mt krishna babu
-
ఏపీలో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు
సాక్షి,విజయవాడ : కేరళలో కోవిడ్ కేసులు పెరుగుతున్నందునే కేంద్రం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసిందని ఏపీ వైద్యారోగ్య శాఖ స్పెషల్ సీఎస్ ఎం.టి కృష్ణబాబు తెలిపారు. ఈ విషయమై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కోవిడ్ కేసుల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు. ‘ఏపీ నుంచి ఈ సీజన్‌లోలో కేరళ వెళ్లే అయ్యప్ప భక్తులు ఎక్కువ ఉంటారు. శబరిమల వెళ్లి వచ్చిన భక్తులకి కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించాం. 12 మెడికల్ కళాశాలల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశాం’ అని తెలిపారు. ‘ప్రతీ గ్రామ సచివాలయానికి పది ర్యాపిడ్ కిట్లు పంపించాం. ఫీవర్ ఉన్న వారికి ర్యాపిడ్ కిట్లతో ముందుగా పరీక్షలు చేస్తాం. ఇందులో పాజిటివ్ వచ్చిన వారి శాంపిల్స్ ఆర్టీపీసీఆర్ ల్యాబులకు పంపేందుకు ఏర్పాట్లు చేశాం. పాజిటివ్ వచ్చిన వారిలో కోవిడ్ వేరియంట్ తెలుసుకోవడానికి విజయవాడలోని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌లో పరీక్షలు చేస్తాం’ అని చెప్పారు. జ్వరం, పొడి దగ్గు, డయేరియా లాంటి లక్షణాలు జెఎన్ 1 కొత్త వేరియంట్లో కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒమిక్రాన్ కంటే వేగంగా కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతోంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ మాస్క్ ధరించడం లాంటి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏపీలో 33 వేలకి పైగా ఆక్సిజన్ బెడ్స్, 6 వేలకి పైగా ఐసీయూ బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. వెంటిలేటర్లకు, కోవిడ్ మందులకి కొరత లేదు’అని కృష్ణబాబు తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులలో ఏర్పాటు చేసిన RTPCR ల్యాబ్ లను క్రియాశీలకం చేయాలి. రోజుకు కనీసం వెయ్యి పరీక్షలు నిర్వహించేలా సిద్ధం కావాలి. విలేజ్ హెల్త్ క్లినిక్ లకు ర్యాపిడ్ టెస్ట్ కిట్లను సిద్ధం చేయాలి. ఫ్లూ జ్వరం లేదా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న రోగులకు RTPCR టెస్ట్ లను తప్పనిసరి చేయాలి. గ్లౌజ్‌లు, మాస్క్ లు, శానిటైజర్లు వంటి రక్షణ పరికరాలను అన్ని ఆస్పత్రులలో సిద్ధంగా వుంచుకోవాలి. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారికి అవసరమైన ఆక్సిజన్ సరఫరా కోసం LMO, PSA, ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల వంటి వాటిని, డి టైప్ సిలిండర్లను సిద్ధంగా ఉంచాలి. జ్వరం, దగ్గు వంటి ఎటువంటి స్వల్ప లక్షణాలు కన్పించినా సంబంధిత వ్యక్తులు ఐసోలేషన్‌లో ఉండాలి. దీనితో పాటు రానున్న పండుగ సీజన్లలో అన్ని ప్రాంతాలలో రద్దీ పెరుగనున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని ప్రజల్ని కోరారాయన. శబరిమలై యాత్రకు వెళ్లే భక్తులు తగినంత ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, వారిలో ఎటువంటి వ్యాధి లక్షణాలు కన్పించినా వారు తక్షణణం దగ్గరలోని విలేజ్ క్లనిక్ లో పరీక్షలు చేయించుకుని ఆరోగ్య పరిస్థితిని నిర్ధారించుకోవాలని సూచించారు. అయితే ప్రస్తుతం ఏ విధంగానూ ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని, తాము ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా నిరంతరం అప్రమత్తతతో వ్యవహరిస్తున్నామని, ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు మన రాష్ట్రంలో కోవిడ్ కేసులు తాజాగా ఇప్పటి వరకూ ఒక్కటి కూడా నమోదు కాలేదని, అయితే కేరళ వంటి రాష్ట్రాలలో కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో మనం అత్యంత జాగ్రత్తగా వుండాల్సిన అవసరం వుందని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు అన్నారు. గ్రామ సచివాలయ స్థాయిలో వున్న విలేజ్ క్లినిక్ లు అన్నింటికీ యాంటిజెన్ టెస్ట్ కిట్లు ఇప్పటికే అందచేశామని ఆయన చెప్పారు. అక్కడ ఏదైనా పాజిటివ్ గా నిర్ధారణ అయితే దానిని ఆర్టీపీసీఆర్ టెస్ట్ కు పంపటానికి వీలుగా రాష్ట్రంలోని 11 వైద్య కళాశాలల్లో టెస్ట్ లకు అవసరమైన సౌకర్యాలను సిద్ధంగా ఉంచామని చెప్పారు. అక్కడ కూడా పాజిటివ్ నిర్ధారణ అయితే విజయవాడలో జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపి వేరియంట్ ను గుర్తించి దాని వ్యాప్తి నిరోధానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అయితే కేరళ, తమిళనాడు తరహాలో మన రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఇటువంటి సమస్య తలెత్తలేదని, అయితే మనం ముందు జాగ్రత్త పాటించటం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. బయటకు వెళ్లే సమయంలో మాస్క్ లు ధరించటం, సామాజిక దూరం పాటించటం, పరిశుభ్రతను పాటించటం వంటి చర్యల ద్వారా వ్యాధి వ్యాప్తిని నివారించవచ్చని ఆయన సూచించారు. ఇదీచదవండి..జమ్ములో ఆంధ్రప్రదేశ్ జవాను మృతి -
జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా లక్ష మంది పేదలకు రిఫరల్ సేవలు
సాక్షి, గుంటూరు జిల్లా: జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలకు ఇప్పటి వరకు 55 లక్షల మంది ఓపీకి రాగా.. వీరిలో దాదాపు లక్ష మందికి ఆరోగ్యశ్రీ కింద మెరుగైన వైద్యానికి డాక్టర్లు రిఫరల్‌కు పంపించారని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి.కృష్ణ బాబు తెలిపారు. కేవలం రిఫరల్‌తో ఆగిపోకుండా చికిత్స అనంతరం తిరిగి గ్రామాలకొచ్చాక కూడా ఆయా పేషంట్ లు ఏమేరకు సంతృప్తి పొందారో ఫీడ్ బ్యాక్ తీసుకుని, బాగుందని సంతృప్తి చెందే వరకు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచించారని తెలిపారు. ఆ దిశగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. మంగళగిరి టిడ్కో ఇళ్ల సముదాయాల్లో మార్కండేయ కాలనీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్, గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఆరోగ్య శ్రీ సీఈవో ఎం.యన్.హరీందర ప్రసాద్, గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రావణ్ బాబు పాల్గొన్నారు. గతంలో ఒక యుపిహెచ్సీ పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని నిర్వహించాలనుకున్నామని తెలిపిన ఎం. టీ. కృష్ణబాబు.. ప్రతి వార్డు సచివాలయంలో కూడా శిబిరాన్ని ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించినట్లు తెలిపారు. అలాగే ఆరోగ్య శ్రీ యాప్‌లను వాలంటీర్ల ద్వారా డౌన్లోడ్ చేయించే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. తద్వారా సమీపంలో ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు,ఆరోగ్య మిత్రల ఫోన్ నంబర్లు వంటి సమాచారం యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అలాగే ఆరోగ్య శ్రీకి సంబంధించి పూర్తి సమాచారంతో ముద్రించిన బ్రోచర్లను కూడా ఇంటింటికి పంపిణీ చేశామన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటి వరకూ 12 వేలకు పైగా శిబిరాల్ని నిర్వహించామని, సరాసరి 450 ఓపీలు నమోదయ్యాయని కృష్ణ బాబు పేర్కొన్నారు. వీరందరికీ పరీక్షలు, మందులతో పాటు స్పెషలిస్ట్ డాక్టర్ల సేవల్ని ఉచితంగా అందించామన్నారు. అవసరమైన వారికి మెరుగైన వైద్యం కోసం రిఫరల్ కూడా చేశారన్నారు. ఆరోగ్య శ్రీ పై కూడా పెద్ద ఎత్తున అవగాహన కల్పించామన్నారు. పేద ప్రజలకు ఏ రకమైన ఆరోగ్య సమస్య వచ్చినా.. ప్రభుత్వం నుండి ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందించాలన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశమన్నారు. ఆరోగ్య శ్రీపై ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పించేందుకు 45 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్‌ను చేపడతామన్నారు. ఆరోగ్య శ్రీ యాప్‌ను పెద్ద ఎత్తున డౌన్లోడ్ చేసేందుకు ఎఎన్ ఎం/సిహెచ్వోలు, వాలంటీర్లతో కలిసి పనిచేస్తారని కృష్ణ బాబు తెలిపారు. గ్రామాల్లో అక్కడికక్కడే పూర్తి స్థాయి షుగర్ టెస్టులు చేయడానికి చర్యలు తీసుకున్నట్లు కృష్ణబాబు తెలిపారు. తగిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చెయాలని కమీషనర్ నివాస్, ఆరోగ్య శ్రీ సీఈవో హరీంధరప్రసాద్లకు ఆదేశాలు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. తనిఖీల్లో భాగంగా ఆరోగ్య శ్రీ బ్రోచర్ ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారా అని ఆరా తీశారు.ఆరోగ్యశ్రీ బ్రోచర్లోని సమాచారాన్ని చదివారా? అని రోగుల్ని అడిగి తెలుసుకున్నారు. శిబిరానికొచ్చిన రోగులు , వృద్ధులు, గర్భిణులతో మాట్లాడారు. ఆరోగ్య శ్రీ యాప్ ను ఎఎన్ఎంలు డౌన్లోడ్ చేయిస్తున్నారా అని ఆరా తీశారు. జగనన్న ఆరోగ్య సురక్ష బ్యాగులు , ఫోల్డర్లు సరిపడా ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకన్నారు. ఇదీ చదవండి: చికిత్స తర్వాత చంద్రబాబు జైలుకెళ్లాల్సిందే: సజ్జల -
Kurnool Medical College: మల్టీ యుటిలిటీ సెంటర్ నిర్మాణానికి అవగాహన ఒప్పందం
మంగళగిరి(గుంటూరు జిల్లా): కర్నూలు మెడికల్ కాలేజీ ప్రాంగణంలో రూ.15 కోట్లతో నిర్మించే మల్టీ యుటిలిటీ సెంటర్‌కు మంగళగిరిలోని APIIC టవర్స్ 6 వ అంతస్తులో సోమవారం నాడు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి MT కృష్ణబాబు ఛాంబర్లో అవగాహనా ఒప్పందాన్ని ( MOU ) కుదుర్చుకున్నారు. కర్నూలు మెడికల్ కాలేజ్ గ్రాడ్యుయేట్స్ ట్రస్ట్ ( KMC) కార్యదర్శి డి.ద్వారకనాథ రెడ్డి , కోశాధికారి డాక్టర్ మహేష్ కుమార్ మార్డ మల్టీ యుటిలిటీ సెంటర్ నిర్మాణానికి స్థలం కేటాయింపు కోసం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) డాక్టర్ నరసింహంతో కలిసి MOUపై సంతకాలు చేశారు. ఈ ప్రతిపాదిత బహుళ-వినియోగ కేంద్రానికి రూ. 15 కోట్ల మేర ఖర్చవుతుందని మరియు అదనపు విరాళాలతో మరింత అభివృద్ధి చేసేందుకు పూనుకుంటామని కెఎంసిజి ట్రస్టు ప్రతినిధులు ఈ సందర్భంగా తెలిపారు. మల్టీ-యుటిలిటీ సెంటర్లో ఒకేసారి 300 మందికి వసతి కల్పించడానికి వర్చువల్ కాన్ఫరెన్స్ హాల్, డిజిటల్ లైబ్రరీ మరియు ఇతర ఆధునిక విద్యా మౌలిక సదుపాయాలు ఉంటాయని, ప్రపంచ బోధనా వాతావరణంలో తమ వృత్తిని రూపొందించుకోవడంలో విద్యార్థులకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని వారు తెలిపారు. కర్నూలు మెడికల్ కాలేజ్ అలూమిని ఆఫ్ నార్త్ అమెరికా మరియు కర్నూలు మెడికల్ కాలేజ్ అలూమిని అసోసియేషన్ లు కలిసి కర్నూల్ మెడికల్ కాలేజ్ గ్రాడ్యుయేట్స్ ట్రస్ట్ ( KMCGT)గా ఏర్పడింది. ఈ ప్రాజెక్టును చేపట్టినందుకు KMCGT ప్రతినిధుల్ని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ ఎం.టి కృష్ణ బాబు ఈ సందర్భంగా అభినందించారు . అలాగే ఇతర అలూమిని అసోసియేషన్లు మరియు ట్రస్టులు కూడా సమాజానికి సేవ చేయడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. వైద్య సంస్థలోని విద్యార్థులు, సిబ్బంది మరియు రోగులకు సహాయక సౌకర్యాల్ని అందించేందుకు KMC గ్రాడ్యుయేట్స్ ట్రస్ట్ కృషి చేస్తోందని, కర్నూలు మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులు కళాశాల పోర్టల్‌ల ద్వారా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు (కర్నూల్ మెడికల్ కాలేజ్ ఉత్తర అమెరికా పూర్వ విద్యార్థులు & భారతదేశం మరియు ప్రపంచంలోని ఇతర విద్యార్థులు) కలిసి వచ్చారని ప్రతినిధులు తెలిపారు. రాబోయే మల్టీ యుటిలిటీ సెంటర్ వైద్య విద్యార్థులకు ఇండోర్ గేమ్స్ మరియు పెవిలియన్ కోసం ఉపయోగపడుతుంది. పై అంతస్తులో వర్చువల్ కాన్ఫరెన్స్ హాల్, డిజిటల్ లైబ్రరీ మొదలైనవాటిని.ఏర్పాటు చేస్తారు. విద్యార్థులు ప్రపంచ బోధనా వాతావరణంలో వారి కెరీర్‌ను రూపొందించుకునేందుకు ఈ సెంటర్ అన్ని విధాలా ఉపయోగపడుతుంది. కర్నూలు మెడికల్ కాలేజీ ఆవరణలో కేటాయించిన స్థలంలో అంతర్జాతీయ నాణ్యత, సామర్థ్య ప్రమాణాలతో మల్టీ యుటిలిటీ సెంటర్ కు సంబంధించి KMC గ్రాడ్యుయేట్స్ ట్రస్ట్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య PPP విధానంలో చేపడతాయి. బహుళ-వినియోగ కేంద్రంలోKMC గ్రాడ్యుయేట్స్ ట్రస్ట్ గ్రౌండ్, మొదటి మరియు రెండవ అంతస్తుల్ని నిర్మిస్తుంది. ఈ సెంటర్ ను నిర్మించేందుకు KMC గ్రాడ్యుయేట్స్ ట్రస్ట్, APMSIDC కలిసి పనిచేస్తాయి. వర్చువల్ కాన్ఫరెన్స్ హాల్, డిజిటల్ లైబ్రరీ మరియు కౌన్సెలింగ్ సెంటర్ రూపంలో ప్లేస్మెంట్లు పొందడానికి మరియు పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి KMC ట్రస్టు గ్రాడ్యుయేట్లకు తగిన శిక్షణ ఇవ్వడంతో పాటు అవసరమైన పరికరాలు, ఆడియో-విజువల్ ఎయిడ్స్, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్, డిజిటల్ లైబ్రరీ కోసం పుస్తకాల సబ్స్క్రిప్షన్ల సేకరణ, ఇన్‌స్టాలేషన్‌కు బాధ్యత వహిస్తుంది. క్రీడా కార్యకలాపాలలో విద్యార్థులను మరింత గా ప్రోత్సహించేందుకు కూడా ఈ ట్రస్ట్ ఎంతగానో కృషి చేస్తుంది. -
క్యాన్సర్ నివారణకు ప్రత్యేక శ్రద్ధ.. రూ.400 కోట్లతో చికిత్స..
అమరావతి: ప్రజలకు క్యాన్సర్ నివారణ, చికిత్స అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎం.టి క్రిష్ణబాబు అన్నారు. అంతర్జాతీయ క్యాన్సర్ నివారణ దినం సందర్భంగా ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అమెరికన్ అంకాలజీ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన వాకథాన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వాకథాన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 ఏళ్ళ క్రితం సాంక్రమిక వ్యాధులతో(సీడీ) ప్రజలు ఎక్కువగా మరణించే వారని, మారిన జీవన శైలి, పరిస్థితుల్లో ఇప్పుడు అసాంక్రమిక వ్యాధుల(ఎన్సీడీ) కారణంగా ఎక్కువ మంది మృత్యువాత పడుతున్న విషయాన్ని గమనించాలన్నారు. సాంక్రమిక వ్యాధులకు సంబంధించి అత్యాధునిక వైద్య చికిత్సలు, ఔషధాలు అందుబాటులోకి రావటంతో ఆ మరణాల సంఖ్యగణనీయంగా తగ్గిందన్నారు. జీవనశైలి, ఆహారపు అలవాట్ల మార్పు కారణంగా సోకుతున్న క్యాన్సర్, మధుమేహం (డయాబెటిస్), రక్తపోటు (బీపీ) వంటి అసాంక్రమిక వ్యాధులతో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయన్నారు. 20 ఏళ్ల క్రితం ఈ మరణాల సంఖ్య 30 శాతం లోపు వుండగా, ఇప్పుడది 60 శాతానికి పైగా పెరిగిందన్నారు. ఇందుకు ముఖ్యంగా జన్యుపరమైన కారణాల కంటే మన జీవన శైలి లో మార్పే కారణమని ఆయన స్పష్టం చేశారు. ప్రాణాంతకమైన అలవాట్ల వల్ల నోటి క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ వంటి వాటికి ఎక్కువగా గురవుతున్నారన్నారు . క్యాన్సర్ వ్యాధుల కారణంగా 9 శాతం మంది ప్రజలు మృత్యువాత పడుతున్నారని తాజా అంచనాల ద్వరా తెలుస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏటా దాదాపు 35 వేల మందికి పైగా క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్నారన్నారు. మరో 70 వేల మంది కొత్తగా క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నారని ఆయన చెప్పారు. ఈ వ్యాధికి ప్రస్తుతం మన వద్ద ఉన్న చికిత్సా విధానాలు కేవలం జీవన కాలాన్ని పెంచటానికి తప్ప, వ్యాధి నివారణకు, వ్యాధిని తగ్గించటానికి పనికిరావటం లేదన్నారు. భవిష్యత్తులో క్యాన్సర్ వ్యాధికి పూర్తి స్థాయి చికిత్స అందుబాటులోకి వస్తుందని తాను ఆశిస్తున్నానన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గత ఏడాది క్యాన్సర్ చికిత్సకు రూ..430 కోట్లు ఖర్చు చేశామని క్రిష్ణబాబు వెల్లడించారు. నెట్వర్క్ ఆస్పత్రులలో క్యాన్సర్‌ను ప్రధాన వ్యాధిగా చేర్చి అనేక వైద్య విధానాలను ప్రవేశపెట్టామని, దేశంలో మరెక్కడా లేని విధంగా స్టేజ్ 1 నుండి స్టేజ్ 4 వరకూ పాలియేటివ్ కేర్ వంటి వైద్య విధానాలను అందుబాటులోకి తెచ్చి ప్రజలకు వ్యాధి బారి నుండి సాంత్వన కలిగించే ప్రయత్నం చేశామన్నారు. వ్యాధిగ్రస్తులకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించటంతో పాటు స్టేజ్ 4 దాటిన వారికి గౌరవ ప్రదమైన మరణాన్ని పొందేందుకు వెసులుబాటు కల్పించామన్నారు. ఈ అంశాలపై సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని చెప్పారు. క్యాన్సర్ చికిత్సలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన డాక్టర్ నోరి దత్తాత్రేయుడును ప్రభుత్వ సలహాదారుగా నియమించారని, ఆయన సహకారంతో క్యాన్సర్ వ్యాధికి సమగ్ర చికిత్సనందించేందుకు అనువైన ప్రణాళిక రూపొందిస్తున్నామని క్రిష్ణబాబు వెల్లడించారు. అదే విధంగా మన రాష్ట్రంలో వున్న 11 వైద్య కళాశాలల్లో క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన సదుపాయాలను మెరుగుపర్చుకునేందుకు రూ.400 కోట్లు ఖర్చు పెట్టి కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. క్యాన్సర్ సోకిన తరువాత మనం చేసేది ఏమీ లేనప్పటికీ జీవన నాణ్యత, ప్రమాణాలను పెంచేందుకు అనువైన చికిత్సను అందించగలుగుతున్నామని చెప్పారు. చదవండి: పచ్చ పార్టీ.. పచ్చ కుట్రలు.. ఎల్లో మీడియా ఫేక్ స్టోరీలతో శునకానందం.. -
హృదయం పదిలం
సాక్షి, అమరావతి: సకాలంలో వైద్య సేవలు అందించడం ద్వారా హృద్రోగ మరణాలను నియంత్రించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. గోల్డెన్ అవర్‌లో చికిత్స అందిస్తే ప్రాణాపాయ పరిస్థితిని తప్పించవచ్చు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎస్.టి. ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (స్టెమీ) కార్యక్రమాన్ని అమలు చేసేలా వైద్య, ఆరోగ్య శాఖ ప్రణాళిక రూపొందించింది. సాధారణ పరిభాషలో స్టెమీ అంటే గుండె రక్తనాళాలు 100 శాతం పూడుకుపోవడంతో వచ్చే గుండెపోటు. ఇలాంటి సందర్భాల్లో ఆరు గంటల్లోగా లక్షణాలను గుర్తించి పూడికను కరిగించే చికిత్స (థ్రాంబోలైసిస్ ఇంజక్షన్) అందిస్తే ప్రాణాలను కాపాడవచ్చు. రాష్ట్రంలో సంభవిస్తున్న మొత్తం మరణాల్లో 32.4 శాతం హృదయ సంబంధిత వ్యాధులే కారణం. 38 లక్షల మందికి పైగా గుండె జబ్బు బాధితులున్నారు. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ)లో గుండె జబ్బులు అగ్రస్థానంలో ఉంటున్నాయి. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న సీఎం జగన్ వీటిపై దృష్టి సారించారు. ‘ఫ్యామిలీ డాక్టర్’ ద్వారా బీపీ, షుగర్, ఇతర ఎన్సీడీ బాధితుల ఆరోగ్యంపై నిరంతర ఫాలోఅప్ ఉంచాలని ఆదేశించారు. హబ్ అండ్ స్పోక్ విధానంలో.. హబ్ అండ్ స్పోక్ విధానంలో ‘స్టెమీ’ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. 26 జిల్లాల్లో క్యాథ్‌ల్యాబ్ సౌకర్యం కలిగిన ఆస్పత్రులను హబ్‌గా అభివృద్ధి చేసి జిల్లా, ఏరియా ఆస్పత్రులను స్పోక్స్‌గా తీర్చిదిద్దుతారు. రాష్ట్రంలో ఎనిమిది ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో ఇప్పటికే క్యాథ్‌ల్యాబ్ సౌకర్యం ఉండగా మిగిలిన చోట్ల కూడా అందుబాటులోకి తేనున్నారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో క్యాథ్‌ల్యాబ్ సౌకర్యం ఉన్న ఆస్పత్రులను హబ్స్‌గా నోటిఫై చేస్తారు. హబ్‌లో కార్డియాలజీ, యాంజియోప్లాస్టీ సదుపాయాలు, శిక్షణ పొందిన వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. స్పోక్స్‌గా వ్యవహరించే ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో జనరల్ ఫిజీషియన్, స్టాఫ్ నర్సులు, ఇతర వైద్య సిబ్బంది సేవలందిస్తారు. ఛాతీ నొప్పి, గుండె పోటు సంబంధిత లక్షణాలతో ఆస్పత్రులకు వచ్చే వారికి అత్యవసర వైద్య సేవలు అందించేలా సదుపాయాలు సమకూరుస్తారు. ఐసీయూ సెట్టింగ్‌తో (కరోనరీ కేర్ యూనిట్), ఎలక్టో కార్డియోగ్రామ్ (ఈసీజీ), కార్డియోవర్టర్, థ్రాంబోలైసిస్ థెరపీ నిర్వహించడానికి అవసరమైన మందులు, ఇతర సదుపాయాలు ఉంటాయి. బాధితులను అత్యవసరంగా పెద్దాస్పత్రులకు తరలించేందుకు వీలుగా 108 అంబులెన్స్ అందుబాటులో ఉంటాయి. ఇందులోనూ ఈసీజీ సౌకర్యం ఉంటుంది. సేవలు ఇలా.. ఏరియా, జిల్లా ఆస్పత్రులకు ఛాతీ నొప్పి, ఇతర గుండెపోటు లక్షణాలతో వచ్చిన వారికి వెంటనే టెలీ ఈసీజీ తీస్తారు. రిపోర్టు హబ్‌లో ఉండే కార్డియాలజిస్ట్‌కు వెళుతుంది. దీన్ని పరిశీలించి గుండె రక్తనాళం ఎంత శాతం పూడుకుపోయింది? వెంటనే థ్రాంబోలైసిస్ అవసరమా? అనే అంశాలను కార్డియాలజిస్ట్ నిర్ధారిస్తారు. స్పోక్ కేంద్ర వైద్యుడిని అప్రమత్తం చేసి అవసరం మేరకు ‘థ్రాంబోలైసిస్’ ఇంజక్షన్ ఇస్తారు. దీంతో రోగి ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడతాడు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హబ్/సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు తరలిస్తారు. రెండు నెలల్లో.. స్టెమీ కార్యక్రమాన్ని రెండు నెలల్లో అన్ని చోట్లా ప్రారంభించేలా చర్యలు చేపట్టాం. వైద్యులు, సిబ్బందికి ప్రోటోకాల్‌పై ప్రత్యేక శిక్షణ ఇస్తాం. స్పోక్ ఆస్పత్రులకు స్టెమీ కిట్స్ పంపిణీ చేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. దీంతో గోల్డెన్ అవర్‌లో బాధితులకు సత్వర వైద్యం లభిస్తుంది. – ఎం.టి.కృష్ణబాబు, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి తిరుపతిలో ఇప్పటికే అమలు.. స్టెమీ కార్యక్రమాన్ని గత రెండున్నరేళ్లుగా తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో వైద్య ఆరోగ్య శాఖ అమలు చేస్తోంది. తిరుపతి, చిత్తూరు, రాజంపేట, వైఎస్సార్ జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులు రుయా ఆస్పత్రిలోని హబ్‌కు అనుసంధానమై గుండెపోటు బాధితులకు సత్వర వైద్య సేవలు అందిస్తున్నాయి. ఇప్పటి వరకూ వంద మందికిపైగా ప్రాణాలను కాపాడామని రుయా మెడిసిన్, కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ మునీశ్వరరెడ్డి తెలిపారు. -
వైద్య నియామకాలకు స్పెషల్ మెడికల్ బోర్డు
సాక్షి, అమరావతి: వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పటికే పలు విప్లవాత్మక చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య, ఆరోగ్య శాఖలో నియామకాల కోసం ప్రత్యేకంగా ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఏపీ ఎంస్‌ఆర్‌బీ) ఏర్పాటు చేయనుంది. ఈమేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా, డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి మెంబర్ సెక్రటరీగా, జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి సభ్యుడిగా బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మానవ వనరుల కొరతకు తావుండరాదని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి జగన్ 2019 నుంచి ఏకంగా 46 వేల పోస్టుల భర్తీ చేపట్టిన విషయం తెలిసిందే. వైద్య శాఖలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేలా అత్యవసర అనుమతులు ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీల గుర్తింపు, భర్తీ ప్రక్రియ నిరంతరాయంగా చేపట్టేందుకు ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 2012లో తమిళనాడు మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటైంది. ఈ బోర్డు ద్వారానే వైద్య శాఖలో నియామకాల ప్రక్రియ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక బృందం తమిళనాడులో పర్యటించి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏపీ ఎంఎస్ఆర్బీ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. ఈ బోర్డు ద్వారానే వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించిన నియామకాలను చేపట్టనున్నారు. కీలక పరిణామం ఏపీ ఎంఎస్ఆర్బీ ఏర్పాటు వైద్య శాఖ చరిత్రలో కీలక పరిణామం కానుంది. ప్రభుత్వ ఆస్పత్రులను వేధిస్తున్న సమస్యల్లో మానవ వనరుల కొరతే ప్రధానం. సరిపడా వైద్యులు, వైద్య సిబ్బంది లేకపోవడం వైద్య సేవలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పెరిగిన జనాభా, రోగుల రద్దీకి అనుగుణంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సిబ్బందిని సమకూర్చడం, మౌలిక సదుపాయాల కల్పనలో గత ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులంటే నరకానికి చిరునామాగా 2019 ముందు వరకూ రాష్ట్రంలో పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దుస్థితిని అరికట్టేందుకు వైద్య శాఖలో ఏకంగా రూ.16 వేల కోట్లకు పైగా నిధులతో సీఎం జగన్ నాడు–నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మార్చడంతో పాటు 17 కొత్త వైద్య కళాశాలలు, ఇతర సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నెలకొల్పుతున్నారు. నిరంతర ప్రక్రియగా నియామకాలు వైద్య ఆరోగ్య శాఖలో ఎక్కడ పోస్టు ఖాళీగా ఉన్నా వెంటనే నోటిఫై చేసి భర్తీకి చర్యలు తీసుకోవాలని, నియామకాల కోసం ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈమేరకు బోర్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. వైద్య శాఖలో నియామకాలను నిరంతర ప్రక్రియగా కొనసాగించి ఎప్పటికప్పుడు ఆస్పత్రుల్లో వైద్య సిబ్బందిపై ఆడిట్ నిర్వహిస్తాం. ప్రస్తుతం వైద్య శాఖకు అవసరమైన మందులు, పరికరాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఏపీఎంఎస్ఐడీసీ ఉంది. ఇదే తరహాలో మానవ వనరుల కల్పనకు ఏపీ ఎంఎస్ఆర్బీ పని చేస్తుంది. – ఎం.టి.కృష్ణబాబు, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి -
‘ఫ్యామిలీ డాక్టర్’తో గ్రామీణులకు పూర్తివైద్యం
సాక్షి, అమరావతి: ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా గ్రామీణులకు పూర్తిస్థాయిలో వైద్యం అందించేలా పనిచేయాలని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు (సీహెచ్‌వోలకు) వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు సూచించారు. ఆయన గురువారం మంగళగిరిలోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి సీహెచ్‌వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్‌లో వైద్యసేవలన్నీ వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌ల ద్వారా అందుబాటులోకి వస్తాయని, సీహెచ్‌వోలు టీం లీడర్లుగా వ్యవహరిస్తారని చెప్పారు. సెర్ప్ ఆధ్వర్యంలోని విలేజ్ ఆర్గనైజేషన్ల ద్వారా గ్రామీణుల్లో అవగాహన కల్పించేందుకు స్థానిక పెద్దల సహకారం తీసుకోవాలని సూచించారు. ఎన్సీడీ సర్వేను త్వరగా పూర్తిచేయాలన్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్‌లతో పాటు టెలిమెడిసిన్ ద్వారా అవసరమైన మేరకు వైద్య సహాయం అందించాలని సూచించారు. పీహెచ్సీ వైద్యుడు గ్రామాన్ని సందర్శించే ముందురోజు సీహెచ్‌వో, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు రోగులను ఆస్పత్రికి తీసుకొచ్చేలా పనిచేయాలన్నారు. జిల్లా హబ్‌ల సూచనల మేరకు రోగులను ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు పంపించడంతోపాటు చికిత్స అనంతరం తిరిగివచ్చిన రోగుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు. ప్రతి వ్యక్తి ఆరోగ్య సమాచారంతో ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని సూచించారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతా (ఏబీహెచ్ఏ–అభా) నమోదు ప్రక్రియలో మిగిలిన 30 శాతాన్ని డిసెంబర్ నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. గర్భిణుల విషయంలో సీహెచ్‌వోలు ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలన్నారు. -
ఆరోగ్యశ్రీలో మానసిక ఆరోగ్య చికిత్సలు
సాక్షి, అమరావతి: ప్రైవేట్ మానసిక ఆస్పత్రులను వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో ఎంపానల్మెంట్ చేయడం ద్వారా మానసిక ఆరోగ్య చికిత్సలు పూర్తి స్థాయిలో విస్తరించాలని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు అధికారులను ఆదేశించారు. మంగళగిరిలోని వైద్యశాఖ కార్యాలయంలో స్టేట్ మెంటల్ హెల్త్ అథారిటీ (ఎస్ఎంహెచ్ఎ) సమావేశం మంగళవారం జరిగింది. కృష్ణబాబు మాట్లాడుతూ మానసిక చికిత్సలకు ప్రభుత్వాస్పత్రుల్లో ఇప్పటికే ఆరోగ్యశ్రీలో చికిత్సలు అందుబాటులో ఉన్నాయన్నారు. అయితే, కొన్ని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో మాత్రమే ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద మానసిక చికిత్సలు అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. అన్ని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో మానసిక ఆరోగ్య వైద్య సేవలకు ఆరోగ్యశ్రీ అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని జిల్లాల్లోనూ డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ రివ్యూ బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. సమావేశంలో ఎస్ఎంహెచ్ఎ సీఈవో, డీఎంఈ డాక్టర్ వినోద్‌కుమార్, ప్రత్యేక కార్యదర్శి నవీన్‌కుమార్, కో–ఆర్డినేటర్ డాక్టర్ రాధిక, జేడీ డాక్టర్ నీలిమ పాల్గొన్నారు. -
సంక్రాంతి నుంచి ‘ఫ్యామిలీ డాక్టర్’
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని వచ్చే నెల మొదటి వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు చెప్పారు. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు పైలట్ ప్రాజెక్టు నిర్వహిస్తామని, సంక్రాంతి నుంచి పూర్తిస్థాయిలో అమలు చేస్తామని చెప్పారు. ఆయన గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ విధానంలో ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు, ప్రతి పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు ఉంటారన్నారు. పీహెచ్‌సీలోని ప్రతి వైద్యుడు రోజు మార్చి రోజు 104 మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ)తో వెళ్లి గ్రామాల్లో వైద్య సేవలందిస్తారని చెప్పారు. ఇందుకోసం పీహెచ్సీ పరిధిలోని సచివాలయాలను వైద్యులకు మ్యాపింగ్ చేశామన్నారు. 104 ఎంఎంయూ వాహనంతో కలిసి వైద్యుడు ప్రతి గ్రామాన్ని నెలలో రెండుసార్లు సందర్శిస్తారని తెలిపారు. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న 656 వాహనాలకు అదనంగా మరో 434 వాహనాలు కొంటున్నట్లు చెప్పారు. ఇవి నవంబర్ నెలాఖరుకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని, డిసెంబర్ నుంచి ప్రతి గ్రామానికి 104 వాహనం రెండు సార్లు వెళుతుందని వివరించారు. పీహెచ్సీలో వైద్యుడు సెలవు పెట్టినప్పుడు వైద్య సేవలకు ఇబ్బంది కలగకుండా సమీపంలోని సీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ఇంకా ఇబ్బంది ఏర్పడితే సమీప ఏరియా, జిల్లా ఆస్పత్రుల వైద్యులను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. అదే విధంగా పీహెచ్సీ వైద్యులకు సీయూజీ ఫోన్ నంబర్లు కేటాయించి, వాటిని విలేజ్ క్లినిక్‌లలో ప్రదర్శిస్తామని చెప్పారు. ప్రజలు అవసరమైనప్పుడు ఆ నంబర్లలో ఫ్యామిలీ వైద్యుడిని సంప్రదించవచ్చని తెలిపారు. ఈ విధానాన్ని విజయవంతం చేయడానికి ఉద్యోగులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. ఫ్యామిలీ వైద్యుడి విధానం అమలులోకి వస్తే అధిక శాతం జబ్బులకు గ్రామంలోనే వైద్య సేవలు అందుతాయని, ప్రజలకు పెద్దాస్పత్రులకు వెళ్లే భారం తప్పుతుందని వివరించారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ చికిత్సలు పెంచుతాం ప్రస్తుతం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో చికిత్సల కోసం ఖర్చు చేస్తున్న నిధుల్లో ప్రభుత్వ ఆస్పత్రుల వాటా 25 శాతం ఉంటోందని చెప్పారు. వచ్చే ఆరు నెలల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వనరులు మెరుగుపరచడం ద్వారా ఈ వాటాను 50 శాతానికి పైగా పెంచుతామన్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ వైద్యుల్లో నైపుణ్యం పెంపు, సమన్వయం ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాల్లో వైద్య శాఖ కార్యకలాపాలను వైద్య కళాశాలల పరిధిలోకి తేనున్నట్లు చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వ వైద్య రంగం బలోపేతానికి ప్రభుత్వం 42 వేలకు పైగా వైద్యులు, వైద్య సిబ్బంది నియామకాలు చేపట్టిందన్నారు. త్వరలో మరో 4 వేల నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో వైద్య శాఖ ప్రత్యేక కార్యదర్శి, ఏపీ శాక్స్ పీడీ నవీన్‌కుమార్, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్ పాల్గొన్నారు. ప్రధాన ఆస్పత్రుల్లో బ్లడ్, ఆక్సిజన్ బ్యాంకులు ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రులన్నింటిలో బ్లడ్‌బ్యాంకులు, ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు చెప్పారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో గురువారం రెడ్‌క్రాస్ సొసైటీ పల్స్ ఆక్సీమీటర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను వైద్యశాఖకు అందించింది. ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ వీటిని ప్రధాన ఆస్పత్రులకు అందచేస్తామన్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ ఏపీ బ్రాంచ్ చైర్మన్ డాక్టర్ ఎ.శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా సమయంలో అంతర్జాతీయ రెడ్‌క్రాస్ ఫెడరేషన్ నుంచి ఏపీ రెడ్‌క్రాస్ సొసైటీకి వచ్చిన 4,965 పల్స్ ఆక్సీమీటర్లు, 600 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను రాష్ట్ర వైద్యశాఖకు ఇచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్యశాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్‌కుమార్, కుటుంబసంక్షేమ కమిషనర్ జె.నివాస్ పాల్గొన్నారు. -
చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రిలో అత్యాధునిక వైద్యం
చిలకలూరిపేట (పల్నాడు జిల్లా): చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రిలో అత్యాధునిక వైద్యం అందుబాటులోకి రానున్నదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో కొత్తగా నిర్మిస్తున్న 100 పడకల ఆస్పత్రిని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు, ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం మంత్రి పరిశీలించారు. మంత్రి రజిని మాట్లాడుతూ ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రాంగణంలో ప్రభుత్వం 100 పడకల ఆస్పత్రి నిర్మిస్తోందని చెప్పారు. దీని కోసం ఇప్పటికే రూ.18.57 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. 4.147 ఎకరాల విస్తీర్ణంలో ఇది నిర్మితమవుతోందని, పనులు దాదాపు పూర్తయ్యాయని, రెండు నెలల్లో ఆస్పత్రిని ప్రారంభిస్తామని చెప్పారు. ఈ ఆస్పత్రిలో ఏకంగా 95 మంది సిబ్బందిని నియమించనున్నట్టు వెల్లడించారు. 23 మంది వైద్యులే ఉంటారని చెప్పారు. అన్ని స్పెషాలిటీల వైద్యులూ ఉంటారని వివరించారు. ఆస్పత్రిని ట్రామా కేర్ సెంటర్‌గా కూడా మార్చేందుకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. చుట్టూ ప్రహరీ, సిమెంట్ రోడ్లు, ఫర్నిచర్ కోసం రూ.10 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. అనంతరం మంత్రి రజిని ఆస్పత్రిలో వైద్యులతో మాట్లాడి సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులతో మాట్లాడారు. మంత్రి వెంట ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ నివాస్, ఏపీవీవీపీ కమిషనర్ వినోద్‌కుమార్, ఏఎస్ఎంఎస్ఐడీసీ సీఈ శ్రీనివాసరావు, నోడల్ ఆఫీసర్ ప్రదీప్, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, ఏఎంసీ చైర్మన్ మద్దిరాల విశ్వనాథం ఉన్నారు. వచ్చే జూన్ నాటికి బైపాస్ పూర్తి వచ్చే ఏడాది జూన్ నాటికి చిలకలూరిపేట బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తవుతాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. చిలకలూరిపేట బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబుతో కలిసి మంత్రి పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ బైపాస్‌ను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్నట్టు చెప్పారు. రోడ్డుకిరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నామని, దేశంలోనే ఇలాంటి రహదారి నిర్మాణం ఇదే తొలిసారి అని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.800 కోట్ల వరకు ఖర్చు చేస్తోందని వివరించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చలువ వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. కోటప్పకొండకు ప్రభలు వెళ్లడానికి వీలుగా రహదారికి పురుషోత్తమపట్నం వద్ద అత్యవసర ద్వారాలను ఏర్పాటు చేయాలని ఎంటీ కృష్ణబాబును మంత్రి కోరారు. గణపవరం–అప్పాపురం రోడ్డులో అండర్ పాస్ నిర్మించాలని, నరసరావుపేట, కోటప్పకొండ రహదారి మధ్యన బైపాస్కు రెండో వైపునా సర్వీసు రోడ్డు నిర్మించేలా ప్రతిపాదించాలని సూచించారు. ఈ మూడు అంశాలను తాను ప్రత్యేకంగా పరిశీలిస్తానని, నేషనల్ హైవేస్ అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తానని కృష్ణబాబు తెలిపారు. (క్లిక్: ఆగస్టు 7న టీటీడీ ఆధ్వర్యంలో ఉచిత వివాహాలు) -
ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్న 896 మంది ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం కలిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలకు సంబంధించి విధివిధానాలను ఖరారు చేసింది. గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్టీసీ, జిల్లా కలెక్టర్ల పూల్ కింద కారుణ్య నియామకాలు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి ముందు సర్వీసులో ఉండగా.. 896 మంది ఉద్యోగులు మరణించారు. 2016 నుంచీ సర్వీసులో ఉండి.. మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చే అంశాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2020 జనవరి 1 నుంచి ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైంది. విలీనమైన తరువాత సర్వీసులో ఉండి మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులకు కారుణ్య నియామకాలు కూడా చేపట్టింది. కాగా అంతకుముందు 2016 నుంచి పెండింగ్‌లో ఉన్న 896 కారుణ్య నియామకాలు కూడా చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్టీసీ, కలెక్టర్ పూల్‌కింద ఉన్న ఉద్యోగాల్లో నియమించేందుకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి. ► పెండింగ్‌లో ఉన్న 896 మంది కారుణ్య నియామకాల జాబితాను ఆర్టీసీ ఎండీ సంబంధిత జిల్లా కలెక్టర్లకు పంపుతారు. ► వారిలో అర్హులను గుర్తించి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల్లో కలెక్టర్లు నియమిస్తారు. మిగిలిన అభ్యర్థుల జాబితాను ఆర్టీసీ ఎండీకి పంపిస్తారు. ► అలా మిగిలిన వారి జాబితాలోని అర్హతలను బట్టి ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్‌లుగా నియమిస్తారు. అప్పటికి ఇంకా మిగిలి ఉంటే ఆ జాబితాను తిరిగి సంబంధిత జిల్లా కలెక్టర్లకు పంపుతారు. ► ఆర్టీసీ ఎండీ నుంచి వచ్చిన జాబితాలో ఉన్నవారికి కలెక్టర్లు ఆయా జిల్లాల్లో ప్రభుత్వ విభాగాల్లో ఉన్న ఖాళీలలో భర్తీ చేస్తారు. సీఎం గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఆర్టీసీలో 2016 నుంచి పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధిత కుటుంబాల్లో వెలుగులు నింపుతూ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులకు గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్టీసీ, ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించడం గొప్ప విషయం. – చెంగయ్య, అధ్యక్షుడు, ఆర్టీసీ వైఎస్సార్ ఎంప్లాయీస్ యూనియన్ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలపై సానుకూల నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు. ప్రభుత్వంలో విలీనానికి ముందు సర్వీసులో ఉండి మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల పట్ల సానుకూల దృక్పథంతో మంచి నిర్ణయం తీసుకున్నారు. – పీవీ రమణారెడ్డి, వై.శ్రీనివాసరావు, ఎన్ఎంయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు -
‘చివరి విద్యార్థిని కూడా తీసుకువచ్చే బాధ్యత ప్రభుత్వానిదే’
సాక్షి, అమరావతి: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన విద్యార్థులందరినీ క్షేమంగా వెనక్కి తీసుకు వస్తామని.. విద్యార్థులు, తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులను తీసుకువచ్చే అంశంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారని తెలిపింది. ఈ అంశంపై ప్రతి రోజూ అధికారులతో సమీక్షిస్తూ పలు సూచనలు చేస్తున్నారని ఈ అంశంపై ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ ఎంటీ కృష్ణ బాబు తెలిపారు. తాజా పరిస్థితి సమాచారాన్ని శనివారం ఆయన సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరించారు. ఉక్రెయిన్‌లో ఉన్న చివరి విద్యార్థిని సైతం తీసుకు వచ్చే వరకు రాష్ట్ర ప్రతినిధులు అక్కడే ఉంటారన్నారు. గ్రామ స్థాయి నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 770 మంది విద్యార్థులు వైద్య విద్య కోసం ఉక్రెయిన్ వెళ్లినట్లు తేలిందన్నారు. వీరిలో ఇప్పటి వరకు 429 మందిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చామని తెలిపారు. మార్చి 9లోగా విద్యార్థులందరినీ వెనక్కి తీసుకువచ్చే విధంగా భారత విదేశాంగ శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుందని చెప్పారు. దానికి అనుగుణంగా రాష్ట్ర విద్యార్థులను త్వరితగతిన ఇక్కడికి తీసుకువచ్చేలా రాష్ట్ర ప్రతినిధులు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం గుర్తించిన 770 మందికి తోడు మరో 100–150 మంది రాష్ట్రానికి చెందిన వారు ఉండొచ్చని అంచనా వేస్తున్నామని, వీరందరినీ కూడా వెనక్కి తీసుకు రావడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయం చేస్తుందని స్పష్టం చేశారు. పరిస్థితులను బట్టి తరలింపు సరిహద్దు దేశాలకు ముందు వచ్చిన వారి కంటే వెనక వచ్చిన వారిని తొలుత పంపించేస్తున్నారంటూ కొంత మంది తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి వస్తున్న వార్తలు అపోహలంటూ కృష్టబాబు కొట్టిపారేశారు. స్థానిక పరిస్థితులను బట్టి.. సురక్షిత ప్రాంతాల్లో ఉన్నవారి కంటే బయట ఉన్న వారు తొలుత వెళ్లడానికి అనుమతిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ రోజు (శనివారం) బుడాపెస్ట్‌లో 2,000 మందికి వసతి ఏర్పాటు చేయగా, బయట మరో 2,000 మంది నిరీక్షిస్తున్నారని చెప్పారు. ఇలా వసతికి నోచుకోని వారిని ముందుగా పంపుతున్నారన్నారు. సరిహద్దు దేశాలకు చేరుకున్న వారి వసతి, రవాణా సదుపాయాలను చూడటానికి నాలుగు దేశాలకు నలుగురు ప్రతినిధులను రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని గుర్తు చేశారు. హంగేరికి ఏపీఎన్ఆర్టీ ప్రెసిడెంట్ మేడపాటి వెంకట్, పోలాండ్‌కు యూరోప్ ప్రత్యేక ప్రతినిధి రవీంద్ర రెడ్డి, రుమేనియాకు రాష్ట్ర ప్రభుత్వ ప్రవాసాంద్ర డిప్యూటీ సలహాదారు చంద్రహాస రెడ్డి, స్లోవేకియాకు నాటా ప్రతినిధి పండుగాయల రత్నాకర్‌ను నియమించిందని తెలిపారు. ఇందులో ఇప్పటికే మేడపాటి వెంకట్, రవీంద్రరెడ్డి, చంద్రహాస రెడ్డిలు ఆయా దేశాలకు చేరుకొని విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. దేశంలోకి వచ్చిన విద్యార్థులను ప్రభుత్వ ఖర్చులతో సొంత ఊరికి పంపడానికి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, తిరుపతి, విశాఖ, విజయవాడల్లో రాష్ట్ర ప్రతినిధులను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రవాసాంధ్ర వ్యవహారాల ప్రత్యేక అధికారి గితేష్ శర్మ మాట్లాడుతూ.. యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో రాష్ట్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలోని విదేశీయులను తరలించడానికి రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించిందని, తద్వారా వారిని క్షేమంగా సరిహద్దులకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఢిల్లీ చేరుకున్న 161 మంది తెలుగు విద్యార్థులు సాక్షి, న్యూఢిల్లీ, ముంబై: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న మరో 161 మంది తెలుగు విద్యార్థులు ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి చేరుకున్నారు. ఇందులో ఏపీకి చెందిన 96 మంది, తెలంగాణకు చెందిన 65 మంది ఉన్నారు. వీరికి ఏపీ భవన్, తెలంగాణ భవన్‌కు చెందిన ఉద్యోగులు ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పించారు. ఇక్కడి నుంచి వారి స్వస్థలాలకు వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మరో 39 మంది రాక ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థులను తీసుకొస్తున్న మరో విమానం శనివారం ముంబైకి చేరుకుంది. ఈ విమానంలో ఏపీ విద్యార్థులు 39 మంది ఉన్నారు. వీరికి ఏపీ ప్రభుత్వ నోడల్ అధికారి వి.రామకృష్ణ స్వాగతం పలికారు. అనంతరం వారికి ఉచితంగా భోజనం, వసతి ఏర్పాటు చేసి.. తర్వాత వారి స్వస్థలాలకు తరలించారు. -
ఉక్రెయిన్: ఏపీ విద్యార్థుల కోసం టాస్క్ ఫోర్స్ పనిచేస్తోంది
సాక్షి, అమరావతి: ఉక్రెయిన్‌లో ఉన్న రాష్ట్ర విద్యార్థుల కోసం టాస్క్ ఫోర్స్ పనిచేస్తుందని టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ ఎం.టీ కృష్ణబాబు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విద్యార్థుల వివరాలను సేకరిస్తున్నామని, ఎవరైనా1902 నంబర్‌కు కాల్ చేసి వివరాలు ఇవ్వొచ్చని పేర్కొన్నారు. ఇతర దేశాలలో ఉన్నవారి కోసం వాట్సాప్ నెంబర్ అందుబాటులో ఉంచామని తెలిపారు. అన్ని విధాలుగా వివరాలను తెలుసుకుని మాస్టర్ లిస్ట్ తయారు చేశామని చెప్పారు. 212 మంది విద్యార్థుల డేటాను విదేశీ వ్యవహారాల శాఖకు పంపామని అన్నారు. ముంబై, ఢిల్లీకి రెండు విమానాలు వస్తున్నాయని చెప్పారు. ముంబై, ఢిల్లీలో ఏపీ వాళ్ల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎంత మంది వస్తారన్న దానిపై స్పష్టత రాలేదన్నారు. లిస్ట్‌లో ఉన్నా లేకున్నా అక్కడ రిసీవ్ చేసుకుంటామని అన్నారు. విద్యార్థులను ప్రభుత్వ ఖర్చులతో తీసుకోస్తామని, ముంబై వచ్చేవారిని ట్రావెల్ ఏజెన్సీ ద్వారా తీసుకోస్తామని చెప్పారు. బోర్డర్లకు రావొద్దని ఇప్పుడు చెప్తున్నారని, ఎక్కడ వాళ్లని అక్కడే ఉండాలని సూచిస్తున్నారని తెలిపారు. 300 మందితో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశామని చెప్పారు. వారికి నిరంతరం సూచనలు చేస్తున్నామని, విద్యార్థులు ఎవరు బోర్డర్‌కు రావొద్దని సూచిస్తున్నామని తెలిపారు. ఏడు యూనివర్సిటీల్లో ఏపీ విద్యార్థులు ఎక్కువగా ఉన్నారని, రుమేనియాకు దగ్గరలో వాళ్లు ఉన్నారని, ఎంబసీ ద్వారా వచ్చే మెసేజ్‌ల ద్వారానే విద్యార్థులు స్పందించాలన్నారు. ఎంత ఖర్చుకైనా వెనకడొద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారని ఎం.టీ కృష్ణాబాబు తెలిపారు. -
గుంటూరు చేరిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్
లక్ష్మీపురం(గుంటూరు): గుజరాత్ జామ్‌నగర్‌లోని రిలయన్స్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్ కంటైనర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం న్యూగుంటూరు రైల్వేస్టేషన్ ఆవరణలోని కాంకర్ కంటైనర్ డిపోకు చేరుకుంది. ఈ ఆక్సిజన్‌ను ఇతర జిల్లాలకు పంపేందుకు చేస్తున్న ఏర్పాట్లను రాష్ట్ర కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూం ప్రత్యేకాధికారి ఎంటీ కృష్ణబాబు, కోవిడ్ నోడల్ అధికారి డాక్టర్ ఆర్జా శ్రీకాంత్‌లతో పాటు జేసీ దినేష్‌కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంటీ కృష్ణబాబు మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయించినా సరిపోకపోవడంతో 910 మెట్రిక్ టన్నులు కేటాయించాలని ఐదు రోజుల కిందట సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధానికి లేఖ రాసినట్టు చెప్పారు. దీంతో స్పందించిన కేంద్రం రెండు ఆక్సిజన్ కంటైనర్లను రైలు ద్వారా పంపినట్టు తెలిపారు. గుంటూరుకు వచ్చిన ఆక్సిజన్‌ను పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాలకు సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. జామ్‌నగర్ నుంచి ఇదే విధంగా రోజూ ఆక్సిజన్ సరఫరా చేయాలని కోరుతూ సీఎం వైఎస్ జగన్ శనివారం మరోసారి ప్రధానికి లేఖ రాసినట్టు చెప్పారు. జేసీ దినేష్‌కుమార్ మాట్లాడుతూ గుంటూరుకు చేరుకున్న ఆక్సిజన్‌ను గుంటూరు జిల్లాకు 30 మెట్రిక్ టన్నులు, కృష్ణా జిల్లాకు 20, ప్రకాశం, పశ్చిమగోదావరి, కర్నూలు జిల్లాలకు 10 మెట్రిక్ టన్నుల చొప్పున సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం నరేంద్రవర్మ, డీవోఎం వి.రాంబాబు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏపీ హెడ్ రవిరామరెడ్డి తదితరులున్నారు. -
టీఎస్ఆర్టీసీ కోరినట్లే ప్రతిపాదనలు పంపాం
సాక్షి, అమరావతి: తెలంగాణ ఆర్టీసీ అధికారులు కోరినట్లే ప్రతిపాదనలు పంపించామని, రూట్ల వారీగా స్పష్టత ఇచ్చామని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ, రవాణా, ఆర్అండ్బీ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు శుక్రవారం మీడియాకు తెలిపారు. ఏపీఎస్ ఆర్టీసీ 1.04 లక్షల కి.మీ. తగ్గించుకుందని, 1.61 లక్షల కి.మీకే పరిమితం అయ్యామని చెప్పారు. ఈ ప్రతిపాదనలతో ఏపీఎస్ ఆర్టీసీకి నష్టం వస్తున్నా ప్రయాణికుల ఇబ్బందులను దృష్ట్యా టీఎస్ ఆర్టీసీ డిమాండ్లకు అంగీకరించామని వివరించారు. ఈ నెల 19నే తుది ప్రతిపాదనలు పంపించామని, వాళ్లు కోరినట్లు ప్రతిపాదనలు పంపినా ఇంకా గందరగోళం ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. ► విజయవాడ – హైదరాబాద్ రూట్లో ఏపీఎస్ఆర్టీసీ బస్సులు తగ్గించాలని తెలంగాణ అధికారులు కోరారు. వారి విజ్ఞప్తి మేరకు 322 బస్సులను తగ్గిస్తూ ప్రతిపాదనలు పంపించాం. ► ఏపీ, తెలంగాణ మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం కుదిరేలోగా రెండు రాష్ట్రాల ఆర్టీసీలు 70 వేల కి.మీ. చొప్పున బస్సులు నడుపుదామని ప్రతిపాదించినా వారు అంగీకరించలేదు. ► 2 రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో రోజుకు రూ. 3.50 కోట్ల వరకు నష్టం వాటిల్లుతోంది. -
అదనంగా 17 వేల వైద్య సిబ్బంది సిద్ధం..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులను దృష్టిలో పెట్టుకొని 46198 బెడ్లు సిద్ధం చేసినట్లు కోవిడ్- 19 టాస్క్‌ఫోర్స్ నోడల్ అధికారి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. ప్రతి జిల్లాలో 5 వేల బెడ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పశ్చిమగోదావరి, చిత్తూరు జిల్లాలో ఇప్పటికే ఈ మేరకు బెడ్లు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. కోవిడ్ సమాచారానికి సంబంధించి 1902 కాల్ సెంటర్ పని 24 గంటలు నిరంతరాయంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. కోవిడ్ ఆస్పత్రుల్లో మరిన్ని సౌకర్యాలు పెంచే దిశగా ప్రభుత్వం ఐఏఎస్ అధికారి రాజమౌళిని నియమించిందని.. ఆయనతో పాటు అర్జా శ్రీకాంత్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ కన్నబాబు కలిసి పని చేస్తారన్నారు. ఇక వైరస్ తీవ్రతరమవుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా కోవిడ్ కేర్ సెంటర్ల సామర్థ్యం పెంచుతున్నట్లు కృష్ణబాబు తెలిపారు. అక్కడ ఉన్న పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులు తెలుసుకొనేందుకు వీలుగా హెల్ప్ డెస్క్ పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని పేర్కొన్నారు. అదే విధంగా కోవిడ్ సెంటర్లలో పెట్టే భోజనం, శానిటేషన్, మందులు, మరుగుదొడ్లు, పరిశుభ్రత వంటి తొమ్మిది అంశాలపై ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్ తీసుకుంటామని తెలిపారు. సిబ్బంది ఏమాత్రం అలసత్వం వహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. (అట్టడుగు వర్గాల సంక్షేమమే లక్ష్యం: సీఎం జగన్) ‘‘ప్రతి కోవిడ్ సెంటర్ నుంచి ప్రతి రోజు 5 నుంచి 6 మంది దగ్గర నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాము. రానున్న రోజుల్లో మెరుగైన సదుపాయాల కోసం 17000 మంది వైద్య సిబ్బందిని అదనంగా సిద్ధం చేశాము. కోవిడ్ వలన చనిపోయిన వారి అంత్యక్రియల కోసం 15000 ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. చనిపోయిన సమయంలో 20 మంది, పెళ్లిళ్లకు 50కు మించి మంది హాజరయ్యేందుకు అనుమతి లేదు. నిబంధనలకు మించి గుమిగుడితే పోలీసులు చర్యలు తీసుకుంటారు’’ అని కృష్ణబాబు పేర్కొన్నారు. -
కోవిడ్ కేర్ సెంటర్ల సామర్థ్యం పెంచుతున్నాం
-
మరికాసేపట్లో అండమాన్‌కు 'హర్షవర్దన్'
విశాఖపట్నం : అండమాన్ వెళ్తున్న హర్షవర్దన్ నౌకలో సాంకేతిక లోపం తలెత్తి నడి సముద్రంలో నిలిచిపోవడంపై విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ ఎం.టి. కృష్ణబాబు బుధవారం విశాఖపట్నంలో స్పందించారు. మధ్యాహ్నాం 2.00 గంటల తర్వాత ఈ నౌక అండమాన్ బయలుదేరే అవకాశం ఉందని తెలిపారు. నౌకలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని సరి చేసేందుకు సాంకేతిక నిపుణులను పంపుతున్నట్లు చెప్పారు. అలాగే నౌకలో ప్రయాణిస్తున్న 560 మందికి ఆహారాన్ని పంపుతున్నట్లు కృష్ణాబాబు వెల్లడించారు. హర్షవర్దన్ నౌక దాదాపు 600 మంది ప్రయాణికులతో మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖపట్నం పోర్టు నుంచి అండమాన్ బయలుదేరింది. బయలుదేరిన కొద్దిసేపటికే నౌకలో సాంకేతిక లోపం ఏర్పడినట్లు సిబ్బంది గుర్తించారు. దీంతో వారు పోర్టు ట్రస్ట్ ఉన్నతాధికారులను సంప్రదించారు. నౌక నిలిచిపోవడంతో అందులోని ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నౌకలో ప్రయాణిస్తున్న వారిలో అత్యధికులు ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలకు చెందిన వారని... వారంతా అండమాన్‌లో ఉపాధి చేసుకుంటున్న వారని సమాచారం. నౌక నడి సంద్రంలో చిక్కుకుందని తెలిసిన ప్రయాణికుల బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. -
ఈసారి.. లెహర్
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: లెహర్ తుపాను టై పుట్టిస్తోంది. పై-లీన్ కంటే తీవ్రంగా ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తుపాను తీరం దాటే సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. బుధవారం సాయంత్రానికి మచిలీపట్నంలోని బందరువైపు తుపాను దిశ మారింది. గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రంలోపు తీరం దాటుతుందని, ఆ సమయంలో కృష్ణా, గుంటూరు జిల్లాలతోపాటు ప్రకాశం జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించడంతో జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. అధికార యంత్రాంగం తుపానును ఎదుర్కొనేందుకు అన్ని చర్యలూ తీసుకుంటోంది. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ (08592 28144)ను ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నం(1077)ను కూడా సిద్ధంగా ఉంచారు. ఒంగోలు రెవెన్యూ డివిజనల్ కార్యాలయం, కందుకూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలతోపాటు తీర ప్రాంతాల్లోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. జిల్లాకు నియమించిన స్పెషల్ ఆఫీసర్ ఎంటీ కృష్ణబాబు గురువారం ఒంగోలు వస్తున్నారు. తీర ప్రాంతాలకు స్పెషల్ ఆఫీసర్లు.. లెహర్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని 11 తీర ప్రాంతాలకు నియమించిన స్పెషల్ ఆఫీసర్లు వారికి కేటాయించిన మండలాలకు చేరుకున్నారు. బుధవారం రాత్రి అక్కడే బస చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటూ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మత్స్యకార గ్రామాల్లోని పెద్దలతో మాట్లాడి మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూడాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సెలవులు రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్కడున్నా వెంటనే తాము పనిచేసే ప్రాంతాలకు చేరుకొని అందుబాటులో ఉండాలని ఆదేశించారు. జిల్లాలోని 95 తీర ప్రాంతాల్లో లక్షా 840 మంది జనాభా నివశిస్తున్నారు. తుపాను తీవ్రతను బట్టి వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు గ్రామానికి ఒకటి చొప్పున 95 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. 320 టన్నుల బియ్యం, లక్షా 36 వేల లీటర్ల కిరోసిన్ సిద్ధంగా ఉంచారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 170 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరికలు రావడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా ముందస్తు చర్యలు తీసుకొంది. రాత్రివేళల్లో ఇళ్లల్లో నుంచి బయటకు రావద్దని జిల్లా యంత్రాంగం ప్రజలను కోరింది. విపత్తు బృందాలు.. హెలికాప్టర్లు లెహర్ తుపాను వల్ల అతి భారీ వర్షాలు కురిస్తే యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు అందించేందుకు జాతీయ విపత్తుల నివారణ సంస్థ నుంచి రెండు ప్రత్యేక బృందాలను పంపించాలని జిల్లా యంత్రాంగం కోరింది. అదేవిధంగా ఒక హెలికాప్టర్‌ను కూడా సిద్ధంగా ఉంచాలని సూచించింది. తుపాను ప్రభావం కృష్ణా, గుంటూరులపై ఎక్కువగా ఉండే అవకాశాలుండటంతో అక్కడ బృందాలను, హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచుతామని, తుపాను తీవ్రత ప్రకాశం జిల్లాపై ఉంటే వెంటనే వచ్చేలా వాటిని సిద్ధం చేసినట్లు జిల్లాకు సమాచారం అందింది. వాడరేవులో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చీరాల, న్యూస్‌లైన్: లెహర్ తుపాను నేపథ్యంలో మండలంలోని వాడరేవులో బుధవారం మూడో నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. చీరాలలో చిరుజల్లులు కురిశాయి. సముద్రంలో అలల తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. వాడరేవు, తదితర ప్రాంతాల్లోని బోట్లను జెట్టి వద్ద నిలిపి వలలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మండలంలోని వాడరేవు, చినబరప, పాకల, విజయలక్ష్మీపురం, తదితర ప్రాంతాల్లో వేటకు వెళ్లిన మత్స్యకారులు తుపాను కారణంగా ఇంటికి వచ్చేందుకు పయనమవుతున్నారు.