
చిలకలూరిపేట: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడటం అత్యంత హాస్యాస్పదమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఆమె శనివారం మీడియాతో మాట్లాడారు. ఆస్పత్రులను సందర్శించి, రోగుల వద్దకు వెళ్లి పలకరించి ఆరోగ్యశ్రీ ఎలా అమలవుతోందో తెలుసుకోవాలని సూచించారు.
రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజాక్షేత్రంలో అభాసుపాలవుతారని సూచించారు. 2007లో దివంగత వైఎస్సార్ 946 ప్రొసీజర్లతో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే.. ఇప్పుడు వైఎస్ జగన్ ఏకంగా 3,255కి పెంచారని గుర్తు చేశారు. చంద్రబాబు తన సొంత మనుషులతోనే రాళ్లు వేయించుకున్నట్లు అనుమానాలున్నాయన్నారు. ఇప్పటం గ్రామంలో ఏం జరిగిందో ప్రజలకు అంతా తెలుసని మంత్రి రజిని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment