపారు. ప్రతివారం సమీక్ష చేపట్టి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. -
క్యాన్సర్‌ను జయించిన వలంటీర్ మహమ్మద్
క్రోసూరు: క్యాన్సర్ బారిన పడిన వలంటీర్‌కు ప్రభుత్వం సాయం చేయడంతో అతడు పూర్తిగా కోలుకుని తిరిగి విధుల్లో చేరాడు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం నాగవరం గ్రామానికి చెందిన షేక్ ఉమ్మర్ ఖయ్యుం ఆటో నడుపుతుంటాడు. వారి పెద్ద కుమారుడు షేక్ మహమ్మద్ డిగ్రీ పూర్తి చేసి వలంటీర్‌గా పనిచేస్తున్నాడు. మహమ్మద్ 2021లో బ్లడ్ క్యాన్సర్ బారిన పడ్డాడు. ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేదు. సమాచారం తెలుసుకున్న పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అతని ఇంటికి వెళ్లి పరామర్శించి వెంటనే ఆరోగ్యశ్రీ కార్డు ఇప్పించారు. సీఎం వైఎస్ జగన్‌కి వినతి పెట్టారు. వెంటనే స్పందించిన సీఎం జగన్..మహమ్మద్‌కు ఎంత ఖర్చు అవుతుందో అంతా ప్రభుత్వమే భరాయించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహమ్మద్‌కు ప్రభుత్వం రూ.78 లక్షలు మంజూరు చేసింది. పూర్తిస్థాయిలో చికిత్స పొంది మహమ్మద్ ఇంటికి చేరుకున్నాడు. వైఎస్సార్ ఆసరా ద్వారా నెలకు రూ.5,000 చొప్పున 6 నెలల పాటు అందించి మందులను కూడా ఉచితంగా అందజేసింది. సీఎం జగన్ లాంటి నేత ఉండటంతోనే తాము ఈ సమస్య నుంచి బయటపడ్డామని, ఆయనకు తాము ఎంతగానో రుణపడి ఉన్నామని ఖయ్యుం కుటుంబసభ్యులు తెలిపారు. మహమ్మద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు చొరవతో సీఎం జగన్ వెంటనే స్పందించి తనను ఆదుకున్నారని, జీవితంలో ఒక్కసారి సీఎం జగన్‌ని కలిసి కృతజ్ఞతలు తెలపాలని తన కోరిక అని చెప్పాడు. -
కడుపు కోత తగ్గించేలా!
రాష్ట్రలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎక్కువగా సిజేరియన్ ప్రసవాలే చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దీనిని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చేస్తున్న సిజేరియన్ల నియంత్రణకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం వైద్య శాఖ ప్రత్యేక ప్రణాళిక రచించింది. సాక్షి, అమరావతి: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మార్గదర్శకాల ప్రకారం మొత్తం ప్రసవాల్లో సిజేరియన్లు 10 నుంచి 15 శాతంలోపే ఉండాలి. కానీ.. మన రాష్ట్రంలో ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదైన మొత్తం ప్రసవాల్లో 2021–22లో 43.82 శాతం, 2022–2023 (ఏప్రిల్ నుంచి డిసెంబర్)లో 47.39 శాతంగా నమోదైంది. హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్ఎంఐఎస్) సమాచారం ప్రకారం.. 2021–22 సంవత్సరంలో రాష్ట్రంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగిన మొత్తం ప్రసవాల్లో 50.81 శాతం సిజేరియన్లుగా నమోదయ్యాయి. 2022–23లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ పరిశీలిస్తే 55.83 శాతానికి పెరిగింది. ప్రభుత్వాస్పత్రుల్లో సిజేరియన్ ప్రసవాల నియంత్రణకు వైద్య శాఖ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్ల నియంత్రణ చర్యల్లో భాగంగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా 26 జిల్లాల్లో ప్రసూతి సేవలందిస్తున్న నెట్వర్క్ ఆస్పత్రుల్లో నిర్వహించిన సిజేరియన్ ప్రసవాలపై ఆడిట్ నిర్వహించింది. 74 ఆస్పత్రుల్లో 91నుంచి 100 శాతం సిజేరియన్లే 2022–23 సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య రాష్ట్రంలో ప్రసూతి సేవలు అందిస్తున్న 198 ఆస్పత్రుల్లో సిజేరియన్ ప్రసవాలపై వైద్య శాఖ అధ్యయనం నిర్వహించింది. వీటిలో ఏకంగా 74 ఆస్పత్రుల్లో 91నుంచి 100 శాతం సిజేరియన్లే చేసినట్టు తేలింది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 14, పల్నాడులో 9, అనకాపల్లిలో 7, గుంటూరులో 8 ఆస్పత్రులు ఈ జాబితాలో ఉన్నాయి. 45 ఆస్పత్రుల్లో 81నుంచి 90 శాతం, 38 ఆస్పత్రుల్లో 71నుంచి 80%, 41 ఆస్పత్రుల్లో 70 శాతానికిపైగా సిజేరియన్లు చేసినట్టు అధికారులు గుర్తించారు. జిల్లాల వారీగా అత్యధికంగా సిజేరియన్లు నిర్వహించిన ఆస్పత్రులను పరిశీలిస్తే.. శ్రీసత్యసాయి జిల్లాలోని ఓ ఆస్పత్రిలో 714 ప్రసవాలకు గాను.. 712 సిజేరియన్లు చేశారు. కర్నూలు జిల్లాలోని మరో ఆస్పత్రిలో 322 కాన్పులకు గాను 321, అన్నమయ్య జిల్లాలో 290 ప్రసవాలకు గాను 290 సిజేరియన్లు చేశారు. కుటుంబ సభ్యుల నుంచీ ఒత్తిడి! సిజేరియన్ చేయాలని గర్భిణుల కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉండటం వల్లే ఇలా చేయాల్సి వస్తోందని వైద్యులు చెబుతున్నారు. తొలి కాన్పు సిజేరియన్ అయితే.. రెండో కాన్పు కూడా అలా చేయక తప్పడం లేదంటున్నారు. ఇందులో కొంత నిజం ఉన్నప్పటికీ వైద్యులు అందుకు అంగీకరించకూడదని.. సంబంధిత కేసుల్లో ఆయా కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కొన్ని ఆస్పత్రులైతే సిజేరియన్లు చేయడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి. కారణాలివీ.. ► సాధారణ ప్రసవంతో పోలిస్తే సిజేరియన్‌కు ఆరోగ్యశ్రీలో ప్రభుత్వం చెల్లిస్తున్న ఫీజు ఎక్కువగా ఉండటం. సాధారణ ప్రసవం చేయాలంటే కొన్ని గంటల సమయం పడుతుంది. ఈ క్రమంలో గర్భిణి, కడుపులోని బిడ్డ ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తూ ఉండాలి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిపుణులైన నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉండరు. దీంతో అన్ని గంటలపాటు ప్రైవేట్ వైద్యులు ఓపికతో ఎదురుచూసే పరిస్థితులు లేకపోవడం. ► చిన్నపాటి నర్సింగ్ హోమ్‌లు, ఆస్పత్రులకు ప్రత్యేకంగా 24/7 ఆనస్తీషియా వైద్యుడు అందుబాటులో లేకపోవడం. ► యువ వైద్యుల్లో సాధారణ ప్రసవాలు నిర్వహించడానికి తగినంత అనుభవం, ఆత్మవిశ్వాసం లేకపోవడం. ► సాధారణ ప్రసవానికి సిద్ధపడేలా సిజేరియన్ ప్రసవంతో సంభవించే సమస్యలపై గర్భిణి, కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయకపోవడం. -
డాక్టర్లు, సిబ్బంది ఖాతాలకే ప్రోత్సాహకాలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రుల్లో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవల్లో నాణ్యతను మరింతగా పెంపొందించడంపై వైద్య, ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. ఆరోగ్యశ్రీ ప్రోత్సాహకాల (ఇన్సెంటివ్) సొమ్మును నేరుగా వైద్యులు, వైద్య సిబ్బంది బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. ఆస్పత్రుల్లో మానవ వనరుల కొరతకు తావులేకుండా పోస్టుల భర్తీ, మౌలిక వసతుల కల్పన, అన్ని ప్రభుత్వాస్పత్రులను నెట్వర్క్ ఆస్పత్రులుగా నోటిఫై చేయడం వంటి ప్రభుత్వ చర్యలతో ఆరోగ్యశ్రీ సేవలు అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే ప్రభుత్వాస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు భారీగా పెరిగాయి. మొత్తం క్లెయిమ్‌లలో 30 శాతం ప్రభుత్వాస్పత్రుల నుంచి ఉంటున్నాయి. వీటిని ఇంకా పెంచడం ద్వారా ప్రభుత్వాస్పత్రులకు ఎక్కువ నిధులు రాబట్టి, ఆస్పత్రులను అభివృద్ధి చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగానే ప్రోత్సాహకాల జమలోనూ నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ కింద ఒక ఆపరేషన్ చేస్తే.. దానికి వచ్చే క్లెయిమ్ మొత్తంలో 25 శాతం ప్రోత్సాహకం కింద హెల్త్ కేర్ స్టాఫ్‌కు వస్తుంది. ఈ మొత్తాన్ని నిబంధనలకు అనుగుణంగా వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి కేటాయిస్తారు. ఇప్పటివరకూ ఈ సొమ్మును ఆస్పత్రుల సూపరింటెండెంట్ పర్యవేక్షణలో ఉండే ఖాతాల్లో జమ చేస్తున్నారు. అనంతరం వాటిని వైద్యులు, సిబ్బందికి పంపిణీ చేస్తున్నారు. ఈ విధానంలో కాలయాపన జరుగుతోంది. దీంతో నేరుగా, వైత్యులు, సిబ్బంది ఖాతాల్లోనే ఈ సొమ్ము జమ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఏపీవీవీపీ, డీఎంఈ ఆస్పత్రుల్లోని వైద్యులు, ఇతర సిబ్బంది బ్యాంక్ ఖాతాల వివరాలను ఆన్లైన్లో రిజిస్టర్ చేసే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ నెల నుంచి డీఎంఈలో ప్రారంభం ఆరోగ్యశ్రీ ప్రోత్సాహకాలు నేరుగా సిబ్బంది ఖాతాల్లో జమ చేసే విధానాన్ని ఈ నెల నుంచి డీఎంఈ ఆస్పత్రుల్లో ప్రారంభిస్తున్నాం. అనంతరం ఏపీవీవీపీ ఆస్పత్రులకూ విస్తరిస్తాం. జనవరి వరకు పాత విధానంలో చెల్లింపులు ఉంటాయి. ఏ నెలకు ఆ నెల ప్రోత్సాహకాలు నేరుగా వ్యక్తిగత ఖాతాల్లో ట్రస్టు నుంచి జమ అవుతాయి. ఈ విధానంతో వైద్యులు, సిబ్బందిలో నూతనోత్తేజం వస్తుందని భావిస్తున్నాం. తద్వారా ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు మరింత పెరుగుతాయని భావిస్తున్నాం. – డాక్టర్ వినోద్‌కుమార్, డీఎంఈ -
ఆగిందా.. గురువిందా!
సాక్షి, అమరావతి: గతంతో పోలిస్తే 108 అంబులెన్స్‌ల సేవలు ఎంతో బాగున్నట్లు చిన్న పిల్లాడైనా చెబుతాడు. ఈనాడుకు మాత్రం 108లు ఆపదలో ఉన్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు డొక్కు వాహనాలతో 108 సేవలు మొరాయించినా రామోజీకి అంతా సవ్యంగానే కనిపించింది. నాడు అంబులెన్స్‌లు రాక ప్రాణాలు గాల్లో కలిసినా ఆ పెద్ద మనిషికి చీమ కుట్టినట్లైనా అనిపించలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిబంధనల ప్రకారం 60 వేల జనాభాకు ఒక అంబులెన్స్ ఉండాలి. దేశవ్యాప్తంగా సగటున లక్షకు పైగా జనాభాకు ఒక అంబులెన్స్ మాత్రమే అందుబాటులో ఉంది. మన రాష్ట్రంలో ప్రస్తుతం 74 వేల జనాభాకు ఒకటి చొప్పున 108 అంబులెన్స్‌లు ఉన్నాయి. 16 రోజుల్లో 89 కేసుల్లో సేవలు.. సెల్ఫ్ మోటర్, వైరింగ్ సమస్యతో ఓ అంబులెన్స్ శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో ఆగిపోవడంతో మెకానిక్ షెడ్డుకు తరలిస్తున్న ఫోటోను ఈనాడు కథనంలో ప్రచురించింది. నంబులపూలకుంట మండలానికి చెందిన ఈ వాహనం ఈ నెల 13వతేదీన 01 : 23 గంటలకు నిలిచిపోయింది. అంబులెన్స్ నిలిచిపోవడానికి ముందు వరకు కూడా 3 కేసుల్లో సేవలు అందించింది. మరమ్మతుల అనంతరం మరుసటి రోజు 4 : 52 గంటల నుంచి అంబులెన్స్ తిరిగి విధుల్లోకి వచ్చింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఒక్క రోజు మాత్రమే నిలిచిపోయింది. మిగిలిన 16 రోజుల్లో 89 కేసుల్లో సేవలు అందించింది. కొత్త వాహనాల కొనుగోలు 2020 జూలై ఒకటో తేదీ నుంచి 768 వాహనాలతో సీఎం జగన్ ప్రభుత్వం 108 అంబులెన్స్ సేవలను బలోపేతం చేసింది. 432 కొత్త వాహనాలను ప్రవేశపెట్టింది. 336 వాహనాలకు మరమ్మతులు నిర్వహించి సేవలు అందిస్తోంది. నంబులపూలకుంట అంబులెన్స్ చాలా పాత వాహనం. 2.5 లక్షల కి.మీ పైగా తిరిగిన వాటి స్థానంలో కొత్తవి ప్రవేశపెట్టడంలో భాగంగా 146 అంబులెన్స్‌ల కొనుగోలుకు వైద్య శాఖ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. వీటి కొనుగోలుకు ప్రభుత్వం రూ.41 కోట్ల మేర ఖర్చు చేయనుంది. నిబంధనలకు లోబడే స్పందన నిబంధనల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో ఫోన్ చేసిన 15 నిమిషాల్లో ఘటనా స్థలానికి అంబులెన్స్ చేరుకోవాలన్నది నిబంధన. అయితే 14.50 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకుంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాలకు గాను 16.55 నిమిషాల్లోనే వచ్చేస్తున్నాయి. ఇక గిరిజన ప్రాంతాల్లో 30 నిమిషాలకు గాను 22.12 నిమిషాల్లోనే వస్తున్నాయి. త్వరలోనే ట్రాకింగ్ సదుపాయం.. కాల్ సెంటర్ నుంచి అన్ని అంబులెన్స్‌లను ట్రాక్ చేస్తుంటాం. ఎక్కడైనా వాహనం అందుబాటులో లేకపోయినా, నిలిచిపోయినా వెంటనే తెలిసిపోతుంది. జిల్లాల వారీగా డ్యాష్ బోర్డును కో–ఆర్డినేటర్లు పర్యవేక్షిస్తుంటారు. మరో 20 రోజుల్లో కాల్ చేసిన వారు తమ మొబైల్ నుంచి అంబులెన్స్ లొకేషన్‌ను ట్రాక్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తున్నాం. అప్లికేషన్ ఇప్పటికే సిద్ధమైంది. అంబులెన్స్‌ల ప్రతిస్పందన సమయం తనిఖీ చేయడానికి జియో ఫెన్సింగ్ టెక్నాలజీని వినియోగించనున్నాం. 15 రోజుల్లో ఈ సదుపాయం కూడా అందుబాటులోకి వస్తుంది. – ఎం.ఎన్. హరేందిరప్రసాద్, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈవో -
షాకింగ్ వివరాలు.. దేశంలో క్యాన్సర్ విజృంభణ.. 2022లో 8 లక్షల మంది మృతి
సాక్షి, అమరావతి: దేశంలో క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తోంది. గత మూడేళ్లలో (2020–22) దేశంలో 42.88 లక్షల మంది క్యాన్సర్ బారినపడ్డారు. మృతుల సంఖ్య కూడా ఏటా పెరుగుతోంది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్‌లో ఈ వివరాలు పొందుపరిచింది. 2020 నుంచి 2022 మధ్య రాష్ట్రాలవారీగా ఐసీఎంఆర్ వెల్లడించిన క్యాన్సర్ కేసులు, మరణాలను ఇటీవల కేంద్ర వైద్య శాఖ మంత్రి మాండవీయా లోక్‌సభలో వివరించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. దేశవ్యాప్తంగా 2020లో 13,92,179 కేసులు నమోదవగా 2021లో 14,26,447 కేసులు, 2022లో 14,61,427 కేసులు నమోదయ్యాయి. ఇదే కాలంలో మరణాల సంఖ్య కూడా భారీగానే ఉంది. 2020లో దేశవ్యాప్తంగా 7.70 లక్షలు, 2021లో 7.89 లక్షలు, 2022లో 8.08 లక్షల మరణాలు నమోదయ్యాయి. కేసులు, మరణాలు ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా ఉన్నాయి. 2022లో ఉత్తరప్రదేశ్‌లో 2,10,958 కేసులు, 1,16,818 మరణాలు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. ఏపీలో 73,536 క్యాన్సర్ కేసులు నమోదవగా, 40,307 మంది మరణించినట్లు ఆ గణాంకాలు తెలిపాయి. అత్యల్పంగా లక్షద్వీప్‌లో 28 కేసులు, 14 మరణాలు నమోదయ్యాయి. క్యాన్సర్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి రాష్ట్రంలో క్యాన్సర్ వ్యాధి నియంత్రణ, చికత్సకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలోకి చేర్చింది. ఇప్పటివరకు క్యాన్సర్ చికిత్సలకే రూ. వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేశారు. మరోవైపు ప్రభుత్వ రంగంలో క్యాన్సర్ చికిత్స సదుపాయాలను మెరుగుపరుస్తోంది. దీనివల్ల క్యాన్సర్ బాధితులు వ్యయప్రయాసలకోర్చి వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పని ఉండదు. ఇందులో భాగంగా తొలి దశలో ప్రస్తుతం ఉన్న ఏడు ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో క్యాన్సర్ చికిత్స సదుపాయాల మెరుగుపరుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే రూ.119.58 కోట్లు కేటాయించింది. వ్యాధి నియంత్రణ చర్యల్లో భాగంగా నోటిఫైడ్ జబ్బుల జాబితాలోకి క్యాన్సర్‌ను చేర్చింది. ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించి, ప్రాణాపాయ పరిస్థితులను తప్పించడానికి సామూహిక క్యాన్సర్ స్క్రీనింగ్ చేపడుతోంది. -
పేదలకు ఉచితంగా మరింత నాణ్యమైన వైద్యం
సాక్షి, అమరావతి: పేదలందరికీ ఇకపై ఎయిమ్స్‌లో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలందనున్నాయి. ఈ మేరకు గురువారం మంగళగిరిలోని ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో ఎయిమ్స్‌తో ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. పేదలకు ఉచితంగా మరింత నాణ్యమైన వైద్యం అందించాలనే సీఎం జగన్ ఆలోచనల మేరకు ఎయిమ్స్‌తో ఎంవోయూ కుదుర్చుకున్నట్లు చెప్పారు. కొన్ని రోజులుగా ఎయిమ్స్‌లో ఆరోగ్యశ్రీ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 100 మందికి పైగా రోగులకు ఎయిమ్స్‌లో ఉచితంగా ఆరోగ్యశ్రీ సేవలు అందించామన్నారు. 30 మందికి పైగా రోగులకు చికిత్సలు కూడా పూర్తయ్యాయని తెలిపారు. ట్రయల్ రన్ పూర్తవ్వడంతో అధికారికంగా అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. 24 గంటలూ ఆరోగ్యశ్రీ సేవలందేలా చర్యలు తీసుకున్నామన్నారు. క్యాన్సర్‌కు నాణ్యమైన వైద్యం అతి త్వరలో ఎయిమ్స్‌లో పెట్ సిటీ స్కాన్ అందుబాటులోకి రానుందని మంత్రి విడదల రజిని చెప్పారు. శరీరంలో ఎక్కడ క్యాన్సర్ అవశేషాలున్నా సరే.. ఈ స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. క్యాన్సర్‌కు అంతర్జాతీయ స్థాయి వైద్యం ఏపీలోనే అందించాలనే సీఎం జగన్ ఆలోచనకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎయిమ్స్‌కు ప్రస్తుతం రోజుకు ఆరు లక్షల లీటర్ల నీటిని అందిస్తున్నామన్నారు. వచ్చే జూన్ కల్లా పైపులైను పనులు పూర్తవుతాయని చెప్పారు. ఎయిమ్స్ నుంచి రోగులను మంగళగిరికి చేర్చేందుకు ఉచిత వాహన సౌకర్యం కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో ఎయిమ్స్ డైరెక్టర్ త్రిపాఠి, ఎయిమ్స్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ వంశీకృష్ణ, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, కార్యదర్శి నవీన్‌కుమార్, కమిషనర్ నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్ పాల్గొన్నారు. (క్లిక్ చేయండి: స్మార్ట్ మీటర్లకు రుణాలా.. అలాంటిదేమి లేదు!?) -
YSR Aarogyasri: ఇతర రాష్ట్రాల క్షతగాత్రులకూ చికిత్స.. మార్గదర్శకాలు జారీ
సాక్షి, అమరావతి: ఏపీలో రోడ్డు ప్రమాదానికి గురైన ఇతర రాష్ట్రాల వ్యక్తులకూ డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా వైద్యం అందనుంది. రాష్ట్రంలో ఏటా రోడ్డు ప్రమాదాల కారణంగా 8,000 మందికి పైగా మృత్యువాత పడుతున్నారు. ప్రమాదాలు, మరణాలను 15 శాతం తగ్గించాలని ఈ ఏడాది ఫిబ్రవరి 14న సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఏపీ రోడ్ సేఫ్టీ కౌన్సిల్ మీటింగ్‌లో నిర్ణయించారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదానికి గురవుతోన్న ఇతర రాష్ట్రాలకు చెందిన డ్రైవర్లు, రోజువారీ కూలీలు, ప్రయాణికులకు నగదు రహిత వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కింద ఇతర రాష్ట్రాల రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్సలు అందించేలా చూడాలని సూచించారు. ఈ మేరకు రవాణా శాఖ కమిషనర్ పంపిన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఆరోగ్యశ్రీ కింద ఇతర రాష్ట్రాల రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స అందించడానికి వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు సోమవారం మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇకపై రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలకు గురయ్యే ఇతర రాష్ట్రాల వ్యక్తులకు సీఎంసీవో కార్డును జారీ చేయడం ద్వారా నగదు రహిత చికిత్సను ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో అందించనుంది. ఇందుకోసం అవసరమైన చర్యలను చేపట్టాలని ఆరోగ్యశ్రీ సీఈవో, రవాణా శాఖ కమిషనర్లను ఆదేశించారు. -
ఏపీలో వైద్య విప్లవం.. సీఎం జగన్ ఆలోచనలు దేశానికే దిక్సూచి
సాక్షి, అమరావతి: డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం, వైద్య కళాశాలల నిర్మాణం, నాడు–నేడు కింద ఆస్పత్రుల అభివృద్ధి వంటి కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్‌లో వైద్య రంగంలో సరికొత్త విప్లవాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. సీఎం జగన్ ఆలోచనలు దేశానికే దిక్సూచి అని అన్నారు. న్యూఢిల్లీలో టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ ఆధ్వర్యంలో జరిగిన టైమ్స్ నౌ సమ్మిట్–22లో మంత్రి రజిని నేతృత్వంలో ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జీఎస్ నవీన్‌కుమార్‌లతో కూడిన బృందం పాల్గొంది. వివిధ అంశాలపై సదస్సులో చర్చించారు. వైద్య రంగంలో డిజిటలైజేషన్‌పై జరిగిన చర్చలో రాష్ట్ర ప్రజలకు డిజిటల్ వైద్య సేవలు అందించడంలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తున్న కృషి అనిర్వచనీయమని నిర్వాహకులు ప్రశంసించారు. ఈ చర్చలో మంత్రి రజిని మాట్లాడుతూ.. ప్రజలకు వైద్యం భారం కాకూడదన్నదే సీఎం జగన్ ఆకాంక్ష అని తెలిపారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద 2,200కు పైగా ఆస్పత్రుల్లో 3,255 చికిత్సలను ఉచితంగా పేదలకు అందిస్తున్నామని, ఇందుకు ఏటా రూ.3 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. శస్త్ర చికిత్స అనంతరం ఆరోగ్య ఆసరా కింద రోగులకు ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. వలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల సహకారంతో రాష్ట్రంలోని 3.5 కోట్ల మందికి డిజిటల్ హెల్త్ ఐడీలు సృష్టించామని, ఇప్పటికే 1.5 కోట్ల మంది ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేశామని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో 10,032 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, 1,142 పీహెచ్‌సీల నిర్మాణం, ఆధునికీకరణ ద్వారా ఆరోగ్య సేవలను బలోపేతం చేశామన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టి, గ్రామీణులకు వైద్య సేవలను మరింత చేరువ చేశామని చెప్పారు. నాడు–నేడు కింద రూ.16 వేల కోట్లతో వైద్య రంగం రూపురేఖలు మారుస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఏకంగా రూ.8,500 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి రజిని వివరించారు. -
ఆరోగ్యశ్రీలో మానసిక ఆరోగ్య చికిత్సలు
సాక్షి, అమరావతి: ప్రైవేట్ మానసిక ఆస్పత్రులను వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో ఎంపానల్మెంట్ చేయడం ద్వారా మానసిక ఆరోగ్య చికిత్సలు పూర్తి స్థాయిలో విస్తరించాలని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు అధికారులను ఆదేశించారు. మంగళగిరిలోని వైద్యశాఖ కార్యాలయంలో స్టేట్ మెంటల్ హెల్త్ అథారిటీ (ఎస్ఎంహెచ్ఎ) సమావేశం మంగళవారం జరిగింది. కృష్ణబాబు మాట్లాడుతూ మానసిక చికిత్సలకు ప్రభుత్వాస్పత్రుల్లో ఇప్పటికే ఆరోగ్యశ్రీలో చికిత్సలు అందుబాటులో ఉన్నాయన్నారు. అయితే, కొన్ని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో మాత్రమే ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద మానసిక చికిత్సలు అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. అన్ని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో మానసిక ఆరోగ్య వైద్య సేవలకు ఆరోగ్యశ్రీ అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని జిల్లాల్లోనూ డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ రివ్యూ బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. సమావేశంలో ఎస్ఎంహెచ్ఎ సీఈవో, డీఎంఈ డాక్టర్ వినోద్‌కుమార్, ప్రత్యేక కార్యదర్శి నవీన్‌కుమార్, కో–ఆర్డినేటర్ డాక్టర్ రాధిక, జేడీ డాక్టర్ నీలిమ పాల్గొన్నారు. -
వైద్య పథకాల అమలుపై కేంద్ర బృందం సంతృప్తి
మచిలీపట్నం: కృష్ణా జిల్లాలో కేంద్ర వైద్యబృందం ఆదివారం పర్యటించింది. ఐదు రోజులపాటు జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆస్పత్రులు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను ఈ బృందంలోని సభ్యులు సందర్శించనున్నారు. మచిలీపట్నంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిని సందర్శించిన బృందం ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలు, ఆరోగ్యశ్రీ అమలు, రోగులకు కల్పించిన సౌకర్యాలను పూర్తిస్థాయిలో పరిశీలించారు. జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా మంజూరైన నిధులతో అమలు చేస్తున్న పథకాలు రోగులకు ఎలా అందుతున్నాయనేది తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ ఇందిరాదేవి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జయకుమార్ కేంద్ర వైద్యబృందానికి ఇక్కడ అమలు చేస్తున్న కార్యక్రమాలపై వివరించారు. అంతకుముందు మచిలీపట్నంలోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో కేంద్ర బృందానికి డీఎంహెచ్‌వో డాక్టర్ గీతాబాయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలో అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఈ బృందంలో డాక్టర్ త్రిపాఠి షిండే, డాక్టర్ ఆసీమా భట్నాగర్, డాక్టర్ రష్మీ వాద్వా, డాక్టర్ అనికేట్ చౌదరి, శ్రీ శుభోధ్ జైస్వాల్, ప్రీతీ ఉపాధ్యాయ, అభిషేక్ దదిచ్ ఉన్నారు. వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర కమిషనరేట్ నుంచి డాక్టర్ దేవి, డాక్టర్ శిరీష, డాక్టర్ రమాదేవి, డాక్టర్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
ఆస్పత్రులకు వచ్చి చూడండి
చిలకలూరిపేట: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడటం అత్యంత హాస్యాస్పదమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఆమె శనివారం మీడియాతో మాట్లాడారు. ఆస్పత్రులను సందర్శించి, రోగుల వద్దకు వెళ్లి పలకరించి ఆరోగ్యశ్రీ ఎలా అమలవుతోందో తెలుసుకోవాలని సూచించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజాక్షేత్రంలో అభాసుపాలవుతారని సూచించారు. 2007లో దివంగత వైఎస్సార్ 946 ప్రొసీజర్లతో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే.. ఇప్పుడు వైఎస్ జగన్ ఏకంగా 3,255కి పెంచారని గుర్తు చేశారు. చంద్రబాబు తన సొంత మనుషులతోనే రాళ్లు వేయించుకున్నట్లు అనుమానాలున్నాయన్నారు. ఇప్పటం గ్రామంలో ఏం జరిగిందో ప్రజలకు అంతా తెలుసని మంత్రి రజిని తెలిపారు. -
ఆపద వేళ.. అమృత హస్తం
పేద కుటుంబాల్లోని వ్యక్తి తీవ్రమైన అనారోగ్యంతో, దీర్ఘకాలిక వ్యాధులతో మంచం పడితే వైద్యం చేయించుకునేందుకు కూడా డబ్బులు లేక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అటువంటి వారిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ హెల్త్ పెన్షన్లు మంజూరు చేస్తోంది. వ్యాధిని బట్టి గరిష్టంగా రూ.10 వేల వరకు అందిస్తున్న పెన్షన్‌తో సకాలంలో వైద్యం పొందుతున్నారు. ఒంగోలు అర్బన్: దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేసి దేశానికే ఆదర్శంగా నిలిచేలా పథకాలు అమలు చేశారు. ఇప్పుడు ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రికి మించిన తనయుడుగా అన్నీ వర్గాల పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా వైద్య ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేశారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన 108, 104, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల ఏర్పాటుతో పాటు ఆరోగ్యశ్రీ ద్వారా పేదల ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. వైద్య సేవలే కాకుండా అనారోగ్యంతో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి “వైఎస్సార్ హెల్త్ పెన్షన్’ ద్వారా ఉపశమనం కల్పిస్తున్నారు. గతంలో కేవలం వికలాంగులకు మాత్రమే నెలకు రూ.3 వేలు పింఛన్ ఇచ్చేవారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో దీర్ఘకాలిక వ్యాధులతో మంచానికే పరిమితమైన వారిని చూసి చలించిపోయారు. కుటుంబ పెద్ద మంచానికి పరిమితం కావడంతో కుటుంబ పోషణ సైతం కష్టమైన పరిస్థితులను గమనించి ప్రభుత్వం ఏర్పడగానే అటువంటి వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు వైఎస్సార్ హెల్త్ పెన్షన్ పథకం అమలు చేసి వ్యాధిని బట్టి నెలకు రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు ప్రతి నెలా అందజేస్తున్నారు. జిల్లాలో వైఎస్సార్ హెల్త్ పెన్షన్నుకు సంబంధించి ఉన్నతాధికారులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి నిజమైన బాధితులకు అండగా నిలుస్తున్నారు. 2020లో ప్రారంభమైన వైఎస్సార్ హెల్త్ పెన్షన్ పథకం ద్వారా ఉమ్మడి ప్రకాశంలో 3,983 మంది ఉండగా ప్రస్తుత కొత్త జిల్లాలో 2558 మంది లబ్ధిదారులు పెన్షన్ అందుకుంటున్నారు. ప్రస్తుతం మరో 400 దరఖాస్తులు అప్లోడ్ చేసిఉన్నారు. కుష్టు వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.3 వేలు పింఛన్ ఇస్తుండగా కిడ్నీ, లివర్, గుండె రీప్లేస్మెంట్ జరిగిన రోగులకు, కిడ్నీ బాధితులు (సీరం క్రియాటిన్ 5 ఎంఎం కంటే ఎక్కువ) ఉన్న వారికి, తీవ్రంగా కండరాల క్షీణతతో పాటు ప్రమాదాలతో మంచానికి, వీల్‌చైర్‌కు పరిమితమైన వారికి, చక్రాల కుర్చీ, మంచానికి పరిమితమైన పక్షవాతం ఉన్న రోగులకు, బోదకాలు (రెండు కాళ్లకు) ఉన్న వారికి నెలకు రూ.5 వేలు పింఛన్ అందజేస్తున్నారు. తలసేమియా మేజర్, సికిల్‌సెల్, సివియర్ హిమోఫీలియా (2 శాతం పైబడి) ఉన్న రోగులకు నెలకు రూ.10 వేలు ఇస్తున్నారు. పక్షవాతం, కండరాల క్షీణత, ప్రమాదాలతో మంచానికే పరిమితమైన రోగులకు సదరమ్ సర్టిఫికెట్తో పెన్షన్ మంజూరు చేస్తున్నారు. మిగిలిన వ్యాధులకు తొలుత మెడికల్ బోర్డులోని కమిటీ రోగ ధ్రువీకరణæ చేస్తారు. అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని డాక్టర్లు సోషల్ ఆడిట్ చేసి వ్యాధి నిర్ధారణ చేసి అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని రోగులకు అందజేస్తారు. ధ్రువీకరణ పత్రంతో పాటు రోగులకు సంబంధించిన ఆధార్, బియ్యం కార్డు, బ్యాంకు ఖాతా పాస్ పుస్తకం తదితర వివరాలను డీఎంహెచ్ఓ కార్యాలయంలోని వైఎస్సార్ హెల్త్ పెన్షన్ విభాగంలో దరఖాస్తు అందచేయాలి. అందిన దరఖాస్తులను డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌కు అప్లోడ్ చేస్తారు. అక్కడి నుంచి సెర్ప్‌కు వెళ్లి పెన్షన్ మంజూరై సంబంధిత సచివాలయాలకు వెళుతుంది. సచివాలయాల ద్వారా వలంటీర్లు బాధితులకు పెన్షన్ అందజేస్తారు. అనారోగ్యంతో ఉన్న వారికి ప్రభుత్వం చేయూత దీర్ఘకాలిక అనారోగ్యం, ప్రమాదాలతో నడవలేని పరిస్థితితో సాధారణ జీవనం గడపలేని వారికి ప్రభుత్వం వైఎస్సార్ హెల్త్ పెన్షన్ ద్వారా చేయూతనిస్తోంది. వ్యాధి నిర్ధారణకు సంబంధించి సదరమ్, మెడికల్ బోర్డు పారదర్శకంగా పనిచేసేలా పక్కా చర్యలు తీసుకున్నాం. నిరంతరం సంబంధిత ఉన్నతాధికారులతో పర్యవేక్షణ కొనసాగిస్తున్నాం. ప్రభుత్వం తలపెట్టిన పెన్షన్ పథకం నిజమైన రోగులకు చేరాలి. ఆ విధంగా పెన్షన్ మంజూరులో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. వ్యాధి నిర్ధారణలో అవకతవకలు జరిగితే సహించేది లేదు. కఠిన చర్యలు తీసుకుంటాం. – ఏఎస్ దినేష్ కుమార్, కలెక్టర్ -
ఆపద్బంధు.. సీఎం సహాయ నిధి
భీమవరం(ప్రకాశం చౌక్): పేదల ఆరోగ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు నాడు–నేడులో భాగంగా ప్రభుత్వాస్పత్రులను అభివృద్ధి చేస్తోంది. అలాగే ఆరోగ్యశ్రీ పథకం వర్తించని కేసులకు సంబంధించి రోగులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తోంది. వారి పాలిట ఆపన్నహస్తంలా నిలుస్తోంది. ఆరోగ్యశ్రీలో వైద్యం లేని వ్యాధులకు సంబంధించి ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం పొందిన పేద, మధ్యతరగతి వర్గాలకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలుస్తున్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యానికి లక్షలు ఖర్చు చేసిన వారు ఆందోళన పడాల్సిన అవసరం లేకుండా ఆర్థిక భరోసా అందిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, స్థానిక ప్రజాప్రతినిధుల చేతులమీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందిస్తున్నారు. రూ.10 కోట్లకు పైగా.. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన 2019 నుంచి ఇప్పటివరకు పశ్చిమగోదావరి జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో బాధితులకు సుమారు రూ.10 కోట్లకు పైగా సీఎం రిలీఫ్ ఫండ్ సాయం అందించారు. సుమారు 2 వేల మంది వరకు ఈ సాయం అందినట్టు అంచనా. సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న రోగులకు ఆస్పత్రిలో అయిన ఖర్చును బట్టి రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు సాయం అందిస్తున్నారు. బాసటగా నిలుస్తున్న ఎమ్మెల్యేలు ఆరోగ్యశ్రీలో వర్తించని వ్యాధులకు సొంత ఖర్చుతో వైద్యం చేయించుకున్న బాధితులకు జిల్లాలో ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు బాసటగా నిలుస్తున్నారు. నేరుగా వారి వద్దకు వచ్చినా లేదా గ్రామాల పర్యటన సందర్భంగా గుర్తించిన కేసులకు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేలా కృషిచేస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తులను వారి కార్యాలయాల నుంచి పంపించి బాధితులకు అండగా నిలుస్తున్నారు. సర్వత్రా హర్షం సీఎం రిలీఫ్ ఫండ్ సాయంపై లబ్ధిదారులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ పేదల ఆరోగ్యానికి భరోసాగా నిలుస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీలో వర్తించని వ్యాధులకు సంబంధించి సాయం అందించడం అభినందనీయమని అంటున్నారు. రూ.10 లక్షలు ఇచ్చారు మా అబ్బాయికి కాలేయ సమస్య రావడంతో హైదరాబాద్‌లో వైద్యం చేయించాం. విషయాన్ని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ దృష్టికి తీసుకురాగా ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.10 లక్షలు వచ్చేలా సాయపడ్డారు. నేను ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా మా అబ్బాయికి పెద్ద కష్టం వచ్చిపడింది. ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి ఆర్థికంగా ఆదుకుంది. సీఎం జగన్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు. – పచ్చిపాల మూర్జా, గూట్లపాడు పేదలకు వరంలా.. మా మనవడు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. హైదరాబాద్ రెయిన్బో ఆస్పత్రిలో సొంత ఖర్చులతో ఆపరేషన్ చేయించాం. తర్వాత శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకోగా ఇటీవల రూ.5.20 లక్షల సాయం అందించారు. ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి వరంలా మారింది. ప్రభుత్వానికి ధన్యవాదాలు. – ఎం.రామకృష్ణ, విస్సాకోడేరు -
ఆరోగ్యశ్రీ 2.0.. రెట్టింపు భరోసా
డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నాం. బకాయిలు లేకుండా మన ప్రభుత్వం తీసుకున్న చర్యలు నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాల్లో నమ్మకం, విశ్వాసం పెరిగేలా చేసింది. ఇప్పుడు రోగులకు మరిన్ని వైద్య సేవలను అందుబాటులోకి తీసుకు వస్తున్నాం. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల కారణంగా గాయపడే ఇతర రాష్ట్రాల వారికి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఉత్తమ సేవలు అందించిన ఆరోగ్య మిత్రలకు సేవా మిత్రలు, సేవారత్న, ఉన్నత ఆరోగ్య సేవ అవార్డులు ఇవ్వాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి కుటుంబాల్లోని ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెట్టింపు భరోసా కల్పించారు. ఆయా వర్గాల ప్రజలు దురదృష్టవశాత్తు ఏదైనా జబ్బు బారిన పడిన సందర్భాల్లో ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్న ‘డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’ పథకాన్ని మరింత బలోపేతం చేశారు. ఈ పథకం పరిధిలోకి మరో 809 చికిత్సలను కొత్తగా చేర్చి, మొత్తం 3,255 వైద్య చికిత్సల(ప్రక్రియలు)తో ‘డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ 2.0’ను శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. దీంతో ఇప్పటి వరకు ఉన్న 2,446 చికిత్స ప్రక్రియల సంఖ్య 3,255కు చేరింది. ఇవన్నీ శుక్రవారం నుంచే అందుబాటులోకి వచ్చాయి. చరిత్ర సృష్టించిన సీఎం జగన్ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకూ 2014–19 మధ్య ఆరోగ్యశ్రీ పథకంలో కేవలం 1,059 చికిత్సలు మాత్రమే అందుబాటులో ఉండేవి. ప్రజారోగ్యానికి పెద్ద పీట వేసిన సీఎం జగన్ టీడీపీ హయాంలో నిర్వీర్యం అయిన ఈ పథకానికి ఊపిరిలూదేలా విప్లవాత్మక చర్యలు చేపట్టారు. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటే ప్రతి చికిత్సకు ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేసేలా అడుగులు ముందుకు వేస్తామని 2019 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారంలోకి వచి్చన వెంటనే ఆ దిశగా వడివడిగా అడుగులు వేశారు. 2020 జనవరిలో చికిత్సలను 2059కి పెంచారు. అదే సంవత్సరం జూలైలో 2,200 చికిత్సలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా అదనంగా చేర్చిన చికిత్సల్లో 54 క్యాన్సర్ చికిత్సల ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. 2020 నవంబర్‌లో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి పలు పెద్ద చికిత్సలతో సహా 2,436కు పెంచారు. 2020, 2021 సంవత్సరాల్లో ప్రపంచాన్ని కోవిడ్ మహమ్మారి అతలాకుతలం చేసింది. ఈ వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్న సీఎం జగన్ సర్కార్.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా కరోనాకు సంబంధించిన 10 రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీలోకి 2021 మే, జూన్ నెలల్లో చేర్చింది. తాజాగా మరో 809 చికిత్సలను చేర్చడంతో మొత్తం చికిత్సల ప్రక్రియలు 3,255కు పెరిగింది. ఇలా 2019 నుంచి ఇప్పటి వరకు 2,196 చికిత్సలను పథకంలో చేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుంది. ఖర్చు మూడు రెట్లు అధికం టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే సీఎం జగన్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ, 104, 108 వైద్య సేవల కోసం మూడు రెట్లు అదనంగా ఖర్చు చేస్తోంది. 2018–19లో అప్పటి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ, 104, 108 సేవల కోసం రూ.1299.01 కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుత ప్రభుత్వం 2021–22లో ఆరోగ్యశ్రీ కోసం రూ.2,894.87 కోట్లు ఖర్చు పెట్టింది. మరో వైపు ఇదే ఏడాది ఆరోగ్య ఆసరా కోసం సుమారు రూ.300 కోట్లు, 104 సేవల కోసం రూ.114.05 కోట్లు, 108 సేవల కోసం రూ.172.78 కోట్లు వెచ్చించింది. ఇలా మొత్తంగా ఆ ఏడాది రూ.3481.7 కోట్లు ప్రజల ఆరోగ్యం కోసం ఖర్చు చేసింది. -
ఆరోగ్యశ్రీతో బాలుడికి పునర్జన్మ
కడప రూరల్: ఎంతో మందికి పునర్జన్మను ప్రసాదిస్తున్న డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ తాజాగా ఓ పేద కుటుంబానికి చెందిన చిన్నారికి అండగా నిలిచింది. వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం బీరాన్ఖాన్పల్లెకు చెందిన షేక్ నూర్‌బాషా, చాందిని దంపతుల కుమారుడు హబీబ్(2)కు పుట్టుకతో మల విసర్జన ద్వారం ఏర్పడలేదు. ఈ సమస్య 5 వేల మంది చిన్నారుల్లో ఒకరికి వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో.. హబీబ్ తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఏరోజుకారోజు పనికి వెళ్తే గానీ జీవితం గడవని పరిస్థితుల్లో కుమారుడికి వైద్యమెలా చేయించాలా అని తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఇంతలో ఈ జబ్బుకు కూడా ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని వైద్యులు చెప్పడంతో.. ఎంతో సంతోషించిన వారు వెంటనే తమ కుమారుడిని కర్నూలుకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు మొదటి దశ సర్జరీ చేసి.. పెద్ద పేగును తీసి బయటకు పెట్టారు. ఆ తర్వాత కడపలోని కేసీహెచ్ ఆస్పత్రిలో కూడా దీనికి చికిత్స చేస్తారని తెలియడంతో అందులో చేర్పించారు. అక్కడి పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ సుకుమార్ పర్యవేక్షణలో వైద్య సిబ్బంది ఇటీవల రెండో సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. రూ.5 లక్షల వరకు ఖర్చయ్యే ఈ చికిత్స.. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా పూర్తవ్వడంతో హబీబ్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా తమ కుమారుడికి పునర్జన్మ లభించిందని.. వైఎస్ జగన్ ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటామంటూ వారు కృతజ్ఞతలు తెలిపారు. -
