న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. అత్యాచారం, యాసిడ్ దాడులు, లైంగిక దాడులు, పోక్సో (లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ) కేసుల బాధితులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం పొందేందుకు అర్హులని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించారు.
మంగళవారం తండ్రి కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆరోపిస్తూ దాఖలైన పోక్స్ కేసు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ధర్మాసనం పై విధంగా వ్యాఖ్యానించింది.
అత్యాచారం, యాసిడ్ దాడి బాధితులకు ఉచిత వైద్యం అందించాలని, అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పనిచేసే సంస్థలు, ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లు నర్సింగ్‌హోమ్‌లు తప్పని సరిగా ఈ ఆదేశాలను పాటించాలని జస్టిస్ ప్రతిభా ఎం. సింగ్ జస్టిస్ అమిత్ శర్మలతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. అలాగే పోక్సో సంబంధిత కేసుల్లో.. బాధితులకు తక్షణ వైద్య సంరక్షణ, అవసరమైన సేవలు అందించాలని సూచించింది.
బాధితులకు అందించే ఉచిత వైద్యంలో ప్రథమ చికిత్స, రోగ నిర్ధారణ, ఇన్‌పేషెంట్ కేర్, ఔట్ పేషెంట్ ఫాలో అప్‌లు, రోగనిర్ధారణ, సంబంధిత పరీక్షలు, అవసరమైతే శస్త్రచికిత్సలు, ఫిజకల్,మెంటల్ కౌన్సెలింగ్,ఫ్యామిలీ కౌన్సిలింగ్ సైతం వస్తాయని కోర్టు స్పష్టం చేసింది.
#DelhiHighCourt has mandated that all govt & private hospitals must provide free medical treatment to survivors of rape, acid attacks, & POCSO cases. This includes first aid, diagnostic tests, surgery, & counseling, ensuring victims do not face financial or procedural hurdles. pic.twitter.com/k2sln7J1fG
— Informed Alerts (@InformedAlerts) December 24, 2024
Comments
Please login to add a commentAdd a comment