
సాక్షి, అమరావతి: కొన్ని నెట్‌వర్క్ ఆస్పత్రులు ఎక్కువ రోజులు ఆస్పత్రుల్లో ఉండాలని కోవిడ్ పేషెంట్లపై ఒత్తిడి తెస్తున్నాయని, వాటిపై చర్యలు తీసుకుంటామని ఆరోగ్యశ్రీ సీఈవో మల్లికార్జున హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ సాంకేతిక కమిటీ అన్నీ పరిశీలించాకే రోజు వారీ ప్యాకేజీలు నిర్ణయించామని, దీన్ని కాదని ఆస్పత్రులు ప్యాకేజీ డబ్బుల కోసం ఎక్కువ రోజులు ఉండాలని ఒత్తిడి తెస్తున్నాయన్నారు. అయినా సరే నిబంధనల ప్రకారం ప్యాకేజీ డబ్బులు ఇస్తామని నెట్‌వర్క్ ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment