CM YS Jagan Launch Mega Aarogyasri Awareness Programme Updates
సీఎం జగన్ మాట్లాడుతున్నారు..
- ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమం ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
- దేశంలో ఎక్కడా లేని విధంగా పేదవాడికి ఖరీదైన వైద్యం అందిస్తున్నాం
- వైద్యం కోసం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ కిందకు వస్తుంది
- ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం
- ఆరోగ్యశ్రీ చికిత్సల సంఖ్యను పెంచాం
- రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 513 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు
- ఏ పేదవాడు వైద్యం కోసం అప్పులు కాకూడదని అడుగులు వేస్తున్నాం
- ఇవాళ్టి నుంచి ఏపీలో కొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్‌కార్డుల పంపిణీ
- క్యూఆర్ కోడ్‌తో కార్డులో లబ్ధిదారుని ఫొటో, ఇతర వివరాలు
- ఆరోగ్యశ్రీ సేవలపై ప్రతీ ఒక్కరికీ అవగాహన కల్పించాలి
- ఆరోగ్యశ్రీ మార్పులు.. విప్లవాత్మకమైన మార్పులు
- ఆరోగ్యశ్రీ సేవల్ని ప్రతీ ఒక్కరికీ విస్తరించాలన్నదే లక్ష్యం
- రాష్ట్రంలోని 4 కోట్ల 25 లక్షల మంది ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తారు
- ఆరోగ్యశ్రీ కోసం ఏటా రూ. 4వేల 100 కోట్లు ఖర్చు చేస్తున్నాం
- గతంలో రూ.5 లక్షలకు మించి ఇవ్వలేదు
- రాష్ట్రంలో కొత్తగా మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నాం
- పార్లమెంట్ స్థానానికి ఒక మెడికల్ కాలేజీ ఉండేలా ప్రణాళిక రూపొందించాం
- ఇక నుంచి ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్యం
- పేదవాడికి ఆరోగ్యశ్రీని మరింత చేరువ చేయడమే లక్ష్యం
- పేదలకు ఆరోగ్యశ్రీ ఒక వరం
తాడేపల్లి కార్యక్రమంలో.. ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమం ప్రారంభించిన సీఎం జగన్
► సీఎం జగన్ అధ్యక్షతన తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రారంభమైన ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమం. పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, సంబంధిత శాఖ అధికారులు
► కాసేపట్లో వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీపై అవగాహన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు.
► ఆరోగ్యశ్రీ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించడం.. అలాగే ఈ పథకం ద్వారా వైద్యం ఎలా పొందాలనే దానిపైనా అర్హులకు అవగాహన కల్పిండమే ఈ కార్యక్రమ ఉద్దేశం. దీంతో పాటు కొత్త ఫీచర్లతో మెరుగైన ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ.. ఆరోగ్యశ్రీ ద్వారా అందించే వైద్యం పరిధి రూ.25 లక్షల దాకా పెంపును సైతం ఆయన ప్రారంభిస్తారు.
► పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన ఉచిత కార్పొరేట్ వైద్యం అందించేందుకు తీసుకొచ్చిందే డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం.
► దీనికి మరిన్ని మెరుగులు దిద్దుతూ.. మరింత బలోపేతం చేసే కార్యక్రమాన్ని సీఎం జగన్ సోమవారం లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ పథకం కింద ఇక నుంచి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందనుంది.
- క్యూఆర్ కోడ్, లబ్దిదారుని ఫొటో, కుటుంబ యజమాని పేరు, ఫోన్ నెంబర్, కుటుంబ సభ్యుల వివరాలు
- ఎల్రక్టానిక్ హెల్త్ రికార్డులో పొందుపరిచిన లబ్ధిదారుల ఆరోగ్య వివరాలతో ఏబీహెచ్‌ఏ ఐడీ
- క్యూఆర్ కోడ్‌తో లాగిన్ ద్వారా రోగి చేయించుకునే వ్యాధి నిర్ధారణ పరీక్షలు, తీసుకుంటున్న వైద్యం, చికిత్సలు, డాక్టర్ సిఫార్సులు, సమీపంలోని ఆసుపత్రులు, ఆ ఆసుపత్రులకు చేరేందుకు గూగుల్ మ్యాప్స్ ద్వారా అనుసంధానమైన మార్గాలు తెలుసుకోవచ్చు
- ఆరోగ్యమిత్ర కాంటాక్టు నంబర్లు సైతం తెలుసుకునే వీలు
- రోగి ఆరోగ్య పరిస్థితులపై డాక్టర్లకు, సిబ్బందికి పూర్తి అవగాహన
- మెరుగైన ఉచిత వైద్యం లభించేందుకు మార్గం సులభతరం
అవగాహన అందరికీ..
► ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమం ద్వారా.. లబ్దిదారులకు దిక్సూచిలా పనిచేసే ఆరోగ్యశ్రీ యాప్‌ను ప్రతి ఒక్కరి సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేయించాలి
► యాప్ ద్వారా ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి, ఎక్కడికి వెళ్లాలి, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి, ఎవరిని అడగాలనే సందేహాలన్నింటినీ ప్రతిఇంట్లో నివృత్తిచేసే కార్యక్రమం ఇది
► అలాగే కొత్త కార్డుల పంపిణీ సందర్భంగా ప్రతీ ఇంట్లో కనీసం ఒకరి ఫోన్‌లో ఆరోగ్యశ్రీ యాప్ డౌన్‌లోడ్ చేసుకునేలా ఏఎన్‌ఎంలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, ఆశా వర్కర్లు, వలంటీర్లు, మహిళా పోలీసులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు కృషి చేయాలి
ఇదీ చదవండి: జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్–2 జనవరి 1 నుంచి..
Comments
Please login to add a commentAdd a comment