క్యాన్సర్ బారినపడిన పేద, మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్యశ్రీ కొండంత అండగా ఉంటోంది. 2019 నుంచి ఇప్పటివరకు 2.64 లక్షల మంది బాధితులకు జగన్ ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఉచితంగా చికిత్స అందించింది. ఇందుకోసం రూ.1,801 కోట్లు ఖర్చుచేసింది.
ఈ ఫొటోలో మంచంపై ఉన్న మహిళ పేరు కె. సువార్త. ఈమెది పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం అల్లూరివారిపాలెం గ్రామం. పొదుపు సంఘాల ఆర్పీగా పనిచేస్తోంది. భర్త ఆటో డ్రైవర్. కొద్దినెలల క్రితం గొంతులో సమస్య మొదలైంది. క్రమంగా ఆ సమస్య తీవ్రమై ఆహారం తీసుకోవడానికి ఇబ్బందిగా మారింది. దీంతో వైద్యులను సంప్రదిస్తే.. గొంతు క్యాన్సర్‌గా నిర్ధారించారు. ఉన్నంతలో సంతోషంగా జీవించే ఆ కుటుంబంలో ఆందోళన మొదలైంది.
ఇంతలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్‌కు ఉచిత వైద్యం లభిస్తుందని తెలియడం రాజేశ్‌కు ఎంతో ఊరటనిచ్చింది. దీంతో విజయవాడలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి భార్యను తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు. ఈ క్రమంలో రాజేశ్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటివరకూ నా కుటుంబానికి సీఎం జగన్ ప్రభుత్వం అనేక పథకాలు అందించింది. ఇప్పుడు నా ఇల్లాలు క్యాన్సర్‌తో బాధపడుతుంటే ఉచిత వైద్యం కూడా అందిస్తోంది. ఆరోగ్యశ్రీ పథకం లేకుంటే ఈ రోజున నా భార్యను బతికించుకునేందుకు నేను ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చేదో’’.. అని అంటున్నాడు.
– సాక్షి, అమరావతి
ఇలా సువార్తలాగే క్యాన్సర్ బారినపడ్డ పేద, మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకం కొండంత అండగా ఉంటోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ పథకం పరిధిని సీఎం జగన్ విస్తరించారు. టీడీపీ ప్రభుత్వంలో 1,059గా ఉన్న ప్రొసీజర్స్‌ను ఏకంగా 3,257కు పెంచారు. అలాగే, టీడీపీ హయాంలో 200లోపు మాత్రమే క్యాన్సర్ ప్రొసీజర్లు ఉండగా ప్రస్తుతం 400కు పైగా క్యాన్సర్ ప్రొసీజర్లు పథకం పరిధిలోకి వచ్చాయి. లుకేమియా (బ్లడ్ క్యాన్సర్) బాధితులకు నిర్వహించే అత్యంత ఖరీదైన బోన్ మ్యారో స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను ఆరోగ్యశ్రీ కింద చేస్తున్నారు. అలాగే, రూ.10 లక్షలు, ఆపైన ఖర్చయ్యే ఈ ప్రొసీజర్‌ను పూర్తి ఉచితంగా చేస్తున్నారు. ఇలా ఏ తరహా క్యాన్సర్‌కైనా ఆరోగ్యశ్రీలో ఉచితంగా చికిత్స లభిస్తోంది.
ఒక్క క్యాన్సరే కాకుండా..
క్యాన్సర్‌కే కాక.. హృద్రోగాలు, కిడ్నీ, లివర్ ఇలా వివిధ రకాల చికిత్సలు ఆరోగ్యశ్రీ ద్వారా బాధితులకు ఉచితంగా అందుతున్నాయి. అదే టీడీపీ హయాంలో ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడంతో అప్పట్లో పేదలు పడ్డ కష్టాలు అన్నీఇన్నీ కావు. కానీ, ఆ తర్వాత ఆరోగ్యశ్రీకి పూర్వవైభవం తీసుకొస్తూ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న చర్యలతో పేద, మధ్యతరగతి ప్రజలకు భారీ మేలు చేకూరుతోంది. ప్రొసీజర్లను 3,257కి పెంచి 2019 నుంచి ఇప్పటికి 40 లక్షల మందికి ఉచిత వైద్యం అందించారు. చికిత్స అనంతరం విశ్రాంత సమయానికి ఆరోగ్య ఆసరా కింద కూడా అండగా నిలుస్తున్నారు. ఇలా ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా కోసం 2019 నుంచి ఇప్పటికి రూ.10వేల కోట్లకు పైగా జగన్ సర్కార్ ఖర్చుచేసింది.
ప్రభుత్వమే నా మనవరాలిని బతికించింది..
నా మనవరాలికి బ్లడ్ క్యాన్సర్. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి మాది. మమ్మల్ని ఆరోగ్యశ్రీ పథకం ఆదుకుంది. ఒకరోజు జీవచ్ఛవంలా పడిపోయిన పాపను ఎత్తుకుని విజయవాడలోని హెచ్‌సీజీ ఆస్పత్రికి వెళ్లాం. అక్కడ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా పాపకు వైద్యం మొదలుపెట్టారు. ప్రస్తుతం వైద్యం కొనసాగుతోంది. ఈరోజు నా మనవరాలి ప్రాణాలను సీఎం జగన్ ప్రభుత్వం కాపాడింది.
– శాంతకుమారి, విజయవాడ
2.64 లక్షల మందికి వైద్యం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ కింద 2,64,532 మంది క్యాన్సర్ బాధితులకు ఉచితంగా వైద్యం అందించారు. ఇందుకోసం ప్రభుత్వం ఏకంగా రూ.1,801.30 కోట్లు ఖర్చుచేసింది. ఇదే 2014–19 మధ్య టీడీపీ హయాంలో క్యాన్సర్ చికిత్సకు కేవలం రూ.751.56 కోట్లు ఖర్చుచేశారు. అంటే.. నాలుగేళ్లలోనే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం టీడీపీ కంటే రూ.1,049.74కోట్లు అదనంగా ఖర్చుచేసింది.
ప్రభుత్వమే నా మనవరాలిని బతికించింది..
నా మనవరాలికి బ్లడ్ క్యాన్సర్. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి మాది. మమ్మల్ని ఆరోగ్యశ్రీ పథకం ఆదుకుంది. ఒకరోజు జీవచ్ఛవంలా పడిపోయిన పాపను ఎత్తుకుని విజయవాడలోని హెచ్‌సీజీ ఆస్పత్రికి వెళ్లాం. అక్కడ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా పాపకు వైద్యం మొదలుపెట్టారు. ప్రస్తుతం వైద్యం కొనసాగుతోంది. ఈరోజు నా మనవరాలి ప్రాణాలను సీఎం జగన్ ప్రభుత్వం కాపాడింది. – శాంతకుమారి, విజయవాడ
ఆరోగ్యశ్రీ లేకపోయి ఉంటే..
మా నాన్నకు గొంతు క్యాన్సర్ వచ్చింది. ఆయన కౌలు రైతు. వ్యవసాయం మీద వచ్చే ఆదాయంతో వాళ్లు జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్యాన్సర్ చికిత్సకు సొంతంగా ఖర్చుపెట్టే స్థోమత లేదు. ఆరోగ్యశ్రీ పథకం మా నాన్నను ఆదుకుంది. పథకం లేకపోయి ఉంటే ఎంతో కష్టంగా ఉండేది. ఈ మేలును ఎప్పటికీ మరువలేం.
– ప్రశాంతి, శృంగవృక్షం గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా
పూర్తి ఉచితంగా వైద్యం..
అన్ని రకాల క్యాన్సర్‌తో పాటు, రూ.వెయ్యి వైద్యం ఖర్చు దాటే ప్రతి ప్రొసీజర్‌ను ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చింది. అర్హులైన లబ్దిదారులకు ఉచితంగా వైద్యం అందేలా చూస్తున్నాం. చికిత్స అనంతరం రోగుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నాం. మెజారిటీ శాతం సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు పథకాన్ని మరింతగా మెరుగుపరచడానికి నిరంతరం కసరత్తు చేస్తున్నాం.
– ఎంఎన్ హరేంధిరప్రసాద్, సీఈఓ, డా. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ
Comments
Please login to add a commentAdd a comment