mental hospital
-
మనసు కుదిరింది.. పెళ్లి జరిగింది
‘పెళ్లి కుదిరితే పిచ్చి కుదురుతుంది పిచ్చి కుదిరితే పెళ్లి జరుగుతుంది’ అని సామెత. అంటే పిచ్చి కుదరదు... పెళ్లి జరగదు అని అర్థం. కాని ఆ సామెతను తప్పు చేశారు ఇద్దరు ప్రేమికులు. మానసిక అస్వస్థతతో చెన్నై పిచ్చాసుపత్రిలో విడివిడిగా చేరిన ఈ ఇరువురుకి అక్కడ పరిచయమైంది. వ్యాధి నయం కావడంతో పెళ్లి నిర్ణయానికి వచ్చారు. 200 ఏళ్ల చరిత్రగల ఆ ఆస్పత్రిలో ఈ ఘటన మొదటిసారి. మానసిక అస్వస్థత కూడా జ్వరం, కామెర్లులా నయం కాదగ్గదే. గమనించి వైద్యం చేయిస్తే పూర్వ జీవితం గడపొచ్చు. చెన్నైలో జరిగిన ఈ పెళ్లి ఆశలు వదులుకునే మానసిక అస్వస్థులకు గొప్ప శుభవార్త. శుభమస్తు వార్త. మానసిక అస్వస్థత వస్తే ఈ సమాజంలో ఎన్నో అపోహలు, భయాలు, ఆందోళనలు, హేళనలు ఆపై బహిష్కరణలు. ‘పిచ్చివారు’ అని ముద్ర వేసి వారికి వైద్యం చేయించాలనే ఆలోచన కూడా చేయరు. అదే జ్వరం వస్తే జ్వరం అని చూపిస్తారు. కాని మనసు చలిస్తే ఏదో దెయ్యం పట్టిందని వదిలేస్తారు. మానసిక ఆరోగ్యం గురించి ప్రభుత్వాలు, సేవా సంస్థలు ఎంతో ప్రచారం చేస్తున్నా వైద్యం అందాల్సిన వారు, వైద్యం చేయించాల్సిన వారు కూడా అవగాహన లోపంతో వున్నారు. డాక్టర్ దగ్గరకు వెళ్దామంటే ‘నాకేమైనా పిచ్చా’ అని ఎదురు తిరుగుతారు పేషెంట్లు. ‘పిచ్చి’ ముద్ర వేస్తారని. ‘పిచ్చికి మందు లేదు’ అని వదిలేస్తారు బంధువులు. ఇద్దరూ ఓర్పు వహిస్తే గొప్ప ఫలితాలు వస్తాయి అనడానికి ఇదిగో ఇదే ఉదాహరణ. చెన్నైలోని ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్’ (ఐ.ఎం.హెచ్.) బ్రిటిష్ కాలం నాటిది. దేశంలోనే రెండవ అతి పెద్ద మానసిక చికిత్సాలయం. అందులో కొంత కాలం కిందట వైద్యం కోసం చేరారు మహేంద్ర (42), దీప (38). కుటుంబాలు వారిని చేర్పించి చేతులు దులుపుకున్నాయి. కాని వారు బాగయ్యారు. కొత్త జీవితం గడపాలనుకున్నారు. కాని బయటకు వెళితే ‘నయమై వచ్చినా’ అమ్మో పిచ్చోళ్లు అనే వివక్షతో చూస్తారు జనం. ఆ భయంతో మళ్లీ హాస్పిటల్‌కు వచ్చేశారు. దాంతో హాస్పిటల్ వారే వారికి లోపల ఉద్యోగాలు కల్పించారు. మహేంద్ర డేకేర్ సెంటర్లో పని చేస్తుంటే దీప కేంటిన్లో పని చేస్తోంది. మెల్లగా ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ సంగతి అడ్మినిస్ట్రేషన్‌కు తెలియగానే హడలిపోయారు. ఎందుకంటే ఇలాంటిది ఇంతకు మునుపు ఎరగరు. ఇదేమైనా ఇష్యూ అవుతుందా అనుకున్నారు. కాని హాస్పిటల్ డైరెక్టర్ అయిన డాక్టర్ పూర్ణ దగ్గరకు వచ్చిన దీప ‘నేను అతనితో నా జీవితం పంచుకోవాలనుకుంటున్నానమ్మా’ అని చెప్పే సరికి ఆమెకు ఆ స్త్రీ హృదయం అర్థమైంది. అంతే. హాస్పిటల్లో పని చేసే అందరూ తలా ఒక చేయి వేసి వారి పెళ్లికి ఆర్భాటంగా ఏర్పాట్లు చేశారు. తాళిబొట్టు ఆ ఏరియా ఎం.ఎల్.ఏ. ఏర్పాటు చేశాడు. అంతేనా హెల్త్ మినిస్టర్ శేఖర్ బాబు, ఎం.పి. దయానిధి మారన్ ఏ బందోబస్తు లేకుండా సగటు బంధువుల్లా పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి ఎంతో వేడుకగా జరిగింది. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటే జీవితం ముగిసినట్టు కాదు. స్వల్ప కాలం ఇబ్బంది పడ్డా నయమయ్యి కొత్త జీవితం గడపవచ్చు. అందుకు ఉచిత వైద్యం దొరుకుతుంది. కనుక ఆరోగ్యాన్ని గమనించి సమస్య వస్తే జయించండి. కొత్త జీవితాన్ని కళకళలాడించండి. ఎవరికి తెలుసు... ఇప్పుడు కష్టం వచ్చినా భవిష్యత్తు ఎన్ని సంతోషాలను దాచిపెట్టి ఉందో! -
ఆరోగ్యశ్రీలో మానసిక ఆరోగ్య చికిత్సలు
సాక్షి, అమరావతి: ప్రైవేట్ మానసిక ఆస్పత్రులను వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో ఎంపానల్మెంట్ చేయడం ద్వారా మానసిక ఆరోగ్య చికిత్సలు పూర్తి స్థాయిలో విస్తరించాలని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు అధికారులను ఆదేశించారు. మంగళగిరిలోని వైద్యశాఖ కార్యాలయంలో స్టేట్ మెంటల్ హెల్త్ అథారిటీ (ఎస్ఎంహెచ్ఎ) సమావేశం మంగళవారం జరిగింది. కృష్ణబాబు మాట్లాడుతూ మానసిక చికిత్సలకు ప్రభుత్వాస్పత్రుల్లో ఇప్పటికే ఆరోగ్యశ్రీలో చికిత్సలు అందుబాటులో ఉన్నాయన్నారు. అయితే, కొన్ని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో మాత్రమే ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద మానసిక చికిత్సలు అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. అన్ని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో మానసిక ఆరోగ్య వైద్య సేవలకు ఆరోగ్యశ్రీ అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని జిల్లాల్లోనూ డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ రివ్యూ బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. సమావేశంలో ఎస్ఎంహెచ్ఎ సీఈవో, డీఎంఈ డాక్టర్ వినోద్‌కుమార్, ప్రత్యేక కార్యదర్శి నవీన్‌కుమార్, కో–ఆర్డినేటర్ డాక్టర్ రాధిక, జేడీ డాక్టర్ నీలిమ పాల్గొన్నారు. -
మాజీ క్రికెటర్‌కు కోర్టులో ఊరట.. మెంటల్ హెల్త్ ఆస్పత్రికి తరలింపు!
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకెల్ స్లేటర్‌ను మెంటల్ హెల్త్ ఆసుపత్రికి తరలించారు. మానసిక పరిస్థితి సరిగా లేనందున అతనిపై ఉన్న గృహహింస కేసును కొట్టేస్తున్నట్లు సిడ్నీ లోకల్ కోర్టు తెలిపింది. విషయంలోకి వెళితే.. 52 ఏళ్ల మైకెల్ స్లేటర్‌పై గతేడాది అక్టోబర్‌లో న్యూసౌత్ వేల్స్ పోలీసులు గృహహింస కేసు నమోదు చేశారు. ఇక తన మాజీ భార్యకు ఫోన్ ద్వారా అసభ్యకర సందేశాలు పంపించడంతో పాటు మానసిక వేధింపులకు గురి చేశాడనే ఆరోపణలు రావడంతో గత డిసెంబర్లో అధికారులు అతనిపై మరిన్ని కేసులు నమోదు చేశారు. అయితే అతని మానసికస్థితి సరిగా లేనందునే ఇలా ప్రవర్తిస్తున్నాడని ఫిబ్రవరిలో అతని తరపు లాయర్ కోర్టుకు తెలిపాడు. తాజాగా మరోసారి మైకెల్ స్లేటర్ కేసు వాదనకు వచ్చింది. కేసును విచారించిన మెజిస్ట్రేట్ రాస్ హడ్సన్ అతని పరిస్థితిపై స్పందించాడు. ''మైకెల్ స్లేటర్ మానసిక పరిస్థితి బాగా లేదని.. ప్రస్తుతం జైలు కంటే రీహాబిలిటేషన్ సెంటర్‌కు పంపించాల్సిన అవసరం ఉంది. మూడు వారాల పాటు మెంటల్ హెల్త్ యూనిట్లో స్లేటర్ చికిత్స తీసుకోనున్నాడు. తక్షణమే అతన్ని మెంటల్ హెల్త్ యూనిట్‌కు తరలించే ఏర్పాట్లు చేయాలని మెజిస్ట్రేట్ ఆదేశించారు. కాగా మైకెల్ స్లేటర్ అంతకముందే దాదాపు వంద రోజులపాటు ఆల్కహాల్, మెంటల్ డిజార్డర్‌తో బాధపడుతూ రీహాబిటేషన్ సెంటర్లో చికిత్స తీసుకున్నట్లు తేలింది. ఇక 1993-2001 కాలంలో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించిన మైకెల్ స్లేటర్ 74 టెస్టులు, 42 వన్డేలు ఆడాడు. కాగా 74 టెస్టుల్లో 5312 పరుగులు, 42 వన్డేల్లో 987 పరుగులు సాధించాడు. ఆటకు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత మైకెల్ స్లేటర్ కామెంటేటర్ అవతారం ఎత్తాడు. చదవండి: Yuvraj Singh: టీమిండియా టెస్ట్ కెప్టెన్సీకి అతడే సరైనోడు..! IPL 2022: ఫెర్గూసన్‌కు చుక్కలు చూపించాడు.. ఎవరీ శశాంక్ సింగ్? -
డాక్టర్ సుధాకర్‌పై కేసు..
-
డాక్టర్ సుధాకర్‌పై సీబీఐ కేసు
సాక్షి, విశాఖపట్నం, మహారాణిపేట(విశాఖ దక్షిణ): వివాదాస్పద వ్యవహార శైలితో కలకలం రేపి.. ప్రస్తుతం మానసిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్ సుధాకర్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు, బాధ్యత కలిగిన ఓ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు కేసు నమోదు చేసినట్టు సీబీఐ ఎస్పీ విమలా ఆదిత్య మంగళవారం రాత్రి వెల్లడించారు. కేసు వివరాలను తమ వెబ్సైట్లో పొందు పరిచినట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్వాపరాలిలా ఉన్నాయి. ⇔ నర్సీపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అనస్థీషియా డాక్టర్‌గా పని చేస్తున్న సుధాకర్ ఏప్రిల్ 6వ తేదీన కరోనా నియంత్రణపై ప్రభుత్వ చర్యలను విమర్శిస్తూ ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. ⇔ మే 16వ తేదీ సాయంత్రం 3.50 ప్రాంతంలో డాక్టర్ సుధాకర్.. విశాఖ నగరం మర్రిపాలెం నుంచి బాలయ్యశాస్త్రి లేఅవుట్లో ఉన్న తన ఇంటికి వెళ్తూ మార్గం మధ్యలో పోర్టు ఆస్పత్రి వద్ద జాతీయ రహదారిలో కారు ఆపి స్థానికులను, ఆటో డ్రైవర్లను దుర్భాషలాడారు. ⇔ దీంతో స్థానికులు 100 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో వెంటనే నాలుగో పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని డాక్టర్‌కు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ⇔ అయినా వినిపించుకోకుండా మతం, కులాల పేరిట దూషిస్తూ ప్రధాని, సీఎం, మంత్రులతో పాటు పోలీసులను, అక్కడ ఉన్న స్థానికుల్ని సైతం నోటికొచ్చినట్లు దుర్భాషలాడారు. ⇔ డాక్టర్ ప్రవర్తనను మొబైల్లో వీడియో చిత్రీకరిస్తున్న హెడ్‌కానిస్టేబుల్ చేతి నుంచి సెల్‌ను లాక్కొన్ని రోడ్డుకేసి కొట్టారు. ⇔ చొక్కా విప్పుకుని జాతీయ రహదారిపై వాహనాలకు అడ్డంగా పడుకోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. నిలువరించాలని ప్రయత్నించిన పోలీసులపై తిరగబడి.. చొక్కాను చించుకుని హైవేపైకి మళ్లీ వచ్చి.. లారీకి అడ్డంగా వెళ్లారు. ⇔ ఈ పరిణామంతో అక్కడ ఉన్న స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే.. తనకు కరోనా ఉందని, తనను పట్టుకుంటే వైరస్ అంటించేస్తానంటూ భయపెట్టారు. పోలీసుల సహాయంతో.. స్థానిక ఆటోడ్రైవర్ వైద్యుడి చొక్కాతోనే.. అదుపు చేయడం కోసం అతని చేతులు కట్టేశారు. ⇔ మద్యం మత్తులో ఉన్న డాక్టర్‌ను ఎమ్మెల్సీ చేయించడం కోసం కేజీహెచ్‌కు తరలించారు. కరోనా కారణంగా బ్రీత్ ఎనలైజర్‌ను వాడకుండా కేజీహెచ్‌లో రక్త నమూనాలను సేకరించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు సుధాకర్ మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ప్రభుత్వ మానసిక వైద్యశాలకు రిఫర్ చేశారు. ⇔ సుధాకర్‌ను అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి పంపించిన పరిణామాలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత రాసిన లేఖ, ఎడిట్ చేసిన వీడియోను సుమోటో పిల్‌గా పరిగణించిన హైకోర్టు.. కేసు విచారణను సీబీఐకి అప్పగించింది. ⇔ నాలుగు రోజులుగా విశాఖలో విచారణ చేపట్టిన సీబీఐ.. నాలుగో పట్టణ పోలీసుస్టేషన్ సిబ్బందితో పాటు సుధాకర్‌ను, ఆయన కుటుంబ సభ్యులను, ఆయనకు వైద్యం చేసిన కింగ్ జార్జ్ ఆస్పత్రి అధికారులను, వైద్యులను విచారించింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి సుధాకర్‌పై 188, 357 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. ⇔ ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి నడి రోడ్డుమీద ప్రజాప్రతినిధులను దూషింంచడం, విధి నిర్వహణలో వున్న పోలీసులను తూలనాడటంతో పాటు స్థానికులను భయ బ్రాంతులకు గురి చేశారని సీబీఐ తన కేసులో పేర్కొన్నట్టు సమాచారం. కాగా, 23 మంది సాక్షుల సమాచారంతో పాటు 130 పేజీలతో కూడిన సిడి ఫైల్‌ను నాలుగో పట్టణ టౌన్ పోలీసులు సీబీఐకి అందించారు. -
పన్నెండేళ్లకు కుటుంబం చెంతకు..
జక్రాన్‌పల్లి: మతిస్థిమితం కోల్పోయి తప్పిపోయిన ఓ వివాహిత 12 ఏళ్లకు సొంతింటికి చేరుకుంది. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం పడకల్ గ్రామానికి చెందిన సావిత్రి, లింగన్న దంపతులు. వీరికి ఏడాది పాప ఉంది. సావిత్రి మతిస్థిమితం కోల్పోవడంతో 2007లో పాపను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. 2008లో చెన్నై రైల్వే స్టేషన్లో పోలీసులు ఈమెను అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశం మేరకు సావిత్రిని చెన్నై మానసిక వైద్యశాలలో చేర్పించగా.. పాపను బాలిక సం రక్షణ కేంద్రానికి తరలించారు. 12 ఏళ్లపాటు చికిత్స పొందిన సావిత్రి.. మామూలు స్థితిలోకి వచ్చింది. దీంతో ఐఎంహెచ్ డాక్టర్లు ఎక్కడి నుంచి వచ్చావని అడిగితే ఊరు పడకల్, మండలం జక్రాన్‌పల్లి, జిల్లా నిజామాబాద్ అని తెలిపింది. అక్కడి అధికార యంత్రాంగం నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌కు 4 రోజుల క్రితం సమాచారం అందించారు. సోమవారం చెన్నైలో సావిత్రిని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. సావిత్రి కూతురు లావణ్య ఎనిమిదో తరగతి ఇంగ్లిష్ మీడియం చదువుతోంది. లావణ్య పూర్తిగా ఇంగ్లిష్ లేదా తమిళం మాట్లాడుతుండటంతో ఆమెను పడకల్‌కు పంపించడంలేదని తెలిపారు. 12 ఏళ్ల తరువాత తన బిడ్డ ఇంటికి చేరుకుంటుండటంతో కుటుంబీకులు, బంధువుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. -
వరంగల్‌లో మెంటల్ ఆస్పత్రి
సాక్షి ప్రతినిధి,వరంగల్: వరంగల్‌లో త్వరలో మానసిక రోగుల ఆస్పత్రిని నెలకొల్పబోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో ఈ దవాఖానా ఏర్పాటు కాబోతుంది. రూ. 33 కోట్ల వ్యయంతో 75 పడకల సామర్థ్యంతో ఆస్పత్రి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో ప్రస్తుతం మానసిక రోగుల ఆస్పత్రి ఉంది. ఇది మినహా ప్రభుత్వ రంగంలో మరో ఆస్పత్రి ఎక్కడా లేదు. మానసిక రోగాలు తలెత్తితే హైదరాబాద్ వరకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. వాస్తవంగా సాధారణ పేషెంట్ల కంటే మానసిక రోగులకు రోజుల తరబడి చికిత్స అందించాల్సి ఉంటుంది. దీంతో ఉత్తర తెలంగాణ రోగులకు హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఆస్పత్రిలో చికిత్స పొందడం వ్యయప్రయాసలతో కూడిన వ్యవహారంగా మారింది. అయితే ఈ ఇబ్బం దులను తొలగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 శాతం భాగస్వామ్యంతో మానసిక రోగుల ఆస్పత్రిని వరంగల్‌లో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. కాకతీయ మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో ఈ ఆస్పత్రి సేవలు అందించనుంది. ప్రతిపాదనలకు ఆమోదం.. కాకతీయ మెడికల్ కాలేజీ పరిధిలో మానసిక రోగుల ఆస్పత్రి ఏర్పాటు చేయాలంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాం కింద ఈ పథకానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. రూ. 33 కోట్లతో 75 పడకల సామర్థ్యంతో దవాఖానాను మంజూరు చేయాల్సిందిగా ప్రతిపాదనలు పంపారు. వీటికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ డిప్యూటీ సెక్రటరీ అలోక్మాథూర్ తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా కేఎంసీ యాజమా న్యాన్ని ఇటీవల ఆదేశించారు. ఈ మేరకు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ ఆదేశాల ప్రకారం మెంటల్ ఆస్ప త్రికి సంబంధించిన నిర్మాణం ఎన్ని ఎకరాల్లో ఏర్పాటు చేయాలి. ఆస్పత్రి భవనంలో వివిధ విభాగాలైన ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్, ఫొరెన్సిక్ సైన్స్, అడాలసెంట్ సైకాలజీ, క్లినికల్ సైకాలజీ, క్రిమినల్ సైకాలజీ, సైకియాట్రిక్ సోషల్‌వర్క్, కౌన్సిలింగ్ తదితర సేవలు ఎక్కడెక్కడ నెలకొల్పుతారనే అంశాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాల్సి ఉంటుంది. వీటిని డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీలో జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశంలోపు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులకు అందివ్వాల్సి ఉంది. వీటి ఆధారంగా కేంద్ర ప్రభుత్వం సాంకేతిక అను మతులు జారీచేసి సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఆస్పత్రి భవన నిర్మాణాలు ప్రారంభిస్తారు. సాధ్యమైనంత వరకు తుది అనుమతులు వచ్చిన తర్వాత ఆరు నుంచి ఏడాదిలోపు భవన నిర్మాణాన్ని పూర్తిచేసి వైద్య సేవలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకు న్నారు. కాగా, మెంటల్ ఆస్పత్రికి కేటాయించిన రూ. 33 కోట్లలో రూ. 19.8 కోట్ల నిధులు కేవలం భవనానికి కేటాయించనున్నారు. మిగిలిన నిధులతో ఆస్పత్రికి అవసరమైన సామగ్రిని సమకూర్చుతారు. కాగా, ఈ ఆస్పత్రి నిర్మాణానికి కనీసం మూడు ఎకరాల స్థలం అవసరం అవుతుంది. ప్రస్తుతం ఎంజీఎం ఆస్పత్రి ప్రాంగణంలో స్థల లభ్యత లేదు. దీంతో కేఎంసీ ప్రాంగణంలో నిర్మించాలా లేదా ఇతర ప్రాంతాల్లో నిర్మించాలా అనే అంశంపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్కటిగా.. 1970వ దశకంలో కాకతీయ మెడికల్ కాలేజీ ఏర్పాటైంది. ఈ ఆస్పత్రికి అనుబంధంగా ఎంజీఎంతో పాటు హన్మకొండ, వరంగల్‌లో ప్రసూతి ఆస్పత్రులు ఉన్నాయి. ఆ తర్వాత ప్రాంతీయ కంటి దవాఖానా, ఛాతి ఆస్పత్రులు వరంగల్‌కు మంజూరయ్యాయి. అనంతరం వైద్యసేవల పరంగా ఆశించిన పురోగతి లేదు. గత నాలుగేళ్లలో మళ్లీ వైద్య సేవల పరంగా వేగం పెరిగింది. ఎంజీఎం ఆస్పత్రిలో మాతాశిశు విభాగం ఇప్పటికే ప్రారంభమై సేవలు అందిస్తోంది. రూ. 150 కోట్లతో 250 పడకల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ మరికొన్ని నెలల్లో సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా మానసికరోగుల ఆస్పత్రి మంజూరు కావడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
'రూ.200 కోట్ల భూమి అన్యాక్రాంతం'
హైదరాబాద్:ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రి ప్రాంగంణలోని రూ.200 కోట్ల విలువైన భూమి అన్యాక్రాంతమైందని తెలంగాణ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. మెంటల్ ఆస్పత్రిలో భూమిని రఘువంశ ప్రసాద్ అనే వ్యక్తి భూమిని కబ్జా చేశాడని ఆయన తెలిపారు. మంగళవారం మెంటల్ ఆస్పత్రిని తెలంగాణ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ కృష్ణారెడ్డి, సభ్యులు సుధాకర్ రెడ్డి, రాంరెడ్డి వెంకట్ రెడ్డిలు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందన్నారు. ఈ భూమిని రక్షించాల్సిన బాధ్యత రెవెన్యూ, సీఎంపైనే ఉందని తెలిపారు. దీనికి సంబంధించి రికార్డులు కమిటీ ముందు ఉంచాలని ఆదేశించినట్లు తెలంగాణ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పేర్కొంది. మెంటల్ ఆస్పత్రి ప్రాంగణంలో ఖైదీల వార్డు నిర్మాణం జాప్యమవుతుందన్నారు. -
పిచ్చాసుపత్రిలో రైతులకు ప్రత్యేక సెల్
ఇప్పటి ఏపీ సీఎం.. అప్పుడెప్పుడో చెప్పిన మాటను ఉత్తరప్రదేశ్ సర్కారు వంటబట్టించుకుంది! 'రైతులు ఆత్మహత్యలు చేసుకునేది మానసిక సమస్యలతోనేగానీ ప్రభుత్వాల వైఫల్యంతో కాదు' అని నిర్ధారణకు వచ్చింది. అందుకే మెంటల్ హాస్పిటళ్లలో ప్రత్యేక వార్డులు తెరిచి రైతులకు ట్రీట్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమైంది! ఆ క్రమంలోనే మొదటి విడతగా ఆగ్రా పట్టణంలోని ప్రభుత్వ మానసిక వైద్యశాలలో స్పెషల్ వార్డును ప్రారంభించింది. ఆత్మహత్యకు పాల్పడే అవకాశాలున్న రైతుల్ని గుర్తించి.. ఆసుపత్రికి తీసుకొచ్చి.. పంట నష్టపోతే ఆందోళనకు గురికావద్దని, చనిపోవాలనే ఆలోచన వస్తే భార్యాబిడ్డల్ని తలుచుకోవాలని మోటివేషన్ క్లాసులు నిర్వహిస్తున్నారు మానసిక వైద్యులు! అదేంటి..ఒట్టి మాటలే చెబుతారా? గట్టి మేలేదీ చెయ్యరా? అనే ప్రశ్నలకు.. 'ఆత్మహత్యలు నివారించేందుకు మేం చేయగలిన ప్రయత్నాలన్నీ చేశాం. చనిపోయిన రైతుల జాబితాతోపాటు రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్రానికి లేఖలు రాశాం. రూ. 3,500 కోట్ల సహాయం అందిస్తే సమస్యలు కొద్దివరకు పరిష్కారమవుతాయిని ఆశిస్తున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం మా విజ్ఞప్తుల్ని పట్టించుకోవట్లేదు' అని ప్రభుత్వాధికారులు సమాధానమిచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని 65 జిల్లాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంటలు దెబ్బతినడంతో దాదాపు 400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు అఖిలేశ్ సర్కార్ అధికారికంగా వెల్లడించింది. అన్నదాతకు మనోస్థైర్యం పెంచేందుకు అన్ని మెంటల్ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు తెరవాలనుకుంటోంది. -
వికారాబాద్‌కు పిచ్చాస్పత్రి!
* హెల్త్‌హబ్‌గా వికారాబాద్ * సీఎం కేసీఆర్ ప్రకటన సాక్షి, రంగారెడ్డి జిల్లా : వికారాబాద్‌ను హెల్త్‌హబ్‌గా మార్చనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించారు. ప్రస్తుతం ఎర్రగడ్డలో కొనసాగుతున్న క్షయ ఆస్పత్రి, పిచ్చాస్పత్రిని అనంతగిరికి తరలించనున్నట్లు చెప్పారు. శనివారం టీఆర్ఎస్ భవన్లో జిల్లాలవారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించిన కేసీఆర్.. జిల్లా ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సమావేశంలో రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డితో కలిసి ఎంపీలు విశ్వేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీలు నరేందర్‌రెడ్డి, యాదవరెడ్డి, జనార్దన్‌రెడ్డి ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, కనకారెడ్డి, పార్టీ నేతలు నాగేందర్‌గౌడ్, చంద్రశేఖర్‌రెడ్డి, కేఎస్ రత్నం తదితరులు పాల్గొని సమస్యల్ని వివరించారు. -
చిట్టితల్లి
‘‘నాన్న సచ్చిపోయినాడు. అమ్మకు పిచ్చిలేసింది. పోలీసోళ్లు ఆసుపత్రిలో చేర్పించినారు. నాల్గో తరగతి సదువుతుంటి. నల్గురు సెల్లెల్లను సూస్కోనీక బడి మానేసిన. కవిత(6), రేణుక(4), వెంకటేశ్వరమ్మ(2)కు అమ్మా నాయిన గొత్తుకొచ్చి ఏడుస్తరు. సిన్న సెల్లెలు సుజాతరాణికి ఏడు నెలలు. పాలు, బిస్కట్లు నేనే తినిపించాల. రేత్రికి సిన్నాయిన ఇంట్ల పండుకుంటం.’’ - ఇదీ కోడుమూరు నియోజకవర్గంలోని ప్యాలకుర్తికి చెందిన తొమ్మిదేళ్ల లక్ష్మి దీనగాథ గ్రామానికి చెందిన చిట్టెమ్మకు మతిభ్రమించింది. తానేమి చేస్తున్నానో తెలియని పరిస్థితుల్లో నెల రోజుల క్రితం భర్త సంజన్నను కొడవలితో కడతేర్చింది. పోలీసులు అరెస్టు చేసి ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి తరలించారు. ఈ దంపతులకు ఐదుగురు సంతానం. పెద్ద కూతురైన తొమ్మిదేళ్ల లక్ష్మి మిగిలిన వారందరికీ పెద్దదిక్కుగా మారింది. ఆడిపాడే వయస్సులో చెల్లెళ్లను అన్నీ తానై చూసుకుంటోంది. గుక్కపట్టి ఏడ్చే ఏడు నెలల చిన్నారిని ఓదార్చేందుకు ఈ బాలిక పడే అవస్థలు చూస్తే ఎలాంటి హృదయమైనా ద్రవించక మానదు. తనకూ చదువుకోవాలనే ఆశ ఉన్నా.. చెల్లెళ్ల ఆలనాపాలన చూసుకోవడం, వారిని బడికి పంపేందుకు చంపేసుకుంది. అన్నెంపున్నెం ఎరుగని వయస్సులో తోబుట్టువుల భారం భుజానికెత్తుకున్న ఈ చిట్టితల్లి గాథ కొందరినైనా కదిలిస్తే.. ఆ తెగిన గాలిపటాలకు ఓ ఆ‘ధారం’ దొరికినట్లే. - న్యూస్‌లైన్, కోడుమూరు -
పిచ్చివాళ్ల స్వర్గం
హ్యూమరం పిచ్చాసుపత్రి నుంచి ఒకాయన తప్పించుకు పారిపోయి జనంలో పడ్డాడు. మొదట ఒక రాజకీయ నాయకుడు ఎదురయ్యాడు. ‘‘చారిత్రక సన్నివేశంలో బృహత్తర పథకం ఎదురైంది. మిగులు జలాల పోరాటం రాజీనామాలతో పరిష్కారం. పేదల కన్నీటి ఉప్పెన ఒత్తిడి వాయుగుండమై అల్పపీడనమై ప్రజా సంక్షేమమే ప్రధాన కర్తవ్యం’’ అని ఉపన్యసిస్తుండగా, పిచ్చివాడు జడుసుకుని కాలి సత్తువ కొద్దీ పారిపోతూ ఉంటే ఒక పుస్తకావిష్కరణ సభ తగిలింది. ‘‘ఈ పుస్తకం మస్తక పరీక్ష. కవిత్వం కాదిది కన్నీటి తత్వం. జనం గుండె గల్లంతు సాగర సంగమ తటాక జల తరంగిణి పాఠక బుర్ర రామకీర్తనగా...’’ పిచ్చివాడికి కోపమొచ్చి, ‘‘ఏం మాట్లాడుతున్నార్రా?’’ అని గట్టిగా అరిచాడు. ‘‘మాట్లాడే సమయంలో నోరు మూసుకుని ఉండటం, నోరు మూసుకోవాల్సిన సమయంలో మాట్లాడటం రచయితల మౌళిక హక్కు. అర్థం కాకుండా మాట్లాడితే వేదాంతం. అర్థం లేకుండా మాట్లాడితే సిద్ధాంతం. అర్థమే పరమార్థమైతే ఎకనామిక్స్. అర్థాన్ని జీర్ణం చేసుకుంటే పాలిటిక్స్’’ అని కర్రలు తీసుకుని రచయితలంతా పిచ్చివాడిని తరుముతున్నారు. ఎక్కడికి పారిపోవాలో తెలియక, మనవాడు ఒక సినిమా ఆడియో ఫంక్షన్‌లోకి వెళ్లాడు. ‘‘కళామతల్లి సేవకులం, భృత్యులం, ఆ తల్లి పాదధూళి సోకితే రాయికి ప్రాణమొస్తుంది. ఆ తల్లికి జోల పాడుతాం. కళామతల్లి...’’ అంటూ ఒకాయన పూనకమొచ్చినట్టు ఊగుతున్నాడు. ‘‘ఆ తల్లి ఎక్కడుంది?’’ అని పిచ్చివాడు అమాయకంగా అడిగాడు. ‘‘ఎక్కడుందో ఎవరికీ తెలియదు. ఆమెని చూసినవాళ్లు ఇంతవరకూ లేరు’’ అని దివాళా తీసిన ఒక నిర్మాత చెప్పాడు. అయోమయంగా వెళుతున్న పిచ్చివాడిని ఒక చానెల్వాళ్లు లాక్కెళ్లారు. ‘ప్రజాస్వామ్యానికి జబ్బు చేసిందా, లేదా?’ అన్న అంశంపై బోలెడు మంది నాయకులు డాక్టర్లతో చర్చావేదిక సాగుతుంటే పిచ్చాయనకు కూడా మైకిచ్చారు. ‘‘ప్రజాస్వామ్యానికి బీపీ పడిపోయింది. షుగర్ లెవెల్స్ పెరిగాయి. నాడి అందడం లేదు. గుండె ఎక్కడుందో తెలియడం లేదు’’ అంటూ పిచ్చివాడిని అభిప్రాయం చెప్పమన్నారు. ‘‘ప్రజాస్వామ్యమంటే ఏంటి?’’ అన్నాడు మనవాడు. మైకులు, కెమెరాలతో చావబాదారు. పిచ్చివాడు నేరుగా పిచ్చాసుపత్రికి వెళ్లి, ‘‘ఇక్కడి కంటే బయటే పిచ్చివాళ్లు ఎక్కువగా ఉన్నారు. ఇదే సేఫ్’’ అంటూ డాక్టర్ని బతిమాలి చేరిపోయాడు. - జి.ఆర్.మహర్షి మహర్షిజం రాజకీయ నాయకుల ప్రత్యేకత: వాళ్లు తక్కువగా మాట్లాడే నెల - ఫిబ్రవరి వాళ్లు చచ్చినా స్వర్గానికి ఎందుకు వెళ్లరు? - వెళ్లినా దాన్ని నరకంగా మారుస్తారు. సులభంగా గెలిచే ఆట - మల్లయుద్ధం (రోజూ ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి) కేంద్ర మంత్రుల స్పెషాలిటీ? ఏకకాలంలో నాటకం, తోలుబొమ్మలాట, బుర్రకథ, భరతనాట్యం అభినయించగలరు. అమాయకత్వం: శుభం కార్డు పడిన తరువాత కూడా ఇంకా సినిమా ఉందనుకోవడం. సామాన్యుడి కామెంట్: తెలుగులో మాట్లాడినా మన నాయకుల మాటలు అర్థం కావడం లేదు. -
'టిడిపి కార్యాలయం పిచ్చాసుపత్రిలో పెట్టుకోవడం మంచిది'