ఓరుగల్లులో మెగా వైద్య శిబిరం
కరీమాబాద్: వరంగల్ జిల్లా కరీమాబాద్ ప్రాంతంలో ‘మానవసేవే-మాధవసేవ’ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 500 మంది పేదలు పాల్గొన్నారు. సాధారణ జబ్బులతో పాటు గుండె, ఎముకలు, కంటికి, స్త్రీ సంబంధిత వ్యాధులకు చెందిన నిపుణులైన వైద్యుల బందం ఈ శిబిరంలో ఉచితంగా సేవలందించనున్నారు.
ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం ఒంటి గంట వరకు వైద్య సేవలందిస్తామని నిర్వాహకులు తెలిపారు. రోగులకు మందులను ఉచితంగా పంపిణీ చేశారు. సన్‌షైన్, వరంగల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్, వరంగల్ లయన్స్ క్లబ్‌కు చెందిన వైద్యులు ఈ శిబిరంలో పాల్గొన్నారు.