హైదరాబాద్:ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రి ప్రాంగంణలోని రూ.200 కోట్ల విలువైన భూమి అన్యాక్రాంతమైందని తెలంగాణ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. మెంటల్ ఆస్పత్రిలో భూమిని రఘువంశ ప్రసాద్ అనే వ్యక్తి భూమిని కబ్జా చేశాడని ఆయన తెలిపారు. మంగళవారం మెంటల్ ఆస్పత్రిని తెలంగాణ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ కృష్ణారెడ్డి, సభ్యులు సుధాకర్ రెడ్డి, రాంరెడ్డి వెంకట్ రెడ్డిలు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందన్నారు.
ఈ భూమిని రక్షించాల్సిన బాధ్యత రెవెన్యూ, సీఎంపైనే ఉందని తెలిపారు. దీనికి సంబంధించి రికార్డులు కమిటీ ముందు ఉంచాలని ఆదేశించినట్లు తెలంగాణ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పేర్కొంది. మెంటల్ ఆస్పత్రి ప్రాంగణంలో ఖైదీల వార్డు నిర్మాణం జాప్యమవుతుందన్నారు.