గుండెకు ‘ఆరోగ్యశ్రీ’ అండ
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రాందాస్ పేటకు చెందిన ఇతని పేరు బోర రామమూర్తి. పండ్ల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల రామమూర్తి ఒంట్లో నలతగా ఉందని వైద్యుల్ని సంప్రదించగా.. గుండె జబ్బుతో బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. ఈ విషయం తెలియడంతో కుటుంబ సభ్యులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వైద్యానికి ఎంత ఖర్చవుతుందో ఏమిటోనని, అంత డబ్బు ఎలా సమకూర్చుకోవాలో తెలియక సతమతమయ్యారు. ఈ పరిస్థితుల్లో ఆ కుటుంబానికి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం అండగా నిలిచింది. ఆ పథకం కింద రూ.4.50 లక్షల వ్యయాన్ని ప్రభుత్వమే భరించి ఉచితంగా బైపాస్ సర్జరీ చేయించింది. అంతేకాకుండా రామమూర్తి విశ్రాంత సమయంలో పోషణకు ఇబ్బందులు పడకుండా వైఎస్సార్ ఆసరా రూపంలో ఆర్థిక సాయం అందింది. ‘ఆరోగ్యశ్రీ పథకం నా ప్రాణాన్ని కాపాడింది. నా వైద్యం కోసం కుటుంబ సభ్యులు అప్పులు పాలుకాకుండా చూసింది. పథకాన్ని అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు’ అంటూ రామమూర్తి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి వారు లెక్కకు మిక్కిలిగా ఉన్నారు. నిరుపేద, మధ్య తరగతి గుండెలకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ అండగా నిలుస్తోంది. గుండె, కాలేయం, కిడ్నీ, క్యాన్సర్ వంటి ఎన్నో రకాల పెద్ద జబ్బులకు సైతం పైసా ఖర్చు లేకుండా శస్త్ర చికిత్సలు చేయిస్తోంది. ఇప్పటికే 2,446 రకాల జబ్బులకు ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత వైద్యం లభిస్తుండగా.. ఆ సంఖ్య త్వరలో 3,254 రకాల చికిత్సలకు పెరగనుంది. టీడీపీ హయాంలో నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీ పథకానికి ఊపిరిలూదుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న చర్యలతో పేదలకు భారీ మేలు చేకూరుతోంది. పొరుగు రాష్ట్రాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో సైతం ఈ పథకం కింద ఉచితంగా చికిత్స అందుతోంది. వారంతా వైద్యం తర్వాత చిరునవ్వుతో ఇంటికి తిరిగొస్తున్నారు. టీడీపీ హయాంలో పేదలకు పెద్ద జబ్బు వస్తే ఆస్తులు అమ్ముకోవడం లేదా అప్పుల ఊబిలో కూరుకుపోవడం తప్ప మరో మార్గం ఉండేది కాదు. ఏ ఆస్తులూ లేని వారు దైవంపై భారం వేసి రోజులు లెక్కపెట్టుకోవాల్సిన దుస్థితి ఉండేది. 73,856 గుండెల్లో సంతోషం 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరు వరకూ (18 నెలలు) రాష్ట్రంలో 73,856 మంది ఆరోగ్యశ్రీ కింద గుండె జబ్బులకు చికిత్స పొందారు. వీరిలో 21,740 మంది మహిళలు కాగా, 52,116 మంది పురుషులు. వీరి చికిత్స కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.378 కోట్లు ఖర్చు చేసింది. 2021–22లో రూ.233 కోట్లు వెచ్చించగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.145 కోట్లు వెచ్చించింది. మరోవైపు చికిత్స పొందిన వారికి ఆరోగ్య ఆసరా పథకం కింద విశ్రాంత సమయానికి ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించింది. ఆరోగ్యశ్రీ కింద బైపాస్ సర్జరీ చేశారు గుండె జబ్బుతో బాధపడుతున్న నేను కొద్ది రోజుల క్రితం కర్నూలు జీజీహెచ్‌లో చేరాను. బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం కింద బైపాస్ సర్జరీ చేశారు. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగుంది. కొద్దిరోజులు ఆస్పత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండాలన్నారు. – సి.సుబ్బమ్మ, తిమ్మంపల్లె, అనంతపురం జిల్లా జగన్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం నేను లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నా. ఆగస్టు 15న డ్యూటీ దిగాక గుండెలో నొప్పిగా అనిపించి గుంటూరు నగరంలోనే ఓ ఆస్పత్రికి వెళ్లాను. పరీక్షలు అనంతరం బైపాస్ సర్జరీ చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చికిత్స చేశారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదు. లారీ డ్రైవర్‌గా జీవనం సాగించే నాకు అంత ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోవడం చాలా కష్టం. నా చికిత్సకు సాయం చేసిన సీఎం జగన్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. – బి.శ్రీనివాసరావు, గుంటూరు నగరం అర్హులందరికీ ఉచితంగా చికిత్స అర్హులందరికీ ఉచితంగా గుండె, కాలేయం, కిడ్నీ, ఊపిరితిత్తులు సంబంధిత పెద్ద వ్యాధులతోపాటు క్యాన్సర్ వంటి జబ్బులకు సైతం ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వం వైద్యం చేయిస్తోంది. త్వరలో మరిన్ని చికిత్సలను తీసుకురాబోతున్నాం. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకంలో 2,446 చికిత్సలకు వైద్యం అందుతుండగా.. త్వరలో ఆ సంఖ్య 3,254కు పెరగనుంది. – హరేంధిర ప్రసాద్, సీఈవో, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ -
ఆరోగ్యశ్రీలో చికిత్సలు పెంపు
సాక్షి, అమరావతి: డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తోంది. పథకం కింద ఇప్పటికే 2,446 చికిత్స విధానాలు ఉండగా మరో 808 విధానాలను దాని పరిధిలోకి తీసుకొస్తోంది. దీంతో ఆరోగ్య శ్రీలో చికిత్సల సంఖ్య ఏకంగా 3,254కు పెరుగుతోంది. వచ్చే వారంలో వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ నిర్ణయంతో ప్రజలకు మెరుగైన, కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించడానికి మరింత వీలవుతుంది. టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే 2,195 చికిత్సలు అదనం 2019కి ముందు టీడీపీ హయాంలో ఆరోగ్యశ్రీ పథకం కింద 1,059 చికిత్సలు మాత్రమే అందుతుండేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ సంఖ్యను ఏకంగా 2,446కు పెంచింది. ప్రజల ఆరోగ్యానికి మరింత రక్షణ కల్పించేలా సీఎం జగన్ మరో అడుగు ముందుకేస్తూ ఇంకో 808 చికిత్సలను పథకం పరిధిలోకి తెస్తున్నారు. దీంతో టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే 2,195 చికిత్సలు అదనంగా ఆరోగ్యశ్రీలోకి వచ్చినట్లవుతుంది. మరోవైపు.. 2019 అనంతరం రూ.ఐదు లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ పథకం పరిధిలోకి తెచ్చారు. ఫలితంగా రాష్ట్రంలో 1.40 కోట్ల కుటుంబాలకు ఉచిత వైద్యసేవలు అందుతున్నాయి. ఆసరా రూపంలో అండగా.. పేద, మధ్య తరగతి కుటుంబాల్లోని వ్యక్తులు జబ్బుచేసి మంచానికి పరిమితమైతే వారి పోషణ చాలా కష్టంగా ఉంటుంది. దీనిని గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దీనికింద 1,519 రకాల చికిత్సలు చేయించుకున్న వారికి వైద్యులు సూచించిన విశ్రాంత సమయానికి రోజుకు రూ.225లు.. లేదా గరిష్టంగా నెలకు రూ.5వేలు చొప్పున భృతి అందిస్తోంది. 2019లో ఆసరా కార్యక్రమం ప్రారంభించిన నాటి నుంచి ఈ ఏడాది మే నెల వరకూ రాష్ట్రవ్యాప్తంగా 9,85,315 మందికి రూ.624.02 కోట్లు ప్రభుత్వం సాయంచేసింది. వచ్చే వారంలో అందుబాటులోకి.. కొత్తగా పెంచుతున్న 808 చికిత్సలను వచ్చే వారం నుంచి అందుబాటులోకి తీసుకొస్తాం. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపు.. 450 చికిత్సల ప్యాకేజీలను రీవైజ్ చేస్తున్నాం. రీవైజ్డ్ ప్యాకేజీలను వచ్చే వారంలోనే అందుబాటులోకి తెస్తాం. – హరేంధిరప్రసాద్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈఓ -
ఆరోగ్య సేవలకు రూ.3,200 కోట్లు: ఏపీ సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో చికిత్సల సంఖ్యను త్వరలో 2,446 నుంచి 3,254కు పెంచనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఆరోగ్యశ్రీ, అనుబంధ సేవలకు ఏటా రూ.3,200 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. గత సర్కారు హయాంతో పోలిస్తే మూడు రెట్లు అదనంగా ఖర్చు చేస్తున్నామని, ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని చెప్పారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వైద్య శాఖలో నియామకాలు, ఆరోగ్యశ్రీలో చికిత్సల పెంపు, కొత్త వైద్య కళాశాలల నిర్మాణం సహా పలు కార్యక్రమాల్లో పురోగతిని పరిశీలించారు. మెరుగైన వైద్య సేవలే లక్ష్యం ఆరోగ్యశ్రీ పథకం కోసం ఏటా రూ.2,500 కోట్లు, ఆరోగ్య ఆసరా కోసం సుమారు రూ.300 కోట్లు, 108 అంబులెన్స్‌లు, 104 మొబైల్ మెడికల్ యూనిట్ల (ఎంఎంయూ) కోసం మరో రూ.400 కోట్లు ఖర్చు పెడుతున్నాం. మొత్తంగా ఏటా రూ.3,200 కోట్లు ఆరోగ్యశ్రీ, అనుబంధ సేవలకు వెచ్చిస్తున్నాం. వచ్చే డిసెంబర్ నాటికి 104 ఎంఎంయూ కొత్త వాహనాలు 432 అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే 676 వాహనాల ద్వారా గ్రామాల్లో వైద్య సేవలు అందిస్తున్నాం. కొత్త వాహనాలతో ఎంఎంయూల సంఖ్య 1,108కి పెరుగుతుంది. వీటికి తోడు 108 అంబులెన్స్‌లు 748 ఉన్నాయి. 104, 108 వాహనాల నిర్వహణ, ఆరోగ్యశ్రీ పథకం అమలులో లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే మన లక్ష్యం. 12 వైద్య పరీక్షలు.. 67 రకాల మందులు గ్రామీణ ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను ఏర్పాటు చేస్తున్నాం. వీటిలో 12 రకాల వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు 67 రకాల మందులు పుష్కలంగా అందుబాటులో ఉండాలి. కరోనా నిర్ధారణ కిట్లు కూడా సమకూర్చాలి. ప్రతి నెలా ఆడిట్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో మానవ వనరుల కొరత సమస్య తలెత్తడానికి వీల్లేదు. వేల సంఖ్యలో వైద్య సిబ్బంది పోస్టుల భర్తీ చేపట్టాం. ప్రతి చోటా సరిపడా వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలి. దీనిపై ప్రతి నెలా ఆస్పత్రుల వారీగా ఆడిట్ నిర్వహించాలి. ఆడిట్ నివేదికలు ప్రతి నెలా ఉన్నతాధికారులకు చేరాలి. నివేదికలు పరిశీలించి ఎక్కడైనా ఖాళీ ఉంటే తక్షణమే వేరొకరిని నియమించాలి. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగాలి. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు యోచన చేయాలి. జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ పెంపుపై చర్యలు తీసుకోవాలి. డైట్ చార్జీలు రూ.100 ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు మంచిమెనూతో ఆహా రం అందించాలి. డైట్చార్జీని రోజుకు రూ.100కు పెంచాలి. మంచి మెనూతో డైట్ సమకూర్చాలి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 17 కొత్త వైద్యకళాశాలలను నిర్మిస్తున్నాం. సకాలంలో వీటి నిర్మాణాలు పూర్తయ్యేలా దృష్టి సారించాలి. 15 నుంచి ప్రారంభం! ఆరోగ్యశ్రీలో కొత్తగా చేర్చే చికిత్సలను దాదాపు ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే కొన్ని సంప్రదింపుల దృష్ట్యా కొత్తగా చేర్చిన చికిత్సలను అందుబాటులోకి తెచ్చే కార్యక్రమాన్ని అక్టోబర్ ఐదో తేదీ నుంచి 15వ తేదీకి వాయిదా వేసినట్లు వెల్లడించారు. అదే రోజు ‘ఫ్యామిలీ డాక్టర్’ పైలట్ ప్రాజెక్టును కూడా ప్రారంభిస్తామన్నారు. వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణం వచ్చే నవంబర్ నెలాఖరుకు పూర్తవుతుందని చెప్పారు. సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, సీఎస్ సమీర్‌శర్మ, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులు కృష్ణబాబు, ముద్దాడ రవిచంద్ర, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, వైద్య శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్‌కుమార్, ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ మురళీధర్‌రెడ్డి, సీఎఫ్‌డబ్ల్యూ నివాస్, డీఎంఈ, ఏపీవీవీపీ కమిషనర్ డాక్టర్ వినోద్, ఆరోగ్యశ్రీ సీఈవో హరేందిరప్రసాద్, డ్రగ్ కంట్రోల్ డీజీ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి ఆరు అవార్డులు ప్రజలకు డిజిటల్ వైద్య సేవలు అందించడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆంధ్రప్రదేశ్‌కు ఇటీవల కేంద్ర ప్రభుత్వం అందచేసిన అవార్డులను సమీక్ష అనంతరం సీఎం జగన్ తిలకించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కార్యక్రమంలో ఉత్తమ పనితీరుకు జాతీయ స్థాయిలో 10 అవార్డులు ఇవ్వగా ఆరు రాష్ట్రానికే దక్కాయని మంత్రి రజిని, అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై సంతోషం వ్యక్తం చేసిన సీఎం జగన్ వారిని అభినందించారు. -
మరింత మెరుగ్గా 108, 104 సేవలు
సాక్షి, అమరావతి: 108 అంబులెన్సులు, 104 మొబైల్ మెడికల్ యూనిట్(ఎంఎంయూ)ల సేవలను ప్రజలకు మరింత మెరుగ్గా అందించాలని అధికారులను వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఆదేశించారు. బుధవారం మంగళగిరిలోని వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో 108, 104ల పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు. టెండర్ అగ్రిమెంట్ ప్రకారం సేవలందించడం లేదంటూ ఐటీ విభాగంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. 108 అంబులెన్సులలో జీపీఎస్ సౌకర్యంపై ఆరా తీశారు. వాహనాల మరమ్మతుల విషయంలో జాప్యం చేయొద్దని స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో వాహనాల బఫర్ స్టాక్ తప్పనిసరిగా ఉంచాలన్నారు. రెండు వారాల్లో సేవలు మెరుగుపడకపోతే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
బిగ్ క్వశ్చన్ : హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరుపై బాబు ఏడుపు
-
ఏపీ ఆరోగ్యశ్రీ: క్యాన్సర్‌ను అణిచేద్దాం
ఆరోగ్యశ్రీ కింద చికిత్స అనంతరం పేషెంట్‌కు ఇంకా అదనంగా మెడికేషన్ అవసరమైన పక్షంలో సంబంధిత వైద్యాధికారితో ఏఎన్ఎం మాట్లాడాలి. తగిన చికిత్స అందించేలా చూడాలి. ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్ ఆస్పత్రుల వివరాలను విలేజ్ హెల్త్ క్లినిక్, సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలి. ఇందుకు సంబంధించి విలేజ్ హెల్త్ క్లినిక్‌లో హోర్డింగ్ పెట్టాలి. 104 కాల్ సెంటర్‌కు ఫోన్ చేసిన వెంటనే సమీపంలో ఎంప్యానెల్ ఆస్పత్రి ఎక్కడుందో వివరాలు తెలిపేలా చర్యలు తీసుకోవాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో క్యాన్సర్ నివారణ, నియంత్రణ, చికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఉన్న మెడికల్ కాలేజీలతోపాటు కొత్తగా నిర్మించనున్న వాటిలో కూడా ప్రత్యేక క్యాన్సర్ విభాగాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి టీచింగ్ ఆస్పత్రి కేన్సర్ కేర్ అండ్ ట్రీట్మెంట్కు సెంటర్ కావాలని స్పష్టం చేశారు. ఆస్పత్రుల్లో ఇదివరకే ఉన్న క్యాన్సర్ విభాగాలను బలోపేతం చేయడంతో పాటు, లేని వాటిలో సదుపాయాలు కల్పించాలని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యకలాపాలపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విజయవాడ, అనంతపురం, కాకినాడ, గుంటూరు ఆస్పత్రుల్లో 4 లైనాక్ మెషీన్లు (రేడియేషన్ ఇచ్చే యంత్రాలు) ఏర్పాటు చేయడానికి.. శ్రీకాకుళం, నెల్లూరు, ఒంగోలు ఆస్పత్రుల్లో లైనార్ బంకర్ల (వైద్య అవసరాలు తీర్చే గది.. ఉదా: హై ఎనర్జీ – ఎక్స్‌రే) నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరో 7 పాత మెడికల్ కాలేజీల్లో కేన్సర్ శస్త్రచికిత్సల కోసం ఆపరేషన్ థియేటర్ల అప్‌గ్రేడేషన్, పాథాలజీ డిపార్ట్మెంట్లలో ఆధునిక సౌకర్యాలు, కీమో థెరపీ, డ్రగ్స్ తదితర సదుపాయాల కల్పనకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి టీచింగ్ ఆస్పత్రి ఆ జిల్లాకు సంబంధించిన వైద్య కార్యకలాపాలకు సెంటర్‌గా వ్యవహరించాలని, విలేజ్ క్లినిక్స్ దగ్గర నుంచి ఆ ఏరియాలో ఉన్న ప్రతి ఆస్పత్రి కూడా బోధనాస్పత్రి పరిధిలోకి రావాలన్నారు. దీనివల్ల క్యాన్సర్ లాంటి వ్యాధులను గుర్తించి, వైద్యం అందించడం సులభతరమవుతుందని చెప్పారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లో 12 రకాల రాపిడ్ డయాగ్నోస్టిక్స్ కిట్లు, 67 రకాల మందులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. విలేజ్ క్లినిక్స్ విధివిధానాల్లో పారిశుధ్యం, తాగునీటి నాణ్యతపై నిరంతర పరిశీలన ఉండాలని, ప్రతి నెలా తప్పనిసరిగా నివేదికలు పంపాలని సూచించారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం పర్యవేక్షణకు జిల్లాల్లో ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. వైద్య ఆరోగ్య శాఖ కార్యకలాపాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్ రక్తహీనత కేసులు ఉండకూడదు ► చిన్నారులు, మహిళల్లో రక్తహీనత నివారణకు ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నాం. ఈ నేపథ్యంలో అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం అందుతున్న తీరుపై నిరంతరం పర్యవేక్షణ చేయాలి. రక్తహీనత అధికంగా ఉన్న ప్రాంతాల్లో అదనంగా పౌష్టికాహారం అందించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ► వైద్యాధికారుల సిఫార్సు మేరకు వైద్య పరంగా, ఆహార పరంగా వారిపై దృష్టి పెట్టడం ద్వారా రాష్ట్రంలో రక్తహీనత కేసులు రాకుండా చూడాలి. వ్యవసాయానికి ఆర్బీకేలు ఎలా అండగా నిలుస్తున్నాయో ప్రజారోగ్యం విషయంలో విలేజ్ క్లినిక్‌లు కూడా అలాగే కీలక పాత్ర పోషించాలి. పీహెచ్‌సీలు, విలేజ్ క్లినిక్‌ల నిర్మాణం అనుకున్న రీతిలో పూర్తి చేయాలి. ► స్కూళ్లలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై నిరంతరం పర్యవేక్షణ జరగాలి. పిల్లల ఆరోగ్య పరిస్థితులను కనుక్కోవడంతోపాటు నిరంతరం కంటి పరీక్షలు చేయాలి. ► ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పుల కోసం సరిపడా సిబ్బందిని అందుబాటులో ఉంచాలి. ఇందుకు సంబంధించి వెంటనే నియామకాలు పూర్తి చేయాలి. (అక్టోబర్ 15లోగా పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు) సదుపాయాలను మెరుగు పరచాలి. అప్పుడే ప్రజలు ప్రభుత్వాస్పత్రుల సేవలను మెరుగ్గా వినియోగించుకుంటారు. ► ఆరోగ్య శ్రీ కింద అక్టోబర్ 2 నాటికి మొత్తం 3,118 వైద్య ప్రక్రియలకు చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలి. ‘నాడు–నేడు’పై ప్రతివారం సమీక్ష ► రాష్ట్రంలో చేపట్టిన కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాల పురోగతితో పాటు ప్రస్తుతం ఉన్న మెడికల్ కాలేజీల్లో నాడు–నేడు పనులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ప్రతివారం సమీక్ష చేయడంతో పాటు నిర్దేశించుకున్న సమయంలోగా నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలి. ► ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజ్మెంట్ అండ్ వ్యాక్సినేషన్) ముద్దాడ రవిచంద్ర, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి జి ఎస్ నవీన్ కుమార్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ జె నివాస్, ఆరోగ్యశ్రీ సీఈఓ ఎం ఎన్ హరీంద్రప్రసాద్, ఏపీవీవీపీ కమిషనర్ వి.వినోద్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆరోగ్య శ్రీ మరింత పటిష్టం ‘ఆరోగ్య శ్రీ లబ్ధిదారులకు వర్చువల్ అకౌంట్లు క్రియేట్ చేశాం. ఈ అకౌంట్ల ద్వారా ఆరోగ్య శ్రీ డబ్బు నేరుగా ఆస్పత్రులకు వెళ్తుంది. డబ్బులు డిడక్ట్ అవగానే పేషెంట్ సెల్‌ఫోన్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. రోగులు డిశ్చార్జి అయ్యేటప్పుడు వారికి అందిన వైద్య సేవలపై కన్సెంట్ లెటర్ కూడా తీసుకుంటున్నాం. లంచాలు లాంటి ఘటనలు ఉంటే ఫిర్యాదు చేయడానికి ఏసీబీ 14400 నంబర్ పెట్టాం. పేషెంట్ డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఏఎన్ఎం వారి ఇంటికి వెళ్లి ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. ఆరోగ్య పరిస్థితులపై, అందిన వైద్య సేవలపై, ఆస్పత్రిలో ఆరోగ్య మిత్రల పనితీరుపై అభిప్రాయాలు తీసుకుంటారు. ఆ తర్వాత సెల్ఫీ తీసుకుని అప్లోడ్ చేస్తారు’ అని అధికారులు సీఎంకు వివరించారు. -
ఆరోగ్యశ్రీకి అదనపు బలం
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని మౌలిక సదుపాయాలు, సిబ్బందిని సమకూర్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీలోకి మరిన్ని ప్రొసీజర్లను చేర్చడం ద్వారా మరింత మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు సన్నద్ధమైంది. జిల్లాల్లో వైద్య ఆరోగ్య శాఖ కార్యకలాపాల నిర్వహణలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కీలకం కానున్నాయి. ఈమేరకు బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై నిర్వహించిన ఉన్నత సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలోనూ వైద్య కళాశాల ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం సమీక్షలోముఖ్యాంశాలు ఇవీ.. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేయడంలో భాగంగా మరో 754 ప్రొసీజర్లను పథకంలో చేరుస్తున్నాం. కొత్తగా చేర్చే వాటితో కలిపి మొత్తం 3,118 ప్రొసీజర్లకు పథకం ద్వారా ప్రజలకు ఉచితంగా వైద్యం అందుతుంది. సెప్టెంబరు 5వతేదీ నుంచి కొత్త ప్రొసీజర్లను అందుబాటులోకి తేవాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైద్య కళాశాల కేంద్రంగా.. గ్రామ స్థాయిలో వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ మొదలు పీహెచ్సీ, సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆస్పత్రులు, అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, డీఎంహెచ్ఓ, డీసీహెచ్ఎస్లను ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ వైద్య కళాశాల పరిధిలోకి తేవాలి. వైద్య, పరిపాలన కార్యకలాపాలన్నీ వైద్య కళాశాల నుంచే నిర్వహించాలి. పకడ్బందీగా వైద్య సేవలు అందించడంతోపాటు అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయానికే ఈ చర్యలన్నీ. దీనికి సంబంధించి ఎవరెవరు ఏం చేయాలి? విధులు, బాధ్యతలు ఏమిటి? అనే అంశాలపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ) రూపొందించాలి. అన్ని జిల్లాల వైద్య కళాశాలల్లో మెడికల్ హబ్స్ ఏర్పాటు చేయాలి. వైద్య కళాశాల నేతృత్వంలోనే హబ్స్ పని చేయాలి. హబ్స్ నుంచి కింది స్థాయి ఆస్పత్రుల్లో చికిత్సలకు అవసరమైన సలహాలు, సూచనలు వైద్యులకు వెళ్లాలి. 6,956 టెలీ మెడిసిన్ స్పోక్స్, 27 హబ్స్ ఏర్పాటు కావాలి. ఇకపై కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ప్రతి విలేజ్ క్లినిక్‌లో ఎంఎల్‌హెచ్‌పీ (మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్), ఒక ఏఎన్ఎం, ఒకరు లేదా ఇద్దరు ఆశావర్కర్లు ఉంటారు. ఈ లెక్కన ప్రతి విలేజ్ క్లినిక్‌లో ముగ్గురు నుంచి నలుగురు సిబ్బంది సమకూరుతారు. విలేజ్ క్లినిక్‌లో 67 రకాల మందులు, 14 రకాల పరీక్షలు అందుబాటులో ఉంటాయి. ఎంఎల్‌హెచ్‌పీలను ఇకపై కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌గా పిలవాలి. 18 ఏళ్లు నిండిన వారందరికీ ప్రికాషన్ టీకా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినప్పటికీ నియంత్రణ చర్యల్లో అలసత్వం వహించొద్దు. ప్రికాషన్ డోసు టీకా పంపిణీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. రెండు డోసులూ టీకా తీసుకుని అర్హులైన 18 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్ టీకాలు ఇవ్వాలి. ఫ్యామిలీ డాక్టర్.. 3 అంశాలపై ఫోకస్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను సమర్థంగా అమలు చేసేందుకు ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి పెట్టాలి. విలేజ్ క్లినిక్స్, పీహెచ్‌సీల భవనాలు, మానవ వనరులు, తగినన్ని 104 మొబైల్ మెడికల్ యూనిట్స్ అందుబాటులోకి తేవడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించి పనులు ఎలా ముందుకు సాగుతున్నాయో రోజూ సమీక్షించాలి. మరో 432 ఎంఎంయూలు.. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలుకు అవసరమైన కసరత్తు పూర్తి చేస్తున్నట్లు ఈ సందర్భంగా అధికారులు వివరించారు. కొత్త విధానాన్ని సంక్రాంతి వరకు ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నట్లు చెప్పారు. మరోవైపు పీహెచ్‌సీలతో 104 మొబైల్ మెడికల్ యూనిట్ల మ్యాపింగ్ పూర్తైందని వెల్లడించారు. పీహెచ్‌సీలు, సచివాలయాల మ్యాపింగ్ కూడా పూర్తి చేస్తామన్నారు. 104 ఎంఎంయూలు ఇప్పటికే 656 పని చేస్తున్నాయని, మరో 432 వాహనాలను సమకూరుస్తున్నట్లు చెప్పారు. సమీక్షలో మంత్రి విడదల రజని, సీఎస్ సమీర్‌శర్మ, వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ జె.నివాస్, ప్రత్యేక కార్యదర్శి జి.ఎస్.నవీన్‌కుమార్, ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ మురళీధర్‌రెడ్డి, వైద్య విధానపరిషత్ కమిషనర్ డాక్టర్ వినోద్‌కుమార్, డ్రగ్ కంట్రోల్ డీజీ రవిశంకర్, ఆరోగ్యశ్రీ సీఈవో హరీంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: బతుకులు మార్చే పథకాలు పప్పుబెల్లాలా? -
ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరిన్ని చికిత్సలు
సాక్షి, అమరావతి: పేద, మధ్యతరగతి ప్రజలకు సంజీవని అయిన డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరింత బలోపేతం చేయబోతోంది. పథకంలో చికిత్సల సంఖ్యను పెంచడానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2007లో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆయన హఠాన్మరణంతో తర్వాతి ప్రభుత్వాలు పథకాన్ని నిర్వర్యం చేశాయి. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ పథకాన్ని బలోపేతం చేస్తూ అనేక సంస్కరణలు చేపట్టింది. ఇందులో భాగంగా.. పథకం పరిధిని గతంలో ఎన్నడూలేని విధంగా విస్తరించింది. అయితే, అక్కడితో ఆగకుండా పథకంపై నిరంతరం సమీక్ష జరుపుతూ అవసరమైతే కొత్త చికిత్సలను చేర్చాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కొత్తగా 700 చికిత్సలు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే పథకం వర్తించేది. కానీ, 2019 అనంతరం రూ.ఐదు లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ పథకం పరిధిలోకి తెచ్చారు. దీంతో రాష్ట్రంలో 1.40 కోట్ల కుటుంబాలకు ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి. అలాగే, పథకం కింద టీడీపీ హయాంలో 919 ఆస్పత్రుల్లో మాత్రమే చికిత్స అందించేవారు. ఇందులో 79 పొరుగు రాష్ట్రాల్లో ఉండేవి. వీటిలోను వైద్యం అరకొరగానే అందేది. కానీ, ప్రస్తుతం ఈ పథకం కింద 1,700లకు పైగా ఆస్పత్రుల్లో ప్రజలకు ఉచితంగా వైద్యసేవలు అందుతున్నాయి. ఇందులో పొరుగు రాష్ట్రాల్లోని 137 ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులు, 17 సూపర్ స్పెషాలిటీల్లో వైద్య సేవలు ఉచితంగా అందుతున్నాయి. ఇక 2019కి ముందు ఆరోగ్యశ్రీ పథకం కింద 1,059 రకాల చికిత్సలు అందుతుండేవి. అదే నేడు వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే చాలు ఈ పథకం భరోసా ఇస్తోంది. కరోనా చికిత్సను పథకం పరిధిలోకి తేవడంతో పాటు, బ్లాక్‌ఫంగస్, మిస్–సి వంటి జబ్బులనూ ఇందులో చేర్చడంతో ప్రజలపై పెనుభారం తప్పింది. ఇలా ఇప్పటికే 2,446 చికిత్సలు ఈ పథకంలో ఉన్నాయి. తాజాగా.. మరో 700 చికిత్సలను పథకంలో చేర్చడానికి కసరత్తు జరుగుతోంది. దీంతో త్వరలో చికిత్సల సంఖ్య మూడు వేలు దాటనున్నాయి. ‘ఆసరా’గా నిలుస్తున్న ప్రభుత్వం పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఎవరైనా జబ్బుచేసి మంచానికి పరిమితమైతే ఆ సమయంలో వారి పోషణకు మిగిలిన కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యను గుర్తించిన వైఎస్ జగన్ సర్కారు ‘ఆరోగ్య ఆసరా’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 1,519 రకాల చికిత్సల్లో ఏదైనా చేయించుకున్న వారికి వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తే రోజుకు రూ.225.. లేదా గరిష్టంగా నెలకు రూ.5వేలు చొప్పున భృతి అందిస్తోంది. ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకూ దాదాపు 10 లక్షల మందికి ప్రభుత్వం ఆర్థికసాయం చేసింది. ఇక దీనిపై వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈఓ హరీంద్రప్రసాద్ స్పందిస్తూ.. పథకంలో మరికొన్ని చికిత్సలను చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపుతున్నట్లు ఆయన చెప్పారు. -
క్యాన్సర్‌కు కళ్లెం.. గ్రామ, వార్డు క్లినిక్స్ స్థాయిలో స్క్రీనింగ్
సాక్షి, అమరావతి: మారుతున్న జీవన శైలి, ఆహార అలవాట్లతో విస్తరిస్తున్న క్యాన్సర్ కేసులను పసిగట్టి సరైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయి నుంచి ప్రణాళిక సిద్ధం చేసింది. గ్రామ, వార్డు క్లినిక్స్ స్థాయిలోనే క్యాన్సర్ కేసులను ప్రాథమిక దశలోనే గుర్తించి అవగాహన కల్పించనున్నారు. ఈ మేరకు క్యాన్సర్ స్క్రీనింగ్‌పై సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. లైనాక్ మెషిన్లు, 3 చోట్ల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లు క్యాన్సర్ కేసుల్లో 60 – 70 శాతం వరకు చివరి దశలో గుర్తించడంతో వ్యయ ప్రయాసలతో చికిత్స పొందినా ఫలితం దక్కడం లేదు. విస్తృత స్క్రీనింగ్ ద్వారా ప్రాథమిక దశలోనే గుర్తించి సరైన చికిత్స అందిస్తే చాలా ప్రాణాలను కాపాడవచ్చు. గ్రామ, వార్డు క్లినిక్స్‌తో పాటు మండలానికి రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు ద్వారా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను ప్రభుత్వం అమల్లోకి తేనుంది. తద్వారా క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించి సరైన చికిత్సలు అందించనున్నారు. క్యాన్సర్ గుర్తింపు, చికిత్సపై సమర్థ వ్యవస్థను అందుబాటులోకి తేవాలని ఇటీవల వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. కొత్తగా ఏర్పాటయ్యే వాటితో కలిపి మొత్తం 27 మెడికల్ కాలేజీల్లో క్యాన్సర్ నివారణకు రెండు చొప్పున లైనాక్ మెషిన్లు ఉండేలా బ్లూ ప్రింట్ సిద్ధం చేయాలని ఆదేశించారు. విశాఖ, తిరుపతి, గుంటూరు కాలేజీల్లో క్యాన్సర్ నివారణకు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు పూర్తి స్థాయి ప్రతిపాదనలను రూపొందించాలని సూచించారు. మూడో దశలో గుర్తిస్తే సంక్లిష్టం క్యాన్సర్లలో 33.2 శాతం ముందుగానే గుర్తించి సరైన చికిత్స అందిస్తే నయం అవుతోంది. మహిళల్లో రొమ్ము, నోటి, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లలో 49.2 శాతం ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందిస్తే తక్కువ ధరతోనే నయం అవుతున్నట్లు పలు అధ్యయనాల్లో వెల్లడైంది. మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే రూ.71 వేల లోపే వ్యయంతో 99 శాతం నయం అవుతోంది. అదే మూడో దశలో గుర్తించి రూ.1.76 లక్షలు వ్యయం చేసినా 29 శాతమే నయంఅవుతోంది. లక్షల్లో మరణాలు.. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు ఏటా పెరిగిపోతున్నాయి. మన దేశంలో 2020లో కొత్తగా 13.24 లక్షలకుపైగా క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. ఇందులో దాదాపు 6.8 లక్షలు మహిళల్లో క్యాన్సర్ కేసులు కాగా 6.5 లక్షలు పురుషుల్లో క్యాన్సర్ కేసులున్నాయి. 2020లో క్యాన్సర్‌తో 8.5 లక్షల మంది మృతి చెందగా రాష్ట్రంలో 34 వేల మంది మృత్యువాత పడినట్లు అంచనా. 2030 నాటికి దేశంలో క్యాన్సర్ కేసులు 28 శాతం మేర పెరగవచ్చని అంచనాలు పేర్కొంటున్నాయి. ఆరోగ్యశ్రీలో పెరిగిన చికిత్స వ్యయం రాష్ట్రంలో కొత్త క్యాన్సర్ కేసులు 70 వేల వరకు ఉండవచ్చని అంచనా. పురుషుల్లో అత్యధికంగా నోటి క్యాన్సర్, మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్లు ఎక్కువగా నమోదవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. రాష్ట్రంలో ప్రస్తుతం 39,768 క్యాన్సర్ కేసులుండగా అత్యధికంగా ఉమ్మడి తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో 13 శాతం చొప్పున నమోదయ్యాయి. 16 శాతం బ్రెస్ట్ క్యాన్సర్ కేసులున్నాయి. 2030 నాటికి రాష్ట్రంలో క్యాన్సర్ కేసులు 70 వేల వరకు పెరగవచ్చని అంచనా. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా 2019 నుంచి 2021 వరకు క్యాన్సర్ చికిత్స వ్యయం 37.3 శాతం మేర పెరిగింది. 2021–22లో ఆరోగ్యశ్రీలో 1,18,957 క్యాన్సర్ కేసులకు చికిత్స అందించారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఆరోగ్యశ్రీ ద్వారా క్యాన్సర్ చికిత్సలు 24 శాతం పెరిగాయి. -
మరింత చేరువగా.. ఆరోగ్యశ్రీ, గ్రామ స్థాయి నుంచే రిఫరల్ విధానం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 1.40 కోట్లకు పైగా పేద, మధ్యతరగతి కుటుంబాల ఆరోగ్యాలకు శ్రీరామ రక్షగా నిలుస్తోంది.. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం. టీడీపీ హయాంలో పూర్తిగా నిర్వీర్యమైన ఈ పథకానికి ఊపిరిలూదుతూ వైఎస్ జగన్ సర్కార్ ఇప్పటికే అనేక సంస్కరణలు చేపట్టింది. ఏకంగా 2,446 చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చింది. వీటి సంఖ్యను ఇంకా పెంచేందుకు కసరత్తు చేస్తోంది. కాగా ఈ పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పట్టణాలు, నగరాల్లోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు వెళ్లడానికి, ఏ జబ్బుకు ఎక్కడ చికిత్స చేస్తారో తెలియక ప్రజలు పలు సందర్భాల్లో ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి కష్టాలకు తావివ్వకుండా గ్రామ స్థాయి నుంచే రిఫరల్ విధానాన్ని వైద్య శాఖ ప్రవేశపెడుతోంది. గ్రామస్థాయి నుంచే ఆరోగ్య మిత్ర గ్రామ స్థాయిలోనే ఆరోగ్యశ్రీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం కోసం గ్రామ సచివాలయ ఏఎన్ఎం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్ మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్‌హెచ్‌పీ) ద్వారా గ్రామ ఆరోగ్య మిత్ర సేవలను వైద్య శాఖ అందించబోతోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏఎన్ఎం, ఎంఎల్‌హెచ్‌పీలకు ఆరోగ్య మిత్ర విధులపై శిక్షణ ఇస్తున్నారు. గ్రామ సచివాలయం/విలేజ్ క్లినిక్స్ స్థాయి నుంచే రోగులను నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేయాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపడుతున్నారు. గ్రామం నుంచి నేరుగా నెట్వర్క్ ఆస్పత్రికి.. ఆగస్టు 15 నుంచి ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానాన్ని వైద్య శాఖ అమలు చేయనుంది. ఈ క్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ) వైద్యులు 104 మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ)తో పాటు గ్రామాల్లోకి వెళ్లి వైద్య సేవలు అందించనున్నారు. రోగికి మెరుగైన వైద్య సేవలు అవసరమని భావిస్తే వెంటనే ఆస్పత్రికి తరలించాలని ఏఎన్ఎం, ఎంఎల్‌హెచ్‌పీకి సూచిస్తారు. సంబంధిత చికిత్స ఏ ప్రభుత్వ/ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రిలో చేస్తారో గుర్తించి.. రోగిని ఆ ఆస్పత్రికి గ్రామ ఆరోగ్య మిత్ర రిఫర్ చేస్తారు. అంతేకాకుండా రోగి ఆస్పత్రికి వెళ్లేలోగా అక్కడి ఆరోగ్య మిత్రను అప్రమత్తం చేసి.. ఆస్పత్రిలో చేర్చి వైద్య సేవలు అందేలా సమన్వయం చేస్తారు. నెట్వర్క్ ఆస్పత్రిలో చికిత్స పొంది.. రోగి ఇంటికి చేరుకుని పూర్తిగా కోలుకునే వరకూ గ్రామ ఆరోగ్య మిత్ర అన్ని రకాలుగా సహాయ, సహకారాలు అందిస్తారు. అలాగే సాధారణ పరిస్థితుల్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే వారిని కూడా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రికి రిఫర్ చేసి వైద్యం అందేలా చూస్తారు. రెండు రోజులు శిక్షణ ఇవ్వనున్నాం.. ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు పొందడానికి ప్రజలు ఇబ్బందులు పడకూడదనేది సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. పథకం కింద పేద, మధ్యతరగతి ప్రజలకు సులువుగా వైద్యాన్ని చేరువ చేసేందుకు గ్రామ ఆరోగ్య మిత్ర విధానాన్ని ప్రవేశపెట్టాం. ఆరోగ్య మిత్ర విధులపై ఏఎన్ఎం, ఎంఎల్‌హెచ్‌పీలకు ఈ వారంలో రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నాం. ఇప్పటికే మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ పూర్తయింది. వీరు జిల్లాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. – జె.నివాస్, కమిషనర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ -
రూ.16 వేల కోట్లతో ఆస్పత్రుల అభివృద్ధి
తిరుపతి (తుడా): రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రులను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.16 వేల కోట్లు కేటాయించారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. శనివారం ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిని ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, మేయర్ శిరీషతో కలిసి ఆమె తనిఖీ చేశారు. అక్కడ అందుతున్న సేవల గురించి వార్డుల్లో చికిత్స పొందుతున్న గర్భిణులు, బాలింతలు, వారి సహాయకుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించే విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు. ఆగస్టు 1 నుంచి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరిన్ని వ్యాధులను చేర్చేలా సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు ఇచ్చారన్నారు. మొత్తం 3 వేల వ్యాధులు ఆరోగ్యశ్రీ పరిధిలోకి రానున్నాయన్నారు. ఆస్పత్రులలో పనిచేసే పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఏజెన్సీలపై విచారణ చేయాలని డీఎంఈని ఆదేశించారు. తీరు మారకుంటే సరెండర్ చేస్తాం రుయా సూపరింటెండెంట్ డాక్టర్ భారతి పనితీరుపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో మంత్రి రజని స్పందిస్తూ.. సక్రమంగా విధులు నిర్వహించలేనప్పుడు తప్పుకోవచ్చుగా అంటూ సూపరింటెండెంట్‌పై మండిపడ్డారు. ‘మీ నిర్లక్ష్యం లేకుంటే ఇంత మంది ఎందుకు ఫిర్యాదు చేస్తారు.. ఇకనైనా తీరు మారకుంటే హెడ్ ఆఫీస్‌కు సరెండర్ చేస్తాం’ అని హెచ్చరించారు. మంత్రి వెంట డీఎంఈ ఎం.రాఘవేంద్రరావు, డీఎంహెచ్ఓ శ్రీహరి, ఈఈ ధనంజయరెడ్డి, ఎస్వీ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖరన్, మెటర్నిటీ సూపరింటెండెంట్ లక్ష్మీప్రసన్న, సీఎస్ఆర్ఎంఓ ఈబీ దేవి, పార్థసారథి ఉన్నారు. -
పల్లెకు ‘ఫ్యామిలీ డాక్టర్’
సాక్షి, అమరావతి: గ్రామీణ వైద్యసేవల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమవుతోంది. స్వాత్రంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి మారుమూల పల్లెల్లో సైతం ప్రజలను పరామర్శిస్తూ వ్యక్తిగత శ్రద్ధతో డాక్టర్లు వైద్య సేవలందించేలా భారీ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి మరిన్ని చికిత్సలను చేర్చడంతోపాటు గ్రామీణ ప్రజలకు వ్యక్తిగత శ్రద్ధతో సొంత ఊరిలోనే మెరుగైన వైద్యం అందించే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను విస్తృతంగా దశలవారీగా అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా ఆరోగ్యశ్రీలో సంస్కరణలు, నాడు–నేడు పనుల పురోగతి, రాష్ట్రంలో కరోనా పరిస్థితి తదితర అంశాలను పరిశీలించి సీఎం జగన్ పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ... వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రోగి వర్చువల్ ఖాతా నుంచి ఆస్పత్రికి గత సర్కారు హయాంలో ఆరోగ్యశ్రీ ద్వారా కేవలం 1,059 చికిత్సలు మాత్రమే అందగా మన ప్రభుత్వం వాటిని 2,446కి పెంచింది. ఇప్పుడు చికిత్సల సంఖ్యను 3,000కిపైగా పెంచుతున్నాం. ఆగస్టు 1వతేదీ నుంచి పెంచిన చికిత్సలను పథకంలోకి చేర్చాలి. నెట్వర్క్ ఆస్పత్రుల్లో చేరే ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు వర్చువల్ బ్యాంకు ఖాతాలు తెరవాలి. చికిత్స అందించిన నెట్వర్క్ ఆస్పత్రికి చెల్లించాల్సిన డబ్బులు తొలుత నేరుగా రోగి వర్చువల్ ఖాతాలోకి జమ చేయాలి. అనంతరం ఆస్పత్రికి బదిలీ కావాలి. ఈమేరకు పథకం కింద చికిత్స పొందిన రోగి నుంచి సమ్మతి (కన్సెంట్) పత్రం తీసుకోవాలి. ఏ జబ్బుకు చికిత్స అందించాం? ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది? అనే వివరాలు అందులో రోగికి తెలియజేయాలి. వైద్యం అందించేందుకు ఆస్పత్రిలో ఎవరైనా డబ్బుల వసూళ్లకు పాల్పడ్డారా? సేవలు ఎలా అందించారు? అనే విషయాలపై స్పష్టత తీసుకోవాలి. పథకం కింద చికిత్స అందించేందుకు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేసేందుకు ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 14400, వైద్య సేవలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం 104 నంబర్ అందులో పొందుపరచాలి. ఇంటికి వెళ్లి పరామర్శించాలి.. డిశ్చార్జి అనంతరం ఇంటికి వెళ్లిన రోగి ఆరోగ్యంపై కూడా మనం వాకబు చేయాలి. డిశ్చార్జి అయిన వారం రోజులకు క్షేత్ర స్థాయి ఆరోగ్య శాఖ సిబ్బంది ఆ వ్యక్తి ఇంటికి వెళ్లాలి. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయాలి. చికిత్స అనంతరం ఏమైనా సమస్యలు తలెత్తాయా? అనే విషయాలు తెలుసుకోవాలి. మరింత వైద్య సాయం అవసరమైన పక్షంలో సమన్వయం చేసుకుని అందేలా చూడాలి. రోగికి అందిన సేవలు, అదనంగా కావాల్సిన మందులు, తదితర అంశాలపై ఫోన్‌కాల్ ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. ఎలాంటి ఇబ్బంది ఎదురైనా.. 108, 104 సేవలు పొందేందుకు ప్రజలు లంచాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితులకు తావుండరాదు. అందుకు అనుగుణంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. ప్రతి వాహనంపై ఫిర్యాదు నంబర్ ప్రదర్శించాలి. సేవలు పొందడంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తినా ఫిర్యాదును స్వీకరించాలి. వాటిని సకాలంలో పరిష్కరించాలి. నెలాఖరు నుంచి నర్సీపట్నం వైద్య కళాశాల పనులు రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న 16 వైద్య కళాశాలల్లో 14 చోట్ల పనులు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. నర్సీపట్నంలో కళాశాల నిర్మాణ పనులను ఈ నెలాఖరు నుంచి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అదుపులోనే కరోనా రాష్ట్రంలో కరోనా పూర్తిగా అదుపులో ఉందని అధికారులు తెలిపారు. అక్కడక్కడా కోవిడ్ కేసులున్నా ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య అత్యంత స్వల్పమని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2,042 కరోనా యాక్టివ్ కేసులుండగా కేవలం 69 మంది మాత్రమే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో ప్రికాషన్ డోసుకు అర్హులైన 60.01 లక్షల మందిలో ఇప్పటికే 52.3 లక్షల మందికి టీకాలిచ్చామన్నారు. 15 – 17 ఏళ్ల వయసు వారికి రెండు డోసుల వ్యాక్సినేషన్ 99.69 శాతం పూర్తైందని వెల్లడించారు. 12–14 ఏళ్ల పిల్లల్లో 98.93 శాతం మందికి రెండు డోసుల టీకాలిచ్చామన్నారు. ప్రికాషన్ డోసు వ్యవధిని తగ్గించినందున మరింత ముమ్మరంగా చేపట్టి 60 ఏళ్లు దాటిన వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం జగన్ సూచించారు. నాణ్యమైన వైద్యమే లక్ష్యం ఆస్పత్రుల సామర్థ్యానికి సరిపడా వైద్యులు, సిబ్బంది నియామకాలను చేపట్టి ఇప్పటికే 40,476 పోస్టులను భర్తీ చేశామని అధికారులు తెలిపారు. ఈ నెలాఖరులోగా మిగతా నియామకాలు కూడా పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ నుంచి బోధనాసుపత్రుల వరకు నిర్దేశిత సంఖ్యకు అనుగుణంగా వైద్య సిబ్బంది ఉండాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎక్కడా లోటుపాట్లు ఉండరాదని, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఇందులో భాగంగానే వైద్య ఆరోగ్య శాఖలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, సీఎస్ సమీర్‌శర్మ, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ప్రత్యేక కార్యదర్శి జి.ఎస్.నవీన్‌కుమార్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో వినయ్‌చంద్, ఏపీఎంస్ఐడీసీ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ మురళీధర్‌రెడ్డి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ వినోద్‌కుమార్, ఔషధ నియంత్రణ విభాగం డీజీ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. వ్యక్తిగత శ్రద్ధతో వైద్యం ► ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా వైద్యులు ప్రతి గ్రామానికి నెలలో రెండుసార్లు 104 వాహనంలో వెళ్లి వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని ప్రజలకు సేవలందిస్తారు. ► ప్రాథమిక వైద్యాన్ని బలోపేతం చేయడంలో భాగంగా మండలానికి రెండు పీహెచ్‌సీలను ఏర్పాటు చేసి నలుగురు డాక్టర్ల చొప్పున ప్రభుత్వం నియమిస్తోంది. ఇద్దరు డాక్టర్లు పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉండగా మిగతా ఇద్దరు 104 వాహనంలో గ్రామాలకు చేరుకుని వ్యక్తిగత శ్రద్ధతో వైద్య సేవలు అందచేస్తారు. ► వయోభారం, అనారోగ్య సమస్యలతో మంచానికే పరిమితమైన వారికి ఇది ఎంతో ఉపయుక్తం. ► 104 వాహనాలు రెండేళ్ల వ్యవధిలో 1.49 కోట్ల మందికిపైగా సేవలు అందించాయి. ► 20 రకాల వైద్యసేవలు, 8 రకాల వైద్యపరీక్షలు వీటి ద్వారా ఉచితంగా నిర్వహిస్తున్నారు. ► ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సగటున రోజూ 40 వేల మందికి సేవలు అందుతున్నాయి. మధ్యాహ్నం వరకు ఓపీ చూసి తరువాత వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్య బాధితుల ఇంటి వద్దకే వెళ్లి సేవలు అందిస్తున్నారు. -
YSR Aarogyasri: ఆరోగ్యమస్తు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఆరోగ్యశ్రీ అమలులో జవాబుదారీతనం, పారదర్శకత పెంపొందించడంలో భాగంగా పథకాన్ని మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అక్రమాలు, పొరపాట్లకు ఏమాత్రం తావుండరాదని స్పష్టం చేశారు. జూలై 26 లోగా వైద్య ఆరోగ్యశాఖలో నియామకాల ప్రక్రియను ముగించాలని నిర్దేశించారు. రిటైర్మెంట్, ఇతర కారణాలతో ఖాళీ అయిన పోస్టులను ఇకపై వెంటనే భర్తీ చేయాలన్నారు. సంస్కరణల ఫలితాలు సజావుగా అందాలంటే తగినంత మంది వైద్యులు, సిబ్బందిని నియమించడం తప్పనిసరన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో నాడు–నేడు కార్యక్రమాల పురోగతి, ఆరోగ్యశ్రీ అమలు తదితరాలపై మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ.. మొదటి రెఫరల్ పాయింట్‌గా విలేజ్ క్లినిక్ ఆరోగ్యశ్రీ ద్వారా సులభంగా చికిత్స పొందేలా రెఫరల్ విధానాన్ని బలోపేతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. మొదటి రెఫరల్ పాయింట్‌గా వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను అభివృద్ధి చేయాలని సూచించారు. ఆరోగ్యశ్రీ సేవల గురించి ప్రజలకు విస్తృతంగా తెలియచేసేలా విలేజ్ క్లినిక్‌లలో హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. నెట్వర్క్ ఆస్పత్రుల్లో అందే వైద్య సేవలు, ఏ జబ్బుకు ఏ ఆస్పత్రికి రెఫర్ చేయాలి? ఎలా రెఫర్ చేయాలి? తదితర వివరాలతో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్(ఎంఎల్‌హెచ్‌పీ), ఏఎన్ఎంలకు బుక్లెట్లు అందజేయాలన్నారు. రోగి సంతకంతో కన్సెంట్, కన్ఫర్మేషన్ ఆరోగ్యశ్రీ పథకం అమలులో జవాబుదారీతనం, పారదర్శకత పెరిగేలా సీఎం జగన్ పలు సూచనలు చేశారు. చికిత్స అనంతరం డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లేప్పుడు సంబంధిత రోగికి ఆరోగ్యశ్రీ ద్వారా ఏ జబ్బుకు చికిత్స అందించాం? చికిత్సకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది? తదితర వివరాలను తెలియచేయాలని ఆదేశించారు. ఆస్పత్రిలో చికిత్స అందించేందుకు డబ్బులేమైనా డిమాండ్ చేశారా? వైద్య సేవలు ఎలా ఉన్నాయి? అనే విషయాలను ఆరా తీసి సేవల పట్ల రోగి సంతృప్తిగా ఉన్నాడో లేదో తెలుసుకోవాలన్నారు. ఈ మేరకు డిశ్చార్జి సమయంలో రోగి సంతకంతో సమ్మతి(కన్సెంట్), నిర్ధారణ (కన్ఫర్మేషన్) పత్రం తీసుకోవాలన్నారు. క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ఆస్పత్రులు వాటిని అప్లోడ్ చేయాలన్నారు. వర్చువల్ ఖాతా ద్వారా చెల్లింపు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సకు సంబంధించి ప్రభుత్వం అందించే డబ్బులు నేరుగా ఆస్పత్రికి వెళ్లకుండా రోగి పేరిట వర్చువల్ ఖాతాను రూపొందించాలని సీఎం జగన్ ఆదేశించారు. రోగి సమ్మతి తీసుకుని ఈ ఖాతాకు తొలుత నేరుగా డబ్బులు జమ చేయాలన్నారు. అనంతరం ఆస్పత్రికి డబ్బులు బదిలీ చేయాలని నిర్దేశించారు. లబ్ధిదారుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతా విషయంలో ఎలాంటి సందేహాలు, భయాందోళనలు లేకుండా ఈ ప్రత్యేక వర్చువల్ అకౌంట్ ఉపయోగపడుతుందన్నారు. వైఎస్సార్ ఆరోగ్య ఆసరాలో డబ్బులు నేరుగా రోగి వ్యక్తిగత ఖాతాకు డీబీటీ విధానంలో జమ చేస్తున్న పద్ధతినే కొనసాగించాలన్నారు. పథకం కింద సేవలు అందించడానికి ఆస్పత్రుల యాజమాన్యాలు అదనంగా డబ్బులు వసూలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ సేవలపై ఫిర్యాదులుంటే ఏ నెంబరుకు ఫోన్ చేయాలన్న విషయం ప్రతి రోగికి తెలిసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సచివాలయాల ద్వారా లేఖలు ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందిన లబ్ధిదారులకు గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా లేఖలు పంపాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆ లేఖను వలంటీర్, ఏఎన్ఎంలు లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి అందజేసి ఆరోగ్యంపై ఆరా తీయాలని సూచించారు. లేఖలో పథకం ద్వారా లబ్ధిదారుడికి ప్రభుత్వం అందించిన సాయాన్ని తెలియజేయాలన్నారు. చురుగ్గా ఆరోగ్యమిత్రలు ఆరోగ్యశ్రీ పథకం అమలులో ఆరోగ్యమిత్రలు మరింత చురుగ్గా వ్యవహరించాలని సీఎం జగన్ సూచించారు. రోగి ఆస్పత్రిలో చేరిన దగ్గర నుంచి డిశ్చార్జి అయ్యేవరకూ అండగా, తోడుగా నిలవాలన్నారు. ప్రస్తుతం 2,446 చికిత్సలను పథకం కింద ఉచితంగా చేస్తున్నామన్నారు. అవసరమైన మేరకు చికిత్సా విధానాల సంఖ్యను పెంచాలన్నారు. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటే ప్రతి చికిత్సకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందించాలన్నారు. సేవలు ఉచితంగా అందాలి.. 108, 104, వైఎస్సార్ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలు ప్రజలకు ఉచితంగా అందాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. వీటిద్వారా సేవలు అందించడానికి ఎక్కడా లంచాలు వసూలు చేసే పరిస్థితి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరైనా సిబ్బంది లంచం డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయాల్సిన ఫోన్ నెంబర్లను వాహనాలపై ప్రదర్శించాలన్నారు. ఎక్కడా కొరత ఉండకూడదు 2019 నుంచి వైద్య శాఖలో 40,188 పోస్టులు భర్తీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. మరో 1,132 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. మండలానికి రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటులో భాగంగా 176 కొత్త పీహెచ్‌సీలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. వీటిల్లో పని చేయడానికి 2,072 మంది వైద్యులు, ఇతర సిబ్బంది అవసరం కాగా భవన నిర్మాణాలు పూర్తి కాగానే భర్తీ చేపడతామన్నారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్ నుంచి బోధనాస్పత్రి వరకూ ఎక్కడా మానవ వనరుల కొరత ఉండకూడదని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అవసరం అయితే పదవీ విరమణ పొందిన వైద్యుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. వైద్యుల పదవీ విరమణ వయసు పెంపుపై పరిశీలన చేయాలని ఆదేశించారు. సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, సీఎస్ సమీర్‌శర్మ, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులు ఎం.టి.కృష్ణబాబు, ముద్దాడ రవిచంద్ర, ఆర్థిక శాఖ కార్యదర్శి కె.వి.వి.సత్యనారాయణ, ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ డి.మురళీధర్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈవో వి.వినయ్‌చంద్ తదితరులు పాల్గొన్నారు. -
ఎలాంటి కాన్పులైనా అమ్మకు 5,000
సాక్షి, అమరావతి: ఏ తరహా ప్రసవాలు జరిగినా వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద తల్లులకు రూ.ఐదు వేల చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. సహజ ప్రసవమైనా, సిజేరియన్ జరిగినా ఈ మొత్తాన్ని అందించాలన్నారు. గతంలో సిజేరియన్ జరిగితే రూ.3 వేలే ఇస్తున్నారని, దీన్ని రూ.5 వేలకు పెంచాలని సూచించారు. సహజ ప్రసవమైనా, సిజేరియన్ అయినా తల్లీబిడ్డల సంరక్షణ ముఖ్యం కాబట్టి ఒకే మొత్తాన్ని ఇవ్వాలన్నారు. సహజ ప్రసవాల సంఖ్యను పెంచడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అవగాహన, చైతన్యం కల్పించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందన్నారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, వైద్య ఆరోగ్యశాఖలో నాడు–నేడు, కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం, క్యాన్సర్ కేర్, కోవిడ్ తదితరాలపై సీఎం జగన్ సోమవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ.. ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరిన్ని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్న చికిత్సలు, వ్యయం వివరాలను సమీక్షలో అధికారులు వివరించారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి 2,446 ప్రొసీజర్లను తెచ్చినట్లు తెలిపారు. దీన్ని నిరంతరం పరిశీలిస్తూ అవసరాల మేరకు ప్రొసీజర్ల సంఖ్యను పెంచాలని సీఎం జగన్ నిర్దేశించారు. ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపు ప్రక్రియను మరింత పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. సంబంధిత రోగికి ఏ వైద్యం అందించారు? చికిత్స కోసం ప్రభుత్వం ఎంత చెల్లిస్తోంది? లాంటి వివరాలను డిశ్చార్జి సమయంలో రోగులకు తెలియచేస్తూ వారి ఆమోదం తీసుకుని పారదర్శకంగా బిల్లులు చెల్లించే విధానంపై వారంలోగా మార్గదర్శకాలు రూపొందించాలని సూచించారు. వ్యయం రూ.4 వేల కోట్లు.. వచ్చింది రూ.223 కోట్లు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా నెలకు కనీసం రూ.270 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 104, 108 కోసం ప్రతి నెలా కనీసం రూ.25 కోట్లు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద నెలకు కనీసం మరో రూ.35 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. కేవలం ఆరోగ్యశ్రీ, సంబంధిత కార్యకలాపాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా దాదాపు రూ.4 వేల కోట్లు వ్యయం చేస్తున్నట్లు పేర్కొన్నారు. గతేడాది ఆయుష్మాన్ భారత్ కింద రాష్ట్రానికి వచ్చింది రూ.223 కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. ఇక ఈ ఏడాది రూ.360 కోట్లు రానున్నట్లు అంచనా వేసినట్లు తెలిపారు. డిసెంబర్‌కు 4 కొత్త మెడికల్ కాలేజీలు వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, వార్డు క్లినిక్స్, ఆస్పత్రుల్లో అభివృద్ధి పనులు, కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న 16 మెడికల్ కాలేజీల పనుల పురోగతిని సీఎం సమీక్షించారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నంలో ఏర్పాటయ్యే కొత్త మెడికల్ కాలేజీల్లో 2023 నుంచి ప్రవేశాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మెడికల్ కౌన్సిల్ మార్గదర్శకాల ప్రకారం పనులు వేగంగా చేపట్టి నాలుగు కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం డిసెంబర్ నాటికి పూర్తయ్యేలా కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన చోట్ల కూడా నిర్మాణాలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఒకటి రెండు చోట్ల స్థలాలపై కోర్టు కేసులున్నట్లు అధికారులు నివేదించగా వీలైనంత త్వరగా పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. పీహెచ్‌సీల్లో 977 చోట్ల అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, కొత్తవాటి నిర్మాణం చురుగ్గా సాగుతోందని అధికారులు తెలిపారు. క్యాన్సర్‌కు ఏడాదిలో 34 వేల మంది బలి భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని, 2020లో రాష్ట్రంలో 34 వేల మందిని ఈ మహమ్మారి కబళించినట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక దశలో గుర్తించకపోవడంతో చాలా మరణాలు చోటు చేసుకుంటున్నట్లు చెప్పారు. చివరి దశలో గుర్తించి చికిత్స కోసం భారీగా ఖర్చు చేస్తున్నారని, అప్పటికే పరిస్థితి చేయి దాటిపోతోందని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలోనే క్యాన్సర్ కేర్, స్క్రీనింగ్, ప్రివెంటివ్ చర్యలు.. విలేజ్ క్లినిక్స్ స్థాయిలోనే క్యాన్సర్‌ను గుర్తించడంపై దృష్టి సారించాలని సీఎం జగన్ సూచించారు. గ్రామాల్లోనే మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో విలేజ్ క్లినిక్స్, వార్డు క్లినిక్స్, పీహెచ్‌సీల నిర్మాణాలను డిసెంబర్ కల్లా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తద్వారా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ విధానం సమర్థంగా అమలుతో పాటు క్యాన్సర్ గుర్తింపు సులభంగా జరుగుతుందన్నారు. ఈలోగా క్యాన్సర్ స్క్రీనింగ్, ప్రివెంటివ్ చర్యలపై సిబ్బందికి శిక్షణ ఇప్పించాలని ఆదేశించారు. దీనివల్ల క్యాన్సర్ గుర్తింపు నుంచి చికిత్స వరకూ సమర్థవంతమైన వ్యవస్థ ఏర్పాటవుతుందన్నారు. టాటా మెమోరియల్ ద్వారా వైద్యులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చేలా ఎంవోయూ కుదిరిందని అధికారులు పేర్కొనగా స్విమ్స్ ఆస్పత్రిని కూడా ఇందులో భాగస్వామిగా చేయాలని సీఎం సూచించారు. 27 మెడికల్ కాలేజీల్లో లైనాక్ మెషిన్లు కొత్తగా ఏర్పాటయ్యే 16 మెడికల్ కాలేజీలతో కలిపి మొత్తం 27 వైద్య కళాశాలల్లో క్యాన్సర్ నివారణకు రెండేసి చొప్పున లైనాక్ మెషిన్లు ఉండేలా బ్లూ ప్రింట్ రూపొందించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఇందులో మూడు కాలేజీల్లో విశాఖ, తిరుపతి, గుంటూరులో క్యాన్సర్ నివారణకు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించగా పూర్తిస్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేసి నివేదిక సమర్పించాలని సీఎం సూచించారు. కోవిడ్‌పై అప్రమత్తంగా ఉండాలి రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. కోవిడ్ పూర్తి నియంత్రణలో ఉన్నప్పటికీ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. 18 ఏళ్ల లోపువారికి రెండు డోసుల వ్యాక్సినేషన్ దాదాపుగా పూర్తైందని అధికారులు తెలిపారు. 15 నుంచి 17 ఏళ్ల లోపు వారికి 99.65 శాతం పూర్తి కాగా 12 నుంచి 14 ఏళ్లలోపు వారికి 97.78 శాతం వ్యాక్సినేషన్ జరిగినట్లు వివరించారు. సమీక్షలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, సీఎస్ సమీర్‌శర్మ, ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, కోవిడ్ మేనేజ్మెంట్ అండ్ వ్యాక్సినేషన్ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, స్పెషల్ సెక్రటరీ జి.ఎస్.నవీన్‌కుమార్, ఆరోగ్యశ్రీ సీఈవో వినయ్‌చంద్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి.మురళీధర్ రెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్ వి.వినోద్ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ (డ్రగ్స్) రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
వైద్య సేవలపై ఫిర్యాదులకు '104 '
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ రూ.వేల కోట్లతో ప్రభుత్వాస్పత్రులను తీర్చిదిద్దుతూ కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం వైద్య సేవల్లో ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించడంలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ఫిర్యాదులను సైతం స్వీకరించేలా ఇప్పటికే విస్తృత ప్రచారం పొందిన 104 టోల్ ఫ్రీ నంబర్ సేవలను వినియోగించుకునేలా ఏర్పాట్లు చేసింది. తొలుత ఐదు సేవలతో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ – ఆరోగ్య ఆసరా, 104 మొబైల్ మెడికల్ యూనిట్స్(ఎంఎంయూ), 108 అంబులెన్స్, వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్, మహాప్రస్థానం.. ఈ ఐదు సేవలకు సంబంధించి తొలుత ఫిర్యాదులను స్వీకరించనున్నారు. అనంతరం ఇతర సేవలకు విస్తరించనున్నారు. స్పందనతో అనుసంధానం 104 కాల్‌సెంటర్ ద్వారా వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించిన సేవలు, సమగ్ర సమాచారాన్ని ఇప్పటికే ప్రజలకు అందిస్తున్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో 30 మంది సిబ్బందితో పనిచేసే కాల్‌సెంటర్‌కు నిత్యం వెయ్యి వరకూ ఫోన్ కాల్స్ వస్తుంటాయి. ఫిర్యాదులు స్వీకరించేందుకు విశాఖపట్నంలో కాల్ సెంటర్ ఏర్పాటైంది. ఇక్కడ 30 మంది విధుల్లో ఉంటారు. ఫిర్యాదుల కాల్‌సెంటర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్పందన’ ప్రజాసమస్యల పరిష్కార వేదిక డ్యాష్‌బోర్డుకు అనుసంధానించారు. కాల్‌సెంటర్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదు, పరిష్కారానికి సంబంధించి డ్యాష్‌బోర్డ్ ద్వారా ఉన్నత స్థాయిలో పర్యవేక్షిస్తారు. ఎస్వోపీ రూపకల్పన కాల్ సెంటర్‌కు అందే ఫిర్యాదులను ఎంత సమయంలోగా పరిష్కరించాలి? ఎవరెవరు బాధ్యత వహించాలి? అనే అంశాలతో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ) రూపొందించారు. గత మూడేళ్లుగా ఐదు సేవలకు సంబంధించిన ఫిర్యాదులను నిపుణుల కమిటీ పరిశీలించింది. సమస్య తీవ్రత ఆధారంగా ఫిర్యాదుల పరిష్కార సమయాన్ని అత్యంత వేగం, వేగం, సాధారణం అని మూడు విభాగాలుగా విభజించారు. అత్యంత వేగం పరిధిలోకి వచ్చే ఫిర్యాదులను గంట లోపు పరిష్కరిస్తారు. వేగం పరిధిలోకి వచ్చే ఫిర్యాదులను 24 నుంచి 72 గంటలు, సాధారణ పరిధిలోకి వచ్చే ఫిర్యాదులను 7 నుంచి 21 రోజుల్లోగా పరిష్కరించాలని నిర్దేశించారు. దీనిపై కాల్‌సెంటర్ సిబ్బంది, ఆరోగ్యశ్రీ, 104 ఎంఎంయూ, 108 జిల్లా కోఆర్డినేటర్లు, టీమ్‌లీడర్లు తదితరులకు శిక్షణ ఇచ్చారు. వచ్చే వారం ప్రారంభం ఐదు రకాల సేవలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలు ముగిశాయి. ఇబ్బందులు ఎదురైతే 104కు కాల్ చేయవచ్చు. వచ్చే వారం ఫిర్యాదుల స్వీకారం ప్రారంభిస్తాం. అంబులెన్స్‌లు, ఆరోగ్య మిత్ర కియోస్క్‌లపై ఫిర్యాదుల నంబర్ ప్రదర్శించేలా స్టిక్కర్లు సిద్ధం చేశాం. వైద్య సేవలు పొందడంలో ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకూడదన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా చర్యలు చేపట్టాం. – వినయ్‌చంద్, ఆరోగ్యశ్రీ సీఈవో ఫిర్యాదులు ఇలా... ► నిర్దేశించిన ఐదు సేవలకు సంబంధించి ఫిర్యాదు చేయాలనుకుంటే 104కి కాల్ చేసి 1వ నంబర్ నొక్కాలి. ► అనంతరం కాల్ సెంటర్ సిబ్బంది లైన్లోకి వచ్చి ఫిర్యాదు స్వీకరిస్తారు. ► ఉదాహరణకు ఏదైనా ఆస్పత్రిలో ఆరోగ్య మిత్ర అందుబాటులో లేకుంటే ఈ ఫిర్యాదు అత్యంత వేగంగా స్పందించాల్సిన విభాగం పరిధిలోకి వస్తుంది. ఇది గంటలోగా పరిష్కరించాల్సి ఉంటుంది. ఫిర్యాదు అందిన వెంటనే ఫోన్, ఎస్ఎంఎస్ ద్వారా ఆరోగ్య మిత్ర టీమ్ లీడర్‌కు సమాచారం ఇస్తారు. ఒకవేళ అక్కడ స్పందించడంలో ఆలస్యం అయితే వెంటనే జిల్లా ఆరోగ్యమిత్ర కోఆర్డినేటర్, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్‌కు ఫిర్యాదు వెళుతుంది. గంటలోగా ఫిర్యాదు పరిష్కారం కాకుంటే ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్టు అధికారుల దృష్టికి వచ్చేలా చర్యలు చేపట్టారు. సకాలంలో ఫిర్యాదు పరిష్కరించకుంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటారు. పలు సమస్యలు – వాటి పరిష్కారం ఇలా ఆరోగ్య శ్రీ అత్యంత వేగంగా పరిష్కరించాల్సిన ఫిర్యాదులు (గంటలోపు) ► ఆరోగ్యమిత్ర అందుబాటులో లేకపోవడం ► ఆరోగ్య శ్రీ కింద అడ్మిషన్, చికిత్స అందించడానికి ఆస్పత్రులు నిరాకరించడం వేగంగా పరిష్కరించాల్సిన ఫిర్యాదులు (24 గంటల్లో) ► హెల్త్ కార్డు డీయాక్టివేషన్‌లో ఉండటం ► అడ్మిషన్, చికిత్స సమయంలో డబ్బు డిమాండ్ చేయడం సాధారణంగా పరిష్కరించే ఫిర్యాదులు (7 నుంచి 21 రోజుల్లో) ► పోస్ట్ ఆపరేషన్, ఫాలో అప్‌లో సమస్యలు ► హెల్త్‌కార్డు అందకపోవడం ► కుటుంబసభ్యుడిని కార్డులో చేర్చడం, తొలగించడం ► ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొందుతున్న రోగి మరణించడం, ఇతర ఫిర్యాదులు ఆరోగ్య ఆసరా వేగంగా పరిష్కరించాల్సిన ఫిర్యాదులు (24 గంటల్లో) ► బ్యాంక్ ఖాతాలో ఆసరా డబ్బు జమకాకపోవడం ► ఆసరాకు దరఖాస్తు చేయడంలో ఆరోగ్యమిత్ర ఆలస్యం చేయడం సాధారణంగా పరిష్కరించే ఫిర్యాదులు (7 నుంచి 21 రోజుల్లో) ► మంజూరైన దానికంటే తక్కువ భృతి అందడం, ఇతర ఫిర్యాదులు 104 ఎంఎంయూ వేగంగా పరిష్కరించాల్సిన ఫిర్యాదులు (24 గంటల్లో) ► గ్రామానికి 104 ఎంఎంయూ రాకపోవడం ► ఆలస్యంగా వచ్చి, త్వరగా వెళ్లిపోవడం ► వైద్యపరీక్షలు చేయకపోవడం, వైద్యులు అందుబాటులో లేకపోవడం సాధారణంగా పరిష్కరించే ఫిర్యాదులు (7 నుంచి 21 రోజుల్లో) ► వైద్యసేవలు అందించడానికి డబ్బు డిమాండ్ చేయడం ► సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం ► పరికరాలు పనిచేయకపోవడం, ఇతర సమస్యలు 108 అంబులెన్స్ వేగంగా పరిష్కరించాల్సిన ఫిర్యాదులు (24 గంటల్లో) ► అంబులెన్స్ ఆలస్యంగా రావడం, సేవలు అందించడానికి తిరస్కరించడం సాధారణంగా పరిష్కరించే ఫిర్యాదులు (7 నుంచి 21 రోజుల్లో) ► సిబ్బంది డబ్బులు డిమాండ్ చేయడం ► అంబులెన్స్‌లో ఆక్సిజన్, మందులు, పరిశుభ్రంగా లేకపోవడం ► సిబ్బంది ప్రవర్తన, ఇతర సమస్యలు మహాప్రస్థానం వేగంగా పరిష్కరించాల్సిన ఫిర్యాదులు (24 గంటల్లో) ► డ్రైవర్ మద్యం తాగి ఉండటం ► వాహనం అందుబాటులో లేకపోవడం, గమ్యస్థానానికి చేర్చడానికి నిరాకరించడం సాధారణంగా పరిష్కరించే ఫిర్యాదులు (7 నుంచి 21 రోజుల్లో) ► సిబ్బంది ప్రవర్తన, డబ్బు డిమాండ్ చేయడం, ఇతర ఫిర్యాదులు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వేగంగా పరిష్కరించాల్సిన ఫిర్యాదులు (24 గంటల్లో) ► వాహనాలు అందుబాటులో లేకపోవడం, ఆలస్యం చేయడం, తరలింపునకు నిరాకరించడం సాధారణంగా పరిష్కరించే ఫిర్యాదులు (7 నుంచి 21 రోజుల్లో) ► డబ్బు డిమాండ్ చేయడం, వాహనం పరిశుభ్రంగా లేకపోవడం, ఇతర సమస్యలు -
జగనన్న ప్రభుత్వం @3 ఏళ్లు: ప్రాణం పోశారు
సాక్షి, అమరావతి: ఒకప్పుడు పెద్ద జబ్బు వచ్చిందంటే ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవాల్సిందే. ఇంట్లో అనారోగ్యంతో ఉన్న వారి కష్టాన్ని చూసి కుటుంబ సభ్యులు తల్లడిల్లేవారు. ఇలాంటి వేల కుటుంబాలకు అపర సంజీవనిగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పునర్జన్మ ప్రసాదిస్తోంది. చికిత్స ఖర్చులు చెల్లించడమే కాకుండా శస్త్ర చికిత్స తర్వాత రోగి కోలుకునే సమయంలో చేతికి డబ్బులూ ఇస్తున్నారు. కుటుంబ పెద్ద అనారోగ్యం పాలైతే ఆ ఇంట్లో వారు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే సహృదయంతో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య సేవలు పొందాలంటే పొరుగూర్లకు వెళ్లి పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఇప్పుడు గ్రామాల్లో లేదు. గర్భిణులు, చిన్నారుల సంరక్షణ, నవజాత ఆరోగ్య సంరక్షణ, అంటు వ్యాధుల నివారణ తదితర 12 రకాల వైద్య సేవలు, 14 రకాల పరీక్షలు, 67 రకాల మందులు గ్రామంలోనే అందుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వేల గ్రామాల్లో వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు సేవలు ప్రారంభించాయి. గత మూడేళ్లలో కరోనా మహమ్మారి మూడు దఫాలుగా విరుచుకు పడ్డా అన్ని వేవ్‌ల్లోనూ ప్రభుత్వం సమర్థంగా కట్టడి చేసింది. రూ.16 వేల కోట్లకుపైగా వెచ్చిస్తూ వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడంతో మూడేళ్లలోనే ఎన్నో మార్పులు కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ఆరోగ్యశ్రీతో రక్షణ ఛత్రం ఆరోగ్యశ్రీతో గత మూడేళ్లలో 18,72,183 మందికి ప్రభుత్వం ఉచితంగా వైద్యం అందించింది. ఏకంగా రూ.6,321.92 కోట్లు వైద్యానికి ఖర్చు చేసింది. శస్త్ర చికిత్సల అనంతరం 9,85,315 మందికి విశ్రాంతి సమయంలో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద రూ.624.01 కోట్లు ఆర్థిక సాయం చేసింది. రోజుకు రూ. 225 లేదా నెలకు గరిష్టంగా రూ.5 వేలు చొప్పున ఆర్థిక సాయం అందుతోంది. ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ రాష్ట్రంలో 95% కుటుంబాలకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీతో ఉచితంగా వైద్య చికిత్సలను అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే విశిష్ట గుర్తింపు సాధించింది. దేశంలో మధ్య తరగతి వర్గాలకు ఆరోగ్యబీమా దక్కడం లేదని ‘హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ ఇండియాస్ మిస్సింగ్ మిడిల్ క్లాస్’ను ఉటంకిస్తూ గత ఏడాది నీతి ఆయోగ్ పేర్కొంది. ఏపీలో మాత్రం మధ్య తరగతి వర్గాలను కూడా ఆరోగ్య బీమా రక్షణ ఛత్రం కాపాడుతోందని ఆ నివేదికలో వెల్లడించడం గమనార్హం. రూ.ఐదు లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న అందరికి ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తానని 2019 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ రెండు వేల జనాభాకు ఒకటి చొప్పున 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. నాడు–నేడులో భాగంగా రూ.1,692 కోట్లతో 1,498 భవనాలకు మరమ్మతులు, 8,534 కొత్త భవనాల నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటికే 1,201 భవనాల నిర్మాణం పూర్తయింది. క్లినిక్‌లలో సేవలు అందించేందుకు 8,413 మంది ఎంఎల్‌హెచ్‌పీలను ప్రభుత్వం నియమించింది. సగటున రోజుకు ఒక్కో క్లినిక్‌లలో 23 ఓపీలు, ఎనిమిది పరీక్షలు జరుగుతున్నాయి. నిత్యం సగటున 4,500 మందికి టెలీమెడిసిన్ వైద్య సేవలు అందుతున్నాయి. పీహెచ్‌సీలు బలోపేతం రాష్ట్రవ్యాప్తంగా 1,149 పీహెచ్‌సీలు ఉండగా ప్రతి చోటా ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్ నర్సులు సహా 12 మంది సిబ్బంది ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.661 కోట్లతో నాడు–నేడు కింద 997 పీహెచ్‌సీలకు మరమ్మతులు, 148 కొత్త భవనాల నిర్మాణం చేపట్టారు. మండలానికి రెండు పీహెచ్‌సీలు ఉండాలనే లక్ష్యంతో కొత్తగా 176 పీహెచ్‌సీలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి పీహెచ్సీలో 63 రకాల వైద్య పరీక్షలు, 215 రకాల మందులను అందుబాటులోకి తెచ్చారు. పట్టణ, నగర ప్రాంతాల్లో 30 వేల మంది జనాభాకు ఒకటి చొప్పున 560 వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పారు. రూ.367 కోట్లతో వీటికి భవనాలు, ఇతర వనరులు సమకూరుస్తున్నారు. నాడు–నేడులో భాగంగా 121 సీహెచ్‌సీలు, 24 ఏరియా ఆస్పత్రులు, రెండు ఎంసీహెచ్‌ల అభివృద్ధికి ప్రభుత్వం రూ.1,223 కోట్లు ఖర్చు చేస్తోంది. నవశకానికి నాంది ప్రభుత్వ వైద్య రంగం బలోపేతానికి ఏకంగా రూ.16 వేల కోట్లకు పైగా నిధులను వెచ్చిస్తున్నారు. రూ.12,268 కోట్లతో 11 వైద్య కళాశాలలను, బోధనాస్పత్రులను అభివృద్ధి చేయడంతో పాటు కొత్తగా 16 వైద్య కళాశాలలు, సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. నూతనంగా నిర్మించే ప్రతి వైద్య కళాశాలకు అనుసంధానంగా నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో మరో 1,850 వరకూ ఎంబీబీఎస్, 960 నర్సింగ్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం బోధనాస్పత్రుల్లో వసతులు గణనీయంగా మెరుగయ్యాయి. విజయవాడ జీజీహెచ్‌లో 240 పడకలతో సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌ను అందుబాటులోకి తెచ్చారు. కార్డియాలజీ, కార్డియో థొరాసిక్ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ, మెడికల్ ఆంకాలజీ సహా పలు విభాగాలను ఏర్పాటు చేశారు. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా వసతులు సమకూర్చడంతో పెద్దాస్పత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగింది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఓపీలు దాదాపు రెట్టింపు కావడం ఇందుకు నిదర్శనం. గుంటూరు జీజీహెచ్‌లో అధునాతన సౌకర్యాలతో క్యాన్సర్ కేర్ సెంటర్‌ను ప్రభుత్వం 2020లో ప్రారంభించింది. రూ.28 లక్షల వైద్యం ఉచితం కూలి పనులకు వెళ్లే కృష్ణా జిల్లా నాగాయలంకకు చెందిన చేబ్రోలు వరప్రసాద్‌కు ఇద్దరు కుమారులు. బీటెక్ చదివిన పెద్ద కుమారుడు గ్రామంలోనే చిన్న హోటల్ నడుపుతున్నాడు. చిన్న కుమారుడు ఉదయ్‌భాస్కర్ మంగళగిరిలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీఎస్సీ ఎం.ఎల్.టి. కోర్సు చదువుతున్నాడు. గతేడాది ఆగస్టులో ఉదయ్‌కు కడుపులో నొప్పి రావడంతో విజయవాడలోని ఓ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. ప్లేట్ లెట్స్ ఎక్కించినా నయం కాలేదు. సమగ్ర రక్త పరీక్షల అనంతరం బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు నిర్ధారించారు. వరప్రసాద్ కుటుంబాన్ని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆపద్భాంధవిలా ఆదుకుంది. ఇప్పటికే పలు మార్లు కీమోథెరఫీ చేశారు. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా చేపడుతున్నారు. ఏకంగా రూ.28 లక్షలు ఖర్చయ్యే వైద్యాన్ని ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ఆరోగ్యశ్రీ తన కుమారుడికి ప్రాణం పోసిందని వరప్రసాద్ చెబుతున్నాడు. శివ శంకర్ గుండె పదిలం వైఎస్సార్ జిల్లా దేవుని కడపకు చెందిన శివ శంకర్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. అతడి సంపాదనపై తల్లి, భార్య పిల్లలు ఆధారపడి జీవిస్తున్నారు. రెండేళ్ల క్రితం శివకు గుండె జబ్బు ఉన్నట్లు బయటపడింది. గుండె మార్పిడి చేస్తే కానీ బతికే అవకాశం లేని పరిస్థితి. అందుకు రూ.10 లక్షలకు పైగా ఖర్చు అవుతుంది. అతడిని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆదుకుంది. బెంగళూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో నెల క్రితం ఆరోగ్యశ్రీతో ఉచితంగా హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్రచికిత్స జరిగింది. ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం రూ.10.50 లక్షలు చెల్లించింది. పల్లెకు ప్రాణనాడి ప్రస్తుతం రాష్ట్రంలో 44,452 మందికి ఒకటి చొప్పున 104 వాహనాలున్నాయి. ప్రతి వాహనంలో 74 రకాల మందులు అందుబాటులో ఉంటున్నాయి. కొత్తగా 539 వాహనాలను కొనుగోలు చేస్తోంది. ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే 108 అంబులెన్స్ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 412 కొత్త వాహనాలను సమకూర్చింది. ‘వైఎస్సార్ కంటి వెలుగు’ కింద 66,17,613 విద్యార్థులు, 19,12,259 మంది వృద్ధులు చికిత్స పొందారు. 2,457 మంది వైద్యుల నియామకంతో పాటు పారా మెడికల్ నియామకాల్లో భాగంగా ఇప్పటి వరకు 36,898కి పైగా పోస్టులు భర్తీ చేశారు. కరోనాకు కళ్లెం ఇలా.. ► కరోనా ప్రారంభమైనప్పుడు ఒక్క వైరాలజీ ల్యాబ్ కూడా లేని పరిస్థితి నుంచి.. రోజుకు 80 వేల పరీక్షలు చేయగలిగే సామర్థ్యంతో పాటు రాష్ట్రంలో 44 ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లను ప్రభుత్వం నెలకొల్పింది. మూడు వేవ్‌ల్లో కలిపి ఇప్పటి వరకూ 3.35 కోట్ల పరీక్షలను వైద్య శాఖ చేపట్టింది. ► దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ మిలియన్ జనాభాకు 6,07,747 వైద్య పరీక్షలు చేయగా మన రాష్ట్రంలో మాత్రం జాతీయ స్థాయిని మించి 6,28,908 పరీక్షలు చేశారు. రికవరీ శాతం జాతీయ స్థాయిలో 98.74 ఉంటే, రాష్ట్రంలో 99.36 శాతం నమోదైంది. ► ప్రస్తుతం 34,763 పడకలకు నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా జరుగుతోంది. ఆక్సీజన్ సరఫరాకు 90 ఎల్ఎంవో ట్యాంకర్లు, 25 క్రయోజనిక్ ట్యాంకర్లు కొనుగోలు చేశారు. 23,971 ఆక్సీజన్ కాన్సన్ట్రేటర్లు, 55,007 డీ–టైప్ ఆక్సీజన్ సిలెండర్లను సమకూర్చారు. ► ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ విధానం అమలు. ఇప్పటి వరకు 45 దఫాలు ఫీవర్ సర్వేలు. ఆసుపత్రులు, క్వారంటైన్ కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్‌లు.. పడకల లభ్యత, రోగుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ ► సీసీ కెమెరాల ద్వారా క్వారంటైన్ సెంటర్లు, ఆసుపత్రుల పర్యవేక్షణ. ఆరోగ్యశ్రీ ద్వారా కరోనాకు ఉచిత చికిత్స ప్రారంభించిన తొలి రాష్ట్రం ఏపీ. 104 కాల్ సెంటర్‌తో 13 లక్షల మందికి పైగా సేవలు ► కోవిడ్ టీకాల పంపిణీలో దేశంలో రికార్డు. 15 ఏళ్లు పైబడిన వారందరికీ రాష్ట్రంలో రెండు డోసుల టీకా పంపిణీ 100 శాతం పూర్తి. 12–14 వయసు వారికి తొలి డోసు వంద శాతం, రెండో డోసు 92 శాతానికి పైగా పంపిణీ. హెల్త్‌కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు వేగంగా ప్రికాషన్ డోసు పంపిణీ. -
3 Years Of YS Jagan Ruling: జనమే సాక్షి - ప్రజా పాలనకు మూడేళ్లు
-
క్యాన్సర్ లెక్క తేల్చేలా..
సాక్షి, అమరావతి: క్యాన్సర్ వ్యాధిని ఇప్పటికే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి సాంత్వన చేకూరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బాధితుల లెక్కలు పక్కాగా నిర్ధారించి సమగ్రంగా చికిత్స అందించేందుకు సిద్ధమైంది. క్యాన్సర్‌ను నోటిఫై జబ్బుల జాబితాలోకి చేర్చేలా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈమేరకు త్వరలో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం నోటిఫై చేసిన జబ్బులు 31 వరకు ఉండగా జాబితాలో ఎయిడ్స్, మలేరియా, డెంగ్యూ, హెపటైటిస్ లాంటివి ఉన్నాయి. గతేడాది కరోనా రోగుల్లో వెలుగు చూసిన బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ను కూడా నోటిఫైడ్ జబ్బుల జాబితాలో చేర్చారు. వివరాలు లేక అస్పష్టత క్యాన్సర్ మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. క్యాన్సర్ రిజిస్ట్రీ గణాంకాల ప్రకారం ఏటా దేశంలో ఎనిమిది లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో క్యాన్సర్ కేసులకు సంబంధించి రిజిస్ట్రీ అంటూ ఇప్పటి వరకూ లేదు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్ చికిత్స పొందుతున్న రోగుల గణాంకాల ఆధారంగా ఏటా 53 వేల కొత్త కేసులు నమోదు అవుతున్నట్టు అంచనా. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సొంతంగా క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్న వారి వివరాలు అందుబాటులో లేవు. దీంతో ఏ ప్రాంతాల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి? ఏ రకం క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి? అనే వివరాలు తెలియకపోవడంతో వ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టత కొరవడింది. ఎప్పటికప్పుడు ఆన్లైన్లో.. ఒక జబ్బును నోటిఫై చేస్తే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కింద రిజిస్టర్ అయిన ప్రైవేట్ ఆస్పత్రులు, డయోగ్నోస్టిక్ కేంద్రాలు సంబంధిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్స వివరాలను ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేయాలి. చికిత్సకు నిర్దేశిత ప్రొటోకాల్ అనుసరించాలి. నిబంధనలను అతిక్రమిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. క్యాన్సర్ వ్యాధిని నోటిఫై చేయడం వల్ల ఎక్కడైనా ఆసుపత్రి, డయాగ్నోస్టిక్ సెంటర్లో కేసును కొత్తగా గుర్తించినా, చికిత్స అందించినా ఆ వివరాలు వెంటనే ప్రభుత్వానికి చేరతాయి. తద్వారా డిజిటల్ క్యాన్సర్ రిజిస్ట్రీని వైద్య శాఖ నిర్వహిస్తుంది. ఇందుకు వెబ్ అప్లికేషన్‌ను రూపొందిస్తున్నారు. ఇందులో అన్ని రిజిస్టర్ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్స్ సెంటర్లకు లాగిన్ ఇస్తారు. దీనివల్ల ఎప్పటికప్పుడు కొత్తగా నమోదైన క్యాన్సర్ కేసులు, చికిత్స పొందిన రోగుల వివరాలు ఆన్లైన్లో వైద్య శాఖకు చేరతాయి. ఈ వివరాలను రాష్ట్ర స్థాయిలో కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ విధానాల్లో విశ్లేషించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)కు పంపుతారు. దేశంలోనే తొలిసారి.. సమర్థంగా క్యాన్సర్‌ను నియంత్రించాలన్న సీఎం జగన్ ఆశయాల మేరకు నోటిఫై జాబితాలో చేర్చాలని నిర్ణయించాం. డిజిటల్ క్యాన్సర్ రిజిస్ట్రీని దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో ప్రారంభించనున్నాం. వెబ్ అప్లికేషన్ రూపొందిస్తున్నాం. రిజిస్ట్రీ నిర్వహించడం వల్ల కేసులకు అనుగుణంగా వైద్యులు, వైద్య సదుపాయాలు సమకూర్చుకునేందుకు ఆస్కారం ఉంటుంది. క్యాన్సర్‌కు అధునాతన వైద్య చికిత్స అందించేలా ప్రణాళికలు రచిస్తున్నాం. – నవీన్‌కుమార్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆరంభంలోనే గుర్తిస్తే.. క్యాన్సర్ కేసులను పక్కాగా నమోదు చేయడం వల్ల సమర్థంగా నియంత్రించే అవకాశాలుంటాయి. వయసు, లింగం, ప్రాంతాల వారీగా ఏ వర్గాల్లో, ఏ రకం క్యాన్సర్లు ఎక్కువగా నమోదవుతున్నాయో తెలుస్తుంది. తద్వారా స్క్రీనింగ్ నిర్వహించి ప్రారంభ దశలోనే గుర్తించి నియంత్రించే వీలుంటుంది. ఉదాహరణకు గుంటూరు జిల్లాలో జీర్ణాశయ క్యాన్సర్, ఉత్తరాం«ధ్రలో ఓరల్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉంన్నట్లు వైద్య శాఖ అంచనా వేస్తోంది. ఇలాంటివన్నీ నోటిఫైతో పక్కాగా తెలుస్తాయి. ఎక్కువగా నమోదయ్యే క్యాన్సర్లపై అధ్యయనం, పరిశోధనలకు ఆస్కారం ఉంటుంది. నూతన వైద్య విధానాల దిశగా అడుగులు వేసే వీలుంటుంది. -
అన్ని క్యాన్సర్లకూ ఆరోగ్యశ్రీ
దేశంలో క్యాన్సర్ చికిత్స ప్రాముఖ్యతను గుర్తించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. క్యాన్సర్ బాధితుల సంరక్షణ, చికిత్సపై సీఎం జగన్ దూరదృష్టి అభినందనీయం. రాష్ట్రవ్యాప్తంగా మూడు సమగ్ర క్యాన్సర్ ఆసుపత్రుల నిర్మాణానికి సీఎం శ్రీకారం చుట్టారు. – డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, రేడియేషన్ ఆంకాలజిస్ట్, ప్రభుత్వ సలహాదారు సాక్షి ప్రతినిధి, తిరుపతి: క్యాన్సర్ వంటి వ్యాధులకు కూడా ఆరోగ్యశ్రీని వర్తింపజేసి, పేదలందరికీ ఉచితంగా వైద్య సౌకర్యం అందించాలనేదే తమ లక్ష్యమని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో టాటా సంస్థ అద్భుతమైన క్యాన్సర్ ఆస్పత్రిని తిరుపతిలో ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు. తిరుపతి జూపార్క్ రోడ్లో టీటీడీ సహకారంతో టాటా సంస్థ ఆధ్వర్యంలో రూ.190 కోట్లతో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (స్వీకార్)ను గురువారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం రేడియాలజీ విభాగంలో రోగుల కోసం అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసిన క్యాబిన్లు, వైద్య పరికరాలను, చికిత్సా విధానాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి భరోసా ఇవ్వడమే లక్ష్యమని, రానున్న రోజుల్లో ఆంకాలజీ విభాగంలో అన్ని రకాల సేవలు వర్తింపజేయాలని భావిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో సమగ్రమైన క్యాన్సర్ చికిత్స అందించాలన్నది తమ లక్ష్యమని, ఇందులో భాగంగా అన్ని రకాల క్యాన్సర్లకు ఒకే గొడుగు కింద ఉచితంగా చికిత్స అందించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలో ఏ ఒక్క రోగి కూడా క్యాన్సర్‌తో చనిపోకూడదని, చికిత్స కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లకూడదనేది తమ అంతిమ లక్ష్యమని చెప్పారు. క్యాన్సర్ కేర్, అడ్వాన్స్డ్ ఆసుపత్రిని ప్రారంభిస్తున్న సీఎం జగన్, చిత్రంలో మంత్రులు, ఆసుపత్రి బృందం క్యాన్సర్ చికిత్సపై దృష్టి పెట్టిన ఏకైక రాష్ట్రం ఏపీ ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మూడు సమగ్ర క్యాన్సర్ ఆసుపత్రుల నిర్మాణానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్నారు. క్యాన్సర్ సంరక్షణ, చికిత్సపై సీఎం దూరదృష్టి అభినందనీయమన్నారు. పీడియాట్రిక్ ఆంకాలజీ సెంటర్, ప్రివెంటివ్ ఆంకాలజీ, సెంటర్ ఫర్ పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తూ.. భారతదేశంలో క్యాన్సర్ చికిత్స ప్రాముఖ్యతను గుర్తించిన ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమేనని చెప్పారు. టాటా ట్రస్ట్ సీఈవో ఎన్.శ్రీనాథ్, స్వీకార్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వీఆర్.రమణన్, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘ఆరోగ్యశ్రీ’లో అరుదైన ఆపరేషన్
లబ్బీపేట(విజయవాడతూర్పు): మల్టీపుల్ మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగికి విజయవాడలో తొలిసారిగా బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఎంతో ఖరీదైన ఈ చికిత్సను వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నిర్వహించినట్లు హెచ్‌సీజీ క్యాన్సర్ సెంటర్ హెమటాలజిస్ట్–బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ నిపుణులు డాక్టర్ అమర్నాథ్ పొలిశెట్టి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలోని ఆస్పత్రిలో బుధవారం చికిత్స వివరాలు వెల్లడించారు. విజయవాడకు చెందిన వెంకటేశ్వరరావు (55) మల్టీపుల్ మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్‌తో ఏడాదిగా బాధపడుతున్నాడు. అతనికి కీమోథెరపీ చికిత్స అందిస్తూ, ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో మార్చి 23న బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారు. కార్యక్రమంలో రోగితో పాటు హెచ్‌సీజీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జి.రవికిరణ్ పాల్గొన్నారు. -
తిరుపతిలో అత్యాధునిక క్యాన్సర్ ఆసుపత్రి
తిరుపతి తుడా: రాష్ట్రంలో క్యాన్సర్ రోగులకు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. క్యాన్సర్ చికిత్స కోసం ఇకపై చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాలకు పరుగులు పెట్టాల్సిన పని లేదు. అంతకుమించిన అత్యాధునిక వైద్య పరిజ్ఞానంతో తిరుపతిలో క్యాన్సర్ ఆసుపత్రి అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో టాటా ట్రస్టు సౌజన్యంతో అలమేలు చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా శ్రీవేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆసుపత్రిని శరవేగంగా నిర్మించారు. ఈ ఆసుపత్రిలో తక్కువ ఖర్చుతో అత్యాధునిక కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తారు. క్యాన్సర్ కేర్‌కు చిరునామాగా నిలిచే ఈ ఆసుపత్రిని రూ.190 కోట్ల వ్యయంతో 92 పడకలతో నిర్మించారు. దశలవారీగా పడకలను 300కు పెంచనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 5వ తేదిన ఈ అత్యాధునిక క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించి, ప్రజలకు అంకితం చేయనున్నారు. టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఈ అత్యాధునిక ఆసుపత్రి నిర్మాణానికి టాటా సంస్థకు టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం సహకారాన్ని అందించాయి. ఇప్పటికే టీటీడీ సహకారంతో నిర్వహిస్తున్న స్విమ్స్ ఆసుపత్రిలో ఆంకాలజీ విభాగం ద్వారా క్యాన్సర్ రోగులకు వైద్య సేవలందిస్తోంది. ప్రత్యేకంగా క్యాన్సర్ వైద్యానికి అత్యాధునిక ఆసుపత్రి నిర్మాణానికి ముందుకు వచ్చిన టాటా సంస్థకు అలిపిరి వద్ద విలువైన 25 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. కరోనా మహమ్మారి కారణంగా నిర్మాణానికి ఏడాదికిపైగా ఆటంకం ఏర్పడింది. దీని నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించడంతో ఆసుపత్రి అందుబాటులోకి వచ్చింది. ఆరోగ్యశ్రీ అమలుకు చర్యలు నూతన ఆసుపత్రిలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా క్యాన్సర్ చికిత్సను అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ సూచనల మేరకు ఆసుపత్రి యాజమాన్యం ఆరోగ్యశ్రీకి అనుమతుల కోసం ప్రతిపాదనలను పంపింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే టాటా క్యాన్సర్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీని అమలు చేస్తారు. విస్తృతంగా అవగాహన ఆసుపత్రికి పునాది వేసిన ఆరు నెలల నుంచే ట్రస్టు ద్వారా ఏడుగురు వైద్యుల బృందంతో జిల్లావ్యాప్తంగా క్యాన్సర్‌పై అవగాహన, స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహిస్తోంది. మహిళల కోసం పింక్ బస్సు ఏర్పాటు చేసి గ్రామాల్లో పరీక్షలు చేస్తోంది. రోగ లక్షణాలను గుర్తించిన వారికి తక్కువ ఖర్చుతో ఖరీదైన వైద్యాన్ని అందిస్తోంది. అలానే క్యాన్సర్ మహమ్మారిని గుర్తించేందుకు పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మెడికల్ హబ్‌గా తిరుపతి రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. తిరుపతిని మెడికల్ హబ్‌గా చేస్తోంది. నాడు–నేడు ద్వారా రాయలసీమ పెద్దాసుపత్రి రుయాను రూ.450 కోట్లతో ఆధునీకరిస్తోంది. స్విమ్స్, బర్డ్ ఆసుపత్రులను మరింత ఆధునీకరించి మెరుగైన వైద్యం అందిస్తోంది. గత ఏడాది అక్టోబర్ 11న టీటీడీ శ్రీపద్మావతి చిన్న పిల్లల గుండె చికిత్సల ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు తిరుపతిలో అత్యాధునిక క్యాన్సర్ ఆసుపత్రి అందుబాటులోకి వస్తోంది. అత్యాధునిక వైద్యం ఈ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలు, సౌకర్యాలు కల్పించారు. సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ విభాగాలతో పాటు అనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్, పెయిన్ అండ్ పాలియేటివ్, రేడియాలజి, పాథాలజి, మైక్రో బయాలజి, బయో కెమిస్ట్రి, నాణ్యమైన ఫార్మసీ, బ్లడ్‌బ్యాంక్‌ను ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం 120 మంది నిపుణులైన వైద్యులు, వైద్య సిబ్బంది ఉంటారు. అత్యాధునిక అల్ట్రాసౌండ్, మమోగ్రామ్, ఎక్స్‌రే, సీటీ, ఎంఆర్ఐ, లీనాట్, బ్రాకీథెరపీ, కీమోథెరపీ డేకేర్తో పాటు ఆధునిక ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. ‘టాటా’ సామాజిక స్పృహ దిగ్గజ కార్పొరేట్ కంపెనీల్లో టాటా ఒకటి. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన టాటా సంస్థ వ్యాపారమేగాక సామాజిక స్పృహలోనూ ముందుంది. స్వాతంత్య్రం రాక ముందే 1941లో ముంబై పట్టణంలో టాటా మెమోరియల్ ఆసుపత్రిని నిర్మించింది. 2011లో అతిపెద్ద క్యాన్సర్ ఆసుపత్రిని కోల్‌కతాలో అందుబాటులోకి తెచ్చింది. ఆ తర్వాత అలమేలు మంగ చారిటబుల్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి తిరుపతిలో ఆసుపత్రిని నిర్మించింది. టాటా ట్రస్టు చైర్మన్‌గా రతన్‌టాటా, అలమేలు చారిటబుల్ ఫౌండేషన్‌కు సీఈగా సంజయ్‌చోప్రా వ్యవహరిస్తున్నారు. క్యాన్సర్ ఆసుపత్రికి మెడికల్ డైరెక్టర్‌గా విఆర్ రమణన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇది అత్యాధునిక ఆసుపత్రి అలమేలు చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అత్యాధునిక వైద్య సేవలతో క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించాం. దీని నిర్మాణానికి టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వ సహకారం మరువలేనిది. లాభాపేక్ష లేకుండా ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని సాధారణ ఖర్చుతో అందించడమే టాటా సంస్థ లక్ష్యం. ఇప్పటివరకు స్విమ్స్‌తో మాత్రమే ఎంవోయూ కుదిరింది. ఆసుపత్రి సేవలను జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం, డిఫెన్స్ సంస్థలతో ఎంవోయూ చేసుకుంటాం. – డాక్టర్ విఆర్ రమణన్, మెడికల్ డైరెక్టర్, క్యాన్సర్ ఆసుపత్రి వైద్య సేవలు పొందడం ఇలా ► ఆసుపత్రి టోల్ ఫ్రీ నెం: 18001036123 ► ప్రతిరోజు రేడియో ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ వైద్య సేవలు ► నేరుగా ఆసుపత్రి రిసెప్షన్లో సంప్రదించి ఓపీ పొందవచ్చు ► ఆసుపత్రి ఓపీ సమయం: ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ► ఓపీ టిక్కెట్ రుసుము: రూ.30 ► పేషెంట్‌తో పాటు వచ్చే అటెండెంట్స్ విశ్రమించేందుకు ప్రత్యేకంగా ధర్మశాల నిర్మించారు. ఇందుకోసం రోజుకు రూ.100 (ఒక్కరికి) వసూలు చేస్తారు. ► అతి తక్కువ ధరలతో క్యాంటీన్ కూడా ఉంది. -
క్యాన్సర్ రోగులకు ఆరోగ్యసిరులు
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెనిగండ్లకు చెందిన శ్రీనుది నిరుపేద కుటుంబం. భార్య పక్షవాతంతో బాధపడుతోంది. కుమార్తె, అల్లుడూ అనారోగ్యంతో బ్బందిపడుతున్నారు. వీరిద్దరి కుమార్తె దేవశ్రీ (5)కు బ్లడ్ క్యాన్సర్. దీంతో ఈ ముగ్గురి బాధ్యత కూడా శ్రీనుపై పడడంతో అతని ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ సమయంలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం మనవరాలి వైద్యానికి అండగా నిలిచింది. పెదకాకానిలోని అమెరికన్ ఆంకాలజీ ఆసుపత్రిలో చిన్నారికి ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ఇప్పటివరకూ రూ.5,21,000లు ప్రభుత్వం ఖర్చుచేసింది. అలాగే, పాప పోషణకు వైఎస్సార్ ఆసరా అందుతోంది. ‘మనవరాలి చికిత్సకు అప్పులు చేయాల్సి వస్తుందని భయపడ్డాను. కానీ, ఆరోగ్యశ్రీ ఆదుకుంటోంది’.. అని శ్రీను అంటున్నాడు. విశాఖపట్నం నగరానికి చెందిన ఎస్. కొండమ్మ (28) కూడా క్యాన్సర్‌తో బాధపడుతోంది. వీరిదీ పేద కుటుంబమే. ఈమెకు కూడా ఆరోగ్యశ్రీ పథకం ఎంతగానో తోడ్పాటు అందించింది. నాలుగు కీమోథెరపీలు జరిగాయి. దీంతో పాటు రూ.11లక్షలతో బోన్‌మారో స్టెమ్‌సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్స అందించారు. ఇలా ఏకంగా రూ.18.80 లక్షలు కొండమ్మ చికిత్సకు ప్రభుత్వం ఖర్చుచేసింది. ‘ఆరోగ్యశ్రీ లేకపోయి ఉంటే కుటుంబం అప్పులపాలైపోయేది. నా కుటుంబాన్ని ప్రభుత్వం కాపాడింది. నాకు పునర్జన్మ ప్రసాదించింది’.. అని కొండమ్మ అంటోంది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న అనేకమంది రోగులకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కొండంత భరోసా ఇస్తోంది. కుటుంబాలు అప్పులపాలు కాకుండా ఆదుకుంటోంది. నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందిస్తోంది. కానీ, గత టీడీపీ ప్రభుత్వం క్యాన్సర్‌కు మొక్కుబడిగా చికిత్స అందించింది. దీంతో చేతి నుంచి డబ్బు ఖర్చుపెట్టలేక ప్రాణాలు వదులుకున్న వారు అనేకమంది ఉన్నారు. పథకంలో 400కు పైగా ప్రొసీజర్స్ 2019లో అధికారంలోకి రాగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసింది. ఏకంగా 2,446 ప్రొసీజర్స్‌ను పథకం పరిధిలోకి తెచ్చింది. ఈ క్రమంలో పేద, మధ్యతరగతి ప్రజలు క్యాన్సర్ వ్యాధి చికిత్సకు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో 400కు పైగా క్యాన్సర్ ప్రొసీజర్స్‌ను పథకంలో చేర్చారు. దీంతో ప్రస్తుతం అన్ని రకాల క్యాన్సర్ వ్యాధులకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం లభిస్తోంది. అదే టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం 200 క్యాన్సర్ చికిత్స ప్రొసీజర్స్ మాత్రమే పథకం కింద ఉండేవి. వీటి నిర్వహణ కూడా అంతంతమాత్రంగా ఉండేది. మూడేళ్లలోనే రూ.926 కోట్లు ఖర్చు 2014–19 మధ్య టీడీపీ సర్కారు క్యాన్సర్ చికిత్సకు రూ.751.56 కోట్లు ఖర్చుచేసింది. రూ.3.18 లక్షల చికిత్సలు అందించారు. కానీ, సీఎం జగన్ ప్రభుత్వం గడిచిన మూడేళ్లలోనే రూ.926.16 కోట్లు ఖర్చుచేసింది. అంటే టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో పెట్టిన ఖర్చును మూడేళ్లలోనే అధిగమించి అదనంగా రూ.174.6 కోట్లు వెచ్చించింది. అదే విధంగా 4,16,665 చికిత్సలను ప్రస్తుత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేసింది. ప్రభుత్వ రంగంలో క్యాన్సర్‌కు కార్పొరేట్ వైద్యం ఇక ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కలిగిన సీఎం జగన్.. ఆరోగ్యశ్రీ పరిధిలోకి అన్ని క్యాన్సర్ వ్యాధులను తీసుకొచ్చారు. దీంతోపాటు.. మరో అడుగు ముందుకేసి ప్రభుత్వ రంగంలో క్యాన్సర్‌కు కార్పొరేట్ వైద్యం అందించేలా వసతుల కల్పనకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా.. ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని ప్రభుత్వ సలహాదారు (క్యాన్సర్)గా ఇటీవల నియమించారు. ఈయన సూచనల మేరకు క్యాన్సర్ వైద్య సదుపాయాలు మెరుగుపరచడానికి కసరత్తు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ ఆపద్బాంధవిలా ఆదుకుంది నా భర్త ప్రైవేట్ ఉద్యోగి. కొద్ది నెలల క్రితం నాకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ అయింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షల్లో ఖర్చు అవుతుందన్నారు. అంత స్తోమతలేక ఆందోళన చెందాం. ఆరోగ్యశ్రీ ఆపద్భాందవిలా ఆదుకుంది. ఇప్పటికి ఏడు కీమోలు మణిపాల్ ఆసుపత్రిలో చేశారు. ఆసరా కింద ఏడు విడతలు ఆర్థిక సాయం అందింది. ప్రభుత్వం చేస్తున్న మేలును మేం మర్చిపోలేం. – కె. కృష్ణజ్యోతి, క్యాన్సర్ బాధితురాలు, మంగళగిరి గుంటూరు జిల్లా ఉచితంగా చికిత్స అందించారు నేను ఇంటి నిర్మాణ కూలిగా పని చేస్తుంటాను. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నాను. నిరుపేద కుటుంబానికి చెందిన మాకు క్యాన్సర్ చికిత్స చేయించుకోవడం కష్టతరం. అలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ ఆదుకుంది. ఇప్పటివరకు ప్రభుత్వం నా చికిత్సకు రూ.3.72 లక్షలు ఖర్చుచేసింది. ఇంకా చికిత్స జరుగుతోంది. పోషణకు ఆసరా కింద కూడా సాయం చేస్తున్నారు. – ఎస్.కె. వలి, ఇంటూరు బాపట్ల జిల్లా -
ఆరోగ్యశ్రీ చాలా గొప్ప పథకం
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ఎంతో గొప్పదని.. ఈ పథకం ద్వారా ఎంతోమంది పేదలు మెరుగైన వైద్య సేవలు పొందుతున్నారని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వ్యాఖ్యానించారు. ఆదివారం గుంటూరులోని సాయిభాస్కర్ ఆస్పత్రిలో ‘న్యూ రివిజన్ నీ రీప్లేస్మెంట్ బ్లాక్’ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆయన ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, ఈహెచ్ఎస్ లబ్ధిదారులతో సంభాషించారు. అనంతర ఆయన మాట్లాడుతూ.. వైద్య ఖర్చులు భరించలేని పేద కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకం ధైర్యాన్ని ఇస్తోందన్నారు. రూ.25 లక్షల విలువైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలలో ఉపయోగించే ఇంప్లాంట్లను ప్రభుత్వానికి విరాళంగా అందించడమే కాకుండా, ఉన్నతి ఫౌండేషన్ ద్వారా డాక్టర్ నరేంద్రరెడ్డి అందిస్తున్న సేవలను అభినందించారు. గుంటూరు సర్వజన వైద్యశాలలో డాక్టర్ నరేంద్రరెడ్డి 100 ఉచిత మోకీలు మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తి చేయడం గొప్ప విషయమన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల ఆయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యేలు మద్దాళి గిరిధర్, ముస్తఫా, మేయర్ కావటి మనోహర్ నాయుడు, కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, ఎస్పీ ఆరిఫ్‌హఫీజ్, జేసీ రాజకుమారి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మైనార్టీ సంక్షేమ శాఖ సలహాదారు ఎస్ఎం జియావుద్దీన్, హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి పాల్గొన్నారు. -
అర్హులందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యం
గుంటూరు మెడికల్: అర్హులందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్టు ఫీల్డ్ ఆపరేషన్స్ సర్వీసెస్ జేఈవో డాక్టర్ శ్రీదేవి అన్నారు. సోమవారం గుంటూరు జీజీహెచ్‌లో ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త డాక్టర్ నాగళ్ల జయరామకృష్ణ అధ్యక్షతన ఆరోగ్యమిత్రలు, టీమ్ లీడర్లు, ఎంఎల్‌హెచ్‌పీలకు శిక్షణ కార్యక్రమం జరిగింది. శ్రీదేవి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా 2,446 జబ్బులకు, 1,973 నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో కూడా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నామన్నారు. ట్రస్టు పీఎంయూ జీఎం అంకయ్య, నరసరావుపేట ఆరోగ్య కో–ఆర్డినేటర్ డాక్టర్ పి.సునీల, జిల్లా మేనేజర్ సి.హెచ్.రవికిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
Andhra Pradesh: ఆరోగ్య ధీమా
పేద, మధ్యతరగతి వర్గాల వారికి గత ప్రభుత్వ హయాంలో దురదృష్టవశాత్తు ఏదైనా పెద్ద జబ్బు వస్తే ఆస్తులమ్ముకోవడం తప్ప మరో మార్గం ఉండేది కాదు. ఏ ఆస్తులూ లేని వారు దైవంపై భారం వేసి రోజులు లెక్కపెట్టుకునే వారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆ పరిస్థితి ఎక్కడా లేదు. ఎంత పెద్ద రోగం వచ్చినా ఆరోగ్యశ్రీ పథకం అండగా నిలుస్తోంది. పొరుగు రాష్ట్రాల్లోని పెద్ద పెద్ద కార్పొరేట్ ఆస్పత్రుల్లో సైతం ఈ పథకం కింద మన వాళ్లకు ఉచితంగా చికిత్స అందుతోంది. వైద్యం తర్వాత చిరునవ్వుతో ఇంటికి తిరిగొస్తున్నారు. ఆ తర్వాతా ‘ఆరోగ్య ఆసరా పథకం’ ఆర్థికంగా భరోసా ఇస్తుండటంతో వారి ఆనందానికి అవధుల్లేవు. – సాక్షి అమరావతి గుంటూరు జిల్లా అమరావతి మండలం ధరణికోటకు చెందిన పి.సూరిబాబు దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరి కుమారుడు అనిల్ కుమార్ 2018లో ఇంటర్ పూర్తి చేశాడు. గుంటూరు సమీపంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్‌లో చేరాడు. బీటెక్ పూర్తయితే కుమారుడు ప్రయోజకుడు అవుతాడని తల్లిదండ్రులు భావించారు. 2018 చివరిలో అనిల్‌కు కాళ్లు తిమ్మిరిగా ఉండటం, స్పర్శ తెలియకపోవడం, నడవడానికి ఇబ్బంది పడటం సమస్యలు ఎదురయ్యాయి. చుట్టుపక్కల ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించినా ఫలితం లేకపోయింది. క్రమంగా అనిల్ నడవలేని స్థితికి చేరుకున్నాడు. దీంతో పలు చోట్ల కార్పొరేట్ ఆసుపత్రుల్లో చూపించారు. అప్పులు చేసి మూడేళ్లలో రూ.20 లక్షలు ఖర్చు చేశారు. చివరి ప్రయత్నంగా గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లారు. వైద్య పరీక్షలు చేసి అనిల్.. ‘స్పైనల్ ఎపిడ్యూరల్ లైపోమ్యాటోసిస్’ వ్యాధితో బాధ పడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా శస్త్ర చికిత్స చేశారు. దీంతో ప్రస్తుతం అనిల్ నడవగలుగుతున్నాడు. ‘వ్యాధితో మూడేళ్లు నరకం చూశాను. చదువు ఆగిపోయింది. నన్ను చూసి నా తల్లిదండ్రులు ఏడ్వని రోజు లేదు. ప్రైవేట్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకుని ఉంటే రూ.6 లక్షలకు పైగా ఖర్చు అయ్యేది. ఆరోగ్యశ్రీలో ఉచితంగా చికిత్స చేసి నయం చేశారు’ అని అనిల్ చెప్పాడు. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం నారువానిపల్లె గ్రామానికి చెందిన వెంకట రామయ్యదీ నిరుపేద వ్యవసాయ కుటుంబం. రామయ్య దంపతుల కుమారుడు యోగేంద్రకు ఎనిమిదేళ్లు. యోగేంద్ర ఇటీవల ఇంటి వద్ద ఆడుకుంటూ కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళితే లాభం లేదు.. గుంటూరుకు తీసుకువెళ్లమని చెప్పారు. హుటాహుటిన గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం యోగేంద్ర బ్రెయిన్ ఎన్యూరిజం రప్చర్ అనే వ్యాధితో బాధ పడుతున్నట్టు వైద్యులు తేల్చారు. అరుదైన జబ్బుకు వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద వెంకటరామయ్య ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ప్రభుత్వం ఉచితంగా ప్రైవేట్ ఆస్పత్రిలో గత నెలలో శస్త్ర చికిత్స చేయించింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. రామయ్య తనకున్న కొద్దిపాటి పొలం ద్వారా వచ్చే ఆదాయం, కూలికి వెళితే వచ్చే డబ్బుతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ‘ఆరోగ్యశ్రీ పథకం ఆదుకుని ఉండకపోతే పొలం అమ్ముకోవాల్సి వచ్చేది’ అని రామయ్య తెలిపారు. పేదల పాలిట వరమే.. అనిల్ కుమార్, యోగేంద్రలే కాకుండా పెద్ద పెద్ద రోగాలతో బాధపడుతూ.. సొంతంగా డబ్బు ఖర్చు చేసే స్తోమత లేక, అప్పులు చేసి వైద్యం చేయించుకోలేక ప్రాణాల మీద ఆశలు వదిలేసుకునే దీన స్థితిలో ఉన్న వారి పాలిట ‘డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ’ పథకం వరంగా మారింది. గత ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తే, ఈ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులతో అమలు చేస్తోంది. కేవలం వైద్యం అందించి వదిలేయకుండా, చికిత్స అనంతరం వైద్యులు సూచించిన విశ్రాంతి సమయానికి వారి జీవన భృతి కోసం ‘వైఎస్సార్ ఆరోగ్య ఆసరా’ పథకం కింద ఆర్థిక సాయం అందిస్తున్నారు. అన్ని రకాల క్యాన్సర్ జబ్బులను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తెచ్చింది. విశాఖ మధురవాడకు చెందిన ఎస్.కొండమ్మకు 2020 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో, 2021 జనవరిలో నాలుగుసార్లు ఉచితంగా కీమో థెరఫీ చేశారు. ఇందుకు ప్రభుత్వం రూ.7.80 లక్షలు ఖర్చు చేసింది. గత ఏడాది మార్చిలో రూ.11 లక్షల ఖర్చుతో బోన్ మ్యారో స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారు. మొత్తంగా రూ.18.80 లక్షల విలువైన చికిత్సను కొండమ్మకు ఉచితంగా అందించింది. ఈ మేలు మరచిపోలేను నేను నిరుపేదను. నాకు గుండె వ్యాధి ఉందని తెలియడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. కడపలో డాక్టర్‌కు చూపిస్తే బైపాస్ సర్జరీ చేయాలని చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అయితే రూ.2 లక్షలు అవుతుందన్నారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా సర్జరీ చేస్తారని ఆరోగ్య మిత్ర చెప్పారు. తెలిసిన వారి ద్వారా హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రికి వెళ్లాను. అక్కడ వారు నాకు ఉచితంగా ఆపరేషన్ చేశారు. ఇందుకు మన ప్రభుత్వం కేర్ ఆసుపత్రికి రూ.1,18,881 చెల్లించింది. నేను కోలుకుంటున్న సమయంలో ‘ఆరోగ్య ఆసరా’ కింద ప్రభుత్వం నా బ్యాంక్ ఖాతాకు రూ.9,500 జమ చేసింది. ఈ మేలు నేను మరచిపోలేను. నాలాంటి పేదలకు ఆరోగ్య శ్రీ ద్వారా పునర్జన్మ లభిస్తోంది. – ఎస్.అజ్మతుల్లా, నకాష్ స్ట్రీట్, కడప, వైఎస్సార్ జిల్లా రూ.12 లక్షల ఆపరేషన్ ఉచితం మా పాపకు రెండున్నరేళ్లు. పుట్టుకతో వినికిడి లోపం ఉంది. విశాఖపట్నంలోని విమ్స్‌లో వైద్య పరీక్షలు చేసి, రెండు చెవులకు ఆపరేషన్ చేస్తే వినికిడి లోపం పోయి పాప మాట్లాడగలుగుతుందని చెప్పారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం కింద రూ.12 లక్షల ఖర్చుతో ప్రభుత్వమే ఉచితంగా ఆపరేషన్ చేయించింది. ఆపరేషన్ విజయవంతం అయింది. ఈ ప్రభుత్వం మేలును జన్మలో మరవలేము. – పార్వతి, మక్కువ, విజయనగరం జిల్లా ప్రాణం పోస్తున్న 108 జనవరి 8వ తేదీన కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం కొండుపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉయ్యాలవాడకు చెందిన జి.శంకర్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. పొట్ట భాగం నుంచి పేగులు బయటకు రావడంతో శంకర్‌రెడ్డి స్పృహ తప్పి పడిపోయాడు. అటుగా వెళ్తున్న వారు 108కు ఫోన్ చేశారు. కొద్ది సేపటికి అంబులెన్స్ అక్కడికి చేరుకుంది. అంబులెన్స్ టెక్నీషియన్.. గాయపడ్డ వ్యక్తి పేగులపై స్టెరైల్ డ్రెస్సింగ్ ప్యాడ్స్, వాటిపై నార్మల్ సెలైన్ వేసి పేగులకు సరైన తేమ శాతం ఉండేలా ప్రథమ చికిత్స చేశాడు. ఆ వెంటనే అంబులెన్స్‌లోకి ఎక్కించి ఆస్పత్రికి బయలుదేరారు. ఆ వెంటనే ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్(ఈఆర్సీ)లోని వైద్యుడిని సంప్రదించారు. వైద్యుల సూచన మేరకు శంకర్‌రెడ్డికి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించారు. సరైన సమయంలో నంద్యాలలోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడి వైద్యులు వెంటనే శస్త్రచికిత్స చేయడంతో శంకర్‌రెడ్డి ప్రాణాలతో బయటపడ్డాడు. వైఎస్సార్ జిల్లా గునకనపల్లిలో ఇటీవల ఫక్కీరప్ప అనే వ్యక్తి ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎంతగా తట్టిలేపినా ఉలుకు.. పలుకు లేదు. శరీరం చల్లబడింది. ఇక ఫక్కీరప్ప లేవరని భావించారు. చుట్టుపక్కల వాళ్లు ఎవరో 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. కొద్ది నిమిషాల్లో అంబులెన్స్ అక్కడికి చేరుకుంది. సిబ్బంది అతడ్ని అంబులెన్స్‌లోకి ఎక్కించారు. చికిత్స అందిస్తూ సమీపంలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఫక్కీరప్ప కోలుకున్నాడు. సకాలంలో అంబులెన్స్ రాకపోయి ఉంటే తాము బతికుండే వాళ్లం కాదని శంకర్‌రెడ్డి, ఫక్కీరప్పలు కొనియాడుతున్నారు. 108 తమకు పునర్జన్మ ఇచ్చిందని చెబుతున్నారు. మండలానికి ఒకటి.. శంకర్ రెడ్డి, ఫక్కీరప్ప తరహాలో అనుకోని ప్రమాదాలు, అనారోగ్య సమస్యలకు గురై ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడుతున్న లక్షల మందికి 108 అంబులెన్స్‌లు సంజీవనిలా మారాయి. గతంలో జనాభాకు అనుగుణంగా ఉండేవి కాదు. 2020 జూలై నుంచి మండలానికో 108 అంబులెన్స్ అందుబాటులోకి వచ్చింది. పట్టణ ప్రాంతాల్లో ఫోన్ చేసిన 14:48 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 19:20 నిమిషాల్లో, గిరిజన ప్రాంతాల్లో 22:21 నిమిషాల్లో ఘటన స్థలికి చేరుకుంటున్నాయి. 2,54,111 మంది కరోనా బాధితులు 108లో ఉచితంగా రవాణా సేవలు పొందారు. గతంలో 1,19,595 మందికి ఒకటి చొప్పున 440 అంబులెన్స్‌లు ఉండేవి. వీటి స్థానంలో 532 బేసిక్ లైఫ్ సపోర్ట్(బీఎల్ఎస్), 190 అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్(ఏఎల్ఎస్), 26 నవజాత శిశువుల అంబులెన్స్‌లు 19 కలిపి మొత్తంగా 748 అంబులెన్స్ సేవలను ఈ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు సగటున 2,753 మందిని అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్‌లు ఆస్పత్రులకు తరలిస్తున్నాయి. 108కు కోటి దండాలు మాది గంట్యాడ మండలం పెదవేమలి. మా అల్లుడు శ్రీనివాస్‌కు గంట్యాడ పోలీస్‌స్టేషన్‌కు సమీపంలో కొద్ది రోజుల క్రితం యాక్సిడెంట్ అయింది. బైక్‌పై వెళుతుండగా ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొనడంతో అతని కాలు విరిగిపోయింది. తలకు పెద్ద దెబ్బ తగిలింది. మాట్లాడలేని స్థితిలో ఉండగా 108 ద్వారా విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించాం. త్వరగా తీసుకొచ్చినందునే బతికించగలిగామని వైద్యులు చెప్పారు. 108 అంబులెన్స్‌కు కోటి దండాలు. – గేడు సన్యాసమ్మ, పెదవేమలి, విజయనగరం జిల్లా పునర్జన్మనిచ్చారు గర్భిణినైన నాకు గత ఏడాది నవంబర్ 13న రాత్రి పురిటి నొప్పులు వచ్చాయి. మా కుటుంబీకులు నన్ను పాలకొండ ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి అదుపు తప్పటంతో అదే రోజు రాత్రి 10 గంటలకు శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి రిఫర్ చేసారు. అప్పుడు వాహనాలు అందుబాటులో లేవు. 108కు సమాచారం ఇవ్వగానే పది నిమిషాల్లో వచ్చింది. మార్గంమధ్యలో నొప్పులు అధికమయ్యాయి. ఆముదాలవలస చేరే సరికి నేను స్పృహ కోల్పోయాను. అంబులెన్స్ సిబ్బందే సుఖ ప్రసవం చేయించారు. పండంటి ఆడబిడ్డ జన్మించింది. 11 గంటలకు మమ్మల్ని శ్రీకాకుళం జిల్లా ఆస్పత్రికి చేర్చారు. నా బిడ్డకు ఆయుష్షు పోసి, నాకు పునర్జన్మనిచ్చారు. – కండాపు హేమలత, సంకిలి గ్రామం, శ్రీకాకుళం జిల్లా -
కరోనా పరీక్షలు.. పండుగ తర్వాత పరుగులు
సాక్షి, అమరావతి: కరోనా మూడో దశ పొంచి ఉన్న నేపథ్యంలో ఎక్కువ పరీక్షలు చేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 19 వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ ల్యాబొరేటరీ (వీఆర్డీఎల్)లు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో మాత్రమే ఇవి ఉండటంవల్ల జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి నమూనాలు తరలించి, పరీక్షలు చేసి ఫలితాలు వెలువరించడానికి కొంత సమయం పడుతోంది. అన్ని జిల్లా ఆసుపత్రులు, కొన్ని ప్రాంతీయ ఆసుపత్రుల్లో ప్రయోగశాలలను ప్రభుత్వం నెలకొల్పింది. వీటిల్లో పనిచేయడానికి మైక్రోబయాలజిస్ట్‌లు, ఇతర సిబ్బంది నియామక ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. సంక్రాంతి పండుగ తర్వాత వీటి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్కు రాష్ట్ర ప్రభుత్వం తొలినుంచీ అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న విషయం తెలిసిందే. ఎక్కువ పరీక్షలు చేసి తద్వారా పాజిటివ్ రోగులను గుర్తించి వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చన్నది సర్కారు భావన. జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రుల్లో.. ప్రస్తుతం ఈ వీఆర్డీఎల్ ల్యాబ్‌లు రాష్ట్రంలోని 14 ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో ఉన్నాయి. వీటికి అదనంగా జిల్లా, ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాల్లో 19 చోట్ల కొత్త ల్యాబ్‌లను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ ప్రయోగశాలల్లో క్షయ, హెచ్ఐవీ, డెంగీ, ఇతర వైరస్ పరీక్షలూ చేసేందుకు వీలుంటుంది. ప్రారంభంలో ఒక్కో సెంటర్ రోజుకు వెయ్యి నిర్ధారణ పరీక్షలు చేసే సామర్థ్యం ఉంటుంది. ముందు ముందు నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. తొలి నుంచి దూకుడుగా.. కరోనా కట్టడి చర్యల్లో సీఎం వైఎస్ జగన్ సర్కార్ తొలి నుంచి దూకుడుగానే ముందుకెళ్తోంది. రాష్ట్రంలో తొలి కరోనా కేసు 2020 మార్చి 10న నెల్లూరు జిల్లాల్లో వెలుగుచూసింది. ప్రారంభంలో వైరస్ నిర్ధారణకు రాష్ట్రంలో ఒక్క ల్యాబ్ కూడాలేదు. పూణేలోని వైరాలజీ ల్యాబ్‌కు అప్పట్లో నమూనాలు పంపేవారు. తదనంతరం యుద్ధప్రాతిపదికన అదే ఏడాది అక్టోబర్ నాటికి రోజుకు 80వేల ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్, యాంటిజెన్లతో కలిపి రోజుకు ఒక లక్ష నుంచి 1.20 లక్షల పరీక్షల సామర్థ్యం కలిగిన 150 ల్యాబ్‌లను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. తాజాగా.. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పరీక్షలు చేపట్టడానికి జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌ను ఇటీవల ప్రారంభించింది. ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణా జిల్లాలకు సంబంధించిన నమూనాలను ప్రస్తుతం విజయవాడ జీనోమ్ ల్యాబ్‌లో పరీక్షిస్తున్నారు. పండుగ తర్వాత అందుబాటులోకి సంక్రాంతి పండుగ అనంతరం ల్యాబ్‌లు అందుబాటులోకి వస్తాయి. సిబ్బంది నియామకానికి వాక్ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. సిబ్బంది నియామకం, ఇతర కార్యకలాపాల పురోగతిపై రోజు సమీక్షిస్తున్నాం. – డాక్టర్ వినోద్‌కుమార్, ఏపీ వైద్య విధాన పరిషత్ కమిషనర్ రూ.6.22 కోట్లు ఖర్చు రాష్ట్రంలో 19 ల్యాబ్‌ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.6.22 కోట్లు వెచ్చించింది. సిబ్బంది జీతాలు, ఇతర ఖర్చుల రూపంలో నెలకు రూ.1.10 కోట్లు ఖర్చుచేయనుంది. – వినయ్‌చంద్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈఓ -
అరుదైన వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యశ్రీతో పునర్జన్మ
సాక్షి, అమరావతి: ఆరోగ్య శ్రీ పథకం ఇద్దరు నిరుపేద బాలికలకు పునర్జన్మనిచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో లక్షల మందిలో ఒకరికి చాలా అరుదుగా వచ్చే వ్యాధులకు గురైన ఆ బాలికలకు ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఉచిత వైద్యమందింది. వైఎస్సార్ కడప, కృష్ణా జిల్లాలకు చెందిన ఇద్దరు బాలికలు అతి అరుదైన వ్యాధులకు గురయ్యారు. రెక్కాడితే కాని డొక్కాడని ఆ రెండు నిరుపేద కుటుంబాలు వారి చిన్నారుల కోసం చేయగలిగినంత చేశాయి. కానీ, వారి ప్రాణాలు కాపాడాలంటే లక్షలాది రూపాయలు ఖర్చయ్యే బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలి. అంత ఖర్చు చేసే స్తోమతు లేక పిల్లల గురించి ఆ తల్లిదండ్రులు ఆందోళన చెందారు. విషయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్లింది. ఆయన వెంటనే ఆ రెండు జబ్బులను ఆరోగ్య శ్రీ పథకం కింద చేర్చి, బాలికలకు ఉచితంగా వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు అధికారులు ఆ బాలికలకు హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స అందించారు. వీరిద్దరికీ రూ. 60 లక్షలు వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించింది. ఇప్పుడా బాలికలు ఆరోగ్యంతో ఉన్నారు. వారి కుటుంబాల్లో ఆనందం నింపారు. ఉల్లాసంగా జోయా వైఎస్సార్ జిల్లా రాయచోటికి చెందిన డ్రైవర్ ఎస్. జాకిర్, షాను దంపతుల కుమార్తె జోయాకు మూడు నెలల వయస్సులో ఉన్నప్పుడు చర్మంపై దద్దుర్లు వచ్చాయి. పాప పెరిగేకొద్దీ దద్దుర్లు ఎక్కువై, చర్మం ఎర్రగా మారింది. రక్తస్రావం అయ్యేది. దీంతో కడప, తిరుపతి, హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో చికిత్స చేయించారు. లక్ష మందిలో ఒకరికి అరుదుగా వచ్చే హైపర్ ఐజీఈ సిండ్రోమ్ అనే జబ్బు పుట్టుకతోనే పాపకు వచ్చినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ జబ్బు క్యాన్సర్‌కు దారితీస్తుందని వైద్యులు చెప్పారు. అల్లోజెనిక్ బోన్ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ ఒక్కటే మార్గమని, రూ. 35 లక్షల వరకూ ఖర్చవుతుందని తెలిపారు. అప్పటికే రూ. 10 లక్షల మేర అప్పు చేసిన జాకిర్ దంపతులు ఆందోళనకు గురయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే ద్వారా విషయం సీఎం జగన్‌కు చేరింది. వెంటనే స్పందించి, ఆరోగ్య శ్రీ పథకం కింద పాపకు వైద్యం అందించాలని ఆదేశించారు. తొమ్మిది నెలల క్రితం హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో పాపకు బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారు. వైద్యానికి అయిన రూ. 35 లక్షలు ప్రభుత్వమే భరించింది. పునర్జన్మ ప్రసాదించారు మా పాపకు సీఎం జగన్ పునర్జన్మ ప్రసాదించారు. చికిత్సకు భారీ మొత్తం ఖర్చు పెట్టే స్తోమత లేక పాపపై ఒక దశలో ఆశలు వదులుకున్నాం. చివరి ప్రయత్నంగా సీఎంకు వినతి పెట్టుకున్నాం. ఆయన వెంటనే స్పందించి, పాపకు ఉచితంగా వైద్యం అందించారు. – షేక్ షాను, పాప తల్లి, రాయచోటి ఆరోగ్యంగా యువంకిత కృష్ణా జిల్లా లంకపల్లికి చెందిన కుంపటి కోటేశ్వరరావు, మహాలక్ష్మి దంపతులు వ్యవసాయ కూలీలు. వారి కుమార్తె యువంకితకు 13 ఏళ్లు. పాప 10 ఏళ్ల వయసులో ఉండగా కళ్లు తిరిగి పడిపోవడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లారు. బాలికకు అప్లాస్టిక్ అనీమియా అనే జబ్బు ఉందని, దాని వల్ల శరీరంలో ఎముక మజ్జ కొత్త రక్త కణాలను ఉత్పత్తి చేయడంలేదని వైద్యులు నిర్ధారించారు. ప్రతి 3.5 లక్షల మంది పిల్లల్లో ఒకరికి ఈ జబ్బు వస్తుందని వైద్యులు తెలిపారు. వెల్లూరు సీఎంసీలో చికిత్సకు రూ. 25 లక్షలు అవసరమని చెప్పారు. తిండి గడవడమే కష్టమైన పరిస్థితుల్లో అంత డబ్బు సమకూర్చడం సాధ్యం కాలేదు. ఎలాగోలా తిప్పలు పడి పాపకు తరచూ రక్తాన్ని ఎక్కిస్తూ కాపాడుకుంటూ వస్తున్నారు. కుమార్తె ఆరోగ్యంపై దిగులుతో గత ఏడాది కోటేశ్వరరావు చనిపోయాడు. దీంతో మహాలక్ష్మి మరింత దిగులు చెందింది. గ్రామంలో తెలిసిన వ్యక్తుల ద్వారా కలెక్టర్ దృష్టికి పాప విషయాన్ని కోటేశ్వరరావు కుటుంబం తీసుకువెళ్లింది. కలెక్టర్ ద్వారా సీఎం జగన్‌కు తెలిసింది. ఆయన వెంటనే ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. యువంకితకు ఆరోగ్య శ్రీ కింద ఈ ఏడాది ఫిబ్రవరి 28న హైదరాబాద్‌లో బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్స అందింది. ప్రస్తుతం పాప ఆరోగ్యంగా ఉంది. యువంకిత వైద్యానికి అయిన రూ.25 లక్షలు ప్రభుత్వమే చెల్లించింది. సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం నా కుమార్తెకు రెండేళ్ల క్రితం జబ్బు ఉన్నట్టు నిర్ధారణ అయింది. కొత్త రక్తం ఎక్కిస్తూ, ఆసుపత్రుల్లో వైద్యం చేయిస్తూ పాప ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వచ్చాం. గత ఏడాది పాప ఆరోగ్యంపై దిగులుతో నా భర్త కోటేశ్వరరావు గుండెపోటుతో చనిపోయారు. గ్రామంలో తెలిసిన వాళ్ల ద్వారా ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తే ఉచితంగా పాపకు చికిత్స చేశారు. భర్తను కోల్పోయా. కుమార్తెను కూడా కోల్పోతానేమోనని చాలా ఆందోళన చెందాను. అలాంటి పరిస్థితుల్లో పాపకు ఉచితంగా వైద్యం చేయించి, ప్రాణాలు నిలబెట్టిన సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం. – మహాలక్ష్మి, బాలిక తల్లి, లంకపల్లి -
AP: పల్లెకు ప్రాణనాడి
సాక్షి, అమరావతి: గ్రామాల్లో మంచానికే పరిమితమైన వృద్ధులు, దివ్యాంగులతోపాటు అనారోగ్య బాధితులకు 104 వాహనాల సంచార వైద్య సేవలు (ఎంఎంయూ) వరంగా మారాయి. అవస్థలు పడుతూ ఎటూ వెళ్లాల్సిన అవసరం లేకుండా వీటి ద్వారా సొంతూరిలోనే మెరుగైన వైద్య సేవలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. రక్తపోటు, మధుమేహం లాంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారికి, గర్భిణిలకు 104 సేవలు ఎంతో మేలు చేకూరుస్తున్నాయి. ప్రతి నెలా ఠంచన్‌గా ప్రతి గ్రామాన్ని 104 ఎంఎంయూలు సందర్శిస్తూ ప్రజలకు వైద్యం అందిస్తున్నాయి. గత సర్కారు హయాంలో మంచం పట్టిన ఈ వ్యవస్థకు జవసత్వాలు కల్పించి ప్రతి మండలానికి ఒక 104 చొప్పున మొత్తం 656 వాహనాలను సీఎం జగన్ ప్రభుత్వం గతేడాది జూలై 1 నుంచి అందుబాటులోకి తెచ్చింది. కర్నూలు జిల్లా పాండురంగాపురం గ్రామంలో వైద్యశిబిరం నిర్వహిస్తున్న దృశ్యం వైద్య సేవలు అందుతున్నాయి ఇలా ► 104 వాహనం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30 వరకు గ్రామంలోనే ఉంటుంది. 104 వైద్యుడితో పాటు సంబంధిత పీహెచ్సీ వైద్యుడు ఏఎన్ఎం, ఆశా వర్కర్ అక్కడే అందుబాటులో ఉంటారు. మధ్యాహ్నం వరకూ గ్రామ సచివాలయం వద్ద రోగులకు వైద్య సేవలు అందిస్తారు. అనంతరం నడవలేని వారు, మంచానికే పరిమితమైన వృద్ధులు, దివ్యాంగులు, ఇతర రోగులకు ఇళ్ల వద్దకే వెళ్లి డాక్టర్లు సేవలు అందచేస్తారు. ► 104లో ఉండే డేటా ఎంట్రీ ఆపరేటర్ ప్రతి రోగి వివరాలను ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డులో పొందుపరుస్తారు. ఆ వివరాలను టెలీమెడిసిన్, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు అనుసంధానించి భవిష్యత్‌లో తక్షణమే మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు చేపట్టారు. ► రోగికి మెరుగైన వైద్య సేవలు అవసరం అయితే దగ్గరలోని పీహెచ్సీ, సీహెచ్‌సీ, జిల్లా ఆసుపత్రులకు, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తారు. ► సంబంధిత రోగిని ఆసుపత్రికి తరలించే బాధ్యతను స్థానిక ఏఎన్ఎం నిర్వర్తిస్తుంది. ఏమిచ్చి రుణం తీర్చుకోను? పక్షవాతంతో బాధ పడుతున్న నాలాంటి వారికి 104 ప్రాణాలు నిలబెడుతోంది. ఆస్పత్రికి వెళ్లాలంటే ఎన్నో ప్రయాసలు పడేవాడిని. కుటుంబ సభ్యులు రావాల్సిందే. ఆటో అద్దెకు తీసుకుని ప్రతి వారం వెళ్లాల్సి వచ్చేది. ఎంత లేదన్నా కనీసం ఐదారు వందలు ఖర్చయ్యేవి. ఇప్పుడు ఆ సమస్యలన్నీ తొలిగాయి. 104 వైద్యురాలు డాక్టర్ జి. మానస సుప్రియ ఇంటికి వచ్చి మరీ వైద్య సేవలు అందిస్తున్నారు. ఎంత డబ్బిచ్చినా వైద్యులు ఇంటికి వచ్చి సేవలందించడం ఎక్కడో గానీ జరగదు. నాలాంటి వారికి అలాంటి సదుపాయాన్ని కల్పించిన ముఖ్యమంత్రి జగన్‌కు ఏమిచ్చినా రుణం తీరదు. – చీకట్ల సత్యనారాయణ, ద్రాక్షారామం, తూర్పు గోదావరి జిల్లా ఖర్చుల భారం తప్పింది ఐదేళ్లుగా మధుమేహం, రక్తపోటుతో బాధపడుతున్నా. వీటికి తోడు రెండేళ్ల క్రితం ఆయాసం తోడైంది. ప్రతి నెలా మూడో మంగళవారం మా ఊరికి 104 వాహనం వస్తోంది. పైసా ఖర్చు లేకుండా వైద్య పరీక్షలు చేసి మందులు ఇస్తున్నారు. అదే ఆసుపత్రికి వెళితే చార్జీలు, మందులు, ఇతర ఖర్చుల రూపంలో నెలకు రూ. 3 నుంచి రూ.5 వేలు ఖర్చయ్యేవి. – బాలమ్మగారి గోపాలురెడ్డి, అంగళ్లు గ్రామం చిత్తూరు జిల్లా నెలలో రెండుసార్లు నెలలో రెండు రోజులు 104 సంచార వైద్య సేవల వాహనం మా గ్రామానికి వస్తోంది. ఒక రోజు ముందే వలంటీర్లు మాకు సమాచారం ఇస్తున్నారు. షుగర్, బీపీ, పక్షవాతం, గుండె జబ్బులున్న వారిని డాక్టర్లు పరీక్షించి మందులు కూడా ఇంటి వద్దే అందిస్తున్నారు. వైద్యం కోసం పట్టణానికి వెళ్లాల్సిన పనిలేదు. –బసవసుబ్బారెడ్డి, పాండురంగాపురం, నంద్యాల మండలం, కర్నూలు జిల్లా కుటుంబమంతా 104 మందులే మా కుటుంబమంతా గ్రామానికి వచ్చిన 104 వాహనం వద్దకే వెళ్లి ఉచితంగా పరీక్షలు, మందులు తీసుకుంటోంది. మా మనవరాలు గర్భవతి కావడంతో బీపీ, హిమోగ్లోబిన్ లాంటి పరీక్షలు చేశారు. కాల్షియం, ఐరన్ మాత్రలను ఉచితంగా పంపిణీ చేశారు. నాకు కూడా షుగర్, బీపీ మాత్రలు ఇచ్చారు. థైరాయిడ్ సమస్య ఉన్నవారికి కూడా పరీక్షలు నిర్వహించి మందులు ఇస్తున్నారు. – జయన్న, బిళ్లలాపురం గ్రామం, నంద్యాల మండలం త్వరలో ఫ్యామిలీ డాక్టర్ విధానం రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలులోకి తీసురానుంది. అంతేకాకుండా ప్రతి గ్రామాన్ని 104 నెలలో రెండు సార్లు సందర్శించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే కొన్నిచోట్ల అమలులోకి తెచ్చాం. మండలంలోని రెండు పీహెచ్‌సీల్లో నలుగురు డాక్టర్లు ఉంటారు. 104లో కూడా ఒక వైద్యుడు ఉంటారు. వీరు ప్రతి గ్రామానికి వెళతారు. రెండు దఫాలు సందర్శించి వైద్యం అందించడం వల్ల వైద్యుడికి సంబంధిత కుటుంబాలపై పూర్తి అవగాహన ఏర్పడుతుంది. – వినయ్‌చంద్, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈవో తిరిగే అవస్థ తప్పింది గుంటూరు జిల్లా గారపాడుకు చెందిన 55 ఏళ్ల గోలి సూర్యనారాయణ 12 ఏళ్లుగా పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యాడు. షుగర్ బాధితుడు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలతో మందులు వాడితే కానీ నియంత్రణలో ఉండదు. వైద్య పరీక్షల కోసం పది కి.మీ దూరంలోని 75 తాళ్లూరు పీహెచ్సీ లేదా సత్తెనపల్లి వెళ్లడం దూరాభారమే. ప్రత్యేకంగా ఆటోలో వెళ్లి రావాలంటే జేబుకు చిల్లు పడుతోంది. ఇలాంటి వారందరికీ 104 సంచార వైద్యం వరంగా మారింది. ఇప్పుడు ప్రతి నెలా వైద్యుడు, సిబ్బంది సూర్యనారాయణ ఇంటికే వెళ్లి షుగర్, రక్తపోటు, ఇతర పరీక్షలు చేసి ఉచితంగా మందులు కూడా ఇస్తున్నారు. తక్షణ సేవలతో కోలుకుని... అస్వస్థతతో మంచం పట్టిన ఈ వృద్ధురాలి పేరు పతాడ చిన్నమ్మి. విజయనగరం జిల్లా పాచిపెంట మండలం పాంచాలి స్వగ్రామం. ఈ నెల 4న లో బీపీతో కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు ఆశావర్కర్, ఏఎన్ఎం సహాయంతో 104కి సమాచారం ఇచ్చారు. సేవల ఎగ్జిక్యూటివ్ ప్రశాంత్ ఆధ్వర్యంలో సిబ్బంది కాశీ, హరగోపాల్ గ్రామానికి చేరుకుని వృద్ధురాలికి చికిత్స అందించడంతో ఆరోగ్యం కుదుటపడింది. -
ఉద్యోగులకు మేలు.. సెలవు సిఫారసులు
సాక్షి, అమరావతి: పదకొండో వేతన సంఘం ఉద్యోగుల సెలవులు, వైద్య సౌకర్యాలపై కొన్ని సిఫారసులు చేసింది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఇతర రాష్ట్రాల్లో అందిస్తున్న వైద్య సేవలను ఈహెచ్ఎస్ పథకానికి కూడా వర్తింపజేయాలని సూచించింది. పిల్లలను దత్తత తీసుకున్న వారికి సైతం దత్తత సెలవులు 180 రోజులు ఉండాలని, చైల్డ్ కేర్ లీవ్స్ కూడా ఇదే స్థాయిలో ఉండాలని, ఇది ఒంటరి పురుష ఉద్యోగులకు కూడా అమలు చేయాలని సిఫారసు చేసింది. అంతేగాక ఈ విభాగంలో పితృత్వ సెలవులను సైతం సూచించింది. వికలాంగ ఉద్యోగులకు సైతం మేలు జరిగేలా మరికొన్ని సిఫారసులను నివేదికలో పొందుపరిచింది. ఈ సూచనలు మహిళా, వికలాంగ ఉద్యోగులకు మేలు చేసేవిగా ఉండడంతో కార్యదర్శుల కమిటీ ఓకే చెప్పింది. లీవ్ బెనిఫిట్స్:11వ పీఆర్సీ సిఫారసు ► బోధన రంగంలో ఉన్న బోధనేతర మహిళా ఉద్యోగులకు సైతం అదనంగా ఐదు సాధారణ సెలవులు ఉండాలి ► ఇద్దరు పిల్లలు ఉన్న మహిళా ఉద్యోగి ఏడాది లోపు వయసున్న పిల్లలను దత్తత తీసుకుంటే 180 రోజుల దత్తత సెలవులు ఇవ్వాలి, అలాగే ఒంటరి లేదా అవివాహిత పురుష ఉద్యోగులకు సైతం 15 రోజుల పితృత్వ సెలవులు కూడా ఉండాలి ► చైల్డ్ కేర్ లీవ్స్ 180 రోజులకు పెంచాలి, ఇదే నిబంధన ఒంటరి లేదా అవివాహిత పురుష ఉద్యోగులకు వర్తించాలి ► కృత్రిమ అవయవాల అవసరం ఉన్న ఆర్థోపెడిక్ వికలాంగ ఉద్యోగులకు ఏడాదికి ఏడు ప్రత్యేక సాధారణ సెలవులు. హైరిస్క్ వార్డులో పనిచేసే నర్సింగ్ ఉద్యోగులకు సైతం ఈ వర్తింపు ఉండాలి కార్యదర్శుల కమిటీ ప్రతిపాదనలు: మహిళలు, వికలాంగుల లీవ్ బెనిఫిట్స్‌కు కమిటీ ఆమోదం తెలిపింది మెడికల్ బెనిఫిట్స్: పీఆర్సీ సిఫారసు ► ఉద్యోగుల హెల్త్ స్కీమ్‌లో ఆర్థిక స్థిరత్వం కోసం ప్రభుత్వ సహకారం పెరగాలి, నెట్వర్క్ ఆస్పత్రుల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌కు ఆదనపు నిధులను విడుదల చేయాలి ► పెన్షన్ తీసుకునేవారు, వారి సహచరుల వార్షిక ఆరోగ్య పరీక్షల స్కీమ్‌ను పెంచాలి ► డా. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ట్రస్ట్ ద్వారా వివిధ రాష్ట్రాల్లో వైద్య సేవలు అందిస్తున్న ఆస్పత్రుల్లో ఈహెచ్ఎస్ సేవలు కూడా అందించేందుకు ఆయా ఆస్పత్రులతో చర్చించాలి ► సర్వీస్ పెన్షనర్ / ఫ్యామిలీ పెన్షనర్స్‌కు నెలకు రూ.500 మెడికల్ భృతి చెల్లించాలి కార్యదర్శుల కమిటీ: మెడికల్ బెనిఫిట్స్ సిఫారసులన్నింటినీ అంగీకరించింది ప్రత్యేక చెల్లింపులు: 11వ పే కమిషన్ సిఫారసు ► ప్రస్తుతమున్న ఉద్యోగుల్లో కొన్ని కేటగిరీలకు ప్రత్యేక చెల్లింపుల క్వాంటం/రేటు పెంపు, కొన్ని వర్గాల ఉద్యోగుల చెల్లింపులను నిలిపి వేయాలి కార్యదర్శుల కమిటీ సిఫారసు: ఉద్యోగులకు ప్రత్యేక వేతనాల మంజూరును సమీక్షించడానికి సీనియర్ సెక్రటరీలు, హెచ్ఆర్ నిపుణులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు కట్టుబడి ఉంది. నిర్దిష్టమైన ప్రత్యేక వేతనాల రేట్ల పెంపునకు సిఫార్సు, ప్రత్యేక చెల్లింపుల సమస్యను, దీనిపై ప్రస్తుత మార్గదర్శకాల పరిశీలనకు అంగీకారం ఇతర భత్యాలు: పే కమిషన్ సిఫారసులు ► పెట్రోల్ అలవెన్సులను కిలోమీటర్‌కు రూ.15.50కి పెంచాలి. పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలకు కి.మీకి రూ.11.50, డీజిల్ వాహనానికి రూ.6.50 ఇవ్వాలి ► రోజువారీ భత్యం, వసతి చార్జీలు 33 శాతం పెంపు. రాష్ట్రం లోపల పర్యటనలకు రోజుకు రూ. 300 నుంచి రూ. 600 వరకు, రాష్ట్రం వెలుపల పర్యటనలకు రూ.400 నుంచి రూ.800కు పెంచవచ్చు. రాష్ట్రం వెలుపల బస చేసినప్పుడు రోజువారీ లాడ్జింగ్ భత్యం రూ.1,700 చెల్లించాలి ► కోర్టు మాస్టర్స్, హైకోర్టు న్యాయమూర్తుల వ్యక్తిగత కార్యదర్శుల రవాణా చార్జీలు రూ.5 వేలకు పెంచాలి, ప్రయాణ భత్యాన్ని నెలకు రూ.1,700 కు పెంచాలి ► పిల్లల ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఏడాదికి రూ.2,500 పెంచాలి ► మరణించిన ఉద్యోగి అంత్యక్రియల చార్జీలను రూ.20 వేలకు పెంచాలి ► గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వారికి నెలకు చెల్లించే ప్రత్యేక పరిహార భత్యాన్ని ప్రస్తుతమున్న రూ.500 నుంచి రూ.1,275కు, రూ.700 నుంచి రూ.1800కు పెంచాలి ► యూనిఫారం అలవెన్సులు, రిస్క్ అలవెన్సులు గణనీయంగా పెంచాలి ► మెడికల్ విభాగంలో పనిచేసే ఉద్యోగులకు ఎమర్జెన్సీ హెల్త్ అలవెన్సు, రూరల్ మెడికల్ అలవెన్సులు, పీజీ డిగ్రీ అలవెన్సులు పెంచాలి ► విజువల్లీ చాలెంజ్డ్ ఉపాధ్యాయులు, లెక్చరర్ల రీడర్స్ అలవెన్సును 33 శాతం పెంచాలి ► ఏపీ భవన్లో పనిచేసే వారికి ఢిల్లీ అలవెన్సు కింద బేసిక్ పేలో 15 శాతం లేదా నెలకు రూ.5 వేలు చెల్లించాలి. ఏపీ భవన్లో పనిచేసే డ్రైవర్లకు స్పెషల్ అలవెన్సు కింద గంటకు రూ.30 చొప్పున గరిష్టంగా నెలకు 100 గంటలకు చెల్లించాలి ► ఫిజికల్లీ చాలెంజ్డ్ ఉద్యోగుల కన్వీనియన్స్ చెల్లింపుల కింద వారి బేసిక్ పేలో 10 శాతం పెంచాలి. ఇది రూ.2 వేలకు మించరాదు కార్యదర్శుల కమిటీ: పే కమిషన్ సిఫారసులు పూర్తిగా మహిళలు, వికలాంగ ఉద్యోగులకు మేలు జరిగేదిగా ఉంది కాబట్టి ఈ సిఫారసులను ఆమోదించవచ్చు సీఎం జగన్‌కి పీఆర్సీ నివేదిక అందజేసిన సీఎస్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి 11వ వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) నివేదికను అందజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ఆర్) శశిభూషణ్ కుమార్, ఆర్ధిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. -
చిన్నారి రెండు చెవులకూ ఇంప్లాంటేషన్
ఆరిలోవ (విశాఖ తూర్పు): రాష్ట్రంలోనే మొదటిసారిగా విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)లో ఓ చిన్నారి రెండు చెవులకు కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా గతంలో చిన్న పిల్లలకు ఒక చెవికి కాక్లియర్ ఇంప్లాంటేషన్ చేసేవారు. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా రెండు చెవులకూ కాక్లియర్ ఇంప్లాంటేషన్ చేయడానికి అవకాశం కల్పించారు. దీంతో ఆరోగ్యశ్రీ కింద మొదటిసారిగా ఈ తరహా ఆపరేషన్‌ను విమ్స్‌లో రెండున్నరేళ్ల ఓ చిన్నారికి విజయవంతంగా నిర్వహించారు. చిన్నారిని సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు వివరాలు వెల్లడించారు. విజయనగరం జిల్లా మక్కువ గ్రామానికి చెందిన రెండున్నరేళ్ల చిన్నారి భువనేశ్వరి పుట్టుకతో చెవిటి, మూగతనంతో బాధపడుతోంది. ఆమె తండ్రి శంకరరావు ఇటీవల విమ్స్‌లో ఈఎన్టీ వైద్యుడు బి.అన్నపూర్ణారావును కలిశారు. ఆయన పరీక్షలు నిర్వహించి, బాలికకు 100 శాతం వినికిడి సమస్య ఉన్నట్లు గుర్తించారు. బాలిక తల్లిదండ్రులకు పరిస్థితిని వివరించి, వారి అనుమతితో బాలిక రెండు చెవులకు కాక్లియర్ ఇంప్లాంటేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. దీనికి రూ.12 లక్షలు వరకు ఖర్చు అవుతుందని విమ్స్ డైరెక్టర్ తెలిపారు. ఇంత ఖరీదైన ఆపరేషన్‌ను పేద పిల్లలకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేసే అవకాశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కల్పించారన్నారు. ఇంతవరకు విమ్స్‌లో 10 మంది పిల్లలకు ఒక చెవికి కాక్లియర్ ఇంప్లాంటేషన్ చేసినట్లు తెలిపారు. బాలిక తల్లిదండ్రలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. -
ఆరోగ్యానికి ‘ఆసరా’!
సాక్షి, అమరావతి: పేద, మధ్య తరగతి కుటుంబాల్లో సంపాదించే వ్యక్తులు శస్త్ర చికిత్సలు చేయించుకుని విశ్రాంతి తీసుకునే సమయంలో ఆ కుటుంబాన్ని అనేక ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. రోజు గడవడం కూడా కష్టంగా మారుతుంది. ఈ పరిస్థితులను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్ జగన్ గుర్తించారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం కింద శస్త్ర చికిత్సలు చేయించుకున్న పేద, మధ్య తరగతి వ్యక్తులకు విశ్రాంతి సమయంలో అండగా నిలిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకాన్ని 2019 డిసెంబర్ 2న ప్రారంభించారు. పథకం కింద శస్త్ర చికిత్సల అనంతరం వైద్యులు సూచించే విశ్రాంతి సమయానికి రోజుకు రూ.225 లేదా నెలకు గరిష్టంగా 5వేలు ప్రభుత్వం సాయం చేస్తోంది. ఈ పథకం ప్రవేశపెట్టి నేటికి రెండేళ్లు అవుతోంది. 6.91 లక్షల మందికి ఆసరా పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచి గత నెల 25వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా శస్త్ర చికిత్సలు చేయించుకున్న 6,91,805 మందికి ప్రభుత్వం రూ.453.96 కోట్లు అందించింది. ఆర్థిక సంవత్సరాల వారీగా పరిశీలించినట్లయితే 2019–20లో 1,07,233 మందికి రూ.79.54 కోట్లు, 2020–21లో 2,77,567 మందికి రూ.194.47 కోట్లు, 2021–22లో 3,07,805 మందికి రూ.180.21 కోట్లు సాయం అందింది. సకాలంలో సాయం అందింది నా భర్త సురేష్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంటారు. మా రెండేళ్ల పాప గుండె సమస్యతో బాధపడుతుంది. ఆరోగ్యశ్రీ ద్వారా ఇటీవల విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేసి డిశ్చార్జ్ చేశారు. పాప విశ్రాంతి సమయానికి ఆసరా నగదు రూ.9,500 అందింది. మమ్మల్ని కుటుంబసభ్యుల్లా భావించి ఆరోగ్య మిత్రలు పనిచేశారు. ఉచితంగా ఆపరేషన్లు చేసి, ఆర్థిక సాయం చేయడం ఎంతో తోడ్పాటును అందిస్తోంది. లేదంటే పాపకు పౌష్టికాహారం, ఇతర సౌకర్యాల కోసం మేము అప్పు చేయాల్సి ఉండేది. – యర్రబోలు విశాల్, విశాఖపట్నం డిశ్చార్జి అయిన రోజునే సాయం ఈ పథకం కింద ఆపరేషన్లు చేయించుకున్న వారికి ప్రభుత్వం ఆరోగ్య ఆసరా కింద సాయం చేస్తోంది. శస్త్ర చికిత్సల అనంతరం వైద్యులు సూచించిన విశ్రాంతి సమయానికి ఆర్థిక సాయం చేస్తున్నాం. రోగి డిశ్చార్జి అయిన రోజునే బ్యాంక్ ఖాతాలో ఆసరా సాయం జమ చేస్తున్నాం. – వినయ్ చంద్, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కేర్ సీఈవో -
ఆరోగ్యశ్రీ ద్వారా కోవిడ్ చికిత్స ఏపీలోనే: సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : ‘ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ మహమ్మారిని మన కళ్లతో చూస్తున్నాం. కోవిడ్ వైద్యం వల్ల ప్రజలు నష్టపోకూడదని, ఇబ్బంది పడకూడదని ఏ రాష్ట్రం చేయని విధంగా ఈ వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చిన ఏకైక ప్రభుత్వం మనదే’ అని సీఎం జగన్ స్పష్టం చేశారు. గురువారం శాసనసభలో ఆరోగ్య రంగంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. కోవిడ్ అనంతరం బ్లాక్ ఫంగస్ లాంటి ఆరోగ్య సమస్యలు వస్తే కూడా అటువంటి రోగాలను ఆరోగ్య శ్రీలోకి చేర్చిన మనసున్న ప్రభుత్వమని చెప్పారు. వలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థలను పీహెచ్‌సీలతో అనుసంధానం చేసి.. టెస్టింగ్, ట్రేసింగ్.. ట్రీట్మెంట్ ద్వారా కోవిడ్‌పై ఏ రకంగా యుద్ధం చేశామో రాష్ట్రమంతా చూశారన్నారు. ఇంకా సీఎం ఏమన్నారంటే.. వలంటీర్లు, ఆశా వర్కర్లు, సచివాలయంలోని ఏఎన్ఎంలు ప్రతి ఇంటికీ వెళ్లి కోవిడ్ ఉందా? లేదా? అని అడిగి తెలుసుకోడానికి ఏకంగా 31 సార్లు సర్వే చేశారు. కోవిడ్ పరీక్షలు, ట్రీట్మెంట్లలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. నవంబర్ 23 నాటికి రాష్ట్రంలో మొత్తం 3.02 కోట్ల మందికి కోవిడ్ పరీక్షలు చేశాం. దేశం గర్వపడే విధంగా పరీక్షలు చేసిన అతి కొద్ది రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఒకటి. జాతీయ స్థాయిలో కోవిడ్ మరణాల రేటు 1.35 శాతం అయితే, మన రాష్ట్రంలో 0.70 శాతమే. కోవిడ్ వచ్చినా కూడా 99.3 శాతం మందిని మనం కాపాడుకోగలిగాం. కోవిడ్ టెస్టింగ్ ల్యాబ్ ఒక్కటి కూడా లేని పరిస్థితి నుంచి 19 ల్యాబ్‌లు 24 గంటలపాటు అందుబాటులో ఉన్నాయి. కోవిడ్ వైద్యం కోసం 20 నెలలుగా రూ.3,648 కోట్లు ఖర్చు చేశాం. ఎమర్జెన్సీలో ప్రాణాలు కాపాడే 108, 104 సేవలకు అర్థంచెప్తూ ఏకంగా 1,068 వాహనాలను సమకూర్చాం. రాష్ట్ర జనాభాలో మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 3,41,53,000. అంటే దాదాపు 87 శాతం మంది. 2 డోసులు తీసుకున్నవారు 2.39 కోట్ల మంది. అంటే దాదాపు 61 శాతం. కేంద్రం పంపిస్తున్న వ్యాక్సిన్ల షెడ్యూల్ ప్రకారం డిసెంబర్‌కి రాష్ట్రంలో 18 ఏళ్లకు పైబడిన వారికి 100 శాతం మందికి ఒకడోసు.. మార్చి నాటికి పూర్తిగా 2 డోసులు ఇస్తాం. కోవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ.10 లక్షలు డిపాజిట్ చేసి, వారి ఆలనా పాలనా చూసుకునే ఏర్పాటు చేసిన తొలి ప్రభుత్వం మనదే. -
ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షలకు పెంపు: సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘మనిషి ప్రాణానికి విలువ ఇచ్చే ప్రభుత్వం ఇది. ప్రతి ఒక్క ప్రాణాన్ని నిలబెట్టేందుకు.. వైద్యాన్ని పేద వారికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ రెండున్నరేళ్లలో మనసా, వాచా, కర్మణ చిత్తశుద్ధితో ప్రతి అడుగు విప్లవాత్మక మార్పులతో ముందుకేశాం’ అని సీఎం వైఎస్ జగన్ ఉద్ఘాటించారు. గురువారం శాసనసభలో ఆరోగ్య రంగంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. రెండున్నరేళ్ల క్రితం రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉన్నాయి? అన్నది బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి రెండున్నరేళ్ల క్రితం వర్తించే వార్షిక ఆదాయ పరిమితిని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏకంగా రూ.5 లక్షలకు పెంచామని చెప్పారు. దీనివల్ల రాష్ట్రంలో 90 శాతం మందికి ఆరోగ్యశ్రీ ద్వారా రక్షణ లభిస్తోందన్నారు. రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు పెద్దగా లేవన్న సంగతి తెలిసీ కూడా, గతంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆస్పత్రుల్లో చికిత్సకు అనుమతించే వారు కాదని చెప్పారు. ప్రస్తుతం పొరుగు రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీని వర్తింప చేస్తున్నామని, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 130 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఎక్కడైనా వైద్యం చేయించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఖర్చుకు వెరవక ముందుకు అడుగులు గతంలో ఆరోగ్యశ్రీని ఎలా కత్తిరించాలి.. అని చూసే వారు. క్యాన్సర్‌కు ఒకటి రెండు సార్లు మాత్రమే కీమోథెరపీ చేసే వారు. ఇప్పుడు రూ.2.5 లక్షలు, రూ.3 లక్షలు కాదు, ఏకంగా రూ.5 లక్షలు దాటినా వ్యాధి నయమయ్యే వరకు ఏడెనిమిది సార్లు కిమోథెరపీ ఇచ్చి ఆరోగ్యశ్రీ పరిధిలో చికిత్స అందిస్తున్నాం. రూ.10 లక్షలు ఖర్చయ్యే బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను చేయిస్తున్నాం. మూగ, చెముడు పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేయిస్తున్నాం. దీనికోసం రూ.12 లక్షలు ఖర్చు చేస్తున్నాం. రూ.11 లక్షల వ్యయమయ్యే హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్రచికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం. స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్.. 2 మోడల్స్ ఆపరేషన్లను ఆరోగ్య శ్రీ కిందకు తీసుకు వచ్చాం. ఒకదానికి రూ.6.3 లక్షలు, ఇంకోదానికి రూ.9.3 లక్షల ఖర్చు అవుతోంది. 29 నెలల్లో ఆరోగ్యశ్రీ పథకం కోసం రూ.4 వేల కోట్లు ఖర్చు చేశాం. గత ప్రభుత్వం నెట్వర్క్ ఆస్పత్రులకు బకాయిపడిన రూ.680 కోట్లను మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెల్లించాం. ఇప్పుడు.. 21 రోజులు దాటితే చాలు.. నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించే విధంగా దిశా నిర్దేశం చేస్తున్నా. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే చాలు.. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ అండగా ఉంటుంది. గతంలో 1,059 ప్రొసీజర్లు (వ్యాధులు) మాత్రమే ఉంటే.. ఇప్పుడు 2,446 ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీని విస్తరింపచేశాం. ఇంకా అవసరమైనవి చేర్చడానికి సిద్ధంగా ఉన్నాం. కొత్తగా 16 వైద్య కళాశాలల ఏర్పాటు ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలు కేవలం 11 మాత్రమే ఉన్నాయి. ఈ పరిస్థితిలో కొత్తగా 16 వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టాం. వీటికి అనుబంధంగా నర్సింగ్ కళాశాల, 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తున్నాం. గిరిజనుల కోసం పాడేరులో కొత్తగా ఒక వైద్య కళాశాల నిర్మాణాన్ని చేపట్టాం. ఐటీడీఏ ప్రాంతాల్లో మరో ఐదు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, 560 అర్బన్ హెల్త్‌క్లినిక్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం. 1,325 పీహెచ్‌సీలు, 52 ఏరియా ఆసుపత్రులు(ఏహెచ్), 191 కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల(సీహెచ్‌సీ) రూపు రేఖలను నాడు–నేడు ద్వారా మార్చేస్తున్నాం. సరిపడా వైద్యులు, వైద్య సిబ్బందిని నియమిస్తున్నాం. వీటన్నింటికీ రూ.16,250 కోట్లు ఖర్చు చేస్తున్నాం. డబ్ల్యూహెచ్ఓ, జీఎంపీ ప్రమాణాలు ఉన్న 67 రకాల మందులు అందుబాటులో ఉంటాయి. రెండున్నరేళ్లలో వైద్య శాఖలో 9,712 పోస్టులు భర్తీ చేశాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో 15 వేల మంది ఏఎన్ఎంలను నియమించాం. మరో 14,788 పోస్టులు ఫిబ్రవరిలోగా భర్తీ చేస్తున్నాం. మొత్తంగా ఒక్క వైద్య రంగంలోనే దాదాపు 40 వేల పోస్టులు భర్తీ చేస్తున్నాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో విప్లవాత్మక మార్పు తీసుకువస్తాం. హెల్త్ క్లినిక్‌లలో ఏఎన్ఎంలు, మిడ్‌లెవల్ హెల్త్ ప్రాక్టీషనర్లు(ఎంఎల్‌హెచ్‌పీ) ఉంటారు. ఆశా వర్కర్లు అక్కడే రిపోర్టు చేస్తారు. వీళ్లందరినీ పీహెచ్సీలలో ఉన్న డాక్టర్లతో అనుసంధానం చేస్తున్నాం. ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు, ప్రతి పీహెచ్‌సీకి ఒక 104 వాహనం ఉంటుంది. ఒక డాక్టర్ పీహెచ్సీలో, మరో డాక్టర్ 104లో తనకు కేటాయించిన నాలుగు, ఐదు గ్రామాలలో తిరుగుతాడు. ఇవన్నీ 6 నెలల్లో కార్యాచరణలోకి వస్తాయి. ఇందుకోసం 104 వాహనాలను మరో 432 కొనుగోలు చేస్తున్నాం. వైఎస్సార్ ఆరోగ్య ఆసరాతో దన్ను వైఎస్సార్ ఆరోగ్యశ్రీ విషయంలో మరో విప్లవాత్మక మార్పు.. ఆరోగ్య ఆసరా. ఆపరేషన్ చేశాక.. ఆ పేషెంట్ ఎన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ నిర్ణయిస్తే.. అన్ని రోజులు ఆ పేషెంట్ బయటకు వెళ్లి పనిచేసే పరిస్థితి ఉండదు. ఆ సమయంలో వారు ఇబ్బంది పడకుండా రోజుకు రూ.220 చొప్పున లేదా గరిష్టంగా నెలకు రూ.5 వేలు ఇస్తూ తోడుగా నిలబడుతున్నాం. లెప్రసీతో బాధపడుతున్న వారికి రూ.3 వేలు, పెరాలసిస్ రోగులకు రూ.5 వేలు, డయాలసిస్ చేసుకుంటున్న వారికి రూ.10 వేల వరకు పింఛన్ ఇచ్చే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పటికే 66 లక్షల మంది స్కూలు పిల్లలకు పూర్తిగా కంటి పరీక్షలు చేశాం. 1.58 లక్షల మంది పిల్లలకు కంటి అద్దాలు ఇచ్చాం. 300 మంది పిల్లలకు శస్త్ర చికిత్సలు చేయించాం. 14.28 లక్షల మంది అవ్వాతాతలకూ కంటి పరీక్షలు చేశాం. 7.83 లక్షల మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశాం. 1.13 లక్షల మందికి శస్త్ర చికిత్సలు చేయించాం. ఇది నిరంతర ప్రక్రియ. 56.88 లక్షల మంది అవ్వాతాతలకు కంటి వెలుగు ద్వారా దన్నుగా నిలుస్తాం. పిల్లల హార్ట్ కేర్‌కు సంబంధించిన ఆస్పత్రి మన దగ్గర లేదని, హైదరాబాద్‌లో ఉన్న నీలోఫర్ ఆస్పత్రి లాంటిది మనకూ కావాలని తిరుపతిలో ఇటీవల పద్మావతి చైల్డ్ హార్ట్ సెంటర్‌ను ప్రారంభించాం. రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో పిల్లల కోసం ప్రత్యేకంగా మూడు పీడియాట్రిక్, హార్ట్‌కు సంబంధించిన ఆసుపత్రులు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ప్రైవేట్ రంగంలోనూ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నాం. రూ.100 కోట్లు పైబడి పెట్టుబడితో ఆస్పత్రులు పెట్టే వారికి భూములు ఉచితంగా ఇస్తామని చెప్పాం. వీటిలో 50 శాతం బెడ్లు ఆరోగ్యశ్రీ పరిధిలో పేదలకు అందుబాటులోకి వస్తాయి. కొన్ని నెలల్లో ఇవి మనకు కనిపిస్తాయి. రాష్ట్ర చరిత్రలో ఇదివరకెన్నడూ లేని విధంగా వైద్య ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. దాదాపు 40 వేల పోస్టులు ఈ ఒక్క రంగంలోనే భర్తీ చేస్తుండటం మనందరి ప్రభుత్వ నిబద్ధత. రూ.16,250 కోట్లు ఖర్చు చేస్తూ ఆస్పత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుంటం ఒక చరిత్ర. ఎంత ఖర్చు అయినా పరవాలేదు.. ఒక మనిషిని కాపాడాలనే తాపత్రయమున్న ప్రభుత్వం ఇది. ఈ దృష్ట్యా సూపర్ స్పెషాలిటీ సేవల కోసం పొరుగు రాష్ట్రాల్లోని 130 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తున్నాం. -
పొరుగు రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీ సేవలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: మనిషి ప్రాణానికి విలువనిచ్చే ప్రభుత్వం తమదని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఆరో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశంలో భాగంగా సీఎం జగన్ ఆరోగ్య అంశంపై ప్రసంగించారు. వైద్యాన్ని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చామని ఆయన చెప్పారు. గతంలో ఆస్పత్రులు ఎలా ఉన్నాయి.. ఇప్పుడు ఎలా ఉన్నాయి? అనే విషయాన్ని గమనించాలని తెలిపారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో అనేక మార్పులు చేశామని అన్నారు. ఆదాయ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచామని తెలిపారు. రాష్ట్రంలో 90 శాతం మందికి ఆరోగ్యశ్రీ సేవలు అందించామని పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందింస్తున్నామని చెప్పారు. ఇతర రాష్టాల్లో 130 సూపర్ స్పెషాలిటీల్లో ఆరోగ్యశ్రీ వర్తింపచేశామని సీఎం పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీపై ఎన్నో మెలికలు పెట్టిందని తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిధిలో రూ.10 లక్షల ఆపరేషన్‌ను కూడా తీసుకొచ్చామని తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిధిలో గుండె మార్పిడి బైకాక్లియర్, స్టెమ్ సెల్స్ చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. 29 నెలలుగా ఆరోగ్యశ్రీపై రూ. 4 వేల కోట్లు ఖర్చు చేశామని, గత ప్రభుత్వ బకాయిలు రూ. 600 కోట్లు చెల్లించామని సీఎం జగన్ చెప్పారు. 21 రోజుల్లో నెట్వర్క్ ఆస్సత్రులకు బిల్లుల చెల్లిస్తున్నామని తెలిపారు. వైద్యం ఖర్చు వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు వైద్యం ఖర్చు వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపును తీసుకొచ్చామని, ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పరిధిలో 2,446 చికిత్స అందించామని సీఎం పేర్కొన్నారు. గతంతో పోలిస్తే చికిత్పలు రెట్టింపు చేశామని వివరించారు. ఇంకా అవసరమైనవి కూడా కొత్తగా చేరుస్తామని అన్నారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని పట్టించుకోలేదని సీఎం తెలిపారు. ప్రతీ పార్లమెంట్ పరిధిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి.. సూపర్ స్పెషాలిటీ సేవలు అందించనున్నామని తెలిపారు. గిరిజన ప్రాంతంలో కొత్తగా టీచింగ్ ఆస్పత్రి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఐటీడీఏ ప్రాంతాల్లో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. గ్రామస్థాయి నుంచి సమూల మార్పులు తీసుకొస్తున్నాని తెలిపారు. నాడు-నేడు ద్వారా ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తున్నామని, రూ.16,255 కోట్లలో ఆస్పత్రుల్లో నాడు-నేడు అమలు చేస్తున్నామని తెలిపారు. ఆరోగ్య శాఖలో 9712 పోస్టులు భర్తీ చేశామని, 14788 పోస్టులు వచ్చే ఫిబ్రవరిలోగా భర్తీ చేస్తామని తెలిపారు.10,032 వైఎస్సార్ విలేజ్ క్లీనిక్స్ ఏర్పాటు చేశామని, గ్రామస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను తీసుకువస్తున్నామని తెలిపారు. వచ్చే 6 నెలల్లో వైద్య సంస్కరణలు అమల్లోకి వస్తాయిని సీఎం జగన్ వివరించారు. కోవిడ్ వైద్యాన్ని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చాం వైఎస్సార్ కంటివెలుగు ద్వారా 66 లక్షల పిల్లలకు పరీక్షలు చేశామని, 3 ప్రాంతాల్లో కొత్తగా చైల్డ్ కేర్ ఆస్పత్రులను నిర్మిస్తామని తెలిపారు. కోవిడ్ వైద్యాన్ని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చామని సీఎం పేర్కొన్నారు. కోవిడ్ అనంతర సమస్యలకు కూడా ఆరోగ్య శ్రీ చికిత్స అందిస్తున్నామని, ఏపీలో కోవిడ్ మరణాల రేటు 0.70 మాత్రమే ఉందని సీఎం జగన్ చెప్పారు. రాష్ట్రంలో కోవిడ్ వచ్చిన 99.3 శాతం మందిని కాపాడుకున్నామని తెలిపారు. కోవిడ్ పరీక్షల కోసం 19 ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయని సీఎం చెప్పారు. జనాభాలో 87 శాతం మందికి ఒక డోసు వ్యాక్సిన్ అందించినట్లు తెలిపారు. కరోనాతో తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు రూ. 10 లక్షలు ఇస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. -
Andhra Pradesh: ఆస్పత్రులకు ఆహ్వానం
కోవిడ్ నేర్పిన పాఠాలు అన్నీ ఇన్నీ కావు. ప్రధానంగా వైద్య రంగం ఆవశ్యకతను, ఆధునిక వైద్య సేవల అవసరాన్ని ఈ మహమ్మారి నొక్కి చెప్పింది. కోవిడ్ తీవ్రతను ముందుగానే ఊహించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ పరంపరలో ప్రభుత్వ ఆస్పత్రులను నాడు–నేడు ద్వారా మెరుగు పరచడంతో పాటు.. ముందు చూపుతో ప్రైవేట్ రంగంలోనూ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు చేయూతనిస్తోంది. ఇలా ఏర్పాటయ్యే ఆస్పత్రుల్లో సగానికి సగం బెడ్లు పేదలకు అందుబాటులో ఉండేలా వడివడిగా అడుగులు వేస్తోంది. సాక్షి, అమరావతి: వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరమే లేకుండా, స్థానికంగానే అత్యుత్తమ వైద్యం అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా 13 చోట్ల మల్టీ/సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసింది. తొలి దశలో 13 పట్టణాల్లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్లను కోరుతూ ఏపీఐఐసీ టెండర్లను ఆహ్వానించింది. శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి నగరాల నడిబొడ్డున ఆస్పత్రుల నిర్మాణానికి ఏపీఐఐసి ఉచితంగా భూమిని ఇవ్వనుంది. ఇప్పటికే అవసరమైన మేరకు స్థలాలను సేకరించింది. రాష్ట్ర విభజన తర్వాత సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు అత్యధిక శాతం హైదరాబాద్‌కే పరిమితం కావడంతో కోవిడ్ సమయంలో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వీటి నిర్మాణం చేపట్టినట్లు ఏపీఐఐసీ టెండర్లలో పేర్కొంది. ఇందుకోసం ఆయా నగరాల్లో ఎకరం నుంచి 5 ఎకరాల వరకు భూమిని సేకరించింది. ఆస్పత్రి నిర్మాణం, దాని నిర్వహణ.. బిడ్ దక్కించుకున్న సంస్థే నిర్వహించాల్సి ఉంటుంది. ఆసక్తి గల సంస్థలు ఒక చోట లేదా వివిధ నగరాల్లో ఆస్పత్రులు నిర్మించడానికి బిడ్లను దాఖలు చేసుకునే అవకాశం కల్పించింది. నవంబర్ 6న మొదలైన బిడ్ల స్వీకరణ నవంబర్ 25 మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతుంది. దాఖలైన బిడ్లను పరిశీలించి డిసెంబర్ 15న బిడ్డర్లను ఎంపిక చేస్తారు. బిడ్డింగ్‌లో ఎంపికైన సంస్థ రెండేళ్లలో ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది. అధిక పెట్టుబడి పెట్టేవారికి ప్రాధాన్యత ► అత్యధికంగా ప్రత్యేక వైద్య సేవలు, అధిక పడకలు అందుబాటులోకి వచ్చే విధంగా బిడ్డింగ్‌లో నిబంధనలను పొందుపర్చినట్లు ఏపీఐఐసీ చీఫ్ ఇంజనీర్ సీహెచ్ఎస్ శ్రీనివాస్ ప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు. ప్రతి చోట కనీసం రూ.100 కోట్ల పెట్టుబడి, కనీసం 100 పడకల ఆస్పత్రిని నిర్మించాల్సి ఉంటుంది. ► అయితే బిడ్డింగ్ ఎంపికలో అధిక పెట్టుబడితో అధిక పడకలు నిర్మించడానికి ముందుకు వచ్చే సంస్థలకే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రతి ఆస్పత్రిలో కనీసం రెండు స్పెషాలిటీ ట్రీట్మెంట్లను కలిగి ఉండాలి. ఈ స్పెషాలిటీ ట్రీట్మెంట్ల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే ఎంపికలో వాటికి అంత ప్రాధాన్యత ఉంటుంది. ► క్యాన్సర్, గుండె, కిడ్నీ, ఊపిరితిత్తులు, బోన్ మారో వంటి చికిత్సలు అందించే వాటికి ఎంపికలో ప్రాధాన్యత అధికంగా ఉండేలా నిబంధనలు రూపొందించారు. ఆరోగ్యశ్రీకి 50 శాతం పడకలు ► కొత్తగా నిర్మించే ఈ ఆస్పత్రుల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి తప్పనిసరిగా 50% పడకలను కేటాయించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆయా నగరాల్లో 2020లో వివిధ రోగాలకు చికిత్స తీసుకున్న వారి వివరాలను బిడ్‌లో పొందుపర్చారు. తద్వారా బిడ్డింగ్ దాఖలు చేసే సంస్థలు స్పెషాలిటీ చికిత్సలను ఎంపిక చేసుకోవడానికి సులభతరమవుతుంది. ► వైఎస్సార్ ఆరోగ్య శ్రీకి ఎన్ని పడకలు అధికంగా కేటాయిస్తే బిడ్ ఎంపికలో అంత ప్రాధాన్యత పెరుగుతుంది. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స చేసే వైద్యులు కూడా ఆయా నగరాల్లోనే నివసించాలన్న నిబంధన కూడా విధించారు. ఈ 13 ఆస్పత్రుల నిర్మాణం ద్వారా కనీసం రూ.2,500 కోట్ల పెట్టుబడులు 2,000 అదనపు పడకలు అందుబాటులోకి వస్తాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. -
నీతి ఆయోగ్ నివేదిక: మిడిల్ క్లాస్‌కూ ఏపీలో ఆరోగ్య భద్రత
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ రాష్ట్రంలో 95 శాతం కుటుంబాలకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీతో ఉచితంగా వైద్య చికిత్సలను అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే విశిష్ట గుర్తింపు సాధించింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక సంస్కరణలతో తీసుకువచ్చిన ‘వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’ పథకం ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యరక్ష కల్పిస్తోందని కేంద్ర ప్రభుత్వ నివేదికలో వెల్లడైంది. నాడు – నేడు ద్వారా పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ప్రభుత్వాస్పత్రులను తీర్చిదిద్దడంతోపాటు వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ ద్వారా గ్రామస్థాయి నుంచి రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర చరిత్రలోనే భారీ ఎత్తున వైద్య సిబ్బంది నియామకాలను ప్రభుత్వం చేపట్టింది. ఏపీలో అందరికీ ఆరోగ్య భరోసా దేశంలో మధ్య తరగతి వర్గాలకు ఆరోగ్యబీమా దక్కడం లేదని ‘హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ ఇండియాస్ మిస్సింగ్ మిడిల్ క్లాస్’ పేరుతో రూపొందించిన తాజా నివేదికలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ వెల్లడించింది. అయితే అందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం మధ్య తరగతి వర్గాలను కూడా ఆరోగ్య బీమా రక్షణ ఛత్రం కాపాడుతోందని ఆ నివేదికలో వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మధ్య తరగతి వర్గాలకు పూర్తి ఆరోగ్య బీమా రక్షణ కల్పిస్తున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ అగ్రశ్రేణిలో నిలవడం గమనార్హం. దూరదృష్టితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం పరిధిని విస్తరించి మధ్యతరగతి వర్గాలకు కూడా ప్రయోజనం చేకూర్చడంతోనే ఇది సాధ్యపడిందన్నది సుస్పష్టం. దేశంలో మిస్సింగ్ ‘మిడిల్’... దేశంలో 30 శాతం మంది ఉన్న మధ్యతరగతి వర్గాలకు ఆరోగ్య బీమా అందని ద్రాక్షగానే ఉందని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. సమాజంలో దారిద్రరేఖకు దిగువన ఉన్న 50 శాతం మంది ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత ఆరోగ్య బీమా పథకాలను అమలు పరుస్తున్నాయి. ధనిక వర్గాలకు చెందిన 20 శాతం మంది ప్రైవేట్ కంపెనీల ఆరోగ్య బీమా పాలసీలను తీసుకుంటున్నారు. మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత ఆరోగ్య బీమా కల్పించకపోవడం, ఇటు ప్రైవేట్ కంపెనీలు అత్యధిక ప్రీమియంతో అందించే ఆరోగ్య బీమా పాలసీలను కొనుగోలు చేయలేక అనారోగ్యం బారినపడితే దేవుడిపైనే భారం వేస్తున్నారు. రక్షణ కవచంలా.. మధ్య తరగతి ప్రజలకు కూడా ఆరోగ్య బీమా కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రక్షణ కవచంలా నిలుస్తోందని నీతి ఆయోగ్ నివేదిక ప్రశంసించింది. నివేదిక ప్రకారం మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్యబీమా కల్పిస్తున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ అగ్రశ్రేణిలో నిలిచింది. కర్ణాటక ముందు వరుసలో ఉంది. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ లాంటి రాష్ట్రాలు కూడా మధ్యతరగతి వర్గాలకు ఆరోగ్య భద్రత కల్పించలేకపోతున్నాయని నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది. ఆరోగ్యశ్రీలోకి 95 % కుటుంబాలు రాష్ట్ర ప్రజలకు ఉచితంగా ఆరోగ్య బీమా కల్పించేందుకు ముఖ్యమంత్రి జగన్ వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టారు. మొదట వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరించారు. అప్పటివరకు తెల్లరేషన్ కార్డు ఉన్న కుటుంబాలకే ఆరోగ్యశ్రీ పథకం వర్తించేది. ఏడాదికి రూ.2 లక్షల లోపు ఆదాయం ఉన్న కుటుంబాలకే ఈ పథకం కింద ప్రయోజనం కలిగేది. అయితే తెల్లరేషన్ కార్డుతో నిమిత్తం లేకుండా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. వార్షిక ఆదాయం రూ.5 లక్షలు వరకు ఉన్న కుటుంబాలను సైతం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తేవడంతో రాష్ట్ర ప్రజలకు గరిష్టంగా లబ్ధి చేకూరుతోంది. రాష్ట్రంలో దాదాపు 95 శాతం కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకంతో ప్రయోజనం దక్కుతోంది. పేదలతోపాటు మధ్యతరగతి వర్గాలకు సంపూర్ణంగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంతో భరోసా లభించింది. స్వయం ఉపాధిపై ఆధారపడ్డవారు, అసంఘటిత రంగ కార్మికులు, చిరు వ్యాపారులు, ప్రైవేట్ ఉద్యోగులు... ఇలా అందరికీ ఉచితంగా వైద్య బీమా కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ దేశంలోనే గుర్తింపు సాధించింది. మరింత మెరుగ్గా పథకం విస్తరణ... ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో దాదాపు అన్ని రకాల వ్యాధులను వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి చేర్చారు. 2019 వరకు 1,059 చికిత్సలకే పథకం కింద ఉచితంగా వైద్య సాయం అందుతుండగా ఇప్పుడు 2,436 చికిత్సలను ఆరోగ్యశ్రీలోకి చేర్చారు. చికిత్స వ్యయం రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకురావడంతో పేద, మధ్యతరగతి వర్గాలకు ఎంతో ఊరట లభిస్తోంది. అత్యధిక వ్యయం అయ్యే కాక్లియర్ ఇంప్లాంటేషన్, వివిధ రకాల క్యాన్సర్ వ్యాధులను కూడా ఈ పథకం పరిధిలోకి చేర్చారు. కరోనాను ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి చేర్చిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం గమనార్హం. బ్లాక్ ఫంగస్‌ను కూడా ఆరోగ్యశ్రీలోకి చేర్చి బాధితులకు సాంత్వన కలిగించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు 92 శాతం ప్రైవేట్ ఆసుపత్రులు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద లబ్ధిదారులకు ఉచితంగా వైద్య సాయం అందిస్తున్నాయి. రాష్ట్రంలోనే కాకుండా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లో కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్సలను వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేశారు. ఆ ఏడు రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలో ప్రధానంగా ఏడు రాష్ట్రాల్లో మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్య బీమా వర్తించడం లేదని, అందులో తెలంగాణ రాష్ట్రం ఒకటని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. తెలంగాణలో దారిద్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు మాత్రమే ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నారు. తెలంగాణలో 30 శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా లేదని నీతిఅయోగ్ నివేదిక వెల్లడిస్తోంది. కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.5 లక్షలు లోపు ఉన్నవారికే పథకం వరిస్తుంది. ఇక పథకం కింద అందించే చికిత్స గరిష్ట పరిమితి రూ.1.5 లక్షలు మాత్రమే. 949 రకాల చికిత్సలను నిర్దేశించిన ప్యాకేజీ ప్రకారం అందిస్తారు. స్వయం ఉపాధిపై ఆధారపడ్డ వారు, అసంఘటిత రంగం, వలస కార్మికులు తదితరులకు ఎలాంటి బీమా పథకాలు లేవు. దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తితే ఆ కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి. ఆ రాష్ట్రాలివే... ఆరోగ్య బీమా పథకాలు మధ్యతరగతి ప్రజలకు అందడం లేదని నీతి ఆయోగ్ ప్రస్తావించిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణతో పాటు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ, హిమాచల్‌ప్రదేశ్ ఉన్నాయి. అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్‌లో కూడా పూర్తి స్థాయిలో ఆరోగ్య బీమా పథకాలు అమలు కావడం లేదని నీతి ఆయోగ్ వెల్లడించింది. -
13 ఏళ్ల బాలికకు పునర్జన్మ
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): గ్రహణంమొర్రి, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ జీవించే అవకాశం ప్రమాదంలో పడ్డ 13 ఏళ్ల బాలికకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీతో పునర్జన్మ లభించింది. వివరాల్లోకెళ్తే.. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పరిధి కొత్తపాలెం నివాసితులు సిద్దాబత్తుల పురుషోత్తం, కుమారి నిరుపేదలు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. వీరిలో చివరి సంతానం.. కృప. 2008లో జన్మించిన కృప గ్రహణంమొర్రి, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడింది. నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ విశాఖ వస్తున్నారని తెలుసుకుని పాప తల్లిదండ్రులు ఆయనను కలిశారు. వైఎస్సార్ పాపకు వెంటనే ఆపరేషన్ చేయించాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు గ్రహణంమొర్రికి ఆపరేషన్ చేయించారు. గుండెకు మాత్రం పాప ఎదిగిన తర్వాతే ఆపరేషన్ చేయడం వీలవుతుందని వైద్యులు తెలిపారు. 2009లో వైఎస్సార్ కన్నుమూయడంతో తర్వాత వచ్చిన పాలకులు చిన్నారిని పట్టించుకోలేదు. కృప ఎదిగే కొద్దీ గుండె సమస్యతోపాటు కిడ్నీ సమస్య కూడా వెంటాడింది. దీంతో తరచూ తీవ్ర అనారోగ్యానికి గురవుతుండేది. వైఎస్సార్, జగన్‌లకు రుణపడి ఉంటాం.. నాడు పెద్దాయన వైఎస్ రాజశేఖరరెడ్డి మమ్మల్ని ఆదుకోకపోతే మా పాప జీవించి ఉండేది కాదు. ఎక్కడున్నా ఆ మహానుభావుడికి వేల వేల కృతజ్ఞతలు. ఇతర రాష్ట్రాల్లో సైతం ఆరోగ్యశ్రీని వర్తింపజేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటాం. –పురుషోత్తం సిద్దాబత్తుల (చిన్నారి కృప తండ్రి) ‘సాక్షి’ చొరవతో.. ఈ ఏడాది జూన్ 23న కృప తీవ్ర అనారోగ్యానికి గురవడంతో విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పాపకు గుండె, కిడ్నీ సమస్యలు తీవ్రమైనట్టు తెలిపారు. వీటికి హైదరాబాద్ లేదా చెన్నైలో మాత్రమే చికిత్స ఉందని, చాలా ఖర్చుతో కూడుకుందని చెప్పారు. బతికే అవకాశాలు కూడా తక్కువేనని చెప్పడంతో తల్లిదండ్రులు బావురుమన్నారు. ఇక చేసేది లేక కృప తండ్రి పురుషోత్తం తనకు తెలిసిన వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా సహాయాన్ని అర్థించడం ప్రారంభించారు. అదే సమయంలో ఆయన మెసేజ్‌ను చూసిన సాక్షి విలేకరి విజయ్‌కుమార్ వెంటనే పాప అనారోగ్య విషయాన్ని ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ రాజేష్‌కు తెలియజేశారు. బెంగళూరు నుంచి తల్లిదండ్రులతో కలిసి ఇటీవల నగరానికి చేరుకున్న కృప ఆయన కృపకు బెంగళూరులో ఆపరేషన్ చేసే వీలుందని తెలుసుకుని.. అక్కడి ఆరోగ్యశ్రీ కో–ఆర్డినేటర్ ఉషతో మాట్లాడారు. ఆమె సూచన మేరకు కృపను బెంగళూరు వైదేహి ఆస్పత్రిలో చేర్చారు. సెప్టెంబర్ 8న కార్డియాలజిస్ట్ డాక్టర్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో వైద్యుల బృందం పాపకు గుండె ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. పాపకు ఆరోగ్యం కుదుటపడటంతో సెప్టెంబర్ 24న డిశ్చార్జ్ చేశారు. ఇప్పుడే గుండె ఆపరేషన్ చేయడంతో కొంతకాలం ఆగాక కిడ్నీ సమస్యకు కూడా ఉచితంగా ఆపరేషన్ చేస్తానన్నారని కృప తల్లిదండ్రులు చెప్పారు. ఆపరేషన్ మొత్తం ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చేయడంతో వారు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీని ఇతర రాష్ట్రాల్లోనూ వర్తింపచేయడం గ్రేట్ ఇది చాలా క్లిష్టమైన ఆపరేషన్. చాలా ఖర్చుతో కూడుకున్న చికిత్స. ఇలాంటి ఆపరేషన్‌ల్లో సగం మాత్రమే విజయావకాశాలు ఉంటాయి. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం చాలా బాగుంది. సీఎం వైఎస్ జగన్ ఈ పథకాన్ని ఇతర రాష్ట్రాల్లో చికిత్స చేయించుకున్నవారికి కూడా వర్తింపజేయడం గ్రేట్. గతేడాది మా ఆస్పత్రిలో చిత్తూరు జిల్లాకు చెందిన ఎం.ఆనంద్‌కు ఆరోగ్యశ్రీ పథకం కింద గుండెమార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా చేశాం. దీనికి ఏపీ ప్రభుత్వం రూ.11 లక్షలు విడుదల చేసింది. – డాక్టర్ దుర్గాప్రసాద్, కార్డియాలజిస్ట్, వైదేహి ఆస్పత్రి, బెంగళూరు -
Aarogyasri: ఆరోగ్యశ్రీ.. ఓ ‘మేలు’ పర్వతం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధి లోకి రాష్ట్ర ప్రభుత్వం అనేక కొత్త చికిత్సలు తీసుకురావడంతో ఎంతోమందికి లబ్ధిచేకూరుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు కేవలం 1,059 రకాల చికిత్సలు మాత్రమే అందుబాటులో ఉండేవి. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఇప్పుడా సంఖ్య 2,436కి చేరింది. అంతేకాక.. వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకూ ఉన్న వారిని కూడా పథకం పరిధిలోకి చేర్చడంతోపాటు బిల్లు రూ.వెయ్యి దాటితే వాటినీ ఆరోగ్యశ్రీలోకి తీసుకువచ్చారు. దీంతో ఇప్పటివరకు 1,96,491 మంది లబ్ధిపొందారు. అలాగే, గతంలో 1,059 చికిత్సలు మాత్రమే అందుబాటులో ఉన్నప్పుడు ఏదైనా కొత్త సమస్య వస్తే బాధితులు తమ చేతి నుంచి పెట్టుకోవాల్సి వచ్చేంది. ఇప్పుడా పరిస్థితి నుంచి పూర్తిగా విముక్తి లభించింది. రూ.430.11 కోట్లు వ్యయం ఇక ఆరోగ్యశ్రీ పథకంలోకి కొత్తగా చేర్చిన చికిత్సల కోసం 2020 జనవరి నుంచి 2021 అక్టోబర్ 9 వరకు రూ.430.11 కోట్లు వ్యయమైంది. అంటే.. ఒక్కో పేషెంటుకు రాష్ట్ర ప్రభుత్వం సగటున రూ.21,889 ఖర్చు చేసింది. అంతేకాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న నెట్వర్క్ ఆస్పత్రుల సంఖ్య కూడా భారీగా పెంచారు. ఇతర రాష్ట్రాల్లో 129 నెట్వర్క్ ఆస్పత్రులు మరోవైపు.. గతంలో రాష్ట్రం దాటి చికిత్సకు వెళ్తే సొంత డబ్బులతో చికిత్స చేయించుకోవాల్సి వచ్చేది. ఇప్పుడలాంటి పరిస్థితికి స్వస్తి చెప్పారు. పొరుగునున్న మూడు రాష్ట్రాల్లో 129 ఆస్పత్రులను జాబితాలో చేర్చారు. ఇందులో 81 తెలంగాణలో, 33 కర్ణాటకలోనూ, 15 తమిళనాడులోనూ ఉన్నాయి. పెద్దపెద్ద జబ్బులు వచ్చి, మన రాష్ట్రంలో చికిత్సకు అవకాశంలేకపోతే ఇతర రాష్ట్రాలకూ వెళ్లి చేయించుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఇలా ఇప్పటివరకూ 29,185 మందికి అనుమతులిచ్చారు. ఇందుకు రూ.74.68 కోట్లు ఖర్చయింది. 6 లక్షల మందికి ఆసరా ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స చేయించుకుని కోలుకునే సమయంలో కుటుంబ పోషణ నిమిత్తం బాధితుడికి సర్కారు ‘ఆరోగ్య ఆసరా’తో అండగా నిలుస్తోంది. దీని ద్వారా సుమారు 6 లక్షల మంది లబ్ధిపొందారు. ఇందుకోసం రూ.349 కోట్లను సర్కారు చెల్లించింది. అలాగే, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కదలలేని స్థితిలో ఉన్న 57,331 మంది రోగులకు నెలనెలా రూ.35 కోట్ల మేర పెన్షన్ ఇస్తున్నారు. ఇందుకోసం 12 జబ్బులను గుర్తించారు. -
ఆంధ్రప్రదేశ్: పంట నష్టం అంచనాలకు ప్రత్యేక ఫీచర్
సాక్షి, అమరావతి: ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయే ప్రతీ రైతన్నను ఆదుకోవాలన్న సంకల్పంతో పంట నష్టం అంచనాలను పక్కాగా తేల్చేందుకు ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఈ– క్రాప్‌తో సహా ఇతర సేవల కోసం ఇటీవల వినియోగంలోకి తెచ్చిన వైఎస్సార్ రైతు భరోసా యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్‌ఫాం (ఆర్బీ– యూడీపీ) యాప్‌లో అదనంగా విపత్తు నిర్వహణ సేవ(డిజాస్టర్) పేరిట ప్రత్యేక ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ – క్రాప్‌తో అనుసంధానించిన ఈ యాప్ ద్వారా పంట నష్టం అంచనాలు రూపొందించడం ద్వారా పరిహారం చెల్లింపుల్లో మరింత పారదర్శకత రానుంది. జాప్యం లేకుండా శరవేగంగా ‘గులాబ్’ తుపాన్ ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 1,62,721 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 8,637 ఎకరాల్లో ఉద్యాన పంటలు ముంపునకు గురైనట్లు ప్రాథమికంగా గుర్తించారు. సాధ్యమైనంత త్వరగా తుది అంచనాలను లెక్క తేల్చి సీజన్ ముగిసేలోగా పంటలు దెబ్బతిన్న ప్రతీ రైతుకు పరిహారం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు పంట నష్టం అంచనాలను మదింపు చేస్తున్నాయి. గతంలో నిర్దేశిత ఫార్మాట్లో పంట నష్టం వివరాలను నమోదు చేసి ఫొటోలు తీసుకునే వారు. ఆ వివరాలను మదింపు చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించే వారు. అయితే ఈ విధానం వల్ల పంటనష్టం అంచనాలు రూపొందించడం, పరిహారం చెల్లింపుల్లో పెద్ద ఎత్తున అవకతవకలు చోటుచేసుకునేవి. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ ఆర్బీ యూడీపీ యాప్‌లో ప్రత్యేకంగా తెచ్చిన డిజాస్టర్ ఫీచర్ ద్వారా జియో కోఆర్డినేట్స్‌తో సహా పంట నష్టం అంచనాలు పక్కాగా లెక్కతేల్చే అవకాశం ఏర్పడింది. జియో కో ఆర్డినేట్స్‌తో సహా వివరాలు నమోదు ఆర్బీ యూడీపీ యాప్‌లో డిజాస్టర్ ఐకాన్‌ను క్లిక్ చేసి పంట దెబ్బతిన్న రైతు ఆధార్ నంబర్ నమోదు చేస్తే చాలు. ఈ – క్రాప్‌తో అనుసంధానించడం వల్ల రైతు ఎన్ని ఎకరాల్లో ఏ పంట వేశారు? ఎంత దిగుబడి వస్తుందని అంచనా వేశారు? తదితర వివరాలన్నీ చూడవచ్చు. అవన్నీ సరైనవిగా నిర్ధారించుకున్న తర్వాత డిజాస్టర్ బాక్స్‌లో పంట నష్టం తీవ్రతను బట్టి పూర్తిగా లేదా పాక్షికం అని పేర్కొనాలి. దెబ్బతిన్న పంట విస్తీర్ణం వివరాలతో పాటు ఎలాంటి వైపరీత్యం (వరద/ కరువు/ భూమికోత) వల్ల జరిగిందో నమోదు చేయాలి. ఆ తర్వాత నష్ట తీవ్రతను బట్టి ముంపు/నేలకొరగడం/ఇసుక మేటలు వేయడం లాంటి వివరాలను పొందుపర్చిన తర్వాత ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేయగానే జియో కో ఆర్డినేట్స్‌తో సహా పంట నష్టం వివరాలను ఆటోమేటిక్‌గా నమోదు చేస్తుంది. సీజన్ ముగిసేలోగా పరిహారం ‘వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న రైతులకు పరిహారం చెల్లింపులో మరింత పారదర్శకత తెచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు యాప్‌లో ప్రత్యేక ఫీచర్లు అందుబాటులోకి తెచ్చాం. ఆర్బీ యూడీపీ యాప్‌లో కొత్తగా తీసుకొచ్చిన విపత్తు నిర్వహణ సేవ (డిజాస్టర్) ఫీచర్ ద్వారా గులాబ్ తుపాన్ వల్ల జరిగిన పంట నష్టం తుది అంచనాలను ప్రత్యేక బృందాలు రూపొందిస్తున్నాయి. సీజన్ ముగిసేలోగా నష్టపోయిన ప్రతీ రైతుకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటాం’ – కురసాల కన్నబాబు, వ్యవసాయశాఖ మంత్రి బోగస్, బినామీలకు ఆస్కారం లేని రీతిలో.. చివరగా నష్టపోయిన రైతుతో పాటు పరిశీలనలో గుర్తించిన అంశాలపై ఆర్బీకేలో పనిచేస్తున్న గ్రామ వ్యవసాయ సహాయకులు (వీఏఏ) తమ అభిప్రాయాలను ఆడియో రికార్డ్ ద్వారా అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తారు. పంట వేయగానే పంట వివరాలను ఆర్బీ యూడీపీ యాప్ ద్వారా ఈ క్రాప్‌తో నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. డిజాస్టర్ ఫీచర్‌తో వివరాలను అనుసంధానించడం వల్ల బోగస్ లేదా బినామీ పేర్లు నమోదు చేసే అవకాశం ఉండదు. అంతేకాదు దెబ్బతిన్న పంటల ఫొటోలు, వీడియోలు జియో కో ఆర్డినేట్స్‌తో సహా నమోదు చేస్తుండడం ద్వారా ఇష్టమొచ్చినట్లు నష్ట తీవ్రత నమోదు చేసే అవకాశం ఉండదు. యాప్ ద్వారా పంట నష్టం వివరాలను నమోదు చేస్తుండడం వల్ల భవిష్యత్‌లో తుపాన్లు, వరదలు లాంటి వైపరీత్యాల వేళ పంట కోల్పోయే వాస్తవ సాగుదార్లకు మాత్రమే పెట్టుబడి రాయితీ అందే అవకాశం ఉంటుందని వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్‌కుమార్ తెలిపారు. గులాబ్ తుపాన్ వల్ల జరిగిన పంట నష్టం అంచనాలు అక్టోబర్ 15 కల్లా కొలిక్కి వస్తాయని, ఆ వెంటనే ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని చెప్పారు. -
ఆరోగ్యశ్రీ ద్వారా అరుదైన క్యాన్సర్ నుంచి విముక్తి
గుంటూరు (మెడికల్): రెండోసారి క్యాన్సర్ బారినపడిన యువకుడికి అత్యంత అరుదైన శస్త్రచికిత్స చేసి ఆ వ్యాధి నుంచి విముక్తి కల్పించారు గుంటూరు వైద్యులు. రూ.3 లక్షల ఖర్చయ్యే ఈ శస్త్ర చికిత్సను వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో అందించారు. మంగళవారం గుంటూరు ఒమెగా హాస్పిటల్లో సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎంజీ నాగకిషోర్ ఈ వివరాలు వెల్లడించారు. స్థానిక మంగళదాస్ నగర్‌కు చెందిన మొహమ్మద్ నజీర్ అనే 18 ఏళ్ల యువకుడికి నాలుగేళ్ల క్రితం ఛాతి పక్కటెముకలకు ‘ఈవింగ్స్ సర్కోమా’ అనే క్యాన్సర్ సోకింది. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో సుమారు రూ.6 లక్షలు వెచ్చించి సర్జరీ చేయించుకున్నాడు. ఇటీవల ఆ యువకుడికి ట్యూమర్ ఏర్పడి క్యాన్సర్ తిరగబెట్టింది. యువకుడి తండ్రి మొహమ్మద్ బాజీ గుంటూరు ఒమెగా ఆస్పత్రికి అతడిని తీసుకెళ్లగా.. పరీక్షలు చేసి ఛాతి నుంచి గుండెకు వెళ్లే మార్గంలో భారీ గడ్డ ఉన్నట్టు నిర్ధారించారు. మూడు నెలలపాటు మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ స్నేహ కీమోథెరఫీ చేసినప్పటికీ గడ్డ కొద్దిగా మాత్రమే తగ్గింది. ఊపిరితిత్తుల్లో ఉన్న ట్యూమర్‌ను (గడ్డను) వెంటనే తొలగించకపోతే ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని నిర్ధారించి ఈ నెల 17న నాలుగున్నర గంటల సేపు శ్రమించి అత్యంత క్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా చేశారు. డాక్టర్ నాగకిషోర్ నేతృత్వంలో కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ మారుతి ప్రసాద్, డాక్టర్ సుమన్, మత్తు డాక్టర్ శౌరయ్య, డాక్టర్ విద్యాసాగర్ ఈ శస్త్ర చికిత్సలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నిరకాల క్యాన్సర్లకు ఉచితంగా చికిత్స అందించేందుకు ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చారన్నారు. దీంతో ఆ యువకుడికి చికిత్సను పూర్తి ఉచితంగా చేశామని డాక్టర్ నాగకిషోర్ తెలిపారు. -
Andhra Pradesh: ఆరోగ్యశ్రీకి పెద్దపీట
ప్రభుత్వాస్పత్రుల్లో అత్యుత్తమ నిర్వహణా పద్ధతులను అనుసరించాలి. ఆరోగ్యం బాగోలేకపోయిన వారంతా ప్రభుత్వాస్పత్రులకు వెళ్లే పరిస్థితి ఉండాలి. ఆస్పత్రుల నిర్వహణలో పర్యవేక్షణ స్థాయి బలంగా ఉండాలి. సిబ్బంది సెలవులో ఉన్నందున సేవలకు అంతరాయం రాకూడదు. నిర్ణీత రోజులకు మించి సెలవులో ఉంటే, వెంటనే చర్యలు తీసుకోవాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లలో ఏర్పాటు చేయబోయే హెల్త్ హబ్స్‌లో ఆరోగ్య శ్రీకి 50% కంటే ఎక్కువ బెడ్లను కేటాయించే ఆస్పత్రులకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. హెల్త్ హబ్స్ ద్వారా ఏర్పాటయ్యే ఆస్పత్రుల్లో కనీసం 50 శాతం బెడ్లను ఆరోగ్య శ్రీ రోగులకు ఇవ్వాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో హెల్త్ హబ్స్, ఆస్పత్రుల నిర్వహణ, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, కోవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌పై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హెల్త్ హబ్స్ ఏర్పాటు విధివిధానాల గురించి అధికారులు సీఎంకు వివరించారు. ఏయే జిల్లాల్లో ఏ తరహా ప్రత్యేక వైద్య చికిత్సలు అవసరమో గణాంకాలు అందజేశారు. ఏ తరహా వైద్యం కోసం రోగులు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారనే వివరాలనూ అందజేశారు. వివిధ వైద్య సంస్థలు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో అనుసరిస్తున్న నిర్వహణ విధానాలను వివరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. హెల్త్ హబ్స్ ద్వారా వచ్చే ఆస్పత్రుల బోర్డుల్లో ప్రభుత్వం నుంచి ఒక సభ్యుడు ఉంటారని తెలిపారు. మన రాష్ట్రానికి చెందిన డాక్టర్లు కూడా ఇక్కడే స్థిరపడి, మంచి వైద్య సేవలు అందించాలనే ఉద్దేశం హెల్త్ హబ్స్ ద్వారా నెరవేరుతుందని పేర్కొన్నారు. డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉండాలన్నది ఆస్పత్రుల ఎంపికకు ఒక ప్రామాణికం కావాలని స్పష్టం చేశారు. అవయవ మార్పిడి చికిత్సలు చేసే ఆస్పత్రుల ఏర్పాటుపై హెల్త్ హబ్స్‌లో ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. లాభాపేక్ష లేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తున్న సంస్థలకూ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆరోగ్య బీమా కంపెనీలు చెల్లిస్తున్న చార్జీలతో పోలిస్తే ఆరోగ్యశ్రీ కింద చెల్లిస్తున్న చార్జీలు మెరుగ్గా ఉన్నాయని చెప్పారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆస్పత్రుల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ ► ఆస్పత్రుల నిర్వహణలో భాగంగా బిల్డింగ్ సర్వీసులు, ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసులు, బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ సేవల నిర్వహణకు ప్రత్యేక అధికారులను నియమించాలి. సీహెచ్‌సీల నుంచి బోధనాస్పత్రుల వరకూ నిర్వహణ కోసం ప్రత్యేక అధికారులను నియమించాలి. ► కొత్తగా నిర్మిస్తున్న ఆస్పత్రులు, బోధనాస్పత్రుల నిర్మాణాలు ఉత్తమ నిర్వహణా పద్ధతులకు అనుగుణంగా ఉండాలి. వీటి డిజైన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆస్పత్రుల్లో బెడ్ల నిర్వహణ, బాత్రూమ్ల నిర్వహణ, పరిశుభ్రత, ఆహారంలో నాణ్యత చాలా ముఖ్యం. ► రిసెప్షన్ సేవలు కూడా కీలకం. సరిపడా వైద్యులు, పైన పేర్కొన్న సేవలు నాణ్యతతో అందితే.. కార్పొరేట్ ఆస్పత్రుల స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా సేవలు అందుతాయి. ► జనాభాను దృష్టిలో ఉంచుకుని 104లను వినియోగించాలి. విలేజ్ క్లినిక్స్ విధివిధానాలను, ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్)లను ఖరారు చేయాలి. పీహెచ్సీలో కనీసం ఇద్దరు డాక్టర్లను ఉంచాలి. ఒక డాక్టరు పీహెచ్సీలో సేవలు అందిస్తుండగా, మరో డాక్టరు 104 ద్వారా ఫ్యామిలీ డాక్టర్ విధానంలో సేవలు అందించేలా చూడాలి. కొత్త పీహెచ్‌సీల నిర్మాణాలు వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. ► ప్రతి గ్రామ సచివాలయంలో కనీసం నెలకు 2 సార్లు 104 ద్వారా వైద్యుల సేవలు ఉండేలా విధివిధానాలు రూపొందించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. నవంబర్ 15 నుంచి 258 మండలాల్లో, జనవరి 26 నుంచి రాష్ట్రం అంతటా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు చేయనున్నామని చెప్పారు. ► ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి ► మొత్తం యాక్టివ్ కేసులు : 14,652 ► పాజిటివిటీ రేటు శాతం : 2.23 ► రికవరీ రేటు శాతం : 98.60 ► ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు : 2,699 ► కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్న వారు : 854 ► నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందిస్తున్న బెడ్ల శాతం : 91.66 ► ప్రైవైట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందిస్తున్న బెడ్ల శాతం : 71.04 ► 104 కాల్ సెంటర్‌కు వచ్చిన ఇన్కమింగ్ కాల్స్ : 753 ► ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వేలు : 21 ► జీరో కేసులు నమోదైన సచివాలయాలు : 10,541 ► పాజిటివిటీ రేటు 3 శాతం కంటే తక్కువగా నమోదైన జిల్లాలు : 9 థర్డ్ వేవ్ సన్నద్ధత ► అందుబాటులో ఉన్న ఆక్సిజన్ డీ టైప్ సిలెండర్లు : 27,311 ► అందుబాటులో ఉన్న ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు : 20,964 ► ఇంకా రావాల్సినవి : 2,493 ► 50 కంటే ఎక్కువ బెడ్స్ ఉన్న 140 ఆస్పత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్ఏ) ప్లాంట్ల ఏర్పాటు. ► అక్టోబరు 11 నాటికి 140 ఆస్పత్రుల్లో అందుబాటులోకి పీఎస్ఏ ప్లాంట్లు వ్యాక్సినేషన్ ► సింగిల్ డోసు వ్యాక్సినేషన్ పూర్తయిన వారు : 1,33,30,206 ► రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిన వారు : 1,08,54,556 ► సింగిల్, డబుల్ డోసులు పూర్తయిన వారు : 2,41,84,762 ► వ్యాక్సినేషన్ కోసం వినియోగించిన మొత్తం డోసులు : 3,50,39,318 -
విషజ్వరాలూ ఆరోగ్యశ్రీలోకి..
సాక్షి, విశాఖపట్నం: సీజనల్ వ్యాధులైన డెంగీ, మలేరియాతో పాటు విషజ్వర పీడితులకు కూడా ఆరోగ్యశ్రీలో వైద్యం అందించనున్నట్లు ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. విశాఖ జిల్లాలో సీజనల్ వ్యాధులపై వైద్యాధికారులు, వైద్యులతో మంగళవారం ఆయన ఇక్కడ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. (చదవండి: ఉపాధ్యాయుడికి దేహశుద్ధి) రాష్ట్రవ్యాప్తంగా విశాఖ జిల్లాలోనే అత్యధిక మలేరియా, డెంగీ కేసులు నమోదయ్యాయన్నారు. విశాఖ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 462 డెంగీ, 708 మలేరియా, 24 చికున్‌గున్యా కేసులు నమోదయ్యాయని తెలిపారు. లోతట్టు, నీటి నిల్వలున్న ప్రాంతాలు, దోమల లార్వా నిల్వ ప్రాంతాల్లో ప్రతిరోజూ శానిటైజేషన్ చేయడమే కాకుండా వైద్య శిబిరాలు నిర్వహించేలా జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేశామని మంత్రి నాని చెప్పారు. అలాగే, ఐటీడీఏ పరిధిలోని పీహెచ్సీ, సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో వైద్యులు, వైద్య పరికరాలు, పరీక్షలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. హాట్‌స్పాట్ ప్రాంతాల గుర్తింపు విషజ్వరాలు, డెంగీ, మలేరియాతో పాటు సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్న ప్రాంతాలను ‘హాట్ స్పాట్’ ప్రాంతాలుగా గుర్తించి.. అక్కడే వైద్య సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆళ్ల నాని వెల్లడించారు. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాలతో పాటు అర్బన్ ప్రాంతాల్లో డెంగీ ప్రబలుతున్న ప్రాంతాల్లో నిరంతరంగా ఫాగింగ్, స్ప్రే చేయిస్తున్నామని, ఏజెన్సీలో దోమ తెరలు పంపిణీ ప్రక్రియను వేగవంతంగా చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ప్రజలు కూడా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని.. పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. (చదవండి: Bigg Boss 5 Telugu: జనాలను పిచ్చోళ్లను చేసిన లోబో, సిరి) -
ఆరోగ్యసేవల అనుసంధానం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆరోగ్యశాఖలో సమగ్ర ఆరోగ్య వ్యవస్థ (ఇంటిగ్రేటెడ్ హెల్త్ సిస్టం) రూపుదిద్దుకుంటోంది. వైద్యసేవల్ని అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల రోగికి సంబంధించిన సమాచారం పక్కాగా ఒకే చోట లభిస్తుంది. తద్వారా రోగులకు మెరుగైన వైద్యసేవలు అందుతాయి. తొలిదశలో ఈనెలాఖరు నాటికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 104 సర్వీసులను అనుసంధానం చేయనున్నారు. ఈ మూడు సర్వీసుల్లో ఎక్కడకు వెళ్లినా రోగి పూర్తి సమాచారం ఉంటుంది. 104 వాహనాల్లో రక్తనమూనాలు పరిశీలించిన వివరాలు సైతం దీన్లో నమోదు చేస్తారు. ఉదాహరణకు 104 వాహనంలో సేవలు పొందాక ఆరోగ్యశ్రీ ద్వారా ఆస్పత్రిలో చికిత్స పొందాల్సి ఉంటుంది. అప్పుడు రోగికి ఇచ్చిన ప్రత్యేక కోడ్‌ను క్లిక్ చేయగానే, నెట్వర్క్ ఆస్పత్రిలో సైతం గతంలో బీపీ ఉందా, షుగర్ ఉందా, ఏ తేదీల్లో చూపించుకున్నారు.. ఇలా మొత్తం సమాచారం వెల్లడవుతుంది. ప్రస్తుతం దేశంలో మొట్టమొదటిసారి మన రాష్ట్రంలోనే ఈ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. 1,149 పీహెచ్‌సీలు, 104 వాహనాలు 676 ప్రస్తుతం రాష్ట్రంలో 1,149 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. 104 వాహనాలు 676 సేవలందిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ పరిధిలో 800కు పైగా నెట్వర్క్ ఆస్పత్రులున్నాయి. ఈ మూడు సర్వీసులను కలిపి రోగుల డేటాను ఒకే వేదికపై ఉంచుతారు. ఇప్పటికే క్యూ ఆర్ కోడ్‌తో కూడిన ఆరోగ్యశ్రీ కార్డులో గానీ, లేదా ప్రత్యేక కోడ్ నంబరు ఇవ్వడం ద్వారా గానీ సమాచారం తెలుసుకోవచ్చు. వాహనంలో చికిత్సలు పొందినా, పీహెచ్సీలో వైద్యం పొందినా.. ఈరెండూ కాకుండా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు వెళ్లినా రోగి గతంలో తీసుకున్న చికిత్సల వివరాలన్నీ వస్తాయి. దీనివల్ల రోగి పూర్వాపరాలు తెలుసుకోవడంతో పాటు తక్షణమే చికిత్స చేయడానికి వీలుంటుంది. బ్లడ్‌గ్రూపు వివరాలు కూడా ఉంటాయి కాబట్టి అత్యవసర సమయాల్లో ఆలస్యం జరగకుండా ఉంటుంది. ఈ మూడు సర్వీసులను అనుసంధానించే ప్రక్రియను ఈనెలాఖరు నాటికి పూర్తి చేయాలని కుటుంబ సంక్షేమశాఖ భావిస్తోంది. తర్వాత మిగిలినవన్నీ.. ఈ మూడు సర్వీసులు అనుసంధానం అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10,051 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, 195 సామాజిక ఆరోగ్య కేంద్రాలను వీటికి లింక్ చేస్తారు. తరువాత ఏరియా ఆస్పత్రుల వరకు అనుసంధానం చేస్తారు. దీంతో రాష్ట్రంలో ఒక పేషెంటు ఏ ఆస్పత్రికి వెళ్లినా అతడి సమస్త సమాచారం ఒక కోడ్ నంబరు క్లిక్ చేస్తే వస్తుంది. ఇలా సమాచారం అందుబాటులో ఉండటం వల్ల రోగికి తక్షణమే వైద్యం అందించడంతో పాటు సరైన వైద్యం అందించే వెసులుబాటు ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. త్వరలో ఇంటిగ్రేటెడ్ సేవలు ఈనెలాఖరుకల్లా ఆరోగ్యశ్రీ, పీహెచ్‌సీలు, 104 సర్వీసుల అనుసంధాన ప్రక్రియ పూర్తవుతుంది. క్రమంగా మిగతా ఆస్పత్రులనూ ఒకే గొడుగు కిందకు తెస్తాం. దీనివల్ల రోగులకు ఉపయోగమే కాదు, వైద్యులకు కూడా చికిత్సలు సులభతరమవుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే చికిత్స అనంతరం ఇంటివద్దకే వెళ్లి మందులు అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా సేవలను ఉన్నతీకరిస్తున్నాం. – కాటమనేని భాస్కర్,కమిషనర్, కుటుంబ సంక్షేమశాఖ -
సొంత ఊరికి ఎక్కడి నుంచైనా వైద్య సేవలు
సాక్షి, అమరావతి : పక్క రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల్లో ఉండి సొంత ఊరు, సాంత రాష్ట్ర ప్రజలకు సేవలను అందించాలనుకునే వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వం చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది. తక్కువ బ్యాండ్ విడ్త్ ఉన్నా, వీడియోకాన్ఫరెన్స్ ద్వారా వైద్యులతో కన్సల్టెన్సీ సేవలను అందించే విధంగా ప్రత్యేక యాప్‌ను ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (ఏపీటీఎస్) అభివృద్ధి చేసింది. ఒక్కసారి ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే ఇంటర్నెట్ వేగంగా తక్కువగా ఉన్నా వీడియో కాన్ఫరెన్స్ ఎంపిక చేసుకున్న డాక్టర్‌తో వైద్య సేవలను, ఈ ప్రిస్కిప్షన్‌ను పొందవచ్చని ఏపీటీఎస్ మేనేజింగ్ డైరెక్టర్ నందకిషోర్ ‘సాక్షి’కి వివరించారు. యాప్ వినియోగించడం తెలియని వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో నిర్మిస్తున్న విలేజ్ క్లినిక్‌లకు అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. వైద్య సేవలను అవసరమైన వారు అక్కడి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్య సేవలు పొందవచ్చన్నారు. ఇందుకోసం ఆర్ఎక్స్ టెలికేర్ సంస్థతో ఏపీటీఎస్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ ఒప్పందం చేసుకుందని చెప్పారు. ఏపీటీఎస్ అభివృద్ధి చేసిన యాప్‌ను కోవిడ్–19 సమయంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేయగా, సత్ఫలితాలు ఇచ్చిందన్నారు. త్వరలోనే ఈ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా యాప్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఉచితంగా వైద్య సేవలు ఇలా.. ► కార్పొరేట్ సామాజికసేవా కార్యక్రమంలో భాగంగా ఆర్ఎక్స్ టెలికేర్ సంస్థ ఉచితంగా వైద్య సేవలను అందించడానికి ముందుకు వచ్చింది. ఇప్పటికే అమెరికా వంటి పలు దేశాల్లో వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎక్స్ టెలీకేర్‌లో 200 మందికి పైగా డాక్టర్లు ఉన్నారు. ► ఒక్కసారి యాప్‌లో పేరు నమోదు చేసుకొని, కాల్ చేస్తే రోగి సమాచారం మొత్తం తీసుకుని.. ఏ విభాగానికి చెందిన డాక్టర్‌ను సంప్రదించాలో నిర్ణయించి అపాయింట్మెంట్ ఇస్తారు. ఆ సమయంలో ఇంటి వద్ద నుంచి కానీ, విలేజ్ క్లినిక్‌లోని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ నేరుగా డాక్టర్‌తో మాట్లాడొచ్చు. ► రోగిని పరిశీలించిన తర్వాత చికిత్సకు సంబంధించిన ఈ–ప్రిస్క్రిప్షన్‌ను ఆన్లైన్లో అందిస్తారు. ఈ–ప్రిస్క్రిప్షన్‌ను అన్ని మందుల షాపులు అనుమతిస్తాయి. ఒకేసారి రోగి బంధువులతో కలిసి గ్రూప్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం, అప్పటికప్పుడు రోగి దద్దుర్లు, గాయాలు, ఇన్ఫెక్షన్ వంటి లక్షణాలను ఫొటోలు తీసి భద్రపరుచుకునే వెసులుబాటు ఉంది. ► రోగి నుంచి సేకరించే సమాచారం అంతా పూర్తి భద్రత ఉంటుంది. ఈ సమాచారాన్ని డేటా ఎన్స్క్రిప్షన్ చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో పూర్తి రక్షణ ఉండే క్లౌడ్ స్టోరేజ్‌లో ఉంచుతారు. సమాచారాన్ని డేటా ఎనలిటిక్స్ ద్వారా విశ్లేషించి రోగ లక్షణాలను ముందుగానే గుర్తించడం, ఫాలో అప్ ట్రీట్మెంట్, వారసత్వంగా వచ్చే వ్యాధులను నియంత్రించడం వంటి సౌకర్యాలు ఈ యాప్‌లో ఉంటాయి. -
ప్రసవానంతరం తల్లీబిడ్డలు సురక్షితంగా ఇంటికి..
సాక్షి, అమరావతి: గర్భిణులకు ఉచిత వైద్యసదుపాయం కల్పించడమేగాక ప్రసవానంతరం తల్లీబిడ్డలను సురక్షితంగా ఇంటి వద్దకు పంపించే సేవలను కూడా ప్రభుత్వం సమర్థంగా నిర్వర్తిస్తోంది. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవమయ్యే మహిళల్లో ఎక్కువమంది ఇంటికి వెళ్లేందుకు ప్రభుత్వ రవాణాను ఉపయోగించుకున్నారు. 2020–21 సంవత్సరంలో 2,20,731 మంది బాలింతలు అంటే మొత్తం డెలివరీల్లో 77.83 శాతం మంది తల్లీబిడ్డలు ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లేందుకు ప్రభుత్వ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నట్లు తాజా గణాంకాల్లో వెల్లడైంది. ప్రతి ఆస్పత్రిలోను బాలింతను డిశ్చార్జి చేసే సమయానికి వైద్యులే వాహనాలను సిద్ధం చేసి తల్లీబిడ్డలను సురక్షితంగా ఇంటికి చేరుస్తున్నారు. ప్రసవానంతరం ప్రభుత్వం ఇచ్చే పోషకాహారాన్ని 2.66 లక్షల మంది బాలింతలు వినియోగించుకున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో గర్భిణులుగా నమోదు చేసుకుని ఉచిత వైద్యపరీక్షలు, రక్తపరీక్షలు చేయించుకున్న వారు 2,67,069 మంది ఉన్నారు. ప్రసవానికి వెళ్లేందుకు ఉచిత రవాణా అంటే 108 వాహనాలను 48.45 శాతం మందే ఉపయోగించుకున్నారు. దీన్ని మరింతగా పెంచాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. పురిటినొప్పుల సమయంలో 108కు కాల్చేస్తే 15 నిమిషాల్లోనే ఇంటిదగ్గరకు వస్తుందని, ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవం అయ్యే మహిళలకు సంబంధించిన వివరాలను ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు పంపించాలని ట్రస్ట్ సీఈవో అన్ని ఆస్పత్రులకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ప్రసవాలకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని కూడా ఆయన ఆ లేఖలో స్పష్టం చేశారు. -
ఆరోగ్యశ్రీ ఆల్‌టైమ్ రికార్డ్
సాక్షి, అమరావతి: దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2007లో పేదల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పింది. గడిచిన రెండేళ్లలో ఈ పథకం కనీవినీ ఎరుగని రీతిలో పేదలకు అండగా నిలిచింది. 2007లో పథకం ప్రారంభించినప్పటి నుంచి 2021 జూన్ వరకూ 34.84 లక్షల మంది బాధితులు ఈ పథకం ద్వారా లబ్ధిపొందగా.. అందులో సుమారు 34% లబ్ధిదారులు ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలోనే లబ్ధిపొందారంటే అతిశయోక్తి కాదు. రెండేళ్లలో 11.79 లక్షల మందికి.. 2019లో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రెండేళ్లలో ఆరోగ్యశ్రీ పథకంలో పెనుమార్పులు తీసుకువచ్చారు. – అప్పటివరకు 1,059గా ఉన్న చికిత్సల సంఖ్యను 2,436కు పెంచారు. – సూపర్‌స్పెషాలిటీ వైద్యానికి ఇతర రాష్ట్రాల్లోని ఆస్పత్రులకూ అనుమతులిచ్చారు. – వెయ్యి రూపాయలు బిల్లు దాటితే ఆ జబ్బుకు ఆరోగ్యశ్రీలో చికిత్స చేసేలా అవకాశం కల్పించారు. దీంతో గడిచిన 25 నెలల్లోనే 11.79 లక్షల మంది బాధితులు ఈ పథకం ద్వారా లబ్ధిపొందారు. – విచిత్రమేమిటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏడేళ్ల పాటు లబ్ధిపొందిన వారికంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో లబ్ధిపొందిన వారే ఎక్కువ. – కరోనా చికిత్సను పథకం పరిధిలోకి తేవడం, కోవిడ్ కారణంగా వచ్చే బ్లాక్‌ఫంగస్, మిస్–సి వంటి జబ్బులనూ పథకం పరిధిలోకి తీసుకురావడంతో పేద, మధ్యతరగతి వారికి ఆర్థికంగా పెనుభారం తప్పింది. వ్యయంలోనూ ఇప్పుడే ఎక్కువ ఇక 2007 నుంచి 2014 వరకూ ఆరోగ్యశ్రీ పథకానికి వ్యయం చేసింది అక్షరాలా రూ.3,976.95 కోట్లు. ఆ తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా 2019 వరకూ ఉన్నారు. ఆ సమయంలో ఖర్చు చేసింది రూ.5,838.17 కోట్లు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2019 జూన్ నుంచి 2021 జూన్ వరకూ 25 నెలల కాలంలోనే 4,244.01 కోట్లు ఖర్చుచేశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సగటున రోజుకు 1,572 మంది ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్నారు. అలాగే, చికిత్స అనంతరం కోలుకునే సమయంలో ‘ఆసరా’ కింద రోజుకు రూ.225 ఇస్తూండటంతో బాధిత కుటుంబానికి గొప్ప భరోసా లభిస్తున్నట్లయింది. దీనికింద ఇప్పటివరకు ఆరోగ్యశ్రీకి అదనంగా రూ.324కోట్లు చెల్లించింది. -
తెలుగు వెలుగుల రేడు వైఎస్సార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కొంతమంది ముఖ్యమంత్రులది ప్రత్యేక స్థానం. సీఎంలుగా పనిచేసిన వారిలో రాష్ట్రాన్ని ప్రజారంజకంగా, ప్రమోదభరితంగా, ప్రగతిదాయకంగా పరిపాలించిన వారు చరితార్థులవుతారు. వారి పేర్లను జిల్లాల పేర్లగా ప్రకటించి, గౌరవించుకోవటం ఆనవాయితీ. ఆ ఘనత దక్కించుకున్న ముఖ్యమంత్రులు ఇద్దరే ఇద్దరు. వారు ప్రకాశం పంతులు, డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి. ప్రతిపక్షాలకు చెందినవారైనా సరే.. కోరి వచ్చి సాయం అడిగినవారిని, ఆయన నిరాశ పరి చింది ఎన్నడూ లేదు. ముఖ్యమంత్రి సహాయనిధిని నిజ మైన సేవానిధిగా మార్చింది ఆయనే. తనను కలిసారంటే వారి కోరిక క్షణాల్లో నెరవేరేది. క్యాంపు కార్యాలయం సామాన్య ప్రజలతో బారులు తీరి, నిత్యం కిటకిటలాడేది. బడుగు బలహీన వర్గాలవారూ, వ్యాపారులూ, ఉద్యోగులూ ప్రతీ ఒక్కరూ ఆనందంగా జీవించిన కాలమది. ‘మా ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టులు చేపట్టిన రోజులు నాకు అత్యంత ప్రీతిపాత్రమైనవైతే, అవి పూర్తయిన రోజే నాకు నిజమైన పుట్టినరోజు’’ తన జన్మదినం రోజున వైఎస్సార్ స్పందన ఇది. తెలుగు ప్రజలపైన, రాష్ట్ర భవితవ్యం పైన ఆయనకున్న మమకారం తాలూకు నిలువెత్తు విశ్వరూపం ఇది. గుండెలోతుల్లో నిక్షిప్తమైన ప్రేమాభిమానాలకు నిజరూప దర్శనమిది. ‘‘ప్రతీ పథకాన్నీ ప్రారంభించేముందు లేదా రూపకల్పన చేసేముందు ఈ పనివలన పేదవాడి ముఖంలో వెలుగు నిండుతుందా, వారికి ఈ పథకం ప్రయోజనం చేకూరుస్తుందా అని నన్ను నేను ప్రశ్నించుకుని, తర్వాతే అమలు చేస్తానన్న దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఆలోచనా విధానాన్నే వైఎస్ కూడా ఆచరించారన్నది సుస్పష్టం. తన ప్రతీ పథకం ప్రయోజనకరంగా రూపుదిద్దుకుని, ప్రజల మన్ననలను పొందిందంటే అదే కారణం. ఈ రకంగా పుట్టుకొచ్చినవే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి వినూత్న పథకాలు, ఎన్నో గొప్ప కార్యక్రమాలు! కడుపు నిండకుండానే ఎవరికైనా ఓ పూట గడవచ్చేమో కానీ వైఎస్సార్ పేరు తలవకుండా ఏ ఒక్కరికీ రాష్ట్రంలో ఒక్కరోజు కూడా గడవదు. రాష్ట్రంలో ఏదో ఒక మూలన, ఏదో ఒక సందర్భాన ప్రతి వ్యక్తీ ఆయన ప్రస్తావన తెస్తూనే ఉంటారు. ప్రజలు ఆయన్ని ఎంతగా ఆరాధిస్తున్నారో, ఆయన ఆకస్మిక అదృశ్యాన్ని ఎంతటి దుఃఖంగా భావిస్తున్నారో దీన్నిబట్టి అవగతమవుతుంది. వైఎస్సార్‌ని అర్థంతరంగా కోల్పోయి, వేదనలో ఉన్న ప్రజలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన విశిష్ట పరిపాలనతో సాంత్వన చేకూరుస్తూ ఆ లోటును తీరుస్తున్నారు. భౌతికంగా ఆయన దూరమైనా, రాష్ట్ర ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకుని మానసికంగా మన చెంతనే ఉన్నారు. ప్రజలకు ఉపయోగపడే అనేక పథకాల పేర్లతో వైఎస్సార్ పేరు కలిసి వుండడం, మరింత శోభనిస్తూ ప్రజల ప్రయోజనాల్ని నెరవేరుస్తూ ఉండటం, మరణించినా ఆయన బ్రతికి ఉన్నారన్నట్లుగా భావిస్తూ, నిరంతరం గుర్తుకు తెచ్చుకోవటం ఆ మహామనిషి సేవాస్ఫూర్తికి మనమిచ్చే ఘనమైన నివాళి. డా. ఎమ్.వి.జె. భువనేశ్వరరావు, ప్రముఖ కథారచయిత -
ఆరోగ్యశ్రీలో 13.74 లక్షల మందికి ఉచిత వైద్యం
సాక్షి, అమరావతి : వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద రెండేళ్లలో ఏకంగా 13.74 లక్షల మంది పేదలు, సామాన్యులకు ఉచిత వైద్య చికిత్సలు అందాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మే 31వ తేదీ వరకు ఇంత పెద్ద సంఖ్యలో ఉచిత వైద్య చికిత్సలు అందడం ఇదే తొలిసారి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.3,400.18 కోట్లు వ్యయం చేసింది. గత చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్య శ్రీని పూర్తిగా నీరు కార్చేసింది. ప్రభుత్వం బిల్లులు చెల్లించక పోవడంతో ఈ పథకం కింద చికిత్స చేయడానికి ఆస్పత్రులు నిరాకరించేవి. ఏటా కనీసం రూ.500 కోట్లు కూడా కేటాయించలేదు. చంద్రబాబు సర్కారు నీరు కార్చిన ఆరోగ్య శ్రీ పథకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఊపిరి పోశారు. తెల్ల రేషన్ కార్డుతో ఆరోగ్య శ్రీ కార్డు లింక్‌ను ఉప సంహరించడమే కాకుండా, పేదలతో పాటు వార్షిక ఆదాయం రూ.5 లక్షల్లోపు గల సామాన్య ప్రజలకు కూడా ఈ పథకాన్ని వర్తింప చేశారు. తద్వారా రాష్ట్రంలోని 95 శాతం కుటుంబాలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకువచ్చారు. చికిత్స వ్యయం రూ.1000 దాటితే వైఎస్సార్ ఆరోగ్య శ్రీ వర్తింప చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. తరచూ సమీక్షలతో ఈ పథకం అమలుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి బిల్లులు చెల్లించే ఏర్పాటు చేశారు. లక్షన్నర మంది కోవిడ్ రోగులకు ఉచిత చికిత్స గత ఏడాది కోవిడ్–19ను కూడా వైఎస్సార్ ఆరోగ్య శ్రీలో చేర్చి ఉచిత వైద్యం అందిస్తున్నారు. ఇటీవల బ్లాక్ ఫంగస్‌ను కూడా చేర్చారు. ప్రభుత్వ నిర్ణయం పేదలు, సామాన్యులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మే ఆఖరు వరకు వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద 1.55 లక్షల మందికి పైగా కోవిడ్ రోగులకు ఉచిత వైద్య చికిత్సలు అందించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.435.87 కోట్లు వ్యయం చేసింది. ఈ పథకాన్ని గతంలో వెయ్యి చికిత్సలకే పరిమితం చేస్తే, సీఎం జగన్ 2,434 వ్యాధులు, ఆపరేషన్లకు పెంచారు. అంతే కాకుండా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందేలా వీలు కల్పించారు. తద్వారా రాష్ట్రంలో పేదలు, సామాన్యులను వైఎస్సార్ ఆరోగ్య శ్రీ సంజీవనిలా ఆదుకుంటోంది. -
పేదలకు పెద్ద వైద్యం
ఎలాంటి లోటు లేదు.. ఉండదు ‘‘కోవిడ్‌కు సంబంధించి మనందరి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అసెంబ్లీ సాక్షిగానూ, పలు సందర్భాలలో వివరంగా చెప్పాం. టీకాలు ఇవ్వడంలో కానీ, ఆక్సిజన్ విషయంలో కానీ, కోవిడ్ మందుల విషయంలో కానీ ప్రభుత్వం చేసే ప్రయత్నంలో ఎలాంటి లోటు లేదని, ఉండదని మరొక్కసారి మాట ఇస్తున్నా’’ – ముఖ్యమంత్రి జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దడం, పేదలు, సామాన్యులకు చెంతనే కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒకే సారి 14 వైద్య కళాశాలలకు సోమవారం శంకుస్థాపన చేశారు. తద్వారా గ్రామ స్థాయిలో వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ నుంచి టీచింగ్ ఆస్పత్రుల దాకా సేవలు అనుసంధానమై ప్రజలకు అత్యుత్తమ వైద్య సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 16 మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధంగా నర్సింగ్ కళాశాలలను రూ.8,000 కోట్ల వ్యయంతో నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. వీటిలో ఇప్పటికే పాడేరు, పులివెందుల వైద్య కళాశాలల పనులు ప్రారంభం కాగా తాజాగా విజయనగరం, అనకాపల్లి, అమలాపురం, రాజమండ్రి, పాలకొల్లు, ఏలూరు, మచిలీపట్నం, బాపట్ల, పిడుగురాళ్ల, మార్కాపురం, మదనపల్లె, పెనుకొండ, నంద్యాల, ఆదోనిలో ఏర్పాటయ్యే 14 మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీల శిలాఫలకాలను ముఖ్యమంత్రి సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి పర్చువల్ విధానంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో క్యాంపు కార్యాలయంతోపాటు ఆయా ప్రాంతాల నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ.. సమీపంలోనే మెరుగైన వైద్యం.. మనందరి ప్రభుత్వం ఏర్పాటై నిన్నటితో (ఆదివారం) రెండేళ్లు పూర్తైన సందర్భంగా ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ, నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి టీచింగ్ ఆస్పత్రికి ఒక మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఉంటుంది కాబట్టి డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది అందుబాటులోకి వస్తారు. పేదవాడికి మంచి వైద్యం, వీలైనంత దగ్గర్లోనే అందుబాటులోకి తెచ్చేలా గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దశాబ్దాలుగా 11 మాత్రమే.. బ్రిటీష్ కాలం నుంచి చూసినా రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. ఇవాళ ఏకంగా 16 కొత్త మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేయగలుగుతున్నాం. దేవుడు ఆ అవకాశం ఇచ్చాడు. ఇప్పటికే విశాఖ జిల్లా పాడేరు, కడప జిల్లా పులివెందుల మెడికల్ కాలేజీల పనులు మొదలయ్యాయి. మిగిలిన 14 మెడికల కాలేజీల పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేస్తున్నాం. ఇవన్నీ 2023 డిసెంబరు నాటికి పూర్తై అందుబాటులోకి వస్తాయి. ఈ రోజు వేస్తున్న అడుగుతో.. ఈ కాలేజీల నిర్మాణంతో దేశంలో ఏ ఒక్క రాష్ట్రానికీ తీసిపోని విధంగా మన రాష్ట్రం తయారవుతుందని సంతోషంగా చెబుతున్నా. ఎందుకంటే మనకు టైర్–1 నగరాలు లేవు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి మహా నగరాలు లేవు. మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు అలాంటి నగరాల్లోనే ఉంటాయి. ఇటువంటి పరిస్థితి నుంచి మనకు విముక్తి కావాలంటే, మన దగ్గరే టెరిషరీ వైద్యం అభివృద్ధి చెందాలంటే ఈరోజు వేసే గొప్ప అడుగు ఎంతగానో ఉపయోగపడుతుంది. హెల్త్ హబ్స్‌తో ప్రైవేట్‌లోనూ ఆస్పత్రులు.. 16 హెల్త్ హబ్స్ ఏర్పాటు కానుండటం మరో అంశం. సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను మూడేళ్లలో పూర్తి చేసేలా రూ.100 కోట్ల పెట్టుబడితో ఎవరు ముందుకు వచ్చినా జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లలోనూ ఐదు ఎకరాల చొప్పున భూమిని ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. ఆ విధంగా ఒక్కోచోట ఐదారు ఆస్పత్రులను ప్రభుత్వం ప్రోత్సహిస్తే దాదాపు మరో 80 నుంచి 90 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు ప్రైవేటు రంగంలో అందుబాటులోకి వస్తాయి. ఆరోగ్యశ్రీతో అనుసంధానం.. ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీకి అనుసంధానమై ఉంటాయి. ఏ విధంగా అయితే హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను అనుసంధానం అయ్యాయో అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా దాదాపు 80 నుంచి 90 ఆస్పత్రులు ఆరోగ్యశ్రీకి అనుసంధానంగా వస్తాయి. ఇవన్నీ ఏర్పాటు కావడం వల్ల జిల్లాల రూపురేఖలు మారి వైద్య రంగంలో మెరుగైన పరిస్థితి వచ్చి పేదలకు మంచి వైద్యం అందుతుందని మీ బిడ్డగా సంతోషంగా చెబుతున్నా. అత్యాధునిక వసతులు.. ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా 500 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వస్తుంది. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 10 మాడ్యులర్ ఆపరేషన్ ధియేటర్లు, సెంట్రలైజ్డ్ ఏసీతో ఐసీయూలు, ఓపీ రూమ్స్, డాక్టర్ రూమ్స్, మెడికల్ ఆక్సిజన్ పైప్లైన్లతో అనుసంధానం చేసిన బెడ్లు, ఆక్సిజన్ నిల్వ చేసిన ట్యాంకులు, ఉత్పత్తి జనరేషన్ ప్లాంట్లు కూడా వస్తాయి. ఎంఆర్ఐ, సీటీ స్కాన్ లాంటి సదుపాయాలు ప్రతి కాలేజీలో ఏర్పాటు చేసి ఎన్ఏబీహెచ్ సర్టిఫికెట్ పొందే స్థాయిలో నెలకొల్పుతాం. ఆస్పత్రులు నాడు–నేడు.. ‘నాడు–నేడు’ ద్వారా ఆస్పత్రుల రూపురేఖలు సమూలంగా మార్చేందుకు దాదాపు రూ.16,300 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 10,111 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, 560 అర్బన్ హెల్త్ క్లినిక్‌లు, మండలానికి కనీసం రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ) ఉండేలా 1,145 పీహెచ్‌సీలను అప్‌గ్రేడ్ చేయడంతో పాటు కొత్తగా 176 పీహెచ్‌సీల నిర్మాణం చేపట్టాం. మొత్తంగా 1,321 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 52 ఏరియా ఆస్పత్రులు, 191 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీ) ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే ఉన్న 11 మెడికల్ కాలేజీల రూపురేఖలు నాడు–నేడు ద్వారా పూర్తిగా మారనున్నాయి. ఎన్ఏబీహెచ్ గుర్తింపు పొందేలా చర్యలు చేపడతాం. ఐపీహెచ్ఎస్ ప్రమాణాలకు అనుగుణంగా పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలను తీర్చిదిద్దుతాం. ఇవన్నీ 2023 డిసెంబరు నాటికి పూర్తై అందుబాటులోకి వస్తాయి. 5 గిరిజన మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రులు.. గిరిజన ప్రాంతాల అక్క చెల్లెమ్మలు, సోదరులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు రూ.246 కోట్లతో సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయగూడెం, దోర్నాలలో ఐదు గిరిజన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు శ్రీకారం చుట్టాం. ఉద్ధానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం పలాసలో రూ.50 కోట్లతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. రూ.272 కోట్లతో కడపలో మానసిక ఆరోగ్య కేంద్రం. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, క్యాన్సర్ ఆస్పత్రుల నిర్మాణానికి ఇప్పటికే శ్రీకారం చుట్టాం. ఆరోగ్యశ్రీ – ఆరోగ్య ఆసరా.. వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో మార్పులు తెచ్చి 2,436 వైద్య చికిత్సలకు వర్తింప చేస్తున్నాం. 95 శాతం కుటుంబాలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చాయి. వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా శస్త్రచికిత్స అనంతరం కోలుకునే వరకు నెలకు రూ.5 వేలు సాయం అందచేస్తున్నాం. కంటి వెలుగు ద్వారా ఉచితంగా పరీక్షలు, కళ్లద్దాలు ఇస్తున్నాం. కాక్లియర్తో పాటు బైకాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ సదుపాయం కల్పించాం. అన్ని క్యాన్సర్ చికిత్సలను పథకంలోకి తెచ్చాం. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో కూడా వైద్యం చేయిస్తున్నాం. దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారు మొదలు, మంచం, వీల్ చైర్లకు పరిమితమైన వారికి రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు పింఛన్లు ఇస్తున్నాం. కోవిడ్‌తోపాటు బ్లాక్ ఫంగస్‌ను ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తెచ్చాం. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో దాదాపు రూ.680 కోట్లు బకాయిలు పెడితే వాటిని ఇవ్వడంతోపాటు ఇవాళ మూడు వారాల్లోనే నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లిస్తూ వ్యవస్థలో మార్పులు తెచ్చాం. దాదాపు 40కిపైగా సంక్షేమ పథకాలతో పాటు వైద్య ఆరోగ్య రంగంపై నిండు మనసుతో దృష్టి పెట్టాం కాబట్టే ఇవన్నీ చేయగలిగానని మీ కుటుంబ సభ్యుడిగా సగర్వంగా చెబుతున్నా. రెండేళ్లలో రూ.5,215 కోట్లు ఖర్చు.. ఈ రెండేళ్లలో ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్టు ద్వారా రూ.5,215 కోట్లు ఖర్చు చేశాం. ఆరోగ్యశ్రీ చికిత్సల కోసం రూ.3,560 కోట్లు, ఆరోగ్య ఆసరా కోసం రూ.303 కోట్లు. ఉద్యోగుల ఆరోగ్య పథకంలో రూ.510 కోట్లు. 108, 104 సర్వీసుల కోసం రూ.452 కోట్లు, దీర్ఘకాల వ్యాధులు, పెన్షన్ల కింద మరో రూ.390 కోట్లు ఖర్చు చేశాం. + పోస్టుల భర్తీ.. 104, 108 వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు 9,712 రెగ్యులర్ పోస్టుల్లో డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందిని నియమించాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పోస్టులు ఖాళీగా ఉంటే వెంటనే భర్తీ చేశాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా 108, 104 సర్వీసులు కింద ఒకేసారి 1,180 వాహనాలను ప్రవేశపెట్టాం. + వారికి రూ.5 లక్షల సాయం.. కోవిడ్ ఫ్రంట్‌లైన్ వర్కర్లలో మరణించిన వారికి కేంద్రం ప్రకటించిన పరిహారం వర్తించకపోతే వారికి మన ప్రభుత్వం తరపున రూ.5 లక్షలు ఇస్తాం. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్‌లో పని చేసేవారికి ఆ సహాయం అందచేస్తాం. కోవిడ్ విధి నిర్వహణలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబానికి అందించాల్సిన సహాయంపై విధి విధానాలు ఖరారు చేయాలని సీఎస్‌ను ఆదేశిస్తున్నాం. ((((((((((((((((కోట్స్)))))))))))))) + ప్రాణం విలువ తెలుసు కాబట్టే.. ‘‘మనిషి ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వంగా జనాభా అవసరాలను బేరీజు వేసుకుని ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఈ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం. సరైన వైద్యం అందక అన్యాయానికి గురవుతున్న ప్రతి నిరుపేదకూ మంచి వైద్య సదుపాయం వారి వాకిట్లోనే, గడప వద్దకు తీసుకురావడంలో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. పాదయాత్ర హామీని నిలబెట్టుకుంటూ పేదలను ఆదుకునేందుకే ఈ నిర్ణయం’’ నా మాంగల్యం నిలబడింది కరోనా బారినపడిన నా భర్త బతకడం కష్టమన్నారు. విశాఖ ఆస్పత్రికి వెళ్లడానికి 104కి కాల్ చేస్తే.. పావుగంట తర్వాత కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచి్చంది. ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. రోజూ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి ఆరా తీసేవారు. ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా అని అడిగేవారు. ఇంతగా ఎవరూ చేయలేదు. ఎక్కడా నయాపైసా చెల్లించలేదు. నా మాంగల్యం నిలబడిందంటే మీ వల్లే. మా అనకాపల్లిలో ఇంత పెద్ద ఆస్పత్రి నిరి్మంచడం మా పూర్వజన్మ సుకృతం. – జయలక్షి్మ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా -
2 Years Of YS Jagan Rule In AP: ఆరోగ్య భాగ్యం
-
కోవిడ్ బాధితులకు కొండంత అండ
సాక్షి, అమరావతి: కోవిడ్ బాధితులకు ఆరోగ్యశ్రీ కొండంత అండగా నిలుస్తోంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చడం, చివరకు బ్లాక్ ఫంగస్‌ను సైతం ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచితంగా చికిత్స అందించడం ద్వారా పేద రోగులకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పించింది. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో 50 శాతం పడకలు ఆరోగ్యశ్రీ రోగులకు కేటాయించాలనే నిబంధనతో వేలాది మందికి ఉచితంగా కరోనా చికిత్స అందుతోంది. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచితంగా సమర్థవంతంగా చికిత్స అందిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది. సుమారు 55 శాతం ప్రైవేట్ ఎం ప్యానల్డ్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్నట్టు అంచనా వేశారు. ఇది 65 శాతానికి పెంచాలని భావిస్తున్నారు. 116 ప్రభుత్వ ఆస్పత్రుల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 116 ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోవిడ్ బాధితులకు చికిత్స అందుతోంది. ఇందులో 2,288 ఐసీయూ పడకలు, 12,250 ఆక్సిజన్ పడకలు, 11,544 సాధారణ పడకల్లో సేవలు అందుతున్నాయి. ఈ కేసులన్నిటికీ ఆరోగ్యశ్రీ వర్తిస్తోంది. ఇవి కాకుండా 200 తాత్కాలిక ఎం ప్యానల్డ్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లోనూ సేవలు అందిస్తున్నారు. చికిత్సకు నిరాకరిస్తే కఠిన చర్యలు.. ఆరోగ్యశ్రీ కింద కోవిడ్ బాధితులకు పడకలు కేటాయించని ఆస్పత్రులు, చికిత్స అందించని ఆస్పత్రులపై అధికారులు తనిఖీలు నిర్వహించి ఇప్పటివరకూ 54 కేసులు నమోదు చేశారు. 11 ఆస్పత్రులను మూసి వేశారు. రూ.3.72 కోట్లు జరిమానా విధించారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. ఎంత పెద్ద కార్పొరేట్ ఆస్పత్రి అయినా సరే ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించకుంటే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మానవత్వంతో వ్యవహరించాలి ‘కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. ఈ సమయంలో వ్యాపార దృక్పథంతో ఆస్పత్రులను నిర్వహించడం సమంజసం కాదు. తమ వంతు సాయంగా ప్రజలకు వైద్యం అందించేలా కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు మానవత్వంతో ఆలోచించాలి. సామాన్యులు, పేదలకు భరోసా కల్పించాలి. ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించిన ప్రతి ఆస్పత్రికీ ప్రభుత్వం చెల్లింపులు చేస్తోంది’ –డాక్టర్ ఎ.మల్లికార్జున, సీఈవో, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ -
ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు రూ.235.94 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేస్తున్న ఆస్పత్రులకు రూ.235.94 కోట్లు చెల్లించినట్టు ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ ఎ.మల్లికార్జున ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 719 నెట్వర్క్ ఆస్పత్రులకు ఏప్రిల్ 15 నాటికి ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు సమర్పించిన బిల్లులకుగాను 195.36 కోట్లు, ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద 584 నెట్వర్క్ ఆస్పత్రులకు మార్చి 15 నాటికి ఇచ్చిన బిల్లులకుగాను రూ.40.58 కోట్లు కలిపి మొత్తం రూ.235.94 కోట్లు చెల్లించామన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసే ఆస్పత్రులకు ఎప్పటికప్పుడు నిధులు చెల్లిస్తున్నట్టు తెలిపారు. ఆస్పత్రులకు నోటీసులు కోవిడ్ బాధితులకు ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స అందించని ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసినట్లు ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు. మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో విజయవాడలోని నిమ్రా ఆస్పత్రి, ఆంధ్ర ఆస్పత్రులు కోవిడ్ బాధితులకు చికిత్స అందించడంలో సరిగా స్పందించడం లేదని తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ రెండు ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. కోవిడ్ సమయంలో ఏ ప్రైవేటు ఆస్పత్రి అయినా పేద ప్రజలకు చికిత్సలు అందించాల్సిందేనని, ఆరోగ్యశ్రీ కింద 50 శాతం పడకలు ఇవ్వకపోయినా, చికిత్సలు చేయకపోయినా అలాంటి ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామన్నారు. -
ఆరోగ్యశ్రీకి పడకలివ్వకుంటే అనుమతులు రద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఏ ప్రైవేటు ఆస్పత్రి అయినా ఆరోగ్యశ్రీలో కోవిడ్‌కు 50 శాతం పడకలు ఇవ్వకపోతే ఆ ఆస్పత్రులకు కోవిడ్ అనుమతులతోపాటు అవసరమైతే రిజిస్ట్రేషన్ రద్దుచేస్తామని ఆరోగ్యశాఖ హెచ్చరిస్తోంది. ఉదాహరణకు కృష్ణాజిల్లాలో పేరున్న ఓ ఆస్పత్రికి మచిలీపట్నం బ్రాంచ్‌లో 130 పడకలుండగా, 5 పడకలు మాత్రమే ఆరోగ్యశ్రీకి ఇచ్చారు. అదే ఆస్పత్రికి విజయవాడ భవానీపురంలో 150 పడకలుంటే 10 పడకలు కూడా చూపించలేదు. ఇలాంటి ఆస్పత్రులు విశాఖపట్నం, కృష్ణాజిల్లాలో ఎక్కువగా ఉన్నట్టు ఆరోగ్యశాఖకు సమాచారం వచ్చింది. దీంతో రానున్న రెండు రోజుల్లో అన్ని ఆస్పత్రుల్లోను తనిఖీలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. కోవిడ్ చికిత్స చేసే ఏ ఆస్పత్రిలో అయినా సరే 50 శాతం పడకలు ఆరోగ్యశ్రీ కింద ఇవ్వాలని, కోవిడ్ సమయంలో అన్ని ఆస్పత్రులు ఇది పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ కొన్ని ఆస్పత్రులు ఈ ఆదేశాలను పెడచెవిన పెట్టడంతో వాటిపై చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు. 50 శాతం పడకలు ఇవ్వకపోయినా, ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకునే బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసినా భారీగా జరిమానాలు విధించాలని నిర్ణయించారు. ఇప్పటికే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే. ఫిర్యాదు చేస్తే 24 గంటల్లోనే చర్యలు ఎవరైనా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే అలాంటి ఆస్పత్రిపై 24 గంటల్లోనే చర్యలు తీసుకుంటాం. కోవిడ్ చికిత్సకు 50 శాతం పడకలు ఇవ్వని ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే ఆ ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ రద్దుచేసేందుకైనా వెనుకాడేది లేదు. – డాక్టర్ ఎ.మల్లికార్జున,సీఈవో, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ -
AP Budget 2021: ఆరోగ్యశ్రీ పథకానికి రూ.2,258 కోట్లు
సాక్షి, అమరావతి: ఆరోగ్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం 2021–22 బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరం ఆరోగ్య రంగానికి రూ.9,426.49 కోట్లు కేటాయించగా ఈ ఏడాది ఈ మొత్తాన్ని రూ.13,830.44 కోట్లకు పెంచింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, 104, 108 పథకాలకు నిధుల కొరత లేకుండా కేటాయింపులు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నాడు నేడు కింద ఆస్పత్రుల అభివృద్ధి పనులకు రూ.1,535 కోట్లు కేటాయించింది. వైద్యవిధాన పరిషత్‌కు గతేడాది కంటే రూ.77.32 కోట్లు ఎక్కువగా ఇచ్చింది. తొలిసారిగా బడ్జెట్లో కోవిడ్ టీకా కోసం రూ.500 కోట్లు, కోవిడ్ నియంత్రణకు రూ.500 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఆరోగ్య రంగానికి బడ్జెట్లో 4,403.95 కోట్లు అధికంగా కేటాయించడం విశేషం. పేద రోగులకు భరోసా పేద రోగులకు భరోసానిస్తూ 2,400 జబ్బులను ఆరోగ్యశ్రీలో చేర్చడంతోపాటు దేశంలోనే మొదటిసారిగా కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చిన ఘనత రాష్ట్రానిది. అంతేకాకుండా రెండ్రోజుల క్రితమే ఖరీదైన బ్లాక్ ఫంగస్ చికిత్సనూ ఆరోగ్యశ్రీలో చేర్చారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ పథకానికి బడ్జెట్లో పెద్దపీట వేశారు. మన రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉచిత చికిత్సకు అవకాశం కల్పిస్తున్న ఈ పథకానికి ఈ ఏడాది రూ.2,258.94 కోట్లు కేటాయించింది. రూ.5 లక్షల వార్షికాదాయంలోపు ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఈ పథకాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 1,088 కొత్త అంబులెన్సు (108, 104)లను కొనుగోలు చేసిన ఘనత ప్రభుత్వానిది. ఇప్పుడు ప్రతి మండలానికి 108, 104 వాహనాలు ఉన్నాయి. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో 108 అంబులెన్సులు అద్భుతమైన సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. గ్రామీణుల్లో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 104 వాహనాలు ఇంటి వద్దకే వెళ్లి మందులిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు పథకాలకు కలిపి బడ్జెట్లో రూ.300 కోట్లు కేటాయించారు. చదవండి: ప్రాణం విలువ తెలిసిన వాడిని: సీఎం జగన్ -
ఆరోగ్యశ్రీలోకి ‘బ్లాక్ ఫంగస్’
సాక్షి, అమరావతి: బ్లాక్ ఫంగస్ చికిత్సను రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఈ ఫంగస్ జబ్బు వస్తోంది. స్టెరాయిడ్స్ వాడిన తర్వాత షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరగడం తదితర కారణాల వల్ల ఫంగస్ ఎక్కువగా సోకుతుండటం, వైద్యం ఖరీదు కావడంతో రకరకాల వైద్య పరీక్షలతో పాటు చికిత్సలు, శస్త్రచికిత్సలను కూడా ఆరోగ్యశ్రీలోకి తెచ్చారు. సీటీ/ఎంఆర్ఐ, ఫంగల్ కల్చర్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, రీనల్ ఫంక్షన్ టెస్ట్ (కిడ్నీ), షుగర్ టెస్ట్‌లు, హెచ్‌బీఏ1సీ, నాజల్ ఎండోస్కొపీ వంటివన్నీ ఉచిత చికిత్సలో భాగంగా చేయాలి. అంతేకాకుండా యాంటీబయాటిక్, ఐవీ ఫ్లూయిడ్స్, లింఫొసొమాల్ (యాంపొటెరిసిన్ బి) లేదా ఓరల్ పొసకొనొజోల్ ఇవ్వాలి. వైద్య పరీక్షల ఆధారంగా 2 వారాల నుంచి 3 వారాల పాటు ఈ వైద్యం చేయాల్సి ఉంటుంది. చికిత్స అనంతరం ఏదైనా శస్త్రచికిత్స చేయాల్సి వచ్చినా అదనంగా కూడా కేటాయిస్తామని ఉత్తర్వుల్లో చెప్పారు. సర్జికల్ మేనేజ్మెంట్ ఆఫ్ ప్రొప్టొసిస్కు రూ. 50 వేలు, యాంటీబయోటిక్స్, మందుల ప్యాకేజీకి రూ. 41,968, ఆఫ్తాల్మాలజీ ఆర్బిటొటొమి చికిత్సకు రూ. 27,810, ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీకి రూ. 16,932, ఎక్స్ంటరేషన్ ఆఫ్ ఆర్బిట్ చికిత్సకు రూ. 10,180 నిర్ణయించారు. లింఫొసొమాల్ (యాంఫొటెరిసిన్ బి), పొసకొనొజోల్ ఇంజక్షన్లకు ఎంఆర్పీ ధరలు చెల్లిస్తారు. ఆరోగ్యశ్రీలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ చికిత్స ఉచితంగా చేయాలని స్పష్టం చేశారు. -
మీ సేవలకు అభినందనలు
అధికారులందరికీ ఒక విజ్ఞప్తి. నా దగ్గర నుంచి పారిశుద్ధ్య కార్మికుడి వరకు కోవిడ్ వల్ల ఎదురయ్యే అనూహ్య పరిస్థితులను ఎదుర్కొనే ఒత్తిడిలో ఉన్నారు. ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సులు, వార్డు బాయ్‌లు, శానిటేషన్ సిబ్బంది.. ఇలా ప్రతి ఒక్కరూ ఎంతో ఒత్తిడి మధ్య పని చేస్తున్నారు. కాబట్టి కింది వారికి నచ్చ చెప్పి పని చేయించుకోండి. ఆగ్రహిస్తే వచ్చేదేమీ లేదు. కాబట్టి ఎవ్వరూ సహనం కోల్పోవద్దు. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘కోవిడ్ సంక్షోభంలో ప్రతి ఆస్పత్రిలో వైద్యులు, నర్సులు, శానిటేషన్ సిబ్బందితో పాటు, గ్రామ స్థాయిలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, వలంటీర్లు పగలు.. రాత్రి కష్టపడుతున్నారు. చాలా బాగా పనిచేస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారు. వీరి సేవల గురించి ఎంత పొగిడినా తక్కువే. కోవిడ్ సమయంలో ఎంతో మంచి సేవలందిస్తున్న మీ అందరికీ అభినందనలు’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడపలోని బోధనాస్పత్రుల్లో రూ.67 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్లు, ఎంఆర్ఐ పరికరాలను బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి రోజూ 20 వేల కోవిడ్ కేసులు నమోదవుతున్నాయని, మన దగ్గర టయర్–1 సిటీ, ఆ స్థాయిలో ఆస్పత్రులు లేకపోయినా, దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ మరణాల రేటు చాలా తక్కువగా ఉందని చెప్పారు. మీరంతా (వైద్యులు, వైద్య సిబ్బంది) ఆస్పత్రుల్లో బా«ధ్యత తీసుకోవడమే కాకుండా, ఎంతో ఒత్తిడి ఉన్నా చిరునవ్వుతో పని చేస్తున్నారు కాబట్టే కోవిడ్‌ను ఎదుర్కోగలుగుతున్నామని అభినందించారు. అయితే ఫీవర్ సర్వే కొన్ని చోట్ల అనుకున్న విధంగా జరగలేదని కొందరు అధికారులు దిగువ స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకున్నారని తన దృష్టికి వచ్చిందని చెప్పారు. కరోనా మహమ్మారితో ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఎంతో ఒత్తిడిలో ఉన్నారనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని, ఈ దృష్ట్యా అధికారులంతా మంచితనంతో తమ సిబ్బందితో పని చేయించుకోవాలని కలెక్టర్లు, జేసీలు, డీహెచ్‌ఎంఓలకు సూచించారు. ఈ సమీక్షలో సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. నెల్లూరు, ఒంగోలు, కడప, శ్రీకాకుళం ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్య సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆస్పత్రుల్లో ఉన్నత ప్రమాణాలు ► ఉన్నత ప్రమాణాలతో ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నాం. అన్ని బోధనాస్పత్రుల్లో డయాగ్నస్టిక్ సదుపాయాలు కల్పించి ఆరోగ్య శ్రీ పథకంలో ఉచితంగా వైద్య సేవలు, పరీక్షలు నిర్వహించనున్నాం. డయాగ్నస్టిక్ పరికరాల నిర్వహణ బాధ్యత ఆరోగ్య శ్రీ ట్రస్టుకు అప్పగిస్తాం. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రతి పార్లమెంటు నియోజవర్గంలో ఒక బోధనాస్పత్రి, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం. ► ఈ రోజు రాష్ట్రంలో 11 టీచింగ్ ఆస్పత్రుల్లో కేవలం ఏడింటిలో మాత్రమే సీటీ స్కాన్, ఎంఆర్ఐ పరికరాలు ఉన్నాయి. అవి కూడా పీపీపీ పద్ధతిలో ఉన్నాయి. వాటిలో టెక్నాలజీ, క్వాలిటీ అప్‌గ్రేడేషన్ కూడా లేదు. ఈ పరిస్థితి మారాలని పలు చర్యలు తీసుకుంటున్నాము. ఆస్పత్రులను జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నాము. ► ఇవాళ రూ.67 కోట్ల వ్యయంతో శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడపలో సీటీ స్కాన్లు, కడప మినహా మూడు చోట్ల ఎంఆర్ఐ పరికరాలను ప్రారంభించాం. వీటికి మూడేళ్ల వారంటీ ఉంది. మరో ఏడేళ్లు సర్వీసు బాధ్యతను ఆ కంపెనీలు నిర్వహిస్తాయి. ఏ పేదవాడికైనా ఉచితంగా సేవలందించేలా, ప్రభుత్వ టీచింగ్ ఆస్పత్రుల్లో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. కొత్త ఆస్పత్రుల్లోనూ అన్ని సదుపాయాలు ► కొత్తగా ఏర్పాటు చేస్తున్న 16 టీచింగ్ ఆస్పత్రుల్లోనూ అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాము. ఇప్పటికే ఉన్న 11 టీచింగ్ ఆస్పత్రులను నాడు–నేడు కింద అప్‌గ్రేడ్ చేయడంతో పాటు, కొత్తగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో టీచింగ్ ఆస్పత్రితో పాటు, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం. వాటిలో టాప్ ఆఫ్ ది లైన్ డయాగ్నస్టిక్ సర్వీసులు అందించే దృక్పథంతో అడుగులు వేస్తున్నాము. ► టీచింగ్ ఆస్పత్రుల్లో సదుపాయాలన్నింటినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చి, పథకం లబ్ధిదారులకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తాము. ఆ విధంగా డయాగ్నస్టిక్ సేవలు అందిస్తాము. మరోవైపు ఆరోగ్యశ్రీ ట్రస్టు వాటి నిర్వహణ వ్యయం భరిస్తుంది. ► ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ వి.విజయరామరాజు, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కోవిడ్ చికిత్సకు ఆరోగ్యశ్రీ రేట్లు పెంపు
సాక్షి, అమరావతి: కోవిడ్ చికిత్సలకు చెల్లించే ఆరోగ్యశ్రీ రేట్లను సవరిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. సీటీ స్కాన్‌లో కొరాడ్స్–4, సీటీ సివియారిటీ స్కోర్ 25 ఉండి, ఆర్టీపీసీఆర్ టెస్టు లేకపోయినా పేషెంట్లను అనుమతించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో వెంటిలేటర్ సాయంతో ఉన్న రోగులకు రోజుకు రూ. 2,500 చెల్లిస్తామన్నారు. గతంలో నాన్‌క్రిటికల్ ట్రీట్మెంట్కు రూ. 3,250, వెంటిలేటర్ లేని ఐసీయూకు రూ.5,480, ఐసీయూతో వెంటిలేటర్‌కు రూ.9,580, క్రిటికల్ పేషంట్లకు వెంటిలేటర్‌తో చికిత్సకు రూ. 10,380 ఇచ్చేవారు. -
YSR Aarogyasri: కోవిడ్ వేళ ఆరోగ్యశ్రీ ఆదుకుంది..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా చితికిపోకుండా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సంజీవనిలా నిలుస్తోంది. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్‌ను ఆరోగ్యశ్రీ కింద చేర్చి ఉచిత వైద్యం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు గతేడాది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏడాదిలోనే 1.11 లక్షల మంది కోవిడ్ రోగులకు ఉచిత వైద్యసేవలు అందాయి. కోవిడ్ సోకిన పేదలు, మధ్యతరగతి ప్రజలు చికిత్సకు అప్పులు పాలుకాకుండా, వారి ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి తలెత్తకుండా ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఉచిత వైద్యం అందిస్తోంది. ఇందులో భాగంగా గతేడాది ఏప్రిల్ 7 నుంచి ఈ నెల 5 వరకు రాష్ట్రంలో 1,11,266 మంది కోవిడ్ రోగులకు ఉచిత వైద్యం అందింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.332.41 కోట్లు వ్యయం చేసింది. మరే రాష్ట్రంలోనూ ఇలా ప్రభుత్వ పథకంలో కోవిడ్ చికిత్సలను చేర్చి ఉచిత వైద్య చికిత్సలను అందించకపోవడం గమనార్హం. సీఎం వైఎస్ జగన్ ఎంతో ముందుచూపుతో ఆలోచించి కోవిడ్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చడం వల్లే గతేడాది కాలంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు చికిత్సకు నగదు సమస్యను ఎదుర్కోలేదు. -
నిబంధనల ప్రకారమే ఆస్పత్రుల్లో ఉంచండి
సాక్షి, అమరావతి: కొన్ని నెట్వర్క్ ఆస్పత్రులు ఎక్కువ రోజులు ఆస్పత్రుల్లో ఉండాలని కోవిడ్ పేషెంట్లపై ఒత్తిడి తెస్తున్నాయని, వాటిపై చర్యలు తీసుకుంటామని ఆరోగ్యశ్రీ సీఈవో మల్లికార్జున హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ సాంకేతిక కమిటీ అన్నీ పరిశీలించాకే రోజు వారీ ప్యాకేజీలు నిర్ణయించామని, దీన్ని కాదని ఆస్పత్రులు ప్యాకేజీ డబ్బుల కోసం ఎక్కువ రోజులు ఉండాలని ఒత్తిడి తెస్తున్నాయన్నారు. అయినా సరే నిబంధనల ప్రకారం ప్యాకేజీ డబ్బులు ఇస్తామని నెట్వర్క్ ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేశారు. -
ఆరోగ్యశ్రీ కింద కోవిడ్ రోగుల చికిత్సకు రూ.309.61 కోట్లు
సాక్షి, అమరావతి: కోవిడ్ రోగుల చికిత్సలను వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 1.01 లక్షల మంది కోవిడ్ రోగులకు ఉచితంగా వైద్యసేవలను అందించింది. ఇందుకోసం ఏకంగా రూ.309.61 కోట్లను ఖర్చు చేసింది. గతేడాది ఏప్రిల్ నుంచి ఆరోగ్యశ్రీ కింద ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రుల్లో కోవిడ్ రోగులకు ప్రభుత్వం ఉచిత చికిత్సలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ నెల 23 వరకు మొత్తం 1,01,387 మంది బాధితులు ఉచిత వైద్యం పొందారు. దేశంలోనే తొలి రాష్ట్రం కోవిడ్‌ను ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకొచ్చి పేదలందరికీ ఉచిత వైద్యం అందించిన తొలి రాష్ట్రం.. ఆంధ్రప్రదేశ్. ఇప్పటివరకు ఈ పథకం కింద వివిధ ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరి ఉచితంగా చికిత్స పొందినవారి సంఖ్య లక్ష దాటింది. – మేకపాటి గౌతమ్‌రెడ్డి, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి సీఎం సమర్థ పాలనకు నిదర్శనం ఆరోగ్యశ్రీ పథకంలోకి కోవిడ్‌ను చేర్చడం వల్ల ఇప్పటివరకు రాష్ట్రంలో లక్ష మందికిపైగా ఉచిత వైద్య సేవలు పొందారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమర్థ పరిపాలన, సంక్షేమ పథకాల అమలుకు ఇది ఒక నిదర్శనం. – పరిమళ్ నత్వానీ, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు -
ఆరోగ్యశ్రీ.. నా బిడ్డకు మళ్లీ మాటలిచ్చింది
‘నా బిడ్డ కొన్నేళ్లుగా థైరాయిడ్‌తో బాధపడుతూ నోటిమాట రావడంలేదు. సీఎం జగన్మోహన్రెడ్డి పుణ్యమా అని ఆరోగ్యశ్రీ ద్వారా నా బిడ్డకు ఉచితంగా ఆపరేషన్ చేయడంతో నా బిడ్డ అందరు పిల్లల్లా మాట్లాడుతోంది. నేను సీఎంకు జీవితాంతం రుణపడి ఉంటాను..’ – ఇది ఓ తల్లి సంతోషం వి.కోట (చిత్తూరు జిల్లా): ముఖ్యమంత్రి చలవతో తన బిడ్డకు మళ్లీ మాటలొచ్చాయని చిత్తూరు జిల్లా వి.కోటకు చెందిన నాగరత్నమ్మ సోమవారం మీడియా ముందు ఆనందంగా చెప్పారు. ఇక తమ బిడ్డ బతుకు అంతేనేమోనని ఆవేదనతో బతుకుతున్న తమకు జీవం పోసినట్లయిందని తెలిపారు. ఆమె తెలిపిన మేరకు.. వి.కోట భారత్‌నగర్‌లో ఉంటున్న నాగరత్నమ్మ కుమార్తె చందన (14) ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. చందనకు హైపో థైరాయిడిజం కారణంగా క్రమంగా మాట పోయింది. వారిది రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం. పాప ఆరోగ్యం కోసం వారు శక్తికి మించి ఆస్పత్రుల్లో ఖర్చుచేశారు. అయినా పాపకు మాట రాకపోవడంతో డాక్టర్లు ఆపరేషన్ చేయాలని అందుకు లక్ష రూపాయలకు పైగా ఖర్చవుతుందని చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేస్తారేమోనని గతంలో పలుమార్లు ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. వీలుకాదని అప్పట్లో వైద్యులు తెలపడంతో మందులు వాడుకుంటూ మిన్నకుండిపోయారు. సీఎం జగన్మోహన్రెడ్డి ఆరోగ్యశ్రీలో అదనంగా పలు వ్యాధులకు చికిత్స చేయిస్తున్నారని తెలిసింది. దీంతో సర్పంచి పీఎన్ లక్ష్మిని ఆశ్రయించారు. సర్పంచి సాయంతో చందనను మార్చి 22న తిరుపతి రుయా ఆస్పత్రిలో చేర్చారు. డాక్టర్లు 25వ తేదీ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్ చేశారు. 29వ తేదీన డిశ్చార్జి చేశారు. తాము ఆస్పత్రికి వెళ్లి రావడానికి, అక్కడ తమకు అయిన ఖర్చులూ తమ అకౌంట్లో వేస్తామని చెప్పారని నాగరత్నమ్మ తెలిపారు. నిజంగా ఇది పేదల ప్రభుత్వమేనని.. ఆస్పత్రికి వెళ్లాక తెలిసిందని సంతోషం వ్యక్తం చేశారు. ఎంతోమంది నిరుపేదలకు ఆరోగ్యశ్రీ ప్రాణం పోస్తోందన్నారు. జగన్మోహన్రెడ్డి పుణ్యమా అని తన బిడ్డ ఇప్పుడు అందరు పిల్లల్లా మాట్లాడుతోందని, రోజూ బడికి వెళ్లి చదువుకుంటోందని చెప్పారు. సీఎంకు తమ కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటుందని, జగన్మోహన్రెడ్డి వంటి సీఎంలు రాష్ట్రంలో ఉన్నంతవరకు పేదల కష్టాలు వారి దరిదాపుల్లో లేకుండా చేస్తారని ఆమె ఆనందంతో తెలిపారు. -
పేద రోగులకు కొండంత ‘ఆసరా’
సాక్షి, అమరావతి: పేదలు ఎవరైనా ఏదైనా అనారోగ్య కారణంతో ఆస్పత్రి పాలైతే.. వారి జీవితం మరింత దుర్భరం అవుతుంది. అదే ఇంటి పెద్ద అయితే కుటుంబం మొత్తం కష్టాల పాలవుతుంది. ఇలాంటి వారి జీవనోపాధికి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో శస్త్రచికిత్సల అనంతరం పేషెంట్లు కోలుకునే వరకూ ఆసరాగా ప్రభుత్వం ఉండాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకాన్ని అమలు చేస్తున్నారు. ఆ పథకం అలాంటి వారికి కొండంత అండగా నిలుస్తోంది. రాష్ట్రంలో పథకాన్ని ప్రారంభించిన 2019 డిసెంబర్ 1 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు అంటే 15 నెలల కాలంలోనే 3,81,723 మంది రోగులకు రూ. 235.46 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వం ఆసరా కల్పించింది. దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి పథకం అమలు చేయడం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచన అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. నవరత్నాల్లో భాగంగా వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొందిన రోగులకు వైఎస్సార్ ఆసరా పథకం వర్తింప చేస్తున్నారు. ఈ పథకం కింద పేషెంటు చికిత్స అనుసరించి అతడి విశ్రాంతి కాలంలో రోజుకు రూ. 225 చొప్పున గరిష్టంగా నెలకు రూ. 5,000 ఇస్తున్నారు. శస్త్రచికిత్సల అనంతరం రోగులు డిశ్చార్జ్ కాగానే వారికి వైఎస్సార్ ఆరోగ్య ఆసరా తప్పనిసరిగా అందాలని, ఈ విషయంపై జాయింట్ కలెక్టర్లు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. బ్యాంకు ఖాతాలో జమ శస్త్ర చికిత్స పూర్తయిన తరువాత రోగుల డిశ్చార్జ్ అయిన రోజునే వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద డబ్బులను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. బ్యాంకు ఖాతాల వివరాలు లేని వైఎస్సార్ ఆరోగ్య శ్రీ లబ్ధిదారులకు 104 ద్వారా కాల్ చేసి హెల్త్ కార్డులోని ఇతర సభ్యుల బ్యాంకు ఖాతా నంబర్ ఆస్పత్రిలోని ఆరోగ్య మిత్రకు ఇవ్వాలని సూచిస్తున్నారు. కాగా, వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకాన్ని మొత్తం 1,519 చికిత్సలకు వర్తింప చేస్తున్నారు. ఇక్కడే గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి స్పష్టమైన తేడా కనిపిస్తోంది. గత ప్రభుత్వం అసలు ఇలాంటి పథకం గురించి ఆలోచనే చేయలేదు గానీ మరోపక్క ఆరోగ్యశ్రీని నీరుగార్చి వ్యయం తగ్గించుకోవాలనే ఆలోచన చేసింది. -
ఆయువు పోసిన ఆరోగ్యశ్రీ
తాడేపల్లి రూరల్: ఆరోగ్యశ్రీ పథకంలో సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడంతో ఓ చిన్నారి క్లిష్టమైన ఆరోగ్య సమస్య నుంచి బయటపడింది. ఇందుకు సంబంధించిన వివరాలను మణిపాల్ ఆస్పత్రి అంకాలజీ వైద్యుడు డాక్టర్ జి.కృష్ణారెడ్డి, హెమటో అంకాలజీ కన్సల్టెంట్ డాక్టర్ దంతాల మాధవ్ బుధవారం వెల్లడించారు. గుంటూరు జిల్లా నంబూరు గ్రామానికి చెందిన రాణి కుమార్తె సిరిస్పందన (6) ప్రైమరీ రిఫ్రాక్టరీ హడ్కిన్ లింఫోమా అనే వ్యాధితో రెండేళ్లుగా బాధపడుతోంది. వైద్యం నిమిత్తం ఎన్ని ఆస్పత్రులకు తిరిగినా ప్రయోజనం లేకపోయింది. చివరకు మణిపాల్ ఆస్పత్రికి తీసుకురాగా.. అక్కడి వైద్యులు సాల్వేజ్ కీమోథెరపీ జీడీపీతో చికిత్స అందించారు. బాలికకు జబ్బు తగ్గిన తర్వాత బీఈఎం కండిషనింగ్, ఆటోలోగాస్ మూల కణ మార్పిడి చికిత్స అందించారు. బాలిక పూర్తిగా కోలుకుని మంచి బ్లడ్ కౌంట్ సాధించటంతో మూడు వారాల్లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. డాక్టర్ కంటెపూడి సుధాకర్ మాట్లాడుతూ చిన్నారి అన్నిరకాల ఆరోగ్య చిక్కుల నుంచి బయటపడి ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించేందుకు మణిపాల్ వైద్య బృందం చేసిన కృషి అభినందనీయమన్నారు. చిన్నారికి చికిత్స అందించిన క్లినికల్ సర్వీసెస్ చీఫ్ డాక్టర్ మనోజ్‌కుమార్, మెడికల్ అంకాలజీ అసోసియేట్ కన్సల్టెంట్ డాక్టర్ బి.శ్రావణ్‌కుమార్‌ను ఆయన అభినందించారు. బాలిక తల్లి రాణి మాట్లాడుతూ ఈ విధమైన చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చి సీఎం వైఎస్ జగన్ తన బిడ్డకు ప్రాణం పోశారని కృతజ్ఞతలు తెలిపారు. -
మరో 683 చికిత్సలకు ఆరోగ్య ఆసరా
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేయించుకున్న అనంతరం కోలుకునే సమయంలో ఇచ్చే ‘ఆరోగ్య ఆసరా’ చికిత్సల సంఖ్య భారీగా పెంచారు. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. గతంలో 836 చికిత్సలకు వైద్యం చేయించుకున్న తర్వాత కోలుకునే సమయంలో రోజుకు రూ. 225 చొప్పున, గరిష్టంగా నెలకు రూ. 5 వేలు ఇచ్చారు. ఇప్పుడు మరో 683 చికిత్సలను ఇందులో చేర్చారు. దీంతో మొత్తం చికిత్సల సంఖ్య 1,519కి చేరింది. ఈ మొత్తం చికిత్సల్లో దేనికైనా సరే వైద్యం పొంది ఇంటివద్ద కోలుకుంటూంటే వెంటనే బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ చేస్తారు. డాక్టరు నిర్ణయించిన మేరకు విశ్రాంతి రోజులకు లెక్కకట్టి ఆసరా సొమ్ము ఇస్తారు. తాజాగా ఇచ్చిన జాబితాలో గైనకాలజీ, పల్మనరీ, డయాబెటిక్ ఫుట్, డెంగీ జ్వరం వంటివి ఉన్నాయి. రోగులు తమ ఆధార్‌ను బ్యాంకుకు లింకు చేసి ఉంటే వెంటనే నిధులు జమచేస్తామని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
ప్రతి పల్లెకు ఫ్యామిలీ డాక్టర్
వైద్యుడు ఆయా గ్రామాలకు వెళ్తున్నప్పుడు ఆరోగ్య మిత్ర, ఆశా వర్కర్లు వెంట వెళతారు. డాక్టర్ సేవలు అందించడానికి విలేజ్ క్లినిక్ వేదికగా ఉంటుంది. అవసరమైతే హోం విజిట్స్ కూడా చేయాలి. పల్లెల్లో సగటున 1,500 – 2,000 కుటుంబాలకు ఒక డాక్టర్ ఉంటాడు కనుక కొంత కాలానికి పేషెంట్ల ఆరోగ్య పరిస్థితులపై అతనికి పూర్తి అవగాహన ఏర్పడుతుంది. దీంతో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ వస్తుంది. వైద్యం చేయడం సులభమవుతుంది. ఇందుకోసం అవసరమైతే 104 సర్వీసులు పెంచుకోవాలి. – సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: పల్లెల్లోకి డాక్టర్లను పంపించడం ద్వారా ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనిపై కార్యాచరణ సిద్ధం చేయాలని చెప్పారు. ఆరోగ్య రంగంలో నాడు–నేడు కార్యక్రమాల స్థితిగతులు, వనరుల సమీకరణ, పనులు జరుగుతున్న తీరు, ఆరోగ్య శ్రీ అమలుపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి మండలంలో కనీసం 2 పీహెచ్‌సీలు ఉండాలని, ప్రతి పీహెచ్సీలో కనీసం ఇద్దరు చొప్పున.. మొత్తం నలుగురు డాక్టర్లు ఉండాలని, ప్రతి డాక్టర్‌కు కొన్ని గ్రామాలను కేటాయించాలని చెప్పారు. ఆ డాక్డర్ ప్రతి నెల కనీసం రెండు సార్లు తనకు నిర్దేశించిన గ్రామాలకు వెళ్లి వైద్యం అందించాలని, తద్వారా గ్రామాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితుల మీద అతనికి అవగాహన ఏర్పడుతుందన్నారు. ఈ మేరకు తదుపరి సమావేశం నాటికి కార్యాచరణ సిద్ధం చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ కొత్త వ్యవస్థను ఎప్పటి నుంచి అందుబాటులోకి తెస్తారనే దానిపై తేదీలను కూడా ఖరారు చేయాలని చెప్పారు. ఈ కొత్త వ్యవస్థ కోసం ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఉదారంగా ఉండాలన్నారు. తద్వారా పేషెంట్ల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆరోగ్య కార్డుల్లో నమోదు చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని, మెరుగైన వైద్యం కోసం వారు సరైన ఆస్పత్రికి రిఫరెల్ చేయగలుగుతారన్నారు. ఈ సమీక్షలో సీఎం వైఎస్ జగన్, అధికారులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. నిధుల లోటు రాకూడదు ► ఆరోగ్య రంగంలో నాడు–నేడు కార్యక్రమాలకు ఏకంగా రూ.16,270 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశాం. ఈ కార్యక్రమాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నందున నిధులు కూడా ఆ మేరకు ఇచ్చేలా చూడాలి. నాడు–నేడు కింద కొత్తగా చేపట్టే మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలు యుద్ధ ప్రాతిపదికన సాగాలి. ► మార్చి 31 నాటికి వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్‌ల పనులు జనవరి నెలాఖరు కల్లా ప్రారంభం కావాలి. నిర్మాణాలు పూర్తయ్యాక జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆస్పత్రులను నడపాలి. ► వీటి నిర్వహణలో నిరంతరం ఆ ప్రమాణాలు పాటించేలా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి. మొదట్లో బాగున్నా.. సరైన శ్రద్ధ, దృష్టి లేకపోతే మళ్లీ పరిస్థితులు మొదటికి వచ్చే అవకాశాలున్నాయి. అలాంటి పరిస్థితి రాకూడదు. అద్భుతంగా కట్టడమే కాకుండా, ఆస్పత్రులను సరైన ప్రమాణాలతో నడపడం అత్యంత కీలకం. మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సత్వరమే చర్యలు ► ‘పలాస సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు చురుగ్గా సాగుతున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతాయి. కడప సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు మొదలు పెట్టాం. 2023 జూన్ నాటికి ఆ పనులు పూర్తి చేస్తాం. ఐటీడీఏల పరిధిలోని ఐదు మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణానికి ఈ వారంలోనే రివర్స్ టెండరింగ్ నిర్వహించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. పాడేరు, పిడుగురాళ్ల, పులివెందులలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఈ వారంలోనే రివర్స్ టెండరింగ్‌కు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. మచిలీపట్నం మెడికల్ కాలేజీకి నెలాఖరులోగా టెండర్లు ఆహ్వానిస్తాం’ అని అధికారులు వివరించారు. ► మిగిలిన 12 చోట్ల మెడికల్ కాలేజీల ఏర్పాటుపైనా సత్వరమే చర్యలు తీసుకుని, యుద్ధ ప్రాతిపదికన కదలాలని సీఎం అధికారులను ఆదేశించారు. పీహెచ్‌సీల్లో నాడు –నేడు పనులను 2021 సెప్టెంబర్ నాటికి.. ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. హెల్ప్ డెస్క్ కీలకం ► ఆరోగ్యశ్రీ అమలు తీరును, కార్డుల పంపిణీ, ఆరోగ్య ఆవసరాలపై సీఎం సమీక్షించారు. ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగులో లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే 2,436 ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు. ► ఆరోగ్య ఆసరా కింద ఇప్పటి వరకు 836 ప్రొసీజర్లకు ఆర్థిక సహాయం చేస్తున్నామని, అదనంగా 638 ప్రొసీజర్లకు కూడా ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వివరించగా, దీన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ► ప్రైవేట్ ఆస్పత్రుల నుంచే కాకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా నాణ్యతా ప్రమాణాలపై నిరంతరం నివేదికలు తెప్పించుకోవాలని సీఎం సూచించారు. అన్ని నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రలతో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ► నెట్వర్క్ ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలపై అధికారులు సీఎంకు వివరాలు అందజేశారు. అన్ని ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు కావాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. ► ‘ఒక పేషెంట్‌గా మనం ఆస్పత్రులకు వెళ్లినప్పుడు ఎలాంటి సమాచారం, సహకారం ఆశిస్తామో.. అలాంటి సహకారాన్ని, సమాచారాన్ని ఆరోగ్యమిత్రలు అందించాలి. ఆరోగ్యశ్రీ, హెల్ప్‌డెస్క్‌ల సర్వీసు ప్రతి రోజూ మెరుగు పడాలి. పేషెంట్లకు పూర్తి స్థాయిలో సంపూర్ణ సేవలు అందేలా చూడాలి. రిఫర్ చేయడం.. అంబులెన్స్‌లను రప్పించుకోవడం తదితర అంశాలపై ప్రొటోకాల్, ప్రొసీజర్లపై గ్రామ సచివాలయాల్లోని ఏఎన్ఎంలకు శిక్షణ ఇవ్వాలి. పేషెంట్ల పట్ల సానుకూల దృక్పథంతో ఉండాలి’ అని సీఎం తెలిపారు. ఆరోగ్యం బాగోలేనప్పుడు రోగికి ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించే ఆస్పత్రులు ఏవన్నది పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. 104 నంబర్‌కు ఫోన్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్లాలన్న దానిపై పేషెంట్‌కు అవగాహన కల్పించాలి. పేషెంట్ తన గ్రామం, మండలం పేరు చెప్పగానే.. అందుబాటులో ఉన్న రిఫరల్ ఆస్పత్రులు ఏవేవి.. ఎక్కడెక్కడ ఉన్నాయన్న వివరాలు చెప్పాలి. వెంటనే ఆరోగ్య సిబ్బంది ద్వారా వారికి సరైన సహాయం, సహకారం అందించేలా చూడాలి. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదు ► ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందిస్తున్న కొన్ని ఆస్పత్రులు రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలపై చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఆధారాలు సేకరించి ఆయా ఆస్పత్రులపై జరిమానాలు కూడా విధించామని చెప్పారు. అలాంటి ఆస్పత్రులను ప్యానెల్ నుంచి తొలగించడమే కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ► అంబులెన్స్‌ల నిర్వహణ సమర్థవంతంగా ఉండేందుకు నిరంతరం పరిశీలన చేయించాలని సీఎం ఆదేశించారు. అవి ఎప్పుడూ మంచి కండిషన్లో ఉండాలన్నారు. అవసరం అనుకుంటే.. మండలాల జంక్షన్లలో అదనంగా అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచేలా చూడాలని సూచించారు. -
దీటుగా కరోనా కట్టడి
సాక్షి, అమరావతి: తొమ్మిది నెలలుగా కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తూ దీటుగా ఎదుర్కొన్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 1,02,29,745 పరీక్షలు చేశామని, ప్రతి 10 లక్షల జనాభాకు 1,91,568 పరీక్షలు చేశామని, జనాభాలో 19.15 శాతం మందికి పరీక్షలు నిర్వహించామని వివరించారు. కోవిడ్ పరీక్షల్లో దేశంలో అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ తొలిస్థానంలో ఉందన్నారు. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ ఈ మూడింటిపైన ప్రభుత్వం వాయువేగంగా వ్యవహరించిందని తెలిపారు. కరోనా నియంత్రణ చర్యలు, ఆరోగ్య శ్రీ వైద్య సేవలు, నాడు–నేడుపై శుక్రవారం అసెంబ్లీలో స్వల్ప వ్యవధి చర్చలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. పాజిటివిటీ రేటు సగటున 16 శాతం నుంచి 8.51 శాతానికి తగ్గిందని, ఈ వారం 1.48 శాతం మాత్రమే ఉందన్నారు. మరణాల రేటు దేశంలో 1.4 శాతం ఉండగా, మన దగ్గర కేవలం 0.81 శాతం మాత్రమే ఉందన్నారు. గతంలో రోజుకు 100 మంది చనిపోగా ఇప్పుడు 7 నుంచి 8 మందికి తగ్గిందని, అది కూడా జరగకూడదని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. కోవిడ్ పోరాట యోధులకు కృతజ్ఞతలు రాష్ట్రంలో కరోనా బారిన పడిన ప్రజల సంఖ్య 8,70,076. రికవరీ అయిన వారు 8,56,320 మంది కాగా 7,014 మంది చనిపోయారు. మరో 6,742 యాక్టివ్ కేసులున్నాయి. ఇంతమంది కోలుకున్నారంటే ఎంత శ్రమకోర్చామో ఊహించవచ్చు. ఇందుకు మన డాక్టర్లు, నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వలంటీర్లు, పోలీసులు, రెవెన్యూ ఉద్యోగులు, కలెక్టర్లు.. అందరికీ కృతజ్ఞతలు. మిగిలిన రాష్ట్రాలలో కోవిడ్ చికిత్సకు రూ.లక్షలు ఖర్చవుతున్నాయన్న విమర్శలు వచ్చాయి. మన రాష్ట్రంలో అలాంటి ఫిర్యాదులు రాలేదు. ప్రభుత్వం 243 ఆస్పత్రులను అధీనంలోకి తీసుకుని మౌలిక సదుపాయాలు, సిబ్బందిని సమకూర్చింది. ఎవరికైనా కోవిడ్ లక్షణాలు కనిపిస్తే 104 నెంబరుకు ఫోన్ చేస్తే చాలు టెస్టింగ్, అవసరమైతే ఆస్పత్రిలో చేర్చడం, బెడ్ సమకూర్చడం, చికిత్స తర్వాత తిరిగి ఇంటికి పంపించడం వరకు అన్ని సేవలు ఒక్క కాల్‌తో పొందేలా సదుపాయాలు కల్పించాం. దేశం మొత్తం మనల్ని అభినందిస్తోంది. ఖర్చుకు వెనకాడకుండా ఖరీదైన వైద్యం.. ఇవాళ రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు 30 డోసులు ప్రతి ఆస్పత్రిలో ఉన్నాయి. ఒక్కోదాని ఖరీదు రూ.5,500. ఒక్కొక్కరికి కనీసం 6 ఇంజెక్షన్లు ఇవ్వాల్సి వస్తుంది. అందుకయ్యే ఖర్చే రూ.30– రూ.35 వేల వరకు ఉంది. పాక్సులీజోమా ఒక్కో ఇంజెక్షన్ ఖరీదు రూ.17 వేలు. ఇవి కూడా ప్రతి జిల్లా ఆస్పత్రిలో అందుబాటులో ఉంచి ప్రతి ఒక్కరినీ మానవతా దృక్పథంతో ఆదుకుంటాం. ఇంట్లో ఐసొలేషన్‌కు అవకాశం లేని వారికి కోవిడ్ కేర్ సెంటర్లు అండగా నిలుస్తున్నాయి. 14410 కు ఫోన్ చేస్తే వైద్య సహాయం అందుతుంది. మరికొన్నాళ్లు జాగ్రత్తగా ఉందాం.. కోవిడ్ వ్యాప్తిలో ఇప్పుడు చివరి దశకు వచ్చాం. కొద్ది నెలలు కాస్త జాగ్రత్తగా ఉంటే గండం నుంచి బయటపడొచ్చు. అమెరికాలో మొన్న ఎన్నికలు జరిగాయి. ఇవాళ అక్కడ రోజుకు 2 లక్షల కేసులు నమోదవుతున్నాయి. దాదాపు 2,500 మంది రోజూ చనిపోతున్నారు. ఎన్నికలు జరిగాయి కాబట్టి ఆ పరిస్థితి వచ్చింది. బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ లాక్డౌన్లో ఉన్నాయి. కాబట్టి మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. వాక్సిన్ రావడానికి మరో 3, 4 నెలలు పట్టొచ్చని కేంద్రం చెబుతోంది. ఒకవేళ వచ్చినా మొత్తం రాష్ట్ర జనాభాకు అందకపోవచ్చు. తొలుత కోటి మందికే వాక్సిన్ ఇచ్చే అవకాశం ఉంది. మిగిలిన వారికి వాక్సిన్ ఇవ్వడానికి సమయం పడుతుంది. చలి పెరుగుతోంది కాబట్టి కరోనా కేసులు పెరుగుతున్నాయి. గుజరాత్, మధ్యప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూ విధించారు. చాలా కష్టపడి ఈ పరిస్థితికి వచ్చాం కాబట్టి కొద్ది నెలలు జాగ్రత్తగా ఉంటే పరిస్థితిని పూర్తిగా అదుపు చేయవచ్చు. రోజుకు 18 గంటలు పనిచేస్తున్నానని చెప్పను.. కేంద్ర ప్రభుత్వం తొలి దశలో కోటి మందికి వాక్సిన్ అందచేస్తామని తెలిపింది. టీకా నిల్వ చేసేందుకు దాదాపు 4,065 కోల్డ్ ఛెయిన్ ఎక్విప్మెంట్ కావాలి. 2 డిగ్రీల నుంచి 8 డిగ్రీల లోపు వాక్సిన్లు ఉంచాలి. వాక్సిన్ రవాణా కోసం 29 రిఫ్రిజిరేటెడ్ వాహనాలు సిద్ధంగా ఉండాలి. ప్రభుత్వం ఇవన్నీ సిద్ధం చేస్తున్నా బయటకు కనిపించవు. లోపల ఇవన్నీ జరుగుతున్నాయి. ‘నేను రోజుకు 18 గంటలు పని చేస్తున్నా. నాకు నిద్ర లేదు’ అని చెప్పను. ప్రతి ఒక్కరూ బాగా పని చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ.. ఆరోగ్య ఆసరా వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింప చేశాం. 1,000 నుంచి 2,059 వ్యాధులకు ఆరోగ్యశ్రీని విస్తరించాం. బయటి రాష్ట్రాలలో కూడా ఆరోగ్యశ్రీ చికిత్స కోసం 130 ఆస్పత్రులు గుర్తించాం. నెట్వర్క్ ఆస్పత్రులకు చంద్రబాబు సర్కారు ఎగ్గొట్టిన బకాయిలు తీర్చాం. ఆరోగ్య ఆసరా పథకం ద్వారా ఆపరేషన్ తర్వాత వైద్యులు సూచించినంత కాలం రోగి ఇంట్లో విశ్రాంతి పొందే సమయంలో ఆర్థిక సహాయం అందిస్తున్నాం. విలేజ్ క్లినిక్‌లు మొదలు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, టీచింగ్ ఆస్పత్రులను జాతీయస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా మారుస్తున్నాం. రాష్ట్రంలో 11 టీచింగ్ ఆస్పత్రులు ఉండగా కొత్తగా మరో 16 వస్తున్నాయి. రానున్న మూడేళ్లలో రూ.16 వేల కోట్లతో వైద్య ఆరోగ్య రంగంలో సమూల మార్పులు తెస్తాం. పేదలెవరూ వైద్యం కోసం అప్పులపాలు కాకూడదన్న తపనతో పని చేస్తున్నాం. కరోనా నియంత్రణలో ఏపీ దేశానికే ఆదర్శం నీతిఆయోగ్, ప్రధాని మోదీ ప్రశంసలే నిదర్శనం: మంత్రి ఆళ్ల నాని కరోనా నియంత్రణలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచిందని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అన్నారు. నీతిఆయోగ్, ప్రధాని ప్రశంసలే దీనికి నిదర్శనమన్నారు. ‘కరోనా నియంత్రణ–ఆరోగ్యశ్రీ–వైద్య రంగంలో సంస్కరణలు’పై శుక్రవారం అసెంబ్లీ స్వల్ప కాలిక చర్చలో ఆయన ప్రసంగించారు. సీఎం జగన్ అనునిత్యం సమీక్షలు చేస్తూ మార్గనిర్దేశం చేయడం వల్లే రాష్ట్రంలో సమర్థంగా కరోనాను కట్టడి చేయగలిగామని తెలిపారు. డాక్టర్లు, పారామెడికల్, శానిటేషన్, వార్డు, గ్రామ సచివాలయాల సిబ్బంది ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేశారని కొనియాడారు. 243 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను కోవిడ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేశాం. ప్రత్యేకంగా 21,662 మంది డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందిని తాత్కాలిక పద్ధతిన నియమించాం. 9,712 మంది డాక్టర్లు, పారామెడికల్ పోస్టు లను శాశ్వత పద్ధతిలో భర్తీ చేశాం. హైదరా బాద్‌లో కూర్చున్న చంద్రబాబు ప్రజలను పరా మర్శించలేదు. పైగా ప్రజలను భయపెట్టేలా మాట్లాడారు. రాజకీయ స్వార్థంతో ఇలా ప్రజలను భయపెట్టిన బాబుకు ప్రజలు వచ్చే ఎన్నికల్లో మరింత బుద్ధి చెబుతారు. ఆయన హయాంలో వైద్య ఆరోగ్య రంగాలను భ్రష్టు పట్టించారు’ అని ఆళ్ల నాని మండిపడ్డారు.