సాక్షి, అమరావతి: డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద పేద, మధ్య తరగతి రోగులకు యథావిధిగా ఉచిత చికిత్సలు అందుతున్నాయి. పథకం సేవలు నిలిపివేసినట్టు కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రకటనలు చేశాయి. కాగా, ఎక్కడా పథకం సేవలు నిలిచిపోలేదని ముఖ్య కార్యనిర్వహణ అధికారి(సీఈవో) డాక్టర్ లక్ష్మీషా బుధవారం తెలిపారు.
ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం కింద 3,257 ప్రొసీజర్‌లలో నగదు రహిత చికిత్సను అందిస్తున్నట్టు తెలిపారు. ఇలా ప్రతి కుటుంబానికీ వార్షిక చికిత్స పరిమితి రూ.25 ల„ý ల వరకూ ఉందన్నారు. గత ఆరి్థక సంవత్సరం(2023–24)లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి రూ.3,566.22 కోట్లు నెట్‌వర్క్ ఆస్పత్రులకు జమ చేశారు.
బుధవారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి అన్ని ఆస్పత్రులకు రూ.203 కోట్ల బిల్లులు చెల్లించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మొదటి రెండు నెలల్లోనే రూ.366 కోట్లు చెల్లించినట్లయింది. మిగిలిన బకాయిలనూ త్వరలోనే విడుదల చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఐదేళ్లలో వైద్య శాఖలో 54 వేల పోస్టుల భర్తీ
కొన్ని ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటనలిస్తున్న క్రమంలో పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్య సేవల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌లకు వైద్య శాఖ ఆదేశాలిచ్చింది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలంది.
ఆరోగ్యశ్రీ లబ్ధిదారుల వైద్య సేవలకు అంతరాయం కలిగించే ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు అసౌకర్యం కలగకుండా చూడాలని సూపరింటెండెంట్లకు సూచించింది. గత ఐదేళ్లలో 54 వేల మేర వైద్య శాఖలో పోస్టులు భర్తీ చేశారు. దీంతో ఆస్పత్రుల్లో పూర్తి స్థాయిలో వైద్యులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment