సాక్షి, విజయవాడ: ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అంతరాయం కలిగిస్తే ఆ ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ సేవలు బ్రేక్ కాకుండా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
‘‘పెండింగ్ నిధులపై పట్టుబడుతూ ఆరోగ్యశ్రీ సేవలకు కొన్ని చోట్ల నెట్ వర్క్ ఆసుపత్రులు బ్రేక్ వేశాయి. 2023-24లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి 3,566.22 కోట్లు నెట్ వర్క్ ఆసుపత్రులకు జమ చేశాం. గతంలోని హామీ ప్రకారం ఇప్పటికే 203 కోట్లు విడుదల చేశాం. 2024-25 మొదటి రెండు నెలల్లో ఇప్పటివరకు రూ.366 కోట్లు విడుదల చేశాం. గత ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ ద్వారా 42.91 లక్షల మందికి వైద్యసేవలు అందించాం ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 13,471 కోట్లు ఖర్చు చేశాం.. మిగిలిన బకాయిలు త్వరలోనే విడుదల చేస్తాం’’ అని ట్రస్ట్ సీఈవో లక్ష్మీషా వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment