free treatment
-
యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు
సాక్షి, అమరావతి: డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద పేద, మధ్య తరగతి రోగులకు యథావిధిగా ఉచిత చికిత్సలు అందుతున్నాయి. పథకం సేవలు నిలిపివేసినట్టు కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రకటనలు చేశాయి. కాగా, ఎక్కడా పథకం సేవలు నిలిచిపోలేదని ముఖ్య కార్యనిర్వహణ అధికారి(సీఈవో) డాక్టర్ లక్ష్మీషా బుధవారం తెలిపారు.ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం కింద 3,257 ప్రొసీజర్లలో నగదు రహిత చికిత్సను అందిస్తున్నట్టు తెలిపారు. ఇలా ప్రతి కుటుంబానికీ వార్షిక చికిత్స పరిమితి రూ.25 ల„ý ల వరకూ ఉందన్నారు. గత ఆరి్థక సంవత్సరం(2023–24)లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి రూ.3,566.22 కోట్లు నెట్వర్క్ ఆస్పత్రులకు జమ చేశారు. బుధవారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి అన్ని ఆస్పత్రులకు రూ.203 కోట్ల బిల్లులు చెల్లించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మొదటి రెండు నెలల్లోనే రూ.366 కోట్లు చెల్లించినట్లయింది. మిగిలిన బకాయిలనూ త్వరలోనే విడుదల చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఐదేళ్లలో వైద్య శాఖలో 54 వేల పోస్టుల భర్తీ కొన్ని ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటనలిస్తున్న క్రమంలో పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్య సేవల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని జిల్లా కలెక్టర్లకు వైద్య శాఖ ఆదేశాలిచ్చింది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలంది. ఆరోగ్యశ్రీ లబ్ధిదారుల వైద్య సేవలకు అంతరాయం కలిగించే ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు అసౌకర్యం కలగకుండా చూడాలని సూపరింటెండెంట్లకు సూచించింది. గత ఐదేళ్లలో 54 వేల మేర వైద్య శాఖలో పోస్టులు భర్తీ చేశారు. దీంతో ఆస్పత్రుల్లో పూర్తి స్థాయిలో వైద్యులు ఉన్నారు. -
Priya Desai: అవగాహనే ప్రథమ చికిత్స!
ఈ ఫొటోను చూడండి. ఇందులో ఉన్నది షుగర్ పేషెంట్లు. ఒకరితో ఒకరు షుగర్ వ్యాధి గురించి మాట్లాడుకుంటూ అవగాహన కల్పించుకుంటున్నారు. ‘చికిత్స కంటే అవగాహన ముఖ్యం’ అంటారు ప్రియా దేశాయ్. బెంగళూరులో ఆమె పేదవారి కోసం ఉచిత క్లినిక్‌లు నడుపుతున్నారు. డయాబెటిస్, బి.పి ఉన్న వారికి సదస్సులు నిర్వహిస్తూ ఉచిత మందులు అందేలా చూస్తున్నారు. ప్రతి ఉదయం ఈ క్లినిక్‌ల ముందు క్యూ కట్టే పేషెంట్లను చూస్తే ప్రియా సేవ తెలుస్తుంది.బెంగళూరులోని శాంతి నగర్లో ఉన్న ‘అనాహత్’ క్లినిక్‌కు వెళితే ఒక బోర్డు మీద ఐదారు రకాల భోజనం ప్లేట్ల ఫొటోలు ఉంటాయి. వాటిలో రొట్టె, కూర, అన్నం, ఇతర కూరలు ఉంటాయి. ప్రతి ప్లేట్ కింద స్టార్లు ఇచ్చి ఉంటారు. ఐదు స్టార్లు ఇచ్చిన భోజనం ప్లేట్‌ను ఆహారంగా తీసుకోవాలని బీపీ, షుగర్ ఉన్న పేషెంట్లకు సులభంగా అర్థమయ్యేలా చె΄్తారు. మీ ప్లేట్లో ఏముంది అనేదే మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని ఈ క్లినిక్‌లో వారానికి రెండుసార్లు జరిగే అవగాహన సదస్సుల్లో తెలియచేస్తారు. ఇలాంటి అవగాహన దీర్ఘకాలిక వ్యాధులైన షుగర్, బీపీల తీవ్రతను తగ్గిస్తాయని అంటారు ప్రియా దేశాయ్. ఆమె ఈ క్లినిక్ నిర్వాహకురాలు.10 వేల మందికి ఒక క్లినిక్బెంగళూరు జనాభా కోటీ ముప్పై లక్షలకి పైనే. కాని ఇక్కడ మొత్తం 147 ్ర΄ాథమిక ఆరోగ్య కేంద్రాలు మాత్రే ఉన్నాయి. అంటే దాదాపు 80 వేల మందికి ఒక క్లినిక్. ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసినా 30 వేల మందికి ఒక క్లినిక్ ఉండాలి. ఆదర్శవంతమైన ΄ాలనా నిర్వహణ అంటే 10 వేల మందికి ఒక క్లినిక్. ఇలాంటి స్థితిలో పేదలకు ఎలా మంచి వైద్యం అందుతుంది అని అడుగుతారు ప్రియా దేశాయ్. జర్నలిజం అభ్యసించిన ప్రియ తన తల్లి రాణీదేశాయ్ స్ఫూర్తితో వైద్య సేవారంగంలోకి వచ్చారు. అనేక స్వచ్ఛంద సంస్థల్లో పని చేసిన రాణీ దేశాయ్ తన కుమార్తెతో కలిసి ‘అనాహత్ క్లినిక్’కు అంకురార్పణ చేశారు. బెంగళూరులో ఉన్న పేదలకు వైద్యం అందించాలనేది అనాహత్ సంకల్పం. నేరుగా క్లినిక్‌కు వచ్చేవారికి వైద్యం అందిస్తూనే హెల్త్ క్యాంప్స్ ద్వారా స్లమ్స్‌లో వైద్య చికిత్స అందించడం అనాహత్ లక్ష్యం. ఇప్పటికి 3 లక్షల మందికి హెల్త్ క్యాంప్స్ ద్వారా వైద్యం అందించారు ప్రియ తన తల్లి రాణీదేశాయ్ చేయూతతో.బీపీ, షుగర్ బాధితులు‘నగరాల్లో పని చేసే దిగువ ఆదాయ వర్గాల వారు సమయానికి భోజనం చేయరు. ఆహార అలవాట్లు, నిద్రలో క్రమశిక్షణ ఉండదు. శరీరాన్ని పట్టించుకోరు. దానివల్ల బీపీ బారిన పడుతున్నారు. షుగర్ వచ్చిన వారికి షుగర్ వచ్చిన సంగతి కూడా తెలియడం లేదు. మా క్లినిక్‌కు రోజుకు వంద మంది వస్తారు. ఎక్కువ మందికి ఇవే సమస్యలు. మా కౌన్సిలింగ్స్ వల్ల ఎక్కడ ఏ పనిలో ఉన్నా రాత్రి ఎనిమిదికి భోజనం చేయడం నేర్చుకున్నారు చాలామంది’ అంటారు ప్రియా దేశాయ్. మిత్రుల దాతల సహాయంతో ఈ క్లినిక్‌ను నడుపుతున్న ప్రియ తగిన సహాయం దొరికితే సేవను విస్తరించవచ్చు అని తపన పడుతుంటారు. 70 రకాల పరీక్షలుఅనాహత్ క్లినిక్‌లో 70 రకాల టెస్ట్‌లు ఉచితంగా చేస్తారు. 100 రకాల మందులు ఉచితంగా ఇస్తారు. వైద్యుల పరీక్ష ఉంటుంది. వీరే కాకుండా ఫిజియోథెరపిస్ట్లూ సేవలు అందిస్తారు. ‘ఆనంద’ అనే కార్యక్రమం ద్వారా సైకియాట్రీ కౌన్సెలింగ్ కూడా ఉంటుంది. ‘అన్నింటికంటే ముఖ్యం మేము పేషెంట్స్‌ను ఒక కమ్యూనిటీగా మారుస్తాం. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిని ఒక గ్రూప్‌గా చేసి వారే ఒకరితో మరొకరు మాట్లాడుకుని తామంతా ఈ వ్యాధులను ఎదిరించవచ్చు అనే ధైర్యం పొందేలా చేస్తాం’ అన్నారు ప్రియ. చికిత్స అందించడం ఎంత ముఖ్యమో వ్యాధి పట్ల అవగాహన, నివారణ అంతే ముఖ్యమని భావిస్తారు ఈ క్లినిక్‌లో. అందుకే బెంగళూరు పేదలు అనాహత్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. ప్రియను, ఆమె తల్లి రాణి దేశాయ్‌ను అభిమానిస్తున్నారు.‘స్లమ్స్‌లో ఉన్నవారు క్లినిక్స్‌కు రారు. స్లమ్స్‌లో హెల్త్ క్యాంప్స్ విస్తృతంగా... క్రమబద్ధంగా జరగాలి. అప్పుడే దీర్ఘకాలిక వ్యాధులు బయటపడి చికిత్స మొదలవుతుంది. లేకుంటే అనవసర మరణాలు కొనసాగుతూనే ఉంటాయి. అందుకే అందరూ ఈ విషయమై ముందుకు రావాలి’ అని కోరుతున్నారు ప్రియ. -
‘న్యూరాలజీ’ బాధితులకు భరోసా
సాక్షి, అమరావతి: మణికంఠ, యోగేంద్ర తరహాలో అనారోగ్యం బారినపడిన నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వ్యక్తులకు ఆరోగ్యశ్రీ పథకం అండగా నిలుస్తోంది. చేతి నుంచి చిల్లిగవ్వ ఖర్చు పెట్టే పని లేకుండానే పూర్తి ఉచితంగా ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ స్ట్రోక్, మెదడులో రక్తం గడ్డకట్టడం వంటి జబ్బుల బాధితులతో పాటు, రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులకు న్యూరో, న్యూరో సర్జరీ విభాగాల్లో ఖరీదైన చికిత్సలు ఉచితంగా అందుతున్నాయి. న్యూరో, న్యూరో సర్జరీ విభాగాల్లో 1.46 లక్షల మందికి మేలు 2019 నుంచి ఇప్పటి వరకూ ఆరోగ్యశ్రీ కింద న్యూరో, న్యూరో సర్జరీ విభాగాల్లో 1,46,345 మంది ఉచితంగా చికిత్సలు పొందారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.572.23 కోట్లు వెచ్చించింది. ఇందులో 77,190 మంది న్యూరాలజీ, 69,155 మంది న్యూరో సర్జరీ విభాగాల్లో చికిత్సలు అందుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక పథకం బలోపేతంలో భాగంగా బెంగళూరు, హైదరాబాద్ వంటి ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ సేవలు అందుబాటులోకొచ్చాయి. దీంతో న్యూరో, న్యూరో సర్జరీ సమస్యల బాధితులు ఆయా నగరాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా చికిత్సలు పొందుతున్నారు. మరోవైపు చికిత్స అనంతరం ఆస్పత్రులకు డిశ్చార్జ్ అయిన రోగులకు వైద్యులు సూచించిన విశ్రాంత సమయానికి వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద భృతిని సైతం ప్రభుత్వం అందిస్తోంది. దీంతో విశ్రాంత సమయంలో రోగులకు ఆర్థిక ఇబ్బందులు తప్పుతున్నాయి. జబ్బుల బారినపడిన నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలను ఆరోగ్య శ్రీ సంజీవనిలా ఆదుకుంటోంది. 2019కు ముందు బాబు పాలనలో నీరుగారిపోయిన పథకాన్ని సీఎం జగన్ విప్లవాత్మక సంస్కరణలతో బలోపేతం చేశారు. రూ.25 లక్షలకు వైద్య సేవల పరిమితిని పెంచడంతో పాటు.. 1059 నుంచి 3257కు ప్రొసీజర్లనూ పెంచారు. నెట్వర్క్ ఆస్పత్రులను విస్తరించారు. దీంతో 2019 నుంచి ఇప్పటి వరకూ ఏకంగా 44.78 కోట్ల మంది రూ.13,004 కోట్ల విలువ చేసే వైద్య సేవలు పొందారు. 22 లక్షల మందికి పైగా బాధితులకు చికిత్స అనంతరం రూ.1,300 కోట్లకు పైగా ఆసరా సాయాన్ని ప్రభుత్వం అందించింది. 3.67 లక్షల మంది గుండె జబ్బు, 3.03 లక్షల మంది క్యాన్సర్ రోగులు ఉచిత వైద్య సేవలు అందుకున్న వారిలో ఉన్నారు. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం నారువానిపల్లెకు చెందిన వెంకటరామయ్యది నిరుపేద వ్యవసాయ కుటుంబం. 2021లో రామయ్య దంపతుల ఎనిమిదేళ్ల కుమారుడు యోగేంద్ర ఇంటి వద్ద ఆడుకుంటూ కళ్లు తిరిగిపడిపోయాడు. దగ్గర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళితే గుంటూరుకు తీసుకెళ్లాలని చెప్పారు. గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. బ్రెయిన్ ఎన్యూరిజం రప్చర్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ అరుదైన జబ్బుకు ప్రభుత్వం ఉచితంగా చికిత్స చేయించింది. ఈ ఫోటోలో వైద్యుల మధ్య బెడ్‌పై ఉన్న గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గొడవర్రుకు చెందిన దానబోయిన మణికంఠ ఆటోడ్రైవర్. కొంతకాలంగా మూర్చ సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో ఆటోను సక్రమంగా నడపలేక జీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. గతేడాది డిసెంబర్ 29న ఫిట్స్ వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చికిత్స కోసం కుటుంబ సభ్యులు గుంటూరులోని బ్రింద న్యూరో సెంటర్‌కు తీసుకెళ్లారు. మెదడులో కుడి వైపు, కుడిచెయ్యి, గొంతు, నాలుక, దంతాలు, దవడ, మాటలు వచ్చే భాగం, ముఖానికి నరాలు సరఫరా చేసే మెదడులోని భాగంలో ట్యూమర్ ఉన్నట్లు గుర్తించారు. దానిని తొలగించ కుంటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.5 లక్షల ఖరీదైన అరుదైన ఆపరేషన్‌ను పూర్తి ఉచితంగా ఆస్పత్రిలో నిర్వహించారు. అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ల్యాప్‌ట్యాప్‌లో చూపిస్తూ డాక్టర్ భవనం శ్రీనివాసరెడ్డి నిర్వహించిన అరుదైన సర్జరీ అప్పట్లో సంచలనమైంది. ప్రస్తుతం మణికంఠ ఆరోగ్యంగా ఉన్నాడు. -
ఉచిత వైద్యంపై అక్కసు రాతలు
-
Andhra Pradesh: అందరికీ ‘ఆరోగ్యం’
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు సంపూర్ణ ఆరోగ్య భరోసా కల్పిస్తూ డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షల వరకూ ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్న నేపథ్యంలో పథకం గురించి తెలియని వారు ఏ ఒక్కరూ ఉండటానికి వీల్లేదని అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. నిరుపేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఆరోగ్యశ్రీ అండగా నిలుస్తుందనే అవగాహన ఉండాలన్నారు. పథకాన్ని ఎలా వినియోగించుకోవాలనే అంశంపై ముమ్మరంగా ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ అమలు, ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ, ప్రచార కార్యక్రమాలపై ఆరా తీసిన సీఎం జగన్ పలు సూచనలు చేశారు. చేతి నుంచి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి రాకూడదు.. నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు ఉచిత వైద్య సేవలందిస్తూ అత్యంత మానవీయ దృక్పథంతో మనందరి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. ఆరోగ్యశ్రీ ప్రొసీజర్లు, చికిత్స వ్యయ పరిమితిని విప్లవాత్మక రీతిలో భారీగా పెంచాం. పేద, మధ్య తరగతి ప్రజలెవరూ వైద్యం కోసం చేతి నుంచి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఎక్కడా రాకూడదు. ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలన్న విషయంలో ఎవరికీ సందేహాలు ఉండకూడదు. తమకు దగ్గరలోని నెట్వర్క్ ఆస్పత్రులకు ఎలా వెళ్లాలన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలియాలి. విస్తరించిన ప్రయోజనాలతో కొత్త ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను అందిస్తున్నాం. నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు కార్డుల పంపిణీ పూర్తి చేయాలి. జల్లెడ పట్టి గుర్తిస్తూ.. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా గుర్తించిన అనారోగ్య బాధితులకు చేయూతనిచ్చే కార్యక్రమం ఎలా జరుగుతోందో నిరంతరం సమీక్షించాలి. ప్రజారోగ్య పరిరక్షణలో ప్రివెంటివ్ కేర్ అత్యంత ముఖ్యమైన అంశం. ఆరోగ్య సురక్షలో భాగంగా ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ఆరోగ్య సమస్యలను గుర్తించి శిబిరాల ద్వారా అవసరమైన వైద్య సేవలు అందించాలి. ప్రతి ఆర్నెల్లకు ఒకసారి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి. ప్రతి ఇల్లు, ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం, ప్రతి పట్టణాన్ని జల్లెడ పట్టాలి. శాచ్యురేషన్ విధానంలో ఈ ప్రక్రియ జరగాలి. ఏ గ్రామంలో ఎంతమందికి బీపీ, షుగర్లు ఉన్నాయి? ఎంత మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు? వారికి అందే వైద్యసేవలు ఏమిటి? తదితర అంశాలతో డేటా మ్యాపింగ్ చేపట్టాలి. బీపీ, షుగర్, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్సలు, కాలానుగుణంగా మందులు అందించాలి. ఈ మొత్తం డేటాను ప్రతి ఆర్నెల్లకు ఒకసారి మీ రికార్డుల్లో అప్డేట్ చేయాలి. గ్రామంలో వంద శాతం ఇళ్లు, వ్యక్తులు ఈ ప్రక్రియలో కవర్ కావాలి. సదుపాయాలపై శ్రద్ధ.. ఎక్కడైనా ఆరోగ్యశ్రీ కార్డు మిస్ అయినా సరే వారికి కూడా ఉచిత వైద్యం అందాలి. ప్రాథమిక వైద్య పరీక్షల్లో గుర్తించిన సమస్యలను నిర్ధారించేందుకు మరోసారి పరీక్షలు చేయాలి. సురక్ష రెండో దశ నిర్వహణ తర్వాత ప్రతి కేసుకు సంబంధించి టెస్ట్‌లు పూర్తి కావాలి. గుండె పోటు బాధితులకు సత్వర వైద్యం కోసం ప్రవేశపెట్టిన స్టెమీ కార్యక్రమం వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ దగ్గర నుంచి మొదలవ్వాలి. దీనిపై సిబ్బందికి అవగాహన కల్పించాలి. నూతనంగా ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సదుపాయాలపై ఫోకస్ పెట్టాలి. అవసరమైన అన్ని వసతులను కల్పించాలి. కర్నూలు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ త్వరలో ప్రారంభం జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ కింద ఇప్పటివరకూ 1,338 శిబిరాలు నిర్వహించి 98,210 మందికి అక్కడే స్పాట్ టెస్ట్‌లు నిర్వహించినట్లు సమీక్షలో అధికారులు వెల్లడించారు. 4,27,910 మంది ఓపీ ద్వారా వైద్యసేవలు పొందినట్లు తెలిపారు. సురక్ష తొలి దశ కార్యక్రమం సందర్భంగా నేత్ర పరీక్షలు నిర్వహించి 5,76,493 మందికి కళ్లద్దాల అవసరం ఉందని గుర్తించగా 67 శాతం మందికి ఇప్పటికే పంపిణీ చేసినట్లు చెప్పారు. మిగిలిన వారికి అద్దాల పంపిణీ వేగంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 12 ఎస్ఎన్సీయూలు, 5 ఎన్ఐసీయూలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రికి తెలియచేశారు. విశాఖలోని మెంటల్ కేర్ ఆసుపత్రి, విజయవాడ, తిరుపతిలో సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్స్, రీజనల్ డ్రగ్ స్టోర్స్, తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజ్‌లో పీజీ మెన్స్ హాస్టల్, అనంతపురం జీజీహెచ్‌లో బరŠన్స్ వార్డ్, కర్నూలులో స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, జీఎంసీ కర్నూలులో ఎగ్జామినేషన్ హాల్‌ను అతి త్వరలో ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్‌రెడ్డి, వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, కార్యదర్శి డాక్టర్ మంజుల, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ నివాస్, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈవో బాలాజీ తదితరులు పాల్గొన్నారు. -
దశాబ్దాల నిర్లక్ష్యానికి చికిత్స 'ప్రజారోగ్య విప్లవం'
పల్నాడు జిల్లా యండ్రాయి, ధరణికోట గ్రామాల నుంచి సాక్షి ప్రతినిధి వడ్డే బాలశేఖర్: ఈ ఫొటోలోని షేక్ రిహానాకు ఏడేళ్లు. పల్నాడు జిల్లా అమరావతి మండలం యండ్రాయి గ్రామం. తండ్రి జానీ చిరు వ్యాపారి, తల్లి ఫాతిమా గృహిణి. రిహానాకు పుట్టుకతో గుండె సమస్య ఉంది. దీనికి తోడు రెండేళ్ల వయస్సు వచ్చినా మాటలు రాలేదు. గుండె సమస్య కారణంగా మాటలు రావడం లేదని తొలుత తల్లిదండ్రులు భావించారు. కొద్ది రోజులకు గుంటూరు ఆస్పత్రిలో చూపించగా, పుట్టుకతో వినికిడి లోపం సమస్య కూడా ఉందని తేలింది. పాపకు మూడేళ్లు వచ్చాక గుండెకు సర్జరీ చేయించారు. వినికిడి లోపం సమస్యకు చికిత్స చేయించాలంటే ఎంత ఖర్చు అవుతుందోనని భయపడి ఆగిపోయారు. డబ్బు సమకూర్చుకున్నాక వైద్యం చేయిద్దామనుకున్నారు. ఇలా రోజులు గడుస్తూ పాపకు ఏడేళ్లు వచ్చాయి. అందరు పిల్లలు గలగలా మాట్లాడుతుంటే రీహానా మాత్రం మౌనంగా ఉండటం చూసి తల్లిదండ్రులు ఆవేదనకు గురవ్వని రోజంటూ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం వీరికి కలిసొచ్చింది. గత నెల 6వ తేదీన గ్రామంలో సురక్ష క్యాంప్ నిర్వహించారు. తల్లి ఫాతిమా.. రిహానాను ఆ క్యాంప్‌నకు తీసుకెళ్లింది. వైద్యులు పరీశీలించి గుంటూరు జీజీహెచ్‌కు రెఫర్ చేశారు. అక్కడ పలు పరీక్షలు నిర్వహించి మందులు ఇచ్చారు. అవి వాడాక వాస్తే మరికొన్ని పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఫలితాల ఆధారంగా స్పీచ్ థెరఫీ ఇవ్వడం లేదంటే కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ నిర్వహించడమో చేస్తామని తెలిపారు. ‘నా బిడ్డ మాట్లాడలేని స్థితిలో ఉండటం చూసి ఏడుపు వస్తోంది. సురక్ష క్యాంప్‌లో వైద్యులు చెప్పారని జీజీహెచ్‌కు వెళ్లొచ్చాను. పాపకు చికిత్స చేసి మాటలొచ్చేలా చేస్తామన్నారు. నా బిడ్డకు మాటలొస్తే చాలు అంతకు మించి ఏమీ వద్దు’ అని ఫాతిమా అంటోంది. ‘మీరు అధైర్యపడొద్దు. వైద్య పరీక్షలకు వెళ్లండి. ఆశా వర్కర్‌ను మీకు తోడుగా పంపుతాను. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. ప్రభుత్వమే ఉచితంగా పాపకు మాటలు వచ్చేలా చికిత్స చేయిస్తుంది. ఆరోగ్యశ్రీ కింద రూ.12 లక్షల ఖరీదైన రెండు చెవులకు కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీని ప్రభుత్వం ఉచితంగా చేయిస్తోంది’ అని అత్తలూరు పీహెచ్సీ డాక్టర్ రవిబాబు ఫాతిమాకు ధైర్యం చెప్పారు. ఇలా రాష్ట్రంలోని ప్రజలందరి ఆరోగ్యానికి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కొండంత అండగా నిలుస్తోంది. సీఎం జగన్ సర్కార్ ఆరోగ్య భరోసా అనారోగ్య సమస్యలున్నప్పటికీ సుదూర ప్రాంతంలో ఉండే ఆస్పత్రులకు వెళ్లి చూపించుకోలేక కొందరు, నిర్లక్ష్యంతో మరికొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఈ నేపథ్యంలో ప్రాణం విలువ తెలిసిన సీఎం వైఎస్ జగన్.. రాష్ట్రంలో ఏ ఒక్కరూ వైద్య సాయం అందక ఇబ్బంది పడటానికి వీల్లేకుండా ఫ్యామిలీ డాక్టర్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించారు. అయినప్పటికీ ఇంకా ఎవరైనా ప్రజలు వైద్యం అందక ఇబ్బంది పడుతున్నారేమోనని మరో అడుగు ముందుకు వేసి ప్రతి ఇంటిని జల్లెడ పట్టి.. ప్రజల ఆరోగ్య సమస్యలు, అవసరాలను గుర్తించి ఉచిత చికిత్సలు చేపట్టి, వైద్య పరంగా చేయి పట్టి నడిపించడం కోసం ఆరోగ్య సురక్షకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో అనేక సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉన్న ఊళ్లోనే 59.30 లక్షల మందికి వైద్యం ఏఎన్ఎం, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో) నేతృత్వంలోని వైద్య బృందాలు 1.44 కోట్లకు పైగా గృహాలను సందర్శించి ప్రజలను స్క్రీనింగ్ చేపట్టాయి. బీపీ, షుగర్, హెచ్‌బీ, మలేరియా, డెంగ్యూ వంటి ఏడు రకాల పరీక్షలను 6.50 కోట్ల మేర నిర్వహించారు. తద్వారా వివిధ అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారిని గుర్తించి సురక్ష శిబిరాలకు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 9వ తేదీ నాటికి గ్రామాల్లో 9,982, పట్టణాల్లో 2,258 సురక్ష శిబిరాలను ప్రభుత్వం నిర్వహించింది. ఒక్కో శిబిరంలో సగటున 485 చొప్పున 59,30,972 మందికి సొంత ఊళ్లలోనే వైద్య సేవలు అందించారు. ప్రతి శిబిరంలో జనరల్ మెడిసిన్, గైనిక్, పీడియాట్రిక్, ఆప్తమాలజిస్ట్ వంటి స్పెషలిస్ట్ వైద్యులు అందుబాటులో ఉండి ప్రజలకు వైద్య సేవలు అందించారు. ప్రతి శిబిరం వద్ద ర్యాపిడ్ టెస్ట్‌లతో పాటు, ఈసీజీ, ఇతర వైద్య పరీక్షలు నిర్వహణతోపాటు, 172 రకాల మందులను అందుబాటులో ఉంచారు. ఖరీదైన వైద్యం పూర్తిగా ఉచితం సురక్ష క్యాంప్‌లకు వచ్చిన వివిధ అనారోగ్య బాధితుల్లో మెరుగైన వైద్యం అవసరం ఉన్న వారిని ఆస్పత్రులకు రెఫర్ చేశారు. ఇలా 86,108 మందిని ఇప్పటి వరకు రెఫర్ చేయగా వీరందరికీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స చేపడుతోంది. గుండె, కిడ్నీ, మెదడు సంబంధిత జబ్బులు, క్యాన్సర్, ఇతర వ్యాధులకు ఖరీదైన చికిత్సలను పూర్తి ఉచితంగా అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆఖరికి వీరు ఆస్పత్రులకు పోయి, రావడానికి అయ్యే ప్రయాణ చార్జీలు కూడా ప్రభుత్వమే అందిస్తోంది. ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ఇస్తోంది. ప్రతి రెఫరల్ కేసును స్థానిక పీహెచ్సీ వైద్యుడు, ఏఎన్ఎం, సీహెచ్‌వోల ద్వారా పర్యవేక్షిస్తూ వైద్యం అందించేలా చూస్తున్నారు. ఇలా ఇప్పటి వరకూ 19,934 మంది ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు వెళ్లగా, 1,634 మందికి అడ్మిషన్ అవసరం ఉందని వైద్యులు నిర్ధారించారు. మిగిలిన వారికి మెడికేషన్ అందించారు. అడ్మిషన్ అవసరం ఉన్న వారిలో 1,060 మందికి సర్జరీలు, చికిత్సలు పూర్తయ్యాయి. చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వారి ఆరోగ్యంపై వైద్య శాఖ నిరంతరం వాకబు చేస్తోంది. కాలానుగుణంగా ఎప్పటికప్పుడు అవసరమైన మందులు, వైద్య సేవలు అందించేలా చర్యలు చేపడుతోంది. ఈ ఫోటోలో వైద్యుడు రవిబాబు పరిశీలిస్తున్న ఉషారాణిది యండ్రాయి గ్రామమే. చిన్నపాటి పాడి రైతు. కొద్ది నెలల క్రితం కాలికి సర్జరీ చేయించుకుంది. అనంతరం కాలు వాపు రావడంతో పాటు, గాయాలు మొదలయ్యాయి. సర్జరీ కారణంగా ఇన్ఫెక్షన్ వచ్చిందేమోనని గుంటూరులోని పలు ఆస్పత్రుల్లో చూపించుకుంది. మందులు వాడినా సమస్య తగ్గలేదు. ఆరోగ్య సురక్షలో భాగంగా వైద్య సిబ్బంది ఇటింటి సర్వే నిర్వహించినప్పుడు ఆమె తన సమస్య వివరించింది. ఈ క్రమంలో సురక్ష శిబిరానికి హాజరవ్వమని సిబ్బంది సూచించారు. గత నెల 6వ తేదీన శిబిరానికి హాజరైంది. స్పెషలిస్ట్ వైద్యులు ఆమెను పరిశీలించి బోద వ్యాధి లక్షణాలున్నాయని, అమరావతి సీహెచ్‌సీకి రెఫర్ చేశారు. వైద్య సిబ్బంది సహాయంతో ఆమె అక్కడికి వెళ్లింది. వైద్య పరీక్షల అనంతరం తెనాలిలోని ప్రభుత్వ ఫైలేరియా సెంటర్‌కు రెఫర్ చేశారు. అక్కడ బోద వ్యాధిగా నిర్ధారించారు. ఉచితంగా మందులు అందించారు. ఈ క్రమంలో ఉషారాణి మాట్లాడుతూ.. ‘ఊళ్లో ఆరోగ్య సురక్ష క్యాంప్ పెట్టి ప్రభుత్వం నాకు ఎంతో మేలు చేసింది. లేకుంటే నా సమస్యను ఇంకా నిర్లక్ష్యం చేసేదాన్ని. నేను ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకునే వరకు వైద్య సిబ్బంది రోజు ఫాలోఅప్ చేశారు’ అని సంతోషం వ్యక్తం చేస్తోంది.1250 మంది జనాభా ఉన్న యండ్రాయి గ్రామంలో నిర్వహించిన సురక్ష క్యాంప్‌నకు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న 350 మంది హాజరయ్యారు. వీరిలో 88 మంది కంటి సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. మిగిలిన వారు గ్యాస్ట్రిక్, బీపీ, షుగర్ వంటి ఇతర సమస్యలతో బాధపడుతున్నారు. కంటి సమస్యలున్న వారిలో 74 మందికి ఆప్తమాలజిస్ట్ సూచన మేరకు కళ్లద్దాల పంపిణీ చేపడుతున్నారు. ఇక రిహాన, ఉషారాణి తరహాలో పలు తీవ్రమైన సమస్యలున్న నలుగురిని ఇతర ఆస్పత్రులకు రెఫర్ చేశారు. స్పెషలిస్ట్ వైద్య సేవల కోసం ఈ గ్రామస్తులు 25 కి.మీ దూరంలో ఉండే గుంటూరు జీజీహెచ్‌కు వెళ్తుంటారు. దీంతో ఒకసారి గుంటూరుకు పోయి రావాలంటే కనీసం రూ.500 చొప్పున రవాణా, ఇతర అవసరాల కోసం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఒక రోజంతా పని మానుకోవాల్సి రావడంతో కూలి డబ్బులు నష్టపోవాల్సి వస్తుంది. ఈ ఖర్చులకు భయపడి ఇదే గ్రామానికి చెందిన దస్తగిరి కొంత కాలంగా మోకాళ్ల నొప్పులు వేధిస్తున్నప్పటికీ మందులు వేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. సురక్ష క్యాంప్‌లో స్పెషలిస్ట్ వైద్య సేవలుంటాయని స్థానిక ఏఎన్ఎం చెప్పడంతో హాజరయ్యాడు. తన సమస్యకు వైద్య సేవలు పొందాడు. క్యాంప్‌లోనే ఉచితంగా మందులు ఇచ్చారు. ఆ మందులు వాడినా సమస్య నయం అవ్వకపోతే తదుపరి వైద్యం ఉచితంగా అందిస్తామని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది నాకు 72 ఏళ్లు. రక్తపోటు, మధుమేహం సమస్యతో కొన్నేళ్లుగా బాధ పడుతున్నాను. గతంలో ప్రతి నెలా గుంటూరుకు మెడికల్ చెకప్ కోసం వెళ్లేవాడిని. ఒకసారి గుంటూరుకు పోయి, రావడానికి రూ.వెయ్యికి పైనే ఖర్చు అయ్యేది. ఈ ప్రభుత్వం వచ్చాక మా గ్రామంలోనే వైద్య సేవలు అందుతున్నాయి. ప్రతి నెలా మా గ్రామానికే డాక్టర్ వస్తున్నారు. దీంతో గుంటూరుకు వెళ్లడం మానేశాను. మందులు బాగా పని చేస్తున్నాయి. దీనికి తోడు ఈ మధ్య ఆరోగ్య సురక్ష క్యాంప్ పెట్టారు. గతంలో మేం వైద్యం కోసం వేరే ప్రాంతాలకు వ్యయ ప్రయాసలకోర్చి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు మా వద్దకే వచ్చి వైద్యం చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. – కె. పౌలేశు, యండ్రాయి, పల్నాడు జిల్లా కిడ్నీ సమస్యను గుర్తించి చికిత్స కొద్ది నెలలుగా నడుము భాగంలో నొప్పి వస్తుండేది. గుంటూరు వరకు పోయి చూపించుకోలేక ఏవో మందులు తెప్పించుకుని నొప్పి నుంచి విముక్తి పొందేదాన్ని. గ్రామంలో క్యాంప్ పెట్టడంతో వెళ్లాను. వైద్యులకు నా సమస్య వివరించాను. కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. క్యాంప్‌లోనే పలు మందులు ఇచ్చారు. జీజీహెచ్‌కు వెళ్లమని చీటీ ఇచ్చారు. ఆ మందులు వాడాక నొప్పి తగ్గుముఖం పట్టింది. జీజీహెచ్ కూడా వెళ్లొచ్చాను. క్యాంప్‌లో ఇచ్చిన మందులన్నీ వాడాక రమ్మన్నారు. – మొగల్ సబీరా, యండ్రాయి, పల్నాడు జిల్లా ఇంత శ్రద్ధ ఏ ప్రభుత్వం చూపలేదు ఎనిమిదేళ్ల క్రితం నా గుండెకు స్టెంట్ వేశారు. రోజూ మందులు వాడటంతో పాటు, రెండు, మూడేళ్లకు ఓసారి పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. మందులు అయితే వాడుతున్నా కానీ పరీక్షలు చేయించుకోలేదు. మా ఊళ్లో పెద్ద డాక్టర్లతో క్యాంప్ పెడుతున్నారని చెబితే వెళ్లి చూపించుకున్నాను. వాళ్లు ఈసీజీ తీశారు. ఎందుకైనా మంచిదని గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లండని చెప్పారు. వెళ్లాను.. పరీక్షలు చేశారు. అంతా బాగుందని చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చాక మా గ్రామంలోనే బీపీ, రక్తం పలుచబడే బిళ్లలు ఇస్తున్నారు. నెలనెలా డాక్టర్ వస్తున్నారు. వైఎస్సార్ కంటి వెలుగు కింద ఉచితంగా కంటి ఆపరేషన్ చేశారు. ఇన్ని విధాలుగా గతంలో ఏ ప్రభుత్వం మా ఆరోగ్యాలపై శ్రద్ధ చూపలేదు. – ఎస్.ఆదం, ధరణికోట, పల్నాడు జిల్లా పెద్ద ఊరట కల్పించారు వయోభారం రీత్యా కాళ్లు, నడుము నొప్పులతో కొన్నాళ్లుగా బాధపడుతున్నాను. పట్టణంలోని ఆస్పత్రికి వెళ్లాలంటే ఎవరో ఒకరు తోడుండాలి. దీనికి తోడు రానుపోను చార్జీలు, ఇతర ఖర్చులు పెట్టుకోవాలి. ఇంట్లో ఎవరైనా పట్టణానికి పోయినప్పుడు తెచ్చి ఇచ్చే మాత్రలు వేసుకుంటూ కాలం వెల్లదీస్తుండేదాన్ని. ఈ పరిస్థితుల్లో గ్రామంలో క్యాంప్ పెట్టారని వలంటీర్ చెప్పడంతో వెళ్లాను. నాకున్న సమస్యలు చెప్పాను. మందులు ఇచ్చారు. అవి వేసుకుంటుంటే నొప్పులు తగ్గాయి. గ్రామంలోనే వైద్య శిబిరం పెట్టి చాలా పెద్ద ఊరట కల్పించారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులకు నెలనెలా ఇంటి వద్దకే పింఛన్ పంపిణీ చేస్తున్నట్టే, వైద్య సేవలను చేరువ చేసి పుణ్యం కట్టుకున్నారు. – కింతలి రాజేశ్వరమ్మ, తోనంగి, గార మండలం, శ్రీకాకుళం జిల్లా. ప్రతి కేసుపై ప్రత్యేక శ్రద్ధ పీహెచ్సీ పరిధిలోని సురక్ష శిబిరాల్లో సుమారు ఏడు వేల మంది వైద్య సేవలు అందుకున్నారు. 168 మందిని ఆస్పత్రులకు రెఫర్ చేశారు. ప్రతి రెఫరల్ కేసుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. రెఫరల్ కేసుల్లో సంబంధిత వ్యక్తులను ఆస్పత్రులకు తరలించి, అక్కడ వైద్య సేవలు అందేలా పర్యవేక్షిస్తున్నాం. అవసరం మేరకు ఆశ వర్కర్‌ను తోడు పంపి మరీ వైద్య సేవలు అందిస్తున్నాం. చికిత్స అనంతరం డిశ్చార్జి అయిన రోగుల ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్యంపై వాకబు చేస్తున్నాం. – డాక్టర్ రవిబాబు, మెడికల్ ఆఫీసర్, అత్తలూరు పీహెచ్సీ, పల్నాడు జిల్లా నెలలో మండలంలో నాలుగు చోట్ల నిరంతరాయంగా ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టాలని సీఎం ఆదేశించారు. జనవరి నుంచి ప్రతి మండలంలో నెలలో నాలుగు చోట్ల సురక్ష శిబిరాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇక ఇప్పటికే శిబిరాల నుంచి వచ్చిన రెఫరల్ కేసులన్నింటికీ వంద శాతం మెరుగైన, నాణ్యమైన చికిత్సలు అందించడానికి చర్యలు వేగవంతంగా చేపడుతున్నాం. – జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ -
కరోనా బీఎఫ్.7 బాధితులకు పైసా ఖర్చు లేకుండా చికిత్స.. ఎక్కడంటే?
బెంగళూరు: దేశంలో కరోనా ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 వెలుగుచూసిన నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యాధి సోకిన రోగులకు పైసా ఖర్చు లేకుండా మెరుగైన వైద్యం అందించనున్నట్లు తెలిపింది. రెవెన్యూ మంత్రి ఆర్ ఆశోక ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. బీఎఫ్.7 వేరియంట్ సోకిన బాధితుల కోసం ప్రత్యేకంగా రెండు ఆస్పత్రులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్, మంగళూరులోని వెన్లాక్ హాస్పిటల్లో చికిత్స అందించనున్నట్లు చెప్పారు. అలాగే కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ప్రజలు కచ్చితంగా కరోనా మార్గదర్శకాలు పాటించాలని ఆశోక స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాలు, బార్లు, పబ్‌లు, హోటళ్లలో అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. అర్ధ రాత్రి ఒంటి గంట వరకే వేడుకలకు అనుమతి ఉంటుందని చెప్పారు. చదవండి: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు అస్వస్థత.. ఎయిమ్స్‌లో చేరిక -
Pratibha Naithani: యాసిడ్ సమాజానికి సర్జరీ
పిల్లలను దృష్టిలో పెట్టుకొని టీవీ కార్యక్రమాల్లో అసభ్యత, హింస చూపడాన్ని వ్యతిరేకించడంలో పేరొందారు ముంబై వాసి డాక్టర్ ప్రతిభా నైతాని. యాసిడ్ దాడి బాధితులకు ఉచితంగా కాస్మెటిక్ వైద్యం అందించడంతో పాటు, వారికి తగిన న్యాయం జరగాలంటూ ఆయా మంత్రిత్వ శాఖల చుట్టూ తిరుగుతూ, దోషులకు శిక్ష పడేలా చేశారు, చేస్తున్నారు. డాక్టర్ ప్రతిభ కష్టానికి ఫలితంగా చట్టం మారింది, దోషులకు శిక్షలు పెరిగాయి. యాసిడ్ దాడి బాధితుల జీవితాలు కాస్త తేలికయ్యాయి. అయితే, గడిచిన ఈ ఐదేళ్లలో దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా యాసిడ్ దాడులు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ ప్రతిభా నైతాని ఎన్నో విషయాలను మీడియా ముందుంచారు. ‘‘పంతొమ్మిదేళ్ల క్రితం.. ప్రఖ్యాత ప్లాస్టిక్ సర్జన్ పద్మశ్రీ డాక్టర్ అశోక్ గుప్తాతో కలిసి పనిచేయడం ప్రారంభించాను. డాక్టర్ అశోక్ అప్పటికే తన పనితో పాటు సామాజిక సేవ కూడా చేస్తుండేవారు. మారుమూల ప్రాంతాలకు వెళ్లి పేద, గిరిజనులకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, ఉచితంగా కాస్మెటిక్ సర్జరీలు చేస్తుండేవారు. వారి నుంచి స్ఫూర్తి పొందిన నేను, ఈ సర్జరీలలో సహాయంగా ఉండేదాన్ని. యాసిడ్ దాడి కేసులు మొదట్లో ఒకటో రెండో వచ్చేవి. తర్వాత్తర్వాత వీటి సంఖ్య పెరుగుతుండటం గమనించాను. వీరికి ఉచితంగా సర్జరీలు చేయడమొక్కటే సమస్యకు పరిష్కారం కాదనుకున్నాను. వీటిని అరికట్టేందుకు ఏదైనా చేయాలనుకున్నాను. దోషులకు శిక్షను పెంచాలి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి మహిళా, శిశు సంక్షేమ శాఖ, లా కమిష¯Œ వరకు ప్రదక్షిణలు చేశాను. ముంబై నుంచి ఢిల్లీకి తరచూ ప్రయాణించేదాన్ని. గతంలో యాసిడ్ దాడి దోషులకు శిక్షలు చాలా తక్కువగా ఉండేవి. నిందితులకు కేవలం ఆరు నెలలు మాత్రమే బెయిలబుల్ శిక్ష ఉండేది. కానీ అమ్మాయి జీవితమంతా నరకమే. దీంతో పాటు తమకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే మరిన్ని ఇబ్బందులు తప్పవని బాధితురాలి కుటుంబాన్ని బెదిరించేవారు. దీంతో వారికి న్యాయం జరిగేది కాదు. కత్తి గాయం, యాసిడ్ మంట ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఒకరి శరీరంపై యాసిడ్ పోయడం హత్య కంటే ఘోరమైన నేరం. ఈ విషయంలో చేసిన సుదీర్ఘ పోరాటం తర్వాత, 2013లో ఐపిసి లో 32-6A, 32-6B సెక్షన్లు చేర్చబడ్డాయి. దీని ప్రకారం, నిందితుడు దోషిగా తేలితే, ఏడేళ్ల నుండి జీవిత ఖైదు వరకు శిక్ష పడుతుంది. అపరాధి నుండి జరిమానా కూడా వసూలు చేయబడుతుంది. దీంతో బాధితురాలి కోసం ఎంతో కొంతైనా చేయగలిగామనే ధీమా వచ్చింది. బాధితులకు పునరావాసం ‘‘యాసిడ్ దాడి బాధితులు సమాజంలో జీవించడం కష్టం. ఈ అమ్మాయిలకు పని ఇవ్వడానికి ఎవరూ ఇష్టపడరు. చాలా సందర్భాల్లో చికిత్స ఖర్చులు పెరిగి, ఇంటి నుంచి వెళ్లగొట్టడం వంటి ఘటనలు కూడా తెలిశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆడపిల్లల భవిష్యత్తుకు భద్రత కల్పించాల్సిన అవసరం ఏర్పడింది. యాసిడ్ దాడి బాధితులను వికలాంగుల కేటగిరీలో చేర్చాలని, విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ వంటి వికలాంగుల కోటాలో వచ్చే అన్ని సౌకర్యాలు వారికి కల్పించాలని డిమాండ్ చేశాం. ఈ డిమాండ్‌ను నెరవేర్చడంలోనూ విజయం సాధించాం’’. ఉచిత వైద్య చికిత్స ‘‘యాసిడ్ దాడి బాధితులకు ప్రతి నగరంలో ఉచితంగా చికిత్స అందించాలన్నది మరో డిమాండ్. చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి కేసులకు ప్రత్యేకంగా ప్లాస్టిక్ సర్జరీ సౌకర్యం లేదు. ఏ ఆసుపత్రి అయినా, ఎక్కడ ఉన్నా ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశాం. ఈ మేరకు యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ సుప్రీంకోర్టులో పిటిష¯Œ దాఖలు చేశారు. వారికి ఉచితంగా శస్త్ర చికిత్స సౌకర్యం కల్పించాలని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అందుబాటులో ఉండకూడదు బహిరంగంగా విక్రయించే యాసిడ్‌కు సంబంధించి, దాని విక్రయాలను నియంత్రించాలని డిమాండ్ చేశాం. సాధారణ దుకాణాల్లో యాసిడ్ ఉండకూడదు. ఎప్పుడు, ఎవరు కొన్నారు, దేనికి వినియోగిస్తున్నారనేదానిపై ఓ కన్నేసి ఉంచాలి. ఈ విధానం వల్ల యాసిడ్ దుర్వినియోగాన్ని నిరోధించవచ్చు. ప్రాణాలతో పోరాటం యాసిడ్ దాడి బాధను భరిస్తూ జీవితంలో ముందుకు సాగిన అమ్మాయిలు ఎందరో ఉన్నారు. అలాంటి అమ్మాయిలలో లలిత ఒకరు. దాడి జరిగి, తీసుకువచ్చినప్పుడు, ఆమె గాయాల వాసనకు, జనం క్లినిక్ నుంచి బయటకు వెళ్లిపోయారు. అనేక శస్త్రచికిత్సల తర్వాత కోలుకుంది. ఇప్పుడు సాధారణ జీవితం గడుపుతోంది. పెళ్లి చేసుకొని, ఒక బిడ్డకు తల్లి అయ్యింది. ఏ అమ్మాయీ యాసిడ్ బారిన పడకుండా అందరూ ఆనందంగా జీవించాలి’ అనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తారీ వైద్యురాలు. -
పేదలకు ఉచితంగా మరింత నాణ్యమైన వైద్యం
సాక్షి, అమరావతి: పేదలందరికీ ఇకపై ఎయిమ్స్‌లో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలందనున్నాయి. ఈ మేరకు గురువారం మంగళగిరిలోని ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో ఎయిమ్స్‌తో ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. పేదలకు ఉచితంగా మరింత నాణ్యమైన వైద్యం అందించాలనే సీఎం జగన్ ఆలోచనల మేరకు ఎయిమ్స్‌తో ఎంవోయూ కుదుర్చుకున్నట్లు చెప్పారు. కొన్ని రోజులుగా ఎయిమ్స్‌లో ఆరోగ్యశ్రీ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 100 మందికి పైగా రోగులకు ఎయిమ్స్‌లో ఉచితంగా ఆరోగ్యశ్రీ సేవలు అందించామన్నారు. 30 మందికి పైగా రోగులకు చికిత్సలు కూడా పూర్తయ్యాయని తెలిపారు. ట్రయల్ రన్ పూర్తవ్వడంతో అధికారికంగా అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. 24 గంటలూ ఆరోగ్యశ్రీ సేవలందేలా చర్యలు తీసుకున్నామన్నారు. క్యాన్సర్‌కు నాణ్యమైన వైద్యం అతి త్వరలో ఎయిమ్స్‌లో పెట్ సిటీ స్కాన్ అందుబాటులోకి రానుందని మంత్రి విడదల రజిని చెప్పారు. శరీరంలో ఎక్కడ క్యాన్సర్ అవశేషాలున్నా సరే.. ఈ స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. క్యాన్సర్‌కు అంతర్జాతీయ స్థాయి వైద్యం ఏపీలోనే అందించాలనే సీఎం జగన్ ఆలోచనకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎయిమ్స్‌కు ప్రస్తుతం రోజుకు ఆరు లక్షల లీటర్ల నీటిని అందిస్తున్నామన్నారు. వచ్చే జూన్ కల్లా పైపులైను పనులు పూర్తవుతాయని చెప్పారు. ఎయిమ్స్ నుంచి రోగులను మంగళగిరికి చేర్చేందుకు ఉచిత వాహన సౌకర్యం కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో ఎయిమ్స్ డైరెక్టర్ త్రిపాఠి, ఎయిమ్స్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ వంశీకృష్ణ, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, కార్యదర్శి నవీన్‌కుమార్, కమిషనర్ నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్ పాల్గొన్నారు. (క్లిక్ చేయండి: స్మార్ట్ మీటర్లకు రుణాలా.. అలాంటిదేమి లేదు!?) -
ఆరోగ్యశ్రీ కింద.. రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం
సాక్షి, హైదరాబాద్/ సుందరయ్య విజ్ఞానకేంద్రం: ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. మొదటి ఏఎన్ఎం ఖాళీ పోస్టుల భర్తీకి నెలారెండు నెలల్లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన రెండో ఏఎన్ఎం మహాసభల్లో మంత్రి మాట్లాడారు. అన్ని ఆసుపత్రుల్లో డయాలసిస్ సేవలను అందుబాటులోకి తెస్తున్నామని, రాబోయే రోజుల్లో కీమో, రెడియో థెరపీ కూడా అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు. ప్రాథమిక వైద్యం అందించడంలో ఏఎన్ఎంలది కీలక పాత్ర అని కొనియాడారు. బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి వ్యాధులు ఉన్నట్లు చాలా మందికి తెలియదని, అలాంటివారిని గుర్తించి ముందుగా చికిత్స అందిస్తే దీర్ఘకాలిక రోగాలు రావని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో 350 బస్తీ దవాఖానాల ద్వారా ప్రజలకు మంచి వైద్యసేవలు అందుతున్నాయని, ఫలితంగా గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆసుపత్రుల్లో ఓపీ తగ్గిందని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 500 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఏఎన్ఎం సెంటర్లను పల్లె దవాఖానాలుగా ఆధునీకరిస్తున్నామని చెప్పారు. ఈ నెలలో 2 వేల పల్లె దవాఖానాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో పెరిగిన ప్రసవాలు 2014లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతం ప్రసవాలు జరగగా, ఇప్పుడు అవి 67 శాతానికి పెరిగాయని మంత్రి హరీశ్ తెలిపారు. వైద్యసేవల్లో దేశంలోనే తెలంగాణ మూడోస్థానం దక్కించుకుందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు చివరి స్థానంలో ఉందని, డబుల్ ఇంజిన్ ట్రబుల్ ఇంజినే తప్ప దాని వల్ల పేదలకు ఎలాంటి లాభం లేదని ఎద్దేవా చేశారు. రెండు, మూడు రోజుల్లో 58 టిఫా ప్రారంభం అవుతుందని తెలిపారు. జనవరి వరకు అన్ని జిల్లాల్లో టి–డయాగ్నొస్టిక్ కేంద్రాల ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఏఎన్ఎం పరిధిలో వందశాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగేటట్టు చూడాలన్నారు. మొదటి ఏఎన్ఎం పోస్టుల ఖాళీల భర్తీలో కరోనా తర్వాత వెయిటేజీ ఇస్తున్నామని, ఏడాదికి 2 మార్కుల చొప్పున కలుపుతున్నామని చెప్పారు. టీవీవీపీలో 228 ఉద్యోగాలు ఇస్తే, 200 పోస్టులు ఏఎన్‌ఎంలకే వచ్చాయన్నారు. పూర్తిస్థాయిలో వయో పరిమితి సడలింపు ఇచ్చామని హరీశ్ తెలిపారు. ఇదీ చదవండి: ఎల్ఆర్ఎస్.. గప్‌చుప్! చడీచప్పుడు లేకుండా వెంచర్ల క్రమబద్ధీకరణ -
గుండెకు ‘ఆరోగ్యశ్రీ’ అండ
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రాందాస్ పేటకు చెందిన ఇతని పేరు బోర రామమూర్తి. పండ్ల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల రామమూర్తి ఒంట్లో నలతగా ఉందని వైద్యుల్ని సంప్రదించగా.. గుండె జబ్బుతో బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. ఈ విషయం తెలియడంతో కుటుంబ సభ్యులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వైద్యానికి ఎంత ఖర్చవుతుందో ఏమిటోనని, అంత డబ్బు ఎలా సమకూర్చుకోవాలో తెలియక సతమతమయ్యారు. ఈ పరిస్థితుల్లో ఆ కుటుంబానికి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం అండగా నిలిచింది. ఆ పథకం కింద రూ.4.50 లక్షల వ్యయాన్ని ప్రభుత్వమే భరించి ఉచితంగా బైపాస్ సర్జరీ చేయించింది. అంతేకాకుండా రామమూర్తి విశ్రాంత సమయంలో పోషణకు ఇబ్బందులు పడకుండా వైఎస్సార్ ఆసరా రూపంలో ఆర్థిక సాయం అందింది. ‘ఆరోగ్యశ్రీ పథకం నా ప్రాణాన్ని కాపాడింది. నా వైద్యం కోసం కుటుంబ సభ్యులు అప్పులు పాలుకాకుండా చూసింది. పథకాన్ని అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు’ అంటూ రామమూర్తి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి వారు లెక్కకు మిక్కిలిగా ఉన్నారు. నిరుపేద, మధ్య తరగతి గుండెలకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ అండగా నిలుస్తోంది. గుండె, కాలేయం, కిడ్నీ, క్యాన్సర్ వంటి ఎన్నో రకాల పెద్ద జబ్బులకు సైతం పైసా ఖర్చు లేకుండా శస్త్ర చికిత్సలు చేయిస్తోంది. ఇప్పటికే 2,446 రకాల జబ్బులకు ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత వైద్యం లభిస్తుండగా.. ఆ సంఖ్య త్వరలో 3,254 రకాల చికిత్సలకు పెరగనుంది. టీడీపీ హయాంలో నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీ పథకానికి ఊపిరిలూదుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న చర్యలతో పేదలకు భారీ మేలు చేకూరుతోంది. పొరుగు రాష్ట్రాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో సైతం ఈ పథకం కింద ఉచితంగా చికిత్స అందుతోంది. వారంతా వైద్యం తర్వాత చిరునవ్వుతో ఇంటికి తిరిగొస్తున్నారు. టీడీపీ హయాంలో పేదలకు పెద్ద జబ్బు వస్తే ఆస్తులు అమ్ముకోవడం లేదా అప్పుల ఊబిలో కూరుకుపోవడం తప్ప మరో మార్గం ఉండేది కాదు. ఏ ఆస్తులూ లేని వారు దైవంపై భారం వేసి రోజులు లెక్కపెట్టుకోవాల్సిన దుస్థితి ఉండేది. 73,856 గుండెల్లో సంతోషం 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరు వరకూ (18 నెలలు) రాష్ట్రంలో 73,856 మంది ఆరోగ్యశ్రీ కింద గుండె జబ్బులకు చికిత్స పొందారు. వీరిలో 21,740 మంది మహిళలు కాగా, 52,116 మంది పురుషులు. వీరి చికిత్స కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.378 కోట్లు ఖర్చు చేసింది. 2021–22లో రూ.233 కోట్లు వెచ్చించగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.145 కోట్లు వెచ్చించింది. మరోవైపు చికిత్స పొందిన వారికి ఆరోగ్య ఆసరా పథకం కింద విశ్రాంత సమయానికి ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించింది. ఆరోగ్యశ్రీ కింద బైపాస్ సర్జరీ చేశారు గుండె జబ్బుతో బాధపడుతున్న నేను కొద్ది రోజుల క్రితం కర్నూలు జీజీహెచ్‌లో చేరాను. బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం కింద బైపాస్ సర్జరీ చేశారు. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగుంది. కొద్దిరోజులు ఆస్పత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండాలన్నారు. – సి.సుబ్బమ్మ, తిమ్మంపల్లె, అనంతపురం జిల్లా జగన్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం నేను లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నా. ఆగస్టు 15న డ్యూటీ దిగాక గుండెలో నొప్పిగా అనిపించి గుంటూరు నగరంలోనే ఓ ఆస్పత్రికి వెళ్లాను. పరీక్షలు అనంతరం బైపాస్ సర్జరీ చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చికిత్స చేశారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదు. లారీ డ్రైవర్‌గా జీవనం సాగించే నాకు అంత ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోవడం చాలా కష్టం. నా చికిత్సకు సాయం చేసిన సీఎం జగన్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. – బి.శ్రీనివాసరావు, గుంటూరు నగరం అర్హులందరికీ ఉచితంగా చికిత్స అర్హులందరికీ ఉచితంగా గుండె, కాలేయం, కిడ్నీ, ఊపిరితిత్తులు సంబంధిత పెద్ద వ్యాధులతోపాటు క్యాన్సర్ వంటి జబ్బులకు సైతం ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వం వైద్యం చేయిస్తోంది. త్వరలో మరిన్ని చికిత్సలను తీసుకురాబోతున్నాం. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకంలో 2,446 చికిత్సలకు వైద్యం అందుతుండగా.. త్వరలో ఆ సంఖ్య 3,254కు పెరగనుంది. – హరేంధిర ప్రసాద్, సీఈవో, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ -
వైరల్ జ్వరాలకు ఆరోగ్యశ్రీ రక్ష
సాక్షి, అమరావతి: సీజనల్ జ్వరాల బారినపడుతున్న ప్రజలకు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం అండగా నిలుస్తోంది. ఓ వైపు వ్యాధుల నియంత్రణకు ప్రభుత్వం సమర్థవంతంగా చర్యలు చేపడుతూనే.. మరోవైపు జ్వరాలబారిన పడిన వారికి ఉచిత వైద్య సేవలు అందిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు రాష్ట్రంలో 1,237 మలేరియా, 2,174 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో సీజనల్ వ్యాధుల బారినపడే వారికి ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఉచితంగా చికిత్స లభిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటే చికిత్సలన్నింటినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆరోగ్యశ్రీ కింద చేసే చికిత్సల సంఖ్యను ప్రభుత్వం ఏకంగా 2,446కు పెంచింది. త్వరలో వీటిని 3,118కి పెంచనుంది. 7,032 మందికి చికిత్స ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు రాష్ట్రవ్యాప్తంగా 689 మంది మలేరియా బాధితులు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స పొందారు. వైరల్ జ్వరాల బారినపడిన వారిలో ప్లేట్లెట్స్ తగ్గుదల సమస్య ఉంటోంది. ఈ క్రమంలో ఎలీసా నిర్ధారణ పరీక్షతో సంబంధం లేకుండా వైరల్ జ్వరంతో బాధపడుతూ.. ర్యాపిడ్ కిట్‌లో పాజిటివ్ ఉన్నవారికి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా డెంగ్యూ చికిత్స అందిస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా జనవరి నుంచి ఆగస్టు వరకు 6,343 మంది చికిత్స పొందారు. వీరిలో అత్యధికంగా అనంతపురం జిల్లా నుంచి 1,612 మంది ఉన్నారు. పరీక్షతో సంబంధం లేకుండా డెంగ్యూకి ఉచిత చికిత్స.. ఎలీసా పరీక్ష ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,174 డెంగ్యూ కేసులను మాత్రమే నిర్ధారించారు. ఎలీసా పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయితేనే డెంగ్యూ ఉన్నట్టు. అయితే కొన్ని రకాల వైరల్ జ్వరాల్లో ఎముక మజ్జ అణచివేత (బోన్‌మ్యారో సప్రెషన్)తో ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయి. ఈ క్రమంలో వైరల్ జ్వరాల బారినపడి.. ప్లేట్లెట్స్ తగ్గినవారికి ఎలీసా పరీక్షతో సంబంధం లేకుండా డెంగ్యూకు చికిత్స అందించాలని కేంద్రం సూచించింది. ఇలాంటి పరిస్థితులున్న బాధితులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందిస్తున్నాం. – డాక్టర్ రామిరెడ్డి, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకులు -
సరి‘హద్దు’లు చెరిపిన మానవత్వం.. పాక్ బాలికకు పునర్జన్మ!
న్యూఢిల్లీ: ‘మతములన్నియు మాసిపోవును... జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును’ అన్నారు మహాకవి గురజాడ. మత, ప్రాంత భేదాలన్నీ మాసిపోయి.. మానవత్వమొక్కటే నిలబడుతుందని రుజువు చేశారో ఢిల్లీ డాక్టర్. ఉచితంగా వైద్యమందించి మెడ వంకరతో ఏళ్లుగా బాధపడుతున్న పాక్ బాలికను మామూలు మనిషిని చేశారు. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌కు చెందిన అఫ్షీన్ గుల్ వయసిప్పుడు 12 ఏళ్లు. బాలిక పది నెలల చిన్నారిగా ఉన్నసమయంలో తన అక్క చేతుల్లోంచి జారిపడిపోయింది. అంతే మెడ 90 డిగ్రీలు వంగిపోయింది. అక్కడ డాక్టర్లకు చూపిస్తే మందులిచ్చారు. కానీ మెడ సెట్ కాలేదు. మెడ వంకరకు సెరిబ్రల్ పాల్సీ కూడా తోడవడంతో అఫ్షీన్ జీవితం నిత్య నరకమైంది. ఆడుకోలేదు. చదువుకోనూ లేదు. స్నేహితులు లేరు. అవన్నీ కాదు... అసలు తినడం, నడవడం, మాట్లాడటమే కష్టమైంది. బ్రిటిష్ జర్నలిస్టు అలెగ్జాండ్రియా థామస్ అఫ్షీన్ వ్యథను రిపోర్ట్ చేసింది. అది ఢిల్లీలోని అపోలో హాస్పిటల్ డాక్టర్ రాజగోపాలన్ కృష్ణన్‌కు తెలిసింది. జర్నలిస్టు ద్వారా కుటుంబంతో మాట్లాడిన డాక్టర్... అఫ్షీన్ను మామూలు మనిషిని చేస్తానని మాటిచ్చారు. అలా 2021 నవంబర్‌లో బాలికను ఢిల్లీకి తీసుకొచ్చారు. ఉచిత వైద్యమందించారు. నాలుగు అతిపెద్ద సర్జరీలను పైసా తీసుకోకుండా చేశారు. ఇప్పుడా బాలిక నవ్వుతోంది, మాట్లాడగలుగుతోంది. మామూలు మనిషైపోయింది. డాక్టర్ సర్జరీలు చేసి చేతులు దులుపుకోలేదు. ఇప్పటికీ స్కైప్‌లో బాలిక పరిస్థితిని సమీక్షిస్తూనే ఉన్నారు. ఇదీ చదవండి: Viral Video: ఆ పసికందు ప్రేమకు అంతా ఫిదా.. ఇంటర్నెట్ను కదిలిస్తున్న వీడియో చూశారా? -
ఆరోగ్యశ్రీలో 13.74 లక్షల మందికి ఉచిత వైద్యం
సాక్షి, అమరావతి : వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద రెండేళ్లలో ఏకంగా 13.74 లక్షల మంది పేదలు, సామాన్యులకు ఉచిత వైద్య చికిత్సలు అందాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మే 31వ తేదీ వరకు ఇంత పెద్ద సంఖ్యలో ఉచిత వైద్య చికిత్సలు అందడం ఇదే తొలిసారి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.3,400.18 కోట్లు వ్యయం చేసింది. గత చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్య శ్రీని పూర్తిగా నీరు కార్చేసింది. ప్రభుత్వం బిల్లులు చెల్లించక పోవడంతో ఈ పథకం కింద చికిత్స చేయడానికి ఆస్పత్రులు నిరాకరించేవి. ఏటా కనీసం రూ.500 కోట్లు కూడా కేటాయించలేదు. చంద్రబాబు సర్కారు నీరు కార్చిన ఆరోగ్య శ్రీ పథకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఊపిరి పోశారు. తెల్ల రేషన్ కార్డుతో ఆరోగ్య శ్రీ కార్డు లింక్‌ను ఉప సంహరించడమే కాకుండా, పేదలతో పాటు వార్షిక ఆదాయం రూ.5 లక్షల్లోపు గల సామాన్య ప్రజలకు కూడా ఈ పథకాన్ని వర్తింప చేశారు. తద్వారా రాష్ట్రంలోని 95 శాతం కుటుంబాలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకువచ్చారు. చికిత్స వ్యయం రూ.1000 దాటితే వైఎస్సార్ ఆరోగ్య శ్రీ వర్తింప చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. తరచూ సమీక్షలతో ఈ పథకం అమలుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి బిల్లులు చెల్లించే ఏర్పాటు చేశారు. లక్షన్నర మంది కోవిడ్ రోగులకు ఉచిత చికిత్స గత ఏడాది కోవిడ్–19ను కూడా వైఎస్సార్ ఆరోగ్య శ్రీలో చేర్చి ఉచిత వైద్యం అందిస్తున్నారు. ఇటీవల బ్లాక్ ఫంగస్‌ను కూడా చేర్చారు. ప్రభుత్వ నిర్ణయం పేదలు, సామాన్యులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మే ఆఖరు వరకు వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద 1.55 లక్షల మందికి పైగా కోవిడ్ రోగులకు ఉచిత వైద్య చికిత్సలు అందించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.435.87 కోట్లు వ్యయం చేసింది. ఈ పథకాన్ని గతంలో వెయ్యి చికిత్సలకే పరిమితం చేస్తే, సీఎం జగన్ 2,434 వ్యాధులు, ఆపరేషన్లకు పెంచారు. అంతే కాకుండా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందేలా వీలు కల్పించారు. తద్వారా రాష్ట్రంలో పేదలు, సామాన్యులను వైఎస్సార్ ఆరోగ్య శ్రీ సంజీవనిలా ఆదుకుంటోంది. -
YSR Aarogyasri: కోవిడ్ వేళ ఆరోగ్యశ్రీ ఆదుకుంది..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా చితికిపోకుండా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సంజీవనిలా నిలుస్తోంది. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్‌ను ఆరోగ్యశ్రీ కింద చేర్చి ఉచిత వైద్యం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు గతేడాది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏడాదిలోనే 1.11 లక్షల మంది కోవిడ్ రోగులకు ఉచిత వైద్యసేవలు అందాయి. కోవిడ్ సోకిన పేదలు, మధ్యతరగతి ప్రజలు చికిత్సకు అప్పులు పాలుకాకుండా, వారి ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి తలెత్తకుండా ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఉచిత వైద్యం అందిస్తోంది. ఇందులో భాగంగా గతేడాది ఏప్రిల్ 7 నుంచి ఈ నెల 5 వరకు రాష్ట్రంలో 1,11,266 మంది కోవిడ్ రోగులకు ఉచిత వైద్యం అందింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.332.41 కోట్లు వ్యయం చేసింది. మరే రాష్ట్రంలోనూ ఇలా ప్రభుత్వ పథకంలో కోవిడ్ చికిత్సలను చేర్చి ఉచిత వైద్య చికిత్సలను అందించకపోవడం గమనార్హం. సీఎం వైఎస్ జగన్ ఎంతో ముందుచూపుతో ఆలోచించి కోవిడ్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చడం వల్లే గతేడాది కాలంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు చికిత్సకు నగదు సమస్యను ఎదుర్కోలేదు. -
తెలంగాణలో కరోనాకు ఉచిత చికిత్స
-
తెలంగాణలో కరోనాకు ఉచిత చికిత్స
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కరోనాకు ఉచితంగా చికిత్స అందించాలని నిర్ణయం తీసుకుంది. అందులోభాగంగా మొదట మూడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ఎంపిక చేసింది. మల్లారెడ్డి, మమత, కామినేని మెడికల్ కాలేజీల్లో కరోనా టెస్టులు, చికిత్స ఉచితంగా అందించేలా ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. కాగా, తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 37,745కి చేరుకుంది. మృతుల సంఖ్య 375కి పెరిగింది. చదవండి: కరోనా రికవరీ రేటు 99% -
15 రోజుల్లోగా పంపేయండి
న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను స్వరాష్ట్రాలకు తరలించేందుకు 15 రోజుల గడువివ్వనున్నట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది. స్వరాష్ట్రాలకు వెళ్ళే వలస కార్మికుల ఉపాధి కల్పన కోసం, వారికి ఇతర ప్రయోజనాలు చేకూర్చేందుకు వారి పేర్లను నమోదు చేయాలని కోరింది. అందుకు ఈ సమయం సరిపోతుందని కోర్టు అభిప్రాయపడింది. వలస కార్మికుల తరలింపు, వారి పేర్ల నమోదు, ఉపాధి అవకాశాల కల్పన సహా అన్నింటిపైనా జూన్ 9న ఆదేశాలివ్వనున్నట్టు ధర్మాసనం పేర్కొన్నది. వలస కార్మికుల అంశాన్ని సుమోటోగా తీసుకొని విచారించిన సుప్రీంకోర్టు వారిని సురక్షితంగా తమతమ ప్రాంతాలకు చేర్చేందుకు గతంలో ఆదేశాలు జారీచేసింది. వలస కార్మికుల నుంచి బస్సుల్లోగానీ, రైళ్ళలోగానీ చార్జీలు వసూలు చేయరాదనీ, వారికి ఉచితంగా భోజనసదుపాయం కల్పించాలనీ సుప్రీంకోర్టు మే 28న ఆదేశించింది. తీర్పుని రిజర్వులో ఉంచిన కోర్టు, కోవిడ్ కారణంగా లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన వలస కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్రాలూ, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను వెల్లడించాలని జస్టిస్ అశోక్ భూషణ్, ఎస్.కే.కౌల్, ఎంఆర్.షాలతో కూడిన ధర్మాసనం కోరింది. స్వరాష్ట్రాలకు చేరిన వలస కూలీలకు ఉపాధి అవకాశాల కల్పన కోసం కొత్త పథకాలు రూపకల్పన చేయాలని సూచించింది. వలస కార్మికులను వారి స్వరాష్ట్రాలకు చేర్చేందుకు జూన్ 3వ తేదీ వరకు 4,200 శ్రామిక్ స్పెషల్ రైళ్ళను నడిపినట్టు కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. ఇప్పటి వరకు కోటి మందికిపైగా వలస కార్మికులను గమ్యస్థానాలకు చేర్చామనీ, 41 లక్షల మందిని బస్సుల ద్వారానూ, 57 లక్షల మందిని రైళ్ళ ద్వారా తరలించినట్టు మెహతా పేర్కొన్నారు. వలస కార్మికులకోసం ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు అత్యధిక రైళ్ళను నడిపినట్టు వెల్లడించారు. ఇంకా ఎంత మంది వలస కార్మికులు చిక్కుకుపోయారు. వారిని తరలించేందుకు ఎన్ని రైళ్ళు అవసరమనే విషయాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేయాలని తుషార్ మెహతా కోర్టుకి వెల్లడించారు. ఇకముందు కూడా వలస కార్మికుల అవసరాన్ని బట్టి వారిని తరలించేందుకు రైళ్ళు నడుపుతామని కోర్టుకి హామీ ఇచ్చారు. జాతీయ మానవహక్కుల కమిషన్ సైతం కల్పించుకొని వలస కార్మికుల ప్రయోజనం కోసం చేపట్టాల్సిన కొన్ని చర్యలను వివరించింది. మొత్తం 22 లక్షల మందిలో ఇంకా 2.5 లక్షల మంది వలస కార్మికులను మాత్రమే తరలించాల్సి ఉందని గుజరాత్ పేర్కొంది. ఇంకా ఢిల్లీలో 2 లక్షల మంది వలస కార్మికులుండగా 10 వేల మంది మాత్రమే తిరిగి వెళ్లాలనుకుంటున్నారని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ఢిల్లీ సరిహద్దుల నుంచి 5.50 లక్షల మంది వలస కార్మికులను తమ రాష్ట్రానికి చేర్చినట్టు ఉత్తరప్రదేశ్ విన్నవించింది. రాజస్తాన్ నుంచి 6 లక్షల మందిని, మహారాష్ట్ర నుంచి 11 లక్షల మందిని తరలించారు, ఇంకా 38 వేల మందిని తరలించాల్సి ఉంది. 28 లక్షల మంది బిహార్‌కి తిరిగి వచ్చినట్టు ఆ రాష్ట్రం పేర్కొంది. కోవిడ్‌కు ఉచిత చికిత్స చేస్తారా? ప్రభుత్వ ఆరోగ్య పథకం ‘ఆయుష్మాన్ భారత్’కింద కోవిడ్ –19 రోగులకు చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నారా అంటూ సుప్రీంకోర్టు ప్రైవేటు ఆసుపత్రులను ప్రశ్నించింది. దేశంలోని పేద, అట్టడుగు వర్గాల కోసం ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం ఆయుష్మాన్ భారత్‌ని ప్రవేశపెట్టారు. అన్ని ప్రైవేటు ఆసుపత్రులు కోవిడ్–19 రోగులకు ఉచితంగా చికిత్స అందించాలని తాము కోరడం లేదని పేర్కొంది. కేవలం ప్రభుత్వ భూముల్లో, లేదా తక్కువ ధరకు ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన భూముల్లో నడుస్తోన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో కొందరు కోవిడ్–19 రోగులకు ఉచిత చికిత్సనందించాలని జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే సారథ్యంలోని జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ రిషికేష్ రాయ్‌ల ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రైవేటు ఆసుపత్రులు కోవిడ్ పేషెంట్లు కొందరికైనా ఉచిత చికిత్సనందించలేవా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రైవేటు ఆసుపత్రులు కొంత సేవాభావంతో పనిచేసేలా చూడాలని అభిప్రాయపడింది. ఆయుష్మాన్ భారత్ పథకం ప్రకారం, అవే ధరలను అన్ని ప్రైవేటు ఆసుపత్రులకు వర్తింపజేయాలని పిటిషన్ దారుడు, న్యాయవాది సచిన్ జైన్ కోర్టుకి విన్నవించారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు తిరిగి రెండు వారాల అనంతరం విచారించనుంది. ప్రైవేటులో కరోనా చికిత్స ఖర్చుకు పరిమితి విధించండి! ప్రైవేటు ఆసుపత్రుల్లో కోవిడ్–19 రోగుల చికిత్సకు అయ్యే ఖర్చుపై పరిమితి విధించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. సంబంధిత ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై వారంలోగా స్పందించాలని జస్టిస్ అశోక్‌భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేసుకోగల స్థోమత ఉన్న వ్యక్తికి బలవంతంగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించాల్సిన అవసరమేంటని పిటిషన్‌దారు ప్రశ్నించారు. ప్రైవేట్ ఆస్పత్రులతోపాటు క్వారంటైన్ కేంద్రాల సంఖ్యను పెంచేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఆరోగ్య బీమా ఉన్నవారికి నగదు రహిత వైద్యం అందించాలన్నారు. -
‘ఎల్జీ పాలిమర్స్’ బాధితులందరికీ ఉచితంగా వైద్యం
సాక్షి, అమరావతి: ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో అనారోగ్యం పాలైన ప్రతి ఒక్కరికీ ఉచితంగా వైద్యం అందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు తక్షణమే ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆరోగ్యశ్రీ సీఈవో డా.మల్లికార్జున పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందిస్తామని, ఏ ఒక్కరూ పైసా చెల్లించకుండా ఆస్పత్రులకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ► గ్యాస్ ఘటన ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారు ఏ ప్రైవేటు ఆస్పత్రిలోనైనా ఎలాంటి ఫీజూ లేకుండా వైద్యానికి వెళ్లొచ్చు. ► సదరు ఆస్పత్రి ఆరోగ్యశ్రీ పరిధిలో లేకపోయినా సరే వైద్యం ఉచితంగా అందించాలని ఆదేశాలిచ్చాం. ఇప్పటికే ఈ విషయాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా అన్ని ఆస్పత్రులకు సమాచారం అందించాం. ► వైద్యానికి వచ్చే బాధితుల ఆధార్ కార్డు, ఇతర వివరాలను తీసు కుని చికిత్స చేయాలి. ఎంత ఖర్చయినా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ► వైద్యం అనంతరం ఆస్పత్రులు సంబంధిత బిల్లులను ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు పంపిస్తే సొమ్ము చెల్లిస్తాం. ► గ్యాస్ ప్రభావిత ప్రాంతాల ప్రజలు సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరి వైద్య సేవలు పొందాలని కోరుతున్నాం. ► అత్యవసర సేవల కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశాం. డా.డి.భాస్కరరావు, జిల్లా కోర్డినేటర్, 8333814019 నంబర్‌కు కాల్ చేస్తే వెంటనే స్పందిస్తారు. -
‘దివ్యంగా’ నడిపిస్తారు
సాక్షి, ద్వారకాతిరుమల: అసమాన వైద్య సేవలతో దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రీహేబిలిటేషన్ ఫర్ ది డిజేబుల్డ్ (విర్డ్). చిన్న తిరుపతిగా పేరొందిన పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల క్షేత్రంలో 2008లో ప్రారంభమైన ఈ ఆస్పత్రి అంతర్జాతీయ సౌకర్యాలను సమకూర్చుకుని దివ్యాంగులకు ఉచితంగా అత్యాధునిక వైద్య సేవలందిస్తోంది. పోలియో బాధితులతోపాటు ప్రమాదాల్లో గాయపడి అవయవాలు కోల్పోయిన వారు.. వెన్నెముక సంబంధ సమస్యలతో బాధపడుతున్న వారెందరో ఇక్కడ చికిత్స పొంది కోలుకున్నారు. వేగేశ్న ఆనందరాజు, అనంత కోటిరాజు ప్రధాన దాతృత్వంతో రూపుదిద్దుకున్న ఈ ఆస్పత్రి పలువురు దాతలు అందించిన రూ.16.05 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై ఏటా వస్తున్న వడ్డీ రూ.1.20 కోట్లతో వైద్య సేవలను విస్తృతం చేస్తోంది. దీనికి ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి దేవస్థానం సహకారం అందిస్తోంది. ప్రత్యేకతలివీ.. పోలియో, సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతున్న దివ్యాంగులకు çపూర్తి ఉచితంగా వైద్య సేవలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో రూ.లక్షలు ఖర్చయ్యే అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్సలను అతి తక్కువ ధరకే అందిస్తారు లింబ్ రీ–కనస్ట్రక్షన్ సిస్టమ్ ద్వారా పొట్టిగా ఉన్న కాళ్లను పొడవుగా చేయడం ఎముకల మధ్య ఖాళీ ఏర్పడితే రీ–లింబ్ సిస్టమ్ ద్వారా సరిచేయడం మోకాలు లేదా భుజంలో దెబ్బతిన్న లిగ్మెంట్స్ను సరిచేయడానికి ఆర్థోస్కోపీ కీహోల్ సర్జరీ ప్రముఖ ఆస్పత్రుల్లో సైతం విఫలమైన శస్త్ర చికిత్సలను సైతం ఇక్కడ విజయవంతంగా చేస్తున్నారు. ఆధునిక పరికరాలతో లాభాపేక్ష లేకుండా తక్కువ ఖర్చుతో శస్త్ర చికిత్సలు ఆస్పత్రిలోనే ఫార్మసీని నెలకొల్పి ఎమ్మార్పీపై 25 శాతం తక్కువ ధరలకు మందుల విక్రయం. చెన్నైలో రూ.7 లక్షలైంది నాలుగేళ్ల క్రితం ఎడమ కాలిపై కణుతులొచ్చాయి. నొప్పి ఎక్కువై నడవలేని పరిస్థితి. గుంటూరు ఆస్పత్రికి వెళితే ఎముక మద్య ఖాళీ ఏర్పడిందని సిమెంట్‌తో పూడ్చారు. ఇన్ఫెక్షన్ రావడంతో చెన్నై వెళ్లాను. అక్కడి వైద్యులు రూ.7 లక్షలు తీసుకుని చికిత్స చేశారు. ఫలితం లేకపోగా కాలు తీసేసే పరిస్థితి వచ్చింది. విర్డ్‌లో లింబ్ రీ–కనస్ట్రక్షన్ ఆపరేషన్ చేస్తున్నారని చెబితే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు బాగానే ఉంది. – శీలం బాబు, విజయవాడ చౌకగా శస్త్రచికిత్స పదేళ్ల క్రితం మేడ పైనుంచి పడిపోవడంతో ఎడమ కాలి తుంటి కీలు విరిగిపోయింది. శస్త్రచికిత్స చేయించుకోగా కొన్నాళ్లు బాగానే ఉంది. ఏడాది నుంచి నడవలేకపోతున్నాను. ఏ ఆస్పత్రికెళ్లినా కాలు తీసేయాలన్నారు. కొందరు వైద్యులు రూ.5 లక్షలు ఇస్తే ఆపరేషన్ చేస్తామని, అది కూడా గ్యారంటీ లేదన్నారు. డాక్టర్ జగదీష్ నాకు ఉచితంగా ఆపరేషన్ చేశారు. పరికరాలకు రూ.1.20 లక్షలు ఖర్చయింది. – నాగసుబ్బమ్మ, కడప జీవితం ముగిసిందనుకున్నా.. చిన్నతనంలోనే పోలియో బారినపడ్డాను. 2003లో వెన్నెముక నుంచి నొప్పి మొదలైంది. ఏడాది క్రితం హైదరాబాద్, బెంగళూరు వైద్యులను సంప్రదించాను. ఆపరేషన్ చేయకపోతే శరీరంలోని అన్ని అవయవాలు చచ్చుబడతాయన్నారు. ఆపరేషన్‌కు రూ.15 లక్షలు అవుతుందని, అయినా గ్యారంటీ ఇవ్వలేమన్నారు. దీంతో నా జీవితం ముగిసిపోయిందనుకున్నా. విర్డ్ ఆస్పత్రిలో ఉచితంగా ఆపరేషన్ చేశారు.పరికారాలకు మాత్రం రూ.1.50 లక్షలు ఖర్చయింది. – బి.శ్రీదేవి, నంద్యాల పైసా తీసుకోకుండా.. రోడ్డు ప్రమాదంలో నా మోకాలిలోని ఏసీఎల్ తెగిపోయింది. విర్డ్ ఆసుపత్రిలో కీహోల్ సర్జరీ చేస్తున్నట్టు తెలిసి వచ్చాను. ఆరోగ్యశ్రీలో పైసా ఖర్చు లేకుండా ఇక్కడ కీహోల్ సర్జరీ చేశారు. – పి.భవానీ శంకర్, రామన్నపాలెం, మొగల్తూరు మండలం -
ఓడి గెలిచిన రాజు
ఒకప్పుడు అతనో చెస్ క్రీడాకారుడు. ఎత్తుకు పైఎత్తులు వేసి, ప్రత్యర్థులనుచిత్తు చేసి బంగారు పతకాలు కొల్లగొట్టాడు. అయితే తల్లిదండ్రులమరణంతో ఆయన జీవితం గాడితప్పింది. దురలవాట్లతో ఉద్యోగం పోయింది. తినడానికి లేకపోవడంతో యాచకుడిగా మారాడు. మళ్లీ ఇప్పుడు మామూలు మనిషిగా మారిన అతడు... చదరంగంలో ఎత్తులు వేసేందుకు సై అంటున్నాడు. అతడే ఎంవై రాజు. తార్నాక: తార్నాకలోని వినాయక దేవాలయంలో భిక్షాటన చేస్తూ జీవితం వెళ్లదీస్తున్న రాజును ‘సాక్షి’ గమనించింది. ఆయన పరిస్థితిపై ‘జీవన చదరంగంలో ఓడిపోయాడు’ శీర్షికతో ఆరు నెలల క్రితం కథనం ప్రచురించింది. అప్పటికే అతడు స్కీజోఫినియా వ్యాధితో బాధపడుతున్నాడు. కథనానికి స్పందించిన రాజు చిన్ననాటి స్నేహితులు, సోదరుడు.. ఆయనకు మంచి వైద్యం అందించాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ప్రయత్నిస్తున్న తరుణంలో శంషాబాద్‌లోని ‘ఆశాజ్యోతి రిహాబిలిటేషన్’ కేంద్రం వైద్యులు డాక్టర్ జగన్నాథం ఉచితంగా వైద్యం అందించేందుకు ముందుకొచ్చారు. దీంతో రాజును అక్కడ చేర్పించగా మూడు నెలలు చికిత్స అందించారు. ఉచితంగానే భోజన సదుపాయాలు, మందులు అందజేశారు. రాజు ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడని, చెస్‌లో పాల్గొనేందుకు సిద్ధమని డాక్టర్ జగన్నాథం తెలిపారు. స్కీజోనిఫియా వ్యాధి పూర్తిగా నయమైందని, ఇక మామూలుగా మందులు వాడితే సరిపోతుందని చెప్పారు. ఆవాసం కోసంమిత్రుల ప్రయత్నం.. ఇంతకముందు వరకు దేవాలయంలోనే గడిపిన రాజుకు షెల్టర్ లేదు. ఇప్పుడు ఆయన ఉండేందుకు గదిని అద్దెకు తీసుకోవాలని మిత్రులు నిర్ణయించారు. అందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గది కోసం వెతుకుతున్నామని, దొరికిన వెంటనే కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసి.. అన్ని రకాలు సదుపాయాలు సమకూరుస్తామని రాజు మిత్రుడు గుమ్మడి విజయ్‌కుమార్ తెలిపారు. అన్ని సెట్ అయ్యాక రాజును డిశ్చార్జీ చేసి తీసుకెళ్తామన్నారు. ఇదీ నేపథ్యం.. రాజు 1969లో ఒంగోలులో జన్మించాడు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. రాజుకు చిన్నతనం నుంచి చదరంగం అంటే ఎంతో ఆసక్తి. ఆయన క్రీడాసక్తికి తండ్రి ప్రోత్సాహం తోడవడంతో జాతీయ స్థాయి క్రీడాకారుణిగా రాణించాడు. ఆ ప్రతిభతోనే 1998లో దక్షిణమధ్య రైల్వేలో ఉద్యోగం సంపాదించాడు. అయితే తల్లిదండ్రుల మరణంతో రాజు జీవితం మారిపోయింది. దురలవాట్లకు బానిసవడంతో అటు ఆట.. ఇటు ఉద్యోగం రెండింటికీ దూరమయ్యాడు. మానసిక వ్యాధితో బాధపడుతూ యాచకుడిగా మారాడు. ఉద్యోగం.. చదరంగం మిత్రుల సహకారంతో నేను కోల్పోయిన ఉద్యోగాన్ని తిరిగి సంపాదిస్తాను. ఉపాధి కోసం ఉద్యోగమైతే... నా ఆసక్తిని కొనసాగించేందుకు చదరంగం. మళ్లీ చెస్‌ను ప్రారంభిస్తాను. మంచి క్రీడాకారుడిగా రాణిస్తూ.. జాతీయ స్థాయిలో అవార్డులు అందుకోవాలనేదే నా ఆశయం. ఔత్సాహిక క్రీడాకారులకు నావంతుగా శిక్షణనిస్తాను. – ఎంవై రాజు -
‘అమరావతి ఉచిత వైద్యం’ ఉత్తుత్తికే..
తాడేపల్లి రూరల్ :‘కట్టు బట్టలతో అమరావతికి వచ్చా... మీ అందరూ సహకరించండి... మీ పంట పొలాలను రాజధాని నిర్మాణానికి ఇవ్వండి... అన్నీ మీకు ఉచితంగా ఇస్తాం... వ్యవసాయం కన్నా ఎక్కువ లాభాలను చూపిస్తాం... అదే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉదారత్వం... అంటూ ముగ్గురు మంత్రులు, పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు ఇంటింటికీ తిరిగి అన్నదాతల దగ్గరనుంచి భూములు సేకరించారు. ఆ తిరిగే సమయంలో ఎవరైనా అనారోగ్యంతో మంచం మీద పడుకుని ఉంటే, ఇక మీ కష్టాలు తీరినాయి, అంతా కార్పొరేట్ వైద్యమే, ఎంతైనా ముఖ్యమంత్రి గారు మీకిస్తారని నమ్మబలికారు. తీరా భూములు ఇచ్చిన తర్వాత వారి ఇంటి మొహం కూడా చూడలేదు. ప్రస్తుతం రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో భూములు ఇచ్చిన రైతు కుటుంబాల వారే 10శాతం మంది అన్నదాతలు మంచాన పడ్డారు. ప్రభుత్వం ఇచ్చే రూ.50వేల కౌలు, రూ.30వేల కౌలు ఇంటి ఖర్చులకే సరిపోవడం లేదు. వైద్యం ఎలా చేయించుకోవాలో అర్థంకాక మంచానికే పరిమితమయ్యారు. రాజధాని పరిధిలో ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యమంటూ ‘అమరావతి ఉచిత వైద్య పథకం’ అంటూ ఓ కార్డు అందజేశారు. ఆ కార్డు తీసుకొని కార్పొరేట్ ఆసుపత్రులకు వెళితే డబ్బులు కట్టండి, వైద్యం చేస్తాం అంటున్నారు. ఆ కార్డుమీద వైద్యం చేయమని ప్రభుత్వం మాకు ఎటువంటి సందేశాలు పంపించలేదని డాక్టర్లు తెలియచేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే మీ జబ్బుకు సంబంధించిన వైద్యాన్ని మేం చేయగలం కానీ, మందులు మాత్రం బయటనుంచి కొనుగోలు చేయాలని సెలవిస్తున్నారు. అదికూడా ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు అనేది చెప్పడం లేదు. తమకు ఉన్నది తాకట్టు పెట్టి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 29 గ్రామాలలో రాజధానికి భూములు సేకరించేటప్పుడు సుమారు లక్షా 30వేల మంది జనాభా ఉంటారని అంచనా. ఆ మేరకు 10 రూపాయలతో అమరావతి తొలి పౌరులకు ఉచిత వైద్యం అంటూ పంపిణీ చేసిన కార్డులు నిరుపయోగంగా మారాయి. కానీ కార్డు మీద మాత్రం 1044 రోగాలకు ఉచిత వైద్యం చేస్తున్నట్లు ముద్రించారు. ఏ జబ్బుకు వైద్యం చేయమని అడిగినా మీకు వచ్చిన జబ్బు ప్రభుత్వం ఇచ్చిన లిస్టులో లేదంటూ వైద్యులు తప్పించుకుంటున్నారు. నిరుపయోగంగా ఉన్న ఈ కార్డులతో రాజధాని ప్రజలకు ఉపయోగమేంటంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాలి ప్రభుత్వం రైతుల వద్ద నుంచి భూములు తీసుకునేటప్పుడు వైద్యం, విద్య ఉచితంగా ఇస్తున్నామని ప్రకటించారు. కానీ రాజధాని 29 గ్రామాలలో అది ఎక్కడా అమలు కావడం లేదు. ఇప్పటివరకు వైద్య నిమిత్తం రాజధానిలో అన్నదాతలు, రైతుకూలీలు, సామాన్య ప్రజానీకం వైద్యానికి ఖర్చు పెట్టిన డబ్బును ప్రభుత్వం వెంటనే వెనక్కు ఇవ్వాలి. అప్పుడే అన్నదాతలకు న్యాయం చేసిన వారవుతారు. –ఎమ్మెల్యే ఆర్కే వైద్యం చేయట్లేదు.. మా తండ్రి నిడమర్రు గ్రామంలో ల్యాండ్ ఫూలింగ్‌కు మూడున్నర ఎకరాల పొలాన్ని అందచేశారు. ఆయన వయసు 50 సంవత్సరాలు. ఆయనకు వెన్నుపూసలో నొప్పి రావడంతో తీవ్ర ఇబ్బందికి గురయ్యాడు. వైద్యం నిమిత్తం ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళితే రూ.5 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. అంత ఖర్చు భరించలేక ప్రభుత్వాస్పత్రికి వెళితే అటూఇటూ తిప్పారే తప్ప వైద్యం చేయలేదు. మరలా ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి రూ.5 లక్షలు వడ్డీకి తెచ్చి వైద్యం చేయించాం. భూములు తీసుకొని ఇంత మోసం చేస్తారని అనుకోలేదు. –కొమ్మారెడ్డి కిషోర్, నిడమర్రు -
పోలీసు కుటుంబాలకు ఉచిత వైద్యం
అనంతపురం మెడికల్ : ఆరోగ్య భద్రత పథకం కింద అర్హులైన పోలీసు కుటుంబాలకు సాయినగర్‌లోని ఎస్ఎన్ దంత వైద్యశాలలో ఉచిత దంత వైద్యం అందించనున్నట్లు డాక్టర్ జీపీ కవితారెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
పేదల ఆరాధ్యుడు
మారుమూల గిరిజన ప్రాంతాల్లో డాక్టర్ చిన్నబిల్లి సేవలు ప్రతి ఆదివారం ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ రాజవొమ్మంగి : ఆదివారం వచ్చిందంటే శాంతాక్లాజ్ తాతలా గిరిజన బాలల ఎదుట రకరకాల బహుమతులతో ప్రత్యక్షమవుతారాయన. కలం చేతపట్టి బూర్జువా శక్తులను ఎలా ఎదుర్కోవాలో వ్యాసాలు రాస్తారు. పేదలు కనిపిస్తే.. ఆపద్బాంధవుడిలా దుస్తులు, ఆహారం ఇచ్చి ఆదుకుంటారు. ప్రతి ఆదివారం లోతట్టు ప్రాంతాల్లో గిరిజనులకు సేవ చేస్తుంటారు. తన సంపాదనలో కొంత సొమ్మును పేదల వైద్యం కోసం ఖర్చుచేస్తున్నారు. ప్రతివారం డాక్టర్ చిన్నబిల్లి కోసం గిరిజనులు ఎంతో ఆశగా ఎదురుచూస్తారంటే అతిశయోక్తికాదు. వివరాల్లోకి వెళితే.. రాజవొమ్మంగి మండలం అప్పలరాజుపేట గ్రామంలో ఆదివారం డాక్టర్ చిన్నబిల్లి సత్యనారాయణ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఆయనను పలకరించగా, పేదలకు సేవ చేయాలన్న ప్రధాన ఉద్దేశంతో డాక్టర్ కోట్నీసు ప్రజా వైద్యశాలను డాక్టర్ చిన్నబిల్లి 1999లో కాకినాడలో ప్రారంభించానన్నారు. తన ఉచిత వైద్య సేవలను కేవలం పట్టణాలకే పరిమితం చేయకుండా, లోతట్టు గ్రామాల వారికి అందించాలనే ఆలోచన వచ్చిందని చెప్పారు. ఇప్పటివరకు (24 జూలై ఆదివారం) 134 ఉచిత వైద్యశిబిరాలను నిర్వహించినట్టు వివరించారు. మందులతో పాటు ఆరోగ్య సూత్రాలు వేలాది మందికి మందులతో స్వస్థత చేకూర్చడమే కాకుండా, ఆరోగ్యంగా జీవించేందుకు అనుసరించాల్సిన ఆరోగ్యసూత్రాలను డాక్టర్ చిన్నబిల్లి గిరిజనులకు వివరిస్తున్నారు. కూలీ జనం అంటే, కంజారు చేతపట్టి పాటలు పాడతారు. వైద్యానికన్నా ముందు తన శిబిరానికి వచ్చేవారికి వస్త్రాలు, దుప్పట్లు, దోమతెరలు, మస్కిటో కాయిల్స్, చిన్న పిల్లలకు బూట్లు, బిస్కట్లు, పెన్నులు, పెన్సిళ్లు పంచిపెడుతున్నారు. అత్యవసర వైద్యసేవలు అవసరమైన వారికి సూదిమందు ఇచ్చి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నారు. కాకినాడలో వైద్య విద్య గొల్లప్రోలు గ్రామానికి చెందిన చిన్నబిల్లి సత్యనారాయణ కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ అభ్యసించారు. సీపీఐ(ఎంఎల్) అనుబంధంగా గత 17 ఏళ్లుగా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. జన సాంస్కతిక మండలి రాష్ట్ర అధ్యక్షుని పదవిలో గజ్జెకట్టి, గ్రామాల్లో ఉద్యమస్ఫూర్తిని నింపుతున్నారు. మానవుడు ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి మానసిక సై్థర్యాన్ని నింపుతున్నారు. -
'ప్రభుత్వ వైద్యులపై చర్యలు తప్పవు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ డాక్టర్లకు మధ్య వివాదం మరింత ముదిరినట్లు కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసిన ప్రభుత్వ వైద్యులపై చర్యలు తప్పవని ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు మంగళవారం స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏజెన్సీలో 501 మంది డాక్టర్లను నియమిస్తామని తెలిపారు. రాష్ట్ర ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందిస్తామని పేర్కొన్నారు. ఈ 25న ప్రైవేట్ ఆస్పత్రులతో సమావేశమై ప్యాకేజీలు ఖరారు చేస్తామన్నారు. హైదరాబాద్ లోని ఆస్పత్రుల్లోనూ ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ 22న జీజీహెచ్ లో మోకాలికి చికిత్స చేయించుకుంటానని మంత్రి కామినేని వివరించారు. విధులకు సక్రమంగా హాజరు కాని 650 మంది ప్రభుత్వ వైద్యులకు ఏపీ ప్రభుత్వం ఇటీవలే నోటీసులు జారీ చేసిన విషయం అందరికీ విదితమే.