సాక్షి, అమరావతి: ప్రైవేట్ మానసిక ఆస్పత్రులను వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో ఎంపానల్‌మెంట్ చేయడం ద్వారా మానసిక ఆరోగ్య చికిత్సలు పూర్తి స్థాయిలో విస్తరించాలని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు అధికారులను ఆదేశించారు. మంగళగిరిలోని వైద్యశాఖ కార్యాలయంలో స్టేట్ మెంటల్ హెల్త్ అథారిటీ (ఎస్‌ఎంహెచ్‌ఎ) సమావేశం మంగళవారం జరిగింది.
కృష్ణబాబు మాట్లాడుతూ మానసిక చికిత్సలకు ప్రభుత్వాస్పత్రుల్లో ఇప్పటికే ఆరోగ్యశ్రీలో చికిత్సలు అందుబాటులో ఉన్నాయన్నారు. అయితే, కొన్ని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో మాత్రమే ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద మానసిక చికిత్సలు అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. అన్ని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో మానసిక ఆరోగ్య వైద్య సేవలకు ఆరోగ్యశ్రీ అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
అన్ని జిల్లాల్లోనూ డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ రివ్యూ బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. సమావేశంలో ఎస్‌ఎంహెచ్‌ఎ సీఈవో, డీఎంఈ డాక్టర్ వినోద్‌కుమార్, ప్రత్యేక కార్యదర్శి నవీన్‌కుమార్, కో–ఆర్డినేటర్ డాక్టర్ రాధిక, జేడీ డాక్టర్ నీలిమ పాల్గొన్నారు.
ఆరోగ్యశ్రీలో మానసిక ఆరోగ్య చికిత్సలు
Published Wed, Nov 9 2022 5:02 AM | Last Updated on Wed, Nov 9 2022 5:02 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment